బజాజ్ ఆటోను వణికిస్తున్న కరోనా | Bajaj Auto Waluj Plant After 400 Covid Cases Detected | Sakshi
Sakshi News home page

బజాజ్ ఆటోను వణికిస్తున్న కరోనా

Published Tue, Jul 7 2020 5:11 PM | Last Updated on Tue, Jul 7 2020 7:44 PM

Bajaj Auto Waluj Plant After 400 Covid Cases Detected - Sakshi

సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కల్లోలంతో ఆటో దిగ్గజం బజాజ్ ఆటో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కంపెనీకి సంబంధించిన ముంబై వాలూజ్ ప్లాంట్‌లో కోవిడ్‌ కేసులు తాజాగా 400కు పెరిగాయి. దీంతో కార్మికులు ప్లాంట్‌కు వచ్చేందుకు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్‌ ను తాత్కాలికంగా మూసివేయాలనే డిమాండ్ ఊపందుకుంది.

కోవిడ్-19 కేసుల సంఖ్య పెరిగినందున,  వైరస్ సైకిల్ ను  విచ్ఛిన్నం చేయడానికి ఎనిమిది నుంచి 10 రోజులు ప్లాంట్‌లో పని నిలిపివేయాలని కోరుతున్నామని బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెంగడే బాజీరావ్ తెలిపారు. దీనికి సంబంధించి మళ్ళీ మేనేజ్‌మెంట్‌తో చర్చిస్తామనీ, మధ్యవర్తిత్వం వహించడానికి ప్రభుత్వ అధికారులను కూడా సంప్రదించనున్నామని చెప్పారు. అవసరమైతే ఉత్పత్తి నష్టాన్ని భర్తీ చేసేందుకు అదనపు గంటలు కేటాయించమని కోరినట్లు వర్కర్స్‌ యూనియన్‌ తెలిపింది.  అయితే దీనిపై బజాజ్‌ యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.  (కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన)

కాగా ప్రస్తుతం బజాజ్‌ ఆటోకు 3 ఉత్పత్తి ప్లాంట్‌లు ఉన్నాయి. మహారాష్ట్రలోని వాలూజ్‌, చకన్‌ వద్ద రెండు ప్లాంట్‌లు ఉండగా, ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌ వద్ద మరో ప్లాంట్‌ ఉంది. డిస్కవర్‌, ప్లాటినా, సిటీ 100, బాక్సర్‌ 150తో పాటు త్రిచక్ర వాహనాలను కంపెనీ వాలూజ్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. 8,100 మందికి పైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటివరకు బజాజ్ ఆటో కార్మికులు ఏడుగురు చనిపోయారు. (కరోనా : శుభవార్త చెప్పిన మైలాన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement