అయోధ్య: ప్రపంచమంతా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట ఉత్సవం ఈ నెల 22న మధ్యాహ్నం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకకు హాజరయ్యే ముఖ్య అతిథులకు ఒక అపూర్వమైన కానుకను టెంపుల్ యాజమాన్యం అందించనుంది. ఈ కానుకకు ప్రత్యేకంగా రామ్‌రాజ్ అని పేరు కూడా పెట్టారు.
వీటితో పాటు అదనంగా అతిథులకు ప్రత్యేకంగా తయారు చేయించిన మోతీచూర్ లడ్డూలను కూడా ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఇంతకీ రామ్‌రాజ్ కానుకలో ఏముంటుందంటే అయోధ్యలో రామ్‌మందిరం నిర్మాణం ప్రారంభించే ముందు మందిర పునాదిలోని పవిత్రమైన మట్టిని సేకరించారు. ప్రత్యేకమైన బాక్సుల్లో ఆ మట్టిని ప్యాక్ చేసి వాటిని గిఫ్ట్‌లుగా అలంకరించారు.
కాగా, దేశం నలుమూలల నుంచి ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానాలు అందుకున్న మొత్తం 11 వేల మంది విశిష్ట అతిథులకు రామ్‌రాజ్ బాక్సులు అందించనుండటం విశేషం.ఈ అతిథుల్లో ఎవరైనా వేడుకకు రాకపోతే వారు తర్వాత తొలిసారి గుడికి వచ్చినపుడు రామ్‌రాజ్ కానుకను అందజేస్తారు. ప్రధాని మోదీకి 15 మీటర్ల పొడవున్న రాముని గుడి చిత్ర పటాన్ని జ్యూట్ బ్యాగులో ఉంచి గుడి యాజమాన్యం కానుకగా ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment