ఆసీస్‌ను 4–0తో ఓడించినా ఆశ్చర్యం లేదు: గంగూలీ
ముంబై: ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ను కోహ్లి సేన 4–0తో గెలిచినా ఆశ్చర్యం లేదని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ఈనెల 23 నుంచి భారత్‌లో ఆస్ట్రేలియా పోరు మొదలవుతంది. సినీ నటి నేహా ధూపియాతో కలిసి శనివారం ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘నా అభిప్రాయం ప్రకారం ఆసీస్‌కు ఈసారి కష్టాలు తప్పవు. కోహ్లి సేన ప్రస్తుత ఫామ్ దృష్ట్యా క్లీన్‌స్వీప్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని అన్నారు. సొంతగడ్డపై భారత్‌కు తిరుగులేదన్నారు. 25 ఏళ్ల నుంచి ఈ ఆధిపత్యం కొనసాగుతోందని వివరించారు.