Guests
-
మోదీ ప్రమాణస్వీకారం.. అతిథుల్లో కూలీలు, హిజ్రాలు
న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రమాణస్వీకారానికి ఎందరో అతిథులు విచ్చేయనున్నారు. ఆదివారం(జూన్9) జరిగే ఈ కార్యక్రమానికి కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో కొన్ని ప్రత్యేకతలుండటంతో పాటు కొంత మంది ప్రత్యేక అతిథులు కూడా హాజరుకానున్నారు.కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్తా నిర్మాణంలో పాల్గొన్న కూలీలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు, మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేసిన అధికారులతో పాటు పలువురు హిజ్రాలు, శానిటేషన్ సిబ్బంది, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తదితరులకు మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమాకి ఆహ్వానాలు అందాయి. కాగా, మోదీ ప్రమాణస్వీకారానికి పలువురు ఇతర దేశాల అధినేతలు కూడా రానున్నారు. -
అంబానీ ఇంట పెళ్లి సందడి: అతిథులకు అదిరిపోయే గిఫ్ట్..?!
బిలియనీర్లు, బిజినెస్ దిగ్గజాల ఇంట్లో పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదుగా. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు, వ్యాపారవేత్త అనంత్అంబానీ, రాధిక మర్చంట్ మూడుముళ్ల వేడుక అంటే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే అంబానీ చేతితో రాసారని చెబుతున్న ఇన్విటేషన్ కార్డ్ ఒకటి నెట్టింట హల్ చల్ చేసింది. అయితే, అంబానీ కుటుంబం ఈ వార్తలను ధృవీకరించలేదు అలాగని ఖండించనూ లేదు.దీంతో మరిన్ని ఊహాగానాలు, అంచనాలు వెలుగులోకి వస్తున్నాయి. జూలైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గ్రాండ్ వెడ్డింగ్ అంబానీ ఫ్యాన్ పేజీలలో ప్రకారం, అనంత్ ,రాధిక జూలై 2024లో ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.జూలై 10, 11 , 12 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లికి VIP గెస్ట్ హౌస్‌లతో పాటు 1200 మంది అతిథులు రానున్నారు. సింగర్, దిల్జిత్ దోసాంజ్ వారి వివాహానికి ముందు ఉత్సవాల్లో అనేక మంది ప్రదర్శనకారులలో ఉంటారు. జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో ఈ ఏడాది మార్చిలో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ అవుతాయి.దీంతో పాటు అనంత్ అంబానీ , రాధిక డిజైనర్ దుస్తులు, విందు, ఇలా పెళ్లికి సంబంధించి అనేక పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పెళ్లి హడావిడి మొదలైందని కొన్ని ఫోటోలు షేర్ అవుతున్నాయి. ఇందులో వధువు తండ్రి, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ రాధిక స్నేహితులతో కలిసి పోజులిచ్చాడు. ఎంబ్రాయిడరీ నెహ్రూ జాకెట్, బ్లాక్ కలర్ బంద్‌గాలా షేర్వాణిలో వీరేల్ హుందాగా కనిపించాడు. Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..! దివ్యాంగులు తయారు చేసిన స్పెషల్ క్యాండిల్స్ మరో ఇంట్రస్టింగ్ వార్త ఏంటంటే..పెళ్లికి వచ్చిన అతిథులకు మహాబలేశ్వర్‌లోని అంధ ళాకారుల తయారు చేసిన ప్రత్యేక కొవ్వొత్తులను బహుమతిగా ఇస్తారట. స్వదేశీ పురాతన హస్తకళ, అమూల్యమైన వారసత్వ సంపదకు ఇషా అంబానీ సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలంకరణకు కూడా వీటిని ఎక్కువగా వాడనున్నారట. ( ‘గో నిషా గో’ గేమ్ : వారి కోసమే, డౌన్లోడ్లతో దూసుకుపోతోంది) -
Ayodhya Ram Mandir: అతిథులకు అపూర్వ కానుక! ఏంటంటే..
అయోధ్య: ప్రపంచమంతా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట ఉత్సవం ఈ నెల 22న మధ్యాహ్నం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకకు హాజరయ్యే ముఖ్య అతిథులకు ఒక అపూర్వమైన కానుకను టెంపుల్ యాజమాన్యం అందించనుంది. ఈ కానుకకు ప్రత్యేకంగా రామ్రాజ్ అని పేరు కూడా పెట్టారు. వీటితో పాటు అదనంగా అతిథులకు ప్రత్యేకంగా తయారు చేయించిన మోతీచూర్ లడ్డూలను కూడా ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఇంతకీ రామ్రాజ్ కానుకలో ఏముంటుందంటే అయోధ్యలో రామ్మందిరం నిర్మాణం ప్రారంభించే ముందు మందిర పునాదిలోని పవిత్రమైన మట్టిని సేకరించారు. ప్రత్యేకమైన బాక్సుల్లో ఆ మట్టిని ప్యాక్ చేసి వాటిని గిఫ్ట్‌లుగా అలంకరించారు. కాగా, దేశం నలుమూలల నుంచి ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానాలు అందుకున్న మొత్తం 11 వేల మంది విశిష్ట అతిథులకు రామ్రాజ్ బాక్సులు అందించనుండటం విశేషం.ఈ అతిథుల్లో ఎవరైనా వేడుకకు రాకపోతే వారు తర్వాత తొలిసారి గుడికి వచ్చినపుడు రామ్రాజ్ కానుకను అందజేస్తారు. ప్రధాని మోదీకి 15 మీటర్ల పొడవున్న రాముని గుడి చిత్ర పటాన్ని జ్యూట్ బ్యాగులో ఉంచి గుడి యాజమాన్యం కానుకగా ఇవ్వనుంది. ఇదీచదవండి.. రూ.50 వేల కోట్ల వ్యాపారం.. అంతా రాముని దయ -
అంధ్రమేవ జయతే.. రాజమహేంద్రవరంలో "అంతర్జాతీయ తెలుగు మహాసభలు"
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్,చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రాజరాజ నరేంద్రుల వారి పట్టాభిషేక సహస్రాబ్ది ఉత్సవాల నీరాజనం గా 2వ అంతర్జాతీయ తెలుగు మహా సభలు -2024, జనవరి 5, 6,7 తేదీలు 2024 ఉదయం 8.30 నుండి మూడు రోజుల పాటు గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాలయ ప్రాంగణం రాజమహేంద్రవరం. అంధ్ర ప్రదేశ్ లో నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ ,చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ చైతన్యరాజులు, పరిషత్ కార్యదర్శి శ్రీ రెడ్డప్ప ధవేజీ పాత్రికేయ సమావేశంలో తెలిపారు. తెలుగు భాషా వికాసం కోసం.. అంధ్రమేవ జయతే ! అన్న నినాదంతో తెలుగు భాషలోని షుమారు 25 పై ప్రముఖులతో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలాది మంది విద్యార్థులు తెలుగు సంస్కృతి , భారతీయతల పై సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు , జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, పీఠాధిపతులు , చలనచిత్ర ప్రముఖులు అతిథులుగా రానున్నారని తెలిపారు. ప్రాంగణం లో ఒక ప్రధాన వేదిక, రెండు ఉప వేదికలు, గ్రంధాల, ఆయుర్వేద, చిరు ధాన్యాలు, , కొండపల్లి, లేపాక్షి, ఏటికొప్పాక కళలు , తెలుగు వైభవం చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ కళల తో పాటు సంచార జాతుల కళా ప్రదర్శనలకు కూడా పెద్ద పీట వేస్తామని తెలిపారు. షుమారు 50 దేశాల నుండి ప్రతినిధులు హాజరు అయ్యే అవకాశం ఉందని, రాష్ట్రేతర తెలుగు సంఘాల వారిని కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రవేశ రుసుము లేకుండా మహా సభల సాంస్కృతిక, సాహితీ వేదికల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. శ్రీ రాజరాజ నరేంద్రుల వారి పట్టాభిషేక సహస్రాబ్ది సందర్భంగా తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలతో వేయి కవితలతో ,వేయి మంది కవులతో సహస్ర కవితా నీరాజనం ఇవ్వనున్నామని నిర్వాహకులు తెలిపారు. సదస్సులు, కవి సమ్మేళనాలతో కలిపి పాల్గొనేవారు 3000 మంది , సాంస్కృతిక కార్యక్రమాలు 15 వేల మంది వీక్షించే సదుపాయం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ కేశిరాజు రామప్రసాద్, శ్రీ శర్మ లు ముఖ్య సమన్వయ కర్తలుగా ఉంటారని తెలిపారు. త్వరలో తెలుగు మహా సభలు 2024 వెబ్సైట్ కూడా ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ పాత్రికేయ సమావేశం లో పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ మేడికొండ శ్రీనివాస్, డా.కడిమిళ్ళ వరప్రసాద్ సహస్రావధాని, కోశాధికారి శ్రీ రాయప్రోలు భగవాన్, సంయుక్త కార్యదర్శులు శ్రీ పొన్నపల్లి రామారావు, శ్రీ మంతెన రామకుమార్ , సలహాదారులు శ్రీ బాబూశ్రీ,, శ్రీ అడ్డాల వాసుదేవరావు, , కవి సమ్మేళనం సమన్వయ కర్త డా. ఎస్.ఆర్ .ఎస్ కొల్లూరి లు పాల్గొన్నారు. డా.గజల్ శ్రీనివాస్ 9849013697 -
ప్రతి సినిమాకు అదే అసలైన బలం : విశ్వక్ సేన్
‘చరిత్ర సృష్టించే సినిమాలకు బడ్జెట్ ఇంత ఉండాలనే అవసరం లేదని ‘పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి, బలగం, మసూద, ఫలక్‌నుమా దాస్’ వంటి ఎన్నో చిత్రాలు నిరూపించాయి. సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టామనేది చూస్తుంటారు చాలామంది. కానీ ఆ చిత్రంలో పనిచేస్తున్న వాళ్లు ఎంత ప్రతిభావంతులు అనేది చూస్తే అదే సినిమాకు అసలైన బలం. ‘రామన్న యూత్’ చిత్రానికి అలాంటి మ్యాజిక్ జరగాలి.ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. అమూల్య రెడ్డి హీరోయిన్గా చేశారు. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడకకి విశ్వక్ సేన్, నటులు ప్రియదర్శి, తిరువీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో తిర్వీర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నాతో కలిసి ఆటోలో తిరిగిన అభయ్ నవీన్ ఇప్పుడు ఇలా సినిమా చేశాడని అంటే ఆనందంగా ఉంది. డబ్ స్మాష్ ద్వారా చాలా వీడియోలు చేసేవాడు. కలిసి సినిమాలో నటించాం. అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చిన అభయ్..ఇప్పుడు డైరెక్టర్ అయి మా ఫ్రెండ్స్ కు అవకాశాలు ఇవ్వడం సంతోషంగా ఉంది’ అన్నారు. ‘నేను సినిమా చూశాను. చాలా ఫన్ ఫీలయ్యా, అలాగే కొన్ని చోట్ల సర్ ప్రైజ్ అయ్యాను. రామన్న యూత్ సినిమాలో ఒక జీవితం ఉంటుంది’ అని హీరో ప్రియదర్శి అన్నారు. ‘‘ప్రేక్షకులకు చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనేది తెలియదు. మంచి కథ ఉంటే ఆ చిత్రాన్ని తప్పకుండా చూస్తారు. ‘రామన్న యూత్’ని థియేటర్ లో చూసి ప్రోత్సహించాలి’’ అన్నారు అభయ్ నవీన్. -
పెళ్లిలో ఫొటోగ్రాఫర్ స్టెప్పులు.. నెటిజన్స్ ఫిదా..!
ఎక్కడైనా ఫొటోగ్రాఫర్ అంటే వేడుకల్లో మంచి స్టిల్స్ తీస్తూ బిజీగా ఉంటాడు. తనపని తాను చేసుకుంటూ ఫంక్షన్లో సందడిని చూస్తుంటాడు. కానీ ఫొటోగ్రాఫర్ ఏకంగా డ్యాన్సులు వేస్తే..? ఫొటోలు ఎవరు తీస్తారనే ప్రశ్నలు వేయకండి. ఎందుకంటే రెండు పనులను ఒంటి చేత్తే చేసేశాడు మీరు ఇప్పుడు చూడబోయే ఫొటోగ్రాఫర్. పెళ్లికి బంధువులంతా గుమికూడారు. ఇంట్లో సందడి బాగా నెలకొంది. ఆ సందడిని మరింత పెంచాడు పెళ్లికి వచ్చిన ఫొటోగ్రాఫర్. బంధువులతో పాటు కలిసి చిందులు వేశాడు. ఓ వైపు ఫొటోలు తీస్తూనే మరోవైపు వీడియోలు తీశాడు. పెళ్లికి వచ్చిన బంధువులు కూడా అతనితో పాటు కలిసి స్టెప్పులు వేశారు. if your wedding camera man ain’t doing this …..ask for refund pic.twitter.com/UGOwDdedi5 — Punjabi Touch (@PunjabiTouch) August 14, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం రెండు రోజుల్లోనే 2 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ డ్యాన్సుకు నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. డ్యాన్సు చేస్తూ ఫొటోలు తీసినందుకు అతన్ని మెచ్చుకున్నారు. అతను తీసిన ఫొటోలు ఎలా ఉన్నాయో చూడాలని ఉందంటూ మరో యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ఇదీ చదవండి: స్టైలిష్ లుక్‌లో రాహుల్ గాంధీ.. లద్దాఖ్‌లో బైక్ టూర్.. -
ఢిల్లీ పంద్రాగస్టు వేడుకలకు రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఎర్రకోటలో ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వనించింది. కరీంనగర్‌లోని రైతుప్రగతి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ప్రైవేట్ లిమిటెడ్ లబ్ధిదారులు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని భూసంపాడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌తోపాటు హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాది 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చైతన్యవంతమైన గ్రామాల సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు, న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన శ్రామికులు, ఖాదీ రంగ కార్మికులు, జాతీయ అవార్డు పొందిన పాఠశాల ఉపాధ్యాయులు, సరిహద్దు రోడ్ల సంస్థ కార్మికులు, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజన ప్రాజెక్ట్‌ల కోసం సహాయం చేసినవారు, పనిచేసినవారు ఈ ప్రత్యేక ఆహ్వనితుల జాబితాలో ఉన్నారు. ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వనించడంపై కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘం చైర్మన్ సంద మహేందర్, ఆదిలాబాద్ జిల్లా గుండాలకు చెందిన భూసంపద రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ చైర్మన్ జూన గణపతిరావు, సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు జనార్దన్ గంగపుత్ర సంతోషం వ్యక్తం చేశారు. -
NMACC పార్టీలో టిష్యూ పేపర్ బదులుగా, రూ.500 నోటా? నిజమా?
సాక్షి, ముంబై: బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ‘నీతా ముఖేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC)’ ప్రారంభం వేడుకల్లో మరో విషయం ఆసక్తికరంగా మారింది. టిష్యూ పేపర్లలా రూ. 500నోట్లను ఉంచారన్న వార్త ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. (NMACC: డాన్స్‌తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్‌కైతే ) బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు, ఇతర ప్రముఖులు సందడి చేసిన అంబానీల గ్రాండ్ పార్టీపై ఒక ట్విటర్ యూజర్ ఒక పోస్ట్ పెట్టారు. అంబానీ జీ కే పార్టీ మే టిష్యూ పేపర్ కీ జగహ్ 500 కే నోట్స్ హోతే హై (sic)’’ అని ట్వీట్ చేశాడు. దీంతో రుచి కరమైన వంటకాలతో పాటు కరెన్సీ నోట్లు వడ్డించారా అంటూ నెటిజన్ల కామెంట్లు వైరలయ్యాయి. (అమ్మ విషయంలో అది చాలా బాధగా ఉంటుంది: ఇన్ఫీ నారాయణమూర్తి ) నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ లాంచింగ్ సందర్భంగా వడ్డించిన తీపి పదార్థంపైనే ఈ చర్చ అన్నమాట. అతిథులకు వడ్డింయిన ఖరీదైన వంటకాలకు తోడు, ఈ స్వీటు, కరెన్సీ నోట్లతోపాటు ఉండటంతో ఈ ప్రత్యేక స్వీట్ ఫొటో హాట్ టాపిక్‌గా నిలిచింది. మీమ్స్‌తో నెటిజన్లు సందడి చేశారు. Ambani ji ke party mein tissue paper ki jagah 500 ke notes hote hain 😭 pic.twitter.com/3Zw7sKYOvC — R A T N I S H (@LoyalSachinFan) April 2, 2023 అయితే అసలు విషయం ఏమిటంటే.. ఈ స్వీట్ పేరు ‘దౌలత్ కి చాట్’ (daulat ki chaat) ఉత్తర భారతదేశంలో చాలా ఇష్టపడే వంటకం. ప్రత్యేకంగా శీతాకాలంలో ఎక్కువ సేవిస్తారట. బాగా మరిగించిన పాలను చల్లబరిచిన తర్వాత తయారు చేస్తారు. పిస్తా, కోవా,బాదం,చక్కెర తదితర రిచ్ ఇంగ్రీడియెంట్స్‌తో గార్నిష్ చేస్తారంటూ ఫుడ్ ఎక్స్పర్ట్స్, కొంతమంది నెటిజన్లు స్పందించారు. ఈ స్వీట్ ఢిల్లీలో కూడా చాలా పాపులర్ అని ఒకరు. ఇది చాలా రెస్టారెంట్లలో ఇది దొరుకుతుందని మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఈ ఫుడ్ ఐటమ్ చుట్టూ పెట్టిన కరెన్సీ నోట్లు కూడా నకిలీవే అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు. దీంతో అంబానీ పార్టీలో కరెన్సీ నోట్ల వడ్డన అనే ఊహాగానాలకు చెక్ పడింది. కాగా శుక్రవారం సాయంత్రం మొదలైన ఈ గ్రాండ్ ఈవెంట్ ఉత్సవాలు మూడురోజుల పాటుసాగాయి. నీతా అంబానీ స్వయంగా ప్రదర్శించిన నృత్యప్రదర్శనతోపాటు, బాలీవుడ్, హాలీవుడ్ తారల డ్యాన్స్‌లు, షారూక్, గౌరీ డాన్స్, ప్రియాంక చోప్రా, రణవీర్ స్టెప్పులు, టాలీవుడ్ ఆస్కార్ విన్నర్ సాంగ్ నాటునాటు పాటకు రష్మిక, అలియా నృత్యం, అలాగే శనివారం జరిగిన ఈవెంట్లో ఆస్కార్ విజేత ముంబైకి వచ్చి పింక్ కార్పెట్‌పై అలరించిన సంగతి తెలిసిందే. @Ruhaani77 pic.twitter.com/At1f4ZXr5Z — garima (@badanpesitaree) April 2, 2023 -
హైదరాబాద్ సాహిత్యోత్సవం.. ప్రత్యేకతలు ఇవే
సాక్షి, హైదరాబాద్: వైవిధ్యభరితమైన హైదరాబాద్ సాహితీ ఉత్సవం (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్) 13వ ఎడిషన్‌కు నగరం సన్నద్ధమవుతోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు విద్యారణ్య స్కూల్ వేదికగా వేడుకలు జరగనున్నాయి. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు హెచ్ఎల్ఎఫ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభిన్న కళలు, సాహిత్యం, సంస్కృతులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రతి సంవత్సరం హైదరాబాద్ సాహిత్యోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2010 నుంచి నిరాటంకంగా (కోవిడ్ కాలం మినహా) జరుగుతున్న లిటరరీ ఫెస్టివల్ అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యాన్ని గడించింది. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు, భిన్న భావజాలాలు, విభిన్న జీవన సమూహాలను ప్రతిబింబించే కళారూపాలకు, సాహిత్య, సాంస్కృతిక ప్రక్రియలకు ఇది వేదికగా నిలిచింది. మూడు రోజుల పాటు సాహితీ ప్రియులను అక్కున చేర్చుకొని సమకాలీన సాహిత్య, సామాజిక అంశాలపై లోతైన చర్చలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అతిథి దేశంగా జర్మనీ.. హెచ్ఎల్ఎఫ్ 13వ ఎడిషన్‌కు జర్మనీ అతిథి దేశంగా హాజరు కానుంది. ఆ దేశానికి చెందిన పలువురు రచయితలు, మేధావులు భాగస్వాములు కానున్నారు. ప్రముఖ జర్మనీ యువ నవలా రచయిత్రి ఎవేన్‌కో బుక్కోసీ ఈ వేడుకల్లో పాల్గొంటారు. జర్మనీ కళారూపాలను ప్రదర్శించనున్నారు. కొంకణి సాహిత్యం ఎంపిక.. ఈ ఏడాది కొంకణి భాషా సాహిత్యాన్ని భారతీయ భాషగా ఎంపిక చేశారు. గతేడాది జ్ఞానపీఠ అవార్డు పొందిన కొంకణికి చెందిన ప్రముఖ రచయిత దామోదర్ మౌజో ఈ వేడుకల్లో కీలకోపన్యాసం చేయనున్నారు. కొంకణి భాషా చిత్రాల దర్శకుడు బార్డ్‌రాయ్‌బరెక్టో పాల్గొంటారు. కొంకణి నృత్యాలు, జానపద కళలను ప్రదర్శించనున్నారు. ప్రముఖుల ప్రసంగాలు ప్రఖ్యాత దర్శకుడు దీప్తీ నవల్, ప్రముఖ పాత్రికేయుడు, రచయిత పాలగుమ్మి సాయినాథ్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మానస ఎండ్లూరి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నుంచి గీతా రామస్వామి, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. జర్మనీతో పాటు అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన రచయితలు, కళాకారులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మందికి పైగా ప్రతినిధులు వేడుకల్లో పాల్గొంటారు. వేడుకల్లో భాగంగా హైదరాబాద్ చారిత్ర వైభవాన్ని, వాస్తు నైపుణ్యాన్ని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉషా ఆకెళ్ల రూపొందించిన ‘హమ్ ఐసీ బాత్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇది అందరి వేడుక: ప్రొఫెసర్ విజయ్‌కుమార్ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ఈసారి మెట్రో రైల్ ప్రత్యేక ప్రచారం నిర్వహించనుంది. ఖైరతాబాద్ నుంచి విద్యారణ్య స్కూల్ వరకు మూడు రోజుల పాటు ప్రతి 15 నిమిషాలకో ఉచిత ట్రిప్పును ఏర్పాటు చేయనుంది. (క్లిక్ చేయండి: ప్రెస్ – పిక్చర్ – ప్లాట్‌ఫాం!) -
మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. లైవ్ డిబేట్లో ఏం చేసిందో తెలుసా?
కోల్‌కతా: సాధారణంగా టీవీ డిబేట్లలో పాల్గొనడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులను, ఆయా రంగాలకు ప్రముఖులను ఆహ్వనిస్తుంటారు. కొన్నిసార్లు ఈ డిబేట్లు ఆసక్తికరంగా సాగితే మరికొన్ని సార్లు ఫన్నీగాను సాగుతుంటాయి. ఈ డిబేట్లలో పాల్గొనే వక్తలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు లైవ్ డిబేట్లలో మాటమాట పెరిగి.. సభ్యులు ఒకరిపై మరొకరు దాడిచేసుకొవడం, తిట్ల దండకాన్ని అందుకోవడం మనకు తెలిసిందే. కొన్నిసార్లు ఈ డిబేట్లలో హద్దులు దాటి కూడా ప్రదర్శిస్తుంటారు. కొందరు ఎదుటివారి దృష్టిని తమవైపు ఆకర్శించడానికి కొందరు తమ నోటికి పనిచేబితే.. మరికొందరు ఎదుటివారి వాదనలు వినకుండా ఫన్నీగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా.. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక టీవీ ఛానెల్ డిబేట్లో యాంకర్, ఐదుగురు సభ్యులు డిబెట్లో పాల్గొన్నారు. దీనిలో అందరు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈక్రమంలో డిబెట్లో పాల్గొన్న ఒక మహిళ తన వంతు కోసం వేచిచూస్తుంది. ఏదో చెప్పాలనుకుంటుంది. అయితే, మిగతా సభ్యులు మాత్రం ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దాంతో ఆమె హైడ్రామా క్రియేట్ చేసింది. ఆ మహిళ లైవ్‌లోనే స్టెప్పులేయడం ప్రారంభించింది. దీంతో పక్కనున్న సభ్యులు మహిళ చర్యపట్ల ఆశ్చర్యంతో ఆమె వైపే చూస్తు ఉండిపోయారు. ఆ మహిళ మాత్రం.. తన రెండు చేతులను వివిధ భంగిమలతో చూపిస్తూ .. వెరైటీగా డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత.. గట్టిగా అరుస్తు వెరైటీగా స్పందించింది. ఈ ఫన్నీ డిబెట్ గతంలోనే జరిగింది. ఆకుపచ్చని కుర్తీవేసుకున్న మహిళ రోష్నిఆలీ. ఆమె పర్యావరణ వేత్త. తాజాగా, దీన్ని ఎలిజబెత్ అనే ట్విటర్యూజర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో మరోసారి ఇది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. భలే స్టెప్పులేసింది..’, ‘మహిళ ఎవరిని తిట్టలేదు.. బాగా నిరసన తెలిపింది’, ‘ పాపం.. మాట వినకుంటే ఏంచేస్తుంది..’, ‘మా సపోర్ట్ ఆ మహిళకే..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. See what the participant in green kurti does when not given a fair chance to speak! 😂😂😂 pic.twitter.com/M58kKkbpxB — Elizabeth (@Elizatweetz) January 16, 2022 చదవండి: మాజీ సర్పంచ్ దాష్టికం!..మహిళా ఆఫీసర్ని జుట్టు పట్టుకుని, చెప్పుతో కొట్టి... చివరికి -
పిలవని పెళ్లికి వెళ్లొద్దాం
ఒక దేశ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవాలనుకుంటే పండుగలు, వివాహాలకు మించిన వేడుకలేముంటాయి? అదీగాక సంప్రదాయబద్ధంగా, వైభవోపేతంగా జరిగే భారతీయ పెళ్లి సందడంటే పాశ్చాత్యులకు మోజు. ఆ క్రేజ్‌ను గమనించే ‘జాయిన్ మై వెడ్డింగ్ డాట్ కామ్’ అనే ఆస్ట్రేలియన్ సైట్ వెలిసింది! తమ పెళ్లికి విదేశీ అతిథులను ఆహ్వానించదలిచిన వధూవరులు ఈ వెబ్సైట్లో తమ పేరు, పెళ్లి సంబరం తాలూకు వివరాలను పొందుపర్చాలి. భారతదేశ పర్యటనలో భాగంగా ఇక్కడి పెళ్లిళ్లను చూడాలనే ఆసక్తిగల విదేశీయులు ఈ వెబ్సైట్ లాగిన్ అయి ఏ సంప్రదాయపు పెళ్లి.. అంటే ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతీయ పెళ్లిళ్లలో ఏ వివాహతంతును చూడాలనుకుంటే అక్కడున్న వధూవరులు సైట్‌కి ఇచ్చిన పెళ్లి వివరాల ప్రకారం ఆ పెళ్లికి హాజరుకావచ్చు.ఆ పెళ్లికి సంబంధించిన టికెట్లను కొనుక్కోవాలి. ఆ టికెట్ డబ్బులో కొంత శాతాన్ని సైట్ వాళ్లు కమీషన్‌గా తీసుకొని మిగిలిన డబ్బును ఆ జంటకు ఇచ్చేస్తారు. పసుపు దంచే కార్యక్రమం నుంచి మెహందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ దాకా అన్నిట్లో ముందువరుసలో ఉండి ఆలకిస్తారు ఆ విదేశీ అతిథులు. ఇంట్రెస్ట్ ఉంటే ఆయా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కూడా. మన సంప్రదాయపు దుస్తులు ధరించొచ్చు. విందును ఆస్వాదించవచ్చు. ఆత్మీయ అతిథిౖయె పెళ్లి సంబరంలో పాలుపంచుకోవచ్చు. జాయిన్ మై వెడ్డింగ్ డాట్ కామ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే మీ పెళ్లికి విదేశీయులకు టికెట్లు అమ్మడం. యేటా కొన్ని లక్షల పెళ్లిళ్లు ఆర్భాటంగా జరుగుతుంటాయి కాబట్టి ఈ తరహా వివాహ పర్యటనలకు విదేశీ అతిథుల డిమాండ్ చాలానే ఉంటోందట. ఒక్క పర్యటనలో దాదాపు అయిదారు పెళిళ్లకు హాజరైన అతిథులూ ఉన్నారట. ఈ వెడ్డింగ్ టూరిజంలో ఇప్పటిదాకా దాదాపు వంద పెళ్లిళ్లకు హాజరయ్యారట విదేశీ అతిథులు. మరో సంగతేంటంటే ఇలా పెళ్లికి విదేశీయుల నుంచి వచ్చిన టికెట్ డబ్బులతో కొత్త జంటలు ఎంచక్కా తమ హనీమూన్‌ను ప్లాన్ చేసుకుంటున్నాయట. అంటే ఉచితంగా హనీమూన్ డెస్టినేషన్‌కు చేరుకుంటున్నారన్నమాట. కొత్త ప్రాంతాల నుంచి ఫ్రెండ్స్ అవడానికి ఇంతకన్నా గొప్ప వేడుక ఏముంటుంది అని అటు ఫారిన్ గెస్ట్‌లు, ఇటు వధూవరులూ అంటున్నారు. ఈ పెళ్లిళ్లను చూడ్డానికి అమెరికా, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రియా అండ్ అఫ్కోర్స్ ఆస్ట్రేలియా నుంచి యమ డిమాండ్ ఉంటోందట. కార్తీకమాసం పెళ్లిళ్ల సీజనే.. ఆలస్యమెందుకు.. ఆన్లైన్లో టికెట్స్‌కు శుభస్య శీఘ్రం!! అన్నట్లు.. మనం విదేశీయుల పెళ్లిళ్లకు వెళ్లాలన్నా.. ఇదే రూటు. ఇదే సైటు. టికెట్ కొనుక్కుని వెళ్లిపోవచ్చు. -
అంబానీ ఇంట పెళ్లి సందడి
-
ఆ పెళ్లికి అతిరథ మహారథులు
ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, డైమండ్ కింగ్ రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతా వివాహ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ రోజు (మార్చి 9వ తేదీ శనివారం, రాత్రి ) ఆకాశ్, శ్లోకా మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. ఈ పెళ్లి సందడి ముంబై జియో టవర్స్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకుకు దేశ విదేశాల నుంచి విచ్చేసిన అతిరథ మహారథులతో పాటు, హితులు, సన్నిహితులు, బంధు మిత్రులతో పెళ్లి వేడుక కళకళలాడుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖేశ్, నీతా అంబానీ దంపతులతో పాటు, వరుడు ఆకాశ్ అంబానీ .. ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ వివాహానికి ముఖేశ్ సోదరుడు అనిల్ అంబానీ కుటుంబ సభ్యులు, కోకిలా బెన్ అంబానీ సందడి చేస్తుండగా, పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగ దిగ్గజాలతో పాటు విదేశీ ప్రముఖులు ఇప్పటికేవివాహ వేదికకు తరలి వచ్చారు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమతి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ దంపతులు, టోనీబ్లేయర్ దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. View this post on Instagram Amazing decor 👍👍👍👍#akashambani #shlokamehta wedding ❤️#bigfatindianwedding #desibride #weddingoftheyear @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Mar 9, 2019 at 2:48am PST -
నిక్కరు
కొంకణీ మూలం : వశంత్ భగవంత్ సావంత్ అనువాదం: శిష్టా జగన్నాథరావు రాత్రవుతున్న కొద్దీ అతిథులు రావడం కూడా పెరుగుతోంది. బయట కొరికేసే చలి. జాతరకొచ్చిన జనం గుంపులు గుంపులుగా చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. చాలామంది మండపంలో గుమిగూడి జాతరలో దేవుడి వస్తువుల వేలం త్వరగా పూర్తవ్వాలని హడావుడి చేస్తున్నారు. కేశవ్ మామ టీకొట్టు ఎదురుగా ఉన్న స్తంభానికి ఆనుకుని నేను ఎవరైనా నా స్కూలు మిత్రులు కనిపిస్తారేమోనని ఎదురు చూస్తూ నిలుచున్నాను. జాతర ఆఖరి రోజవడం వలన ఊళ్లో వాళ్లంతా మూకుమ్మడిగా వచ్చారు. నాకెంతో ఇష్టమైన ఈ జాతర ఏడాదికొకసారి వస్తుంది. ఈ ఏడాది మాత్రం నా ఉత్సాహం ఎండిపోయింది మనస్సులోనే. కారణం ఈసారి అమ్మ నన్ను కేశవ్ మామ జాతరలో పెట్టిన టీ దుకాణంలో ఉంచి, ఆయనకి సహాయం చేయమని పురమాయించింది. నిజం చెప్పాలంటే ఈ కేశవ్ మామని చూస్తేనే నాకు చిరాకేసేది. ఈ జాతర మూడు రాత్రులు మమ్మల్ని గద్దలా పొడిచి, పొడిచి చంపుకుతిన్నాడు. చలికి వణుకుతున్న జనం, ఆ వణుకు తగ్గడానికని చాయ్ కోసం మా కొట్టులో జమవుతున్నారు. అందువల్ల మాకు బొత్తిగా విశ్రాంతి లోపించింది. కేశవ్ మామ టీకొట్టులో పనిచేసే భట్టీవాడు, టీ ఇచ్చే సర్వరు ఇద్దరూ మామని చాటుగా నానాబూతులు తిట్టేవారు. అయితే ఆయన ముందు మాత్రం పల్లెత్తుమాట అనకుండా అడ్డమైన చాకిరీ చేసేవారు. మూడు రాత్రులు నిద్రలేకుండా పనిచేయడం వలన నా కళ్లు గుడ్లగూబ కళ్లల్లా అయ్యాయి. రెండు కాళ్లు పీకుతున్నాయి. ఎప్పుడు కాస్త నడుంవాల్చి విశ్రాంతి తీసుకోగలుగుతానా అని ఎదురుచూస్తున్నాను. ‘‘డిగూ.. ఒరేయ్ డిగూ.. లోపల ఆ ఖాళీ గ్లాసులెవరు తీస్తార్రా? మీ నాన్న వస్తాడ్రా కడగడానికి? గొప్పగా షావుకార్లా నిల్చున్నావు ఆ కొయ్యపట్టుకుని. నడు... తొరగారా లోపలికి. ఆ గ్లాసులు కడుగు.. ముందు ఆ ప్లేట్లు చూడు’’.మావ నా మీద ఇంకా శాపనార్థాలు కురిపించేలోగా, ఆయన రుసరుసలని లక్ష్యపెట్టక నేను వెనకదారిలో వచ్చి గ్లాసులు కడగసాగాను. మూడు రాత్రులు రెండు గ్లాసులు బద్దలుకొట్టానని, నేను అప్పటికే రెండు తన్నులు తిన్నాను. నాకు పూర్తిగా విసిగెత్తింది.అన్ని గ్లాసులు, ప్లేట్లు, చెంచాలు అక్కడే విసిరేసి హాయిగా జాతరలోకి పోయి మండపంలో స్నేహితులతో కూర్చుని పిచ్చాపాటి మాటల్తో, చక్కగా నాటకం చూడాలని మనసు ఉవ్విళ్లూరింది. కానీ ఏం చేస్తాను? అమ్మ నన్ను కోప్పడుతుందని భయమేసి, ఆ ఆలోచన వదులుకొన్నాను.ప్రతి ఏడాదీ ఇలాగే కేశవ్ మావ జాతరలో టీకొట్టు పెడతాడు. కానీ నాకు ఈసారే తెలిసింది. అతను నాకు మావని. అతని వ్యాపారమే అదిట. వివిధ జాతర్లలో తిరగడం. ఏ ఊళ్లో ఏ జాతర జరిగినా అక్కడ మావ టీ హోటలు డేరా వెలుస్తుంది. ఈ హడావిడిలో పనితొందర్లో ఎప్పుడూ ఆయనకి, తన చెల్లెల్ని (అంటే మా అమ్మని) చూడడానికి వీలవలేదట. కానీ ఈ సారి మాత్రం జాతర ప్రారంభం అవడానికి ముందురోజే మా ఇంటికి వచ్చాడు. ఆయన నా మావ అనీ, జాతరలో దుకాణం పెడ్తున్నాడనీ విని, ఆశ్చర్యం ఆనందాలతో ఈ విషయం నా తోటి మిత్రులకి చెప్పడానికి నేను వాడలోకి పరిగెత్తాను.నేను తిరిగి, తిరిగి ఇంటికి చేరిన తర్వాత కేశవ్ మావ గుడికి వెళ్తానని చెప్పి బయటకి వస్తున్నాడు. మావ తెచ్చి ఇచ్చిన పిప్పరమెంట్ల పొట్లం నాకు ఇస్తూ అమ్మ ఇలా అంది – ‘‘డిగూ, మావ నీకు లాగు కుట్టించుకోడానికి కొత్త బట్ట ఇస్తానన్నాడు’’.‘‘నిజంగానా?’’ అని నేను నా వెనక చిరిగిన లాగు తడుముకుంటూ అన్నాను. ‘‘అవును, నిజం. కానీ నువ్వు ఆయనకో పని చెయ్యాలట.’’‘‘ఎటువంటి పని?’’ నేను ఉత్సాహంతో ఊరటతో అడిగాను.‘‘మావ చాయ్ కొట్టులో ఇద్దరు పనివాళ్లు ఆరోగ్యం బాగులేనందువల్ల రాలేదట. అందుకని జాతర ఉన్న మూడు రోజులు నువ్వు అతనికి సహాయంగా ఆ టీకొట్టులో పనిచేయాలి’’ అమ్మ నన్ను బుజ్జగిస్తూ చెప్పింది.‘‘వద్దు.. వద్దు.. నేను ఎంచక్కా జాతరలో తిరగాలి మిత్రులతో కలిసి!’’‘‘ఇదిగో విను – నువ్వు తెలివైన నా బంగారు కొడుకువి కదూ, ఈ మధ్య నీకు నేను కొత్త బట్టలు కుట్టించలేకపోయాను. నీ ముడ్డి దగ్గర చిరిగిన పట్లంతో జాతరలో తిరుగుతావా ముష్ఠివాడిలా? నీ మిత్రులునవ్వరా నిన్ను చూసి? అయినా జాతరలో ఏముందిరా, ప్రతీ ఏడాది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ దుకాణంలో పనిచేస్తే, ఎంచక్కా నీకు కొత్త లాగు వస్తుంది.’’అమ్మకి ఎలా నచ్చజెప్పాలో నాకు తెలియలేదు. చివరికి ఒప్పుకున్నాను. నా జుత్తుని వేళ్లతో ప్రేమగా నిమురుతూ అమ్మ అంది – ‘‘ఇదిగో చూడు, నువ్వు మావ దుకాణానికి వెళ్లు. నేను చెప్పాను మీ మావకి నువ్వు వస్తావని. పని కాస్త వొళ్లు దగ్గర పెట్టుకుని చెయ్యి. నీ మావ కాస్త కోపిష్ఠి. అతనికి సహనం తక్కువ. నీ మీద ఏ కారణం వల్లనైనా విరుచుకుపడితే నిరాశపడకు. ఈ జాతర్లలో రాత్రిళ్లు ఎప్పుడూ జాగరణ చెయ్యడం వలన అతనిలో శక్తి, సహనం పోయాయి.’’ నేను సరేనని అన్నట్లు తల ఆడించాను. అమ్మ మళ్లీ అంది – ‘‘నీకు తెలియదురా. నీ మావకి ఎన్నో పనులు అడ్డమైన వ్యవహారాల్లోనూ తల దూరుస్తాడు. ఇక్కడి వస్తువులు అక్కడికీ, అక్కడివి ఇక్కడికీ వాణ్ని వంచించడం, వీణ్ని కాళ్లు పట్టుకుని వేసుకోవడం ఇటువంటి తిమ్మిని బమ్మిని చేసే వక్రబుద్ది వాడిది. డబ్బే వాడి దైవం. డబ్బు ముందు మనవాళ్లు, పరాయివాళ్లు అని అంతరం చూపడు. ఎవర్నీ లెక్కచెయ్యడు. ఇన్నేళ్లుగా జాతరలో దుకాణం పెడుతున్నాడు అయినా ఒక్కసారీ, ఈ ఊరికి వచ్చినప్పుడు వాడికి నన్ను చూడాలని తోచలేదు. మనింటికి రాలేదు. ఈసారి మాత్రం వచ్చాడు. ఎందుకనీ? పనివాళ్లు తక్కువైనందువల్ల. నిన్ను మేనల్లుడిని ఆ మురికిపనిలో దింపడానికి.’’అమ్మ కళ్లంబడి అశ్రువులు వచ్చాయి. అప్పుడామె చెప్పిన మాటలు నాకు సరిగ్గా అర్థమవలేదు. కానీ రెండు రాత్రులు కేశవ్మావ టీ కొట్టులో కొట్టుమిట్టాడాక ఆ త్రాస్టుడి కుటిల స్వభావం బాగా తెలిసింది. టీ ఒకసారి చేసాక, మళ్లీ అదే పొడితో మళ్లీ మళ్లీ టీ చేయమని వంటవాడికి ముందే పురమాయించి వాడు మరచినప్పుడు, మండిపడి కోప్పడేవాడు. శేరు పాలల్లో మరో శేరు నీళ్లు కలిపేవాడు. ఆ టీలో రుచిపచీ లేదు. ఒట్టి వేడినీళ్లు. కొద్దిగా పంచదార ఎక్కువ పడితే ఆ వంటవాడి ముడ్డిమీద పడిందనుకో దెబ్బ! జనం గోలచేసేవారు. కానీ మావ వాళ్లేమన్నా పళ్లు ఇకిలిస్తూ నవ్వేవాడు. ఏమాత్రం లజ్జ లేకుండా! జాతరలో మరెవ్వరి చాయ్ దుకాణం లేనందువల్ల మావ కొట్టులోనే జనాలు ఉండేవారు. మావ మానవత్వం ఇసుమంతైనా చూపించకుండా తన వ్యాపారం కొనసాగించేవాడు. అతని కుటిల స్వభావం, కుత్సిత బుద్ధి, పాడు పనులు చూశాక అతనంటే నాకు ఏహ్యభావం కలిగేది. అతన్ని చూడాలంటేనే అసహ్యం వేసేది. హోటల్లో గిరాకీదారులుండగా, అందరి ముందు మావని తూర్పారబెట్టి, అవమానం చేసి ఆ పని విడిచిపెట్టి పారిపోవాలని నాకు క్షణక్షణం అనిపించేది. కానీ అమ్మ ప్రేమతో చెప్పిన మాటలు గుర్తుకువచ్చి, ఆ ఆలోచనకీ, నా కాళ్లకి బంధాలు తగిలేవి.గ్లాసులు, సాసర్లు కడుగుతూ ఉండగా, నా చెవుల్లో బయట జాతరలో లౌడ్‌స్పీకర్ మీద దేవుడి వస్తువుల వేలంపాట వినపడుతోంది. ‘‘ఆఖరి బేరం.. దేవుడి చరణాల మీద పూల దండ.. ఇరవై ఒక్క రూపాయలు... మూడవసారి....’’ వేలం పాట ముగియగానే, ఆ వేలంపాట పాడినవాడు ఉస్సూరుమని నిట్టూర్చాడు. పెద్ద కార్యం పూరై్తందని. కానీ నాకూ ఆ వంటవాడికీ, టీనీళ్లు గిరాకులకి ఇచ్చే పనివాడికీ మాత్రం విశ్రాంతి లేదు. హఠాత్తుగా దుకాణంలో రద్దీ తగ్గింది. నాటకం ప్రారంభమవుతుందని తెలిసి పరుగుపరుగున డబ్బులు గల్లా మీద విసిరేసి వెళ్లిపోయారు. గడియారంలో టైమ్ చూసి మావకి ఒళ్లుమండింది. మావ మండిపడ్డం చూసి నిజం చెప్పాలంటే నాకు భలే భలే అనిపించింది. ఈ మనిషి ఇలాగే జీవితాంతం ఏడుస్తూ చావాలని మనసులోనే శాపనార్థాలు పెట్టాను. వంటవాడు చక్కటి, చిక్కటి టీ నాకోసమని చేసి మావ చూడకుండా గ్లాసు నా చేతికిచ్చి తాగమని రహస్యంగా సంజ్ఞ చేశాడు.మావ గల్లాపెట్టెలో నోట్లు లెక్కపెడుతున్నాడు. నేను ఒక కుర్చీలో కూర్చుని నోట్లు లెక్కపెట్టడం చూస్తున్నాను. తడి చేసిన నాలికని వేలుతో మధ్య మధ్య తాకుతూ, ఏకాగ్రదృష్టితో అతి జాగ్రత్తతో లెక్కపెడుతున్నాడు. అలా లెక్కపెడుతూ తలెత్తి నన్ను చూసి హఠాత్తుగా కోపంతో కేకలేశాడు – ‘‘నువ్వేం చేస్తున్నావురా? నడు, త్వరగా ఆ ఎంగిలి గ్లాసులన్నీ కడుగు. సర్ది పెట్టు. లెక్కపెట్టు ఎన్ని విరిగాయో, ఎన్ని మిగిలాయో’’.నేను అన్ని గ్లాసులు, సాసర్లు కడిగాను. వాటిని సర్దిపెట్టి, భట్టీ దగ్గరకెళ్లి చలితో కొంకర్లుపోయిన చేతుల్ని వెచ్చచేసుకోసాగాను. చేతుల్లో కరెన్సీనోట్లు మరోసారి లెక్కపెట్టి మావ నన్ను పిలిచాడు. నాకనిపించింది. ఇప్పుడు మావ నాకు ప్యాంట్ కుట్టించుకోవడానికి బట్టకోసం డబ్బులు ఇస్తాడని. నేను గల్లాపెట్టె దగ్గర చేరగానే మావ అన్నాడు – ‘‘నువ్వు కాస్త ఈ గల్లాపెట్టె దగ్గర కూర్చో కాసేపు’’ అని. నన్ను అక్కడ కూర్చోబెట్టి, లోపల ఉంచిన ట్రంక్‌పెట్టె తెరిచి డబ్బులు పెట్టసాగాడు. నేను గల్లాపెట్టె దగ్గర కూర్చుంటే, నాకు ఏనుగెక్కినంత ఆనందమైంది. నేను ఇలా కూర్చునుండగా నా మిత్రులెవరైనా చూస్తే బాగుంటుందని సంబరపడ్డాను. కానీ కళ్లకెవరూ కనిపించలేదు.మావ నోట్లన్నీ తీసుకెళ్లాక, గల్లా పెట్టెలో చాలా చిల్లర మిగిలింది. ఎంత చిల్లరంటే, నేను ఎప్పుడూ దేవాలయంలో దేవుడి ముందు పళ్లెంలో కూడా చూడలేదు. అంత చిల్లర! నేనా చిల్లరలో నా చెయ్యి పెట్టి, కెలుకుతూ చప్పుడు చేశాను. ఆ చప్పుడు విని నా ఒళ్లు ఝల్లుమంది. నేను నా దోసిట్లో వచ్చినంత చిల్లర తీసుకుని పైకెత్తి గడగడలాడించి, మళ్లీ లోపల పడేశాను. మూడు రాత్రుల జాగరణ ఉండి ఆ హోటల్లో చేసిన పని అలసట ఆ చప్పుడుతో అదృశ్యమైపోయినట్లు నాకనిపించింది. నాటకం మొదటి అంకం పూర్తవగానే నలుగురైదుగురు వ్యక్తులు టీ తాగడానికి దుకాణంలోకి వచ్చారు. వాళ్లు టీ తాగాక, నేను హుందాగా బెల్లు వాయించి బిల్లు ఎంతైందని పనివాణ్ని అడిగాను. వాళ్లిచ్చిన నోటు తీసుకుని బాకీ చిల్లర తిరిగి ఇచ్చాను.లోపటి నుంచి మావ అరిచాడు – ‘‘సరిగ్గా బిల్లు వసూలుచేశావట్రా?’’ అని.‘‘హా.. చేశాను’’ నేనూ గంభీరంగా జవాబిచ్చాను.‘‘సీతారామ్..’’ వంటవాడిని ఉద్దేశించి మావ గట్టిగా అన్నాడు. ‘‘రేపు, ఎల్లుండీ కామర్ఖండ్ జాతరకి వెళ్తున్నాం. నాటకం మూడవ భాగం పూర్తవగానే సామాన్లు అన్నీ సర్దేసి, మూటలు కట్టి, ఆతర్వాతే పడుకోవాలి. తెల్లవారుజామున పికప్ వ్యాన్ వస్తుంది. డేరా ఎత్తేసి వెంటనే వెళ్లిపోవాలి. వింటున్నావా?’’సీతారాం.. అవును అనలేదు, కాదు అనలేదు.మావ చిన్న మేజామీద లెక్కలు రాసుకుంటున్నాడు. నేను పావలా కాసులు, అర్ధరూపాయి బిళ్లలూ ఏరి ఒకదానిమీద ఒకటి పేర్చి నిటారుగా అమర్చాను. నేను గల్లాపెట్టె దగ్గర కూర్చుని ఉండడం చూసిననా క్లాసు మిత్రులిద్దరు నా ముందరికి వచ్చి నన్ను పలకరించారు. నేను వాళ్లని చూసి హుందాగా అడిగాను, ‘‘టీ తాగుతార్రా?’’. వాళ్లు తాగుతామని తల ఊపుతూ సూచించారు. ‘‘సీతారాం, ఇక్కడ రెండు చక్కటి, చిక్కటి టీలు తీసుకురా’’ అని నేను హుందాగా, దర్జాగా ఆర్డర్ ఇస్తూ బల్ల మీద బెల్లు వాయించడానికి చేయి చాపితే, ఆ చెయ్యి తగిలి నిలువుగా పేర్చిన నాణేలన్నీ ఖంగున నేలమీద పడిపోయాయి. ఇంతవరకూ నా చేతలు చూడని మావ వెంటనే లేచి పరుగున వచ్చి చిల్లరంతా ఏరి గల్లాపెట్టెలో వేశాడు. నన్ను ఓ మూలకి తీసుకెళ్లి నా జేబులన్నీ జాగ్రత్తగా వెతికి, నా చెవి మెలేసి అన్నాడు కోపంగా.. ‘‘మీ అబ్బ సొమ్మనుకున్నావురా ఇది? డబ్బుల దగ్గర ఆటలాడుతావు? కాస్త గల్లాపెట్టె దగ్గర కూర్చోగానే డబ్బు నిషా ఎక్కింది కదూ? చాలు చాలు.. పక్కకి తప్పుకో’’. మావ నన్ను తోసేసి, మూలకి గెంటాడు. నా మిత్రులు నారాయణ, బీకు బెదిరిపోయి బయటకెళ్లిపోయారు. నా ఒళ్లు మండిపోయింది కోపంతో. ఒక కుర్చీ ఎత్తి మావ నెత్తిమీద గట్టిగా పడేసి, రక్తం కారేలా చూడాలని క్షణంసేపు అనిపించింది.‘‘నా లాగు బట్టకోసం డబ్బులియ్యి’’ కోపం పట్టలేక గట్టిగా అన్నాను.‘‘ఆ.. డబ్బులా? రేపొద్దున్న మీ అమ్మకి ఇస్తాను’’ మావ తాపీగా అన్నాడు.‘‘రేపు వద్దు.. నాకు ఇవాళే ఇప్పుడే కావాలి.’’‘‘ఇప్పుడే కావాలా? సరే ఇప్పుడే నీ చెవి మెలేసి ఓ లెంపకాయ ఇస్తాను’’ అలా అంటూనే మావ నాకో లెంపకాయ ఇచ్చాడు. జాగరణతో నిద్రలోపించిన నా కళ్లల్లో హఠాత్తుగా చీకట్లు చిమ్మాయి. ఆ దెబ్బతో నేను పరిగెత్తి నాటకం ఆడుతున్న మండపంలోకి వచ్చిపడ్డాను. నాటకం చూస్తూ, చూస్తునే నిద్రపోయాను. ఎప్పుడు నాటకం పూర్తయిందో ఎవరికి తెలుసు! అమ్మ నన్ను తట్టి లేపినప్పుడు కళ్లు తెరిచాను. మధ్యాహ్నం అయ్యింది. నాలాగే నలుగురైదుగురు కుర్రాళ్లు మండపంలో పడుకొని ఉన్నారు.‘‘మావ నీకు నిక్కరు బట్టకోసం డబ్బులిచ్చాడ్రా?’’ అమ్మ ప్రేమతో నిమురుతూ చెవిలో అడిగింది. ‘‘లేదమ్మా! నీకు ఇస్తానన్నాడమ్మా. నీకూ ఇవ్వలేదన్నమాట!’’ నేనన్నాను.అమ్మ ఇవ్వలేదని తలాడించింది.నేను మావ టీ దుకాణంవైపు చూశాను. సామాన్లన్నీ తీసుకుని మావ ఎప్పుడెళ్లిపోయాడో ఎవరికి తెలుసు? డేరా – బురా ఏం లేదక్కడ. పిడకలతో, బొగ్గులతో నిండిన ఒక భట్టీ మాత్రం వదిలేసివుంది, అక్కడ ఒక దుకాణం ఉండేదన్న గుర్తుగా. మరే విధమైన గుర్తులేదు.‘‘మావ పెద్ద మోసగాడు’’ నేను ఏడుపు గొంతుకతో అన్నాను.‘‘వాడి పని గొడవలో నీ సంగతి బహుశా మరచిపోయి ఉంటాడు’’ అంటూ నడవసాగింది అమ్మ. మావ చాయ్ దుకాణం పెట్టిన స్థలంవైపు కన్నెత్తి కూడా మళ్లీ చూడకుండా నా చిరిగిన లాగు మీద చిరుగుని అరచేతితో కప్పుకుంటూ నేనూ అమ్మవెంబడే ఇంటివైపు నడవసాగాను. -
దశ దేశాల అతిథులు
ఈసారి మన గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొనేందుకు ఆగ్నే యాసియా దేశాల సంఘం(ఆసియాన్) అధినేతలు వచ్చారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని, సైనిక పాటవాన్ని ప్రముఖంగా ప్రదర్శించే ఈ ఉత్సవాలకు ప్రతిసారీ ఒక దేశాధినేత ముఖ్య అతిథిగా రావడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా ఈసారి ఆసియాన్ అధినేతలందరూ రావడం విశేషం. ఆసియాన్‌తో మన దేశం సంబంధాలు నెలకొల్పుకుని అర్థ శతాబ్ది పూర్తయింది. వాటితో మనకు వ్యూహాత్మక భాగ స్వామ్యం ఏర్పడి పదిహేనేళ్లయింది. ఆసియాన్ దేశాలతో భారత్ వాణిజ్యపరమైన చర్చలు సాగించేందుకు అనువైన దౌత్య భాగస్వామ్యం ఏర్పడి పాతికేళ్లవుతోంది. ఈ దేశాలతో మనకు ప్రాదేశిక లేదా సముద్ర ప్రాంత సరిహద్దులు లేవు. కనుక వాటికి సంబంధించిన తగాదాలు లేవు. అందువల్ల మనతో ఉన్న స్నేహబంధాన్ని మరింత విస్తరించుకునే విషయంలో వాటికి రెండో అభిప్రాయం లేదు. ఆసియాన్‌లోని పది సభ్యదేశాలు– సింగపూర్, బ్రూనై, మలేసియా, థాయ్‌లాండ్, ఇండొనేసియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, లావోస్, కంబోడియా, మయన్మార్ల జనాభా మొత్తంగా దాదాపు 65 కోట్లు. వీటి ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి 2.60 లక్షల కోట్ల డాలర్లు. 120 కోట్ల జనాభా, 2.26 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ ఉన్న మన దేశంతో మైత్రి రెండు పక్షాలకూ మేలు చేస్తుంది. ఆగ్నేయాసియా దేశాలతో మన దేశానికి చరిత్రాత్మక సంబంధాలున్నా ప్రచ్ఛన్న యుద్ధ (కోల్డ్ వార్) కాలంలో అవి మందగించాయి. ఆ దేశాలు మొదటినుంచీ అమెరికాతో సన్నిహితంగా ఉండటం, అప్పట్లో మనం సోవియెట్ యూనియన్‌తో మైత్రి సాగించడం ఇందుకు కారణం. కానీ పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలకు ద్వారాలు తెరవడంతోపాటు ‘లుక్ ఈస్ట్’ విధానం పేరిట తూర్పు దేశాలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పు కోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటినుంచి ఆగ్నేయాసియా దేశాలతో మన సంబంధాలు విస్తరిస్తూ వచ్చాయి. 2009లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం, 2014లో దీన్ని వివిధ సేవలకూ విస్తరించడంతో అనుబంధం మరింత పెరిగింది. ‘లుక్ ఈస్ట్’ను ప్రధాని నరేంద్ర మోదీ ‘యాక్ట్ ఈస్ట్’(తూర్పుదేశాలతో కార్యాచ రణ)గా రూపుదిద్దడం వల్లనే సంబంధాలు ఇంతగా విస్తృతమయ్యాయి. భౌగోళికంగా చూసినా, ఆర్థిక కార్యకలాపాల రీత్యా చూసినా ఆగ్నేయాసియా ప్రాంతం మనకెంతో కీలకమైనది. ఇరు పక్షాల మధ్యా వాణిజ్యం 7,000 కోట్ల డాలర్ల మేర ఉంది. వాణిజ్యంలో ఆసియాన్ భారత్‌కు నాలుగో పెద్ద భాగస్వామి. ఈ వాణిజ్యాన్ని మరింత పెంచుకునే దిశగా ఇరుపక్షాలూ ప్రయత్నిస్తున్నాయి. ఇదిగాక ఐటీ, కమ్యూనికేషన్లు వంటి రంగాల్లో భారత్ సాధించిన వృద్ధి ఆసియాన్‌ను ఆకట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం నెట్‌వర్క్‌ను పెంచుకోవడంలో అది తమకు సహకారం అందించగలదన్న విశ్వాసం వాటికుంది. అయితే ఇదే సమ యంలో చైనా పాత్రను తక్కువ అంచనా వేయలేం. ఆ దేశం కూడా కొన్ని దశా బ్దాలుగా ఆసియాన్ దేశాలతో వాణిజ్యబంధాన్ని విస్తరించుకుంటోంది. ఆ ప్రాంత దేశాలైన ఫిలిప్పీన్స్, మలేసియా, సింగపూర్, వియత్నాం వంటి దేశాలతో దానికి సరిహద్దు వివాదాలున్నా వాటి మధ్య వాణిజ్యం పెరుగుతోంది. అయితే చైనా దూకుడు ఆసియాన్ దేశాలకు ఇబ్బందిగానే ఉంటోంది. అది తమపై పెత్తనం చలా యించాలని చూస్తున్నదన్న అనుమానాలు వాటికున్నాయి. పర్యవసానంగా అభద్రతకు లోనవుతున్నాయి. అందుకే కేవలం చైనాపై ఆధారపడే విధానాన్ని విడనాడి ఆసియాలో మరో బలమైన దేశం భారత్‌కు మరింత సాన్నిహిత్యం కావాలని అవి భావిస్తున్నాయి. ఆసియాన్ దేశాలతో భిన్న రంగాల్లో భారత్ సహకారాన్ని విస్తరిం చుకోవడానికి, ఆ అంశాల్లో తరచు సంభాషణలు జరపడానికి 30 రకాల బృందాలు ఏర్పాటయ్యాయి. విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పర్యాటకం, వ్యవసాయం, పర్యా వరణం, పునరుత్పాదక ఇంధన వనరులు, టెలికమ్యూనికేషన్ల రంగాల్లో మంత్రుల స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. తూర్పు–పడమరలను ఏకం చేసేందుకు చైనా తలపెట్టిన బృహత్తరమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టులో ఆసియాన్ దేశాలు భాగస్వాములుగా ఉన్నా ఆ ప్రాజెక్టు విషయంలో వాటికి కొన్ని అభ్యంతరాలున్నాయి. మన దేశమైతే ఇందులో చేరలేదు. ఆసియాన్ దేశాలతో రాకపోకలను పెంచే భారత్–మయన్మార్–థాయ్‌లాండ్ త్రిభుజ రహదారి నిర్మాణా నికి మన దేశం చేయూతనిస్తోంది. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఈ ఏడాది కాలంలో ‘ఇండో–పసిఫిక్ పదబంధం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇండో–పసిఫిక్ ప్రాంత భద్రతలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఆయన చెబుతున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం అవసరమని, ఇది మాత్రమే ఈ ప్రాంత సుస్థిరతకు, భద్రతకు పూచీ ఇస్తుందని భారత్–ఆసియాన్ దౌత్య శిఖరాగ్ర సదస్సును ప్రారంభిస్తూ నరేంద్ర మోదీ చెప్పడంతోపాటు సాగర ప్రాంత భద్రతకు అవసరమైన సహకారాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని హామీ ఇవ్వ డాన్నిబట్టి రాగల కాలంలో ఈ దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో మన పాత్ర మరింత పెరుగుతుందని అర్ధమవుతుంది. ఇది సహజంగానే చైనాకు కంటగింపుగా ఉంటుంది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన పరపతిని పెంచుకుంటున్న చైనా వ్యవహారశైలికి జవాబుగానే మన దేశం ఇలా అడుగులేస్తోంది. అయితే ఆసియాన్ దేశాలన్నిటితో మన దేశం ఒకే స్థాయిలో సంబంధాలు నెలకొల్పుకోవడం కష్టం. మన వ్యూహాత్మక అవసరాలతోపాటు ఆ దేశాల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆసియాన్ దేశాలు అన్నిటా ఒకే మాటపై లేకపోవడం కూడా మన పాత్రను పరిమితం చేస్తోంది. ఈ కారణం వల్లనే వాణిజ్యరంగం అనుకున్నంతగా విస్తరించలేదు. ఈ లోటుపాట్లన్నిటినీ సవరిం చుకుని ముందడుగేయడానికి అధినేతల రాకపోకలు, సంభాషణలు, శిఖరాగ్ర సదస్సులు దోహదపడతాయి. అందువల్ల ఆసియాన్ దేశాధినేతల రాక మంచి పరిణామం. -
పొంగి పొర్లే పండుగ
అక్టోబర్ ఫెస్ట్ ఒక నగరాన్ని కోటి మంది అతిథులు ముంచెత్తేస్తారు. కేవలం పదహారు రోజుల్లో... కోటి లీటర్ల బీరు ఖాళీ చేసేస్తారు. టన్నుల కొద్దీ మాంసం, ఇతర ఆహారం ఖర్చయిపోతుంది. నిజం!! ఇదో పార్టీ. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఒకటీ రెండూ కాదు... ఏకంగా రెండు వందల ఏళ్లకు పైబడి నడుస్తోంది. అదే... అక్టోబర్ ఫెస్ట్. జర్మనీలోని మ్యూనిక్ నగర స్పెషాలిటీ. వీధుల్లోంచి వెళ్లే బ్యాండు వాయిద్యాలు వింటూ... బీరు ఖాళీ చేసేయ్యెటమే ఈ పండగ ప్రత్యేకత. చారిత్రక సంప్రదాయాల మేరకు జరిగే ఈ పండగలో... అతిథులూ యూనిఫామ్స్ ధరిస్తారు. కొందరు అభిమానుల డైరీల్లో ఏటా ఈ పండగ ఉండాల్సిందే. మిగిలిన వారు కూడా... జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకోకుండా ఉంటారా?. మ్యూనిక్‌కు వెళ్లేదెలా? హైదరాబాద్‌తో పాటు ముంబయి, ఢిల్లీ నుంచి మ్యూనిక్‌కు నేరుగా విమానాలున్నాయి. అక్టోబర్ ఫెస్ట్‌లో యాత్రికుల తాకిడి ఎక్కువ కనక టిక్కెట్లు ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా బుక్ చేస్తే తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.40 వేల లోపే ఉంటాయి. ఏ సీజన్ మంచిది? సెప్టెంబరు నెలాఖర్లోనే వెళ్లాల్సి ఉంటుంది. సెప్టెంబరు మూడో వారం నుంచి అక్టోబర్ ఫెస్ట్ ఆరంభమవుతుంది. -
అతిథులందు ప్రత్యేక అతిథులు వేరయా!
ఓ పక్క సంతోషం.. మరో పక్క ఇంటికొచ్చిన అతిథులకు చేసే మర్యాదలతో హడావుడి. చుట్టాలొస్తే ఆ సందడే వేరు. పండగలప్పుడో.. ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే చుట్టాలు వస్తారు. సినిమాల్లోనూ అంతే! హీరో, హీరోయిన్ పాటలు పాడుకుంటున్నప్పుడో, కథ కీలక మలుపు తీసుకుంటున్నప్పుడో అతిథులు వస్తారు. ఆ అతిథుల్లో ప్రత్యేకమైన అతిథులు కొందరు ఉంటారు. తెరపై తళుక్కుమన్న ఆ ప్రత్యేక అతిథిని చూడగానే ప్రేక్షకుడి కళ్లల్లో ఓ ఆనందం. ఆ అతిథి రాకతో ఆ సన్నివేశానికి సందడి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ‘అతిథులందు ప్రత్యేక అతిథులు వేరయా!’ అన్నట్టు ప్రస్తుతం సెట్స్ మీదున్న, సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమాల్లో ప్రత్యేక అతిథి పాత్రల్లో కనిపించనున్న ‘స్టార్స్’ కొంతమంది ఉన్నారు. ఆ ప్రత్యేక అతిథులు ఎవరంటే..? ప్రయోగాత్మక చిత్రాలకు, పాత్రలకు వెనకడుగు వేయని నటుడు నాగార్జున. మంచి కథ, పాత్ర అని భావిస్తే.. కీలక పాత్రల్లో నటించడానికి ఎప్పుడూ ముందుంటారు. స్టార్ స్టేటస్ గురించి ఆలోచించరు. అంత నిర్మలమైన మనసు ఆయనది. గతంలో పలు చిత్రాల్లో అతిథిగా కనిపించిన నాగార్జున, ప్రస్తుతం నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న ‘నిర్మలా కాన్వెంట్’లో ప్రత్యేక పాత్ర పోషించారు. ఇందులో ఆయన పాత్ర ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మేనల్లుడిపై ప్రేమమ్.. కథానాయకుడిగా మూడు దశాబ్దాల ప్రయాణంలో విక్టరీ వెంకటేశ్ అతిథిగా కనిపించిన సందర్భాలు చాలా అరుదు. నాలుగేళ్ల క్రితం అన్నయ్య సురేశ్‌బాబు కొడుకు రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో వెంకీ ఓ పాటలో తళుక్కుమన్నారు. ఇప్పుడు మేనల్లుడిపై ప్రేమతో మళ్లీ అతిథి పాత్ర కోసం మేకప్ వేసుకున్నారు. నాగచైతన్య నటిస్తున్న ‘ప్రేమమ్’లో వెంకీ కీలక పాత్రలో నటించారు. మామా అల్లుళ్ల మధ్య సన్నివేశాలు సూపరంటున్నారు యూనిట్ సభ్యులు. సినిమాలో వీరిద్దరి మధ్య రిలేషన్ ఆసక్తి కలిగిస్తుందట. నాగ్‌తో నాలుగోసారి! కథానాయికగా పరిచయం చేసిన నాగార్జున అంటే అనుష్కకు అభిమానం ఉండటం సహజమే. అందుకే నాగ్ సరసన కథానాయికగా నటించడంతో పాటు అప్పుడప్పుడూ ఆయన సినిమాల్లో అతిథి పాత్రలు కూడా చేస్తుంటారు అనుష్క. ఇప్పటివరకూ మూడుసార్లు ఈ మన్మధుడి చిత్రాల్లో అనుష్క అతిథిగా సందడి చేశారు. అవి ‘కింగ్’, ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘ఊపిరి’. తాజాగా హాథీరామ్ అనే భక్తుడి పాత్రలో నాగార్జునతో కె.రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న భక్తిరసాత్మక చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’లో అనుష్క అతిథి పాత్ర చేస్తున్నారు. అయితే, అతిథి పాత్ర కంటే కాస్త నిడివి ఎక్కువ ఉంటుందట. ‘అభినేత్రి’లో హిందీ దర్శకురాలు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘అభినేత్రి’. తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ డెరైక్టర్ ఫరాఖాన్ అతిథిగా కనిపించనున్నారు. సినీ నేపథ్యంలో సాగే ఓ సన్నివేశంలో ఫరా దర్శకురాలిగా కనిపిస్తారని సమాచారం. కలిసొచ్చిన అతిథి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారిగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ సినిమా ‘అకీరా’. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్లతో సౌతిండియా ప్రేక్షకులను అలరించిన లక్ష్మీ రాయ్ ఈ సినిమాతో బాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ అతిథి పాత్ర చేశారు. ఈ పాత్ర చిత్రీకరణ మొదలుపెట్టాక హిందీ చిత్రం ‘జూలీ 2’లో లక్ష్మీ రాయ్‌కి కథానాయికగా అవకాశం వచ్చింది. సో.. హిందీలో లక్ష్మీరాయ్‌కి అతిథి పాత్ర కలిసొచ్చిందన్న మాట. ఇంకా అతిథి పాత్రల్లో పలువురు తారలు కనిపించనున్నారు. తమిళ చిత్రం ‘ఓకే కన్మణి’ (‘ఓకే బంగారం’) హిందీ రీమేక్ ‘ఓకే జాను’లో షారుక్ ఖాన్ అతిథిగా నటించనున్నారని సమాచారం. అలాగే సంజయ్ దత్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చేసే అవకాశం ఉంది. ‘‘సంజయ్ దత్ జీవిత కథతో తీసే సినిమాలో నేను నటించకపోతే అసంపూర్ణంగా ఉంటుంది’’ అని సల్మాన్‌ఖాన్ స్వయంగా ప్రకటించారు. తెలుగు విషయానికి వస్తే.. చిరంజీవి 150వ చిత్రంలో చిన్న పాత్రలో అయినా నటించడానికి సిద్ధమని అల్లు అర్జున్ ఎప్పుడో ప్రకటించారు. ఇటీవల రామ్‌చరణ్ కూడా దర్శకుడు వీవీ వినాయక్ కోరితే, పాటలో కనిపిస్తానని చెప్పారు. మరి.. ఈ ఇద్దరూ 150వ చిత్రానికి స్పెషల్ అవుతారా? లేదా? అనేది వేచి చూడాలి. కనిపిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరోనో, హీరోయినో కనిపిస్తే కచ్చితంగా అది సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంది. కొన్నిసార్లు బిజినెస్‌కి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ‘అతిథి దేవోభవ’ అనొచ్చు. - సత్య పులగం -
రాగాల అతిథులూ... రారండీ!
దేవుడు తనను తల్లిగా స్వీకరించనున్నాడనే సంతోషాన్ని సోదరితో పంచుకోవడానికి మేరీమాత ఒక పాటను ఎంచుకుందట. అయితే ముందే సోదరి సంగీతంతో మేరీమాతకు స్వాగతం పలికింది. ఇలా యేసు జన్మదిన సంబరాలకు, ఆట పాటల సందడికి ఉన్న అనుబంధం ఆ కథల్లో అడుగడుగునా ప్రస్ఫుటిస్తుంది. అందుకు తగ్గట్టే క్రిస్మస్ సమయంలో నివాసాలన్నీ సంగీత నిలయాలుగా మారతాయి. ప్రార్థనా మందిరాలన్నీ పాటల వేదికలవుతాయి. క్రీస్తు రాక గురించి సమాచారాన్ని దేవదూతల ద్వారా తెలుసుకున్న మూగ జీవాలు ఆనందంతో వీధుల్లో తిరుగుతూ అందరికీ ఈ విషయాన్ని రాగాలు తీస్తూ తెలియజేశాయట. ఈ కథను ఆధారం చేసుకుని ఆవిర్భవించినవే క్యారల్స్ సంబరాలు. డిసెంబరు రెండో వారం గడిచినప్పటి నుంచి క్రిస్మస్ అయ్యేవరకూ ఇవి కొనసాగుతాయి. రాగాల రాత్రి... ప్రతి చర్చిలోనివారూ బృందాలుగా ఏర్పడతారు. రాత్రి అయ్యాక విశ్వాసుల ఇళ్లకు వెళతారు. పాటలు పాడుతూ క్రీస్తు ఘనతను కొనియాడతారు. క్రిస్మస్ శుభ వార్త చెప్పడం, పాటలు పాడడం, కుటుంబీకుల క్షేమం గురించి ప్రార్థించడం, బైబిల్ ఇచ్చి వెళ్లడం... క్యారల్స్ బృందం చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే ఇది కేవలం మతపరమైన చర్యగానే చూడటం లేదు కొందరు. ‘‘ఇది మతపరమైన వేడుకగా పరిమితం చేయం. మా చర్చ్ మెంబర్స్ కాని వారి ఇళ్లకూ వెళతాం. ఒకింట్లో ఉన్న ప్పుడు పొరుగింటివాళ్లు అడిగితే వారిం టికి కూడా వెళతాం’’ అని ఒక క్యారల్ గ్రూప్ సభ్యురాలైన అమూల్య షెరాన్ చెప్పారు. ఒక్కో ఇంట్లో 15 నిమిషాలకు మించి గడపరు. రోజులో 10 నుంచి15 ఇళ్ల వరకూ చుట్టేస్తారు. అలా ఈ కార్యక్రమం తెల్లవారుఝామున 5 గంటల వరకూ కొనసాగుతుంది. అందరూ బంధువులే... అందర్నీ అను‘రాగ’ంతో పలకరించే క్యారల్స్ సంప్రదాయం... పండుగ అంటే సంతోషాన్ని పంచుకోవడమేననే గొప్ప సందేశాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమానికి పెరుగుతున్న ఆదరణ కారణంగా కొందరు స్వచ్ఛంద బృందాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ బృందాల్లో విద్యార్థులు, వ్యాపారులు, ఐటీ ప్రొఫెషనల్స్... ఇలా విభిన్న రంగాలకు చెందినవారు సభ్యులుగా మారుతున్నారు. సింగర్స్, గిటారిస్ట్‌లు, కీబోర్డ్ ప్లేయర్స్, కాంగో ప్లేయర్స్... ఇలా విభిన్న రకాల ఇన్స్ట్రుమెంట్స్ను పలికించ గల నేర్పు ఉన్నవారు తమ టాలెంట్‌ను చూపించడానికి కూడా ఇదో అద్భుతమైన అవకాశంగా మారుతోంది. కులమతాలకు అతీతంగా సంగీతాభిమానులను, నలుగురితో కలిసి వేడుకలను ఆస్వాదించే వారిని ఆకట్టుకుంటోంది. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో కేరల్స్ గ్రూప్‌లలో సభ్యులవుతున్నారు. కొన్నిసార్లు ఈ కేరల్ గ్రూప్ సభ్యుల సంఖ్య ఎక్కువై తిరగడానికి మినీ బస్సులు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ‘న్యూలైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్’ చర్చి తరపున కేర్‌సెల్ గ్రూప్స్ అని వ్యవహరిస్తాం. ప్యారడైజ్ కేర్‌సెల్. అల్వాల్ కేర్‌సెల్... అలా ఇవి లొకేషన్ వైజ్ డివైడ్ అవుతాయి. మా గ్రూప్‌లో 20 మంది ఉన్నాం. నేను 2012 నుంచి క్యారల్ గ్రూప్‌తో వెళుతున్నా. చలిలో అలా వెళ్లడం, కొత్త వ్యక్తుల్ని కలవడం, సంప్రదాయ వినోదాలను పంచడం, అందరి బాగు కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించడం... ఇవన్నీ గొప్ప ఫీలింగ్. కొంతమంది టీ, కాఫీ, బిస్కెట్స్ మాతో షేర్ చేసుకుంటారు’’ అంటూ చెప్పారు అమూల్య షెరాన్. - ఎస్.సత్యబాబు -
రాజధాని శంకుస్థాపన అతిథులకు ప్రత్యేక వంటకాలు
-
స్లైసర్స్... మీకు మంచి హెల్పర్స్!
వాయనం: అతిథులు వచ్చారు. పెట్టడానికి ఫ్రూట్స్ తప్ప ఏమీ లేవు. వాటిని కడిగి, ముక్కలుగా కోసి పెట్టేసరికి లేటవుతుందేమోనని టెన్షన్ పడతాం. ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది. ఏ ఫ్రూట్ సలాడో, ఫుడ్డింగో చేద్దామనుకుంటాం. కానీ అన్ని పండ్లు ఎలా కోయాలా అని ఫీలవుతాం. పెద్ద మొత్తంలోను, తక్కువ సమయంలోను కోయాల్సి వచ్చినప్పుడు పడే ఈ ఇబ్బందిని తీర్చడానికే రకరకాల స్లైసర్స్ వచ్చాయి. ఏ పండునైనా కోయడానికి స్లైసర్ ఉందిప్పుడు. కొన్ని తక్కువ ధరలోనే లభిస్తుంటే, కొన్నిటికి కాస్త ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అన్నీ ఒకసారి కొనలేకపోతే అప్పుడప్పుడూ ఒక్కోటి కొని పెట్టుకోండి. ఎందుకంటే ఇవి మీకెప్పటికీ ఉపయోగమే! ఇలా చేయండి చాలు! నెగైల్లా లాసన్... ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చెఫ్. వంటలు అద్భుతంగా చేయడంలోనే కాదు, వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో నేర్పరి ఆమె. తనకు తెలిసిన కొన్ని చిట్కాలను అందరికీ చెబుతూ ఉంటుంది కూడా. అందులో ఇవి కొన్ని... మూకుడు జిడ్డు వదలకుండా విసిగిస్తుంటే... దానిలో కాసిన్ని నీళ్లు, కొద్దిగా వాషింగ్ పౌడర్ వేసి ఐదు నిమిషాల పాటు స్టౌమీద మరిగించాలి. ఆ పైన మంచి నీటితో కడిగితే మూకుడు మెరుస్తుంది! ఉల్లిపాయలు కోసేటప్పుడు ఓ కొవ్వొత్తిని వెలిగించి పక్కన పెట్టుకోండి. ఇక మీ కళ్లు మండవు! వంటగదిలో ఎప్పుడూ కలబందను ఉంచుకోండి. ఎప్పుడైనా పొరపాటున చేయి కాలితే కాస్త కలబంద రసం వేయండి. మంట మాయమౌతుంది! ైవైట్ వెనిగర్‌లో కాసింత బేకింగ్ సోడా వేసి, ఆ మిశ్రమంలో ముంచి తీసిన బట్టతో మైక్రో అవన్ని తుడవండి. కొత్తదానిలా మెరుస్తుంది! చేతులకు నూనె, పిండి లాంటివి అంటుకుని వదలకపోతే ఉప్పుతో రుద్దుకోండి. ఒకవేళ వాసన వదలకపోతే కాసింత కరివేపాకును గానీ, కొత్తిమీరను కానీ తీసి రుద్దండి! -
నిజంగా విశేషమే!
సినిమా వేడుకలకు హీరోయిన్లు అతిథులుగా వెళ్లడం కామనే. కానీ... త్రిష, నయనతార కలిసి ఓ వేడుకకు అతిథులుగా వెళ్లడం మాత్రం నిజంగా విశేషమే. ఎందుకంటే... ఒకప్పుడు వీరిద్దరూ బద్ద శత్రువులు. ఇప్పుడేమో ప్రాణ మిత్రులు. తాము నటించిన సినిమాల వేడుకలకే వారు సరిగ్గా హాజరవ్వరు. ఆ విషయంలో త్రిష కొంచెం పర్లేదు. అగ్ర హీరోల సినిమా అంటే.. అలా కనిపించి ఇలా వెళ్లిపోతారు. కానీ నయన మాత్రం... ‘ఎవరి సినిమా అయితే ఏంటి? డోంట్‌కేర్’ అనే రకం. తను ప్రధాన పాత్ర పోషించిన ‘అనామిక’ సినిమానే పట్టించుకోని విశాల హృదయం నయనది. అలాంటి ఈ ఇద్దరూ కలిసి ఓ చిత్రానికి అతిథులుగా వెళ్లడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకెళ్తే- తన తమ్ముడు సత్యని హీరోగా పరిచయం చేస్తూ తమిళ స్టార్ హీరో ఆర్య ‘అమరకావ్యం’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక త్వరలో జరగనుంది. ఈ వేడుకకు త్రిష, నయన అతిథులుగా వస్తే... వేదిక గ్లామరస్‌గా ఉంటుందని, తన తమ్ముడికి కూడా వీరి రాక కలిసొస్తుందని ఆర్య భావించాడట. పైగా ఆర్యకు త్రిష, నయనతార మంచి ఫ్రెండ్స్. ఇంకేముంది! అడగడమే ఆలస్యం ఇద్దరూ ‘సై’ అనేశారట. తమ సినిమాల ప్రమోషన్లు పట్టించుకోరు కానీ, పరాయి సినిమాల వేడుకలకు అతిథులుగా వెళ్లడం నిజంగా విడ్డూరం అంటూ కోలీవుడ్డంతా చెవులు కొరుక్కుంటున్నారట. -
మంచి కోసం మనువాడారు!
ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, చుట్టూ వందలాది మంది అతిథులు, నగల ధగధగలు, అలంకరణల మిలమిలలు... ఇవి లేకుండా పెళ్లి చేసుకోడానికి ఎవరైనా ఇష్టపడతారా? కానీ ఆ ఇద్దరూ ఇవేమీ వద్దనుకున్నారు. అసలు తమ పెళ్లి తమ ఆనందం కోసం కాకుండా, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి అనుకున్నారు. ఇందుకే ఈ రోజున అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, తనని ఎంత బాగా చూసుకుంటారు అని అంచనా వేసుకున్న తరువాతే ఎవరైనా పెళ్లికి సిద్ధపడతారు. కానీ చెన్నైకి చెందిన తిలక్, ధన ఇవేమీ చూసుకోలేదు. ఎంత మంచివారు, ఎంత సేవ చేస్తారు, ఇతరుల కోసం జీవితాన్ని ఎంతవరకూ అంకితమివ్వగలరు అని చూసుకున్నారు. తిలక్ తన స్నేహితుడు నందన్‌తో కలిసి ఓ సేవాసంస్థను నడుపుతున్నాడు. గ్రామాల్లోని పేద పిల్లలను చదివిస్తుంటాడు. ఓ కార్యక్రమంలో అతడికి పరిచయమయ్యింది ధన. అతడు చేస్తోన్న సేవ గురించి తెలిసి ముగ్ధురాలయ్యింది. ఆమెలో ఉన్న సేవాగుణం అతడినీ ఆకర్షించింది. కొన్ని మంచి పనుల కోసం ఇద్దరూ కలిసి అడుగులు వేయాలనుకున్నారు. తరువాత ఆ ఆశయం వారితో ఏడడుగులు వేయించింది. ఓసారి ఎయిడ్సతో బాధపడుతోన్న ఓ చిన్నారిని చూసింది ధన. ఆ బిడ్డకు తల్లిదండ్రుల ప్రేమను ఇవ్వాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని తిలక్‌ని అడిగింది. అంతలోనే మరో మనసున్న దంపతులు ఆ పాపని దత్తత చేసుకున్నారు. అయితే ఇద్దరూ కలిస్తే కొందరికి జీవితాన్ని ఇవ్వొచ్చు అన్న ఆలోచన బలపడింది. సేవ చేయడం కోసం ఇద్దరూ ఒకటవ్వాలనుకున్నారు. చివరకు తమ పెళ్లి కూడా పేదపిల్లలకే ఉపయోగపడేలా చేయాలనుకున్నారు. అందుకే తమ పెళ్లికి వచ్చేవారిని బహుమతులు తీసుకురావొద్దని, ఏదిచ్చినా ధన రూపంలోనే ఇవ్వాలని ముందే చెప్పారు. అతిథులతో పాటు పేదపిల్లలను కూడా పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లిరోజున వాళ్లిద్దరూ పట్టుబట్టలు కట్టుకోలేదు. పందిళ్లు వేయలేదు. అలంకరణలు లేవు. అతి సింపుల్‌గా మనువాడారు. వచ్చిన కానుకల్ని, తమ పెళ్లికి ఖర్చు చేయాలని ఇంట్లోవాళ్లు దాచిన మొత్తాన్నీ కూడా పేదపిల్లల సంక్షేమానికి వినియోగించారు. నాటినుంచి నేటివరకూ... అంటే దాదాపు రెండేళ్లుగా వారు చిన్నారుల జీవితాలను తీర్చిదిద్దేందుకే పాటు పడుతున్నారు. ఆదర్శ దంపతులుగానే కాదు... ఆదర్శనీయమైన వ్యక్తులుగానూ అభినందనలు అందుకుంటున్నారు!