GDP
-
తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు. ఈ విషయంలో గతంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా కూడా.. ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన రాష్ట్రంగా మారుస్తానని నేను చెప్పినపుడు చాలా మంది సాధ్యం కాదని అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎంగా నేను దావోస్‌లో రెండుసార్లు పర్యటించి భారీ పెట్టుబడులు సాధించా.. తొలి ఏడాది రూ.41వేల కోట్లు, రెండో సారి రూ.1.78లక్షల కోట్ల ఎంఓయూలపై సంతకాలు జరిగాయి’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీనితో హైదరాబాద్ రైజింగ్ ఇకపై ఆగదని ప్రపంచం మొత్తం నమ్ముతోందని చెప్పారు. సీఎం గురువారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మంత్రి శ్రీధర్‌బాబుతో కలసి ‘హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గ్లోబల్ డెలివరీ సెంటర్’ను ప్రారంభించి మాట్లాడారు. పెద్ద కల అవుతుందన్నారు... ‘‘మా పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు లేదా చెన్నైతో కాదని నేను చెప్పినప్పుడు కొంతమంది అది పెద్ద కల అవుతుందన్నారు. మనం ఈవీ అడాప్షన్‌లో హైదరాబాద్‌ను నంబర్ వన్‌గా చేశాం. రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మాన్యుఫాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్‌కు హబ్‌గా మారుస్తున్నాం. కేవలం ఏడాదిలోనే తెలంగాణకు దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయి. ఉద్యోగ కల్పనలో నంబర్ వన్‌గా నిలిచాం..’’అని సీఎం రేవంత్ చెప్పారు. ఇక్కడ దగ్గర అత్యధిక కృత్రిమ మేధ వినియోగం, అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నాయన్నారు. 60 దేశాల్లో 2.2 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌సీఎల్ టెక్ 2007లో భారత్‌లో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగిందని చెప్పారు. హెచ్‌సీఎల్ నూతన క్యాంపస్ 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. గ్లోబల్ వ్యాల్యూ సెంటర్లుగా జీసీసీలు: శ్రీధర్‌బాబు తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించేలా జీసీసీలను గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా మార్చుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు చెప్పారు. ‘‘ఏఐ, మెషీన్ లెరి్నంగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీలలో తెలంగాణను హబ్‌గా మార్చి పెట్టుబడులను ఆకర్షిస్తాం. త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. నైపుణ్య శిక్షణ కోసం నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా భాగస్వామ్యం వహించాలి. తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం’’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ, ఎండీ సి.విజయ్‌కుమార్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌కు గడ్డుకాలం ముగిసినట్టే: డాయిష్ బ్యాంక్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం ముగిసినట్టేనని జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ 5.4 శాతానికి (ఏడు త్రైమాసికాల కనిష్టం) పడిపోవడం తెలిసిందే. దీంతో దేశ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 6.2 శాతానికి మెరుగుపడుతుందని బ్యాంక్ అంచనా వేసింది. అయినప్పటికీ 2025–26లో జీడీపీ వృద్ధి 7 శాతం లోపే ఉంటుందని పేర్కొంది.క్యూ3 (2024 అక్టోబర్-డిసెంబర్) జీడీపీ గణాంకాలు విడుదల కావడానికి ముందు బ్యాంక్ ఈ నివేదిక విడుదల చేయడం గమనార్హం. కీలక సూచికలు సైతం వృద్ధి రేటు 6.2 శాతానికి పెరుగుతుందని సూచిస్తున్నట్టు తెలిపింది. వృద్ధికి మద్దతుగా ఏప్రిల్ మానిటరీ పాలసీ సమీక్షలోనూ ఆర్బీఐ మరో 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చని అంచనా వేసింది. అనంతరం 0.50 శాతం రేటు బదిలీ దిశగా లిక్విడిటీ చర్యలపై ఆర్బీఐ దృష్టి సారించొచ్చని తెలిపింది.ప్రస్తుత సైకిల్లో మరిన్ని రేట్ల కోతలు ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. లిక్విడిటీ అవసరాల పట్ల ఆర్బీఐ ఇప్పటికే దృష్టి పెట్టిందంటూ.. ఇటీవల 10 బిలియన్ డాలర్ల స్వాప్ ప్రకటన ప్రోత్సాహనీయంగా పేర్కొంది.జీడీపీలో పన్నుల నిష్పత్తిని పెంచుకోవాలి: ఈవైభారత్ 6.5 - 7 శాతం మేర జీడీపీ వృద్ధిని నమోదు చేయాలంటే, పన్నుల పరిధిని 1.2 - 1.5 శాతం స్థాయిలో కొనసాగించాలని ఈవై సూచించింది. ఆదాయ వసూళ్లను బలోపేతం చేసుకోవాలంటూ.. జీడీపీలో పన్నుల నిష్పత్తిని 2025 - 26లో 12 శాతం అంచనా స్థాయి నుంచి 2030 - 31 నాటికి 14 శాతానికి పెంచుకోవాలని పేర్కొంది. ద్రవ్య నిర్వహణ, నిర్మాణాత్మక సంస్కరణలు, పన్ను చెల్లింపుదారుల పరిధిని పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించాలని సూచించింది. 2025–26లో భారత జీడీపీ 6.3 - 6.8 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. -
2047 నాటికి రూ.3,000 లక్షల కోట్ల ఆదాయం!
సేవల రంగం తోడ్పాటుతో భారత్ 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుందని ఒక నివేదిక అంచనా వేసింది. అప్పటికి జీడీపీ 23–35 ట్రిలియన్ డాలర్లకు (రూ.1,978–3,010 లక్షల కోట్లు) చేరుకుంటుందని తెలిపింది. దేశ జీడీపీలో సేవల రంగం వాటా 60 శాతంగా, తయారీ రంగం వాటా 32 శాతం మేర ఉంటుందని పేర్కొంది. ఈ నివేదికను బెయిన్ అండ్ కంపెనీ, నాస్కామ్ సంయుక్తంగా రూపొందించాయి.‘రానున్న దశాబ్దాల్లో 20 కోట్ల మంది శ్రామికశక్తి అందుబాటులోకి వస్తారు. అధిక విలువ ఉద్యోగాలను కల్పించే వినూత్నమైన అవకాశం భారత్ ముందుంది. తద్వారా గణనీయమైన ఆర్థిక సామర్థ్యాలను వెలికితీయగలదు. ఇందుకు రంగాలవారీ టెక్నాలజీపరమైన కార్యాచరణ అవసరం. ఏఐ ఆధారిత చిప్ డిజైన్, విడిభాగాల తయారీకి కావాల్సిన ముడి సరుకుల సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలు పోటీతత్వాన్ని, ఆవిష్కరణలను పెంచుతాయి. దీనివల్ల ఎగుమతుల్లో తయారీ వాటా 24 శాతం నుంచి 2047 నాటికి 45–50 శాతానికి చేరుకుంటుంది’ అని ఈ నివేదిక వివరించింది. అలాగే ఆటో విడిభాగాల ఎగుమతులు 200–250 బిలియన్ డాలర్లు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇదీ చదవండి: ఈ–కామర్స్ దూకుడుఐదు కీలక రంగాలు..అంతర్జాతీయంగా నెలకొన్న ధోరణులు, విస్తృతమైన అవకాశాల దృష్ట్యా.. ఎలక్ట్రానిక్స్, ఇంధనం, కెమికల్స్, ఆటోమోటివ్, సేవలు భారత్‌కు వృద్ధి చోదకాలుగా పనిచేస్తాయని ఈ నివేదిక తెలిపింది. పెరిగే ఆదాయం, నైపుణ్య కార్మికులు, మౌలిక వసతుల కల్పన ఈ వృద్ధికి నడిపిస్తాయని పేర్కొంది. -
దేశాభివృద్ధికి జీడీపీ అద్దంపడుతోంది
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 5.4 శాతం వృద్దిరేటుతో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో పయనిస్తోందని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) చెప్పారు. సాధారణ బడ్జెట్‌పై చర్చలో భాగంగా మంగళవారం లోక్‌సభలో విత్తమంత్రి హోదాలో నిర్మల ప్రసంగించారు. ‘‘ ప్రజల చేతుల్లో నగదు నిల్వలు ఉండేలా బడ్జెట్‌ను రూపొందించాం. కేంద్రప్రభుత్వం తెచ్చే రుణాల్లో 99 శాతం నిధులను మౌలిక వసతుల కల్పనలో భాగంగా మూల ధన వ్యయాల కోసమే ఖర్చుచేస్తున్నాం. తద్వారా భవిష్యత్ సంపదను సృష్టిస్తున్నాం.ద్రవ్యోల్బణం కట్టడికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందుకే ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నుంచి ఆరు శాతం మధ్యే తచ్చాడుతోంది. ఆహార వస్తువులకు సంబంధించి ద్రవ్యోల్బణం సైతం మధ్యస్థాయిలోనే కట్టడిలో ఉంది. 2024–24 ఆర్థిక సంవత్సరానికి మూడేళ్ల ముందువరకు భారత జీడీపీ వృద్ధి రేటు సగటున 8 శాతంగా నమోదైంది’’ అని మంత్రి అన్నారు. అయితే గత నాలుగేళ్లలో ఎన్నడూలేని విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికాభివృద్ధి 6.4 శాతంగా నమోదుకావచ్చన్న విశ్లేషణలు వెలువడటం తెల్సిందే. ఇటీవల పార్లమెంట్లో ఆర్థి కశాఖ ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే సైతం తదుపరి ఆర్థికసంవత్సరంలో వృద్ధిరేటు 6.3 శాతం నుంచి 6.8శాతం మధ్యలో కదలాడవచ్చని పేర్కొనడం విదితమే.‘‘ గత 12 త్రైమాసికాల్లో కేవలం రెండు త్రైమా సికాల్లోనే భారత వృద్ధిరేటు 5.4 శాతం లేదా అంతకంటే తక్కువకు పడిపోయింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో తైమాసికంలో వృద్ధిరేటు గత యేడు త్రైమాసికాల కనిష్టమైన 5.4 శాతానికి పడి పోయింది. అయితే ఆ తర్వాత ఆర్థిక పునాదులు బలపడటంతో వృద్ధిరేటు మళ్లీ పుంజుకుంది. ఇకపై భారత్ వేగంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. జీడీపీలో మొత్తం సేవలు, వస్తూత్పత్తుల విలువ ఏకంగా 61.8 శాతానికి పెరిగింది. 2002–03 సంవత్సరం నుంచి చూస్తే ఇది ఈస్థాయికి పెరగడం ఇదే తొలిసారి. వచ్చే ఆర్థికసంవత్సరంలో మౌలికవసతుల కల్పన కోసం చేసే మూల ధన వ్యయం రూ.15.48 లక్షల కోట్లకు చేరుకోనుంది.ఇది జీడీపీలో 4.3 శాతానికి సమానం. కొత్త ఆర్థికసంవత్సరంలో ఆర్థిక లోటును రూ.15.68 లక్షల కోట్లకు పరిమితంచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇది జీడీపీలో 4.4 శాతానికి సమానం.అంతర్జాతీయంగా ఎన్నో అంతర్యుద్ధాలు, యుద్ధ భయాలు, ఆర్థిక అస్థిర పరిస్థితుల మధ్య నూతన బడ్జెట్‌ను తీసుకొచ్చాం. గత పదేళ్లలో యావత్ ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి. భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. వీటన్నింటినీ సరిచూసుకుంటూ జాతీయ ప్రయోజనాలకు పట్టంకడుతూ బడ్జెట్ కేటాయింపులు చేశాం’’ అని మంత్రి అన్నారు. -
జీడీపీలో బీర్ పరిశ్రమ వాటా 0.3 శాతం
న్యూఢిల్లీ: దేశ జీడీపీలో బీర్ పరిశ్రమ వాటా 2023లో 0.3 శాతానికి చేరుకుంది. రూ.92,324 కోట్లు సమకూరినట్టు బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ నిర్వహించిన అధ్యయనాన్ని ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా బీర్ పరిశ్రమ పరిమాణం 2023లో రూ.76.45 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఆక్స్ఫర్డ్ నివేదిక పేర్కొంది. దేశ జీడీపీకి బీర్ పరిశ్రమ నుంచి నేరుగా రూ.40,050 కోట్లు వస్తుండగా, అనుబంధ వ్యాల్యూ చైన్ (లాజిస్టిక్స్, రెస్టారెంట్లు, రిటైలర్లు) ద్వారా మరో రూ.52,239 కోట్లు సమకూరుతోంది. ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్, ఇతర పన్నుల రూపంలో రూ.51,376 కోట్ల ఆదాయం 2023లో ప్రభుత్వ ఖజానాలకు చేరినట్టు పేర్కొంది. మొత్తం పన్నుల ఆదాయంలో 1.8 శాతానికి సమామని తెలిపింది. బీర్ పరిశ్రమ, వ్యాల్యూ చైన్ సంయుక్తంగా 13 లక్షల మందికి ఉపాధి కలి్పస్తున్నట్టు.. ఇందులో బీర్ పరిశ్రమ ఒక్కటే 5.4 లక్షల మందికి ఉపాధినిస్తున్నట్టు వివరించింది. ‘‘బీర్ అన్నది పూర్తిగా స్థానిక తయారీ ఉత్పత్తి. అధిక పరిమాణంతో కూడినది. స్థానిక ఆర్థిక వ్యవస్థపై ఇది ఎన్నో అంచల ప్రభావం చూపిస్తుంటుంది. స్థానిక రైతుల నుంచి బార్లీ కొనుగోలు చేస్తుంది. స్థానిక సరఫరాదారుల నుంచి ప్యాకేజింగ్ మెటీరియల్ సమకూర్చుకుంటుంది. హ్యాండ్లింగ్‌లో ఎక్కువ మంది పాలు పంచుకుంటారు. పెద్ద స్థాయి గోదాములు, ఉత్పత్తుల రవాణాకు పెద్ద ఎత్తున రవాణా సదుపాయాలను వినియోగించుకుంటుంది’’ అని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి వివరించారు. -
వెనక్కి పంపేస్తే నష్టమే!
2024 ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ సాధించిన విజయానికీ – బైడెన్ పాలనా కాలంలో అమెరికా ద్రవ్యోల్బణం పెరగడం, దేశ దక్షిణ సరి హద్దులో వలసదారుల ప్రవాహం వంటివాటి పట్ల ఓటర్లకు ఉన్న అసంతృప్తికీ మధ్య దగ్గరి సంబంధం ఉంది.ట్రంప్ తన రెండవ పదవీకాలంలో మొదటి రోజున తీసుకున్న చర్యలను పరిశీలిద్దాం. సరిహద్దును మూసివేయడం, సరైన పత్రాలు లేని వలసదారులపై కఠినంగా వ్యవహరించడం, అలాగే పౌరులు కాని వారి పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దుచేయడంవంటి అంశాలపై అధ్యక్షుడు వరుసగా ఆదేశాలు జారీ చేశారు.అక్రమ వలసలపై ఇంతటి అణచివేతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడంలో ట్రంప్ ఉద్దేశ్యం ఓటర్లలో ప్రజాదరణ పొందడమే. ఇటీవలి ఆక్సియోస్–ఇప్సోస్ పోల్‌లో 10 మందిలో తొమ్మిది మంది రిపబ్లి కన్లతోపాటు దాదాపు సగం మంది డెమొక్రాట్లు కూడా అనధికార వలసదారుల సామూహిక బహిష్కరణకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. బహిష్కరణ కోసం ఎంపిక చేసుకున్న పద్ధతుల దగ్గరికి వచ్చేటప్పటికి... అంటే కుటుంబాలను వేరు చేయడం లేదా పిల్లలుగా అమెరికాకు వచ్చిన వారిని బహిష్కరించడం వంటివాటికి మద్దతు పలచబడుతోంది.ట్రంప్ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడానికి అమెరికన్ కాంగ్రెస్ కూడా సిద్ధంగా ఉంది. జనవరి 7న, ప్రతినిధుల సభ లేకన్ రిలే చట్టాన్ని ఆమోదించింది. దొంగతనం,దోపిడీ, కస్టమర్‌గా దుకాణాలలో ప్రవేశించి వస్తువులను దొంగిలించడం వంటివే కాక అంతకు మించిన హింసాత్మక నేరాలకు పాల్పడే అనధికార వలసదారులను బహిష్కరించడాన్ని ఈ చట్టం సులభతరం చేస్తుంది. మొదటి రోజే సెనేట్ తమ ముందుకొచ్చిన బిల్లును 64–35 ఓట్లతో ఆమోదించింది. 12 మంది డెమొక్రాట్లు కూడా రిపబ్లికన్లతో కలిసి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో సరైన పత్రాలు లేని వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటే ఆర్థిక పరిణామాలు ఎలా ఉంటాయనే విషయంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, 2022లో దాదాపు కోటి 10 లక్షల మంది అనధికార వలసదారులు అమెరికాలో ఉన్నారు. వారిలో 80 లక్షల 30 వేలమంది శ్రామికులు. గత రెండేళ్లలో వలసదారుల సంఖ్య పెరగడంతో, ఇప్పుడు కోటిమంది అనధికార కార్మికులు ఉండవచ్చని అంచనా. ఇది అమెరికా శ్రామిక శక్తిలో 6 శాతం. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్ నగరాల్లోనే దాదాపు సగం మంది వీరు ఉన్నారు.సామూహిక బహిష్కరణలను సమర్థించేవారి వాదన ఏమిటంటే, అవి అమెరికన్ కార్మికులకు ఒక వరం. సామూహిక తొలగింపులు అమెరికన్లకు ఉద్యోగాలను కల్పిస్తాయనీ, వారి వేతనాలను పెంచుతాయనీ ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ వాదన. అనధికార వలస కార్మికులు ఇలాంటి ఉద్యోగాల కోసం స్థానికంగా జన్మించిన కార్మికులతో పోటీ పడుతున్నారని ఈ వాదన చెబుతోంది. అయితే ఇది వాస్తవం కాదని అనేక అధ్యయనాల వల్ల తేలుతోంది. నిజానికి నమోదుకాని వలసదారులు తరచుగా అమెరికన్ కార్మికులు కోరుకోని ఉద్యోగాలను తీసుకుంటారని ఇవి చెబుతున్నాయి. ఇందుకు ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎంప్లాయర్స్’ కోవిడ్–19 మహమ్మారి కాలంలో సుమారు 1,00,000 సీజనల్ వ్యవసాయ ఉద్యోగాలలో ఎంత మంది నిరుద్యోగ అమెరికన్లు చేరతారో తెలుసుకోవడానికి నిర్వహించిన సర్వే ఒక మంచి ఉదాహరణ. లక్ష ఉద్యోగాలకు గాను కేవలం 337 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని సర్వే చెప్పింది. కాలానుగుణ వలసదారులు లేకపోతే, కార్మికుల కొరత (ఆహార కొరత) కొనసాగే అవకాశం ఉందని సర్వే తెలిపింది.అనధికార వలసదారులు చేపట్టే అతి సాధారణమైన 15 వృత్తులలో అమెరికాలో జన్మించిన కార్మికులు–అనధికార వలస కార్మికులు ఎంతెంత మంది ఉన్నారనే సంగతినిని ‘బ్రూకింగ్స్’ అధ్యయనం చెబు తోంది. స్థానిక కార్మికులు, అధికారిక వలస కార్మికుల కంటే అనధికార వలసదారులు తక్కువ జీతం, ప్రమాదకరమైన, తక్కువ ఆకర్షణీ యమైన ఉద్యోగాలను ఎక్కువగా తీసుకుంటారని ఈ అధ్యయనం ప్రధానంగా తేల్చింది.అక్రమ వలస కార్మికులను బలవంతంగా పంపివేసే చర్య వల్ల అనేక రంగా లపై వివిధ స్థాయుల్లో కార్మికుల సరఫరాపై ప్రభావం పడుతుందని ‘ది ఎకానమిస్ట్’ ఎత్తి చూపింది. ముఖ్యంగా వ్యవసాయంపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. అమెరికాలోని 25 లక్షలమంది వ్యవసాయ కార్మికులలో దాదాపు 40 శాతం మంది అనధికార వలస దారులేనని అంచనా. వీరి తొలగింపు వల్ల గృహ నిర్మాణం కూడా ప్రభా వితమయ్యే అవకాశం ఉంది. అనధికార వలసదారులు గృహ నిర్మాణ శ్రామిక శక్తిలో ఆరవ వంతు ఉన్నారు.బహిష్కరణలు ఎంత విస్తృతంగా ఉన్నాయనే దానిపైనే మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఆధారపడి ఉంటుంది. ట్రంప్ లక్షలాదిమంది వలసదారులను సాగనంపే ‘అమెరికన్ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమం’ నిర్వహిస్తామని బెదిరించినప్పటికీ... చట్టపరమైన, రవాణాపరమైన, ఆర్థిక, రాజకీయ పరమైన అడ్డంకుల వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం కష్టమే! ఇంతలోనే, ‘అమెరికన్ పాలనాయంత్రాంగం 10 లక్షలమంది బహిష్కరణతో ప్రారంభించి... ఆపై అక్కడి నుండి ఇంకా ముందుకు వెళ్ళవచ్చు’ అని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సూచించారు. పీటర్సన్ ‘ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్’ చేసిన అధ్యయనంలో, 1956లో అధ్యక్షుడు ఐజెన్ హోవర్ ‘ఆపరేషన్ వెట్బ్యాక్’ కేంపెయిన్ సమయంలో చేసిన 13 లక్షల బహిష్కరణల సంఖ్యకు సమానమైతే గనక, ప్రస్తుత బహిష్కరణల ఫలితంగా 2028లో అమెరికా... జీడీపీ దాని ప్రాథమిక అంచనా కంటే 1.2 శాతం తక్కువగా ఉంటుందట!సక్రమ పత్రాలు లేని కార్మికులు... ప్రభుత్వ ప్రాయోజిత ప్రయోజనాలను పొందుతూ పన్నులు చెల్లించని ‘అమాం బాపతు’ అని మరొక వాదన ఉంది. ‘ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమ్మి గ్రేషన్ రిఫార్మ్’ నుండి వచ్చిన డేటా ఆధారంగా, అక్రమ వలసదారులు 2023లో అమెరికన్ పన్ను చెల్లింపుదారులు కట్టిన పన్నుల్లో 150 బిలియన్ డాలర్ల ఖర్చుకు కారణమయ్యారని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘ప్రభుత్వ ఖర్చు తగ్గింపు కార్యక్రమం’ పేర్కొంటోంది. దీనికి ప్రధాన కారణం... ‘వారు తక్కువ సగటు విద్యా స్థాయులను కలిగిఉండటం, ఫలితంగా తక్కువ పన్ను చెల్లింపులు జరగడం, పైగా వారు తరచుగా వారి పిల్లల తరఫున సంక్షేమ కార్య క్రమాలకు అర్హత పొందడం’ అని ‘సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్’కు చెందిన స్టీవెన్ కమరోటా వాదన.అయితే, మొత్తం వలసదారుల విషయానికి వచ్చేటప్పటికి ఈ వాదన సరికాదు. కోవిడ్–19 మహమ్మారి తర్వాత వలసదారులు 90 లక్షలకు పెరిగారంటే రాబోయే 10 సంవత్సరాలలో అమెరికా ప్రభుత్వ ఆదాయానికి అది 1.2 ట్రిలియన్ డాలర్లను జోడిస్తుందని, ప్రభుత్వ తప్పనిసరి కార్యక్రమాలకు ఖర్చులు 300 బిలియన్ డాలర్ల మేరకు మాత్రమే పెరుగుతాయని ‘కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ నివేదిక’ అంచనా వేసింది. వలసదారులు స్థానికంగా జన్మించిన కార్మికుల కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు. పైగా వారు పదవీ విరమణ వయస్సుకు చేరుకునే వరకు సామాజిక భద్రత, మెడికేర్ నుండి ప్రయోజనాలను పొందకపోవడం గమనార్హం.చివరగా, నేటి వలసల గురించి చర్చ... పత్రాలు లేని వలస దారులపై కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, 34 సంవత్సరాలుగా అమెరికా వలస చట్టాలు గణనీయంగా నవీకరించబడలేదని రెండు వైపులా ఉన్న రాజకీయ నాయకులు గుర్తించాలి. తగ్గుతున్న సంతా నోత్పత్తి రేటు కారణంగా అమెరికా జనాభా పెరుగుదల మందగించడంతో, అమెరికా కార్మిక మార్కెట్ వృద్ధికి ప్రధాన ఆధారం చట్టబద్ధమైన వలసల ద్వారానే లభిస్తుంది.వలసలను అరికట్టడం వల్ల ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉంది. అమెరికాకు వలస వచ్చిన చాలా మంది దక్షిణ సరిహద్దు నుంచే ఉధృతంగా రావడానికి ముఖ్య కారణం కాలం చెల్లిన అమెరికా వలస చట్టాలు అని గుర్తించాలి.నికోలస్ సార్జెన్ వ్యాసకర్త ఫోర్ట్ వాషింగ్టన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్‌కు ఆర్థిక సలహాదారు -
ఖర్చు పెట్టించేందుకు ఇది చాలదు!
భారతదేశ మధ్య తరగతి బహుశా గడచిన మూడు దశాబ్దాల్లో ఇలాంటి బడ్జెట్ చూడ లేదు. ఆదాయ పన్నులో ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుందని మోదీ సర్కారుపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంత భారీ ఊరట లభిస్తుందని మాత్రం ఊహించలేదు. నగరాల్లో నెలకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఉన్నవారిని మాత్రమే మధ్య తరగతిగా పరిగణించాలని నేను గతంలో వాదించాను. అయితే, ఇలాంటి వాళ్లు దేశం మొత్తమ్మీద నాలుగైదు శాతం మాత్రమే ఉంటారు. ఇంత మొత్తం ఆర్జిస్తున్నవాళ్లు కూడా పన్నులు కట్టే పని లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఎందుకీ ఉపశమనం?ఫలితంగా ఈ స్థాయి ఆదాయమున్న వారి జేబుల్లోకి ప్రతి నెల ఆరు వేల రూపాయలు అదనంగా వచ్చి చేరుతుంది. ఈ డబ్బును ఇంటికి కావాల్సిన వస్తువుల కొనుగోలుకు వాడుకోవచ్చు. లేదంటే దాచుకుని చిరకాలంగా ఆశపడుతున్న స్మార్ట్‌ఫోన్ నైనా సొంతం చేసుకోవచ్చు. మీ ఆదాయం నెలకు రెండు లక్షల రూపాయలనుకుంటే, మారిన పన్ను రేట్ల కారణంగా మీకు నెల నెలా రూ. 9,000 అదనంగా ఆదా అవుతుంది. దీన్ని రోజువారీ ఖర్చుల కోసం వాడు కోవచ్చు. ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు వెళ్లి భోంచేయొచ్చు. ఏడాదిలో రూ. 1.10 లక్షలు మిగులుతుంది. ఈ డబ్బుతో 55 అంగుళాల టీవీ, అత్యాధునిక వాషింగ్ మెషీన్ కొనుక్కోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే, పన్నుల మినహాయింపు పొందిన మధ్య తరగతి విరగబడి కొనుగోళ్లు చేస్తుందనీ, తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమొస్తుందనీ మోదీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే జరిగితే దేశంలో, ముఖ్యంగా నగర మధ్యతరగతి వినియోగం తగ్గుతోందన్న ఫిర్యాదులకు ఫుల్స్టాప్ పడుతుంది. 2022–23లో దేశంలో దాదాపు 7 కోట్ల మంది ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించారని దాఖలైన ఆదాయ పన్ను రిటర్న్స్ చెబుతున్నాయి. వీరిలో దాదాపు రెండు కోట్ల మంది పన్నులు చెల్లించారు. ప్రస్తుతం వేతనాల్లో పెంపును పరిగణనలోకి తీసుకున్నా, పన్ను రేట్లలో వచ్చిన మార్పుల కారణంగా సుమారు 1.5 కోట్ల మంది పన్ను పరిధిలోంచి జారిపోతారు. అంటే, పన్ను చెల్లింపుదారుల సంఖ్య సుమారు 1.4–1.6 కోట్లకు పడిపోనుంది. వీరిలో ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వారూ ఉంటారు. ఇది మొత్తం మన శ్రామిక శక్తిలో కేవలం 4 శాతం మాత్రమే. ప్రభుత్వ అంచనా వేరే!పరిస్థితి ఇలా ఉంటే, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పన్ను రాబడుల లెక్కలు ఇంకోలా ఉన్నాయి. 2025 బడ్జెట్ అంచనాల ప్రకారం, ఆదాయపు పన్ను రూపంలో వచ్చే మొత్తం రూ.1.8 లక్షల కోట్లు ఎక్కువ కానుంది. ఇంకోలా చెప్పాలంటే ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం వచ్చిన దానికంటే రానున్న సంవత్సరం వచ్చే మొత్తం 14 శాతం ఎక్కువ. గతేడాది ప్రభుత్వ అంచనాలతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా పన్ను రేట్లలో మార్పుల వల్ల ప్రభుత్వానికి ఒక లక్ష కోట్ల రూపాయల నష్టం జరగడం లేదు. పాత రేట్లు, శ్లాబ్స్ కొనసాగి ఉంటే ప్రభుత్వం 22 శాతం వరకూ ఎక్కువ ఆదాయపు పన్నులు వసూలు చేసి ఉండేది. ఆదాయ పన్ను రాబడి పెరిగేందుకు ఒకే ఒక్క మార్గం... వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రజల వ్యక్తిగత ఆదాయం బాగా పెరగడం! ఇలా జరిగే సూచనలైతే లేవు. నిజానికి కృత్రిమ మేధ, వేర్వేరు ఆటో మేషన్ పద్ధతుల ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల సంఖ్య తగ్గేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా జీతాలు కూడా స్తంభించిపోతాయి. తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తి గురించి ఆలోచిద్దాం. ఆదాయపు పన్ను కొత్త విధానాన్ని ఎంచుకుంటే ఇతడికి రూ.70 వేల వరకూ మిగులుతుంది. ఇంత మొత్తాన్ని వస్తు, సేవల కోసం ఖర్చు పెట్టగలడు. ఒకవేళ ఆదాయం పది శాతం తగ్గితే? అప్పుడు పన్ను మినహాయింపులు అక్కరకు రావు. వాస్తవికంగా ఖర్చు పెట్టడం ఇప్పటికంటే మరింత తక్కువైపోతుంది.ఇంకో పెద్ద ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఖర్చు చేయడం తగ్గించుకుంటోంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారనుంది. గత ఏడాది కంటే ఈసారి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 6.1 శాతం మాత్రమే ఎక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇంకో 5 శాతమే అదనంగా ఖర్చు పెట్టాలని యోచిస్తోంది. ద్రవోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఈ పెంపుదల కేవలం 1.5 శాతమే అవుతుంది. పెట్టుబడులు తగ్గించుకుంటున్న ప్రభుత్వంరోడ్లు, హైవేలు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం గతంలో ఖర్చు పెట్టినదానికి ఇది పూర్తి భిన్నం. ఆ ఖర్చులో పెరుగుదల జీడీపీ పెంపునకు దారితీసింది. ఈసారి మూలధన వ్యయం గత ఏడాది కంటే కేవలం ఒకే ఒక్క శాతం ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణిస్తే అసలు మొత్తం ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి... ఈ ఏడాది మౌలిక వసతులపై పెట్టే ఖర్చు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే, మౌలిక వసతుల రంగానికి అనుబంధమైన స్టీల్,సిమెంట్, తారు, జేసీబీల్లాంటి భారీ యంత్రాలు, బ్యాంకులు కూడా డిమాండ్‌లో తగ్గుదల నమోదు చేయవచ్చు. ఇదే జరిగితే ఆయా రంగాల్లో వేతనాల బిల్లులు తగ్గించుకునే ప్రయత్నం అంటే... వేత నాల్లో కోతలు లేదా ఉద్యోగాల కుదింపు జరుగుతుంది. ఇది మధ్య తరగతి వారి ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం ఈ ఏడాది కార్పొరేట్ కంపెనీల ద్వారా ఎక్కువ ఆదా యపు పన్ను ఆశించడం లేదని అంచనా కట్టింది. జీడీపీ విషయంలోనూ ఇంతే. వృద్ధి నామమాత్రమేనని ప్రభుత్వం భావిస్తోంది.పెట్టుబడులు పెరగకపోతే?ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తాను లక్ష్యించుకున్న కార్పొరేట్ పన్నులు కూడా పూర్తిగా వసూలు చేయలేకపోయింది. మొత్తం 10.2 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీల ద్వారా వస్తుందని ఆశిస్తే వసూలైంది రూ.9.8 లక్షల కోట్లు మాత్రమే. అదే సమయంలో ఆదాయపు పన్ను రాబడులను మాత్రం రూ.11.9 లక్షల కోట్ల నుంచి రూ.12.6 లక్షల కోట్లకు సవరించింది. అంటే ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల కంటే 28 శాతం ఎక్కువ ఆదా యపు పన్ను రూపంలో వసూలు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కార్పొరేట్ పన్నుల కంటే ఆదాయపు పన్నులు 33 శాతం ఎక్కువ వసూలు చేస్తామని చెబుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ బాగు పడుతోందనేందుకు ఏమాత్రం సూచిక కాదు. ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగం నుంచి ఎక్కువ పెట్టుబడుల్లేకుండా... కేవలం ఆదాయపు పన్ను రాయితీలతోనే వినియోగం పెరిగిపోతుందని ఆశించడంలో ఉన్న సమస్య ఇది. మధ్య తరగతి ప్రజల జేబుల్లో కొంత డబ్బు మిగిల్చితే, కొన్ని రకాల వస్తు సేవలకు తాత్కాలిక డిమాండ్ ఏర్పడవచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో ఎదగకపోతే ఆ డిమాండ్ ఎక్కువ కాలం కొనసాగదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌పై మరింత పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగా కనిపించడం లేదు. వీరి ప్రాజెక్టుల్లో అధికం ప్రభుత్వ మౌలిక వసతుల కల్పనకు సంబంధించినవే. అవే తగ్గిపోతే, కార్పొరేట్ కంపెనీలు కూడా తమ పెట్టుబడులను కుదించుకుంటాయి. దీంతో పరిస్థితి మొదటికి వస్తుంది. ఆదాయపు పన్ను రిబేట్లు ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం సాయం చేయనివిగా మిగిలిపోతాయి!అనింద్యో చక్రవర్తి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, ఆర్థికాంశాల విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘ఐటీ’ కటాక్షించేనా?
(సాక్షి, బిజినెస్ డెస్క్, సాక్షి, అమరావతి) : మరి కొద్ది గంటల్లో బడ్జెట్(Budget) ప్రవేశపెట్టనున్న తరుణంలో వెలువడిన కేంద్ర ఆర్థిక సర్వేతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) చేసిన వ్యాఖ్యలు వేతన జీవులు, మధ్య తరగతి వర్గాల్లో ఆశలను పెంచుతున్నాయి. 2014 నుంచి పన్నుల శ్లాబులు మార్చకపోవడం.. మండిపోతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెరగని నేపథ్యంలో ఈదఫా వేతన జీవులకు ఊరట లభిస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదలైన ఆర్థిక సర్వే ఇదే సంకేతాలనిచ్చింది. 2023–24లో కంపెనీల లాభాలు 22.3 శాతం పెరగగా ఇదే సమయంలో ఉద్యోగాల కల్పన వృద్ధి 1.3 శాతానికి పరిమితం కావడం.. సంస్థలు వ్యయాల నియంత్రణ పేరుతో సిబ్బంది సంఖ్యతో పాటు వేతనాల్లో కోత పెడుతుండటంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 2002–03లో దేశ జీడీపీలో 2.1 శాతంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల లాభాలు 2023–24 నాటికి ఏకంగా 4.8 శాతానికి చేరుకున్నాయని, ఇదే సమయంలో వేతనాల పెరుగుదల చాలా తక్కువగా ఉండటం ఆర్థిక అసమానతలను పెంచుతుందని సర్వే పేర్కొంది. అయితే దేశ ఆర్థిక పరిస్థితేమీ అంత గొప్పగా లేదు. వృద్ధి నెమ్మదించింది. అమెరికాలో ట్రంప్ విజయం సాధించటమేకాక... భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచుతామని బెదిరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరగటంతో... ఇపుడు బ్లూచిప్, చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా అన్ని కంపెనీల్లోనూ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఫారిన్ ఫండ్స్) తమ వాటాలను అయినకాడికి తెగనమ్మేస్తున్నాయి. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతోంది... డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీగా పతనమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందే తప్ప తగ్గటం లేదు. ఇలాంటి సమస్యలతో దేశం ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో 2025–26 కేంద్ర బడ్జెట్‌ను శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా... మోదీ ప్రభుత్వం మూడోసారి గెలిచాక ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.ఎందుకంటే ఎన్నికలు సంవత్సరం మధ్యలో రావటంతో మిగిలిన కాలానికి ఓటాన్ అకౌంట్‌తో నెట్టుకొచ్చారు. మరి ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలంటే సరికొత్త గేమ్ ఛేంజర్ విధానాలు అవసరమన్నది నిపుణుల మాట. ఒకవైపు పేద, మధ్య తరగతి వర్గాలకు తగిన రక్షణ కల్పిస్తూనే.. వృద్ధిని పరుగులెత్తించాల్సిన బాధ్యత ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఏ మేరకు నెరవేరుస్తారన్నదే సర్వత్రా చర్చనీయమవుతోంది.ఆదాయపు పన్నులో మరింత ఊరట!బడ్జెట్ వచ్చిందంటే మధ్య తరగతి ఎదురుచూసేది ఆదాయపు పన్ను సవరణల గురించే. ఈసారి ఆదాయ పన్ను విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల కిందట ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తెచ్చింది. ఎలాంటి మినహాయింపులూ లేకుండా పన్ను శ్లాబులను మాత్రం సవరించింది. పాత పన్ను విధానంలోనైతే గృహ రుణం, స్కూలు ఫీజుల నుంచి మనం చేసిన వివిధ సేవింగ్స్‌ను కూడా మినహాయించుకునే అవకాశముండేది. కొత్త విధానంలో అలాంటి మినహాయింపులేవీ లేవు. కాకపోతే పన్ను రేట్లు కాస్త తక్కువ. జీతాన్ని బట్టి ప్రస్తుతం ఎవరి లెక్కలు వారు వేసుకుని, ఎవరికి ఏది అనుకూలమంటే దాన్ని ఎంచుకుంటున్నారు. కాకపోతే రెండేళ్లు ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో ఆకర్షణీయమైన మార్పులు చేస్తూ... పాత పన్ను విధానం నుంచి ఎవరికి వారు స్వచ్ఛందంగా కొత్త విధానంలోకి మారేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈసారి పాత విధానం వృథా అనేలా చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్నుల విధానంలో 72 శాతం మందికి పైగా రిటర్నులు దాఖలు చేశారు. పాత పన్నుల విధానాన్ని రద్దు చేసి.. కొత్త పన్నుల విధానంలో పలు రాయితీలను ప్రకటించడం ద్వారా మధ్య తరగతి ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చన్నది ఆర్థిక మంత్రి ఆలోచనగా ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం... కొత్త విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని, రూ.15–20 లక్షల వరకు ఆదాయానికి 25 శాతం కొత్త పన్ను శ్లాబ్‌ను ప్రవేశపెట్టాలనే వాదనలు బలంగా వస్తున్నాయి. ఆర్థిక మంత్రి గనక ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే బడ్జెట్లో మధ్య తరగతికి మేలు జరిగినట్లే. బడ్జెట్ సమావేశాల ఆరంభానికి ముందు... శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పన్ను మినహాయింపులపై ఆశలు పెంచేలా ఉన్నాయి. మధ్యతరగతి, పేదలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పేర్కొనడం గమనార్హం. ఇన్ఫ్రాకు బూస్ట్కొంతకాలంగా ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణంపై దృష్టి సారించడం వల్ల ఇన్ఫ్రా రంగంమీద ఫోకస్ ఉంటుంది. అయితే ఈ రంగంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు నిరుత్సాహకరంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే మూలధన వ్యయం మద్దతును పెంచే అవకాశముంది. వివిధ పరిశ్రమలలో ఇప్పటికే మంచి ఫలితాలను చూపించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని విస్తరించడం ద్వారా తయారీ రంగాన్ని బలోపేతం చేసే అవకాశం కనిపిస్తోంది. వినియోగాన్ని పెంచడం తక్షణ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రైవేట్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోటీతత్వం ,ఉపాధి అవకాశాలను పెంచే దీర్ఘకాలిక వ్యూహాలపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.యువత ఉపాధి, కీలక రంగాలకు మద్దతురాబోయే రోజుల్లో లక్షల మంది యువతీ యువకులు డిగ్రీ పట్టాలతో మార్కెట్లోకి వస్తారు. వీళ్లందరికీ ఉద్యోగాలు లభిస్తేనే ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. ఇందువల్ల ఉద్యోగ కల్పనపై కూడా బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించే అవ కాశం ఉంది. నిర్మాణం, జౌళి, ఇ–కామర్స్, పర్యాటక రంగాలు పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి.ఈ రంగాలకు బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు ఉండొచ్చు. దీనికి అదనంగా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం వారికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించడం లక్ష్యంగా విధానాలు ప్రకటించచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి ప్రభుత్వం నుంచి నిరంతర సహాయం అందేలా చర్యలు తీసుకునే వీలుంది. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం రుణ హామీ పథకాలను విస్తరించడం, ఎగుమతులకు అదనపు ప్రోత్సాహæకాలు అందించడం వంటి చర్యలను పరిశీలించవచ్చు. వీటికి తోడు చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై విధించే పన్నుల సరళీకరణ కూడా బడ్జెట్లో ఉండొచ్చు.వ్యవసాయం, గ్రామీణ ఆర్థికంపై ఫోకస్వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బడ్జెట్లో ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉంది. రైతులు రుణాలను సులభంగా పొందడానికి ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ పథకాలను విస్తరించవచ్చు. ఈ రంగానికి మరింత మద్దతుగా, ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మరిన్ని కేటాయింపులు చేసే అవకాశం ఉంది. పంట నిల్వల కోసం గోదాముల నిర్మాణం, వ్యవసాయ మార్కెటింగ్ కోసం మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వొచ్చు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ వంటి కార్యక్రమాలు నీటిపారుదలను గణనీయంగా పెంచినప్పటికీ, ఇంకా పురోగతికి అవకాశం ఉంది. పరిశోధన, అభివృద్ధితో సహా సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యవస్థలతో వ్యవసాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెంచడానికి రైతులకు మరింత మద్దతు అవసరం. గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకి పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని, అందుబాటు గృహాల నిర్మాణం మరో ముఖ్యమైన అంశంగా ఉండొచ్చు. ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఉపాధి పథకాలకు నిధులు పెంచి, దాని పరిధిని విస్తరించే అవకాశముంది. -
తగ్గిన జీడీపీ వృద్ధి అంచనా
కేంద్ర బడ్జెట్‌కు ముందు శుక్రవారం మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 ఆర్థిక సర్వే 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.3-6.8 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.2% వృద్ధిని నమోదు చేసిందన్నారు. దాంతో వరుసగా మూడో ఏటా 7% పైగా వృద్ధి నమోదు చేసినట్లయింది.ఆర్థిక సర్వే 2026 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 6.3-6.8% అంచనా వేసింది. ఇది అంతకుముందు సంవత్సరం వృద్ధి కంటే తక్కువగా ఉంది. అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడంలో విధానకర్తలు కీలక పాత్ర పోషించారని ఆర్థిక సర్వే తెలిపింది. సవాలుతో కూడిన అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధిని కొనసాగించాలంటే గణనీయమైన ప్రయత్నాలు అవసరమని సర్వే నొక్కి చెప్పింది.ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా వంటి కీలక రంగాలు మంచి పనితీరు కనబరుస్తాయని పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సవాళ్లను ఎదుర్కొంటాయని అంచనా వేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం, లక్పతి దీదీ పథకం, ఇండియా ఏఐ మిషన్ సహా ఆర్థిక వృద్ధిని పెంచడానికి ఉద్దేశించిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పురోగతి ఉంటుందని ఈ సర్వే తెలిపింది.ఇదీ చదవండి: జాతికి ముప్పు చేసే టెక్నాలజీలుకేంద్ర బడ్జెట్ 2025 అంచనాలుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆదాయపు పన్ను శ్లాబులను సవరించడం, మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడం, గ్రామీణాభివృద్ధి, విద్యకు కేటాయింపులను పెంచడం వంటి చర్యలతో జీడీపీ వృద్ధిని ప్రోత్సహించడంపై బడ్జెట్ దృష్టి పెడుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
బంగారం.. మరింత పెరిగే అవకాశం!
న్యూఢిల్లీ: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం, 2024 నాలుగో త్రైమాసికంలో అమెరికా జీడీపీ నెమ్మదించిందన్న పరిణామాల నేపథ్యంలో పసిడి ఆల్‌టైమ్ రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో ఏప్రిల్ కాంట్రాక్టుకు సంబంధించి ఔన్సు (31.1 గ్రాములు) ధర ఒక దశలో ఏకంగా 2,852 డాలర్లకు ఎగిసింది. ఈ నేపథ్యంలో 2025లో 3,290 డాలర్లకు కూడా చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.బుధవారం అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా పసిడి రేట్లకు ఆజ్యం పోసినట్లు తెలిపాయి. తాజా పరిణామంతో దేశీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం మరింత పెరగవచ్చని పేర్కొన్నాయి.మరోవైపు, ఢిల్లీలో గురువారమూ పసిడి కొత్త జీవితకాల గరిష్టాలను తాకింది. 99.9 స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.83,800కు చేరింది. బుధవారం 10 గ్రా. రూ.910 లాభపడి రూ.83,750 వద్ద ముగియడం తెలిసిందే. 99.5 స్వచ్ఛత బంగారం సైతం రూ.50 పెరిగి రూ.83,400కు చేరింది. మరోవైపు వెండికి సైతం డిమాండ్ పెరిగింది.కొనుగోళ్ల మద్దతుతో కిలోకి ఏకంగా రూ.1,150 పెరిగి రూ.94,150కి చేరింది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం నూతన గరిష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్ నెల కాంట్రాక్టుల ధర రూ.541 పెరిగి రూ.81,145కు చేరింది. బడ్జెట్లో దిగుమతి సుంకాలు పెంచొచ్చన్న అంచనాలతో బంగారం సానుకూలంగా ట్రేడ్ అవుతోందని నిపుణులు చెబుతున్నాయి. -
కేంద్ర బడ్జెట్ 2025.. మురిపించేనా.. మొండిచెయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రం గంపెడాశలు పెట్టుకుంది. గత ఏడాది కేటాయింపులు కార్యరూపం దాల్చకపోవడం, ఆశించిన మేర నిధులు రాకపోవడంతో కించిత్ దూరంలో ఉన్న కీలక ప్రాజెక్టులు ఈసారైనా కేంద్ర సాయం దక్కక పోతుందా అని ఎదురుచూస్తున్నాయి. అలాగే ఫ్యూచర్ సిటీ మొదలు అనేక అభివృద్ధి ప్రణాళికలు, కార్యక్రమాలకు నిధులు కావాల్సి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు, పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాలాంటి పాత డిమాండ్లు నెరవేర్చాలని కోరడంతో పాటు, ట్రిపుల్ ఆర్, మెట్రో రైలు విస్తరణ లాంటి కొత్త పనులకు కూడా నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. అయితే గత కొన్నేళ్లుగా కేంద్ర బడ్జెట్ ఆశించిన మేర రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడం లేదు. దీంతో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఈసారైనా మంచి చేయకపోతుందా.. మరిన్ని నిధులు వచ్చేలా ప్రతిపాదనలు చేయకపోతుందా..పన్నుల్లో వాటా పెంచకపోతుందా, గ్రాంట్లు ఇవ్వకపోతుందా అనే ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గ్రాంట్లు, పన్నుల్లో వాటా ఏం చేస్తారో? రాష్ట్రాలకు కేంద్రం నేరుగా ఇచ్చే నిధుల్లో కూడా కొన్నేళ్లుగా కోతలు పడుతున్నాయి. జనాభా ప్రాతిపదికన ఇచ్చే పన్నుల్లో వాటాను 41 శాతంగా 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించినా బడ్జెట్లో కేవలం 32 శాతానికి కుదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఏడాదికి రూ.15 వేల కోట్లకు పైగా మాత్రమే పన్నుల్లో వాటా కింద తెలంగాణకు వస్తుండగా, పూర్తిస్థాయిలో ఇస్తే మరో రూ.5–8వేల కోట్లు అధికంగా వస్తాయని రాష్ట్రం ఆశిస్తోంది. ఇక గత మూడేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ వివరాలను పరిశీలిస్తే.. 2022–23లో రూ.41,001.73 కోట్లు ఇస్తారని ఆశిస్తే అందులో 32.14 శాతం అంటే కేవలం రూ.13,179.21 కోట్లు మాత్రమే వచ్చాయి. 2023–24లో రూ.41,259.17 కోట్లు అంచనా వేస్తే అందులో 23.58 శాతం అంటే రూ.9,729.91 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలైన ఉపాధి హామీ, ఇళ్లు, స్మార్ట్‌సిటీలు, రోడ్లు..తదితరాల కింద కూడా ఆశించిన మేర నిధులు రాకపోవడం గమనార్హం. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై ఇప్పటికే ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. 2025–26 బడ్జెట్లో నిధుల కేటాయింపు కోరుతూ ప్రాజెక్టుల వారీగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపింది. రీజనల్ రింగు రోడ్డు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో ప్రాజెక్టు విస్తరణ, హైదరాబాద్‌లో సీవరేజి మాస్టర్‌ప్లాన్, వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ, రేడియల్ రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఇండ్రస్టియల్ హబ్‌లు, లాజిస్టిక్, రిక్రియేషన్ పార్కులు, ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, కరీంనగర్, జనగామ జిల్లాల్లో లెదర్ పార్కులకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయి. అలాగే తెలంగాణలోని గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాక్‌లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి, కేంద్రీయ విద్యాలయాలు, జిల్లాకో నవోదయ పాఠశాల, పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా, రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు తదితరాలు కూడా వాటిల్లో ఉన్నాయి. వీటితో పాటు గత ఆరేళ్లుగా రాని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు (బీఆర్జీఎఫ్) రూ.1,800 కోట్లు, 2014–15లో కేంద్ర ప్రాయోజిత పథకాల బకాయిలు రూ.495 కోట్లు, ఉమ్మడి సంస్థల నిర్వహణకైన ఖర్చులో ఏపీ వాటా కింద రూ.408.49 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ప్రతిపాదనల్లో వేటికి ఎంత కేటాయింపులు జరుగుతాయో, అసలు జరుగుతాయో లేదో, ఆశించిన మేర ప్రయోజనం చేకూరుతుందో లేదో ఒకటవ తేదీన తేలనుంది. ట్రిపుల్ ఆర్ చూపెట్టి తప్పించుకునే చాన్స్? ఈసారి కేంద్ర బడ్జెట్ పరిమాణం 10 శాతం పెరిగి రూ.55 లక్షల కోట్లకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి. ఆ మేరకు రాష్ట్రాలకు కేటాయింపులు పెరగాలి. డివిడెండ్ కింద ఆర్బీఐ ఈసారి కేంద్రానికి రూ.2 లక్షల కోట్లు ఇవ్వొచ్చు. ఆ డివిడెండ్, సెస్సులు, అదనపు ఆదాయాన్ని రాష్ట్రాలకు బదిలీ చేయాలి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ప్రాణహిత లేదంటే పాలమూరు ప్రాజెక్టులో ఒక దానికి ఖచ్చితంగా జాతీయ హోదా ఇవ్వాలి. కానీ కేంద్రం ఈసారి ట్రిపుల్ ఆర్కి అరకొర నిధులు చూపెట్టి చేతులు దులుపుకునే అవకాశముంది. ఈ ఏడాది జీడీపీ తగ్గినందున ఆదాయ పన్ను పరిమితి పెంచాలని అటు ప్రభుత్వం, ఇటు కార్పొరేట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినందునే జీడీపీ తగ్గిపోతోందని ఆర్బీఐ కూడా ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే అసంఘటిత రంగంలోని కారి్మకుల వేతనాలను నెలకు కనీసం రూ.28 వేలకు పెంచాలి. వేతన సవరణ కమిషన్ల సిఫారసులను త్వరితగతిన అమలు చేయడం వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. కేవలం రాయితీలకే పరిమితం కాకుండా ప్రజల నిజమైన ఆదాయం పెరిగే విధంగా కేంద్రం బడ్జెట్ ప్రతిపాదనలకు రూపకల్పన చేయాలి. – డాక్టర్ అందె సత్యం, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు -
పెరిగిన జీడీపీ వృద్ధి అంచనాలు
రాబోయే కేంద్ర బడ్జెట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ నామమాత్ర జీడీపీ వృద్ధి 10.4%గా ప్రకటిస్తారని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 9.7 శాతం కంటే ఇది అధికం. వాస్తవ జీడీపీలో ఊహించిన ద్రవ్యోల్బణం నమోదు కావడమే ఈ పెరుగుదలకు కారణమని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.నామమాత్రపు జీడీపీ వృద్ధిని నడిపించే అంశాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 2025 ఆర్థిక సంవత్సరంలో 2.5 శాతం నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణంలో ఈ పెరుగుదల నామమాత్ర జీడీపీ వృద్ధికి గణనీయంగా దోహదం చేసే అవకాశం ఉంది. వినియోగాన్ని పునరుద్ధరించేందుకు సబ్సిడీల హేతుబద్ధీకరణ తోడ్పడుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: మహా కుంభమేళా ఎఫెక్ట్.. పెరిగిన ఛార్జీలు2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 4.5% కంటే తక్కువగా ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడానికి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని నిర్ధారించడానికి ఈ లక్ష్యం కీలకం కానుంది. జీడీపీలో వృద్ధి అంచనా వేసినప్పటికీ, ప్రపంచ ఆర్థిక ప్రతికూలతలు, భారత ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయి. వాస్తవ జీడీపీ వృద్ధి 2026 ఆర్థిక సంవత్సరంలో 6.6% ఉంటుందని అంచనా. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మూలధన వ్యయంపై ప్రభుత్వం దృష్టి సారించడం ఆర్థిక వృద్ధికి సానుకూల చర్యగా భావిస్తున్నారు. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 6.6 శాతం
భారత ఆర్థిక వ్యవస్థపై (Indian economy) ఐక్యరాజ్యసమితి ఆశావహ దృక్పథాన్ని ప్రకటించింది. 2025లో భారత్ జీడీపీ (GDP) 6.6 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది.మౌలికరంగ వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న మూలధన వ్యయాల ప్రభావం రానున్న సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థపై ఎన్నో రెట్లు ఉంటుందని అంచనా వేసింది. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2025’ పేరుతో ఐక్యరాజ్యసమితి ఒక నివేదికను (UN report) విడుదల చేసింది. భారత్ జీడీపీ 2024లో 6.8 శాతం వృద్ధి చెందగా, 2025లో 6.6 శాతం, 2026లో 6.8 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఈ నివేదికలో అంచనాలు వెల్లడించింది.సేవలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి కొన్ని రకాల వస్తు ఎగుమతుల్లో బలమైన వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుందని తెలిపింది. 2024లో వర్షాలు ఆశాజనకంగా ఉండడం 2025లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని పేర్కొంది. భారత్‌లో భారీ స్థాయి మౌలిక ప్రాజెక్టులు, ఫిజికల్, డిజిటల్ అనుసంధానత, సోషల్ ఇన్ఫ్రాపై ప్రభుత్వం చేస్తున్న వ్యయాలు 2025లోనూ బలంగా కొనసాగుతాయని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం దిగొస్తుంది.. భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 2024లో 4.8 శాతం ఉండగా, 2025లో 4.3 శాతానికి దిగొస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది. మధ్యకాలానికి ఆర్బీఐ లకి‡్ష్యత పరిధి అయిన 2–6 శాతం మధ్యే ఉంటుందని పేర్కొంది. భారత్‌లో ఉపాధి మార్కెట్ 2024 వ్యాప్తంగా బలంగా ఉన్నట్టు, కార్మికుల భాగస్వామ్యం రికార్డు స్థాయిలో ఉన్నట్టు తెలిపింది.పట్టణ ప్రాంత నిరుద్యోగం 2023లో 6.7 శాతంగా ఉంటే, 2024లో 6.6 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం మెరుగుపడినట్టు తెలిపింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2025లో 2.8 శాతం, 2026లో 2.9 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2023, 2024లో 2.8 శాతంగా ఉండడం గమనార్హం. -
ఎకానమీ స్పీడ్ 6.4 శాతమే..
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ రేటు నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి అవుతుంది. ముఖ్యంగా తయారీ, సేవల రంగాల పనితీరు బలహీనంగా ఉండడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. 2020–21లో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8 శాతం క్షీణతను నమోదుచేసిన సంగతి తెలిసిందే.అటు తర్వాత 6.4 శాతం వృద్ధి రేటు నమోదయితే అది నాలుగేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది. బేస్ ఎఫెక్ట్‌తో 2021–22లో ఎకానమీ వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదయ్యింది. 2022–23లో 7 శాతం, 2023–24లో 8.2 శాతంగా ఈ రేట్లు ఉన్నాయి. 2024–25పై జాతీయ గణాంకాల కా ర్యాలయం తాజా అంచనాలు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) డిసెంబర్ 2024లో అంచనా వేసిన 6.6 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వశాఖ తొలి అంచనా 7 శాతంకన్నా కూడా ఈ అంచానలు తక్కువగా ఉండడం గమనార్హం. ఆర్బీఐ పాలసీ అంచనాలు ఇవీ.. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనావేసిన ఆర్బీఐ ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్ష క్యూ3లో 6.8 శాతం, క్యూ4లో 7.2 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని, 2025–26 మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) వరుసగా 6.9 శాతం, 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధి నమోదవగా, రెండవ క్వార్టర్లో 7 క్వార్టర్ల కనిష్ట స్థాయి లో 5.4 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.కీలక రంగాలపై అంచనాలు..తయారీ రంగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 5.3 శాతంగా అంచనా. గత ఆర్థిక సంవత్సరం ఈ విభాగం 9.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. సేవల రంగం: ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన ఈ రంగం వృద్ధి అంచనా 5.8 శాతం. 2023–24లో ఈ రేటు 6.4 శాతం. వ్యవసాయం: కొంత మెరుగైన ఫలితం వెలువడనుంది. 3.8 శాతం వృద్ధి నమోదవుతుందని గణాంకాలు అంచనా వేస్తున్నాయి. 2023–24లో 1.4 శాతంతో పోలిస్తే ఇది మెరుగైన స్థాయి కావడం గమనార్హం. ఎకానమీ లెక్కలు ఇలా... ⇒ 2024–25లో ఎకానమీ విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు (డాలర్ మారకంలో రూపాయి విలువ రూ.85.71 ప్రాతిపదికన) ⇒ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత ధరల ప్రకారం 2024–25లో జీడీపీ విలువ అంచనా రూ. 324.11 లక్షల కోట్లు, 2023–24లో ఈ విలువ రూ. 295.36 లక్షల కోట్లు. అంటే వృద్ధి 9.7 శాతం. ⇒ ప్రైవేట్ తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.3 శాతం. గత సంవత్సరంలో ఈ రేటు 4 శాతం. ప్రభుత్వ తుది వినియోగ వ్యయం (జీఎఫ్‌సీఈ): 2024–25లో 4.1 శాతం వృద్ధి, 2023–24లో ఈ రేటు 2.5 శాతం. తలసరి ఆదాయం: ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకోకుండా 2024–25లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం 8.7 శాతం పెరిగి రూ. 2,00,162కు చేరుకునే అవకాశం ఉంది. 2023–24లో ఈ విలువ రూ. 1,84,205. ముందస్తు గణాంకాల ప్రాధాన్యత!ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌కు సన్నాహకంగా తాజా ముందస్తు అంచనాలు ఉపయోగపడతాయి. తగిన అంచనాలు... 2024–25 ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలు సమంజసంగానే ఉన్నాయి. అయితే కొన్ని రంగాలు అధిక వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎకానమీపై కూడా అంతర్జాతీయ అనిశ్చితిలు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయా అంశాలు పరిగనణలోకి తీసుకుంటూ 2025–25లో జీడీపీ వృద్ధి రేటును 6.5 శాతంగా మేము అంచనా వేస్తున్నాం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్మూలధన వ్యయ తగ్గుదల ప్రభావం కరోనా మహమ్మారి తర్వాత ఎకానమీ పురోగతిలో ప్రభుత్వ మూలధన వ్యయాలు కీలకంగా మారాయి. వీటి తగ్గుదల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఇక పట్టణ ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం అలాగే రుణ వృద్ధి మందగమనం సవాళ్లను ఎదుర్కొంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల విశ్వాసం తగ్గింది. పట్టణ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపే రిటైల్ క్రెడిట్ వృద్ధి మందగించింది. – ధర్మకీర్తి జోషి, క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్వృద్ధి 6.2 శాతానికి పరిమితం: హెచ్ఎస్బీసీప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.2 శాతమేనని విదేశీ బ్రోకరేజ్ సంస్థ– హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. అధికారిక అంచనాతో పోలిస్తే ఇది మరింత తక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతానికి పెరుగుతుందని నివేదిక విశ్లేíÙంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై –సెప్టెంబర్) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదుకావడం నిరాశాజనకంగా ఉన్నట్లు హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. క్యూ2 తర్వాత పరిస్థితులు మెరుగు... ‘‘మేము విశ్లేíÙంచే 100 సూచికల ప్రకారం సెప్టెంబర్ తరువాత వృద్ధి సూచికలు మెరుగుపడ్డాయి. అయితే జూన్ త్రైమాసికంతో ఇంకా బలహీనంగానే ఉన్నాయి’’ అని నివేదిక పేర్కొంది. జూలై–సెపె్టంబర్ కాలంలో 55 శాతం సూచికలు సానుకూలంగా వృద్ధి చెందగా, డిసెంబర్ త్రైమాసికంలో ఇది 65 శాతానికి పెరిగిందని తెలిపింది. వ్యవసాయం, ఎగుమతులు, నిర్మాణ రంగాల్లో మెరుగుదల అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. ఇటీవల వారంలో చాలా చర్చనీయాంశంగా మారిన పట్టణ వినియోగంలో కూడా డిసెంబర్ త్రైమాసికంలో కొంత మెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది.అయితే, వినియోగ విద్యుత్ సేవలు, ప్రైవేటు పెట్టుబడుల సూచికలు ఇంకా బలహీనంగానే ఉన్నాయని తెలిపింది. జూన్ త్రైమాసికంలో 75 శాతం సూచికలు సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి అంత బాగోలేదని నివేదిక వెల్లడించింది. 2024–25లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.9 శాతంగా ఉంటుందని, 2025–26లో ఇది 4.4 శాతానికి నివేదిక పేర్కొంది. నవంబరులో 5.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం డిసెంబరులో 5.3 శాతానికి, జనవరిలో 5 శాతం కంటే తక్కువకు పడిపోతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. అరశాతం రెపో రేటు కోత అంచనా... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధానం ఫిబ్రవరి, ఏప్రిల్ విధాన సమీక్షలలో 0.25 శాతం చొప్పున రెండు రేట్ల కోత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. వృద్ధే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ ప్రస్తుత 6.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గే అవకాశం ఉంది. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయడానికి వ్యయ నియంత్రణ అవసరమని పేర్కొన్న నివేదిక, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుండడమే దీనికి కారణంగా వివరించింది. -
ఆర్థిక మందగమనం తాత్కాలికమే..!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) 5.4 శాతం పురోగతి ‘‘తాత్కాలిక ధోరణి’’ మాత్రమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రాబోయే త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ చక్కటి వృద్ధిని చూస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గ్రాంట్ల కోసం తొలి సప్లిమెంటరీ డిమాండ్‌కు సంబంధించి లోక్‌సభలో జరిగిన చర్చకు ఆమె సమాధానమిస్తూ, భారతదేశం స్థిరమైన వృద్ధిని చూసిందని, గత మూడేళ్లలో దేశం జీడీపీ వృద్ధి రేటు సగటున 8.3 శాతంగా నమోదైందని తెలిపారు. ఆమె ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు... → ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) తొలి రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 6.7 శాతం, 5.4 శాతాలుగా నమోదయ్యాయి. రెండవ త్రైమాసిక ఫలితం ఊహించినదానికన్నా తక్కువగానే ఉంది. రెండవ త్రైమాసికం భారత్‌కే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాలకుసైతం ఒక సవాలుగా నిలిచింది. → ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది. సవాళ్లను ఎదుర్కొంటూనే, వారి ఆకాంక్షలను నెరవేర్చుకుంటూ ఎకానమీ పురోగతికి దోహదపడుతున్న భారత ప్రజలకు ఈ ఘనత దక్కుతుంది. → తయారీ రంగంలో విస్తృత స్థాయి మందగమనం లేదు. మొత్తం తయారీ బాస్కెట్‌లోని సగం రంగాలు పటిష్టంగానే కొనసాగుతున్నాయి. తయారీలో పూర్తి మందగమనాన్ని ఊహించలేం. ఎందుకంటే సవాళ్లు కొన్ని విభాగాలకే పరిమితం అయ్యాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీలోని 23 తయారీ రంగాలలో సగం ఇప్పటికీ పటిష్టంగానే ఉన్నాయి. → జూలై–అక్టోబర్ 2024 మధ్య కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం 6.4 శాతం పెరిగడం ఒక హర్షణీయ పరిణామం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మూలధన కేటాయింపులు రూ.11.11 లక్షల కోట్లు పూర్తి స్థాయిలో వ్యయమవుతాయని భావిస్తున్నాం. మూలధన వ్యయాల ద్వారా వృద్ధికి ఊతం ఇవ్వడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. → ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, యూపీఏ హయాంలో కొనసాగిన ‘రెండంకెల రేటు’తో పోలి్చతే ఎన్డీఏ పాలనా కాలంలో ధరల స్పీడ్ తక్కువగా ఉంది. 2024–25 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఈ రేటు 4.8 శాతం. కోవిడ్ మహమ్మారి దేశాన్ని కుదిపివేసిన తర్వాత ఇంత తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం నమోదుకావడం గమనార్హం. ఫుడ్, ఇంధన ధరల ఒడిదుడుకులతో సంబంధంలేని కోర్ ద్రవ్యోల్బణం (తయారీ తత్సబంధ) ఇదే కాలంలో కేవలం 3.6 శాతంగా ఉండడం గమనార్హం. → 2017–18లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ప్రస్తుతం 3.2 శాతానికి తగ్గింది. రూ.44,143 కోట్ల అదనపు వ్యయాలకు ఆమోదం ఆర్థిక మంత్రి సమాధానం తర్వాత లోక్‌సభ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 44,143 కోట్ల అదనపు నికర వ్యయానికి ఆమోదం కోరుతూ సంబంధిత గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్లను ఆమోదించింది. ప్రధానంగా వ్యవసాయం, ఎరువులు, రక్షణ మంత్రిత్వ శాఖలు అధిక వ్యయం చేస్తున్న నేపథ్యంలో ఈ అనుబంధ డిమాండ్ అవసరం అయ్యింది. -
జీడీపీ మందగమనం
దేశ ఆర్థిక వ్యవస్థ ఇటీవలి కాలంలో అంచనాలను మించలేకపోతుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశార్థికం భారతీయ రిజర్వు బ్యాంకు ఆశించిన ఆశించినంత వృద్ధి రేటు సాధించలేకపోయింది. 7 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తే ఈసారి కనిష్ఠంగా 5.4 శాతం వృద్ధి కనబరిచింది. గడిచిన త్రైమాసికంలో అదే తంతు కొనసాగింది. ఏప్రిల్-జూన్ కాలంలో అంచనా వేసిన 7.1 శాతం వృద్ధిని చేరుకోలేక 6.7 శాతంతో సరిపెట్టుకుంది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఆశించినంత పెరగదని రిజర్వు బ్యాంకు ముందుగానే అంచనా వేసింది. అందుకు విభిన్న అంశాలు కారణమని ఆర్బీఐ విశ్లేషించింది. ఎన్నికల వల్ల వివిధ పథకాలు, ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం తగ్గడం, వ్యవసాయ, సేవా రంగాల్లో క్షీణత జీడీపీ వృద్ధికి నిరోధంగా నిలిచాయి. రెండో త్రైమాసికంలోనూ ఆర్థిక వృద్ధిని వెనక్కు లాగిన కొన్ని అంశాలను ఆర్బీఐ వెల్లడించింది.వేతనాల్లో మార్పు లేకపోవడం: కొన్ని రాష్ట్రాల్లో వాస్తవ వేతన వృద్ధిలో ఎలాంటి మార్పులు లేవు. దాంతో వృద్ధికి ప్రతికూలంగా మారింది. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది.అధిక ఆహార ద్రవ్యోల్బణం: రిటైల్ ఆహార ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది పట్టణ వినియోగాన్ని ప్రభావితం చేస్తోంది.బలహీనమైన తయారీ రంగం: తయారీ రంగం 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కేవలం 2.2 శాతం మాత్రమే వృద్ధి చెందింది.తగ్గిన ప్రభుత్వ వ్యయం: ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గుతోంది. దానివల్ల ఉపాధి సృష్టి జరగక వినియోగం మందగిస్తోంది. ఫలితంగా ఆర్థిక వృద్ధి సన్నగిల్లుతోంది.ప్రతికూల వాతావరణ పరిస్థితులు: మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా పడింది. ఆయా విభాగాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది.కార్పొరేట్ ఆదాయాలు: చాలా కంపెనీలు రెండో త్రైమాసికంలో ఆశించినమేర ఆదాయాలు పోస్ట్ చేయలేదు. ఇది వస్తు వినియోగం తగ్గుదలను సూచిస్తుంది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ క్లెయిమ్ తిరస్కరించారా? ఇవి తెలుసుకోండి!ఈ ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికంలో భారతదేశ వాస్తవ జీడీపీ రూ.43.64 లక్షల కోట్లకు చేరుకుంది. అది రెండో త్రైమాసికంలో రూ.44.1 లక్షల కోట్లకు పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనా వేసిన స్థూల దేశీయోత్పత్తిని ‘వాస్తవ జీడీపీ’ అంటారు. ఒక ప్రాతిపదిక సంవత్సర ధరలను తీసుకుని ద్రవ్యోల్బణం వల్ల వాటిలో వచ్చిన మార్పులను సరిచేస్తే వాస్తవ జీడీపీ వస్తుంది. -
తగ్గుతున్న వేతనాలు.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి!
భారత వృద్ధికి వెన్నెముకగా ఉంటున్న మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం, గృహ ఖర్చులు, రవాణా ఖర్చలు పెరగడం.. వంటి విభిన్న అంశాలు ఇందుకు కారణమని ఎలరా సెక్యూరిటీస్ తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం వల్ల లిస్టెడ్ నాన్ ఫైనాన్షియల్ కంపెనీల్లో వేతనాలు 0.5% తగ్గినట్లు ఎలారా పేర్కొంది.ఎలరా సెక్యూరిటీస్ వివరాల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రజల ఆదాయాలు గణనీయంగా ప్రభావితం చెందుతున్నాయి. మధ్యతరగతి, పేద ప్రజలు రోజువారీ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేట్ ఆదాయాల్లో మందగమనం కనిపిస్తోంది. హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా వంటి కంపెనీలకు చెందిన వస్తువుల పట్టణ డిమాండ్ క్షీణిస్తోంది. ఆయా కంపెనీ త్రైమాసిక వృద్ధికి సంబంధించి ముందుగా అంచనావేసిన దానికంటే బలహీనమైన వృద్ధి నమోదు అవుతోంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో గ్రామీణ విక్రయాలు 8% వృద్ధి చెందగా, పట్టణ విక్రయాలు 2% తగ్గాయి.ఇదీ చదవండి: మస్క్ కొత్తగా గేమింగ్ స్టూడియో!ప్రభుత్వం వస్తువుల డిమాండ్‌ను పెంచేందుకు వడ్డీరేట్ల కోతలు ప్రారంభించాలని యోచిస్తోంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ వివిధ మార్గాలు అనుసరిస్తోంది. దాంతో వడ్డీరేట్ల కోత నిర్ణయం వాయిదా పడుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిని 7 శాతం నుంచి 6.5 శాతానికి కట్ చేశారు. అంచనాల కంటే భిన్నంగా జీడీపీ వృద్ధి నమోదవుతుండడం ఆందోళన కలిగించే అంశం. మెట్రో నగరాల్లో ఇంటి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ ధరలు దేశవ్యాప్తంగా 23% పెరిగాయి. ఇంటి అద్దెలు పట్టణ ప్రజల ఆదాయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 7.2 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ 2024లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని మూడిస్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణ రిస్క్‌లు ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానాన్నే కొనసాగించేందుకు (2024 చివరి వరకు) దారితీయవచ్చని తెలిపింది.తగినన్ని ఆహార నిల్వలు, పెరిగిన సాగుతో ఆహార ధరలు దిగొస్తాయని, రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత లక్ష్యం (4 శాతం) దిశగా తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేసింది. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి అయిన 6.21 శాతానికి చేరడం తెలిసిందే. ‘‘పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఎదురయ్యే ద్రవ్యోల్బణం రిస్క్, తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ద్రవ్య విధానాన్ని సడలించే విషయంలో ఆర్బీఐ అప్రమత్తతను తెలియజేస్తోంది’’అని మూడీస్ పేర్కొంది.ఇదీ చదవండి: కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్ఈ ఏడాదికి చివరి ఎంపీసీ సమావేశం డిసెంబర్ 7–9 తేదీల మధ్య జరగనుంది. గృహ వినియోగం పెరగనుందని చెబుతూ.. పండుగల సీజన్లో కొనుగోళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడాన్ని మూడీస్ తన నివేదికలో ప్రస్తావించింది. సామర్థ్య వినియోగం పెరుగుతుండడం, వ్యాపార సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తోందని, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుండడం ప్రైవేటు పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. -
వృద్ధికి సానుకూలతలే ఎక్కువ
ముంబై: దేశ జీడీపీ వృద్ధికి సంబంధించి వస్తున్న గణాంకాలు మిశ్రమంగా ఉన్నాయంటూ.. ప్రతికూలతల కంటే సానుకూలతలే ఎక్కువని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా కార్యకలాపాలు మొత్తానికి బలంగానే కొనసాగుతున్నట్టు చెప్పారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంపై ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ మాట్లాడారు. ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే, వెనక్కిలాగే 70 అధిక వేగంతో కూడిన సూచికలను ట్రాక్ చేసిన తర్వాతే ఆర్బీఐ అంచనాలకు వస్తుందని వివరించారు. 2024–25 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి 6.7 శాతంగా నమోదు కావడం గమనార్హం. 15 నెలల కనిష్ట స్థాయి ఇది. దీంతో వృద్ధిపై విశ్లేషకుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుండడం తెలిసిందే. కానీ, జీడీపీ 2024–25లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందంటూ ఆర్బీఐ గత అంచనాలను కొనసాగించడం గమనార్హం. ప్రతికూలతల విషయానికొస్తే.. పారిశ్రామికోత్పత్తి సూచీ డేటా (ఐఐపీ), పట్టణాల్లో డిమాండ్ మోస్తరు స్థాయికి చేరినట్టు ఎఫ్ఎంసీజీ విక్రయ గణాంకాల ఆధారంగా తెలుస్తోందని దాస్ అన్నారు. దీనికితోడు సబ్సిడీల చెల్లింపులు కూడా పెరగడం సెపె్టంబర్ త్రైమాసికం జీడీపీ (క్యూ2) గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. బలంగా ఆటో అమ్మకాలు డిమాండ్ బలహీనంగా ఉండడంతో ఆటోమొబైల్ కంపెనీల ఇన్వెంటరీ స్థాయిలు పెరిగిపోవడం పట్ల చర్చ జరుగుతుండడం తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ దాస్ ఇదే అంశంపై స్పందిస్తూ అక్టోబర్‌లో ఈ రంగం మంచి పనితీరు చూపించిందని, 30 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. దీనికి అదనంగా వ్యవసాయం, సేవల రంగాలు సైతం మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు వెల్లడించారు. కనుక వృద్ధి మందగిస్తుందని ప్రకటించడానికి తాను తొందరపడబోనన్నారు. భారత్ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగుపెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. ఆర్థిక వ్యవస్థకు పెద్దపులి లాంటి బలం ఉందంటూ, దీనికి ఆర్బీఐ చలాకీతనాన్ని అందిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. అధిక ద్రవ్యోల్బణం.. రేట్ల కోత అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం సెపె్టంబర్లో వచ్చిన 5.5 శాతం కంటే అధికంగా ఉంటుందని శక్తికాంతదాస్ సంకేతం ఇచ్చారు. ఈ నెల 12న గణాంకాలు వెల్లడి కానున్నాయి. రెండు నెలల పాటు అధిక స్థాయిలోనే కొనసాగొచ్చన్న ఆర్బీఐ అంచనాలను గుర్తు చేశారు. మానిటరీ పాలసీ విషయంలో ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకోవడం (కఠినం నుంచి తటస్థానికి) తదుపరి సమావేశంలో రేట్ల కోతకు సంకేతంగా చూడొద్దని కోరారు. తదుపరి కార్యాచరణ విషయంలో ప్యానెల్‌పై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. దిద్దుబాటు కోసమే చర్యలు.. నాలుగు ఎన్బీఎఫ్సీలపై నియంత్రణ, పర్యవేక్షణ చర్యల గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. దేశంలో 9,400 ఎన్బీఎఫ్సీలు ఉండగా, కేవలం కొన్నింటిపైనే చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఆయా సంస్థలతో నెలల తరబడి సంప్రదింపుల అనంతరమే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీన్ని పర్యవేక్షించడం చాలా కష్టమని అంగీకరించారు. -
అత్యధికుల జీవితం అప్పులతో సరి
సాక్షి, అమరావతి: భారతీయుల్లో ఎక్కువ మంది ఎడాపెడా అప్పులు చేసేస్తున్నారా. అవునంటోంది కేర్ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ. మనవాళ్లు పొదుపు చేయడం కంటే.. అప్పులు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తోంది. భారతీయులకు పొదుపు కంటే రెండు రెట్లు అధికంగా అప్పులు ఉన్నట్టు కేర్ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత అప్పులు ఈ స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తున్నా.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇవి ప్రమాదకర స్థాయిలో లేవని పేర్కొంది. దేశ జీడీపీలో వ్యక్తిగత అప్పులు ఏకంగా 38 శాతానికి చేరాయి. ప్రస్తుతం దేశ జీడీపీ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.173.82 లక్షల కోట్లుగా అంచనా వేస్తుంటే.. అందులో 38 శాతం అంటే సుమారు రూ.66 లక్షల కోట్లకు సమానమైన అప్పులు మనవాళ్లు చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలైన బ్రెజిల్ జీడీపీలో వ్యక్తిగత అప్పులు 35 శాతం, దక్షిణాఫ్రికాలో 34 శాతానికే పరిమితమైనట్టు కేర్ఎడ్జ్ తన నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో మన దేశంలో వ్యక్తిగత పొదుపు జీడీపీలో 24 శాతానికే అంటే రూ.42 లక్షల కోట్లకే పరిమిత మైంది.అప్పులతో ‘రియల్’ పరుగులుమొత్తం వ్యక్తిగత అప్పుల్లో 50 శాతం గృహరుణాలే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు రుణాలు తీసుకుంటుండడం వ్యక్తిగత అప్పులు భారీగా పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది. అప్పు తీసుకుని ఖర్చు చేయకుండా సంపద సృష్టించుకోవడం కోసం వ్యయం చేస్తుండటాన్ని ఆహ్వానించింది. అప్పు తీసుకుని విలాసాలకు ఖర్చు చేయకుండా ఇల్లు, రియల్ ఎస్టేట్ వంటి సంపద సృష్టికి విని యోగంచడం సంతోషం కలిగించే విషయంగా పేర్కొంది. దేశంలో పొదుపు ఆలోచనలో భారీ మార్పు వచ్చిందని, బ్యాంకు డిపాజిట్లు వంటి వాటికంటే స్థిరాస్తుల్లో అధికంగా ఇన్వెస్ట్ చేయ డానికి మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అప్పులు విలాసాలకు విని యోగిస్తారని, కానీ.. భారత దేశంలో అప్పులను సంపద సృష్టికి వినియోగిస్తుండటంతో జీడీపీలో వ్యక్తిగత అప్పులు 38 శాతానికి చేరినా అది ప్ర మాదకర స్థాయి కాదని వెల్లడించింది. ఈ అప్పు లు నియంత్రించే స్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది. ఇతర అప్పులు వస్తే క్రెడిట్ కార్డు వంటి అన్ సెక్యూర్డ్ రుణాలు భారీగా పెరుగు తున్నట్టు హె చ్చరించింది. ఇదే సమయంలో వ్యక్తిగత ఆదా యం వృద్ధి చెందాల్సి ఉంటుందని పేర్కొంది. -
ప్రాతిపదిక ఏడాది మార్పు..?
స్థూల దేశీయోత్పత్తిని కచ్చితంగా లెక్కించేందుకు ప్రాతిపదికగా ఉన్న 2011-12 ఏడాదిని 2022-23కు మార్చాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్(ఏసీఎన్ఏఎస్)కు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ(మోస్పి) త్వరలో సూచనలు జారీ చేసే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.దేశ ఆర్థిక వ్యవస్థను కచ్చితంగా లెక్కించేందుకు ప్రస్తుతం 2011-12 ఏడాదిని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది. 12-13 ఏళ్ల కిందటి ఏడాదిని ప్రామాణికంగా తీసుకుని వృద్ధిరేటును లెక్కించడం సరికాదని కొందరు భావిస్తున్నారు. దాంతోపాటు కొత్తగణనలో కొన్ని వస్తువులను తొలగించాలని సూచిస్తున్నారు. కొత్త బేస్ ఇయర్ ఆధారంగా లెక్కించే గణాంకాలు ఫిబ్రవరి 2026లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: అన్నదానం కాదు.. ఐఫోన్ కోసం పరుగులుప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ జారీ చేసే సూచనల ఆధారంగా 2022-23 బేస్ ఇయర్లో యూనికార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ వార్షిక సర్వే, గృహ వినియోగ వ్యయ సర్వే(హెచ్సీఈఎస్) వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొత్త గణనలో లాంతర్లు, వీసీఆర్‌లు, రికార్డర్లు వంటి వస్తువులను తొలగిస్తారు. స్మార్ట్ వాచ్‌లు, ఫోన్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తులను తీసుకురానున్నారు. జీడీపీ లెక్కింపులో జీఎస్టీ కౌన్సిల్ డేటాను పరిగణనలోకి తీసుకోనున్నారు. అనధికారిక రంగాలకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలియజేసేలా అత్యాధునిక క్యాలిక్యులేషన్స్ వాడబోతున్నట్లు తెలిపారు. జీఎస్టీఎన్ నమూనా ఫ్రేమ్ వర్క్ ఆధారంగా యాన్యువల్ సర్వే ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (ఏఎస్ఎస్ఎస్ఈ) నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి సర్వే జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
స్వరాష్ట్రంలో ‘సమృద్ధి’
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే వయసులో చిన్నదైన తెలంగాణ రాష్ట్రం నానాటికీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, దేశాభివృద్ధిలో రాష్ట్ర వాటా ఏటేటా పెరుగుతోందని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఆర్థిక సలహా మండలి ఇటీవల ప్రధానమంత్రికి ఇచ్చిన రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి నివేదిక మేరకు జాతీయోత్పత్తి (జీడీపీ)లో రాష్ట్ర వాటా 4.9 శాతంగా తేలింది. తెలంగాణ ఏర్పాటయ్యాక జీడీపీలో రాష్ట్రం వాటా 3.8 శాతం కాగా, పదేళ్లలోనే ఇది గణనీయంగా పెరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో రాష్ట్ర వాటా 4.7 శాతానికి చేరగా, తాజా అంచనాల మేరకు 2023–24లో 4.9 శాతానికి చేరింది. 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయేనాటికి ఆంధ్రప్రదేశ్ వాటా 8.4 శాతంగా ఉండేదని అంచనా. ఇప్పుడు అది 9.7 శాతానికి పెరిగింది. అయితే అందులో 1.1 శాతం తెలంగాణ వాటానే పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి బాటలోనే పయనిస్తున్నా.. జీడీపీలో ఆ రాష్ట్ర వాటా పెరుగుదల స్వల్పంగానే ఉంది. రాష్ట్రం విడిపోయే నాటికి 4.6 శాతం ఉండగా, 2020–21 నాటికి 4.9 శాతానికి చేరింది. అయితే 2023–24 నాటికి 4.7 శాతానికి తగ్గింది. మొత్తంమీద రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బాటలోనే ఉన్నాయని, రెండు రాష్ట్రాల జీడీపీ వాటా ఏటేటా పెరుగుతోందని ఆర్థిక సలహా మండలి నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలే టాప్ ఇతర అన్ని రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆర్థికాభివృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది. 1991 సంవత్సరానికి ముందు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులు జీడీపీలో తమ భాగస్వామ్యాన్ని చెప్పుకోదగిన స్థాయిలో నమోదు చేయలేదని, ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో ఇప్పుడు సింహభాగం వాటా దక్షిణాది రాష్ట్రాలదేనని ఆర్థిక సలహా మండలి నివేదిక చెపుతోంది. ప్రస్తుత జీడీపీలో దాదాపు 30 శాతం ఈ రాష్ట్రాలదేనని వెల్లడించింది. తలసరి ఆదాయం కూడా జాతీయ సగటుతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో జాతీయ సగటుతో పోలిస్తే 193.6 శాతం అధికమని, కర్ణాటక 181, తమిళనాడు 171, కేరళ 152.5 శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా తలసరి ఆదాయం కలిగి ఉన్నాయని ఆ నివేదికలో వెల్లడయింది. -
RBI: ఊహించిందే జరిగింది
భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తగ్గినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఈ తగ్గుదలను ముందుగానే ఊహించినట్లు ఆర్బీఐ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రాజెక్ట్‌లపై పెట్టే వ్యయం తగ్గడం వల్లనే ఇలా జీడీపీ ముందగమనంలో ఉందని స్పష్టం చేసింది.2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ వాస్తవ జీడీపీ(ద్రవ్యోల్బణాన్ని పరిగణించిన తర్వాత) వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది. గతేడాది సరాసరి అన్ని త్రైమాసికాల్లో కలిపి ఇది 8 శాతంగా ఉంది. ఈసారి జీడీపీ తగ్గడానికి వ్యవసాయం, సేవల రంగం ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి మెరుగవడం కొంత జీడీపీకి ఊతమిచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ జనాభాలో అత్యధికంగా ప్రాథమిక రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అంటే వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పాడి పరిశ్రమ, చేపలు, గొర్రెల పెంపంకం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ఈ రంగం జీడీపీ వృద్ధిని వెనక్కులాగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రాథమిక రంగంతోపాటు సేవల రంగం కూడా జీడీపీ వృద్ధిని వెనక్కి లాగినట్లు ఆర్బీఐ తెలిపింది. సేవల రంగంలో వాణిజ్యం, రవాణా, బ్యాంకులు, హోటళ్లు, స్థిరాస్తి.. వంటి విభాగాలు వస్తాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సేవల రంగం 7.2 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది గతేడాది పది శాతంగా ఉంది. ఇదిలాఉండగా, ఇప్పటికే అమలవుతున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, ఇతర పథకాలు, పెరుగుతున్న వ్యయ సామర్థ్యం వల్ల ప్రారిశ్రామిక రంగం వృద్ధి పథంలో దూసుకుపోతోంది. గతేడాది ఐదు శాతంగా ఉన్న ఈ రంగం వృద్ధి ఈసారి ఏడు శాతానికి చేరింది.ఇదీ చదవండి: సంపద వృద్ధిలో టాప్ 10 దేశాలుదేశ వృద్ధిలో సింహభాగం ప్రాథమిక, సేవల రంగాలదే. కాబట్టి వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో విశేష వృద్ధితోపాటు సేవల రంగంలో మెరుగైన ఫలితాలు నమోదైతేనే జీడీపీ గాడిలో పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఆయా రంగాల్లో ప్రోత్సాహకాలు పెంచాలని చెబుతున్నారు. దేశంలోని యువతకు ఆ రంగాల్లో పనిచేసేలా నైపుణ్యాలు అందించి మరింత ఉత్పాదకతను పెంచాలని సూచిస్తున్నారు. -
అస్థిరంగా రుతుపవనాలు.. స్థిరంగానే ఆర్థిక వృద్ధి
న్యూఢిల్లీ: రుతుపవనాలు కొంత అస్థిరంగా ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక పురోగమనం యథాతథంగా కొనసాగుతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై నెలవారీ నివేదిక తెలిపింది. ఆర్థిక సర్వే అంచనాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలోనే నమోదవుతుందన్న ధీమాను వ్యక్తం చేసింది.ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరం గడచిన నాలుగు నెలల్లో ఎకానమీ పురోగమనం సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. ప్రత్యేకించి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు (రూ.7.39 లక్షల కోట్లు) పూర్తి సానుకూల నమోదుకావడం హర్షణీయ పరిణామమని అభిప్రాయపడింది. తయారీ, సేవల రంగాలు సైతం పురోగతి బాటలో ఉన్నాయని వివరించింది. తాజా 2024–25 బడ్జెట్ దేశ ద్రవ్య, ఆర్థిక పటిష్టతకు బాటలు వేస్తుందని భరోసాను ఇచ్చింది.ద్రవ్యోల్బణం కట్టడి (ఐదేళ్ల కనిష్ట స్థాయిలో జూలైలో 3.4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు) సానుకూల అంశంగా వివరించింది. రిజర్వాయర్‌లో నీటి మట్టాలు భారీగా పెరగడం వల్ల ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ పంటల ఉత్పత్తి విషయంలో మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్న నివేదిక, రాబోయే నెలల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో ఈ పరిణామం మరింత దోహదపడుతుందని విశ్లేషించింది. -
పెరుగుతున్న ప్రైవేట్ మూలధన వ్యయం
దేశంలో ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం 54% పెరుగుతుందని అంచనా. 2023-24లో రూ.1.59 లక్షల కోట్లుగా ఉన్న ఈ పెట్టుబడులు ఈ ఏడాదిలో రూ.2.45 లక్షల కోట్లకు చేరుకుంటాయని ఆర్బీఐ ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది. పెరుగుతున్న దేశీయ డిమాండ్, మెరుగుపడుతున్న కార్పొరేట్ నిర్వహణ, స్థిరమైన క్రెడిట్ డిమాండ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి..వంటి చాలా అంశాలు ప్రైవేట్ పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొంది. పెరుగుతున్న మూలధన పెట్టుబడులు ప్రధానంగా మౌలిక వసతులు సదుపాయానికి, రోడ్లు, వంతెనలు, విద్యుత్..వంటి ప్రాజెక్ట్‌లను రూపొందించడానికి వెచ్చిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇదీ చదవండి: ఆటోమేషన్తో మహిళలకు అవకాశాలుబ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా భారీగా నిధులు పొంది వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ సదుపాయాల ద్వారా రానున్న 3-5 ఏళ్లల్లో ఆదాయం సమకూరనుంది. మూలధన పెట్టుబడులు పెరగడం వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థకు దూసుకుపోతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంపొందుతాయి. దేశీయ ఉత్పత్తి పెరుగుతోంది. ఎగుమతులు హెచ్చవుతాయి. ఫలితంగా స్థూల దేశీయోత్పత్తి అధికమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
జీడీపీ అంటే ఏమిటి..? ఎలా లెక్కిస్తారు..?
వార్తా సంస్థలు, టీవీలు, న్యూస్ పేపర్లలో నిత్యం జీడీపీ పెరిగింది లేదా తగ్గిందని వింటూ ఉంటాం. ఇటీవల ఆర్బీఐ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రెండో త్రైమాసికంలో జీడీపీ 7.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అసలు ఈ జీడీపీ అంటే ఏమిటి..? దీన్ని ఎలా లెక్కిస్తారు..? దేశ ఆర్థిక వృద్ధిలో ఇది ఎంత ముఖ్యమైందో ఈ కథనంలో తెలుసుకుందాం.జీడీపీ..లెక్కింపుజీడీపీను స్థూల దేశీయోత్పత్తి(గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్) అంటారు. సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం అంతిమ వస్తువుల విలువను ఆ దేశ జీడీపీగా పరిగణిస్తారు. ఉదాహరణకి ఒక సూపర్ మార్కెట్ ఉంది. అందులో ఒక రోజు రూ.20 విలువ చేసే ఒక సబ్బు, రూ.10 విలువ చేసే చాకొలేట్, రూ.50 విలువ చేసే పుస్తకం అమ్మారు అనుకుందాం. అప్పుడు దాని ఒక రోజు జీడీపీ రూ.80 లెక్కిస్తారు. అదే మాదిరి దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయి అమ్ముడైన వస్తువుల అంతిమ విలువ ఆ దేశ జీడీపీ అవుతుంది.మినహాయింపులుజీడీపీ లెక్కించేపుడు అన్ని ఉత్పత్తులను పరిగణించరు. ఉదాహరణకు చైనాకు చెందిన ఒక కంపెనీ ఏదైనా వస్తువును ఇండియాలో అమ్మితే అది మన జీడీపీ పరిధిలోకి రాదు. చైనా దేశపు జీడీపీలో చేరుతుంది. జీడీపీలో మాధ్యమిక వస్తువులను(వస్తు తయారీకి అవసరమయ్యే వాటిని) లెక్కించరు. కేవలం అంతిమ వస్తువులను మాత్రమే పరిగణిస్తారు. ఉదాహరణకు కారులో వాడే టైర్, సీట్, లైట్లు..వంటి వాటిని నేరుగా ఉపయోగించలేము. అయితే వాటిని కారు తయారీలో వాడుతారు. అంతిమంగా కారుకు ధర చెల్లిస్తాం. కాబట్టి టైర్, సీట్, లైట్లు..వంటి మాధ్యమిక వస్తువులను జీడీపీలో లెక్కించరు. కారు ధరను జీడీపీలో చేరుస్తారు. మరింత వివరంగా చెప్పాలంటే కాఫీ పొడి ఉందనుకుందాం. దాన్ని నేరుగా తినలేము. కానీ దానితో కాఫీ చేసుకుని తాగవచ్చు. కాబట్టి కాఫీ పొడి మాధ్యమిక వస్తువు అవుతుంది. కాఫీ అంతిమ ఉత్పత్తిగా ఉంటుంది. దాంతో కాఫీ ధరను జీడీపీలో చేరుస్తారు.ఒక్కోసారి దేశ జీడీపీ పడిపోయిందని వింటూ ఉంటాం. అంటే మన దేశంలో తయారైన వస్తువులు స్థానికంగా ఎక్కువగా అమ్ముడవడం లేదన్నమాట. పక్క దేశాలకు చెందిన వస్తువులనే ఎక్కువగా కొంటున్నాం అని అర్థం. కొంతకాలం ఇలాగే కొనసాగితే దేశీయ వస్తువులను కొనడంలేదు కాబట్టి కంపెనీలు కూడా వాటిని తయారు చేయవు. ఉత్పత్తి లేకపోతే కంపెనీలకు లాభాలు ఉండవు. దాంతో కొత్త ఉద్యోగాలు రావు. ఉన్న ఉద్యోగులను తొలగిస్తారు. తిరిగి జీడీపీ గాడిలోపడాలంటే దేశంలో తయారైన వస్తువులనే ఎక్కువగా కొనాలి. అప్పుడు కంపెనీలు వాటిని తయారు చేస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. ఎగుమతులు పెరుగుతాయి. -
ఆహార ధరలు ఇంకా తీవ్రమే..
న్యూఢిల్లీ: తక్షణం వడ్డీరేటు సరళతరం అయ్యే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ తెలిపారు. వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2 ప్లస్‌తో ఆరు శాతానికి కట్టడి చేయాలన్న కేంద్రం నిర్దేశం... ప్రస్తుతం 6 శాతం దిగువనే ఉన్న పరిస్థితి (మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతం)ని ఆయన ప్రస్తావిస్తూ, ‘‘ప్రస్తుత ద్రవ్యోల్బణం–4 శాతం లక్ష్యం మధ్య ఉన్న అంతరాన్ని బట్టి వడ్డీ రేటుపై వైఖరిని మార్చడం చాలా ముందస్తు చర్య అవుతుంది’’ అని ఉద్ఘాటించారు. రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతమేనని పలు సందర్భాల్లో ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పొంచి ఉన్నాయని కూడా ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. జూన్ 2023 నుండి వరుసగా 11వ నెలలో ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గింది. సేవల ద్రవ్యోల్బణం చారిత్రక కనిష్ట స్థాయిలకు దిగివచి్చంది. వస్తు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు.. → మనం స్థిరమైన ప్రాతిపదికన 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం వైపునకు వెళ్లినప్పుడు వడ్డీరేటు వైఖరిలో మార్పు గురించి ఆలోచించే విశ్వాసం మనకు లభిస్తుంది. → ద్రవ్యోల్బణం ప్రయాణం అంచనాలకు తగ్గట్టుగానే పురోగమిస్తున్నది. అయితే పూర్తి 4 శాతం దిశగా ప్రయాణం అత్యంత కష్టతరమైన అంశం. ఇందుకు పలు అడ్డంకులు ఉన్నాయి. → మార్చి–మే మధ్య తయారీ, ఫ్యూయల్ అండ్ లైట్ ద్రవ్యోల్బణం తగ్గింది. అయితే ఆహార ద్రవ్యోల్బణం విషయలో ఇంకా ఆందోళనలు ఉన్నాయి. కూరగాయలుసహా పలు నిత్యావసరాల వస్తువుల ద్రవ్యోల్బణం స్పీడ్ రెండంకెలపైనే ఉంది. → స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విషయానికి వస్తే పలు అంశాలు వృద్ధికి దోహదపడే విధంగా తమ పాత్రను పోషిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి వేగం చాలా బలంగా ఉంది. ఇది మొదటి త్రైమాసికంలో బలంగా కొనసాగుతుందని భావిస్తున్నాం. జూన్ పాలసీ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ క్రితం 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచడం ఇక్కడ గమనార్హం. ఇదే జరిగితే దేశం వరుసగా నాలుగు సంవత్సరాల్లో 7 శాతం ఎగువన వృద్ధి సాధించినట్లు అవుతుంది. పాలసీ విధానం పునరుద్ఘాటన ఇంటర్వ్యూలో గవర్నర్ పాలసీ విధాన సమీక్ష అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి జూన్ 5 నుంచి 7వ తేదీ మధ్య మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో మెజారిటీ 4 శాతం దిగువకు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ వరుసగా ఎనిమిదవసారి కీలక రేటు– రెపోను (6.5 శాతం) యథాతథంగా ఉంచింది. అయితే వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. వీరిలో ఎంపీసీ ఎక్స్టర్నల్ సభ్యులు జయంత్ వర్మతో ఆషిమా గోయల్ కూడా ఉన్నారు. అయితే ఆర్బీఐ ఎంపీసీ మెజారిటీ సభ్యులు –ఎటువంటి అనిశ్చితి లేకుండా ద్రవ్యోల్బణం దిగువబాటనే కొనసాగుతుందన్న భరోసా వచ్చే వరకూ– వేచిచూసే ధోరణి పాటించాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే రిసు్కలను ఎంపీసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ సమీక్ష సందర్భంగా చెప్పారు. ధరలు నిలకడగా ఉండే విధంగా స్థిరత్వాన్ని సాధించగలిగితేనే అధిక వృద్ధి సాధనకు పటిష్టమైన పునాదులు వేయడానికి సాధ్యపడగలదని ఆయన పేర్కొ న్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా పొంచే ఉన్నాయని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3 లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యో ల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ గవర్నర్ పేర్కొంటున్న లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. -
దేశంలో మౌలిక సదుపాయాలకు చేసే ఖర్చు ఎంతంటే..
దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధానమంత్రి గతి శక్తి పథకం ఎంతో ఉపయోగపడిందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. 2029 నాటికి మౌలిక సదుపాయాల వృద్ధికి జీడీపీలో 6.5 శాతం ఇన్వెస్ట్ చేస్తారని అంచనావేస్తూ నివేదిక విడుదల చేసింది.నివేదికలోని వివరాల ప్రకారం..ప్రధానమంత్రి గతి శక్తి పథకంతో భారతదేశ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి. హైవే, రైల్వే, ఓడరేవులు వంటి సదుపాయాలు మెరుగయ్యాయి. ‘మల్టీ మోడల్ కనెక్టివిటీ’తో భారత రవాణా వ్యవస్థ దూసుకుపోతుంది. దేశ జీడీపీలో మౌలిక సదుపాయాల కల్పనకు 2023-24లో 5.3 శాతం వెచ్చించారు. క్రమంగా ఇది పెరుగుతూ 2029 నాటికి 6.5 శాతానికి చేరుతుంది. దాని ఫలితంగా రాబోయే ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ భారీగా పెరుగుతుంది.‘ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం..భారత షిప్‌యార్డ్‌ల్లో కంటైనర్లు ఉండే సగటు సమయాన్ని ముడు రోజులకు తగ్గించారు. అందుకోసం హైవేలు, రైల్వేలు ఎంతో తోడ్పడుతున్నాయి. ఇది యూఏఈ, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో నాలుగు రోజులు, యూఎస్ఏలో ఏడు రోజులు, జర్మనీలో పది రోజులుగా ఉంది. భారతీయ ఓడరేవుల ‘టర్నరౌండ్ సమయం(అన్లోడ్ చేసి లోడ్ చేయడానికి పట్టే సమయం)’ 0.9 రోజులకు చేరుకుంది. ఇది యూఎస్ఏలో 1.5 రోజులుగా, ఆస్ట్రేలియాలో 1.7 రోజులుగా, సింగపూర్‌లో ఒక రోజుగా ఉంది. అక్టోబరు 2021లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పీఎం గతి శక్తి పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ఇప్పటివరకు పోర్ట్‌లు, షిప్పింగ్ రంగాల్లో రూ.60,900 కోట్ల విలువైన 101 ప్రాజెక్టులు గుర్తించారు. ఏప్రిల్ 2023 నాటికి రూ.8,900 కోట్ల విలువైన 26 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.15,340 కోట్ల విలువైన 42 ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయి. రూ.36,640 కోట్ల విలువైన 33 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి’ అని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.ఇదీ చదవండి: ఇన్‌స్టా పోస్ట్ వైరల్ కావాలంటే.. సీఈఓ సూచనసాగరమాల కార్యక్రమం కింద రూ.1.12 లక్షల కోట్ల విలువైన 220 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.2.21 లక్షల కోట్ల విలువైన 231 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. రూ.2.07 లక్షల కోట్ల విలువైన 351 ప్రాజెక్టులు మూల్యాంకన దశలో ఉన్నాయని మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది. -
భారత్ వృద్ధి 6.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.8 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సాధిస్తుందన్న తన అంచనాలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ స్పష్టం చేసింది. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యలోటు సవాళ్లు డిమాండ్‌ను తగ్గిస్తాయని తన తాజా ఆసియా పసిఫిక్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. 2023–24లో భారత్ 8.2 శాతం వృద్ధి రేటు సాధనను సైతం ఈ సందర్భంగా ఎస్అండ్పీ ప్రశంసించింది. 2024–25కు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ తాజా రేటింగ్స్ ఉద్ఘాటన.. ఆర్బీఐ అంచనా 7.2శాతంకన్నా తక్కువగా ఉండడం గమనార్హం. గ్లోబల్ రేటింగ్ దిగ్గజం తాజా అవుట్‌లుక్‌లో ము ఖ్యాంశాలు చూస్తే.. 2025–26, 2026– 27లో భారత్ వృద్ధి రేట్లు వరుసగా 6.9 శాతం, 7 శాతాలుగా ఉంటాయి. 2024లో చైనా వృద్ధి అంచనా 4.6 శాతం నుంచి 4.8 శాతానికి పెంపు. రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) చైనా ఎకానమీ మందగమనాన్ని చూస్తుంది. ఒకవైపు తగ్గిన వినియోగం, తయారీ పెట్టుబడుల పెరుగుదల వంటి కీలక అంశాలు లాభాల మార్జిన్లపై ప్రభావం చూపుతాయి. -
అభివృద్ధి చెందే రంగాలు ఇవే.. నిర్మలా సీతారామన్
ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. వికసిత భారత్ సాధ్యమవుతుందని, ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని 'నరేంద్ర మోదీ' గతంలో చాలా సార్లు చెబుతూనే వచ్చారు. ఈ విషయం మీద కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.ఎవరు ప్రధానమంత్రి అయినా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చిదంబరం అన్నారు. ఈ మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా విమర్శించారు. 2004 - 2014 మధ్య జీడీపీ కేవలం రెండు ర్యాంకులు మాత్రమే పెరిగిందని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన విక్షిత్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ సభలో వెల్లడించారు.2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం పదేళ్లలో కేవలం రెండు ర్యాంకులు జీడీపీ పెంచింది. ఆ తరువాత పదేళ్ల మోదీ పాలనలో జీడీపీ ఐదు ర్యాంకులకు ఎగబాకింది. రాబోయే రోజుల్లో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే.. తప్పకుండా జేడీపీ మరింత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.ఆర్ధిక వ్యవస్థ 2014కు ముందు బాగా తగ్గింది. చెడు విధానాలు, భారీ అవినీతి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తరువాత ఐదో స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మూడో స్థానానికి చేరుతుంది. అది మోదీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సీతారామన్ అన్నారు.భారతదేశంలో ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉందనే విషయాలను నిర్మల సీతారామన్ వివరించారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో పునరుత్పాదక వస్తువులు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్రో-ప్రాసెసింగ్ రంగాలు మరింత అభివృద్ధి మార్గంలో నడుస్తాయని స్పష్టం చేశారు. -
మరో 50 ఏళ్లలో దేశాభివృద్ధి ఎంతంటే..
ప్రపంచంలో 2075 సంవత్సరం వరకు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగే దేశాలను అంచనావేస్తూ గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక విడుదల చేసింది. భారత్ ఇప్పటికే 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసిన విషయం తెలిసిందే. చైనా: 57 ట్రిలియన్ డాలర్లు భారతదేశం: 52.5 ట్రిలియన్ డాలర్లు యునైటెడ్ స్టేట్స్: 51.5 ట్రిలియన్ డాలర్లు ఇండోనేషియా: 13.7 ట్రిలియన్ డాలర్లు నైజీరియా: 13.1 ట్రిలియన్ డాలర్లు ఈజిప్ట్: 10.4 ట్రిలియన్ డాలర్లు బ్రెజిల్: 8.7 ట్రిలియన్ డాలర్లు జర్మనీ: 8.1 ట్రిలియన్ డాలర్లు మెక్సికో: 7.6 ట్రిలియన్ డాలర్లు యూకే: 7.6 ట్రిలియన్ డాలర్లు జపాన్: 7.5 ట్రిలియన్ డాలర్లు రష్యా: 6.9 ట్రిలియన్ డాలర్లు ఫిలిప్పీన్స్: 6.6 ట్రిలియన్ డాలర్లు ఫ్రాన్స్: 6.5 ట్రిలియన్ డాలర్లు బంగ్లాదేశ్: 6.3 ట్రిలియన్ డాలర్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి గతంలో చేసిన ప్రకటన ప్రకారం.. 1980–81లో భారత్ ఎకానమీ పరిమాణం 189 బిలియన్ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది. ఇదీ చదవండి: ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామిగా కొనసాగుతోంది. -
20 ఏళ్లలో ఏ దేశం ఎంత వృద్ధి చెందిందో తెలుసా.. (ఫొటోలు)
-
2003-07 నాటి వృద్ధిరేటు దిశగా భారత జీడీపీ
దేశ ఎకానమీ వృద్ధి రేటుపై మోర్గాన్‌స్టాన్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ఎకానమీ 2003–2007 కాలంలో ఎలా అయితే వృద్ధి చెందిందో ప్రస్తుత పరిస్థితుల్లోనూ అదేమాదిరి వృద్ధి కనబరుస్తోందని మోర్గాన్ స్టాన్లీ నివేదికలో తెలిపింది. భారత జీడీపీ 2003-07 కాలంలో ఏడాదికి సగటున 8.6 శాతం చొప్పున వృద్ధి కనబరిచింది. ప్రస్తుత పరిస్థితులు కూడా అలానే ఉన్నాయని నిదేదిక ద్వారా తెలిసింది. భారీగా పెట్టుబడులు వస్తుండడంతో దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. కానీ పెట్టుబడులు పెరగడంతో ఎకానమీ వృద్ధి చెందుతోందని ఈ రిపోర్ట్ పేర్కొంది. వినియోగం తగ్గినా, దేశంలోకి వస్తున్న పెట్టుబడులు జీడీపీ గ్రోత్‌ను ముందుండి నడుపుతున్నాయని తెలిపింది. నివేదిక ప్రకారం.. ప్రభుత్వం చేసే మూలధన వ్యయం తగ్గినప్పటికీ ప్రైవేట్ కంపెనీలు చేసే క్యాపెక్స్ పుంజుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గినా, పట్టణాల్లో వినియోగం ఊపందుకుంది. గ్లోబల్ ఎగుమతుల్లో ఇండియా వాటా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది. జీడీపీ వృద్ధి 2003–2007 సమయంలో 27 శాతం నుంచి 39 శాతానికి చేరుకుంది. ఇదే గరిష్ట వృద్ధిగా నమోదైంది. ఇదీ చదవండి: ఎన్నికల నేపథ్యంలో వస్తువులకు అసాధారణ గిరాకీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం 2011–21 మధ్య పెట్టుబడులు తగ్గినా ప్రస్తుతం జీడీపీ 34 శాతం దగ్గర ఉందని వివరించింది. భవిష్యత్తులో ఇది 36 శాతానికి చేరుతుందని అంచనా. 2003–2007 లో ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదైనట్లు నివేదిక తెలిపింది. -
‘గొప్పలు చెప్పి సరిపెట్టొద్దు.. అదో విచిత్ర అలవాటు’
భారతదేశం తన జీడీపీ వృద్ధిని ఇతర దేశాలతో పోల్చకూడదని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య అన్నారు. అలా గొప్పలు చెప్పి సరిపెట్టే బదులుగా ఉద్యోగాలను సృష్టించేందుకు దృష్టి సారించాలని తెలిపారు. భారతదేశంలో చాలా మందికి ఒక విచిత్రమైన అలవాటు ఉందన్నారు. మన వృద్ధి రేటును ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చడం కంటే, కొత్త కార్మిక శ్రామికశక్తి కోసం ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు. యూట్యూబ్‌లోని ది గ్లోబల్ ఇండియన్స్‌కు చెందిన పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. ఇదీ చదవండి: భారీగా పెరిగిన ఫిర్యాదులు! సమస్య పరిష్కారం కావాలంటే.. ‘భారత్ తన జీడీపీ వృద్ధి రేటును ఇతర దేశాలతో పోల్చుకుని, మిన్నగా ఉందంటూ సంబరపడటం సరికాదు. వాస్తవానికి మన దేశంలో ఉపాధి కల్పనకు అవసరమైన వృద్ధి సాధనపై దృష్టినిలపాలి. జాబ్స్ మార్కెట్లో ప్రవేశిస్తున్నవారికి ఉద్యోగాల సృష్టి కోసం అవసరమైన వృద్ధి రేటుపై ఆలోచించాలి. కానీ మిగతా ప్రపంచంతో పోల్చుకుని ఉపయోగం లేదు. భారత్ తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి’ అని హితవు పలికారు. -
అనంత్-రాధిక ప్రీ-వెడ్డింగ్ : పాక్ జీడీపీ, నీతా నగలపై సెటైర్లు
రిలయన్స్ అధినేత బిలియనీర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇంటర్నెట్లో పెద్ద సంచలనంగా మారాయి. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ఈ ఏడాది జూలై నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1, 2, 3 తేదీల్లో ప్రీ వెడ్డింగ్ బాష్ అంగరంగ వైభంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు. అయితే ఈ సందర్బంగా అంబానీ కుటుంబం ఈ వేడుకులకు ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయలపై పెద్ద చర్చ నడిచింది. ప్రీ వెడ్డింగ్ వేడుకలకే ఇంత హంగామా అని కొందరు, లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ 12 వందల కోట్లు వెచ్చించడం పెద్ద ఖర్చే కాదని మరికొందరు వాదించారు. దీంతోపాటు వందల కోట్ల విలువ చేసే అంబానీ భార్య నీతా అంబానీ, పెద్ద కొడలు శ్లోకామెహతా, కుమార్తె ఇషా అంబానీ ధరించి డైమండ్ నగలు, కాబోయే వరుడు అనంత్ అంబానీ డైమండ్ వాచ్ గురించి ఇంటర్నెట్ తీవ్ర చర్చ నడిచింది. ఇదంతా ఒక ఎత్తయితే నీతా అంబానీ ధరించి రూ. 500-600 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ వైరల్‌గా మారింది. పాకిస్తాన్ జీడీపీ కంటే నీతా అంబానీ డైమండ్ నెక్లెస్ ధరే ఎక్కువ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఇన్‌స్టాలో పలు పోస్ట్‌లు వైరల్‌గా, తాజాగా ఏఎన్ఐ షేర్ చేసిన వీడియోపై ఇదే కమెంట్లు కనిపించడం గమనార్హం. కాగా ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం పాకిస్తాన్ జీడీపీ దాదాపు 341 కోట్ల డాలర్లు (రూ. 28.23 లక్షల కోట్లు)గా ఉన్న సంగతి తెలిసిందే. Etched with the initials Anant Ambani and Radhika Merchant, Nita Ambani dons the world-famous handloom Kanchipuram saree designed by Swadesh and handcrafted by artisans. She was seen thanking the Jamnagar Reliance Parivar for their love and support during Anant and Radhika's… pic.twitter.com/YEOYdVOmjp — ANI (@ANI) March 7, 2024 -
వృద్ధి గాథలో చూడాల్సిన కోణం
జీడీపీలో భారత్ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది. 1990ల్లో 17వ స్థానంలో ఉండేది. మూడు దశాబ్దాల క్రితం తలసరి ఆదాయంలో 161వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు కేవలం 159వ స్థానానికి మాత్రమే ఎగబాకింది. తలసరి ఆదాయం పెరగకుండా జీడీపీ పెరగడం దీనికి ఒక కారణం. భారత తలసరి జీడీపీ ర్యాంకింగ్ పెరగాలంటే, సగటు వృద్ధి రేటు చాలా ఎక్కువుండాలి. గత మూడు దశాబ్దాల వృద్ధి లాభాల్లో ఎక్కువ భాగం జనాభాలోని ఒక చిన్న వర్గంలో కేంద్రీకృతమై ఉంది. దేశ జనాభాకు సంబంధించి అది చిన్నదే అయినా, మార్కెట్‌గా ఆ సమూహ పరిమాణం తక్కువ కాదు. ప్రపంచ దేశాలు ఆర్థిక శక్తిగా భారత్‌పై దృష్టి సారిస్తున్నాయంటే కారణం ఇదే. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉంది. 2030 నాటికి మన జీడీపీ మూడవ స్థానానికి చేరుకుంటుందని అంచనా. 1990ల ప్రారంభంలో, జీడీపీ పరంగా భారతదేశం 17వ స్థానంలో ఉండేది. ఈ విషయంలో దాని సాపేక్ష స్థానం గణనీయంగా మెరుగు పడిందనడంలో సందేహం లేదు. అయితే, తలసరి ఆదాయం ప్రాతి పదికన, భారతదేశం 1990ల ప్రారంభంలో 161వ స్థానంలో ఉండగా ఇప్పుడు 159వ స్థానంలో ఉంది. అంటే, తలసరి ఆదాయం పరంగా భారతదేశ సాపేక్ష స్థానం జీడీపీ పరంగా 17వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకున్న కాలంలోనూ పెద్దగా మారలేదు. ఎందుకు? తలసరి ఆదాయాన్ని పెంచకుండా యాంత్రికంగా జీడీపీని పెంచే జనాభా పెరుగుదలే దీనికి కారణమని అనుకోవచ్చు. కానీ అది కారణం కాదు. వాస్తవానికి, జనాభా పరంగా భారతదేశ సాపేక్ష స్థానం ఈ కాలంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద (చైనా తర్వాత) దేశంగా ఉంది. అంతే కాదు, చర్చిస్తున్న కాలంలో జనాభా పెరుగుదల రేటు విషయంలో భారత్‌కూ, ప్రపంచ సగటుకూ గణనీయంగా తేడా లేదు. పైగా కాలక్రమేణా, దాని జనాభా పెరుగుదల రేటు తగ్గింది. 1991, 2021 మధ్య తలసరి స్థూల దేశీయోత్పత్తి ఏడు రెట్లు ఎక్కువ పెరిగిందనే వాస్తవంలో కొంత సమాధానం ఉంది. ద్రవ్యో ల్బణం ప్రభావాన్ని మినహాయిస్తే, దేశ తలసరి వాస్తవ జీడీపీ దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్లు చూడవచ్చు. అయినప్పటికీ, జీడీపీ ర్యాంకింగ్ మెరుగుపడి తలసరి జీడీపీ ఎందుకు స్తబ్ధుగా ఉంది? ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దేశ తలసరి జీడీపీ దశాబ్దంలో రెట్టింపు అయిందనుకుందాం. ఆ దేశాలు ఇప్పటికే తలసరి సగటు జీడీపీని ఎక్కువగా కలిగి ఉన్నట్లయితే లేదా అవి కూడా సహేతుకమైన అధిక రేటుతో వృద్ధి చెందుతున్నట్లయితే, ఇతర దేశాలతో పోలిస్తే దాని సాపేక్ష స్థితిలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ, ఆ దేశ జనాభా ఎంత పెద్దదైతే, మొత్తం జీడీపీ విలువ ఆ జనాభా దామాషా ప్రకారం అంత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, దాని జనాభా రెట్టింపు అయితే, మొత్తం జీడీపీ నాలుగు రెట్లు పెరుగుతుంది. మనం దీనిని జనాభా గుణకం ప్రభావం అని పిలవవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే అధిక జనాభా ఉన్న దేశ సాపేక్ష స్థానం జీడీపీ పరంగా పెరిగే అవ కాశం ఉంది. ఈ పెద్ద జనాభా గుణకం కారణంగానే భారతదేశం 1990ల ప్రారంభం నుండి ఇప్పటి వరకు జీడీపీ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి ఎదగగలిగింది. కానీ భారత తలసరి జీడీపీ ర్యాంకింగ్‌ను పెంచడానికి సగటు వృద్ధి రేటు ఇంకా ఎక్కువగా ఉండాలి. అనేక దశాబ్దాలుగా జీడీపీ ర్యాంకింగ్‌లో భారత్ సాధిస్తున్న మెరుగుదల వెనుక... అధిక జనాభా, తలసరి జీడీపీకి చెందిన అధిక వృద్ధిరేటు కలయిక దాగి ఉంది. చైనాతో పోల్చి చూద్దాం. 1991, 2021 మధ్య, జీడీపీలో చైనా ర్యాంక్ 11 నుండి 2వ స్థానానికి పెరిగింది. అదే సమయంలో సగటు తలసరి ఆదాయంలో దాని స్థానం 158 నుండి 75కి పెరిగింది. ఈ కాలంలో దాని తలసరి జీడీపీ 38 రెట్లు పెరిగింది. అయితే భారతదేశ తలసరి జీడీపీ కేవలం ఏడు రెట్లు మాత్రమే పెరిగింది. చైనాలో ఎక్కువ జనాభా ఉన్నందున, జనాభా గుణకం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ వారు సగటు తలసరి ఆదా యాన్ని కూడా అనేక రెట్లు పెంచుకోగలిగారు. కాబట్టి మొత్తం ఆదాయం, తలసరి ఆదాయం రెండింటిలోనూ వారి సాపేక్ష స్థానం మెరుగుపడింది. ఇప్పుడు, అసమానతల వెలుగులో, జీడీపీ లేదా జాతీయ ఆదాయం అనేది సగటు వ్యక్తి జీవన నాణ్యతకు నమ్మదగిన కొల మానం కాదని అందరికీ తెలుసు. ధనవంతులైన 10 శాతం మంది ఆదాయం 10 శాతం పెరిగి, మిగిలిన వారి ఆదాయం అలాగే ఉంటే, జాతీయ ఆదాయం 10 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. తలసరి జీడీపీ ఈ విషయంలో సాధారణ ప్రజల జీవన ప్రమాణానికి కొంచెం ఎక్కువ విశ్వసనీయ సూచికగా ఉంటుంది. ఈ ఉదాహరణలో, తల సరి ఆదాయం 1 శాతం మాత్రమే పెరుగుతుంది. అభివృద్ధి పరంగా నిజమైన ప్రశ్న ఏమిటంటే, మొత్తం లేదా సగటు జాతీయ వృద్ధిరేటు సాధారణ జనాభా జీవన ప్రమాణాల పెరుగుదలను ఎంతవరకు ప్రతిబింబిస్తుంది అనేది. ఇప్పుడు, అధిక జనాభా కలిగిన దేశం తన తలసరి ఆదాయాన్ని దీర్ఘకాలంపాటు పెంచగలిగితే, పేదల ఉనికి ఎల్లప్పుడూ సగటు కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంత విశ్వసనీయతకు అర్హమైనది. తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాలు ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారత్‌పై దృష్టి సారిస్తున్నాయంటే కారణం ఏమిటి? ఈ గణాంకాలు మొత్తం చిత్రాన్ని పట్టుకోకపోయినా, ఇంకేదాన్నో సూచిస్తాయి. మార్కెట్ సైజు, జీడీపీ వృద్ధి లాభాల్లో సింహభాగాన్ని కైవసం చేసుకుంటున్న జనాభాలోని అతి చిన్న భాగపు సౌభాగ్యం ఇందులో ఉంది. అత్యధిక రాబడిని కోరుకునే మార్కెట్లు లేదా సరళ మైన గ్లోబల్ క్యాపిటల్‌పై నిశితమైన దృష్టిని కలిగి ఉన్న బహుళజాతి సంస్థలు మొత్తం లేదా తలసరి జీడీపీ గురించి పట్టించు కోవు. గత మూడు దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలోని ఒక చిన్న భాగం వారికి ముఖ్యం. గత మూడు దశాబ్దాల వృద్ధి లాభాల్లో ఎక్కువ భాగం జనాభాలోని ఒక చిన్న వర్గంలో కేంద్రీకృతమై ఉంది. అయితే భారత దేశ జనాభాకు సంబంధించి అది చిన్నదే అయినప్పటికీ, మార్కెట్‌గా ఆ సమూహ పరిమాణం తక్కువ కాదు. ఎందుకంటే బ్రిటన్ లేదా ఫ్రాన్స్ మొత్తం జనాభా భారతదేశ మొత్తం జనాభాలో 4–5 శాతానికి దగ్గరగా ఉంటుంది. చిన్న దేశాలలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉండవచ్చు లేదా వేగంగా వృద్ధి చెందవచ్చు, కానీ మార్కెట్ పరిమాణం కారణంగా భారతదేశం ముఖ్యమైనది. కాబట్టి మొత్తం జీడీపీ విలువ లేదా దాని వృద్ధి రేటు అభివృద్ధికి కొలమానంగా బలహీనంగా ఉన్నప్పటికీ లేదా జనాభాలో అధిక భాగం పేదగా ఉన్నప్పటికీ, ఇది బాగా డబ్బున్న, సంపన్న సమూహపు కొనుగోలు శక్తికి సూచిక. ఆర్థిక వ్యవస్థలోని ఈ విభాగం లగ్జరీ కార్లు లేదా ఫ్యాన్సీ స్మార్ట్ఫోన్ల మార్కె ట్‌గా పరిమాణ పరంగా చూస్తే అనేక సంపన్న దేశాలతో పోటీపడ గలదు. అదే సమయంలో మెరిసే షాపింగ్ మాల్స్, విలాసవంతమైన వస్తువులు, సేవల వినియోగం పెరగడం వల్ల భారత్ ప్రకాశిస్తున్నట్లు భ్రమ కలగవచ్చు. మార్కెట్ పరిమాణం ఎందుకు ముఖ్యమైనది? మొదటిది, భారీ స్థాయి తయారీ పరిశ్రమలకు సంభావ్య కొనుగోలుదారుల పరంగా నిర్దిష్ట పరిమాణంలోని మార్కెట్ అవసరం. లేకపోతే, పెట్టుబడి లాభ దాయకం కాదు. రెండవది, తలసరి ఆదాయంతో సంబంధం లేకుండా, ఒక పెద్ద దేశం జనాభాలో కొంత భాగం ఆదాయం నిర్దిష్ట పరిమి తిని మించి ఉంటే, దాని డిమాండ్లు అవసరాల నుండి విలాసాలకు మారుతాయి. కాబట్టి, జీడీపీ పరంగా భారతదేశ పెరుగుదల పూర్తిగా గణాంక నిర్మాణమేననీ, ఇది సామాన్యుల జీవన ప్రమాణాన్ని ప్రతిబింబించదనీ లేదా సగటు తలసరి ఆదాయం పెరగలేదనీ ఎవరైనా అనుకుంటే... వాళ్లు అసలు కథను విస్మరిస్తున్నట్టు. కొనుగోలు శక్తి జనాభాలోని నిర్దిష్ట విభాగానికి విపరీతంగా పెరిగింది. కాకపోతే సమస్య ఏమిటంటే– సప్లయ్, డిమాండ్ ఆట ఒక చిన్న విభాగానికే పరిమిత మైతే... అది జనాభాలో ఎక్కువ భాగానికి విస్తరించకపోతే ఆర్థిక వృద్ధి స్తబ్ధతకు గురవుతుంది. కోవిడ్ మహమ్మారి ముందు కనిపించిన వృద్ధి క్షీణత సంకేతాలు దానికి ప్రతిబింబం కావచ్చు. మైత్రీశ్ ఘటక్ వ్యాసకర్త లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
వృద్ధికి కార్పొరేట్ పెట్టుబడుల దన్ను
ముంబై: కార్పొరేట్ రంగం తాజా మూలధన వ్యయాలు తదుపరి దశ వృద్ధికి దోహదపడే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ శీర్షికన రూపొందించిన తాజా బులెటిన్ పేర్కొంది. స్థిరంగా, 4 శాతం వద్ద తక్కువ ద్రవ్యోల్బణం జీడీపీ పురోగమనానికి కీలక అంశంగా ఉంటుందని వివరించింది. 2024లో గ్లోబల్ ఎకానమీ ఊహించిన దానికంటే బలమైన వృద్ధిని ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొంది. సవాళ్లు ఉన్నప్పటికీ, సానుకూలతలో వాటిని సమతౌల్యం చేస్తున్నట్లు వివరించింది. భారత ఆరి్థక వ్యవస్థ 2023–24 ప్రథమార్థంలో మంచి పురోగతి సాధించిందని, ఇదే ధోరణిని ఇప్పటికీ కొనసాగిస్తోందని పేర్కొంది. మొత్తంమీద, ప్రైవేట్ కార్పొరేట్ రంగం పెట్టుబడి ధోరణులు ఈ సంవత్సరం ఇప్పటివరకు సానుకూలంగా ఉన్నాయని తెలిపింది. 2023 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ప్రధాన బ్యాంకులు, ఆరి్థక సంస్థలు (ఎఫ్ఐ) రుణాలు మంజూరు చేసిన ప్రాజెక్ట్‌ల మొత్తం వ్యయం రూ. 2.4 లక్షల కోట్లని పేర్కొంటూ, ఇది వార్షికంగా 23 శాతంకంటే ఎక్కువని తెలిపింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం రెండవ, మూడవ త్రైమాసికాల్లో మూలదన పెట్టుబడులు, పబ్లిక్ ఆఫర్లు, వాణిజ్య రుణ సేకరణలు.. ఎకానమీ సానుకూలతలను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక సగటును 4.5 శాతంగా పేర్కొంది. బులెటిన్ కథనంలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు సంబంధిత రచయితలవితప్ప భారతీయ రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలుగా భావించరాదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ బులెటిన్‌ను రూపొందించింది. భారత్ రుణ–జీడీపీ నిష్పత్తిపై ఐఎంఎఫ్ వాదనలు సరికాదు... ఇదిలావుండగా, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన మరో ఆరి్టకల్ భారత్ రుణ–జీడీపీ నిష్పత్తిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయాలను త్రోసిపుచి్చంది. రుణ–జీడీపీ నిష్పత్తి అంచనా వేసిన దానికంటే గణనీయంగా తక్కువగా ఉండవచ్చని ఉద్ఘాటించింది. ‘‘ఈ సందర్భంలో తీవ్ర పరిస్థితులు ఏదైనా సంభవిస్తే... భారతదేశ సాధారణ ప్రభుత్వ రుణం జీడీపీలో మధ్య కాలికంగా 100 శాతం మించిపోతుందన్న ఐఎంఎఫ్ వాదనను మేము తిరస్కరిస్తున్నాము’’ అని ఆర్టికర్ పేర్కొంది. 2030–31 నాటికి ప్రభుత్వ సాధారణ రుణ–జీడీపీ నిష్పత్తి 78.2 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనావేయగా, ఐదు శాతం తక్కువగా 73.4 శాతానికి పరిమితం అవుతుందని ఆర్టికల్ పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్ పటిష్ట రీతిలో కట్టడి చేయగలుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2024–25లో వృద్ధి 7 శాతం: ఆరి్థకశాఖ కాగా, భారత ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ ప్రకాశవంతంగా’ కనిపిస్తుందని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఆరి్థక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని ఆరి్థకశాఖ నెలవారీ ఆరి్థక సమీక్షా నివేదిక పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు– అంతర్జాతీయ ఆరి్థక మార్కెట్లలో అస్థిరత నుండి ప్రతికూలతలపై దేశం నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని నివేదిక ఉద్ఘాటించింది. గృహ వినియోగం మెరుగుపడుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రైవేటు రంగంలో తిరిగి పెరుగుతున్న పెట్టుబడులు, మెరుగైన వ్యాపార సెంటిమెంట్లు, బ్యాంకులు– కార్పొరేట్ల ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్లు, మూలధన వ్యయం పెంపునకు ప్రభుత్వ నిరంతర ప్రయత్నం ఎకానమీని సుస్థిరంగా నడుపుతోందని నివేదిక పేర్కొంది. ప్రపంచ వాణిజ్యం మెరుగుపడ్డం, సరఫరాల చైన్ స్థిరీకరణ అంతర్జాతీయ డిమాండ్ పురోగమనానికి దారితీసే అంశాలని వివరించింది. -
‘సాహో’ రతన్ టాటా!.. టాటా గ్రూప్ మరో సంచలనం..
టాటా గ్రూప్ కంపెనీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. టాటా గ్రూప్ కంపెనీల విలువ దాయాది దేశం పాకిస్తాన్ జీడీపీని దాటిందని ఎకనమిక్స్ టైమ్స్ (ET) నివేదించింది. ఎకనమిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ రంగాల వరకు తన సర్వీసుల్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న టాటా గ్రూప్ కంపెనీల అన్నీ స్టాక్స్ గత ఏడాది నుంచి ఊహించని లాభాల్ని గడిస్తున్నాయి. ఫలితంగా టాటా గ్రూప్ కంపెనీల మొత్తం విలువ పాకిస్తాన్ జీడీపీని అధిగమించిందని పేర్కొంది. ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం.. టాటా గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ వ్యాల్యూ సుమారు 365 బిలియన్ డాలర్లు. అంటే భారత్ కరెన్సీలో అక్షరాల రూ.30లక్షల కోట్లు. ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం.. పాకిస్తాన్ జీడీపీ 341 బిలియన్ డాలర్లు. టీసీఎస్ హవా స్టాక్ మార్కెట్లో లిస్టైన టాటా గ్రూప్ మొత్తం కంపెనీల్లో టీసీఎస్ విలువ సుమారు 15లక్షల కోట్లుగా ఉంది. ఈ మొత్తం టీసీఎస్ విలువ పరిమాణం పాకిస్తాన్ ఎకానమీలో దాదాపూ సగం ఉంది. ప్రస్తుతం పాక్ ఆర్ధిక వ్యవస్థ అప్పుల్లో కూరుకుపోవడం అందుకు కారణమని తెలుస్తోంది. సత్తా చాటిన మల్టీ బ్యాగర్ స్టాక్స్ అన్ని టాటా గ్రూప్ కంపెనీలు తమ మెరుగైన పనితీరుతో మార్కెట్ విలువ పెరుగుదలకు దోహదపడగా, టాటా మోటార్స్, ట్రెంట్లు మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఆకట్టుకున్నాయి. టాటా మోటార్స్ షేర్లు కేవలం ఏడాది వ్యవధిలో 110 శాతం పెరగ్గా, ట్రెంట్ 200 శాతం భారీగా లాభపడింది. ఇది టాటా టెక్నాలజీస్, టీఆర్ఎఫ్, బెనెరాస్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా, ఆర్ట్సన్ ఇంజినీరింగ్ స్టాక్స్ పనితీరు కంటే మెరుగ్గా రాణించాయి. 25కి పైగా లిస్టెడ్ కంపెనీలు కాగా, పలు నివేదిక ప్రకారం.. టాటా గ్రూప్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టైన కంపెనీలు కనీసం 25 ఉన్నాయి. వాటిలో టాటా కెమికల్స్ పనితీరు కారణంగా దాని విలువ 5 శాతం మాత్రమే తగ్గింది. అన్‌లిస్టెడ్ కంపెనీల జాబితాలో టాటా గ్రూప్‌లో టాటా సన్స్, టాటా క్యాపిటల్, టాటా ప్లే, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎయిరిండియాతో సహా అనేక అన్‌లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యాపారాలను పరిగణనలోకి తీసుకుంటే టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయమైన పెరుగుదలను చూస్తుంది. వచ్చే ఏడాది ఐపీఓకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న టాటా క్యాపిటల్ అన్‌లిస్టెడ్ మార్కెట్లో దాదాపు రూ. 2.7 లక్షల కోట్ల విలువను కలిగి ఉంది. -
2024 జూన్ లో మళ్లీ మన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతుంది
-
ఈ దేశాల్లో డబ్బులన్నీ వ్యాపార కుటుంబాలవే..
ప్రతి దేశంలో ఎన్నో వ్యాపార సామ్రాజ్యాలు ఉంటాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు పలు కుటుంబాల ఆధ్వర్యంలోని కంపెనీలపై ఆధారపడి ఉంటుంటాయి. వాల్‌మార్ట్, ఫోర్డ్, రిలయన్స్ వంటి ‘కుటుంబ’ కంపెనీలు.. ఆయా దేశాల్లో ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఊతంగా నిలుస్తుంటాయి. ఈ అంశంపై తాజాగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ పరిశీలన జరిపింది. దేశాలవారీగా జీడీపీలో అక్కడి ‘వ్యాపార’ కుటుంబాల సంస్థల భాగస్వామ్యం ఎంత అన్న అంచనాలు వేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు క్యాపిటల్ మార్కెట్లలో కేవలం కుటుంబ కంపెనీల వాటానే 27 శాతం ఉంటుందని తేల్చింది. ఇది మరింతగా పెరుగుతూనే ఉందని పేర్కొంది. ‘వ్యాపార’ కుటుంబాల ఆదాయ శాతంలో ఇండియా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. ఏటా దేశ జీడీపీలో 79 శాతం వరకు పెద్దా, చిన్నా ‘కుటుంబ’ వ్యాపారాల నుంచే సమకూరుతున్నట్టు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అంచనా వేసింది. ఈ విలువ 245 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! విలువపరంగా ‘వ్యాపార’ కుటుంబాలు సమకూర్చుతున్న మొత్తాన్ని చూస్తే.. రూ.1,205 లక్షల కోట్లతో అమెరికా ప్రపంచంలో టాప్‌లో ఉంది. 821 లక్షల కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. వీటి తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది. -
నార్వేను అధిగమించనున్న ఉత్తరప్రదేశ్ - ఎలా అంటే?
సుమారు 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరే రోజు, యావత్ ప్రపంచం భారత్ వైపు చూసే రోజు రానే వచ్చింది. ఈ రోజు బాలరాముని దర్శనం కేవలం ప్రముఖులకు మాత్రమే.. రేపటి నుంచి సామాన్య భక్తులు దర్శనం చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు సమాచారం. దీంతో ఉత్తరప్రదేశ్ ఆర్థికంగా వేలకోట్లు ఆర్జిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నివేదికలు చెబుతున్నాయి. రామ మందిర నిర్మాణంతో అయోధ్య భారతదేశంలో సందర్శించదగ్గ పర్యాటక ప్రదేశం కానుంది. గతంలో కంటే ఎక్కువ మంది పర్యాటకులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను భారీగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 2024-25 ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ రూ.20000 నుంచి రూ.25000 కోట్లు పెరుగుతుందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర పర్యాటకరంగం ఆదాయం రెట్టింపు అవుతుందని, ఇప్పటికే అయోధ్యలో హోటల్స్, రెస్టారెంట్స్, ఇతర వ్యాపారాలు భారీగా సాగుతున్నాయి. ఇదీ చదవండి: అంబానీ ఇల్లు.. అంతా రామమయం.. వీడియో వైరల్ 2022లో ఉత్తరప్రదేశ్ సందర్శించిన పర్యాటకులు 32 కోట్లు, ఇందులో 2.21 కోట్లమంది జనాభా అయోధ్యకు వచ్చారు. పర్యాటకులు ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2 లక్షల కోట్లు అని తెలుస్తోంది. పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందంజలో ఉన్న ఉత్తరప్రదేశ్, అయోధ్య రామ మందిర నిర్మాణంతో మరింత ఆదాయం పొందనుంది. 2027 నాటికి ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లు దాటుతుందని, దేశ జీడీపీలో ఇది 10శాతం అని చెబుతున్నారు. 2027-28 నాటికి జీడీపీ వెయిటేజ్‌లో ఉత్తరప్రదేశ్ 2వ స్థానం పొందుతుందని సమాచారం. నార్వే జీడీపీని అప్పటికి ఉత్తరప్రదేశ్ అధిగమించే అవకాశాలు చాలానే ఉన్నాయి. -
జీడీపీ.. టాప్‌గేర్!
న్యూఢిల్లీ: ఆర్థిక మూలాలు బలోపేతం అవుతున్నందున భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023–24) 6.9–7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిడ్ ఇండియా తెలిపింది. త్రైమాసిక వారీ అవుట్‌లుక్‌ను విడుదల చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా మంచి పురోగతి నెలకొందని, స్థూల ఆర్థిక గణాంకాలు దీన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2022–23లో 1.9 శాతంగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత తగ్గుతుందని డెలాయిట్ ఇండియా తెలిపింది. అలాగే విదేశీ మారకం నిల్వలు 568 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఇవి 10 నెలల దిగుమతి అవసరాలకు సమానమని పేర్కొంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 5 శాతం స్థాయిలో ఆర్బీఐ లకి‡్ష్యత పరిధి కంటే ఎగువన ఉన్నట్టు వివరించింది. కానీ, దశాబ్ద కాలం క్రితం నాటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే చాలా తక్కువలోనే ఉన్నట్టు గుర్తు చేసింది. జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన తొలి ముందస్తు జాతీయ ఆదాయం గణాంకాల ప్రకారం చూసినా.. దేశ జీడీపీ 2023–24లో 7.3 శాతం వృద్ధిని నమోదు చేయనుంది. 2022–23 సంవత్సరంలో ఉన్న 7.2 శాతం కంటే స్వల్ప వృద్ధి కావడం గమనార్హం. మైనింగ్, క్వారీయింగ్, తయారీ, సేవలకు సంబంధించి కొన్ని రంగాల బలమైన పనితీరు ఇందుకు దోహదం చేయనుందని జాతీయ గణాంక కార్యాలయం అంచనాగా ఉంది. 2024–25లో 6.4 శాతం.. ‘‘ఆర్థిక మూలాలు మెరుగుపడుతుండడం మా అంచనాలకు మద్దతుగా నిలిచింది. మా ప్రాథమిక అంచనాల ప్రకారం 2023–24లో భారత్ 6.9–7.2 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఇది 6.4 శాతం, 6.7 శాతంగా ఉండొచ్చు. అంతర్జాతీయ ఆర్థిక చిత్రం మోస్తరుగానే ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ, మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అనిశ్చితులను మెరుగ్గా అధిగమించగలదు’’అని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుక్మి ముజుందార్ తెలిపారు. ద్రవ్యోల్బణం తిరిగి 5.4 శాతానికి ఇటీవల పెరగడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ద్రవ్యోల్బణం 2023–24 ద్వితీయ ఆరు నెలల్లోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని.. అధిక ఆహార ధరలు, అస్థిరతలతో కూడిన చమురు ధరలు ఆ తర్వాతి కాలంలో స్థిరపడతాయని వెల్లడించారు. గడిచిన పదేళ్ల కాలంలో భారత్ సాధించిన వృద్ధి ప్రయాణాన్ని డెలాయిట్ ప్రస్తావించింది. ఎగుమతులను పలు దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవడంతోపాటు, విలువ ఆధారిత ఉత్పత్తుల వైపు మళ్లినట్టు తెలిపింది. ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటా పెరిగినట్టు వెల్లడించింది. ఎగుమతుల్లో పోటీతత్వాన్ని కూడా పెంచుకున్నట్టు పేర్కొంది. అయితే మరింత పోటీతత్వాన్ని అందిపుచ్చుకోవాలని అభిప్రాయపడింది. -
నాలుగేళ్లలో రూ.400 లక్షల కోట్లు..?
రానున్న నాలుగేళ్లల్లో భారత్ జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లకు(దాదాపు రూ.400 లక్షల కోట్లు) చేరి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా భారతీయులకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఈ సంఖ్య 2014 నాటికి 15 కోట్లగా ఉండేదని పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో భారతదేశం 595 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను పొందినట్లు మంత్రి తెలిపారు. 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లు మించిపోతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం భారతదేశం దాదాపు 3.4 ట్రిలియన్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు మనకన్నా ముందున్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి రేటును అంచనా వేయగా 7.2 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. ఇదీ చదవండి: యూట్యూబ్‌కు కేంద్ర సంస్థ సమన్లు.. విస్తుపోయే కారణం.. గడిచిన 23 ఏళ్లలో భారత్‌కు 919 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని.. ఈ ఎఫ్డీఐలో 65శాతం అంటే 595 బిలియన్ డాలర్లు గత 8-9 ఏళ్లలో వచ్చినవేనని తెలిపారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారి సంఖ్య 50 కోట్లకు పెరిగిందని, అయితే 2014లో 15 కోట్ల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవని వివరించారు. -
నవంబరు చివరకు ద్రవ్యలోటు రూ.9.06 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు నవంబర్ ముగిసే నాటికి 2023–24 వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 50.7 శాతానికి చేరింది. విలువలో రూ.9,06,584 కోట్లకు చేరిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. 2023–24లో ద్రవ్యలోటు రూ.17.86 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అంచనాల్లో పోల్చి చూస్తే ఇది 5.9 శాతం. ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధన సాధ్యమేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఇటీవలే అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. నవంబర్ ముగిసే నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.17.40 లక్షల కోట్లు (బడ్జెట్ లక్ష్యంలో 64.3 శాతం). వ్యయాలు రూ.26.46 లక్షల కోట్లు (బడ్జెట్ లక్ష్యంలో 58.9 శాతం). వెరసి ద్రవ్యలోటు రూ.9.06 లక్షల కోట్లకు చేరింది. కాగా, మొత్తం వ్యయాల్లో రూ.20.66 లక్షల కోట్లు రెవెన్యూ అకౌంట్‌కు సంబంధించినదికాగా, మిగిలినది మూలధన వ్యయాలపై జరిగింది. -
2023 సామాన్యునికి ఏమిచ్చింది?
గడచిన 2020, 2021 సంవత్సరాల్లో కరోనా మహమ్మారి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. దేశవ్యాప్తంగా అమలైన లాక్డౌన్, కరోనా ఆంక్షలు సామాన్యుల వెన్ను విరిచాయి. వ్యాపారాలు నిలిచిపోవడంతో చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే 2022లో పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. వ్యాపారాలు తిరిగి ట్రాక్‌లో పడ్డాయి. ఆ దశ దాటాక వచ్చిన 2023 సామాన్యులకు ఉపశమనం కలిగించింది. మాల్స్‌లో జనం బారులు దేశంలో జీడీపీ వృద్ధి కూడా ఊహించిన దాని కంటే అధికంగానే ఉంది. 2023లో మార్కెట్లలో మంచి ఆర్థికవృద్ధి కనిపించింది. రెస్టారెంట్లు జనాలతో నిండిపోయాయి. మార్కెట్లు, మాల్స్‌లో జనం గుంపులు గుంపులుగా కనిపించారు. ఇది జీడీపీ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మించి 7.6 శాతంగా నమోదైంది. తయారీ, మైనింగ్, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల అద్భుతమైన పనితీరు కారణంగా రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఊహించిన దాని కంటే అధికంగా ఉంది ఉంది. రూ. 200 దాటిన టమాటా వ్యవసాయం పరంగా కూడా ఈ ఏడాది బాగానే ఫలితాలు వచ్చాయి. బియ్యం, ఇతర ధాన్యాల ఉత్పత్తి వృద్ధి చెందింది. ద్రవ్యోల్బణం విషయానికి వస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువగానే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. జూలై-ఆగస్టులో టమాటా ధరలు కిలో రూ.200 దాటాయి. దీంతో ప్రభుత్వం టమాటాను రాయితీ ధరలకు విక్రయించాల్సి వచ్చింది. టమోటా తర్వాత ఉల్లి ధరలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. అయితే ఇప్పుడు ఉల్లి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. తగ్గిన నిరుద్యోగిత రేటు 2023 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు తగ్గింది. జూలై-సెప్టెంబర్ 2023లో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 7.2 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.6 శాతంగా ఉంది. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 6.6 శాతంగా నమోదైంది. అదే సమయంలో మహిళా కార్మికుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. 2023 సంవత్సరం ఉపాధి రంగంలో మిశ్రమ సంవత్సరంగా నిలిచింది. ఇది కూడా చదవండి: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి
కరోనా సమయంలో అన్ని రంగాలు కుదేలైనా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు మాత్రం వృద్ధి నమోదు చేశాయి. అలాంటి వ్యవసాయ రంగానికి సంబంధించి దేశ జీడీపీలో వాటా తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 1990-91లో 35 శాతంగా ఉండేదని, 2022–23లో 15 శాతానికి తగ్గిందని లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముంద్రా వెల్లడించారు. ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్ వేగంగా వృద్ధి చెందడంతోనే వ్యవసాయ రంగం వాటా తగ్గిందని మంత్రి పార్లమెంట్లో పేర్కొన్నారు. ‘ప్రొడక్షన్ పడిపోవడం వల్ల వ్యవసాయ రంగం వాటా తగ్గిపోలేదు. పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్లో ఉత్పత్తులు వేగంగా పెరగడమే ఇందుకు కారణం’ అని ఆయన వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు గత ఐదేళ్లలో ఏడాదికి 4 శాతం చొప్పున వృద్ధి సాధించాయని మంత్రి అన్నారు. వ్యవసాయానికి సంబంధించి కేవలం మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. గ్లోబల్ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 4 శాతంగా ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రొడక్షన్ పెంచడానికి, సుస్థిరాభివృద్ధికి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, వనరులను సమర్థంగా వినియోగించేందకు ప్రభుత్వం వివిధ పథకాలు, సంస్కరణలు, పాలసీలు తీసుకొచ్చిందని వివరించారు. కేంద్రం ప్రభుత్వం రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2.81 లక్షల కోట్లు విడుదల చేశామన్నారు. ఇదీ చదవండి: మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం? -
21 శాతం పెరిగిన పన్నులు..!
ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 17 వరకు భారతదేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20.7 శాతం పెరిగి రూ.13.70 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ పన్ను రూ. 6.95 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యూరిటీల లావాదేవీల పన్ను కలిపి రూ. 6.73 లక్షల కోట్లుగా ఉంది. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు సంవత్సరానికి 17 శాతం పెరిగి రూ.15.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 7.90 లక్షల కోట్లు, స్థూల వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యూరిటీల లావాదేవీల పన్ను రూ. 8.03 లక్షల కోట్లుగా ఉందని డిసెంబర్ 18న మంత్రిత్వ శాఖ తెలిపింది. 10.5 శాతం వృద్ధితో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2023-24లో రూ. 18.2 లక్షల కోట్లుగా ఉందని అంచనా. తాత్కాలిక డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2.25 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా రీఫండ్లను జారీ చేసింది. -
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..?
ముంబై: భారత్ 2026 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని, దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అప్పటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, 2027లో 5.5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా విశ్లేషించారు. ‘ఇండియా ఎట్ 125: రీక్లెయిమింగ్ ది లాస్ట్ గ్లోరీ అండ్ రిటరి్నంగ్ ది గ్లోబల్ ఎకానమీ టు ది ఓల్డ్ నార్మల్’ అనే శీర్షికతో 18వ సీడీ దేశ్‌ముఖ్ మెమోరియల్ లెక్చర్‌లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, ప్రస్తుత డాలర్ పరంగా జర్మనీ లేదా జపాన్ జీడీపీ వచ్చే మూడేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశం లేదని అన్నారు. జపాన్ తన 2022 స్థాయి 4.2 ట్రిలియన్ డాలర్ల నుండి 2027లో 5.03 ట్రిలియన్ డాలర్లను చేరుకోవడానికి ప్రస్తుత డాలర్ పరంగా 3.5 శాతం వృద్ధి రేటును కొనసాగించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇది సాధ్యం కాకపోవచ్చని వివరించారు. 4 శాతం వార్షిక వృద్ధితో జర్మనీ జీడీపీ 2023లో 4.4 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, 2025 నాటికి 4.9 ట్రిలియన్ డాలర్ల స్థాయికి ఎదుగుతుందని, 2027 నాటికి 5.1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవిస్తుందని అన్నారు. ఈ అంచనాలను బట్టి చూస్తే, భారత జీడీపీ ఈ రెండు దేశాల జీడీపీలను ఎంత త్వరగా దాటగలదన్నది ప్రశ్నని అన్నారు. భారత్ 2026 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని వివరించారు. చింతామన్ ద్వారకానాథ్ దేశ్‌ముఖ్ (డీసీ దేశ్‌ముఖ్) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పనిచేసిన మొదటి భారతీయుడు. 1943 నుండి 1949 వరకు ఆయన పదవీకాలంలో, 1949 బ్యాంకింగ్ కంపెనీల చట్టం అమల్లోకి వచ్చింది తరువాత దీనిని బ్యాంకింగ్ నియంత్రణ చట్టంగా పేరు మార్చడం జరిగింది. గణాంకాల ప్రకారం, 1980–81లో భారత్ ఎకానమీ పరిమాణం 189 బిలియన్ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. -
‘చైనాను చూసి నేర్చుకోండి’.. మరోసారి ఇన్ఫోసిస్ మూర్తి షాకింగ్ కామెంట్స్
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటారు. వారంలో 72 గంటలు పనిచేయాలని ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో కొందరు ప్రముఖులు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరు టెక్ సమ్మిట్‌లో నారాయణమూర్తి మాట్లాడారు. ప్రస్తుతం చైనా జీడీపీ 19 ట్రిలియన్లుగా ఉందని, చైనా మోడల్‌ను అధ్యయనం చేసి అక్కడ అవలంబిస్తున్న పద్ధతులను దేశంలో అనుసరించాలని సూచించారు. దాంతోపాటు ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. అయితే అందుకు బదులుగా సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలని ఆయన కోరారు. ఆయన ఉచితాలకు వ్యతిరేకం కాదని పరిస్థితులను అర్థం చేసుకోగలనని అన్నారు. తాను పేద కుటుంబానికి చెందినవాడినని, ఉచిత రాయితీలను పొందిన వారు సమాజానికి తమ బాధ్యతగా కొంత తిరిగి ఇవ్వాలన్నారు. ఉదాహరణకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తే అందుకు బదులుగా పిల్లలను బడికి పంపించి బాగా చదివేలా చూడాలన్నారు. ఏదీ ఉచితంగా ఉండకూడదని, ఏదో రూపకంగా సమాజానికి తిరిగి ఇవ్వాలన్నారు. ఇదీ చదవండి: రూ.12 వేల కోట్ల వ్యాపారాధిపతి.. రూ.200 కోసం బేకరీలో పని..! చైనా జీడీపీ 19 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. భారత్ జీడీపీ మాత్రం 3.4-4 ట్రిలియన్‌లోనే ఉందని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు చైనాలోనూ ఉన్నాయి. కానీ భారత్ కంటే 5-6 రెట్లు జీడీపీ అధికంగా ఉందన్నారు. చైనా మోడల్‌ను అధ్యయనం చేసి, ఉత్పత్తి పెంచి సమాజానికి లబ్ధి చేకూరే విషయాలు ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. -
4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్?, కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలు!
ఇటీవల మన దేశ ఆర్థిక వ్యవస్థ మొదటి సారిగా 4 ట్రిలియన్ డాలర్ల మైలు రాయిని చేరిందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘ఎక్స్’ వేదికగా పలువురు ప్రముఖులు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తరుణంలో ఫోర్బ్స్ ఇండియా భారత్ స్థూల దేశీయోత్పత్తి (GDP) పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. మన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు. దేశ రాజధాని. ఇవన్నీ కలిపి భారత్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరుగులేని దేశంగా నిలబెడుతున్నాయి. ఫలితంగా ప్రస్తుత (2023లో) జీడీపీ 3.75 ట్రిలియన్ డాలర్లుగా ఉందని తేలింది. జీడీపీని బట్టే దేశాభివృద్ది ఎలా ఉందనే విషయాన్ని గుర్తించవచ్చు. ఇంతకీ జీడీపీ అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంటారు. ‘జీడీపీ అనేది ఒక విద్యార్థి మార్కుల జాబితా వంటిద’ని ఆర్థికవేత్తలు అభివర్ణిస్తుంటారు. ఒక సంవత్సరంలో ఒక విద్యార్థి పనితీరును, ఆయా పాఠ్యాంశాల్లో సదరు విద్యార్థి బలాబలాలను మార్కుల జాబితా ఎలా చెబుతుందో.. దేశ ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, అందులో వివిధ రంగాలు, అంశాల బలాబలాలను జీడీపీ ప్రతిఫలిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవ్యవస్థ బాగుందో లేదో ఇది చూపుతుంది. మందగమనం ఉన్నట్లు జీడీపీ గణాంకాలు చూపుతున్నట్లయితే దానర్థం దేశ ఆర్థికవ్యవస్థ మందగిస్తుందని. అంటే దేశంలో గడచిన సంవత్సరంతో పోలిస్తే దేశంలో తగినన్ని సరకులు, సేవలు ఉత్పత్తి కావటం లేదని అర్ధం. తలసరి జీడీజీ విషయానికొస్తే ఇది దేశంలోని ప్రతి వ్యక్తికి సగటు ఆర్థిక ఉత్పత్తి లేదా స్థూల దేశీయోత్పత్తి (GDP)ని సూచించే కొలత. ఇది ఒక దేశ మొత్తం జీడీపీని దాని జనాభాతో గుణించడం ద్వారా అంచనా వేయొచ్చు.ఈ రెండు పారామీటర్స్‌ని ఉపయోగించి ఒక నిర్దిష్ట ప్రాంత జనాభా ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా కేంద్ర సంస్థ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) జీడీపీ డేటాను విడుదల చేస్తుంది. ఆ రిపోర్ట్ ద్వారా మన దేశంలోని అత్యంత ధనిక,పేద రాష్ట్రాలను గుర్తింవచ్చు. -
రేపటి నగరాలను నిర్మించేదెలా?
ప్రపంచవ్యాప్తంగా జీడీపీలో దాదాపు 80 శాతం వాటా సమకూరుస్తూ నగరాలు ప్రధాన ఆదాయ సముపార్జన కేంద్రాలుగా మారుతున్నాయి. భారతదేశంలో కూడా ఇందుకు భిన్నమైన పరిస్థితులు లేవు. దేశంలోని ముంబై, ఢిల్లీ వంటి నగరాలు ప్రపంచంలోని కొన్ని దేశాల కంటే అధికంగా జీడీపీని సమకూరుస్తున్నాయి. మన నగరాలను అభివృద్ధి పథంలో నిలపడానికి కొత్తగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న సదుపాయాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడంలో ప్రభుత్వాలకున్న పరిమితుల దృష్ట్యా ప్రైవేటు పెట్టుబడులను సమీకరించడం నేడు అనివార్యంగా మారింది. విశాఖపట్నం లాంటి నగరాలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆదాయ నమూనాలను విజయవంతంగా వినియోగించుకుంటున్నాయి. 2036 నాటికి భారతదేశంలోని నగరాల్లో నివసించే జనాభా 60 కోట్లకు చేరుకుంటుందని ఒక అంచనా. ఈ స్థాయిలో జనాభా పెరుగుదల మంచి అవకాశాలను సృష్టించడంతో పాటు లక్షలాది మంది జనాభాకు అనుగుణంగా పౌర సేవలు విస్తరించడం, పౌరులకు మెరుగైన జీవనానికి అనువైన పరిస్థితులను కల్పించడం ప్రభుత్వానికి ఒక సవాలు కానుంది. అందువల్ల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణ మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడానికి మనం గణనీయంగా వనరులను కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని గుర్తించిన భారత జీ20 అధ్యక్షత ‘ఫైనాన్సింగ్ సిటీస్ టుమారో: సస్టెయినబుల్, ఇంక్లూజివ్ అండ్ రజిలెంట్’ అనే థీమ్‌ను ఎంపిక చేసుకుంది. అందుకనుగుణంగా నగరాల్లో స్థిరమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడానికి న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ పేరుతో ‘ఫైనాన్సింగ్ సిటీస్ ఆఫ్ టుమారో’ ఆవిర్భావానికి కొన్ని సూత్రాలను ఆమోదించారు. పట్టణ మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడంలో ప్రభు త్వాలకున్న పరిమితుల దృష్ట్యా ప్రైవేటు పెట్టుబడులను సమీకరించడం నేడు అనివార్యంగా మారింది. ఇందుకనుగుణంగా స్థిరమైన, సమ్మిళిత మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చు కోవడానికి నగరాలకు మార్గనిర్దేశం చేసే విధంగా భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 కొన్ని నివేదికలను ప్రకటించింది. ఈ వ్యూహంలో పట్టణ ప్రణాళిక సంస్కరణలు, సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం, పెట్టు బడి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, నగరాల రుణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం, గ్రీన్, సోషల్ మరియు సస్టెయినబుల్ బాండ్లు వంటి వినూత్న ఫైనాన్సింగ్ సాధనాలను ఉపయోగించుకుని స్థిరమైన పెట్టుబడి ప్రాజెక్టులను నిర్విరామంగా సాధించడం, నియంత్రణా వాతావరణాన్ని అందుబాటులో ఉంచడం, ఏఐ, సామర్థ్యాల పెంపు, సంస్థాగత సంసిద్ధత వంటి సాధనాలను ఉపయోగించు కోవడం వంటివి ప్రధానాంశాలుగా ఉన్నాయి. భారతదేశంలోని అనేక నగరాలు వినూత్న ఆదాయ వనరుల సృష్టి, పెట్టుబడి అవకాశాలు సుసాధ్యమని నిరూపించాయి. మధ్య ప్రదేశ్‌లోని రేవా మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసీ) మౌలిక సదు పాయాల కోసం సగటున ఏటా రూ. 350 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో కేవలం 34 శాతం మాత్రమే మున్సిపాలిటీ సొంత ఆదాయ వనరుల నుండి వస్తుంటే, మిగిలినది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ పథకాలు మరియు గ్రాంట్ల ద్వారా సమకూరుతోంది. మౌలిక వసతులకు సొంత ఆదాయం నుండి ఇంత తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పటికీ, పట్టణ భూభాగపు రీ–డెన్సిఫికేషన్ ఆధారంగా వ్యూహ్మాత్మక పట్టణ ప్రణాళికతో న్యూ రేవా బస్ స్టాండ్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానం ద్వారా విజయవంతంగా అమలు చేసింది. న్యూ రేవా బస్ స్టాండ్ ప్రాజెక్టులో 3.5 ఎకరాల ఖాళీ ప్రదేశాన్ని వాణిజ్య సము దాయంతో కూడిన బస్ స్టాండ్‌గా తీర్చిదిద్దడం ద్వారా, మున్సిపా లిటీకి రూ. 10.5 కోట్ల ప్రీమియంతో పాటు, ఏడాదికి రూ. 35 లక్షల అద్దె లభిస్తోంది. భారతదేశంలోని ఇతర నగరాలు కూడా పట్టణ మౌలిక సదు పాయాలను అభివృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆదాయ నమూనా లను విజయవంతంగా వినియోగించుకుంటున్నాయి. గ్రేటర్ విశాఖ పట్నం మున్సిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వ్యర్థ జలాలను శుద్ధి చేసి ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో పరిశ్రమల వినియోగానికి నీటిని సరఫరా చేయడం ద్వారా ఏటా సుమారు రూ. 30 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రాజెక్టు నిధుల కోసం జీవీఎంసీ పన్నుల వసూళ్లు, సేవా పంపిణీ ప్రమాణాలను స్థిరంగా ప్రదర్శించడం ద్వారా రుణ అర్హతలను మెరుగుపరుచుకుని ‘ఏఏ’ క్రెడిట్ రేటింగ్‌ను సాధించింది. అదే విధంగా సూరత్ నగరం కూడా పారిశ్రామిక పునర్వి నియోగం కోసం శుద్ధి చేసిన వ్యర్థ నీటిని విక్రయించడం ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్ల కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంది. స్థిరమైన ఆర్థిక వనరుల సేకరణలో పేరుగాంచిన ఘజియాబాద్ భారతదేశంలో రూ. 150 కోట్ల మున్సిపల్ గ్రీన్ బాండ్లను విడుదల చేసిన మొదటి యూఎల్బీ (అర్బన్ లోకల్ బాడీ)గా నిలిచింది. మెరుగైన పట్టణ ప్రణాళిక, వినూత్న ఆర్థిక నమూనాల ద్వారా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుని తమ పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి చిన్న నగరాలు కూడా ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించ గలవని పైన పేర్కొన్నవి ఉదాహరణగా నిలుస్తున్నాయి. జీ20 వెలువరించిన పత్రాలు నాణ్య మైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడానికి మన నగరాలకు మార్గ దర్శకంగా ఉపయోగపడుతుంటే, భారత దేశ అనుభవాలు ప్రపంచ మౌలిక సదు పాయాల ఎజెండాను నిర్దేశించడానికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. అటల్ మిషన్ ఫర్ రీజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్, హౌసింగ్ ఫర్ ఆల్ (పీఎంఎవై), మెట్రో రైల్ ప్రాజెక్టులు, ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్, స్మార్ట్ సిటీ మిషన్ లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్లు, వివిధ నగరాలు జారీ చేసిన మునిసిపల్ బాండ్లు, 2018లో రూపొందించిన భారతదేశ నేషనల్ అర్బన్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ (ఎన్యూపీఎఫ్) అమలు నుండి నేర్చుకున్న పాఠాలు... గ్రూపు ఆలోచనలను సుసంపన్నం చేశాయి. అలాగే వాటిని పరస్పరం పంచుకోవడం వివిధ దశలలో అభివృద్ధిలో ఉన్న నగరాల ఆకాంక్షలకు అనుగుణంగా సుస్థిర ఆర్థిక వనరుల సమీకరణకు ఇతర మార్గాలను ఉపయోగించుకునేందుకు మార్గదర్శకంగా నిలిచాయి. సుస్థిర ఆర్థిక వనరుల సమీకరణకు ఇతర మార్గాలను ఉపయోగించుకునే దిశగా ముందుకు వెళ్లడానికి భారతీయ నగరాలు తమ సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, డిజిటైజ్డ్ అకౌంటింగ్ వ్యవస్థను అవలంబించడం, పెట్టుబడి పెట్టదగిన ప్రాజెక్టుల పైప్ లైన్‌ను కలిగి ఉండటం, వాటి విశ్వసనీయత, ఆదాయ సేకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం అత్యవసరం. పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వైపు ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఈ పరివర్తన కీలకం. సోలమన్ ఆరోక్యరాజ్ వ్యాసకర్త జాయింట్ సెక్రటరీ, కేంద్ర ఆర్థిక శాఖ, భారత ప్రభుత్వం (వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం) -
ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలోనే..
ఆంధ్రప్రదేశ్ విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, కార్మికరంగం.. ఇలా ఏ రంగంలో చూసిన గతంతో పోలిస్తే అభివృద్ధి చెందింది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నా.. ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా దేశంలోని కొన్ని రాష్ట్రాలు తిరిగి వాటి పూర్వస్థితి కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో రంగాల్లో ముందుంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించాలంటే వివిధ శాఖల అనుమతులు అవసరం అవుతాయి. అవి పొందాలంటే యాజమాన్యాలకు కొంత శ్రమతో కూడుకున్న వ్యవహరం. అయితే వీటన్నిటినీ కేంద్రీకృతం చేసి ఇండస్ట్రీయల్ సింగిల్ విండో క్లియరెన్స్‌ను అమలులోకి తెచ్చిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రం. 2023-24 సంవత్సరానికిగాను స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.14,49,501 కోట్లుగా ఉంది. ఇది చంద్రబాబు పాలన ముగిసిన 2018-19కి గాను రూ.8,70,849 కోట్లుగా ఉండేది. గడిచిన ఈ కొన్నేళ్లలో ఇది దాదాపు 65 శాతం ఎక్కువ. 2021-22లో స్థూల విలువ ఆధారిత (జీవీఏ)వృద్ధి 18.47%గా ఉంది. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా, నాణ్యమైన మౌలిక సదుపాయాలను సృష్టించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2023 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.6వేల కోట్లు. 2023లో రాష్ట్ర సరుకుల ఎగుమతులు రూ.1.58లక్షల కోట్లు. ఇందులో గరిష్ఠంగా సముద్ర ఉత్పత్తుల వల్ల దాదాపు 13.62% వాటా చేకూరింది. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా రూ.22,282.16 కోట్లతో భారీ, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు స్థాపించేలా ప్రభుత్వం కృషిచేసింది. టీడీపీ హయాంలో పరిశ్రమల అభివృద్ధిలో 27వ స్థానానికి దిగజారిన రాష్ట్రం ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 2023 నాటికి, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 26,675.73 మెగావాట్లు. సోలార్ పవర్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రత్యేక చట్టాలను చేసింది. తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో 17 స్థానంలో నిలిచిన రాష్ట్రం ప్రస్తుతం 9వ స్థానానికి ఎదిగింది. టీడీపీ ప్రభుత్వకాలంలో కేవలం 34000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4.93లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. అందులో 2.13లక్షల శాశ్వత కొలువులు ఉన్నాయి. వ్యవసాయంలో రాష్ట్రం మైనస్ 6.5శాతంతో టీడీపీ కాలంలో అధ్వానంగా మారింది. అదే 2021-22కు గాను 8.2 శాతం వృద్ధి చెందింది. దాంతో వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2022-23కుగాను వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.13,640 కోట్లు కేటాయించారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 24,620 పాఠశాలల్లోని వసతులను మెరుగుపరిచారు. -
తలసరి నికర రాష్ట్రీయోత్పత్తిలో టాప్ 10లో ఏపీ
రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా అక్కడ అభివృద్ధి ఆధారపడుతుంది. పరిశ్రమలు, వ్యవసాయం, సాంకేతికత, ఐటీ..ఇలా చాలా రంగాల ద్వారా రాష్ట్రాలకు రాబడి ఉంటుంది. 2022-23 సంవత్సరానికిగాను స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో తయారు చేసిన ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయం వివరాలను కొన్ని సర్వేలు వెల్లడించాయి. తలసరి స్థూల నికర రాష్ట్రీయోత్పత్తి(నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ 10 స్థానాల్లో నిలిచింది. 2019 నుంచి మార్చి 2023 వరకు దాదాపు రూ.6600 కోట్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించింది. రాష్ట్ర జనాభా ఆధారంగా తలసరి స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో సిక్కిం రూ.5.19లక్షలుతో మొదటిస్థానంలో ఉంది. గోవా-రూ.4.72లక్షలతో రెండో స్థానంలో నిలిచింది. బిహార్ రూ.54వేలతో చివరి స్థానంలో ఉంది. సిక్కిం: రూ.5.19లక్షలు గోవా: రూ.4.72లక్షలు ఆంధ్రప్రదేశ్: రూ.2.19లక్షలు అరుణాచల్ ప్రదేశ్: రూ.2.05లక్షలు అస్సాం: రూ.1.18లక్షలు బిహార్: రూ.54వేలు ఛత్తీస్‌గఢ్: రూ.1.33లక్షలు గుజరాత్: రూ.2.41లక్షలు హరియాణా: రూ.2.96లక్షలు హిమాచల్ ప్రదేశ్: రూ.2.22లక్షలు ఝార్ఖండ్: రూ.91వేలు కర్ణాటక: రూ.3.01లక్షలు కేరళ: రూ.2.33లక్షలు మధ్యప్రదేశ్: రూ.1.4లక్షలు మహారాష్ట్ర: రూ.2.24లక్షలు మణిపుర్: రూ.91వేలు మేఘాలయ: రూ.98వేలు మిజోరం: రూ.1.98లక్షలు నాగాలాండ్: రూ.1.25లక్షలు ఒడిశా: రూ.1.5లక్షలు పంజాబ్: రూ.1.73లక్షలు రాజస్థాన్: రూ.1.56లక్షలు తమిళనాడు: రూ.2.73లక్షలు తెలంగాణ: రూ.3.08లక్షలు త్రిపుర: రూ.1.59లక్షలు ఉత్తర్ ప్రదేశ్: రూ.83వేలు ఉత్తరాఖండ్: రూ.2.33లక్షలు పశ్చిమ బెంగాల్: రూ.1.41లక్షలు నాగాలాండ్: రూ.1.25లక్షలు జమ్మూ కశ్మీర్: రూ.1.32లక్షలు -
India GDP Growth: జీడీపీలో జిల్లాల వాటా ఎంతంటే..
దేశ స్థూలజాతీయోత్పత్తి వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతంగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయం, ఆర్థిక రంగాల పని తీరుతో ఇది సాధ్యమైందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అయితే దేశంలోని జిల్లాల అభివృద్ధిపై జీడీపీ ఆధారపడుతుంది. ప్రముఖ నగరాలున్న జిల్లాలు దేశాభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తున్నాయి. 2020-21 సంవత్సరానికిగాను జీడీపీ వృద్ధిరేటులో భాగంగా దేశంలోని జిల్లాల్లో అత్యధికంగా ముంబయి తన సహకారాన్ని అందించించినట్లు సమాచారం. 2020-21 ఏడాదికిగాను గణాంకాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం వివిధ జిల్లాల వాటా వివరాలు కింది విధంగా ఉన్నాయి. ముంబయి-రూ.22లక్షల కోట్లు దిల్లీ-రూ.21లక్షల కోట్లు కోల్‌కతా-రూ.12లక్షల కోట్లు బెంగళూరు అర్బన్-రూ.9.9లక్షల కోట్లు పుణె-రూ.9.7లక్షల కోట్లు హైదరాబాద్-రూ.9.5లక్షల కోట్లు అహ్మదాబాద్-రూ.9.4లక్షల కోట్లు చెన్నై-రూ.9లక్షల కోట్లు సూరత్-రూ.6.6లక్షల కోట్లు థానే-రూ.6.6లక్షల కోట్లు జూపుర్-రూ.5.4లక్షల కోట్లు నాగ్‌పుర్-రూ.5.1లక్షల కోట్లు నాసిక్-రూ.4.6లక్షల కోట్లు -
మెరుగ్గా వ్యవహరించిన భారత్
అంతర్జాతీయ పరిణామాలు సవాలు విసురుతున్న సమయంలో గత ఏడాది భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. కోవిడ్–19 మహమ్మారి ప్రభావం నుండి ప్రపంచం క్రమంగా కోలుకున్నప్పటికీ, ప్రపంచ వృద్ధి ఇంకా దుర్బలంగానే ఉంది. ద్రవ్యోల్బణం కూడా మొండిగాఉంది. విపరీతమైన వాతావరణ ఘటనలు పెరుగుతున్న తరుణంలో (రికార్డుల పరంగా జూలై అత్యంత వేడి అయిన నెల అని గ్రహించాలి), వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ఈ ‘కార్యాచరణ దశాబ్ది’లో తక్షణ చర్యలు అవసరం. అయితే, అంతర్జాతీయ సహకారాత్మక చర్యకు సంబంధించిన ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ – భౌగోళిక రాజకీయ పోటీ, ఘర్షణ ప్రమాదాలు ఆ సహకారానికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ కష్టతరమైన ప్రపంచ ముఖచిత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బహుశా భారతదేశ అత్యంత పరిణామాత్మకమైన, అత్యంత బోధనాత్మకమైన నిర్ణయం, జీ20 చర్చా ప్రక్రియకు ఉపక్రమించడం! చెప్పాలంటే,ఇండియా చేయాల్సినదాని కంటే ఎక్కువ చేసింది. అత్యంత సంఘటిత ప్రక్రియను నడిపించడం ద్వారా సహకార విధానంలోకి మొగ్గు చూపింది. భౌగోళిక కమ్యూనిటీలు అన్నింటికీ స్వరాలు ఉండాల్సిన ఈ బహుముఖ, బహుళ వాటాదారుల విధానం... ప్రపంచ సహకారాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. మన భాగస్వామ్య ప్రాధాన్యాలపై పురోగతి సాధించడానికి ప్రపంచం తక్షణమే మార్గాలను కనుగొనాల్సిన తరుణంలో ఇది చాలా కీలకమైనది. ప్రపంచ జనాభాలో 85 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణార్ధ దేశాల సమూహానికి బహుముఖ సంభాషణలలో తరచుగా చోటివ్వరు. అయితే దక్షిణార్ధ ప్రపంచ (గ్లోబల్ సౌత్) వాణికి అవకాశం ఇవ్వడం ద్వారా భారతదేశం భౌగోళికంగా జీ20 చర్చలను విస్తరించింది. జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మొదటి నెలల్లో భారతదేశం 125 దేశాలకు చెందిన నాయకులు, మంత్రుల భాగస్వామ్యంతో కూడిన ‘వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్’ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జీ20 కూటమిలో ప్రాతినిధ్యం వహించని దేశాలతో సంప్రదింపులు జరపడం, వారి ప్రాధాన్యాలను అర్థం చేసుకోవడమే దీని లక్ష్యం. అటువంటి ప్రాధాన్యాల్లో ఒకటి ప్రపంచ సార్వభౌమాధికార దేశాల రుణ సమస్య. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 50 శాతం దేశాలు తీవ్రమైన రుణ బాధలో ఉన్నట్టు అంచనా. ఈ రుణ విచికిత్స కోసం భారతదేశం గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 3 ట్రిలియన్ డాలర్ల సామూహిక జీడీపీ ఉన్న 55 ఆఫ్రికన్ రాజ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో చేర్చాలని కూడా భారతదేశం వాదించింది (ఈ మేరకు సఫలమైంది కూడా). విభిన్న భౌగోళిక ప్రాంతాల నుండి పెట్టుబడులను తీసుకువచ్చే బహుముఖ ప్రక్రియకు నాయకత్వం వహించడంతో పాటు, భారతదేశం కమ్యూనిటీలలో కూడా వాటాదారులతో చర్చలు జరిపింది. ఉదాహరణకు, థింక్20 కమ్యూనిటీ అనేది, జీ20కి ‘ఐడియా బ్యాంక్’గా పనిచేస్తుంది. అదే సమయంలో, ప్రపంచ వాణిజ్య కమ్యూనిటీకి ప్రాతి నిధ్యం వహించే అధికారిక డైలాగ్ ఫోరమ్‌గా బి20 వ్యవహరిస్తుంది. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మొట్ట మొదటిసారిగా ‘స్టార్టప్20 ఎంగేజ్మెంట్ గ్రూప్’ ప్రాతినిధ్యం వహిస్తుంది. జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్, సాధారణ సవాళ్లను పరిష్కరించడానికి ఒక సాధనంగా అంతర్జాతీయ బహుళ వాటాదారుల సహకారానికి ప్రాముఖ్యమిస్తోంది. ఈ విధానం స్పష్టమైన హామీని కలిగి ఉంది. పెరుగుతున్న సంక్లిష్ట ప్రపంచంలో– భౌగోళికాలు, వ్యాపార రంగాలు, పర్యావరణ వ్యవస్థలు, కమ్యూనిటీలలోని సవాళ్లను పరిష్కరించడానికి బహుళ వాటాదారుల విధానం చాలా అవసరం. సమ్మిళిత జీ20 ప్రక్రియను తీర్చి దిద్దడానికి చేసిన భారత ప్రయత్నాలను సులభంగా తీసేయకూడదు. జనాభాలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారత్. ప్రస్తుతం నిట్టనిలువుగా ఎదుగుతున్న పథంలో ఉంది. అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో వరుసగా మూడేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేకాకుండా 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 100 కంటే ఎక్కువ స్టార్టప్ యునికార్న్స్ (1 బిలి యన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్‌లు) కలిగివుంది. ఇటీవలి సంవత్సరాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెరుగుదలను చూసింది. ఇవి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 85 బిలియన్ డాలర్ల కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం, ప్రపంచం త్వరలో కొత్త జీ3 యుగానికి స్వాగతం పలుకుతుంది. ఈ అంచనా అమెరికా, చైనాతోపాటు ప్రపంచంలోని ఉత్కృష్ట దేశాలలో భారతదేశాన్ని కూడా చేర్చింది. ఇది మరోలా ఉండి వుంటే, ఈ పరిణామాలు వేరుగా ఉండేవి. ఇదంతా భారతదేశం దాని తలలోకి ఎక్కించు కొని ఉండవచ్చు. అందరినీ కలుపుకొని పోవడం కాకుండా, కొందరితో ప్రత్యేకంగా చర్చలు జరిపి వుండొచ్చు. కానీ భారతదేశం స్వభావరీత్యా పైనుంచి కిందివరకూ చర్చలను నడిపించడానికి ప్రోత్సహించింది. జీ20 అధ్యక్షతలో తొలి నుండీ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ మకుటంతో, మరింత సంపన్నమైన, సురక్షితమైన భవి ష్యత్తును రూపొందించడానికి ఏకైక మార్గం సహకారమే అని గుర్తు చేసింది. సహకారం పట్ల అంతర్జాతీయ నిబద్ధత క్షీణిస్తున్న తరుణంలో, భారతదేశ జీ20 అధ్యక్షత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రధారులు తమ సహకార విధానాలకు మళ్లీ కట్టుబడి ఉండాలని గుర్తుచేస్తోంది. బోర్గే బ్రెండే వ్యాసకర్త వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు; నార్వే మాజీ విదేశాంగ మంత్రి -
అవనిని తోడ్కొని ఆఖరి మైలు వరకు!
వసుధైక కుటుంబం! ఈ రెండు పదాల్లో యావత్ ప్రపంచాన్నీ ఏకం చేసే లోతైన తాత్త్వికత దాగి ఉంది. ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అన్నదే ఈ రెండు మాటలు బోధించే విశాల భావన. ప్రాదేశిక సరిహద్దులు, భాషలు, భావజాలాలకు అతీతంగా మనమంతా ఒకే సార్వజనీన కుటుంబంగా పురోగమించేలా మనల్ని ప్రోత్సహిస్తూ అందరినీ ప్రపంచ ప్రజానీకంతో మమేకం చేసే విశ్వ దృక్పథమిది. భారత్ జి–20 అధ్యక్షతన ఈ దృక్పథం ప్రాతిపదికగానే మానవ కేంద్రీకృత పురోగమనం అనే భావన ఒక పిలుపుగా రూపొందింది. ఒక భూమిపై నివసించేవారిగా మన గ్రహాన్ని తీర్చిదిద్దుకోవడానికి మనమంతా ఏకమౌదాం. ఒకే కుటుంబంగా... అభివృద్ధి సాధనలో పరస్పరం మద్దతిచ్చుకుందాం. సమష్టి భవిష్యత్తే ఏకైక భవిష్యత్తు అన్నది ఈ పరస్పర అనుసంధాన యుగంలో తోసిపుచ్చలేని వాస్తవం. మహమ్మారి అనంతర ప్రపంచ క్రమం అంతకు ముందున్న ప్రపంచానికి ఎంతో భిన్నమైనది. ఈ మేరకు సంభవించిన మార్పులలో ముఖ్యమైనవి మూడు ఉన్నాయి: మొదటిది, ప్రపంచ జీడీపీ కేంద్రీకృత దృక్పథం నుంచి మానవ కేంద్రీకృత దృక్పథానికి మారడం అవసరమనే అవగాహన పెరగడం. రెండవది, వస్తూత్పత్తి సరఫరా, పంపిణీల క్రమంలో ఒడిదుడుకులను తట్టుకుని కోలుకునే సామర్థ్యాన్ని, నమ్మకమైన నిలకడల ప్రాముఖ్యాన్ని ప్రపంచం గుర్తిస్తుండటం. మూడవది, అంతర్జాతీయ వ్యవస్థలలో సంస్కరణల ద్వారా బహుపాక్షికతకు ఉత్తేజమిచ్చే దిశగా సామూహిక గళం వినిపిస్తుండటం. ఈ మూడు రకాల మార్పులకు సంబంధించి జి–20కి భారత అధ్యక్షత ఉత్ప్రేరక పాత్రను పోషించింది. ఈ మేరకు ఇండోనేషియా నుంచి 2022 డిసెంబరులో మనం అధ్యక్ష బాధ్యతను స్వీకరించిన వేళ ప్రపంచ ఆలోచనా వైఖరులలో మార్పులకు జి–20 ఉత్ప్రేరకం కావాల్సి ఉంటుందని నేనొక వ్యాసంలో రాశాను. వర్ధ మాన, దక్షిణార్ధ గోళ దేశాలు సహా ఆఫ్రికా ఖండంలోని బడుగు దేశాల ఆకాంక్షలను ప్రధాన స్రవంతిలో చేర్చాల్సిన నేపథ్యంలో ఇదొక ప్రత్యేక అవసరం. ఈ మేరకు జి–20కి మన అధ్యక్షతన తొలి కార్యాచరణలో భాగంగా దక్షిణార్ధ గోళ దేశాల గళం వినిపించేందుకు నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో 125 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణార్ధ గోళ దేశాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడంలో అదొక కీలక కసరత్తు. అంతేకాకుండా మన అధ్యక్షత సమయాన ఆఫ్రికా దేశాలనుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు పాల్గొనడంతోపాటు ఆఫ్రికా సమాఖ్యకు జి–20 శాశ్వత సభ్యత్వం కల్పించే ప్రతిపాదన కూడా వచ్చింది. పరస్పర సంధానిత ప్రపంచమంటే వివిధ రంగాల్లో మన సవాళ్లు కూడా పరస్పరం ముడిపడి ఉంటాయి. ఇక 2030 గడువుతో సాధించాల్సిన లక్ష్యాలకుగాను మనమిప్పుడు మధ్య కాలంలో ఉన్నాం. అయినప్పటికీ సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్.డి.జి.) దిశగా పురోగమనం లేదన్న ఆందోళన చాలా దేశాల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎస్.డి.జి. ప్రగతిని వేగిరం చేయడంపై జి–20 కూటమి 2023 కార్యాచరణ ప్రణాళిక అన్ని దేశాలనూ భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ప్రకృతితో సామరస్యపూరిత జీవనశైలి భారతదేశంలో ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్నదే. అదే సమయంలో ఈ ఆధునిక యుగంలోనూ వాతావరణ కార్యాచరణకు మన వంతు సహకారం అందిస్తున్నాం. ప్రగతికి సంబంధించి దక్షిణార్ధ గోళంలోని అనేక దేశాలు వివిధ దశలలో ఉన్నాయి. అందువల్ల వాతావరణ కార్యా చరణ కావడం తప్పనిసరి. లక్ష్యసాధన ఆకాంక్షలు నెరవేరాలంటే ఇందుకు తగినట్లు వాతావరణ నిధుల సమీకరణ, సాంకేతికత బదిలీ కూడా అవశ్యం. ‘పరిస్థితి చక్కబడాలంటే మనం ఏం చేయకూడదు?’ అనే నిర్బంధాత్మక ధోరణి నుంచి మనం పూర్తిగా బయట పడాలన్నది మన దృఢ విశ్వాసం. అలాంటి ధోరణికి భిన్నంగా వాతావరణ మార్పుల పోరాటంపై చేయాల్సింది ఏమిటనే దిశగా నిర్మాణాత్మక ఆలోచనలపై మనం దృష్టి సారించాలి. సుస్థిర, నిలకడ గల నీలి ఆర్థిక వ్యవస్థ కోసం చెన్నై ‘హెచ్ఎల్పీ’లు మన మహా సముద్రాలను ఆరోగ్య కరంగా ఉంచడంపై దృష్టి పెట్టాలి. హరిత ఉదజని ఆవిష్కరణ కేంద్రంతోపాటు పరిశుభ్ర హరిత ఉదజని కోసం అంతర్జాతీయ పర్యా వరణ వ్యవస్థ మన జి–20 అధ్యక్షత నుంచి ఆవిష్కృతమౌతుంది. 2015లో మనం అంతర్జాతీయ సౌర కూటమికి నాంది పలికాం. నేడు ప్రపంచ జీవ ఇంధన కూటమి ద్వారా, వర్తుల ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలకు తగినట్లు ఇంధన పరివర్తనకు శ్రీకారం చుట్టడంలో ప్రపంచానికే మనం ఆసరా అవుతున్నాం. వాతావరణ ఉద్యమానికి ఊపునివ్వడంలో వాతావరణ కార్యాచరణను ప్రజాస్వామ్యీకరించడం ఉత్తమ మార్గం. వ్యక్తులు తమ దీర్ఘకాలిక ఆరోగ్యం ప్రాతిపదికగా రోజువారీ నిర్ణయాలు తీసుకున్న రీతిలోనే మన భూమి దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం ప్రాతిపదికగా జీవనశైలిపై నిర్ణయాలు తీసు కోవచ్చు. మానవ శ్రేయస్సుకు యోగాభ్యాసం ఒక అంతర్జాతీయ ఉద్యమంగా రూపొందిన తరహాలోనే మనం కూడా ‘సుస్థిర పర్యావ రణం కోసం జీవనశైలి’(లైఫ్)తో ప్రపంచవ్యాప్తంగా కదలిక తెచ్చాం. వాతావరణ మార్పుల ప్రభావం నేపథ్యంలో ఆహారం–పౌష్టి కతల భద్రతకు హామీ ఇవ్వడం ఎంతో కీలకం. ఈ హామీతో పాటు వాతావరణ అనుకూల వ్యవసాయ వృద్ధికి చిరుధాన్యాలు లేదా ‘శ్రీ అన్న’ కూడా తోడ్పడతాయి. ప్రస్తుత అంతర్జాతీయ చిరుధాన్య సంవ త్సర నేపథ్యంలో మనం చిరుధాన్యాలను అంతర్జాతీయ ప్రజానీకం కంచాల్లోకి తీసుకెళ్లగలిగాం ఆహార భద్రత–పౌష్టికతపై దక్కన్ ఉన్నత స్థాయి సూత్రాలు కూడా ఇందుకు సాయపడతాయి. సాంకేతిక పరిజ్ఞానంలో పరివర్తన సర్వసాధారణమే. అదే సమ యంలో అది సార్వజనీనం కూడా కావాలి. లోగడ సాంకేతిక పురోగ మన ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అంద లేదు. అయితే, అసమానతల విస్తరణలోగాక తొలగింపులో సాంకే తి కత వినియోగం ఎంత ప్రయోజనకరమో కొన్నేళ్లుగా భారత్ ససా క్ష్యంగా నిరూపించింది. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగాబ్యాంకింగ్ సదుపాయం లేదా డిజిటల్ గుర్తింపు లేని కోట్లాది ప్రజలకు డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు (డి.పి.ఐ.) కల్పించడం ద్వారా ఆర్థిక సార్వజనీనతలో వారిని భాగస్వాములను చేయవచ్చు. ఈ మేరకు డి.పి.ఐ. ఆధారిత పరిష్కారాలకు నేడు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్ధమాన దేశాలు సార్వజనీన వృద్ధి సాధనలో డి.పి.ఐ. ని స్వీకరించి, తమకు తగిన స్థాయిలో వాటిని రూపొందించుకునేలా మనం చేయూతనిస్తాం. భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ కావడం యాదృచ్ఛికమేమీ కాదు. బలహీన/అట్టడుగు వర్గాలు మన పురోగమన పయనాన్ని నడిపించగలిగేలా మనం అమలు చేసిన సరళ, అనుసరణీయ, సుస్థిర పరిష్కారాలు శక్తినిచ్చాయి. అంతరిక్షం నుంచి క్రీడారంగం వరకు; ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక ఔత్సాహి కత దాకా భారత మహిళలు వివిధ రంగాల్లో ముందంజ వేశారు. మహిళల నేతృత్వంలో ప్రగతికి వారు సరికొత్త అర్థం చెప్పారు. ఈ విధంగా లింగపరంగా డిజిటల్ విభజన తొలగింపు, శ్రామిక శక్తి పరంగా అంతరం తగ్గింపు సహా నాయకత్వం–నిర్ణయాత్మకతలో మహిళలు కీలక పాత్ర పోషించేలా ఇవి ప్రోత్సహిస్తున్నాయి. భారత్‌కు జి–20 అధ్యక్షత ఉన్నతస్థాయి దౌత్య కర్తవ్యం మాత్రమే కాదు; ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా, వైవిధ్యానికి నమూనాగా యావత్ ప్రపంచం మన అనుభవాలను పంచుకునేందుకు ద్వారాలు తెరిచాం. వివిధ అంశాల్లో విజయసాధన అన్నది నేడు భారతదేశ సహజ లక్షణంగా మారింది. ఇందుకు జి–20 అధ్యక్ష బాధ్యత మినహాయింపు కాబోదు. ఇప్పుడీ బాధ్యత ప్రజాచోదక ఉద్యమంగా రూపొందటమే ఇందుకు కారణం. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 60 నగరాల్లో 200కు పైగా సమావేశాలు, సదస్సులు నిర్వహించాం. వీటితోపాటు మన అధ్యక్ష బాధ్యతలు ముగిసేలోగా వీటిలో పాలుపంచుకున్న 125 దేశాలకు చెందిన 1,00,000 మందికిపైగా ప్రతినిధులకు మన ఆతిథ్యం రుచి చూపాం. ఇప్పటిదాకా ఏ దేశమూ ఇంత భౌగోళిక వైవిధ్యంతో జి–20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది లేదు. భారతదేశ జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యం, ప్రగతిపై ఇతరుల నుంచి ప్రశంసలు వినడం ఒక అంశమైతే, అంతకన్నా ముందే వాటిని ప్రత్యక్షంగా అనుభవించడం పూర్తిగా భిన్నం. మన జి–20 ప్రతినిధులు దీనికి ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. మన జి–20 అధ్యక్షత ప్రధానంగా విభజన రేఖల తుడిచివేతకు, అడ్డంకుల ఛేదనకు, విభేదాలకు భిన్నంగా ప్రపంచంలో సామరస్యం దిశగా సహకార బీజాలు వేయడానికి కృషి చేస్తుంది. ‘ఎవరికివారే యమునాతీరే’ అనే పరిస్థితికన్నా ఉమ్మడి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడమే మన లక్ష్యం. ఆ దిశగా ప్రతి స్వరం వినిపించేలా, ప్రతి దేశం సహకరించేలా అంతర్జాతీయ వేదిక విస్తరణకు మనం శపథం చేశాం. తదనుగుణంగా మన కార్యాచరణ, ఫలితాలు చెట్టాపట్టాలతో సాగుతున్నాయని నేను ఘంటాపథంగా చెప్పగలను. నరేంద్ర మోదీ భారత ప్రధాని (సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జి–20 న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశం జరగనుంది.) -
2047 నాటికి అభివృద్ధి భారత్
న్యూఢిల్లీ: ప్రపంచ అభివృద్ధి ‘జీడీపీ కేంద్రిత విధానం’ నుంచి ‘మానవ కేంద్రిత విధానం’ వైపు మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ మోడల్ ప్రపంచ సంక్షేమానికి ఒక మార్గదర్శిగా మారుతోందని స్పష్టం చేశారు. జీడీపీ పరిమాణంతో సంబంధం లేకుండా ప్రపంచంలో ప్రతి దేశానికీ ప్రాముఖ్యం ఉందని పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా వార్తా సంస్థ ‘పీటీఐ’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక కొత్త ప్రపంచ క్రమం(వరల్డ్ ఆర్డర్) ఏర్పడిందని, కోవిడ్–19 తర్వాత మరో ప్రపంచ క్రమాన్ని చూస్తున్నామని చెప్పారు. మానవ కేంద్రిత అభివృద్ధి దిశగా ప్రపంచం పయనిస్తోందని, ఈ విషయంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. జీ20కి సారథ్యం వహిస్తున్న భారత్ ప్రపంచ దేశాల్లో విశ్వాసం అనే విత్తనాలు నాటిందని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. పేదరికంపై విజయం తథ్యం ‘‘చాలా ఏళ్ల క్రితం భారత్‌ను 100 కోట్లకుపైగా ఆకలితో అలమటించే ఖాళీ కడుపులున్న దేశంగా భావించేవారు. కానీ, ఇప్పుడు 100 కోట్లకుపైగా ఆకాంక్షలతో కూడిన హృదయాలు, రెండు కోట్లకుపైగా నైపుణ్యం కలిగిన చేతులు, కోట్లాది యువత ఉన్నదేశంగా భారత్‌ను చూస్తున్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఈ కాలమంతా ఒక మంచి అవకాశమే. గొప్ప అభివృద్ధికి పునాదులు వేసే అవకాశం ఈనాటి భారతీయులకు వచి్చంది. మనం సాధించే ప్రగతి రాబోయే వెయ్యేళ్లు గుర్తుండిపోతుంది. పేదరికంపై జరుగుతున్న యుద్ధంలో పేద ప్రజలు కచి్చతంగా విజయం సాధిస్తారు. విద్య, వైద్యం, సామాజిక రంగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించబోతున్నాం. దేశంలో అవినీతి, కులతత్వం, మతతత్వానికి ఎంతమాత్రం స్థానంలేదు. జీ20 కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహించడంలో వింతేమీ లేదే. అది సహజమే. భారత్ చాలా విశాలమైన, వైవిధ్యం కలిగిన దేశం. మన సొంత భూభాగంలో ఎక్కడైనా సదస్సులు నిర్వహించుకునే స్వేచ్ఛ మాకుంది. వాతావరణ మార్పులపై పోరాడే విషయంలో కేవలం ఒకే విధానం సరిపోదు. నిర్మాణాత్మక చర్యలుండాలి. వాతావరణ లక్ష్యాలను సాధించే విషయంలో ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోం. ఉగ్రవాద సంస్థలు టెక్నాలజీని విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి. కార్యకలాపాల కోసం డార్క్ నెట్, మెటావెర్స్, క్రిప్టోకరెన్సీ వేదికలను ఉపయోగించుకుంటున్నాయి. సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. ప్రపంచ సమస్యలకు భారత్ పరిష్కారం భారత్‌లో అమలవుతున్న మానవ కేంద్రిత అభివృద్ధి మోడల్‌ను ప్రపంచ దేశాలు గుర్తించి, అనుసరిస్తున్నాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగుతున్నాం. మన దేశాన్ని గతంలో కేవలం ఒక పెద్ద మార్కెట్‌గానే పరిగణించేవారు. ఇప్పుడు ప్రపంచ దేశాల ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్ పరిష్కార మార్గాలు చూపిస్తోంది. అప్పుల భారం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్ద ముప్పుగా మారుతోంది. ఉచిత పథకాలు అనేవి సరైన ఆలోచన కాదు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తేనే అభివృద్ధి వేగవంతమవుతుంది. ప్రపంచ పరిణామాలు మారిపోతున్నాయి. దానికి అనుగుణంగా ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితిలో అన్ని దేశాల గొంతుకలకు ప్రాతినిధ్యం దక్కాలి. జీ20లో ఆఫ్రియన్ యూనియన్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం కలి్పంచాలి. అందుకు మేము మద్దతు ఇస్తాం. అన్ని గొంతుకలను గుర్తించకుండా, ప్రాతినిధ్యం కలి్పంచకుండా.. ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ ప్రణాళిక కూడా సఫలం కాదు’’ అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. -
భారత్ వృద్ధి మరింత పైకి.. డెలాయిట్ ఇండియా
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) 6 నుంచి 6.3 శాతం వరకూ పురోగమిస్తుందని డెలాయిట్ ఇండియా తన తాజా ఎకనమిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితి తీవ్రత తగ్గితే వచ్చే రెండేళ్లలో 7 శాతం వరకూ కూడా వృద్ధి పురోగమించే అవకాశం ఉందని అంచనావేసింది. ప్రస్తుతం తీవ్ర అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిలోనూ భారత్ ఎకానమీ పటిష్ట పనితీరును ప్రదర్శిస్తున్నట్లు వివరించింది. ఇదీ చదవండి: ప్రపంచంలో టాప్ రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీ ఏదో తెలుసా? అర్బన్ డిమాండ్‌సహా దేశీయంగా ఆటోమొబైల్, యూపీఐ లావాదేవీలు, దేశీయ విమాన ప్రకాణాలు, ట్రాక్టర్ అమ్మకాలు, ఐఐపీ నాన్–డ్యూరబుల్ గూడ్స్, ఎంజీఎన్ఆర్ఈజీఏ గణాంకాలు.. పూర్తి సానుకూలంగా ఉన్నట్లు వివరించింది. (ఫెడ్ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే?) -
జీడీపీలో వ్యవసాయం వాటా మరింత పెరగాలి
న్యూఢిల్లీ: దేశ జీడీపీలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా మరింత పెరగాల్సి ఉందని, మార్కెటింగ్‌ను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌షా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రైతులు, తయారీదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు) కీలకపాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ విధానాలను అనుసరించడం మొదలు పెడితే వ్యవసాయం లాభదాయకంగా మారుతుందన్నారు. ఈ దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), ఎఫ్‌పీవోలు సాయంగా నిలుస్తాయన్నారు. ఎఫ్‌పీవోలు, పీఏసీఎస్‌లు హైబ్రిడ్ నమూనాలో కలసి పనిచేయాలని సూచించారు. ఇందులో భాగంగా 11,770 ఎఫ్‌పీవోలు ఒప్పందం ద్వారా పీఏసీఎస్‌తో అనుసంధానం కావాలని కోరారు. దీనికింద పీఏసీఎస్‌లకు ఎఫ్‌పీవోలు సేవలు అందించాలని సూచించారు. ‘‘తయారీ ద్వారా జీడీపీ వృద్ధి చెందితే ఉపాధి కల్పన భారీగా ఉండదు. అదే వ్యవసాయం, అనుబంధ రంగాలు వృద్ధి చెందిదే జీడీపీకే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అనుకూలిస్తుంది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అత్యధికంగా జీడీపీకి 17.5–18 శాతం వాటా సమకూరుస్తున్నాయి. కానీ, ఇతర రంగాల్లోని వారితో పోలిస్తే రైతుల పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఇతర రంగాల్లో మాదిరే రైతుల పరిస్థితులు మెరుగు పడాలంటే అందుకు ఎఫ్‌పీవోలను ఆమోదించాలి’’ అని అమిత్‌షా పేర్కొన్నారు. ఎఫ్‌పీవోల్లో రైతులు, తయారీదారులు (ఉత్పత్తిదారులు) భాగంగా ఉంటారు. వీరు చిన్న, సన్నకార రైతులకు సాగు, ముడి సరుకులు, సాంకేతిక సేవలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సహా అన్ని రకాల సేవలు అందిస్తుంటారు. మరిన్ని ఎఫ్‌పీవోలు ఇప్పటికే 11,770 ఎఫ్‌పీవోలు ఉండగా, 2027–28 నాటికి మరో 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దేశంలో 85 శాతం మంది చిన్న, సన్నకార రైతులే ఉన్నందున వ్యవసాయం లాభసాటిగా మారాల్సి ఉందని అమిత్‌షా పేర్కొన్నారు. ఇందుకోసం ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ విధానాలు అవసరమని సూచించారు. ‘‘ఎఫ్‌పీవోల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. కానీ, సహకార రంగంలో ఎఫ్‌పీవోలు, వాటి వల్ల ప్రయోజనాలు పరిమిత స్థాయికే చేరుకున్నాయి. పీఏసీఎస్‌ల ద్వారా 1,100 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని ఇటీవలే నిర్ణయించాం’’అని అమిత్‌షా తెలిపారు. వ్యవసాయ మౌలిక నిధికి మద్దతుగా నిలవాలి బ్యాంక్‌లను కోరిన వ్యవసాయ శాఖ వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి (రూ.లక్ష కోట్లు)కి ప్రోత్సాహంగా నిలవాలని కేంద్ర వ్యవసాయ శాఖ కోరింది. సాగు రంగంలో మౌలిక వసతులు కల్పించేందుకు ఇది తప్పనిసరి అవసరంగా పేర్కొంది. సాగు అనంతరం నిల్వ వసతుల నిర్వహణ, కమ్యూనిటీ సాగు తదితర చర్యల కోసం 2020 జూలై 8న కేంద్ర సర్కారు వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనా నిధి (ఏఐఎఫ్)ని ప్రారంభించింది. ఈ పథకం కింద 2025–26 నాటికి రూ.లక్ష కోట్లను బ్యాంక్‌లు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇది వడ్డీ రాయితీ, కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన పథకం. ఇందుకోసం కొత్త ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రారంభించారు. ‘‘నెల రోజుల పాటు (ఆగస్ట్ 15 వరకు) ఇది కొనసాగుతుంది. ఈ కాలంలో రూ. 7,200 కోట్లను మంజూరు చేయాలి. ఈ వీడి యో కాన్ఫరెన్స్ సమావేశానికి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రాంతీయ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోపరేటివ్ బ్యాంక్‌ల ఎగ్జిక్యూటివ్‌లు హాజరయ్యారు’’అని అహుజా తెలిపారు. దేశంలో వ్యవసాయ మౌలిక ప్రాజెక్టులకు గణనీయమైన అవకాశాలున్నాయని చెప్పారు. -
పడుతూ లేస్తూ.. పైపెకి!... ఒడిదొడుకుల మధ్య ఆర్థికాభివృద్ధి
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పదేళ్లలో ఎంతో అభివృద్ధిని సాధించినట్లు రాష్ట్ర ప్ర భుత్వం ప్రకటించింది. అనేక సవాళ్లను అధిగమించి వివిధ రంగాల్లో గణనీయ ప్రగతిని సాధించడం వెనుక జిల్లాల విభజన, జిల్లాలు సాధించిన జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ), తలసరి ఆదాయం (పీసీఐ)కారణంగా పేర్కొంది. రాష్ట్రం ఏర్పడక ముందు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్జీఎఫ్)కింద ఉన్న తొమ్మిది జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ ఒకటి కాగా.. ఆతర్వాత అభివృద్ధిలో అన్ని రంగాల్లో పురోగతి సాధించింది. పదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి సూచికలో ఉమ్మ డి వరంగల్ జిల్లా భాగస్వామ్యం కూడా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ ఆర్థికాభివృద్ధి–10’ నివేదికలో వెల్లడించింది. ఆర్థిక వృద్ధి రేటులో హనుమకొండ టాప్–2 ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. 2021–22 సంవత్సరానికి ఆర్థిక వృద్ధిలో హనుమకొండ జిల్లా టాప్–2లో నిలిచినట్లు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ ఉత్తమ పనితీరు కనబర్చాయి. ప్రస్తుత ధరల ప్రకారం.. వరుసగా 34.2 శాతం, 24.9 శాతం వృద్ధి రేటుతో ఈరెండు జిల్లాలు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రంలోని 32 జిల్లాలు వృద్ధి రేటులో పురోగమించగా.. రూ.6,240 కోట్ల జీడీపీపీతో అన్నింటికన్నా చివరన ములుగు జిల్లా నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా.. అభివృద్ధి అంతా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా.. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా.. ఆర్థిక వృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు నివేదిక చెబుతోంది. భూపాలపల్లి భేష్ 2021–22లో రంగారెడ్డి జిల్లా రూ.7,58,102 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా..రూ.2,34,818తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచింది.వరంగల్ జిల్లా రూ.1,94,317తో 16వ స్థానం, రూ.1,86,278తో జనగామ 18, రూ.1,79,222లతో మహబూబాబాద్ 20, రూ.1,77,316తో ములుగు 21వ స్థానాల్లో నిలవగా.. హనుమకొండ రూ.1,56,086తో చివరి స్థానానికి చేరింది. బాగా పట్టణీకరణ జరిగిన జిల్లాలతో పోల్చితే.. మారుమూల గ్రామీణ జిల్లాలు తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హనుమకొండ జిల్లా కూడా తలసరి ఆదాయంలో వెనుకబడగా.. భూపాలపల్లి మినహా మిగతా జిల్లాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తలసరి ఆదాయం విషయంలో పదేళ్లలో వృద్ధిరేటు గణనీయంగానే పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆయా జిల్లాల ప్రజల సగటు ఆదాయం పెరుగుతూ వస్తోంది. హనుమకొండ జిల్లాలో 2015–16 సంవత్సరానికి తలసరి సగటు ఆదాయం రూ.77,378 ఉండగా.. అది కాస్తా.. 2021–22 నాటికి రూ.1,56,086కు పెరిగింది. వరంగల్ రూరల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జేఎస్ భూపాలపల్లిలోనూ తలసరి సగటు ఆదాయం పెరిగినట్లు నివేదికలో గణాంకాలు చెబుతున్నాయి. -
తొమ్మిదేళ్లలో జీఎస్డీపీ 155% వృద్ధి!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇటీవలి కాలంలో అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని.. జాతీయ వృద్ధి కంటే అధిక వృద్ధితో వేగంగా దూసుకుపోతోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2014–15 నుంచి 2022– 23 మధ్య 118.2శాతం పెరిగితే.. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఏకంగా 155.7శాతం వృద్ధి సాధించిందని తెలిపింది. 2014–15 నుంచి ఇప్పటివరకు తెలంగాణ సగటున ఏటా 12.5శాతం వృద్ధి నమోదు చేయగా.. జాతీయ వృద్ధి 10.5 శాతమేనని పేర్కొంది. 2014–15తో పోల్చితే 2022–23 నాటికి దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగిందని.. ఇదే సమయంలో దేశ జనాభాలో రాష్ట్ర వాటా మాత్రం అంతే ఉందని వివరించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 2022–23లో రాష్ట్రం 12.93 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి సాధించినట్టు తెలిపింది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూపొందించిన ‘ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ @ 10’ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ శనివారం ఈ నివేదికను ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్)’లో ఆవిష్కరించారు. అందులోని వివరాలివీ.. తలసరి ఆదాయంలో అగ్రగామి రాష్ట్ర తలసరి ఆదాయం 2014–15 రూ.1,12,162కాగా.. 2022–23 నాటికి రూ.3,08,732కి పెరిగింది. జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.79,118 నుంచి రూ.1,72,000కి చేరింది. గత తొమ్మిదేళ్లలో జాతీయ తలసరి ఆదాయం 9.2 శాతం వృద్ధి సాధించగా.. తెలంగాణ 12.1శాతం వృద్ధి నమోదు చేసింది. అందుబాటులో ఉన్న 16 రాష్ట్రాల తలసరి ఆదాయం వృద్ధి లెక్కలను పరిశీలిస్తే.. 2022–23లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రంగాల వారీగా వృద్ధి ఇదీ.. ► ప్రాథమిక రంగమైన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను పరిశీలిస్తే.. తెలంగాణ 2014–15లో ప్రస్తుత ధరల వద్ద 19.5శాతం వృద్ధి సాధించగా, 2022–23 నాటికి 21.1శాతానికి పెరిగింది. తొమ్మిదేళ్లలోనే ప్రాథమిక రంగంలో ఏడింతల వృద్ధి రేటును నమోదు చేసింది. ► ద్వితీయ రంగమైన తయారీ, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాల్లో రాష్ట్రం ప్రస్తుత ధరల వద్ద 2014–15 నుంచి 2022–23 మధ్య కాలంలో 186.2 శాతం వృద్ధి నమోదు చేసింది. ► రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, రవాణా, కమ్యూనికేషన్, ఇతర సేవలతో కూడిన తృతీయ రంగం అధిక చేయూత అందిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను స్థూల రాష్ట్ర విలువ జోడింపు (జీఎస్వీఏ)లో తృతీయ రంగం వాటా ఏకంగా 61.3శాతం కావడం గమనార్హం. సొంత పన్నుల ఆదాయంలో 266% వృద్ధి రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 2014–15లో రూ.29,288 కోట్లు ఉండగా.. 2022–23 నాటికి ఏకంగా 266శాతం వృద్ధితో రూ.1,06,949 కోట్లకు పెరిగింది. సగటున ఏటా 18.3శాతం వృద్ధి నమోదు చేసింది. రాష్ట్ర జనాభాపై అదనపు పన్నులు విధించకుండానే ఈ మేరకు ఆదాయం పెంచుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర బడ్జెట్ సైతం రూ.62,306 కోట్ల నుంచి రూ.2,04,085 కోట్లకు పెరిగినట్టు వివరించింది. -
భారత్‌లో తగ్గిన నిరుద్యోగం, ఎంతమేర తగ్గిందంటే?
ముంబై: దేశంలో నిరుద్యోగం మే నెలలో తగ్గుముఖం పట్టింది. 7.7 శాతానికి తగ్గినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అనే ప్రైవేటు పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఉపాధి లేమి 8.5 శాతంగా ఉండడం గమనించొచ్చు. ఏప్రిల్ నెలతో పోలిస్తే కార్మికుల భాగస్వామ్య రేటు మే నెలలో 1.1 శాతం తగ్గి 39.6 శాతంగా ఉన్నట్టు సీఎంఐఈ పేర్కొంది. ఏప్రిల్ నెలలో పెద్ద ఎత్తున పనుల్లోకి చేరడంతో మే నెలలో కార్మికుల భాగస్వామ్య రేటు తగ్గుతుందని అంచనా వేసిందేనని తెలిపింది. (SaradhaChitFundScam: పెట్టుబడిదారుల సొమ్ము రికవరీకి శారదా ఆస్తుల వేలం) దీనివల్ల మే నెలలో ఉపాధి కోసం అన్వేషించే వారి సంఖ్య తగ్గినట్టు వివరించింది. ఫలితంగా కార్మిక శక్తి 453.5 మిలియన్ల నుంచి 441.9 మిలియన్లకు తగ్గిందని సీఎంఐఈ ప్రకటించింది. కార్మికుల భాగస్వామ్య రేటు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. పట్టణాల్లో పనిచేసే కార్మికులు 4.5 మిలియన్లు తగ్గారు. ఏప్రిల్ నెలలో పట్టణాల్లో పనిచేసే కార్మికులు 147 మిలియన్లుగా ఉంటే, మే నెలలో 142.5 మిలియన్లకు తగ్గారు. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) పట్టణాల్లో ఉద్యోగుల సంఖ్యతోపాటు, నిరుద్యోగుల సంఖ్య కూడా తగ్గినట్టు యూఎంఐఈ వెల్లడించింది. పట్టణాల్లో కార్మిక శక్తి 129.5 మిలియన్లుగా ఉంటే, 13 మిలియన్లు నిరుద్యోగులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే మాదిరి ఉద్యోగం, నిరుద్యోగం రేటు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు 299.4 మిలియన్లుగా మే నెలలో ఉన్నారు. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 306.5 మిలియన్లుగా ఉంది. మరిన్ని బిజినెస్ వార్తలు, సక్సెస్ స్టోరీస్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఈ ఏడాది వృద్ధి 6 శాతానికిపైనే
భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి 7.2 శాతం వృద్ధి రేటును సాధించడం, దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం,అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాల నేపథ్యంలో ఎకానమీపై తాజా అంచనాలను పరిశీలిస్తే.. 2023–24లో వృద్ధి అంచనాలు అప్ అంతర్జాతీయ వృద్ధి అవుట్‌లుక్ బాగుంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖంగా పయనిస్తున్నాయి. సేవల ఎగుమతులు మెరుగుపడుతున్నాయి. 2022–23 క్యూ4లో భారత్ వృద్ధి అంచనాలకు మించి మెరుగ్గా 6.1 శాతంగా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో భారత్ ఎకానమీ ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నాం. వెరసి 2023–24లో వృద్ధి 6.2 శాతంగా ఉండవచ్చు. ఇక భారత్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే 2023–24లో క్రితం అంచనాలు 5.3 శాతంకన్నా తక్కువగా 5.1 శాతంగా సగటు నమోదుకావచ్చు. ప్రపంచ వృద్ధి అంచనాలను ఇప్పటికే 50 బేసిస్ పాయింట్లు పెంచి 2.6 శాతానికి పెంచడం జరిగింది. చైనా, యూరోపియన్ యూనియన్, అమెరికా నుంచి వెలువడుతున్న గణాంకాల సానుకూలత దీనికి కారణం. క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలో ఉన్న అనిశ్చితి పరిస్థితి ఇప్పుడు కనిపించడంలేదు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. – యూబీఎస్, స్విస్ బ్రోకరేజ్ సంస్థ ఈ సారీ రేట్ల పెంపు ఉండకపోవచ్చు ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలో ఉన్న నేపథ్యంలో జూన్ 8వ తేదీ సమీక్షా సమావేశంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటులో ఎటువంటి మార్పూ చేయకపోవచ్చు. మార్చిలో 5.7 శాతం వద్ద ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే. 2023లో సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా నమోదుకావచ్చు. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కన్నా ఇది తక్కువ. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో మే 2022 నుంచి ఆరు దఫాలుగా రెపో రేటును ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ పెంచుతూ వచ్చింది. ఈ కాలంలో రేటు 4 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. అయితే ఏప్రిల్ పాలసీ సమీక్షా సమావేశంలో అందరి అంచనాలకూ భిన్నంగా రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయించింది. అయితే భవిష్యత్ నిర్ణయం ద్రవ్యోల్బణం కట్టడిపై ఆధారపడి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. – గోల్డ్‌మన్ శాక్స్, వాల్‌స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ 2023–24లో 6.7% వరకూ.. దేశీయంగా పటిష్టంగా ఉన్న ఆర్థిక ఫండమెంటల్స్, ప్రభుత్వం భారీ మూలధన పెట్టుబడుల మద్దతుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.5–6.7 శాతం శ్రేణిలో వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. 2022–31 దశాబ్ద కాలంలో భారత్ సగటున అంతక్రితం దశాబ్దంతో పోల్చితే (6.6 శాతం) భారీగా 7.8 శాతం వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణాత్మక చర్యలు భారత్‌ను చక్కటి వృద్ధి పథంలో నడిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాం. భారతదేశం జీ–20 అధ్యక్ష పదవిని చేపట్టిన దృష్ట్యా, ఈ సంవత్సరం దేశానికి చాలా ముఖ్యమైనది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. దీని నుండి ఉత్పన్నమయ్యే అవకాశాలు మనకు ముఖ్యమైనవి. ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలో ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. భారత్ వృద్ధికి దోహదపడే అంశం ఇది. – ఆర్ దినేష్, కొత్తగా ఎన్నికైన సీఐఐ ప్రెసిడెంట్ -
అన్నీ అనర్థాలే.. 3.4 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం!
భూగోళం మండిపోతోంది.. ఎండ ప్రచండంగా మారుతోంది.. వాతావరణంలో మార్పులతో రుతువులు గతి తప్పుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఇతర శిలాజ ఇంధనాల మితిమీరిపోయిన వాడకంతో కర్బన ఉద్గారాలు అడ్డూఅదుçపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలతో భూతాపం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే ఉంటే ముందు ముందు మరిన్ని అనర్థాలు ఎదుర్కోబోతున్నాం. 2030కి భారత్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుందని ఆర్బీఐ నివేదిక హెచ్చరిస్తోంది. మండే ఎండలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. శ్రామిక శక్తి నిర్వీర్యమైపోతోంది. సూర్యుడు నిప్పులు కురిపిస్తూ ఉంటే శ్రామికులు సత్తువ కోల్పోతున్నారు. పని గంటలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ మార్పులతో మన దేశం ఆర్థికంగా కుదేలయ్యే దుస్థితి రాబోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదిక హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతే అందులో దాదాపుగా సగం 3.4 కోట్లు భారత్‌లోనేనని ఆర్బీఐ నివేదిక అంచనా వేసింది. ఇక స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 4.5 శాతం వరకు కోల్పోయే ముప్పు ఉందని హెచ్చరించింది....! వచ్చే ఐదేళ్లలో భగభగలే..! వచ్చే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల్లో భారీగా పెరిగిపోనున్నాయి. గ్రీన్హౌస్ గ్యాస్‌లు, çపసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావంతో ఎండ ప్రచండంగా మారుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. 2023–2027 మధ్యలో సగటు ఉష్ణోగతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా. వచ్చే అయిదేళ్లలో ఏదో ఒక ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడానికి 98% అవకాశం ఉంది. 2015 నుంచి ఉష్ణోగ్రతల్లో సగటు పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటూ వస్తోంది. ఆర్కిటిక్ కరిగి మంచు కరిగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. వందేళ్లలో ఒక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. వ్యవసాయం: భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. అత్యధికులు ఇప్పటికీ వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ సీజన్లే మారిపోతాయి. దీని వల్ల పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక రంగం కుదేలైపోతుంది. దాని ప్రభావంతో పట్టణాల్లో ధరాభారం పెరిగిపోతుంది. పరిశ్రమలు: పారిశ్రామిక రంగంలో నిర్వహణ వ్యయాలు తడిసిమోపెడయిపోతాయి. లాభా లు తగ్గుతాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త నియంత్రణలు పాటించాల్సి రావడంతో పెట్టుబడులు పెరుగుతాయి. సేవలు : ఆర్థిక సేవలపై ఒత్తిడి పెరిగిపోతుంది. అనారోగ్యాల బారిన పడేవారి సంఖ్య పెరిగి బీమా క్లెయిమ్‌లు పెరుగుతాయి. ప్రయాణాలు తగ్గి ఆతిథ్య రంగం కుదేలవుతుంది. శ్రామిక మార్కెట్: పర్యావరణ మార్పులతో ఉత్పాదకత తగ్గి వలసలు పెరుగుతాయి. ఎండలకు శ్రామికుల పని గంటలు తగ్గుతాయి. రుణాలు, మార్కెట్, లిక్విడిటీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలపైనా ప్రభావం పడనుంది. -
భారత్ ‘సేవలు’ పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఏప్రిల్‌లో గణనీయమైన ఫలితాన్ని నమోదుచేసుకుంది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్విసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 13 నెలల గరిష్ట స్థాయిలో 62కు ఎగసింది. మార్చిలో సూచీ 57.8 వద్ద ఉంది. కొత్త వ్యాపారాల్లో వృద్ధి, మార్కెట్ పరిస్థితుల సానుకూల వంటి అంశాలు ఈ పటిష్ట ఫలితానికి కారణమని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. నిజానికి ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సేవల సూచీ గడచిన 21 నెలల్లో వృద్ధి శ్రేణిలోనే ఉంది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సేవల రంగం మెజారిటీ వాటాను కలిగిఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఇంకా ఉపాధి అవకాశాలు ఈ రంగంలో భారీగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకు సంబంధించిన సర్వే పేర్కొంది. ఇదిలావుండగా, తయారీ, సేవల రంగం రెండూ కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా ఏప్రిల్‌లో 61.6గా నమోదయ్యింది. మార్చిలో సూచీ 58.4 వద్ద ఉంది. -
సాయం కాదు, సంక్షోభాలు ఆపాలి!
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ వద్ద ఉన్న వనరులు ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం ద్వారా లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చే రుణాల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఐఎంఎఫ్ కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. ఐఎంఎఫ్ తలకెత్తుకుంటున్న చాలా పనులు ఇతర సంస్థలు ఇంతకంటే మెరుగ్గా నిర్వహించగలవు. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్పగలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని. ఇదే సూత్రం ఐఎంఎఫ్కూ వర్తిస్తుంది. ఎలాగైతే వాతావరణ మార్పుల మీద ప్రపంచ బ్యాంక్ ఏమీ చేయలేకపోతున్నదో, దాని కవల అయిన ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) సంస్థ కూడా దాని ప్రధాన కార్యకలాపాలపై చేష్టలుడిగి చూస్తోంది. ప్రపంచ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది. కానీ అమెరికాలో బ్యాంకులు కుప్ప గూలాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపులకు లోనవుతోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచడటంతో ఎదుగుతున్న మార్కెట్లలో రుణాలకు డిమాండ్ పెరిగిపోతోంది. అయినా వీటిని ఎదుర్కోవడంలో ఐఎంఎఫ్ ప్రధాన భూమిక పోషించడం లేదు. లింగవివక్ష, మానవాభివృద్ధి వంటి అంశాల మీద దృష్టి పెడుతూ– అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు సంక్షోభాలను ఎదుర్కొ నేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు వృద్ధిని పెంచుకునేలా, పేదరి కాన్ని తగ్గించుకునేలా రూపొందించే కార్యక్రమాల మీద ఐఎంఎఫ్ తన మొత్తం శక్తిని వెచ్చిస్తోంది. కానీ ఇతర సంస్థలు కూడా ఈ పనులు మెరుగ్గా నిర్వహించగలవు. నిఘా నామమాత్రం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఐఎంఎఫ్‌పై ప్రధానంగా ఆరు అభ్యంతరాలు వినిపిస్తాయి! ఆర్థిక మార్కెట్ల అస్థిరత్వానికి దారితీసే ఓపెన్ కేపిటల్ మార్కెట్లకు అవసరానికి మించి మద్దతివ్వడం వీటిల్లో ఒకటి. ఇక రెండో విమర్శ... అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలకు భిన్నమైన సలహాలివ్వడం. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలపై నిఘా నామమాత్రంగా సాగడం, ఆ దేశాల విధానాలపై విశ్లేషణ కూడా అంతంతమాత్రంగానే చేయడం మూడో విమర్శ. దీని ప్రభావం చిన్న దేశాలపై కూడా పడుతుందన్నది ఇక్కడ గమనించా ల్సిన విషయం. ప్రపంచస్థాయి సంక్షోభాలను ముందుగానే గుర్తించగలిగే ఐఎంఎఫ్ అసమర్థత కూడా దీనికి జత కలుస్తుంది. ఇప్పుడు నాలుగో విమర్శ విషయానికి వద్దాం. ఐఎంఎఫ్ చేపట్టే కార్యక్రమాల పరిమాణం ఏకపక్షంగా ఉంటుంది. గ్రీస్, పోర్చుగల్, ఐర్లాండ్ వంటి చిన్న యూరోపియన్ దేశాలు తమ కోటా కంటే 30 రెట్లు అదనంగా ఐఎంఎఫ్ ప్రయోజనాలు పొందుతూంటాయి. ఒక వైపు యుద్ధం జరుగుతూండగా, ఉక్రెయిన్ లో సుమారు 1500 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టును హడావిడిగా ఆమోదించారు. ఇదే సమయంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక కేవలం 300 కోట్ల డాలర్ల సాయం కోసం నెలలు వేచి చూడాల్సి వచ్చింది. శ్రీలంకకు మిత్రుడని చాటుకున్న చైనా కూడా సాయం కోసం ఏడాదిపాటు నిరీక్షింపజేసిన విషయం గమనార్హం. జీ7 దేశాల రాజకీయ మద్దతు లేకుంటే ఇంతకంటే చాలా తక్కువ మొత్తాలకు కూడా చిన్న దేశాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇలా చిన్న మొత్తాలను తీసుకున్నప్పుడు పొదుపునకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలూ తక్కువగా ఉంటాయి. బకాయిల వల్ల రుణాలివ్వడం నిలిపేసిన తరువాత కూడా ఐఎంఎఫ్ వరుసగా రుణాలిస్తోందన్నది ఐదవ విమర్శ. ఈ రుణాలు దివాళా తీయడానికే కాకుండా, ద్రవ్య లభ్యత లేమికీ ఇస్తూండటం గమనార్హం. ఐఎంఎఫ్ తరచూ ప్రైవేట్ రుణదాతలకూ డబ్బులిస్తూంటుంది. అది కూడా వారి వాణిజ్య ప్రభుత్వాలకిచ్చిన రుణాలు ప్రజా రుణంగా మారిన తరువాత కూడా. ఈ రుణాలను చెల్లించాల్సిన బాధ్యత పౌరు లపై పడుతుంది. ఐఎంఎఫ్ సభ్యదేశాల్లో 25 శాతం (48) తమ సభ్యత్వ కాలంలో సగంకాలం రుణగ్రహీతలుగా కొనసాగుతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే, ఐఎంఎఫ్ ప్రాపకంలో ఉన్నాయన్నమాట. చివరిగా ఐఎంఎఫ్‌పై ఉన్న ఆరో విమర్శ... ఐక్యరాజ్య సమితి లోని పలు విభాగాలు లేదా బ్యాంకులు చేయదగ్గ పనుల్లో ఐఎంఎఫ్ వేలు పెడుతూండటం. రెసిలియన్్స అండ్ ట్రస్ట్ ఫెసిలిటీ పేరుతో ఏర్పాటు చేసుకున్న కొత్త పథకం ద్వారా ఇరవై ఏళ్ల గరిష్ఠ పరిమితితో సామాజిక కార్యక్రమాలకు రుణాలిస్తోంది. ఇది కాస్తా ఐఎంఎఫ్‌ను ఏదో అంతర్జాతీయ సహాయ సంస్థ స్థాయికి మార్చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచస్థాయి సమస్యలకు పనికిరాదు? 2008–09 ఆర్థిక మాంద్యం, 2020 నాటి కోవిడ్, తాజాగా రష్యా– ఉక్రెయిన్ యుద్ధం... ఈ అంశాలపై ఐఎంఎఫ్ వ్యవహారశైలిని గమనిస్తే, తనకున్న నియమ నిబంధనలు, వనరులను దృష్టిలో ఉంచుకుంటే... అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోగల సత్తా ఈ సంస్థకు లేదనే చెప్పాల్సి వస్తుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, ఆయా ప్రాంతాల్లోని దేశాలు చేసుకునే ఒప్పందాల ప్రకారం లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చేదాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఐఎంఎఫ్ వద్ద ఉన్న వనరులు ఇప్పుడు సుమారు లక్ష కోట్ల డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. ఇది ఒకట్రెండు దేశాల ఆర్థిక సంక్షోభాలను గట్టెక్కించేందుకూ ఉపయోగపడని పరిస్థితి. అంతర్జాతీయ సంక్షోభాల మాట సరేసరి. ఈ మొత్తంలోనూ సగం సొంత వనరుల నుంచి సమ కూర్చున్నవి కాగా, మిగిలిన సగం విచక్షణపై లభించే రుణ ఏర్పాట్లు. ఐఎంఎఫ్ మూలధనాన్ని కనీసం రెట్టింపు చేయాల్సిన అవస రముంది. అలాగే జీడీపీ ఆధారంగా ఎప్పటికప్పుడు సర్దుబాట్లూ చేయాలి. రుణాలపై సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్న ఈ తరుణంలో ఇది మరీ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఐఎంఎఫ్ ప్రాంతీయ స్థాయిలో లిక్విడిటీ ఏర్పాట్లు చేయడం ద్వారా సూక్ష్మ స్థాయిలో ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటునందించాలి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) కింద సుమారు 660.7 బిలియన్లు ఉండగా(ఇది కరెన్సీ కాదు) ఇవి సుమారు 950 బిలియన్ డాలర్లకు సమానం. అంటే ప్రపంచ జీడీపీలో ఒక శాతం కంటే కొంచెం ఎక్కువ. ఒక్కో ఎస్డీఆర్ జారీ రాజకీయ ప్రభావానికి గురవుతూంటుంది. ఎస్‌డీఆర్‌లు ఐదేళ్లకు ఒకసారి ఆటోమెటిక్‌గా జారీ అయ్యేలా చూడాలి. అలాగే వీటి మొత్తం జీడీపీలో కనీసం ఒక్కశాతం ఉండేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు ఎక్కువ షేర్లు కేటాయించేలా ఏర్పాట్లు చేయా ల్సిన అవసరముంది. అయితే ఈ అంశాలపై ఏకాభిప్రాయం ఇప్పు డున్న పరిస్థితుల్లో చాలా కష్టం. చిట్ట చివరి రుణ వితరణ సంస్థగా ఉండాలి ఆర్థిక వ్యవస్థకు కేంద్రబిందువుగా సంస్కరణలకు లోనైన ఐఎంఎఫ్ ఉండాలి. అలాగే ఇది కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. సూక్ష్మస్థాయిలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయాలే గానీ... సాయం చేసే సంస్థగా మారకూడదు. ఐఎంఎఫ్‌ను చిట్టచివరి రుణ వితరణ సంస్థగా మాత్రమే పరిగణించాలి. ఉనికిలో ఉండేందుకు మాత్రమే కొత్త కొత్త పథకాలను సృష్టించడం, రుణ వితరణ చేపట్టడం చేయరాదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్ప గలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని. సెంట్రల్ బ్యాంక్స్ పరస్పర సహకారాన్ని ఐఎంఎఫ్ ప్రోత్సహించాలి. అలాగే ప్రాంతీయ స్థాయిలో సహాయానికి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. గతంలో ఇలాంటి ప్రయత్నాలను ఐఎంఎఫ్ నిరోధించిన మాట అందరికీ తెలిసిందే. అన్ని దేశాలకు సాయం చేసే ఏకైక సంస్థగా మారడం కాకుండా... ఆర్థిక సుస్థిరత కోసం బహుముఖీనంగా పని చేసే మరింత శక్తిమంతమైన వ్యవస్థగా ఎదిగేందుకు ఐఎంఎఫ్ ప్రయత్నించాలి. అజయ్ ఛిబ్బర్ వ్యాసకర్త జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో విజిటింగ్ స్కాలర్ (‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
భారత్ వృద్ధి రేటుకు ప్రపంచ బ్యాంక్ కోత
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6.3 శాతానికి పరిమితమవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ మేరకు క్రితం అంచనాలను 6.6 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, ఆదాయ వృద్ధి మందగమనం, అధిక ధరలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తన క్రితం అంచనాల తాజా తగ్గింపునకు కారణమని దక్షిణాసియాకు సంబంధించి ఆవిష్కరించిన నివేదికలో బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక (స్ప్రింగ్) సమావేశాలకు ముందు వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా) హన్స్ టిమ్మర్ ఈ నివేదిక విడుదల చేశారు. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు... ♦ బలహీన వినియోగం, కఠిన వడ్డీరేట్ల వ్యవస్థ ముఖ్యంగా ప్రభుత్వ ప్రస్తుత వ్యయ నియంత్రణ అంచనాల డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణం. ♦ దక్షిణాసియాలోని అనేక ఇతర దేశాల కంటే భారతదేశంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆర్థిక రంగంలో పరిస్థితి ఇతర దేశాల కంటే బాగుంది. భారతదేశంలోని బ్యాంకులు పటిష్ట స్థితిలో ఉన్నాయి. మహమ్మారి తర్వాత బ్యాంకింగ్ చక్కటి రికవరీ సాధించింది. ఆర్థిక వ్యవస్థలో తగిన రుణాలకుగాను లిక్విడిటీ బాగుంది. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే ప్రైవేట్ పెట్టుబడులు చాలా బలంగా ఉన్నాయి. సమస్యల్లా దేశం తన సామర్థ్యాన్ని తక్కువ స్థాయిలో వినియోగించుకోవడమే. ♦ భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది. అసంఘటిత రంగం ఉత్పాదకత పెరుగుతోందన్న దాఖలాలు లేవు. అలాగని ఫలితాలూ మరీ అధ్వానంగానూ లేవు. ఆయా అంశాలను పరిశీలిస్తే అన్ని వర్గాల భాగస్వామ్యంతో వృద్ధిని మరింత పెంచడానికి భారత్ ముందు భారీ నిర్మాణాత్మక ఎజెండా ఉందని భావిస్తున్నాం. ♦ విదేశాల నుండి ప్రైవేట్ పెట్టుబడులు మరింత పెరగాలి. ముఖ్యంగా సేవల రంగాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇందుకుగాను సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళ్లాలి. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఉద్గారాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలి. దక్షిణాసియా దేశాలపై ఇలా.. స్వల్పకాలికంగా చూస్తే, భారత్ దక్షిణాసియాలో ఇతర దేశాలకంటే పటిష్ట ఎకానమీని కలిగి ఉంది. భూటాన్ మినహా ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు తమ వృద్ధి అంచనాలను కుదించుకుంటున్నాయి. గత ఏడాది విపత్తు వరదల ప్రభావంతో పాకిస్తాన్ ఇంకా సతమతమవుతూనే ఉంది. సరఫరాల వ్యవస్థకు తీవ్ర అంతరాయాలు ఎదురవుతున్నాయి. పెట్టుబడిదారుల విశ్వాసం దిగజారుతోంది. అధిక రుణ, మూలధన వ్యయాలు భారమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ వృద్ధి ఈ ఏడాది 0.4 శాతానికి తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక రుణ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఎకానమీలో వృద్ధి లేకపోగా, ఇది ఈ ఏడాది 4.3% క్షీణిస్తుందన్నది అంచనా. పర్యాటకం ఊపందుకోవడం మాల్దీవులు, నేపాల్‌కు సానుకూల అంశాలైనా, అంతకుమించి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావాలు ఈ దేశాలు ఎదుర్కొననున్నాయి. దక్షిణాసియాలో 2023లో 8.9 శాతం ద్రవ్యోల్బణం అంచనాలు ఉన్నాయి. 2024లో ఇది 7% లోపునకు తగ్గవచ్చు. అయితే బలహీన కరెన్సీలు పెద్ద సమస్యగా ఉంది. ద్రవ్యోల్బణం భయాలను పెంచే అంశమిది. వృద్ధి 6.4 శాతం: ఏడీబీ ఇదిలాఉండగా, 2023–24లో భారత్ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అవుట్‌లుక్ ఒకటి పేర్కొంది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసిన ఏడీబీ, 2023–24లో ఈ రేటు తగ్గడానికి కఠిన ద్రవ్య పరిస్థితులు, చమురు ధరలు పెరగడాన్ని కారణంగా చూపింది. కాగా, 2024–25లో వృద్ధి రేటు 6.7 శాతానికి పెరుగుతుందని ఏడీబీ అంచనావేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పెరగడం దీనికి కారణంగా చూపింది. రవాణా రంగం పురోగతికి, వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఫలితాలు ఇస్తాయని ఏడీబీ వివరించింది. అంతర్జాతీయంగా పలు దేశాలు మాంద్యం ముంగిట నుంచున్నప్పటికీ, భారత్ ఎకానమీ తన సహచర దేశాల ఎకానమీలతో పోల్చితే పటిష్టంగా ఉందని ఏడీబీ కంట్రీ డైరెక్టర్ టకియో కినీషీ పేర్కొన్నారు. -
విధాన లోపం వ్యవస్థకు శాపం
2023 ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 4.4 శాతం స్థూల జాతీయ వృద్ధి రేటును మాత్రమే సాధించగలిగింది. ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ జీడీపీ పతనం భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలలో అది 1 శాతానికి లోపు పరిమితమైంది. ఈ దేశాలన్నింటికీ ఉన్నటువంటి కీలక సారూప్యత – ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయిలో ఉండడం. ఈ దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగుల వేతనాల పెరుగుదల బలహీనంగా ఉంది. ప్రభుత్వ విధానాలు మెజారిటీ ప్రజానీకానికి నష్టం కలిగించేవిగా ఉండడం వలననే జీడీపీ దారుణంగా పతనమయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కాలానికి సంబం ధించి డిసెంబర్ 2022తో ముగిసిన మూడవ త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 4.4 శాతం స్థూల జాతీయ వృద్ధి (జీడీపీ) రేటును మాత్రమే సాధించగలిగింది. అంతకు ముందరి త్రైమాసిక వృద్ధి రేటు 6.3 శాతం కంటే ఇది గణనీయమైన పతనం. 2022 ఆర్థిక సంవత్సరం తాలూకూ మూడవ త్రైమాసికంలోని 5.2 శాతం కంటే కూడా ఇది తక్కువ. ఈ జీడీపీ దిగజారుడు మన దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొంటున్న అనేక సమస్యలకు ప్రతిబింబం. వృద్ధి రేటును లెక్కించేందుకు పరిగణనలోకి తీసుకునే అంశా లుగా వ్యక్తిగత వినియోగం, ప్రభుత్వ వినియోగం లేదా వ్యయాలు, పెట్టుబడులు, నికర ఎగుమతులు ఉంటాయి. వీటిలో వ్యక్తిగత విని యోగానిది అతిపెద్ద వాటా. అది దేశీయ జీడీపీలో 55 నుంచి 60 శాతం మేరకు వాటాని కలిగి ఉంటుంది. కాగా, ఇది ప్రస్తుతం అంతకు ముందరి మూడవ త్రైమాసికంలోని వృద్ధి రేటుతో పోలిస్తే కేవలం 2.1 శాతం మాత్రమే ఎదుగుదలను చూపింది. ప్రస్తుత జీడీపీ వృద్ధి రేటు పతనం వెనుక వ్యక్తిగత వినియోగ పతనం ఉందన్నది గమనించాల్సిన అంశం. ఈ వ్యక్తిగత వినియోగం తగ్గటం వెనుక అసమానతలతో కూడిన ఆర్థిక అభివృద్ధి ఉంది. దీనినే మనం ఆంగ్లాక్షరం ‘కే’ పై గీత, కింది గీతలతో పోలుస్తున్నాం. పై గీతను పోలిన ధనవంతులు మరింతగా ధనవంతులవుతుండగా, కింది గీతను పోలిన సామాన్య జనం మరింత కిందికి దిగజారుతున్నారు. ఈ అసమానతల అభివృద్ధికి వక్కాణింపుగా – ఇండియా రేటింగ్స్ సంస్థ ఆర్థిక వేత్త సునీల్ కుమార్ సిన్హా మాటలను చెప్పుకోవచ్చు: ‘ప్రస్తుత వినియోగ డిమాండ్ అనేది ప్రధానంగా ఉన్నత ఆర్థిక వర్గాలు వినియోగించే సరుకులు, సేవల నుంచే వస్తోంది. అంటే, ప్రస్తుతం దేశంలోని ప్రజల వ్యక్తిగత వినియోగంలో సింహభాగం – ఉన్నత ఆదాయ వర్గాల నుంచే వస్తోంది. మరో రకంగా చెప్పాలంటే – మెజారిటీ జన సామాన్యం కొనుగోళ్లు బల హీనంగా ఉన్నాయి.›ఫలితంగా అంతిమ లెక్కింపులో దేశంలో వ్యక్తిగత వినియోగం బలహీనపడుతోంది’. కోవిడ్ మహమ్మారి కాలంలో దేశంలో ప్రజల వినియోగం భారీగా పడిపోయింది. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం లభించిన తొలి దశలో ఈ వ్యక్తిగత వినియోగం పెద్దగంతులో పెరిగింది. కోవిడ్, లాక్ డౌన్ల కాలంలో ప్రజలు తమకు కావాల్సిన సరుకులు లేదా సేవల కొను గోళ్లను వాయిదా వేసి ఉంచడం... కోవిడ్ బెడద తగ్గగానే ఒక్కసారిగా కొనుగోళ్లు చేయడం ఈ పెద్దగంతు వినియోగ పెరుగుదలకు కారణం. ఒక మారు ఈ తరహా కొనుగోళ్లు పూర్తయి పోగానే, మరలా వినియోగం తగ్గుముఖం పట్టసాగింది. కోవిడ్ అనంతర కాలంలో కూడా జఠిలంగానే మిగిలి పోయిన నిరుద్యోగం, పడిపోతున్న దేశీయ ఎగుమతులు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలన్నీ కల గలిసి ప్రజల కొనుగోలు శక్తి దిగజారింది. కోవిడ్, లాక్డౌన్లు, అనంతరం కూడా సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున అప్పుల పాలయ్యారు. బంగారాన్ని తనఖా పెట్టడం భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే సామాన్య ప్రజల పొదుపు స్థాయి దారుణంగా పడి పోయింది. కొత్తగా అప్పులు చేయగల స్థితి కూడా లేకుండా పోయింది. జీడీపీ పతనం కేవలం భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలలో అది 1 శాతానికి లోపు పరిమి తమైంది. అంటే, భారతదేశంలో జీడీపి వృద్ధి, మిగత ప్రపంచం తాలూకూ సమస్యలతో సంబంధం లేకుండా, ప్రపంచంలోనే అత్యధి కంగా ఉంటుందనే కట్టుకథను ఇది వట్టిదిగా కొట్టేసింది. పైన పేర్కొన్న దేశాలన్నింటికీ ఉన్నటువంటి కీలక సారూప్యత – ఆయా దేశాలలో ఆర్థిక అసమానతలు అత్యంత తీవ్రస్థాయిలో ఉండడం. భారత్ సహా దరిదాపు ఈ దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగుల వేతనాల పెరుగుదల బలహీనంగా ఉంది. ఉదాహరణకు, అంత ర్జాతీయ కార్మిక సమాఖ్య గణాంకాల ప్రకారం 2008–11 కాలంలో మన దేశంలో నిజ వేతనాల పెరుగుదల 1 శాతం ప్రతికూల దిశగా ఉన్నది. అదే కాలంలో దేశంలో కార్మిక ఉత్పాదకత 7.6 శాతం పెరిగింది. పెరిగిన సంపద తాలూకు ప్రయోజనం కార్మికులు, ఉద్యోగు లకు దక్కక పోగా, వారికి అప్పటికే ఉన్న ఆర్థిక స్థితి దిగజారింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో జరుగుతోంది ఈ వేతనాల పతనమే. 2018 నాటి అంతర్జాతీయ కార్మిక సమాఖ్య తాలూకు ప్రపంచ వేతనాల నివేదిక కూడా ఈ అంశాన్నే చెబుతోంది. ఒక్క చైనా మినహా 2017లో ప్రపంచ వ్యాప్తంగా వేతనాల పెరుగుదల వార్షికంగా కేవలం 1.1 శాతం. జపాన్‌లో దశాబ్దాల కాలంపాటు ఉద్యోగులు, కార్మికుల వేతనాలు ఎదుగూ బొదుగూ లేకుండా స్తంభించిపోయి ఉన్నాయి. మొత్తంగా జీ 20 దేశాల్లో 2017లో నిజ వేతనాల వృద్ధి కేవలం 0.4 శాతం. చైనాలో 2015 నాటికే సరుకు ఉత్పత్తి రంగంలోని కార్మికుల 1 గంట కాలపు వేతనాలు, అప్పటికే అధిక ఆదాయ దేశాలుగా ఉన్న గ్రీస్, పోర్చుగల్‌తో సమానంగా ఉన్నాయి. దాని వలన అక్కడ యావన్మంది ప్రజల కొనుగోలు శక్తి తగినస్థాయిలో ఉంది. ఫలితంగానే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం తన దేశీయ ఎగుమతులు కొంత మేర తగ్గినా, స్వయంగా తన దేశంలోనే పెరిగిన ప్రజల కొనుగోలు శక్తి ద్వారా, ఆర్థిక వృద్ధిని కొనసాగించగలిగింది. ప్రస్తుతం తన జీరో కోవిడ్ పాలసీ, నిర్మాణ రంగం పట్ల కఠిన వైఖరి తరువాత కూడా చైనాలో కర్మాగారాల ఉత్పత్తి రికార్డు స్థాయిని అందుకుంది. దీనంతటికీ కారణం, కొనుగోలు శక్తి ప్రజానీకం అంతటిలోనూ విస్తారంగా పెరిగి ఉండడమే. మన దేశంలో నేడు సంస్కరణల పేరిట అమలు జరుగుతోన్న విధానాలు పొదుపు చర్యల రూపంలో ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. ఈ పొదుపు చర్యల వల్ల ప్రతీ సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలపై కోతలు పడుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కూడా ఆహారం, ఎరువులు, ఇంధన సబ్సిడీలు, జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక సంక్షేమ విధానాలపై కోతలు పడడం చూశాం. ఈ పొదుపు చర్యలలో భాగంగానే దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గణనీయంగా తగ్గిపోయింది. 2022లోనే దీనిలో 8.8 శాతం తగ్గుదల నమోదైంది. దీనంతటి ఫలితంగా ప్రజల ఉపాధి అవకాశాలు, కొనుగోలు శక్తి వేగంగా పడిపోతున్నాయి. దశాబ్దాల కాలం ప్రజల పన్నుల డబ్బు, శ్రమలతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు వేగంగా ప్రైవేటు పరం అవుతుండడం... దేశంలోని రోడ్లు, రైలు మార్గాలు, స్టేడియాలు ఇత్యాది సమస్త మౌలిక సదు పాయాల వ్యవస్థలూ నగదీకరణ పేరిట ప్రైవేట్ పరం అవుతుండడంతో – ప్రజల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే పేరిట (ద్రవ్యలోటు తగ్గింపు కోసం) నిత్యావసరాల పైన కూడా జీఎస్టీ వంటి పన్ను భారాలను మోపడం ప్రజల కొనుగోలు శక్తి పాలిట అశనిపాతంగా మారుతోంది. ప్రభుత్వ విధానాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్న విధంగా, మెజారిటీ ప్రజానీకానికి నష్టం కలిగించేవిగా ఉండడం వలననే జీడీపీ దారుణంగా పతనమయ్యింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్గం – ఇప్పటి వరకూ జరిగినట్లుగా కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు ఇస్తూ పోయి, జన సామాన్యంపై భారాలు మోపుతూ నిర్ణయాలు తీసు కోవడం కాదు. సంపదలో సాధ్యమైనంతగా కార్మికులు, ఉద్యోగులు, మధ్య తరగతి జనాలకు తగిన వాటాను కల్పించడం! ప్రస్తుత వృద్ధి రేటు పతనం, దానికి మూలంగా ఉన్న ప్రజల కొనుగోలు శక్తి పతనం వంటి వాటిని పరిష్కరించలేని పక్షంలో మున్ముందు దేశ ఆర్థిక సమస్యలు మరింత జఠిలం కాగలవు. డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
అభివృద్ధిలో ‘బ్లూ ఎకానమీ’ కీలకపాత్ర
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ‘బ్లూ ఎకానమీ’ కీలక పాత్ర పోషించనుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) గిరీష్ చంద్ర (జీసీ) ముర్ము విశ్లేషించారు. సుస్థిర వృద్ధి, సామాజిక, ఆర్థిక సంక్షేమం వంటి అంశాల విసృత ప్రాతిపదికన ఎకానమీ పురోగతికి సంబంధించి మున్ముందు బ్లూ ఎకానమీ కీలకం కానుందని ఆయన అన్నారు. బ్లూ ఎకానమీ ఇస్తున్న అవకాశాలు, సవాళ్లు అన్న అంశంపై ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► భారత్ 7,517 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలు, 1,382 ద్వీపాలను కలుపుతోంది. సముద్ర తీవ్ర ప్రాంత ఆర్థిక వ్యవస్థ 40 లక్షలకు పైగా మత్స్యకారులకు, ఇతర తీర ప్రాంత వర్గాలకు చక్కటి ఆర్థిక అవకాశాలను అందిస్తోంది. ► ఇక దాదాపు 199 ఓడరేవులు ఉన్నాయి, వీటిలో 12 ప్రధాన ఓడరేవులు ప్రతి సంవత్సరం సుమారు 1,400 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు దోహదపడుతూ, దేశ పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ► రెండు మిలియన్ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి క్రూడ్, సహజవాయువులుసహా విస్తారమైన వనరులను కలిగిఉంది. ► సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్డీజీ) సాధనకు బ్లూ ఎకానమీ కీలక భూమికను పోషించనుంది. బ్లూ ఎకనమీ అంటే.. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం క్లుప్తంగా బ్లూ ఎకానమీ అర్థాన్ని పరిశీలిస్తే... ఇది సము ద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ. సముద్ర పర్యావరణ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ఇందుకు అనుగుణమైన ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవనోపాధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం దీని లక్ష్యం. ఉపాధి కల్పన మెరుగుదలకు సముద్ర వనరుల ను స్థిరంగా, పటిష్ట స్థాయిలో వినియోగించుకోవడాన్ని ఇది సూచిస్తుంది. ‘‘సముద్రాలు, సముద్ర తీరాలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలే బ్లూ ఎకానమీ’’ అని యూరోపియన్ కమిషన్ నిర్వచించింది. 2022–2023లో భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడంతో, ఈ సందర్భంగా బ్లూ ఎకానమీకి సంబంధించి జరుగుతున్న ఎస్ఏఐ20 సదస్సు బాధ్యతలను కాగ్ నిర్వహిస్తున్నారు. బ్లూ ఎకానమీపై అధ్యయనంపై ఈ సదస్సు దృష్టి పెట్టనుంది. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధికి ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను, విధానాలను ఎలా రూపొందించవచ్చు, అమలుచేయవచ్చు వంటి అంశాలపై ఎస్ఏఐ20 అధ్యయనం చేస్తుంది. -
దూసుకుపోతున్న డిజిటల్ ఎకానమీ
ముంబై: డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలు మరింతగా వృద్ధి చెందుతాయని, 2028–29 ఆర్థిక సంవత్సరం చివరికి అదనంగా సమకూరే దేశ జీడీపీలో పావు వంతు వాటా ఆక్రమిస్తాయని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ అంచనా వేశారు. 2029 మార్చి నాటికి దేశ జీడీపీ 7 ట్రిలియన్ డాలర్ల స్థాయిని చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం మన దేశ జీడీపీలో డిజిటల్ ఆర్థిక కార్యకలాపాల వాటా 4 శాతంగా ఉంటే, చైనాలో 40 శాతంగా ఉండడం గమనార్హం. డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలు అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కామర్స్, డిజిటల్ చెల్లింపులు, సేవలు తదితర వాటిని కామత్ ఉదాహరణగా పేర్కొన్నారు. చైనా జీడీలో డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలు 40 శాతం సమకూరుస్తున్నాయని, మన దగ్గరా ఆ స్థాయికి చేరుకోకపోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని కామత్ పేర్కొన్నారు. ఇన్ఫ్రా అభివృద్ధి బ్యాంక్ (నాబ్‌ఫిడ్) చైర్మన్‌గా ప్రస్తుతం కామత్ పనిచేస్తున్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థకు మరిన్ని మౌలిక సదుపాయాల అవసరం ఉంది. రవాణా, ఎక్స్‌ప్రెస్‌వే, హైవేలు, ఎయిర్‌పోర్ట్‌లు, ఓడరేవులు, రైల్వే నెట్‌వర్క్‌ల పరంగా మనం ఎంతో చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో ప్రజల రవాణాకు, వస్తు రవాణాకు వీలుగా ఎన్నో ఎక్స్‌ప్రెస్ రహదారులు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, పెద్ద ఎయిర్‌పోర్ట్‌లు వస్తాయి’’అని కామత్ వివరించారు. -
రికవరీకి అవకాశం
ముంబై: గత వారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన దేశీయ సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే అదానీ గ్రూప్ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతల కారణంగా భారీ లాభాలైతే ఉండకపోవచ్చు. అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) డిసెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు, ఫిబ్రవరి ఆటో అమ్మకాలు, తయారీ, సేవారంగ పీఎంఐ డేటాను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు తదితర సాధారణ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ కఠిన ద్రవ్య విధాన వైఖరి కొనసాగింపు సంకేతాలు, రష్యా – ఉక్రెయిన్– అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తెరపైకి రావడంతో సూచీలు గడిచిన ఎనిమిది నెలల్లో ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,539 పాయింట్లు, నిఫ్టీ 478 పాయింట్ల చొప్పున క్షీణించాయి. ‘‘వరుస నష్టాల మార్కెట్ వచ్చే వారం గట్టెక్కే వీలుంది. అయితే అగ్రరాజ్యమైన అమెరికా మార్కెట్లలో కరెక్షన్ ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తంగా., సూచీలు ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో ట్రేడవొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ కీలక మద్దతు స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. అమ్మకాలు కొనసాగి బడ్జెట్ రోజునాటి కనిష్ట స్థాయి(17,353)ని కోల్పోతే 17,050 –17,000 శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు. అనుకున్నట్లే రికవరీ కొనసాగితే 17,750–17,800 పాయింట్ల పరిధిలో నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది’’ అని ఏంజెల్ వన్ సాంకేతిక నిపుణుడు రాజేశ్ భోంస్లే తెలిపారు. బుధవారం డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ ఐపీవో కొన్ని నెలల విరామం తర్వాత ప్రైమరీ మార్కెట్ మళ్లీ యాక్టివ్ అయ్యింది. ఆటోమోటివ్ ఉపకరణాల తయారీ సంస్థ డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ ఐపీవో మార్చి ఒకటిన మొదలవనుంది. శుక్రవారం ముగియనున్న ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.180 కోట్లను సమీకరించనుంది. ఇందుకు 39 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయానికి పెట్టింది. ధర శ్రేణిని సోమవారం కంపెనీ వెల్లడించనుంది. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ ఫిబ్రవరి 24 తేదీ నాటికి ఎఫ్ఐఐలు రూ.2,313 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు ఎన్‌సీడీఎల్ డేటా చెబుతోంది. అయితే ఈ ఏడాది జన వరి విక్రయాలు రూ.28,852 కోట్లతో పోలిస్తే అమ్మకాలు భారీగానే తగ్గాయి. ‘‘అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు వెలువడిన నేపథ్యంలో వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐ లు వైదొలుగుతున్నారు. అయితే దక్షిణ కొరి యా, తైవాన్, చైనా దేశాలు ఈక్విటీలు చౌకగా లభిస్తున్నందున ఇన్వెస్టర్లు ఈ దేశాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్(క్యూ3) జీడీపీ గణాంకాలు ఈ మంగళవారం(ఫిబ్రవరి 28) కేంద్రం వెల్లడిస్తుంది. అదేరోజున జనవరి ద్రవ్యలోటు డేటా వెలువడుతుంది. మార్చి ఒకటిన(బుధవారం) ఆటో కంపెనీలు ఫిబ్రవరి హోల్‌సేల్ అమ్మకాల వివరాలు, ఫిబ్రవరి తయారీ పీఎంఐ డేటా వెల్లడి అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం సేవారంగ పీఎంఐ డేటా విడుదల అవుతుంది. అదే రోజున ఆర్బీఐ ఫిబ్రవరి 24 తేదీన ముగిసిన వారం నాటి ఫారెక్స్ నిల్వలు డిసెంబర్ 19వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ఇక అంతర్జాతీయంగా నేడు(సోమవారం) యూరోజోన్ ఫిబ్రవరి ఎకనామిక్స్, సర్విసెస్, పారిశ్రామిక సెంటిమెంట్ వివరాలు వెల్లడికానున్నాయి. అమెరికా, యూరోజోన్‌తో పాటు ఇతర ప్రధాన దేశాల తయారీ రంగ డేటా మార్చి ఒకటిన(బుధవారం) విడుదల అవుతుంది. యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా మార్చి రెండో తేదీన వెల్లడి కానుంది. ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. -
సరికొత్త సంచలనం.. ప్రపంచంలో ఐదో ఆర్ధిక శక్తిగా భారత్!
(ఎం. విశ్వనాధరెడ్డి, సాక్షి ప్రతినిధి): బలీయమైన ఆర్థిక శక్తిగా టాప్–5 దేశాల జాబితాలో చేరి భారత్ సంచలనం సృష్టించింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వస్తు, సేవల ఉత్పత్తి విలువ కోటి కోట్ల డాలర్లు దాటింది. ఇందులో 3.5 లక్షల కోట్ల డాలర్ల వాటాతో భారత్ ఐదో స్థానాన్ని దక్కించుకుని బ్రిటన్ను ఆరో స్థానానికి పరిమితం చేసింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం యాదృచ్ఛికం. బలీయమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా వినూత్న ఆవిష్కరణల సూచీలో మాత్రం భారత్ వెనుకంజలో ఉంది. బలం పుంజుకున్న ఆర్థిక వ్యవస్థకు వినూత్న ఆవిష్కరణలు తోడైతే భారత్ అద్భుతాలు సాధిస్తుందని మేధావులు పేర్కొంటున్నారు. ఈ దిశగా అడుగులు వేసి పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. జీడీపీలో సగం వాటా 5 దేశాలదే 2022లో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. ప్రపంచ దేశాల మొత్తం స్థూల ఉత్పత్తి కోటి కోట్ల డాలర్ల (100 ట్రిలియన్ డాలర్స్) మార్క్ దాటింది. ఇందులో 51 శాతం జీడీపీ అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్ నుంచే ఉంది. ఇక టాప్ 10 దేశాల్లో 66 శాతం జీడీపీ ఉంది. 84 శాతం టాప్ 25 దేశాల్లో ఉంది. మిగతా 167 దేశాల్లో కలిపి 16 శాతం మాత్రమే జీడీపీ ఉంది. అగ్రస్థానంలో స్విట్జర్లాండ్ జీడీపీలో 22వ స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ ప్రపంచ వినూత్న ఆవిష్కరణల సూచీలో పుష్కరకాలంగా తొలి స్థానంలో నిలుస్తోంది. ఇన్నోవేటివ్ ఇండెక్స్‌లో 64.6 స్కోరుతో 2022లో తొలిస్థానంలో నిలిచింది. 61.8 స్కోరుతో రెండో స్థానంలో ఉన్న అమెరికా పరిశోధన–అభివృద్ధిపై ఏటా 70 వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధన, అభివృద్ధిపై భారీగా వ్యయం చేస్తున్న నాలుగు కంపెనీలు అమెజాన్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, యాపిల్ అమెరికాలోనే ఉండటం గమనార్హం. ఐరాస రూపొందించిన వినూత్న ఆవిష్కరణల సూచీలో మన దేశానికి 40వ స్థానం దక్కింది. 36.6 పాయింట్ల స్కోరుతో భారత్ 40వ స్థానంలో ఉంది. జీడీపీలో రెండోస్థానంలో ఉన్న చైనా 55.3 పాయింట్ల స్కోరుతో వినూత్న సూచీలో 11వ స్థానంలో నిలిచింది. -
జీడీపీకి ‘డిజిటల్’ వర్కర్ల దన్ను: వారికి డిమాండ్ మామూలుగా ఉండదు!
న్యూఢిల్లీ: క్లౌడ్ ఇన్ఫ్రా లేదా సాఫ్ట్వేర్ అభివృద్ధికి సంబంధించి అధునాతన డిజిటల్ నైపుణ్యాలు గల ఉద్యోగులతో భారత స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 10.9 లక్షల కోట్ల మేర ఊతం లభించగలదని ఒక నివేదిక వెల్లడించింది. ఒకే తరహా విద్యార్హతలు ఉన్నప్పటికీ కార్యాలయాల్లో డిజిటల్ నైపుణ్యాలను ఉపయోగించని వారితో పోలిస్తే వాటిని ఉపయోగించే ఉద్యోగులు 92 శాతం అధికంగా వేతనాలు పొందగలరని పేర్కొంది. ఏడబ్ల్యూఎస్ తరఫున గాలప్ సంస్థ ఈ అధ్యయన నివేదికను రూపొందించింది. రెండు దశల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో 2,005 మంది ఉద్యోగులు, 769 సంస్థలు పాల్గొన్నాయి. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► ఈ అధ్యయనం కోసం ఈమెయిల్, వర్డ్ ప్రాసెసర్లు, ఇతరత్రా ఆఫీస్ ఉత్పాదకత పెంచే సాఫ్ట్వేర్, సోషల్ మీడియాను వినియోగించగలిగే సామర్థ్యాలను ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలుగా వర్గీకరించారు. ఇక వెబ్సైట్ డిజైన్, డేటా అనాలిసిస్లాంటి వాటిని మధ్య స్థాయి నైపుణ్యాలుగా.. క్లౌడ్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కృత్రిమ మేథ మొదలైన వాటిని అడ్వాన్స్డ్ డిజిటల్ నైపుణ్యాలుగా పరిగణించారు. ► అధునాతన డిజిటల్ నైపుణ్యాలు ఉపయోగించే వారిలో 91 శాతం మంది ఉద్యోగంపై సంతృప్తిగా ఉండగా, ప్రాథమిక నైపుణ్యాలు ఉన్న వారిలో ఇది 74 శాతంగా ఉంది. అలాగే, అడ్వాన్స్డ్ డిజిటల్ సామర్థ్యాలు గల ఉద్యోగులున్న సంస్థల్లో 80 శాతం కంపెనీలు అధిక వార్షికాదాయ వృద్ధి నమోదు చేస్తున్నాయి. అయితే ఇలాంటి వాటిల్లో 88 శాతం కంపెనీలు.. హైరింగ్పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ► తమ వ్యాపారాల్లో సింహభాగాన్ని క్లౌడ్‌పై నిర్వహించే భారతీయ సంస్థల్లో 21 శాతం కంపెనీలు రెట్టింపు ఆదాయాలు నమోదు చేస్తున్నాయి. క్లౌడ్‌ను కొద్దిగా వినియోగించే లేదా అస్సలు వినియోగించని కంపెనీల విషయంలో ఇది 9 శాతంగా ఉంది. క్లౌడ్ ఆధారిత సంస్థలు గత రెండేళ్లలో కనీసం ఒక కొత్తదైనా లేక మెరుగుపర్చిన ఉత్పత్తినైనా ప్రవేశపెట్టి ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి. ► వ్యాపారాలు, ప్రభుత్వ విభాగాలు డిజిటల్ బాట పట్టడం వేగవంతమవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో అడ్వాన్స్డ్ డిజిటల్ వర్కర్లకు డిమాండ్ భారీగా ఉండనుంది -
దేశ జీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం.. స్పందించిన కేంద్రం!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2013-14లో రూ. 89,796 రూపాయలుగా ఉన్న భారతదేశ జీడీపీ తలసరి 2021-22 నాటికి రూ.1,72,913 రూపాయలకు పెరిగిందని ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. దేశ జాతీయ ఆదాయంలో టాప్ 1 శాతం కలిగిన ధనికులు 40 శాతం, టాప్ 10 శాతం కలిగిన ధనికులు 57 శాతం ఉంటే, దిగువనున్న 57 శాతం మంది ప్రజలు జాతీయ ఆదాయంలో కేవలం 13 శాతం మాత్రమే కలిగి ఉన్నారన్న వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్-2022 గణాంకాలు వాస్తవమేనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్టు -2022 నివేదిక సందేహాస్పదంగా ఉండడంతో దానిని పరిగణలోకి తీసుకోలేమని అన్నారు. ఆ నివేదిక ఆధారంగా కోరిన వివరాలపై వ్యాఖ్యానించలేమని తెలిపారు. దేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు, వీక్షిత్ భారత్ ఉద్దేశాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌పై జీడీపీతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ఎంపీ విజయ సాయి రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏపీలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందా? ఢిఫెన్స్ కారిడార్లకు సేవలందించే విధంగా ఎన్సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ అందించనున్నారా? డిఫెన్స్ కారిడార్లలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏవైనా చేపట్టనున్నారా? ఉంటే వాటికి సంబంధించిన వివరాలు తెలపాలని అన్నారు. ఎంపీ అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఎన్సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ ఇచ్చే ఆలోచన లేదని చెప్పారు. యువతలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, వివేకం, జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించి తద్వారా వారు సమాజానికి నిస్వార్ధమైన సేవలు అందించడంతో పాటు, రక్షణ దళాల వైపు మొగ్గు చూపే లక్ష్యంతోనే ఎన్సీసీ కేడెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. -
వృద్ధికి ద్రవ్యోల్బణం దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వృద్ధి రేటుపై ద్రవ్యోల్బణం ప్రభావం పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు గణనీయంగా తగ్గనుందని ‘ముందస్తు ప్రాథమిక అంచనాలు (ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్/పీఏఈ)’ స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ధరల వద్ద 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ 19.4శాతం వృద్ధి రేటును నమోదుచేయగా.. 2022–23లో 15.6 శాతానికి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జాతీయ స్థాయిలో చూసినా.. 2021–22లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 19.5శాతం వృద్ధిరేటు నమోదు చేయగా.. 2022–23లో 15.4 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. రాష్ట్ర శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన తెలంగాణ సామాజిక–ఆర్థిక సర్వే–2023 నివేదికలో ఈ గణాంకాలను వెల్లడించింది. స్థిర ధరల వద్ద 7.4 % దేశ, రాష్ట్ర వృద్ధిరేటు తగ్గుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, సప్లై మందగమనం, డిమాండ్ తగ్గడంతో వృద్ధికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రధానంగా తయారీ రంగంపై ఈ ప్రభావం అధికంగా ఉందని తెలిపింది. ఇక గత ఏడాది (2021–22) సాధించిన 19.4శాతం భారీ వృద్ధిరేటుపై అంతకు మించిన వృద్ధిరేటును ఈ ఏడాది ఆశించడం సాధ్యం కాదని వివరించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014–15 నుంచి 2019–20 వరకు జాతీయ సగటును మించి వృద్ధిరేటును తెలంగాణ నమోదు చేసిందని.. కోవిడ్ తర్వాత కాలంలో జాతీయ సగటుతో సమానంగా వృద్ధి రేటు కొనసాగుతోందని పేర్కొంది. ఇక స్థిర (2011–12 నాటి) ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 7.4 శాతం, దేశ జీడీపీ వృద్ధి రేటు 7శాతం ఉంటుందని అంచనా వేసింది. తగ్గిన నిరుద్యోగం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్) ప్రకారం రాష్ట్ర లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్ఎఫ్పీఆర్) 65.4 శాతంగా ఉంది. ఏదో ఒక పనిచేస్తూ లేదా ఏదైనా పనికోసం ఎదురు చూస్తున్న 15–59 ఏళ్ల జనాభా శాతాన్ని ఎల్ఎఫ్పీఆర్గా పరిగణిస్తారు. ఈ సర్వే ప్రకారం.. 2019–20తో పోల్చితే 2020–21లో రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 7.5 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) డేటా ప్రకారం.. 2022 ఏప్రిల్‌తో పోల్చితే 2022 డిసెంబర్లో రాష్ట్ర నిరుద్యోగ రేటు 9.9 శాతం నుంచి 4.1 శాతానికి దిగొచ్చింది. ముఖ్యంగా పట్టణాల్లోనే నిరుద్యోగం అధికంగా ఉంది. 2019–20తో పోల్చితే 2020–21లో గ్రామీణ నిరుద్యోగం 5.7శాతం నుంచి 3.6శాతానికి, పట్టణ నిరుద్యోగం 10.7శాతం నుంచి 8శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో పురుషుల్లో నిరుద్యోగం 8.4శాతం నుంచి 5.5 శాతానికి, మహిళల్లో నిరుద్యోగం 6.1 శాతం నుంచి 4.5శాతానికి తగ్గాయి. పెరిగిన ఉద్యోగ భద్రత సామాజిక–ఆర్థిక సర్వే ప్రకారం.. రాష్ట్రంలో ఉద్యోగులకు సదుపాయాలు, భద్రత క్రమంగా పెరుగుతున్నాయి. 2019–20తో పోల్చితే 2020–21లో పెయిడ్ లీవ్‌కు అర్హతగల ఉద్యోగులు 45.2శాతం నుంచి 50.9శాతానికి.. పెన్షన్లు, ఆరోగ్య సేవలు వంటి సదుపాయాలు కలిగిన ఉద్యోగులు 40.8శాతం నుంచి 46.9శాతానికి పెరిగారు. రాతపూర్వక జాబ్ కాంట్రాక్టు కలిగిన ఉద్యోగులు 39.9శాతం నుంచి 36.2శాతానికి తగ్గారు. ఈఓడీబీ, టీ–ఐడియా, టీ–ప్రైడ్ వంటి కార్యక్రమాలతో పాటు ఐటీ, ఇతర సేవా రంగాలను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలతో ఉద్యోగుల పరిస్థితులు మెరుగయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర, జాతీయ వృద్ధిరేటు తీరు జీఎస్డీపీ వృద్ధిలో మూడో స్థానం ►స్థిర ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ విలువ రూ.13.27 లక్షల కోట్లు, దేశ జీడీపీ విలువ రూ.273.08 లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.48 లక్షల కోట్లు, దేశ జీడీపీ రూ.236.65 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. ►జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో (19.4 శాతంతో) నిలిచిందని.. ఒడిశా (20.5శాతం), మధ్యప్రదేశ్ (19.7 శాతం) తొలి రెండు స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. ►2021–22లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.9 శాతమని.. 2022–23లో కూడా ఇదే స్థాయిలో భాగస్వామ్యం ఉండనుందని ప్రభుత్వం అంచనా వేసింది. -
అమృతకాల బడ్జెట్: అంతర్జాతీయ సవాళ్ల మధ్య ధీటుగా భారత్
న్యూఢిల్లీ: యూనియన్ బడ్జెట్ 2023-24 ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న సందర్భంగా కీలక విషయాలను ప్రకటించారు. ఇది అమృత కాల బడ్జెట్ అనీ,దీనికి గత బడ్జెట్ లోనే గట్టి పునాది పడిందని ఆమె అన్నారు. అంతర్జాతీయ సవాళ్ల మధ్య మన దేశం తలయెత్తుకొని సగర్వంగా నిల బడిందనీ, సమిష్టి ప్రగతి దిశగా దేశం పయనిస్తుందని నిర్మలా భరోసా ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అత్యంత వేగంగా ఉందన్నారు. వృద్ధి రేటును 7శాతంగా అంచనావేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా పేదలు, యువత, మహిళలు, రైతులు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. అంత్యోదయ వర్గాల వారికి సంత్సరం పాటు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం జనవరి 2023 నుంచి ఉచిత ధాన్యాల పంపిణీ స్కీంను ప్రశేపెడుతున్నాం. దీని య్యే మొత్తం ఖర్చును 2 లక్షల కోట్లు కేంద్రం భరిస్తుంది. కోవిడ్ , యుద్ధం లాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా గ్లోబల్‌గా నెలకొన్న మాంద్యం పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థంగా దృఢంగా నిలబడింది. కోవిడ్ అడ్డుకోవడంలో చాలా వేగంగా పనిచేశాం. 102 కోట్ల మందికి వ్యాక్సన్స్ అందించాం వ్యాక్సినేషన్ డ్రైవ్ శరవేగంగా చేపట్టామని ఆమె చెప్పారు. -
కోత పడింది.. ఈ ఏడాది వృద్ధి 6.1 శాతమే
వాషింగ్టన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2022–23) దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజాగా కోత పెట్టింది. 2022లో సాధించిన 6.8 శాతంతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి నమోదుకాగలదని అభిప్రాయపడింది. మరోపక్క ప్రపంచ ఆర్థిక భవిష్యత్‌పట్ల జనవరి అంచనాలను వెలువరించింది. దీనిలో భాగంగా ప్రపంచ వృద్ధి అంచనాలను సైతం 3.4 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గించింది. అయితే వచ్చే ఏడాది(2024)లో కొంత పుంజుకుని 3.1 శాతం పురోగతి నమోదుకాగలదని అంచనా వేసింది. నిజానికి అక్టోబర్‌లో ప్రకటించిన ఇండియా వృద్ధి ఔట్లుక్ 6.8 శాతంలో ఎలాంటి మార్పులేదని, విదేశీ అంశాల కారణంగా కొంతమేర మందగించి 6.1 శాతంగా నమోదుకాగలదని తాజాగా భావిస్తున్నట్లు ఐఎంఎఫ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ చీఫ్ ఎకనమిస్ట్, డైరెక్టర్ పియరీ ఒలీవియర్ గొరించాస్ పేర్కొన్నారు. తిరిగి వచ్చే ఏడాది(2023–24)లో 6.8 శాతం వృద్ధిని సాధించగలదని అంచనా వేశారు. విదేశీ సవాళ్లు ఎదురైనప్పటికీ ఇందుకు దేశీ డిమాండు సహకరించగలదని అభిప్రాయపడ్డారు. చదవండి: కేంద్ర బడ్జెట్‌పై గంపెడు ఆశలు..పేద, మధ్యతరగతి ప్రజలు ఏం కోరుకుంటున్నారు! -
ముంచుకొస్తోంది..ఆర్ధిక మాంద్యం
మాంద్యం... ప్రపంచాన్ని ఇప్పుడు వెంటాడుతున్న పదం ఇది. కరోనా దెబ్బతో కకావికలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి... ఇప్పుడు ధరాభారంతో పెనం మీంచి పొయ్యిలో పడినట్లయింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలయ్యాక యూరప్, అమెరికా దేశాల్లోనే కాదు ఆసియాలోని చాలా దేశాల్లోనూ ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ద్రవ్యోల్బణం సెగను తగ్గించేందుకు అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచుతుండటం... చైనాలో మళ్లీ కరోనా భయాలతో అంతర్జాతీయ వాణిజ్యం మందగించడం.. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు, గ్యాస్ రేట్లు భగ్గుమనడం.. ఇలా అనేక పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం కోరల్లో చిక్కుకునేలా చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు ఇప్పటికే 2023లో చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారిపోవచ్చనే డేంజర్ బెల్స్ మోగించింది. యూరప్, అమెరికాలో ఈ ముప్పు ఎక్కువగా ఉందని కూడా చెబుతోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, హెచ్‌పీ వంటి అనేక అమెరికా టెక్నాలజీ దిగ్గజాలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలు ప్రకటించడం కూడా మాంద్యం ఆందోళనలను మరింత పెంచుతోంది. అసలు ఆర్థిక మాంద్యం వస్తే ఏం జరుగుతుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎందుకింత ఘోరంగా తయారైంది? కొలువుల కోతలకు కారణమేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి! శివరామకృష్ణ మిర్తిపాటి 2007లో ప్రపంచం నెత్తిన పడిన అమెరికా సబ్‌ప్రైమ్ సంక్షోభం ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఎందుకంటే ఆ దెబ్బకు ప్రపంచమంతా అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. స్టాక్ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. అనేక బ్యాంకులు, పరిశ్రమలు దివాలా తీశాయి. నిరుద్యోగం ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. 2009 జూన్ వరకు ఇది ప్రపంచ దేశాలను కుదిపేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న అత్యంత తీవ్ర మాంద్యంగా అది చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రపంచాన్ని మరో మాంద్యంలోకి తోసేస్తున్నది కూడా అమెరికానే కావడం గమనార్హం. గత సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు సహాయ ప్యాకేజీల రూపంలో ఎడాపెడా డాలర్లను ప్రింట్ చేసి, కృత్రిమంగా ఎకానమీలను నిలబెట్టిన అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులకు ఇప్పుడు దాని సెగ బాగానే తగులుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ కొండెక్కి... ప్రజల జేబులను గుల్ల చేస్తుండటంతో చేసేదేమీలేక అవి వడ్డీరేట్ల పెంపు బాట పట్టాయి. అంతేకాదు, గతంలో అందించిన సహాయ ప్యాకేజీ సొమ్మును వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకోవడంతో పాటు, అత్యంత వేగంగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతుండటంతో ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వెరసి, డిమాండ్ సన్నగిల్లి పరిశ్రమలు పడకేసే పరిస్థితి నెలకొనడం వల్ల గ్లోబల్ ఎకానమీకి మాంద్యం ముప్పు అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పట్లో ధరలు దిగొచ్చే పరిస్థితి లేకపోవడం, వడ్డీరేట్లు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రపంచం 2023లో మరో మాంద్యానికి చేరువ కావచ్చని ఆర్థికవేత్తలతో పాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, మరికొంత మంది ఆర్థిక వేత్తలు మాత్రం ఇది మందగమనం మాత్రమేనని, ఒకవేళ మాంద్యం వచ్చినా చాలా స్వల్పకాలమే ఉంటుందని లెక్కలేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు తాజా వార్నింగ్... అంచనాలను మించిన ద్రవ్యోల్బణం.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అకస్మాత్తుగా పెరిగిన వడ్డీరేట్లు, మళ్లీ కోవిడ్ మహమ్మారి భయాలు, బలహీన డిమాండ్ ప్రభావంతో ప్రపంచ ఎకానమీ వృద్ధి రేటు 2023లో 1.7 శాతానికి పడిపోవచ్చని ప్రపంచ బ్యాంకు తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత అంచనా 3 శాతం కాగా, దాదాపు సగానికి కోతపెట్డడం గమనార్హం. ఒకవేళ అమెరికా మాంద్యాన్ని తప్పించుకున్నప్పటికీ, వృద్ధి రేటు మాత్రం 0.5 శాతానికి పడిపోవచ్చని లెక్కగట్టింది. అధిక ధరలు, తీవ్ర వడ్డీరేట్లు, ప్రపంచ ఆర్థిక బలహీనతలు అమెరికా వ్యాపార సంస్థలు, వినియోగదారుల నడ్డివిరుస్తాయని ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. కోవిడ్ మరింత విస్తరించి, ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముదిరిపోతే... సరఫరా వ్యవస్థలు కుప్పకూలుతాయని.. అంతిమంగా మాంద్యానికి దారితీయొచ్చని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు... బలహీన చైనా ఎకానమీ కారణంగా, యూరప్ దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. అమెరికా, యూరప్, చైనా ఏకకాలంలో మందగమనంలో ఉండటం అనేది ప్రపంచ ఎకానమీకి పెను ముప్పుగా మారుతుందని ఐఎంఎఫ్ అధిపతి క్రిస్టీనా జార్జియేవా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈయూ ఎకానమీ వృద్ధి 0 స్థాయిలో... చైనా వృద్ధి 4.3 శాతానికి, బ్రెజిల్ వృద్ధి రేటు 0.8 శాతానికి దిగజారవచ్చనేది ప్రపంచ బ్యాంక్ అంచనా. భారత్ బెటర్... అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు 2022తో పోలిస్తే ఈ ఏడాది సగానికి పడిపోయే అవకాశం ఉన్నప్పటికీ.. మెరుగైన స్థాయిలో 3.4 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ముఖ్యంగా, భారత్ జీడీపీ తగ్గినా కూడా మిగతా దేశాలతో పోలిస్తే మెరుగైన పనితీరును నమోదు చేయొచ్చని చెబుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. 2022–23 ఏడాది అంచనా 6.9 శాతంగా ఉంది. దీని ప్రకారం చూస్తే ఏడు అతిపెద్ద వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు సాధించిన దేశంగా ఈ ఏడాది భారత్ నిలుస్తుంది. 2020–21లో కోవిడ్ కారణంగా భారత్ జీడీపీ 7.3 శాతం క్షీణించినా, 2021–22లో తిరిగి కోలుకోవడమే కాకుండా 8.7 శాతం వృద్ధి చెందింది. ప్రపంచ ప్రతికూలతల నేపథ్యంలో ఈ ఏడాది వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం కావచ్చనేది ప్రభుత్వ అంచనా. మొత్తంమీద చూస్తే ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారినప్పటికీ, భారత్ మాత్రం దీన్ని తప్పించుకునే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంతా అమెరికానే చేసింది!! 2007–2009 ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ట్రిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించడంతో పాటు వడ్డీరేట్లను దాదాపు సున్నా స్థాయిలోనే అనేక సంవత్సరాలు కొనసాగించింది అమెరికా. పరిస్థితులు కాస్త సద్దుమణగడం.. అమెరికా స్టాక్ మార్కెట్ల జోరు నేపథ్యంలో 2018లో వడ్డీరేట్లను నెమ్మదిగా పెంచడం మొదలుపెట్టింది ఆ దేశ సెంట్రల్ బ్యాంక్. అయితే, పులి మీద పుట్రలా కరోనా మహమ్మారి 2020లో ప్రపంచాన్ని అతలాకుతలం చేయడంతో అన్ని దేశాల ఎకానమీలు ఒక్కసారిగా స్తంభించిపోయి, కుప్పకూలాయి. దీంతో మళ్లీ అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను అమాంతం సున్నా స్థాయికి తీసుకొచ్చి, లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాల్సి వచ్చింది. కోవిడ్ నుంచి గట్టెక్కుతున్న తరుణంలో.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముంచుకొచ్చింది. అమెరికా, యూరప్ ఇతరత్రా వాటి మిత్ర దేశాలు రష్యాపై పరోక్ష యుద్ధానికి కాలుదువ్వడం.. ఆంక్షల కొరడా ఝుళిపించడంతో క్రూడ్, ఆహారోత్పత్తుల ధరల మంట మొదలైంది. ద్రవ్యోల్బణం దూసుకెళ్లడంతో అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీరేట్లను ఎకాయెకిన పెంచేయడం మొదలెట్టాయి. అమెరికా తన ఆర్థిక ప్యాకేజీలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది. కాగా, చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కనిపించకపోవడంతో ధరాఘాతం మరికొన్నాళ్లు కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాదీ వడ్డీరేట్లు మరింత పెరిగిపోవచ్చనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇదే జరిగితే.. ఎకానమీలు మరింత మందగిస్తాయని.. వెరసి ప్రపంచ మాంద్యానికి ఇంకాస్త చేరువకావడం ఖాయమని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ‘ప్రపంచ వృద్ధి తీవ్రంగా మందగిస్తోంది. ఇది మరింత దిగజారితే, చాలా దేశాలు మాంద్యంలోకి జారిపోతాయి. ఈ ధోరణులు చాలాకాలం కొనసాగనుండటం అందోళనకరమైన విషయం. ఇదే జరిగితే వర్థమాన దేశాల ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటారు’ అని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ అభిప్రాయపడ్డారు. వణికిస్తున్న వడ్డీరేట్లు... 2007లో దాదాపు 5 శాతం స్థాయిలో ఉన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేటు.. అప్పటి ఆర్థిక సంక్షోభం తర్వాత సున్నా స్థాయికి దిగొచ్చింది. దాదాపు 2016 వరకూ ఇదే స్థాయిలో కొనసాగింది. అయితే, తర్వాత మళ్లీ పెరుగుతూ 2.25 శాతానికి చేరింది. ఆ సమయంలో కోవిడ్ దెబ్బకు మళ్లీ 2020లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటును సున్నాకు తగ్గించేసింది. రెండేళ్లపాటు అక్కడే ఉంచింది. ఎకానమీ కాస్త మెరుగైన సంకేతాలకు తోడు.. ద్రవ్యోల్బణం దాదాపు 9 శాతానికి చేరి (40 ఏళ్ల గరిష్ఠం) ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఈ ఏడాది మళ్లీ పెంపు మొదలుపెట్టి డిసెంబర్ నాటికి 4.5 శాతానికి చేర్చింది. ఈ ఏడాదిలో ఇది 5.25 శాతానికి చేరే అవకాశం ఉంది. దీంతో డాలరు విలువ ఎగబాకి.. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలను కుదేలు చేసింది. మన రూపాయి కూడా దాదాపు 83 స్థాయికి బక్కచిక్కి ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోవడం తెలిసిందే. అయితే, మిగతా కరెన్సీలతో పోలిస్తే మనదే కాస్త తక్కువ క్షీణించడం విశేషం. అమెరికా వడ్డీరేట్ల పెంపు జోరు, ద్రవ్యోల్బణంపై పోరు కారణంగా అటు యూరప్‌తో పాటు ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులూ వడ్డీరేట్లను తప్పక పెంచాల్సి వస్తోంది. మన ఆర్బీఐ కూడా కీలక రెపో రేటును 4 శాతం నుంచి ఇప్పుడు 6.25 శాతానికి పెంచడంతో కార్పొరేట్లు, ఇటు రిటైల్ రుణ గ్రహీతలపై వడ్డీ భారం తడిసిమోపెడవుతోంది. వెరసి ఆర్థిక వ్యవస్థలు మరింత మందగిస్తున్నాయి. యూరప్ సెల్ఫ్ గోల్... అసలే అంతంతమాత్రంగా ఉన్న యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో మరింత దిగజారింది. ముఖ్యంగా అమెరికా ప్రోద్బలంతో రష్యాపై విధించిన ఆంక్షలు చివరికి యూరప్ దేశాల మెడకే చుట్టుకున్నాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ సరఫరాలను నిలిపివేయడం, ఇతరత్రా కమోడిటీ దిగుమతులపై ఆంక్షలకు తోడు జర్మనీకి గ్యాస్ సరఫరా చేసే నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పేల్చివేయడం (అమెరికా ఏజెంట్లే చేశారన్నది రష్యా ఆరోపణ)తో యూరోపియన్ దేశాల్లో ద్రవ్యోల్బణం కనీవినీ ఎరుగని స్థాయికి (చాలా దేశాల్లో ఆల్‌టైమ్ గరిష్ఠం) ఎగబాకింది. రష్యా చౌక గ్యాస్, క్రూడ్‌ను కాదని భారీ మొత్తానికి అమెరికా ఇతర దేశాల నుంచి యూరప్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో అక్కడి పరిశ్రమలు అధిక వ్యయాలతో మూతబడే పరిస్థితి నెలకొంది. ఇది ఉద్యోగాల కోతకు దారితీస్తోంది. బ్రిటన్ ఎకానమీ ఇప్పటికే క్షీణతలోకి (2022 మూడో త్రైమాసికంలో జీడీపీ మైనస్ 0.3% క్షీణించింది) జారుకొని మాంద్యాన్ని చవిచూస్తోంది. మిగతా దేశాలూ అదే బాటలోకి వెళ్లే ప్రమాదం ఉంది. యూరప్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తే అది ప్రపంచ ఎకానమీపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. మొత్తంమీద రష్యా విషయంలో అమెరికా వలలో చిక్కుకుని యూరప్ సెల్ఫ్ గోల్ వేసుకుందనేది ఆర్థికవేత్తల విశ్లేషణ. ధరదడ... స్టాగ్ఫ్లేషన్! పశ్చిమ దేశాల విచ్చలవిడి కరెన్సీ ప్రింటింగ్‌కు తోడు కరోనా దెబ్బతో సరఫరా వ్యవస్థలు ఛిన్నాభిన్నం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ధరలకు రెక్కలొచ్చాయి. ధరల దెబ్బకు సామాన్యుడే కాదు, ఆర్థిక వ్యవస్థలు సైతం అల్లాడిపోతున్నాయి. మన పొరుగున ఉన్న శ్రీలంకలో ద్రవ్యోల్బణం దెబ్బకు ప్రజలు ఎలా రోడ్డెక్కి అధ్యక్షుడిని సైతం పారిపోయేలా చేశారో మనం కళ్లారా చూశాం. అలాగే పాకిస్తాన్లో గోధుమ పిండి, ఇతరత్రా నిత్యావసరాల కోసం జరుగుతున్న కొట్లాటలకూ ధరల తీవ్రతే కారణం. మరోపక్క, ఆర్థిక మందగమనం కూడా కొనసాగుతుండటంతో ప్రస్తుతం ప్రపంచం ‘స్టాగ్ఫ్లేషన్’ను ఎదుర్కొంటోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అధిక ద్రవ్యోల్బణానికి తోడు జీడీపీ వృద్ధి అంతకంతకూ పడిపోతూ ఉండటం, ఫలితంగా నిరుద్యోగం తీవ్రతరం కావడాన్ని స్టాగ్‌ఫ్లేషన్‌గా పేర్కొంటారు. కంపెనీల లాభదాయకత పడిపోవడంతో ఉద్యోగాల కోతకు దారితీస్తుంది. మాంద్యం–ద్రవ్యోల్బణంగా కూడా దీన్ని చెప్పొచ్చు. ఇది పాలసీ నిర్ణయాల విషయంలో డైలమాకు కారణమవుతుంది. ఎందుకంటే, అధిక ధరలకు కళ్లెం వేయాలంటే కొన్ని నెలల పాటు వడ్డీరేట్లను పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా డిమాండ్ సన్నగిల్లి, ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోతుంది. ధరలు కట్టడి అయ్యేంతవరకూ సెంట్రల్ బ్యాంకులు అదేపనిగా వడ్డీరేట్లను పెంచడం వల్ల నిరుద్యోగం మరింత పెరగడంతో పాటు అంతిమంగా ఆర్థిక వ్యవస్థ కూడా మాంద్యంలోకి వెళ్లిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. చైనాలో జీరో కోవిడ్ పాలసీ దెబ్బ... కరోనాతో 2020లో పాతాళానికి పడిపోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు.. 2021లో మళ్లీ పుంజుకోవడం మొదలైంది. అయితే, చైనా మాత్రం జీరో కోవిడ్ పాలసీ పేరుతో విధించిన ఆంక్షలకు తోడు, 2022లో కొత్త వేరియంట్ బీఎఫ్7 కారణంగా లాక్డౌన్లకు తెరతీసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రపంచ తయారీ భాండాగారంగా పేరొందిన చైనా నుంచి వాణిజ్యం కుంటుపడటం.. ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోసింది. ఈ పరిణామాలతో చైనాలో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు స్తంభించడంతో ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పడిపోయింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2022లో 3 శాతానికి పరిమితమైంది. 2020లో కోవిడ్ వల్ల 2.2 శాతానికి పడిపోయిన ఉదంతాన్ని మినహాయిస్తే, 1976 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. 2021లో జీడీపీ వృద్ధి 8.1 శాతం కావడం గమనార్హం. అయితే, ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో జీరో కోవిడ్ పాలసీకి 2022 డిసెంబర్లో చైనా చెల్లు చెప్పినప్పటికీ.. తిరిగి మళ్లీ ఎకానమీ పుంజుకోవడానికి చాలా నెలలు పట్టొచ్చనేది ఆర్థిక వేత్తల మాట. పెరుగుతున్న కోవిడ్ కేసులు.. రియల్ ఎస్టేట్ మార్కెట్ క్షీణత, బలహీన ప్రపంచ డిమాండ్ వంటివి 2023లో చైనాకు పెను సవాళ్లుగా నిలుస్తాయని మూడీస్ ఎకనమిస్ట్ హ్యారీ మర్ఫీ క్రూయిజ్ విశ్లేషిస్తున్నారు. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కుంటుపడటం అంటే ప్రపంచ మాంద్యానికి మరింత దగ్గరైనట్లేనని కూడా పేర్కొంటున్నారు. ఒకపక్క మాంద్యం భయాలకు తోడు... వ్యయాలు తడిసిమోపెడవుతుండంతో టెక్నాలజీ కంపెనీలు గత ఏడాది నుంచే కొలువుల కోతకు తెరతీశాయి. అంతేకాదు, చాలా కంపెనీలు కొత్త ఉద్యోగాలను కూడా (హైరింగ్) తాత్కాలికంగా ఆపేస్తుండటం ఆర్థిక వ్యవస్థల్లో బలహీనతకు నిదర్శనం. ప్రపంచ టాప్ టెక్నాలజీ కంపెనీలన్నీ ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించాయి. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి పుండుమీద కారంలా తయారైంది. గూగుల్ దాదాపు 12,000 ఉద్యోగాల్లో కోత పెట్టనుండగా, హెచ్‌పీ దాదాపు 6,000 మందిని సాగనంపింది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా సైతం ఆదాయాలు పడిపోతుండటంతో 11,000 కొలువులకు కోత పెట్టింది. ఇక ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సిబ్బందిని సగానికి సగం తగ్గించి, దాదాపు 3,500 మందిని ఇంటికి పంపారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ అయితే, ఏకంగా 18,000 మందిపై వేటు వేసింది. కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద కోత. ఇందులో భారత్‌లోనూ 1,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 10,000 కొలువులు (మొత్తం ఉద్యోగుల్లో 5%) కట్ చేస్తామని ప్రకటించింది. ఇంకా చిన్నాచితకా టెక్ కంపెనీలతో పాటు పెప్సికో, ఫోర్డ్ వంటి తయారీ రంగ కంపెనీలు సైతం ఇదే బాటలో వెళ్తున్నాయి. ‘లేఆఫ్స్.ఎఫ్‌వైఐ’ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది టెక్నాలజీ కంపెనీలు దాదాపు 1,50,000 ఉద్యోగులను తొలగించినట్లు అంచనా. ఇక 2023 విషయానికొస్తే, ఇప్పటికే 104 పైగా కంపెనీలు సుమారు 26,000 మందికి పింక్ స్లిప్స్ ఇచ్చాయి. అంటే రోజుకు 1,600 మంది కొలువులు కోల్పోయారన్నమాట! ఆర్థిక వృద్ధి మరింత పడిపోయి, వడ్డీరేట్ల పెంపు కొనసాగితే రానున్నకాలంలో ఒక్క టెక్నాలజీ కంపెనీలే కాకుండా అన్ని రంగాల్లోనూ మరిన్ని కోతలు తప్పవని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2007లో ప్రపంచం నెత్తిన పడిన అమెరికా సబ్‌ప్రైమ్ సంక్షోభం ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఎందుకంటే ఆ దెబ్బకు ప్రపంచమంతా అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. స్టాక్ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. అనేక బ్యాంకులు, పరిశ్రమలు దివాలా తీశాయి. నిరుద్యోగం ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. 2009 జూన్ వరకు ఇది ప్రపంచ దేశాలను కుదిపేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న అత్యంత తీవ్ర మాంద్యంగా అది చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రపంచాన్ని మరో మాంద్యంలోకి తోసేస్తున్నది కూడా అమెరికానే కావడం గమనార్హం. గత సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు సహాయ ప్యాకేజీల రూపంలో ఎడాపెడా డాలర్లను ప్రింట్ చేసి, కృత్రిమంగా ఎకానమీలను నిలబెట్టిన అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులకు ఇప్పుడు దాని సెగ బాగానే తగులుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ కొండెక్కి... ప్రజల జేబులను గుల్ల చేస్తుండటంతో చేసేదేమీలేక అవి వడ్డీరేట్ల పెంపు బాట పట్టాయి. అంతేకాదు, గతంలో అందించిన సహాయ ప్యాకేజీ సొమ్మును వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకోవడంతో పాటు, అత్యంత వేగంగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతుండటంతో ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వెరసి, డిమాండ్ సన్నగిల్లి పరిశ్రమలు పడకేసే పరిస్థితి నెలకొనడం వల్ల గ్లోబల్ ఎకానమీకి మాంద్యం ముప్పు అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పట్లో ధరలు దిగొచ్చే పరిస్థితి లేకపోవడం, వడ్డీరేట్లు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రపంచం 2023లో మరో మాంద్యానికి చేరువ కావచ్చని ఆర్థికవేత్తలతో పాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, మరికొంత మంది ఆర్థిక వేత్తలు మాత్రం ఇది మందగమనం మాత్రమేనని, ఒకవేళ మాంద్యం వచ్చినా చాలా స్వల్పకాలమే ఉంటుందని లెక్కలేస్తున్నారు. -
ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి!
బీజింగ్: కరోనా తెచ్చిపెట్టిన కష్టాలు, రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బతినడం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా తర్వాత ప్రపంచ రెండవ అతిపెద్ద ఎకానమీ 2022లో కేవలం 3 శాతం పురోగతి సాధించింది. మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం, వార్షిక జీడీపీ విలువ 121.02 ట్రిలియన్ యువాన్ (17.94 ట్రిలియన్ డాలర్లు). 2021 విలువతో (114.37 ట్రిలియన్ యువాన్లు) పోల్చితే ఈ గణాంకాలు కేవలం 3 శాతం అధికం. కనీసం 5.5 శాతం వృద్ధి నమోదవుతుందన్న అంచనాలకన్నా... గణాంకాలు తగ్గినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటస్టిక్స్ (ఎన్బీఎస్) పేర్కొంది. 1974లో చైనా జీడీపీ వృద్ధి రేటు 2.3 శాతం. అటు తర్వాత ఈ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. అమెరికా డాలర్లతో పోల్చితే జీడీపీ విలువ 2021లో 18 ట్రిలియన్ డాలర్లుకాగా, తాజాగా 17.94 ట్రిలియన్ డాలర్లకు తగ్గడం గమనార్హం. డాలర్లో చైనా కరెన్సీ ఆర్ఎంబీ బలహీనపడ్డమే దీనికి కారణం. ఎన్బీఎస్ డేటా ప్రకారం, చైనా జాబ్ మార్కెట్ 2022లో స్థిరంగా ఉంది. పట్టణ వార్షిక ఉపాధి కల్పనా లక్ష్యం 11 మిలియన్లుకాగా, 12.06 మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. 2021లో చైనా ఎకానమీ వృద్ధి రేటు 8.4 శాతం. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
దిగువబాటన భారత్ వృద్ధి రేటు
న్యూఢిల్లీ: భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ కుదించింది. 6.9 శాతంగా ఉన్న క్రితం అంచనాలను 6.6 శాతానికి కుదిస్తున్నట్లు తన తాజా ఎకనమిక్ అప్డేట్లో తెలిపింది. భారత్ 2021–22లో 8.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా, ప్రస్తుత 2022–23లో ఈ రేటు 6.9 శాతంగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. కాగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ 6.1 శాతంగా అంచనావేసింది. అంటే వృద్ధి రేటు క్రమంగా దిగువకే పయనిస్తుందన్నది ప్రపంచ బ్యాంక్ అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి, ఎగుమతులు, పెట్టుబడుల వేగం తగ్గడం తన అంచనాలకు కారణమని ప్రపంచ బ్యాంక్ పేర్కొంటోంది. అయితే ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో భారత్ తొలి స్థానంలో ఉంటుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. చదవండి: టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధిరేటు 7 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం అవుతుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తొలి ముందస్తు అంచనాలు వెల్లడించాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (8.7 శాతం) ఇది 1.7 శాతం తక్కువ కావడం గమనార్హం. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు వృద్ధి రేటు అంచనా భారీ తగ్గుదలకు కారణమని తొలి అంచనాలు వెలువరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలో అసలు వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణత నమోదవుతుందని ఎన్ఎస్ఓ అంచనా. 2021–22లో ఈ రంగం 9.9% వృద్ధిని నమోదుచేసింది. మొత్తం ఎకానమీలో పారిశ్రామిక రంగం వెయిటేజ్ దాదాపు 15 శాతంకాగా ఇందులో మెజారిటీ వాటా తయారీ రంగానికి కావడం గమనార్హం. ఇక మైనింగ్‌లో కూడా వృద్ధి రేటు 11.5 శాతం నుంచి 2.4%కి పడిపోతుందని అంచనాలు వెలువడ్డం గమనార్హం. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 6.8% అంచనాలకన్నా కేంద్రం అంచనాలు 20 బేసిస్ పాయింట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఎన్ఎస్ఓ ప్రకటనలో ముఖ్యాంశాలు ఇవీ.. ►జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగంలో వృద్ధి 3.5 శాతంగా ఉండనుంది. 2021–22లో ఈ రేటు 3%. ►ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు,, బ్రాడ్‌కాస్టింగ్ విభాగానికి సంబంధించిన సర్వీసుల వృద్ధి రేటు 11.1 శాతం నుంచి 13.7 శాతానికి చేరనుంది. ►ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలలో వృద్ధి రేటు 4.2% నుంచి 6.4%కి పెరగనుంది. ►అయితే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 11.5%నుంచి 9.1 శాతానికి తగ్గనుంది. ►పబ్లిక్ అడ్మినిస్టేషన్, రక్షణ, ఇతర సేవల వృద్ధి రేటు కూడా 12.6% నుంచి 7.9%కి పడనుంది. ►స్థూల విలువ జోడింపు (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్– జీవీఏ) ప్రాతిపదికన 2022–23లో వృద్ధి రేటు 8.1% నుంచి 6.7%కి తగ్గనుంది. ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రాంతం, పరిశ్రమ లేదా రంగంలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల విలువే జీవీఏ. ఇంకా చెప్పాలంటే జీడీపీలో ఒక నిర్దిష్ట రంగం ఉత్పత్తి తోడ్పాటును జీవీఏ ప్రతిబింబిస్తుంది. అన్ని రంగాల జీవీఏలను కలిపి, పన్నులు– సబ్సిడీలకు సంబంధించి అవసరమైన సర్దుబాటు చేస్తే ఆర్థిక వ్యవస్థ జీడీపీ విలువ వస్తుంది. ఎన్ఎస్ఓ అంచనా విలువల్లో. 2011–12 స్థిర ధరల ప్రాతిపదికన (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేస్తూ) వాస్తవ జీడీపీ విలువ 2021–22లో రూ.147.36 లక్షల కోట్లయితే, ఇది 2022–23లో రూ.157.60 లక్షల కోట్లకు పెరగనుందని ఎన్ఎస్ఓ తాజా అంచనా. అంటే వృద్ధి రేటు 7 శాతం అన్నమాట. -
2023లో ప్రపంచ ఎకానమీ ఒడిదుడుకులు!
న్యూఢిల్లీ: గ్లోబల్ ఎకానమీలో ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సన్యాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రపంచ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి సంఖ్యలను పదేపదే డౌన్గ్రేడ్లు చేస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే 2023 సంవత్సరం కూడా కష్టతరమైనదని చెప్పడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషించారు. ఎకానమీకి సంబంధించి ఆయన ఇచ్చిన ఒక తాజా ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... ► వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం) భారీగా పెరిగిపోకుండా చర్యలు అవసరమే. ఒకే దేశంలో వాణిజ్యలోటు తీవ్రంగా పెరిగిపోకుండా పలు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. మనకు కావాల్సిన ఉత్తులను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య చైనాతో వాణిజ్యలోటు 51.1 బిలియన్ డాలర్లకు తాకిన నేపథ్యంలో సన్యాల్ ఈ వ్యాఖ్యలు చేశారు) ► భారతదేశ మొత్తం సరుకు వాణిజ్య లోటు పెరిగిన మాట వాస్తవమే. అయితే దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోవడం, మిగిలిన ప్రపంచం మందగించడం దీనికి కారణం. ► ఇక భారత్ నుంచి ఎగుమతుల పెంపునకూ వ్యూహ రచన జరుగుతోంది. ఇక్కడ మనం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీమ్‌నూ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. పీఎల్ఐ పథకం లక్ష్యం– దేశీయ తయారీని ప్రపంచవ్యాప్త పోటీ వేదికపై నిలబెట్టడం, తయారీ రంగంలో ప్రపంచ ఛాంపియన్లను సృష్టించడం, ఎగుమతులను పెంచడం, ఉద్యోగ అవకాశాలను కల్పించడం. ► తూర్పు యూరప్‌లో ఇబ్బందులు, చైనాలో కోవిడ్ కేసుల విజృంభన వంటి అంశాలు భారత్‌సహా ప్రపంచంలోని పలు ఎకానమీలపై ప్రతికూలత చూపే అవకాశం ఉంది. అయితే సవాళ్లను తట్టుకుని నిలబడగలిగే స్థితిలో భారత్ ఉంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ వ్యవస్థగా కొనసాగుతోంది. 2023–24లో కూడా ఇదే హోదా కొనసాగిస్తుందన్న విశ్వాసం ఉంది. ► కాగా, కోవిడ్ తిరిగి తీవ్రమయ్యే అవకాశాలపై భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. ► ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) వంటి స్థూల ఆర్థిక స్థిరత్వ అంశాలపై జాగరూకత అవసరం. ► తక్షణం కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక భారత్ ఎకానమీ అవుట్‌లుక్ స్థిరంగా ఉంది. పాత పెన్షన్ పథకాల పునరుద్ధరణ సరికాదు..! ఉద్యోగుల వంతు జమతో (కాంట్రిబ్యూషన్) సంబంధంలేని పాత పెన్షన్ పథకాలు (ఓపీఎస్).. భవిష్యత్ తరాలపై దాడి వంటిదేనని సన్యాల్ పేర్కొన్నారు. కొన్ని ప్రతిపక్ష పాలక రాష్ట్రాల నుంచి వచ్చిన ‘పాత పెన్షన్ పథకాలను పునరుద్ధరణ డిమాండ్’ సరైంది కాదని స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలుగా చాలా కష్టాలతో అమల్లోకి తెచ్చిన పెన్షన్ సంస్కరణలను తిరిగి వెనక్కు మళ్లించే విషయంలో జాగరూకత అవసరమన్నారు. పెన్షన్ మొ త్తాన్ని ప్రభుత్వమే ఇవ్వడానికి సంబంధించిన పాత పెన్షన్ పథకాలను 2003లో ఎన్డీఏ ప్రభుత్వం నిలిపివేసింది. 2004 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కింద ఉద్యోగులు తమ ప్రాథమిక (బేసిస్) వేతనంలో 10 శాతం పెన్షన్‌కు జమ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది. -
యూట్యూబ్‌తో రూ. 10 వేల కోట్లు.. 7.5 లక్షల పైగా ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ వ్యవస్థ 2021లో భారత స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ. 10,000 కోట్ల పైగా తోడ్పాటు అందించింది. అలాగే, 7.5 లక్షల పైచిలుకు ఫుల్‌టైమ్ కొలువులకు సమానమైన ఉద్యోగాలను కల్పించింది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ రూపొందించిన యూట్యూబ్ ప్రభావ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో 4,500 పైగా ఛానల్స్‌కు 10 లక్షలకు మించి సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. వార్షికంగా రూ. 1 లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్న ఛానల్స్ సంఖ్య వార్షిక ప్రాతిపదికన 2021లో 60 శాతం పైగా పెరిగింది. యూట్యూబ్ ప్రభావంపై ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ నిర్వహించిన సర్వేలో 4,021 యూట్యూబ్ యూజర్లు, 5,633 మంది క్రియేటర్లు, 523 వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి. నివేదిక ప్రకారం ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఇద్దరు యూజర్లలో ఒకరు తమ కెరియర్‌కు ఉపయోగపడే నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే కొత్తగా ఉద్యోగాలను దక్కించుకోవాలనుకునే యూజర్లలో 45 శాతం మంది, వాటికి అవసరమైన నైపుణ్యాలను సాధించుకునేందుకు యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. ‘యూట్యూబ్‌ను సాంప్రదాయ విద్యాభ్యాసానికి అదనంగా ఒక ప్రయోజనకరమైన సాధనంగా విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పరిగణించే ధోరణి పెరుగుతోంది. యూట్యూబ్‌తో పిల్లలు సరదాగా నేర్చుకుంటున్నారని దాన్ని ఉపయోగించే పేరెంట్స్‌లో 83 శాతం మంది తెలిపారు. విద్యార్థులు నేర్చుకునేందుకు ఇది సహాయకరంగా ఉంటోందని యూట్యూబ్‌ను ఉపయోగించే 76 శాతం మంది అధ్యాపకులు తెలిపారు‘ అని నివేదిక వివరించింది. మహిళల ఆసక్తి: పర్సనల్ ఫైనాన్స్ గురించి తెలుసుకోవడం మొదలుకుని స్ఫూర్తినిచ్చే సలహాలు పొందేందుకు, తమ హాబీలను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు, కెరియర్.. వ్యాపారాలను నిర్మించుకోవడం వరకు ఇలా తమ జీవితానికి తోడ్పడే ఎన్నో అంశాలు నేర్చుకునేందుకు మహిళలు యూట్యూబ్‌ని ఎంచుకుంటున్నారు. జీవితకాల అభ్యాసానికి యూట్యూబ్ ఎంతో ఉపయోగకరమైన ప్లాట్‌ఫాం అని 77 శాతం మంది మహిళలు తెలిపారు. ప్రతి రోజూ ఉపయోగపడే నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఇది సహాయకరంగా ఉంటోందని 56 శాతం మంది, తమ ఆకాంక్షలు .. ఐడియాలను పంచుకోవడంలో సహాయపడుతోందని 90 శాతం మంది మహిళా క్రియేటర్లు వివరించారు. చదవండి: న్యూ ఇయర్ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ! -
సంస్కరణలతో భారత్ వృద్ధికి దన్ను
న్యూఢిల్లీ: రాబోయే కొన్ని దశాబ్దాల పాటు భారత్‌కు వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణలు ఇందుకు ఊతంగా నిలవనున్నాయని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ముందు, తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు 2047 నాటికి సాధించదల్చుకున్న లక్ష్యాలకు గట్టి పునాదిగా ఉండగలవని చంద్రశేఖరన్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటి కి భారత్ 25–30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించగలదని ఆయన తెలిపారు. అయితే, అసంఘటిత రంగంలోని వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, మహిళలు సహా ప్రజలందరికీ ఆ ఫలాలు దక్కేలా చూసుకోవడం చాలా ముఖ్యమని చంద్రశేఖరన్ పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా వివరించారు. మహమ్మారి సమయం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు మరింతగా పుంజుకున్నాయని ఆయన చెప్పారు. -
నవంబర్‌లో ఎగుమతులు రూ.2.6 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఎగుమతు లు నవంబర్ నెలకు ఎలాంటి వృద్ధి లేకుండా 31.99 బిలియన్ డాలర్లు (రూ.2.62 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. 2021 నవంబర్ నెలలోనూ ఎగుమతులు 31.8 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఇక నవంబర్ నెలకు దిగుమతులు 55.88 బిలియన్ డాలర్లు (రూ.4.58 లక్షల కోట్లు)గా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో దిగుమతులు 53.93 బిలియన్ డాలర్లతో పోలిస్తే 4 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలోనూ ఎగుమతులు 16.65 శాతం తగ్గి 29.78 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు చూస్తే ఎగుమతులు 295.26 బిలయన్ డాలర్లుగా, దిగుమతులు 493.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2021 నవంబర్‌లో ఇవి వరుసగా 256.77 బిలియన్ డాలర్లు, 381.17 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. -
పెరుగుతున్న ఆర్థిక పొదుపులు
ముంబై: దేశంలో పొదుపు ఆర్థిక సాధనాల వైపు ప్రయాణిస్తోంది. ఈ ఆర్థిక పొదుపు 2026–27 నాటికి జీడీపీలో 74 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. దీనిపై బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2021–22 నాటికి రూ.135 లక్షల కోట్లుగా ఉంటే, 2026–27 నాటికి రూ.315 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా వేసింది. విధాన నిర్ణేతలు దీర్ఘకాలంగా పొదుపు నిధులు ఆర్థిక సాధనాల్లోకి మళ్లాలని కోరుకుంటున్నట్టు గుర్తు చేసింది. అంటే నగదు, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాలకు బదులు ప్రజలు మ్యూచువల్ ఫండ్స్, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈక్విటీ, ఇతర పెట్టుబడి సాదనాల్లో తమ పొదుపు నిధులను ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా డెట్, ఈక్విటీ మార్కెట్లలో అధిక లిక్విడిటీ మొత్తం ఆర్థికీకరణ అజెండాకు సాయపడుతున్నట్టు క్రిసిల్ పేర్కొంది. అయితే ఫైనాన్షియల్ మార్కెట్లలో ఎక్కువ కాలం పాటు అస్థిరతలు లేదా లిక్విడిటీ పరిస్థితులు ఇన్వెస్టర్ల అనుభవంపై ప్రభావం చూపించొచ్చని క్రిసిల్ హెచ్చరించింది. మద్దతు చర్యలు.. అందరికీ ఆర్థిక సేవలు చేరువ కావడం, డిజిటలైజేషన్, దీర్ఘకాలంగా మధ్య తరగతి ప్రజల ఖర్చు చేసే ఆదాయం పెరగడం, ఈ తరహా సాధనాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు అన్నీ కలసి.. పొదుపు నిధులు ఆర్థిక సాధనాల వైపు మళ్లేందుకు దోహదపడినట్టు క్రిసిల్ వివరించింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని వారికి ఆర్థిక సాధనాలను చేరువ చేసేందుకు పంపిణీపై దృష్టి సారించాలని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ జిజు విద్యాధరన్ సూచించారు. ఆయా ప్రాంతాల్లోని వారికి ఆర్థిక సాధనాలను చేరువ చేసేందుకు ప్రోత్సాహకాల అవసరాన్ని కూడా ప్రస్తావించారు. ఇన్వెస్టర్లు పెట్టుబడి సాధనాలను మరింత సరళంగా అర్థం చేసుకునేందుకు అన్నింటిపైనా ఒకే మాదిరి పన్ను విధానం ఉండాలన్నారు. -
భారత్ వృద్ధిరేటు అప్‌గ్రేడ్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను పలు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంస్థలు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రపంచబ్యాంక్ ఇందుకు భిన్నంగా మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. నిజానికి అక్టోబర్‌లోనే బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం భారత్ 2022–23 వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 1 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి దిగివచ్చింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొంది. దీనితోపాటు రెండవ (సెప్టెంబర్) త్రైమాసికంలో భారత్ ఎకానమీ వృద్ధి రేటు అంచనాలకు మించి 6.3 శాతంగా నమోదుకావడమూ తమ తాజా ఎగువముఖ సవరణకు కారణమని వివరించింది. భారత్ ఎకానమీ మొదటి త్రైమాసికంలో 13.5 శాతం పురోగతి సాధించిన సంగతి తెలిసిందే. ‘నావిగేటింగ్ ది స్ట్రోమ్’ (తుపానులో ప్రయాణం) శీర్షికన ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు... ► క్షీణిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు భారతదేశ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం చూపుతాయి. అయితే ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కె ట్లతో పోలిస్తే భారత్ ఎకానమీ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనగలుగుతోంది. ► మంచి డిమాండ్ వాతావరణంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తోంది. ► అయితే అంతర్జాతీయ పరిణామాలపై నిరంతర నిఘా అవసరం. అభివృద్ధి చెందిన దేశాల కఠిన ద్రవ్య పరపతి విధానాలు, రూపాయి పతనం, కమోడిటీ ధరల తీవ్రత, ఆయా అంశాల నేపథ్యంలో కరెంట్ అకౌంట్ సవాళ్లు దేశం ఎదుర్కొనే వీలుంది. దీనితోపాటు ఎగుమతుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి అవసరం. ►2023–24లో ఎకానమీ వృద్ధి రేటు 6.6%గా నమోదుకావచ్చు. ► భారీ పన్ను వసూళ్ల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2022–23లో లక్ష్యాల మేరకు జీడీజీలో 6.4%కి (విలువలో రూ.16.61 లక్షల కోట్లు) కట్టడి కావచ్చు. ఫిచ్ 7% అంచనా యథాతథం కాగా, ఫిచ్ రేటింగ్ 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను యథాతథంగా 7 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. -
రానున్న సంవత్సరాల్లోనూ 6.5 శాతం పైనే వృద్ధి
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి పట్ల కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత దశాబ్దంలో మిగిలిన సంవత్సరాల్లోనూ దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంపైనే ఉండొచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5–7 శాతం మధ్య ఉండొచ్చన్నారు. ఆర్బీఐతోపాటు అంతర్జాతీయ సంస్థలైన ఓఈసీడీ, ఐఎఎంఫ్ అంచనాలను ఆయన ప్రస్తావించారు. ‘‘ఈ సమయంలో ఇది సహేతుకమే. రెండో త్రైమాసికం వృద్ధి గణాంకాలు కొన్ని రోజుల్లో వెలువడనున్నాయి. దీంతో భవిష్యత్తుపై మరింత స్పష్టత వస్తుంది’’అని నాగేశ్వరన్ వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) భారత్ జీడీపీ వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని సిటీ గ్రూపు అంచనా వేయగా, ఎస్అండ్పీ రేటింగ్స్ 7.3 శాతంగా ఉంటుందని పేర్కొనడం తెలిసిందే. కానీ, ఇక నుంచి ఏటా వృద్ధి రేటు 6.5 శాతంపైనే ఉంటుందన్న అంచనాను నాగేశ్వర్ వ్యక్తీకరించారు. మూలధన పెట్టుబడుల సైకిల్ తిరిగి వేగాన్ని అందుకోవడం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, గత కొన్నేళ్లలో చేపట్టిన సంస్థాగత సంస్కరణలు మధ్యకాలానికి అధిక వృద్ధి రేటుకు బాటలు వేస్తాయన్నారు. వృద్ధికి మద్దతుగా, రేట్ల కఠినతరం విషయంలో ఆర్బీఐ కాస్త ఆచితూచి వ్యవహరించగా, నాగేశ్వరన్ దీనికి మద్దతుగా మాట్లాడారు. 2021–22లో రేట్ల కఠినతరం మరింత బలంగా ఉండాలన్నారు. -
భారత్ వృద్ధి రేటు 7 శాతానికి కోత: క్రిసిల్
ముంబై: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును రేటింగ్ సంస్థ క్రిసిల్ 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. దీనితో ఇందుకు సంబంధించి క్రిసిల్ అంచనా 7 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రతికూలతలు, పంట ఉత్పత్తికి సంబంధించి అందుతున్న మిశ్రమ ఫలితాలు, ఎగుమతులు తగ్గడం, పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న ప్రతికూలతలు తమ తాజా అంచనాలకు కారణంగా తెలిపింది. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం. 2022–23 తుది ఆరు నెలల్లో వృద్ధి 6.5 శాతం: ఇక్రా కాగా, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో (అక్టోబర్–మార్చి) భారత్ వృద్ధి 6.5 శాతానికి పరిమితం అవుతుందని మరో రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన పరపతి కమిటీ అంచనా 6.3 శాతంకన్నా ఇది అధికం కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 12.7 శాతం కావడం గమనార్హం. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
క్షీణిస్తున్న మునిసిపల్ కార్పొరేషన్ల ఆదాయం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్ల సొంత ఆదాయం, సామర్థ్యం క్షీణిస్తోందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. మునిసిపల్ కార్పొరేషన్ల ఆదాయ, వ్యయాలు దశాబ్ద కాలంలో దేశ జీడీపీలో ఒక్క శాతం వద్ద స్తబ్దుగా ఉన్నట్లు తెలిపింది. మెజారిటీ మునిసిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ కాగితాలకే పరిమితమని, వాస్తవికతను ప్రతిబింబించడం లేదని పేర్కొంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే గ్రాంట్లపైనే మునిసిపల్ కార్పొరేషన్లు ఆధారపడుతున్నాయని, సొంత ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించింది. దేశవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక స్థితిగతులపై ఆర్బీఐ తొలిసారిగా అధ్యయన నివేదికను విడుదల చేసింది. దక్షిణాఫ్రికా తరహాలో.. పెరుగుతున్న పట్టణ జనాభాకు తగినట్లుగా సేవల్లో నాణ్యత పెరిగేందుకు తక్షణం సొంత ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం దక్షిణాఫ్రికా తరహాలో సంస్కరణలు తేవాలని సూచించింది. బ్రెజిల్, రష్యన్ ఫెడరేషన్, చైనా, దక్షిణాఫ్రికాతో పోల్చి చూస్తే దేశంలో పట్టణ ప్రజలకు కనీస నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు అందించడం చాలా తక్కువ శాతం ఉందని తెలిపింది. పెరుగుతున్న పట్టణ జనాభాకు మెరుగైన మౌలిక సదుపాయాలు, కనీస ప్రాథమిక సేవలందించేందుకు ఆస్తి పన్ను సంస్కరణలతో పాటు పాలనా సంస్కరణలు తేవాలని సూచించింది. ఆస్తి పన్ను మరింత సమర్థంగా వసూలు చేసే చర్యలు చేపట్టడంతోపాటు యూజర్ చార్జీలు, ప్రకటన పన్ను, పార్కింగ్ ఫీజు, ట్రేడ్ లైసెన్సుల జారీలో పటిష్ట విధానాలను అమలు చేయాలని పేర్కొంది. రహదారులు, సీవరేజ్, మంచినీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పనకు మునిసిపల్ బాండ్లను జారీ చేయాలని సూచించింది. సీఆర్డీఏ బాండ్లతో అత్యధిక రుణం దేశంలో తొలిసారిగా 1997లో బెంగళూరు మునిసిల్ కార్పొరేషన్, 1998లో అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా రుణాలను సేరించాయని, 2000 సంవత్సరం వరకు తొమ్మిది మునిసిపల్ కార్పొరేషన్లు బాండ్ల జారీ ద్వారా రూ.1200 కోట్ల వరకు సమీకరించినట్లు నివేదికలో ప్రస్తావించింది. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ ప్రారంభమయ్యాక 2005 నుంచి మున్సిపల్ బాండ్ల జారీ ఆకస్మాత్తుగా నిలిచిపోయిందని పేర్కొంది. తిరిగి 2017–2021 మధ్యలో తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా రూ.3840 కోట్లను సమీకరించినట్లు పేర్కొంది. ఇందులో అత్యధికంగా ఏపీ సీఆర్డీఏ బాండ్ల ద్వారా రూ.2000 కోట్లు రుణం తీసుకున్నాయి. సొంత వనరులు పెంచుకునేలా.. ప్రైవేట్ భూ యజమానులపై భూమి విలువ పన్నులు, బెటర్మెంట్ లెవీ, డెవలప్మెంట్ చార్జీలు, ఖాళీ భూమి పన్ను మొదలైన మార్గాల ద్వారా సొంత ఆదాయ వనరులను పెంచుకోవాలని నివేదిక సూచించింది. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను మూలధన వ్యయం కోసం ప్రత్యేకంగా వినియోగించాలని పేర్కొంది. బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల ద్వారా మున్సిపాలిటీలకు రుణాల సేకరణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. తలసరి అప్పుల్లో తెలంగాణ టాప్ దేశంలో మునిసిపల్ కార్పొరేషన్ల తలసరి రుణాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. తలసరి అప్పు రూ.1750 ఉండగా బిహార్, మహారాష్ట్రలో రూ.600 ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో మునిసిపల్ కార్పొరేషన్లలో తలసరి అప్పు రూ.400 చొప్పున ఉంది. షరతుల బాండ్లతో అవరోధాలు దేశంలో మునిసిపల్ బాండ్లకు అనేక షరతులతో అనుమతించడం అవరోధంగా ఉందని నివేదిక తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో బాండ్ల జారీకి అనుమతించినా ద్వితీయ మార్కెట్ లేకపోవడంతో కీలకమైన అడ్డంకిగా ఉందని పేర్కొంది. ఈ సెక్యూరిటీల కోసం మరింత విస్తృతమైన పెట్టుబడిదారుల వ్యవస్థ అవసరమని సూచించింది. పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మునిసిపల్ బాండ్ల ద్వారా స్థిరమైన వనరుల సమీకరణకు ప్రోత్సహించాలని తెలిపింది. ఆర్థిక పెట్టుబడికి అవసరమైన వాతావరణం, సమర్థ నియంత్రణ, పారదర్శకత, మెరుగైన పాలనకు చర్యలు తీసుకోవాలని, స్టాక్ ఎక్సే్చంజీలలో మునిసిపల్ బాండ్లు నమోదయ్యేలా ద్వితీయ మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని పేర్కొంది. బాండ్ల జారీతో రూ.37,600 కోట్లు మునిసిపల్ పాలన మెరుగుపరచేందుకు దక్షిణాఫ్రికా రెండు దశాబ్దాలుగా పలు చర్యలు తీసుకుంది. మూడంచెల విధానంలో జనాభా ఆధారంగా షరతులు లేకుండా సమానంగా వనరుల పంపిణీ చేపడుతోంది. అక్కడ 97 మునిసిపాలిటీలు 4.7 బిలియన్ డాలర్లు (రూ.37,600 కోట్లు) బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించాయి. -
గ్లోబల్ వెల్త్ రిపోర్ట్–2022: ‘సంపాదన’లో సగం వారిదే
లేచింది మొదలు పడుకొనే వరకు ప్రపంచంలో ప్రతి మనిషీ జపించే కామన్ జపం ‘డబ్బు’. గుండె కూడా లబ్ ‘డబ్బు’.. లబ్ ‘డబ్బు’ అని కొట్టుకుంటుందని కొందరు చమత్కరిస్తుంటారు. ఏ పని చేసినా దాని వెనుక ఉండేది ‘సంపాదన’. ‘ఎంత సంపాదించావన్నది కాదు.. ఎలా బతికావన్నది ముఖ్యం’ అన్న సూత్రం రివర్సయింది. సంపాదనే ముఖ్యమైంది. ఇందులో అమెరికా, చైనా పౌరులు ఆరితేరారు. వ్యక్తిగత సంపాదనలో వారిదే సగం. మిగతా ప్రపంచానిది సగం. క్రెడిట్ సూయిస్ నివేదిక గణాంకాలతో ప్రత్యేక కథనం.. (ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): ఒక దేశం ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి జీడీపీ (జాతీయ స్థూల ఉత్పత్తి) గణాంకాలు చూస్తాం. ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడంలో మరో కొలమానం వ్యక్తిగత సంపద విలువ. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత సంపదను లెక్కగట్టి ఏ దేశ పౌరులు ఎక్కువ సంపాదిస్తున్నారో, ఎవరు విలువైన ఆస్తులు కూడగడుతున్నారో తెలుసుకోవచ్చు. ‘క్రెడిట్ సూయిస్’ సంస్థ ఏటా గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ విడుదల చేస్తుంది. ఇటీవల ‘గ్లోబల్ వెల్త్ రిపోర్ట్–2022’ విడుదల చేసింది. ఇందులో 2021 సంవత్సరం గణాంకాలను పేర్కొంది. 2021 ఆఖరునాటికి ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపద 463.6 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. అందులో సగం అమెరికా, చైనా పౌరుల సొంతమని, మిగతా సగం అన్ని దేశాల పౌరుల వ్యక్తిగత సంపదగా నివేదిక పేర్కొంది. మొత్తం వ్యక్తిగత సంపదలో అమెరికా పౌరులకు 31.5 శాతం వాటా కాగా, తర్వాత స్థానంలో ఉన్న చైనా పౌరుల వాటా 18.4 శాతం. 3.1 శాతం వాటాతో మనదేశం ఏడో స్థానంలో నిలిచింది. టాప్–10లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇండియా, కెనడా, ఇటలీ, ఆస్ట్రేలియా ఉన్నాయి. సంపద పంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే క్రెడిట్ సూయిస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. ప్రపంచంలోని 40 శాతం సంపద ఒక శాతం వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమైంది. 10 శాతం ధనికుల వద్ద 82 శాతం సంపద పోగుబడి ఉంది. ఎవరి దగ్గర సంపద ఉందని చెప్పడంకంటే.. ఎవరి దగ్గర లేదో చెప్పడం కూడా ముఖ్యమని నివేదిక రూపకర్త ‘ఆంతోనీ షోరాక్’ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని 50 శాతం వ్యక్తులకు 1 శాతం సందప మాత్రమే ఉందనే విషయాన్ని నొక్కి చెప్పారు. సంపద అందరికీ సమానంగా ఉండటం ఊహకు అందని విషయం. కానీ నిరుపేదలకు వేగంగా సందప పంపిణీ జరిగితేనే అసలు సంపదకు అర్థం చేకూరుతుంది. అభివృద్ధి దిశగా సమాజం వేగంగా అడుగులు వేస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రభుత్వాలకు నిజమైన అర్థం ఏదో రూపంలో సంపదను నిరుపేద వర్గాలకు అందించడమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నివేదికలో ముఖ్యాంశాలు.. ► భారీ ఆర్థిక శక్తుల వద్దే వ్యక్తిగత సంపద కూడా కూడుతోంది. అమెరికా, చైనా కలిసి ప్రపంచంలోని వ్యక్తిగత సంపదలో సగం ఉండగా, ఆయా దేశాల జీడీపీ ప్రపంచ దేశాల జీడీపీతో పోలిస్తే కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల జీడీపీలో అమెరికా వాటా 24 శాతం కాగా, వ్యక్తిగత సంపదలో 31.5 శాతం ఉండటం గమనార్హం. చైనా అలా లేదు. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 19 శాతం, వ్యక్తిగత సంపదలో ఆ దేశం వాటా 18.4 శాతం. అంటే.. అమెరికాలో జీడీపీకంటే వ్యక్తిగత సంపాదన వాటా ఎక్కువ ఉంటే.., చైనాలో ఇది తక్కువ. ► ప్రపంచంలోని వ్యక్తిగత సంపదలో 75 శాతం కేవలం 10 దేశాల్లోనే ఉంది. ► దశాబ్దం క్రితం ప్రపంచ వ్యక్తిగత సంపదలో చైనా వాటా 9 శాతం ఉండగా, ఇప్పుడు రెట్టింపు అయింది. ► 10 లక్షల డాలర్లు, అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తుల (మిలయనీర్ల) సంఖ్య 2021లో 7.9 లక్షలు. 2026 నాటికి ఈ సంఖ్య రెట్టింపై 16.23 లక్షలకు చేరుతుందని అంచనా. ► ప్రపంచ వ్యక్తిగత సంపద వాటాలో మన దేశం వాటా అంతగా పెరగలేదు. అయితే దేశంలో వ్యక్తిగత సంపదలో వృద్ధి నమోదవుతోంది. 2020తో పోలిస్తే 2021లో 12 శాతం వృద్ధి నమోదు చేసి 14.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మన దేశంలో ఒక్కో వ్యక్తికి ఉన్న సరాసరి సంపద విలువ 2000 సంవత్సరం నుంచి ఏటా 8.8 శాతం పెరుగుతోంది. 2021 ఆఖరుకు అది 15,535 డాలర్లకు చేరింది. అది ప్రపంచ సరాసరి వ్యక్తిగత సంపద (87,489 డాలర్లు)తో పోలిస్తే బాగా తక్కువ. ► ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 6.2 కోట్ల మంది మిలియనీర్లు ఉండగా, 2026 నాటికి వీరి సంఖ్య 8.75 కోట్లకు చేరుతుందని అంచనా. ► ప్రపంచంలోని డాలర్ మిలియనీర్లు మన దేశంలో ఒక శాతం ఉండగా, అమెరికాలో 39 శాతం మంది ఉన్నారు. చైనాలో 10 శాతం మంది, జపాన్, యూకే, ఫ్రాన్స్‌లో 5 శాతం చొప్పున, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియాలో 4 శాతం చొప్పున, ఇటలీ, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్‌లో 2 శాతం చొప్పున ఉన్నారు. తైవాన్, హాంకాంగ్, స్వీడన్లో ఒక శాతం చొప్పున ఉన్నారు. మిగతా 10 శాతం మంది ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో ఉన్నారు. -
అందరికీ ఉపాధి: పీపుల్స్ కమిషన్ కీలక నివేదిక
న్యూఢిల్లీ: ప్రభుత్వం పని చేసే హక్కును తీసుకురావాల్సిన అవసరం ఉందని, అందరికీ ఉపాధి కల్పించేందుకు వీలుగా జీడీపీలో ఏటా 5 శాతం చొప్పున (సుమారు రూ.13.52 లక్షల కోట్లను) కేటాయించాలని ఓ సంస్థ సూచించింది. దేశ్ బచావో అభియాన్ ఏర్పాటు చేసిన ‘పీపుల్స్ కమిషన్ ఆన్ ఎంప్లాయిమెంట్, అన్ఎంప్లాయిమెంట్’ ఈ నివేదికను విడుదల చేసింది. ఏవో నామమాత్రపు నిధుల కేటాయింపులతో పూర్తి స్థాయి ఉపాధి కల్పన అసాధ్యమని అభిప్రాయపడింది. చట్టంలోనూ, సామాజిక-రాజకీయ, ఆర్థిక విధానాల్లోనూ గణనీయమైన మార్పులు అవసరమని పేర్కొంది. దేశ పౌరులకు తగినంత ఉపాధి కల్పించేందుకు ‘రైట్ టు వర్క్’ చట్టాన్ని తేవాలని కోరింది. దేశంలో పనిచేసేందుకు 21.8 కోట్ల మంది సిద్ధంగా ఉన్నారంటూ.. వీరికి ఉపాధి కల్పించేందుకు జీడీపీలో ఏటా 5 శాతం నిధుల కేటాయింపు అవసరాన్ని ప్రస్తావించింది. అలాగే, ఏటా ఒక శాతం చొప్పున ఐదేళ్లపాటు పెంచుతూ వెళ్లాలని సూచించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని పొందుతున్న వారిని ఈ గణాంకాల నుంచి మినహాయించింది. ఉపాధి కల్పన పెరిగితే అది పెద్ద ఎత్తున ఉత్పత్తికి దారితీస్తుందని, తద్వారా డిమాండ్ బలోపేతం అవుతుందని సూచించింది. ప్రస్తుతం దేశంలో 30.4 కోట్ల మందికే సరైన ఉపాధి ఉన్నట్టు తెలిపింది. -
భారత్ వృద్ధికి ఐఎంఎఫ్ రెండో కోత
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తన తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ తగ్గించడం ఇది వరుసగా రెండోసారి. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా వెలువరించింది. అయితే జూలైలో దీనిని 7.4 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను మరింతగా 6.8 శాతానికి ఐఎంఎఫ్ కుదించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ అవుట్‌లుక్ విడుదలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)సహా పలు జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ ఆర్థిక, విశ్లేషణా సంస్థలు 2022–23 భారత్ వృద్ధి అంచనాలను కుదిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, ప్రపంచంలోనే వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుండడం గమనార్హం. 2021–22లో భారత్ వృద్ధి రేటు 8.2 శాతం. ఐఎంఎఫ్ మంగళవారం విడుదల చేసిన వార్షిక ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’లో ఈ విషయాలను వెల్లడించింది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత తగ్గిందని విశ్లేషించింది. అంతర్జాతీయ డిమాండ్ తగ్గడం కూడా ప్రతికూల ప్రభావానికి దారితీస్తోందని వివరించింది. ప్రపంచ వృద్ధి 3.2 శాతమే... 2021లో ప్రపంచ వృద్ధి 6 శాతం ఉంటే, 2022లో ఇది 3.2 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. 2023లో ఈ రేటు మరింతగా 2.7 శాతానికి పడిపోతుందని అవుట్‌లుక్ అంచనావేసింది. 2001 తర్వాత ప్రపంచ వృద్ధి ఈ స్థాయిలో బలహీనపడటం (అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కోవిడ్–19 తీవ్ర స్థాయి కాలాలతో పోల్చితే) ఇదే తొలిసారి. అవుట్‌లుక్ ప్రకారం, అమెరికా జీడీపీ 2022 తొలి భాగంలో క్షీణతలోకి జారింది. 2023లో ఒక శాతం వృద్ధి నమోదుకావచ్చు. -
క్యూ1లో తగ్గిన భారత్ విదేశీ రుణ భారం
ముంబై: భారత్ విదేశీ రుణ భారం 2022 జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చితే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 2.5 బిలియన్ డాలర్లు తగ్గి 617.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన సమాచారం ప్రకారం, 2022 మార్చి త్రైమాసికంలో జీడీపీ విలువలో విదేశీ రుణ నిష్పత్తి 19.9 శాతం అయితే, ఇది జూన్ త్రైమాసికానికి 19.4 శాతానికి దిగివచ్చింది. డాలర్ మారకంలో భారత్ రూపాయి, ఇతర కరెన్సీ విలువల సర్దుబాటు, లాభ నష్టాల నేపథ్యం రుణ భారం తగ్గడానికి కారణమని గణాంకాలు పేర్కొన్నాయి. ‘వాల్యుయేషన్ ప్రభావం మినహాయిస్తే, విదేశీ రుణం 2022 మార్చి చివరితోపోల్చి 2022 జూన్ చివరి నాటికి 2.5 బిలియన్ డాలర్లు తగ్గడానికి బదులుగా 11.9 బిలియన్ డాలర్లు పెరిగింది‘ అని కూడా సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. కాగా, 2022 చివరినాటికి దీర్ఘకాలిక రుణం (ఏడాది కన్నా ఎక్కువ వాస్తవ మెచ్యూరిటీ విషయంలో) 487.3 బిలియన్ డాలర్లుగా ఉందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. 2022 మార్చి చివరి నాటితో పోల్చితే ఈ విలువ 10.6 బిలియన్ డాలర్లు తగ్గడం గమనార్హం. -
కరిమింగిన వెలగపండులా దేశ ఆర్థిక వ్యవస్థ
దేశంలో ఈ 8 ఏళ్లల్లో బిలియనీర్ల సంఖ్య అనూహ్యంగా పెరగడం, వారి కారణంగా దేశ స్థూల ఉత్పత్తిలో పెరుగుదల కనిపించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ 5వ స్థానాన్ని ఆక్రమించడం ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఘనతగా చెప్పు కొంటోంది. ఓ దశాబ్దం క్రితం వరకు భారత్ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది. ఇప్పుడది 5వ స్థానా నికి ఎగబాకింది. అది కూడా కోవిడ్ సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి, అప్పటివరకు ఐదవ స్థానంలో ఉన్న బ్రిటన్ను వెనక్కు నెట్టి ఆ స్థానంలో నిలబడింది కనుక అది విజయంగా ఎన్డీఏ భావిస్తోంది. దేశంలో అదుపు తప్పిన ధరలు, నిరుద్యోగం, దిగుమతులలో వృద్ధి, ఎగుమతులలో క్షీణత, రూపాయి పతనం, తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు... ఇన్ని సమస్యల నేపథ్యంలో దేశం ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న విషయం విస్మరించరానిది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటడం అన్నది నిజానికి ప్రస్తుత యూరప్ సంక్షోభ పరిస్థితులలో గొప్ప విజయమేమీ కాదు. బ్రిటన్‌లో చాలాకాలంగా ద్రవ్యోల్బణం రెండంకెలు దాటింది. బ్రిటన్‌లోని అన్ని వర్గాల ఉద్యోగులు, ముఖ్యంగా రైల్వే కార్మికులు, రేవు కార్మికులు, పోస్టల్ కార్మికులు అధిక వేతనాలను డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు. తమ కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిన దృష్ట్యా వేతనాలు పెంచాలని వారు కోరుతున్నారు. ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, చివరకు వైట్ కాలర్ ఉద్యోగులుగా పేర్కొనదగ్గ ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టడంతో ఇది వరకు ఎన్నడూలేని రీతిలో బ్రిటన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్క బ్రిటన్ లోనే కాదు.. స్పెయిన్, జర్మనీ, బెల్జియం తదితర సంపన్న యూరోపియన్ దేశాలలో పరిస్థితులు ఏమంత మెరుగ్గా లేవు. జర్మనీలో ఇటీవల పైలెట్లు సమ్మె చేయడంతో వంద లాది విమానాల రాకపోకలు నిలిచిపోయి, దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగింది. భారతదేశంలో చాలాకాలం క్రితమే పలు కార్మిక చట్టాలను రద్దు చేశారు. లాభాలలో నడుస్తున్న పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడి కార్మికులు, రాజకీయ పార్టీలవారు ఏమీ చేయలేని నిస్సహా యస్థితిలో ఉన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అనూహ్యంగా పెరిగినా ప్రజలు మౌనంగానే భారాన్ని మోస్తున్నారు. నిర్మాణరంగంలో ఇసుక, స్టీలు, సిమెంటు ధరలు 40 శాతం కంటే మించి పెరిగాయి. ఇక జీఎస్టీని అత్యధికంగా దాదాపు అన్ని వస్తువులపై విధించడంతో పేద ప్రజలు సైతం ధరాఘాతానికి గురవుతున్నారు. కొన్ని రకాలైన ఎరువుల ధరలు 40 నుంచి 80 శాతం మేర పెరగడంతో రైతులపై అదనపు భారం పడింది. దేశ ఆర్థికాభివృద్థి రేటును, స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను బ్రిటన్‌తో పోలుస్తున్న కేంద్ర ప్రభుత్వం... మానవాభివృద్ధి సూచికలలో మనం ఏ స్థానంలో ఉన్నామో ఎందుకు వెల్లడించడం లేదు? ఐక్యరాజ్యసమితి తాజాగా వెలువరించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో భారత్ స్థానం 132 కాగా, బ్రిటన్‌ది 18వ స్థానం. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాల ప్రకారం మన దేశంలో 22 శాతం ప్రజల సగటు ఆదాయం రోజుకు రూ. 160 మాత్రమే. దేశ జనాభాలో 27.9 శాతం మంది ఇంకా పేదరికంతో విలవిల లాడుతున్నారని తాజా సర్వే వెల్లడించింది. కొన్నేళ్లుగా దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దేశంలోని 21.7 శాతం సంపద కేవలం ఒక శాతంగా ఉన్న బిలియనీర్ల చేతుల్లో ఉండగా, 19.8 శాతం సంపద మాత్రమే 40 శాతం మంది దేశ ప్రజల్లో ఉన్నట్లు సర్వేలో తేలింది. అసమానతలు అన్నవి ఆర్థికంగానే కాక ఇంకా లింగ (జెండర్) అసమానతలు, సామాజిక (సోషల్) అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ నాణేనికి రెండో వైపు ఉన్న పార్శ్వం. ఇక డాలర్‌తో రూపాయి విలువ క్షీణత ఇంత సుదీర్ఘంగా సాగడం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. ఇందుకు కారణం వాణిజ్యలోటు భారీగా పెరగడమే. గత సెప్టెంబర్‌లో 2020– 21 వాణిజ్యలోటు 11.7 బిలియన్ల డాలర్లు ఉండగా, ఈ ఆగస్ట్ 2022 నాటికి 28.7 బిలియన్ల డాలర్లకు చేరింది. అంటే లోటు వృద్ధిరేటు దాదాపు 250 శాతం. దిగుమతుల్లో వృద్ధి నానాటికీ పెరిగిపోతుండగా ఎగుమతుల వృద్ధిరేటులో క్షీణత నమోదవుతోంది. తాజా రాజకీయ కారణాలతో దేశం నుంచి ఎగుమతి అయ్యే బాస్మతియేతర, నాన్ పారాబాయిల్డ్ బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం విధించడం ద్వారా బియ్యం ఎగుమతిని కేంద్రం నియంత్రించింది. మరోపక్క, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రపంచంలోని పలు దేశాలు భారత్ నుంచి ద్విచక్రవాహనాలు, ఆటో మొబైల్ విడిభాగాలు మొదలైన వాటిని దిగుమతి చేసుకోవడం నిలిపివేశాయి. దీంతో ఎగుమతుల ద్వారా లభించే విదేశీ మారక ద్రవ్య ఆదాయం తగ్గింది. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న దుష్ఫలితాలేమిటన్నది నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘ఆర్థిక సర్వే 2022’లోనే వెల్లడైంది. అధిక ధరల కారణంగా పేద, మధ్య తరగతి ప్రజల పొదుపు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క ఏడాది కాలంలో, అంటే గత ఏడాదిలో ధనవంతులు 13 లక్షల కోట్ల సంపద ఆర్జించగా, 15 కోట్లమంది పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం 53 శాతం తగ్గిపోయినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం ఆర్ధికాభివృద్ధి రేటు సాధించాలంటే జీడీపీలో 39 శాతం పెట్టుబడులు కీలక రంగాలలో పెట్టాలి. కానీ, ఈ రంగాలలో వస్తున్న ప్రైవేటు పెట్టుబడులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు చేకూర్చే ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం’కు కేటాయించే నిధులలో ప్రతి ఏటా కోత విధిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న వివిధ పథకాలలో కోత పడుతోంది. ఇదికాక, పేదలకు అందిస్తున్న గృహ నిర్మాణ పథకం మందగించింది. ఈ పరిణామాలన్నీ దేశంలోని పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజల, రైతుల జీవనాన్ని దుర్భరం చేస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పైకి నిగనిగలాడుతున్నట్లు కనిపిస్తున్నా లోపల డొల్లమాదిరిగా ఉంది. మరోరకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ‘కరి మింగిన వెలగపండు’లా ఉంది. - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
దేశానికి కరెంట్ అకౌంట్ లోటు కష్టాలు
ముంబై: భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ– క్యాడ్) కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ లోటు అదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 5 శాతానికి చేరే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. అదే విధంగా 2022–23లో 3.5 శాతంగా ఉండే వీలుందని అంచనావేసింది. దేశం నుంచి ఎగుమతులు తగ్గుతుండడం, దిగుమతుల పెరుగుదల, దీనితో భారీగా పెరగనున్న వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) వంటి అంశాలు క్యాడ్ ఆందోళనకు కారణమని ఇక్రా విశ్లేషించింది. నివేదికకు సంబంధించి ముఖ్యాంశాలు... ►ఒక్క ఆగస్టును తీసుకుంటే వాణిజ్య లోటు రెట్టింపై 28.7 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్ ఎగుమతులు 20 నెల్లో మొదటిసారి ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా 1.15 శాతం మేర క్షీణించడం, (విలువలో 33 బిలియన్ డాలర్లు) దిగుమతులు 37 శాతం పెరిగి, 61.68 బిలియన్ డాలర్లుగా నమోదవడం దీనికి కారణం. ఎగుమతుల ద్వారా ఆదాయం తగ్గడం క్యాడ్‌పై ప్రభావం చూపింది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో క్యాడ్ విలువ ఆల్‌టైమ్ హై 41 బిలియన్ డాలర్ల నుంచి 43 బిలియన్ డాలర్ల శ్రేణిలో (జీడీపీ విలువ అంచనాలో దాదాపు 5 శాతం) నమోదుకావచ్చు. 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఈ విలువ 30 బిలియన్ డాలర్లుగా ఉంది. ►అయితే ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో (అక్టోబర్–మార్చి) క్యాడ్ 2.7 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. దీనివల్ల ఆర్థిక సంవత్సరం మొత్తంలో క్యాడ్ 3.5 శాతానికి పరిమితం కావచ్చు. కమోడిటీల బిల్లు తగ్గే అవకాశాలు, సీజనల్‌గా ఎగుమతులు కొంచెం మెరుగుపడే పరిస్థితులు దీనికి కారణం. అయితే దిగ్గజ ఎకనామీల్లో మాంద్యం పరిస్థితుల వల్ల దేశం వస్తు, సేవల ఎగుమతులు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ►ఆర్థిక సంవత్సరం (2022–23)లో క్యాడ్ 120 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.5 శాతం)గా ఉండే వీలుంది. 2021–22లో ఈ విలువ కేవలం 38.7 బిలియన్ డాలర్లు. అంటే జీడీపీలో 1.2%. ►ఇక రూపాయి విషయానికి వస్తే, 2022 రానున్న కాలంలో డాలర్ మారకంలో రూపాయి విలువ 78.5–81 శ్రేణిలో తిరిగే వీలుంది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ఈక్విటీ ఇన్‌ఫ్లోస్ పెరగవచ్చు. ►2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. భారత్ వద్ద ప్రస్తుతం (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకోడానికి దోహదపడతాయి. రూపాయి తీవ్ర ఒడిదుడుకులను నివారిస్తాయి. క్యాడ్ అంటే... ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
తగ్గేదెలే! అగ్రరాజ్యం బ్రిటన్ను దాటేసిన భారత్.. మరింత బలంగా..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను తట్టుకొని నిలబడ్డ భారత్ ప్రపంచ పటంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అగ్రరాజ్యమైన బ్రిటన్ను దాటి అయిదోస్థానంలోకి దూసుకుపోయింది. 2022 మార్చి చివరి నాటికి భారత్ ప్రపంచంలోని బలమైన ఆర్థిక దేశాల్లో అయిదో స్థానంలో ఉందని బ్లూమ్‌బర్గ్ సంస్థ తాజా కథనంలో వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి సేకరించిన జీడీపీ గణాంకాలు, డాలర్‌తో మారకపు రేటు ఆధారంగా బ్లూమ్‌బర్గ్ లెక్కలు వేసి ఒక నివేదికను రూపొందించింది. ప్రపంచంలో బలమైన ఆర్థిక దేశంగా అమెరికా మొదటి స్థానంలోనూ, చైనా రెండో స్థానంలో ఉంటే జపాన్, జర్మనీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. పదేళ్ల క్రితం పదకొండో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు బ్రిటన్ను ఆరో స్థానానికి నెట్టేసి అయిదో స్థానానికి ఎగబాకింది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లు ఉంటే, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 816 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది భారత్‌రూపాయితో పోల్చి చూస్తే బ్రిటన్ పౌండ్ విలువ 8% మేరకు క్షీణించింది. మరోవైపు భారత్ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 7శాతానికి పైగా నమోదు చేయవచ్చునని అంచనాలున్నాయి. 2021–22లో మన దేశం 8.7% వృద్ధి నమోదు చేసింది. అయితే తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి సూచిలో మాత్రం మనం బ్రిటన్ కంటే వెనుకబడి ఉండడం గమనార్హం. విద్య, ఆరోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలతో కొలిచే మానవ అభివృద్ధిలో బ్రిటన్ 1980లో ఉన్నప్పటి స్థితికి చేరాలన్నా మనకు మరో పదేళ్లు పడుతుందని ఆర్థిక వేత్తలంటున్నారు. వలస పాలకుల్ని నెట్టేయడం గర్వకారణం దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకొని ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ మన దేశం అయిదో స్థానానికి చేరుకోవడంతో కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దేశాన్ని వలస రాజ్యంగా మార్చి పరిపాలించిన బ్రిటన్నే ఆర్థికంగా వెనక్కి నెట్టేయడం ప్రతీ భారతీయుడు గర్వించాల్సిందేనని ట్వీట్లు చేశారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కర్మ సిద్ధాంతం పని చేసిందని, దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ప్రతీ భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుందని ట్వీట్ చేస్తే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ‘‘రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్’’ అన్న సూత్రంతోనే విజయం సాధించామని, ప్రధాని నరేంద్ర మోదీకే ఈ క్రెడిట్ దక్కుతుందని ట్విటర్లో పేర్కొన్నారు. ఆర్థిక కష్టాల్లో బ్రిటన్ బ్రిటన్ గత కొన్నేళ్లుగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులకి బతుకు భారమైపోయింది. ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటోంది. 2021 ద్వైమాసికంలో బ్రిటన్ జీడీపీ కేవలం 1% మాత్రమే పెరిగింది. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కోలేక ఆర్థికంగా చతికిల పడిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ అస్థిరత్వం, బోరిస్ జాన్సన్ రాజీనామా వంటివి ఆ దేశాన్ని మరింత కుదేల్ చేశాయి. 2024 వరకు ఇవే పరిస్థితులు ఉంటాయని బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేస్తోంది. -
ఆ మార్పులతోనే ఆర్థికాభివృద్ధి
గత 75 ఏళ్ళలో ప్రపంచ ఆర్థిక దిగ్గజాల సరసన భారత్ చోటు నిలుపుకొంది. సంపద పంపిణీకి సంబంధించినంత వరకు మాత్రం అలా ఉండకపోవచ్చు. సాధారణ జీడీపీ పరంగా చూస్తే ప్రపంచంలోనే ఆరవ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. దశాబ్దాలుగా విధానాల్లో, స్తంభించిన వృద్ధిరేట్లలో మార్పు చేసుకుంటూ వచ్చిన ఫలితంగానే దేశం ఈ స్థాయికి చేరు కుంది. ఇదో సుదీర్ఘ ప్రయాణం. 1700లో ప్రపంచ ఆదా యంలో 22.6 శాతంగా ఉన్న భారత్ వాటా 1947 నాటికి 3 శాతానికి పడిపోయింది. 1947 నాటికి జాతీయ దిగుబడిలో పారిశ్రామిక రంగ వాటా 7.5 శాతం ఉండేది. కానీ 35 కోట్లమంది శ్రామికుల్లో 25 లక్షల మందికే పారిశ్రామిక రంగం ఉపాధి కల్పించింది. అప్పట్లో దేశ జీడీపీలో సగభాగం వ్యవసాయం నుంచే వచ్చేది. రూ. 249 తలసరి ఆదాయంతో అతి పేద దేశాల్లో ఒకటిగా భారత్ మిగిలింది. ఈ నేపథ్యంలోనే నూతనంగా ఎంపికైన ప్రభుత్వాధినేత ప్రథమ భారత ప్రధాని నెహ్రూ దేశాన్ని దారిద్య్రం నుంచి బయటకు లాగే లక్ష్యంతో విధానాల రూపకల్పన ప్రారంభిం చారు. నెహ్రూ విశ్వసించే సామ్యవాద ఆదర్శాలు ఆర్థిక ప్రణాళికకు పునాదిరాయిగా నిలిచాయి. దీంతోనే భారీ స్థాయి ప్రభుత్వ యాజమాన్య సంస్థల ఏర్పాటు వేగం పుంజుకుంది. ‘ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్–1948’ ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రతిపాదించింది కానీ ఆ వ్యవస్థ పగ్గాలు మాత్రం పబ్లిక్ సెక్టార్‌కే ఉద్దేశించబడ్డాయి. ‘రెండో ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ –1956’ ప్రభుత్వ రంగ సంస్థలు ఏ రంగాలను నియంత్రించవచ్చు, వేటిని ప్రైవేట్ రంగానికి వదిలిపెట్టవచ్చు అనే విషయంలో ముఖ్యమైన విభజనరేఖ గీసింది. భారీయెత్తున మూలధనం అవసరమైన పరిశ్రమలను చాలావరకు పబ్లిక్ సెక్టార్‌కి పరిమితం చేయగా, వినియోగ సరకుల తయారీని ప్రైవేట్ పరిశ్రమలకు ఉద్దేశించారు. నాటి ప్రధాన ఆర్థికవేత్త, గణాంక శాస్త్రవేత్త పీసీ మెహలనోబిస్ మార్గదర్శకత్వంలో ఈ విధాన ప్రకటనను రూపొందించారు. తర్వాత అనేక సంవత్సరాలు ఇదే ఆర్థిక విధానాల మార్గదర్శక సూత్రంగా మారింది. భారీ పరిశ్రమలపై ప్రధానంగా దృష్టిపెట్టడం వల్ల వ్యవ సాయ రంగం నిర్లక్ష్యానికి గురైంది. దీంతో 1950ల చివరి నాటికి దేశంలో ఆహార కొరత ఏర్పడింది. ‘పబ్లిక్ లా 480’ కింద అమెరికా నుంచి దిగుమతులపై భారత్ ఆధారపడాల్సి వచ్చింది. ఈ ‘పబ్లిక్ లా 480’ మిగులు ఆహార ధాన్యాలను ఉచితంగా అందించేది. అయితే అధిక దిగుబడి వంగడాలను ప్రవేశపెట్టినందున హరిత విప్లవం దేశంలో మరో మలుపు నకు దారి తీసింది. విస్తృతంగా పంటల ఉత్పత్తి సాధ్యమై, సమృద్ధిగా ఆహారధాన్యాలు అందుబాటు లోకి వచ్చాయి. ఇందిరాగాంధీ పాలనాకాలంలో లైసెన్స్‌రాజ్ వ్యవస్థ బలపడింది. అవినీతి స్థాయి పెరిగిపోయింది. ప్రైవేట్ పరిశ్రమల రంగం ఉక్కిరిబిక్కిరైంది. ఉపాధి నష్టాలను నిరోధించడానికి బ్యాంకింగ్ పరిశ్రమ, విదేశీ చమురు కంపెనీలు, పలు రోగగ్రస్థ కంపెనీల జాతీయీకరణ పథకాలను వరుసగా చేపడుతూ పోయారు. దేశంలో అనేక ప్రైవేట్ బ్యాంకులు కుప్పకూలిపోయి, సామాన్యులు భారీ నష్టాలకు గురైన నేపథ్యంలోనే బ్యాంకుల జాతీయీకరణ చేయాల్సి వచ్చిందని తప్పక గుర్తుంచుకోవాలి. జాతీయీ కరణ వల్ల పేద వ్యక్తి కూడా ఇప్పుడు అతి కొద్ది నగదుతోనే బ్యాంక్ ఖాతాను తెరవగలడు. ఇది ఆర్థిక వ్యవస్థలో సామాన్యుల చేరికకు వీలు కల్పించిన తొలి అడుగు. చమురు కంపెనీల జాతీయీకరణ అనేది హైడ్రో కార్బన్లకు సంబంధించినంతవరకు దేశ వ్యూహాత్మక భద్రతకు హామీ కల్పించింది. అయితే రోగగ్రస్థ ప్రైవేట్ కంపెనీలను స్వాధీన పర్చుకోవడం ఘోర తప్పిదమైంది. దీంతో అనేక దశాబ్దాల పాటు దేశం భారీ ఆర్థిక చెల్లింపుల్లో ఇరుక్కుపోయింది. ఖాయిలా పడిన ఈ సంస్థలను సాధారణ మూసివేతకు అనుమతించి, వాటి స్థానంలో కొత్త వెంచర్లను ప్రారంభిం చాలని నిర్దేశించి ఉంటే బాగుండేది. 1980ల వరకు ఈ సోషలిస్టు పాలసీలు భారత వృద్ధి రేటును 3 నుంచి 4 శాతానికే పరిమితం చేస్తూ వచ్చాయి. దీన్ని ‘హిందూ వృద్ధి రేటు’ అని వ్యంగ్యంగా పేర్కొంటూ వచ్చారు. 1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ క్రమాన్ని ప్రారంభించవలసి వచ్చింది. ఈ నూతన విధానాలు లైసెన్స్‌రాజ్ వ్యవస్థ ఆంక్షల నుంచి పరిశ్రమను విముక్తి చేసి, సులభతరమైన దిగుమతులు, విదేశీ పోటీకి అనువుగా ఆర్థిక వ్యవస్థను బార్లా తెరిచాయి. ఫలితంగా 1990ల మధ్య నుంచి వృద్ధి రేటు 7 –8 శాతానికి ఉన్నట్లుండి పెరిగింది. సంస్కరణలను తీవ్రతరం చేయడమే కాక అనేక ప్రభుత్వ రంగ కంపెనీలను సాహసోపేతంగా ప్రైవేటీకరించిన వాజ్‌పేయి వరకు ఈ వృద్ధి కొనసాగింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2014లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన అభివృద్ధి మందగించినట్లు కనిపించింది. పెద్ద నోట్ల రద్దు విధానం, జీఎస్టీ ప్రారంభం, కోవిడ్ మహమ్మారి, చమురు ధరలు, సరఫరాపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వంటివి అందుకు కారణాల్లో కొన్ని. అయితే, దిశా నిర్దేశం చేసిన 1991 నాటి సంస్కరణల కాలంతో పోలిస్తే నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవి. దేశ ఆర్థిక వ్యవస్థ ముందంజ వేసినప్పటికీ, నలిపివేస్తున్న దారిద్య్రం ఇప్పటికీ కొనసాగుతోంది. అంత ర్జాతీయ రంగంలో ఐటీ పరిశ్రమ బలమైనశక్తిగా మారినం దున దేశం కూడా గొప్పగా ముందడుగు వేసింది. పైగా బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించిన వెంచర్లుగా పేరుపడిన యూనికార్న్‌లను అత్యధికంగా స్థాపించిన మూడో అతి పెద్ద దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అదే సమయంలో, ప్రత్యేకించి కరోనా తర్వాత నిరుద్యోగం పెరిగిన గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రం కొనసాగుతోంది. (క్లిక్: పండించినవారికే తిండికి కొరతా!?) గ్రామీణ, కుటీర పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా క్షేత్రస్థాయిలో మరిన్ని ఉద్యోగాలను ప్రభుత్వం సృష్టించాల్సిన అవసరం ఉంది. గాంధీ దీన్నే ప్రబోధిస్తూ వచ్చారు. జీడీపీలో వాటా తగ్గినా, వ్యవసాయరంగం నేటికీ 50 శాతం ఉద్యోగితను కల్పిస్తున్నందున రైతుల ప్రయోజనాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. రానున్న సంవత్సరాల్లో విస్తృతంగా వేరవుతున్న రెండు ఇండియాల మధ్య డిజిటల్ అంతరాన్ని పూరించాలి. ప్రపంచ స్థాయి ఐటీ పరిశ్రమ ఉన్నప్పటికీ మహమ్మారి కాలంలో మొబైల్ ఫోన్లు లేక విద్యకు ఎంతోమంది పిల్లలు దూరమయ్యారు. 2022–23లో భారత్ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవుతుందని అంచనా. ఆ మాటెలా ఉన్నా, నిరుపేదల స్థితిగతుల్ని మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. (క్లిక్: మా వాటా మాకిచ్చారా?) - సుష్మా రామచంద్రన్ సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో...) -
ఉచితం అనుచితమా! పేదలకు ఎందుకివ్వొద్దు?
ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించడం ఆర్థిక వ్యవస్థకు మంచిదా, కాదా అంటూ దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉచిత పథకాలపై ఇటీవలి సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సామాజిక విశ్లేషకులు ఘాటుగానే స్పందిస్తున్నారు. వాటిని ఎంతసేపూ ఉచితాలుగానే చూడటానికి బదులు సంక్షేమ పథకాలుగానో, లేదా సామాజిక పెట్టుబడిగానో ఎందుకు చూడటం లేదన్నది వారి ప్రశ్న. ఉచితంగా సైకిళ్లు, టీవీలు, కేబుల్ కనెక్షన్ ఇస్తే వృథా కింద లెక్కించవచ్చేమో గానీ విద్య, ఆరోగ్యం, వైద్యం తదితర రంగాలపై పెట్టే ఖర్చు అంతకంతకూ లాభాలు తెచ్చిపెట్టేదే కదా అన్నది వారి వాదన. ఇది ఒక్కరో, ఇద్దరో కాదు, ఏకంగా ముగ్గురు నోబెల్ గ్రహీతలు చెప్పిన మాట! బడికి వెళ్లేందుకు అయ్యే ఖర్చును తగ్గిస్తే మరింత ఎక్కువ మంది చదువుకోగలుగుతారని ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత ఆర్థికవేత్తలు అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫెలో స్పష్టం చేశారు. బడి ఫీజులను తగ్గించడం లేదా తొలగించడం, ఏపీలో అమలు చేస్తున్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితరాల రూపంలో తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలివ్వడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. పలు దేశాల్లో విద్యాపరమైన కార్యక్రమాలను పరిశీలించిన మీదట నిరూపితమైన ఆసక్తికరమైన విషయమిది! బాలల హక్కులపై పోరాడిన నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి పేదరికం, నిరుద్యోగిత సమస్యలను అధిగమించేందుకు విద్య అత్యంత కీలకమని 2015లోనే చెప్పారు. భారత్‌లో విద్యపై పెడుతున్న పెట్టుబడులు తక్కువగా ఉన్నాయని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘జాతీయ స్థూల ఉత్పత్తిలో ప్రస్తుతం 3 శాతం మాత్రమే విద్యపై వెచ్చిస్తున్నారు. దీన్ని కనీసం రెట్టింపు చేయాల్సిన అవసరముంది’’ అని స్పష్టం చేశారు. పేద పిల్లల విద్యపై ఖర్చు చేసే ప్రతి రూపాయి భవిష్యత్తులో జీఎస్డీపీకి కనీసం 2 రూపాయలు జత చేస్తుందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ‘మరీ ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే పేదలు పేదలుగానే మిగిలిపోతారు‘ అంటూ హెచ్చరించారు. సామాజిక పెట్టుబడి∙ ఉచితం పేరిట ప్రచారంలో ఉన్న పథకాలన్నీ అక్షరాలా ఉచితం కాదు. యూపీలో ఉచిత సైకిళ్లు, తమిళనాడులో కేబుల్ కనెక్షన్ల వంటివాటిని కచ్చితంగా వనరుల వృథాగానే చెప్పాలి. కానీ, విద్య, ఆరోగ్యం, వైద్యం వంటి రంగాలపై పెట్టే ఖర్చు అంతకంతకూ లాభాలు తెచ్చిపెట్టేదే. దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేదే. విద్య, నైపుణ్యాలున్న వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్పాదకతా మెరుగ్గా ఉంటుంది. ఈ రెండూ ఆర్థిక వృద్ధికే తోడ్పడతాయి. అక్షరాస్యత, ఉన్నత విద్య ఉన్న సమాజాల్లో సమస్యలపట్ల అవగాహన, సామాజిక చైతన్యం సహజంగానే ఎక్కువగా, సామాజిక రుగ్మతలు తక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ లెక్కల ప్రకారం చదువుకునేందుకు మెరుగైన అవకాశాలు కల్పించడం, వసతులు ఏర్పాటు చేయడం సామాజిక పెట్టుబడి. వీటిపై వెచ్చించే ప్రతి రూపాయీ కనీసం రెండు రూపాయల దాకా లాభం తెచ్చిపెడుతుందని అంచనా. ‘ఆసుపత్రుల ఆధునీకరణ, సౌకర్యాల పెంపు, కొత్త వైద్య కళాశాల వంటి ఆరోగ్య రంగ పెట్టుబడులు ప్రజల ప్రాణాలు కాపాడటమే గాక కుండా ఆరోగ్య పరిరక్షణ ద్వారా సామాజిక ఉత్పాదకతను పెంచుతాయి. మధ్య వయస్కులకు కళ్లజోడు ఉచితంగా ఇవ్వడం దానం కాదు. చూపు బాగైతే వారు మరింత సమర్థంగా పని చేయగలరు. తద్వారా కుటుంబాలకు మరింత ఆదాయం వీలవుతుంది’ అంటారు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే. ఒక రాత్రి అక్కడ నిద్ర చేస్తే పేదరికమంటే ఏమిటో తెలుస్తుంది ‘పేదలు, మరీ ముఖ్యంగా దారిద్య్రరేఖకు దిగువన కోటానుకోట్ల కుటుంబాలు నివసిస్తున్న భారతదేశంలో ఉచితాలు తప్పనే వారి గురించి ఏం మాటాడతాం? అయితే ఒకమాట. దేశంలో పేదలే లేరని వారు అనుకుంటుంటే గనక ముంబైలోని ధారవి, కోల్‌కతాలోని బసంతి, ఢిల్లీలోని బాల్స్వా, చెన్నైలోని నోచికుప్పం మురికివాడల్లో ఒక్క రాత్రి నిద్ర చేయండి‘ అని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను సామాజిక విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ‘ఏది ఉచితం, ఏది కాదన్న విచక్షణ లేకుండా విమర్శకులు అన్నింటినీ ఒకే గాటన కట్టేస్తున్నారు. ఈ రెండింటికీ తేడా అర్థం చేసుకుంటే అసలు విషయం బోధపడుతుంది. పేదరికంలో మగ్గుతున్నవారికి చదువు దూరమైనా, వైద్యం లభించకపోయినా, ఎన్ని వనరులు ఉన్నాయన్న దానితో నిమిత్తం లేకుండా ఆ దేశం పేదరికంలో మగ్గుతున్నట్టే లెక్క‘ అని ఢిల్లీ కేంద్రంగా పేద పిల్లల చదువు కోసం దశాబ్దాలుగా స్వచ్ఛందంగా పని చేస్తున్న ‘అభినవ్ సమాజ్’ చైర్మన్ గోపాలకృష్ణ గుప్తా అన్నారు. సంపన్న దేశాల్లోనూ ఉచితాలు బ్రిటన్‌తో పాటు పలు యూరప్ దేశాల్లో ఆహారం కోసం కూపన్లు, విద్య, ఆరోగ్యం వంటి సౌకర్యాలనూ ఉచితంగా అందించడం వంటివి ఇప్పటికీ అమలవుతున్నాయి. భారత్‌లో సంక్షేమ కార్యక్రమాల కోసం చేస్తున్న ఖర్చు సాపేక్షంగా తక్కువగానే ఉంటోంది. బ్రెజిల్ లాంటి దేశాలు వీటిపై స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఏడెనిమిది శాతం వరకూ ఖర్చు చేస్తున్నాయి. వైద్యం, ఆరోగ్యం, విద్య, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కలిపి భారత్‌లో 2020–21లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సంక్షేమంపై వెచ్చించింది జీడీపీలో 8.8 శాతమే. ఫ్రాన్స్ సంక్షేమ కార్యక్రమాలకు జీడీపీలో ఏకంగా 32 శాతం ఖర్చు పెడుతోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఇది 18 శాతంగా ఉంది. నార్వే, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రియా, డెన్మార్క్, ఇటలీ, బెల్జియం వంటి సంపన్న యూరప్ దేశాలూ జీడీపీలో నాలుగోవంతుకు పైగా ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నాయి. బ్రిటన్ కూడా 20 శాతానికి పైగా ఇందుకు వెచ్చిస్తోంది. -కంచర్ల యాదగిరిరెడ్డి -
అమెరికాలో ఆర్థిక మాంద్యం రాదు: బైడెన్
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుంటుందని భావించడం లేదని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ మరింత పడిపోతుందనే అంచనాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగిత గణాంకాలు ఆశాజనకంగా ఉన్నందున..ప్రస్తుత వేగం పుంజుకున్న అభివృద్ధి, స్థిరత్వాన్ని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు కూడా మాంద్యం భయాలను కొట్టిపారేస్తున్నారు. పటిష్టమైన లేబర్ మార్కెట్ల వల్ల అలాంటి పరిస్థితి రాదని అంటున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీలో 1.6%క్షీణత నమోదైంది. రెండో త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశముందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, స్వల్ప వృద్ధి నమోదవుతుందనే విషయంలో ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
నినాదాలు కాదు, విధానాలు కావాలి
దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితి మాటలలో వివరించలేనంత ఆందోళనకర స్థాయిలో ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ. 80కి చేరింది. రూపాయి పతనాన్ని ఆపడానికి 1.5 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని కుమ్మరించినా పరిస్థితిలో ఎటువంటి మెరుగుదలా లేదు. ముడిచమురు, బొగ్గు, ఆహార ధాన్యాలు వంటివాటి దిగుమతులు గణనీయంగా పెరిగి దేశం నుండి జరిగే ఎగుమతులు తగ్గాయి. దాంతో, విదేశీ మారక ద్రవ్యం వేగంగా హరించుకు పోతోంది. విదేశీ రుణం రికార్డు స్థాయికి చేరింది. ఫలితంగా విదేశీ చెల్లింపుల సమతౌల్యం దెబ్బతిని కరెంట్ ఖాతా లోటును నిర్వహించడంలో ఆర్థిక శాఖ సతమతం అవుతోంది. దేశంలో చిల్లర విపణి ధరలు, వంట గ్యాస్, కిరోసిన్, బొగ్గు ధరలు అదుపు తప్పాయి. అన్ని సరుకుల టోకు ధరల సూచీ 15 శాతం పైకి ఎగబాకింది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాల కారణంగా దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. చాలామంది కేంద్రం, రాష్ట్రాలు చేస్తున్న అప్పుల గురించే మాట్లాడుతున్నారుగానీ... కుటుంబాలు చేస్తున్న అప్పుల గురించి మాట్లాడ్డం లేదు. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయి గత్యంతరం లేక పేదలు, మధ్య తరగతి ప్రజలు అప్పుల ఊబిలో దిగిపోయారు. దేశం ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక దుస్థితి హఠాత్తుగా వచ్చి పడింది కాదు. అలాగని కరోనా దెబ్బతోనూ, రష్యా ఉక్రెయిన్ల యుద్ధంతోనూ పూర్తిగా ఈ స్థితి దాపురించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి స్థిరమైన ఆర్థిక విధానం లోపించడమే దీనికి ప్రధాన కారణం. ప్రధాని నరేంద్రమోదీ 2014లో అధికారం చేపట్టేనాటికి దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 7.4 శాతం వృద్ధిరేటుతో ఆరోగ్యకరంగానే ఉంది. పైగా, 2014 తర్వాత దాదాపు నాలుగేళ్లపాటు అంటే 2018 వరకు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా... కేంద్ర ఖజానాకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. కానీ, ఈ అనుకూలతను ఆర్థిక రంగ పటిష్టతకు విని యోగించుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలం అయింది. 2016 నవంబర్‌లో నల్లధనం అరికట్టడం లక్ష్యంగా హఠాత్తుగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ఓ విఫల కార్యక్రమంగా మిగిలి పోయింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలోని అసంఘటిత రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది. నిరు ద్యోగం పెరిగింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయత సన్నగిల్లడంతో అనేక మంది డిపాజిట్‌దారులు తమ డబ్బును బ్యాంకుల నుండి ఉపసంహరించుకొని డాలర్ల రూపంలో విదేశీ బాంకుల్లో దాచుకున్నారు. అంటే, భారత బ్యాంకుల్లో ఉండాల్సిన డిపాజిట్లు విదేశాలకు తరలడం వల్ల ‘రూపాయి’పై భారం పెరగడమే కాక.. దేశ ఆర్థిక ప్రగతికి గొడ్డలిపెట్టుగా పరిణమించింది. కోట్లాదిమందికి ఉపాధి కల్పించే దేశీయ అసంఘటిత రంగాలను దెబ్బతీయడమే పెద్దనోట్ల రద్దు విజయంగా మిగిలి పోయింది. స్థిరమైన పెట్టుబడులు మాత్రమే ఆర్థిక వ్యవస్థను బలో పేతం చేస్తాయి. కానీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే తాపత్రయంతో నిబంధనలను పూర్తిగా సరళీకృతం చేశారు. వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులను 50 శాతం నుంచి 90 శాతం వరకు అనుమతి ఇస్తున్నారు. మరో పక్క స్టాక్ మార్కెట్ లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులను (ఎఫ్ఐఐలు) ప్రోత్సహి స్తున్నారు. అయితే ఎప్పుడైతే రూపాయి విలువ క్షీణిస్తుందో... అప్పుడు స్టాక్ మార్కెట్ల నుండి ఎఫ్ఐఐల ఉపసంహరణ ఊపందుకుంటుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్ప గూలడం అనేకసార్లు చూశాం. డాలర్‌తో రూపాయి మారకం విలువ వేగంగా పతనం కావడంతో అనేక రంగాలలో ఈ దుష్ఫలితాలు కనపడుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కు వగా అమెరికన్ డాలర్ చుట్టూ పరిభ్రమించడం వల్లనే ఈ దుస్థితికి ప్రధాన కారణం. అమెరికన్ డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో భారత్ అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా బంగారం, ఇతర విలాస వస్తువులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం ఎక్కువైంది. ఇక, దేశాన్ని పన్ను ఉగ్రవాదం నుండి విముక్తం చేయడమే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) లక్ష్యం అని చెప్పుకున్న ఎన్డీఏ ప్రభుత్వం హేతుబద్ధత లోపించిన ఆచరణతో ప్రజలపై పెనుభారం మోపింది. గత 8 ఏళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు కొండలా పెరిగిపోయాయి. 2014 జూన్ నాటికి దాదాపు 2 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు ప్రస్తుతం 10 లక్షల కోట్లకు చేరాయన్న నివేదికలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడతాయి. మొండి బకాయిలు పేరుకుపోతున్నాయంటే అర్థం.. ఆర్బీఐ తన బాధ్య తను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నదనే. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్తలను వెనక్కి రప్పించి వారి ఆస్తులను జప్తు చేయించడంలో కూడా కేంద్రం విఫలం అయింది. కాగా, నష్టాల్ని తగ్గించు కోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియ చేపట్టడం అనేక విమర్శలకు గురైంది. తాజాగా, ఎస్బీఐ మినహా దేశంలోని అన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే కలిగే అనర్థాలు అనేకం. ఉద్యోగ భద్రత లోపించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు వర్తించవు. ప్రధాని మోదీ ‘డబుల్ ఇంజన్ గ్రోత్’ వంటి పసలేని నినాదాలకు తాత్కాలికంగానైనా స్వస్తి పలికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. జీఎస్టీని సరళతరం చేయాలి. రూపాయిని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి. నల్లధనాన్ని వెనక్కు రప్పించాలి. అధిక వ్యయంతో కూడిన దిగుమతులను నిలుపుదల చేసి వైవిధ్యభరితమైన ఎగుమతులపై దృష్టి పెట్టాలి. దేశంలోని మానవ వనరులను సద్వినియోగ పర్చుకొని పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడంపైనే దృష్టి పెట్టాలి. రాష్ట్రాలను కలుపుకొని ఉమ్మడిగా దేశం ఎదుర్కొంటున్న ఈ అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి స్థిరమైన ఆర్థిక విధానాలతో తగిన కార్యాచరణ రూపొందించాలి. (క్లిక్: ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!) - సి. రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
మోర్గాన్ స్టాన్లీ కోత..భారత్ జీడీపీ వృద్ధి అంచనా కుదింపు!
ముంబై: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకు అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ– మోర్గాన్ స్టాన్లీ 40 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. దీనితో ఈ రేటు 7.6 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. 2023–24 వృద్ధి అంచనాలను సైతం 0.30 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.7 శాతం నుంచి 6.4 శాతానికి దిగివచ్చింది. ప్రపంచ వృద్ధి మందగమన ధోరణి భారత్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపనుందని మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇక 2022 డిసెంబర్‌తో ముగిసే సంవత్సరంలో ప్రపంచ వృద్ధి 1.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. 2021లో ఈ రేటు 4.7 శాతం. కాగా ఆర్బీఐ రెపోరేటు ప్రస్తుత 4.9% నుంచి 2023 ఆగస్టు నాటికి 6.5%కి చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది. -
ఎకానమీకి పీఎల్ఐ దన్ను: ఎంకే నివేదిక
ముంబై: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) భారత్ ఎకానమీకి వెన్నుదన్నుగా నిలవనుందని ఎంకే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ (బ్రోకరేజ్ ఎంకే గ్లోబల్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగం) నివేదిక విశ్లేషించింది. వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను అందించడం ద్వారా కీలకరంగాల్లో తయారీ పెంచేందుకు ఉద్దేశించిన ఈ పథకం, వార్షికంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 4 శాతం అదనపు విలువను జోడించవచ్చని నివేదిక అభిప్రాయపడింది. ఇప్పటివరకు ఈ పథకం ఎల్రక్టానిక్స్, ఆటో కాంపోనెంట్స్, ఫార్మా రంగాల నుండి గరిష్ట స్పందనను చూసిందని వివరించింది. నివేదికలో మరికొన్ని అంశాలన పరిశీలిస్తే.. ► పీఎల్ఐ పథకం విజయవంతం కావడానికి చైనా ప్లస్ 1 వ్యూహమే కారణం. మహమ్మారి ప్రారంభమైన నుండి చైనాలో పెట్టుబడులకు అనేక పాశ్చాత్య కంపెనీలు, ప్రభుత్వాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. తాజా లాక్డౌన్లు ఆ దేశంలో సరఫరాల సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి. దీనికితోడు ఆ దేశానికి చెందిన అనేక వస్తువులపై అభివృద్ధి చెందిన దేశాలు యాంటీ డంపింగ్ డ్యూటీలను విధించాయి. ► ఉత్పాదక కంపెనీలు బలమైన రాబడుల కారణంగా సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. కంపెనీలు విస్తరిస్తున్నాయి. నమోదైన కొత్త తయారీ కంపెనీల సంఖ్యను బట్టి ఇది స్పష్టమవుతుంది. ► తయారీ కంపెనీల నమోదు గత ఏడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో తయారీ కంపెనీల వాటా గత దశాబ్దం నుండి దాదాపు అత్యధిక స్థాయిలో ఉండడం గమనార్హం. ► మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోరిన-మంజూరైన పర్యావరణ అనుమతుల సంఖ్య అత్యధికంగా ఉంది. 2018-21లో ఆవిష్కరించిన నిర్మాణాత్మక మార్పులు ఎకానమీపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. 2003-06లో నెలకొన్న సానుకూల పరిస్థితులను తాజా పరిణామాలు గుర్తుకు తెస్తున్నాయి. ► నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తొలిరోజుల్లో దేశీయ తయారీ రంగం దెబ్బతింది. తాజాగా మహమ్మారి వినియోగదారుల డిమాండ్‌పై ప్రభావం చూపింది. ఆయా పరిస్థితుల నుంచి ఎదురైన సవాళ్లు తయారీ పరిశ్రమపై కొనసాగుతున్నాయి. మూలధన సవాళ్లు, సమస్యలు ఇంకా తొలగిపోలేదు. ► 2021-22లో తలసరి ఆదాయం 2020-21కన్నా పెరిగింది. మార్చితో ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరం నుండి విచక్షణాపరమైన ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రూపాయి బలహీనత బలం... చైనీస్ యువాన్‌తో రూపాయి విలువ క్షీణించడం భారత్ తయారీ రంగానికి సానుకూలంగా మారింది. ఈ పరిణామాల వల్ల ఆటో, ఆటో విడి భాగాలు, వ్రస్తాలు, రసాయనాలు, భారీ పరిశ్రమలకు సంబంధించి క్యాపిటల్ గూడ్స్ ప్రయోజనం పొందుతున్నాయి. – వికాస్ ఎం సచ్‌దేవా, ఎంకే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ సీఈఓ -
ప్రపంచంలోనే మరే దేశానికి సాధ్యపడకుండా..జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న భారత్..!
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022లో 8.2 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ప్రపంచంలో మరే దేశ ఎకానమీ ఈ స్థాయిలో పురోగమించలేదని విశ్లేషించింది. దీనితో ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ కలిగిన దేశంగా భారత్ ఉంటుందని స్పష్టం చేసింది. ఇదే ఏడాది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యసవ్థ చైనా 4.4 శాతం పురోగతి సాధిస్తుందని బహుళజాతి బ్యాంకింగ్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఐఎంఎఫ్ విడుదల చేసిన వార్షిక వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదికలోని కొన్ని అంశాలు... ► 2022 భారత్ ఎకానమీ వృద్ధి తాజా అంచనా 8.2 శాతం అయినప్పటికీ, ఇది క్రితం అంచనాల కన్నా 80 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తక్కువ కావడం గమనార్హం. ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, కమోడిటీ, ఆహార ధరల పెరుగుదల, బలహీన దేశీ డిమాండ్, ప్రైవే టు వినియోగం, పెట్టుబడులు పుంజుకోకపోవడం వంటి అంశాలు వృద్ధి అంచనా తగ్గింపు కారణం. ► 2021లో భారత్ వృద్ధి 8.9 శాతం. 2023లో 6.9 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా. ప్రపంచ వృద్ధి 3.6 శాతం కాగా, 2022లో ప్రపంచ వృద్ధి రేటు 3.6 శాతానికి పరిమితం అవుతుందని ఐఎంఎఫ్ అవుట్‌లుక్ అంచనావేసింది. ఈ మేరకు క్రితం (జనవరిలో 4.4 శాతంగా అంచనా) అంచనాలకన్నా 80 బేసిస్ పాయింట్లు కుదించింది. భౌగోళిక ఉద్రిక్తతలను దీనికి కారణంగా చూపింది. 2021 ప్రపంచ వృద్ధి 6.1 శాతం. 2023లో ప్రపంచ వృద్ధి అంచనాలను 3.8 శాతం నుంచి 3.6 శాతానికి కుదించింది. ఇక 2021లో 8.1 శాతం పురోగమించిన చైనా వృద్ధి రేటు 2022లో 4.4 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. 2023లో ఈ రేటు 5.1 శాతంగా ఉంటుందని అంచనావేసింది. అమెరికా 2022లో 3.7 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంటుందని పేర్కొంది. 2023లో ఈ రేటు 2.3 శాతానికి తగ్గుతుందని అంచనావేసింది. ప్రపంచ వృద్ధి వేగం తగ్గడానికి రష్యా యుద్ధం ప్రధాన కారణంగా చూపిన ఐఎంఎఫ్, 2022లో ఆ దేశ ఎకానమీ 8.5 శాతం క్షీణిస్తుందని తెలిపింది. ఉక్రెయిన్ విషయంలో ఈ క్షీణత 35 శాతంగా అంచనా వేసింది. ఇక 19 దేశాల యూరో దేశాల ఎకానమీ 2022 వృద్ధి అంచనాలను 3.9 శాతం నుంచి 2.8 శాతానికి కుదించింది. చదవండి: భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! ఎకానమీపై తీవ్ర ప్రభావం..! -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, భారత్ వృద్ధికి ఇండియా రేటింగ్స్ కోత!
ముంబై: భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలకు ఇండియా రేటింగ్స్ కోత విధించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.6 శాతంకాగా, తాజాగా 7 నుంచి 7.2 శాతం శ్రేణికి తగ్గిస్తున్నట్లు తాజా నివేదికలో పేర్కొంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వినియోగదారు సెంటిమెంట్ బలహీనత దీనికి కారణమని పేర్కొంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత ఎకానమీపై కనబడుతుందని విశ్లేషించింది. ఇప్పుడే చెప్పడం కష్టం... చక్రవర్తి ఇదిలావుండగా, యుద్ధం ప్రభావం భారత్ ఎకానమీపై ఏ మేరకు ఉంటుందన్న విషయం ఇప్పడే చెప్పడం కష్టమవుతుందని ప్రముఖ ఆర్థికవేత్త పినాకి చక్రవర్తి పేర్కొన్నారు. పలు ప్రపంచ దేశాలకు ఇప్పుడు ధరల పెరుగుదల తీవ్రత సవాలుగా ఉందని అన్నారు. -
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, భారత్ ఎకానమీపై భారీ ఎఫెక్ట్..ఎంతలా ఉందంటే!
ముంబై: భారత్ ఎకానమీపై యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉందని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలను 0.8 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో క్రితం 7.8 శాతం అంచనాలు 7.2 శాతానికి తగ్గాయి. ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ముఖ్యాంశాలు... ►కమోడీటీ ధరల పెరుగుదల ప్రధాన సమస్య. యుద్ధం నేపథ్యంలో తాజా సరఫరాల సమస్యలు తలెత్తుతున్నాయి. ►2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలు ప్రస్తు తం 7.8%గా ఉన్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో జరగనున్న పాలసీ సమావేశాల్లో ఈ అంకెను తగ్గించే అవకాశం ఉంది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో వృద్ధి రేటు 5.4% కాగా, నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి 2022) ఈ రేటు 3 నుంచి 4 % మేరకే నమోదయ్యే వీలుంది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 8.5%గా ఉంటుందని భావిస్తున్నాం. ►ఊహించినట్లుగానే మహమ్మారి కరోనా మొదటి, రెండవ వేవ్‌లతో పోల్చితే మూడవ వేవ్‌లో ఆర్థిక, ప్రాణ నష్టాలు చాలా తక్కువగానే నమోదయ్యాయి. 2022 మార్చి ప్రారంభంలో ఆర్థిక డేటా మిశ్రమంగా ఉన్నప్పటికీ, రష్యా–ఉక్రెయిన్ వివాదం, వస్తువుల ధరలలో పెరుగుదల ఎకానమీలో అనిశ్చితిని పెంచిం ది. పలు కంపెనీల ఉత్పత్తులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ►ఇంధనం, వంట నూనెల వంటి వస్తువుల అధిక ధరలు మధ్య, దిగువ స్థాయి ఆదాయ వర్గాల విచక్షణ రహిత వ్యయాలను తగ్గించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులు వచ్చే ఆర్థిక సంవత్సరం డిమాండ్ పునరుద్ధరణను అడ్డుకుంటుంది. ►సెప్టెంబరు 2022 వరకు ఉచిత ఆహారధాన్యాల పథకం పొడిగింపు హర్షణీయం. బలహీన ఆర్థిక కుటుంబాల ఆహార బడ్జెట్లకు ఇది కొంత ఉపశమనం కలిగిస్తుంది. ►భారత్ ఎగుమతుల విషయానికి వస్తే, మూడవ త్రైమాసికంతో పోల్చితే నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) సామర్థ్య వినియోగ స్థాయిలు 72% నుంచి 75%కి పెరిగింది. ►2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోడానికి కేంద్ర మూలధన వ్యయాలు కీలకంగా మారనున్నాయి. ►ఎకానమీలో వివిధ రంగాల్లో పలు స్థాయిల్లో (కే నమూనాలో) రికవరీ చోటుచేసుకునే అవకాశం ఉంది. సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతాయి. వ్యవసాయంలో వృద్ధి 3 % లోపే... ఇక్రా నివేదిక ప్రకారం, 2022లో రిజర్వాయర్ స్థాయిలు బాగున్నాయి. దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడినా, వ్యవసాయ రంగంపై అంతగా ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చు. అయితే ఎరువుల కొరత వ్యవ సాయ రంగానికి ఆందోళన కలిగించే అంశం. అంతర్జాతీ య మార్కెట్లో పరిమిత లభ్యత, పెరిగిన ధరలు, తక్కువ దిగుమతులు వంటి అంశాలు వ్యవసాయ రం గంపై ప్రతికూలత చూపే అవకాశం ఉంది. అందువల్ల తగిన రిజర్వాయర్ స్థాయిలు, సాధారణ వర్షపాతం ఉన్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగే అవకాశం లేదు. స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 14 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 3%కన్నా తక్కువగా నమోదయ్యే వీలుంది. -
ఉక్రెయిన్ - రష్యా యుద్ధంతో భారత్ ఎకానమీ ఢమాల్!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చి 31వ తేదీతో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో అంచనావేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందని పేర్కొన్న నివేదిక, మౌలిక రంగంపై ప్రభుత్వ వ్యయాలు, ప్రైవేటు పెట్టుబడులు ఇందుకు దోహదం చేస్తాయని వివరించింది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదనంతర పరిణామాలు ఎకానమీకి తీవ్ర ప్రతికూల అంశాలని పేర్కొంది. ప్రత్యేకించి క్రూడ్ ధరల తీవ్రతను ప్రస్తావించింది. ‘ఇండియా అవుట్‌లుక్, ఫిస్కల్ 2023’ పేరుతో రూపొందించిన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను విశ్లేషిస్తే... ► కోవిడ్–19 మహమ్మారికి సంబంధించి మూడవవేవ్ ఒమిక్రాన్ ప్రభావం అంతగా లేకపోవడం ఎకానమీకి లాభించింది. అయితే తద్వారా లభించిన ప్రయోజనం ఎకానమీకి ఏదైనా ఉందంటే, అది ఉక్రెయిన్‌పై రష్యా దాడి నుండి ఉత్పన్నమైన భౌగోళిక రాజకీయ కలహాల ద్వారా నీరుగారిపోయే పరిస్థితి తలెత్తింది. యుద్ధం ప్రపంచ వృద్ధి మందగమనానికి దారితీసే అంశం. చమురు సంబంధిత ఉత్పత్తుల ధరలు దీనివల్ల భారీగా పెరుగుతాయి. ప్రపంచ వృద్ధికి పొంచిఉన్న సవాళ్లలో ఇది తీవ్రమైనది. ఇది దేశీయ ఎకానమీపై కూడా తీవ్ర ప్రతికూలత చూపుతుంది. ► ప్రైవేటు వినియోగం ఇంకా బలహీనంగానే కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ద్రవ్యపరమైన మద్దతు కూడా అంతగా లేదు. ► రిటైల్ద్రవ్యోల్బణం విషయానికొస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 5.4 శాతం వద్ద స్థిరంగా ఉంటుంది. అయితే దీనికి ముడి చమురు ధర సగటు బ్యారల్‌కు 85 నుంచి 90 డాలర్ల మధ్య ఉండాలి. గత సంవత్సరం ప్రకటించిన ఎక్సైజ్ సుంకం తగ్గింపులను పరిగణనలోకి తీసుకోవాలి. ► చమురు ధరల తీవ్రత దీర్ఘకాలం కొనసాగితే ఎకానమీ పురోగతికి తీవ్ర విఘాతం కలుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న సూచనల ప్రకారం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగాలి. అయితే జనవరిలో ఈ రేటు నిర్దేశ శ్రేణికి మించి 6.01 శాతంగా నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ గత జరిగిన జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత కొనసాగితే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. 2022–23లో క్రూడ్ బ్యారల్ ధర 75 డాలర్లగా లెక్కించి, ఈ ప్రాతిపదిన బడ్జెట్ రూపకల్పన జరిగింది. భౌగోళిక ఉద్రిక్తతలు ఈ అంచనాలను దెబ్బతీయవచ్చు. ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక విధానాల అమల్లో కొంత దూకుడును ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఉపాధి కల్పించే పథకాల ప్రకటన, ఆహార సబ్సిడీలకు కేటాయింపులను పెంచడం, పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాన్ని తగ్గించడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన వర్గానికి ఈ చర్యలు దోహదపడతాయి. అలాగే ఈ చర్యల వల్ల ప్రైవేట్ వినియోగ డిమాండ్ స్థిరంగా పురోగమిస్తుంది. ► ముడి చమురు ధరల తీవ్రత వల్ల, దిగుమతుల భారం పెరిగి 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంట్ ఖాతా లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2.2 శాతానికి పెరుగుతుందని అంచనా. సాధారణంగా ముడి చమురు ధరలో 10 డాలర్ల పెరుగుదల వల్ల క్యాడ్ 40 బేసిస్ పాయింట్లు (జీడీపీలో) పెరుగుతుంది. కార్పొరేట్ రంగం ఇప్పటికి సానుకూలం రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక ప్రకారం, చమురు ఎక్కువ కాలం పాటు బ్యారెల్‌కు 100 డాలర్లకు మించి కొనసాగితే ఎకానమీలోని పలు విభాగాలపై దీని ప్రతికూల ప్రభావం ఉంటుంది. పలు భారత్ కంపెనీల నిర్వహనా లాభాలు భారీగా పడిపోతాయి. ఇప్పటి వరకూ పరిస్థితిని పరిశీలిస్తే, దాదాపు 700 దేశీయ కంపెనీల స్థూల ఆదాయాలు బాగున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరుసగా రెండవ ఏడాది 20 శాతం వృద్ధిని నమోదుచేసుకునే పరిస్థితి ఉంది. అయితే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, బీమా రంగాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి. భౌగోళిక రాజకీయాలు, ఇతర ఊహించని సంఘటనలు ఎదురుకాకుంటే, 2022–23లో ఆర్థిక రికవరీ విస్తృత ప్రాతిపదికన ఉంటుంది. 10 నుంచి 14 శాతం కార్పొరేట్ ఆదాయ వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం. పరిశ్రమలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) వంటి పథకాలు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంతో ముగిసిన త్రైమాసికంలో పారిశ్రామిక మూలధన పెట్టుబడులు రూ.3 నుంచి 3.5 లక్షల కోట్లు ఉంటే, 2025–25 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ శ్రేణి రూ.4 నుంచి 4.5 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. భారతదేశ పెట్టుబడి దృష్టి ఇప్పుడు గ్రీన్ (పర్యావరణ అనుకూల) క్యాపిటల్ వ్యయం వైపు మళ్లుతోంది. 2023 నుండి 2030 ఆర్థిక సంవత్సరం మధ్య వార్షికంగా రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఈ విభాగాలపై వ్యయం ఉంటుందని అంచనా. ఈ కాలంలో వార్షికంగా మొత్తం పెట్టుబడులలో దాదాపు 15–20 శాతం మౌలిక, పారిశ్రామిక రంగాల్లో ఉంటాయని భావిస్తున్నాం. చదవండి: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్‌కు భారీ దెబ్బ!! -
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్‌కు భారీ దెబ్బ!!
అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) నష్టం ఉంటుందని అంచనావేసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.9 శాతానికి తగ్గిస్తున్నట్లు (8.4 శాతం నుంచి) పేర్కొంది. చమురు ధరల తీవ్రత దేశంలో సవాళ్లకు దారితీస్తుందని పేర్కొంది. ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఎగువ స్థాయిలోనే 6 శాతంగా కొనసాగుతుందని విశ్లేషించింది. ఇదే పరిస్థితి కొనసాగితే స్టాగ్ఫ్లేషన్ (ఎకానమీలో స్తబ్దతతో కూడిన పరిస్థితి. ధరల తీవ్రత వల్ల వృద్ధి మందగమనం, తీవ్ర నిరుద్యోగం వంటి సవాళ్లు తలెత్తడం) సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశానికి అంతర్జాతీయంగా సవాళ్లను తెచ్చిపెడతాయని, ఆర్థిక వ్యవస్థకు ప్రతిష్టంభన కలిగించే పరిస్థితులకు దారితీస్తాయని విశ్లేషించింది. రికవరీ కొనసాగినా అది బలహీనంగా ఉంటుందని పేర్కొంది. కరెంట్ అకౌంట్ లోటు పదేళ్ల గరిష్టం 3 శాతానికి (జీడీపీలో) పెరిగే అవకాశం ఉందని అంచనావేసింది. దేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరమే సరళతర ఆర్థిక విధానానికి ముగింపు పలకవచ్చని, ఏప్రిల్ లేదా జూన్ విధాన సమీక్షలో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (వరుసగా 10 ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథంగా 4 శాతంగా కొనసాగుతోంది) పావుశాతం వరకూ పెంచే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలో సరళతర ఆర్థిక విధానాలు మరెంతోకాలం కొనసాగించే పరిస్థితి లేదని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతంగా బడ్జెట్ అంచనావేయగా ఇది 6.9 శాతం వరకూ పెరగవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. చదవండి: Anand Mahindra: యుద్ధంలో చివరికి తేలే ఫలితం ఇదే -
అమ్మకాలకే అవకాశం.. మార్కెట్‌పై ఉక్రెయిన్–రష్యా అనిశ్చితి
ముంబై: ఉక్రెయిన్–రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల దృష్ట్యా ఇన్వెస్టర్లు ఈ వారమూ అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వొచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే కీలక స్థూల ఆర్థిక గణాంకాల విడుదల నేపథ్యంలో చోటు చేసుకోనున్న అప్రమత్తత విక్రయాలకు ఊతం ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ టెస్టిమోనీపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. దేశీయంగా ఇదే వారంలో విడుదలయ్యే క్యూ3 జీడీపీ, ఫిబ్రవరి తయారీ, సేవల రంగానికి చెందిన పీఎంఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు, వాహన విక్రయ వివరాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి స్టాక్ మార్కెట్‌పై ట్రేడింగ్ ప్రభావితం చేసే ఇతర అంశాలుగా ఉన్నాయి. ప్రభావితం చేసే అంశాలు.. ► ఉక్రెయిన్ రష్యా సంక్షోభం ఉక్రెయిన్ రష్యాల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రష్యాను అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి అత్యవసర మరోసారి అత్యవసర సమావేశాన్ని అభ్యర్థించింది. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. యుద్ధ పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు కొనసాగవచ్చు. ► నేడు క్యూ3 జీడీపీ గణాంకాల విడుదల కేంద్ర గణాంకాల శాఖ నేడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైసికం(క్యూ3) జీడీపీ గణాంకాలను ప్రకటించనుంది. సమీక్షిస్తున్న మూడో క్వార్టర్లో జీడీపీ వృద్ధి 6.6% నమోదు అవుతుందని బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ఎస్బీఐ రీసెర్చ్‌లు 5.8 శాతంగా నమోదుకావచ్చని భావిస్తోంది. ఇదే రోజున జనవరి నెల పారిశ్రామికోత్పత్తి, ద్రవ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. ► రేపు ఆటో అమ్మక డేటా వెల్లడి దేశీయ ఆటో కంపెనీలు మంగళవారం(రేపు) ఫిబ్రవరి నెల వాహన అమ్మక గణాంకాల వివరాలను వెల్లడించనున్నాయి. చిప్ కొరత కష్టాలు కాస్త తగ్గడంతో వాణిజ్య, ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే బేస్ ఎఫెక్ట్ కారణంగా ద్విచక్ర, ట్రాక్టర్ విక్రయాల్లో క్షీణత నమోదు కావచ్చని అంటున్నారు. అమ్మక గణాంకాల విడుదల నేపథ్యంలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్, జజాజ్ ఆటో, ఎస్కార్ట్స్, ఐషర్ మోటార్స్, ఎంఅండ్ఎం తదితర ఆటో కంపెనీల షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ కావచ్చు. ► బుధవారం పావెల్ టెస్టిమోనీ ప్రసంగం ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా కాంగ్రెస్ ఎదుట బుధవారం యూఎస్ దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ(టెస్టిమోనీ) వివరణ ఇవ్వనున్నారు. పావెల్ ప్రసంగంతో అమెరికా ఆర్థిక అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఉక్రెయిన్ – రష్యా సంఘర్షణ నేపథ్యంలో ద్రవ్యపాలసీపై ఫెడ్ రిజర్వ్ వైఖరి వెల్లడించనున్నారు. ► తయారీ, సేవల రంగ గణాంకాలు ఫిబ్రవరి తయారీ రంగ సేవల గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. కోవిడ్ వైరస్ వ్యాప్తి భయాలు తగ్గడం, లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. కావున తయారీ డేటా ఆశించిన స్థాయిలో నమోదుకావచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదేవారంలో శుక్రవారం జనవరి సేవల రంగ గణాంకాలు విడుదల అవుతాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంతో పాటు జనవరిలో కోవిడ్ ఆంక్షలతో సేవారంగం నెమ్మదించి ఉండొచ్చని భావిస్తున్నారు. ► వరుసగా ఐదోనెల అమ్మకాలే... దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఐదో నెల విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఫిబ్రవరిలో మొత్తం రూ.35,506 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గడచిన ఐదు నెలల్లో మొత్తం రూ.1.84 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు భయాలకు తోడు తాజాగా ఉక్రెయిన్ రష్యా దేశాల యుద్ధ పరిస్థితులు తోడయ్యాయి. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు బేర్స్‌కు సానుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో దేశ ఎక్సే్చంజీలు 4 రోజులకే పనిచేయనున్నాయి. దేశీయ ఆర్థిక స్థితిగతులను తెలిపే కీలకమైన స్థూల ఆర్థిక గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా అప్రమత్తత ధోరణి ప్రదర్శించవచ్చు. నిఫ్టీకి సాంకేతికంగా దిగువ స్థాయిలో 16,200 వద్ద కీలకమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది. షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరిగితే ఎగువస్థాయిలో 16,900 వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమా తెలిపారు. ట్రేడింగ్ నాలుగు రోజులే... మహాశివరాత్రి సందర్భంగా మంగళ వారం స్టాక్ మార్కెట్‌కు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. రష్యా సైనిక చర్యతో గతవారంలో సెన్సెక్స్ 1,974 పాయింట్లు, నిఫ్టీ 618 పాయిం ట్లు చొప్పున నష్టపోయాయి. ఏడు రోజుల వరుస పతనం నేపథ్యంలో వారాంతపు రోజు శుక్రవారం సూచీలు స్వల్పంగా బౌన్స్‌బ్యాక్ కావడం మార్కెట్ వర్గాలకు ఊరటనిచ్చింది. -
ఐటీ శ్లాబ్స్ హేతుబద్ధీకరించాలి..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 15 నుంచి 21వ తేదీ వరకూ వివిధ వర్గాలతో జరిపిన 2022–23 బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శ్లాబ్‌ల హేతుబద్దీకరణ నుంచి డిజిటల్ సేవలకు మౌలిక రంగం హోదా కల్పన వరకూ వివిధ వినతులు అందాయి. ఆర్థికశాఖ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. హైడ్రోజన్ నిల్వకు ప్రోత్సాహకాలు, ఫ్యూయెల్ సెల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి, ఆన్లైన్ రక్షణ చర్యలపై పెట్టుబడుల వంటి అంశాలూ పారిశ్రామిక వర్గాల విజ్ఞప్తుల్లో ఉన్నట్లు ప్రకటన వెల్లడించింది. ప్రకటనలోని ముఖ్యాంశాలు.. ► డిసెంబర్ 15 నుంచి 21వ తేదీ వరకూ వర్చువల్‌గా జరిగిన ఎనిమిది సమావేశాలలో ఏడు రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 120 మందికి ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో వ్యవసాయం–వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ–మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పు, ఆర్థిక రంగం–మూలధన మార్కెట్లు, సేవలు–వాణిజ్యం, సామాజిక రంగం, కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులుసహా పలువురు ఆర్థిక వేత్తలు ఉన్నారు. ► ప్రధాని నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వానికి అలాగే సీతారామన్‌కు నాల్గవ బడ్జెట్. కోవిడ్–19 మహమ్మారి దెబ్బకు కుదేలయిన భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో రూపొందుతున్న బడ్జెట్ ఇది. ► ఈ ఆర్థిక సంవత్సరం 8.3–10% వరకూ వృద్ధి ఉండొచ్చని అంచనా. ఆర్బీఐ అంచనాలు 9.5%. ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అంచనా (జీడీపీలో) 6.8%గా ఉంది. 2021–22కి వివిధ వర్గాల అంచనా 7–7.5 శాతం వరకూ ఉంది. -
భారత ఎకానమి వృద్దిపై టాప్ కంపెనీల సీఈవోలు ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: దేశీ ఎకానమీ ఈ ఆర్థిక సంవత్సరంలో తిరిగి పుంజుకుని, 9–10 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమలో అంచనాలు నెలకొన్నాయి. అయితే, తయారీ, సర్వీసుల రంగాలపై కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రతికూల ప్రభావాలపైనా ఆందోళనలు కూడా భయపెడుతున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సర్వేలో సుమారు 100 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశారు. 56 శాతం మంది సీఈవోలు.. 2021–22లో ఎకానమీ 9 శాతం నుంచి 10 శాతం స్థాయిలో వృద్ధి చెందవచ్చని భావించగా.. అంతకు మించి ఉండవచ్చని 10 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే, తమ వ్యాపారాల సెంటిమెంటుపై 35 శాతం మంది సీఈవోలు ఆశావహంగా ఉన్నారు. కోవిడ్ పూర్వ (2019–20) స్థాయిలో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం 10–20 దాకా పెరగవచ్చని 35 శాతం మంది, 20 శాతానికి మించి వృద్ధి చెందవచ్చని 33 శాతం ధీమా వ్యక్తం చేశారు. అలాగే స్థూల లాభాలు 20 శాతం పెరుగుతాయని 35 శాతం మంది సీఈవోలు, 10–20 శాతం వృద్ధి నమోదు కావచ్చని 17 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. ‘మౌలిక సదుపాయాల కల్పనపై మరింతగా దృష్టి పెట్టడం, లిక్విడిటీని పెంచేందుకు సకాలంలో చర్యలు తీసుకోవడం, సంస్కరణలు మొదలైనవి పరిశ్రమ వర్గాల్లో ఆశాభావాన్ని పెంచాయి‘ అని సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ తెలిపారు. మరిన్ని విశేషాలు.. - ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా సర్వీసుల రంగంపై ప్రతికూల ప్రభావం పడవచ్చని 55% మంది సీఈవోలు, తయారీ కార్యకలాపాలు దెబ్బతినొచ్చని 34% మంది సీఈవోలు ఆందోళన వ్యక్తం చేశారు. - తమ తమ రంగాల్లో సరఫరాపరమైన సమస్యలు నెలకొన్నప్పటికీ.. వ్యాపార వృద్ధిపై మూడొంతుల మంది సీఈవోలు ఆశావహంగా ఉన్నారు. - కంపెనీల సామర్థ్యాల వినియోగం 70–100 % వరకూ ఉండగలదని 59% మంది సీఈవోలు అంచనా వేస్తున్నారు. - ఎగుమతులపరంగా 2019–20తో పోల్చి చూస్తే 20% వృద్ధి ఉండొచ్చని 35% మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. పది శాతం మంది మాత్రం 50% పైగా ఉండొచ్చని ధీమాగా ఉన్నారు. చదవండి: జీడీపీ అంచనాల్లో మార్పులు.. కారణమిదే ? -
జీడీపీ అంచనాల్లో మార్పులు.. కారణమిదే ?
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 10 శాతం నుంచి 9.7 శాతానికి కుదించింది. తొలత 11 శాతం వృద్ధి అంచనాలను సెప్టెంబర్‌లో 10 శాతానికి తగ్గించింది. తాజాగా మరో 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కుదించింది. పరిశ్రమలకు సంబంధించి సరఫర సమస్యలు ఇందుకు ప్రధాన కారణమని మనీలా కేంద్రంగా పనిచేస్తున్న బహుళజాతి బ్యాంకింగ్ సంస్త పేర్కొంది. దక్షిణాసియా వృద్ధి రేటును కూడా 8.8 శాతం నుంచి 8.6 శాతానికి సంస్థ తగ్గించింది. కాగా ఏడీబీ అంచనాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలు 9.5 శాతంకన్నా అధికంగానే ఉండడం గమనార్హం. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ అంచనా 8.7 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో అంచనాలకు మించి 8.4 శాతం వృద్ధి రేటు నమోదయిన సంగతి తెలిసిందే. చదవండి: పన్ను పోటు లేని ప్రదేశం.. క్రిప్టో కుబేరులకు ఇప్పుడది స్వర్గధామం! -
ఒమిక్రాన్ ఎఫెక్ట్ తక్కువే!: ఆర్థిక శాఖ
జీడీపీ జోరుకు పగ్గాల్లేవ్ పటిష్ట వృద్ధిని సాధించనున్న దేశాలలో భారత్ ఆర్థిక శాఖ తాజా సమీక్ష న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దుష్ప్రభావాల తదుపరి పటిష్ట వృద్ధిని అందుకోనున్న కొద్దిపాటి ప్రపంచ దేశాలలో భారత్‌కూడా ఒకటని ఆర్థిక శాఖ తాజాగా పేర్కొంది. ఇటీవల పలు దేశాలలో తలెత్తుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం దేశీయంగా తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. ఇందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన వేగవంత వ్యాక్సినేషన్ సహకరించనున్నట్లు తాజా ఆర్థిక సమీక్షలో తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కోవిడ్–19 దెబ్బకు పలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా కుదేలైన నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 8.4 శాతం అప్ Economy Of India ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్)లో రియల్ జీడీపీ 8.4 శాతం ఎగసింది. కరోనా మహమ్మారికి ముందు అంటే 2019–20 ఏడాది ఇదే కాలంలో వృద్ధితో పోలిస్తే ఇది రెట్టింపని నెలవారీ సమీక్షలో ఆర్థిక శాఖ వివరించింది. కోవిడ్–19 నేపథ్యంలోనూ వరుసగా నాలుగు త్రైమాసికాలపాటు ఆర్థిక పురోభివృద్ధిని సాధించిన దేశాలలో భారత్ ఒకటని వెల్లడించింది. గతేడాది(2020–21) క్యూ3, క్యూ4లతోపాటు.. ఈ ఏడాది క్యూ1, క్యూ2లను ప్రస్తావించింది. సర్వీసుల విభాగంలో నమోదైన రికవరీ, తయారీ, వ్యవసాయ రంగాలు సాధించిన నిలకడైన వృద్ధి ఇందుకు సహకరించినట్లు పేర్కొంది. తిరిగి పెట్టుబడులు పుంజుకుంటున్న అంశాన్ని రికవరీ ప్రతిఫలిస్తున్నట్లు వివరించింది. భారీ వ్యాక్సినేషన్, సమర్థవంత ఆర్థిక నిర్వహణ, స్థూల, సూక్ష్మ ఆర్ధిక పరిస్థితులను ఉత్తేజితం చేయడం వంటి మద్దతిచ్చినట్లు తెలియజేసింది. మరింత స్పీడ్ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ మరింత పటిష్టపడనున్నట్లు తాజా సమీక్షలో ఆర్థిక శాఖ అంచనా వేసింది. క్యూ2లో ఇందుకు పలు సంకేతాలు(హెచ్ఎఫ్ఐలు) వ్యక్తమైనట్లు పేర్కొంది. సమీక్షలో ఆర్థిక శాఖ ఇంకా ఇలా వివరించింది.. ‘కొత్తగా తలెత్తిన ఒమిక్రాన్ వేరియంట్ గ్లోబల్ రికవరీకి తాజా సవాళ్లను విసురుతోంది. అయితే ప్రాథమిక దృష్టాంతాల ప్రకారం దేశీయంగా అంతంతమాత్ర ప్రభావాన్నే చూపగలదని అంచనా. వేగవంత వ్యాక్సినేషన్ ఇందుకు కారణంకానుంది. కోవిడ్–19వల్ల గతేడాది తగిలిన దెబ్బనుంచి దేశం వేగవంతంగా పుంజుకుంటోంది. క్యూ2లో ఇది ప్రదర్శితమైంది. ఈ ఏడాదికి జీడీపీ 9.5 శాతం ఎగిసే వీలున్నట్లు తాజా సమీక్షలో మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) అభిప్రాయపడింది. మహమ్మారికి ముందు ఏడాది అంటే 2019–20తో పోలిస్తే ఇది 1.6 శాతం అధిక వృద్ధికి సమానం. గతేడాది నమోదైన క్షీణత నుంచి బయటపడి పటిష్ట రికవరీ సాధిస్తున్న అతికొద్ది ప్రపంచ దేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తోంది. ఇందుకు వ్యవసాయం దన్నునిస్తోంది. పుంజుకున్న ఆహార ధాన్యాల దిగుబడి, ఖరీప్, రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు, గ్రామీణ ప్రాంత ఆదాయాలు మెరుగుపడటం వంటి అంశాలు సహకరిస్తున్నాయి. చదవండి: సింగపూర్ నుంచి వచ్చేవారికి తప్పిన ‘ రిస్క్’ ! కేంద్రం కొత్త ఆదేశాలు -
2022 మార్చి 31 నాటికి దేశ అప్పు ఎంతంటే..!
భారత రుణభారంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం లోక్‌సభలో పేర్కోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే (మార్చి 31, 2022)నాటికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దేశ రుణం 62 శాతంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఆర్థిక లోటు, రుణభారాలపై నజర్..! సోమవారం లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో, దేశ రుణ భారాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటుందని వెల్లడించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా మెరుగైన సమ్మతి ద్వారా పన్ను రాబడిని పెంచడం, ఆస్తుల మానటైజేషన్ ద్వారా వనరుల సమీకరణ, ప్రభుత్వ వ్యయ సమర్థతను మెరుగుపరచడం మొదలైనవి ఆర్థిక లోటు, రుణ భారాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమైన చర్యలని చౌదరి చెప్పారు. పుంజుకున్న ఆదాయాలు..! 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు జీడీపీలో 6.8 శాతంగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో అంచనా వేశారు. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం... ప్రభుత్వం ఆశించిన దానికంటే బలంగా ఆదాయం పుంజుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 6.6 శాతం ఆర్థిక లోటు ఉంటుందని తెలిపినట్లు పంకజ్ చౌదరీ అన్నారు. అంచనాలకు మించి..! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం ఎఫ్వై22లో భారత ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం వృద్ధి చెందుతుందని పంకజ్ అభిప్రాయపడ్డారు. దాంతో పాటుగా ఐఎమ్ఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ అప్డేట్ గురించి ప్రస్తావించారు. భారత్ 2021లో 9.5 శాతం, 2022లో 8.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసిందనే విషయాలను చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. చదవండి: ఏటీఎం ‘విత్‌డ్రా బాదుడు’.. 21రూ. మించే! ఇంతకీ ఆర్బీఐ ఏం చెప్పిందంటే.. -
HDFC Report: బేస్ ఎఫెక్ట్ ప్రభావంతో 9.4 శాతం వృద్ధి
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటుపై బేస్ ఎఫెక్ట్ ప్రభావమే అధికమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2022 మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ వృద్ధి రేటు 9.4 శాతంగా ఉంటుందని అంచనావేసింది. మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) ఈ రేటు 7.8 శాతంగా ఉంటుందని పేర్కొంది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020–21 ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే, కరోనా కష్టాలతో ఎకానమీలో అసలు వృద్ధి నమోదుకాకపోగా, 7.3 శాతం క్షీణత నమోదయిన సంగతి తెలిసిందే. నవంబర్ 30వ తేదీన రెండవ త్రైమాసిక ఫలితాలు రానున్న నేపథ్యంలో ప్రస్తుత ఎకానమీపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజా అంచనాలను పరిశీలిస్తే.. - రెండవ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధికి గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లో బేస్ ప్రధాన కారణం. అప్పట్లో ఎకానమీ వృద్ధిలేకపోగా 7.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. - వరుస త్రైమాసికాల పరంగా చూస్తే, ఎకానమీ మెరుగ్గా వుండే వీలుంది. దీని ప్రకారం, 2020– 21లో ఎకానమీ 16.9 శాతం క్షీణిస్తే, రెండవ త్రైమాసికంలో 9.75% పెరిగే అవకాశం ఉంది. - భారత్ ఎకానమీలో వెలుగురేఖలు స్పష్టమయ్యాయి. రవాణాలో నిషేధం పూర్తిగా తొలగిపోవడం, డిమాండ్ పుంజుకోవడం వంటి అంశాల నేపథ్యంలో పలు హైప్రీక్వెన్సీ ఇండికేటర్లు సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి. - 2021–22 రెండవ త్రైమాసికంలో వ్యవసాయం, అటవీ, మత్స్య సంపద వృద్ధి రేటు 4 శాతం ఉంటుందని భావిస్తున్నాం. ఎకానమీలో ఈ విభాగం వాటా దాదాపు 15 శాతంగా ఉంది. - జీడీపీలో మరో 15 శాతం వాటా కలిగిన పరిశ్రమ విభాగం వృద్ధి 6.3 శాతం ఉంటుందని సరళతర వడ్డీ రేట్లనే కొసాగించాలి - అసోచామ్ ఎకానమీ పూర్తి స్థాయిలో పురోగతి బాట పట్టే వరకూ సరళతర వడ్డీరేట్ల విధానాన్నే భారత్ కొనసాగించాలని ఇండస్ట్రీ సంస్థ అసోచామ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి విజ్ఞప్తి చేసింది. దేశంలో ద్రవ్యోల్బణం ప్రతికూల పరిస్థితులను అధిగమించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఇందుకు వడ్డీరేట్ల పెంపును సాధనంగా ఎంచుకోకూడదని కోరింది. ‘ప్రస్తుత పాలసీ రేట్లను కొనసాగించడానికి ఆర్బీఐ, దాని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ప్రశంసనీయమైన ప్రయత్నం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన కొన్ని ఆర్థిక వ్యవస్థలలోని కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నాయి. అయితే దీనిని ఆర్బీఐ అనుసరించబోదని, తక్కువ వడ్డీ రేట్లనే కొనసాగిస్తుందని మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నాము‘ అని ఛాంబర్ ప్రకటన తెలిపింది. వ్యూహాత్మక నిల్వల వినియోగించుకోవడం ద్వారా క్రూడ్ ధరల నియంత్రణకు ప్రయత్నం చేయాలన్న అమెరికా, చైనా, జపాన్ వంటి చమురు దిగుమతి దేశాల నిర్ణయాన్ని అసోచామ్ స్వాగతించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఉందని పేర్కొన్న ఇండస్ట్రీ బాడీ, అయితే రుణ వృద్ధి ఇంకా పుంజుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. ప్రత్యేకించి ప్రైవేటు పెట్టుబడులు ఇంకా బలహీనంగానే ఉన్నాయని తెలిపింది. ఇప్పటికీ అంతంతమాత్రంగానే ఉన్న ప్రైవేటు పెట్టుబడులు, వడ్డీరేట్లు పెంచితే మరింత తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: Goldman Sachs: 2021–22లో భారత్ జీడీపీ వృద్ధి 9.8% -
Goldman Sachs: 2021–22లో భారత్ జీడీపీ వృద్ధి 9.8%
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2021–22లో 8.5 శాతంగా నమోదవుతుందని అమెరికన్ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్ తన తాజా నివేదికలో అంచనావేసింది. 2022–23లో వృద్ధి రేటు 9.8 శాతంగా ఉంటుందని పేర్కొంది. మహమ్మారి ప్రతికూల ప్రభావంతో గడచిన ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ లో బేస్ ఎఫెక్ట్‌తో 2021–22లో మంచి వృద్ది రేటు నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2021–22లో 9.5 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా. అయితే 2022–23లో మాత్రం ఈ వృద్ధి రేటు 7.8 శాతం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గోల్డ్‌మన్ శాక్స్ తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► మహమ్మారి ప్రభావంగ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృత ప్రాతిపదికన జరుగుతోంది. ఆయా అంశాలకు తోడు వినియోగం మెరుగుపడుతోంది. ఈ సానుకూల పరిస్థితులు దేశ ఆర్థిక పురోగతికి దోహదపడే అంశాలు. ► ప్రభుత్వ మూలధన వ్యయాలు కూడా భారీగా పెరుగుతాయని విశ్వసిస్తున్నాం. అయితే ప్రైవేటు కార్పొరేట్ క్యాపిటల్ వ్యయాలు (క్యాపెక్స్) రికవరీ, హౌసింగ్ పెట్టుబడుల పునరుద్దరణ మాత్రం బలహీనంగానే ఉంది. ► బేస్ ఇయర్ ఎఫెక్ట్ తగ్గిపోయినప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో పలు సానుకూల అంశాల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కూడా భారీగా 9.8 శాతం వృద్ధి నమోదవుతుందన్నది అంచనా. ► వృద్ధి పురోగమిస్తుందన్న సంకేతాలతో ఆర్బీఐ తన ద్రవ్య పరపతి విధానాన్ని తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2022లోనే ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను 0.75 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయి. ► నాలుగు దశల్లో పాలసీ విధానాన్ని సాధారణ పరిస్థితికి తెచ్చే అవకాశం ఉంది. అదనపు లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని వెనక్కు తీసుకుంటామని ఇప్పటికే ఆర్బీఐ పేర్కొనడం ఇందులో మొదటి దశగా భావించవచ్చు. ► వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2021లో సగటున 5.2 శాతం, 2022లో 5.8 శాతంగా ఉండే వీలుంది. బార్క్లేస్ అంచనా 10 శాతం ఇదిలాఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ అంచనావేసింది. అయితే 2022–23లో వృద్ధి 7.8 శాతానికి పరిమితమవుతుందని విశ్లేషించింది. ఆర్బీఐ సరళతర వడ్డీరేట్ల విధానానికి ముగింపు పలకవచ్చని కూడా బార్క్లేస్ అంచనావేసింది. డిసెంబర్లో జరిగే పాలసీ సమీక్షలో రివర్స్ రెపో రేటును పెంచే వీలుందని విశ్లేషించింది. అటు తర్వాత 2022లో రెపో రేటును కూడా పెంచే అవకాశం ఉందని పేర్కొంది. భారతీయ విధాన నిర్ణేతలు గత మూడు సంవత్సరాలుగా వృద్ధికి, ఆర్థిక మూల స్తంభాలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారని పేర్కొంది. నిజానికి భారత్ ఆర్థిక వ్యవస్థ మహమ్మారి ప్రారంభానికి ముందే నెమ్మదించడం ప్రారంభించిందని ఈ సందర్భంగా పేర్కొంది. ఇప్పుడు ఆర్థిక స్థిరత్వంపై విధాన నిర్ణేతలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని వివరించింది. చదవండి: భారత్ జీడీపీ వృద్ధి 8.1 శాతం - ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ -
భారత్ జీడీపీ వృద్ధి 8.1 శాతం
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 8.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రిసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 9.3 శాతం–9.6 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా కట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 20.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఆర్బీఐ అంచనా ప్రకారం జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా 9.5 శాతం. క్యూ2లో 7.9 శాతం, క్యూ3లో 6.8 శాతం, క్యూ4లో 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేస్తోంది. తాజాగా దేశ ఎకానమీపై ఎస్బీఐ రిసెర్చ్ రిపోర్ట్‌లో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... - రెండవ త్రైమాసికంలో 8.1 శాతం వృద్ధి నమోదయితే, అది ప్రపంచంలోనే సంబంధిత క్వార్టర్లో అత్యధిక వృద్ధి రేటుగా ఉంటుంది. త్రైమాసికంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ పొందుతుంది. - మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీ ప్రకటించారు. అయితే ఈ బిల్లులు లేకపోయినప్పటికీ, కేంద్రం అమలు చేస్తామని పేర్కొంటున్న ఐదు వ్యవసాయ సంస్కరణలు ఈ రంగంలో మంచి ఫలితాలకు దారితీస్తాయి. - వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)ల విషయంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లో ధరల విధానాన్ని పర్యవేక్షించే ప్రత్యేక యంత్రాంగంతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్ భారతదేశంలో స్థాపించడానికి చర్యలు కొనసాగాలి. - వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ప్రొక్యూర్మెంట్ విధానం వ్యవస్థాగతం కావాలి. ద్రవ్యలోటు తగ్గే అవకాశం: ఫిచ్ ఇదిలావుండగా, 2021–22లో ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాలకన్నా మెరుగ్గా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ అంచనావేసింది. అంచనాలకు మించి ఆదాయాలు దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది. బడ్జెట్లో నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ అంచనాలు నెలవేరకున్నా, ద్రవ్యలోటు 6.6 శాతం అంచనాలకన్నా తక్కువగానే ఉండే వీలుందని పేర్కొంది. 2021–22లో 1.75 లక్షల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ తద్వారా ఒనగూడింది కేవలం రూ.9,330 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక ద్రవ్యలోటు ఆర్థిక సంవత్సరం మొత్తంగా 15.06 లక్షల కోట్లుండాలన్నది బడ్జెట్ నిర్దేశం.జీడీపీలో ఈ నిష్పత్తి అంచనా 6.8 శాతం. అయితే సెప్టెంబర్ నాటికి బడ్జెట్ అంచనాల్లో 35 శాతానికి ఎగిసింది. చదవండి: ఎకానమీ రికవరీ వేగవంతం: పీహెచ్‌డీసీసీఐ -
BrickWork Ratings : జీడీపీలో వృద్ధి.. 10 నుంచి 10.5 శాతం నమోదు
ముంబై: దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను దేశీయ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ రేటింగ్స్ పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో తొలుత 9 శాతం వృద్ధిని అంచనా వేయగా, దీనిని ఎగువముఖంగా 10 నుంచి 10.5 శాతం శ్రేణికి సవరించింది. అనేక ఆర్థిక వృద్ధి సూచికలు ఆర్థిక కార్యకలాపాల్లో ఊహించిన దాని కంటే వేగంగా పునరుద్ధరణను సూచిస్తున్నాయని సోమవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) వృద్ధి 20.1 శాతంగా నమోదయ్యింది. అయితే రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 8.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. మూడవ వేవ్ రూపంలో వైరస్ తీవ్రత లేనట్లయితే మూడు, నాలుగు త్రైమాసికాల్లో కూడా భారీ ఆర్థిక వృద్ధి జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు సంస్థ తెలిపింది. వ్యాక్సినేషన్లో సాధించిన పురోగతి కారణంగా వల్ల ‘మూడవ వేవ్’ వచ్చినా, దానివల్ల ఏర్పడే ప్రతికూలతలు కూడా పరిమితంగానే ఉంటాయన్న అభిప్రాయాన్ని బ్రిక్‌వర్క్ రేటింగ్ వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఎకానమీకి కొన్ని ప్రతికూలతలు ఉన్నట్లు ఏజెన్సీ పేర్కొంది. పెరుగుతున్న ముడి చమురు, ఖనిజ ఉత్పత్తులు, ముడిసరుకు, సరుకు రవాణా ధరలు, సెమీకండక్టర్ సరఫరాలో అంతరాయాలు, బొగ్గు సరఫరా కొరత వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆయా సవాళ్లు వృద్ధి వేగాన్ని తగ్గించే అవకాశం ఉందని తెలిపింది. -
KTR: వసూలు ఇక్కడ.. ఖర్చు అక్కడా?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులను కేంద్రం యూపీ, బిహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఖర్చు చేస్తోంది. తెలంగాణ చెల్లించే ప్రతిపైసా తిరిగి రాష్ట్రానికే రావాలని మేము కోరు కోవడం లేదు. కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల్లో కనీ సం సగం కూడా తిరిగి రాష్ట్రానికి ఇవ్వ డం లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను పునస్స మీక్షించి, వాటిని నెరవేర్చాలి’ అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ‘మ్యాన్ఎక్స్ 2021’ సదస్సులో కేటీఆర్ కీలకోప న్యాసం చేశారు. ‘పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలు, భూములు, విద్యుత్, శాంతి భద్రతలతోపాటు మానవ వనరులు కూడా ముఖ్యమే. దీని కోసం ఐఐఎం, ఎన్ఐడీ, ట్రిపుల్ ఐటీ కరీంనగర్, ఐసెర్, ట్రైబల్ వర్సిటీలు, మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి మం జూరు చేయాలని కేంద్రాన్ని కోరాం. బుల్లెట్ ట్రైన్ వచ్చినా ఢిల్లీ నుంచి గుజరాత్ మీదుగా ముంబైకి వెళ్తుందే తప్ప హైదరాబాద్ లేదా దక్షిణాదికి ఎందుకు రాదు? దేశం స్వయం స్వావలంబన దిశగా పయనించాలనుకుంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలి’ అని వ్యాఖ్యానించారు. ఏడున్నరేళ్లుగా శూన్యహస్తం.. ‘దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.5 శాతమే అయినా దేశ జీడీపీకి 5శాతం సమకూరుస్తోంది. భౌగోళికంగా 12వ అతిపెద్ద రాష్ట్రమైనా మా కంటే పెద్ద రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత దేశ జీడీపీ సమకూర్చంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ప్రగతిశీల విధానాలతో దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషి స్తున్న తెలంగాణను వెన్నుతట్టి ప్రోత్సహించాలని కేంద్రానికి అనేక వినతలు చేశాం. స్థానికంగా ఉద్యోగాల కల్పన కోసం భారీ పారిశ్రామిక పార్కులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. చైనా వంటి పెద్ద దేశాలతో ఉత్పత్తి రంగంలో పోటీ పడాలంటే చిన్న పారిశ్రామిక పార్కులతో సాధ్యం కాదు. రాష్ట్రం ఏర్పాటు చేసిన మెగా పారిశ్రామిక పార్కులు ఫార్మాసిటీ, మెగా టెక్స్టైల్ పార్కులను కేంద్రం పట్టించుకోవడం లేదు. దేశం స్వయం స్వావలంబన సాధించేందుకు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలోకి రావాలి. 2014కు ముందు నాటి యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్రం, ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారో చెప్పడం లేదు’అని కేటీఆర్ పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో అండగా నిలిచాం.. కోవిడ్.. లాక్డౌన్ సమయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడంలో పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కాపాడుకునేందుకు కేంద్రంతో అనేకమార్లు సమన్వయం చేశాం. అయితే వీటిని ఆదుకునేందుకు కేంద్ర ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ కంటి తుడుపు కాకుండా ఉద్యోగాల కల్పన, పురోగతికి దోహదం చేసేలా ఉండాలి. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీ ఎంఎస్ఎంఈలపై ఆశించిన ప్రభావం చూపలేదు. కోవిడ్ సమయంలోనూ తెలంగాణలో అనేక ప్రముఖ సంస్థలు పెట్టుబడులతో ముందుకొచ్చాయి. తైవాన్, కొలంబియా, పోలండ్, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి దేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చాయి’అని కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా ఎగుమతులు, ఆవిష్కరణలు, ఉత్తమ విధానాలు, ఉత్తమ స్టార్టప్‌లు తదితరాలకు సంబంధించి ఆరు కేటగిరీల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ తరఫున విజేతలకు కేటీఆర్ అవార్డులు అందజేశారు. సీఐఐ భాగస్వామ్యంతో ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్’అవార్డులను కూడా అందజేశారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సమీర్ గోయల్, సీఐఐ కన్వీనర్ శోభా దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. దేశం నడిబొడ్డున ఉన్న తెలంగాణ, ప్రత్యేకించి హైదరాబాద్ దేశానికి ఆర్థిక ఇంజిన్‌గా పనిచేస్తోంది. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–నాగపూర్, హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– విజయవాడ నడుమ పారిశ్రామిక కారిడార్ల కోసం అనేక విన తులు చేశాం. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఏపీలో పారిశ్రామీకరణ, ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు ఇన్సెంటివ్‌లు ఇస్తామని కేంద్రం ప్రకటించినా.. ఏడున్నరేళ్లుగా శూన్య హస్తమే ఎదురవుతోంది. – కేటీఆర్ -
‘ఎలన్ మస్క్..పాకిస్థాన్‌ను కొనేస్తారా...!’
Elon Musk Is Wealthier Than The Entire GDP of Pakistan: టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ ప్రపంచ అపర కుబేరుడుగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. టెస్లా కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే 36 బిలియన్ డాలర్లను పొందడంతో ఎలన్ మస్క్ సంపద 300 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కొద్దిరోజుల క్రితం హెర్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ అనే కార్ రెంటల్ సంస్థ సుమారు లక్ష టెస్లా కార్లకు ఆర్డర్ చేసింది. దీంతో అక్టోబరు 25 నాటి మార్కెట్ ట్రేడింగ్‌లో టెస్లా కంపెనీ షేరు విలువ భారీగా పెరిగింది. ఇక ఎలన్ మస్క్ సంపద పాకిస్థాన్ జీడీపీ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ఎలన్ మస్క్ నికర సంపద విలువ 311 బిలియన్ డాలర్లుగా ఉంది. 220 మిలియన్ల జనాభా కలిగిన పాకిస్థాన్ జీడిపీ కేవలం 280 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎలన్ మస్క్ సంపద పాకిస్థాన్ కంటే సుమారు 12 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉందని అమెరికాకు చెందిన కాలమిస్ట్ ఎడ్వర్డ్లూయీస్ ట్విటర్లో పోస్ట్ చేసిన విషయం తెగ వైరల్‌గా మారింది. Elon Musk's net worth now greater than Pakistan's gross domestic product - a country with 220 million people. — Edward Luce (@EdwardGLuce) October 27, 2021 Then he’d be left with nothing (other than 220m really pissed off people and an excellent T20 team). — Edward Luce (@EdwardGLuce) October 27, 2021 ఎడ్వర్డ్ ట్వీట్‌కు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫీచర్ ఫిల్మ్ మేకర్, ప్రొడ్యూసర్ రమేష్ శర్మ తన రిప్లేలో.. ఇప్పుడు ఎలన్ మస్క్ పాకిస్థాన్ కొనేస్తారా...అంటూ ప్రశ్నించారు. నెటిజన్లు కూడా రమేష్ శర్మ ట్విట్‌ను రీట్విట్ చేస్తున్నారు. రమేష్ శర్మ చేసిన ట్విట్‌కు ఎడ్వర్డ్ లూయిస్ రిప్లే ఇస్తూ...ఒక వేళ ఎలన్ మస్క్ అదే చేస్తే...అతని దగ్గర ఎమీ మిగలదు. కాగా పాకిస్థాన్‌లో చిరాకులో ఉన్న 220 మిలియన్ల ప్రజలు, ఒక మంచి టీ20 టీమ్ మాత్రం అతనికి లభిస్తుదంటూ ట్విట్ చేశారు. చదవండి: రెట్రో లుక్స్‌లో కవాసకి నుంచి అదిరిపోయే బైక్..! -
పటిష్టంగా ఎకానమీ పునాదులు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో వాస్తవ జీడీపీ గణాంకాలు.. కరోనా పూర్వ స్థాయిని అధిగమించడం ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కోవిడ్–19 మహమ్మారి సమస్యను సాధ్యమైన వేగంగా, నిర్మయాత్మకంగా దేశం అధిగమించాలని పనగారియా పేర్కొన్నారు. దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు ఇప్పటికే పుంజుకున్నాయని ఆయన వివరించారు. మరోవైపు, సంపన్న దేశాలు అమలు చేస్తున్న ఉపశమన ప్యాకేజీల (క్యూఈ) వల్లే భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. భారత్‌లోకి పెట్టుబడులకు క్యూఈతో పాటు అనేక కారణాలు ఉన్నాయన్నారు. ‘క్యూఈ అనేది సంపన్న దేశాల నుంచి ఇతర దేశాలకు పెట్టుబడులు మరలడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ నిధులన్నీ ఇతర వర్ధమాన మార్కెట్లలోకి కాకుండా మొత్తం భారత్‌లోకే వస్తాయన్న హామీ లేదు. అత్యధికంగా రాబడులు వస్తాయన్న భరోసా కారణంగానే ఇన్వెస్టర్లు భారత్‌ను ఎంచుకుంటున్నారు‘ అని పనగారియా చెప్పారు. సంపన్న దేశాలు క్రమంగా ప్యాకేజీలను ఉపసంహరించే కొద్దీ పెట్టుబడుల్లో కొంత మొత్తం వెనక్కి వెళ్లడం సాధారణమేనన్నారు. అయితే, ఆయా సంపన్న దేశాల్లో వచ్చే రాబడులకన్నా ఎంత అధికంగా అందించగలదన్న అంశంపైనే భారత్‌లో పెట్టుబడుల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని పనగారియా చెప్పారు. హేతుబద్ధంగానే స్టాక్ మార్కెట్ల తీరు .. వాస్తవ పరిస్థితులతో సంబంధం లేనట్లుగా ఆర్థిక వృద్ధి మందగించిన తరుణంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లిపోతుండటం అసాధారణమేమీ కాకపోవచ్చని పనగారియా చెప్పారు. భవిష్యత్ రాబడుల అంచనాలపైనే స్టాక్ మార్కెట్ ధరలు ఆధారపడి ఉంటాయని వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలు భారీగా ఉన్న నేపథ్యంలో షేర్ల రేట్ల విషయంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు హేతుబద్ధంగానే వ్యవహరిస్తున్నారని భావించవచ్చన్నారు. -
సర్వే: రూ.71.4 లక్షల కోట్లకు రాష్ట్రాల రుణ భారం
ముంబై: రాష్ట్రాల రుణ భారం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో చూస్తే వాటి రుణ భారం 2021–22లో 33 శాతంగా ఉంటుందని పేర్కొన్న క్రిసిల్, 2020–21 ఆర్థిక సంవత్సరంతో (34 శాతం) పోల్చితే దాదాపు సమానమేనని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు పెరగడం, వ్యయాలు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే అంశంగా పేర్కొంది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► 2020–21తో పోల్చితే 2021–22లో రాష్ట్రాల మొత్తం రుణం రూ.7.2 లక్షల కోట్లు పెరుగుతుంది. తద్వారా ఈ మొత్తం రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుంది. అయితే ఆదాయాలు 15 శాతం పెరిగి, మూడవ వేవ్ రాకుండా ఉంటేనే ఈ లెక్కల అంచనా నిజమవుతుంది. లేదంటే రుణ భారాలు మరింత పెరగక తప్పదు. ► మొత్తం జీఎస్డీపీలో దాదాపు 90 శాతం వాటా కలిగిన 18 రాష్ట్రాలను పరిశీలనలోకి తీసుకుంటే, ఆయా రాష్ట్రాలకు జీఎస్టీ పరిమాణం 0.9 లక్షల కోట్ల నుంచి (గత ఏడాది) రూ.1.4 లక్షల కోట్లకు పెరగడం ఊరటనిచ్చే అంశం. ► 2019–20లో రాష్ట్రాల ఆదాయ లోటు రూ.1.8 లక్షల కోట్లు. కరోనా కష్ట కాలం 2020–21లో ఇది రూ.3.8 లక్షల కోట్లకు పెరిగింది. 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది. ఇదే కాలంలో రాష్ట్రాల మూలధన వ్యయాలు జీఎస్డీపీలో వరుసగా 3.7 శాతం, 3.6 శాతంగా ఉంటే, 2021–22లో 4.4 శాతంగా ఉండే వీలుంది. ► 2019–20లో స్థూల ద్రవ్యలోటు 5.1 శాతం. 2020–21లో ఇది 7.6 శాతానికి చేరింది. 2021–22లో ఇది మరింతగా 8.2 శాతానికి పెరిగే వీలుంది. ► ఒక్క రెవెన్యూ లోటును తీసుకుంటే, 2020– 21లో రూ.3.8 లక్షల కోట్లయితే (జీఎస్డీపీలో 2 శాతం), 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు (జీఎస్డీపీలో 1.6 శాతం) తగ్గే వీలుంది. ► తొలి రెండు ఆర్థిక సంవత్సరాల్లో రుణ భారాలు వరుసగా 55.7 లక్షల కోట్లు, రూ.64.2 లక్షల కోట్లుగా ఉంటే, 2021–22లో రూ.71.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. ► గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల ఆదాయాలు 3 శాతం పతనమైతే, 2021–22లో 15 శాతం పెరుగుతాయని భావిస్తున్నాం. ► ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో, మొత్తం పన్ను వసూళ్లలో ఆదాయంలో రెండు ప్రధాన భాగాలు– వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అలాగే పెట్రోలియం ఉత్పత్తులు– మద్యం మీద అమ్మకపు పన్ను వాటా 30 శాతంగా ఉంటుంది. ఈ విభాగాల నుంచి ఆదాయాలు పటిష్టంగా ఉండే వీలుంది. అధిక ద్రవ్యోల్బణం, బేస్ పెంపు ద్వారా జీఎస్టీ 20 శాతం వృద్ధి చెందే వీలుంది. ► అయితే పన్నులు పెరిగినప్పటికీ ఆదాయ వ్యయాలు 10 నుంచి 11 శాతం పెరగవచ్చు. రాష్ట్రాల ఆదాయ వ్యయాల్లో 75 నుంచి 80 శాతం వేతనాలు, పెన్షన్లు, వడ్డీ వ్యయాలు, గ్రాంట్–ఇన్–ఎయిడ్, వైద్యం, కార్మిక సంక్షేమం వంటి కార్యక్రమాలకే కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. ► రోడ్లు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి వంటి మౌలిక రంగాలకు రుణ సమీకరణలు జరపాల్సిన పరిస్థితి ఉంది. ► ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయంలో రాష్ట్రాలు 55 శాతం వృద్ధిని (రూ .5.6 లక్షల కోట్లు) అంచనావేస్తూ బడ్జెట్ ప్రకటించాయి. కానీ వృద్ధి 20 శాతం దాటబోదన్నది అంచనా. ఇప్పటికే 4 శాతంగా ఉన్న ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య ఉన్న నికర వ్యత్యాసం) దీనికి ప్రధాన కారణం. పెరుగుతున్న రాష్ట్రాల రుణ వ్యయాలు: కేర్ రేటింగ్స్ ఇదిలావుండగా, రాష్ట్రాల రుణ వ్యయాలు పెరుగుతున్నాయని కేర్ రేటింగ్స్ మరో నివేదికలో పేర్కొంది. గడచిన ఐదు వారాలుగా రాష్ట్రాల మార్కెట్ రుణాలు దీనికి కారణమని వివరించింది. అన్ని మెచ్యూరిటీలపై సగటున వ్యయాలు 5 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85 శాతానికి చేరినట్లు కేర్ రేటింగ్స్ పేర్కొంది. చదవండి: షాకింగ్ సర్వే,దక్షిణాది కుటుంబాలలో అప్పులే అధికం -
సెప్టెంబర్ వరకూ కేంద్ర రుణం రూ.7.02 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) బాండ్ల జారీ ద్వారా 7.02 కోట్లు సమీకరించింది. అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది. ఆర్థిక శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 2021–22 బడ్జెట్ నిర్దేశాల ప్రకారం– కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12.05 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణ సమీకరణ జరపాల్సి ఉంది. ఇందులో మొదటి ఆరు నెలల్లోనే రుణ లక్ష్యంలో 60 శాతం అంటే దాదాపు రూ.7.24 లక్షల కోట్ల సమీకరణ చేయాల్సి ఉంది. అయితే సమీకరణ లక్ష్యం కొంత తగ్గింది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును కొంత మేర భర్తీ చేయడానికి మార్కెట్ నుంచి కేంద్రం రుణ సమీకరణలు జరుపుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 9.3 శాతంగా ఉంది. 2021–22లో జీడీపీలో 6.8 శాతం(రూ.15,06,812 కోట్లు)ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే 8శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 21.3 శాతం. ద్రవ్యలోటు కట్టడికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థికవేత్తలు కొందరు ఉద్ఘాటిస్తుండగా, కేవీ కామత్ లాంటి ప్రముఖ బ్యాంకర్లు ఈ విషయంలో కొంత సాహస వైఖరిని కేంద్రం ప్రదర్శించవచ్చని సూచిస్తున్నారు. -
రాష్ట్ర జీడీపీలో ఎగుమతుల వాటా 12%
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఎగుమతుల వాటాను పెంచే విధంగా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం దేశ జీడీపీలో ఎగుమతుల వాటా 20% ఉంటే రాష్ట్ర జీడీపీ (జీఎస్డీపీ)లో ఇది 12 శాతానికి పరిమితమైందని తెలిపారు. దీన్ని పెంచేందుకు 10 ఏళ్లకాలానికి ప్రణాళిక తయారు చేసినట్లు చెప్పారు. వాణిజ్య ఉత్సవ్‌లో భాగంగా మంగళవారం రాష్ట్రంలో ఎగుమతుల అవకాశాలను వెల్లడించేలా ‘స్థానికంగా ఉత్పత్తి– అంతర్జాతీయంగా విక్రయం’ అంశంపై వివిధ దేశాల రాయబార ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 300 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఎగుమతులను 2025 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం చేరుకోవాలంటే ఏటా దేశ ఎగుమతుల్లో 36 శాతం వృద్ధి నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు ప్రస్తుత 16.8 బిలియన్ డాలర్ల నుంచి 22.4 బిలియన్ డాలర్లకు చేరతాయని తెలిపారు. అలాగే 2030 నాటికి రాష్ట్ర ఎగుమతులను రెట్టింపు చేయాలన్న లక్ష్యం చేరుకోవాలంటే ఏటా 8% వృద్ధిని నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. 10 ఏళ్ల కాలానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని రెండు, మూడేళ్లకు ఒకసారి సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. -
34 శాతానికి తగ్గిన కుటుంబాల రుణ భారం
ముంబై: ఇంటి రుణ భారం (దేశవ్యాప్తంగా గృహస్థుల రుణాలు) దేశ జీడీపీలో 34 శాతానికి జూన్ త్రైమాసికంలో తగ్గినట్టు ఎస్బీఐకి చెందిన పరిశోధన విభాగం ఒక నివేదికలో వెల్లడించింది. 2019–20 నాటికి జీడీపీలో 32.5 శాతంగా ఉన్న కుటుంబ రుణ భారం.. కరోనా కారణంగా 2020–21 నాటికి 37.3 శాతానికి పెరగడం గమనార్హం. తమ అంచనాల మేరకు ఇది ఈఏడాది జూన్ ఆఖరుకు జీడీపీలో 34 శాతానికి తగ్గి ఉంటుందని నివేదిక తెలిపింది. గృహస్థుల రుణ భారం 2020–21 చివరికి ఉన్న రూ.73.59 లక్షల కోట్ల నుంచి 2021–22 మొదటి త్రైమాసికం చివరికి రూ.75 లక్షల కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. శాతం వారీగా తగ్గినట్టు కనిపిస్తున్నా..అంకెల వారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ‘‘2018తో ముగిసిన ఆరేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని వారి రుణ భారం 84 శాతం పెరగ్గా.. పట్టణ ప్రాంతాల్లోని వారి రుణ భారం 42 శాతం మేర పెరిగింది. ఇదే ఆరేళ్ల కాలంలో 18 రాష్ట్రాల్లోని పల్లెల్లో గృహస్థుల సగటు రుణం రెట్టింపైంది’’ అని ఈ నివేదిక పేర్కొంది. -
ఓలా 'ఫ్యూచర్ ఫ్యాక్టరీ'లో అంతా మహిళా ఉద్యోగులే
న్యూఢిల్లీ: రానున్న కాలంలో ఓలా 'ఫ్యూచర్ ఫ్యాక్టరీ'ని మహిళామణుల చేత నిర్వహిస్తామని ఓలా చైర్మన్ భవేశ్ అగర్వాల్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర భారత్‌కీ ఆత్మనిర్భర విమెన్ అవసరమని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీని దాదాపు 10 వేల మంది మహిళలే నిర్వహిస్తారని, ప్రపంచంలోనే అత్యధిక మంది మహిళలు ఉన్న ఫ్యాక్టరీగా ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ నిలవనుందని చెప్పారు. మహిళలను సమగ్ర శ్రామిక శక్తిగా తీర్చిదిద్దడమే కాక ఆర్థిక పరంగా ఉపాధి అవకాశలు కల్పించిన తొలి సంస్థగా ఓలాను అభివర్ణించారు. చదవండి: సియాచిన్ హిమ శిఖరాన్ని అధిరోహించి ...రికార్డు సృష్టించిన వికలాంగులు సమానత్వానికే పెద్ద పీట..... ఈ క్రమంలో మహిళల నైపుణ్యాలను పెంపొందించేలా శిక్షణ ఇవ్వడానికీ పెట్టుబడులు పెట్టామని భవేశ్ తెలిపారు. ఈ ఉపాధి అవకాశాలు ఆర్ధికపరంగా వారి జీవితాల్ని, కుటుంబాల్ని మాత్రమే కాక యావత్ సమాజాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. అంతేకాక వాహనాల ఉత్పాదనకు సంబంధించిన పూర్తి బాధ్యత మహిళలదేనని చెప్పారు. శ్రామిక శక్తిలో మహిళల సమానత్వానికీ ప్రాధాన్యత ఇస్తే భారత్ జీడీపీ వృద్ధి రేటు 27% పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తరాలలో శ్రామిక శక్తిలో సమానత్వాన్ని తీసుకువచ్చేలా కార్యచరణ దిశగా తొలి అడుగులు వేసిన సంస్థగా ఓలా నిలుస్తుందన్నారు. భారతదేశ పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తామని భవేశ్ చెప్పారు. చదవండి: ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేలా భారత బలగాలకు వ్యూహాత్మక శిక్షణ ! -
తనఖా రుణాలలో వృద్ధి
సాక్షి, హైదరాబాద్: దేశంలో మార్టిగేజ్ లోన్స్ శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. 1990లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతంగా ఉన్న తనఖా రుణాల వాటా.. ప్రస్తుతం 11 శాతానికి చేరిందని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) తెలిపింది. దీని విలవు సుమారు రూ.27 లక్షల కోట్లుగా ఉందని ఇటీవల జరిగిన ‘ట్రాన్స్ఫార్మింగ్ మార్టిగేజ్ లెండింగ్ ఫర్ డిజిటల్ ఇండియా’ వెబినార్ సదస్సులో పాల్గొన్నారు. ఎన్‌హెచ్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భావే తెలిపారు. గత ఐదేళ్లుగా దేశీయ గృహ రుణ మార్కెట్ 30 శాతం మేర వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అంతకుక్రితం ఏడాదితో పోలిస్తే 2021 ఆర్థిక సంవత్సరంలో రుణ పంపిణీ 185 శాతం పెరిగిందని చెప్పారు. ఇందులో 65 శాతం లోన్లు బ్యాంక్‌లు అందించాయి. ఇప్పటివరకు దేశంలోని అన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తెలంగాణలో రూ.17,970 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.5,730 కోట్ల గృహ రుణాలను అందించాయి. చదవండి: గృహ రుణాలలో 26 శాతం వృద్ధి -
మెరుగుపడుతున్న రాష్ట్రాల ఆదాయాలు!
ముంబై: రాష్ట్రాల ఆదాయాలు క్రమంగా మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా)తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ద్రవ్యలోటు (ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) 4.1 శాతానికి (రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తిలో) పరిమితి కావచ్చని అంచనా వేసింది. చదవండి: భారీగా పుట్టుకొస్తున్న సాస్ స్టార్టప్‌లు, ఐపీఓకి జోష్ ఇంతక్రితం వరకూ ఈ అంచనాను సంస్థ 4.3 శాతంగా పేర్కొంది. ఇక రాష్ట్రాల జీడీపీలో రుణ నిష్పత్తి కూడా 34 శాతం నుంచి 32.4 శాతానికి తగ్గుతుందన్న అంచనాలను వెలువరించింది. వ్యాక్సినేషన్ విస్తృత స్థాయిలో కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో ఆర్థిక రికవరీ కూడా ఊపందుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించింది. ఆయా అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల మెరుగుపడ్డానికి దోహపడతాయని పేర్కొంది. కరోనా ప్రేరిత మూడవ వేవ్ భయాలు తొలిగిపోతే వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షలను ప్రభుత్వాలు మరింత సడలించే అవకాశం ఉందని ఏజెన్సీ అంచనావేస్తోంది. ఆయా పరిస్థితుల్లో రెవెన్యూ లోటు క్రితం అంచనాలను కూడా 1.5 శాతం నుంచి (రాష్ట్రాల జీడీపీల్లో) 1.3 శాతానికి మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది. నివేదికకు సంబంధించి కీలక అంశాలను పరిశీలిస్తే.. ►2021–22 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 14 రాష్ట్రాల నుంచి అందిన సమాచారం విశ్లేషణ ప్రకారం ఈ కాలంలో ఆయా రాష్ట్రాల ఆదాయం 30.8 శాతం పెరిగి రూ.3.95 లక్షల కోట్లకు చేరింది. ►2020 ఇదే కాలంలో పోల్చి చూసినా సమీక్షా కాలంలో వృద్ధిరేటు 1.5 శాతంగా ఉంది. ► పన్ను, పన్నుయేతల ఆదాయాలు వరుసగా 77 శాతం, 46 శాతం చొప్పున ఎగశాయి. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాల ఆదాయాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదని భావించవచ్చు. ►రాష్ట్రాల స్థూల మార్కెట్ రుణాలు 2020–21లో రూ.7.88 లక్షల కోట్లు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య స్థూల మార్కెట్ రుణాలు రూ.1.94 లక్షల కోట్లు. ► 2020 ఏప్రిల్–జూలై మధ్య స్థూల మార్కెట్ రుణాలు రూ.2.1 లక్షల కోట్లు. ►అయితే 2020–21తో పోల్చితే స్థూల మార్కెట్ రుణాలు రూ.8.2 లక్షల కోట్లకు పెరుగే అవకాశం ఉంది. ఇది క్రితం క్రితం రూ.8.4 లక్షల కోట్ల అంచనాకన్నా తక్కువ. ఇక నికర మార్కెట్ రుణాలు 2020–21లో రూ.6.45 లక్షల కోట్లుకాగా, ఇది 2021–22 నాటికి 6.2 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది. -
గణాంకాలు–వాస్తవాలు
బ్రిటిష్ మాజీ ప్రధాని బెంజమిన్ డిజ్రేలీ స్వయంగా నవలా రచయిత కూడా కనుక తన అనుభవాన్ని రంగరించి గణాంకాల గురించి ఓ చక్కని మాట చెప్పారు. గణాంకాలు చెప్పని వాస్తవాలేమిటో తెలుసుకున్నాకే వాటిని విశ్వసించాలన్నారు. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి విడుదల చేసిన జీడీపీ, జీవీఏ గణాంకాలను ఆ దృష్టితో చూడకతప్పదు. దేశవ్యాప్తంగా కఠినమైన లాక్డౌన్ అమలైన గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మైనస్ 24.4 శాతానికి పడిపోయిన వృద్ధి రేటు, ఈసారి అదే త్రైమాసికంనాటికి 20.1 శాతానికి ఎగబాకిందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. కరోనా రెండో దశ దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించి భారీగా కేసులు నమోదైన సమయంలో జీడీపీ ఇంతగా వృద్ధి చెందడం గమనించదగ్గదని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అంటున్నారు. నిరుడు తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థను అవస్థలపాలు చేసిన కరోనా, ఈ ఏడాది మరింత ఉగ్రరూపం దాల్చినా మనల్ని ఏమీ చేయలేకపోయిందని కూడా ఆయన చెప్పారు (చదవండి: ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా?) ఈ ఏడాది ప్రపంచంలోనే వేగంగా వృద్ధి నమోదు చేస్తున్న దేశంగా భారత్‌ను పరిగణించవచ్చునని ఆయన లెక్కేశారు. ఆయనే కాదు...ఆర్బీఐ, ఐఎంఎఫ్, ఎస్ అండ్ పీ వగైరా సంస్థలు భారత వార్షిక వృద్ధి రేటు ఈసారి చైనాను అధిగమిస్తుందని జోస్యం చెప్పాయి. అయితే ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే జీడీపీ 16.9 శాతం కుంచించుకుపోయింది. అదే సమయంలో ప్రస్తుత వృద్ధి రేటు రిజర్వ్ బ్యాంకు, బ్లూమ్‌బర్గ్ అంచనాలకు దగ్గరగానే ఉంది. కరోనా మహమ్మారి కంటే చాలా ముందే మన ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో కూరుకుపోవడం మొదలైంది. 2017 ఆర్థిక సంవత్సరానికి ముందు 8 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2020 ఆర్థిక సంవత్సరానికి 4 శాతానికి పడిపోయింది. అనాలోచితమైన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, హడావుడిగా అమలుచేసిన జీఎస్టీ ఇందుకు కారణాలు. అయితే అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకూ భరోసానిస్తూ దేన్నయినా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం మన ఆర్థిక వ్యవస్థకున్నదని, ఇది తిరిగి మరింత శక్తిమంతంగా పుంజుకుంటుందని చెప్పారు. కరోనా మహమ్మారి కాటేయకపోతే ఆయన ఆశలు నెరవేరేవేమో! కానీ జరిగిందంతా అందుకు విరుద్ధం. వేరే దేశాలతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థ చిగురుటాకులా వణికింది. తలసరి జీడీపీలో బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు కూడా మనల్ని అధిగమించాయి. అసలు జీడీపీ ఆధారంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అంచనా వేయడం సరికాదన్నది పలువురు ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో చేస్తున్న వాదన. నిర్దిష్ట కాలంలో వ్యవసాయం, ఉత్పాదక రంగం, సేవా రంగం తదితరాల్లో సాగిన లావాదేవీల మారకపు విలువ ఆధారంగా జీడీపీని లెక్కగడతారు. అయితే ఈ సంపదంతా ఏ రకంగా పంపిణీ అవుతున్నదన్న అంశమే ప్రధానం. కరోనాకు ముందే కుంగిపోవడం మొదలైన సామాన్యుల జీవితాలు ఆ మహమ్మారి కాటుతో మరింత దెబ్బతిన్నాయి. సంఘటిత, అసంఘటిత రంగాలు రెండిటా ఉపాధి లేమి ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఫలితంగా ప్రజానీకం సగటు ఆదాయం గణనీయంగా క్షీణించింది. ప్రజారోగ్యం సరేసరి. కరోనా మహమ్మారి దాన్ని బాహాటంగా బయటపెట్టింది. తాజాగా భారతీయ ఆర్థిక వ్యవస్థ సమీక్షా కేంద్రం(సీఎంఐఈ) వెల్లడించిన గణాంకాలు బెంబేలెత్తిస్తున్నాయి. (చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..) గత నెలలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో 15 లక్షలమంది ఉపాధి కోల్పోయారని దాని సారాంశం. ఇందులో గ్రామీణ భారతం వాటాయే అధికమని ఆ సంస్థ అంచనా వేస్తోంది. అంతకుముందు జూలై నెలలో కొద్దో గొప్పో సాధించిన పురోగతి కాస్తా నెలరోజుల వ్యవధిలో తిరగబడిందని సీఎంఐఈ అంటున్నది. జూలై నెలలో నిరుద్యోగిత 6.95 శాతం ఉంటే ఆగస్టులో అది 8.32 శాతం. తరచి చూస్తే జూలై నెలలో పుంజుకున్నట్టు కనబడిన ఉపాధి అవకాశాలన్నీ సాగు రంగానికి సంబంధించినవేనని అర్థమవుతుంది. వానాకాలంలో వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు జోరందుకోవడం ఇందుకు ప్రధాన కారణం. జీడీపీ గణాంకాలు చూసి, స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్న తీరు చూసి మన ఆర్థిక వ్యవస్థ క్రమేపీ సాధారణ స్థితికి చేరుకుంటున్నదన్న అభిప్రాయం మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్లో కనబడుతోంది. కానీ జీడీపీని, స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలు వేరే ఉంటాయి. వాటికి క్షేత్ర స్థాయి వాస్తవాలతో పెద్దగా సంబంధం ఉండదు. ఉదాహరణకు సీఎంఐఈ ప్రకారం 2,546 కంపెనీల నికర అమ్మకాలు 2019 జూన్ త్రైమాసికం స్థాయికి చేరకపోయినా, వాటి నికర లాభాలు మాత్రం కరోనా మహమ్మారికి ముందునాటికన్నా బాగున్నాయి. వ్యయంలో భారీగా కోత వేయడం వల్లే ఇది సాధ్యమైందని నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది. పెరిగిన ముడి సరుకుల వ్యయాన్ని తగ్గించుకోవడం ఎటూ సాధ్యం కాదు. ఏతా వాతా కోత పడేది ఉద్యోగాల్లోనే. అలాగే వడ్డీ రేట్ల పెంపుదల ఉండదని ఆర్బీఐ చెప్పడంతో స్టాక్ మార్కెట్లు హుషారుగా ఉన్నాయి. మొత్తానికి గత ఏడాది ఇదే సమయంలో అట్టడుగుకు పడిపోయిన వృద్ధితో పోల్చడం వల్లే ఈసారి జీడీపీ మెరుగ్గా ఉన్నట్టు కనబడుతోంది. స్థూల ఆర్థిక వ్యవస్థ పుంజుకోనిదే ఉపాధి అవకాశాలుండవు. ప్రజల కొనుగోలు శక్తి పెరగదు. ఇవి సాధ్యం కావాలంటే కేంద్ర వ్యయం భారీగా పెరగాలి. పెట్రో ఉత్పత్తులపై పరోక్ష పన్నుల భారం తగ్గించాలి. ద్రవ్య లోటును అదుపు చేయడం ప్రధానమే. కానీ ఉపాధి అవకాశాలనూ, కొనుగోలు శక్తినీ పెంచకుండా కృత్రిమంగా పైకి ఎగబాకే వృద్ధి రేటును చూసి ఎన్నాళ్లు సంతృప్తి పడతాం? కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. (చదవండి: టీకాలకు లొంగని కోవిడ్ ఎంయూ వేరియంట్!) -
స్టాక్ మార్కెట్లో రికార్డుల ర్యాలీ.. ఈ అంశాలే కీలకం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ వారంలోనూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగవచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో అధిక ధరల వద్ద ట్రేడ్ అవుతున్న షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయ డేటాతో పాటు ప్రపంచ పరిమాణాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేస్తాయని చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలు కూడా సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. నిఫ్టీ పైపైకి ‘‘జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలతో సూచీల రికార్డు ర్యాలీ కొనసాగవచ్చు. లాభాల స్వీకరణ జరగకపోతే నిఫ్టీ 16,900 స్థాయిని అందుకుంటుంది. దిగువస్థాయిలో 16,550 వద్ద బలమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే ఇతర అంశాలను పరిశీలిస్తే.., క్యూ1 జీడీపీ గణాంకాలపైనే అందరి దృష్టి ... కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికపు (ఏప్రిల్–జూన్) జీడీపీ గణాంకాలను మంగళవారం విడుదల చేయనుంది. లో బేస్ ఎఫెక్ట్ కారణంగా (2020 ఇదే కాలంలో 24 శాతంపైగా క్షీణత) క్యూ1లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని అర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అంచనాలు ఏమాత్రం తారుమారైనా మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇతర స్థూల ఆర్థిక, ఆటో అమ్మక గణాంకాలు... ఆటో కంపెనీలు ఆగస్ట్ వాహన విక్రయ గణాంకాలను బుధవారం విడుదల చేయనున్నాయి. దేశీయంగా కోవిడ్ ఆంక్షల సడలింపుతో ఉత్పత్తి ఊపందుకుంది. పలు దేశాల్లో లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేతతో ఎగుమతులు పెరిగాయి. ఈ పరిణామాలతో ఆటో అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జూలై నెల మౌలిక రంగ పనితీరు, ద్రవ్యలోటు గణాంకాలు ఈ మంగళవారం విడుదల కానున్నాయి. ఇక సెప్టెంబర్ 1వ తేదిన (బుధవారం) ఆగస్ట్ నెలకు సంబంధించిన మార్కిట్ పారిశ్రామిక రంగ పీఎంఐ గణాంకాలు, ఆగస్ట్ మాసపు సేవల రంగపు డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. అదే శుక్రవారం ఆర్బీఐ ఆగస్ట్ 27వ తేదితో ముగిసే ఫారెక్స్ నిల్వలను ప్రకటించనుంది. ఈ వారంలో రెండు ఐపీఓలు... ఈ వారంలో ఒకే రోజున రెండు కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ అమీ ఆర్గానిక్స్, హెల్త్ కేర్ సేవల సంస్థ విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ పబ్లిక్ ఇష్యూలు సెప్టెంబర్ 1న మొదలై, మూడవ తేదీన ముగియనున్నాయి. ఈ రెండు ఇష్యూలు ప్రాథమిక మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.2,465 కోట్లను సమీకరించనునున్నాయి. 4 నెలల తర్వాత తొలిసారి కొనుగోళ్లు నాలుగు నెలల వరుస అమ్మకాల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఈ ఆగస్ట్‌లో తొలిసారి నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు ఈ ఆగస్టులో రూ.986 కోట్ల షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.13,494 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. అంచనాలకు కంటే ముందుగా వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఫెడ్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడంతో భారత్‌తో పాటు వర్థమాన దేశ మార్కెట్లలోకి చెప్పుకోదగిన స్థాయిలో పెట్టుబడులు రావడం లేదని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ హెడ్ శ్రీవాస్తవ తెలిపారు. చదవండి : కేంద్రం చెబుతున్న మానిటైజేషన్‌తో ప్రయోజనం ఎవరికి ? ఆస్తుల నగదీకరణ ఎందుకు ? -
భారత్ ఎకానమీ వృద్ధి 18.5 శాతం!
ముంబై: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో 18.5 శాతం వృద్ధి సాధిస్తుందని ఎస్బీఐ రిసెర్చ్ రిపోర్ట్– ఎకోరాప్ అంచనావేసింది. అయితే దీనికి ప్రధాన కారణం బేస్ ఎఫెక్ట్ అని (2020 ఇదే కాలంలో 24 శాతంపైగా క్షీణత) కూడా నివేదిక పేర్కొనడం గమనార్హం. ఈ నెలాఖరున మొదటి త్రైమాసికం జీడీపీ గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎకోరాప్ తన తాజా అంచనాలను తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►పరిశ్రమలు, సేవల రంగాల క్రియాశీలత, అంత ర్జాతీయ ఆర్థిక పరిస్థితులుసహా 41 కీలక రంగా లు ప్రాతిపదికగా రూపొందించిన ‘నౌకాస్టింగ్ నమూనా’ ప్రాతిపదికన ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ భారత్ ఎకానమీ తాజా అంచనాలను వెలువరించింది. ►తుది ప్రొడక్ట్‌తో సంబంధం లేకుండా ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) ప్రకారం వృద్ధి రేటు క్యూ1లో 15 శాతంగా ఉంటుంది. ►మొదటి త్రైమాసికంలో కార్పొరేట్ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. స్థూల ఆదాయాల్లో మంచి రికవరీ కనిపించింది. ►4,069 కంపెనీలను చూస్తే, క్యూ1లో జీవీఏ వృద్ధి 28.4 శాతంగా ఉంది. అయితే 2020–21 చివరి త్రైమాసికం (2021 జనవరి–మార్చి) కన్నా ఈ వృద్ధి రేటు తక్కువ. ►కరోనా సెకండ్‌వేవ్‌తో ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ప్రతికూలతలకు గురయిన ఆర్థిక వ్యవస్థ జూన్‌లో పుంజుకుంది. ►బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టు 16తో ముగిసిన వారంలో 103.3 వద్ద ఉంది. ►ప్రాంతీయ రవాణా కార్యాలయాల ఆదాయాలు, విద్యుత్ వినియోగం, రవాణా ఇండికేటర్లు రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ►కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో కుటుంబాలపై రుణ భారాలు తీవ్రమయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల రుణ భారం 32.5 శాతం అయితే, ఇది తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో 37.3 శాతానికి పెరిగింది. నిజానికి దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టిన తర్వాత జీడీపీలో కుటుంబ రుణ భారాలు పెరుగుతూ వస్తుండడం గమనార్హం. 2017– 18లో ఇది 30.1 శాతంగా ఉంది. తరువాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 31.7 శాతం, 32.5 శాతంగా నమోదయ్యాయి. అంటే నాలుగేళ్లలో పెరిగిన రుణ భారం 7.2 శాతం. ►2020 లాక్డౌన్ ప్రారంభంలో వ్యయాలు ఏవీ లేక అన్ని వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు భారీ గా పెరిగాయి. అయితే పండుగల కాలంలో క్రమంగా తగ్గాయి. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. ►2021–22 మొదటి త్రైమాసికంపై ఆర్బీఐ అంచనా 21.4 శాతంకాగా, ఇక్రా అంచనా 20 శాతంగా ఉంది. చదవండి : ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతుగా నిలవాలి -
కోవిడ్ సంక్షోభం.. ఆర్థికమంత్రి గారు నోట్లు ముద్రిస్తారా?
న్యూఢిల్లీ: కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవడానికి కొత్తగా నోట్లు ముద్రించే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. కోవిడ్ సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ త్వరగానే కోలుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. నో సార్ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ... కోవిడ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ విపత్తును ఎదుర్కొనేందుకు నోట్లను ముద్రిస్తారా అంటూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ‘నో సార్’ అంటూ ఆర్థిక మంత్రి చట్టసభలో సమాధానం ఇచ్చారు. గాడిన పడుతోంది 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల జాతీయోత్పత్తి జీడీపీ సుమారు 7.3 శాతం కుదించబడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయని అందువల్ల ఇప్పుడప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని, ఈ ఏడాది చివరి నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు రూ,.30 వేల కోట్లతో ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజీని ప్రకటించామని వివరించారు. -
ఏప్రిల్–జూన్‌లో చైనా వృద్ధి 7.9 శాతం
బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన, వర్థమాన, పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు కరోనా ప్రేరిత సవాళ్లను ఎదుర్కొంటుంటే, వైరెస్ సృష్టికి కారణమైన చైనా మాత్రం పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2021 రెండవ త్రైమాసికం ఏప్రిల్–జూన్‌లో 7.9 శాతం (2020 ఇదే కాలంతో పోల్చి) పురోగతి సాధించింది. మొదటి త్రైమాసికం (జనవరి–మార్చి) 18.3 శాతం వృద్ధితో (1993లో చైనా జీడీపీ గణాంకాల ప్రచురణ ప్రారంభమైంది. అటు తర్వాత ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో వృద్ధి రేటు నమోదుకావడం అదే తొలిసారి) పోల్చితే తాజా గణాంకాలు మందగించడం గమనార్హం. ఏడాది తొలి ఆరు నెలల్లో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ– చైనా 12.7 శాతం వృద్ధి నమోదుచేసుకున్నట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) గురువారం గణాంకాలు వెల్లడించాయి. విలువలో ఎకానమీ 53.2 ట్రిలియన్ యువాన్లకు చేరింది. డాలర్లలో ఇది దాదాపు 8.23 ట్రిలియన్లు. కాగా త్రైమాసికంగా చూస్తే, మొదటి త్రైమాసికంకన్నా, రెండవ త్రైమాసికంలో వృద్ధి 1.3 శాతంగా ఉంది. గణాంకాల ప్రకారం వార్షికంగా పారిశ్రామిక ఉత్పత్తి 15.9 శాతం పెరిగితే, రిటైల్ విక్రయాలు 23 శాతం ఎగశాయి. పట్టణ నిరుద్యోగం జూన్‌లో 5 శాతంగా ఉంది. ప్రపంచం కష్టపడుతున్న సమయంలో... కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో 2020 తొలి త్రైమాసికం మినహా మిగిలిన మూడు త్రైమాసికాల్లోనూ వృద్ధిని నమోదుచేసుకోవడం గమనార్హం. కరోనా సవాళ్లతో 2020 మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు (2019 ఇదే కాలంతో పోల్చి) జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెపె్టంబర్ మధ్యా ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారీగా 6.5 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 2.3 శాతం వృద్ధి రేటును (జీడీపీ విలువ 15.42 ట్రిలియన్ డాలర్లు) నమోదుచేసుకుంది. -
రెండు దశాబ్దాల్లో 15 ట్రిలియన్ డాలర్ల మార్క్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ చక్కని వృద్ధి చక్రంలోకి ప్రవేశించిందని.. ఈ దిశలో వచ్చే రెండు దశాబ్దాల కాలంలో (20 ఏళ్లలో) 15 ట్రిలియన్ డాలర్ల స్థాయికి (రూ.1110 లక్షల కోట్లు)చేరుకుంటుందన్న అభిప్రాయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ వ్యక్తం చేశారు. కరోనా రాక ముందు మన దేశ జీడీపీ 2.89 ట్రిలియన్ డాలర్లు(రూ.214 లక్షల కోట్లు)గా ఉంది. సోమవారం గ్రూపు వాటాదారుల వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి అదానీ మాట్లాడారు. రానున్న నాలుగేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల పరిమాణానికి చేరుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయంటూ.. దీన్ని భారత్ చేరుకుంటుందని, ఇందులో తనకు ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ‘‘భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఆ తర్వాత 15 ట్రిలియన్ డాలర్ల పై స్థాయికి వచ్చే రెండు దశాబ్దాల్లో చేరుకుంటుంది’’ అని చెప్పారు. వినియోగం, మార్కెట్ పరిమాణం రీత్యా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందన్నారు. -
కరోనా కాలంలోనూ కరెంట్ ఖాతా మిగులు
ముంబై: దేశం కరోనా సవాళ్లను ఎదుర్కొన్న 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ 0.9 శాతం (స్థూల దేశీయోత్పత్తి విలువలో) కరెంట్ అకౌంట్ మిగులును నమోదు చేసుకుందని ఆర్బీఐ బుధవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. విలువలో ఇది 102.2 బిలియన్ డాలర్లు(7,62,616.4 కోట్లు). గత 17 ఏళ్లలో మొదటిసారి ఎఫ్వై 21లో కరెంట్ అకౌంట్ మిగులు సాధించింది. ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. వచ్చిన దానికన్నా చెల్లింపులు అధికంగా ఉండే పరిస్థితి ‘కరెంట్ అకౌంట్ లోటు’. చెల్లింపులకన్నా దేశంలోకి వచ్చిన మొత్తాలు అధికంగా ఉంటే అది కరెంట్ అకౌంట్ మిగులు. ఇక 2019-20లో 0.9 శాతం కరెంట్ అకౌంట్ లోటును నమోదుచేసుకుంది. విలువలో ఇది 157.5 బిలియన్ డాలర్లు. గణాంకాల ప్రకారం.. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 44 బిలియన్ డాలర్లు. 2019-20లో ఈ పరిమాణం 43 బిలియన్ డాలర్లే కావడం గమనార్హం. నికర విదేశీ ఫోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కూడా ఇదే కాలంలో 1.4 బిలియన్ డాలర్ల నుంచి 36.1 బిలియన్ డాలర్లకు ఎగశాయి. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ కార్పొరేట్ల విదేశీ వాణిజ్య రుణాలు మాత్రం 21.7 బిలియన్ డాలర్ల నుంచి 0.2 బిలియన్ డాలర్లకు తగ్గాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలకు అదనంగా మరో 87.3 బిలియన్ డాలర్లు తోడయ్యాయి. ప్రస్తుత విలువ దాదాపు 600 బిలియన్డాలర్ల పైన రికార్డు స్థాయిల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్న నేపథ్యంలో 2020-21లో కరెంట్ అకౌంట్ ‘లోటు’లోనే ఉంటుందని అంచనా. చదవండి: ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌లో రాబోయే ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు -
ఆర్థిక అవస్థ!
వ్యవసాయం, మత్స్యరంగం, అటవీ రంగం మినహా దేశంలో సకల రంగాలూ 2020–21 ఆర్థిక సంవత్సరంలో తిరోగమనంలోనే వున్నాయని జాతీయ గణాంక కార్యాలయం వెలువరిం చిన గణాంకాలు ఆర్థిక నిపుణులు కొంతకాలంగా వ్యక్తం చేసిన భయాందోళనలను ధ్రువీకరిస్తు న్నాయి. కరోనా మహమ్మారి తొలి దశను అడ్డుకోవటానికి నిరుడు దీర్ఘకాలంపాటు విధించిన లాక్డౌన్ వల్ల మొత్తంగా వృద్ధి రేటు మైనస్ 7.3 శాతంగా నమోదు అయింది. వాస్తవానికి ఇంతకన్నా ఎక్కువగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆర్బీఐ, ఇతర సంస్థలు భావించినా నాలుగో త్రైమాసికంలో అన్ని రంగాలూ ఏదోమేర పనిచేయటం మొదలుకావటంతో ఆ సమ యంలో స్వల్పంగా 1.6 శాతం వృద్ధి నమోదు చేసిన పర్యవసానంగా మొత్తంగా ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం స్వల్పంగా తగ్గింది. దేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో నాలుగు దశాబ్దాల తర్వాత ప్రతికూల వృద్ధి నమోదు కావటం ఇదే తొలిసారని అంటున్నారు. ద్రవ్యలోటు సైతం జీడీపీలో 9.3 శాతమని తేలింది. దేశ పాలకుల దగ్గర ఇందుకు సంబంధించి ముందస్తు అంచనాలు ఏమేరకున్నాయోగానీ అంతా సవ్యంగా వున్నదన్న అభిప్రాయం దేశ ప్రజల్లో కలగజేయటానికి ప్రయత్నించటమే గత ఏడెనిమిది నెలలుగా కనబడుతుంది. ఒకపక్క అమెరికా మొదలుకొని అన్ని దేశాలూ తమ పౌరులకు నేరుగా నగదు బదిలీ చేసి ఆదుకొంటుండంగా, రకరకాల ప్యాకే జీల ద్వారా చేసిన కేటాయింపులు, వాటి చుట్టుతా వున్న నిబంధనలవల్ల మెజారిటీ ప్రజలకు అందకుండా పోయాయి. విద్యావంతులైన యువత ఉపాధిని కోల్పోయింది. కొత్తవారికి ఉపాధి ఊసేలేదు. రోజువారీ పనులు చేసి పొట్ట పోసుకునే వర్గాల పరిస్థితి అయితే మరింత దారుణం. ఇన్ని వర్గాలు నిస్సహాయ స్థితిలో పడబట్టే వినియోగం బాగా పడిపోయి ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందన్నది వాస్తవం. కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సరఫరా వ్యవస్థ కాస్త మెరుగుపడింది. తయారీ రంగం అనుకున్నంత కాకపోయినా కొంతయినా పుంజుకుంది. అది పన్నుల వసూళ్లలో ప్రతిఫలి స్తున్నది. కేంద్రానికి పన్ను ఆదాయం బడ్జెట్ అంచనాతో పోలిస్తే 5.5 శాతం అధికమని తేలింది. కానీ ఆ తయారైన ఉత్పత్తులను కొనే వర్గాలెక్కడ? వినియోగదారుల సూచీని గమనిస్తే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే నిరుడు డిసెంబర్లో డిమాండ్ గణనీయంగా పడిపో యిందని భారతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణా కేంద్రం చీఫ్ మహేష్ వ్యాస్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 97 శాతం కుటుంబాల ఆదాయం క్షీణించిందని ఆ సంస్థ సర్వే తెలి పింది. కేవలం 3 శాతం కుటుంబాలు మాత్రమే తమ ఆదాయం పెరిగిందని చెప్పాయి. 55 శాతం కుటుంబాలు ఏదో నెట్టుకు రాగలుగుతున్నామని చెప్పగా...మిగిలిన 42 శాతం కుటుం బాలు కరోనాకు ముందూ తర్వాతా ఒకేలా వున్నామని చెప్పాయి. అంటే జనాభాలో అధిక శాతంమంది ఆదాయ క్షీణత అంతక్రితమే మొదలైందన్నమాట. ఈమధ్య ఫిక్కీ సంస్థ రూపొందించిన బిజినెస్ కాన్ఫిడెన్స్ సూచీ(బీసీఐ)ని కూడా ప్రస్తావిం చుకోవాలి. వర్తమాన పరిణామాలు చూశాక వ్యాపార సంస్థల్లో ఆత్మవిశ్వాసం బాగా సన్నగిల్లిం దని ఆ సర్వే చెబుతోంది. మూడు త్రైమాసికాలకు ముందున్న ఆత్వవిశ్వాసం వ్యాపా రుల్లో ఇప్పుడు కొరవడిందని అది వెల్లడిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రూ. 145 లక్షల కోట్లు కాగా, నిరుడు దీనికి పదిలక్షల కోట్ల మేర గండి పడింది. కనీసం 2019– 20నాటి స్థితికి చేరాలన్నా ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనబడటం లేదు. మన జీడీపీ 2019–20నాటి స్థాయికెళ్లాలంటే దాదాపు 11 శాతం వృద్ధి నమోదు కావాలి. ఈ రెండో దశ కరోనాలో పరిమిత స్థాయిలో విధించిన లాక్డౌన్ల వల్ల నిరుడు కలిగినంత నష్టం వుండకపోవచ్చు. కానీ రోజువారీ పనులు చేసుకునేవారి ఉపాధిని ఈ లాక్డౌన్లు పూర్తిగా ఊడ్చిపెట్టాయి. ఇదంతా మౌనంగా వీక్షిస్తున్న సాధారణ పౌరుల్లో ఒక రకమైన భయాందోళనలు ఏర్పడ్డాయి. ఆక్సిజన్ కొరత, ఔషధాల కొరత, ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి వగైరా కారణాలతో కళ్లముందు జనం పిట్టల్లా రాలిపో వటంచూశాక వారు భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. రోజువారీ తప్పనిసరి అవస రాలు మినహా మరి దేనిపైనా వ్యయం చేసేందుకు ప్రజలు వెనకాడుతున్నారు. కనుకనే విని యోగం భారీగా పడిపోయింది. ఆదాయ కల్పన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసనీయమైన చర్యలు తీసుకుంది. వివిధ పథకాలకింద నగదు బదిలీ ద్వారా రూ. 95,528 కోట్లను...ఇతరేతర పథకాల ద్వారా పరోక్షంగా రూ. 36,197 కోట్లను ప్రజలకు అందజేసింది. అంటే రూ. 1,31,725 కోట్ల మొత్తం ప్రజానీకానికి చేరింది. ఈ గణాంకాలు గత రెండేళ్లలో అమలైన పథకాలకు సంబంధించినవే అయినా ఇందులో అధిక కాలం కరోనా ముట్టడిలోనే గడిచిందన్నది గుర్తుంచుకోవాలి. కేంద్రం చర్యలు కూడా దీనికి దీటుగా వుంటే ఆర్థిక వ్యవస్థకు అది మరింత తోడ్పడేది. కనీసం కరోనా టీకాలైనా సాధ్యమైనంత త్వరగా అందరికీ అందు బాటులోకొస్తే పౌరుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్నీ రంగాలూ క్రమేపీ పుంజుకోవటం మొదలవుతుంది. 2019 సెప్టెంబర్‌లో జీడీపీ తగ్గినప్పుడు వృద్ధి ప్రక్రియలో అదొక భాగమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో ఇప్పుడు మరింత స్పష్టత వచ్చింది కనుక కేంద్రం పునరాలోచించాలి. -
నేడు 2020–21 జీడీపీ గణాంకాలు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్–21మార్చి) గణాంకాలు సోమవారం వెలువడే అవకాశాలు ఉన్నాయి. కఠిన లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో 7.5% నుంచి 8% ఎకానమీ క్షీణత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చివరి త్రైమాసికంలో మాత్రం 2 శాతం వరకూ వృద్ధి అంచనాలు ఉన్నాయి. కఠిన లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం మొదటి (–24.4 శాతం), రెండు (–7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలోనూ ఇదే సానుకూల ఒరవడి కొనసాగింది. 2 నుంచి ఆర్బీఐ పరపతి సమీక్ష కాగా, ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష జూన్ 2 నుంచి 4వ తేదీ వరకూ జరగనుంది. 4న ప్రధాన నిర్ణయాలు వెలువడతాయి. బ్యాంకు లకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో వరుసగా ఆరవ త్రైమాసికంలో వృద్ధే లక్ష్యంగా 4 శాతంగా కొనసాగే వీలుంది. -
2021-22 వృద్ధి రేటు అంచనాలను భారీగా కోత
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి భారీ వృద్ధి అంచనాలకు భారీగా కోతపెడుతున్న సంస్థల జాబితాలో తాజాగా అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ చేరింది. ఫిబ్రవరిలో వేసిన 13.7 శాతం వృద్ధి అంచనాలను భారీగా 4.4 శాతం తగ్గించి 9.3 శాతానికి కుదించింది. తాజా పరిస్థితులు ఎకానమీ రికవరీకి తీవ్ర అడ్డంకిగా మారాయని మూడీస్ పేర్కొంది. ఈ ప్రతికూల ప్రభావం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందనీ హెచ్చరించింది. మూడీస్ ప్రస్తుతం ఇతర రేటింగ్ దిగ్గజ సంస్థలు- ఎస్అండ్పీ, ఫిచ్ తరహాలోనే భారత్‌కు ‘చెత్త’ స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువగా ‘నెగటివ్ అవుట్‌లుక్‌తో బీఏఏ3’ రేటింగ్‌ను ఇస్తోంది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25-ఏప్రిల్ 14, ఏప్రిల్ 15-మే 3, మే 4-మే 17, మే 18-మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగింది. ఈ పరిస్థితి ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వరకూ క్షీణరేటు నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నాల్గవ త్రైమాసికంలో పరిస్థితి కుదుటపడుతున్నట్లు కనిపించినా ఊహించని రీతిలో కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మూడీస్ భారత్ ఆర్థిక వ్యవస్థపై మంగళవారం విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే.. అధిక రుణ భారం (జీడీపీలో దాదాపు 90 శాతానికి చేరుతుందన్న అంచనా) బలహీన ఫైనాన్షియల్ వ్యవస్థలు సార్వభౌమ క్రెడిట్ ప్రొఫైల్‌పై ఒత్తిడులను తీవ్రతరం చేస్తున్నాయి. సెకండ్ వేవ్‌తో ఉత్పన్నమైన పరిస్థితలు భారత్ ఆరోగ్య వ్యవస్థపై ప్రతికూలను చూపుతున్నాయి. ఆసుపత్రులు క్రిక్కిరిసిపోయిన పరిస్థితి. మెడికల్ సరఫరాల్లో తీవ్ర కొరత ఏర్పడుతోంది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు కొనసాగుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థపై 2020 తరహా తీవ్ర పర్యవసానాలు ఉండబోవు. ఆయా స్థానిక చర్యలు స్వల్పకాలమే కొనసాగే అవకాశం ఉండడం, వ్యాపారాలు, వినియోగదారులు కరోనాతో కలిసి పనిచేయడానికి మార్గాలను అన్వేషిస్తుండటం దీనికి కారణం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలు 7.9 శాతంగా ఉండే వీలుంది. దీర్ఘకాలంలో 6 శాతంగా ఉండవచ్చు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనడంలో విధాన నిర్ణయ సంస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇక ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021-22లో 10.8 శాతం ఉంటుందని క్రితం వేసిన అంచనాలు మరింతగా 11.8 శాతానికి పెంపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉన్న రుణ భారం 2023లో 92 శాతానికి ఎగసే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు దిగ్గజ రేటింగ్ సంస్థలు ఇలా... ఎస్అండ్పీ గ్లోబల్ 2021-22 ఆర్థిక సంవత్సరం 11 శాతం వృద్ధి తొలి (మార్చి) అంచనాలను దిగువముఖంగా సవరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కరోనా కొత్త కేసులు మే చివరినాటికి గరిష్టానికి చేరి, అక్కడినుంచీ పెరక్కుండా తగ్గుతూ వస్తే, భారత్ 9.8 శాతం వృద్ధి సాధిస్తుందని తెలిపింది. అయితే జూన్ చివరి వరకూ ఈ పరిస్థితి లేకపోతే 8.2 శాతానికి కూడా వృద్ధి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. భారత్‌కు ఎస్అండ్పీ 13 సంవత్సరాలుగా స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ-’ రేటింగ్‌ను ఇస్తోంది. రెండేళ్లు ఈ రేటు మార్చబోమని కూడా ఇటీవలే భరోసా ఇచ్చింది. ఇక ఫిచ్ రేటింగ్స్ అంచనా ఇప్పటి వరకూ 2021-22లో 12.8 శాతంగా కొనసాగుతోంది. అయితే 2022-23లో ఇది 5.8 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. ఫిచ్ దేశానికి నెగటివ్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’ అవుట్‌లుక్ ఇస్తోంది. అయితే ఫిచ్ గ్రూప్ సంస్థ- ఫిచ్ సొల్యూషన్ మాత్రం 2020-21 వృద్ధి అంచనాలను ఇప్పటికే 12.8 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. కోతల బాటనే నోమురా జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం- నోమురా కూడా భారత్ 2021-22 వృద్ధి అంచనాలకు భారీ కోత పెట్టింది. తొలి 12.6 శాతం అంచనాలను 10.8 శాతానికి కుదించింది. ఆర్థిక క్రియాశీలతకు సంబంధించి తన ప్రొప్రైటరీ ఇండెక్స్ మే 9వ తేదీతో ముగిసిన వారంలో 64.5 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. వారం వారీగా ఇది 5 శాతం పతనమని పేర్కొన్న నోమురా, 2020 జూన్ నాటి పరిస్థితికి ఆర్థిక క్రియాశీలత జారిపోయిందని తెలిపింది. ఇండెక్స్‌లో భాగమైన రవాణా విభాగం 10 శాతం పడిపోయిందనీ, విద్యుత్ డిమాండ్ 4.1 శాతం తగ్గిందని వివరించింది. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు ఎకానమీ రికవరీకి తీవ్ర విఘాతంగా ఉందని పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. తద్వారానే మహమ్మారి వేగాన్ని నియంత్రించవచ్చని సూచించింది. దేశంలో ఆరోగ్య రంగంపై వ్యయాలు మరింత పెంపుపై దృష్టి సారించాల్సిన తక్షణ అవసరాన్ని ప్రస్తుత పరిస్థితి ఉద్ఘాటిస్తోందని తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. కేర్ అంచనాలు... నాల్గవసారి! కేర్ రేటింగ్స్ మంగళవారం మరోసారి భారత్ 2021-22 వృద్ధి అంచనాలను సవరించింది. 10.2 శాతం నుంచి 9.2 శాతానికి అంచనాలను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. 2021 మార్చి 24న సంస్థ 11 నుంచి 11.2 శాతం అంచనాలను వెలువరించింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 5న 10.7 శాతానికి తగ్గించింది. ఏప్రిల్ 21న మరింతగా 10.2 శాతానికి సవరించింది. తీవ్ర జీవనోపాధి సంక్షోభం దిశగా భారత్! భారత్ ‘తీవ్ర జీవనోపాధి సంక్షోభం’ దిశగా పయనించే అవకాశం ఉందని బెల్జియంకు చెందిన ఇండియన్ ఎకనమిస్ట్ ప్రముఖ ఎకనమిస్ట్ జీన్ డ్రెజ్ హెచ్చరించారు. సెకండ్‌వేవ్ తీవ్రత, రాష్ట్రాల స్థానిక ఆంక్షలు, లాక్డౌన్ల నేపథ్యం- శ్రామిక వర్గంపై పిడుగుపాటుగా మారవచ్చని ఒక ఇంటర్వ్యూలో సూచించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ఆంక్షల వల్ల ఏర్పడిన పరిస్థితి ‘దాదాపు జాతీయ లాక్డౌన్’ను తలపిస్తోందని అన్నారు. 2024–25 నాటికి భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా నడిపించాలన్న ప్రభుత్వ లక్ష్యం ‘‘సాకారమయ్యే’’ అవకాశమే లేదని అన్నారు. దేశానికి సంబంధించి భారత్‌లో కొన్ని వర్గాల ‘‘సూపర్–పవర్ ఆశయాలు’’ సాధ్యమబోవని అభిప్రాయపడ్డారు. శ్రామిక వర్గం పరిస్థితి 2020కన్నా ప్రస్తుతం భిన్నంగా ఏమీ లేదని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వానికి సలహాలను ఇచ్చిన జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ)లో జీన్ డ్రెజ్ సభ్యుడు కావడం గమనార్హం. భారత్ కష్టాల్లో ఉంటే ప్రపంచానికీ కష్టమే : నిషా దేశాయ్ బిస్వాల్ వాషింగ్టన్: భారత్ కష్టాల్లో ఉంటే ప్రపంచానికి కూడా కష్టకాలంగానే ఉంటుందని అమెరికా-భారత్ బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) ప్రెసిడెంట్ నిషా దేశాయ్ బిస్వాల్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో కరోనా వైరస్ పరమైన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని తెలియగానే అమెరికా కార్పొరేట్ సంస్థలు అసాధారణ స్థాయిలో తోడ్పాటు అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయని పేర్కొన్నారు. మహమ్మారిపై పోరాటానికి టాప్ 40 కంపెనీల సీఈవోలతో కొత్తగా గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైనట్లు తెలిపారు. భారత్ మళ్లీ పుంజుకుంటుంది: ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్యసమితి: భారత్ 2022లో తిరిగి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి మంగళవారం ప్రకటించింది. భారత జీడీపీ 10.1 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2021 సంవత్సరానికి మాత్రం భారత వృద్ధి అవకాశాలు చాలా బలహీనంగా ఉన్నట్టు పేర్కొంది. కరోనా మహమ్మారికి నూతన కేంద్రంగా భాతర్ మారడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక స్థితిపై వార్షిక మధ్యంత నివేదికను మంగళవారం విడుదల చేసింది. చదవండి: ఈ మొబైల్ ఫోన్‌పై ఏకంగా రూ. 60 వేలు తగ్గింపు -
India GDP: భారత్ వృద్ధి అంచనాలు డౌన్..!
ముంబై : కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను రేటింగ్ ఏజెన్సీ క్రెడిట్ సూసీ గణనీయంగా తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి 8.5–9 శాతానికి పరిమితం కాగలదని వెల్లడించింది. కోవిడ్ పరిణామాల ప్రతికూల ప్రభావం 100–150 బేసిస్ పాయింట్ల మేర ఉండొచ్చని పేర్కొంది. ఇక భారత్ తన సామర్థ్యానికి తగినట్లుగా పూర్తి స్థాయి వృద్ధి రేటును చేరుకోవాలంటే 2022–23 తర్వాత అదనంగా మరో రెండు మూడేళ్లు పట్టేయొచ్చని క్రెడిట్ సూసీ వెల్లడించింది. తాము వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ మిగతా ఏజెన్సీల లెక్కలతో పోలిస్తే కొంత ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి 4 శాతంగా ఉండగా, 2021–22లో ఇది అంతకు మించి 5 శాతంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు క్రెడిట్ సూసీ ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్ నీలకంఠ మిశ్రా తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు గతేడాది నెలల తరబడి కొనసాగగా ఈసారి కొద్ది వారాలకు మాత్రమే పరిమితం కావచ్చని ఆయన పేర్కొన్నారు. చదవండి: భారత్ ఎకానమీకి నష్టం తప్పదు! -
కరోనా దెబ్బకు తగ్గిన జీడీపీ వృద్ది రేటు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2021 వృద్ధి విషయంలో తొలి అంచనాలకు కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ వరుసలో ప్రపంచ దిగ్గజ ఆర్థిక విశ్లేషణ సంస్థ-ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ చేరింది. 2021లో భారత్ స్థూల దేశీయోత్పత్తి 10.2 శాతానికి పరిమితం అవుతుందని తన తాజా నివేదికలో పేర్కొంది. క్రితం అంచనాలు 11.8 శాతాన్ని ఈ మేరకు దిగువముఖంగా సవరిస్తున్నట్లు తెలిపింది. కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో దేశంలో పెరిగిన వైద్య సంబంధ సవాళ్లు, వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరగకపోవడం, మహమ్మారి కరోనా నియంత్రణలో ప్రభుత్వ వ్యూహంలో లోపాలు తమ తాజా అంచనాల సవరణకు కారణమని వివరించింది. ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ పేర్కొన్న మరిన్ని విశేషాలు చూస్తే... భారత్ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో బెడ్స్‌లేని పరిస్థితి నెలకొంది. స్వల్ప కాలంలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి పది రోజులకూ మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది. మరి కొన్ని సంస్థల అంచనాలు... అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 2021లో భారత్ వృద్ధిని 12.5 శాతం వరకూ అంచనావేస్తోంది. ఏప్రిల్ నుంచీ ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా 10.5 శాతంగా ఉంది. 2020–21 ఎకనమిక్ సర్వే 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 11 శాతంగా పేర్కొంది. సెకండ్‌వేవ్ తీవ్రత నేపథ్యంలో ఆయా అంచనాల వృద్ధి సవరణ కూడా చోటుచేసుకునే వీలుంది. 10 శాతంలోపే వృద్ధి! కోవిడ్ 19 తాజా కేసుల పెరుగుదల, ఫలితంగా స్థానిక లాక్డౌన్ల వల్ల 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 10 శాతం దిగువనే నమోదయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేం. ప్రభుత్వ చర్యలు, ప్రజల ప్రతిస్పందనల ఆధారంగా వ్యవస్థలో డిమాండ్, సరఫరాల పరిస్థితి ఆధారపడి ఉంటుంది. 2020 దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పోలి్చతే రాష్ట్రాల తాజా ఆంక్షల వల్ల వ్యవసాయం, మైనింగ్, తయారీ, యుటిలిటీ, నిర్మాణ రంగాలపై కొంత తక్కువ ప్రభావమే ఉండే వీలుంది. - ఎస్సీ గార్గ్, మాజీ ఫైనాన్స్ కార్యదర్శి నెల లాక్‌డౌన్‌తో జీడీపీకి 2 శాతం నష్టం స్థానిక లాక్డౌన్ల వల్ల మహమ్మారి కరోనా కట్టడి అనుకున్నంత స్థాయిలో జరక్కపోవచ్చు. సెకండ్‌వేవ్ కట్టడికి భారత్ నెలపాటు లాక్డౌన్ విధిస్తే, ఎకానమీకి 100 నుంచి 200 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ఎకానమీకి భారీ నష్టం వాటిల్లే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కఠిన లాక్డౌన్లు విధించకపోవచ్చు. కరోనా తీవ్రత దృష్ట్యా కేంద్రం మే, జూన్ నెలల్లో ఉచిత ఆహార ధాన్యాల సరఫరా వంటి సహాయక చర్యలను ముమ్మరం చేసే వీలుంది. - ఇంద్రనీల్ సేన్ గుప్తా, ఆస్థా గడ్వానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్-భారత్ ఆర్థికవేత్తలు చదవండి: వేతన జీవులూ.. జర జాగ్రత్త! -
భారత్ ఎకానమీకి నష్టం తప్పదు!
సాక్షి ముంబై: కరోనా సెకండ్‌వేవ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని స్పష్టమవుతోంది. పలు రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలకు కోతలు విధిస్తున్నాయి. ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా) శుక్రవారం ఏప్రిల్‌తో ప్రారంభమయిన ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎకానమీ వృద్ధి 10.1 శాతంగా పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 10.4 శాతంగా ఉంది. ఇక ఎస్బీఐ రిసెర్చ్ క్రితం వృద్ధి అంచనా 11 శాతంకాగా, దీనిని తాజాగా 10.4 శాతానికి కుదించింది. ఇప్పటికే ఇక్రా, కేర్ రేటింగ్స్ భారత్ వృద్ధి అంచనాలను కుదించిన సంగతి తెలిసిందే. (సెకండ్ హ్యాండ్ కార్లకు కరోనా జోష్!) కేర్ రేటింగ్స్ ఏకంగా ఏప్రిల్‌లో వృద్ధి అంచనాలకు రెండుసార్లు కోతలు విధించింది. దేశ వృద్ధి రేటు 11 శాతం నుంచి 11.2 శాతం వరకూ ఉంటుందని 2021 మార్చి 24న కేర్ రేటింగ్స్ అంచనావేసింది. అయితే సెకండ్‌వేవ్ ప్రారంభం నేపథ్యంలో ఏప్రిల్ 5వ తేదీన ఈ రేటును 10.7 శాతం నుంచి 10.9 శాతం శ్రేణికి తగ్గించింది. ఇటీవలి నివేదికలో దీనిని మరింతగా కుదించి 10.2 శాతానికి దించింది. ఇక దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఈ వారం మొదట్లో వృద్ధి రేటు అంచనా 10–11 శ్రేణిని 10–10.5 శాతం శ్రేణికి కుదించింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25- ఏప్రిల్ 14, ఏప్రిల్ 15- మే 3, మే 4- మే 17, మే 18-మే 31) కఠిన లాక్డౌన్ అమలు ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు -7.3 శాతం త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. 2021-22లో వృద్ధి రేటు 10.5 శాతం ఉంటుందని ఈ నెలారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనావేసింది. ఈ నేపథ్యంలో ఇండ్ రా, ఎస్బీఐ రిసెర్చ్ అంచనాలను పరిశీలిస్తే... వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడక: ఇండ్ రా ఇండియా రేటింగ్స్ ప్రకటన ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుండడం ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. వైద్య రంగ మౌలిక వ్యవస్థ మొత్తంపై తీవ్ర ఒత్తిడి ఉంది. మే మధ్యస్థ నుంచి సెకండ్‌వేవ్ తగ్గుముఖం పట్టే వీలుంది. ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెంకండ్వేవ్లో ఆర్థిక వ్యవస్థకు నష్టం తక్కువగా ఉంటుంది. లాక్డౌన్లు స్థానికతకు పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. సెకండ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు కుటుంబాలు, వ్యాపారాలు, ఇతర ఆర్థిక వ్యవస్థలు కొంత సంసిద్ధమయ్యాయి. దీనికితోడు వ్యాక్సినేషన్ పక్రియా కొనసాగుతోంది. అయితే ఇది మరింత వేగవంతం కావాలి. వ్యాక్సినేషన్ పక్రియ జీడీపీతో పోల్చితే కేంద్రంపై 0.12 శాతం భారం మోపుతుంది. రాష్ట్రాల విషయంలో ఈ భారం 0.24 శాతంగా ఉంది. 2021లోనూ వ్యవసాయ రంగం కొంత సానుకూలంగా ఉండే వీలుంది. 2020–21లో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం సగటున వరుసగా 5 శాతం, 5.9 శాతంగా కొనసాగవచ్చు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు–చేసే వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యాల మేరకు 6.8 శాతంగా ఉండవచ్చు. అయితే పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో (రూ.1.75 లక్షల కోట్లు) విజయవంతం కావాలి. 2020–21లో మిగులులో ఉన్న కరెంట్ అకౌంట్ (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2021–22లో లోటులోకి మారే అవకాశం ఉంది. ఇది 0.4 శాతం (జీడీపీ)గా నమోదుకావచ్చు. 59 ఏళ్ల కనిష్టానికి రుణ వృద్ధి: ఎస్బీఐ రిసెర్చ్ ఎస్బీఐ రిసెర్చ్ ప్రకటనలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... కోవిడ్–19 ప్రతికూల ప్రభావం నుంచి బయటపడ్డానికి వీలుగా కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు ద్రవ్య, పరపతి ఉద్దీపనలు ప్రకటించినప్పటికీ 2020–21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి కేవలం 5.56 శాతంగా నమోదయ్యింది. గడచిన 59 సంవత్సరాల్లో (1962లో 5.38 శాతం) ఇంత తక్కువ స్థాయి రుణ వృద్ది రేటు ఎప్పుడూ నమోదుకాలేదు. గడచిన ఆర్థిక సంవత్సరం రుణ పరిమాణం 109.51 లక్షల కోట్లుగా ఉంది. కాగా డిపాజిట్లు 11.4 శాతం వృద్ధితో రూ.151.13 లక్షల కోట్లుగా నమోదయినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రభుత్వం 2020–21లో ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్రకటించింది. జీడీపీ విలువతో పోల్చితే ఇది 11 శాతం. అయితే దాదాపు రూ.3 లక్షల కోట్ల ఉద్దీపనలను మాత్రమే వినియోగించుకున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలి. లాక్డౌన్ల వల్ల కలిగే నష్టం కంటే వ్యాక్సినేషన్ వ్యయభారం చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం వ్యాక్సినేషన్ వ్యయ భారం ఇప్పటికి జీడీపీలో 0.1 శాతం ఉంటే, లాక్డౌన్ల వల్ల జరిగిన నష్టం ఇప్పటికి 0.7 శాతంగా ఉంటుంది. పరిమిత లాక్డౌన్ల వల్ల ఇప్పటికి రూ.1.5 లక్షల కోట్ల నష్టం జరిగిందని అంచనా. ఇందులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల వాటా 80 శాతంకాగా, ఒక్క మహారాష్ట్ర వాటా 54 శాతంగా ఉంది. -
18 ఏళ్లు పైబడిన వారికి టీకా : ఖర్చు ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: మే 1 తేదీనుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ కరోనా వైరస్ టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ కీలక విషయాలను వెల్లడించింది. జీడీపీలో ఒక శాతానికంటే తక్కువేనని తాజా అధ్యయనంలో తెలిపింది. 133.26 కోట్ల జనాభాలో దేశంలో 18 సంవత్సరాలు పైబడిన మొత్తం జనాభా 84.19 కోట్లు ఉంటుందని, వీరికి టీకా వేసేందుకు అయ్యే ఖర్చు 67,193 కోట్ల రూపాయలని వెల్లడించింది. ఇంటులో రాష్ట్రాలు వాటా రూ .46,323 కోట్లుగా తేల్చింది. కేంద్ర ప్రభుత్వానికి రూ .20,870 కోట్లు, రాష్ట్రాలకు కలిసి రూ .46,323 కోట్లు ఖర్చవుతాయని లెక్కించింది. కరోనావైరస్ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య తీవ్ర చర్చ నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజిస్తే, అప్పుడు యూనియన్ బడ్జెట్‌పై ఆర్థిక ప్రభావం జీడీపీలో 0.12 శాతం మాత్రమేనని, రాష్ట్ర బడ్జెట్లపై లో 0.24 శాతం ఉంటుందని చెప్పింది. .గరిష్ట ప్రభావం బీహార్ (స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో 0.60 శాతం , ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ (0.47 శాతం), జార్ఖండ్ (0.37 శాతం), మణిపూర్ (0.36 శాతం), అస్సాం (0.35 శాతం) శాతం), మధ్యప్రదేశ్ (0.30 శాతం), ఒడిశా (0.30 శాతం)గా ఉంటుందని తేల్చి చెప్పింది. కేరళ, ఛత్తీస్‌గఢ్, బిహార్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు టీకా ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఇప్పటికే ప్రకటించినవిషయాన్ని గుర్తు చేసింది. టీకా ద్వారా వచ్చిన యాంటిబాడీస్ జీవితకాలం 12-18 నెలల వరకు ప రిమితం కాబట్టి ఈ వ్యయాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు భారత వృద్ధి రేటును 2021-22కు 10.1 శాతానికి తగ్గించింది. గతంలో వృద్ధి రేటును 10.4 శాతంగా ఇండియా రేటింగ్ సంస్థ అంచనా వేసింది. సెకండ్ వేవ్‌లో కరోనా ఉధృతి, టీకా పంపిణీ వేగంగా లేకపోవడమే వృద్ధి అంచనాను తగ్గించడానికి కారణంగా రేటింగ్ ఏజెన్సీ ప్రకటించింది. దేశంలోని కీలక ప్రాంతాల్లో వైద్య మౌలిక సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, అయితే మే మధ్య నాటికి సెకెండ్ వేవ్ ప్రభావం తగ్గుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణ 5 శాతం, టోకు ద్రవ్యోల్బణ 5.9 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. -
కరోనాపై ఏం చేద్దాం చెప్పండి..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎకానమీపై ప్రభావాలు, తీసుకోతగిన చర్యల గురించి చర్చించేందుకు పరిశ్రమవర్గాలు, కార్పొరేట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రజల ప్రాణాలు, జీవనోపాధిని కాపాడేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని ఆమె వివరించారు. ‘ఒక్కో వ్యాపార సమాఖ్యతో టెలిఫోన్ ద్వారా సంభాషించాను. పరిశ్రమలు, అసోసియేషన్లపరమైన అంశాలపై వారి అభిప్రాయాలు తీసుకున్నాను. కోవిడ్–19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం వివిధ స్థాయుల్లో తీసుకుంటున్న చర్యల గురించి వివరించాను‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో మంత్రి ట్వీట్ చేశారు. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో జీడీపీ ఏకంగా 23.9 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెకండ్‌వేవ్ మొదలవుతున్న తొలినాళ్లలోనే కార్పొరేట్లతో ఆర్థిక మంత్రి చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్ కోటక్, ఫిక్కీ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్, అసోచాం ప్రెసిడెంట్ వినీత్ అగర్వాల్‌తో పాటు టాటా స్టీల్ ఎండీ టీవీ నరేంద్రన్, ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్, టీసీఎస్ ఎండీ రాజేశ్ గోపీనాథన్, మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ, టీవీఎస్ గ్రూప్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, హీరో మోటో కార్ప్ ఎండీ పవన్ ముంజాల్ తదితరులతో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. -
కరోనాతో ప్రజలకు రూ.13లక్షల కోట్ల నష్టం
కరోనా మహమ్మారి సామాన్యుల, మధ్య తరగతి కుటుంబ ఆదాయాలపై భారీ ప్రభావం చూపింది. దీనివల్ల కలిగే పరిమాణాలు 2021లో కూడా ఉండే అవకాశం ఉన్నట్లు ఒక నివేదిక పేర్కొంది. ప్రధానంగా కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందని తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లోని ఆదాయం రూ.13 లక్షల కోట్లు తుడుచు పెట్టుకపోయినట్లు యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా నివేదిక వెల్లడించింది. ప్రధానంగా ఉద్యోగాల కోత వల్ల ఎక్కువ ప్రభావం పడినట్లు ఈ నివేదిక వెల్లడించింది. అయితే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండో, మూడో త్రైమాసికాల్లో వృద్ధి పుంజుకోవడం ఆశ్చర్యం కలిగించినట్లు యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా ఆర్థికవేత్తలు తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కుటుంబ ఆదాయాలు తగ్గాయని, దీని ప్రభావం ప్రజల వినియోగ సామర్థ్యంపై 2021 జూన్ వరకు కనిపిస్తుందని తెలిపారు. 2020 జూన్ నెలతో ముగిసిన మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 23.9 శాతానికి పతనం కాగా, రెండో త్రైమాసికంలో జీడీపీ(స్థూల దేశీయోత్పత్తి) క్షీణత 7.5 శాతానికి పరిమితమైందని తెలిపారు. డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. రెండో, మూడో త్రైమాసికంలో వృద్ధి కనిపించడంతో భవిష్యత్ లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు యూబీఎస్ సెక్యూరిటీస్ నిపుణులు పేర్కొన్నారు. లాక్డౌన్ సడలింపుల అనంతరం మార్కెట్లో నగదు వినియోగం, పెట్టుబడులు అనూహ్యంగా పెరిగాయని దీంతో వృద్ధి పునరుద్ధరణ కనిపించిందని వెల్లడించింది. ఇందులో చాలా వరకు లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన పెట్టుబడులేనని తెలిపింది. మరోవైపు తక్కువ వడ్డీకి గృహ రుణాలు లభించడం, ప్రోత్సాహకాలు, లాక్డౌన్ అనంతరం ఒక్కసారిగా రియాల్టీ వంటి రంగాలు పుంజుకోవడం దేశ వృద్ధికి చోదకాలుగా మారాయని తెలిపింది. చదవండి: తొలి ట్వీట్ ఖరీదు రూ.18.30 కోట్లు! ప్రపంచ తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ విడుదల! -
ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా బెటర్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని అంచనావేసినప్పటికీ, అంతకుమించి మంచి ఫలితాన్ని అందించే బాటలో పయనిస్తోందని ఆర్థికశాఖ తన తాజా నివేదికలో పేర్కొంది. వ్యాక్సినేషన్ విస్తృతితో ఆర్థిక పురోగతి మరింత ఊపందుకుంటుందన్న విశ్వాసాన్ని నివేదిక వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో దేశం ఆరోగ్య రంగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. కరోనా వైరెస్ సెకండ్ వేవ్‌ను భారత్ పటిష్టంగా అరికట్టగలిగిందని ఆర్థికశాఖ పేర్కొంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరిగినప్పటికీ, మ్తొతంగా పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది. మహమ్మారి సమస్య కొనసాగుతున్నప్పటికీ, మూడవ త్రైమాసికంలో 0.4 శాతం జీడీపీ వృద్ధి నమోదుకావడం సానుకూల అంశమని పేర్కొంది. మూడవ త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఇండస్ట్రియల్ అవుట్‌లుక్ సర్వే ఆశావాద దృక్పదాన్ని వెలువరించిన అంశాన్ని నివేదిక ప్రస్తావించింది. ఉత్పిత్తి, ఆర్డర్ బుక్, ఉపాధి అవకాశాలు మూడవ త్రైమాసికంలో పెరిగిన అంశాన్ని సర్వే స్పష్టం చేసిందని వివరించింది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో 24.4 శాతం క్షీణించగా, రెండవ త్రైమాసికంలో క్షీణ రేటు 7.3 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. -
జీడీపీకి సాగు దన్ను
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 శాతం క్షీణిస్తుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే పేర్కొంది. మూడవ త్రైమాసికంలో ఎకానమీ మైనస్‌లోనే ఉంటుందని, నాల్గవ త్రైమాసికంలోనే వృద్ధి బాటకు వస్తుందని విశ్లేషించింది. మూడవ త్రైమాసికంలో 1.3 శాతం క్షీణ రేటును అంచనా వేసిన ఫిక్కీ, నాల్గవ త్రైమాసికంలో 0.5 శాతం వృద్ధి బాటకు మళ్లుతుందని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం దేశం 9.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని వివరించింది. 7.5 శాతం–12.5 శాతం కనిష్ట, గరిష్ట శ్రేణిలో ఉండే వీలుందనీ సర్వే అంచనా వేసింది. అదే విధంగా.. దేశ వ్యవసాయ రంగం కరోనా ప్రేరిత సవాళ్లను విజయవంతంగా అధిగమించగలిగినట్లు ఫిక్కీ సర్వే పేర్కొంది. కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఏప్రిల్–జూన్ మధ్య 23.9 శాతం క్షీణించిన ఆర్థిక వ్యవస్థ జారుడు రెండవ త్రైమాసికంలో 7.5 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరిలో పరిశ్రమ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగాల ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రాతిపదికన రూపొందించిన అవుట్‌లుక్ సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ♦ 2020–21లో వ్యవసాయ, అనుబంధ విభాగాల వృద్ధి రేటు 3.5 శాతంగా ఉంటుంది. ♦ కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ రంగం మంచి పనితీరును కనబరచింది. రబీ పంట విస్తీర్ణం, తగిన వర్షపాతం, భారీ రిజర్వాయర్ స్థాయిలు, ట్రాక్టర్ అమ్మకాల్లో పటిష్ట వృద్ధి తత్సంబంధ అంశాలు ఈ రంగంలో గణనీయమైన పురోగతికి సూచికగా ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగం పురోగతికి పెట్టుబడులు మరింతగా పెరగాలి. ప్రత్యేకించి గిడ్డంగి సౌలభ్యతలు మెరుగుపడాలి. ♦ కరోనా వల్ల పరిశ్రమ, సేవల రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ 2 రంగాలూ 2020–21లో వరుసగా 10%, 9.2% నష్టపోతాయి. ♦ పారిశ్రామిక రంగంలో రికవరీ ఉన్నా, ఇంకా విస్తృత ప్రాతిపదికన ఇది కనిపించడంలేదు. పండుగల సీజన్లో పెరిగిన డిమాండ్ రికవరీకి దారితీసినా, దీర్ఘకాలంలో సానుకూలతలు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ♦ పర్యాటకం, ఆతిథ్యం, వినోదం, విద్యా, ఆరోగ్య రంగాల్లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఆయా విభాగాల పురోగతికి ప్రభుత్వం నుంచి సహాయ ప్యాకేజీలు ఉండాలి. ♦ 2020–21లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 10.7% క్షీణతలో ఉంటుంది. కనిష్ట–గరిష్ట స్థాయిల శ్రేణి మైనస్ 9.5%– మైనస్ 12.5 శాతంగా ఉంటుంది. ♦ 2020–21లో 6.5 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. కనిష్ట–గరిష్ట స్థాయిలు 5.8 శాతం – 6.6 శాతం శ్రేణిలో ఉంటాయని అంచనా. ♦ ఇక ప్రభుత్వ ఆదాయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2020–21లో 7.4%గా (జీడీపీలో) ఉండవచ్చు. 7–8.5% శ్రేణిలో ఉండే వీలుంది. -
ధరల దెబ్బతో అమాంతం పెరిగిన ‘జీడీపీ’ : రాహుల్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతుంటే పన్నులు వసూలు చేయడంలో మోదీ ప్రభుత్వం బిజీగా ఉందని పేర్కొన్నాడు. ఇంధన ధరల పెరుగుదలతో జీడీపీ (గ్యాస్-డీజిల్-పెట్రోల్) భారీగా వృద్ధిని కనబరిచిందని సెటైర్లు వేశారు. ఈమేరకు రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. కాగా, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గడిచిన వారంలో నాలుగోసారి రేట్లు పెంచిన తరువాత దేశంలో శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.(చదవండి: ఫ్యాక్ట్ చెక్: ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు) मोदी जी ने ‘GDP’ यानी गैस-डीज़ल-पेट्रोल के दामों में ज़बरदस्त विकास कर दिखाया है! जनता महँगाई से त्रस्त, मोदी सरकार टैक्स वसूली में मस्त। pic.twitter.com/FsiG8ECajk — Rahul Gandhi (@RahulGandhi) January 24, 2021 పెట్రోల్ ప్రస్తుతం ఢిల్లీలో లీటరుకు రూ.85.70, ముంబైలో రూ.92,28గా ఉంది. అలాగే డీజిల్ రేట్లు కూడా ఆకాశానికి చేరుకున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లీలో ఒక లీటరు డీజిల్ ధర రూ.75,88 ఉండగా ముంబైలో లీటరుకు రూ.82,66గా ఉంది. ఈ వారంలో లీటరుకు రూ.1పైగా పెరిగింది. అలాగే హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.89.15, డీజిల్ ధర రూ.82.80గా ఉంది. చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సౌదీ చమురు ఉత్పత్తిని తగ్గించడమే అని కారణమని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కరోనా వైరస్ కారణంగా, చమురు ఉత్పత్తి చేసే అనేక దేశాలు ఉత్పత్తిని నిలిపివేసాయి లేదా తగ్గించాయి. డిమాండ్, సరఫరాలో అసమతుల్యత కారణంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. -
రివైండ్ 2020: ఢామ్.. జూమ్
2020... వస్తూవస్తూనే ‘కరోనా’ సునామీతో ప్రపంచానికి ‘మాస్క్‘ పడింది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజల జీవితాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా చెల్లాచెదురైంది. వివిధ దేశాల ఎకానమీలు మైనస్లలోకి జారిపోయి చరిత్రలో ఎన్నడూచూడని పతనాన్ని చవిచూశాయి. భారత్ జీడీపీ ఏకంగా 23.9 శాతం (క్యూ1లో) క్షీణించింది. కరోనా కల్లోలంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయినప్పటికీ.. మళ్లీ అంతేవేగంగా కోలుకొని, ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. సెన్సెక్స్ మార్చిలో 25,638 పాయింట్ల కనిష్టానికి కుప్పకూలి... కొద్ది నెలల్లోనే కొత్త రికార్డులను బద్దలు కొట్టింది. మరోపక్క, ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బంగారం భగ్గుమంది. భారత్‌లో తులం ధర రూ.55 వేల పైకి ఎగబాకింది. ముడి చమురు ధర చరిత్రలో తొలిసారిగా మైనస్‌లోకి జారిపోయింది. ఇక కరోనాతో దేశీయంగా పర్యాటకం, విమానయానం తదితర రంగాలు తీవ్రంగా దెబ్బతిని, భారీగా ఉద్యోగాల కోతకు దారితీసింది. అసలే మొండిబాకీలతో నెట్టుకొస్తున్న బ్యాంకింగ్ రంగం పరిస్థితి పెనంమీంచి పొయ్యిలో పడినట్లయింది. పీఎంసీ, లక్ష్మీ విలాస్ బ్యాంకులు కుప్పకూలాయి. లాక్డౌన్ల కారణంగా వాహన రంగంలో ఎన్నడూలేని విధంగా సున్నా అమ్మకాలు నమోదయ్యాయి. మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్’ రూపంలో దాదాపు రూ. 29 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీని ప్రకటించి ఎకానమీకి దన్నుగా నిలిచింది. ఆర్బీఐ కూడా వడ్డీరేట్లను అట్టడుగుకు దించేసింది. ఇంత కల్లోలంలోనూ ముకేశ్ అంబానీ నిధుల స్వారీ చేశారు. ఫేస్బుక్, గూగుల్, ఇంటెల్ ఇలా ఒకటేమిటి ప్రపంచాన్ని శాసిస్తున్న అనేక దిగ్గజ కంపెనీలన్నీ రిలయన్స్ జియో, రిటైల్‌లలో కోట్లాది డాలర్లు కుమ్మరించేందుకు క్యూ కట్టడం విశేషం. కరోనా పుణ్యమా అని సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా అంతా డిజిటల్ బాట పట్టారు. వర్చువల్, ఆన్లైన్ అనేవి జీవితంలో భాగమైపోయాయి. ఇలా ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగిన ఈ ‘కరోనా’నామ సంవత్సరంలో వ్యాపార రంగంలో చోటు చేసుకున్న పరిణామాలపై ‘సాక్షి బిజినెస్’ రివైండ్ ఇది... మార్కెట్ ఉద్దీపనల అండ! ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్ ప్రయాణం కరోనా విసిరిన సవాళ్లను అధిగమించి కొత్త శిఖరాల అధిరోహణ లక్ష్యంగా సాగింది. ఏడాది ప్రారంభంలో ఆర్థిక మందగమనం, కోవిడ్ భయాలతో సెన్సెక్స్, నిఫ్టీలు మార్చి 24న రెండేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. ద్వితీయార్థంలో ఉద్దీపనల అండ, ఆర్థిక వ్యవస్థ రికవరీ, కోవిడ్–19 వ్యాక్సిన్ ఆశలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సహకారం అందడంతో రికార్డుల ర్యాలీ చేస్తున్నాయి. మరోవైపు కోవిడ్–19 వైరస్.... స్ట్రెయిన్ వైరస్‌గా రూపాంతరం చెంది ప్రపంచదేశాలను భయపెడుతుండటం ఈక్విటీ మార్కెట్లకు ఆందోళనను కలిగిస్తోంది. ఈ ఏడాది మొత్తం మీద సెన్సెక్స్ 6492 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 1814 పాయింట్లను ఆర్జించింది. లాక్డౌన్ విధింపు ప్రకటనతో మార్చి 23న సెన్సెక్స్, నిఫ్టీలు తమ జీవితకాలంలోనే అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో ఇరు సూచీలు 10 శాతం పతనమవడంతో సర్క్యూట్ నిబంధల ప్రకారం ట్రేడింగ్‌ను 45 నిమిషాలు నిలిపేశారు. తర్వాత ట్రేడింగ్ ప్రారంభమైనా అమ్మకాలు ఆగకపోవడంతో సెన్సెక్స్ 3,935 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఇక ఏప్రిల్ 7న సూచీలు ఒక్కరోజులో రికార్డు లాభాల్ని ఆర్జించాయి. ఈ ఒక్కరోజే సెన్సెక్స్ 2,476 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్లను ఆర్జించాయి. సూచీ ఏడాది కనిష్టస్థాయి ఏడాది గరిష్టస్థాయి సెన్సెక్స్ 25,638 (మార్చి 24న) 47,807(డిసెంబర్ 30) నిఫ్టీ 7511 (మార్చి 24న) 13,997(డిసెంబర్ 30) ఎకానమీ మాంద్యం కోరలు... భారత ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ గట్టి దెబ్బ కొట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం కోరల్లోకి వెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా మైనస్ 23.9 శాతానికి పడిపోయింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు సడలింపుసహా ఎకానమీ కోలుకునేందుకు కేంద్రం, ఆర్బీఐలు తీసుకున్న ఉద్దీపన చర్యలతో రెండో త్రైమాసికానికి వ్యవస్థ కాస్త రికవరీని సాధించింది. క్షీణత మైనస్ 7.5 శాతానికి పరిమితమైంది. కేంద్రం అండ ఆత్మ నిర్భర్ అభియాన్ కరోనా కుదేలైన ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలకు భరోసానిస్తూ కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం ద్వారా అభయమిచ్చింది. కోవిడ్ సంక్షోభం నాటి నుంచి ఈ ఏడాదిలో కేంద్రం, ఆర్బీఐలు సంయుక్తంగా మొత్తం రూ.29.87 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాయి. జీడీపీలో 10 శాతం ఉంటుందని అంచనా. ల్యాండ్, లేబర్æ, లిక్విడిటీ, లా వీటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సూక్ష్మ, స్థూల, మధ్య తరగతి పరిశ్రమకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయడంలాంటి ఎన్నో బృహత్కర కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. బ్యాంకింగ్ కుదుపులు యస్ బ్యాంక్, లక్ష్మీవిలాస్ బ్యాంకు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్(పీఎంసీ) ఉదంతాలతో ఈ ఏడాది భారత బ్యాంకింగ్ రంగం భారీగా కుదుపులకు లోనైంది. లక్ష్మీవిలాస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంకులో విలీనమైంది. హెచ్‌డీఐఎల్‌కు రుణాలను జారీ చేయడంలో అక్రమాలకు తెరతీయడంతో మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ ఆర్బీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. అలాగే నిరర్థక ఆస్తులు పెరిగిపోయి నష్టాల ఊబిలో కూరుకుపోయిన యస్ బ్యాంక్‌ను రక్షించేందుకు ఆర్బీఐ ఆ బ్యాంక్‌లోని 49 శాతం షేర్లను ‘ఎస్బీఐ’ చేత కొనుగోలు చేయించింది. ఇక బ్యాంకింగ్‌లో మొండి బకాయిల తీవ్రత కొనసాగుతోంది. ఆర్బీఐ పాలసీ భరోసా కరోనాతో కష్టాలపాలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఈ ఏడాదిలో ఆర్బీఐ ద్రవ్యపాలసీ కమిటీ వడ్డీరేట్లను గణనీయంగా తగ్గించింది. రెపోరేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.15 శాతం నుంచి 4 శాతానికి పరిమితం చేసింది. అలాగే రివర్స్ రెపోరేటు 155 పాయింట్లను తగ్గించి 4.9 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ప్రతి ద్రవ్యపాలసీ సమీక్షలో సులభతరమైన విధానానికి కట్టుబడి ఉంటామని, ద్రవ్యోల్బణం దిగివస్తే, వడ్డీరేట్లపై మరింత కోత విధించేందుకు వెనకాడబోమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు ఆర్థిక వ్యవస్థ రికవరీకి దన్నుగా నిలుస్తున్నాయి. విమానయానం కుదేలు కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో దేశీయ విమానయాన రంగం పూర్తిగా డీలాపడింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశీయ విమానాలపై ఆంక్షలను విధించింది. సర్వీసులన్నీ ఒక్కసారి స్తంభించిపోవడంతో విమానయాన కంపెనీలకు పైసా ఆదాయం లేకుండా పోయింది. పైపెచ్చు ఆకస్మిక నిర్ణయంతో విమానయాన సంస్థలు ప్రయాణికులు బుక్ చేసుకున్న ముందస్తు టికెట్ల సొమ్మును తిరిగి చెల్లించాల్సి వచ్చింది. దీంతో దేశీయ విమాన కంపెనీలు దివాలా దిశగా ప్రయాణించాయి. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా దేశీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు మే 25న అనుమతులు లభించాయి. అలాగే జూలై నుంచి ఆయా దేశాలతో పరస్పర ఒప్పందంతో కొన్ని దేశాలకు విమానాలు నడుస్తున్నాయి. అయితే విమానయాన కంపెనీలకు అధిక ఆదాయాలను ఇచ్చే అంతర్జాతీయ సర్వీసులపైన ఆంక్షల పర్వం కొనసాగుతోంది. కోవిడ్–19 వ్యాక్సిన్ రాకతో అన్ని సర్వీసులు పునరుద్ధరణ జరిగి విమానయాన రంగం తిరిగి గాడిలో పడుతుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆటోమొబైల్ కరోనా బ్రేకులు ఈ 2020 ఏడాదిలో ఆటో మొబైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. చరిత్రలోనే తొలిసారి ఒక నెల ఆటో అమ్మకాలు సున్నాగా నమోదయ్యాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఉత్పత్తి పూర్తిగా స్తంభించడం, విక్రయాలకు బ్రేక్‌పడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఉద్దీపన ప్యాకేజీలో ఆటో పరిశ్రమకు పెద్దపీట వేయడం, భారత్‌లో ఉత్పాదక సామర్థ్యాలను, ఎగుమతులను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకంలో ఎక్కువగా దెబ్బతిన్న ఆటోమొబైల్ పరిశ్రమకు గరిష్టంగా రూ.57,042 కోట్ల ప్రోత్సాహకాలు లభించనుండటంతో చివరి రెండు క్వార్టర్ల నుంచి ఆటోపరిశ్రమ వీ–ఆకారపు రికవరీని సాధిస్తోంది. రికవరీ స్పీడ్‌పై ఈ రంగం ఆధారపడి ఉంది. ఫోన్లు స్మార్ట్...స్మార్ట్ స్మార్ట్ఫోన్ల కంపెనీలకు ఈ 2020 ఏడాది కలిసొచ్చింది. ఏడాది ప్రథమార్ధంలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఆశించినస్థాయిలో నమోదుకాలేదు. అయితే చివరి రెండు క్వార్టర్ల నుంచి విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 15 కోట్లను దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సరిహద్దు వివాదాలు, కరోనా వైరస్ సృష్టికి కారణమైందనే వాదనల నేపథ్యంలో చైనా ఫోన్లపై బ్యాన్ నినాదంతో దేశంలో మొదటిసారి చైనా ఫోన్ల అమ్మకాలు రెండోస్థానానికి దిగివచ్చాయి. దీంతో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ అమ్మకాల్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. రిలయన్స్ అప్పు లేదు కరోనాతో ఎకానమీ కకావికలమైన తరుణంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఈ ఏడాదిలో వరుస పెట్టుబడులతో కలకలలాడింది. గూగుల్, ఫేస్బుక్, సిల్వర్‌లేక్ వంటి దిగ్గజ కంపెనీలకు జియో ప్లాట్ఫామ్లో 33 శాతం వాటాను విక్రయించి రూ.1.52 లక్షల కోట్లను చేకూర్చుకుంది. అలాగే రైట్స్ ఇష్యూ చేపట్టి అదనంగా రూ.53 వేల కోట్లను సమీకరించింది. తన మరో అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌నూ 10 శాతం వాటాను విక్రయించి రూ.47 వేల కోట్లను సమకూర్చుకుంది. వాటా విక్రయాలు, ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులతో ఆర్ఐఎల్ రుణ రహిత కంపెనీగా అవతరించింది. కంపెనీలోకి వెల్లువలా పెట్టుబడులు రావడంతో కంపెనీ షేరు సైతం ఈ 2020లో 35 శాతం ర్యాలీ చేసింది. ఈ ఏడాదిలో సెప్టెంబర్ 16న రూ.2,369 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. రూపాయి ఒడిదుడుకులు భారత ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వెల్లువెత్తినా ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి బలపడలేకపోయింది. స్టాక్ మార్కెట్ పతనం వేళలో ఆర్బీఐ స్పాట్ మార్కెట్ నుంచి అధిక మొత్తంలో డాలర్లను కొనుగోలు చేయడంతో రూపాయి విలువ బలహీనపడిందని అంచనా. అలాగే కరోనాతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి విలువ గరిష్ట స్థాయి 70.73 గానూ, కనిష్ట స్థాయి 76.92 గానూ నమోదైంది. వెరసి ఈ ఏడాదిలో రూపాయి విలువ 6 రూపాయల రేంజ్లో కదలాడింది. క్రూడాయిల్ మైనస్‌లోకి ఈ ఏడాది క్రూడాయిల్ ధరలు ఏకంగా మైనస్‌ల్లోకి వెళ్లిన సంఘటన జరిగింది. ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో క్రూడాయిల్‌కు డిమాండ్ అంతంతగానే ఉంది. మరోవైపు చమురు ధరలపై ఆధిపత్యం కోసం సౌదీ– రష్యా దేశాలు ఒప్పంద పరిమితికి మించి క్రూడాయిల్ ఉత్పత్తి చేయడంతో నిల్వలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు క్రూడాయిల్ ధరలపై విరుచుకుపడింది. ఫలితంగా ఏప్రిల్ 21న నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ మే నెల ఫ్యూచర్ కాంట్రాక్ట్ బ్యారెల్ ధర తొలిసారి మైనస్‌లోకి వెళ్లిపోయింది. ఒక దశలో మైనస్ 40.32 డాలర్లకు చేరుకుంది. చివరికి 208 డాలర్లు నష్టపోయి మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం @ రూ. 56,190 కరోనా వైరస్‌తో స్టాక్ మార్కెట్లు కుదేలవడం ఈ ఏడాది పసిడి ర్యాలీకి కలిసొచ్చింది. కోవిడ్–19 సంక్షోభ వేళ ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనమైన బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అలాగే ఆర్థికంగా చిన్నాభిన్నమైన వ్యవస్థను సరిదిద్దేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు సులభతర వడ్డీరేట్ల విధానానికి తెరతీయడం కూడా బంగారం ర్యాలీకి కలిసొచ్చింది. ప్రపంచమార్కెట్లో ఆగస్ట్ 7న ఔన్స్ పసిడి ధర అత్యధికంగా 2,089 డాలర్ల స్థాయిని అందుకుంది. ఇదే ఆగస్ట్ 8న దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,190 చేరుకుంది. మొత్తంగా పసిడి ధరలు ఏడాదిలో 20 శాతం పెరిగాయి. అయితే కోవిడ్ వ్యాక్సిన్ రాక, ఆర్థిక వ్యవస్థ పురోగతి నేపథ్యంలో బంగారం ధరలు ఏడాది ముగింపు సమయానికి కొంత దిగివచ్చాయి. వచ్చే ఏడాదిలో పసిడి నుంచి పెద్ద ర్యాలీ ఆశించకపోవడం మంచిదని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
భారత్ ఎకానమీపై ఎస్అండ్పీ వైఖరి మార్పు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) కేవలం 15 రోజుల్లోనే తన వైఖరిని మార్చుకుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ క్షీణ రేటును 9 శాతం నుంచి 7.7 శాతానికి మెరుగుపరిచింది. డిమాండ్ ఊహించినదానికన్నా ముందుగానే మెరుగుపడుతుండడం, కోవిడ్–19 కేసుల తగ్గుముఖ ధోరణి దీనికి కారణంగా మంగళవారం తెలిపింది. 2021–22లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 10 శాతం ఉంటుందని పేర్కొంది. కరోనాను ఇంకా జయించలేనప్పటికీ, దానితో కలిసి జీవించడం భారత్ నేర్చుకుంటోందని తెలిపింది. భారత్‌లో సేవలకన్నా, వస్తువులకు డిమాండ్ బాగుందని పేర్కొన్న ఎస్అండ్పీ, రికవరీలో ఈ అంశమూ కీలకపాత్ర పోషించిందని తెలిపింది. సెలవులకు బయటకు వెళ్లకపోవడం, బయటి ఆహార పదార్థాల తీసుకోవడంపై వ్యయాలు తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో మిగిలిన డబ్బులో కొంతభాగం వస్తువుల కొనుగోళ్లకు మరికొంత పొదుపులకు ప్రజలు కేటాయిస్తారని పేర్కొన్న రేటింగ్ సంస్థ, భారత్‌లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. ద్విచక్ర వాహనాలు, కార్ల కొనుగోళ్లు గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. అయితే వైరెస్ సెకండ్‌వేవ్ సమస్యలు, వ్యాక్సిన్ ఇంకా లభ్యంకాని పరిస్థితులు, వ్యయాలపై ప్రభుత్వానికి పరిమితులు ఆర్థిక వ్యవస్థకు అవరోధాలని పేర్కొంది. 15 రోజుల క్రితం అభిప్రాయం చూస్తే... కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో మొదటి త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ఈ పరిస్థితుల్లో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు క్షీణ అంచనాలను 8 శాతం నుంచి 15 శాతం వరకూ లెక్కగట్టాయి. అయితే రెండవ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలతలో కనిపిస్తున్న పురోగతి నేపథ్యంలో అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్, అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ తమ తొలి అంచనాలను మార్చుకున్నాయి. జూలై– సెప్టెంబర్ త్రైమాసికం గణాంకాలు (నవంబర్ 27) వెలువడ్డానికి ముందే – గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించింది. దీనిని మూడీస్ అనుసరిస్తూ, తన తొలి అంచనా 11.5 శాతం నుంచి 10.6 శాతానికి తగ్గించింది. అనుకున్నట్లుగానే నవంబర్ 27వ తేదీన వెలువడిన సెప్టెంబర్ గణాంకాలు అంచనాలకన్నా మెరుగ్గా వెలువడ్డాయి. క్షీణత 7.5 శాతానికి కట్టడి జరిగింది. త్రైమాసికాల పరంగా చూస్తే, జీడీపీ విలువల్లో వృద్ధి 22 శాతంపైగా నమోదయ్యింది. ఈ సందర్భంలో నవంబర్ 30వ తేదీన ఎస్అండ్పీ ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థపై ఒక నివేదికను విడుదల చేస్తూ, భారత్ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు తమ వైఖరిని మార్చుకోబోమని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవవత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) తమ క్షీణ అంచనాను 9 శాతంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇంకా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయని, స్థూల దేశీయోత్పత్తిపై ఇవి ప్రభావం చూపడానికే అధిక అవకాశాలు ఉన్నాయని సూచించింది.అయితే ఫిచ్ (క్షీణత 10.5 శాతం నుంచి 9.4 శాతానికి), ఏడీబీ (–9 శాతం నుంచి – 8 శాతానికి) ఆర్బీఐ ( క్షీణత 9.5 శాతం నుంచి 7.5 శాతానికి)సహా ఎస్అండ్పీ పరిశోధనా విభాగం క్రిసిల్ (– 9 శాతం నుంచి – 7.7 శాతానికి )సైతం క్షీణ అంచనాలను తగ్గించాయి. ఈ నేపథ్యంలోనే పక్షం రోజుల్లో ఎస్అండ్పీ కూడా భారత్ ఎకానమీపై తన వైఖరి మార్చుకుంది. -
జీడీపీ బౌన్స్‌బ్యాక్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రికవరీ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు 7.5 శాతానికి పరిమితమయ్యింది. నిజానికి క్షీణత ‘సింగిల్ డిజిట్’కు పరిమితమవుతుందని పలు విశ్లేషణలు వచ్చినప్పటికీ, ఇంత తక్కువగా నమోదవుతుందని అంచనావేయలేదు. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం క్షీణిస్తుందని అంచనావేసింది. తయారీ, వ్యవసాయం, విద్యుత్, గ్యాస్ రంగాలు ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీకి చేయూతను ఇచ్చాయి. వినియోగ డిమాండ్ మెరుగుపడితే రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ మరింత ఊపునందుకునే అవకాశం ఉందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులతో భారత్ ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారీగా 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ 4.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. వివిధ రంగాలు చూస్తే...: తయారీ: జూన్ నుంచీ కఠిన లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఊపందుకుంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15% వాటా ఉన్న తయారీ రంగం 0.6% వృద్ధి నమోదుచేసుకోవడం గమనార్హం. జూన్ క్వార్టర్లో ఈ విభా గం 39% క్షీణించింది. ► వ్యవసాయం: జీడీపీలో దాదాపు 15% వాటా ఉన్న వ్యవసాయం 3.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► విద్యుత్, గ్యాస్: 4.4% వృద్ధిని సాధించాయి. ► ఫైనాన్షియల్, రియల్టీ సేవలు: ఈ విభాగాలు క్షీణతలోనే ఉన్నాయి. 8.1 శాతం మైనస్ నమోదయ్యింది. ► ట్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్ విభాగాలు సైతం 15.6 శాతం నష్టాల్లోనే (క్షీణత) ఉన్నాయి. ► నిర్మాణం: ఆర్థిక వ్యవస్థలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఈ రంగం క్షీణత 8.6 శాతం. అయితే క్యూ1లో భారీగా ఇది 50% క్షీణించింది. ► ప్రభుత్వ వ్యయాలు: ఆందోళనకరంగానే ఉన్న ప్రభుత్వ వ్యయాలు మరో అంశం. ప్రభుత్వ వ్య యాలు సెప్టెంబర్ క్వార్టర్లో 12% క్షీణించింది. క్షీణత ఇలా...: జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటన ప్రకారం, 2020–21 సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.33.14 లక్షల కోట్లు. 2019–20 ఇదే కాలంలో ఈ విలువ 35.84 లక్షల కోట్లు. అంటే విలువలో ఎటువంటి వృద్ధిలేకపోగా 7.5 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. సాంకేతికంగా మాంద్యమే... ఒక ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాలు క్షీణ రేటును నమోదుచేస్తే, ఆ పరిస్థితిని మాంద్యంగా పరిగణిస్తారు. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో భారత్ వరుస క్షీణ రేటును నమోచేసిన నేపథ్యంలో దేశం సాంకేతికంగా మాంద్యంలోకి జారిపోయినట్లే భావించాల్సి ఉంటుంది. మొదటి ఆరు నెలల కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 15.7 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 4.8 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. అయితే ఎకానమీ ‘వీ’ నమూనా వృద్ధి నమోదుచేసుకుంటుందని ఆర్థిక నిపుణులు భరోసాతో ఉండడమే ఊరట. దేశంలో క్రమంగా వినియోగ డిమాండ్ పుంజుకుంటోంది. ఆటో మొబైల్ పరిశ్రమ బాగుంది, నాన్–డ్యూరబుల్ రంగం మెరుగుపడుతోంది. రైలు రవాణా పెరుగుతోంది. వచ్చే ఏడాది తొలి నెలల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ వృద్ధికి ఊతం ఇచ్చేవి కావడం గమనార్హం. అయితే సెకండ్‌వేవ్ కేసుల భయాలూ ఉన్నాయి. ఇది రానున్న రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థను ప్రతికూలతలోకి నెడతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న దానికన్నా (4% వద్ద నిర్దేశం) అధికంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండడం గమనార్హం. వృద్ధి బాటలో చైనా దూకుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుసహా ప్రపంచంలోని పలు దేశాల ఎకానమీలు కరోనా ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిన నేపథ్యంలో... ఈ మహమ్మారికి పుట్టినిల్లు చైనా మాత్రం వృద్ధి బాటన సాగుతోంది. ఈ ఏడాది వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును (2019 ఇదే కాలంతో పోల్చి) నమోదుచేసుకుంది. కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. 2020తో తొలి ఆరు నెలల కాలం (జనవరి–జూన్) చూసుకుంటే 1.6 శాతం క్షీణతలో ఉన్న చైనా, మూడు త్రైమాసికాలు కలిపితే 0.7 శాతం పురోగతిలో ఉంది. అక్టోబర్‌లో మౌలికం 2.5 శాతం క్షీణత మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి అక్టోబర్‌లో 2.5 శాతం మేర క్షీణించింది. ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ఉత్పత్తి పడిపోవడం ఇందుకు కారణం. మౌలిక రంగం క్షీణించడం ఇది వరుసగా ఎనిమిదో నెల. మార్చి నుంచి ఇది క్షీణ బాటలోనే ఉంది. 2019 అక్టోబర్‌లో ఎనిమిది మౌలిక పరిశ్రమల ఉత్పత్తి 5.5 శాతం క్షీణత నమోదు చేసింది. బొగ్గు, ఎరువులు, సిమెంట్, విద్యుదుత్పత్తి సానుకూల వృద్ధి కనపర్చగా, క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో చూస్తే మౌలికం 13% క్షీణించింది. గతేడాది ఇదే వ్యవధిలో 0.3% వృద్ధి నమోదైంది. విభాగాల వారీగా .. అక్టోబర్‌లో బొగ్గు ఉత్పత్తి 11.6%, సిమెంట్ (2.8%), విద్యుత్ (10.5%) వృద్ధి నమోదు చేశాయి. మరోవైపు క్రూడాయిల్ 6.2 శాతం, సహజ వాయువు 8.6%, రిఫైనరీ ఉత్పత్తులు 17 శాతం, ఉక్కు 2.7 శాతం మేర ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. 1950–51నుంచి భారత్ జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు – 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. అంచనాలు నిజమైతే 2020–21 ఆరవసారి అవుతుంది. అబ్బురపరుస్తున్నాయ్... ఆర్థిక రికవరీ అబ్బుర పరుస్తోంది. ప్రత్యేకించి తయారీ రంగం సానుకూలతలోకి రావడం హర్షణీయం. వ్యవస్థలో తిరిగి డిమాండ్ నెలకొంటోందని ఈ అంశం సూచిస్తోంది. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రోత్సాహకరం మహమ్మారి ప్రేరిత అంశాలు, గత త్రైమాసికం తీవ్ర నిరాశాకర ఫలితాల నేపథ్యంలో వెలువడిన తాజా గణాంకాలు కొంత ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ కొంత ఆందోళన కూడా ఉంది. ఆర్థిక క్షీణత మహమ్మారి వల్లే. ఈ సవాలు ఇంకా కొనసాగుతోంది. – కృష్ణమూర్తి సుబ్రమణ్యం, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ద్వితీయార్ధంలో ‘వృద్ధి’కి అవకాశం ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యలు, సంస్కరణలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో (అక్టోబర్–మార్చి) దేశం వృద్ధి బాటకు వస్తుందన్న విశ్వాసం కనబడుతోంది. 2021–22లో వృద్ధి రెండంకెల్లో నమోదు అవుతుందని భావిస్తున్నాం. అక్టోబర్‌లో భారీగా పెరిగిన వినియోగ డిమాండ్ ఆశావహ పరిస్థితులను సృష్టిస్తోంది. అయితే సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనడమే ప్రస్తుతం కీలకాంశం. – ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ విశ్వాసాన్ని పెంచుతున్నాయ్ తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులను క్రమంగా సడలిస్తున్న నేపథ్యం ఇది. ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక వ్యవస్థ సంస్కరణలు ఫలితాలను అందిస్తున్నాయి. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందని భావిస్తున్నాం. వినియోగ డిమాండ్ మున్ముందు పుంజుకునే అవకాశం ఉంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ తయారీలో విజయం అంచనాలకు మించి సానుకూల ఫలితం రావడం హర్షణీయం. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీ బాటలో ఉన్నట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా తయారీ రంగంలో సానుకూలత మంచి పరిణామం. ప్రోత్సాహకరమైనది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల ఫలితమిది. – సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ ముందుముందు మంచికాలం ఫలితాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. తాజా ఫలితాలను చూస్తుంటే, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లోనూ మంచి ఫలితాలు వెలువడతాయన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలు పురోగతి బాటన పయనిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం మెరుగుపడుతోంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్