కోల్‌కతా: సాధారణంగా టీవీ డిబేట్లలో పాల్గొనడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులను, ఆయా రంగాలకు ప్రముఖులను ఆహ్వనిస్తుంటారు. కొన్నిసార్లు ఈ డిబేట్లు ఆసక్తికరంగా సాగితే మరికొన్ని సార్లు ఫన్నీగాను సాగుతుంటాయి. ఈ డిబేట్లలో పాల్గొనే వక్తలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
కొన్నిసార్లు లైవ్ డిబేట్లలో మాటమాట పెరిగి.. సభ్యులు ఒకరిపై మరొకరు దాడిచేసుకొవడం, తిట్ల దండకాన్ని అందుకోవడం మనకు తెలిసిందే. కొన్నిసార్లు ఈ డిబేట్లలో హద్దులు దాటి కూడా ప్రదర్శిస్తుంటారు. కొందరు ఎదుటివారి దృష్టిని తమవైపు ఆకర్శించడానికి కొందరు తమ నోటికి పనిచేబితే.. మరికొందరు ఎదుటివారి వాదనలు వినకుండా ఫన్నీగా ప్రవర్తిస్తుంటారు.
తాజాగా.. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక టీవీ ఛానెల్ డిబేట్‌లో యాంకర్, ఐదుగురు సభ్యులు డిబెట్లో పాల్గొన్నారు. దీనిలో అందరు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈక్రమంలో డిబెట్లో పాల్గొన్న ఒక మహిళ తన వంతు కోసం వేచిచూస్తుంది. ఏదో చెప్పాలనుకుంటుంది.
అయితే, మిగతా సభ్యులు మాత్రం ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దాంతో ఆమె హైడ్రామా క్రియేట్ చేసింది. ఆ మహిళ లైవ్‌లోనే స్టెప్పులేయడం ప్రారంభించింది. దీంతో పక్కనున్న సభ్యులు మహిళ చర్యపట్ల ఆశ్చర్యంతో ఆమె వైపే చూస్తు ఉండిపోయారు. ఆ మహిళ మాత్రం.. తన రెండు చేతులను వివిధ భంగిమలతో చూపిస్తూ .. వెరైటీగా డ్యాన్స్ చేసింది.
ఆ తర్వాత.. గట్టిగా అరుస్తు వెరైటీగా స్పందించింది. ఈ ఫన్నీ డిబెట్ గతంలోనే జరిగింది. ఆకుపచ్చని కుర్తీవేసుకున్న మహిళ రోష్నిఆలీ. ఆమె పర్యావరణ వేత్త. తాజాగా, దీన్ని ఎలిజబెత్ అనే ట్విటర్యూజర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో మరోసారి ఇది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. భలే స్టెప్పులేసింది..’, ‘మహిళ ఎవరిని తిట్టలేదు.. బాగా నిరసన తెలిపింది’, ‘ పాపం.. మాట వినకుంటే ఏంచేస్తుంది..’, ‘మా సపోర్ట్ ఆ మహిళకే..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
See what the participant in green kurti does when not given a fair chance to speak! 😂😂😂 pic.twitter.com/M58kKkbpxB
— Elizabeth (@Elizatweetz) January 16, 2022
చదవండి: మాజీ సర్పంచ్ దాష్టికం!..మహిళా ఆఫీసర్‌ని జుట్టు పట్టుకుని, చెప్పుతో కొట్టి... చివరికి
Comments
Please login to add a commentAdd a comment