వినాయక చవితి వేడుకల్లో స్టార్‌ హీరో డ్యాన్స్‌.. వీడియో వైరల్! | Bollywood Hero Salman Khan Dances With Family At Vinakaya Immersion In Mumbai, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Salman Khan: పిల్లలతో కలిసి సల్మాన్ ఖాన్ స్టెప్పులు.. వీడియో వైరల్!

Published Mon, Sep 9 2024 6:20 PM | Last Updated on Mon, Sep 9 2024 6:45 PM

Bollywood Hero Salman Khan Steps at Vinakaya Immersion

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ముంబయిలో సందడి చేశారు. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఆయన డ్యాన్స్ చేస్తూ కనిపించారు. చిన్నపిల్లలతో కలిసి డప్పుల ముందు చిందులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను సల్మాన్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌ సికిందర్‌ చిత్రంలో నటిస్తున్నారు. సల్మాన్ చివరిగా 'టైగర్ 3'లో కత్రినా కైఫ్ సరసన నటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ సరసన రష్మిక మందన్నా స్క్రీన్ పంచుకోనుంది. ఇటీవల పక్కటెముకల గాయంతో ఓ ఈవెంట్‌లో ఇబ్బంది పడుతూ కనిపించారు. మరోవైపు హిందీ బిగ్‌బాస్‌ 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు.

గాయంతో ఈవెంట్‌కు హాజరు..

ఈ బిగ్‌బాస్‌ ఈవెంట్‌లోనూ తాను ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. రెండు పక్కటెముకలు విరిగాయని, ఈ గాయం తాను అనుకున్నదానికంటే కూడా సీరియస్‌గా ఉందని పేర్కొన్నాడు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ ఫోటో, వీడియో జర్నలిస్టులకు సూచించాడు. సల్మాన్‌ ఇబ్బందిని గమనించిన అభిమానులు అంత కష్టంలోనూ పనిధ్యాసే అని పొగుడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement