Anil Ambanis RCom
-
ఒకప్పుడు షేర్ ధర రూ.2,700.. ఇప్పుడు ‘జిరో’.. భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు..
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ నుంచి త్వరలో డీలిస్ట్ అవ్వబోతుంది. రిలయన్స్ క్యాపిటల్‌ను హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కొనుగోలు చేసిన తరుణంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఇకపై దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ క్యాపిటల్ షేర్లు ట్రేడ్ అవ్వవు. ఎందుకంటే కంపెనీ కొత్త యజమాని హిందూజా గ్రూప్ షేర్లను డీలిస్ట్ చేయాలని నిర్ణయించటమే దీనికి ప్రధాన కారణం. వాస్తవానికి 2008లో కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.2,700 కంటే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం షేర్ ధర దాదాపు 99 శాతం క్షీణించి రూ.11 వద్ద ఉంది. షేర్ల డీలిస్టింగ్ జరిగితే ఈక్విటీ షేర్ హోల్డర్ల ఇన్వెస్ట్మెంట్ సున్నా కాబోతోంది. కొత్తగా కొనుగోలు చేసిన కంపెనీ పాత కంపెనీలోని ఇన్వెస్టర్లకు ఎలాంటి వాటాలు ఇవ్వబోదని వెల్లడైంది. దీనివల్ల అనిల్ అంబానీ కంపెనీలో షేర్లు కలిగి ఉన్న వ్యక్తులకు భారీగా నష్టం జరగనుంది. ఇప్పటికే రిలయన్స్ క్యాపిటల్‌పై నియంత్రణ సాధించేందుకు హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ సమర్పించిన రూ.9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) గత మంగళవారం ఆమోదించింది. ఇదీ చదవండి: మరో గ్లోబల్ బ్రాండ్‌ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ ఇందులో రుణదాతలు 63 శాతం బకాయి నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీకి వ్యతిరేకంగా క్లెయిమ్ చేసిన మొత్తం రూ.38,526.42 కోట్లలో రూ.26,086.75 కోట్ల క్లెయిమ్‌లను మాత్రమే ట్రిబ్యునల్ ఆమోదించింది. -
అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా?
గత కొన్ని సంవత్సరాలకు ముందు ఇండియన్ టెలికాం రంగంలో పెను మార్పులు తీసుకువచ్చిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించేందుకు ముంబై ఎన్‌సిఎల్‌టి ట్రిబ్యునల్ ఆమోదం తెలిపినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ ఇటీవల తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కి చెందిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన కొన్ని అపరిమిత ఆస్తుల విక్రయాన్ని చేపట్టేందుకు ఎన్‌సిఎల్‌టి నుంచి అనుమతి కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తు విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ ఆర్డర్‌ను దాఖలు చేసింది. ఈ ట్రిబ్యునల్ ఆమోదం కోసం రిజల్యూషన్ ప్లాన్‌ను సమర్పించిన తర్వాత CIRP రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 29 ప్రకారం దరఖాస్తుదారు/RP కార్పొరేట్ రుణగ్రహీత ఆస్తులను విక్రయించవచ్చని ఈ ట్రిబ్యునల్ స్పష్టం చేస్తుంది. విక్రయానికి ఎంచుకున్న ఆస్తులలో భూమి, భవనంతో కూడిన RCom చెన్నై హాడో ఆఫీస్ ఉన్నాయి. అంతే కాకుండా చెన్నైలోని అంబత్తూర్లో సుమారు 3.44 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్, పూణేలో 871.1 చదరపు మీటర్ల ల్యాండ్, భువనేశ్వర్ బేస్డ్ ఆఫీస్ స్పేస్, క్యాంపియన్ ప్రాపర్టీస్ షేర్లలో పెట్టుబడి, రిలయన్స్ రియల్టీ షేర్లలో పెట్టుబడి వంటివి విక్రయించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత వాస్తవానికి 2016లో ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ప్రారంభించిన తర్వాత అనిల్ అంబానీ సంస్థ పరిస్థితి చాలా దిగజారింది. అన్న ప్రకటించిన డేటా వార్ కారణంగా తమ్ముడు భరించలేని నష్టాల్లోకి జారుకున్నాడు. ఆ విధంగానే కంపెనీ తన బ్యాంక్ రుణాలను చెల్లించటంలో డిఫాల్ట్ అయి చివరికి దివాలా ప్రక్రియలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. -
రుణ సంక్షోభంలో రిలయన్స్ క్యాపిటల్,కొనుగోలు రేసులో టాటా!
న్యూఢిల్లీ:రుణ సంక్షోభంలో చిక్కుకున్ను రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి పలు దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. అదానీ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ లంబార్డ్, టాటా ఏఐజీ, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర 54 కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ నియమిత పాలనాధికారి బిడ్స్ దాఖలుకు గడువును ఈ నెల 11 నుంచి 25కు పెంచారు. కాగా.. రేసులో మరికొన్ని కంపెనీలు నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. జాబితాలో యస్ బ్యాంక్, బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్, ఓక్ట్రీ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్, బ్రూక్‌ఫీల్డ్, టీపీజీ, కేకేఆర్, పిరమల్ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్ తదితరాలను ప్రస్తావించాయి. చెల్లింపుల వైఫల్యం, పాలనా సంబంధ సమస్యలతో రిజర్వ్ బ్యాంక్ గతేడాది నవంబర్ 29న రిలయన్స్ క్యాపిటల్ బోర్డును రద్దు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి దివాలా చట్టం ప్రకారం చర్యలు చేపట్టింది. చదవండి: ఆ రెండు కంపెనీల నుంచి అనిల్ అంబానీ ఔట్ -
అంబానీకి షాకిచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: ఎయిర్ సెల్ మాక్సిస్ 2జీ స్పెక్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఆర్ కాం కి షాకిచ్చింది. మలేషియా కంపెనీ మాక్సిస్ నుంచి 2 జి లైసెన్స్ ను మరో టెలికం కంపెనీ బదిలీ చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. మనీ లాండరింగ్ కేసు కొనసాగుతుండగా నే అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ మధ్య ప్రతిపాదిత ఒప్పందంపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఈ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం నిందితులపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు నలుగురూ స్పెషల్ కోర్టుముందు విధిగా హాజరు కావాలంటూ సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాపార వేత్త ఆనంద కృష్ణన్, మలేసియా సంస్థ మాక్సిస్ కు చెందిన అగస్టస్ రాల్ఫ్ మార్షల్, మరో ఇద్దరు జనవరి 27లోపు కోర్టుముందు హాజరు కావాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణకు ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. విచారణకు ప్రమోటర్లు అంగీకరించకపోతే 2016లో ఎయిర్ సెల్ కు కేటాయించిన 2 జీ స్పెక్ట్రంను లైసెన్స్ ను సీజ్ చేయాలని తెలిపింది. నిందితులు కోర్టు ముందు హాజరు కాకపోతే 2 వారాల్లోగా దీన్ని విక్రయించాల్సిందిగా టెలికాం శాఖకు స్పష్టం చేసింది. అంతేకాదు ఈ లైసెన్సు ద్వారా ఆర్జించిన ఆదాయాన్ని కూడా స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ 2 జి లైసెన్స్ బదిలీ ద్వారా చందాదారుల ప్రతికూల ప్రభావాన్ని నివారించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. కాగా సంచలనం రేపిన ఎయిర్ సెల్ మాక్సిస్ కుంభకోణంలో 2014 ఆగస్టులో మారన్ సోదరులతో బాటు మలేసియా వ్యాపారవేత్త ఆనంద్ కృష్ణన్ మీద, మలేసియాకు చెందిన మరో వ్యక్తి అగస్టస్ రాల్ఫ్ మార్షల్ పైన, సన్ డైరెక్ట్, మాక్సిస్ కమ్యూనికేషన్, సౌత్ ఏషియా ఎంటర్టైన్మెంట్ హోల్డింగ్స్, ఆస్ట్రో ఆల్ ఏషియా నెట్ వర్క్ మీద సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.