e auction
-
చివరి రోజూ మోకిలలో అదే ఊపు.. రూ. 716 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భూముల వేలం హెచ్ఎండీఏకు కాసులుకు కురిపిస్తోంది. మోకిలలో ప్లాట్ల ఈ-వేలానికి రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించింది. చివమోకిల హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలంలో చివరి రోజు మొత్తానికి మొత్తం 60 ప్లాట్లు మంచి రేట్లతో అమ్ముడుపోయాయి. మోకిలలో చేస్తున్న భారీ వెంచర్లో ఫేజ్–1లో 50 ప్లాట్లు, ఫేజ్–2లో 300 ప్లాట్లతో కలిపి 350 ప్లాట్లకు వేలం నిర్వహించగా వాటిలో 346 ప్లాట్లు మంచిరేట్లతో అమ్ముడయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్లను ఆన్లైన్(ఈ–ఆక్షన్)లో అమ్మకాలు నిర్వహించిన విషయం తెలిసిందే. చివరి రోజు మంగళవారం మొత్తం 60 ప్లాట్లు అమ్ముడుపోయాయి. దీంతో రెండు దశల్లో 346 ప్లాట్లకు మొత్తం రూ.716.39 కోట్ల రెవెన్యూ వచ్చింది. చదవండి: కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ!.. 29 స్థానాలకు 263 దరఖాస్తులు -
బుద్వేల్ భూముల వేలంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: బుద్వేల్ భూముల అంశంలో హెచ్ఎండీఏ వేలాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. భూముల వేలంపై స్టే ఇవ్వాలని కోర్టుని కోరింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. దీనిపై స్పందిస్తూ.. బార్ అసోసియేషనల్లో విభేదాలు ఉన్నాయని, అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా బుద్వేల్ లోని ప్రభుత్వ భూములను గతంలో హైకోర్టు కోసం కేటాయిస్తామన్న వాదనతో బార్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లింది. దీంతో బుద్వేల్ భూముల వేలంపై న్యాయవాదుల సంఘం కోర్టుని ఆశ్రయించింది. రంగారెడ్డి బుద్వేల్లోని 100 ఎకరాలకు హెచ్ఎండీఏ ఈ వేలం వేసేందుకు సిద్ధమైంది. 100 ఎకరాల్లో 14 ప్లాట్‌కు ఆన్లైన్ వేలం జరపాలని నిర్ణయించింది. ఈ భూమూలను దక్కించుకోవాలని రియల్ ఎస్టేట్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. దీని ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. చదవండి: హవ్వ.. చెట్లను కొట్టేసి మొక్కలు నాటుతారట? -
రుణ సంక్షోభంలో అనిల్ అంబానీ కంపెనీ..ఈవేలానికి రిలయన్స్ క్యాపిటల్ రెడీ
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ విక్రయానికి ఈవేలం నిర్వహించేందుకు విధానాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వేలం విధానాలు, నిబంధనలను రుణదాతలు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఈ నెల 19న ఈవేలం ప్రారంభంకానున్నట్లు తెలియజేశాయి. కాస్మియా పిరమల్ కన్సార్షియం వేసిన రూ. 5,300 కోట్ల బిడ్‌ను వేలానికి ప్రాథమిక ధరగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రౌండ్ 1లో భాగంగా బిడ్డర్లు ఈ ధరకుపైన కోట్ చేయవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఒక ఎన్బీఎఫ్సీ రుణ పరిష్కార ప్రణాళిక కోసం ఈస్థాయిలో ఈవేలాన్ని నిర్వహించడం ఇదే తొలిసారని తెలియజేశాయి. -
AP: మంగళగిరి టౌన్షిప్లో ప్లాట్లకు ఈ–వేలం.. వారికి 20 శాతం రాయితీ
సాక్షి, అమరావతి: మధ్య ఆదాయ వర్గాలకు అనువుగా మంగళగిరిలో అభివృద్ధి చేసిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లోని ప్లాట్లను ఈ–వేలం వేయనున్నట్టు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సులభ వాయిదాల్లో నగదు చెల్లించే సౌలభ్యం కల్పించినట్టు పేర్కొన్నారు. ఎంఐజీ లే అవుట్–2లో మొత్తం 267 ప్లాట్లు ఉన్నాయని, వీటిలో 200 చదరపు గజాల్లో 68, 240 చదరపు గజాల్లో 199 ఉన్నాయన్నారు. చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు లే–అవుట్‌లోని 10 శాతం ప్లాట్లు రిజర్వు చేయడంతో పాటు 20 శాతం రాయితీ కల్పించామని, విశ్రాంత ఉద్యోగులకు 5 శాతం ప్లాట్లను రిజర్వు చేసినట్టు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ప్లాట్ ధరలో 10 శాతం మొత్తం చెల్లించి ప్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. అందిన దరఖాస్తులకు ఈ–లాటరీ నిర్వహిస్తామని, అందులో ఎంపికైనవారు ప్లాట్ కేటాయించిన నెలలోపు ఒప్పందం చేసుకుని ధరలో 30 శాతం సొమ్ము చెల్లించాలన్నారు. అనంతరం 6 నెలల్లో మరో 30 శాతం మొత్తం, ఏడాదిలోపు మిగిలిన 30 శాతం మొత్తం ధర చెల్లించవచ్చన్నారు. ప్లాట్‌కు మొత్తం ధర చెల్లించిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు ప్రకటించారు. 40 శాతం మినహాయింపు ఎంఐజీలో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం నికర అమ్మకపు ధరలో 60 శాతం మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయని, మిగిలిన 40 శాతంపై రిజి స్ట్రేషన్ చార్జీలను మినహాయింపు ఇచ్చిందని వివేక్‌యాదవ్ తెలిపారు. ప్లాట్ పొందిన వారు ధర మొత్తం ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తున్నట్టు వివరించారు. అన్నిరకాల ప్రభుత్వ అనుమతులు ఉన్న ఈ ప్లాట్లకు సమీపంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్లాట్లు పొందాలనుకునే వారు పది శాతం ప్రారంభ ధర చెల్లించి నవంబర్ 19వ తేదీ లోగా https://migapdtcp.ap.gov.in లేదా https://crda.ap.gov.in వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 0866–2527124 నంబర్లో సంప్రదించాలని సూచించారు. చదవండి: ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి! -
31న అమరావతి టౌన్షిప్ ప్లాట్లకు ఈ–వేలం
సాక్షి,అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి–నవులూరు వద్ద అభివృద్ధి చేసిన అమరావతి టౌన్‌షిప్‌లోని మిగిలిన ప్లాట్లకు కూడా ఈ–వేలం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) నిర్ణయించింది. ఈ ప్రాంతంలో మొత్తం 285.17 ఎకరాల్లో 1,327 ప్లాట్లను అభివృద్ధి చేయగా.. దాదాపు 931 ప్లాట్లను గతంలో విక్రయించారు. మరో 331 ప్లాట్లను వివిధ లాట్లుగా విభజించిన సీఆర్డీఏ.. ఇందులో 29 ప్లాట్లను వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ వివరాలను సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. 200 చదరపు గజాల చొప్పున 23 ప్లాట్లు, 1,000 చదరపు గజాల చొప్పున ఉన్న ఆరు ప్లాట్లకు ఆన్లైన్లో వేలం నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం చదరపు గజానికి రూ.17,800గా ధర నిర్ణయించిందని, ఆసక్తి గలవారు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 31వ తేదీ ఉదయం నుంచి ఆన్లైన్లో వేలం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వివరాలకు https:// konugolu. ap. gov. in Ìôæ§é https:// crda. ap. gov. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. క్రికెట్ స్టేడియం, ఎయిమ్స్‌కు అతి దగ్గరలో.. నవులూరు వద్ద జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఈ లే అవుట్‌లోని ప్లాట్లకు ప్రభుత్వ అనుమతులన్నీ ఉన్నాయని.. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ చెప్పారు. ప్లాట్లకు అతి దగ్గరలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అకాడమీ, ఎయిమ్స్ ఆస్పత్రితో పాటు మంగళగిరి రైల్వేస్టేషన్ తదితర సదుపాయాలు ఉన్నాయని, త్వరలో మరికొన్ని జాతీయ విద్యా సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.1,180 ఫీజు చెల్లించి ‘కొనుగోలు’ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అమరావతి టౌన్షిప్ ప్లాట్లను వేలంలో ఎవరైనా దక్కించుకోవచ్చని చెప్పారు. వివరాలకు 0866–246370/71/72/73/74 నంబర్లను సంప్రదించాలన్నారు. -
ఆక్షన్‌కి యాక్షన్.. వేలానికి ప్రభుత్వ ప్లాట్లు
సాక్షి, హైదరాబాద్: ఖజానాకు మరింత ఆదాయం సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టిన రాష్ట్ర సర్కారు.. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ‘రాజీవ్ స్వగృహ’ ఇళ్లస్థలాలను వేలం వేయాలని నిర్ణయించింది. తొమ్మిది జిల్లాల పరిధిలోని 1,408 ప్లాట్లను వేలం వేయడం ద్వారా రూ.800 కోట్ల వరకు రాబట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాలవారీగా ప్లాట్ల వేలానికి సంబంధించిన వివరాలను శుక్రవారం ప్రకటించింది. జీహెచ్ఎంసీ మినహా చోట్ల భౌతికపద్ధతిలో వేలం నిర్వహిస్తామని తెలిపింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన భూముల ‘ఈ–వేలం’లో ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ)’ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జిల్లాల్లో జరిగే వేలం నిర్వహణలో కలెక్టర్లకు సహకరించి, పర్యవేక్షించే బాధ్యతను వాటికే అప్పగించారు. వేలానికి వీలుగా ఉన్న ప్రాజెక్టుల లేఔట్లను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు.. ఈనెల 18న, వచ్చే నెల ఏడున ప్రిబిడ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి వచ్చే నెల 10వ తేదీ మధ్య కొనుగోలుదారులు సంబంధిత స్థలాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. వచ్చే నెల 14, 15, 16, 17 తేదీల్లో జిల్లాల వారీగా ప్లాట్ల వేలం ప్రక్రియ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. త్వరగా ఇళ్లు కట్టుకునేలా వసతులు వేలం వేసే ప్రాజెక్టుల్లో ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి అంతర్గత రోడ్లు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులను పూర్తిచేస్తారు. ఎటువంటి చిక్కుల్లేని వివాద రహిత ఓపెన్ ప్లాట్లలో వెంటనే నిర్మాణాలు చేపట్టేలా అనుమతులు కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ ప్రాజెక్టుల్లో రెసిడెన్షియల్, ఇతర అవసరాలకు వీలుగా ప్లాట్లను 60 చదరపు గజాల నుంచి గరిష్టంగా 315 చదరపు గజాల వరకు విభజించారు. పెద్ద ప్లాట్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాల కోసం 6,500 చదరపు గజాల విస్తీర్ణమున్న స్థలాలను కూడా వేలంలో విక్రయిస్తారు. ఇప్పటికే వేలం వేసే ప్రాజెక్టుల స్థితిగతులపై సంబంధిత జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. వేలానికి సంబంధించిన విధి విధానాలను ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సంబంధిత జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఖరారు చేశారు. మహబూబ్‌నగర్, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో వేలం నిర్వహణ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించగా.. రంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగే వేలాన్ని టీఎస్ఐఐసీ పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్‌లో స్పందనను బట్టి.. గతేడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములకు హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ‘ఈ–వేలం’ నిర్వహించగా భారీ స్పందన వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.2 వేల కోట్ల మేర ఆదాయం లభించింది. ఖానామెట్, కోకాపేట, ఉప్పల్ భగా యత్, పుప్పాలగూడ తదితర కీలక ప్రాంతాల్లో ఎక రానికి అప్సెట్ ధర సగటున రూ.25 కోట్లుగా నిర్ణ యించగా.. గరిష్టంగా రూ.60 కోట్ల వరకు కూడా ధర పలికింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లోనూ నిర్వ హించే భూముల వేలానికి మంచి ధర వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వచ్చే నెలలో నిర్వ హించే వేలంలో శేరిలింగంపల్లిలోని మూడు ప్లాట్లకు చదరపు గజానికి గరిష్టంగా రూ.40 వేలు అప్సెట్ ధర నిర్ణయించగా.. జిల్లాల్లో అప్సెట్ను రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య నిర్ణయించారు. ‘స్వగృహ’ ఆగిపోవడంతో.. మధ్యతరగతి వారికి మార్కెట్ ధరతో పోలిస్తే 25% తక్కువ ధరకు ఇండ్లు నిర్మించి ఇచ్చే లక్ష్యంతో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ‘రాజీవ్ స్వగృహ’ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణలో జీహెచ్ఎంసీ సహా 15చోట్ల రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులను ప్రారంభించారు. వివిధ కారణాలతో ఇవి మధ్యలో నిలిచిపోయాయి. చాలాచోట్ల ఓపెన్ ప్లాట్లతోపాటు నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు, ఇళ్లు నిరుపయోగంగా ఉండిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలను వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
Uppal: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ మరోసారి అ‘ధర’హో అనిపించింది. గురువారం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో చదరపు గజానికి ఏకంగా రూ.లక్షా ఒక వెయ్యి ధర పలికింది. ఓ కొనుగోలుదారు 222 చదరపు గజాల ప్లాట్‌ను సొంతం చేసుకోగా, మరొకరు ఇంతే ధర చెల్లించి 368 చదరపు గజాలను దక్కించుకున్నారు. 1,196 గజాలున్న మరో ప్లాట్‌కు రూ.77 వేల ధర లభించింది. మరోవైపు గురువారం నాటి బిడ్డింగ్‌లో 1,787 గజాలున్న మరో ప్లాట్‌కు గజానికి రూ.53 వేల చొప్పున కనిష్ట ధర లభించింది. ఈ వేలంలో సగటున గజానికి రూ.71,815.5 చొప్పున ధర పలికినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో హెచ్ఎండీఏకు రూ.141.61 కోట్ల ఆదాయం లభించింది. ఉప్పల్ భగాయత్‌లో వేలం నిర్వహించతలపెట్టిన 44 ప్లాట్లలో సుమారు 150 చదరపు గజాల నుంచి 1,787 చదరపు గజాల వరకు మొత్తం 19,719 చదరపు గజాల మేర విస్తరించి ఉన్న 23 ప్లాట్లకు ఆన్లైన్ బిడ్డింగ్ జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ.77000, కనిష్టంగా రూ.53 వేలు పలికింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ.లక్షా వెయ్యి చొప్పున, కనిష్టంగా రూ.73 వేల చొప్పున డిమాండ్ రావడం విశేషం. లుక్ ఈస్ట్ లక్ష్యంగా.. ►సుమారు రెండు వేల గజాల నుంచి 15 వేల గజాలకు పైగా ఉన్న మరో 21 ప్లాట్లకు శుక్రవారం ఈ– బిడ్డింగ్ జరగనుంది. ఉప్పల్ భగాయత్‌లోని హెచ్ఎండీఏ లేఅవుట్ ప్లాట్లకు వేలం నిర్వహించడం ఇది వరుసగా మూడోసారి. 2019లో నిర్వహించిన ఈ బిడ్డింగ్‌లో గజానికి గరిష్టంగా రూ.79 వేలు, కనిష్టంగా రూ.36 వేల వరకు ధర పలికింది. ఈ సారి పోటీ మరింత పెరిగింది. ►ఉప్పల్‌లో నిర్మాణ రంగం ఊపందుకుంది. పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణమవుతున్నాయి. మెట్రో రైలు సదుపాయంతో పాటు ఉప్పల్ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అనువైన రవాణా సదుపాయం ఉండడం, ఇటు వరంగల్ హైవేకు, అటు విజయవాడ హైవేకు అందుబాటులో ఉండడంతో మధ్యతరగతి, ఉన్నత ఆదాయ వర్గాలు ఉప్పల్ భగాయత్‌పై ఆసక్తి చూపుతున్నాయి. ►ఈ క్రమంలోనే ప్రభుత్వం సైతం ‘లుక్ ఈస్ట్’ లక్ష్యంతో ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన దృష్టి సారించింది. దీంతో బడా బిల్డర్లు, నిర్మాణ సంస్థలు 10 అంతస్థుల నుంచి 26 అంతస్థుల వరకు కూడా అపార్ట్మెంట్ల నిర్మాణాలను చేపట్టాయి. ఈ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు హాట్ కేక్‌లా అమ్ముడవుతుండడంతో నిర్మాణ సంస్థలు ఈసారి మరింత పోటీ పడ్డాయి. ►గతంలో రూ.79 వేల వరకు డిమాండ్ రాగా ఈ సారి రూ.లక్ష దాటినట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 1.35 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 44 ప్లాట్లలో 21 రెసిడెన్షియల్ ప్లాట్లు, 15 బహళ ప్రయోజన ప్లాట్లు ఉన్నాయి. షాపింగ్ కేంద్రాల కోసం మరో ప్లాట్లు, ఆస్పత్రులకు 2, విద్యాసంస్థలకు 2 ప్లాట్ల చొప్పున కేటాయించారు. -
తిరుమల: 19న వాచీల ఈ–వేలం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీల ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఈనెల 19న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ–వేలం వేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీలకు చెందిన వాచీలు మొత్తం 38 లాట్లు ఉన్నట్లు తెలిపింది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయ పని వేళల్లో 0877–2264429 నంబర్లో గానీ, www.tirumala.org రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in వెబ్సైట్లో గానీ సంప్రదించాలని కోరింది. -
ఫాన్సీ నెంబర్లపై ఇంత మోజా! 0001 ధరెంతో తెలుసా?
ఇండోర్: ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లపై ఉన్న క్రేజ్ మామూలుదికాదు. తమ ముచ్చటైన వాహనానికి లక్కీ నెంబర్ దక్కించుకునేందుకు వాహనదారులు ఎంత సొమ్మైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. వీఐపీ నంబర్లంటే అంత మోజు! అందుకే వీటిని ఈ-వేలంలో అత్యధిక ధరకు సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ వ్యామోహమే రవాణా కార్యాలయాలకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. తాజాగా ఇండోర్ ఆర్టీఓ కార్యాలయం కూడా వీఐపీ నంబర్ల విక్రయం ద్వారా బంపర్ ఆదాయన్ని సాధించింది. ‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్ 5 లక్షల 21 వేల అమ్ముడుబోయింది. అలాగే 0009 నంబర్ లక్షా 82 వేలకు విక్రయించింది. ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ప్రజలు తమ ఆసక్తి కనబర్చడం ఇదే మొదటిసారి కాదు. ఆ స్పెషల్ నంబర్లు గతంలో కూడా రికార్డు ధరకు అమ్ముడు బోయాయి. ఉదాహరణకు, 2017 లో "0001" నంబరు ఢిల్లీలో రూ .16 లక్షలకు వేలం వేయగా, ఈ సిరీస్ 2014 లో రూ .12. 50 లక్షలకు, 2015 ఏడాదిలో రూ.12.05 లక్షలకు విక్రయించబడింది. పుట్టినరోజు, ఇతర ముఖ్యమైన రోజులతోపాటు, ఇంకా వారి వారి జాతకం ఆధారంగా కొందరు కొన్ని లక్కీ నెంబర్లను ఎంచుకుంటారు. -
ఖానామెట్ భూముల వేలం.. రూ.729.41 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్ : ఖానామెట్ భూముల ఈ-ఆక్షన్ ముగిసింది. ఖానామెట్‌లోని 15 ఎకరాల్లో 5 ప్లాట్లకు వేలం జరిగింది. భూముల విక్రయంతో రూ.729.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఖానామెట్‌లో ఎకరం భూమి ధర అత్యధికంగా రూ.55 కోట్లు పలికింది. మంజీరా కన్స్ట్రక్షన్స్ రూ.160.60 కోట్లతో 2.92 ఎకరాలు.. జీవీపీఆర్ ఇంజినీర్స్ లిమిటెడ్ రూ.185.98 కోట్లతో 3.69 ఎకరాలు.. లింక్‌వెల్ టెలీసిస్టమ్స్ రూ.153.09 కోట్లతో 3.15 ఎకరాలు.. అప్‌టౌన్ లైఫ్ ప్రాజెక్ట్స్ రూ.137.34 కోట్లతో 3.15 ఎకరాలు కొనుగోలు చేశాయి. రూ.92.40 కోట్లతో మరో 2 ఎకరాలను లింక్‌వెల్ టెలీసిస్టమ్స్ కొనుగోలు చేసింది. కాగా, కోకాపేట భూములకు హెచ్ఎండీఏ గురువారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ వేదికగా ఈ–వేలం నిర్వహించింది. ఇందులో ఏడు ప్లాట్లు నియోపోలీస్ లేఅవుట్‌వి కాగా ఒక ప్లాట్ గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు సంబంధించినది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 30.778 ఎకరాలతో కూడిన 4 ప్లాట్లు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిగిలిన 19.171 ఎకరాల 4 ప్లాట్లకు వేలం జరిగింది. గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు చెందిన ‘2/పీ వెస్ట్ పార్ట్’ ప్లాట్ నంబర్లో 1.65 ఎకరాలుండగా, ఎకరానికి రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్ ధరను కోట్ చేసి, మొత్తం రూ.99.33 కోట్ల ధరతో ‘రాజపుష్ప రియాల్టీ ఎల్ఎల్పీ’ అనే స్థిరాస్తి వ్యాపార సంస్థ ఆ ప్లాట్‌ను దక్కించుకుంది. గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 2007లో నాటి ప్రభుత్వం కోకాపేటలోని ప్రభుత్వ భూములకు వేలం నిర్వహించగా, అప్పట్లో మిగిలిపోయిన ఈ ప్లాట్‌కు తాజాగా నిర్వహించిన వేలంలో రికార్డు ధర పలకడం గమనార్హం. వేలంలో ఎకరాకు రూ.31.2 కోట్ల అతి తక్కువ బిడ్డింగ్ ధరతో ప్లాట్ నంబర్–‘ఏ’ లోని ఎకరం భూమిని హైమ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. కనీస బిడ్డింగ్ ఇంక్రిమెంట్ ధర ఎకరానికి రూ.20 లక్షల లెక్కన బిడ్డర్లు భూముల ధరలు పెంచుతూ పోయారు. -
‘కోకాపేట’కు కోట్లకు కోట్లు: ఒక్క ఎకరం రూ.60 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కోకాపేటలోని సర్కారు భూముల వేలం సరికొత్త రికార్డులు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కోకాపేటలోని 49.949 ఎకరాల భూములకు ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహించగా, ఓ ప్లాట్‌లో ఎకరం ఏకంగా రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్ ధర పలికింది. అతి తక్కువ ధర రూ.31.2 కోట్లుగా నమోదైంది. మొత్తం 49.949 ఎకరాలకుగాను, ఒక్కో ఎకరం సగటున రూ.40.05 కోట్ల ధరకు అమ్ముడు బోయింది. ప్రభుత్వం ఎకరానికి రూ.25 కోట్ల కనీస ధర (అప్సెట్ ప్రైస్)ను ఖరారు చేయగా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కళ్లు చెదిరే భారీ ధరలతో ప్లాట్లు అమ్ముడుబో యాయి. ఈ ప్లాట్లన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలే కొనుగోలు చేయడం గమనార్హం. కాగా కోకాపేట హాట్‌కేక్ అనే విషయం ఈ వేలం స్పష్టం చేసింది. అప్పుడు మిగిలిపోయిన ప్లాట్ కోకాపేట భూములకు హెచ్ఎండీఏ గురువారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ వేదికగా ఈ–వేలం నిర్వహించింది. ఇందులో ఏడు ప్లాట్లు నియోపోలీస్ లేఅవుట్‌వి కాగా ఒక ప్లాట్ గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు సంబంధించినది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 30.778 ఎకరాలతో కూడిన 4 ప్లాట్లు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిగిలిన 19.171 ఎకరాల 4 ప్లాట్లకు వేలం జరిగింది. గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు చెందిన ‘2/పీ వెస్ట్ పార్ట్’ ప్లాట్ నంబర్లో 1.65 ఎకరాలుండగా, ఎకరానికి రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్ ధరను కోట్ చేసి, మొత్తం రూ.99.33 కోట్ల ధరతో ‘రాజపుష్ప రియాల్టీ ఎల్ఎల్పీ’ అనే స్థిరాస్తి వ్యాపార సంస్థ ఆ ప్లాట్‌ను దక్కించుకుంది. గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 2007లో నాటి ప్రభుత్వం కోకాపేటలోని ప్రభుత్వ భూములకు వేలం నిర్వహించగా, అప్పట్లో మిగిలిపోయిన ఈ ప్లాట్‌కు తాజాగా నిర్వహించిన వేలంలో రికార్డు ధర పలకడం గమనార్హం. వేలంలో ఎకరాకు రూ.31.2 కోట్ల అతి తక్కువ బిడ్డింగ్ ధరతో ప్లాట్ నంబర్–‘ఏ’ లోని ఎకరం భూమిని హైమ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. కనీస బిడ్డింగ్ ఇంక్రిమెంట్ ధర ఎకరానికి రూ.20 లక్షల లెక్కన బిడ్డర్లు భూముల ధరలు పెంచుతూ పోయారు. ఆలస్యమైనా కాసుల వర్షం హెచ్ఎండీఏకు కోకాపేటలో ఉన్న 634 ఎకరాల్లో 167 ఎకరాలను గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 100 ఎకరాలను, ఎంపైర్–1, ఎంపైర్–2 పేరుతో 67 ఎకరాలను 2007లో వేలం ద్వారా విక్రయించారు. అప్పుడు కూడా ఎకరానికి అత్యధికంగా రూ.14.25 కోట్ల ధర పలికింది. అయితే ఈ భూముల విషయంలో వివాదం నెలకొని చాలా ఏళ్ల పాటు సాగింది. 2017లో కోకాపేటలోని భూములన్నీ హెచ్‌ఎండీఏవేనని, వాటిని విక్రయించే హక్కు దానికే ఉందని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో వివాదం సమసింది. అయితే 2007లో వేలం వేసిన 167 ఎకరాలు పోనూ ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్‌కు 110 ఎకరాలు, వివిధ కులసంఘాలకు 55 ఎకరాలు కేటాయించారు. మిగిలిన దాదాపు 300 ఎకరాల స్థలంలో అభివృద్ధి చేసిన సువిశాల రోడ్లు పోనూ మిగిలిన 110 ఎకరాల్లో.. తాజాగా 49.94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను విక్రయించారు. కోర్టు వివాదంతో ఇన్నాళ్లూ ఆలస్యమైనా భారీగా రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు అంటున్నారు. ఎప్పటికప్పుడు సీఎంవోకు.. కోకాపేట భూముల ఆన్లైన్ వేలానికి వచ్చిన స్పందనను ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు తెలుసుకుంది. అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఎంఎస్టీసీ-ఈ కామర్స్ టెక్నికల్ విభాగ సిబ్బంది నిర్వహించిన ఈ ప్రక్రియను సంస్థ కమిషనర్, పురపాలక శా>ఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ పర్యవేక్షించారు. వేలానికి వచ్చిన స్పందనను ఎప్పటికప్పుడు సీఎంవోకు నివేదించారు. కోకాపేట భూములను వేలంలో దక్కించుకోవడానికి దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలతో పాటు ప్రవాస భారతీయులు ఆసక్తి చూపారు. పెట్టుబడులకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని తాజాగా నిర్వహించిన కోకాపేట భూముల వేలం రుజువు చేసింది. దాదాపు 60 మంది బిడ్డర్లు దేశ విదేశాల నుంచి ఈ వేలంలో పాల్గొన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. -
8 ప్లాట్ల విక్రయం.. రూ.2500 కోట్లు వస్తుందని అంచనా
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మరో భారీ భూ వేలానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో సువిశాల రోడ్లతో అభివృద్ధి చేసిన నియోపొలిస్ లేఅవుట్లోని ప్లాట్లతో పాటు గోల్డెన్ మైల్ లే అవుట్‌లోని ప్లాటును ఆన్లైన్ వేలం ద్వారా విక్రయిస్తోంది. ఎకరానికి కనీస ధర రూ.25 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణయించినా.. అందుకు రెట్టింపు ధర రావడం ఖాయమని ఆ సంస్థ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ లెక్కన రూ.2,500 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తోంది. 8 ప్లాట్ల విక్రయం రూ.2500 కోట్లు వస్తుందని హెచ్ఎండీఏ అంచనా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు... ప్లాట్ నంబర్లు: నియోపోలిస్ లేఅవుట్ ప్లాట్లు 1,2,3,12 మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు... ప్లాట్ నంబర్లు: నియోపోలిస్ లేఅవుట్ ప్లాట్లు 4, 13, ప్లాట్ ఏ, గోల్డెన్ మైల్ లేఅవుట్ ప్లాట్ నంబర్ 2/పీ/వెస్ట్ పార్ట్ -
25 లక్షలు పలికిన గాంధీ పెయింటింగ్
ప్రధాని మోదీ అందుకున్న జ్ఞాపికల ప్రదర్శన, ఈ–వేలంలో గాంధీజీ చిత్రం అత్యధికంగా రూ.25 లక్షలు పలికింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రదర్శన, ఈ–వేలం సెప్టెంబరు 14న ప్రారంభమై శుక్రవారంతో ముగిసింది. ఈ వేలం ద్వారా 2,772 జ్ఞాపికలు అమ్ముడయ్యాయి. ఇందులో అతి తక్కువగా గణేశ్ విగ్రహం రూ. 500, అత్యధికంగా గాంధీ పెయింటింగ్ రూ. 25లక్షలు పలికింది. ఈ సొమ్మును నమామి గంగా మిషన్‌కు ఇవ్వనున్నారు. -
మోదీ కలశానికి రూ. కోటి
న్యూఢిల్లీ: సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వేలంలో ప్రధాని మోదీకి చెందిన వస్తువులు భారీ ధర పలుకుతున్నాయి. వీటిలో వెండి కలశం, మోదీ ఉన్న ఓ ఫొటో స్టాండ్లు సోమవారం జరిగిన వేలంలో ఒక్కొక్కటీ కోటి రూపాయలు పలికాయి. అందులో కలశం ప్రారంభ ధర రూ. 18 వేలు కాగా వేలంలో ఏకంగా రూ. కోటీ మూడు వందలకు అమ్ముడైంది. ఫొటో స్టాండ్ ధర రూ. 500 కాగా, రూ. కోటి వంద రూపాయలకు అమ్ముడైంది. దూడకు పాలు ఇస్తున్న గోమాత స్వరూపం ప్రారంభ ధర రూ. 1,500 కాగా వేలంలో రూ. 51 లక్షలకు అమ్ముడైంది. -
మోదీ బహుమతులు వేలం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. ఈ బహుమతులను సెప్టెంబర్ 14 నుంచి ఆన్లైన్లో వేలానికి ఉంచనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ బుధవారం తెలిపారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని గంగా నదిని శుభ్రపరచం కోసం మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజక్ట్‌కు కేటాయించనున్నారు. గత ఆరు నెలల కాలంలో మోదీకి వచ్చిన 2,722 బహుమతులను వేలంలో అందుబాటులో ఉంచనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ వస్తువులు న్యూఢిల్లీలోని నేషన్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్‌లో ప్రదర్శన కోసం ఉంచినట్టు చెప్పారు. వస్తువుల ధరలు రూ. 200 నుంచి మొదలుకుని రూ. 2.50 లక్షల వరకు ఉండనున్నట్టు పేర్కొన్నారు. ఈ బహుమతుల్లో భారతీయులు ఇచ్చినవే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కాగా, మోదీకి వచ్చిన బహుమతులను వేలానికి ఉంచడం ఇది రెండోసారి. అంతకుముందు ఈ ఏడాది జనవరి 27 నుంచి ఫిబ్రవరి 9 మధ్యలో తొలిసారిగా మోదీకి వచ్చిన బహుమతులను సాంస్కృతిక శాఖ వేలానికి ఉంచిన సంగతి తెలిసిందే. దీనికి -
ఏడువేల కోట్ల రుణానికి.. 150 కోట్ల ఆస్తా?
ముంబై: భారీగా అప్పులు ఎగ్గొట్టి, ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్‌మాల్యా ఆస్తులను వేలానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి. బ్యాంకులకు విజయ్‌మాల్యా రూ. 7వేల కోట్ల వరకు ఎగనామం పెట్టారు. ఈ క్రమంలో ఆయన నుంచి ఎగ్గొట్టిన రుణాలను రాబట్టుకునేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ముంబైలోని మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ హౌస్‌ను గురువారం ఈ-వేలం వేయనున్నారు. అంధేరిలోని 2,401.70 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీకి రూ. 150 కోట్లకు మించి ధర పలికే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రూ. ఏడువేల కోట్ల అప్పులకు ఈ 150 కోట్ల ఆస్తి ఏ మూలకు సరిపోతుందనే వాదన వినిపిస్తోంది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం గురువారం ఈ కింగ్‌ఫిషర్ హౌస్‌ను ఆన్లైన్లో ఈ వేలం వేయనుంది. ఈ వేలంలో పాల్గొనేవాళ్లు రూ. 5 లక్షలు చెల్లించి, రూ. 15 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. విజయ్‌మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ బ్యాంకుల నుంచి రూ. 6,963 కోట్లు రుణాలు తీసుకొని.. ఎగ్గొట్టింది. ప్రస్తుతం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దివాళాతీసి మూతపడటంతో గత ఏడాది దానికి చెందిన ఈ భవనాన్ని ఎస్బీఐ స్వాధీనం చేసుకుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకుగాను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తోపాటు విజయ్‌మాల్యా, ఆయనకు చెందిన యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ కూడా పూచికత్తు దారులుగా ఉన్నాయి. బ్యాంకు రుణాల ఎగవేత వ్యవహారం తలకు చుట్టుకోవడంతో విజయ్‌మాల్యా దేశం నుంచి వెళ్లిపోయి ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్టు భావిస్తున్నారు. గోవాలోని కింగ్ఫిషర్కు చెందిన విల్లాను కూడా బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విల్లాకు రూ. 90 కోట్లు ధర పలుకుతుందని భావిస్తున్నారు. -
ఎట్టకేలకు ఇసుక ఈ వేలం
శ్రీకాకుళం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు ప్రవేశ పెట్టిన కొత్త విధానం మొదలైంది. ఈవేలంలో ఇసుక రీచ్‌లను ఖరారు చేస్తూ ఎంఎస్టీసీ ఎట్టకేలకు 13 రీచ్‌లను సిద్ధం చేసింది. అత్యధిక బిడ్లను కోడ్ చేసిన 13 ఏజెన్సీలకు రీచ్‌లు దక్కాయి. మూడు రీచ్‌లను ప్రజా ప్రయోజనాల పేరిట నిలిపివేశారు. అత్యధికంగా ఆమదాలవలస మండలం చవ్వాకులపేట రీచ్ రూ.2.29కోట్లుకు మాధవీ ఏజెన్సీస్ దక్కించుకోగా అత్యల్పంగా బుచ్చిపేట ర్యాంపు రూ.44.40లక్షలకు వెంకటలక్ష్మీ ఆటో సెంటర్ దక్కించుకొంది. అక్కడ క్యూబిక్ మీటరు ధర రూ.222గా నిర్ణయించి కోడ్ చేశారు. జిల్లాలో 13 రీచ్‌లకు రూ.222 క్యూబిక్ మీటరు ఇసుక ధర కంటే మించి బిడ్డర్లు దాఖలు చేయలేదు. క్యూబిక్ మీటరు ఇసుక రూ.220 లోపే : ఇసుక ర్యాంపులలో ఏ ర్యాంపు చూసినా క్యూబిక్ మీటరు ఇసుక రూ.220 లోపే దక్కించుకున్నారు. హయాతినగరం ఇసుక ర్యాంపును గోదావరి ఎంటర్‌ప్రెజైస్ క్యూబిక్ మీటరుకు రూ.160 వంతున రూ.67,43,808లకు దక్కించుకొంది. అంధవరం ర్యాంపును రఘురాం ఆగ్రోవర్క్ క్యూబిక్ మీటరుకు రూ.188 వంతున రూ.2,03,04,000లకు, బిల్లమడ ర్యాంపును మహ్మద్ సులేమాన్ క్యూబిక్ మీటరుకు రూ.158 వంతున రూ.79,63,200లకు, బుచ్చిపేట ఇసుక ర్యాంపును వెంకటలక్ష్మీ ఆటో సెంటర్ క్యూబిక్ మీటరుకు రూ.222 వంతున రూ. 44,40,000లకు, చవ్వాకులపేట ఇసుక ర్యాంపును మాధవి ఏజెన్సీస్ క్యూబిక్ మీటరుకు రూ.160 వంతున రూ.2,29,00,000లకు దక్కించుకున్నారుు. అలాగే,దూసి ఇసుక ర్యాంపును క్యూబిక్ మీటరుకు రూ.212 వంతున రూ.84,80,000లకు, కడుమ ఇసుక ర్యాంపును ఎస్ఎస్ఎస్ వైన్స్ క్యూబిక్ మీటరుకు రూ.154 వంతున రూ.1,32,78,000లకు, కల్లేపల్లి ఇసుక ర్యాంపును వెంకటేష్ ఎంటర్ప్రైజెస్ క్యూబిక్ మీటరుకు రూ.152 వంతున 61,56,000లకు,పొన్నాం ఇసుక ర్యాంపును శ్రీలక్ష్మీనారాయణ కంపెనీ వర్క్స్ క్యూబిక్ మీటరుకు రూ.168 వంతున రూ.84,10,000లకు, సింగిడి ఇసుక ర్యాంపును గవర ఉషారాణి క్యూబిక్ మీటరుకు రూ.156 వంతున రూ.78,62,400లకు, యరగాం ఇసుక ర్యాంపును కె.సాయిబాబు క్యూబిక్ మీటరుకు రూ.156 వంతున రూ.1,01,88,800లకు, పురుషొత్తపురం ఇసుక ర్యాంపును బి.వాసుదేవరావు క్యూబిక్ మీటరుకు రూ.180 వంతున రూ.1,29,60,000లకు పొందారు. సిరుసువాడ ఇసుకర్యాంపును విఘ్నేశ్వరా ట్రేడింగ్స్ క్యూబిక్ మీటరుకు రూ.152 వంతున రూ. 1,82,40,000 వేలంపాటలో దక్కించుకున్నారు. మడపాం, పోతయ్యవలస, సింగూరు ర్యాంపులను ప్రజా అవసరాల కోసం నిలుపు చేసినట్టు చెబుతున్నా మంత్రి అనుచరులకు, విప్ అనుచర గణానికి అనధికారికంగా కట్టబెట్టేందుకే ఈ ర్యాంపులు వేలంపాటలో లేకుండా మైన్స్ అధికారులు చక్రం తిప్పారన్న విమర్శలు బిడ్డర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. పరోక్షంగా అధికారపక్షం వారికి అనువుగా వీటిని ప్రజా అవసరాలని చెప్పి తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ సమయంలోనే జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ సెలవుపై వెళ్లడం ఈ చర్చకు బలం చేకూరుస్తోంది.