
వాషింగ్టన్: సుంకాల దెబ్బకు విలవిలలాడుతున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తనతో సంప్రదింపులు జరిపేందుకు కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. ఈ క్రమంలో ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నాయంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన.
నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెసెషనల్ కమిటీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఏరకంగా చూసుకున్నా పార్లమెంట్(Congress) కంటే నేనే మెరుగైన మధ్యవర్తిని. అందుకే ఆయా దేశాలు నాకే ఫోన్లు చేస్తున్నాయి. సుంకాల విషయంలో ఊరట కోసం బతిమాలుకుంటున్నాయి.(ఈ క్రమంలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు). ప్లీజ్ సర్.. మాతో ఒప్పందం చేసుకోండి అంటూ వేడుకుంటున్నాయి. ఏమైనా చేస్తామంటూ దిగజారిపోతున్నాయి’’ అని వ్యాఖ్యానించారాయన. అలాగే..
సుంకాల దేశాలతో ఒప్పందం కోసం పార్లమెంట్‌ను అనుమతించాలని కొందరు రిపబ్లికన్ పార్టీలో కొందరు రెబల్ నేతలు కోరుతున్నారు. అదే జరిగి ఉంటే.. చైనా మీద ఇవాళ 104 శాతం సుంకాలు విధించాల్సి వచ్చేది కాదు. చైనా ఎంతో సంతోషంగా ఉండి ఉండేది. పైగా అమెరికానే సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. పైగా మన దేశాన్ని అమ్ముకోవాల్సి వచ్చేది. కాబట్టి మధ్యవర్తిత్వంలో చట్టసభ సమర్థవంతంగా పని చేస్తుందని నేను అనుకోను. ఇక్కడ ఒక విషయం చెప్పదల్చుకున్నా.. నాలా మీరెవరూ మధ్యవర్తిత్వం వహించలేరు’’ అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: ఫార్మా రంగం.. భారత్‌కు ట్రంప్ బిగ్ షాక్