
కోల్‌కతా: బలమైన జట్టున్న భారత్... గులాబీ బంతితో ఆడే డే నైట్ టెస్టునూ గెలవగలదని మాజీ సారథి సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘బంతి రంగులో మార్పు తప్ప ఇందులో తేడా ఏమీ లేదు. నాణ్యమైన ఆటగాళ్లున్న భారత్ గెలవగలదు’ అని గురువారం ఓ వాణిజ్య కార్యక్రమంలో గంగూలీ వ్యాఖ్యానించాడు.
అఫ్గానిస్తాన్‌తో చరిత్రాత్మక టెస్టు ఆడకూడదని కెప్టెన్ కోహ్లి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘జట్టేదైనా దేశానికి ఆడటం ముఖ్యమని కోహ్లి భావి స్తాడు. అలాంటివాడు కౌంటీలను ఎంచుకోవడం ఇంగ్లండ్ పర్యటనకు అతడిస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది’ అని అన్నాడు.