bids
-
5జీ స్పెక్ట్రమ్ వేలం.. రూ.11వేల కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ వేలం మొదటి రోజున మంచి డిమాండ్ కనిపించింది. మంగళవారం మొత్తం ఐదు రౌండ్లలో టెలికం ఆపరేటర్లు రూ.11వేల కోట్ల మేర బిడ్లు దాఖలు చేశారు. రూ.96,238 కోట్ల విలువ చేసే 10,500 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచింది. 900, 1800, 2100, 2500 మెగాహెర్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ కోసం ఆపరేటర్లు ఆసక్తి చూపించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వేలంలో పాల్గొన్నాయి.అత్యధికంగా రిలయన్స్ జియో రూ.3,000 కోట్లను ముందస్తుగా డిపాజిట్ చేసింది. దీంతో ఎక్కువ స్పెక్ట్రమ్ కోసం రిలయన్స్ పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. భారతీ ఎయిర్టెల్ రూ.1,050 కోట్లను, వొడాఫోన్ రూ.300 కోట్ల చొప్పున డిపాజిట్ చేశాయి. 2010లో ఆన్లైన్లో బిడ్డింగ్ మొదలైన తర్వాత ఇది పదో విడత స్పెక్ట్రమ్ వేలం కావడం గమనార్హం. కేంద్ర సర్కారు చివరిగా 2022 ఆగస్ట్‌లో వేలం నిర్వహించింది. వేలం బుధవారం తిరిగి ప్రారంభమవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
బొగ్గు గనుల కోసం పోటా పోటీ
న్యూఢిల్లీ: బొగ్గు గనుల వేలానికి భారీ స్పందన కనిపించింది. ఏడో విడత బొగ్గు గనుల వేలంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 103 బ్లాకులను ఆఫర్ చేసింది. 18 బొగ్గు గనులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ కలసి 35 బిడ్లు దాఖలైనట్టు బొగ్గు శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి టెక్నికల్ బిడ్లను బుధవారం తెరిచారు. ఎన్టీపీసీ, ఎన్ఎల్సీ ఇండియా, జేఎస్పీఎల్ తదితర 22 కంపెనీలు వేలంలో పోటీ పడుతున్నాయి. 18 బొగ్గు గనుల్లో 9 పాక్షికంగా బొగ్గు అన్వేషించినవి. మిగిలిన గనుల్లో అన్వేషణ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిర్వహించారు. వీటి ద్వారా ఏటా 51.80 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయవచ్చు. 17 నాన్ కోకింగ్ కోల్ కాగా, ఒకటి కోకింగ్ కోల్‌మైన్. జేఎస్పీఎల్, ఎన్ఎల్సీ ఇండియా, బజ్రంగ్ పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జీఎండీసీ), బుల్ మైనింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఒక్కోటీ మూడు బ్లాకులకు బిడ్లు వేశాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ మైనింగ్, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ ఒక్కోటీ రెండు కోల్ బ్లాక్‌ల కోసం పోటీ పడుతున్నాయి. నల్వా స్టీల్ అండ్ పవర్, నువోకో విస్టాస్ కార్ప్, ఒడిశా కోల్ అండ్ పవర్ తదితర 14 కంపెనీలు ఒక్కో బ్లాక్ కోసం బిడ్లు దాఖలు చేశాయి. -
వెనక్కి తగ్గిన ప్రభుత్వం!.. ‘విశాఖ ఉక్కు’కు తెలంగాణ దూరం
సాక్షి, హైదరాబాద్: సంస్థ నిర్వహణకు అవసరమైన మూలధనం సమీకరణ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమ జారీ చేసిన ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనలేదు. గురువారంతో ఈఓఐ ప్రక్రియ గడువు ముగిసిపోగా, సింగరేణి బొగ్గు గనుల సంస్థ గానీ మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖ/సంస్థ గానీ బిడ్ దాఖలు చేయలేదు. ఈఓఐలో అవకాశం చేజిక్కించుకుంటే సంస్థ పెట్టాల్సిన పెట్టుబడులు, ఇతర అంశాలను సింగరేణి డైరెక్టర్ల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. నిర్వహణ మూలధనంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు ఏడాదికి రూ.3,500 కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు అందించాల్సి ఉంటుందని తేల్చినట్టు సమాచారం. అయితే సింగరేణి సంస్థ వద్ద బాండ్లు, డిపాజిట్ల రూపంలో నిధులున్నా, నగదు రూపం (లిక్విడ్ రిజర్వ్స్)లో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే నిధులు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే ఇది ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం ఉండటంతో సర్కారు వెనక్కి తగ్గినట్టు సమాచారం. మరోవైపు సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలుండడం, ఈఓఐ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతోనూ బిడ్డింగ్‌కి దూరంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది. కాగా బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడానికి కారణాలను రాష్ట్ర ప్రభుత్వం/సింగరేణి యాజమాన్యం వెల్లడించలేదు. స్టీల్‌ప్లాంట్ ఈఓఐకు 29 బిడ్లు ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ప్రతిపాదించిన ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ప్రక్రియ గడువు గురువారం ముగిసింది. మొత్తం 29 బిడ్లు దాఖలైనట్లు సమాచారం. మార్చి 27న బిడ్లు ఆహ్వానించగా తొలి గడువు ఏప్రిల్ 15 నాటికి 22 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. మరికొన్ని సంస్థల విజ్ఞప్తి మేరకు గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. -
వందే భారత్ రైళ్ల తయారీకై మేధా సర్వో బిడ్
న్యూఢిల్లీ: అల్యూమినియం బాడీతో 100 వందే భారత్ రైళ్ల తయారీకై హైదరాబాద్ కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్ బిడ్ దాఖలు చేసింది. స్విస్ కంపెనీ స్టాడ్లర్‌తో కలిసి ఈ కంపెనీ బిడ్ సమర్పించింది. అలాగే ఫ్రెంచ్ సంస్థ ఆల్స్టమ్ సైతం పోటీపడుతోంది. కాంట్రాక్టు విలువ రూ.30,000 కోట్లు. 100 రైళ్ల తయారీతోపాటు 35 ఏళ్ల పాటు వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. రైళ్ల డెలివరీ కాగానే రూ.13,000 కోట్లు, మిగిలిన మొత్తం 35 ఏళ్ల తర్వాత అందుకుంటాయి. గురువారం ఇరు సంస్థలు సమర్పించిన టెక్నికల్ బిడ్స్‌ను మూల్యాంకనం చేసి విజేతను నిర్ణయించేందుకు ఫైనాన్షియల్ బిడ్స్‌ను కోరతారు. 2024 తొలి త్రైమాసికంలో స్లీపర్ క్లాస్‌తో కూడిన వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వేస్ లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటి వరకు 102 రైళ్ల తయారీ కోసం అప్పగించిన కాంట్రాక్టులు అన్నీ కూడా చైర్ కార్ వర్షన్ కావడం గమనార్హం. ప్రస్తుతం 10 రైళ్లు పరుగెడుతున్నాయి. 200 స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లకై గతేడాది బిడ్లు దాఖలయ్యాయి. -
ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలుకి బిడ్స్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలుకి పలు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ప్రాథమిక) బిడ్స్ దాఖలయ్యాయి. ప్రభుత్వం వ్యూహాత్మకంగా చేపట్టిన వాటా విక్రయానికి పలు కంపెనీలు ఆసక్తిని చూపినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ ద్వారా వెల్లడించారు. బ్యాంకులో అటు ప్రభుత్వం, ఇటు ఎల్ఐసీ సంయుక్తంగా 60.72 శాతం వాటాను విక్రయించనున్నాయి. ఇందుకు అక్టోబర్‌లోనే ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌కు ఆహ్వానం పలికాయి. వీటికి ఈ నెల 7న గడువు ముగిసింది. తొలి దశ ముగియడంతో రెండో దశలో భాగంగా బిడ్డర్లు సాధ్యా సాధ్యాలను పరిశీలించాక ఫైనాన్షియల్ బిడ్స్‌ను దాఖలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం, ఎల్ఐసీలకు సంయుక్తంగా 94.71 శాతం వాటా ఉంది. విజయ వంతమైన బిడ్డర్ సాధారణ వాటాదారుల నుంచి మరో 5.28 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుంది. కాగా.. కనీసం రూ. 22,500 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండటంతోపాటు.. ఐదేళ్లలో మూడేళ్లు లాభాలు ఆర్జించి ఉంటేనే బ్యాంకులో వాటా కొనుగోలుకి బిడ్ చేసేందుకు అర్హత ఉంటుందటూ గతంలోనే దీపమ్ తెలియజేసింది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
ఫ్యూచర్ రిటైల్‌కు బిడ్స్ దాఖలు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఫ్యూచర్ రిటైల్ పట్ల ఆసక్తి కలిగిన సంస్థలు బిడ్లు దాఖలు చేసేందుకు మరో రెండు వారాల గడువు లభించింది. వాస్తవానికి ఈ గడువు అక్టోబర్ 20నే ముగిసిపోవాలి. భారీ రుణ భారంతో ఉన్న ఫ్యూచర్ రిటైల్ బిడ్ల దాఖలు గడువును నవంబర్ 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ నెల 20 నాటికి బిడ్లు దాఖలు చేసిన సంస్థలు, సవరించిన బిడ్‌ను కూడా తిరిగి సమర్పించొచ్చని తెలియజేసింది. కనీసం రూ.100 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉండాలని, నిర్వహణ ఆస్తులు లేదా పెట్టుబడులు పెట్టేందుకు రూ.250 కోట్లు ఉండాలన్న షరతులను రిజల్యూషన్ ప్రొఫెషనల్ విధించారు. ఫ్యూచర్ రిటైల్‌కు సంబంధించి సెప్టెంబర్ 2 నాటికి రూ.21,433 కోట్ల బకాయిల మేరకు క్లెయిమ్‌లు దాఖలు కావడం గమనార్హం. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
షిప్పింగ్ కార్ప్ విక్రయానికి సిద్దమవుతున్న రంగం: త్వరలోనే బిడ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ) ప్రయివేటీకరణకు ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఆహ్వానించే వీలుంది. ఇందుకు వీలుగా ప్రభుత్వం కంపెనీకి చెందిన కీలకంకాని, భూమి సంబంధ ఆస్తుల విడదీతను ప్రారంభించింది కూడా. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. రానున్న మూడు నెలల్లోగా పూర్తికావచ్చని అంచనా వేశారు. దీంతో జనవరి-మార్చి(క్యూ4)కల్లా అర్హతగల కంపెనీల నుంచి ఫైనాన్షియల్ బిడ్స్‌కు ఆహ్వానం పలికే వీలున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే నెలలో కీలకంకాని ఆస్తుల విడదీతకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా షిప్పింగ్ హౌస్, ముంబై, మ్యారిటైమ్ ట్రయినింగ్ ఇన్స్టిట్యూట్, పోవైసహా ఎస్సీఐ ల్యాండ్ అండ్ అసెట్స్ లిమిటెడ్(ఎస్‌సీఐఎల్‌ఏఎల్)ను విడదీయనుంది. తద్వారా ఎస్‌సీఐఎల్‌ఏఎల్ పేరుతో విడిగా కంపెనీ ఏర్పాటుకు తెరతీయనుంది. -
71% అమ్ముడైన స్పెక్ట్రం
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలంలో నాలుగో రోజు (శుక్రవారం) ముగిసే నాటికి రూ. 1,49,855 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలయ్యాయి. కొత్తగా రూ. 231.6 కోట్ల బిడ్లు వచ్చాయి. వేలానికి ఉంచిన మొత్తం స్పెక్ట్రంలో ఇప్పటివరకూ 71 శాతం అమ్ముడైనట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నాలుగో రోజైన శుక్రవారం మరో ఏడు రౌండ్లు జరిగాయని, దీంతో మొత్తం రౌండ్ల సంఖ్య 23కి చేరినట్లు వివరించారు. అయిదో రోజైన శనివారం కూడా వేలం కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టెలికం పరిశ్రమ వృద్ధి తీరుతెన్నులపై చర్చించేందుకు పీఈ ఫండ్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్వెస్టర్లు, బ్యాంకులతో మంత్రి శనివారం ముంబైలో భేటీ కానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
అద్దె బస్సులొస్తున్నాయ్!
సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికుల అవసరాలు, అవస్థలు తీర్చడానికి అద్దె బస్సులొస్తున్నాయి. రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాలకు ఇవి నడవనున్నాయి. ఆర్టీసీ విశాఖపట్నం రీజియన్‌లో కొత్తగా 83 అద్దె బస్సులు నడపడానికి అనుమతులు లభించాయి. దీంతో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండి, బస్సు సరీ్వసులు తక్కువగా ఉన్న రూట్లను గుర్తించారు. విశాఖతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నంల నుంచి కూడా వివిధ ప్రాంతాలకు వీటిని నడపనున్నారు. అంతేకాదు చాన్నాళ్ల నుంచి విశాఖ నుంచి కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఇచ్ఛాపురం, పాలకొండ, సోంపేట, మందస వంటి దూర ప్రాంతాలకు బస్సుల డిమాండ్ ఉంది. బస్సుల కొరతతో సరిపడినన్ని సరీ్వసులను నడపలేక పోతున్నారు. ఇప్పుడు ఈ రూట్లలోనూ అద్దె బస్సులను నడిపి ప్రయాణికుల అవసరాలను తీర్చనున్నారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు అధికం ఈ అద్దె బస్సుల్లో అత్యధికంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. మొత్తం 83 అద్దె బస్సులకు గాను 39 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, 12 పల్లెవెలుగు,తొమ్మిది సిటీ ఆర్డినరీ, ఎనిమిది సూపర్ లగ్జరీ, ఎనిమిది ఎక్స్‌ప్రెస్, ఏడు అల్ట్రా డీలక్స్ సర్వీసులు. పల్లె వెలుగు సర్వీసులను అనకాపల్లి– నర్సీపట్నం–అనకాపల్లి, అనకాపల్లి–విజయనగరం, నర్సీపట్నం–చోడవరంల మధ్య నడుపుతారు. మెట్రోలను విశాఖ నుంచి విజయనగరం, చోడవరం, కొత్తవలస, భీమిలి, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి తదితర రూట్లకు, సూపర్ లగ్జరీలను విశాఖ నుంచి అమలాపురం, కాకినాడలకు, అల్ట్రా డీలక్స్‌లను రాజమండ్రి, ఇచ్ఛాపురం, పాలకొండలకు తిప్పుతారు. సిటీ ఆర్డినరీ సర్వీసులను ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి యలమంచిలి, దువ్వాడ రైల్వే స్టేషన్, సింథియా నుంచి సింహాచలంలకు కేటాయించారు. మూడు నెలల్లో రోడ్లపైకి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సుల కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. నెలాఖరుకల్లా వీటిని ఖరారు చేయనున్నారు. టెండర్లు ఖాయమయ్యాక అద్దె బస్సుల యజమానులకు మూడు నెలల గడువిస్తారు. ఆర్టీసీ యాజమాన్యం అధీకృత బాడీ బిల్డింగ్ యూనిట్లలో మాత్రమే ఈ బస్సులను తయారు చేయాల్సి ఉంటుంది. అద్దె బస్సులు అందుబాటులోకి వస్తే రద్దీ ఉన్న రూట్లలో బస్సుల కొరత తీరి ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు. -
అమ్మకానికి కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థ వాటా, కొనుగోలు రేసులో మేఘా ఇంజినీరింగ్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీఈఎంఎల్లో 26 శాతం వాటా కొనుగోలుకు సంబంధించి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్), టాటా మోటర్స్, అశోక్ లేల్యాండ్, భారత్ ఫోర్జ్ తదితర సంస్థలు షార్ట్‌లిస్ట్ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా వాటితో పాటు ఈ నాలుగు సంస్థలు.. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) సమర్పించాయి. వీటికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) డాక్యుమెంట్‌ను జారీ చేయడం సహా బీఈఎంఎల్ డేటా రూమ్, ఉత్పత్తి కేంద్రాలను సందర్శించేందుకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. చైనా, పాకిస్తాన్‌తో వ్యాపార సంబంధాలేమైనా ఉంటే వెల్లడించాలంటూ కూడా ఆయా సంస్థలకు సూచించినట్లు పేర్కొన్నాయి. పృథ్వీ మిసైల్ లాంచర్ వంటి మిలిటరీ హార్డ్‌వేర్‌ను తయారు చేసే బీఈఎంఎల్ రక్షణ..ఏరోస్పేస్, మైనింగ్.. నిర్మాణం, రైల్..మెట్రో వంటి మూడు ప్రధాన విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల్లో తొమ్మిది ప్లాంట్లు ఉన్నాయి. బీఈఎంఎల్లో కేంద్రానికి 54 శాతం వాటాలు ఉన్నాయి. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఇందులో కొంత భాగాన్ని విక్రయించడంతో పాటు యాజమాన్య హక్కులను కూడా బదలాయించే ఉద్దేశ్యంతో జనవరి 4న ప్రభుత్వం ఈవోఐలను ఆహ్వానించింది. ఈవోఐలను సమర్పించేందుకు మార్చి 1 ఆఖరు తేదీగా ముందు ప్రకటించినా ఆ తర్వాత దాన్ని 22 వరకూ పొడిగించారు. నీలాచల్ ఇస్పాత్ నిగమ్ కొనుగోలుకు సంబంధించి కూడా షార్ట్‌లిస్ట్ అయిన సంస్థల్లో ఎంఈఐఎల్ ఉంది. -
కేజీ బ్లాకులో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ కేజీ బేసిన్‌లోని గ్యాస్ బ్లాకులో వాటాను విదేశీ సంస్థలకు విక్రయించనుంది. సముద్ర అంతర్భాగంలో అత్యధిక పీడనం, అధిక టెంపరేచర్‌గల ఈ బ్లాకులో వాటాను గ్లోబల్ సంస్థలకు ఆఫర్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు టెండర్లకు తెరతీసింది. సవాళ్లతో కూడిన ఈ గ్యాస్ డిస్కవరీ నుంచి ఉత్పత్తిని చేపట్టేందుకు వీలుగా సాంకేతికత, ఆర్థిక సామర్థ్యంగల సంస్థల కోసం చూస్తోంది. ఈ బాటలో గ్లోబల్ దిగ్గజాలకు ఆహ్వానం పలుకుతోంది. దీన్ దయాళ్ వెస్ట్(డీడీడబ్ల్యూ) బ్లాకుతోపాటు కేజీ–డీ5 ప్రాంతంలోని క్లస్టర్–3లో అత్యంత లోతైన డిస్కవరీల నుంచి గ్యాస్‌ను వెలికితీసేందుకు భాగస్వామ్యం కోసం ప్రాథమిక టెండర్లను ప్రకటించింది. వచ్చే నెల(జూన్) 16కల్లా ఆసక్తిగల సంస్థలు తమ సంసిద్ధత(ఈవోఐ)ను వ్యక్తం చేస్తూ బిడ్స్‌ను దాఖలు చేయవలసిందిగా ఆహ్వానించింది. భాగస్వాములపై కన్ను: కేజీ–55 బ్లాకులోని యూడీ–1 డిస్కవరీలో గ్యాస్ నిల్వలను కనుగొన్న ఓఎన్జీసీ 2017 ఆగస్ట్‌లో 80 శాతం వాటాను సొంతం చేసుకుంది. గుజరాత్ ప్రభుత్వ కంపెనీ జీఎస్పీసీ నుంచి ఈ వాటాను రూ. 7,738 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మరోవైపు యూడీ డిస్కవరీ అభివృద్ధి విషయంలో కంపెనీకి అవసరమైన నైపుణ్యం, సాంకేతికత లేకపోవడంతో అత్య ధిక ఒత్తిడి, టెంపరేచర్‌గల డీడీడబ్ల్యూ బ్లాకులోనూ తగినస్థాయిలో విజయవంతం కాలేకపోయింది. ఓఎన్జీసీ రూ.31,000 కోట్ల పెట్టుబడులు ఇంధన రంగంలో దేశ అవసరాలను మరింతగా తీర్చే లక్ష్యంతో రానున్న మూడేళ్లలో రూ.31,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఓఎన్జీసీ ప్రకటించింది. భవిష్యత్తు ఉత్పత్తి విధానానికి గురువారం ఓఎన్జీసీ బోర్డు ఆమోదం తెలిపింది. చమురు, గ్యాస్ వెలికితతకు సంబంధించి సమగ్రమైన కార్యాచరణను సంస్థ రూపొందించింది. -
రుణ సంక్షోభంలో రిలయన్స్ క్యాపిటల్,కొనుగోలు రేసులో టాటా!
న్యూఢిల్లీ:రుణ సంక్షోభంలో చిక్కుకున్ను రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి పలు దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. అదానీ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ లంబార్డ్, టాటా ఏఐజీ, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర 54 కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ నియమిత పాలనాధికారి బిడ్స్ దాఖలుకు గడువును ఈ నెల 11 నుంచి 25కు పెంచారు. కాగా.. రేసులో మరికొన్ని కంపెనీలు నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. జాబితాలో యస్ బ్యాంక్, బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్, ఓక్ట్రీ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్, బ్రూక్‌ఫీల్డ్, టీపీజీ, కేకేఆర్, పిరమల్ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్ తదితరాలను ప్రస్తావించాయి. చెల్లింపుల వైఫల్యం, పాలనా సంబంధ సమస్యలతో రిజర్వ్ బ్యాంక్ గతేడాది నవంబర్ 29న రిలయన్స్ క్యాపిటల్ బోర్డును రద్దు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి దివాలా చట్టం ప్రకారం చర్యలు చేపట్టింది. చదవండి: ఆ రెండు కంపెనీల నుంచి అనిల్ అంబానీ ఔట్ -
అమ్మకానికి ఎయిరిండియా.. దక్కించుకునేది ఎవరు ?
పెట్టుబడుల ఉపసంహార కార్యక్రమాన్ని వేగవంతం చేసింది ఎన్డీఏ సర్కారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా అమ్మకానికి మరోసారి రంగం సిద్ధం చేసింది. నేటితో ఆఖరు ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా నిర్వాహణపరమైన లోపాలతో నష్టాల పాలైంది. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా నష్టాలు రూ. 43,000 కోట్లుగా తేలాయి. దీంతో ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఆసక్తి ఉన్న కంపెనీలు బిడ్ దాఖలు చేసేందుకు 2021 సెప్టెంబరు 15 చివరి తేదీగా నిర్ణయించింది. ఇకపై గడువు పెంచబోమంటూ ఏవియేషన్ మినిష్టర్ జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. రెండోసారి ఎయిర్ ఇండియాను 2018లోనే కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఎయిర్ ఇండియాలో కనీసం 76 శాతం వాటాను కొనుగోలు చేయాలని షరతు విధించింది. అయితే ఏ ఒక్క కంపెనీ కేంద్రం విధించిన షరతులు అనుసరించి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దీంతో రెండో సారి ఎయిర్ ఇండియా కొనుగోలుకు సంబంధించి బిడ్లను కేంద్రం ఆహ్వానించింది. ఈసారి ఒకే సంస్థ కాకుండా రెండు సంస్థలు కలిసి బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చంటూ కొంత వెసులుబాటు కల్పించింది. అదే విధంగా వంద శాతం వాటాలను విక్రయించాలని కూడా నిర్ణయించింది. బరిలో ఎవరు ? ఎయిర్ ఇండియా కొనుగోలుకు సంబంధించి చివరి తేది వరకు కూడా పెద్దగా కంపెనీలు ఆసక్తి చూపించలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు టాటా గ్రూపుతో పాటు స్పైస్ జెట్ సంస్థలు ఎయిర్ఇండియా కొనుగోలకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా బిడ్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎయిర్ ఇండియా భారీగా నష్టాల పాలైనప్పటికీ వేల కొట్ల విలువ చేసే ఆస్తులు ఆ సంస్థకి ఉన్నాయి. ముంబై, ఢిల్లీలలో నగరం నడిబొడ్డున ఎకరాల కొద్ది స్థలం అందుబాటులో ఉంది. దీనికి తోడు దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లో సిబ్బంది క్వార్టర్స్ రూపంలో కూడా ఆస్తులు ఎయిర్ ఇండియా పేరిట ఉన్నాయి. విదేశాల్లో సైతం ఎయిర్ఇండియాకు అనేక ఆస్తులు ఉన్నాయి. చదవండి : డిసెంబరే టార్గెట్.. ఎయిరిండియాను అమ్మేయడానికే -
ఎల్ఐసీ ఐపీవోకు న్యాయ సంస్థల సేవలు కావాలి
న్యూఢిల్లీ: ఎల్ఐసీ భారీ ఐపీవో విషయంలో న్యాయసేవలు అందించే సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. న్యాయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించడం ఇది రెండో పర్యాయం కావడం గమనార్హం. తొలుత జూలై 15న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ/ప్రతిపాదనలు) విడుదల చేసి ఆగస్ట్ 6వరకు గడువు ఇచి్చంది. తగినంత స్పందన రాకపోవడంతో పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) మరో విడత న్యాయ సేవల సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలకు ఆహా్వనం పలుకుతూ గురువారం ఆర్ఎఫ్పీని విడుదల చేసింది. మొదటి విడత తగినంత స్పందన రాలేదని స్పష్టం చేసింది. ఐపీవో, క్యాపిటల్ మార్కెట్ల చట్టాల విషయంలో తగినంత అనుభవం కలిగిన ప్రముఖ సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహా్వనించింది. ఎల్ఐసీ ఐపీవో కోసం గత వారమే 10 మంది మర్చంట్ బ్యాంకర్లను దీపమ్ ఎంపిక చేయడం గమనార్హం. దేశ చరిత్రలోనే అతిపెద్ద నిధుల సమీకరణగా ఎల్ఐసీ ఐపీవో రికార్డు సృష్టించనుందని అంచనా. -
DRDO: 2-డీజీ డ్రగ్, కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి చికిత్సలో డా.రెడ్డీస్‌తో కలిసి అభివృద్ధి చేసిన 2-డీజీ ఉత్పత్తికి సంబంధించి డీఆర్డీవో కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ డ్రగ్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేలా తమ సాంకేతిక పరిజ్ఞానాన్నిఇతర ఔషధ సంస్థలకు బదిలీ చేయనుంది. ఇందుకు కంపెనీలనుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ (ఈఓఐ)ను ఆహ్వానిస్తోంది. ఈమెయిల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని కోరింది. ఆయా కంపెనీలు దరఖాస్తులను సమర్పించడానికి జూన్ 17 చివరి తేదీగా వెల్లడించింది. పరిశ్రమలు సమర్పించిన ఈఓఐను తమ టెక్నికల్ అసెస్మెంట్ కమిటీ పరిశీలిస్తుందని వీటి ఆధారంగా 15 పరిశ్రమలకు మాత్రమే ఉత్పత్తికి అనుమతి ఉంటుందని డీఆర్డీవో స్పష్టం చేసింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్, సామర్ధ్యం, తమ సాంకేతిక హ్యాండ్‌హోల్డింగ్ సామర్ధ్యం ఆదారంగా కేటాయింపు ఉంటుందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా కరోనా నివారణలో తమ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2డీజీ) ఆసుపత్రులో చేరిన రోగులు వేగంగా కోలుకోవడానికి దోహదపడుతుందని, ఆక్సిజన్‌పై ఆదారపడటాన్ని కూడా తగ్గిస్తుందని డీఆర్డీవో గతంలోనే ప్రకటించినసంగతి తెలిసిందే. ఈ మందు తయారీకి బిడ్డర్లకు డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీలనుండి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్ (ఏపీఐ), డబ్ల్యూహెచ్ఓ జీఎమ్‌పి (మంచి తయారీ పద్ధతులు) ధృవీకరణ తయారీకి డ్రగ్ లైసెన్స్ ఉండాలి. కాగా వినూత్నమైన పనితీరు కారణంగానే కరోనావైరస్ను 2డీజీ సమర్థంగా నిరోధించ గలుగుతోందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి చెప్పారు. ఈ మందు తయారీ, పంపిణీ సులువుగా ఉంటుందన్నారు. అలాగే కరోనా వైరస్ రూపాంతరాలపై కూడా తాము అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం సమర్థంగా పనిచేస్తుందని డీఆర్డీవోకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ నారాయణ్ భట్ తెలిపారు. చదవండి : DRDO 2G Drug: వైరస్ రూపాంతరాలపైనా 2-డీజీ ప్రభావం! -
‘ఏపీలోనే కాదు.. యూపీలో కూడా బిడ్లు దాఖలు కాలేదు’
సాక్షి,అమరావతి: వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నా బిడ్లు దాఖలు చేయలేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీలో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. నిబంధనల ప్రకారం బిడ్ల దాఖలుకు మరో 2 వారాల గడువిస్తామని చెప్పారు. అయితే గడువిచ్చినా బిడ్లు దాఖలవుతాయన్న నమ్మకం లేదన్నారు. ఏపీలోనే కాదు యూపీలో కూడా బిడ్లు దాఖలు కాలేదని వెల్లడించారు. కాగా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సీఎంలందరికీ సీఎం జగన్ లేఖలు తెలిపారు. చదవండి: ‘ఈ రోజు రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని రోజు’ -
రెండో దశకు ఎయిరిండియా విక్రయం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి వీలుగా రెండో దశ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ బిడ్స్‌కు ఆహ్వానం పలుకుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కంపెనీ విక్రయ డీల్ సెప్టెంబర్‌కల్లా పూర్తికావచ్చని అంచనా వేశాయి. ఎయిరిండియా కొనుగోలుకి టాటా గ్రూప్ సహా పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేస్తూ బిడ్స్ దాఖలు చేయడం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌కల్లా ప్రాథమిక బిడ్డింగ్ ప్రక్రియ పూర్తికాగా.. వీటిని సమీక్షించిన ప్రభుత్వం అర్హతగల కంపెనీలను వీడీఆర్‌కు అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. (అంచనాలను మించిన పరోక్ష పన్నులు) ఎయిరిండియా కొనుగోలులో భాగంగా ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలిచ్చే వీడీఆర్‌కు బిడ్డర్స్‌ను అనుమతించినట్లు తెలుస్తోంది. వెరసి ఎయిరిండియా విక్రయం ఫైనాన్షియల్ బిడ్డింగ్ దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎయిరిండియా మధ్య విలీనం జరిగాక కంపెనీ నష్టాలలో నడుస్తుండటం గమనార్హం! కాగా.. ప్రభుత్వం ఎయిరిండియాలో 100శాతం వాటాను విక్రయించనుంది. కొనుగోలుదారుడికి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100శాతం వాటా, గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలు అందించే ఏఐఎస్ఏటీఎస్లో 50శాతం వాటా చొప్పున లభించనుంది. (మారుతీ దూకుడు: టాప్ సెల్లింగ్ కారు ఇదే!) -
రెండే రెండు సంస్థలు..
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ నిర్మాణానికి రెండు టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. నిర్మాణ రంగంలో ప్రముఖ సంస్థలైన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ కంపెనీలు మాత్రమే టెండర్లలో పాల్గొన్నాయి. మంగళవారం మధ్యాహ్నం తో టెండర్ల దాఖలు గడువు ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటలతో గడువు పూర్తయిందని ప్రకటించిన రోడ్లు, భవనాల శాఖ అధికారులు.. 2 టెండర్లు మాత్రమే దాఖలైనట్లు వెల్లడించారు. వాటి సాంకేతిక అర్హతలను పరిశీలించి 23న ఫైనాన్షియల్ బిడ్లు తెరవనున్నారు. రెండు సంస్థల్లో సాంకేతిక అర్హతల్లో ఎంపికైన సంస్థ తాలూకు ఫైనాన్షియల్ బిడ్‌ను మాత్రమే తెరుస్తారు. రెండూ అర్హత సాధిస్తే తక్కువ కోట్ చేసిన సంస్థకు కొత్త సచివాలయ నిర్మాణ బాధ్యత అప్పగిస్తారు. దసరాకు పని ప్రారంభం కానట్టే.. కొత్త సచివాలయ నిర్మాణ పనులను దసరా రోజున ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంవత్సరం లోపు పనులు పూర్తి చేసి వచ్చే సంవత్సరం దసరా రోజున కొత్త భవనాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ టెండర్లకు సంబంధించిన కసరత్తులో జాప్యం జరగటంతో దసరాకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించట్లేదు. 23న ఫైనాన్షియల్ బిడ్లు తెరిచిన తర్వాత ఎంపిక చేసిన సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు గ్యారంటీ సమర్పించాలి. లేబర్ క్యాంపు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా దాదాపు 15 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. వాస్తవానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా, రెండుసార్లు గడువు పెంచాల్సి వచ్చింది. తొలుత స్థానికంగా రిజిస్టర్ అయిన సంస్థలే దాఖలు చేయాలన్న నిబంధనతో టెండర్లు ఆహ్వానించారు. ఆ తర్వాత దాన్ని సడలించారు. ఈ సందర్భంగా> తేదీ మారింది. ఆ తర్వాత మరోసారి గడువు పొడిగించారు. దీంతో జాప్యం తప్పలేదు. వరణుడూ కారణమే.. పనులపై వర్షాల ప్రభావం కూడా ఉంది. ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలో ఎక్కడ తవ్వినా పెద్దమొత్తంలో నీరు ఊరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో పనులు ప్రారంభించటం కుదరదని, వానల ఉధృతి తగ్గాకే పనులు ప్రారంభించేందుకు అనువైన వాతావరణం ఉంటుందని పేర్కొంటున్నారు. తొలుత 5 సంస్థలు హాజరు.. ఇటీవల నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి 5 బడా సంస్థలు హాజరయ్యాయి. ఇందులో తెలంగాణకు చెందినవి కూడా ఉన్నాయి. కానీ టెండర్ దరఖాస్తు దాఖలు చేసేందుకు మాత్రం మిగతా 3 సంస్థలు వెనుకడుగు వేశాయి. ఇందులో ఓ సంస్థకు మాత్రం అర్హత లేదని తెలిసింది. తమకు మొబిలైజేషన్ అడ్వాన్సు ఇవ్వాలని, నిర్మాణ గడువును ఏడాదిన్నరకు పెంచాలని.. ఇలా పలు విన్నపాలు చేశారు. వీటిని అధికారులు తోసిపుచ్చారు. టెండర్లు తక్కువ సంఖ్యలో దాఖలు కావటానికి ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు. -
బీపీసీఎల్ విక్రయం: బిడ్డింగ్‌లకు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశపు రెండవ అతిపెద్ద చమురు శుద్ధిదారు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రైవేటీకరణలో సంస్థలో సగానికిపైగా వాటాల విక్రయానికి కేంద్రం శనివారం బిడ్డింగ్‌లను ఆహ్వానించింది. మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించడానికి బిడ్లను ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం (డిపామ్) బిడ్‌నోట్ ప్రకారం బీపీసీఎల్ వ్యూహాత్మక అమ్మకం కోసం ఆసక్తి గల వారు మే 2వ తేదీలోగా తమ బిడ్డింగ్‌లను సమర్పించాల్సి వుంటుంది. భారత ప్రభుత్వం 114.91 కోట్ల (52.98శాతం ఈక్విటీ వాటా)ఈక్విటీ షేర్లతో కూడిన బీపీసీఎల్ మొత్తం వాటాను వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదిస్తోంది. తద్వారా బీపీసీఎల్ ఈక్విటీ వాటా 61.65 శాతం వాటా వున్న ఎన్ఆర్ఎల్ తప్ప, మిగిలిన నిర్వహణ నియంత్రణ వ్యూహాత్మక కొనుగోలుదారుకు బదిలీ అవుతుందని తెలిపింది. బిడ్డింగ్ రెండు దశల్లో వుంది మొదటి దశలో ఆసక్తి వ్యక్తీకరణ ఆసక్తి, అనంతరం రెండవ రౌండ్లో ఫైనాన్స్ బిడ్డింగ్ ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. 10 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్ ఉన్న ఏ ప్రైవేట్ సంస్థ అయినా బిడ్డింగ్‌కు అర్హులు . అలాగే నాలుగు సంస్థలకు మించని కన్సార్షియానికి అనుమతి వుండదు. బిడ్డింగ్ ప్రమాణాల ప్రకారం, కన్సార్టియం లీడర్ 40శాతం వాటాను కలిగి ఉండాలి. ఇతరులు కనీసం ఒక బిలియన్ డాలర్ల నెట్‌వర్త్ కలిగి ఉండాలి. 45 రోజుల్లో కన్సార్షియంల మార్పులు అనుమతించబడతాయి. కానీ కన్సార్షియానికి నేతృత్వం వహించే సంస్థను మార్చడానికి వీల్లేదు. కాగా మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థను ఆదుకునేందుకు రూ.లక్ష కోట్లు సమీకరించే లక్ష్యంగా భాగంగా ఎయిరిండియా, బీపీసీఎల్ ప్రైవేటీకరణకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. -
జెట్ సంక్షోభం : బిడ్లకు ఆహ్వానం
అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ పరిస్థితి రోజు రోజుకు మరింత ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. జెట్ ఎయిర్వేస్ నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన బ్యాంకులు, వీలైనంత త్వరగా సంస్థ నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం కంపెనీ ఈక్విటీలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు రంగం సిద్ధం చేశాయి. ఈ వాటాల కొనుగోలుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తోంది. వాటాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు బ్యాంకుల కన్సార్షియానికి నాయకత్వం వహిస్తున్న ఎస్బీఐ సోమవారం వెల్లడించింది. ఈ బిడ్లను దాఖలు చేసేందుకు ఏప్రిల్ 10న చివరి తేదీగా పేర్కొంది. బిడ్డర్లలో స్ట్రాటజిక్, అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా స్ట్రాటజిక్ ఇన్వెస్టర్లు ఏవియేషన్ సెక్టారుకు చెందినవారు అయి ఉండాలని నిబంధన విధించారు. అదే సమయంలో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లుగా ఈక్విటీ ఫండ్ మేనేజర్లు, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజర్లను బిడ్ వేసేందుకు ఆహ్వానిస్తోంది. కాగా బ్యాంకులకు జెట్ ఎయిర్ వేస్ నుంచి మొత్తం రూ.8000 కోట్ల బకాయాలు తిరిగి రావాల్సి ఉంది. ఈ అప్పులను 26 బ్యాంకులు ఈక్విటీగా మార్చుకోవడంతో బ్యాంకుల వాటా 51 శాతానికి చేరింది. అలాగే జెట్ ఎయిర్వేస్ ప్రధాన ప్రమోటర్ నరేశ్ గోయల్, ఇతర సభ్యుల వాటా 51 శాతం\ నుంచి 25 శాతానికి తగ్గింది. అయితే ఆ మొత్తాన్ని ఈక్విటీ షేర్లుగా మార్చి ఆసక్తి ఉన్న బిడ్డర్లకు అప్పగించాలని బ్యాంకుల కన్సార్షియం నిర్ణయించింది. ఇప్పటికే కన్సార్షియం కనీసం 3.54 కోట్ల షేర్లను ఆఫర్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. అంటే మొత్తం వాటాలో ఇది 31.2 శాతంతో సమానం. జెట్ ఎయిర్వేస్ రుణ పరిష్కారానికి ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం 180 రోజుల గడువు విధించుకున్న సంగతి తెలిసిందే. -
ఎస్సార్ స్టీల్: అప్పులు చెల్లించాకే బిడ్
సాక్షి,న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రుణ సంక్షోభంతో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న ఉక్కు సంస్థ ఎస్సార్ స్టీల్‌ను దక్కించుకునే రేసులో ఉన్న బిడ్డర్లు ఆర్సెలర్ మిట్టల్, నూమెటల్కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఇరు కంపెనీల బిడ్స్ చెల్లుతాయన్న కోర్టు నుమెటల్‌కు భారీ ఊరట నిచ్చింది. దీనిపై సీవోసీ (కమిటీ ఆఫ క్రెడిటర్స్) అంగీకరించిన తరువాత మాత్రమే ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీ జోక్యం చేసుకుంటాయని తెలిపింది. మెజారిటీ (66శాతం) సీవోసీ సభ్యులు ఈ ప్రక్రియకు అంగీకరించాలనీ, లేదంటే లిక్విడేషన్‌కు వెళుతుందని సుప్రీం స్పష్టం చేసింది. అయితే ఈ వేలానికి ముందు రెండు వారాలలో బకాయిలను క్లియర్ చేయాలని ఇరు సంస్థలను సుప్రీం కోర్టు ఆదేశించింది. రోహిన్టన్ నారిమన్, ఇందుహల్హోత్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ ఆదేశాల్చింది. అలాగే ఈ రెండు కంపెనీల బిడ్లపై ఎస్సార్ స్టీల్ రుణదాతల కమిటీ నిర్ణయం తీసుకోవాలని, ఎనిమిది వారాల్లో అత్యుత్తమ బిడ్‌ను ఎంపిక చేయాలని సూచించింది. అంతేకాక 270 రోజుల్లో దివాలా ప్రక్రియ గడువు పూర్తి కావాలని తెలిపింది. ఆర్సెలార్ మిట్టల్ తన అనుబంధ విభాగమైన ఉత్తమ్ గాల్వాకు బకాయిపడిన మొత్తం రూ.7,000 కోట్లు. దీంతో ఉత్తమ్ గాల్వా రుణదాతలకు బకాయిలు చెల్లించేందుకు ఆర్సెలార్ మిట్టల్ ఇప్పటికే రూ.7 వేల కోట్లను తన ఎస్ర్కో ఖాతాలో డిపాజిట్ చేసింది. దివాలా కోడ్‌లోని సెక్షన్ 29ఎ ప్రకారం.. బకాయి పడిన కంపెనీలకు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హత లేదు. మొత్తం 30 బ్యాంకులు, ఇతర రుణదాతలకు ఎస్సార్ స్టీల్ రూ.49,000 కోట్లు బకాయి పడటంతో సంస్థపై దివాలా పరిష్కార చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే దివాలా పరిష్కారానికి చేరువవుతున్న నేపథ్యంలో సంస్థ బకాయిలను ఆస్తుల పునర్వ్యవస్థీకరణ సంస్థల(ఎఆర్‌సి)కు విక్రయించాలన్న ప్రతిపాదనను ఎస్బిఐ ఉపసంహరించుకుంది. ఎస్బిఐకి ఎస్సార్ స్టీల్ రూ.13,000 బకాయిపడింది. -
భూషణ్ స్టీల్ కోసం టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ పోటీ
న్యూఢిల్లీ: రుణాల ఊబిలో చిక్కుకుని దివాలా చర్యలను ఎదుర్కొంటున్న భూషణ్ పవర్ అండ్ స్టీల్ కొనుగోలు కోసం టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, లిబర్టీ హౌస్ రెండో విడత బిడ్లు దాఖలు చేశాయి. రుణదాతల కమిటీకి ఇవి తమ బిడ్లను సమర్పించాయి. సవరించిన బిడ్లను దాఖలు చేసేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) వారం పాటు గడువును పొడిగిస్తూ ఈ నెల 6న వెసులుబాటు కల్పించింది. రుణదాతల కమిటీ తాజాగా వచ్చిన బిడ్లను మదింపు చేస్తోందని, ఈ నెల 17న తమ నిర్ణయాన్ని ఎన్సీఎల్టీకి తెలియజేయనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రుణదాతల కమిటీ లేవనెత్తిన పలు అంశాలను పరిష్కరించినట్టు లిబర్టీ హౌస్ ప్రతినిధి తెలిపారు. అయితే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఒక్కటే రూ.19,700 కోట్లకు సవరించిన బిడ్ వేసినట్టు తెలుస్తోంది. భూషణ్ పవర్ అండ్ స్టీల్ కోసం టాటా స్టీల్, సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బ్రిటన్‌కు చెందిన లిబర్టీ హౌస్ తీవ్రంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. బ్యాంకులకు భూషణ్ పవర్ రూ.45,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
సిటీ గ్యాసు బిడ్లలో అదానీ ముందంజ
న్యూఢిల్లీ: పట్టణాల్లో సహజవాయువు పంపిణీ ప్రాజెక్టులకు సంబంధించిన బిడ్లలో అదానీ గ్రూపు ముందంజలో నిలిచింది. 52 పట్టణాల్లో ఈ సంస్థ బిడ్లు వేసి టాప్ బిడ్డర్‌గా నిలిచింది. ప్రభుత్వరంగ గెయిల్ 30 పట్టణాల పట్ల ఆసక్తి చూపిస్తూ బిడ్లు వేసింది. ఇక, రిలయన్స్–బీపీ మాత్రం చివరి నిమిషంలో తప్పుకోవడం గమనార్హం. అదానీ గ్యాస్ లిమిటెడ్ 32 పట్టణాల్లో సొంతగాను, 20 పట్టణాల్లో ఐవోసీతో కలసి బిడ్లు వేసింది. దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న 174 జిల్లాల్లోని పట్టణాలు, సమీప ప్రాంతాల్లో... పైపుల ద్వారా వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి 86 పర్మిట్లకు తొమ్మిదో విడతలో భాగంగా ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఢిల్లీలో ఇప్పటికే సీఎన్జీ సరఫరా చేస్తుండగా, మరో 13 పట్టణాల్లో అనుమతులకు బిడ్లు దాఖలు చేసింది. ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఏడు బిడ్లు దాఖలు చేసింది. గెయిల్, మహానగర్ గ్యాస్, గుజరాత్ స్టేట్ ప్రెటోలియం కార్ప్ (జీఎస్పీసీ) కూడా ఇందులో పాల్గొన్నాయి. అయితే, ఆర్ఐఎల్, బ్రిటన్‌కు చెందిన బీపీ 50: 50 జాయింట్ వెంచర్ ‘ఇండియా గ్యాస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్’ మాత్రం బిడ్లు దాఖలు చేయలేదని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ఈ తొమ్మిదో విడతకు ముందు ఎనిమిది దశల్లో కేంద్రం మొత్తం 91 భౌగోళిక ప్రాంతాలను కవర్ చేసే విధంగా లైసెన్స్‌లను జారీ చేసింది. ఇంద్రప్రస్థ గ్యాస్, గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వంటివి వీటిని దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ రెండు ప్రాంతాల్లో లైసెన్సులు దక్కించుకుని దాదాపుగా సరఫరాకు సిద్ధమయింది. మొత్తంగా ప్రస్తుతానికి 24 కోట్ల జనాభా నివసిస్తున్న ప్రాంతాలు ఈ సేవల పరిధిలోకి వచ్చాయి. ప్రాథమిక ఇంధన విభాగంలో సహజవాయువు వాటా ప్రస్తుతం 6 శాతంగా ఉంటే, దాన్ని 15 శాతానికి పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. అలాగే, 2020 నాటికి కోటి ఇళ్లకు పైపుల ద్వారా వంట గ్యాస్ అందించాలన్నది మోదీ సర్కారు సంకల్పం. -
ఫోర్టిస్ రేసు నుంచి తప్పుకున్న ముంజాల్–బర్మన్
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ సంస్థ కొనుగోలు రేసు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటిదాకా బరిలో ముందున్న ముంజాల్–బర్మన్ కుటుంబాలు తాజాగా పక్కకు తప్పుకున్నాయి. ఫోర్టిస్ కొత్తగా బిడ్లు ఆహ్వానించినప్పటికీ.. ముంజాల్–బర్మన్ సవరించిన బిడ్లు దాఖలు చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, మలేషియాకి చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్, మణిపాల్–టీపీజీ సవరించిన బిడ్లు దాఖలు చేశాయి. బైండింగ్ బిడ్ దాఖలు చేసినట్లు ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్.. స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేయగా, మణిపాల్–టీపీజీ కూడా బరిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జులై 3 నాటికి కొత్తగా వచ్చిన బిడ్లను పరిశీలించనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలియజేసింది. సవరించిన నిబంధనల ప్రకారం ఫోర్టిస్‌ను కొనుగోలు చేసే సంస్థ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా కనీసం రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్‌హెచ్‌టీ హెల్త్ ట్రస్ట్ కొనుగోలుకు నిధుల సమీకరణ ప్రణాళిక, డయాగ్నస్టిక్స్ సేవల అనుబంధ సంస్థ ఎస్ఆర్ఎల్ నుంచి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు వైదొలిగేందుకు అవకాశం కల్పించే ప్రణాళిక మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది. 2001లో మొహాలీలో తొలి ఆస్పత్రిని ప్రారంభించిన ఫోర్టిస్‌కు ప్రస్తుతం దేశవిదేశాల్లో 45 హెల్త్‌కేర్ కేంద్రాలు ఉన్నాయి. -
ఎయిరిండియా కథ మళ్లీ మొదటికి
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రయివేటు పరం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చివరిరోజు ఇబ్బడి ముబ్బడిగా బిడ్లు వస్తాయని ఆశించిన సర్కార్ చివరికి సింగిల్ బిడ్‌ను కూడా సాధించలేకపోయింది. ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు చివరి రోజు అయిన మే 31వ తేదీ గురువారం కూడా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. బిడ్లు వేసేందుకు సంస్థల నుంచి కనీస స్పందన కరువైంది. ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి బిడ్డర్లనుంచి ఎలాంటి స్పందనా రాలేదనీ, తదుపరి చర్యలను త్వరలోనే నిర్ణయిస్తామని విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఉన్న ఎయిరిండియాను ప్రయివేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం సంస్థలో 76శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడింది. ఇందుకోసం బిడ్డర్లను కూడా ఆహ్వానించింది. ఈ బిడ్లు వేసేందుకు మే 14 వరకు గడువు పెట్టింది. అయితే మొదట జెట్‌ఎయిర్‌వేస్, ఇండిగో, టాటా లాంటి సంస్థలు ఎయిరిండియాలో వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించాయి. అయితే వాటా విక్రయంపై ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. వాటా కొనుగోలు అనంతరం ఎయిరిండియాను వారి సొంత సంస్థల్లో విలీనం చేయరాదని, పాత సిబ్బందిని తొలగించరాదని పేర్కొంది. దీంతో నిబంధనలు కఠినంగా ఉన్నాయంటూ చాలా సంస్థలు విముఖత వ్యక్తం చేశాయి. నిబంధనల్లో కొన్ని మార్పులు చేసిన అనంతరం బిడ్ వేసేందుకు గడువును మే 31వరకు పొడిగించింది. నిబంధనలను సవరించి, గడువు పొడిగించినా కూడా బిడ్‌ను సాధించడంలో విఫలం కావడం గమనార్హం.