dancing video
-
కొత్త పెళ్లికూతురు శోభిత డ్యాన్స్.. ఒక రేంజ్లో ఉందిగా!
అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి ముచ్చట్లు ఇంకా నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ప్రభుతో విడిపోయిన తరువాత నాగచైతన్య నటి శోభితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఎంగేజ్మెంట్, పసుపు కొట్టుడు, హల్దీ, మూడు ముళ్ల వేడుక ఇలా ప్రతీ వేడుక అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా సోషల్‌మీడియాలో పెళ్లి కూతురు ముస్తాబులో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సంచలనంగా మారింది.శోభిత పెళ్లికి మేకప్ చేసిన సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా మిశ్రా తన ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌లో ఈ వీడియోను షేర్ చేసింది.దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఒక వైపు ముస్తాబవుతానే.. మరోవైపు బ్లాక్ బస్టర్..బ్లాక్ బస్టరే అంటూ మాస్ మాస్‌గా స్టెప్పులేయడం ఈ వీడియోలు చూడొచ్చు. " శ్రద్ధా...మేరీ షాదీ హో రహీ హై (నా పెళ్లి అయిపోతోంది) అంటూ సిగ్గుల మొగ్గే అయింది శోభిత. View this post on Instagram A post shared by Shraddha Mishra (@shraddhamishra8) కాగా గత వారం హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోలో లవ్‌బర్డ్స్ నాగచైతన్య, శోభిత మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. -
అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!
సండే అంటే ఫండే. రొటీన్ లైఫ్‌కు ఆదివారం ఆటవిడుపు. ఇష్టమైన భోజనం, నచ్చిన స్నేహితులతో కాలం గడపడానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో... ఎంటర్టైన్మెంట్కు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఎంటర్టైన్మెంట్లో సినిమాలు షికార్లు, ఓటీటీ సందడి మాత్రమే కాదు. సోషల్ మీడియా బజ్ కూడా ఉంటుంది. ఇదీ చదవండి: ఆకాష్ అంబానీ-శ్లోక లిటిల్ ప్రిన్సెస్ పేరు: పండితులు ఏమంటున్నారంటే? ఇందులో వైరల్ రీల్స్, కామెడీ వీడియోలు, అబ్బురపరిచే విశేషాలుంటాయి. తాజాగా ఇంట్రస్టింగ్ వీడియో ఒకటి ఇన్‌స్టాలో చక్కర్లు కొడుతోంది. ఆరుగురు టీనేజర్లు తన డ్యాన్స్‌తో వైరల్ అవుతున్నారు. అద్భుతమైన స్టెప్పులతో ఇరగ దీశారు. ఈ వీడియో ఇప్పటికే 33 లక్షలకు పైగా లైక్స్‌ను దక్కించుకుంటే ఈ వీడియో క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.అలాంటి క్యూట్ అండ్ ఎనర్జటిక్ వీడియోను మీరు మిస్ అయితే ఎలా? cడాన్స్ ఆఫ్ టాలెంట్ అనే ఇన్‌స్టా హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియోలను చూసేయండి మరి! (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు) View this post on Instagram A post shared by DANCE OF TALENT (@danceoftalent) -
పల్లో లట్కే
డ్యాన్సింగ్ వీడియోలు సోషల్ మీడియాలో పాపులర్ కావడం అనేది కొత్త విషయమేమీ కాదు. అయితే అమ్మాయిల బృందం చేసిన ఈ డ్యాన్స్ వీడియో వారం రోజుల వ్యవధిలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ వ్యూలను సొంతం చేసుకుంది. ‘అసలు కంటే కాపీ ముద్దు’ అనే సామెత లేదుగానీ ఈ వీడియో క్లిప్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ‘షాదీ మే జరూరు ఆనా’ అనే హిందీ సినిమాలోని ‘పల్లో లట్కే’ సాంగ్‌కు ఈ యువబృందం వేసిన స్టెప్పులు ‘అహా’ అనిపించాయి. ‘ఏబీసీడీ డ్యాన్స్ ఫ్యాక్టరీ’ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘అప్పుడెప్పుడో పెళ్లిసంబరాల్లో డ్యాన్స్ చేసేదాన్ని. ఈ వీడియో చూస్తుంటే...నా మొఖాల నొప్పులను పక్కనపెట్టి డ్యాన్స్ చేయాలని ఉంది’ అని కామెంట్ పెట్టింది 69 సంవత్సరాల రాధాబాయి. వీడియో తెగ వైరల్ అయిందని చెప్పడానికి ఇంతకు మించిన కామెంట్ అక్కర్లేదేమో! -
‘పెద్దాయనే గానీ..మహానుభావుడు’ వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు, ఫోటోలకు కొదవలేదు. కొంచెం భిన్నంగా ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా క్షణాల్లో వైరలవ్వడం కామన్ అయి పోయింది. ఇలా గతంలో అనేక విశేషణమైన, ఆశ్చర్యకరమైన చాలా వీడియోలు ఇప్పటికే నెటిజనులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఒక పెద్దాయన డాన్సింగ్ వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది. ఎక్కడ? ఎలా జరిగింది? అనే వివరాలతో నిమిత్తం లేకుండా నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఏమైనా ముసలాయనే గానీ..మహానుభావుడు.. డాన్స్ ఇరగదీశాడు అంటూ కమెంట్ చేస్తున్నారు. -
ఉక్రెయిన్ అధ్యక్షుడు: అప్పుడు లేడీ స్టార్స్‌తో.. ఇప్పుడు యుద్ధభూమిలో!
Volodymyr Zelenskyy Dance Video: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలన్స్కీ సైన్యానికి వెన్నుదండగా నిలవడమే కాక తాను సైతం సైనికుడిలా పోరాడుతున్నాడు. అంతేకాదు ఉక్రెయిన్ దళలు రష్యన్ బలగాలను ఎదుర్కొవడం కష్టమని తెలిసి కూడా ఆయన ఎంతో ధైర్యంగా ముందుండి సైన్యాన్ని నడపించటమే కాకా తమ దేశాన్ని కాపాడుకుంటాం అన్నారు. ఒక పక్క ఉక్రెయిన్ సైనిక స్థావరాలను రష్యా దాడులతో మట్టుబెట్టి, యుద్ధ ట్యాంకులను స్వాధీనం చేసుకున్నప్పటికీ ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా తనదైన యుద్ధ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. నిర్విరామ యుద్ధంతో అలిసిపోతున్నా మా భూమిని రక్షించుకుంటాం అని చెబుతూనే ఉన్నారు. ఈ ఉక్రెయిన్ ఉద్రిక్తల సమయంలో జెలెన్సీ హిరోల ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాక అందరి ప్రశంసలను అందుకున్నారు. అయితే ఆయన 2006లో ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు కూడా అంతే పాపులర్ అయ్యాడు. డ్యాన్సింగ్ విత్ ది స్టార్స్ వేదికపై తన భాగస్వామి ఒలెనా షాప్టెంకోతో కలిసి మంచి ప్రదర్శన చేసి విజేతగా నిలిచాడు. ఈ ఉక్రెయిన్ ఉద్రిక్తల నడుమ జెలన్సీ అలనాటి నృత్య ప్రదర్శన వీడియో ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ వ్యక్తి చేయలేనిదంటూ ఏమిలేదు అని జెలన్స్కీని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. so apparently Zelenskyy won the Ukrainian version of Dancing with the Stars in 2006 and the tape is even better than whatever you're imagining pic.twitter.com/L1gnKD2ISr — Kat Abu (@abughazalehkat) February 27, 2022 (చదవండి: రష్యా మిలటరీ కాన్వాయ్కి అడ్డుగా నిలుచుని ఆపేందుకు యత్నం!) -
మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. లైవ్ డిబేట్లో ఏం చేసిందో తెలుసా?
కోల్‌కతా: సాధారణంగా టీవీ డిబేట్లలో పాల్గొనడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులను, ఆయా రంగాలకు ప్రముఖులను ఆహ్వనిస్తుంటారు. కొన్నిసార్లు ఈ డిబేట్లు ఆసక్తికరంగా సాగితే మరికొన్ని సార్లు ఫన్నీగాను సాగుతుంటాయి. ఈ డిబేట్లలో పాల్గొనే వక్తలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు లైవ్ డిబేట్లలో మాటమాట పెరిగి.. సభ్యులు ఒకరిపై మరొకరు దాడిచేసుకొవడం, తిట్ల దండకాన్ని అందుకోవడం మనకు తెలిసిందే. కొన్నిసార్లు ఈ డిబేట్లలో హద్దులు దాటి కూడా ప్రదర్శిస్తుంటారు. కొందరు ఎదుటివారి దృష్టిని తమవైపు ఆకర్శించడానికి కొందరు తమ నోటికి పనిచేబితే.. మరికొందరు ఎదుటివారి వాదనలు వినకుండా ఫన్నీగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా.. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక టీవీ ఛానెల్ డిబేట్లో యాంకర్, ఐదుగురు సభ్యులు డిబెట్లో పాల్గొన్నారు. దీనిలో అందరు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈక్రమంలో డిబెట్లో పాల్గొన్న ఒక మహిళ తన వంతు కోసం వేచిచూస్తుంది. ఏదో చెప్పాలనుకుంటుంది. అయితే, మిగతా సభ్యులు మాత్రం ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దాంతో ఆమె హైడ్రామా క్రియేట్ చేసింది. ఆ మహిళ లైవ్‌లోనే స్టెప్పులేయడం ప్రారంభించింది. దీంతో పక్కనున్న సభ్యులు మహిళ చర్యపట్ల ఆశ్చర్యంతో ఆమె వైపే చూస్తు ఉండిపోయారు. ఆ మహిళ మాత్రం.. తన రెండు చేతులను వివిధ భంగిమలతో చూపిస్తూ .. వెరైటీగా డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత.. గట్టిగా అరుస్తు వెరైటీగా స్పందించింది. ఈ ఫన్నీ డిబెట్ గతంలోనే జరిగింది. ఆకుపచ్చని కుర్తీవేసుకున్న మహిళ రోష్నిఆలీ. ఆమె పర్యావరణ వేత్త. తాజాగా, దీన్ని ఎలిజబెత్ అనే ట్విటర్యూజర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో మరోసారి ఇది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. భలే స్టెప్పులేసింది..’, ‘మహిళ ఎవరిని తిట్టలేదు.. బాగా నిరసన తెలిపింది’, ‘ పాపం.. మాట వినకుంటే ఏంచేస్తుంది..’, ‘మా సపోర్ట్ ఆ మహిళకే..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. See what the participant in green kurti does when not given a fair chance to speak! 😂😂😂 pic.twitter.com/M58kKkbpxB — Elizabeth (@Elizatweetz) January 16, 2022 చదవండి: మాజీ సర్పంచ్ దాష్టికం!..మహిళా ఆఫీసర్ని జుట్టు పట్టుకుని, చెప్పుతో కొట్టి... చివరికి -
స్టెప్పులతో ఇరగదీసిన జెనీలియా, సల్మాన్ : డ్యాన్సింగ్ వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బర్త్‌డే (డిసెంబరు 27, సోమవారం)సందర్భంగా హీరోయిన్ జెనీలియా డిసౌజా శుభాకాంక్షలు తెలిపారు. అయితే సల్మాన్ ఖాన్‌ను విష్ చేసేందుకు జెనీలియా సోమవారం సాయంత్రం పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో జెనీలియా, సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేసిన ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.షేర్ చేసిన కొన్నిగంటల్లో, ఈ క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. పెద్ద మనసున్న సల్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సంతోషం, ప్రేమ, చక్కటి ఆరోగ్యంతో ఉండేలా ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఆజ్ భాయ్ కా బర్త్‌డే హై." అంటూ జెనీలియా తనఇన్స్టాలో పోస్ట్ చేసింది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులతోపాటు, హీరో, హీరోయిన్ల ద్వారా సల్మాన్‌కు శుభాకాంక్షల వెల్లువ కురిసింది. ముఖ్యంగా సల్మాన్ మాజీ ప్రేయసి, కొత్త పెళ్లి కూతురు, హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా సల్మాన్‌కు బర్త్‌డే విషెస్ అందించింది. కాగా సల్మాన్ ఖాన్ శనివారం రాత్రి పన్వేల్ ఫామ్‌హౌస్‌లో విషం లేని పాము కాటుకు గురయ్యారు. నవీ ముంబైలోని కమోథేలోని ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆదివారం ఉదయం డిశ్చార్జ్ అయిన సల్మాన్ కుటుంబంతో కలిసి సోమవారం తన ఫామ్‌హౌస్‌లో 56వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) -
కొడుకు సినిమా హిట్ టాక్: హీరోయిన్ డ్యాన్స్ వీడియో వైరల్
సాక్షి,ముంబై: ‘మైనే ప్యార్ కియా’ అంటూ బాలీవుడ్ డెబ్యూ మూవీతోనే అదరగొట్టిన అలనాటి అందాల నటి భాగ్యశ్రీ పుత్రోత్సాహంతో పొంగిపోతోంది. తన కుమారుడు అభిమన్యు దాసాని సినిమాలోని మీనాక్షి సుందరేశ్వర్‌లోని ఒక పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. టిట్టర్ బిట్టర్ పాటకు డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోను ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. తన వారసుడి సినిమాను సెలబ్రేట్ చేసుకుంటూ తన సంతోషాన్ని ఇన్‌స్టాలో షేర్ చేసింది “కొత్త సంవత్సరం, కొత్త ప్రారంభం! నా కొడుకు మొదటి నెట్‌ఫ్లిక్స్ చిత్రం మీనాక్షి సుందరేశ్వర్ విడుదలైంది. ఇప్పటికే ప్రేమను కురిపించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా చూడకపోతే, మీ ప్రియమైన వ్యక్తితో, సినిమా చూసేయండి..పాప్‌కార్న్ తింటూ మళ్లీ ప్రేమలో పడండి. మీ ఆశీర్వాదాలకు అందరికీ ధన్యవాదాలు’’అని పేర్కొంది. దీంతోపాటు మైనే ప్యార్‌కియా చిత్ర జ్ఞాపకాలను కూడా సోమవారం సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రేమ్, సుమన్‌లను సజీవంగా గుండెల్లో దాచుకున్నందుకు సినీ అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్బంగా సల్మాన్ ఖాన్‌తో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేయడం విశేషం. కాగా మీనాక్షీ సుందరేశ్వర్ మూవీకి మనోహరమైన హృద్యమైన చాలా గొప్ప చిత్రం అlo ప్రశంసలు లభిస్తున్నాయి. నేటితరం హీరోల మాదిరిగా కాకుండా, చాలా డిగ్నిఫైడ్‌గా ఉన్నాడంటూ భాగ్యశ్రీ కుమారుడుడు, అభిమన్యు దసానీ ముద్దపప్పులా ఈ పాత్రకి సరిపోయాడనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా దసానీకి జోడీగా నటించింది. తమిళ మధ్య తరగతి నేపధ్యంతో తెరకెక్కిన ఈ మూవీకి దర్శకుడు వివేక్ సోనీ. కాగా అభిమన్యు దాసాని 2018లో వాసన్ బాలా చిత్రం మర్ద్ కో దర్ద్ నహీ హోతాతో అరంగేట్రం చేశాడు. నికమ్మ, ఆంఖ్ మిచోలీలో కనిపించనున్నాడు. మరోవైపు సల్మాన్ ఖాన్ సరసన బ్లాక్‌బస్టర్ మూవీలో నటించిన తరువాత చాలా సంవత్సరాలు నటనకు దూరంగా ఉన్న భాగ్యశ్రీ ఇటీవల కంగనా రనౌత్ చిత్రం తలైవిలో కనిపించింది. -
రాంగ్ స్టెప్ వేశారో.. మీ ఫ్యూచర్‌కు దెబ్బే.. అక్షయ్ వీడియో వైరల్
సాక్షి, ముంబై: ఈ దీపావళికి ఎట్టకేలకు బిగ్ స్క్రీన్‌ను పలకరించనున్న బాలీవుడ్ మూవీ సూర్యవంశీ టీమ్ ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. రణవీర్‌తో కలిసి స్పెప్పులతో ఇరగదీసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. (Prabhas: క్లాస్ అయినా మాస్ అయినా.. మోత మోగాల్సిందే!) ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. సూర్యవంశీ మూవీలోని లేటెస్ట్ ట్రాక్ ‘ఐలారే అల్లా’ పాటకు రణవీర్‌తో కలిసి స్టెప్పులేశాడు అక్షయ్. ఈ క్రేజీ డాన్స్‌కు మీరు అడుగులు రోపండి అని పోస్ట్ చేశారు. అంతేకాదు.. జాగ్రత్త.. ఎక్కడైనా పొరపాటు జరిగిందో, మీ ఫ్యూచర్‌కు దెబ్బే అంటే స్వీట్ వార్నింగ్ ఇవ్వడం విశేషం. ఈ మూవీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఐలారే పాటను గురువారం ట్విటర్లో షేర్ చేశారు.(Prabhas Birthday Special: పండగలా దిగొచ్చిన ‘డార్లింగ్’కు హ్యాపీ బర్త్‌డే) రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ సూర్యవంశీ. అజయ్ దేవగన్‌ని ‘సింగం’గా, రణ్‌వీర్‌ని ‘సింబా’గా చూపించిన రోహిత్ తాజాగా అక్షయ్‌ని ‘సూర్యవంశీ’ గా చూపించబోతున్నాడు. అంటే సింగిల్ ఫ్రేమ్‌లో ‘సింగం’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ అన్నమాట. వీరితోపాటు కత్రినా కైఫ్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. (Freida Pinto: అవును..నా డ్రీమ్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నా!) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నవంబర్ 5న దీపావళికి విడుదల కానుంది. తమ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసి ఆదరించాలంటూ దర్శకుడు రోహిత్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. ఈ మూవీ ప్రమోషన్లో ప్రస్తుతం అంతా బిజీబిజీగా ఉన్నారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్నాయి. ఓటీటీలో కంటే థియేటర్లో రిలీజ్ కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్న కొన్ని సినిమాలలో సూర్యవంశీ కూడా ఒకటి. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) The celebrations have begun & here is your party starter pack!!#AilaReAillaa song out now - https://t.co/mLu67F7jTr#Sooryavanshi releases this Diwali, 5th November in cinemas. #BackToCinemas pic.twitter.com/R3HJwOzFT4 — Karan Johar (@karanjohar) October 21, 2021 -
డ్యాన్సింగ్ సెన్సేషన్ ఈ బామ్మ.. 2 కోట్ల వ్యూస్
-
డ్యాన్సింగ్ సెన్సేషన్ ఈ బామ్మ.. 2 కోట్ల వ్యూస్
ఖాట్మండు: లేడిపిల్లలా చెంగుచెంగున నడుస్తూ.. నెమలిలా నాట్యం చేస్తోంది కృష్ణకుమారి తివారి. నాట్యం చేస్తుంటే అందరి కళ్లు ఆమె పైనే. కాళ్లకు ఘల్లుఘల్లుమనే గజ్జలు కట్టుకుని, నాట్యంతో హావభావాలు పలికిస్తోన్న అమ్మాయి కదా! అందరూ ఆసక్తిగా చూస్తారులే! అనుకుంటే మీరు పొరబడినట్లే. డెబ్భైఎనిమిదేళ్ల వయసులో మైమరిపించే స్టెప్పులతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది కృష్ణకుమారి బామ్మ. నేపాల్‌లోని గోర్కా జిల్లాకు చెందిన కృష్ణకుమారి తివారికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో ఇంట్లో వాళ్లు డ్యాన్స్‌ను ప్రోత్సహించేవారు కాదు. సంప్రదాయ కుటుంబాలలోని ఆడపిల్లలు డాన్సులంటూ తిరిగితే సమాజం నుంచి వెలేస్తారేమోనని భయపడే రోజుల్లో ఆమె బాల్యం గడిచింది. దీంతో తనకి ఎంతో ఇష్టమైన నాట్యం తీరని కలగానే మిగిలిపోయింది. పెళ్లీ, పిల్లలు, వారి బాధ్యతలు అన్నీ తీరడం, ఇప్పుడు తీరిక దొరకడం చిన్నప్పటి కట్టుబాట్లు ప్రస్తుతం లేకపోవడంతో ఒంట్లోని ఓపికను కూడగట్టుకుని పదహారేళ్ల పడచు పిల్లలా డ్యాన్స్ చేస్తూ తన చిరకాల కోరికను తీర్చుకుంటోంది. కృష్ణకుమారి డ్యాన్స్ చేస్తోన్న వీడియోలు ఆమె కుటుంబ సభ్యులు టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయడంతో ఇప్పుడవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె డ్యాన్సింగ్ వీడియోలలో ఒకదానికి దాదాపు రెండుకోట్ల వ్యూస్, 65 వేల కామెంట్లు వచ్చాయి. కృష్ణకుమారి డ్యాన్స్ గురించి తెలిసిన వారంతా ఆ చుట్టుపక్కల జరిగే పెళ్లిళ్లు, పార్టీలకు ఆహ్వానిస్తూ ఆమె డ్యాన్స్‌ను మరింత ప్రోత్సహిస్తున్నారు. ‘‘అప్పటి సమాజంలో ఉన్న నిబంధనలను అనుసరించి డ్యాన్స్ చేయాలన్న ఆకాంక్షను నాలోనే అణచి వేసుకున్నాను. అయితే ఇప్పుడు నాకేం జరుగుతుందే తెలియడం లేదు. ఎప్పుడూ డ్యాన్స్ చేస్తూనే ఉంటున్నాను. ఎవరూ నన్ను ఆపడంలేదు, నా పిల్లలు కూడా చాలా సంతోషిస్తున్నారు. నా డ్యాన్స్ వీడియోలకు చాలా మంది అభిమానం చూపిస్తుంటే మరింత డ్యాన్స్ చేయాలనిపిస్తోంది. డ్యాన్స్ చేస్తూ చనిపోవాలని ఉంది’’ అని చెప్పారు కృష్ణకుమారి సంతోషంతో నీళ్లు నిండిన కన్నులతో. -
Video: ఈ నటుడి డెడికేషన్‌కి హ్యాట్సాఫ్.. మామూలు కష్టం కాదు!
తెరపై ఎంత సేపు కనిపించామన్నది కాదు.. ఆడియెన్స్-వ్యూయర్స్‌పై ఎంత ఇంపాక్ట్ చూపించామన్నది ముఖ్యం. ఫ్యామిలీ మ్యాన్ ‘చెల్లం’సర్ లాంటి కొన్ని క్యారెక్టర్లు ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ వస్తున్నాయి. తాజాగా అలాంటి ఇంపాక్ట్ చూపించిన మరో క్యారెక్టర్.. డ్యాన్సింగ్ రోజ్. పా రంజిత్ డైరెక్షన్లో అమెజాన్ ప్రైమ్‌లో లేటెస్ట్గా రిలీజ్ అయ్యింది ‘సార్పట్ట పరంపర’(సార్పట్ట పరంబరై). ఈ సినిమాలో ఈ ‘డ్యాన్సింగ్ రోజ్’ అనే క్యారెక్టర్‌కి ప్రాధాన్యత పదిహేను నిమిషాలు ఉంటుంది. కానీ, ఆ క్యారెక్టర్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాడు పా రంజిత్. స్లిమ్ ఫిట్ బాడీ, నుదుట రింగు, విచిత్రంగా మెలికలు తిరుగుతూ వేసే స్టెప్పులు. రింగ్‌లో ఊగిపోతూ ఓడిపోతున్నట్లుగా ప్రత్యర్థులను భ్రమపెట్టి, కాళ్ల వేగంతో కన్ఫ్యూజ్ చేసి బాక్సింగ్‌లో గెలుపు సాధించే క్యారెక్టర్ డ్యాన్సింగ్ రోజ్‌ది. అయితే డ్యాన్సింగ్ రోజ్కి ఓ క్యారెక్టర్ అంటూ ఉంటుంది. సమర(కబిలన్)తో ఓడినప్పటికీ, విలన్ బ్యాచ్‌లో ఉన్నప్పటికీ.. నీతి తప్పడు. పైగా క్లైమాక్స్ పోటీకి ముందు వేటపులి(వేంబులి)కి హితబోధ కూడా చేస్తాడు. అందుకే చాలామందికి ఈ పాత్ర బాగా కనెక్ట్ అయ్యింది. ఇంతకీ ఈ క్యారెక్టర్ చేసింది ఎవరంటే.. చెన్నై థియేటర్ ఆర్టిస్ట్ షబీర్ కళ్ళరక్కల్. మాంచి థియేటర్ ఆర్టిస్ట్ 2009 నుంచి నటన వైపు అడుగులేశాడు నటుడు షబీర్ కళ్ళరక్కల్. యాభైకి పైగా స్టేజ్ షోలతో థియేటర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆపై ‘నెరుంగి వా ముథమిడతే’(2014) హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు షబీర్. కానీ, ఆ తర్వాత అవకాశాలే పెద్దగా రాలేదు. దీంతో ‘అడంగ మరు, పెట్టా, టెడ్డీ’ లాంటి పెద్దసినిమాల్లో చిన్నరోల్స్ చేశాడు. షబీర్ స్వతహాగా ఫిట్నెస్ ప్రియుడు. దీంతో కాస్టింగ్ డైరెక్టర్ నిత్య.. సార్పట్ట అడిషన్స్‌కు వెళ్లమని సలహా ఇచ్చింది. అలా క్యారెక్టర్ దక్కింది. ఫిట్నెస్ ఉన్నోడు కావడంతో మార్షల్ ఆర్ట్స్ కళలో శిక్షణ తీసుకోగలిగాడు. స్టంట్ మాస్టర్ తిరు నేతృత్వంలో.. రకరకాల కళలను సులువుగా అవపోసన పట్టగలిగాడు. అంత కష్టపడ్డాడు గనుకే డ్యాన్సింగ్ రోజ్ సీక్వెన్స్‌లన్నీ అంతగా పేలాయి. ఇక అతను పడ్డ కష్టం తాలుకా వీడియోను చూసేయండి. Shabeer Kallarakkal aka DANCING ROSE. pic.twitter.com/aCUSdfJwSN — LetsOTT GLOBAL (@LetsOTT) July 22, 2021 అన్నట్లు డ్యాన్సింగ్ రోజ్‌కు ఇన్స్పిరేషన్.. యూకే బాక్సింగ్ లెజెండ్ నసీమ్ హమెద్. ఆయన ఎంట్రీ దగ్గరి నుంచి రింగ్‌లో కదలికల దాకా అంతా విచిత్రంగా ఉంటుంది. 1992-2002 మధ్య ప్రొఫెసనల్ బాక్సర్‌గా కొనసాగిన నసీమ్.. 37 ఫైటింగ్ల్లో ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ఓడిపోయాడు. ఐదున్నర అడుగుల ఎత్తుండే ప్రిన్స్.. క్యారెక్టర్ స్ఫూర్తితో జపనీస్ మాంగా సిరీస్ ‘హజెమె నో ఇప్పో’లో అమెరికన్ బాక్సింగ్ ఛాంపియన్ బ్రయాన్ హక్ క్యారెక్టర్‌ను సైతం తీర్చిదిద్దారు. -
వైరల్ వీడియో: ఇది అసలు పెళ్లేనా.. ఇలా చేశారేంటి?
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం అనేది సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య ఇద్దరు వ్యక్తులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించే అద్భుత ఘట్టం. అయితే రానురానూ ఈ వేడుకలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కన్యాదానం, అప్పగింతలు, ముహూర్తాలూ ఇలాంటివేం పట్టించుకోకుండా తమకు నచ్చినట్లు కానిచ్చేస్తున్నారు. తాజాగా పెళ్లిలో వధూవరుల్దిరూ కలిసి అగ్ని హోత్రం చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని వీడియోను బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ ఛైర్మన్, ఎండీ వేదాంత్ బిర్లా తన ట్విట్టర్లో షేర్ చేశారు. సప్తపదిలో భాగంగా వధూవరులిద్దరూ పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయడం హిందూ వివాహాలలో ఒక ముఖ్యమైన లక్షణం. కానీ బిర్లా పోస్టు చేసిన వీడియోలో మాత్రం ఈ వేడుకలో వధూవరులు నృత్యం చేస్తుంటే అతిథులు వారిని ఉత్సాహపరుస్తున్నారు. అయితే దీనిని బిర్లా వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. ‘ఇది పెళ్లి లేదా మన సాంప్రదాయ విలువలను వదిలేయడమా.. ఈ ప్రపంచంలో మీరు గొప్పవారిగా భావిస్తే అది మీ సంస్కృతి, విలువల వల్లనే అని మర్చిపోవద్దు’ అని కామెంట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలమంది వీక్షించగా వేలల్లో కామెంట్ చేస్తున్నారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. దీనిపై అనేక మంది తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. వీరిలో ఎక్కువగా పెళ్లిలో అలా డ్యాన్స్ చేయడం అసహ్యకరంగా ఉందని, విలువలను అగౌరపరిచే విధంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ‘ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు కేవలం ఫోటోగ్రఫీ కోసం కోసమే అన్న విధంగా మారిపోయాయి. ఈ ఫోటోలు, వీడియోలను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేరేచేందుకు వారి ఆరాటమంతా.. విలువలకు, సంప్రదాయాలకు ఏమాత్రం గౌరవం లేకుండా పోయింది. పెళ్లిలో ఇలా కూడా చేస్తారా. ఇది మన సంస్కృతి కాదు’ అని హితవు పలుకున్నారు. అయితే అనేకమంది విమర్శిస్తుంటే ఓ వర్గం వారు మాత్రం సానూకూలంగా స్పందిస్తున్నారు. వధూవరూలు నృత్యం చేయడంతో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. వేడుక ఎలా చేసుకోవాలనేది వాళ్ల ఇష్టం. ఈ వీడియో చూడమని ఎవరిని మనం ఇంకా 18వ శతాబ్దంలోనే ఉంటున్నాం.. అని అంటున్నారు. చదవండి: ‘థాంక్యూ చెల్లెమ్మ.. కానీ ఈరోజు నా బర్త్‌డే కాదు’ మాల్దీవుల్లో పెళ్లిలో 'సాహో' హీరోయిన్! -
ఆరు పదుల వయసులో.. ఆకట్టుకునే డ్యాన్స్..!
-
డ్యాన్సింగ్ బామ్మ.. వీడియో చూశారంటే షాకే..!
ముంబై : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్ర ట్విటర్లో తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో ఆనందం అంటే ఇదేనేమో..! అనేలా ఉంది. ఓ ఆరు పదుల వయసు దాటిన మహిళ వంట చేస్తూ చలాకీగా డ్యాన్స్ చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మాంసాహారం తయారు చేస్తున్న ఆ బామ్మ.. ‘జిమికి కమల్’ పాటకు సరికొత్త స్టెప్పులతో అదరగొట్టింది. ‘మీలాగే.. నేనూ న్యూఇయర్ సందర్భంగా చాలా వీడియో మెసేజ్‌లు అందుకున్నా. అన్నిటిలో ఈ వీడియో నన్ను అమితంగా ఆకట్టుకుంది. అయితే, వీడియోలో ఉన్నదెవరో.. ఎవరు ఈ వీడియో తీశారో తెలియదు. కానీ, బామ్మ డ్యాన్స్ నన్ను పండుగ మూడ్‌లోకి తీసుకెళ్లింది. ఇంటికి వెళ్లిన మరుక్షణం.. బామ్మ డ్యాన్స్ మూమెంట్లను ప్రాక్టిస్ చేస్తా..!’అని ఆనంద్ మహింద్ర ట్వీట్ చేశారు. -
ఆ అవార్డు అఫ్గాన్‌కే: ఐసీసీ
హైదరాబాద్: క్రికెట్లో వినోదానికి మారుపేరు వెస్టిండీస్ జట్టు. వికెట్ తీసినా, సిక్సర్ కొట్టిన, సెంచరీ చేసినా కరేబియన్ ఆటగాళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీసిన ఆనందంలో విండీస్ బౌలర్ ఓష్నే థామస్ అంపైర్‌కు సెల్యూట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా పసికూన అఫ్గానిస్తాన్ కూడా విండీస్ బాటలోనే నడుస్తుంది. ఆటతోనే కాకుండా అభిమానులకు తమదైన రీతిలో వినోదాన్ని పంచుతున్నారు అఫ్గాన్ ఆటగాళ్లు. తాజాగా అఫ్గాన్ ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తున్న వీడియోనే ఐసీసీ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఓవర్‌వెయిట్ బ్యాట్స్‌మన్ మొహమ్మద్ షహజాద్‌తో పాటు యువ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్లు బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. చాలా సరదాగా ఉన్న ఈ వీడియోనే ఐసీసీ షేర్ చేస్తూ.. ఒకవేళ ప్రపంచకప్‌లో అత్యంత వినోదాత్మక జట్టు అవార్డు ఇవ్వాల్సివస్తే అది అఫ్గాన్‌కే దక్కుతుందని కామెంట్లో పేర్కొంది. ప్రస్తుతం ఐసీసీ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. -
రోడ్డుపై చిందేసిన హీరోయిన్
నటి శ్రియా నడిరోడ్డు పైనే చిందేసింది. అయితే అది షూటింగ్లో భాగంగా కాదు.. ఇండియాలో అసలే కాదు. విదేశాల్లో. వారం క్రింతం హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి ఫారిన్ వెళ్లిన శ్రియా అక్కడ కార్నివాల్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా అందరితో కలిసి రోడ్డు మీదనే డ్యాన్స్ చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలు, ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. 2001లో ఇష్టం చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రియా.. చాలా కాలం పాటు టాప్ హీరోయిన్గా వెలిగిపోయింది. శ్రియా గతేడాది రష్యన్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చివ్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ భామ తమిళ్లో నటించిన ‘నరకాసురన్’ విడుదలకు సిద్ధమవుతుండగా.. హిందీలో ‘తడ్కా’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. View this post on Instagram Carnival last week was so much fun. @dhrutidave our kinda fun it was. A post shared by @ shriya_saran1109 on Mar 15, 2019 at 9:19am PDT -
కశ్మీర్ బాలికలకు హిజ్బుల్ వార్నింగ్..
శ్రీనగర్ : భద్రతా దళాలను తమను నిలువరించాలని సవాల్ విసిరిన ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజహిదిన్ తాజాగా కశ్మీరీ బాలికలను హెచ్చరించింది. డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న బాలికలకు ఇదే చివరి హెచ్చరికని, వారు ఈ పని మానుకోవాలి లేదా వారి కాళ్లు తెగనరుకుతామని, అందుకు సిద్ధంగా ఉండాలంటూ పోస్టర్లను విడుదల చేసింది. శ్రీనగర్‌లో ఇటీవల తాము సమావేశమయ్యామని తదుపరి భేటీ ఢిల్లీలో ఉంటుందని హిజ్బుల్ చీఫ్ రియాజ్ నైకూ వెల్లడించినట్టు తెలిసింది. హిజ్బుల్‌లోకి పెద్ద సంఖ్యలో బాలికలు, ఇతరులను రిక్రూట్ చేసుకోవాలని శ్రీనగర్ భేటీలో ఉగ్రసంస్థ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత్‌తో పాటు దాని సంస్థలతో ఎలా పోరు సాగించాలనే కసరత్తుపై తమ భేటీ 47 గంటల పాటు సుదీర్ఘంగా సాగిందని హిజ్బుల్ ప్రతినిధి పేర్కొన్నారని జీ మీడియా వెల్లడించింది. -
‘సంచలన’ అభిమానిని చూసి హీరో షాక్!
లండన్/విదిషా: డాన్సింగ్ వీడియోతో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించి, ఏకంగా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిపోయిన తన వీరాభిమాని, ‘డాన్సింగ్ అంకుల్’ సంజీవ్ శ్రీవాస్తవకు హీరో గోవిందా సందేశం పంపాడు. ఓ స్నేహితుడు పంపిన ఆ డాన్సింగ్ వీడియో చూసి చిన్నపాటి షాక్‌కు గురయ్యానని, ఒకరు మనల్ని అనుకరించడం ఎంతైనా ఆనందించాల్సిన విషయమేనని వెటరన్ హీరో అన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన ‘ఇండియా టుడే’ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. మీ భార్య కూడా కాలుకదపడం చాలా బాగుంది: ‘‘ ఏదో డాన్స్ చేస్తున్నట్లు కాకుండా పూర్తిగా లీనమై స్టెప్పులు వేశారు. తెలియకుండానే నన్ను అనుకరించారు. నిజంగా ఎవరైనా మనల్ని అనుకరిస్తుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది? ఈ సందర్భంగా సంజీవ్ శ్రీవాస్తవ గారికి నా సందేశమిదే.. ‘మీరు డాన్స చేసిన విధానం, ఎంజాయ్ చేసిన తీరు నిజంగా ఆనందింపజేసేలా ఉన్నాయి. కూడా మీ భార్య సైతం స్టెప్స్ వేయడం చాలా బాగుంది. ఎప్పటికీ మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..’’ అని గోవిందా అన్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం: ‘డాన్సింగ్ అంకుల్’గా ఇంటర్నెట్లో సంచలనం సృష్టించిన విదిషా వాసి, ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గర్నుంచి పెద్దపెద్ద సెలబ్రిటీలంతా పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. డాన్స్‌లో గోవిందానే తనకు ప్రేరణ అని చెప్పుకున్న సంజీవ్ని.. విదిషా మున్సిపల్ కార్పొరేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
గబ్బర్-గేల్ ఒక్కటై ఇరగదీశారు! వైరల్
సాక్షి స్పోర్ట్స్: అద్భుతమైన ఆటతోపాటు విలక్షణమైన యాటిట్యూడ్‌తోనూ అభిమానుల్ని అలరించడంలో ముందుంటారు జమైకన్ క్రిస్‌గేల్, ఇండియన్ ‘గబ్బర్’ శిఖర్ ధావన్! మొన్నటి ఐపీఎల్లో వేర్వేరు జట్ల తరఫున ఆడిన ఈ దిగ్గజాలు.. వేదిక మారగానే ఒక్కటైపోయారు. ఇటీవల ముంబైలో జరిగిన సియాట్ అవార్డుల ఫంక్షన్లో ‘జుమ్మా..చుమ్మా..’ పాటకు స్టెప్పులేసి ఇరగదీశారు. గబ్బర్-గేల్ల సందడి వీడియో వైరల్ అయింది. జమైకన్ దలేర్ మెహంది: పంజాబీ స్టైల్లో తలపాగా ధరించిన క్రిస్ గేల్‌ను ధావన్ పొగడ్తలతో ముంచెత్తాడు. ‘‘చూడండి.. జమైకా దలేర్ మెహందితో సెల్ఫీదిగా. మనసంతా బోలో తారారారా..’’అని గబ్బర్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ 2018లో కింగ్స్ లెవెన్ పంజాబ్ తరుఫున 11 మ్యాచ్‌లు ఆడిన గేల్.. ఒక సెంచరీ, రెండు అర్థసెంచరీలతో మొత్తం 368 పరుగులు చేశాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా 16 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన శిఖర్ ధావన్ నాలుగు హాఫ్ సెంచరీలతో మొత్తం 497 పరుగులు చేశాడు. -
గేల్-గబ్బర్ల సందడి.. వీడియో వైరల్..!
-
తాతయ్య స్టెప్పులు.. వైరల్ వీడియో
-
తాతయ్య స్టెప్పులకు యువతులు ‘ఫిదా’
సాక్షి, ముంబై: వయసు..! అవును ఈ విషయం గుర్తుకు రాగానే అందరి గుండెల్లో గుబులు మొదలవుతుంది. కానీ, ముసలితనం నా శరీరానికే. నాకు కాదు అన్నట్టు ఓ తాత తన డ్యాన్స్‌తో చెలరేగి పోయారు. ఓ పెళ్లి వేడుకలో యువతీ, యువకులకు ధీటుగా స్టెప్పులు వేసి వారికి సవాల్ విసిరారు. రేపన్నది లేదన్నట్టు, దొరికిన ఈ క్షణంలో సాధ్యమైనంత ఆనందాన్ని జుర్రాలి అన్నట్టు ఆయన తన్మయత్వంతో ఊగిపోయారు. డ్యాన్స్ చేయడానికి అడ్డొస్తున్నాయని నడక సాగించేందుకు సహాయపడే తన చేతి కర్రలను విసిరి పడేశారు. ఎంతో కళాత్మకంగా నృత్యం చేస్తున్న ఆ వృద్ధున్ని చూసి మరో ఇద్దరు యువతులు తనకు జతయ్యారు. వారి చేతులు పట్టుకొని తాతయ్య అందంగా వేసిన స్టెప్పులకు అక్కడున్న జనం ముచ్చటపడ్డారు. ఆయన నాట్య విన్యాసాల్ని ఎడ్గార్డ్ అనే వ్యక్తి వీడియోలో బంధించి ఫేస్బుక్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. కొన్ని నెలల క్రితం చోటు చేసుకున్న ఈ సరదా విన్యాసం ఇప్పడు మళ్లీ ట్రెండ్ అవుతుండడం విశేషం. -
డ్యాన్స్‌తో హోరెత్తించిన దాదా.. వైరల్ వీడియో
ముంబాయి : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. అభిమానులు ప్రేమగా పిలుచుకునే దాదా ఓ పార్టీలో డ్యాన్స్‌తో అదరగొట్టారు. శుక్రవారం ఓ నైట్ క్లబ్లో ‘దేశీ బోయ్స్’ సినిమాలోని ‘తూ మేరా హీరో’ పాటకు స్టెప్పులేశారు. అది కాస్తా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్‌తో నాట్‌వెస్ట్ సిరీస్‌లో భాగంగా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత లాడ్స్‌లో చొక్కా విప్పి గిరాటేసి.. భావోద్వేగంగా గంగూలీ తన ఆనందాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అది ఎప్పటికీ క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. అలా గంభీరంగా, హుందాగా కనిపించే దాదా ఇలా సరదాగా డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాదాలో అద్భుతమైన నాయకుడు, ఆటగాడే కాకుండా మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడని ఈ వీడియో చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. -
పార్టీలో డ్యాన్స్‌తో అదరగొట్టిన గంగూలీ