మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూసిన వేడుక ముగిసింది. అభిమాన హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరు దంపతులు కూడా పాల్గొన్నారు.
(ఇది చదవండి: వరుణ్ తేజ్ పెళ్లి.. మెగా ఫోటో షేర్ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే)
అయితే ఈ వేడుకల్లో వరుణ్ తేజ్ సోదరి నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అన్న పెళ్లి వేడుకల్లో సందడి చేసింది. అన్న పెళ్లిలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి నాగబాబుతో కలిసి తీన్ మార్ డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరవుతోంది. కాగా..అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 1 వరకు కొనసాగాయి. కాగా.. ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఇండస్ట్రీ ప్రముఖల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 5న మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరగనుంది.
(ఇది చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 28 సినిమాలు రిలీజ్)
Congratulations to the beautiful couple @IAmVarunTej & @Itslavanya. Wishing a lifetime of happiness! 💖 #VarunLav pic.twitter.com/2OmR5SUIt9
— Vamsi Kaka (@vamsikaka) November 1, 2023
Comments
Please login to add a commentAdd a comment