unions
-
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్
-
జనసేన నేత ప్రేలాపలనపై భగ్గుమన్న కార్మిక సంఘాలు
విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షిస్తామని ప్రకటనలు ఇవ్వాల్సిందిపోయి.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్న కూటమి నేతలపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జననేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా చేసిన ప్రేలాపనలపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భగ్గుమంది.ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ, జనసేన నేతను హెచ్చరించారు. సాక్షి టీవీతో ఆదినారాయణ మాట్లాడుతూ.. ‘‘స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల కోసం జనసేన నేత బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కార్మిక సంఘాల పోరాటం వలనే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశ నుంచి కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. మా పోరాటాలను శంకిస్తే ఊరుకునేది లేదు అని ఆదినారాయణ హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే దిశగా ఎలాంటి ప్రయత్నం కనిపించడం లేదు. ఇది కార్మికుల్లో మరింత ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి చర్చించాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకోగా, ఈలోపే ఆ పార్టీకే చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతున్నది కార్మిక సంఘాలేబొలిశెట్టి ఢిల్లీలో మోసాలు చేసి విశాఖ వచ్చారుకార్మిక నాయకుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదుదమ్ముంటే బొలిశెట్టి ఒక నెలపాటు కార్మిక నాయకుడిగా ఉంటే కార్మికులు ఎవరిని కొడతారో అర్ధమవుతుందిప్రైవేటీకరణ చెయ్యాలనుకున్న బీజేపీ పంచన చేరి అవాకులు చావాకులు మాట్లాడితే కార్మికులు తగిన బుద్ది చెబుతారు:::నీరుకొండ రామచంద్రరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతబొలిశెట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాంపవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే బొలిశెట్టి సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారుస్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం ప్లాంట్ నిర్మాణ దశ నుంచి అనేక పోరాటాలు చేశాంస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పవన్ కల్యాణ్ విఫలమవుతున్నారుడైవర్షన్ కోసమే కార్మిక సంఘాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారుప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. త్వరలోనే తగిన బుద్ధి చెపుతారు..::: ఎన్, రామారావు, సీఐటీయూ లీడర్ సంబంధిత వార్త: విశాఖ ప్లాంట్‌పై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు -
AP: ఉద్యోగ సంఘాల నేతలతో ముగిసిన చర్చలు
సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం భేటీ అయ్యింది. ఐఆర్, పెండింగ్ డీఏ, సరెండర్ లీవ్‌లు, పదవీ విమరణ బకాయిలపై చర్చించింది. చర్చలు అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, రూ.5,600 కోట్ల బకాయిల విడుదలపై చర్చించామని తెలిపారు. త్వరగా ఉద్యోగుల పెండింగ్ అంశాలను పరిష్కరించాలని సీఎస్, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించామన్నారు. విశాఖ ఎమ్మార్వో కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పటికే ప్రకటించామని మంత్రి బొత్స పేర్కొన్నారు. -
సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ.. కంటిన్యూ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ మరో మూడు రోజులు కొనసాగనుంది. ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన తెలంగాణ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ 21వ తేదీకి వాయిదా వేసింది. సింగరేణిలో నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. ఈసారి ఎన్నికలు ఇప్పటికే ఆలస్యంగా కాగా.. డిసెంబర్ 27వ తేదీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు . ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలై.. ఎన్నికల నిర్వహణ కసరత్తులు జరుగుతున్నాయి. అయితే.. రాష్టంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం తో పాటు వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన, వనరుల శాఖ కోరింది. మార్చిలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్ దాఖలైంది. అదే సమయంలో వాయిదా యత్నాలను పసిగట్టి ముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏఐటీయూసీ సంఘం. దీంతో ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్ పై స్టే ఇవ్వకుండా విచారణ చేపట్టింది హైకోర్టు. -
పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ కీలక నిర్ణయం.. అనుబంధ సంఘాలపై ‘దృష్టి’
సాక్షి, హైదరాబాద్: పార్టీ అనుబంధ సంఘాల బలోపేతంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటికే పలుమార్లు అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరైన ఆయన వచ్చే పర్యటనలో కూడా అనుబంధ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీకి అనుబంధంగా పనిచేసే యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్లతో పాటు మహిళా కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే సమావేశమై వారికి దిశానిర్దేశం చేసిన ఆయన ఈసారి పర్యటనలో యూత్ కాంగ్రెస్, టీపీసీసీ ఫిషర్మెన్ కమిటీలతో సమావేశం కానున్నారు. అనుబంధ సంఘాలే పార్టీకి బలమని తన తొలి పర్యటన నుంచి చెపుతున్న ఆయన తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ ఆయా సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటాలపై యూత్‌కాంగ్రెస్, ఫిషర్మెన్ కాంగ్రెస్ నేతలకు భేటీల్లో ఠాక్రే దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి నాలుగు రోజుల టూర్ మాణిక్‌రావ్ ఠాక్రే మరోమారు నాలుగు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 23న హైదరాబాద్ రానున్న ఆయన 26వరకు ఇక్కడే ఉండనున్నారు. ఈనెల 23న పీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, హాథ్‌సే హాథ్‌జోడో ఇంచార్జులతో ఆయన భేటీ కానున్నారు. ఫిబ్రవరి ఆరోతేదీ నుంచి ప్రారంభమైన యాత్రలు సాగుతున్న తీరు, నాయకుల సహకారం, ప్రజల నుంచి వస్తున్న స్పందన లాంటి అంశాలపై చర్చించనున్నారు. ఇక, 24వ తేదీన యూత్‌కాంగ్రెస్, ఫిషర్మెన్ కమిటీలతో సమావేశం కానున్న ఠాక్రే ఈనెల 25న కీలక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందన్న అంచనాల నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లతో సమావేశం కానున్నారు. నగరంలో పార్టీ బలోపేతం తీసుకోవాల్సిన చర్యలు, గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ పునరి్నయామకం తదితర అంశాలపై ఆయన చర్చించనున్నారు. ఆ తర్వాత 26న ఖమ్మంలో రేణుకాచౌదరి ఆధ్వర్యంలో హాథ్‌సే హాథ్‌జోడో యాత్రకు కూడా హాజరుకానున్నారు. 26 నుంచి మళ్లీ హాథ్‌సే హాథ్‌జోడో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు చేపట్టిన హాథ్‌సే హాథ్‌జోడో యాత్రలకు సోమవారం నాటి నుంచి విరామం ఇవ్వనున్నారు. యాత్రల్లో భాగంగా రేవంత్‌రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, భట్టి ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఉన్నారు. సోమవారం యాత్ర ముగిసిన తర్వాత ఇరువురు నేతలూ హైదరాబాద్ వస్తారని, ఉగాది విరామం తర్వాత ఈనెల 26 నుంచి మళ్లీ యాత్ర ప్రారంభిస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల హైదరాబాద్‌కు ప్రియాంకాగాంధీ హాథ్‌సే హాథ్‌జోడో యాత్రల్లో భాగంగా మహిళలతో కలిసి యాత్రలో పాల్గొనేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ తెలంగాణకు వస్తారని, ఏప్రిల్ మొదటి వారంలో ఆమె హైదరాబాద్‌కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. చదవండి: బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం.. బలగం -
బీఎస్ఎన్ఎల్ : మరో 20వేల ఉద్యోగాలకు ముప్పు
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తోంది. మరో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించనుందన్న అంచనాలు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఈనిర్ణయాన్ని సమీక్షించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగాలు తొలగిపునకు సంబంధించి సెప్టెంబర్ 1న బీఎస్ఎన్ఎల్ తన మానవ వనరుల డైరెక్టర్ అనుమతితో ఒక ఉత్తర్వు జారీ చేసిందని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ వెల్లడించింది. కాంట్రాక్ట్ పనులు, కాంట్రాక్ట్ కార్మికుల ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అన్ని చీఫ్ జనరల్ మేనేజర్లు చర్యలను తీసుకోవాలని కోరినట్టు యూనియన ఆరోపించింది. ఈ క్రమంలో మరో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 30వేలమంది కార్మికులను తొలగించిందనీ, వీరికి ఒక సంవత్సరం పాటు వేతనాలు చెల్లించాలని యూనియన్ ఆరోపించింది. ఈ విషయంలో సంస్థ తన నిర్ణయాన్ని సమీక్షించాలని కోరింది. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) అమలు తర్వాత సంస్థ ఆర్థికపరిస్థితి క్షీణించిందని, దీంతోపాటు వివిధ నగరాల్లో ఉద్యోగుల కొరత కారణంగా నెట్‌వర్క్‌లలో లోపాలు పెరిగాయంటూ బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి కె పూర్వర్‌కు యూనియన్ ఒక లేఖ రాసింది.మరోవైపు 900 కోట్ల రూపాయల విలువైనపెండింగ్ బకాయిలను బీఎస్ఎన్ఎల్ చెల్లించకపోతే ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని గతనెలలో ఫిన్నిష్ టెలికాం పరికరాల సంస్థ నోకియా హెచ్చరించింది. కరోనావైరస్ మహమ్మారి మధ్య ఖర్చు తగ్గించే చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని కంపెనీ తెలిపింది. కాగా నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రెండు సంస్థలను విలీనం చేయడం, ఆస్తులను మోనటైజ్ చేయడం, ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇవ్వడం లాంటి చర్యలను ప్రకటించింది. ఇందుకు 2019 అక్టోబర్‌లో 69 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. -
బజాజ్ ఆటోను వణికిస్తున్న కరోనా
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కల్లోలంతో ఆటో దిగ్గజం బజాజ్ ఆటో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కంపెనీకి సంబంధించిన ముంబై వాలూజ్ ప్లాంట్‌లో కోవిడ్ కేసులు తాజాగా 400కు పెరిగాయి. దీంతో కార్మికులు ప్లాంట్‌కు వచ్చేందుకు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ ను తాత్కాలికంగా మూసివేయాలనే డిమాండ్ ఊపందుకుంది. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరిగినందున, వైరస్ సైకిల్ ను విచ్ఛిన్నం చేయడానికి ఎనిమిది నుంచి 10 రోజులు ప్లాంట్‌లో పని నిలిపివేయాలని కోరుతున్నామని బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెంగడే బాజీరావ్ తెలిపారు. దీనికి సంబంధించి మళ్ళీ మేనేజ్మెంట్తో చర్చిస్తామనీ, మధ్యవర్తిత్వం వహించడానికి ప్రభుత్వ అధికారులను కూడా సంప్రదించనున్నామని చెప్పారు. అవసరమైతే ఉత్పత్తి నష్టాన్ని భర్తీ చేసేందుకు అదనపు గంటలు కేటాయించమని కోరినట్లు వర్కర్స్ యూనియన్ తెలిపింది. అయితే దీనిపై బజాజ్ యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. (కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన) కాగా ప్రస్తుతం బజాజ్ ఆటోకు 3 ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. మహారాష్ట్రలోని వాలూజ్, చకన్ వద్ద రెండు ప్లాంట్లు ఉండగా, ఉత్తరాఖండ్‌లోని పంత్నగర్ వద్ద మరో ప్లాంట్ ఉంది. డిస్కవర్, ప్లాటినా, సిటీ 100, బాక్సర్ 150తో పాటు త్రిచక్ర వాహనాలను కంపెనీ వాలూజ్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. 8,100 మందికి పైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటివరకు బజాజ్ ఆటో కార్మికులు ఏడుగురు చనిపోయారు. (కరోనా : శుభవార్త చెప్పిన మైలాన్) -
ప్రముఖ ఐటీ సంస్థకు లీగల్ నోటీసులు
సాక్షి, బెంగళూరు : ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ చిక్కుల్లో పడనుంది. అక్రమంగా, చట్టవిరుద్ధంగా ఉద్యోగులను తొలగించిందన్న ఆరోపణలతో కర్ణాటక స్టేట్ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) కాగ్నిజెంట్‌పై చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. 18,000 మంది కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందన్న అంచనాల నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగుల తొలగింపులను ఖండించిన కేఐటీయూ తొలగించిన కొంతమంది ఉద్యోగుల ద్వారా కాగ్నిజెంట్ యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపింది. 14 రోజులు కాగ్నిజెంట్ నుండి ఆమోదయోగ్యమైన ప్రతిస్పందన రాకపోతే, కార్మిక శాఖను ఆశ్రయించనున్నామని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉల్లాస్ చమలరంబిల్ చెప్పారు. కార్మిక చట్టాల ప్రకారం, 100 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలు తొలగింపుల అమలుకు మొదట కార్మిక శాఖ నుండి అనుమతి పొందాలని కేఐటీయూ కార్యదర్శి సూరజ్ నిడియంగా చెప్పారు. పైగా ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామా చేశారని కంపెనీ వాదిస్తోందనీ, వాస్తవానికి, రాజీనామా చేయవలసి రావడంచట్ట విరుద్ధమేనని పేర్కొన్నారు. అలాగే బాధిత ఉద్యోగులు రాజీనామా చేయకుండా తమ ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు. ఇందుకోసం ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్టు ఉల్లాస్ తెలిపారు. బెంగళూరుతోపాటు చెన్నై, పూణేలోని ఉద్యోగులు యూనియన్లను సంప్రదించాయనీ, ప్రాజెక్టులలో పనిచేసే ఉద్యోగులు కూడా రాజీనామా చేయమని కంపెనీ ఒత్తిడి తెస్తోందని ఉల్లాస్ ఆరోపించారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకొని కార్మిక చట్టాల ఉల్లంఘనలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కర్నాటక ప్రభుత్వాన్ని కేఐటీయూ డిమాండ్ చేసింది. మరోవైపు సామూహిక తొలగింపుల ఆరోపణలను కాగ్నిజెంట్ ప్రతినిధి ఖండించారు. కాగ్నిజెంట్‌తో సహా ఐటీ పరిశ్రమల్లో పనితీరు నిర్వహణ ఆధారంగా తొలగింపు అనేది ఒక సాధారణ ప్రక్రియ అని తెలిపింది. Karnataka State IT/ITeS Employees Union #KITU opened a Help Desk to support the affected employees of Cognizant Don't Panic! Refuse to Resign! Call US @ 9605731771 / 7025984492 / 9742045570 pic.twitter.com/xvvyT1aUy7 — Sooraj Nidiyanga (@SNidiyanga) July 2, 2020 -
బ్యాంకు సమ్మె: 10 లక్షల మంది, 80 వేల శాఖలు
సాక్షి,చెన్నై: రేపటి నుంచి (జనవరి 31) రెండు రోజులపాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జనవరి 31- ఫిబ్రవరి 1 తేదీల్లో వివిధ బ్యాంకు సేవలు ప్రభావితం కానున్నాయి. బ్యాంకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్లతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ఈ సమ్మెకు నాయకత్వం వహించనుంది. మరోవైపు జనవరి 31 న ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. అలాగే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం గమనార్హం. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) తో చర్చలు విఫలమైన అనంతరం రెండు రోజుల సమ్మెకు నిర్ణయించామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం చెప్పారు. సమ్మెకాలంలో 80వేల బ్యాంక్ శాఖల్లో ఎక్కువ భాగం మూత పడతాయని తెలిపారు. అలాగే మార్చి 11 నుండి మూడు రోజుల పాటు మరోసారి సమ్మెను చేపట్టనున్నామని తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మె జరుగుతుందని యుఎఫ్‌బియు ఇంతకుముందే ప్రకటించిన సంగతి విదితమే. -
జెట్‌ను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి
ముంబై: నిధుల సంక్షోభంతో కార్యకలాపాలు నిలిచిపోయిన జెట్ ఎయిర్వేస్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, 22,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఇది అవసరమని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి సూచించాయి. దెబ్బతిన్న విమానయాన సంస్థకు మరిన్ని నిధులిచ్చే దిశగా బ్యాంకులను ఒత్తిడి చేయకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధానికి రాసిన లేఖలో ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) పేర్కొంది. జెట్ కార్యకలాపాలపై దర్యాప్తు చేయాలని కోరింది. తాజాగా నిధులిచ్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో జెట్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ‘‘జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు బ్యాంకులు బిడ్లను ఆహ్వానించాయని తెలిసింది. ఒకవేళ ఇది సఫలం కాకపోతే జెట్ ఎయిర్వేస్ను మీరే స్వాధీనం చేసుకోవాలి. దాంతో 22,000 మంది ఉద్యోగాలు భద్రంగా ఉంటాయి’’ అని ఏఐబీఈఏ లేఖలో కోరింది. జెట్ ఎయిర్వేస్కు తాజా నిధుల సాయం చేయాలని బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావడాన్ని కూడా వ్యతిరేకించింది. బ్యాంకులు యజమానులు కావడంతో ప్రతి ఒక్కరూ జెట్ బెయిలవుట్ కోసం వాటివైపే చూస్తున్నారని పేర్కొంది. ‘‘నరేష్ గోయల్ ఇప్పటికీ సంస్థ ప్రమోటర్‌గా 51 శాతం వాటా కలిగి ఉన్నారు. కంపెనీని నడిపించడమా లేక వేరొకరికి అమ్మేయడమా అన్నది అతని సమస్య’’ అని ఏఐబీఈఏ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం మొత్తానికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి నరేష్ గోయల్ అని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. -
20 శాతం సబ్సిడీతో పెంపకం దారులకు రుణాలు
సాక్షి, పెదవాల్తేరు (విశాఖతూర్పు) : రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకం దార్లకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ద్వారా రూ.275కోట్ల మేర రుణాలు విడుదల చేసిందని గొర్రెలు–మేకల అభివృద్ధి సమాఖ్య రాష్ట్ర చైర్మన్ వై.నాగేశ్వరరావు వెల్లడించారు. నగరంలోని సమాఖ్య కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ 20 శాతం సబ్సిడీతో రుణాలు జిల్లా యూనియన్ల ద్వారా అందిస్తున్నట్టు చెప్పారు. లబ్ధిదారులు రుణాలపై పావలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. 20 గొర్రెలు, పొట్టేలుకు రూ.లక్ష , 50 గొర్రెలు, రెండు పొట్టేళ్లకు రూ.5లక్షలు, వంద గొర్రెలు, 25 పొట్టేళ్లకు రూ.50లక్షలు వంతున బ్యాంకులతో సంబంధం లేకుండా జిల్లా యూనియన్ల ద్వారా రుణాలు అందజేస్తున్నామన్నారు. టీడీపీ లీగల్ సెల్ మాజీ చైర్మన్ డాక్టర్ నర్రా వెంకటరమణమాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తరువాత గొర్రెలు, మేకల పెంపకం దారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ గంటా శ్రీరామ్, తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ ఆర్.సత్తిబాబు, డాక్టర్ నీలం శారద, బమ్మిడి అప్పలనాయుడు, జి.నరసింహమూర్తి పాల్గొన్నారు. -
ఐటీ యూనియన్లపై యూటర్న్
సాక్షి, బెంగళూర్: ఐటీ రంగంలో ఉద్యోగ సంఘాల ఏర్పాటుకు అనుమతించాలన్న యోచనను ప్రభుత్వం విరమించుకుంది. ఈ ఏడాది ఆరంభంలో పెద్దసంఖ్యలో సాఫ్ట్వేర్ పరిశ్రమలో లేఆఫ్‌లు చోటుచేసుకున్న క్రమంలో కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ కర్గే ఐటీలో ఉద్యోగ సంఘాలకు అనుమతిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. యూనియన్లను అనుమతించేందుకు ఐటీ-బీటీ చట్టానికి సవరణలు అవసరమని, ఈ సవరణలపై ఆందోళనలు నెలకొన్నాయని మంత్రి చెప్పారు. అయితే ఐటీ కంపెనీల్లో స్థబ్ధత వీడి పెద్ద ఎత్తున నియామకాలకు దిగుతుండటంతో యూనియన్లు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి లేదని భావిస్తున్నామని ఐటీ కార్యదర్శి గౌరవ్ గుప్తా చెప్పారు. ఇన్ఫోసిస్, విప్రో, గూగుల్ వంటి కంపెనీలు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ప్రారంభించడంతో ఉద్యోగావకాశాల విషయంలో పరిశ్రమలో సానుకూల వాతావరణం నెలకొందని అన్నారు. ప్రస్తుత ఉద్యోగులకు సైతం నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు కంపెనీలు శిక్షణ ఇస్తుండటం మంచి పరిణామమని చెప్పారు.మరోవైపు చెన్నై, పూణేల్లో ఐటీ యూనియన్లు కార్యకలాపాలు కొనసాగుతున్న క్రమంలో బెంగళూర్‌లోనూ ఐటీ యూనియన్ల ఏర్పాటుకు అనుమతించాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు. -
పాయ్ వ్యాఖ్యలు బాధాకరం
బెంగళూరు : ఐటీ పరిశ్రమ ప్రముఖుడు మోహన్ దాస్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగుల అసోసియేషన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఐటీలో ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేస్తున్న వారు, భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారివెంట ఉన్న వారెవ్వరికీ ఉద్యోగాలు రాబోవని మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించడం చాలా బాధకరమని పేర్కొంటున్నాయి. ఈ కామెంట్లు ఉద్యోగుల రాజ్యాంగ హక్కులకు బహిరంగ ముప్పుగా ఉన్నాయని ఆల్ ఇండియా ఐటీ ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ముఖ్విముద్దీన్ అన్నారు. ఐటీ కంపెనీలు అక్రమంగా చేపడుతున్న ఉద్యోగాల కోతపై తాము అంతర్జాతీయ కార్మిక సంస్ధ వద్దకు వెళ్తామని చెప్పారు. ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీకి మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్, హెచ్ఆర్ గా నిర్వర్తించిన పాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బెంగళూరు ఐటీ ఉద్యోగుల ఫోరమ్ రాజేష్ నటరాజన్ మండిపడ్డారు. ఐటీ పరిశ్రమలో ఉద్యోగ సంఘాలు ఏర్పాటుచేయాలనుకునేవారు, కొండంత ఉన్నదాన్ని గోరంత చేసి భయాందోళనలు సృష్టిస్తున్నారని, వారికెవరూ సపోర్టు చేయొద్దని, వారితో వెళ్లేవారికి ఉద్యోగాలు రావని మోహన్ దాస్ పాయ్ హెచ్చరించారు. ఇటీవల ఐటీ కంపెనీల్లో చోటు చేసుకున్న భారీ ఉద్యోగాల కోతతో, ఉద్యోగులు యూనియన్లను ఏర్పాటుచేసేందుకు సన్నద్దమవుతున్నారు. యూనియన్లు ఏర్పాటుచేసిన తమ సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. కంపెనీలు తమ రెవెన్యూలను కాపాడుకోవడానికి తమపై వేటు వేస్తున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. -
టెకీ ఉద్యోగ సంఘాలపై ఇన్ఫీ బాలకృష్ణన్
ఉద్యోగుల తొలగింపుతో ఆందోళనలో ఉన్న టెకీలు ఉద్యమ బాట పట్టడంపై ఐటీ పరిశ్రమ సీనియర్ స్పందించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని బాగా చూసుకుంటున్నపుడు ఐటీ కంపెనీల్లో యూనియన్ల అవసరం లేదని టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యుడు వి.బాలకృష్ణన్ తేల్చి చెప్పారు. అలాగే ఐటీ లో భారీ ఉద్యోగాల కోత అని వస్తున్న నివేదికలు కేవలం అతిశయోక్తి మాత్రమేనని కొట్టి పారేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన చెల్లింపుల విషయంలో తాము చాలా నైతికంగా వ్యవహరిస్తున్నామనీ ఇన్ఫీ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పిటిఐకి చెప్పారు. పనిపరిస్థితులు, జీత భత్యాలు అధికంగా ఉన్న ఐటీ పరిశ్రమలో అసలు ఉద్యోగ సంఘాల అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు, వారి హక్కుల పట్ల అస్తవ్యస్తంగా, అనైతికంగా వ్యవహరించే కంపెనీలకు తప్ప ఐటీ కంపెనీలకు ఉద్యోగ సంఘాలు అవసరం లేదని చెప్పారు. ఐటీలో సంక్షోభంలో ఉన్నపుడు యూనియన్లు పుట్టుకొస్తాయని, కానీ తర్వాత ఉనికిలోఉండవని పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో కూడా తీసివేతలు రెండంకెల్లోనే న్నాయన్నారు. కాబట్టి, ఐటీ పరిశ్రమలో యూనియన్ అవసరం లేదనీ , ఒకవేళ యూనియన్ ఉన్నా బాగా శ్రద్ధ తీసుకుంటున్నారని భావించడం లేదన్నారు. మిగిలిన వాటిల్లా ఐటి సాంప్రదాయ పరిశ్రమ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది పని అవకాశాలు కల్పిస్తూ భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రతిభ ఆధారంగా తొలగింపులు తప్ప, భారీ ఉద్యోగాల నష్టం అనేది అతిశయోక్తి తప్ప మరోకటి కాదని బాలకృష్ణన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 150 బిలియన్ డాలర్లతో ఐటీ సర్వీసుల పరిశ్రమ ఒకే స్థాయిలో వృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తోందనీ వచ్చే ఏడాది రెండింతలు పెరగవచ్చంటూ ఆయన కొత్త ఆశలురేకెత్తించారు. అంతేకాదు ఐటీలో అవకాశాలు చాలా పెద్దవిగా ఉన్నాయన్నారు. భారత్‌కు అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒకటిన్నర నుండి రెండు శాతం వద్ద పెరుగుతోందని బాలకృష్ణన్ తెలిపారు. -
మహిళా సంఘాలపై అసత్య ప్రచారం తగదు
గుంటూరు ఈస్ట్: రాజ్యహింసపై మహిళలను చైతన్యవంతుల్ని చేస్తున్న మహిళా సంఘాలపై ప్రచారంలో ఉన్న వ్యతిరేక వ్యాఖ్యాల్ని అందరూ ఖండించాలని చైతన్య మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి రాధ పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం మహిళలపై పెరుగతున్న హింస అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలను చైతన్య పరచడంలో ముందున్న సంఘాలపై అసత్య ప్రచారం చేస్తూ పోస్టర్లు కూడా వేయడం దారుణమన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రతిఘటించేందుకు వెనుకాడేది లేదన్నారు. కార్యవర్గ సభ్యులు సిపోర మాట్లాడుతూ.. ఆదివాసీలపై జరుగుతన్న అత్యాచారాలు, దాడుల గురించి తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లిన ప్రొఫెసర్లు అర్చన ప్రసాద్, నందినీ సుందర్, జర్నలిస్టు మాలిని సుబ్రహ్మణ్యంపై హత్యానేరం నమోదు చేయడం అన్యాయమన్నారు. ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు బి.శివపార్వతి మాట్లాడుతూ.. రాజ్యహింసను ఎదుర్కొనేందుకు మహిళలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులు రాజేశ్వరి, వివిధ ప్రజా సంఘాల నాయకులు సి.ప్రసాదరావు, పి.శ్రీనివాసులు ,కృష్ణ, చిరతనగండ్ల వాసు, బి.విజయ భాస్కరరావు, ఎం.జాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
సంఘాలను పటిష్టం చేద్దాం
గుంటూరు వెస్ట్ : స్వయం సహాయక సంఘాలు మరింత బలోపేతం కావడానికి కృషిచేయాల్సిన అవసరం ఉందని సెర్ప్ రాష్ట్ర డైరెక్టర్ (సంస్థాగత నిర్మాణం) ఉషారాణి చెప్పారు. సోమవారం జిల్లా సమాఖ్య కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉషారాణి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు పటిష్టం కావడం ద్వారానే స్త్రీనిధి నుంచి మరిన్ని రుణాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 2200 మంది స్వయం సహాయక సభ్యుల ఆధార్ సీడింగ్‌ను తక్షణమే పూర్తిచేయాలని సూచించారు. రాజధాని ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సంఘాలను పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఆర్డీఏ పీడీ హబీబ్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి బ్రిక్స్ తయారీ పనులను స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం గొప్ప అవకాశమన్నారు. వీటిని సక్రమంగా నిర్వహించడం ద్వారా సంఘాలు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ రాష్ట్ర అధికారులు రామకృష్ణ, మాధవీలత, డీఆర్డీఏ ఏపీడీ జి.నాగేశ్వరరావు, డీపీఎం అశోక్‌కుమార్, నారాయణ, శారదాంబ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కె.సౌభాగ్యం, ఏపీఎం సాంబశివరావు, జేడీఎం శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
సామర్ధ్యపరీక్షలు అంటే టీచర్లను అవమానించడమే
ట్రయినింగ్ నీడ్స్ ఐడెంటిఫికేషన్ టెస్టు (టీఎన్‌ఐటీ) పేరిట పనితీరు సామర్ధ్యాలను అంచనా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ తలపెట్టిన పరీక్షలపై టీచర్లనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని ప్రధాన సంఘాలనుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రకటనలు వెలువడుతున్నాయి. యూటీఎఫ్, పీఆర్టీయూ, ఎస్టీయూ సహ పలుసంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ బుధవారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. జాతీయ సర్వేలలో వెనుకబడ్డామని టీచర్లకు ఆన్లైన్ పరీక్ష పెట్టాలనుకోవడం సరికాదని యూటీఎఫ్ అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా సెక్షన్‌కు 60 మంది విద్యార్ధులను పెట్టి స్కూళ్లు నడుపుతూ సీసీఈ మోడల్ ప్రయోగాలు చేస్తూ ఇప్పుడు సర్వేల్లో వెనుకబడ్డామని టీచర్లను బాధ్యులను చేయడమేమిటన్నారు. ప్రభుత్వ లోపాన్ని టీచర్లపై నెట్టడానికే ఈ పరీక్షలన్నారు. ఇప్పటికే పలు సబ్జెక్టులకు, టీచర్లు లేరని, టెలికాన్ఫరెన్సు ద్వారా నిర్వహించే ట్రయినింగ్‌లతో ఫలితం లేదని చెప్పారు. అనేక మంది టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం అంతంతమాత్రమేనని, ఈ సమయంలో ఏకంగా ఆన్లైన్లో పరీక్ష పెట్టడం వారికి నష్టం కలిగిస్తుందన్నారు. పైగా రూ.300 చొప్పున ఫీజు వసూలు చేయడం దారుణమని పేర్కొన్నారు. పరీక్ష ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, బోధనా పద్ధతులపై నేరుగా శిక్షణ ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులు ఉపసంహరించాల్సిందే:ఎస్టీయూ టీచర్లకు పరీక్షలకోసం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని ఫ్యాప్టో నేతలు కత్తినర్సింహారెడ్డి, పాండురంగవరప్రసాదరావు, హృదయరాజు, నారాయణరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. టీచర్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలన్నదానికి కోట్లు ఖర్చు పెట్టి పరీక్ష నిర్వహించడం సరికాదన్నారు. ఆయా సబ్జెక్టు ప్రతినిధులతో, టీచర్లతో వెబ్సైట్ ద్వారా అభిప్రాయాలు తీసుకొని శిక్షణాంశాలను నిర్ధారించవచ్చని సూచించారు. రూ.300 ఫీజు సరికాదన్నారు. పరీక్షల పేరుతో టీచర్లకు శిక్ష వేయడాన్ని వ్యతిరేకిస్తామన్నారు. ముందు ఖాళీగా ఉన్న వేలాదిపోస్టులను భర్తీచేయాలని, పర్యవేక్షణాధికారులను నియమించడంతోపాటు డీఈడీ, బీఈడీ శిక్షణను పటిష్టంచేయాలని సూచించారు. టీచర్లకు మళ్లీ పరీక్షా? టెట్, డీఎస్సీ ద్వారా నియమితులైన టీచర్లకు ప్రతి ఏటా నూతన విద్యావిధానాలపై శిక్షణ ఇస్తున్నారని, ఈ తరుణంలో టీఎన్‌ఐటీ పేరిట పరీక్ష పెట్టడం సరికాదని, వ్యతిరేకిస్తున్నామని పీఆర్టీయూ నేతలు కమలాకర్‌రావు, శ్రీనివాసరాజులు పేర్కొన్నారు. పరీక్షలంటూ టీచర్ల మనోభావాలు దెబ్బతీసేలా ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీలు శ్రీనివాసులు నాయుడు, బచ్చలపుల్లయ్యలతో పాటు తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆధిపత్య పోరే ప్రాణం తీసింది
ప్రొద్దుటూరు: ఒక యూనియన్‌పై మరో యూనియన్ ఆధిపత్యం చేయాలనే ఒకే ఒక కారణం.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆర్టీసీ యాజమాన్యం సకాలంలో స్పందించక పోవడం.. పోలీసుల వ్యవహారం కూడా ఇందుకు పరోక్షంగా కారణమయ్యాయని కార్మికులు మండిపడుతున్నారు. యూనియన్లు ఉండేది కార్మికుల సంక్షేమం, వారికి న్యాయం చేసేందుకే తప్ప ఆధిపత్యం చూపించుకోవడానికి కాదని వారు అంటున్నారు. చిన్న సంఘటన జరిగినప్పుడే డిపో అధికారులు స్పందించి.. కఠినంగా హెచ్చరించి ఉంటే ఈ వ్యవహారం ప్రాణాలు తీసుకునేంత వరకు వచ్చేది కాదు. ఏ సంఘటన జరిగినా సస్పెండ్ చేస్తామన్న ఉన్నతాధికారుల మాటలు తప్ప.. ఏం జరిగిందో విచారణ చేసి వాస్తవాలు తెలుసుకోలేక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తననే కొట్టి.. తన పైనే కేసు పెట్టడంతో మనస్తాపం ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో గ్యారేజీలో శ్రామిక్ కొండారెడ్డి శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం కొండారెడ్డి, మెకానిక్ రామచంద్రుడు మధ్య మాటకుమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. కొండారెడ్డిని రామచంద్రుడు చెప్పుతో కొట్టగా... కొండారెడ్డి రామచండ్రుడి పైకి టైర్ రింగ్ విసిరాడు. ఈ ఘటనలో రామచంద్రుడికి స్వల్ప గాయమైంది. కొండారెడ్డి దాడి చేశాడంటూ రామచంద్రుడు పోలీస్‌స్టేçÙన్లో కేసు పెట్టారు. తనను చెప్పుతో కొట్టాడని కొండారెడ్డి పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. అక్కడి ఎస్ఐ పట్టించుకోలేదు. అసలు ఈ విషయం పోలీస్‌స్టేçÙన్ వరకు వెళ్లడాన్ని ఆర్టీసీ అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. షెడ్లో 40 మందికి పైగా కార్మికులు గొడవ జరిగిన సమయంలో గ్యారేజిలో 40 మందికిపై కార్మికులు విధుల్లో ఉన్నారు. అయితే జరిగిన వాస్తవాన్ని అక్కడ ఉన్న కార్మికులు ఎవరూ పోలీసులకు చెప్పలేదు. పైగా కొండారెడ్డే దాడి చేశాడని రామచంద్రుడికి ఒత్తాసుగా కొందరు కార్మికులు పోలీసులకు చెప్పారు. దీంతో కొండారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనను కొట్టి, మళ్లీ తనపై కేసు పెట్టడంలో ఒక యూనియన్ నాయకులు వ్యవహరించిన తీరు... తాను ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు తిరష్కరించిన విషయం కొండారెడ్డి ప్రాణం పోయేందుకు కారణమయ్యాయి. ఆయన గ్యారేజి ఆవరణలో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకున్న సంఘటనను ఎవరూ చూడ లేదని అధికారులు చెబుతున్నారు. 40 మందికి పైగా పని చేసే బహిరంగ ప్రదేశంలో ఎవరూ చూడకుండా ఎందుకు ఉంటారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆర్టీసీ యాజమాన్యంతోపాటు యూనియన్లు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
జెడ్పీ స్థాయి సంఘాల ఎన్నికఏకగ్రీవం
జిల్లా పరిషత్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఉన్న సభ్యుల బలాబలాలను బట్టి స్థాయి సంఘాల ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని అందరూ భావించారు. కానీ.. ఇందుకు భిన్నంగా సాఫీగా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం ఏడు స్థాయి సంఘాలకు సంబంధించి చైర్మన్లతోపాటు కమిటీ సభ్యులను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియపై జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన చర్చ ప్రారంభం కాగా... జెడ్పీటీసీ సభ్యులు ఏకగ్రీవానికి ఒప్పుకోవడంతో పది నిమిషాల్లో ముగిసింది. మిగిలిన తంతు, బాధ్యతల స్వీకరణ మధ్యాహ్నం 3 గంటలకు వరకు కొనసాగింది. సాక్షి, హన్మకొండ : జిల్లా పరిషత్ స్థాయి సంఘాల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఏడు స్థాయి సంఘాలకు సంబంధించి చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11:00 గంటలకు మొదలైన ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 3:00 గంటలకు వరకు కొనసాగింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ, డిప్యూటీ సీఎం రాజయ్య, ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాంనాయక్, ఎమ్మెల్సీలు బోడ కుంటి వెంకటేశ్వర్లు, నాగపురి రాజలింగం, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, అరూరి రమేష్, ఫ్లోర్ లీడర్లు సకినాల శోభన్, మూలగుండ్ల వెంకన్న, లేతాకుల సంజీవరెడ్డి, కోఆప్టెడ్ సభ్యులు ఇబ్రహీం, నభీ, ఇన్చార్జ్ సీఈవో వాసం వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఈఓ రమాదేవి, సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, సునీత, కృష్ణమూర్తి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. చైర్‌పర్సన్‌కే అధికారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ్య సమావేశం మొదలైంది. సమావేశం ప్రారంభం కాగానే స్థాయి సంఘాల ఎన్నికల సందర్భంగా కమిటీల్లో ప్రాతినిధ్యం కోసం జెడ్పీటీసీలు తమ నామినేషన్లు దాఖలు చేయాలని చైర్పర్సన్ పద్మ కోరారు. వెంటనే టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్ మాట్లాడుతూ స్థాయి సంఘాల్లో సభ్యులకు అవకాశం కల్పించే అధికారం జెడ్పీ చైర్‌పర్సన్‌కు అప్పగిస్తున్నట్లు తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనిని కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ మూలగుండ్ల వెంకన్న, టీడీపీకి చెందిన వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ బలపరిచారు. ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభించడంతో ఈ తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చైర్పర్సన్ పద్మ ప్రకటించారు. దీంతో సమావేశం ముగిసింది. అనంతరం చైర్పర్సన్ చాంబర్లో నామినేషన్లు స్వీకరించారు. రెండు గంటల పాటు పార్టీ ఫ్లోర్ లీడర్లు, వైస్ చైర్మన్ చర్చించడంతో అన్ని కమిటీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రతి స్థాయి సంఘానికి అవసరమైన సంఖ్యలో నామినేషన్లు రావడంతో అభ్యర్థులంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్పర్సన్ ప్రకటించారు.