75 ఏళ్లు దాటితే తప్పుకోవాలని బీజేపీ రాజ్యాంగంలో లేదు
కేంద్ర హోంశాఖ
మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా దేశాన్ని నరేంద్ర మోదీయే ముందుకు నడిపిస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా స్పష్టంచేశారు. 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత పదవి నుంచి తప్పుకోవాలంటూ వయోపరిమితి అనేది తమ పార్టీ రాజ్యాంగంలో లేదని అన్నారు. అమిత్ షా శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీ గెలిస్తే వచ్చే ఏడాది నరేంద్ర మోదీ పదవి తప్పుకుంటారని, అమిత్ షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్‌కు, ఆయన కంపెనీకి, ప్రతిపక్ష ఇండియా కూటమికి ఒక్క విషయం చెప్పదల్చుకున్నా.
నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండితే మీరు సంతోíÙంచాల్సిన అవసరం లేదు. 75 ఏళ్లు దాటితే పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా రాసి పెట్టిలేదు. మోదీ పూర్తికాలం పదవిలో కొనసాగుతారు. దేశాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటారు. ఈ విషయంలో మా పారీ్టలో ఎలాంటి గందరగోళం లేదు’’ అని అమిత్ షా తేలి్చచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment