రుణ సంక్షోభంలో అనిల్‌ అంబానీ కంపెనీ..ఈవేలానికి రిలయన్స్‌ క్యాపిటల్‌ రెడీ | Lenders Of Reliance Capital Finalise E-auction Process For Bidders | Sakshi
Sakshi News home page

రుణ సంక్షోభంలో అనిల్‌ అంబానీ కంపెనీ..ఈవేలానికి రిలయన్స్‌ క్యాపిటల్‌ రెడీ

Dec 10 2022 8:33 AM | Updated on Dec 10 2022 8:38 AM

Lenders Of Reliance Capital Finalise E-auction Process For Bidders - Sakshi

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న అనిల్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ క్యాపిటల్‌ విక్రయానికి ఈవేలం నిర్వహించేందుకు విధానాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

వేలం విధానాలు, నిబంధనలను రుణదాతలు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఈ నెల 19న ఈవేలం ప్రారంభంకానున్నట్లు తెలియజేశాయి. 

కాస్మియా పిరమల్‌ కన్సార్షియం వేసిన రూ. 5,300 కోట్ల బిడ్‌ను వేలానికి ప్రాథమిక ధరగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రౌండ్‌ 1లో భాగంగా బిడ్డర్లు ఈ ధరకుపైన కోట్‌ చేయవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఒక ఎన్‌బీఎఫ్‌సీ రుణ పరిష్కార ప్రణాళిక కోసం ఈస్థాయిలో ఈవేలాన్ని నిర్వహించడం ఇదే తొలిసారని తెలియజేశాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement