న్యూఢిల్లీ:రుణ సంక్షోభంలో చిక్కుకున్ను రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి పలు దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. అదానీ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ లంబార్డ్, టాటా ఏఐజీ, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర 54 కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
ఆర్‌బీఐ నియమిత పాలనాధికారి బిడ్స్ దాఖలుకు గడువును ఈ నెల 11 నుంచి 25కు పెంచారు. కాగా.. రేసులో మరికొన్ని కంపెనీలు నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. జాబితాలో యస్ బ్యాంక్, బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్, ఓక్‌ట్రీ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్, బ్రూక్‌ఫీల్డ్, టీపీజీ, కేకేఆర్, పిరమల్ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్ తదితరాలను ప్రస్తావించాయి.
చెల్లింపుల వైఫల్యం, పాలనా సంబంధ సమస్యలతో రిజర్వ్ బ్యాంక్ గతేడాది నవంబర్ 29న రిలయన్స్ క్యాపిటల్ బోర్డును రద్దు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి దివాలా చట్టం ప్రకారం చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment