Actress Rupali Ganguly Joins BJP At Delhi, Says Every Indian Wants To Join Modi Sena | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ

May 1 2024 1:23 PM | Updated on May 1 2024 4:21 PM

actress Rupali Ganguly joins BJP at delhi

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఓ వైపు బీజేపీ దూసుకుపోతుంటే.. మరోవైపు పలువురు నేతలు ఆ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు. తాజాగా నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. బుధవారం ఆమె ఢిల్లీ బీజేపీ పార్టీ కార్యాలయంలో వినోద్ తావ్డే, అనిల్ బలూని సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 

బీజేపీలో చేరిన అనంతరం రూపాలీ గంగూలీ మీడియాతో మాట్లాడారు. ‘మహాయాగ్య అభివృద్ధి చేసినప్పుడు అందులో నేను కూడా భాగం కావాలని భావించాను. నేను చేసే మంచికి.. మీ దీవెనలు, మద్దతు నాకు కావాలి’ అని రూపాలీ అన్నారు.

రూపాలీ గంగూలీ దర్శకుడు అనిల్‌ గంగూలీ కుమార్తె. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా, ఆపై పలు టీవీ సీరియల్స్‌ ద్వారా ఆమె పాపులారిటీ సంపాదించుకున్నారు. బుల్లితెరపై అత్యధికంగా పారితోషకం అందుకుంటున్న నటి ఈమెనే కావడం గమనార్హం. వ్యక్తిగత జీవితానికి వస్తే.. బెంగాలీ మూలాలున్న కుటుంబమే అయినప్పటికీ రూపాలీ సినీ నేపథ్యం కారణంగా ఆమె తండ్రి ముంబైలో స్థిరపడ్డారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసి ఆపై నటన వైపు ఆమె మళ్లారు. 2013లో ఆమె అశ్విన్‌ వీ వర్మ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.

ఇక.. ఇటీవల బీజేపీలో చేరిన నటి కంగనా రనౌత్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో పోటీ  చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యే రామ్‌నివాస్‌ రావత్‌ మంగళవారం బీజేపీలో చేరారు. ప్రియాంకా గాంధీకి సన్నిహితంగా ఉండే తాజిందర్ సింగ్ బిట్టు గత నెలలో బీజేపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement