objectionable comments
-
రాహుల్ గాంధీపై పాలవ్యాపారి కేసు
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్‌గాంధీపై బీహార్‌లో ఓ కేసు నమోదు అయ్యింది. ఓ పాలవ్యాపారి తనకు రూ.250 నష్టం వాటిల్లిందని, అందుకే రాహుల్ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణమని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) తాజాగా ఢిల్లీ కోటా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన మాటలతో దిగ్భ్రాంతికి లోనైన ముకేష్ కుమార్ చౌదరి అనే వ్యక్తి.. తన చేతిలో ఉన్న పాలబకెట్ను వదిలేశాడట. దీంతో పాలన్నీ నేలపాలై.. అతనికి నష్టం వాటిల్లిందట!.ఈ షాక్ నుంచి తేరుకుని అతను నేరుగా సమస్తిపూర్(Samastipur) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాహుల్‌గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాహుల్ మాటలతో నేను షాక్‌కి లోనయ్యా. నా చేతిలో ఉన్న బకెట్‌ను వదిలేశా. లీటర్ పాలు రూ.50.. మొత్తం రూ.250 నష్టం కలిగింది. రాహుల్ అలా మాట్లాడతారని అనుకోలేదు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయనపై కేసు పెడుతున్నట్లు చెప్పాడతను. దీంతో ఈసారి షాక్ తినడం పోలీసుల వంతు అయ్యింది. చేసేదిలేక.. బీఎన్ఎస్లో పలు సెక్షన్ల ప్రకారం రాహుల్‌పై కేసు నమోదు చేశారు.జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ప్రతీ సంస్థలను బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS)లు స్వాధీనం చేసుకున్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు దేశంతో పోరాడాల్సి వస్తోంది’’ అని అన్నారు. అయితే..‘దేశంతో పోరాటం’ అని వ్యాఖ్యపై దేశం నలుమూలల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడగా.. ఆయన దేశంలోని వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ సమర్థించింది.ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అసోం(Assam) రాజధాని గౌహతిలో మోంజిత్ చెటియా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్ గాంధీ రేకిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు ఆయన పాల్పడినట్లు అందులో ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. -
Delhi Elections: రమేష్ బిదురిపై బీజేపీ చర్యలు!
న్యూఢిల్లీ: మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన బీజేపీ నేత రమేష్ బిదురి(Ramesh Bidhuri)పై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆయన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ సీఎం అతిషితో పాటు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇటు ఆప్, అటు కాంగ్రెస్‌లు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.ఈ పరిస్థితుల్లో ఆయన్ని ఎన్నికల నుంచి తప్పించడమో లేదంటే నియోజకవర్గాన్ని మార్చడమో చేయాలని ఆలోచిస్తున్నారట.ఈ అంశంపై రెండుసార్లు భేటీ జరిగినట్లు సమాచారం. ఇక బీజేపీ ఈ మధ్యే తొలి జాబితా విడుదల చేయగా.. కల్కాజీ నుంచి సీఎం అతిషిపైనే రమేష్ బిదురిని బీజేపీకి పోటీకి దింపింది. ఈ క్రమంలోనే ఓ సభలో పాల్గొన్న ఆయన అతిషిపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని అభ్యర్థిగా కొనసాగించడం పార్టీకి మంచిది కాదని బీజేపీ భావిస్తోందట!.కల్కాజీ నియోజకవర్గంలో రమేష్ బిదురిని తప్పించి.. ఆ స్థానంలో మహిళా అభ్యర్థిని అతిషిపై నిలపాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. ఈ మేరకు రమేష్‌తోనూ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుజ్జర్ సామాజికవర్గపు బలమైన నేతగా పేరున్న రమేష్ బిదురి గతంలో.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పని చేశారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే..రమేష్ బిదురి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే.. నియోజకవర్గంలోని రోడ్లను ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. .. సీఎం ఆతీషి ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు’’ అంటూ రమేశ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
కన్నీరు పెట్టిన ఆతిశీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. తన తండ్రిని దుర్భాషలాడుతూ బీజేపీ నేతలు ఓట్లడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆప్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బిధూరి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా నాన్న టీచర్. ఢిల్లీలోని వేలాది మంది పేద, మధ్య తరగతి పిల్లలకు పాఠాలు బోధించారు. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్లు. చాలా అనారోగ్యంతో ఉన్నారు. కనీసం సొంతంగా నడిచే స్థితిలో కూడా లేరు. ఎన్నికల్లో లబ్ధి కోసం అటువంటి వృద్ధుడి పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా? దేశ రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారిపోతాయని నేనెప్పుడూ అనుకోలేదు. రమేష్ బిధూరి దక్షిణ ఢిల్లీ నుంచి పదిసార్లు ఎంపీగా ఉన్నారు. ఈ ప్రాంతానికి ఆయన ఏం చేశారో కల్కాజీ ప్రజలకు చెప్పాలి. ఎమ్మెల్యేగా నేను చేసిన ఐదేళ్ల పని కంటే పదేళ్లపాటు ఆయన గొప్పగా చేసిందేమిటో చూపించాలి. అప్పుడే ఆయన ఓట్లు అడగాలి’అని ఆతిశీ స్పష్టం చేశారు.#WATCH | Delhi: On BJP leader Ramesh Bidhuri's reported objectionable statement regarding her, Delhi CM Atishi says, " I want to tell Ramesh Bidhuri, my father was a teacher throughout his life, he has taught thousands of children coming from poor and lower-middle-class families,… pic.twitter.com/ojQr3w0gVW— ANI (@ANI) January 6, 2025 ఇదీ చదవండి: ఢిల్లీలో మేం సహకరించకుండా ఉండి ఉంటే..! -
మహిళలపై మంత్రి సవిత అభ్యంతరకర వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: శాసన మండలిలో ఇవాళ ఏపీ మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గతంలో టీబీటీ(Direct Benefit Transfer)నిధుల ద్వారా వచ్చిన సొమ్ముతో.. రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారని అన్నారామె.జగన్మోహన్రెడ్డి టీబీటీ పథకాల వల్ల రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు అంటూ మంత్రి సవిత ప్రసంగించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించ పరిచేలా మంత్రి సవిత మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు..మంత్రి సవిత వ్యాఖ్యలు పై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాంతిచకపోవడంతో మండలిని వాయిదా వేశారాయన. ఇదిలా ఉంటే.. నిన్న ఇదే మండలిలో మెడికల్ కాలేజీలపై చర్చ సమయంలో హజ్ యాత్రను ఉద్దేశించి మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు సైతం తీవ్ర దుమారం రేపాయి. -
జనసేన నేత ప్రేలాపలనపై భగ్గుమన్న కార్మిక సంఘాలు
విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షిస్తామని ప్రకటనలు ఇవ్వాల్సిందిపోయి.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్న కూటమి నేతలపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జననేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా చేసిన ప్రేలాపనలపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భగ్గుమంది.ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ, జనసేన నేతను హెచ్చరించారు. సాక్షి టీవీతో ఆదినారాయణ మాట్లాడుతూ.. ‘‘స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల కోసం జనసేన నేత బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కార్మిక సంఘాల పోరాటం వలనే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశ నుంచి కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. మా పోరాటాలను శంకిస్తే ఊరుకునేది లేదు అని ఆదినారాయణ హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే దిశగా ఎలాంటి ప్రయత్నం కనిపించడం లేదు. ఇది కార్మికుల్లో మరింత ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి చర్చించాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకోగా, ఈలోపే ఆ పార్టీకే చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతున్నది కార్మిక సంఘాలేబొలిశెట్టి ఢిల్లీలో మోసాలు చేసి విశాఖ వచ్చారుకార్మిక నాయకుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదుదమ్ముంటే బొలిశెట్టి ఒక నెలపాటు కార్మిక నాయకుడిగా ఉంటే కార్మికులు ఎవరిని కొడతారో అర్ధమవుతుందిప్రైవేటీకరణ చెయ్యాలనుకున్న బీజేపీ పంచన చేరి అవాకులు చావాకులు మాట్లాడితే కార్మికులు తగిన బుద్ది చెబుతారు:::నీరుకొండ రామచంద్రరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతబొలిశెట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాంపవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే బొలిశెట్టి సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారుస్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం ప్లాంట్ నిర్మాణ దశ నుంచి అనేక పోరాటాలు చేశాంస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పవన్ కల్యాణ్ విఫలమవుతున్నారుడైవర్షన్ కోసమే కార్మిక సంఘాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారుప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. త్వరలోనే తగిన బుద్ధి చెపుతారు..::: ఎన్, రామారావు, సీఐటీయూ లీడర్ సంబంధిత వార్త: విశాఖ ప్లాంట్‌పై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు -
మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు
అనకాపల్లి, సాక్షి: ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వాన్ని తిట్టిపోయడమే రోజూ పనిగా పెట్టుకున్నారు. పైగా అరాచకాలతో ఏపీని రావణ కాష్టంగా మార్చేశారు. దీనికి తోడు ఇప్పుడు ఓ అధికార ఎమ్మెల్యే మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. ‘‘పథకాల వల్లే.. ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కేటీఆర్ కామెంట్స్‌పై మహిళా కమిషన్ సీరియస్
హైదరాబాద్, సాక్షి: ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. సుమోటోగా కేసు నమోదు చేసిన కమిషన్.. త్వరలో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.మరోవైపు.. తెలంగాణ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. బేషరతుగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్స్‌లు చేసుకోవచ్చంటూ కేటీఆర్ అత్యంత హీనంగా మాట్లాడారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు తన తండ్రి నేర్పించిన సంస్కారం ఇదేనా? అని సీతక్క ప్రశ్నించారు. మహిళలపై కేటీఆర్‌కు గౌరవం లేదన్నది ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందని చెప్పారు. అదే సమయంలో.. రవాణా మంత్రి పొన్నం సైతం కేటీఆర్‌పై రాష్ట, జాతీయ మహిళా కమిషన్లు కేసు నమోదు చేయాలంటూ కోరారు. -
ప్రధానిపై సభాహక్కుల తీర్మానం
న్యూఢిల్లీ: విపక్షనేత రాహుల్ గాందీపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం మరో మలుపు తీసుకుంది. అనురాగ్ వ్యాఖ్యల్లో స్పీకర్ తొలగించిన భాగాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ’ఎక్స్‘లో షేర్ చేశారని, ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు. సభా నియమావళి రూల్–222 కింద ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసు ఇస్తున్నట్లు చన్నీ తెలిపారు. మంగళవారం అనురాగ్ ఠూకూర్ లోక్‌సభలో మాట్లాడుతూ.. తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు. దీనిపై విపక్ష సభ్యుల అభ్యంతరంతో స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికా పాల్ (కాంగ్రెస్ ఎంపీ) అనురాగ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. ‘నిబంధనల ప్రకారం రికార్డుల నుంచి తొలిగించిన వ్యాఖ్యలను ప్రచురించడం సభాహక్కుల ఉల్లంఘనే. సుప్రీంకోర్టు కూడా దీన్నే ధృవకరించింది’ అని చన్నీ తెలిపారు. ‘ అయితే అనురాగ్ తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని అన్నపుడు ఎవరి పేరునూ తీసుకోలేదని, ఈ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగించలేదని, దీని ఆధారంగా చన్నీ ఇచ్చే నోటీసు పరిగణనకు రాకపోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్‌లో అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని మొత్తం షేర్ చేస్తూ.. ‘తప్పకుండా వినాల్సినది. వాస్తవాలు, హాస్యం మేలు కలయిక. ఇండియా కూటమి నీచ రాజకీయాలను ఎండగట్టింది’ అని కితాబిచ్చారు. అనురాగ్ వ్యాఖ్యలపై బుధవారం కూడా లోక్‌సభలో తీవ్ర దుమారం రేగింది. -
Lok sabha elections 2024: శ్రుతి మించుతోంది
ఒకప్పుడు ఎన్నికలొస్తే ప్రత్యర్థుల భావజాలం, అవినీతి, ప్రభుత్వ విధానాల వంటివాటిపై పారీ్టల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కానీ ఇప్పుడు నేతల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. మాటలు హద్దులు దాటుతున్నాయి. ఎన్నికల బరిలో దిగుతున్న మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే పెడ ధోరణి పెరిగిపోతోంది. వారిని కించపరచడం, లింగవివక్షతో కూడిన వెకిలి కామెంట్లు చేయడం పరిపాటిగా మారుతోంది. చివరికి మహిళా నేతలు ప్రత్యర్థి పార్టీల్లోని సాటి మహిళలపై నోరు పారేసుకోవడానికి వెనకాడటం లేదు! బీజేపీ లోక్‌సభ అభ్యరి్థ, సినీ నటి కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ వ్యాఖ్యలు అందుకు నిదర ్శనమే. నారీ శక్తి అంటూ పార్టీలు ఇస్తున్న నినాదాలు మాటలకే పరిమితమవుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది... ‘మండీలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోందో!’ – ఇది కంగనాపై కాంగ్రెస్ ఐటీ విభాగం చీఫ్ సుప్రియ మూడు రోజుల కింద ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన పోస్టు. కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలమైన మండి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. మండి అంటే బజారు అన్న అర్థాన్ని సాకుగా తీసుకుని, కంగనా ఫొటో పెట్టి మరీ చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలపై దుమారం రేగింది. బీజేపీ వెంటనే దీన్ని అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్ అంటేనే సంస్కారరాహిత్యానికి మారుపేరంటూ మండిపడింది. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ మొదలుకుని పలువురు నేతలు చేసిన ఇలాంటి కామెంట్లన్నింటినీ ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోసింది. దాంతో ఆ పోస్టుతో తనకు సంబంధం లేదని, ఎవరో తన ఇన్‌స్టా అకౌంట్‌ను హాక్ చేసి ఈ పని చేశారని సుప్రియ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ‘‘ఓ యువకునికి టికెట్ దక్కితే అతని భావజాలంపై దాడి! అదే ఒక యువతి ఎన్నికల బరిలో దిగితే లింగవివక్షతో కూడిన ఇలాంటి వ్యాఖ్యలు! ఈ నీచమైన పోకడకు ఇకనైనా తెర పడాలి. సెక్స్ వర్కర్ల జీవితాలు ఎంతో దుర్భరం. వాటినిలా మహిళలపై బురదజల్లేందుకు సరుకుగా వాడుకోవడం సరికాదు’’ అంటూ కంగనా హుందాగా ఇచ్చిన రిప్లై అందరి మనసులూ గెలుచుకుంది. భారత్‌లో ఎన్నికల వేళ మహిళా నేతలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల వేడి మొదలవుతూనే ఈ తరహా దూషణ పర్వం ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాహుల్ కూడా అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మోదీ సర్కారు కేవలం వీఐపీలనే పిలిచిందంటూ తప్పుబట్టే క్రమంలో నటి ఐశ్వర్యారాయ్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ కార్యక్రమాన్ని మీరంతా చూశారు కూదా! ఐశ్వర్య, అమితాబ్, మోదీ... ఇలాంటివాళ్లే ఉన్నారు. కార్యక్రమంలో ఐశ్వర్య డ్యాన్సులు చేసింది. కానీ అక్కడ ఓబీసీలు, ఇతర సామాన్యులు ఒక్కరన్నా కన్పించారా?’’ అన్న రాహుల్ కామెంట్లపై తీవ్ర విమర్శలే వచ్చాయి. వాటిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇలాంటి వ్యాఖ్యల బాధితురాలే. అమేథీ నియోజకవర్గానికి ఆమె కేవలం అప్పుడప్పుడూ వచ్చి తన హావభావాలతో జనాన్ని ఆకర్షించి వెళ్లిపోతారంటూ కాంగ్రెస్ నేత అజయ్‌రాయ్ ఇటీవల నోరుపారేసుకున్నారు. బీజేపీ నేతలు కూడా... మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో అధికార బీజేపీ నాయకులూ ఏమీ తక్కువ తినలేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా మంటలు రేపాయి. ‘‘మమత గోవాకు వెళ్తే తాను గోవా కూతురినంటారు. త్రిపురకు వెళ్తే త్రిపుర బిడ్డనని చెప్పుకుంటారు. ముందుగా మమత తన తండ్రెవరో గుర్తించాలి’’ అంటూ తీవ్ర అభ్యంతకరకర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రియా, ఘోష్ ఇద్దరికీ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తలంటింది. వారి వ్యాఖ్యలకు వివరణ కోరుతూ తాఖీదులిచ్చింది. ఘోష్‌కు బీజేపీ అధినాయకత్వం కూడా షోకాజ్ నోటీసిచ్చింది. అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. 2021 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమత కాలికి గాయమైంది. దాంతో కొంతకాలం వీల్‌చైర్‌లోనే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తృణమూల్‌తో హోరాహోరీ తలపడ్డ బీజేపీ ఇదంతా సానుభూతి స్టంటేనంటూ ఎద్దేవా చేసింది. ఆ క్రమంలో, ‘బెర్ముడాలు (నిక్కర్లు) వేసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది’ అంటూ అప్పట్లో మమతపై ఘోష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక కేరళలో బీజేపీ నేత, సినీ నటుడు సురేశ్ గోపీ ప్రెస్‌మీట్ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టును పదేపదే అభ్యంతరకరంగా తాకడమూ వివాదం రేపింది. ఆమె ఒకటికి రెండుసార్లు ఆయన చేయిని అడ్డుకుంటూ నెట్టేసినా అలాగే వ్యవహరించారు. దీనిపై గొడవ పెద్దదవడంతో తప్పనిసరైన క్షమాపణలు చెప్పినా, పితృవాత్సల్యంతో అలా చేశానంటూ సమర్థించుకున్నారు. చిర్రెత్తుకొచ్చిన సదరు జర్నలిస్టు ఆయనపై కేసు పెట్టేదాకా వెళ్లింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అగ్ర నేత కైలాశ్ విజయవర్గీయ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు. అభ్యంతరకర దుస్తులు ధరించే మహిళలు శూర్పణఖల్లా కనిపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, ‘‘దేవుడు మీకు అందమైన శరీరమిచ్చాడు. మంచి బట్టలేసుకోవచ్చుగా’’ అన్నారు. వీటిని సుప్రియా శ్రీనేత్ అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టడం, మహిళలంటే బీజేపీకి గౌరవం లేదంటూ దుయ్యబట్టడం విశేషం! రాజకీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్లు వంట చేసుకొమ్మంటూ ఎన్సీపీ నేత సుప్రియా సులేను ఉద్దేశించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలు కూడా అప్పట్లో మంటలు రేపాయి. ఆందోళనకరమే.. మన దేశంలో ఎన్నికల వేళ మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోతాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పరిశోధన తేలి్చంది. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లోనైతే వారిపై వ్యక్తిగత విమర్శలు అనూహ్య స్థాయిలో పెరిగిపోయాయి. 95 మంది మహిళా నేతలకు వచ్చిన 1.14 లక్షల ట్వీట్లను పరిశీలిస్తే 14 శాతం దాకా లింగవివక్షతో కూడిన అభ్యంతరకర విమర్శలే. అంటే ఒక్కొక్కరికీ రోజుకు సగటున ఇలాంటి 113 ట్వీట్లొచ్చాయి!’’ అని పేర్కొంది. బీజేపీ తరఫున యూపీలో రాంపూర్ నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ ‘ఖాకీ లో దుస్తులు’ వ్యాఖ్యలు, ప్రియాంకా గాంధీ ‘పప్పూ కీ పప్పీ’ అంటూ బీజేపీ నేతల ఎద్దేవా, సినీ నటి హేమమాలిని ఓట్ల కోసం డ్యాన్సులు చేస్తారంటూ ప్రత్యర్థుల విమర్శలు... ఇలా 2019 ఎన్నికల్లో వివాదాలకు దారితీసిన ఉదంతాలెన్నో! ఇలా మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పూనుకునే ధోరణి మన దేశ రాజకీయాల్లో నేటికీ పెద్ద సవాలుగానే ఉందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా మన సమాజపు పురుషాహంకార వైఖరికి ఇది అద్దం పడుతోందని వారంటున్నారు. నిజానికి పోలింగ్ బూత్‌లకు వచ్చేందుకు పురుషుల నిరాసక్తత నేపథ్యంలో భారత్‌లో కొన్నేళ్లుగా ఏ ఎన్నికల్లోనైనా మహిళల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాయకురాళ్లను కించపరిస్తే మహిళల ఓట్లకు గండి పడవచ్చని తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటం ఆందోళనకర పరిణామమేనంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బండారు.. మీ ఇంట్లో ఆడపడుచులు లేరా?: ఎంపీ నవనీత్ కౌర్
సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై.. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల్ని ముక్తకంఠంతో ఖండిస్తోంది మహిళా లోకం. ఈ క్రమంలో మాజీ నటికి మద్దతుగా పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఎంపీ(అమరావతి నియోజకవర్గం), మాజీ సినీ నటి నవనీత్ కౌర్ రాణా సైతం రోజా అండగా నిలిచారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బండారుపై ఆమె ఆగ్రహం వెల్లగక్కారు. ‘‘బండారు.. అసలు సిగ్గు ఉందా?. మంత్రి రోజా పై ఇంత దిగజారి మాట్లాడతావా?. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా?. తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారు. కానీ, ఈ బండారు మహిళల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడారు. నీకు రాజకీయాలు ముఖ్యమా?.. లేకుంటే మహిళల గౌరవం ముఖ్యమా?.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి’’ అని నవనీత్ కౌర్ ఫైర్ అయ్యారు. ఒక ఎంపీగా, నటిగా, మహిళగా నేను ఏపీ మంత్రి రోజాకు అండగా ఉంటా. నేనే కాదు.. యావత్ మహిళలంతా రోజాకు అండగా ఉంటుందని నవనీత్ కౌర్ పేర్కొన్నారు. ‘‘రోజా సినీ పరిశ్రమకు సేవలందించారు. స్టార్ హీరోల సరసన నటించారు. ఆమెను ఇంతలా కించపర్చడం సరికాదు. రాజకీయాల్లో ఇంతలా దిగజారి మాట్లాడటమూ మంచిది కాద’’ని నవనీత్ కౌర్ హితవు పలికారు. ఇప్పటికే సీనియర్ నటులు కుష్బూ సుందర్, రాధికా శరత్‌కుమార్ రోజాకు మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు నవనీత్ కౌర్ రాణా సైతం మద్దతుగా నిలిచారు. pic.twitter.com/QqzVrG5V5t — Navnit Ravi Rana (@navneetravirana) October 7, 2023 -
టీడీపీ నేత బండారుపై ఖుష్బూ ఆగ్రహం
సాక్షి, చెన్నై: టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సినీ నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని, తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని మండిపడ్డారామె. రోజాపై బండారు వ్యాఖ్యలు దారుణం. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా?. ఓ మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం. మహిళలను గౌరవించేవారు ఎవరూ బండారులా మాట్లాడరు. బండారు ఒక సగటు మనిషిగా కూడా విఫలమయ్యారు అని అన్నారామె. ఈ విషయంలో మంత్రి రోజా నా మద్దతు ప్రకటిస్తున్నా. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. బండారు క్షమాపణలు చెప్పే దాకా సాగే పోరాటంలో తాను కలుస్తానని చెప్పారామె. మహిళల కోసం రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ అధినియం బిల్లు) ప్రధాని మోదీ తెచ్చారని, మహిళ సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వాళ్లు మహిళా నేతలను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడతారా..? అని కుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. -
గుంటూరు పీఎస్‌లో బండారు.. ఓవరాక్షన్ చేస్తోన్న పచ్చ బ్యాచ్
సాక్షి, విశాఖపట్న/గుంటూరు: ప్రజాప్రతినిధులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో.. గుంటూరు జైలుకు తరలించే టైంలో.. ఆఖరికి ఇవాళ పీఎస్ బయట టీడీపీ శ్రేణులు చేసిన ఓవరాక్షన్ మామూలుగా లేదు. అంతేకాదు పోలీసులు ఆయన్ని ఏదో ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నట్లు పచ్చ మీడియా వరుస కథనాలతో నానా రభస చేస్తోంది. సోమవారం రాత్రి వెన్నెలపాలెంలో ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో.. అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు శతవిధాల యత్నించాయి. ఆపై ఆయన్ని గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఆయనకు విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఆపై ఈ(మంగళవారం) ఉదయం నుంచే ఆయన్ని విచారించే అవకాశం కనిపిస్తోంది. మంత్రి రోజాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరులో బడి మంజుల చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో బండారును అరెస్టు చేశారు. విచారణ కోసం స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు మంత్రి రోజాను ఉద్దేశించి జుగుప్సాకరంగా మాట్లాడిన బండారును అరెస్టు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సైతం డీజీపీని కోరారు. ఇదీ చదవండి: బండారు వ్యాఖ్యలపై రోజా రియాక్షన్ ఇది ఇక ఆయన్ని నగరంపాలెం పీఎస్ తరలించారనే సమాచారంతో పీఎస్ వద్దకు చేరుకుని ఆందోళన చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచిస్తున్నా.. పట్టించుకోకుండా అతి చేష్టలకు దిగుతున్నారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు బందోబస్తులో ఉన్న పోలీసులపై టీడీపీ నేతలు చిందులు తొక్కుతున్నారు. ‘‘మా గవర్నమెంట్ వచ్చాక ఏం చేస్తామో చూడు.. నీ అంతు చూస్తా’’ అంటూ వెస్ట్ డీఎస్పీ ఉమా మహేశ్వర రెడ్డిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు బెదిరించిన దృశ్యాలు కనిపించాయి. -
‘రాజకీయాల నుంచే కాదు.. దేశ బహిష్కరణ చేయాలి’
సాక్షి, గుంటూరు: చరిత్రలో చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యయం అయితే.. ఆ పాలనలో పేదలకు ఇల్లు అనేది ఒక కలగానే ఉండిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆ కలను సాకారం చేయడానికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తుంటే.. కోపం, అసూయ, ద్వేషంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు సజ్జల. గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ.. 2014-19 మధ్య రాష్ట్రంలో పేదలకు ఎక్కడైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?. నిజంగా ఇస్తే ఎవరికి ఇచ్చారో బయట పెట్టగలరా?. పేదలంటే చంద్రబాబుకు చులకన భావం. కనీసం టిట్కో ఇళ్లలో కూడా 16 గజాలు ఇవ్వలేదు. అందులో కూడా కాంట్రాక్టర్లకు అధిక రేట్లుకు ఇచ్చి.. వారి నుండి కిట్ బ్యాగులు తీసుకున్నారు. ఇప్పుడేమో సెంటు స్థలంలో మురికివాడలు అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారు అని సజ్జల మండిపడ్డారు. చక్కని రోడ్లు, మంచినీరు, కరెంటు అన్నీ కల్పిస్తుంటే మురికివాడలు అంటారా?. స్థానిక ఎమ్మెల్యేలు ఆ పేదలకు సామాజిక బాధ్యతగా సిమెంట్, ఇసుక, కంకర లాంటివి తక్కువ రేటుకు ఇప్పిస్తున్నారు. జగన్ కట్టించిన టిట్కో ఇళ్ల దగ్గరకు వెళ్లి చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెంటు స్థలంలో సమాధులు కట్టుకోమంటున్న చంద్రబాబును రాజకీయల నుంచే కాదు.. దేశం నుంచే బహిష్కరించాలని సజ్జల అన్నారు. ముందస్తు ఎన్నికలనే తప్పుడు ప్రచారం చేసుకుని పార్టీని బతికించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తారని, చంద్రబాబు బలవంతుడు అవుతాడని భావించినప్పుడే తాము ముందస్తుకు వెళ్తామని.. కానీ, అలాంటిదేం లేనప్పుడు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకు ఏంటని సజ్జల పేర్కొన్నారు. ‘‘చంద్రబాబుది దింపుడుకల్లం ఆశ. లోకేష్ ఎదగలేదనీ, పార్టీ బతకదని చంద్రబాబుకు పూర్తిగా అర్థం అయ్యింది. అందుకే ఫ్రస్టేషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే ప్రజలు రాజకీయంగా సమాధి చేస్తారు’’ అని సజ్జల అన్నారు. -
బండి సంజయ్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ గుర్రుగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే సుమోటోగా స్వీకరించింది రాష్ట్ర మహిళ కమిషన్. ఈ క్రమంలో తాజాగా నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్.. డీజీపీని వ్యక్తిగత విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది కూడా. ఇక ఈనెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా మహిళ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి.. బండి సంజయ్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా.. బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నారు. -
రామోజీలో నురగలు కక్కుతోన్న విద్వేషం.. గంజాయి మత్తు రాతలెందుకు?
ఈనాడు అధినేత రామోజీరావు తెగబడుతున్నారు. చివరికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని గంజాయి మొక్క అన్నారంటే ఆయనలోని అహంకారం, విద్వేషం ఏ రకంగా నురగలు కక్కుతోంది ఇట్టే తెలిసిపోతుంది. గత కొన్నాళ్లుగా ఆయన ఎపి ప్రభుత్వంపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన అప్రకటిత అధర్మయుద్దం చేస్తున్నారు. ఎన్ని దారుణాలు చేసి అయినా, ఎన్ని అసత్యాలు రాసి అయినా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఒక రోజు తాలిబన్ల రాజ్యం అని సంపాదకీయం రాస్తారు. మరో రోజు వైసిపి వలంటీర్లు అని మరో దిక్కుమాలిన ఎడిటోరియల్ రాస్తారు. దురహంకారం పరాకాష్టకు తాజాగా అమ్మకానికి అమరావతి అంటూ అద్వాన్నమైన సంపాదకీయం రాశారు. ఈనాడు రిపోర్టర్లు రాసే అబద్దాలు, అర్దసత్యాలతో ఆయన సంతృప్తి చెందక, స్వయంగా రంగంలో దిగుతున్నారని అనుకోవాలి. అందువల్లే వృద్దాప్యంలో ఉండి కూడా ఆయన ఉచ్ఛనీచాలు మర్చిపోతున్నారు. ఏభై శాతం పైగా ఓటర్లు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని, 151 సీట్లతో అసాధారణ విజయం సాధించిన ముఖ్యమంత్రిని పట్టుకుని గంజాయి మొక్క అన్నారంటే ఎంత దురహంకారం ఉండాలి. ఆయన రాసిన సంపాదకీయాలు నాసి రకంగా ఉండడమే కాదు.. ఎవరైనా గంజాయి తాగితేకాని అలా రాయలేరన్న చందంగా ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. ముఖ్యమంత్రి జగన్‌ను గంజాయి మొక్క అనడం ద్వారా రామోజీరావు రాక్షసానందం పొంది ఉండవచ్చు. కాని అదే సమయంలో ఆయన జర్నలిజంలో ఒక గంజాయి తోట పెంచుతున్నారని, ఆ తోటలో ఈనాడును ఒక పెద్ద గంజాయి మొక్కగా తయారు చేసి, చిన్న గంజాయి మొక్కలతోటి ఇలాంటి చెత్త సంపాదకీయాలు రాయిస్తున్నారని ఎవరైనా అనుకుంటే తప్పేం ఉంటుంది. విలువలు, ప్రమాణాలకు పాతరేసి జనాన్ని మోసం చేయడానికి, తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మోయడానికి ఆయన పడరాని పాట్లు పడుతున్నారని తెలుసుకోవడం కష్టం కాదు. ఈ ప్రశ్నలకు బదులేది రామోజీ అమరావతి ప్రాంతంలో ఎక్కడో ఒక చోట 14 ఎకరాల భూమిని అదికారులు అమ్మకానికి పెట్టారట. అంతే! రామోజీలో దురహంకారంతో కూడిన ఆవేశం బుసలు కొట్టింది. ఇప్పటికే ఆంద్ర ప్రదేశ్ పాలిట కాలనాగు మాదిరి తయారైన ఆయన ఎక్కడా ఒక అభివృద్ది జరగడానికి వీలు లేకుండా అడ్డుపడుతున్నారు. రాజధానికి సంబంధించి హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందట. శాసనసభకు చట్టం చేసే హక్కు లేదని చెబితే ఈయనకు చారిత్రాత్మకంగా కనిపించింది. అనుకున్నట్లు అమరావతి రాజధాని సాకారమైతే అది కామధేనువు అయ్యేదట. అచ్చంగా తెలుగుదేశం నేత మాదిరే రాశారు తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడే సందేహం వస్తుంది. రామోజీకి , ఆయన మనుషులకు ఇది కామధేనువుగా మారి ఉండేదేమో! నిజంగానే అంత సీన్ ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎందుకు తాత్కాలిక భవనాలు నిర్మించారు? ఎందుకు శాశ్వత భవనాలు కట్టలేదు? అసలు ఒక ప్రధాన రహదారిని అయినా పూర్తి చేయలేదే? చివరికి తాను ఉండే కరకట్ట రోడ్డును కూడా అభివృద్ది చేయలేదే? రాజధాని కట్టడానికి లక్షతొమ్మిది వేల కోట్లు కావాలని కేంద్రానికి ఎందుకు చంద్రబాబు లేఖ రాశారు? చంద్రబాబు, రామోజీరావులు ఇప్పుడు చెబుతున్నట్లు అది స్వయం సిద్దమైనది అయితే అప్పుడు కేంద్రాన్ని ఎందుకు డబ్బు అడిగారు. కేంద్రం తాము ఇవ్వలేమని తేల్చేసింది కదా? అది సెల్ఫ్ పైనాన్సింగ్ అంటే భూములు అమ్మి సంపాదిస్తామని ఆనాడే చెప్పారు కదా? ప్రస్తుతం ఏదైనా చిన్న పనికి భూమి అమ్మబోతే ఎందుకు రామోజీ అడ్డుపడుతున్నారు? అదేదో న్యూయార్క్ లోని ఒక పత్రిక భవిష్యత్తు నగరాలలో ఇది ఒకటి అని రాసిందట. అంతే ఈనాడు, మరికొన్ని టిడిపి పత్రికలు బట్టలు చించుకున్నాయి. అంటే ఒక బొమ్మ గీసి ఇదే భవిష్యనగరం అని అనుకొమ్మంటే జనం పిచ్చివాళ్లా? ఎపి ప్రజల మొత్తం పన్నుల డబ్బును అమరావతిలో ఖర్చు చేస్తే కొన్ని వందల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగుపడితే పడి ఉండవచ్చు. కాని కోట్లాది మంది పేదలకు జరిగే మేలు ఏమిటి? అసలు ఆ నగరం నిర్మాణానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? దేశంలో కొత్త నగరం ఏదైనా ఆ స్థాయిలో నిర్మించారా. గుజరాత్, చత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో ఎంత వ్యయంతో కొత్త రాజధానులు కట్టారో రామోజీకి తెలియదా? ఈనాడు అప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా ముక్కారు పంటలు పండే భూములను రైతులు స్వచ్చందంగా ఇచ్చారట. అసలు మూడు పంటలు పండే భూములను ఇలా రాజధాని పేరుతో ప్రభుత్వం తీసుకోవచ్చా? ఆ రోజుల్లో భూములు ఇవ్వడానికి ఇష్టపడనివారిపై ఎన్నిరకాల వేధింపులు జరిగాయో తెలియదా? అవును గంజాయి తాగి సంపాదకీయాలు రాసేవారికి అవేవి కనిపించవు కదా! టిడిపి ప్రభుత్వమే ఆనాడు పంటలను దగ్దంచేయడానికి పూనుకుందన్న ఆరోపణలు అవాస్తవమా? ఉండవల్లి,పెనుమాక వంటి గ్రామాల రైతులు ఎన్ని బాధలు పడింది వీరు గుర్తించరా? ఇవేమి జరగకపోతే ఆనాడు జనసేన అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ గ్రామాలలో పర్యటించి వారికి అనుకూలంగా మాట్లాడారు? మూడు పంటలు పండే భూములను తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కితే ఈనాడు గంజాయి మత్తులో మునిగితేలిందా? ఒకప్పుడు శ్రీసిటీ పరిశ్రమల స్థాపనకోసం పెద్దగా పంటలు పండని భూములను సేకరిస్తే అమ్మో .. వ్యవసాయ భూములు తీసుకుంటారా? అని రాసిన ఈనాడు పత్రిక, రాజధానికోసం మూడు పంటలు పండే భూములు తీసుకోవడం సమర్ధనీయమని అంటోంది. పైగా ఆసాములు ఉదారంగా భూములు ఇచ్చారట. అదేమిటి? మంచి ప్యాకేజీతో పాటు ఏటా ఎకరాకు ఏభైవేల రూపాయల కౌలును కాణీ ఖర్చు లేకుండా తీసుకుంటున్నారు కదా? అభివృద్ది చేసిన ప్లాట్లు తీసుకుంటే అది ఉదారం అవుతుందా? ఎవరిని మోసం చేయడానికి ఈ రాతలు, రైతులు పాదయాత్ర చేస్తుంటే వైసిపి మందలు దాడులు చేశాయట. ఏమి రాతలో చూడండి. గుడివాడ వెళ్లి కొందరు మహిళలు కారు ఎక్కి మరీ తొడలు కొట్టారే? వారి ఆస్తులు పెరిగితే రాష్ట్రం బాగుపడినట్లా రామచంద్రపురం వద్ద రైతులను హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఐడి కార్డులు చూపాలని అడిగితే పట్టుమని పది మంది లేకుండాపోయారే? నిజంగా రైతులు అయితే తమ యాత్ర కొనసాగించేవారు కదా? ఎవరు అడ్డుకుంటారు? రాజధాని గ్రామాలలో అప్రజాస్వామిక రాజ్యం నడుస్తోందట. అది నిజమే అయితే రైతుల పేరుతో అక్కడ నిత్యం ధర్నాలు ఎలా చేయగలుగుతారు? జగన్ సర్కార్ కు ఎలాంటి శిక్ష వేస్తారో ప్రజలే నిర్ణయిస్తారట. అమ్మ ఒడి పేరుతో, స్కూళ్లలో నాడు-నేడు పేరుతో విద్యారంగాన్ని అభివృద్ది చేస్తున్న జగన్ కు ప్రజలు శిక్ష వేయాలట. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, చేయూత స్కీమ్, చేనేత నేస్తం, కాపు నేస్తం, అనేక స్కీములు అమలు చేస్తూ, మరో వైపు పరిశ్రమల రంగంలో విశేష అభివృద్దికి కృషి చేస్తున్న జగన్ కు శిక్ష వేయాలని గంజాయి మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? రామోజీ, చంద్రబాబు వంటివారు కేవలం తమ ఆస్తుల విలువ పెరిగితే రాష్ట్రం బాగుపడినట్లుగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పేదలను ఆదుకునే స్కీములు అమలు చేస్తే రాష్ట్రం విధ్వంసం అయినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. నిజంగానే రామోజీ దుష్టచతుష్టయంలో ఒకరిగా రుజువు చేసుకుంటున్నారు. అంతేకాదు జగన్ చెబుతున్నట్లు.. వచ్చేది పేదలు, పెత్తందార్ల మద్య యుద్దమే. రామోజీ ఒక పెత్తందారు అయితే, జగన్ పేదల తరపున ప్రతినిధిగా పోరాడుతున్నారు. పెత్తందార్లు ఎల్లవేళలా గెలవలేరని చరిత్ర చెబుతోంది. గంజాయి మత్తులో ఉన్నవారికి ఆ విషయం తెలియడానికి ఇంకా సమయం పడుతుంది కదా! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ -
Pawan Khera: విమానం నుంచి దించేసి మరీ అరెస్ట్!
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇవాళ పెద్ద పొలిటికల్ హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అరెస్ట్ వ్యవహారం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. గురువారం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) బయల్దేరిన ఆయన్ని.. సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు అసోం పోలీసులు. విమానం నుంచి దించేసి మరీ.. రెండు గంటల పాటు ఆగి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌ను ఖండిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. పవన్ ఖేరా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. రాయ్‌పూర్‌లో జరగబోయే ఏఐసీసీ ప్లీనరీ కోసం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో విమానంలో బయలుదేరాల్సి ఉంది. ఇంతలో సడన్ ఎంట్రీ ఇచ్చిన అసోం పోలీసులు.. ఆయన్ని విమానం నుంచి దించేశారు. ఆ సమయంలో ఆయన వెంట ఉన్న సీనియర్లు అడ్డుకునే యత్నం కూడా చేశారు. ఆపై రెండు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ చూపించి అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ.. సుమారు 50 మందికి పైగా కాంగ్రెస్ నేతలు విమానం టేకాఫ్ కానివ్వకుండా అడ్డుకుంటూ నిరసనకు దిగారు. బోర్డింగ్ పాస్ ఉన్న అరెస్ట్ చేశారంటూ ఆందోళన చేపట్టారు. ఇక పోలీసులు తీసుకెళ్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత పోలీసులు వచ్చి మీ బ్యాగేజీతో సమస్య అని చెప్పారు. కానీ, నేను ఒక హ్యాండ్ బ్యాగ్‌తో మాత్రమే బయల్దేరాను. అందుకే అనుమానం వచ్చింది. ఆపై వాళ్లు మీరు విమానంలో ప్రయాణించలేరు. డీసీపీ వచ్చి మిమ్మల్ని కలుస్తారు అంటూ చెప్పారు. చాలా సేపు ఎదురుచూసినా ఆయన రాలేదు అని ఖేరా తెలిపారు. చివరకు పోలీసులు ఆయన్ని వ్యాన్ ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. मुझे कहा गया कि आपके सामान को लेकर कुछ समस्या है, जबकि मेरे पास केवल एक हैंडबैग है। जब फ्लाइट से नीचे आया तो बताया गया कि आप नहीं जा सकते हैं। फिर कहा गया- आपसे DCP मिलेंगे। मैं काफी देर से इंतजार कर रहा हूं। नियम, कानून और कारणों का कुछ अता-पता नहीं है। : @Pawankhera जी pic.twitter.com/637WUlBDpJ — Congress (@INCIndia) February 23, 2023 ఇక ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ కేసీ వేణుగోపాల్(అరెస్ట్ సమయంలో ఆయన కూడా పవన్ వెంట ఉన్నారు) ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం గూండా రాజ్యంగా వ్యవహరిస్తోందని, పవన్ఖేరాను బలవంతంగా నోరు మూయించే సిగ్గుమాలిన చర్యకు దిగిందని విమర్శించారాయన. అలాగే.. పార్టీ మొత్తం పవన్‌కు అండగా ఉంటుందని ప్రకటించారు. మరోవైపు ఇది సుదీర్ఘ పోరాటమని, దేనికైనా సిద్ధమంటూ పవన్ ఖేరా ప్రకటించారు. ఆ కామెంట్‌తో మొదలు.. ఇదిలా ఉంటే.. పవన్ ఖేరా తాజాగా ఓ ప్రెస్మీట్లో హిండెన్‌బర్గ్-అదానీ అంశంపై మాట్లాడారు. ఈ క్రమంలో.. పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ)లపై అభ్యంతరం లేనప్పుడు.. నరేంద్ర గౌతమ్ దాస్.. క్షమించాలి..(పక్కనే ఉన్న ఓ నేతను అడిగి మరీ) దామోదర్‌దాస్ మోదీ ఎందుకు ఇబ్బందిగా ఫీలవుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆపై ‘పేరేమో దామోదర్‌దాస్, పని మాత్రం గౌతమ్‌దాస్(అదానీని ఉద్దేశిస్తూ..) కోసం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ప్రధాని మోదీ తండ్రి ప్రస్తావన తెచ్చి మరీ పవన్ ఖేరా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. పవన్ ఖేరాతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణలు తెలియజేయాలని బీజేపీ మండిపడుతోంది. ఈ మేరకు నిరసన ప్రదర్శనలు కూడా కొనసాగించింది. మరోవైపు ఆయనపై పలువురు బీజేపీ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. Make no mistake- pathetic remarks by courtier Pawan Khera on PM’s father have blessings of the top levels of Congress, which is full of entitlement and disdain against a person of humble origins being PM. India will not forget or forgive these horrible remarks of Congressmen. — Himanta Biswa Sarma (@himantabiswa) February 20, 2023 -
మీరు ఎప్పుడూ సంఘ విద్రోహ శక్తుల మధ్యనే ఉంటున్నారు.. జాగ్రత్త!!
మీరు ఎప్పుడూ సంఘ విద్రోహ శక్తుల మధ్యనే ఉంటున్నారు.. జాగ్రత్త!! -
ఆయన వెరీ డేంజర్: కేంద్రమంత్రి జైశంకర్
ఢిల్లీ: మెల్బోర్న్ హంగేరియన్-అమెరికన్ బిలియనీర్, ప్రముఖ ఇన్వెస్టర్ జార్జ్ సోరస్‌పై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపై 92 ఏళ్ల సోరస్ చేసిన విమర్శలను తిప్పికొట్టారాయన. నిన్న(శుక్రవారం) మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సోరస్‌కు వయసైపోయింది. ఆయనవి మూర్ఖమైన అభిప్రాయాలు అని జైశంకర్ పేర్కొన్నారు. న్యూయార్క్‌లో కూర్చుని ప్రపంచం మొత్తం ఎలా పని చేయాలో తానే నిర్ణయించాలని సోరస్ అనుకుంటున్నారు. ఆయన వయసైపోయిన వ్యక్తి. ధనికుడు. నచ్చిన అంశాలపై తన అభిప్రాయాలను చెప్తుంటాడు. అంతకు మించి ఆయనొక ప్రమాదకరమైన వ్యక్తి అని జైశంకర్ అభివర్ణించారు. తనకు నచ్చిన వ్యక్తి ఎన్నికల్లో గెలిస్తే అది మంచిదని సోరస్ భావిస్తాడు. అదే ఫలితం మరోలా వస్తే గనుక.. ప్రజాస్వామ్యంలో తప్పులు వెతుకుతాడు అంటూ జైశంకర్, సోరస్ గురించి వ్యాఖ్యానించారు. వలసవాదం నుంచి వెలుగులోకి వచ్చిన భారత్‌కు.. బయటి నుంచి జోక్యాలతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో బాగా తెలుసని జైశంకర్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా మంత్రి క్రిస్ బ్రౌన్‌తో చర్చ సందర్భంగా.. జైశంకర్ పై వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. PM మోదీ ప్రజాస్వామ్యవాది కాదని, ముస్లింలపై హింసను ప్రేరేపించడం వల్లే ఆయన స్థాయి పెరిగిందంటూ సోరస్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారమే రేపాయి. హిండెన్‌బర్గ్-అదానీ వ్యవహారంపైనా విదేశీ పెట్టుబడిదారులకు, భారత్‌లోని విపక్షాలకు మోదీ సమాధానం చెప్పాల్సిందని సోరస్, మ్యూనిచ్(జర్మనీ) సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: సోరస్ గురించి తెలుసా? ఆయనో ఆర్థిక నేరగాడు! -
Mahua Moitra: సారీనా? నేనెందుకు చెప్పాలి?
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా క్షమాపణలు చెప్పేదే లే అంటున్నారు. మంగళవారం బడ్జెట్ సెషన్లో టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతున్న సమయంలో.. మెహువా లేచినిలబడి బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై పెను దుమారమే రేగింది. బీజేపీ ఎంపీలు ఆమె వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. అయితే వివరణాత్మక క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌పై ఎంపీ మహువా మోయిత్రా తీవ్రంగా స్పందించారు. అసలు క్షమాపణలు ఎందుకు చెప్పాలని ఆమె ఎదురు ప్రశ్నిస్తున్నారు. యాపిల్‌ను యాపిల్ అనే అన్నాను. అందులో తప్పేం ఉంది. నేను ఏదైతే అన్నానో.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా అని బుధవారం పార్లమెంట్ బయట మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారామె. సారీనా? ఎందుకు చెప్పాలి?. గతంలో ఇదే పెద్దమనిషి(రమేశ్ బిదూరిని ఉద్దేశించి) రైతులను వ్యభిచార గృహాల నిర్వాకులని వ్యాఖ్యానించాడు. అది పార్లమెంట్ రికార్డుల్లోనూ ఉంది. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాను. Mahua Moitra using cuss word like “harami” in Parliament And Brut won’t show this 😀 pic.twitter.com/y8gMNXTR3i — Rishi Bagree (@rishibagree) February 7, 2023 బీజేపీకి చెందిన గౌరవనీయులైన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిగారూ రాజ్యసభలో.. డాక్టర్ శాంతనూ సేన్‌ను ఉద్దేశించి అభ్యంతరకర పదం వాడారు. అయినా పార్లమెంట్లో ఇలాంటి పదాలు ఉపయోగించడం కొత్తేం కాదు కదా. ఒక మహిళ అయి ఉండి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు వాళ్లు. మంచిగా తిరిగి ఇవ్వడానికి నేను పురుషుడినే కావాలా ఏంటి?. అయినా.. బీజేపీ వాళ్లు పార్లమెంటరీ మర్యాదలు బోధించడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారామె. ఇదిలా ఉంటే మెహువా వ్యాఖ్యలపై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎంసీ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ హేమా మాలిని సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుకను అదుపులో ఉంచుకోవాలని. భావోద్వేగంలో ఏది పడితే అది మాట్లాడొద్దని.. పార్లమెంట్లో సభ్యులకు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని హేమమాలిని వ్యాఖ్యానించారు. -
అన్‌స్టాపబుల్‌గా ఏమైనా చేసుకోండి, కానీ.. ఈ కామెంట్లు అవసరమా బాలయ్యా?
తెలుగుదేశం హిందుపూర్ శాసనసభ్యుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ, జనసేన అధినేత, మరో ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్అ న్‌స్టాపబుల్ అంటూ ఏమైనా మాట్లాడుకోనివ్వండి. ఆపకుండా నవ్వుకోనివ్వండి. ఎవరికి అభ్యంతరం లేదు. కాని మధ్యలో ప్రజలను ఉద్దేశించి , లేదా సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టింగులు చేసేవారి గురించి వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. ప్రత్యేకించి బాలకృష్ణ ఊరకుక్కల భాష వాడడం దారుణం. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి ఎవరైనా మాట్లాడితే ఊరకుక్కలతో సమానం అట. అసలు ఊరకుక్కలు ఏమి చేస్తాయో ఆయనకు తెలుసా! వావి వరసలతో నిమిత్తం లేకుండా లైంగిక కార్యకలాపాలకు పాల్పడతాయని, రోడ్లపై ఇష్టారీతిలో సంచరిస్తాయని ఊరకుక్కలు అంటారు. ఏ రంగంలో ఎవరు ఇలా వ్యవహరిస్తారో ఇలాంటి చెత్త పనులు ఎక్కువగా చేస్తారో చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మనకు సభ్యత అడ్డువస్తుంది. కాని అలాంటి వాటితో నిమిత్తం లేని వారు ఏమైనా మాట్లాడగలరు. గతంలో ఇదే బాలకృష్ణ ఏమన్నారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి. లేక... చేయాలి అని అన్నారు. ఆక్షేపణీయపు భాష వాడడం ఇష్టం లేక డాట్ లు పెట్టాల్సి వచ్చింది. ఆడపిల్లల తండ్రి ఎవరైనా ఇలా మాట్లాడతారా? అంతేకాదు .. సినిమాలలో డబుల్ మీనింగ్ డైలాగులు, అర్ధనగ్న నృత్యాలు, అబ్జెక్షనబుల్ సన్నివేశాలు ఎన్ని కనిపిస్తుంటాయో, వాటిపై అప్పుడప్పుడు మహిళా సంఘాలు ఎందుకు ఆందోళనలు చేస్తుంటాయో.. ఇవేవి ప్రజలకు తెలియవా? కేవలం మూడు పెళ్లిళ్లు అని ప్రస్తావిస్తేనే ఊరకుక్కలతో సమానం అయితే పైన చెప్పినవాటిని ఏ మాత్రం సిగ్గుపడకుండా చేసేవారిని ఏమనవలసి వస్తుంది. తన ఇంటిలోనే ఇద్దరిపై కాల్పులు జరిపినవారిని ఏమనాలి? సినిమాలతో పాటు రాజకీయాలలో ఉన్నవారు ఎంత బాధ్యతగా మాట్లాడాలి. సమాజంలో ఎంతో కొంత ప్రభావం చూపే వ్యక్తులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే వారి అభిమానులు కూడా ఇలాగే తయారవ్వరా? సడన్ గా బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ పై రాజకీయ అవసరాల రీత్యా అభిమానం ఏర్పడవచ్చు. అంతకుముందు జనసేనవారిని ఉద్దేశించి అలగాజనం అని, మరొకటి అని అన్నా, పవన్ కళ్యాణ్ పెద్దగా ఫీల్ కాకపోతే అది ఆయన ఇష్టం. కాని ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఊరకుక్కలతో సమానం అంటే మాత్రం కచ్చితంగా చాలామంది బాదపడతారు. దానిపై అదే స్థాయిలో స్పందిస్తుంటారు. అందువల్లే సోషల్ మీడియాలో బాలకృష్ణపై విమర్శలు వెల్లువెత్తున్నాయట. పవన్ కు బాలకృష్ణ సర్టిఫికెట్ ఇచ్చేస్తే జనం ఒప్పేసుకోవాలా! ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూసినా చిత్రంగానే ఉంటాయి. అసలు ఇలాంటి ప్రశ్నలను అవాయిడ్ చేయవచ్చు. అయినా వారిద్దరూ కావాలని మాట్లాడుకున్నారు. తద్వారా అదేదో మూడు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పుకాదు.. అది చాలా చిన్న విషయం అన్నట్లుగా వీరి సంభాషణ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కొత్త సంగతులు చెబుతుంటారు. వాటిలో నిజం ఉందో లేదో ఎవరికి అర్ధం కాదు. ఈసారి ఏకంగా ఆయన బ్రహ్మచారిగా ఉండాలని అనుకున్నానని, యోగ మార్గాన్ని అనుసరించాలని అనుకున్నా అని ఆయన చెప్పారు. కాని, మూడు సార్లు పెళ్లి జరిగింది తనకేనా అనిపిస్తుందట. ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకోలేదని, ముగ్గురితో ఒకేసారి ఉండ లేదని ఆయన అంటూ పెళ్లిళ్లకు కారణాలు చెప్పారు. కాని ఇక్కడ కూడా ఆయన నిజం చెప్పలేకపోయారు. ఆయన యోగి అవుతాననుకున్నది నిజమా? కాదా అన్నది మనకు అనవసరం. ఒక పెళ్లి చేసుకుని మరో మహిళతో సహజీవనం చేశారన్నది ఆయనపై కొందరు చేసే అబియోగం. అది వాస్తవమా? కాదా? అన్నదానిపై ఆయన క్లారిటీ ఇస్తే ఆయనలోని నిజాయితీ ప్రజలకు కాకపోయినా, అభిమానులకు అయినా అర్దం అయ్యేది. విడాకులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకోవడం తప్పుకాదు. ఆయన అన్నది అంతవరకు వాస్తవమే. కాని అలా చేయలేదన్నది ఆయన ప్రత్యర్ధులు చేసే ఆరోపణ. ఇక పవన్ కళ్యాణ్ కొందరు విశిష్ట వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ, అంబేద్కర్, పూలె, తరిమెల నాగిరెడ్డి, రామ్ మనోహర్ లోహియా వంటివారు రచించిన పుస్తకాలు చదివానని అంటారు. ఏదైనా సందేహం తీర్చుకోవాలంటే ఆ పుస్తకాలపై ఆధారపడతారట. అసలు వారు రాసిననాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు సంబంధం ఉందా? 2009లో ప్రజారాజ్యం, 2014 లో జనసేనను స్థాపించి టిడిపి, బిజెపిలకు మద్దతు ఇవ్వడం, 2019లో బిఎస్పి, వామపక్షాలతో కలిసి పోటీచేయడం, తదుపరి బిజెపివారిని బతిమలాడుకుని పొత్తు పెట్టుకోవడం. వీటన్నిటిలో ఆ ప్రముఖుల పుస్తకాలతో ఏమి సంబంధం. పాపం.. ఆ మహనీయులు జీవించి ఉంటే ఎంత క్షోభ పడేవారో! ఏదో ఒకటి చెప్పి తానేదో గొప్ప చదువరిని అని ప్రొజెక్టు చేసుకోవడం తప్ప మరొకటి కాదు. సిపిఐ సీనియర్ నేత చంద్రశేఖర్ టీవీలలో ఒక వ్యాఖ్య చేసేవారు. పవన్ కళ్యాణ్ ఎనభైవేల పుస్తకాలు చదవలేదని, వాటి అట్టలను మాత్రమే చూసి ఉంటారని పేర్కొన్నారు. మరి ఎవరు కరెక్టో వారే చెప్పాలి. అయితే ఒకటి మాత్రం వాస్తవం. తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురువు వంటివారని, ఆయనతో ఆయా అంశాలతో చర్చిస్తానని అన్నారు. ఏమి చర్చిస్తారో తెలియదు కాని, పవన్ కళ్యాణ్ ఆయన రాసిచ్చే డైలాగులనే సభలలో వాడుతుంటారని అంతా చెబుతుంటారు. కొంతలో కొంత ఇదైనా నిజం చెప్పినందుకు సంతోషించాలి. ఇలాంటి అన్ స్టాపబుల్ కార్యక్రమాలతో ఒటిటికి ఏమైనా లాభం కొంత ఉండవచ్చేమో కాని, రాజకీయంగా ప్రయోజనం అంతంతమాత్రమే అని చెప్పాలి. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
వివాదంలో చిక్కుకున్న ప్రముఖ రచయిత.. ఎస్పీకి ఫిర్యాదు
సినీ రచయిత అనంత శ్రీరామ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలె పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ “భట్రాజు పొగడ్తలు” అనే పదాన్ని వాడాడు. దీంతో ఆయన వ్యాఖ్యలపై సదరు కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదం ఇప్పటికే నిషేదించగా భట్రాజులను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు చేశారంటూ ఆ కులస్తులు మండిపడుతున్నారు. నిషేధిత పదాన్ని ఉపయోగించినందున అనంత శ్రీరామ్‌పై చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం ఎస్పీకి భట్రాజు కులసంఘాలు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే అనంత శ్రీరామ్ సదరు వర్గానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. -
Telangana: మంత్రి మల్లారెడ్డి క్షమాపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి క్షమాపణలు తెలియజేశారు. మెడికల్ విద్యార్థులకు ఓరియెంటేషన్ డే సందర్భంగా తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలకుగానూ ఆయన ఈ పని చేస్తున్నట్లు వెల్లడించారు. తన కొడుకుని తమ కులం అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆ కోడలు కిట్టీ పార్టీలు, పిక్నిక్లు అంటూ తిరిగేదని, అలా కాలేదు కాబట్టే ఇవాళ తన కోడలు తన మెడికల్ ఇనిస్టిట్యూట్‌కు ఎండీ అయ్యిందని, మీరు(విద్యార్థులను ఉద్దేశించి..) కూడా అలా కష్టపడి చదివితేనే పైకి వస్తారు అంటూ మల్లారెడ్డి కాలేజ్ ఈవెంట్లో వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో.. ఆయన క్షమాపణలు చెప్పారు. ప్రసంగంలో ఏదో ఫ్లోలో అలా మాట్లాడానని, ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని కోరుతున్నట్లు ఆయన వీడియోలో వెల్లడించారు. సక్సెస్ కోసం కష్టపడితే.. లైఫ్ పార్ట్నర్లు వాళ్లే వెతుక్కుంటూ వస్తారంటూ విద్యార్థులకు హితబోధ చేసే సమయంలో చామకూర మల్లారెడ్డి పైవ్యాఖ్యలు చేశారు. -
ఎలన్ మస్క్ పుట్టుకపై తీవ్ర వ్యాఖ్యలు
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్మస్క్పై తీవ్ర విమర్శలు చేశాడు అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్(45). తాజాగా వెస్ట్ ట్విటర్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ట్విటర్ బాస్ ఎలన్ మస్క్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు వెస్ట్. అమెరికన్ ర్యాపర్ యే అలియాస్ కాన్యే వెస్ట్ ఎలన్ మస్క్‌పై దారుణమైన పోస్ట్ చేశాడు. ఎలన్ మస్క్లో ప్రవహించే సగం రక్తం చైనాదేనా? అంటూ అభ్యంతరకర వ్యాఖ్య చేశాడు. ‘‘ఎలన్ సగం చైనీస్ అని నేను మాత్రమే అనుకుంటున్నానా?.. అతని చిన్నప్పటి ఫొటోలు ఎవరైనా చూశారా? ఒక చైనీస్ మేధావిని తీసుకొచ్చి.. అతనితో దక్షిణాఫ్రికా సూపర్ మోడల్‌తో కలయిక జరిపించారు. అలా ఎలన్ మస్క్ పుట్టుకొచ్చాడు అంటూ తీవ్ర కామెంట్లు చేశాడు. నేను ఒక్క ఎలన్ అనే అంటున్నా. ఎందుకంటే.. బహుశా వాళ్లు పది నుంచి 30 మంది ఎలన్ మస్క్‌లను పుట్టించాలని అనుకున్నారేమో!. కానీ, అతను(మస్క్) మొదటి జన్యు సంకరజాతిగా చిక్కున్నాడు అంటూ తీవ్రంగా పోస్ట్ చేశాడు కాన్యే వెస్ట్. అయితే ఈ ర్యాపర్ పైత్యం ఇక్కడితోనే ఆగలేదు. సరే ఒబామా.. గురించి మరచిపోకూడదు. చర్చిలో నీచ పదాలను ఉపయోగించినందుకు నన్ను క్షమించండి. కానీ, ఒబామా అనే పదానికి ఇంకా నాకు మరో పదం లేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. 22సార్లు గ్రామీ అవార్డులు గెల్చుకున్న కాన్యే వెస్ట్.. ప్రముఖ మోడల్ కిమ్ కర్దాషియన్ పార్ట్నర్(మాజీ)గా కూడా సుపరిచితుడే. అయితే.. హింసను ప్రేరేపించే కంటెంట్‌ను పోస్ట్ చేశాడనే కారణంతో ట్విటర్ అకౌంట్‌ను ట్విటర్ బ్యాన్ చేసింది. ఈ మధ్య కాలంలో ఇలా జరగడం ఇది రెండోసారి. తాజా సస్పెన్షన్‌పై మస్క్ స్పందిస్తూ.. తానెంతో ప్రయత్నించినా ఈ చర్యను ఆపలేకపోయానంటూ పశ్చాత్తాపం సైతం వ్యక్తం చేశాడు. వెస్ట్ విషయంలో ఎలన్ మస్క్ ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. తాజా బ్యాన్ తర్వాత మస్క్‌పై ఇలా తీవ్ర వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు వెస్ట్. View this post on Instagram A post shared by Ye (@kanyewest) -
రామ్‌దేవ్ అసభ్యకరమైన కామెంట్లు.. సారీ చెప్పాల్సిందే!
ఢిల్లీ: యోగా గురు, పతంజలి ఆయుర్వేద్ బ్రాండ్ అంబాసిడర్ బాబా రామ్‌దేవ్ మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో పలు చోట్ల రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు పలువురు. ఈ తరుణంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ రాందేవ్‌పై తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య(అమృతా ఫడ్నవిస్ పక్కనే ఉన్నారు ఆ టైంలో) ఎదుట స్వామి రామ్‌దేవ్.. మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవి, ఖండించదగినవి కూడా. ఈ ప్రకటన పట్ల మహిళా సమాజం బాధించబడింది. కాబట్టి, దేశానికి రామ్‌దేవ్ క్షమాపణలు చెప్పాలి అని స్వాతి మలివాల్ ఓ ట్వీట్ చేశారు. మరోవైపు దేశంలో చాలా చోట్ల మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా విభాగాలు రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిరసనలు చేసింది. రాందేవ్ బాబా దిష్టి బొమ్మ దహనం చేసి ఆందోళనల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి గీతారెడ్డి, ఇతర నేతలు. మరోవైపు సీపీఐ నారాయణ, రామ్‌దేవ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి చాలా అన్యాయంగా మాట్లాడారని, అలాంటి వ్యాఖ్యలు చేసిన టైంలో అక్కడే ఉన్న మహిళలు అతన్ని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాల్సిందని అభిప్రాయపడ్డారు. యోగా పేరుతో నటిస్తూ.. కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నాడని రామ్‌దేవ్‌పై మండిపడ్డారు. అలా మొదలైంది.. ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన కార్యక్రమంలో రామ్‌దేవ్ ప్రసంగిస్తూ.. మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్, సూట్స్‌లో కూడా బాగానే కనిపిస్తారని, నా కళ్లయితే వాళ్లు దుస్తులు ధరించకున్నా బాగుంటారని వ్యాఖ్యానించారు. ఆ వీడియో బయటకు రావడంతో దుమారం మొదలైంది. శివసేన థాక్రే వర్గ నేత సంజయ్ రౌత్, బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఏం సమాధానం చెప్తారంటూ అమృతా ఫడ్నవిస్‌ను సైతం ప్రశ్నించారాయన. महाराष्ट्र के उपमुख्यमंत्री जी की पत्नी के सामने स्वामी रामदेव द्वारा महिलाओं पर की गई टिप्पणी अमर्यादित और निंदनीय है। इस बयान से सभी महिलाएँ आहत हुई हैं, बाबा रामदेव जी को इस बयान पर देश से माफ़ी माँगनी चाहिए! pic.twitter.com/1jTvN1SnR7 — Swati Maliwal (@SwatiJaiHind) November 26, 2022 సంబంధిత వార్త: మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు.. -
‘రాష్ట్రపతిపై వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం’.. ఆ మంత్రిపై టీఎంసీ ఫైర్
కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. అంటూ ఆయన చేసిన కామెంట్ల తాలుకా వీడియో వివాదాస్పదమైన నేపథ్యంలో విపక్షాలు అధికార టీఎంసీ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో మంత్రి వ్యాఖ్యలపై స్పందించింది తృణమూల్ కాంగ్రెస్. ఆయన తీరు బాధ్యతారాహిత్యమేనని, ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, పూర్తిగా వ్యక్తిగతమని స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎంసీ అధికార ప్రతిని సాకెత్ గోఖలే ట్వీట్ చేశారు. ‘ఇది బాధ్యతారాహిత్యంగా చేసిన కామెంట్. ఆ వ్యాఖ్యలతో టీఎంసీకి ఎలాంటి సంబంధం లేదు. మేము భారత రాష్ట్రపతి పట్ల ఎంతో గర్వపడుతున్నాం. మేము ఆమెను, ఆమె పదవిని అత్యున్నతంగా చూస్తాం.’ అని తెలిపారు టీఎంసీ అధికార ప్రతినిధి సాకెత్ గోఖలే. Statement: This is an irresponsible comment & does NOT represent the views of @AITCofficial. We are extremely proud of the President of India & hold her & her office in the highest regard. https://t.co/v571435Snv — Saket Gokhale (@SaketGokhale) November 12, 2022 మంత్రి క్షమాపణలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన క్రమంలో క్షమాపణలు చెప్పారు టీఎంసీ మంత్రి అఖిల్ గిరి. ‘రాష్ట్రపతిని నేను చాలా గౌరవిస్తాను. సువేందు అధికారికి సమాధానం చెప్పేందుకు పదవిని చూపిస్తూ వ్యాఖ్యానించా. ఎవరి పేరును చెప్పలేదు. ఆయన అఖిల్ గిరి చాలా అంద వికారంగా ఉంటారని చెప్పారు. నేను ఒక మంత్రిని. నాగురించే ఏదైనా చెడుగా చెబితే.. అది రాజ్యాంగానికే అవమానం. నేను రాష్ట్రపతి అని సంబోధించాను కానీ, ఎవరి పేరు చెప్పలేదు. దీనిని భారత రాష్ట్రపతి అవమానంగా భావిస్తే.. క్షమాపణలు చెబుతున్నా. నేను చెప్పినదానికి పశ్చాతాపపడుతున్నా.’ అని పేర్కొన్నారు మంత్రి అఖిల్ గిరి. I respect President. I mentioned the post&made a comparison to respond to Suvendu Adhikari,I didn't take any name. He had said Akhil Giri looks bad in his appearance. I'm a min,took oath to office. If something is said against me, it's an insult to Constitution: WB Min Akhil Giri pic.twitter.com/9w1oY2BuZA — ANI (@ANI) November 12, 2022 ఇదీ చదవండి: వీడియో: మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. ముర్ముపై మంత్రి వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్