ganguly
-
బుల్లితెర నటిపై తీవ్ర ఆరోపణలు.. దెబ్బకు వీడియో డిలీట్!
బాలీవుడ్లో బుల్లితెర స్టార్ రూపాలీ గంగూలీ అందరికీ సుపరిచితమే. బుల్లితెర నటుల్లో రిచెస్ట్ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఆమె సవతి కూతురు ఇషా నటిపై సంచలన కామెంట్స్ చేసింది. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్‌ను విడగొట్టిందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది.అయితే ఈషా కామెంట్స్‌పై నటి రూపాలీ గంగూలీ పరువునష్టం దావా వేసింది. తన పరువుకు భంగం కలిగించేలా ఇషా మాట్లాడిందంటూ రూ.50 కోట్లకు నోటీసులు పంపించింది. ఈ నోటీసులు అందుకున్న ఇషా వెంటనే అప్రమత్తమైంది. ఆ తర్వాత కొన్ని గంటలకే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను సైతం డిలీట్ చేసింది. అంతేకాకుండా తన ఇన్‌స్టా అకౌంట్‌ను ప్రైవేట్‌గా మార్చేసింది. పరువు నష్టం కేసు నోటీసులు రావడంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు)డిలీట్ చేసిన వీడియో ఇషా మాట్లాడుతూ..'ఇప్పుడు నేను నా రౌడీలకు వ్యతిరేకంగా నిలబడ్డా. నా జీవితంలో వాళ్లిద్దరే రౌడీలు. వారు నేను ప్రేమించే నా తల్లిని ఇబ్బంది పెట్టడమే కాదు.. నన్ను బాధపెట్టాలని చూశారు. వారు నన్ను విమర్శించడానికి నా బలహీనతలను ఎంచుకున్నారు. వారు నాకు బహిరంగంగా, వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. నన్ను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని" మాట్లాడింది. పరువు నష్టం నోటీసులు రావడంతో వెంటనే ఆ వీడియోను తొలగించింది. కాగా.. అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. -
బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఓ వైపు బీజేపీ దూసుకుపోతుంటే.. మరోవైపు పలువురు నేతలు ఆ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు. తాజాగా నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. బుధవారం ఆమె ఢిల్లీ బీజేపీ పార్టీ కార్యాలయంలో వినోద్ తావ్డే, అనిల్ బలూని సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన అనంతరం రూపాలీ గంగూలీ మీడియాతో మాట్లాడారు. ‘మహాయాగ్య అభివృద్ధి చేసినప్పుడు అందులో నేను కూడా భాగం కావాలని భావించాను. నేను చేసే మంచికి.. మీ దీవెనలు, మద్దతు నాకు కావాలి’ అని రూపాలీ అన్నారు.#WATCH | Actress Rupali Ganguly joins BJP at the party headquarters in Delhi She says, "...When I see this 'Mahayagya' of development, I feel that I should also take part in this...I need your blessings and support so that whatever I do, I do it right and good...'' pic.twitter.com/x7pT7oq0xB— ANI (@ANI) May 1, 2024రూపాలీ గంగూలీ దర్శకుడు అనిల్ గంగూలీ కుమార్తె. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, ఆపై పలు టీవీ సీరియల్స్ ద్వారా ఆమె పాపులారిటీ సంపాదించుకున్నారు. బుల్లితెరపై అత్యధికంగా పారితోషకం అందుకుంటున్న నటి ఈమెనే కావడం గమనార్హం. వ్యక్తిగత జీవితానికి వస్తే.. బెంగాలీ మూలాలున్న కుటుంబమే అయినప్పటికీ రూపాలీ సినీ నేపథ్యం కారణంగా ఆమె తండ్రి ముంబైలో స్థిరపడ్డారు. హోటల్ మేనేజ్మెంట్ చేసి ఆపై నటన వైపు ఆమె మళ్లారు. 2013లో ఆమె అశ్విన్ వీ వర్మ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.ఇక.. ఇటీవల బీజేపీలో చేరిన నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే రామ్నివాస్ రావత్ మంగళవారం బీజేపీలో చేరారు. ప్రియాంకా గాంధీకి సన్నిహితంగా ఉండే తాజిందర్ సింగ్ బిట్టు గత నెలలో బీజేపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. -
దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్.. ఆ బుల్లితెర నటి ఎవరంటే?
సినిమా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ఎందుకంటే స్టార్ హీరోల విషయాకొనిస్తే ఆ పదం కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు కూడా ఉన్నారు. అలాగే సినిమాలతో పాటు బుల్లితెరపై కనిపించే నటీనటులు సైతం కోట్లలో కాకపోయినా.. లక్షల్లో తీసుకునేవారు ఉన్నారు. బుల్లితెరపై నటీనటుల విషయంలో రెమ్యునరేషన్ తక్కువే అయినా.. అందులోనూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్‌కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్న క్రేజీ నటి గురించి తెలుసుకుందాం. ఇంతకీ ఆమె ఎవరో మీరు కూడా ఓ లుక్కేయండి. ఏడేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన నటి ప్రస్తుతం బుల్లితెరపై నటించేవారిలో అత్యధిక పారితోషికం అందుకుంటోంది. ప్రముఖ సీరియల్స్‌లో నటిస్తూ ఒక్కో ఎపిసోడ్‌కు హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఆమె దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బుల్లితెర భామ రూపాలీ గంగూలీ. దర్శకుడు, స్క్రీన్ రైటర్ అనిల్ గంగూలీ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె సోదరుడు విజయ్ గంగూలీ కూడా కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. రూపాలి గంగూలీ 1985లో ఏడేళ్ల వయసులో తన తండ్రి చిత్రం సాహెబ్‌లో నటించింది. ఆ తర్వాత ఆమె 2000లో సుకన్య అనే సీరియల్‌తో బుల్లితెర రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సారాభాయ్ వర్సెస్ సారాభాయ్‌లో మోనిషా పాత్రకు ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2006లో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్- 1లో పాల్గొంది. ఆ తర్వాత కూడా పలు రియాలిటీ షోస్‌లో కూడా పాల్గొంది. ఆమెకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో సన్నిహితమైన సంబంధాలు కూడా ఉన్నాయి. అక్షయ్ కుమార్‌ను కుటుంబ సభ్యుడిలా భావిస్తామని గతంలో రూపాలీ చాలాసార్లు చెప్పుకొచ్చారు. సీరియల్స్‌లో నటిస్తూ ఉండగానే రూపాలి గంగూలీ ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ కె. వర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అనుపమ-నమస్తే అమెరికా, బతేన్ కుచ్ అంకాసీ అనే సీరియల్స్‌లో నటిస్తోంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బుల్లితెర నటిగా పేరు సంపాదించుకున్న రూపాలీ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న బుల్లితెర నటిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 3 లక్షలు తీసుకుంటోంది. కేవలం సీరియల్స్ ద్వారానే దాదాపు రూ. 20 కోట్ల వరకు ఆస్తులు సంపాదించారు. బుల్లితెర పరంగా చూస్తే ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ రూపాలీ గంగూలీ అందుకుంటున్నారు. ఓవరాల్‌గా ఇండియాలో ఈ స్థానం మాత్రం కమెడియన్ కపిల్ శర్మదే. అతడు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.50 లక్షలు వసూలు చేస్తుండటం విశేషం. బాలీవుడ్ లోనూ అతడు పలు సినిమాల్లో కనిపించాడు. ది కపిల్ శర్మ షో మాత్రం చాలా ఫేమస్ అయ్యారు. సంపద పరంగా చూస్తే రూపాలీ గంగూలీ కంటే హీనా ఖాన్ నెట్ వర్త్ చాలా ఎక్కువ. ఆమె రూ.52 కోట్లతో దేశంలో అత్యధిక సంపద కలిగిన బుల్లితెర నటిగా నిలిచింది. View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) -
‘బీజేపీలో చేరలేదనే గంగూలీపై కక్ష సాధింపు’
కోల్‌కతా: భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందునే మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరుతున్నారనే వార్తను వ్యాప్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షాను బీసీసీఐ సెక్రెటరీగా రెండో టర్మ్ కొనసాగిస్తూ గంగూలీకి అధ్యక్షుడిగా మరోమారు అవకాశం ఇవ్వకపోవటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అది రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. ‘సౌరవ్ గంగూలీని పార్టీలో చేర్చుకుంటున్నట్లు బెంగాల్ ప్రజల్లో ఓ వార్తను వ్యాప్తి చేయాలని బీజేపీ కోరుకుంటోంది. ఈ విషయంపై మేము నేరుగా మాట్లాడాలనుకోవట్లేదు. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత అలాంటి వార్తల వ్యాప్తికి బీజేపీ ప్రయత్నించిన క్రమంలోనే మాట్లాడుతున్నాం. బీసీసీఐ చీఫ్‌గా రెండోసారి గంగూలీని కొనసాగించకపోవటం వెనుక రాజకీయాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. సౌరవ్‌ను అవమానించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.’ అని తెలిపారు ఘోష్. ఈ ఏడాది మే నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. గంగూలీ ఇంటికి వెళ్లటం వెనుక అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, పరిస్థితులపై మాట్లాడటానికి గంగూలీనే సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. మరోవైపు.. గంగూలీకి మద్దతు తెలిపారు టీఎంసీ ఎంపీ సాంతాను సేన్. బీసీసీఐ అధ్యక్షుడిగా రెండాసారి ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఖండించిన బీజేపీ.. సౌరవ్ గంగూలీ విషయంలో టీఎంసీ చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్. అవి నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. గంగూలీని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించిందో తమకైతే తెలియదన్నారు. బీసీసీఐ చీఫ్ మార్పుపై కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయటం టీఎంసీ మానుకోవాలని హెచ్చరించారు. ఇదీ చదవండీ: Sourav Ganguly: గంగూలీ కథ ముగిసినట్లే..! -
బీసీసీఐ కి కొత్త బాస్...
-
పంత్ వీరవిహారం గిల్‌క్రిస్ట్ విధ్వంసాలను గుర్తు చేసింది..
అహ్మదాబాద్: తనదైన రోజున ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచే టీమిండియా డాషింగ్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌పై ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఫైటింగ్ సెంచరీతో అదరగొట్టిన పంత్.. 116 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో మూడో సెంచరీని నమోదు చేశాడు. రూట్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మరీ సెంచరీ పూర్తి చేసిన పంత్.. ఆ వెంటనే (101 పరుగుల వద్ద) అండర్సన్ బౌలింగలో ఔటయ్యాడు. క్లిష్ట సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన పంత్.. మొదట్లో వికెట్ కాపాడుకునే ఉద్దేశంతో నెమ్మదిగా ఆడి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఆతరువాతే పంత్ విధ్వంసం మొదలైంది. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత వరుస ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. పంత్‌కు వాషింగ్టన్ సుందర్ నుంచి పూర్తి సహకారం లభించింది. సుందర్(117 బంతుల్లో 60 నాటౌట్, 8 ఫోర్లు), పంత్‌లు కలిసి ఏడో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు 89 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. కాగా, పంత్, సుందర్‌ల జోడీ ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరుపై ప్రముఖ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పంత్ దూకుడును, సుందర్ సంయమన్నాని వారు ఆకాశానికెత్తారు. ఒత్తిడిలో నమ్మశక్యంకాని రీతితో బౌలర్లపై విరుచుకుపడి అద్భుతమైన శతకం సాధించిన టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అభినందనలు. నీ విధ్వంసం మొదటిది కాదు.. అలాగని ఆఖరిది కూడా కాకూడదు.. భవిష్యత్తులో నీ బ్యాటింగ్ ఊచకోత కొనసాగించాలని ఆశిస్తున్నా.. అన్ని ఫార్మాట్లలో ఆల్ టైమ్ బెస్ట్ నువ్వే.. నువ్వు నిజమైన మ్యాచ్ విన్నర్ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పంత్‌ను ఆకాశానికెత్తాడు. జట్టుకు అవసరమైనప్పుడు అద్భుతమైన శతకాన్ని సాధించావు.. గతంలో గిల్‌క్రిస్ట్ చేసిన విధ్వంసాలను గుర్తు చేశావంటూ టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసించారు. యువ క్రికెటర్లు జట్టు బాధ్యతలను భుజానికెత్తుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది.. పంత్ ఊచకోత, సుందర్ నిలకడ ప్రదర్శనకు అభినందనలు.. సుందర్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు.. యువ క్రికెటర్లు భవిష్యత్తులో మరింత నిలకడగా ఆడాలని ఆశిస్తున్నా... వీవీఎస్ లక్ష్మణ్ ఆండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ చేసి ఫోర్ కొట్టడం, సిక్సర్‌తో శతకాన్ని చేరుకోవడం అత్యద్భుతం..నువ్వే నా నిజమైన వారసుడివి.. సెహ్వాగ్ అసాధారణ ప్రతిభ కలిగిన పంత్.. అసాధారణ శతకాన్ని పూర్తి చేశాడు.. అభినందనలు.. టామ్ మూడీ -
‘ధోనీపై గంగూలీ మాటలు ఇంకా గుర్తున్నాయి..’
న్యూఢిల్లీ : మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించడంలో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చేసిన ఎనలేని కృషిని కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య నెమరు వేసుకున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ గొప్ప స్టార్ అవుతాడాని గంగూలీ ముందే పసిగట్టాడని జాయ్ భట్టాచార్య తెలిపాడు. ధోనీ వీఐపీ అవుతాడని తనతో అన్నాడని గౌరవ్ కపూర్ యూట్యూబ్ షోలో జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ గుర్తు చేసుకున్నాడు. భారత్ ఏ, పాకిస్తాన్ ఏ, బంగ్లాదేశ్ ఏ త్రైపాక్షిక సిరీస్ అనంతరం 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన ధ్వైపాక్షిక సీరీస్‌కు ధోనీ తొలిసారిగా ఆడాడు. 2004లో బంగ్లాదేశ్‌కు వెళ్లే విమానంలో గంగూలీ తనతో చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయని జాయ్ అన్నాడు. ధోనీని చూపిస్తూ..'మనకు ఓ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఉన్నాడు. అతను భవిష్యత్తులో గొప్ప స్టార్ అవుతాడు' అని దాదా చెప్పాడని జాయ్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. గంగూలీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆటగాళ్ల ప్రతిభను పసిగట్టడం. ప్లేయర్ టాలెంట్ అతను గుర్తించాడంటే, ఆ ఆటగాడు విఫలమైనా అతనికి అండగా ఉంటాడు. ఎందుకంటే టాలెంట్ ఉన్న ఆటగాళ్లు రాణిస్తారని అతని గట్టి నమ్మకం' అని భట్టాచార్య చెప్పుకొచ్చాడు.(ఐపీఎల్‌పై కేంద్రానికి లేఖ రాసిన బీసీసీఐ) భారత జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో సారథిగా పగ్గాలు అందుకున్న సౌరవ్ గంగూలీ భారత క్రికెట్లో ఓ నూతన అధ్యయాన్ని లిఖించాడు. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ వంటి ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసి బలమైన జట్టుగా భారత్‌ను నిలిపాడు. ఇక 2004 బంగ్లాదేశ్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ధోనీ, ఆ టూర్లో విఫలమైనా గంగూలీ అవకాశం ఇచ్చాడు. ఆ టూర్ అనంతరం స్వదేశంలో విశాఖలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వడంతో మహీ సత్తా ప్రపంచానికి తెలిసింది. ఆ మ్యాచ్‌లో ధోనీ విధ్వంసకర బ్యాటింగ్‌తో 123 బంతుల్లో 148 పరుగులు చేసి వీరవిహారం చేశాడు. అనంతరం ధోనీ క్రికెట్ ప్రయాణం తెలిసిందే. (ఆస్ట్రేలియాలో జరిగితే ఆ టికెట్లు చెల్లుతాయి: ఐసీసీ) -
చెప్పాల్సింది గంగూలీ కాదు: పీసీబీ
ఇస్లామాబాద్: ఆసియా కప్ 2020 రద్దయ్యింది అంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీడియా డైరెక్టర్ శామ్యూల్ హసన్ బర్నీ స్పందించారు. ఆ మాటలకు ఎలాంటి విలువ లేదంటూ కొట్టి పారేశారు. ఆసియా కప్ రద్దు విషయాన్ని ధృవీకరించాల్సింది ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ( ఏసీసీ) అని తెలిపారు. ‘ఇలాంటి ప్రకటనలు కేవలం ఏసీసీ ప్రెసిడెంట్ మాత్రమే చేయాలి. గంగూలీ వ్యాఖ్యాలు మ్యాచ్ షెడ్యూల్‌కు సంబంధించిన ప్రొసిడింగ్స్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. గంగూల్ ప్రతి వారం ఏదో ఒకటి ప్రకటిస్తూ ఉంటారు, ఆయన మాటలకు విలువ లేదు అని అన్నారు. దీనికి సంబంధించి ఏసీసీ ప్రెసిడెంట్ నజ్నూల్ హసన్ మాత్రమే ప్రకటన చేయాలి. మాకు తెలిసినంత వరకు ఏసీసీ సమావేశం షెడ్యూల్ ఇంకా ప్రకటించబడలేదు’ అని పేర్కొన్నారు. (ఆసియాకప్ 2020 వాయిదా : గంగూలీ) ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్‌తో జరిగిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో గంగూలీ ఆసియా కప్ 2020 రద్దైనట్లు పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల మధ్య ఎప్పుడు మ్యాచ్‌లు జరుగుతాయో చెప్పలేమని గంగూలీ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా ముందుకు వెళతామని, ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమని గంగూలీ పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆసియాకప్‌ను పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కానీ బీసీసీఐ భద్రతా విషయాలకు సంబంధించి అభ్యంతరం తెలపడంతో మ్యాచ్ జరగాల్సిన వేదికను దుబాయ్‌కు మార్చారు. సెప్టెంబరులో ఈ టోర్ని జరగాల్సి ఉండగా గురువారం (జూలై 9న) ఆసియా క్రికెట్ మండలి సమావేశం జరగనుంది. అయితే దీనికి ముందే ఈ టోర్నీ రద్దైనట్లు గంగూలీ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. . (ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవద్దు) -
2023 నుంచి నాలుగు రోజుల టెస్టులు?
మెల్బోర్న్: మరో మూడేళ్ల తర్వాత నాలుగు రోజుల టెస్టులే కనిపించే అవకాశముంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సంప్రదాయ క్రికెట్‌ను తప్పనిసరిగా కుదించాలనే యోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2023 నుంచి ఐదు రోజుల ఆట కాస్తా నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఈ కుదింపు మరిన్ని ఈవెంట్లకు అవకాశమిస్తుందని ఐసీసీ భావిస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ద్వైపాక్షిక సిరీస్‌లు పెరగాలని గతంలో డిమాండ్ చేసింది. అయితే వివిధ దేశాల్లో టి20 లీగ్‌లు జరుగుతుండటం వల్లే టెస్టులను కుదిస్తున్నారని తెలిసింది. ఇది కొత్తగా ఇప్పుడే వచ్చిన మార్పు కాదు... ఇదివరకే ఈ ఏడాది ఇంగ్లండ్, ఐర్లాండ్ల మధ్య నాలుగు రోజుల టెస్టు జరిగింది. 2017లోనూ దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నాలుగు రోజుల మ్యాచ్ ఆడాయి. ఇపుడే స్పందిస్తే తొందరపాటే: గంగూలీ నాలుగు రోజుల టెస్టుకు ఇంకా చాలారోజులు పడుతుందని దీనిపై ఇప్పుడే స్పందిస్తే తొందరపాటే అవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. ‘ముందు ప్రతిపాదన రానివ్వండి. రాకముందే వ్యాఖ్యానించడం తగదు’ అని చెప్పాడు. -
క్రికెట్ అడ్వైజరీ కమిటీకి దాదా గుడ్‌బై చెప్పనున్నారా?
-
విజేత పీఎస్‌పీబీ
కోల్‌కతా: జాతీయ సీనియర్ టీమ్ చెస్ చాంపియన్ షిప్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) జట్లు మహిళల, పురుషుల విభాగాల్లో టైటిల్స్ సొంతం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష, పద్మిని రౌత్, ఇషా కరవాడే, సౌమ్య స్వామినాథన్, మేరీ ఆన్‌గోమ్స్ సభ్యులుగా ఉన్న పీఎస్‌పీబీ జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సూర్యశేఖర గంగూలీ, అరవింద్ చిదంబరం, జీఎన్ గోపాల్, కార్తికేయన్ మురళీ, దీప్ సేన్‌గుప్తాలతో కూడిన పీఎస్‌పీబీ పురుషుల జట్టు 17 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. -
డ్యాన్స్‌తో హోరెత్తించిన దాదా.. వైరల్ వీడియో
ముంబాయి : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. అభిమానులు ప్రేమగా పిలుచుకునే దాదా ఓ పార్టీలో డ్యాన్స్‌తో అదరగొట్టారు. శుక్రవారం ఓ నైట్ క్లబ్లో ‘దేశీ బోయ్స్’ సినిమాలోని ‘తూ మేరా హీరో’ పాటకు స్టెప్పులేశారు. అది కాస్తా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్‌తో నాట్‌వెస్ట్ సిరీస్‌లో భాగంగా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత లాడ్స్‌లో చొక్కా విప్పి గిరాటేసి.. భావోద్వేగంగా గంగూలీ తన ఆనందాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అది ఎప్పటికీ క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. అలా గంభీరంగా, హుందాగా కనిపించే దాదా ఇలా సరదాగా డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాదాలో అద్భుతమైన నాయకుడు, ఆటగాడే కాకుండా మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడని ఈ వీడియో చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. -
పార్టీలో డ్యాన్స్‌తో అదరగొట్టిన గంగూలీ
-
భారత్ ‘గులాబీ’ టెస్టూ గెలవగలదు: గంగూలీ
కోల్‌కతా: బలమైన జట్టున్న భారత్... గులాబీ బంతితో ఆడే డే నైట్ టెస్టునూ గెలవగలదని మాజీ సారథి సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘బంతి రంగులో మార్పు తప్ప ఇందులో తేడా ఏమీ లేదు. నాణ్యమైన ఆటగాళ్లున్న భారత్ గెలవగలదు’ అని గురువారం ఓ వాణిజ్య కార్యక్రమంలో గంగూలీ వ్యాఖ్యానించాడు. అఫ్గానిస్తాన్‌తో చరిత్రాత్మక టెస్టు ఆడకూడదని కెప్టెన్ కోహ్లి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘జట్టేదైనా దేశానికి ఆడటం ముఖ్యమని కోహ్లి భావి స్తాడు. అలాంటివాడు కౌంటీలను ఎంచుకోవడం ఇంగ్లండ్ పర్యటనకు అతడిస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది’ అని అన్నాడు. -
ఓపెనింగ్ చెయ్... లేదంటే కూర్చో
కోల్‌కతా: టెస్టుల్లో తను ఓపెనింగ్ చేయాల్సిందేనని అప్పటి కెప్టెన్ ఖరాఖండిగా చెప్పినట్లు మాజీ డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన వీరూ... 2002లో ఇంగ్లండ్ టూర్లో తనకెదురైన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. ‘లార్డ్స్ టెస్టులో ఓపెన్ చేయాలని గంగూలీ చెప్పాడు. నేనెందుకు అని కోచ్ (జాన్‌రైట్), కెప్టెన్లను ప్రశ్నించా. అప్పుడు వాళ్లిద్దరు... ఇప్పటికే వన్డేల్లో ఓపెనర్‌గా రాణించావు కాబట్టి టెస్టుల్లో నీవు ఓపెనింగ్ చేసేందుకు ఈ అనుభవం చాలని బదులిచ్చారు. అప్పుడు మళ్లీ నేను వారితో సచిన్ దశాబ్దంపైగా ఓపెనర్. మీరు (గంగూలీ) కూడా 1998 నుంచి ఓపెనింగ్ చేస్తున్నారు కదా. మీరే ఓపెన్ చేయండి. నేను మిడిలార్డర్లో దిగుతానని చెప్పా. వెంటనే గంగూలీ... టెస్టులాడాలంటే ఓపెనింగ్ స్థానమే ఖాళీగా ఉంది. ప్రశ్నలు వేయకుండా ఓపెనింగ్ చెయ్ లేదంటే బెంచ్‌పై కూర్చోమని తెగేసి చెప్పాడు’ అని సెహ్వాగ్ నాటి సంగతుల్ని వివరించాడు. చివరకు తప్పకపోవడంతో ఒకవేళ ఓపెనర్‌గా విఫలమైతే జట్టు నుంచి తీసేయకుండా మిడిలార్డర్లో చాన్స్ ఇవ్వాలని గంగూలీతో వాగ్ధానం కోరగా... ‘దాదా’ సరేననడంతో ఓపెనర్‌గా లార్డ్స్‌లో ఆడిన తొలి టెస్టులో 84 పరుగులు చేశాడు సెహ్వాగ్. అయితే లార్డ్స్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఏ ఆటగాడు సెంచరీ చేయలేదని ఆ సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నందుకు సచిన్, గంగూలీ, ద్రవిడ్‌లు తనను తిట్టారని సెహ్వాగ్ చెప్పాడు. నాట్‌వెస్ట్ ఫైనల్లో ఇంగ్లండ్ తమ ముందుంచిన 325 పరుగుల లక్ష్యంపై కంగారు వద్దని, తక్కువ వన్డేలాడిన వాళ్లే అంత స్కోరు చేసినపుడు... ఏడాదికి 30–35 వన్డేలాడే తామెందుకు చేయలేమని గంగూలీతో చెప్పినట్లు సెహ్వాగ్ పేర్కొన్నాడు. కైఫ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో నాట్‌వెస్ట్ ట్రోఫీ భారత్ వశమైన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్లో గేల్‌పై నమ్మకంతోనే రెండో రోజు వేలంలో అతన్ని కనీస ధరకు తీసుకున్నట్లు చెప్పాడు. -
స్మిత్ బుద్ధి తక్కువ పని చేశాడు
ఎలాగైనా గెలవాలనే ఆస్ట్రేలియా ఆలోచనలో అర్థం లేదు. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ అలా చేయకుండా ఉండాల్సింది. బాల్ ట్యాంపరింగ్ తెలివి తక్కువ పని. భారత్‌తో రివ్యూ వివాదం సమయంలో తన బుర్ర పని చేయలేదని అతను అంటే ఏదో మాట వరసకు అనుకున్నాను. కానీ ఇప్పుడు నిజంగా స్మిత్‌కు బుర్ర లేదని నాకర్థమైంది. 1981 నుంచి ఆస్ట్రేలియా ఇదే తరహాలో క్రికెట్ ఆడుతోంది. –సౌరవ్ గంగూలీ, భారత మాజీ కెప్టెన్ -
అయినా భారత్‌దే విజయం: గంగూలీ
కోల్‌కతా: ఈడెన్ టెస్టు తొలిరోజు భారత్ త్వరగా వికెట్లు కోల్పోయినప్పటికీ.. తొలిటెస్టులో విజయం సాధిస్తుందని భారత మాజీ కెప్టెన్, ‘క్యాబ్’ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. ‘రెండ్రోజులుగా వర్షం కురుస్తోంది. దాన్ని నేను ఆపలేను. వర్షం, పిచ్‌పై పచ్చిక కారణంగా మ్యాచ్ ఇలాగే ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు, సరైన వెలుతురు లేనప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు. అయినా ఒక విషయం చెబుతున్నా.. తొలిరోజు వెనకబడ్డప్పటికీ భారత్ ఈ మ్యాచ్‌లో గెలుస్తుంది’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఓ జట్టు పచ్చిక ఉన్న వికెట్‌పై ఆడుతుందా లేదా అని తను నిర్ణయించలేనన్నారు. -
గంగూలీ మా కోసం త్యాగం చేశాడు
న్యూఢిల్లీ: ఎంఎస్ ధోని అద్భుత బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకోవడం వెనక మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్యాగం ఉందని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. గంగూలీ నేతృత్వంలోనే 2004లో ధోని అరంగేట్రం చేశాడు. తను బ్యాటింగ్ చేసే స్థానాన్ని ధోనికి ఇవ్వకపోతే ప్రస్తుతం అతను గొప్ప బ్యాట్స్‌మన్‌గా పేరుతెచ్చుకోకపోయేవాడని వీరూ అభిప్రాయపడ్డాడు. అలాగే తాను ఓపెనర్‌గా రావడానికి కూడా తనే కారణమని చెప్పుకొచ్చాడు. ‘ఆ సమయంలో మేం బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాలనే ఆలోచనలో ఉన్నాం. దీంట్లో భాగంగా మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం దొరికితే గంగూలీ వన్‌డౌన్‌లో వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఒకవేళ అదీ జరగకపోతే పించ్ హిట్టర్ రూపంలో ఇర్ఫాన్ లేదా ధోనిని పంపాలని భావించాం. అదే విధంగా ధోనికి తన మూడో నంబర్ స్థానాన్ని ఇవ్వాలని దాదా నిర్ణయించారు. ఇలా ముందుగా తన ఓపెనింగ్ స్థానాన్ని నాకు, ఆ తర్వాత వన్‌డౌన్‌ను ధోనికి ఇచ్చిన కెప్టెన్లు చాలా అరుదని చెప్పవచ్చు. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు తను ఎప్పుడూ ముందుంటారు. ధోనికి తను ఆరోజు అలాంటి అవకాశం ఇచ్చాడు కాబట్టే ఈరోజు అగ్రస్థానానికి చేరాడు’ అని వీరూ వివరించారు. -
ఆస్ట్రేలియాపై క్లీన్‌స్వీప్ కష్టమే: గంగూలీ
శ్రీలంకను చిత్తు చేసినట్లుగా ఆస్ట్రేలియాను 5–0తో క్లీన్‌స్వీప్ చేయలేదు కానీ... భారత జట్టే వన్డే సిరీస్ నెగ్గుతుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. స్వదేశంలో భారత్ కఠిన ప్రత్యర్థి అయితే ఆసీస్ పటిష్టమైన జట్టని చెప్పారు. సెలక్టర్లు అమలు చేస్తున్న రొటేషన్ పద్ధతి మంచిదేనని... ప్రతీ యువ ఆటగాడిని పరీక్షించడం... భారత ప్రపంచకప్ దళానికి మేలు చేస్తుందన్నారు. యువరాజ్ సింగ్ కథ ముగిసిపోలేదని, పునరాగమనానికి అవకాశముందని తెలిపారు. -
ప్రజ్ఞాన్ ఓజాకు గంగూలీ ఝలక్
కోల్‌కతా: తిరిగి హైదరాబాద్‌కు ఆడాలన్న ప్రజ్ఞాన్ ఓజా ఆశలపై బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నీళ్లు చల్లారు. బెంగాల్ నుంచి లెఫ్టార్మ్ స్పిన్నర్ ను విడుదల చేయబోమని స్పష్టం చేశారు. రెండేళ్లుగా బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ స్పిన్నర్ ఈ సీజన్ కోసం తిరిగి సొంత జట్టు హైదరాబాద్‌కు వెళ్లాలని ఆశించాడు. ఈ మేరకు నిరభ్యంతర పత్రం కోసం దరఖాస్తు కూడా చేశాడు. తాజాగా దీన్ని భారత మాజీ కెప్టెన్ తిరస్కరించారు. ‘అతను విడుదల చేయాలని కోరాడు. కానీ మేం చేయం. హైదరాబాద్ ప్లేట్ డివిజన్లో ఉన్నప్పుడు మా జట్టుతో చేరాడు. ఇప్పుడు హైదరాబాద్ ఎలైట్‌కు చేరిందని వెళితే ఎలా? అతని సేవలు మాకు అవసరం’ అని అన్నారు. సీజన్‌కు ముందు జరిగే శిబిరంలో ఓజా పాల్గొంటాడని దాదా చెప్పారు. దీనిపై హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌నారాయణ్ స్పంది స్తూ ‘బెంగాల్ నిరభ్యంతర పత్రం ఇవ్వనపుడు మేం చేయగలిగిందేమీ లేదు. గంగూలీ అంటే మాకెంతో గౌరవం. మాజీ సారథి ఆట కోసం, ఆటగాళ్ల కోసం బాగా ఆలోచిస్తారు’ అని అన్నారు. 2015–16 సీజన్లో బెంగాల్‌కు ఆడిన ఓజా 36 వికెట్లు, గత సీజన్లో10 వికెట్లు తీశాడు. -
జహీర్ బాధ్యతలు ఐదు నెలలే: గంగూలీ
కోల్‌కతా: టీమిండియా బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఎంపికైన జహీర్ ఖాన్ ఏడాదిలో 150 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటారని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. దీంతో జహీర్ జట్టుకు పూర్తి స్థాయి బౌలింగ్ కోచ్ కాదనే విషయంలో స్పష్టత వచ్చినట్టయ్యింది. అటు బీసీసీఐ కూడా ఇప్పటికే జహీర్ నియామకం ఆయా పర్యటనల వారీగా సేవలందించే వరకేనని పేర్కొంది. మరోవైపు తాను కేవలం వంద రోజుల వరకే సేవలందించగలనని జహీర్ స్పష్టం చేసినా... సీఏసీ ఒత్తిడి మేరకు తనతో 150 రోజుల ఒప్పందం కుదిరింది. ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమించిన అనంతరం సహాయక కోచ్‌లుగా జహీర్, రాహుల్ ద్రవిడ్‌ల ఎంపిక అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. జహీర్ స్థానంలో పూర్తి స్థాయి కోచ్‌గా భరత్ అరుణ్‌ను తీసుకోవాలని రవిశాస్త్రి గట్టిగా పట్టుబడుతున్నారు. -
సలహాలకే పరిమితమా!
♦ బాధ్యత తీసుకోని సీఏసీ ♦ బాధ్యత తీసుకోని సీఏసీకోచ్, కెప్టెన్ల వివాదంలో ముగ్గురు దిగ్గజాల నిస్సహాయత సచిన్, గంగూలీ, లక్ష్మణ్... భారత క్రికెట్‌కు ఆటగాళ్లుగా ఎనలేని సేవలందించారు. వారి అనుభవాన్ని, ఆలోచనలను మరో రీతిలో వాడుకోవాలనే ఆలోచనతో బీసీసీఐ ప్రత్యేకంగా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని ఏర్పాటు చేసింది. దాంతో పాటు కోచ్‌ను ఎంపిక చేసే పనిని కూడా వారి చేతుల్లోనే పెట్టింది. అయితే ఈ కమిటీ ఇచ్చిన సలహాలు ఏమిటి, అవి ఎంత వరకు భారత క్రికెట్‌కు మేలు చేశాయో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కానీ భారత కోచ్ ఎంపిక విషయంలో, కోచ్, కెప్టెన్ వివాదాన్ని పరిష్కరించే విషయంలో కూడా కమిటీ చురుగ్గా వ్యవహరించలేకపోయింది. ఈ దిగ్గజాలు మరింత బాధ్యతను తీసుకొని ఉంటే గొడవ ముదరకుండా ముగిసిపోయేదేమో! సాక్షి క్రీడా విభాగం గత ఏడాది భారత కోచ్‌గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేసే విషయంలో క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) తమ పరిధికంటే మించి ఉత్సాహంగా పని చేసింది. ఎలాగైనా తమ మాజీ సహచరుడు కుంబ్లేను ఆ పదవిలో కూర్చోబెట్టేందుకు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ తమ అధికారాన్ని గట్టిగా ఉపయోగించారు. ‘కనీసం జాతీయ జట్టుకు లేదా ఫస్ట్ క్లాస్ జట్టుకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉండాలి’ అనేది కోచ్ పదవికి పోటీ పడేందుకు ఉంచిన నిబంధనల్లో ప్రధానమైంది. కానీ ఈ ముగ్గురు దానిని తోసిరాజన్నారు. నిబంధనల ప్రకారం కుంబ్లేకు అర్హత లేకపోయినా అతడికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో రవిశాస్త్రితో గొడవ పెట్టుకునేందుకు కూడా గంగూలీ సిద్ధమయ్యాడు. ఆ సమయంలో కమిటీ వ్యవహరించిన తీరు ఇది. అంటే నిబంధనలను ఉల్లంఘించవచ్చని తామే చేసి చూపించారు. పరిష్కరించే ప్రయత్నమేది? కోహ్లి, కుంబ్లే మధ్య చాలా రోజులుగా విభేదాలు సాగుతున్నాయనే విషయం చాంపియన్స్ ట్రోఫీకి ముందే మీడియాలో వచ్చింది. కానీ ఇలాంటి విషయాలు ఆ ముగ్గురికి అప్పటి వరకు తెలియదనుకోవాలా! తెలిసినా ఎందుకు మౌనం వహించారు. తాము ఏరికోరి ఎంపిక చేసిన కోచ్‌కు, కెప్టెన్‌కు పడటం లేదంటే కలగజేసుకొని సరిదిద్దే ప్రయత్నం కూడా వారు చేయలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు, చాంపియన్స్ ట్రోఫీకి మధ్య దాదాపు రెండు నెలల విరామం ఉంది. ఆ సమయంలో దీనికి ఏదైనా పరిష్కారం వెతికే ప్రయత్నం కూడా జరగలేదు. అది మా పని కాదని వారు చెప్పడానికి వీలులేదు. భారత క్రికెట్లో దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న వీరినుంచి బీసీసీఐ కేవలం సలహాలకంటే ఎక్కువే ఆశించడం సహజం. తాము కోచ్‌ను ఎంపిక చేయడంతోనే పని ముగిసిపోయిందని ఈ ముగ్గురు భావించారా? నిజానికి సచిన్ స్థాయి వ్యక్తి పూనుకుంటే ఆరంభంలో కచ్చితంగా ఎంతో కొంత మెరుగైన ఫలితం వచ్చేది. అతని మాటను కుంబ్లే గౌరవించకపోయేవాడా? లేక గురుభావంతోనైనా కోహ్లి కాదనేవాడా? ఇప్పుడేం చేస్తారు? పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఈ ముగ్గురు కుంబ్లేనే కోచ్‌గా కొనసాగించమంటూ సిఫారసు చేశారు. కోహ్లి అసలు దానిని లెక్క చేయకపోవడం ఈ కమిటీ వైఫల్యం కిందనే లెక్క. కుంబ్లే హుందాగా తప్పుకున్నాడు కాబట్టి వివాదం సద్దుమణిగింది. కమిటీ చెప్పింది కాబట్టి తాను కొనసాగుతానంటే పరిస్థితి ఎలా ఉండేదో! మరో సారి కొత్త కోచ్ ఎంపిక కూడా ఈ త్రిసభ్య కమిటీ చేతికే వచ్చింది. మేం కోచ్ ఎంపికలో జోక్యం చేసుకోమని పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఇప్పటికే స్పష్టం చేసింది కాబట్టి పూర్తి బాధ్యత మళ్లీ కమిటీదే. తాము ఎంపిక చేసిన వ్యక్తి ఏడాది కాలానికే తప్పుకున్న నేపథ్యంలో ఈసారి కమిటీపై బాధ్యత మరింత పెరిగింది. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. సొంత ఇష్టా ఇష్టాలను పట్టించుకోకుండా ఈసారి తమ క్రికెట్ పరిజ్ఞానం, అనుభవం, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కోచ్‌ను ఎంపిక చేయడం అవసరం. అదే విధంగా తాజా పరిణామాల కారణంగా కోహ్లితో కూడా ముందుగా మాట్లాడతారా అనేది ఆసక్తికరం. నిజంగానే అదే జరిగి కోహ్లి చెప్పిన పేరుకే ఆమోద ముద్ర వేస్తే మాత్రం ఏ మాత్రం బాధ్యతలు పట్టని, కోరలు లేని ఈ కమిటీ ఉండటం కూడా అనవసరం! ఆరు నెలలుగా మాటల్లేవ్! బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం... ఏడాది పదవీ కాలంలో గత ఆరు నెలల నుంచి కెప్టెన్, కోచ్ అసలు మాట్లాడుకోవడం లేదట. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన నాటినుంచి వీరిద్దరు ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నట్లు సమాచారం. మరి కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ కూడా అలాగే సాగిపోయిందంటే బోర్డు పెద్దలు ఏం చేస్తున్నారనేది ప్రశ్న. ‘వీరిద్దరు ఆరు నెలల్లో ఒకే ఒక్కసారి ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత ఎదురెదురుగా కూర్చున్నారు. అప్పుడు కూడా వారిద్దరు ఏం మాట్లాడుకోలేదు. ఇక మైత్రి కొనసాగదని వారిద్దరికి అర్థమైపోయింది’ అని బోర్డు అధికారి వ్యాఖ్యానించారు. ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లపై కుంబ్లే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. దాంతో చిర్రెత్తిన క్రికెటర్లు కుంబ్లేపై మరింత వ్యతిరేకతను పెంచుకున్నారు. ఇదే విషయాన్ని వారు కోహ్లికి కూడా ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. అంతకు ముందు కూడా కోచ్ గురించి ఆటగాళ్ల లెక్కలేనితనం బయటపడింది. చాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్ తర్వాత ఆటగాళ్ల తప్పొప్పులను గుర్తించేందుకు కుంబ్లే వీడియో అనలిస్ట్‌తో సుదీర్ఘంగా కూర్చున్నారు. ఒక్కొక్కరి వీడియో క్లిప్‌లను తీసుకొని లోపాలు ఎలా సరిదిద్దుకోవాలో కూడా వివరిస్తూ కుంబ్లే నోట్స్ రాశారు. అదే రోజు రాత్రి వీడియో, నోట్స్‌ను ఒక్కో ఆటగాడికి పంపించారు. కానీ రెండు రోజుల తర్వాత చూస్తే జట్టులో ఏ ఒక్కరు కుంబ్లే వీడియోను చూడలేదు. అతనిచ్చిన నోట్స్‌ను కూడా కనీసం చదవలేదు! కుంబ్లే తాను తప్పుకోవడం అవసరమనే నిర్ణయం తీసుకునేందుకు ఇది సరిపోయింది. -
ధోని 'సిక్సర్ల' రికార్డు!
లండన్:టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సాధించాడు. విదేశాల్లో అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా ధోని అరుదైన ఫీట్ ను నెలకొల్పాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా భారత్ తరపున అత్యధిక విదేశీ సిక్సర్ల రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో ధోని 52 బంతుల్లో7 ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. ఇక్కడ ధోని రెండు సిక్సర్లు సాధించడంతో భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించాడు. ఇప్పటివరకూ విదేశాల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడి రికార్డు గంగూలీ పేరిట ఉండేది. 296 విదేశీ అంతర్జాతీయ మ్యాచ్ ల్లో గంగూలీ 159 సిక్సర్లు కొట్టగా, ఆ రికార్డును 281 మ్యాచ్ ల్లో ధోని సవరించాడు. ప్రస్తుతం ధోని 161 విదేశీ సిక్సర్లతో తొలిస్థానంలో ఉన్నాడు. శ్రీలంకత మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. భారత జట్టు నిర్దేశించిన 322 పరుగుల భారీ లక్ష్యాన్ని సంచలనాలకు మారుపేరైన శ్రీలంక సునాయాసంగా ఛేదించింది. దాంతో గ్రూప్-బిలో సెమీస్ రేసు రసకందాయంలో పడింది. ప్రస్తుతం భారత్, శ్రీలంక, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలో లు తలో మ్యాచ్ లో గెలవడంతో సెమీస్ కు ఎవరు చేరతారు అనే దానిపై సందిగ్ధత నెలకొంది. -
స్మిత్ అద్భుత బ్యాట్స్‌మన్ : గంగూలీ
కొల్కతా: రైజింగ్ పుణే సూపర్‌గెయింట్, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన జీవితాంతం ఫామ్ కలిగి ఉంటాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పుణే 7 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్మిత్ 84 (54 బంతులు)ను గంగూలీ పొగడ్తలతో ముంచెత్తాడు. స్మిత్ అధ్భుతంగా ఆడాడని, కెప్టెన్‌గా పుణేకు విజయం అందించాడని అభిప్రాయపడ్డాడు. స్మిత్ నాణ్యమైన ఆటగాడని, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన బ్యాట్స్‌మన్ అని గంగూలీ పేర్కొన్నాడు. 27 ఏళ్ల స్మిత్ తన టెస్టు కెరీర్‌ను లెగ్‌స్పిన్నర్‌గా ఆరంభించాడు. బ్యాటింగ్ ఎనిమిదో స్ధానంలో చేసేవాడు. బోర్డర్- గవాస్కర్ సిరీస్‌లో 3 సెంచరీలతో 499 పరుగుల చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
వివాదాన్ని ముగించడం సంతోషంగా ఉంది: క్లార్క్
బెంగళూరు టెస్టులో చోటు చేసుకున్న డీఆర్ఎస్ వివాదాన్ని ఇరు దేశాల బోర్డులు త్వరగా ముగించి మంచి పని చేశాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంతోషం వ్యక్తం చేశాడు. 2007–08 ఆస్ట్రేలియా పర్యటనలో ‘మంకీగేట్’ వివాదాన్ని ఆండ్రూ సైమండ్స్ అంతగా సాగదీయాల్సింది కాదని అతను అభిప్రాయపడ్డాడు. క్లార్క్ ఆటోబయోగ్రఫీ ‘మై స్టోరీ’ని భారత మాజీ కెప్టెన్ గంగూలీ కోల్‌కతాలో మంగళవారం విడుదల చేశాడు. -
ఆసీస్‌ను 4–0తో ఓడించినా ఆశ్చర్యం లేదు: గంగూలీ
ముంబై: ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ను కోహ్లి సేన 4–0తో గెలిచినా ఆశ్చర్యం లేదని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ఈనెల 23 నుంచి భారత్‌లో ఆస్ట్రేలియా పోరు మొదలవుతంది. సినీ నటి నేహా ధూపియాతో కలిసి శనివారం ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘నా అభిప్రాయం ప్రకారం ఆసీస్‌కు ఈసారి కష్టాలు తప్పవు. కోహ్లి సేన ప్రస్తుత ఫామ్ దృష్ట్యా క్లీన్‌స్వీప్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని అన్నారు. సొంతగడ్డపై భారత్‌కు తిరుగులేదన్నారు. 25 ఏళ్ల నుంచి ఈ ఆధిపత్యం కొనసాగుతోందని వివరించారు. -
'బౌలింగ్‌తోనే సమాధానం చెప్పాడు'
నాగ్‌పూర్:ఇంగ్లండ్‌తో మూడు ట్వంటీ 20ల సిరీస్‌కు వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రాను ఎంపిక చేయడం సబబేనా అనే ప్రశ్నకు అతను బౌలింగ్‌తోనే సమాధానం చెప్పాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ప్రత్యేకంగా నెహ్రా వేసిన తొలి స్పెల్ అద్భుతమని కొనియాడాడు. 'నెహ్రా ఎప్పుడూ అసాధారణ బౌలరే. అతను మెరుగైన ఫీల్డర్ కానప్పటికీ, బంతితో నెహ్రా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో అతని బౌలింగ్ సూపర్. నెహ్రా తాజా బౌలింగ్ తో విమర్శకుల నోళ్లను మూయించాడు. కాన్పూర్ లో తొలి ట్వంటీ తరువాత అతని ప్రదర్శనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఈ రోజు బంతితోనే నెహ్రా సమాధానం చెప్పాడు'అని గంగూలీ కొనియాడాడు. ఈ మ్యాచ్ లో నెహ్రా నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్‌లో విజయానికి సంబంధించిన క్రెడిట్ మాత్రం జస్స్రిత్ బూమ్రాకే దక్కుతుందని గంగూలీ అన్నాడు. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి ఎనిమిది పరుగులు కావాల్సిన తరుణంలో బూమ్రా చెలరేగిపోవడంతోనే భారత్ కు విజయం దక్కిందన్నాడు. బూమ్రా తన చివరి రెండు ఓవర్లలో ఐదు పరుగులు మాత్రమే ఇవ్వడం కారణంగానే భారత్ కు గెలుపు సాధ్యమైందన్నాడు. ఇంతటి ఒత్తిడితో కూడిన మ్యాచ్ లో భారత్ చివరి వరకూ పోరాడి విజయం సాధించడం నిజంగానే చిరస్మరణీయమన్నాడు. -
ఆలస్యానికి అడ్రస్ లక్ష్మణ్
కోల్‌కతా: సచిన్‌కు తెలిసింది రెండే రెండు... మైదానంలో పరుగుల వరద పారించడం, ఆ తర్వాత షాపింగ్‌లో మునగడం! అతని సహచరుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పిన ముచ్చట ఇది. సొంతగడ్డపై భారత్ 250వ టెస్టు ఆడుతున్న సందర్భంగా కొందరు క్రికెటర్లతో సరదాగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తమ డ్రెస్సింగ్ రూం విశేషాలను ఆటగాళ్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ ‘మ్యాచ్‌లో సెంచరీ చేశాడంటే మరుసటి రోజు సచిన్‌కు షాపింగ్ తప్ప మరో వ్యాపకం ఉండేదికాదు. అర్మానీ, వెర్సెస్లాంటి బ్రాండింగ్ డ్రెస్‌లు అతని వార్డ్‌రోబ్‌లో చాలా కనిపిస్తాయి. తన దుస్తుల విషయంలో సచిన్ ప్రత్యేక శ్రద్ధ పెడతాడు’ అని చెప్పారు. హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అయితే ఆలస్యానికి కేరాఫ్ అడ్రస్ అని గంగూలీ గుర్తు చేసుకున్నారు. ‘నాలుగో, ఐదో స్థానం ఆటగాళ్లు క్రీజ్‌లో ఉన్న సమయంలో కూడా అతను ఇంకా బాత్రూంలో స్నానం చేస్తూ కనిపించేవాడు. టీమ్ బస్సులోకి అందరికంటే ఆలస్యంగా వచ్చేది కూడా అతనే’ అని గంగూలీ అన్నారు. తాను ఆడిన రోజుల్లో శుచీ శుభ్రతా గురించి అసలు ఏ మాత్రం పట్టించుకోని ఆటగాళ్లంటే సిద్ధూ, అజయ్ జడేజాలే అని మరో మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ చెప్పారు. ‘ఉత్తరాదివారే దూకుడుగా ఉంటారని మేం అనుకునేవాళ్లం. దక్షిణాదివాళ్లు సున్నితంగా, ప్రశాంతంగా ఉంటారని భావించాం. కానీ కుంబ్లే తన ఆటతో వారిలోని దూకుడును చూపించాడు’ అని కపిల్‌దేవ్ వ్యాఖ్యానించడం విశేషం. -
తప్పు చేశాడా..!
‘పెదవి దాటిన మాట పృథ్వి దాటుతుంది’... మాటలతో కోటలు కట్టే రవిశాస్త్రికి ఈ విషయం తెలియనిది కాదు. ఆటగాడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత గత రెండు దశాబ్దాలుగా తనదైన శైలిలో కామెంటేటర్‌గా కూడా ఈ మాజీ కెప్టెన్ తన అభిప్రాయాలను వెల్లడించడంలో విజయవంతమయ్యాడు. వ్యాఖ్యకు ఉన్న విలువ తెలిసినవాడు కాబట్టే ఎక్కడా మాట తూలకుండా ఇంత కాలం నెగ్గుకొచ్చాడు. కానీ కోచ్ పదవి కోల్పోయిన అసహనం మాటల రూపంలో బయటకు రావడం అతడిని ఇబ్బందుల్లో పడేసింది. పేరుకు గంగూలీపై ఆగ్రహం కనిపిస్తున్నా... పరోక్షంగా బీసీసీఐ నిర్ణయాన్ని అతను ప్రశ్నించినట్లే. * రవిశాస్త్రిపై బీసీసీఐ అసంతృప్తి * కామెంటరీకీ దూరమయ్యే ప్రమాదం! సాక్షి క్రీడా విభాగం: మరో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌తో పాటు కొన్నాళ్ల క్రితం వరకు కూడా రవిశాస్త్రి బీసీసీఐ ‘పెయిడ్ కామెంటేటర్’గానే ఉన్నాడు. బోర్డులో ఎన్ని లోపాలున్నా, ఆటలో తప్పులు కనిపిస్తున్నా ఆహా, ఓహో అంటూ టీవీ ప్రసారాల్లో భజన చేయడమే వీరి పని. అందు కోసం భారీ మొత్తాన్ని వీరు అందుకున్నారు. గత 20 ఏళ్లలో బీసీసీఐలో శాస్త్రి వేర్వేరు కమిటీల్లో సభ్యుడిగా కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు గంగూలీపై చేసిన వ్యాఖ్యలు బోర్డు సీనియర్ అధికారులకు కూడా ఆగ్రహం తెప్పించాయి. కోచ్ ఎంపిక ప్రక్రియ ముగిసిపోయిన తర్వాత ఈ రకమైన వివాదం రేగడం వారికి నచ్చలేదు. గట్టిగా చెప్పకపోయినా సంయమనం పాటించమంటూ రాజీవ్ శుక్లా సూచన చేయడం వారి అసంతృప్తిని సూచిస్తోంది. బీసీసీఐలో గంగూలీ ఇప్పుడు చాలా బలమైన వ్యక్తిగా ఎదుగుతున్నాడని కూడా అర్థమైంది. ఏదో ఒక దశలో ఈ వివాదం శాస్త్రిని వెంటాడవచ్చు. ఎందుకీ తొందరపాటు! టీమ్ డెరైక్టర్‌గా తాను మంచి ఫలితాలు రాబట్టానని, కాబట్టి తనకు కొనసాగే అవకాశం ఉందని రవిశాస్త్రి గట్టిగా నమ్మాడు. అయితే అనూహ్యంగా కుంబ్లే సీన్లోకి రావడం, కోచ్ పదవి చేజారడం ఆయనను అసహనానికి గురి చేశాయనేది వాస్తవం. అయితే ఎంపిక కాకపోవడంతో కాస్త నిరాశ చెందానని, కుంబ్లేకు శుభాకాంక్షలు కూడా చెప్పానని మొదటి రోజు మామూలుగా స్పందించిన శాస్త్రి, తర్వాతి రోజునుంచి తన అసంతృప్తిని దాచుకోలేకపోయారు. గంగూలీ సమావేశంలో లేడంటూ బయటపెట్టిన ఆయన అక్కడితో ఆగిపోయినా సరిపోయేది. దీనికి గంగూలీ తనదైన వివరణ ఏదో ఇచ్చుకునేవాడు. కానీ ఆ తర్వాత సౌరవ్‌కు బాధ్యతలు గుర్తు చేయబోయి అనవసరంగా తనకు తాను చెడ్డ పేరు తెచ్చుకున్నారు. కమిటీ కుంబ్లేకు అనుకూలంగా పని చేసిందని స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు వీడియో ద్వారా ఇంటర్వ్యూ ఇవ్వకూడదని కూడా ఎక్కడా నిబంధన విధించలేదు. ఇవన్నీ వాస్తవాలే అయినా ఒకసారి ఎంపిక పూర్తయిన తర్వాత శాస్త్రి ఆగిపోవాల్సింది. బోర్డు రాజకీయాల గురించి తెలిసి, అపార అనుభవం ఉండీ నిర్మొహమాటంగా మాట్లాడటం అతనే తప్పు చేసినట్లుగా బయట ప్రచారమైంది. నమ్మకం పోయింది... నిజానికి 2014లో శాస్త్రి జట్టు బాధ్యతలు తీసుకోవడం కూడా ఆశ్చర్యకర నిర్ణయం. జట్టుకు కోచ్ ఫ్లెచర్ ఉండగా డెరైక్టర్ పేరుతో మరో పాత్రను ప్రవేశపెట్టడం, అంతా నాకే రిపోర్ట్ చేయాలి అంటూ శాస్త్రి చెలరేగిపోవడం వరుసగా జరిగాయి. అయితే ఆ సమయంలో బీసీసీఐ అతడిని గట్టిగా (గుడ్డిగా) నమ్మింది. అద్భుతాలు జరగకపోయినా జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించడం, ఆటగాళ్లు కూడా బాగు బాగు అనడంతో శాస్త్రి 18 నెలల సమయం ఇట్టే ‘సక్సెస్ఫుల్’గా గడిచిపోయింది. ఇప్పుడు కూడా అతను అసమర్థుడు అని ఎవరూ చెప్పలేదు. అధ్యక్షుడు ఠాకూర్ కూడా ప్రశంసించారు. కుంబ్లేకు ఒక అవకాశం ఇద్దామని బోర్డు భావించి ఉండవచ్చు. ఏడాది తర్వాత కుంబ్లే మంచి ఫలితాలు రాబట్టకపోయినా, మరో కారణంతో పదవి వదిలేసినా మళ్లీ వచ్చేందుకు శాస్త్రికి ఏదో ఒక రూపంలో అవకాశం ఉండేది. అతను ఆశిస్తే బోర్డులో లెక్క లేనన్ని పదవులు సిద్ధం. కానీ ఇప్పుడు బోర్డు ఎంపికను ప్రశ్నించడంతో ఆ దారులు మూసుకుపోయినట్లే. అన్నింటికీ మించి తన బలమైన కామెంటరీకి కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రసారకర్తలు ఎవరైనా కామెంటేటర్లను బీసీసీఐనే ఎంపిక చేయడం ఆనవాయితీ. జట్టుకు అనుకూలంగా మాట్లాడలేదనే సాకుతో హర్షాభోగ్లేను ఒక్క వేటుతో తప్పించిన బోర్డుకు శాస్త్రిని తప్పించడం కూడా సమస్య కాదు. తన పాత పరిచయాలతో ఏమైనా రాజీ ప్రతిపాదన చేస్తే తప్ప రవిశాస్త్రికి తాజా పరిణామాలు పూర్తి వ్యతిరేకంగా పరిణమించడం ఖాయం! -
నాకు నీతులు చెబుతావా!
రవిశాస్త్రిపై గంగూలీ ఎదురు దాడి ఇంటర్వ్యూకు హాజరు కాకుండా విహారయాత్రలా అంటూ చురక కోల్‌కతా: అనిల్ కుంబ్లేను భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయడంపై రాజుకున్న అసంతృప్తి అగ్గి చల్లారలేదు. కోచ్ అభ్యర్థిని అగౌరవపరిచాడని, తన బాధ్యత మరిచాడని రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై సౌరవ్ గంగూలీ ఘాటుగా స్పందించాడు. ‘శాస్త్రి వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. నా కారణంగా కోచ్ కాలేకపోయానని ఆయన భావిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఆయన పిచ్చివాళ్ల ప్రపంచంలో బతుకుతున్నట్లే లెక్క’ అని అతను వ్యాఖ్యానించాడు. ‘మరోసారి ఇలాంటి సమావేశం ఉంటే గైర్హాజరు కావొద్దంటూ సలహా ఇస్తానన్న’ శాస్త్రి మరో వ్యాఖ్య కూడా దాదాకు చిర్రెత్తించింది. నీతులు చెప్పే ముందు ఆయనేం చేశాడో గుర్తు చేసుకోవాలని గంగూలీ సలహా ఇచ్చాడు. ‘భారత క్రికెట్ జట్టు కోచ్‌లాంటి ప్రతిష్టాత్మక పదవి కోసం ఎంపిక జరుగుతుంటే నేరుగా హాజరై ఇంటర్వ్యూ ఇవ్వాలి. కుంబ్లేలాంటి ఒక దిగ్గజ క్రికెటర్ రెండు గంటల పాటు ఓపిగ్గా కూర్చొని తన గురించి చెప్పుకుంటే ఈయన బ్యాంకాక్‌లో సరదాగా షికారు చేస్తూ కెమెరాలో ప్రజెంటేషన్ ఇస్తే ఎలా’ అని సౌరవ్ విరుచుకుపడ్డాడు. ‘క్యాబ్’ సమావేశాన్ని 14 రోజుల ముందే నిర్ణయించగా, కోచ్ ఎంపికకు రెండు రోజుల ముందే సమయం అడిగారని గంగూలీ వివరణ ఇచ్చాడు. వాస్తవానికి రవిశాస్త్రి కోసం కేటాయించిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, అయితే ఇంటర్వ్యూలు సుదీర్ఘంగా సాగడం వల్ల ఆలస్యమైందని... మధ్యలో వెళ్లేందుకు తాను బీసీసీఐ అనుమతి తీసుకున్నట్లు వెల్లడించాడు. -
కోచ్ అభ్యర్థులకు నేడు ఇంటర్వ్యూ
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ పదవి కోసం నేడు (మంగళవారం) అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ 21 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ తీసుకోనుంది. ఈనెల 25న కోచ్‌ను ప్రకటిస్తారు. అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి, సందీప్ పాటిల్, ఆమ్రే, వెంకటేశ్ ప్రసాద్, టామ్ మూడీ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం లండన్‌లో ఉన్న సచిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. కమిటీ సూచించే పేరును బోర్డు వర్కింగ్ కమిటీకి ప్రతిపాదిస్తారు. -
కోచ్ ఎంపికకు మరో 2 నెలలు!
జూన్ 10 వరకు దరఖాస్తులు ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియను బీసీసీఐ వేగవంతం చేసింది. అర్హత, ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ అందుకు జూన్ 10 వరకు గడువు విధించింది. బోర్డు అధ్యక్షుడు ఠాకూర్, క్రికెట్ సలహా కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించారు. దరఖాస్తులు వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలల సమయం పట్టవచ్చు. ఫలితంగా వచ్చే నెల 11నుంచి జరగనున్న జింబాబ్వే పర్యటనకు జట్టు కోచ్ లేకుండా వెళ్లనుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ వరకు కోచ్‌ను ఎంపిక చేస్తారు. ప్రధాన కోచ్‌తోపాటు ముగ్గురు అసిస్టెంట్ కోచ్‌లను కూడా బోర్డు కొత్తగా ఎంపిక చేయనుంది. మరోవైపు లోధా కమిటీ సిఫారసుల వల్ల బీసీసీఐ పరిపాలనలో ఇబ్బంది ఎదురు కాదని, ప్రతీ చోట మంచి, చెడు రెండూ ఉంటాయని గంగూలీ అభిప్రాయపడ్డారు. వంటవాడు కూడా...: భారత క్రికెట్ జట్టుతో తొలిసారి విదేశీ పర్యటనకు ఒక వంట చేసే వ్యక్తిని కూడా పంపించనున్నారు. విండీస్‌తో సిరీస్ నుంచి జట్టుతో పాటు వంటవాడు ఉంటాడు. -
గంగూలీ వర్సెస్ సెహ్వాగ్!
దుబాయ్: మరోసారి మాజీ క్రికెటర్లు తమ ఆటతో అలరించేందకు సిద్ధమవుతున్నారు.ఇటీవల అమెరికాలో జరిగిన క్రికెట్ ఆల్ స్టార్స్ సిరీస్ ను వీక్షించిన ప్రేక్షకులు అదేస్థాయిలో కనువిందు చేసేందుకు మాస్టర్స్ చాంపియన్స్ లీగ్(ఎంసీఎల్) వేదిక కాబోతుంది. వచ్చే నెలలో యూఏఈలో జరగనున్న ఎంసీఎల్ కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకూ యూఏఈలోని పలుచోట్ల జరిగే మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. లిబ్రా లెజెండ్స్, జెమినీ అరేబియన్స్, కాప్రికోర్న్ కమాండర్స్, లియో లైన్స్, విర్గో సూపర్ కింగ్స్ , సాగిటారియస్ స్ట్రైకర్స్ లు పోటీకి సన్నద్ధమవుతున్నాయి. తొలి గేమ్ లో వీరేంద్ర సెహ్వాగ్ సభ్యుడిగా ఉన్న జెమినీ అరేబియన్స్ జట్టు.. సౌరవ్ గంగూలీకి నేతృత్వం వహించే లిబ్రా లెజెండ్స్ జట్టు తలపడనుంది. ఈ లీగ్ కు సంబంధించి ఎంసీఎల్ -ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుల మధ్య 10 సంవత్సరాల ఒప్పందం కుదిరింది. తొలి ఎడిషన్ లో ఓవరాల్ గా సెమీ ఫైనల్ , ఫైనల్ మ్యాచ్ లతో కలుపుకుని మొత్తం 18 మ్యాచ్ లు జరగనున్నాయి. -
ఆ కమిటీ ఎక్కడ?
సరిగ్గా ఆరు నెలల క్రితం... భారత క్రికెట్లో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. ఆట అభివృద్ధి, జట్టు విజయాల కోసం సలహా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌ల రూపంలో ముగ్గురు దిగ్గజాలతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ కేవలం ఒక్కసారి మాత్రమే సమావేశమైంది. ఆ తర్వాత ఈ కమిటీ గురించి ఎక్కడా వార్త లేదు. తాజాగా బీసీసీఐ ప్రకటించిన కొత్త కమిటీల్లో అసలు ఈ కమిటీ పేరు కూడా లేకపోవడం గమనార్హం. * కనిపించని బీసీసీఐ సలహా కమిటీ * తాజా జాబితాల్లోనూ లేని త్రిమూర్తుల పేర్లు సాక్షి క్రీడావిభాగం: ‘స్వదేశంలో భారత జట్టు బాగాఆడుతున్నా... విదేశాల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుతం జట్టులో ఎక్కువ మంది యువ క్రికెటర్లు ఉన్నందున వారికి దిశానిర్దేశం చేయడానికి అనుభవజ్ఞులు అవసరం...’ సరిగ్గా ఇవే మాటలతో బీసీసీఐ త్రిసభ్య సలహా కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి బోర్డు అధ్యక్షుడు, దివంగత జగ్మోహన్ దాల్మియా, కార్యదర్శి ఠాకూర్ కలిసి చర్చించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. జూన్ 1న ఈ కమిటీ ఏర్పాటును ప్రకటించిన తర్వాత అదే నెల ఆరో తేదీన కోల్‌కతాలో సచిన్, లక్ష్మణ్, గంగూలీ సమావేశమయ్యారు. అంతే... ఆ తర్వాత ఈ ముగ్గురూ కలిసి కూర్చున్నది లేదు. దాల్మియా మరణానంతరం గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా ఎన్నికవడం, లక్ష్మణ్ కామెంటరీతో బిజీగా మారడం, సచిన్ రకరకాల వ్యాపకాలతో ప్రపంచాన్ని చుట్టేస్తుండటంతో ఈ ముగ్గురూ కలవలేదు. ఈ లోగా బీసీసీఐలోనూ రకరకాల పరిణామాలు జరిగాయి. కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పగ్గాలు అందుకోగానే అన్ని కమిటీలను ప్రక్షాళన చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కమిటీల్లో మెంబర్ల సంఖ్యను తగ్గించి మార్పు చేర్పులతో కొత్త కమిటీలను ప్రకటించి వీటిని బీసీసీఐ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో త్రిమూర్తులతో కూడిన క్రికెట్ సలహా కమిటీ ఊసే లేదు. వారికైనా తెలుసా? అసలు ప్రస్తుతం ఈ కమిటీ ఉందా? లేదా? ఒకవేళ ఉంటే బీసీసీఐ జాబితాలో ఎందుకు చూపించలేదు..? లేకపోతే ఆ విషయం సచిన్, లక్ష్మణ్, గంగూలీలకు తెలిపారా? ఈ ప్రశ్నలకు ఎక్కడా సమాధానం లేదు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం బీసీసీఐ అధికారుల్లో చాలామందికి అసలు ఈ కమిటీ గురించే తెలియదు. ‘ఈ కమిటీ ఉందని నేను అనుకోవడం లేదు’ అని బోర్డు అధికారి ఒకరు అన్నారు. మరోవైపు క్రికెటర్లు దీని గురించి బాహాటంగా ఏమీ చెప్పకపోయినా... వారి సన్నిహితులు మాత్రం ‘ఈ కమిటీ ఉందో లేదో క్రికెటర్లకు తెలియదు’ అని చెబుతున్నారు. అంటే బోర్డు నుంచి వీరికి ఎలాంటి సమాచారం లేదనేది స్పష్టం. ఎందుకు ఏర్పాటు చేశారంటే... జూన్ ఆరో తేదీన ఈ కమిటీ సమావేశమైనప్పుడు కార్యాచరణ గురించి మాట్లాడారు. విదేశాల్లో భారత జట్టు ప్రదర్శన మెరుగుపడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంతర్జాతీయ క్రికెట్లో షెడ్యూల్ బిజీగా మారినందున... మూడు ఫార్మాట్లను సీనియర్లు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దేశంలో మౌళిక సదుపాయాల పెంపునకు ఏం చర్యలు తీసుకోవాలి..? దేశంలో జూనియర్ క్రికెట్ స్థాయిలోనే నాణ్యతను ఎలా పెంచాలి?... ఇలా కొన్ని అంశాలపై ఈ ముగ్గురూ బీసీసీఐకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉండాలి. అయితే ఆ తర్వాత బోర్డు వీరికి ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదు. షెడ్యూల్ ప్రకారం జూలై నెలాఖరులో వీరు సమావేశం కావలసి ఉన్నా బోర్డు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ద్రవిడ్‌కు ముందే తెలుసేమో..! బీసీసీఐ ఏర్పాటు చేసే కమిటీలు, బీసీసీఐ వ్యవహారశైలి గురించి అందరిలోకీ ద్రవిడ్‌కే ఎక్కువ ఆలోచన ఉండి ఉంటుంది. అందుకే ఆనాడు నలుగురు క్రికెటర్లతో కమిటీని ఏర్పాటు చేస్తామంటే తను తిరస్కరించాడు. కమిటీల పట్ల తనకు ఆసక్తి లేదని, జూనియర్ జట్లకు కోచ్‌గా పని చేస్తాననే ప్రతిపాదనతో వచ్చాడు. కాబట్టి తను ఇప్పటికీ తన బాధ్యతలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అండర్-19 జట్టుకు కోచ్‌గా శ్రీలంకలో ఉన్నాడు. నిజానికి బోర్డు ఈ కమిటీని నిర్లక్ష్యం చేయడం ఈ దిగ్గజాలను అవమానించడమే. ఇప్పటికైనా బీసీసీఐ మేలుకొని ఈ కమిటీ విషయంలో ఓ నిర్దిష్ట ప్రకటన చేస్తే మంచిది. -
'క్యాబ్' పగ్గాలు చేపట్టిన దాదా
టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురువారం అధికారికంగా 'క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్' (క్యాబ్) పగ్గాలు చేపట్టారు. కోల్‌కతాలో జరిగిన ప్రత్యేక జనరల్ మీటింగ్ సమావేశంలో గంగూలీ క్యాబ్ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నారు. సెప్టెంబర్ 20న జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణంతో గంగూలీ ఈ స్థానాన్ని భర్తీ చేశారు. దాల్మియా తనయుడు అవిషేక్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. కేవలం 10 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో గంగూలీ, అవిషేక్లను బెంగాల్ క్రికెట్ బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
దూకు దూకు దూకుతాడనే టెన్షనూ...!
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడే గొప్ప కెప్టెన్ అవుతాడు. సినిమా డైలాగ్‌లా అనిపించినా క్రికెట్లో ఇది కఠోర వాస్తవం. ఓ మ్యాచ్‌లో నెగ్గడానికి ఎన్ని వ్యూహాలైనా అమలు చేయొచ్చు. బ్యాట్‌తో, బంతితో ఎలాంటి దూకుడునైనా చూపించొచ్చు. కానీ ప్రవర్తన విషయంలో మాత్రం సంయమనం ఉండాలి. ఆటగాడిగా కోహ్లి గతంలో అనేకసార్లు నియంత్రణ కోల్పోయాడు. కెప్టెన్ అయ్యాక కూడా తన శైలి పెద్దగా మారలేదు. అయితే తాజాగా శ్రీలంక సిరీస్‌లో మిగిలిన జట్టుకు కూడా ఇదే అలవాటు చేశాడు. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేదే ఇప్పుడు టెన్షన్. తాను చూపించిన మార్గమే... విరాట్ కోహ్లికి వివాదాలతో అవినాభావ సంబంధం ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా అతని నోటినుంచి వచ్చే బూతు పురాణం చాలా ప్రసిద్ధికెక్కింది! మూడేళ్ల క్రితం సిడ్నీ టెస్టు సందర్భంగా ప్రేక్షకులకు వేలు చూపించడం, ఐపీఎల్లో గంభీర్‌తో గొడవ, హరారేలో అంపైర్లతో వాదన అతనికి చెడ్డ పేరు తెచ్చి పెట్టాయి. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మిషెల్ జాన్సన్‌ను ఎదుర్కోవడంలో చూపించిన తెగువకు ఆరంభంలో అభినందనలు అందించినా...అది అతి కావడంతో సమస్యగా మారింది. అసలు 2008లో అండర్-19 ప్రపంచకప్‌ను గెలిపించిన కెప్టెన్ కోహ్లి, ఆ టోర్నీలోనే రూబెల్ హుస్సేన్‌తో దూషణకు దిగిన ఘటన అతని వివాదాలకు బీజం వేసింది. ఇక ఇటీవల వన్డే ప్రపంచకప్ సమయంలో జర్నలిస్ట్‌ను కూడా అకారణంగా తిట్టడం, చివరకు ఎలాగోలా దానికి ముగింపు పలకడం ఎవరి మదినుంచీ చెరిగిపోలేదు. ఇదంతా ఆటగాడిగా అతని ట్రాక్ రికార్డు. అయితే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన, కోహ్లి అందించిన విజయాలు ఈ ఘటనలను మరచిపోయేలా చేసినా... ఏదో ఒక సమయంలో అవి మళ్లీ బయటకు వస్తున్నాయి. నాయకుడే ఇలా ఉంటే... మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న కుషాల్ పెరీరా క్యాచ్‌ను మిడాఫ్‌లో అందుకున్న కోహ్లి ఆగ్రహంతో బంతిని ఫుట్బాల్లా తన్నాడు. నోటినుంచి నాలుగు ‘బూతులు’ కూడా జాలువారాయి. కెప్టెన్‌ను చూశాకేనేమో బౌలర్ ఇషాంత్ కూడా పెరీరాను ఏదో అన్నాడు. ఆ సమయానికి భారత్ టెస్టులో సంపూర్ణ ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ హోరాహోరీగా ఏమీ సాగడం లేదు. కానీ విరాట్ ఇంతగా స్పందించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు. ‘మాకు గౌరవం ఇవ్వని వారిని మేం గౌరవించాల్సిన పని లేదు’ అంటూ ఆస్ట్రేలియా సిరీస్‌నుంచి కోహ్లి తనను తాను సమర్థించుకుంటూ రావచ్చు గాక... కానీ అన్నింటికి అదే సమాధానం కాబోదు. సరిగ్గా చెప్పాలంటే కోహ్లి తనలాగే తన జట్టు సభ్యులు కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే దూకుడు... దూకుడు అంటూ ఒకటే పాఠం వల్లె వేస్తున్నాడు. కోహ్లి దూకుడే సిరీస్ విజయం అందించిందని కొంత మంది చెబుతున్నా, గత కొన్నేళ్లలో అత్యంత బలహీనంగా కనిపించిన ఈ శ్రీలంక జట్టుపై గెలిచేందుకు అది అవసరమా అనిపిస్తుంది. గంగూలీతో పోలిక 2002లో లార్డ్స్‌లో విజయానంతరం గంగూలీ చొక్కా విప్పి చేసుకున్న సంబరాలు ఎవరూ మరచిపోలేరు. అంతకు ముందునుంచి కూ డా గంగూలీ ప్రత్యర్థి ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అని తలపడేందుకు సిద్ధంగా ఉండేవాడు. ఆస్ట్రేలియాలాంటి జట్టుతో కూడా మాటల యుద్ధానికి సై అనేవాడు. ఇప్పుడు కోహ్లి ప్రవర్తన కొంత వరకు సౌరవ్‌ను గుర్తుకు తెస్తోంది. ‘గాంధీయవాది’లాగే ఉంటే కుదరదు కాబట్టి ‘దూకుడు’ అనే స్టాంప్ అందరికీ ఉండాలి, అప్పుడే వారు ఆటలో దూసుకుపోగలరని కోహ్లి గట్టిగా నమ్ముతున్నాడు. అయితే నాడు ఒక వైపు అగ్నిలా సౌరవ్ ఉన్నా పరిస్థితిని శాంతపరిచేందుకు జట్టులో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌లాంటి దిగ్గజాలు ఉండేవారు. ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ అత్యుత్తమ ఆటగాళ్లైన వీరి అండ గంగూలీకి కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు సహకరించింది. కుంబ్లే కెప్టెన్‌గా ఉన్నా... సైమండ్స్, హర్భజన్ వివాదాన్ని సాధ్యమైనంత తగ్గించడంలో సచిన్ కూడా కీలక పాత్ర పోషించిన విషయం మరచిపోలేం. కానీ కోహ్లి పరిస్థితి అలా కాదు. ఇది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కొత్త జట్టు. తనకు ఉన్న అనుభవంతోనే జట్టును తీర్చిదిద్దుకోవాల్సిన పనిలో కోహ్లి ఉన్నాడు. సహజంగానే కెప్టెన్ మాట, అతని ప్రవర్తన ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తుంది. ‘ఓహో... ఇలా ఉండటమే కెప్టెన్‌కు ఇష్టం’ అనే సందేశం ఇప్పుడు ఆటగాళ్లకు వెళుతోంది. అనవసరపు దూకుడుతో ఒక ప్రధాన ఆటగాడిని కీలక మ్యాచ్‌కు జట్టు కోల్పోవడం అర్థం లేనిది. ఇలాంటిదే పునరావృతం అయితే రేపు కోహ్లిపై కూడా నిషేధం పడవచ్చు. మారాల్సిన సమయం కోహ్లి కెప్టెన్సీలో భారత్ ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడింది. 2 గెలిచి, 2 ఓడి, 2 డ్రా చేసుకుంది. అప్పుడే అతని పరిణతిపై మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పదే పదే చెప్పే దూకుడు మాత్రమే జట్టుకు విజయాన్ని అందించలేదని ఇప్పటికే అతనికి అర్థమై ఉండాలి. నిజానికి తన స్వభావాన్ని సరైన దిశలో చూపిస్తే అద్భుతాలు చేయగలనని అతను తన బ్యాటింగ్‌తో చాలా సార్లు నిరూపించాడు. ఆటగాడిగా కోహ్లి అందించిన విజయాలు వెలకట్టలేనివి. మరో వైపు సంగక్కరకు ఫేర్వెల్ ఇవ్వడంలో, మూడో టెస్టులో సెంచరీ సాధించిన మ్యాథ్యూస్‌ను భుజంపై తట్టి అభినందించడం చూస్తే ప్రత్యర్థిని గౌరవించగల స్ఫూర్తి కూడా అతనిలో ఉంది. అయితే అనవసరంగా తెచ్చి పెట్టుకునే ఆవేశాన్ని అతను ఇప్పుడు అదుపులో ఉంచుకోవాలి. మరీ మెషీన్ తరహాలో బిగదీసుకోవాల్సిన అవసరం లేదు కానీ.... దూషణలకు దిగే, గొడవలు పెట్టుకునే కెప్టెన్‌ను మనం చూడాలనుకోవడం లేదు. టీవీలో కనిపించే ఈ ఘటనలు అతడి పేరును మరింత చెడగొడతాయి. తన సీనియర్ ధోని నుంచి ఏది నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా... సంయమనంగా ఉండటంలో మాత్రం ‘కెప్టెన్ కూల్’ను అనుసరించాల్సిందే. -
భారత జట్టులో విభేదాలు లేవు: దాదా
కోల్‌కతా: భారత జట్టులో ఎటువంటి విభేదాలూ లేవని మాజీ కెప్టెన్, బీసీసీఐ సలహా మండలి సభ్యుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. టీమిండియా ఓటమి చెందినపుడు, స్థాయి మేరకు ఆడనప్పుడు ఇలాంటి వార్తలు వస్తుంటాయని, ఇవి నిజంకాదని చెప్పాడు. టి-20, వన్డే కెప్టెన్ ధోనీ, టెస్టు కెప్టెన్ కోహ్లీల మధ్య విభేదాలున్నాయని, జట్టులో ఆధిపత్య పోరు నడుస్తోందని వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో భారత్ ఓటమికి ఇవే కారణాలని కథనాలు రావడంతో దాదా స్పందించాడు. ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశాడు. టీమిండియా ఓడిపోవడం బాధాకరమని, అయితే బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడిందని అన్నాడు. -
బ్యాట్‌మెన్ 3
బయోగ్రఫీ బ్యాట్మన్ ఓ సూపర్ హీరో... కలలో మాత్రమే సాధ్యమయ్యే వాటిని క్షణాల్లో చేసి చూపిస్తాడు. భారత క్రికెట్‌కు అలాంటి బ్యాట్‌మెన్ ముగ్గురున్నారు. ఆడినంతకాలం ప్రపంచ క్రికెట్‌ను శాసించిన దిగ్గజ త్రయం సచిన్, గంగూలీ, లక్ష్మణ్... ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్‌ను బంగారుబాట పట్టించేందుకు కంకణం కట్టుకున్నారు. మైదానంలో ఎదురుగా ధోని, కోహ్లిల వంటి హేమాహేమీల్లాంటి ఆటగాళ్లు... వారిని ఎలా నిలువరించాలా అనేది ప్రత్యర్థి జట్ల ఆలోచన. ఇప్పుడు అగ్నికి వాయువు తోడైనట్లుగా... మరికొందరు దిగ్గజాలు ఆటగాళ్ల వెన్నంటి నిలిచి వ్యూహాలకు పదును పెడితే... ఇక వారి కోసం కూడా అవతలి జట్లు ప్రతివ్యూహం పన్నాల్సి వస్తుందేమో. భారత క్రికెట్ భవిష్యత్తును దూరదృష్టితో చూస్తే ఇదే దృశ్యం ఇప్పుడు మన ముందు కనిపించనుంది. ఎందుకంటే ఇకపై భారత జట్టుకు దశ, దిశను ఇచ్చేందుకు నాటి స్టార్ క్రికెటర్లు దిగుతున్నారు. పుష్కర కాలానికి పైగా కలిసి ఆడిన తమ సమష్టి అనుభవంతో త్రిమూర్తులు... ఇప్పుడు మార్గదర్శనం అందించేందుకు సిద్ధమయ్యారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు ఇకపై సలహాదారులుగా జట్టుకు అండగా నిలవనున్నారు. భారత క్రికెట్ జట్టుకి అనుభవం లేదు... అంతా కుర్రాళ్లే... సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత క్రికెట్ ప్రపంచంలో ఉన్న అభిప్రాయం ఇది. ఇది వాస్తవమే. కానీ మాస్టర్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కూడా గత ఏడాదిన్నరగా మనోళ్లు చాలా చోట్ల మెరుపులు మెరిపించారు. అయితే కొన్ని చోట్ల మోకరిల్లారు. ఫలితాల్లో తేడాలు ఉన్నా, అనుభవం లేకపోయినా కొత్త కుర్రాళ్లు సాన పెట్టిన వజ్రంలా రాటుదేలుతూ పోయారు. అయితే విజయాలు ఒక్కటే కాదు... ఇంకేదో కావాలి. అలనాటి విండీస్ లాగానో, ఆ తర్వాతి ఆస్ట్రేలియాలానో భారత్ కూడా అజేయ శక్తిలా నిలవాలి. సరిగ్గా చెప్పాలంటే ఐసీసీలో కాదు ఆటలో కూడా సూపర్ పవర్ కావాలి. అదిగో... దానికోసమే బీసీసీఐ త్రిమూర్తులను ముందుకు తెచ్చింది. ఈ ముగ్గురినీ ఆటలో మళ్లీ భాగం చేసింది. తమ అనుభవాన్ని నవ తరానికి అందించమని కోరింది. మైదానం బయట కూడా తమదైన ముద్ర వేసేందుకు మరో అవకాశం కల్పించింది. వీరంతా తమ 1308 అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవాన్నంతా రంగరించి కుర్రాళ్లలో స్ఫూర్తి నింపితే, మార్గదర్శనం అందిస్తే ఇక తిరుగేముంది. ఈ ముగ్గురిలో ఎవరి పాత్ర ఏమిటనే విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోయినా... సంవత్సరాల పాటు భారత క్రికెట్‌కు మూల స్తంభాలుగా నిలిచినన ఈ త్రయం తెర వెనుక నుంచి కూడా మరో చరిత్రకు అంకురార్పణ చేయగలదనే నమ్మకం ఉంది. సచిన్: వివాద రహితంగా మెలగడం మాస్టర్ బ్లాస్టర్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తన 24 ఏళ్ల కెరీర్లో ఎక్కడా ఒక్క వివాదం కూడా లేదు. మైదానం లోపల, బయట కూడా మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇకపై భారత బ్యాట్స్‌మెన్ తమ ఆటతీరు గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ చిన్న తప్పులు చేస్తున్నా నెట్స్‌లో సరిదిద్దడానికి సచిన్ ఉంటాడు. నిజానికి సచిన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటమే ఓ పాఠం. తన అనుభవాలు చెప్తే చాలు స్ఫూర్తి పెరుగుతుంది. ఫలానా మ్యాచ్‌లో ఇలాంటి ఒత్తిడిలో నేను ఇలా ఆడా అని మాస్టర్ చెప్పినా అదే కొండంత ధైర్యాన్నిస్తుంది. 2003 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన సచిన్ ఆ టోర్నీలో తాను ఒక్కసారి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయలేదని చెబితే ఆశ్చర్యం కలగడమే కాదు... మరో రకమైన సన్నాహకం దాని వెనక ఉందనే విషయం తెలిస్తే యువ ఆటగాళ్లు అదో పెద్ద పాఠం. ఇటీవల కాలంలో ఆటతీరు ఎలా ఉన్నా మైదానం లోపల, బయట కూడా భారత క్రికెటర్లు పదే పదే వివాదాల్లోకి వెళుతున్నారు. ముఖ్యంగా టెస్టు కెప్టెన్ కోహ్లి ఇందులో ముందుంటున్నాడు. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పే బాధ్యత ఇకపై సచిన్ తీసుకోవచ్చు. గంగూలీ: సమపాళ్లలో దూకుడు భారత జట్టు కెప్టెన్‌గా ప్రత్యర్థులతో దూకుడు ఎలా వ్యవహరించాలో తొలుత నేర్పినవాడు గంగూలీ. అయితే తను ఏనాడూ శృతి మించలేదు. గీత దాటి వేటు పడేదాకా పరిస్థితిని తెచ్చుకోలేదు. అలాగే వ్యూహాల విషయంలో తనకు తనే సాటి. ఆట కంటే మిగిలిన విషయాలలో గంగూలీ అనుభవం యువ జట్టుకు ఎక్కువగా ఉపయోగపడొచ్చు. ఇక గంగూలీలో మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నాడు. బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య వారధిగా తను ఉపయోగపడతాడు. తను కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో యువ క్రికెటర్లను వెనకేసుకొచ్చి సెహ్వాగ్, హర్భజన్ లాంటి వాళ్లు నిలదొక్కుకునేలా చేసిన ఘనత తనది. మరోసారి ఇప్పటితరం క్రికెటర్లు కూడా గంగూలీని నమ్ముకోవచ్చు. నైపుణ్యం ఉన్న క్రికెటర్‌ను గుర్తించి, తనకు అండగా నిలవడంలో దాదా ఎప్పుడూ ముందుంటాడు. లక్ష్మణ్: విదేశాల్లో బాగా ఆడటం ప్రస్తుత క్రికెటర్లు లక్ష్మణ్ నుంచి నేర్చుకోవాల్సిన తొలి పాఠం విదేశీ గడ్డపై ఎలా ఆడాలో తెలుసుకోవడమే. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డలపై మన రికార్డు అత్యంత పేలవంగా ఉంది. ప్రస్తుత టి20 తరంలో బ్యాట్స్‌మెన్ టెక్నిక్‌ను బాగా మెరుగుపరిస్తే ఈ రికార్డును సరిజేయొచ్చు. ఈ బాధ్యతను లక్ష్మణ్ సమర్థంగా నిర్వర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే సన్‌రైజర్స్ జట్టు మెంటర్‌గా, బెంగాల్లో యువ బ్యాట్స్‌మెన్‌కు శిక్షకుడిగా కొంత అనుభవం కూడా తను గడించాడు. నిజానికి తమ తరంలో ఎక్కువగా అన్యాయం జరిగిన క్రికెటర్ లక్ష్మణ్. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా వన్డే ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక కాలేదు. అయినా ఏనాడూ బయటకు ఒక్క మాట అనలేదు. వివాదాలను తెచ్చుకోలేదు. ఈ ముగ్గురూ తమ తొలి ఇన్నింగ్స్‌లో క్రికెట్ ఆడుతూ దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్నారు. తాము ఆడినంత కాలం భారత క్రికెట్‌ను శిఖరాన నిలబెట్టారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తమ అనుభవంతో యువ జట్టును కూడా అదే స్థాయికి చేరుస్తారా..? చూద్దాం... త్వరలోనే దీనికి సమాధానం దొరకొచ్చు. - బత్తినేని జయప్రకాష్ భవిష్యత్ కోసం ద్రవిడ్ సలహా కమిటీలో త్రిమూర్తులు మాత్రమే ఉండి ద్రవిడ్ లేకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నిజానికి బీసీసీఐ ద్రవిడ్‌ను కూడా ఈ కమిటీలో ఉండాలని కోరింది. అయితే తాను భారత క్రికెట్ భవిష్యత్ కోసం పని చేస్తానని ‘వాల్’ స్పష్టం చేశాడు. దీంతో భారత్ ఎ, అండర్-19 జట్లకు తనని కోచ్‌గా నియమించారు. భారత్ జట్టు తరఫున క్రికెట్ ఆడే వాళ్లంతా ఈ రెండు జట్లలో ఏదో ఒక దశలో ఆడి రావాల్సిందే. కాబట్టి క్షేత్రస్తాయిలోనే ఆటగాళ్లను సాన బెట్టాలనే ఆలోచన తనది. త్రిమూర్తులతో పోలిస్తే ద్రవిడ్‌దే కఠినమైన పని. క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో జట్టు భారాన్ని అనేకసార్లు ఒంటిచేత్తో మోసిన రాహుల్ ద్రవిడ్‌కు ఇలాంటి సవాళ్లంటేనే ఇష్టం. -
లెజెండ్స్ లీగ్ బ్లూ ప్రింట్ సిద్ధం
దుబాయ్: క్రికెట్ దిగ్గజాలు సచిన్, షేన్‌వార్న్ కలిసి ఏర్పాటు చేయబోతున్న లెజెండ్స్ టి20కి సంబంధించిన బ్లూ ప్రింట్ సిద్ధమైంది. ఈ ఇద్దరూ కలిసి దీనిని ఐసీసీ ముందు ఉంచారు. ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్సన్ను కలిసిన సచిన్, వార్న్ లీగ్ విధివిధానాలను వివరించారు. అమెరికాలో ఆగస్టు, సెప్టెంబర్లలో తొలి సిరీస్ జరగనుంది. న్యూయార్క్, లాస్ఏంజెల్స్, చికాగో నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఫ్లింటాఫ్, బ్రెట్‌లీ, గంగూలీ, గిల్‌క్రిస్ట్, కలిస్, జయవర్ధనే, మెక్‌గ్రాత్ ఇప్పటికే ఈ లీగ్‌లో పాల్గొనేందుకు అంగీకరించారు. మూడున్నరేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అయితే ఈ టోర్నీకి తమ అనుమతి అవసరం లేదని ఐసీసీ అధికార ప్రతినిధి తెలిపారు. మ్యాచ్‌లు ఏ దేశంలో నిర్వహిస్తే ఆ దేశ క్రికెట్ బోర్డు అనుమతి ఉంటే చాలని ప్రకటించారు. టోర్నీని ఐసీసీ దృష్టిలో ఉంచాలనే ఉద్దేశంతో సచిన్, వార్న్ తమ ప్రణాళికలను రిచర్డ్సన్కు వివరించినట్లు సమాచారం. -
దాదాతో పనిచేసేందుకు ద్రావిడ్ అయిష్టత?
-
దాదాతో పనిచేసేందుకు ద్రావిడ్ అయిష్టత?
ముంబై: బీసీసీఐ ఏర్పాటు చేసిన క్రికెట్ సలహా మండలిలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లకు చోటు కల్పించారు. వీరి సమకాలీనుడైన మరో దిగ్గజం రాహుల్ ద్రావిడ్ పేరు ఈ కమిటీలో లేకపోవడం క్రికెట్ వర్గాలకు వెలితిగా కనిపిస్తోంది. ద్రావిడ్ టీమిండియా కెప్టెన్‌గా పనిచేశాడు. ఎంతో అనుభవజ్ఞుడు కూడా. అలాంటి ద్రావిడ్‌ను బోర్డు విస్మరించడం సందేహాలకు తావిస్తోంది. బీసీసీఐ సలహా కమిటీలోకి సచిన్, గంగూలీ, ద్రావిడ్‌లను తీసుకోవాలని బోర్డు తొలుత భావించినట్టు సమాచారం. అయితే ఈ కమిటీలో చేరేందుకు ద్రావిడ్ నిరాకరించాడని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గంగూలీతో ద్రావిడ్‌కు ఉన్న విభేదాలే కారణమని చెబుతున్నారు. సలహా కమిటీలో దాదాతో కలసి పనిచేయడానికి ద్రావిడ్ అయిష్టత వ్యక్తం చేశాడని భావిస్తున్నారు. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనలను ఉదాహరిస్తున్నారు. ద్రావిడ్ నిరాకరించడంతో అతని స్థానంలో హైదరాబాదీ లక్ష్మణ్‌ను కమిటీలోకి తీసుకున్నట్టు క్రికెట్ వర్గాల సమాచారం. ఇదిలావుండగా ద్రావిడ్‌ను కోచ్‌గా నియమిస్తారని, అందువల్లే సలహా కమిటీలో స్థానం కల్పించలేదన్నది మరో వాదన. -
కోచ్ ఎంపిక ‘త్రిమూర్తుల’ చేతుల్లో...
* కమిటీలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ * బీసీసీఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌ను ఎంపిక చేయడంలో ముగ్గురు మాజీ దిగ్గజాలు కీలక పాత్ర పోషించనున్నారు. డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ప్రపంచకప్‌తో ముగియడంతో బీసీసీఐ కోచ్ ఎంపికపై దృష్టి పెట్టింది. ఆదివారం ఇక్కడ సమావేశమైన బోర్డు వర్కింగ్ కమిటీ అందు కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భారత మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ సభ్యులుగా ఉంటారు. టీమిండియా శిక్షకుడిని ఎంపిక చేయడంపై వీరు ముగ్గురూ తమ సూచనలు, సలహాలు బోర్డు అధ్యక్ష, కార్యదర్శులకు అందజేస్తారు. దీంతో కోచ్ పదవికి గంగూలీ రేసులో ఉన్నట్లు ఇటీవల వచ్చిన వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లే. త్వరలోనే భారత జట్టుకు కొత్త కోచ్ రానుండగా... అసిస్టెంట్ కోచ్‌లు సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్‌లు మాత్రం ఇకపై కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆటను మరింతగా అభివృద్ధి చేసేందుకు మాజీ ఆటగాళ్లతో కూడిన సలహా కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. న్యాయ సలహా కోసం: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ విలువను కేవలం రూ. 5 లక్షలుగా చూపడంపై వర్కింగ్ కమిటీలో తీవ్ర చర్చ జరిగింది. పలువురు సభ్యులు దీనిపై ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్‌కు అనేక ప్రశ్నలు సంధించారు. మార్కెట్ విలువ కనీసం రూ. 1500 కోట్లు ఉండే జట్టును ఏ లెక్క ప్రకారం రూ. 5 లక్షలుగా చూపించారని మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ గట్టిగా నిలదీశారు. అయితే ఈ అంశంపై బోర్డు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనిపై తాజాగా న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని మాత్రం నిర్ణయించారు. ‘అర్జున’కు రోహిత్ పేరు ప్రతిపాదన: మరోవైపు కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు కోసం 2015 సంవత్సరానికి రోహిత్ శర్మ పేరును ప్రతిపాదించాలని కూడా వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మృతి చెందిన క్రికెటర్లు అంకిత్ కేసరి, గౌరవ్ కపూర్లకు ఈ సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు. బుకీతో బోర్డు కార్యదర్శి! ముంబై: బీసీసీఐ కార్యదర్శిగా ఇటీవలే ఎంపికైన అనురాగ్ ఠాకూర్ వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ మీడియా కథనం ప్రకారం... కరణ్ గిల్హోత్రా అనే అనుమానిత బుకీతో ఠాకూర్ సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. ఒక పార్టీలో కరణ్‌కు స్వయంగా ఠాకూర్ కేక్ తినిపిస్తున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీఎస్‌యూ) వద్ద ఉన్న బుకీల జాబితాలో కరణ్ పేరు కూడా ఉండటం వివాదానికి కారణమైంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నాలుగు రోజుల క్రితం ఐసీసీ, బీసీసీఐకి ఘాటుగా లేఖ రాసినట్లు తెలిసింది. ఫిక్సింగ్ మాయలో పడకుండా ఆటగాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ బీసీసీఐ ఏసీఎస్‌యూ డెరైక్టర్ రవి సవాని 2014లో అన్ని ఐపీఎల్ జట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కూడా కరణ్ గిల్హోత్రాకు దూరంగా ఉండాలని సూచనలు ఉన్నాయి. అయితే ఐసీసీ లేఖ రాసి నాలుగు రోజులు దాటినా బీసీసీఐ దానికి స్పందించలేదు. శ్రీనివాసన్ గూఢచర్యం!: మరోవైపు ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ గతంలో తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బోర్డు సభ్యులపైనే గూఢచర్యానికి పాల్పడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సహచరుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు, ఇ-మెయిల్స్ హ్యాక్ చేసేందుకు శ్రీనివాసన్ లండన్‌కు చెందిన ప్రైవేట్ ఏజెన్సీని ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన దాదాపు రూ. 14 కోట్ల బోర్డు సొమ్మునే వాడినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ త్వరలో విచారణ జరిపే అవకాశం ఉంది. -
ఎవరికిస్తారు పగ్గాలు?
♦ భారత క్రికెట్ జట్టు కోచ్ రేసులో గంగూలీ, ద్రవిడ్ ♦ డెరైక్టర్‌గా కొనసాగాలనుకుంటున్న శాస్త్రి ♦ ఆసక్తికరంగా కొత్త కోచ్ ఎంపిక ముంబై : భారత క్రికెట్ కోచ్ పగ్గాలు చేపట్టబోయేది ఎవరు? ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ ఇది. డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ముగియడంతో రాబోయే సీజన్‌కు కొత్త కోచ్‌ను నియమించాలి. ఈ పదవి కోసం అందరికంటే ఎక్కువగా గంగూలీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే ద్రవిడ్‌ను కోచ్‌ను చేయాలని బీసీసీఐలోని పెద్దలు కొందరు భావిస్తున్నారు. ఇలాంటి పెద్ద క్రికెటర్లు కాకుండా బంగర్ లేదా ప్రవీణ్ ఆమ్రేలాంటి లో ప్రొఫైల్ కోచ్ ను నియమించి టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని కొనసాగించాలనేది మరో ప్రతిపాదన. ► భారత జట్టు కోచ్ కోసం తొలుత బీసీసీఐ ప్రకటన చేయాలి. ఆసక్తి ఉన్న వాళ్లంతా ఈ పదవి కోసం అప్లికేషన్ పెట్టాలి. ఆ తర్వాత కోచ్‌గా తమ పనితీరు ఎలా ఉండబోతోందనే ప్రజెంటేషన్ ఇవ్వాలి. దీని తర్వాత బీసీసీఐ అధికారులు, మాజీ కెప్టెన్లు కలిసి చేసే ఇంటర్వ్యూలో పాసవ్వాలి. కాబట్టి కోచ్ ఎంపిక పెద్ద తతంగం. ► కోచ్ పదవి కోసం మాజీ కెప్టెన్ గంగూలీ అమితాసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. బీసీసీఐ కొత్త అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాను కలిసి బెంగాల్ టైగర్ ఇప్పటికే దీని గురించి చర్చించాడు. అయితే దాల్మియా నుంచి ప్రస్తుతానికి దాదాకు ఎలాంటి హామీ రాలేదు. అయితే తనకు క్రికెట్ రాజకీయాలపై ఆసక్తి ఉందని, కోచ్ పదవిపై ఆసక్తిలేదని గంగూలీ చెప్పినట్లు కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ► రాజస్తాన్ రాయల్స్ మెంటార్‌గా అద్భుతమైన విజయాలతో ద్రవిడ్ కోచ్ పదవికి సరిపోతానని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఎలాంటి వివాదాలు లేని వ్యక్తిగా ద్రవిడ్ భారత జట్టు కోచ్‌కు అసలైన అర్హుడంటూ బీసీసీఐలోని కొందరు పెద్దలు అంటున్నారు. ద్రవిడ్‌తో మాట్లాడి కోచ్ పదవికి అప్లికేషన్ ఇప్పించాలని వీళ్ల ఆలోచన. ► ద్రవిడ్, గంగూలీలలో ఎవరు కోచ్‌గా వచ్చినా ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మారుతుంది. ప్రస్తుతం జట్టుకు డెరైక్టర్‌గా రవిశాస్త్రి ఉన్నారు. పెత్తనం అంతా ఆయనదే. ఈ ఇద్దరిలో ఎవరు కోచ్ అయినా దీనికి ఒప్పుకోరు. కాబట్టి అప్పుడు డెరైక్టర్ పదవిని రద్దు చేయాలి. ► రవిశాస్త్రి కూడా డెరైక్టర్ పదవిలో కొనసాగాలనే ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. సంజయ్ బంగర్ లేదా ప్రవీణ్ ఆమ్రేలలో ఒకరిని కోచ్‌గా చేసి రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్‌గా కొనసాగడం ఓ ప్రత్యామ్నాయం. ► ప్రస్తుతం అందరూ ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. అయితే ఈ టోర్నీ ముగిశా క కూడా భారత జట్టుకు రెండు నెలల పాటు టోర్నీలు లేవు. కాబట్టి కోచ్ ఎంపికపై తొందరపాటు లేకుండా బీసీసీఐ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. -
టెస్ట్ సిరీస్ ఆడితే బాగుండేది: గంగూలీ
మెల్బోర్న్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఆడితే బాగుండేదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. టెస్టు క్రికెట్ నుంచి తక్షణం తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ధోనీ మరికొన్నాళ్లు ఆడతారని అనుకున్నానట్లు గంగూలీ చెప్పారు. -
సర్కారీ పథకాలే బెస్ట్: గంగూలీ
సెలబ్రిటీలంటే ఎడాపెడా సంపాదిస్తారు కనుక వారి ఇన్వెస్ట్మెంట్లు కూడా అలాగే ఉంటాయనుకుంటాం. కానీ కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి ప్రతి పైసాను చాలా జాగ్రత్తగా చూసుకుంటామంటున్న సెలబ్రిటీల కథలివి... బెంగాలీ బాబు.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీపై క్రికెట్ అభిమానులకున్న ఇష్టం అంతా ఇంతా కాదు. అందుకే ఆటగాడిగానే కాక కెప్టెన్‌గా కూడా సుదీర్ఘ ఇన్సింగ్స్ ఆడాడు గంగూలీ. మరి పెట్టుబడుల గురించి గంగూలీ ఏమంటారు? తనైతే ఏం చేస్తారు? ఆయన అభిప్రాయమేంటి? ఆయన మాటల్లోనే చూద్దాం.. నా ఉద్దేశంలో ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. మనకు ఏ రంగమైతే బాగా తెలుసో, ఎక్కడైతే మనకు అనుభవం ఉందో అక్కడే పెట్టుబడి పెట్టాలి. అంతేతప్ప మనకు తెలియని, అనుభవం లేని రంగం ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నా దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే మనం పెట్టే పెట్టుబడి మనకు నష్టాలు మిగల్చదన్న నమ్మకం మొదట మనకు కలగాలి. నా వరకూ మాత్రం నేను సురక్షితమైన పెట్టుబడులనే ఆశ్రయిస్తాను. ఏ మాత్రం రిస్కున్నా దూరంగా ఉంటాను. నాకు అనుభవం లేని, నాకు తెలియని రంగాల వైపు చూడనే చూడను. ఎక్కువగా ప్రభుత్వ మద్దతున్న రంగాలు, ఇన్వెస్ట్మెంట్లనే ఆశ్రయిస్తాను. పైవేటు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయను. ఇంకా చెప్పాలంటే ప్రైవేటు బ్యాంకులను కూడా పెద్దగా నమ్మను. ప్రభుత్వ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేస్తా. దానివల్ల నేను, నా ఇన్వెస్ట్మమెంట్లు సేఫ్‌గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి పైసా మనం కష్టపడి సంపాదించిందే. పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించటం కష్టం. అయితే వ్యాపారాలు చేసేవారు కూడా ఇలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్లు చేద్దామనుకుంటే కుదరదు. వ్యాపారంలో రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్నచోటే లాభం కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి వారు ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందో, ఎక్కడ వృద్ధికి అవకాశం ఉందో అక్కడ పెట్టుబడులు పెట్టాలి. ఇక్కడ మనం గమనించాల్సిందొకటి ఉంది. జీవితానికి గ్యారంటీ లేదు. రేపు ఏం జరుగుతుందో తెలీదు. అందుకే మనకు అనుభవం, నైపుణ్యం ఉండి... మన అదుపులో ఉండేచోటే ఇన్వెస్ట్ చేయాలన్నది ఎవరికైనా నేను చెప్పే సలహా. -
వివాదం పెరగొద్దనే రాజీనామా
కేంద్రం రాష్ట్రపతికి చేసిన సిఫార్సు అసమంజసం: గంగూలీ కోల్‌కతా: న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఏకే గంగూలీ తాను పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం(డబ్ల్యూబీహెచ్ఆర్సీ) చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ధ్రువీకరించారు. వివాదం మరింత పెరగకుండా నివారించేందుకే పదవి నుంచి తప్పుకున్నానన్నారు. గవర్నర్ ఎంకే నారాయణన్‌కు సోమవారం అందించిన తన రాజీనామా లేఖను ఆయన పీటీఐ వార్తాసంస్థకు ఫోన్లో చదివి వినిపించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారామని పేర్కొన్నారు. తనను హెచ్ఆర్సీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని కేంద్రం రాష్ట్రపతికి చేసిన సిఫార్సు అనాలోచితం, అసమంజసం అని ఆరోపించారు. ‘నా కుటుంబ సభ్యుల సుఖశాంతుల కోసం, నేను నిర్వహించిన ఉన్నత పదవులపై గౌరవంతో రాజీనామా చేశాను. నన్ను విమర్శిస్తున్నవారిని ద్వేషించడం లేదు. వారి జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. గౌరవాభిమానాలతో పని చేసే పరిస్థితి లేనప్పుడు పదవిలో కొనసాగలేనని పేర్కొన్నారు. కాగా, గంగూలీ రాజీనామాను గవర్నర్ ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. మరోవైపు, గంగూలీ రాజీనామా తనను బాధించిందని లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ పేర్కొన్నారు. ఆయన వాదనను సరిగ్గా వినలేదని, నేరం చేశారని రుజువు కాకుండానే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. -
గంగూలీ బాటలో మరో మాజీ జడ్జి!
న్యూఢిల్లీ: ప్రస్తుతం పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీ బాటలోనే సుప్రీం కోర్టుకు చెందిన మరో మాజీ న్యాయమూర్తి ఒక న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఇటీవల రిటైరైన న్యాయమూర్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఒక న్యాయ విద్యార్థిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ‘మెయిల్ టుడే’ తన తాజా కథనంలో వెల్లడించింది. ఈ కథనం ప్రకారం రెండు వారాల కిందటే బాధితురాలు తన ఫిర్యాదును ప్రధాన న్యాయమూర్తికి పంపినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. సీనియర్ న్యాయ అధికారి ఒకరు ఈ మేరకు అఫిడవిట్‌ను సీల్డ్ కవర్లో ప్రధాన న్యాయమూర్తికి పంపినట్లు చెప్పాయి. అయి తే, జస్టిస్ గంగూలీ ఉదంతం తర్వాత సమావేశమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ, రిటైర్డ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులను స్వీకరించరాదని నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ నిర్ణయం ఫలితంగా తాజాగా ఫిర్యాదు చేసిన న్యాయ విద్యార్థినికి ఎలాంటి ప్రతిస్పందన లభించలేదని సమాచారం. గంగూలీపై చర్యలకు కేంద్రం సిద్ధం న్యాయ విద్యార్థినిని లైంగింకంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొటున్న సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఏకే గంగూలీపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టును కోరాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి అభిప్రాయాన్ని కోర్టుకు పంపే అంశంపై న్యాయశాఖ సలహా కోరింది. -
‘దాదా’ కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ
కోల్‌కతా: మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీని తమ పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ‘మా పార్టీలో చేరండి. లోక్‌సభ టికెట్‌తో పాటు క్రీడామంత్రి పదవి ఇస్తామ’ంటూ బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిన మర్నాడే కాంగ్రెస్ రంగంలోకి దిగింది. పార్టీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్‌ను ఆదివారం గంగూలీ ఇంటికి పంపించింది. అయితే, అది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, రాజకీయాలు చర్చకు రాలేదని ప్రదీప్ చెప్పినప్పటికీ గంగూలీని పార్టీలో చేర్చుకునే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లారని సమాచారం. మరోవైపు, గంగూలీ ఎప్పటి నుంచో తమవాడని, ఇకపైనా తమతోనే ఉంటాడని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. కాగా, బీజేపీలో చేరాలన్న ఆ పార్టీ విజ్ఞప్తిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గంగూలీ చెప్పారు. -
గ్యాస్ క్షేత్రాలను వెనక్కితీసుకోవడంపై రిలయన్స్ అభ్యంతరం
న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో తమ కాంట్రాక్ట్ పరిధిలోఉన్న ఐదు గ్యాస్ క్షేత్రాలను ప్రభుత్వం వెనక్కిలాక్కుంటుండటంపై రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం కాంట్రాక్టు ఒప్పంద ఉల్లంఘనేనని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నెల 11న చమురు శాఖకు రాసిన లేఖలో ఆర్ఐఎల్ ప్రెసిడెంట్, సీఓఓ బి. గంగూలీ ఈ విషయాన్ని పేర్కొన్నారు. కేజీ-డీ6లో మొత్తం 7,645 చదరపు కిలోమీటర్ల ప్రాంతలో 6,199 చ. కిలోమీటర్లను వెనక్కితిరిగివ్వాల్సిందేనని చమురు శాఖ అక్టోబర్ 28న రిలయన్స్‌కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆర్ఐఎల్ స్వచ్ఛందంగా తిరిగిస్తామని చెప్పిన 5,367 చ. కిలోమీటర్ల ప్రాంతంతో పోలిస్తే చమురు శాఖ ఆదేశాల్లో 15 శాతం అదనంగా ఉండటం గమనార్హం. ఈ అదనంగా తిరిగివ్వాలన్న ప్రాంతంలో డీ5, డీ7, డీ8, డీ16, డీ23 అనే అయిదు గ్యాస్ క్షేత్రాలు ఉన్నాయని, 0.805 ట్రిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ నిల్వలు ఇందులో ఉన్నట్లు ఆర్ఐఎల్ చెబుతోంది. డీ1, డీ3 ప్రధాన క్షేత్రాల్లో నిల్వలతో పోలిస్తే నాలుగింట ఒకవంతుకు సమానమని, వీటి విలువ 10 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది -
బీజేపీలో చేరండి.. టికెట్ ఇస్తాం!
సౌరబ్ గంగూలీకి మోడీ ఆఫర్ ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీని తమ పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ కోరింది. పార్టీలో చేరితే వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. సాక్షాత్తూ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీయే గంగూలీకి ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. తాము అధికారంలోకి వస్తే బెంగాల్ క్రీడా దిగ్గజానికే స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ అప్పగిస్తామని మోడీ ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో గంగూలీకి ఈ ఆఫర్ ఇవ్వడం విశేషం. కాగా, దీనిపై స్పందించిన గంగూలీ తానెలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. కొన్నాళ్లుగా తాను తీరికలేకుండా ఉన్నానని, త్వరలోనే స్పందిస్తానని బెంగాలీ దినపత్రికకు తెలిపారు. మరోపక్క, గంగూలీ గత నవంబర్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ పరిశీలకుడు వరుణ్ గాంధీతో భేటీ కావడం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్తలకు బలాన్ని చేకూర్చింది. -
గంగూలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి అశోక్‌కుమార్ గంగూలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. కోల్‌కతాకు చెందిన స్వచ్ఛంద సంస్థ భారత్ బచావో ఆందోళన్ ఈ విషయమై ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీకి లేఖ రాసింది. గంగూలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా లేఖలో కోరింది. లా ఇంటర్న్‌గా పనిచేస్తున్న యువతిని గంగూలీ లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఈ కేసు ఉన్నత స్థాయి కేసని, సాక్షులను ప్రభావితం చేసి, ఆధారాలను మాయం చేసే అవకాశముందని ఎన్జీవో ఆందోళన వ్యక్తం చేసింది. లైంగికంగా వేధింపుల ఘటన జరిగిన హోటల్ లీ మెరిడియన్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది కావడంతో ఆ పోలీస్ స్టేషన్‌కు కూడా ఎన్జీవో లేఖ రాసింది. వెంటనే స్పందించి ఆధారాలు సేకరించాలని లేఖలో కోరింది. ‘పోలీసులు అవసరమైన ఆధారాలన్నింటిని సేకరించాలి. సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకోవాల’ని లేఖలో కోరినట్లు భారత్ బచావో సంఘటన్ అధ్యక్షురాలు వినీత్ రుయా తెలిపారు. గంగూలీని అరెస్టు చేయాలనే డిమాండ్‌తో మానవ హక్కుల దినం సందర్భంగా ఈ నెల 10న ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ మానవహక్కుల సంఘం చైర్మన్ అయిన రుయా ఇదివరకే హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు కూడా లేఖ రాశారు. అంతేకాక గంగూలీ ఇంటిముందు మౌనదీక్ష కూడా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా గంగూలీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇప్పటికే రెండుసార్లు లేఖ రాశారు. సుప్రీం కోర్టు నియమించిన ముగ్గురు సభ్యులు కమిటీ కూడా గంగూలీ ప్రవర్తనను తప్పుబట్టిన విషయం తెలిసిందే. కాగా బాధితురాలు తనపట్ల జరిగిన అన్యాయాన్ని బ్లాగు ద్వారా వివరించడంతో.. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ఆమెకు లేఖ రాసిన విషయం తెలిసిందే.