విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షిస్తామని ప్రకటనలు ఇవ్వాల్సిందిపోయి.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్న కూటమి నేతలపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జననేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా చేసిన ప్రేలాపనలపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భగ్గుమంది.
ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ, జనసేన నేతను హెచ్చరించారు. సాక్షి టీవీతో ఆదినారాయణ మాట్లాడుతూ.. ‘‘స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల కోసం జనసేన నేత బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కార్మిక సంఘాల పోరాటం వలనే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశ నుంచి కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. మా పోరాటాలను శంకిస్తే ఊరుకునేది లేదు అని ఆదినారాయణ హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే దిశగా ఎలాంటి ప్రయత్నం కనిపించడం లేదు. ఇది కార్మికుల్లో మరింత ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి చర్చించాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకోగా, ఈలోపే ఆ పార్టీకే చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
- స్టీల్ ప్లాంట్ ను కాపాడుతున్నది కార్మిక సంఘాలే
- బొలిశెట్టి ఢిల్లీలో మోసాలు చేసి విశాఖ వచ్చారు
- కార్మిక నాయకుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు
- దమ్ముంటే బొలిశెట్టి ఒక నెలపాటు కార్మిక నాయకుడిగా ఉంటే కార్మికులు ఎవరిని కొడతారో అర్ధమవుతుంది
- ప్రైవేటీకరణ చెయ్యాలనుకున్న బీజేపీ పంచన చేరి అవాకులు చావాకులు మాట్లాడితే కార్మికులు తగిన బుద్ది చెబుతారు
:::నీరుకొండ రామచంద్రరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేత
- బొలిశెట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
- పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే బొలిశెట్టి సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు
- స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం ప్లాంట్ నిర్మాణ దశ నుంచి అనేక పోరాటాలు చేశాం
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పవన్ కల్యాణ్ విఫలమవుతున్నారు
- డైవర్షన్ కోసమే కార్మిక సంఘాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు
- ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. త్వరలోనే తగిన బుద్ధి చెపుతారు..
::: ఎన్, రామారావు, సీఐటీయూ లీడర్
సంబంధిత వార్త: విశాఖ ప్లాంట్‌పై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment