
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి చికిత్సలో డా.రెడ్డీస్‌తో కలిసి అభివృద్ధి చేసిన 2-డీజీ ఉత్పత్తికి సంబంధించి డీఆర్‌డీవో కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ డ్రగ్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేలా తమ సాంకేతిక పరిజ్ఞానాన్నిఇతర ఔషధ సంస్థలకు బదిలీ చేయనుంది. ఇందుకు కంపెనీలనుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ (ఈఓఐ)ను ఆహ్వానిస్తోంది. ఈమెయిల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని కోరింది. ఆయా కంపెనీలు దరఖాస్తులను సమర్పించడానికి జూన్ 17 చివరి తేదీగా వెల్లడించింది. పరిశ్రమలు సమర్పించిన ఈఓఐను తమ టెక్నికల్ అసెస్‌మెంట్ కమిటీ పరిశీలిస్తుందని వీటి ఆధారంగా 15 పరిశ్రమలకు మాత్రమే ఉత్పత్తికి అనుమతి ఉంటుందని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్, సామర్ధ్యం, తమ సాంకేతిక హ్యాండ్‌హోల్డింగ్ సామర్ధ్యం ఆదారంగా కేటాయింపు ఉంటుందని డీఆర్‌డీవో ఒక ప్రకటనలో తెలిపింది.
క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా కరోనా నివారణలో తమ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2డీజీ) ఆసుపత్రులో చేరిన రోగులు వేగంగా కోలుకోవడానికి దోహదపడుతుందని, ఆక్సిజన్‌పై ఆదారపడటాన్ని కూడా తగ్గిస్తుందని డీఆర్‌డీవో గతంలోనే ప్రకటించినసంగతి తెలిసిందే. ఈ మందు తయారీకి బిడ్డర్లకు డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీలనుండి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్ (ఏపీఐ), డబ్ల్యూహెచ్‌ఓ జీఎమ్‌పి (మంచి తయారీ పద్ధతులు) ధృవీకరణ తయారీకి డ్రగ్ లైసెన్స్ ఉండాలి.
కాగా వినూత్నమైన పనితీరు కారణంగానే కరోనావైరస్‌ను 2డీజీ సమర్థంగా నిరోధించ గలుగుతోందని డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి చెప్పారు. ఈ మందు తయారీ, పంపిణీ సులువుగా ఉంటుందన్నారు. అలాగే కరోనా వైరస్ రూపాంతరాలపై కూడా తాము అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం సమర్థంగా పనిచేస్తుందని డీఆర్‌డీవోకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ నారాయణ్ భట్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment