cleansweep
-
PAKvBAN: క్లీన్‌స్వీప్ దిశగా బంగ్లాదేశ్
రావల్పిండి: పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసే ప్రదర్శనను వాన చినుకులు ఆటంకపరిచాయి. ఇంకా ఆఖరి రోజు ఆట మిగిలుండగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బంగ్లా ఓపెనర్లు జకీర్ హసన్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాద్మన్ ఇస్లామ్ (9 బ్యాటింగ్) చక్కని ఆరంభం ఇచ్చారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 9/2తో నాలుగో రోజు సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఆట మొదలైన కొద్దిసేపటి తర్వాత ఓపెనర్ అయూబ్ (20; 3 ఫోర్లు), కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు), అనుభవజు్ఞడైన బాబర్ ఆజమ్ (11; 1 ఫోర్) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. టస్కిన్ అహ్మద్ ఓవర్లో అయూబ్ ని్రష్కమించగా, యువ సీమర్ నహిద్ రాణా... మసూద్, బాబర్‌లతో పాటు సౌద్ షకీల్ (2)ల వికెట్లను పడగొట్టాడు. దీంతో 21వ ఓవర్లలో 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్ (73 బంతుల్లో 43; 5 ఫోర్లు), సల్మాన్ ఆగా (71 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఏడో వికెట్‌కు 55 పరుగులు జోడించాక రిజ్వాన్‌ను హసన్ మహ్ముద్ అవుట్ చేయడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. హసన్, నహిద్ టెయిలెండర్ల పనిపట్టడంతో పాక్ ఆలౌటయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. రెండో టెస్టు ఆడుతున్న 24 ఏళ్ల పేసర్ హసన్ మహ్ముద్ (5/43), మూడో టెస్టు ఆడుతున్న 21 ఏళ్ల సీమర్ నహిద్ రాణా (4/44) పాక్‌ను చావుదెబ్బ కొట్టారు. 12 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని బంగ్లా ముందు 185 పరుగుల లక్ష్యం ఉండగా... వర్షంతో ఆట నిలిచే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 42 పరుగులు చేసింది. ఓపెనర్లు జకీర్ హసన్, ఇస్లామ్ అజేయంగా క్రీజులో ఉన్నారు. వర్షం వల్ల నాలుగో రోజు కేవలం 50 ఓవర్ల ఆటే సాధ్యమైంది. ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. -
Exit Poll 2024: భారీ మెజార్టీతో ఎన్డీఏ హ్యాట్రిక్
ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయమని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని మెజా రిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ యూపీలో స్థానాలను పెంచుకోవడంతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో క్లీన్‌స్వీప్ చేస్తుందని కర్ణాటకలో హవా కొనసాగించడమే గాక బెంగాల్లో చొచ్చుకుపోతుందని చెప్పాయి. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి 150 మార్కు దాటొచ్చని తెలిపాయి. న్యూఢిల్లీ: కేంద్రంలో పాలక ఎన్డీఏ కూటమిదే మళ్లీ అధికారమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కూటమి హ్యాట్రిక్ కొట్టడం, నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అభిప్రాయపడ్డాయి. శనివారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ముగుస్తూనే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో మరోసారి బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని వాటిలో చాలావరకు పేర్కొన్నాయి. కర్నాటకలో కూడా బీజేపీ హవాయే కొనసాగుతుందని, పశ్చిమబెంగాల్లో మరింతగా చొచ్చుకుపోతుందని వెల్లడించడం విశేషం. బిహార్, రాజస్తాన్, హరియాణాల్లో మాత్రం ఎన్డీఏకు సీట్లు కాస్త తగ్గుతాయని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విపక్షాల అవకాశవాద రాజకీయాలను జనం పూర్తి గా తిరస్కరించారన్నారు. వాస్తవ ఫలితాల్లో తమకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి వస్తాయని ధీమా వెలిబుచ్చారు. కాంగ్రెస్ మాత్రం ఎగ్జిట్ పోల్స్‌ను మోదీ ప్రభావితం చేశారని ఆరోపించింది. వాస్తవ ఫలితాలు చాలా భిన్నంగా రాను న్నాయని విశ్వాసం వెలిబుచి్చంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో ఇప్పుడిక అందరి కళ్లూ జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు జరిగాక రాబోయే అసలు ఫలితాలపైనే కేంద్రీకృతమయ్యాయి. ఏ సర్వే ఏం చెప్పింది...? ఇండియాటుడే–మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ ఎన్డీఏకు 361 నుంచి 401 స్థానాలిచి్చంది. ఇండియా కూటమికి 131 నుంచి గరిష్టంగా 166 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 368 దాకా వస్తాయని రిపబ్లిక్ భారత్–మారై్టజ్ సర్వే పేర్కొంది. ఇండియా కూటమికి 133, ఇతరులకు 48 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 392 దాకా, ఇండియాకు 161, ఇతరులకు 20 దాకా రావచ్చని జన్ కీ బాత్ అభిప్రాయపడింది. ఎన్డీఏకు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న మేరకు 401 స్థానాలు దక్కుతాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ అంచనా వేయడం విశేషం. ఇండియా కూటమికి 139, ఇతరులకు 38 స్థానాలు రావచ్చని తెలిపింది. టుడేస్ చాణక్య కూడా కూడా ఎన్డీఏకు 385 నుంచి ఏకంగా 415 సీట్లిచి్చంది! ఇండియా కూటమి 96 నుంచి 118 మధ్య సాధిస్తుందని పేర్కొంది. న్యూస్ నేషన్ ఎన్డీఏకు 378, ఇండియా కూటమికి 169 స్థానాలిచి్చంది. దైనిక్ భాస్కర్ ఎన్డీఏ కూటమికి 350 దాకా, ఇండియా కూటమికి గరిష్టంగా 201, ఇతరులకు 49 సీట్లిచి్చంది. రిపబ్లిక్ టీవీ సర్వేలో ఎన్డీఏకు 359, ఇండియాకు 154, ఇతరులకు 30 స్థానాలొచ్చాయి. ఏబీపీ న్యూస్–సీ వోటర్ ఎన్డీఏకు 353–383, ఇండియాకు 152 నుంచి 182 సీట్లిచ్చింది. ఎన్డీఏకు 371, ఇండియాకు 125 రావచ్చని ఇండియా న్యూస్ పేర్కొంది. టైమ్స్ నౌ–ఈటీజీ సర్వే ఎన్డీఏకు 358, ఇండియా కూటమికి 152 స్థానాలిచ్చింది. రాష్ట్రాల్లో ఇలా... కేంద్రంలో అధికార సాధనకు అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పై బీజేపీ మరోసారి పట్టు నిలుపుకుంటోందని సర్వేలన్నీ తెలిపాయి. బీజేపీకి యూపీలో ఏకంగా 67 సీట్ల దాకా రావచ్చని ఇండియాటుడే వెల్లడించింది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ సింగిల్ డిజిట్లకే పరిమితమవుతాయని తెలిపింది. కర్నాటకలో ఈసారి కూడా బీజేపీకి 23, భాగస్వామి జేడీ(యూ)కు 3 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక పశి్చమబెంగాల్లోనైతే పాలక తృణమూల్ కాంగ్రెస్‌ను తోసిరాజని 23 నుంచి 27 స్థానాలతో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో అతి పెద్ద పారీ్టగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇండియాటుడే అయితే బెంగాల్లో బీజేపీకి 30 పై చిలుకు, తృణమూల్‌కు 11 నుంచి 12 స్థానాలివ్వడం విశేషం. కీలకమైన మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి సీట్లు 2019తో పోలిస్తే కాస్త తగ్గి 30 నుంచి 32 దాకా రావచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.సర్వత్రా ఆసక్తి నెలకొన్న ఒడిశాలోనైతే 21 సీట్లకు గాను ఎన్డీఏకు ఏకంగా 18 నుంచి 20 వస్తాయని, అధికార బిజూ జనతాదళ్ ఒకట్రెండు సీట్లకు మించబోదని ఇండియాటుడే పేర్కొనడం విశేషం. దక్షిణాదిన కేరళలోనూ తొలిసారి కమలవికాసం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అక్కడ బీజేపీకి 3 సీట్ల దాకా ఖాయమని పేర్కొన్నాయి. లెఫ్ట్ ఫ్రంట్ కుదేలవుతుందని, కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు వస్తాయని తెలిపాయి. రాజస్తాన్, బిహార్లలో ఎన్డీఏకు ఐదారు స్థానాలు తగ్గి ఆ మేరకు ఇండియా కూటమికి పెరగవచ్చని పేర్కొన్నాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే గాక మెజారిటీ లోక్‌సభ స్థానాలూ నెగ్గుతుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్, ఎన్డీఏ కూటమిదే విజయమని మరికొన్ని పేర్కొన్నాయి. తెలంగాణలో బీజేపీకే ఎక్కువ లోక్‌సభ స్థానాలొస్తాయని తెలిపాయి.2019లో ఏం జరిగింది?2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ గెలుస్తుందనే జోస్యం చెప్పాయి. మొత్తం 13 ఎగ్జిట్ పోల్స్ సగటును చూస్తే ఎన్డీఏకు 306, యూపీఏకు 120 సీట్లొస్తాయని పేర్కొన్నాయి. చివరికి ఎన్డీఏకు 353 స్థానాలు రాగా యూపీఏ కేవలం 93 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి సొంతంగానే 303 స్థానాలు రాగా కాంగ్రెస్ కేవలం 53 సీట్లు నెగ్గింది. -
Lok Sabha Election 2024: మోదీ, షా కంచుకోటలో... కాంగ్రెస్‌కు పెనుసవాల్
దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో శుక్రవారం మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కీలకమైన రాష్ట్రం గుజరాత్లో మొత్తం స్థానాలకూ ఇదే విడతలో పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్లో గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్స్వీప్చేసింది. అదే ఊపులో ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అంతకంతకూ చిక్కిపోతున్న కాంగ్రెస్ ఈసారి ఆప్‌తో కలిసి ‘ఇండియా’ కూటమి కింద బీజేపీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కీలక లోక్‌సభ స్థానాలపై ఫోకస్... వదోదర... కొత్త ముఖాలు గుజరాత్లో మూడో అతి పెద్ద నగరమిది. ఇక్కడ వరుసగా రెండు ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొందిన రంజన్‌బెన్ ధనంజయ్ భట్‌ను బీజేపీ అనూహ్యంగా పక్కనబెట్టింది. డాక్టర్ హేమంగ్ జోషీని పార్టీ బరిలో నిలిపింది. కాంగ్రెస్ తరఫున పధియార్ జస్పాల్సింగ్ మహేంద్రసింగ్ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ కొత్తవారే కావడం విశేషం. ఈ సీటు 1998 నుంచి బీజేపీ గుప్పిట్లోనే ఉంది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంతో మరోసారి నెగ్గుతామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 7 సెగ్మెంట్లలో 6 బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. మిగతా చోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. 2014లో మోదీ లోక్‌సభ అరంగేట్రం వారణాసి, వదోదరల నుంచే జరగడం తెలిసిందే. ఇక్కడ ఆయనకు ఏకంగా 5.7 లక్షల మెజారిటీ లభించింది. వారణాసి నుంచి ఎంపీగా కొనసాగి వదోదరను వదులుకున్నారు. రాజ్‌కోట్... రూపాలాకు రాజ్‌పుత్ గండం గుజరాత్లో ఎదురే లేని కమలనాథులకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. సిట్టింగ్ ఎంపీ మోహన్ కుందరియాను కాదని బీజేపీ ఆయనకు టికెటిచి్చంది. కానీ ‘మహారాజులు బ్రిటి‹Ùవారికి, విదేశీ పాలకులకు లొంగిపోయారని, వారితో విందువినోదాల్లో మునగడమే గాక వాళ్లకు తమ కుమార్తెలనిచ్చి పెళ్లిళ్లు చేశా’రని రాజ్‌పుత్‌లపై రూపాలా చేసిన వ్యాఖ్యలతో ఆ సామాజికవర్గం భగ్గుమంది. ఆయన్ను రాజ్‌కోట్ బరి నుంచి తప్పించాలని, లేదంటే ఓడించి తీరుతామని బీజేపీకి వారు అలి్టమేటమిచ్చారు! ఆందోళనలు కూడా చేశారు. రూపాలా పలుమార్లు క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పరేశ్‌బాయ్ ధనాని పోటీలో ఉన్నారు. రాజ్‌పుత్‌లు, పటీదార్లు, మధ్య ఎప్పటినుంచో వైరముంది. పటీదార్ సామాజికవర్గానికి చెందిన రూపాలా దానికిలా ఆజ్యం పోయడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.భావనగర్.. బరిలో ఆప్ ఈ స్థానంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేసింది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా భావనగర్, బరుచ్‌లను ఆ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ గట్టి పట్టున్న బీజేపీని ఢీకొట్టేందుకు ఉమేశ్‌బాయ్ నరన్‌బాయ్ మక్వానాను పోటీకి దించింది. బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీ భారతీబెన్ ధీరూబాయ్ శియాల్‌ను పక్కనబెట్టి నింబూబెన్ బంభానియాకు టికెటిచి్చంది. 1991 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. గత ఎన్నికల్లో భారతీబెన్‌కు 4.29 లక్షల మెజారిటీ లభించింది. ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. మిగతా స్థానం ఆప్‌ది కావడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి 5 సీట్లు నెగ్గిన ఆప్ లోక్‌సభ బరిలో బీజేపీకి సవాలు విసురుతోంది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రచారంతో హోరెత్తిస్తోంది. కేజ్రీవాల్ భార్య సునీత కూడా ప్రచారానికి దిగారు. పోర్బందర్.. మన్సుఖ్ అరంగేట్రం బీజేపీకి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2012 నుంచీ రాజ్యసభకు ఎన్నికవుతున్న ఆయన పోటీతో పోర్‌బందర్‌పై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేశ్‌బాయ్ ధడక్ చేతిలో 2.3 లక్షల ఓట్ల తేడాతో ఓడిన లలిత్ వసోయాకే కాంగ్రెస్ మళ్లీ టికెటిచి్చంది. ఈ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కుతియానాలో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ గెలిచింది. బనస్కాంత.. గెనీబెన్ సవాల్ ఉత్తర గుజరాత్‌లోని ఈ స్థానంలో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ‘వావ్’ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గెనీబెన్ ఠాకోర్‌ను కాంగ్రెస్ బరిలోకి దించడమే అందుకు కారణం. దాంతో బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీ పర్వత్‌బాయ్ పటేల్‌ను కాదని ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రేఖా బెన్ చౌదరి రూపంలో మహిళకే టికెటివ్వాల్సి వచ్చింది. ఆమెకు రాజకీయ అనుభవం లేదు. తొలిసారి ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గుజరాత్లో ఇరు పారీ్టల నుంచీ మహిళలే రంగంలో ఉన్న ఏకైక సీటు కావడంతో బనస్కాంత అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీని పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు చోట్ల గెలిచింది. అయితే గెనీబెన్ కమలం హవాలో కూడా విజయం సాధించి ‘వావ్’ అనిపించారు. రేఖాబెన్‌కు రాజకీయ అనుభవం లేకున్నా నియోజకవర్గంతో సత్సబంధాలున్నాయి. బనస్ డెయిరీ ఈ నియోజకవర్గంలోని 4.5 లక్షల మంది రైతుల నుంచి రోజూ పాలు సేకరిస్తుంది. దీని వ్యవస్థాపకుడు గల్బాబాయ్ చౌదరి మనుమరాలు రేఖ. ఆమె భర్త హితేశ్ చౌదరి బీజేపీ నాయకుడు. అయినా గెనీబెన్ వంటి బలమైన ప్రత్యరి్థపై రేఖ వంటి కొత్త ముఖాన్ని నిలబెట్టడంపై బీజేపీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి నెలకొందని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి!గాంధీనగర్.. అద్వానీ కోటలో షా పాగా! ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటైన ఈ నియోజకవర్గం 1989 నుంచి కమలనాథుల గుప్పిట్లోనే ఉంది. శంకర్ సింఘ్ వాఘేలా, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ వంటి హేమాహేమీలకు నెలవైన ఈ స్థానంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ దిగ్గజం అమిత్ షా పాగా వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 5,57,014 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. ఈసారి మెజారిటీ మరింత పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి! చివరకు 62 ఏళ్ల సోనల్ పటేల్‌ను రంగంలోకి దించింది. ఆమె ఏఐసీసీ సెక్రటరీగా. ముంబై, పశి్చమ మహారాష్ట్ర ఇన్చార్జిగా ఉన్నారు. గిఫ్ట్ సిటీ అభివృద్ధి, గాంధీ సబర్మతి ఆశ్రమానికి మెరుగులు, అయోధ్య రామ మందిరం, మోదీ ఫ్యాక్టర్ తదితరాలతో తనకు తిరుగులేదని షా ధీమాతో ఉన్నారు. గాం«దీనగర్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలూ బీజేపీవే! సీఎం భూపేంద్ర పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఘట్లోడియా కూడా వాటిలో ఒకటి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
NZ vs AUS 2nd Test: ఆసీస్ అద్భుతం
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌ను ఆ్రస్టేలియా 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. అలెక్స్ క్యారీ (98 నాటౌట్; 15 ఫోర్లు), మిచెల్ మార్ష్ (80; 10 ఫోర్లు, 1 సిక్స్) అసాధారణ పోరాటంతో రెండో టెస్టులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో కివీస్‌పై గెలిచింది. 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 77/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ 80 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయింది. దీంతో ఆసీస్ కు పరాజయం ఖాయమనిపించింది. కానీ మార్ష్ , క్యారీ ఆరో వికెట్‌కు 140 పరుగులు జోడించడంతో మ్యాచ్ ఫలితమే మారిపోయింది. 220 స్కోరు వద్ద మార్ష్ ని్రష్కమించినా, స్టార్క్ (0) డకౌటైనా... కెపె్టన్ కమిన్స్ (32 నాటౌట్; 4 ఫోర్లు), క్యారీ అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఆసీస్‌ను గెలిపించారు. 2005 నుంచి కివీస్ గడ్డపై ఆ్రస్టేలియా వరుసగా ఏడు టెస్టుల్లో గెలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలో సంయుక్తంగా ఇది రెండో అత్యుత్తమ వరుస విజయాల ఘనత. సఫారీ గడ్డపై ఇంగ్లండ్ (1889 నుంచి 1999 వరకు) 8 వరుస టెస్టుల్లో గెలిచింది. జింబాబ్వేపై కివీస్ (2000 నుంచి ఇప్పటివరకు) వరుసగా 7 టెస్టులు గెలిచింది. -
టీమిండియా చేతిలో కివీస్ క్లీన్‌స్వీప్.. వన్డే సిరీస్ మనదే
ఇండోర్: మళ్లీ భారత బ్యాట్లు గర్జించాయి. న్యూజిలాండ్ బంతులు డీలా పడ్డాయి. దీంతో పరుగుల తుఫాన్లో కివీస్ క్లీన్‌స్వీప్ అయ్యింది. ఫలితంగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 3–0తో దక్కించుకుంది. అంతేకాకుండా వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి రోహిత్ శర్మ బృందం మూడో స్థానం నుంచి మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది. మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుబ్‌మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. తర్వాత న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు శార్దుల్‌కు దక్కగా... శుబ్‌మన్ గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం అందుకున్నాడు. ఓపెనర్ల ధనాధన్ ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్లు రోహిత్, గిల్ కష్టమైన బంతిని, ఓవర్‌ను గౌరవిస్తూ... అదుపు తప్పిన బంతులకు బౌండరీనే శిక్షగా విధించారు. డఫీ ఐదో ఓవర్లో గిల్, రోహిత్ చెరో సిక్సర్ బాదారు. ఫెర్గూసన్ 8వ ఓవర్‌ను గిల్ 4, 0, 4, 4, 6, 4లతో చితగ్గొట్టాడు. ఏకంగా 22 పరుగుల్ని పిండుకున్నాడు. డఫీ పదో ఓవర్లో రోహిత్ ఒక బౌండరీ రెండు సిక్స్‌లు బాదాడు. ఓపెనర్ల ధాటికి భారత్ స్కోరు 12.4 ఓవర్లలో వంద దాటింది. గిల్ 33 బంతుల్లో (8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ 41 బంతుల్లో (4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. కానీ కివీస్ బౌలర్లే జోడీని విడగొట్టలేకపోయారు. ఓవర్‌కు 8 పైచిలుకు పరుగుల రన్‌రేట్‌తో భారత్ 24.1 ఓవర్లోనే 200 పరుగుల మైలురాయి చేరుకుంది. ఆ వెంటనే రోహిత్ 83 బంతుల్లో, గిల్ 72 బంతుల్లో శతకాలు పూర్తిచేసుకున్నారు. రోహిత్‌ను బౌల్డ్ చేసి బ్రేస్‌వెల్ 212 పరుగుల ఓపెనింగ్ వికెట్ కు తెరదించాడు. కాసేపటికే గిల్ జోరుకు టిక్నెర్ చెక్ పెట్టాడు. తర్వాత కోహ్లి (36; 3 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ (17; 1 ఫోర్, 1 సిక్స్), సూర్య (14; 2 సిక్సర్లు) విఫలమయ్యారు. పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), శార్దుల్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) అండతో చెలరేగాడు. కాన్వే సెంచరీ వృథా న్యూజిలాండ్ ఖాతా తెరువక ముందే అలెన్ (0)ను పాండ్యా డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ కాన్వే ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. నికోల్స్ (42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండతో సిక్సర్లతో మెరిపించాడు. నికోల్స్ ఆటను కుల్దీప్ ముగించగా.. ఆ తర్వాత మిచెల్ (24; 2 ఫోర్లు), లాథమ్ (0), ఫిలిప్స్ (5)లు శార్దుల్ పేస్‌కు తలవంచారు. కాన్వే 71 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతన్ని ఉమ్రా న్ అవుట్ చేశాడు. బ్రేస్‌వెల్ (26; 3 ఫోర్లు, 1 సిక్స్), సాన్‌ట్నర్ (34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు క్రీజులో నిలిచారు. 30: వన్డేల్లో రోహిత్ శర్మ సెంచరీలు. అత్యధిక శతకాలు చేసిన క్రికెటర్ల జాబితాలో పాంటింగ్‌తో కలిసి రోహిత్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ (49), కోహ్లి (46) టాప్–2లో ఉన్నారు. 360: న్యూజిలాండ్‌తో సిరీస్‌లో గిల్ చేసిన రన్స్. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా బాబర్ ఆజమ్ (పాక్; 2016లో విండీస్‌పై) పేరిట ఉన్న రికార్డును గిల్ సమం చేశాడు. 19: న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో భారత బ్యాటర్ల సిక్స్‌ల సంఖ్య. 2013లో ఆస్ట్రేలియాపై కూడా భారత్ 19 సిక్స్‌లు కొట్టింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) బ్రేస్‌వెల్ 101; గిల్ (సి) కాన్వే (బి) టిక్నెర్ 112; కోహ్లి (సి) అలెన్ (బి) డఫీ 36; ఇషాన్ (రనౌట్) 17; సూర్యకుమార్ (సి) కాన్వే (బి) డఫీ 14; పాండ్యా (సి) కాన్వే (బి) డఫీ 54; సుందర్ (సి) మిచెల్ (బి) టిక్నెర్ 9; శార్దుల్ (సి) లాథమ్ (బి) టిక్నెర్ 25; కుల్దీప్ (రనౌట్) 3; ఉమ్రాన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 385. వికెట్ల పతనం: 1–212, 2–230, 3–268, 4–284, 5–293, 6–313, 7–367, 8–379, 9–385. బౌలింగ్: డఫీ 10–0–100–3, ఫెర్గూసన్ 10–1–53–0, టిక్నెర్ 10–0–76–3, సాన్‌ట్నర్ 10–0–58–0, మిచెల్ 4–0–41–0, బ్రేస్‌వెల్ 6–0–51–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (బి) పాండ్యా 0; కాన్వే (సి) రోహిత్ (బి) ఉమ్రాన్ 138; నికోల్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 42; మిచెల్ (సి) ఇషాన్ (బి) శార్దుల్ 24; లాథమ్ (సి) పాండ్యా (బి) శార్దుల్ 0; ఫిలిప్స్ (సి) కోహ్లి (బి) శార్దుల్ 5; బ్రేస్‌వెల్ (స్టంప్డ్) ఇషాన్ (బి) కుల్దీప్ 26; సాన్‌ట్నర్ (సి) కోహ్లి (బి) చహల్ 34; ఫెర్గూసన్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 7; డఫీ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 0; టిక్నెర్ (నా టౌట్) 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (41.2 ఓవర్లలో ఆలౌట్) 295. వికెట్ల పతనం: 1–0, 2–106, 3–184, 4–184, 5–200, 6–230, 7–269, 8–279, 9–280, 10–295. బౌలింగ్: పాండ్యా 6–0–37–1, సుందర్ 6–0–49–0, శార్దుల్ 6–0–45–3, ఉమ్రాన్ 7–0–52–1, కుల్దీప్ 9–0–62–3, చహల్ 7.2–0–43–2. -
జులన్‌కు క్లీన్‌స్వీప్ కానుక
లండన్: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి కెరీర్ విజయంతో ముగిసింది. ఇంగ్లండ్ జట్టుతో శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా 16 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 3–0తో నెగ్గి కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన 39 ఏళ్ల జులన్ గోస్వామికి క్లీన్‌స్వీప్ కానుకగా ఇచ్చింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 45.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (50; 5 ఫోర్లు), దీప్తి శర్మ (68 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను స్మృతి, దీప్తి శర్మ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు వీరిద్దరు 58 పరుగులు జత చేశారు. స్మృతి అవుటయ్యాక ఒకవైపు వికెట్లు పడుతుంటే మరోవైపు దీప్తి పట్టుదలతో ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో కేటీ క్రాస్ (4/26), ఫ్రేయా కెంప్ (2/24), ఎకిల్‌స్టోన్ (2/27) రాణించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామి బ్యాటింగ్‌లో ‘డకౌట్’కాగా... బౌలింగ్‌లో 10 ఓవర్లలో మూడు మెయిడెన్లు వేసి 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (4/29), స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ (2/38) కూడా ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. మొత్తం 340 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. 355: జులన్ గోస్వామి మూడు ఫార్మాట్లలో కలిపి తీసిన వికెట్ల సంఖ్య. జులన్ 12 టెస్టుల్లో 44 వికెట్లు... 204 వన్డేల్లో 255 వికెట్లు... 68 టి20ల్లో 56 వికెట్లు పడగొట్టింది. 7: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత జట్టుకిది ఏడోసారి (బంగ్లాదేశ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లపై ఒకసారి... శ్రీలంకపై మూడుసార్లు). ఇంగ్లండ్‌పై తొలిసారి. -
ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్, వరుసగా ఆరో విజయం
గాలె: స్పిన్నర్ల మాయాజాలంతో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గి రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక నిర్దేశించిన 164 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. డామ్ సిబ్లీ (56 నాటౌట్; 2 ఫోర్లు), జాస్ బట్లర్ (46; 5 ఫోర్లు) ఐదో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు జోడించి మరో రోజు ఆట మిగిలిఉండగానే జట్టును గెలిపించారు. శ్రీలంక గడ్డపై ఇంగ్లండ్‌కిది వరుసగా ఆరో టెస్టు విజయం కావడం విశేషం. విదేశీ గడ్డపై ఆతిథ్య జట్టుపై ఇంగ్లండ్ వరుసగా ఆరు టెస్టుల్లో గెలుపొందడం ఇదే ప్రథమం. శ్రీలంకలో 2012లో ఒక టెస్టు నెగ్గిన ఇంగ్లండ్... 2018 పర్యటనలో ఆడిన మూడు టెస్టుల్లోనూ గెలిచింది. తాజా పర్యటనలో ఆడిన రెండు టెస్టుల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆట నాలుగోరోజు సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 339/9తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ మరో 5 పరుగులు జోడించి 344 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో శ్రీలంకకు 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను ఇంగ్లండ్ స్పిన్నర్లు డామ్ బెస్ (4/49), జాక్ లీచ్ (4/59), జో రూట్ (2/0) దెబ్బతీశారు. ఈ ముగ్గురి ధాటికి లంక 35.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు ఇంగ్లండ్ పేసర్లు తీయగా... రెండో ఇన్నింగ్స్‌లోని 10 వికెట్లను స్పిన్నర్లు తీయడం విశేషం. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి. -
మళ్లీ సీఎం పీఠంపై కేజ్రీవాల్?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కూడా కమలం కలలు కల్లలేనా? దేశానికి మోదీ, రాష్ట్రానికి కేజ్రీవాల్ అని ఓటర్లు ఫిక్సయిపోయారా? జాతీయవాదాన్ని అభివృద్ధి, ఉచిత పథకాల ఎజెండా అధిగమించిందా? మరోసారి ఆప్ కీ సర్కార్ అనే రాజధాని ఓటర్లు నినదించారా? కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయిందా?.. ఈ ప్రశ్నలన్నింటికీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. ఢిల్లీ ప్రజలు మరోసారి ఆప్కే పట్టం కడతారని ఎగ్జిట్‌పోల్స్ తేల్చి చెప్పాయి. అయితే, 2015 ఎన్నికల మాదిరిగా భారీ స్థాయి మెజార్టీ రాకపోవచ్చునని అంచనా వేశాయి. వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సమీక్షించి చూస్తే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 40 నుంచి 50 స్థానాలను గెలుచుకోవచ్చునని, బీజేపీకి 10 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక చతికిలపడుతుందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభ సమయంలో ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందని భావించారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 7 స్థానాలను స్వీప్ చేయడం, కాంగ్రెస్ ఓట్ల శాతంలో రెండో స్థానంలో నిలవడంతో ఈసారి ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. కమలదళం మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే జాతీయ భద్రత, అయోధ్యలో రామాలయ నిర్మాణం, కశ్మీర్లో 370 ఆర్టికల్ వంటి అంశాలనే ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. ప్రధానంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో జరుగుతున్న నిరసనల్ని పదే పదే ప్రస్తావించి, వారికి మద్దతిచ్చిన వాళ్లని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సీఎం కేజ్రీవాల్ మాత్రం తన సొంత సంక్షేమ ఎజెండాతోనే ముందుకు వెళ్లారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా అయిదేళ్లలో తాను చేసిన సుపరిపాలననే నమ్ముకుని సంయమనంతో వ్యవహరించారు. షహీన్‌బాగ్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ‘మీరు గెలిస్తే సీఎం ఎవరు’అంటూ సవాల్ విసిరారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నెలకు 20 వేల లీటర్లు ఉచితంగా నీళ్లు వంటివి కేజ్రీవాల్‌పై క్రేజ్‌ను ఏ మాత్రం తగ్గించలేదని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు పోటీకి అంగీకరించకుండా, వారి బంధువులకే టిక్కెట్లు ఇప్పించుకోవడం, గాంధీ కుటుంబం ఆఖరి నిమిషంలో తూతూ మంత్రంగా ప్రచారం చేయడం వంటివి ఆప్‌కి కలిసి వస్తాయన్న అభిప్రాయం ఉంది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? ఢిల్లీ ప్రజల అసలైన నాడిని పట్టుకోగలిగాయా? అన్నది 11న వచ్చే ఫలితాల్లో తేలిపోనుంది. మెజారిటీ మాదే: ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఆప్ వైపే మొగ్గుచూపుతుండగా బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ మాత్రం.. తమ పార్టీ క్లీన్‌స్వీప్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటరు నాడిని అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయని పేర్కొన్నారు. 48 సీట్లు గెలుచుకుని ఢిల్లీలో అధికారం చేపడుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీ రానుందని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులను ఆయన ట్విట్టర్ ద్వారా అభినందించారు. -
అమ్మాయిలూ అదరగొట్టారు
వడోదర: టెస్టుల్లో పురుషుల జట్టు దక్షిణాఫ్రికాను కంగుతినిపిస్తుంటే... వన్డేల్లో భారత మహిళల జట్టు కూడా సఫారీని చిత్తు చిత్తు చేస్తోంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మిథాలీ బృందం 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ చేతిలో దక్షిణాఫ్రికా వైట్‌వాష్ కావడం ఇదే మొదటిసారి. సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ తక్కువ స్కోరునే కాపాడుకొని 6 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 45.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్ నుంచి టెయిలెండర్ల వరకు ఇద్దరు మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. హర్మన్‌ప్రీత్ కౌర్ (76 బంతుల్లో 38; 5 ఫోర్లు), శిఖా పాండే (40 బంతుల్లో 35; 6 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. సఫారీ బౌలర్లలో మరిజన్నె కప్ 3, షబ్నమ్, అయబొంగ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 48 ఓవర్లలో 140 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత స్పిన్నర్లు ఏక్తా బిష్త్ 3, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ చెరో 2 వికెట్లు తీశారు. మిథాలీకి ‘వంద’నం... తాజా గెలుపుతో హైదరాబాద్ క్రికెటర్, భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 100 విజయాలు సాధించిన రెండో కెప్టెన్‌గా గుర్తింపు పొందింది. 20 ఏళ్ల క్రికెట్ కెరీర్లో మిథాలీ రాజ్ తన సారథ్యంలో భారత్‌కు వందో విజయాన్ని (వన్డేల్లో 80+టి20ల్లో 17+టెస్టుల్లో 3) అందించింది. చార్లోట్ ఎడ్వర్డ్స్ (142; ఇంగ్లండ్) మాత్రమే మిథాలీ కంటే ముందుంది. -
న్యూజిలాండ్‌పై భారత్ హ్యాట్రిక్
బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత పురుషుల జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ 4–0తో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (8వ ని.లో), సురేందర్ కుమార్ (15వ ని.లో), మన్దీప్ సింగ్ (44వ ని.లో), ఆకాశ్‌దీప్ సింగ్ (60వ ని.లో) ఒక్కోగోల్ చేశారు. తొలి క్వార్టర్లో వచ్చిన రెండో పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రూపిందర్ భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించాడు. ఈ సిరీస్‌లో రూపిందర్‌కు ఇది నాలుగో గోల్ కావడం విశేషం. అనంతరం రూపిందర్ ఇచ్చిన పాస్‌ను ప్రత్యర్థి గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ సురేందర్ గోల్ పోస్ట్‌లోకి పంపి ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. మూడో క్వార్టర్లో వెటరన్ ప్లేయర్ సర్దార్ సింగ్ ఇచ్చిన చక్కటి పాస్‌ను మన్దీప్ గోల్‌గా మలిచాడు. మరి కొద్ది క్షణాల్లో ఆట ముగుస్తుందనగా ఆకాశ్‌దీప్ మరో గోల్‌తో భారత్‌కు విజయాన్నందించాడు. -
పాకిస్తాన్ క్లీన్ స్వీప్
బులవాయో: జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి వన్డేలో 131 పరుగుల తేడాతో జయభేరి మోగించిన పాక్ ఐదు వన్డేల సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇమామ్–ఉల్–హఖ్ (105 బంతుల్లో 110; 8 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (76 బంతుల్లో 106 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇమామ్‌కు ఈ సిరీస్‌లో ఇది మూడో సెంచరీ. మరో ఓపెనర్ ఫఖర్ జమాన్ (83 బంతుల్లో 85; 10 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఇమామ్ తొలి వికెట్‌కు 168 పరుగులు జతచేసి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. ఓపెనింగ్ జోడీ వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఈ సిరీస్‌లో ఇది నాలుగోసారి. మూడు రోజుల క్రితం నాలుగో వన్డేలో డబుల్ సెంచరీతో అదరగొట్టిన ఫఖర్ జమాన్ ఈ మ్యాచ్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ ఆరో ఓవర్ చివరి బంతికి బౌండరీ బాది వన్డేల్లో వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. వెయ్యి పరుగులు చేయడానికి ఫఖర్ 18 ఇన్నింగ్స్‌లు ఆడాడు. గతంలో ఈ రికార్డు విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ (21 ఇన్నింగ్స్‌లలో) పేరిట ఉంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 233 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌కు మంచి ఆరంభాలే లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. కెప్టెన్ మసకద్జా (34), కమున్హుకమ్వే (34), ప్రిన్స్ మస్వౌర్ (39), ముర్రే (47), మూర్ (44 నాటౌట్), చిగుంబురా (25 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, నవాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బాబర్ ఆజమ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ఫఖర్ జమాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. -
టి20 సిరీస్ నూ క్లీన్ స్వీప్ చేశారు
రాంచీ: శ్రీలంక మహిళలతో జరిగిన టి20 క్రికెట్ సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్ లో లంకను మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. కౌశల్య(25), జయాంగిని(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బిష్త్ 3, పాటిల్ 2 వికెట్లు పడగొట్టారు. 90 పరుగుల టార్గెట్ ను 37 బంతులు మిగిలుండగానే వికెట్ నష్టపోయి భారత్ చేరుకుంది. 13.5 ఓవర్లలో 91 పరుగులు చేసింది. మంధన 43, వనిత 34, వేద కృష్ణమూర్తి 13 పరుగులు చేశారు. అంతకుముందు శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను మిథాలీ సేన క్లీన్ స్వీప్ చేసింది.