next prime minister
-
Amit Shah: ఐదేళ్లూ మోదీయే
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా దేశాన్ని నరేంద్ర మోదీయే ముందుకు నడిపిస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా స్పష్టంచేశారు. 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత పదవి నుంచి తప్పుకోవాలంటూ వయోపరిమితి అనేది తమ పార్టీ రాజ్యాంగంలో లేదని అన్నారు. అమిత్ షా శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ గెలిస్తే వచ్చే ఏడాది నరేంద్ర మోదీ పదవి తప్పుకుంటారని, అమిత్ షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్‌కు, ఆయన కంపెనీకి, ప్రతిపక్ష ఇండియా కూటమికి ఒక్క విషయం చెప్పదల్చుకున్నా. నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండితే మీరు సంతోíÙంచాల్సిన అవసరం లేదు. 75 ఏళ్లు దాటితే పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా రాసి పెట్టిలేదు. మోదీ పూర్తికాలం పదవిలో కొనసాగుతారు. దేశాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటారు. ఈ విషయంలో మా పారీ్టలో ఎలాంటి గందరగోళం లేదు’’ అని అమిత్ షా తేలి్చచెప్పారు. -
నేను అండర్డాగ్.. తక్కువ అంచనా వేయొద్దు: రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఈ రేసులో తనను తాను అండర్‌డాగ్‌గా అభివర్ణించుకున్నారు. కచ్చితంగా తాను గట్టి పోటీ ఇస్తానని పేర్కొన్నారు. కొన్ని శక్తులు తనతో పోటీపడుతున్న వ్యక్తికి పట్టాభిషేకం జరగాలని కోరుకుంటున్నాయని, కానీ నిర్ణయం టోరీ(కన్జర్వేటివ్ పార్టీ) సభ్యుల చేతుల్లో ఉంటుందని చెప్పారు. ఎవర్ని గెలిపించాలో నిర్ణయించుకునేందుకు వారికి ఇంకా చాలా సమయం ఉందని వ్యాఖ్యానించారు. రిషి సనాక్తో పోటీ పడుతున్న లిజ్ ట్రస్‌కే టోరీ సభ్యులు పట్టం గడుతున్నారని యూగో సర్వే గురువారం వెల్లడించింది. రిషిపై ట్రస్ 24 శాతం పాయింట్ల లీడ్‌లో ఉన్నట్లు ఆ పోల్ అంచనా వేసింది. దీనిపై పరోక్షంగా స్పందిస్తూ తాను అండర్డాగ్నని చెప్పారు రిషి. సెంట్రల్ ఇంగ్లండ్ గ్రాంథమ్లో శనివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని రేసులో భాగంగా రిషి, ట్రస్ నిర్వహిస్తున్న ప్రచారంలో ప్రధానంగా పన్ను కోతలు, రక్షణ వ్యయం గురించే మాట్లాడుతున్నారు. తనను గెలిపిస్తే 2030 నాటికి రక్షణ వ్యయాన్ని జీడీపీలో 3 శాతానికి పెంచుతానని ట్రస్ ప్రకటించారు. రిషి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక నిర్వహణే అన్నింటికంటే ముఖ్యమని, ఆ తర్వాత పన్ను రాయితీలని పేర్కొన్నారు. తాను అధికారం చేపట్టిన వెంటనే ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు చేపడతానని చెప్పారు. చదవండి: లక్ అంటే ఇదే.. తల్లి సలహాతో జాక్‌పాట్ కొట్టిన మహిళ.. లాటరీలో కోట్లు! -
తదుపరి ప్రధానిగా మళ్లీ మోదీకే మొగ్గు..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పోలిస్తే తదుపరి ప్రధానిగానూ నరేంద్ర మోదీవైపే అత్యధికులు మొగ్గుచూపినట్టు ఇండియా టుడే గ్రూప్-కార్వీ ఇన్సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంఓటీఎన్) సర్వేలో వెల్లడైంది. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీల్లో ప్రధానిగా ఎవరిని ఎంచుకుంటారనేదానిపై ప్రజామోదంలో ఇద్దరికి 40 శాతం వ్యత్యాసం ఉండటం గమనార్హం. తదుపరి ప్రధానిగా 53 శాతం మంది నరేంద్ర మోదీని సూచించగా దేశాన్ని ముందుకు నడపడంలో రాహుల్ గాంధీయే సరైన నాయకుడని కేవలం 13 శాతం మంది మాత్రమే వెల్లడించారు. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదుపరి ప్రధానిగా ఉండాలని 7 శాతం మంది అభిప్రాయపడ్డారు. హోంమంత్రి అమిత్ షా దేశ ప్రధానిగా పాలనాపగ్గాలు చేపట్టాలని కేవలం 4 శాతం మంది ఆకాంక్షించారు. నరేంద్ర మోదీకి అసలైన ప్రత్యామ్నాయం ప్రియాంక గాంధీయేనని 3 శాతం మంది ఆమె వైపు మొగ్గుచూపారు. మరోవైపు 60 శాతం మంది హిందువులు, 17 శాతం మంది ముస్లింలు నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టాలని కోరగా, రాహుల్ గాంధీ నాయకత్వానికి 10 శాతం హిందువులు, 32 శాతం మంది ముస్లింలు జైకొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమ భారతంలో 66 శాతం మంది అక్కున చేర్చుకోగా, రాహుల్ వైపు కేవలం ఆరు శాతం మందే మొగ్గుచూపారు. 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,141 మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌ను ఇండియా టుడే గ్రూప్- కార్వీ ఇన్సైట్స్ నిర్వహించాయి. చదవండి : మోదీకి కుంబ్లే కృతజ్ఞతలు.. -
తదుపరి ప్రధాని మోదీయే కావాలట
-
తదుపరి ప్రధాని మోదీయే కావాలట
భారతదేశానికి తదుపరి ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోదీ కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఇండియా టుడే, అధ్యయన సంస్థ కార్వీ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. పాకిస్థాన్‌పై భారత్ జరిపిన సర్జికల్ దాడులను, దేశంలో పెద్ద నోట్ల రద్దును కూడా సర్వేలో పాల్గొన్న వారిలో మూడింట రెండొంతుల మంది సమర్థించారు. ఈ సర్వేలో ఎంపిక చేసుకున్న శాంపిల్ సంఖ్య తక్కువగా ఉంది. 12,143 మందిని ఇంటర్వ్యూ చేసి ఈ సర్వే నిర్వహించారు. దేశంలోని 97 పార్లమెంట్ స్థానాలు, 194 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 53 శాతం గ్రామీణ, 47 శాతం పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రజలను ఎంపిక చేయడం ద్వారా ఈ సర్వేను శాస్త్రీయంగా నిర్వహించామని ఇండియా టుడే, కార్వీ ప్రకటించాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజీపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి 360 లోక్‌సభ స్థానాలు వస్తాయని కూడా సర్వే తెలిపింది. ఇండియా టుడే గతంలో నిర్వహించిన సర్వేలకన్నా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత పాయింట్లు 15 శాతం పెరిగాయి. ఆయన ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ స్కీమ్‌ను ఎక్కువ మంది సమర్థిస్తున్నారు. ఈ స్కీమ్‌కు 27 శాతం మంది ఓటేశారు. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం చేపట్టిన జన్‌ధన్ యోజనకు 16 శాతం, డిజిటల్ ఇండియాకు 12 శాతం మంది ఓటేశారు. పాకిస్తాన్‌తో సంబంధాలను మోదీ ప్రభుత్వం సవ్యంగా నర్వహించిందని 62 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు వల్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిష్ట దెబ్బతిన్నదని, నిబంధనల విషయంలో గందరగోళం ఏర్పడిందని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని ఇంకా బాగా అమలుచేసే అవకాశం ఉండిందని 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా జరగకుండా బీజేపీ, దాని మిత్రపక్షాలే అడ్డుపడ్డాయని 18 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి పదవికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అని 28 శాతం మంది అభిప్రాయపడగా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉత్తముడని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ రేటింగ్స్ గతంలో కన్నా సగానికి సగం పడిపోయాయి. ప్రతిపక్ష మహాకూటమికి ఆయన మంచి నాయకుడవుతారని 11 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. రానున్న బడ్జెట్లో ఆదాయపన్నును తగ్గించాల్సిన అవసరం ఉందని 68 శాతం మంది అభిప్రాయపడ్డారు.