వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్‌మస్క్‌పై తీవ్ర విమర్శలు చేశాడు అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్(45). తాజాగా వెస్ట్ ట్విటర్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ట్విటర్ బాస్ ఎలన్ మస్క్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు వెస్ట్.
అమెరికన్ ర్యాపర్ యే అలియాస్ కాన్యే వెస్ట్ ఎలన్ మస్క్‌పై దారుణమైన పోస్ట్ చేశాడు. ఎలన్ మస్క్‌లో ప్రవహించే సగం రక్తం చైనాదేనా? అంటూ అభ్యంతరకర వ్యాఖ్య చేశాడు. ‘‘ఎలన్ సగం చైనీస్ అని నేను మాత్రమే అనుకుంటున్నానా?.. అతని చిన్నప్పటి ఫొటోలు ఎవరైనా చూశారా? ఒక చైనీస్ మేధావిని తీసుకొచ్చి.. అతనితో దక్షిణాఫ్రికా సూపర్ మోడల్‌తో కలయిక జరిపించారు. అలా ఎలన్ మస్క్ పుట్టుకొచ్చాడు అంటూ తీవ్ర కామెంట్లు చేశాడు.
నేను ఒక్క ఎలన్ అనే అంటున్నా. ఎందుకంటే.. బహుశా వాళ్లు పది నుంచి 30 మంది ఎలన్ మస్క్‌లను పుట్టించాలని అనుకున్నారేమో!. కానీ, అతను(మస్క్) మొదటి జన్యు సంకరజాతిగా చిక్కున్నాడు అంటూ తీవ్రంగా పోస్ట్ చేశాడు కాన్యే వెస్ట్. అయితే ఈ ర్యాపర్ పైత్యం ఇక్కడితోనే ఆగలేదు.
సరే ఒబామా.. గురించి మరచిపోకూడదు. చర్చిలో నీచ పదాలను ఉపయోగించినందుకు నన్ను క్షమించండి. కానీ, ఒబామా అనే పదానికి ఇంకా నాకు మరో పదం లేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు.
22సార్లు గ్రామీ అవార్డులు గెల్చుకున్న కాన్యే వెస్ట్.. ప్రముఖ మోడల్ కిమ్ కర్దాషియన్ పార్ట్‌నర్(మాజీ)గా కూడా సుపరిచితుడే. అయితే.. హింసను ప్రేరేపించే కంటెంట్‌ను పోస్ట్ చేశాడనే కారణంతో ట్విటర్ అకౌంట్‌ను ట్విటర్ బ్యాన్ చేసింది. ఈ మధ్య కాలంలో ఇలా జరగడం ఇది రెండోసారి. తాజా సస్పెన్షన్‌పై మస్క్ స్పందిస్తూ.. తానెంతో ప్రయత్నించినా ఈ చర్యను ఆపలేకపోయానంటూ పశ్చాత్తాపం సైతం వ్యక్తం చేశాడు. వెస్ట్ విషయంలో ఎలన్ మస్క్ ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. తాజా బ్యాన్ తర్వాత మస్క్‌పై ఇలా తీవ్ర వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు వెస్ట్.
Comments
Please login to add a commentAdd a comment