Lok Sabha Election 2024: మోదీ, షా కంచుకోటలో... కాంగ్రెస్‌కు పెనుసవాల్‌ Lok Sabha Elections 2024: PM Narendra Modi And Amit Shah To Cast Vote In Ahmedabad, Details Inside | | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: మోదీ, షా కంచుకోటలో... కాంగ్రెస్‌కు పెనుసవాల్‌

Published Tue, May 7 2024 12:31 AM

Lok sabha elections 2024: PM Narendra Modi, Amit Shah to Cast Vote in Ahmedabad

గుజరాత్‌లో  25 స్థానాలకు నేడే పోలింగ్‌ 

స్టేట్‌స్కాన్‌

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో శుక్రవారం మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కీలకమైన రాష్ట్రం గుజరాత్‌లో మొత్తం స్థానాలకూ ఇదే విడతలో పోలింగ్‌ జరగనుంది. 

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్‌చేసింది. అదే ఊపులో ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అంతకంతకూ చిక్కిపోతున్న కాంగ్రెస్‌ ఈసారి ఆప్‌తో కలిసి ‘ఇండియా’ కూటమి కింద బీజేపీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కీలక లోక్‌సభ స్థానాలపై ఫోకస్‌...                  

వదోదర... కొత్త ముఖాలు 
గుజరాత్‌లో మూడో అతి పెద్ద నగరమిది. ఇక్కడ వరుసగా రెండు ఎన్నికల్లో బంపర్‌ మెజారిటీతో గెలుపొందిన రంజన్‌బెన్‌ ధనంజయ్‌ భట్‌ను బీజేపీ అనూహ్యంగా పక్కనబెట్టింది. డాక్టర్‌ హేమంగ్‌ జోషీని పార్టీ బరిలో నిలిపింది. కాంగ్రెస్‌ తరఫున పధియార్‌ జస్పాల్‌సింగ్‌ మహేంద్రసింగ్‌ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ కొత్తవారే కావడం విశేషం. ఈ సీటు 1998 నుంచి బీజేపీ గుప్పిట్లోనే ఉంది.

 మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంతో మరోసారి నెగ్గుతామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 7 సెగ్మెంట్లలో 6 బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. మిగతా చోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. 2014లో మోదీ లోక్‌సభ అరంగేట్రం వారణాసి, వదోదరల నుంచే జరగడం తెలిసిందే. ఇక్కడ ఆయనకు ఏకంగా 5.7 లక్షల మెజారిటీ లభించింది. వారణాసి నుంచి ఎంపీగా కొనసాగి వదోదరను వదులుకున్నారు. 

రాజ్‌కోట్‌... రూపాలాకు రాజ్‌పుత్‌ గండం 
గుజరాత్‌లో ఎదురే లేని కమలనాథులకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. సిట్టింగ్‌ ఎంపీ మోహన్‌ కుందరియాను కాదని బీజేపీ ఆయనకు టికెటిచి్చంది. కానీ ‘మహారాజులు బ్రిటి‹Ùవారికి, విదేశీ పాలకులకు లొంగిపోయారని, వారితో విందువినోదాల్లో మునగడమే గాక వాళ్లకు తమ కుమార్తెలనిచ్చి పెళ్లిళ్లు చేశా’రని రాజ్‌పుత్‌లపై రూపాలా చేసిన వ్యాఖ్యలతో ఆ సామాజికవర్గం భగ్గుమంది.

 ఆయన్ను రాజ్‌కోట్‌ బరి నుంచి తప్పించాలని, లేదంటే ఓడించి తీరుతామని బీజేపీకి వారు అలి్టమేటమిచ్చారు! ఆందోళనలు కూడా చేశారు. రూపాలా పలుమార్లు క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పరేశ్‌బాయ్‌ ధనాని పోటీలో ఉన్నారు. రాజ్‌పుత్‌లు, పటీదార్లు, మధ్య ఎప్పటినుంచో వైరముంది. పటీదార్‌ సామాజికవర్గానికి చెందిన రూపాలా దానికిలా ఆజ్యం పోయడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది.

భావనగర్‌.. బరిలో ఆప్‌ 
ఈ స్థానంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్నేసింది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా భావనగర్, బరుచ్‌లను ఆ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ గట్టి పట్టున్న బీజేపీని ఢీకొట్టేందుకు ఉమేశ్‌బాయ్‌ నరన్‌బాయ్‌ మక్వానాను పోటీకి దించింది. బీజేపీ కూడా సిట్టింగ్‌ ఎంపీ భారతీబెన్‌ ధీరూబాయ్‌ శియాల్‌ను పక్కనబెట్టి నింబూబెన్‌ బంభానియాకు టికెటిచి్చంది. 1991 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది.

 గత ఎన్నికల్లో భారతీబెన్‌కు 4.29 లక్షల మెజారిటీ లభించింది. ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. మిగతా స్థానం ఆప్‌ది కావడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి 5 సీట్లు నెగ్గిన ఆప్‌ లోక్‌సభ బరిలో బీజేపీకి సవాలు విసురుతోంది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రచారంతో హోరెత్తిస్తోంది. కేజ్రీవాల్‌ భార్య సునీత కూడా ప్రచారానికి దిగారు.  

పోర్‌బందర్‌.. మన్‌సుఖ్‌ అరంగేట్రం 
బీజేపీకి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2012 నుంచీ రాజ్యసభకు ఎన్నికవుతున్న ఆయన పోటీతో పోర్‌బందర్‌పై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేశ్‌బాయ్‌ ధడక్‌ చేతిలో 2.3 లక్షల ఓట్ల తేడాతో ఓడిన లలిత్‌ వసోయాకే కాంగ్రెస్‌ మళ్లీ టికెటిచి్చంది. ఈ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కుతియానాలో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ గెలిచింది.  


బనస్కాంత.. గెనీబెన్‌ సవాల్‌ 
ఉత్తర గుజరాత్‌లోని ఈ స్థానంలో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ‘వావ్‌’ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గెనీబెన్‌ ఠాకోర్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దించడమే అందుకు కారణం. దాంతో బీజేపీ కూడా సిట్టింగ్‌ ఎంపీ పర్వత్‌బాయ్‌ పటేల్‌ను కాదని ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ రేఖా బెన్‌ చౌదరి రూపంలో మహిళకే టికెటివ్వాల్సి వచ్చింది. ఆమెకు రాజకీయ అనుభవం లేదు. 

తొలిసారి ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గుజరాత్‌లో ఇరు పారీ్టల నుంచీ మహిళలే రంగంలో ఉన్న ఏకైక సీటు కావడంతో బనస్కాంత అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీని పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు చోట్ల గెలిచింది. అయితే గెనీబెన్‌ కమలం హవాలో కూడా విజయం సాధించి ‘వావ్‌’ అనిపించారు. రేఖాబెన్‌కు రాజకీయ అనుభవం లేకున్నా నియోజకవర్గంతో సత్సబంధాలున్నాయి. 

బనస్‌ డెయిరీ ఈ నియోజకవర్గంలోని 4.5 లక్షల మంది రైతుల నుంచి రోజూ పాలు సేకరిస్తుంది. దీని వ్యవస్థాపకుడు గల్బాబాయ్‌ చౌదరి మనుమరాలు రేఖ. ఆమె భర్త హితేశ్‌ చౌదరి బీజేపీ నాయకుడు. అయినా గెనీబెన్‌ వంటి బలమైన ప్రత్యరి్థపై రేఖ వంటి కొత్త ముఖాన్ని నిలబెట్టడంపై బీజేపీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి నెలకొందని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి!

గాంధీనగర్‌.. అద్వానీ కోటలో షా పాగా! 
ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటైన ఈ నియోజకవర్గం 1989 నుంచి కమలనాథుల గుప్పిట్లోనే ఉంది. శంకర్‌ సింఘ్‌ వాఘేలా, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ వంటి హేమాహేమీలకు నెలవైన ఈ స్థానంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ దిగ్గజం అమిత్‌ షా పాగా వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 5,57,014 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. ఈసారి మెజారిటీ మరింత పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

 ఆయన్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి! చివరకు 62 ఏళ్ల సోనల్‌ పటేల్‌ను రంగంలోకి దించింది. ఆమె ఏఐసీసీ సెక్రటరీగా. ముంబై, పశి్చమ మహారాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్నారు. గిఫ్ట్‌ సిటీ అభివృద్ధి, గాంధీ సబర్మతి ఆశ్రమానికి మెరుగులు, అయోధ్య రామ మందిరం, మోదీ ఫ్యాక్టర్‌ తదితరాలతో తనకు తిరుగులేదని షా ధీమాతో ఉన్నారు. గాం«దీనగర్‌ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలూ బీజేపీవే! సీఎం భూపేంద్ర పటేల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఘట్లోడియా కూడా వాటిలో ఒకటి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement