టెస్టుల్లో ఆస్ట్రేలియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఆసీస్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(98 నాటౌట్), మిచెల్ మార్ష్(80) కీలక పాత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో మార్ష్,క్యారీ జట్టును అందుకున్నారు. ఆచతూచి ఆడుతూ జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే ఆఖరిలో మార్ష్ ఔట్ కావడంతో మ్యాచ్ కాస్త కివీస్ వైపు మలుపు తిరిగింది.
కానీ క్రీజులో పాతుకుపోయిన క్యారీ, కెప్టెన్ కమ్మిన్స్‌తో కలిసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సీర్స్ 4 వికెట్లు, మాట్ హెన్రీ రెండు, టిమ్ సౌథీ తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేసింది. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 372 పరుగులు చేసిన కివీస్.. ఆసీస్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
చదవండి:IPL 2024: వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment