Wedding Photographer Matches Dance Steps With Guests - Sakshi
Sakshi News home page

పెళ్లిలో ఫొటోగ్రాఫర్ స్టెప్పులు.. నెటిజన్స్ ఫిదా..! వీడియో వైరల్..

Aug 19 2023 5:09 PM | Updated on Aug 19 2023 6:52 PM

Wedding Photographer Matches Dance Steps With Guests - Sakshi

ఎక్కడైనా ఫొటోగ్రాఫర్ అంటే వేడుకల్లో మంచి స్టిల్స్ తీస్తూ బిజీగా ఉంటాడు. తనపని తాను చేసుకుంటూ ఫంక్షన్‌లో సందడిని చూస్తుంటాడు. కానీ ఫొటోగ్రాఫర్ ఏకంగా డ్యాన్సులు వేస్తే..? ఫొటోలు ఎవరు తీస్తారనే ప్రశ్నలు వేయకండి. ఎందుకంటే రెండు పనులను ఒంటి చేత్తే చేసేశాడు మీరు ఇప్పుడు చూడబోయే ఫొటోగ్రాఫర్.

పెళ్లికి బంధువులంతా గుమికూడారు. ఇంట్లో సందడి బాగా నెలకొంది. ఆ సందడిని మరింత పెంచాడు పెళ్లికి వచ్చిన ఫొటోగ్రాఫర్. బంధువులతో పాటు కలిసి చిందులు వేశాడు. ఓ వైపు ఫొటోలు తీస్తూనే మరోవైపు వీడియోలు తీశాడు. పెళ్లికి వచ్చిన బంధువులు కూడా అతనితో పాటు కలిసి స్టెప్పులు వేశారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం రెండు రోజుల్లోనే 2 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ డ్యాన్సుకు నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. డ్యాన్సు చేస్తూ ఫొటోలు తీసినందుకు అతన్ని మెచ్చుకున్నారు. అతను తీసిన ఫొటోలు ఎలా ఉన్నాయో చూడాలని ఉందంటూ మరో యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు.      

ఇదీ చదవండి: స్టైలిష్ లుక్‌లో రాహుల్ గాంధీ.. లద్దాఖ్‌లో బైక్‌ టూర్‌..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement