న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. ఈ బహుమతులను సెప్టెంబర్ 14 నుంచి ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ బుధవారం తెలిపారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని గంగా నదిని శుభ్రపరచం కోసం మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజక్ట్‌కు కేటాయించనున్నారు.
గత ఆరు నెలల కాలంలో మోదీకి వచ్చిన 2,722 బహుమతులను వేలంలో అందుబాటులో ఉంచనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ వస్తువులు న్యూఢిల్లీలోని నేషన్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్‌లో ప్రదర్శన కోసం ఉంచినట్టు చెప్పారు. వస్తువుల ధరలు రూ. 200 నుంచి మొదలుకుని రూ. 2.50 లక్షల వరకు ఉండనున్నట్టు పేర్కొన్నారు. ఈ బహుమతుల్లో భారతీయులు ఇచ్చినవే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కాగా, మోదీకి వచ్చిన బహుమతులను వేలానికి ఉంచడం ఇది రెండోసారి. అంతకుముందు ఈ ఏడాది జనవరి 27 నుంచి ఫిబ్రవరి 9 మధ్యలో తొలిసారిగా మోదీకి వచ్చిన బహుమతులను సాంస్కృతిక శాఖ వేలానికి ఉంచిన సంగతి తెలిసిందే. దీనికి
Comments
Please login to add a commentAdd a comment