ప్రతి దేశంలో ఎన్నో వ్యాపార సామ్రాజ్యాలు ఉంటాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు పలు కుటుంబాల ఆధ్వర్యంలోని కంపెనీలపై ఆధారపడి ఉంటుంటాయి. వాల్‌మార్ట్, ఫోర్డ్, రిలయన్స్ వంటి ‘కుటుంబ’ కంపెనీలు.. ఆయా దేశాల్లో ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఊతంగా నిలుస్తుంటాయి. ఈ అంశంపై తాజాగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ పరిశీలన జరిపింది. దేశాలవారీగా జీడీపీలో అక్కడి ‘వ్యాపార’ కుటుంబాల సంస్థల భాగస్వామ్యం ఎంత అన్న అంచనాలు వేసింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు క్యాపిటల్ మార్కెట్లలో కేవలం కుటుంబ కంపెనీల వాటానే 27 శాతం ఉంటుందని తేల్చింది. ఇది మరింతగా పెరుగుతూనే ఉందని పేర్కొంది.
‘వ్యాపార’ కుటుంబాల ఆదాయ శాతంలో ఇండియా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. ఏటా దేశ జీడీపీలో 79 శాతం వరకు పెద్దా, చిన్నా ‘కుటుంబ’ వ్యాపారాల నుంచే సమకూరుతున్నట్టు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అంచనా వేసింది. ఈ విలువ 245 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
విలువపరంగా ‘వ్యాపార’ కుటుంబాలు సమకూర్చుతున్న మొత్తాన్ని చూస్తే.. రూ.1,205 లక్షల కోట్లతో అమెరికా ప్రపంచంలో టాప్‌లో ఉంది. 821 లక్షల కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. వీటి తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment