స్కాట్ బోలాండ్ (PC: CA)
Australia Vs West Indies Test Series 2022: ఇంగ్లండ్‌తో సిరీస్ ముగించుకున్న ఆస్ట్రేలియా.. తదుపరి వెస్టిండీస్‌తో పోరుకు సిద్ధమవుతోంది. విండీస్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు సమాయత్తమైంది. ఈ క్రమంలో పెర్త్ వేదికగా బుధవారం (నవంబరు 30) ఆరంభం కానున్న మొదటి మ్యాచ్‌లో తలపడే జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా.
యాషెస్ హీరోకు మొండిచేయి!
అయితే, యాషెస్ సిరీస్‌తో అరంగేట్రం చేసి.. అదరగొట్టిన స్కాట్ బోలాండ్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. కాగా ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో బోలాండ్ ఏకంగా 18 వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు.
మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ జట్టులో ఉన్న నేపథ్యంలో ఈ పేసర్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ ఒక్క మార్పు మినహా మిగిలిన వాళ్లంతా శ్రీలంకతో సిరీస్ ఆడినవాళ్లకే ఉండటం గమనార్హం. కాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగుతుండటంతో ఫైనల్ చేరే క్రమంలో ఆసీస్‌కు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇక విండీస్‌తో తొలి టెస్టుకు తుది జట్టు కూర్పు గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘జట్టులో ఉన్న ప్రతి ఒక్కరు మెరుగైన ప్రదర్శన కనబరిచిన వాళ్లే. అందరూ ఫిట్‌గా ఉన్నారు. కాబట్టి తుది జట్టు ఎంపికలో మరీ అంత కష్టమేమీ కాలేదు’’ అని పేర్కొన్నాడు.
వెస్టిండీస్‌తో మొదటి టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు:
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లియాన్.
చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8!
SL Vs AFG: ఒకేరోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు లంక యువ క్రికెటర్లు! ఓవైపు సిరీస్ ఆడుతూనే..
Comments
Please login to add a commentAdd a comment