రెండో టెస్టులో 3 వికెట్లతో విజయం
గెలిపించిన క్యారీ, మార్ష్ , కమిన్స్
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌ను ఆ్రస్టేలియా 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. అలెక్స్ క్యారీ (98 నాటౌట్; 15 ఫోర్లు), మిచెల్ మార్ష్ (80; 10 ఫోర్లు, 1 సిక్స్) అసాధారణ పోరాటంతో రెండో టెస్టులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో కివీస్‌పై గెలిచింది. 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 77/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ 80 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయింది. దీంతో ఆసీస్ కు పరాజయం ఖాయమనిపించింది.
కానీ మార్ష్ , క్యారీ ఆరో వికెట్‌కు 140 పరుగులు జోడించడంతో మ్యాచ్ ఫలితమే మారిపోయింది. 220 స్కోరు వద్ద మార్ష్ ని్రష్కమించినా, స్టార్క్ (0) డకౌటైనా... కెపె్టన్ కమిన్స్ (32 నాటౌట్; 4 ఫోర్లు), క్యారీ అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఆసీస్‌ను గెలిపించారు. 2005 నుంచి కివీస్ గడ్డపై ఆ్రస్టేలియా వరుసగా ఏడు టెస్టుల్లో గెలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలో సంయుక్తంగా ఇది రెండో అత్యుత్తమ వరుస విజయాల ఘనత. సఫారీ గడ్డపై ఇంగ్లండ్ (1889 నుంచి 1999 వరకు) 8 వరుస టెస్టుల్లో గెలిచింది. జింబాబ్వేపై కివీస్ (2000 నుంచి ఇప్పటివరకు) వరుసగా 7 టెస్టులు గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment