సాక్షి, గుంటూరు : ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ ... వర్ల రామయ్య వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.... ‘వర్ల రామయ్యకు పదవి రావడంతో అహంకారం పెరిగింది. వెంటనే మాదిగలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు.’ అని హెచ్చరించారు. కాగా ఆర్టీసీ బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న ఓ యువకుడిని వర్ల రామయ్య కులం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అంతకు ముందు రావెల కిషోర్...గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని అసైన్డ్ భూములను పరిశీలించారు. తక్కువ ధరకు భూములు ఇవ్వాలని ప్రభుత్వ ఒత్తిడి చేస్తోందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతులకు ఉపాధి చూపించిన తర్వాతే వారి వద్ద నుంచి భూములు సేకరించాలని రావెల కిషోర్ అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment