ముంబాయి : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. అభిమానులు ప్రేమగా పిలుచుకునే దాదా ఓ పార్టీలో డ్యాన్స్‌తో అదరగొట్టారు. శుక్రవారం ఓ నైట్ క్లబ్‌లో ‘దేశీ బోయ్స్’ సినిమాలోని ‘తూ మేరా హీరో’ పాటకు స్టెప్పులేశారు. అది కాస్తా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్‌తో నాట్‌వెస్ట్ సిరీస్‌లో భాగంగా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత లాడ్స్‌లో చొక్కా విప్పి గిరాటేసి.. భావోద్వేగంగా గంగూలీ తన ఆనందాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అది ఎప్పటికీ క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. అలా గంభీరంగా, హుందాగా కనిపించే దాదా ఇలా సరదాగా డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాదాలో అద్భుతమైన నాయకుడు, ఆటగాడే కాకుండా మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడని ఈ వీడియో చూసిన వారు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment