limit
-
అకౌంట్లో క్యాష్.. ఎన్ని లక్షలు ఉండొచ్చు?
మనలో చాలా మందికి బ్యాంకులలో సేవింగ్ ఖాతాలు ఉంటాయి. వివిధ అవసరాల నిమిత్తం వీటిలో లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ అకౌంట్లలో లెక్కకు మించి క్యాష్ ఉంచుకునేందుకు వీలు లేదు. ఇందు కోసం ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పరిమితి ఉంది.బ్యాంకు, ఇతర పొదుపు ఖాతాలలో నగదు డిపాజిట్ పరిమితి అనేది ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టిని ఆకర్షించకుండా ఒక వ్యక్తి నిర్దిష్ట వ్యవధిలో డిపాజిట్ చేయగల గరిష్ట నగదు మొత్తాన్ని సూచిస్తుంది. నగదు లావాదేవీల ప్రవాహాన్ని పర్యవేక్షించడం, నియంత్రించడం, మనీలాండరింగ్, పన్ను ఎగవేత, ఇతర అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడం కోసం ఆదాయపు పన్ను నిబంధనల మేరకు ఈ పరిమితిని సెట్ చేశారు.రూ.10 లక్షలు మించితే..భారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. ముఖ్యమైన నగదు డిపాజిట్లతో సహా నగదు లావాదేవీలకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి రూ.50 లక్షలు ఉంటుంది. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడానికి ఆర్థిక సంస్థలు బాధ్యత వహిస్తాయని గుర్తించడం అవసరం.ఇదీ చదవండి: మారనున్న ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్?ఇక నగదు ఉపసంహరణల విషయానికి వస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్లో టీడీఎస్ నిబంధనలు పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ. 1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని వ్యక్తులకు విత్‌డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ. 1 కోటికి మించితే 5% టీడీఎస్ వర్తిస్తుంది. -
నిర్ణీత వేగాన్ని అధిగమించిన రెండు రైళ్లు.. లోకోపైలట్లు సస్పెండ్!
భారతీయ రైళ్లు దేశంలోని లక్షలాది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే ఒక్కోసారి రైళ్లు నడిపే పైలట్ల పొరపాటు కారణంగా ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. తాజాగా అటువంటి ఉదంతం యూపీలో చోటు చేసుకుంది. నిర్ణీత వేగ పరిమితి కంటే అధిక వేగంతో రైళ్లను నడిపిన ఇద్దరు లోకో పైలట్లు (డ్రైవర్), రైలు సహాయకులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతిమాన్ ఎక్స్‌ప్రెస్, మాల్వా ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు, వారి సహాయకులపై రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ముందుజాగ్రత్త చర్యగా గంటకు 20 కిలోమీటర్ల వేగ పరిమితిని నిర్ణయించిన సెక్షన్లో 120 కిలోమీటర్ల వేగంతో రైలును నడుపుతున్నందుకు వారిని సస్పెండ్ చేశారు. రైలు బ్రిడ్జి పునరుద్ధరణ పనుల కారణంగా తాత్కాలిక వేగ పరిమితి అమలులో ఉన్న ఆగ్రా కాంట్‌కు సమీపంలోని జాజౌ- మణియన్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు సిబ్బంది వేగంగా రైలును పోనిచ్చిన ఉదంతం చోటుచేసుకుంది. ఆగ్రా డివిజనల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) ప్రశస్తి శ్రీవాస్తవ ఈ సంఘటనను ధృవీకరిస్తూ సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొదటి సంఘటనలో రైలు ఆగ్రా కాంట్ నుంచి గ్వాలియర్‌కు బయలుదేరిన తర్వాత గతిమాన్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ వేగ పరిమితిని ఉల్లంఘించారు. మరో ఘటనలో కత్రా (జమ్మూ)- ఇండోర్ (మధ్యప్రదేశ్) మధ్య నడిచే మాల్వా ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ కూడా నిబంధనలను ఉల్లంఘించారు. ఈ సెక్షన్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రైలు నడపడానికి అనుమతి ఉంది. అయితే ఇటీవల నది వంతెన మరమ్మతు పనుల కారణంగా గంటకు 20 కిలోమీటర్ల పరిమితిని నిర్ణయించారు.ఈ విషయమై ఆపరేషన్స్ విభాగానికి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ వారు చెప్పిన సెక్షన్లో లోకో పైలట్లు రైలు వేగాన్ని తగ్గించడం మరచిపోయి ఉండవచ్చు. అయినా ఇది రైలు ప్రయాణికులకు ముప్పు వాటిల్లే చర్య. అందుకే రైల్వే శాఖ దీనిని సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. సాధారణంగా ట్రాక్ పరిస్థితి, ట్రాక్ మరమ్మతు పనులు, పాత రైల్వే వంతెనలు, స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణం తదితర సందర్భాల్లో రైల్వేశాఖ ఆ రూట్లో వైళ్లే రైళ్లకు వేగ పరిమితులను విధిస్తుంది. -
Amit Shah: ఐదేళ్లూ మోదీయే
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా దేశాన్ని నరేంద్ర మోదీయే ముందుకు నడిపిస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా స్పష్టంచేశారు. 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత పదవి నుంచి తప్పుకోవాలంటూ వయోపరిమితి అనేది తమ పార్టీ రాజ్యాంగంలో లేదని అన్నారు. అమిత్ షా శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ గెలిస్తే వచ్చే ఏడాది నరేంద్ర మోదీ పదవి తప్పుకుంటారని, అమిత్ షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్‌కు, ఆయన కంపెనీకి, ప్రతిపక్ష ఇండియా కూటమికి ఒక్క విషయం చెప్పదల్చుకున్నా. నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండితే మీరు సంతోíÙంచాల్సిన అవసరం లేదు. 75 ఏళ్లు దాటితే పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా రాసి పెట్టిలేదు. మోదీ పూర్తికాలం పదవిలో కొనసాగుతారు. దేశాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటారు. ఈ విషయంలో మా పారీ్టలో ఎలాంటి గందరగోళం లేదు’’ అని అమిత్ షా తేలి్చచెప్పారు. -
టాప్ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్ల పరిమితి ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: అత్యుత్తమ ప్రతిభగల ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశానికి పరిమితి ఎత్తివేయబోతున్నారు. ఇందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీన్ని రాష్ట్రాల ఉన్నతవిద్యా మండళ్లకు పంపింది. వచ్చే ఏడాది (2024) నుంచి దీన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సుల విషయంలోనూ ఈ విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది. ఇటీవల విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లోనూ ఏఐసీటీఈ దీన్ని ప్రస్తావించింది. ముసాయిదా ప్రతిని సమీక్షించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. యూనివర్సిటీల వీసీలు, మండలి ఉన్నతాధికారులు ఈ అంశంపై చర్చించేందుకు సమావేశమవుతున్నారు. రాష్ట్రంలో పది కాలేజీలకు అవకాశం.. రాష్ట్రంలో 174 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా అటానమస్ కాలేజీలను కలుపుకొని 100 కాలేజీలకు ‘న్యాక్’అక్రెడిటేషన్ ఉంది. వాటిల్లో అత్యుత్తమ ప్రమాణాలు కనబరిచే కాలేజీల జాబితాను గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం ఎక్స్పర్ట్ విజిటింగ్ కమిటీ (ఈవీసీ)ని మండలి నియమించాల్సి ఉంటుంది. ఇందులో ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీల సభ్యులు ఉంటారు. విద్యార్థుల హాజరు శాతం, ఏటా కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీకి ఎందరు దరఖాస్తు చేస్తున్నారు? ఏయే కోర్సులను డిమాండ్ చేస్తున్నారు? ఆయా కోర్సుల్లో చేరేవారి పురోగతి ఎలా ఉంది? కాలేజీలో చేరిన విద్యార్థుల మార్కుల వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఉపాధి పొందిన తీరు, లభించిన వార్షిక వేతనం వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఇలా రాష్ట్రంలో అన్ని అర్హతలు ఉన్న కాలేజీలు 10 వరకూ ఉంటాయని మండలి వర్గాలు చెబుతున్నాయి. అయితే కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ పెరిగాక సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా? అనే విషయమై ఏఐసీటీఈ స్పష్టత ఇవ్వలేదు. కాలేజీల్లో ఉండే మౌలికవసతులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పినా, దానిపైనా స్పష్టత ఇవ్వలేదని అధికారులు అంటున్నారు. సీట్లు పెరిగేనా? ప్రస్తుతం ప్రతి కాలేజీలోని ఒక్కో బ్రాంచిలో గరిష్టంగా 4 సెక్షన్లనే అనుమతిస్తున్నారు. ఒక్కో సెక్షన్లో 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లు ఉంటున్నాయి. అయితే నాలుగు సెక్షన్లు ఉన్న కాలేజీలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాటిల్లోనూ ఎక్కువగా సీఎస్ఈ, కొత్తగా వచి్చన కంప్యూటర్ కోర్సులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిమితి ఎత్తేసినా కొత్తగా సీట్లు పెరుగుతాయా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. కొత్త విధానం వల్ల యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు తీసుకోవాల్సిన అవసరం ఉండదని అధికారులు అంటున్నారు. విస్తృత చర్చ చేపడతాం.. ఏఐసీటీఈ ముసా యిదా ప్రతిపై త్వరలో ఉన్నతస్థాయి చర్చ చేపడతాం. ఏఐసీటీఈ ప్రతిపాదనలు రాష్ట్రంలో అమలు చేయగలమా లేదా? అనేది పరిశీలించాల్సి ఉంది. వీసీలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నాక దీనిపై ఏఐసీటీఈకి అభిప్రాయం తెలియజేస్తాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఎన్నికల వేళ: ఊరికెళుతూ బంగారం, డబ్బు తీసుకెడితే పరిస్థితి ఏంటి?
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక వ్యక్తి సగటున రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. నిర్దేశించిన మొత్తం కంటే పైసా ఎక్కువున్నా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాలి. లేకుంటే సదరు నగదును సీజ్ చేస్తారు. పక్కా ఆధారాలను చూపించినప్పుడు ఆ డబ్బును రిలీజ్ చేస్తారు. పరిమితికి మించి తీసుకెళితే ఎలాంటి పత్రాలను చూపించాలనే దానిపై స్పష్టత కావాలని ఎన్నికల అధికారిని కోరిన ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి సాక్షి, హైదరాబాద్: యాభై వేలకు పైగా డబ్బు తీసుకెళ్తున్నప్పుడు ఎలాంటి రుజువు పత్రాలు ఉండాలో తెలపాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ).. ఎన్నికల అధికారిని కోరింది. బంగారం ఎంత పరిమితిలో తీసుకెళ్లాలో వివరించాలని, దానికి ఎలాంటి ఆధార పత్రాలుండాలో తెలపాలని పేర్కొంది. ఈమేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ప్రకారం పట్టుకున్న బంగారం, డబ్బును కమిటీతో విచారించి 48 గంటల్లో తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రజలు, వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వైన్‌షాపుల యాజమానులు డబ్బులను డిపాజిట్ చేసే క్రమంలో పట్టుకుంటున్నారని వెల్లడించారు. పండగలు, పెళ్ళిళ్ళ సీజన్లో నగదును తీసుకెళ్తారని, వంశపారంపర్యంగా వచ్చిన ఆభరణాలకు రశీదులుండవని పద్మనాభరెడ్డి అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నిబంధనల పేరుతో ప్రజలను, వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దని, వీటిపై పోలీసులు, కింది స్థాయి అధికారులకు తగిన సూచనలు, సలహాలివ్వాలని తెలిపారు. నేరస్తులను పట్టుకోవాలని, అమాయకులను ఇబ్బంది పెట్టొద్దని సీఈవోను కోరారు. -
ట్విటర్ యూజర్లకు షాకిచ్చిన మస్క్.. ఇక రోజుకు అన్నే ట్వీట్లు..
ట్విటర్ యూజర్లకు షాకిచ్చాడు దాని అధినేత ఎలాన్ మస్క్. ఇకపై రోజూ ఎన్నిపడితే అన్ని ట్వీట్లు చదవడానికి వీలు లేదు. పెరిగిపోయిన డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్ స్థాయిని తగ్గించేందుకు యూజర్లు ట్వీట్లను చదవడంపై రోజువారీ పరిమితిని విధిస్తున్నట్లు మస్క్ తాజాగా పేర్కొన్నాడు. ఇదీ పరిమితి.. వెరిఫైడ్ అకౌంట్ యూజర్లు రోజుకు 6,000 పోస్ట్‌లను మాత్రమే చదివేలా పరిమితి విధించారు. ఇక అన్‌వెరిఫైడ్ యూజర్లు 600 పోస్ట్‌లు, కొత్తగా చేరిన అన్‌వెరిఫైడ్ యూజర్లు 300 పోస్టులు మాత్రమే చదివేలా తాత్కలికంగా పరిమితి విధిస్తున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. త్వరలో పరిమితి పెంపు ప్రస్తుతం విధించిన తాత్కాలిక పరిమితిని త్వరలో పెంచనున్నట్లు కూడా మస్క్ ప్రత్యేక పోస్ట్‌లో పేర్కొన్నారు. వెరిఫైడ్ యూజర్లు రోజుకు 8,000 పోస్ట్‌లు, అన్ వెరిఫైడ్ యూజర్లు 800 పోస్ట్‌లు, నూతన అన్‌వెరిఫైడ్ యూజర్లు 400 పోస్ట్‌లు చదివేలా పరిమితిని పెంచుతామని వివరించారు. ట్వీట్లను వీక్షించాలంటే ట్విటర్ అకౌంట్ తప్పనిసరి అని ఆ సంస్థ ఇంతకుముందే ప్రకటించింది. ఈ చర్యను "తాత్కాలిక అత్యవసర చర్య" అని అభివర్ణించారు ఎలాన్ మస్క్. వందలాది సంస్థలు ట్విటర్ డేటాను అత్యంత దూకుడుగా ఉపయోగించుకుంటున్నాయని, ఇది వినియోగదారు అనుభవాన్ని ప్రభావితం చేస్తుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. Rate limits increasing soon to 8000 for verified, 800 for unverified & 400 for new unverified https://t.co/fuRcJLifTn — Elon Musk (@elonmusk) July 1, 2023 ఇదీ చదవండి: ‘ఆ మస్క్‌ను ఎవరైనా నిద్ర లేపండ్రా..’ ఆడేసుకున్న ట్విటర్ యూజర్లు -
వాహనాదారులకు గుడ్ న్యూస్.. ఓఆర్ఆర్ స్పీడ్ లిమిట్ పెంపు
సాక్షి, మైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ గంటకు 100 కి మీ ఉండగా దానిని120కి పెంచాలని నిర్ణయించింది. మేరకు పురపాలక, ఓఆర్ఆర్ అధికారులతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వాహనాల గరిష్ఠ పరిమితి వేగాన్ని పెంచేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు హెచ్ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచుతున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం గంటకు 100 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, దీనిని 120కి.మీకి పెంచుతున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్పై ప్రయాణికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే స్పీడ్ లిమిట్ పెంచిన నేపథ్యంలో వాహనాదారులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏను ఆదేశించారని అర్వింద్ కుమార్ తెలిపారు. ఓఆర్ఆర్ (కోకాపేట నుంచి ఘట్కేసర్ వరకు, తారామతిపేట – నానక్‌రామ్‌గూడ వరకు) ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రయాణికులు 1066, 105910 నంబర్లలో డయల్ చేయాలని హెచ్ఎండీఏ సూచించింది. చదవండి: తెలంగాణలో మతతత్వం పెరుగుతోంది: అసదుద్దీన్ ఓవైసీ The maximum speed limit on #ORR is increased to a maximum of 120 kms/ hour from the present maximum limit of 100 kms/ hour In the review meeting held today, minister @KTRBRS reviewed the arrangements & has instructed @HMDA_Gov to ensure all safety protocols in place pic.twitter.com/yz5Wobsoq8 — Arvind Kumar (@arvindkumar_ias) June 27, 2023 -
ట్విటర్ బ్లూటిక్ లేదా మీకు, అయితే ఈ వార్త మీకోసమే!
న్యూఢిల్లీ: నాన్ వెరిఫైడ్ ట్విటర్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్ డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యను పరిమితం చేయడానికి చూస్తోంది. బ్లూ టిక్ లేని యూజర్ల మెసేజ్‌లకు ఇకపై పరిమితిని విధించనున్నారు. ఒకే రోజులో డైరెక్ట్ మెసేజ్‌పై లిమిట్ విధించేందుకు ట్విటర్ యోచిస్తోంది. ఈ పరిమితి దాటిన తరువాత మరిన్ని మెసేజ్‌లను సెండ్ చేసేందుకు వెరిఫై చేసుకోండి అనే మెసేజ్ దర్శనమివ్వనుంది. లీకర్ అలెశాండ్రో పలుజ్జీ ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. రోజుకి ఒక నాన్వెరిఫైడ్ యూజర్ సెండ్ చేసే డైరెక్ట్ మెసేజ్‌లను కట్టడి చేసేందుకు ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) లీకర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, పరిమితిని చేరుకున్న తర్వాత, నాన్-ట్విటర్ బ్లూ వినియోగదారులు "మరిన్ని సందేశాలపంపానుకుంటే వెరిఫై చేసుకోండి అనే సందేశాన్ని రానుంది. అంతే కాదు ఈ పరిమితి రోజుకు 500 DMలు అని, ఇది అమల్లోకి వచ్చార ఈ పరిమితి తగ్గుతుందని కూడా ఆయన భావించారు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) కాగా ట్విటర్లో కంటెంట్ క్రియేటర్లకు వారి రిప్లయ్స్లో వచ్చిన ప్రకటనల ఆధారంగా త్వరలో చెల్లింపులను ప్రారంభిస్తుందని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. #Twitter is working to limit the number of DMs you can send per day before having to sign up for @TwitterBlue 👀 pic.twitter.com/R9UDmd4OAo — Alessandro Paluzzi (@alex193a) June 12, 2023 -
గ్రీన్‌కార్డులపై ‘కంట్రీ లిమిట్’ తొలగించండి
వాషింగ్టన్: గ్రీన్‌కార్డులపై 7 శాతంగా ఉన్న కంట్రీ లిమిట్‌ను తొలగించాలని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారత–అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ జైన్ భుతోరియా అమెరికా పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిమితి వల్ల గ్రీన్‌కార్డుల కోసం అర్హులైన వారు సుదీర్ఘీకాలం నిరీక్షించాల్సి వస్తోందని చెప్పారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో భారతఅమెరికన్ పార్లమెంట్ సభ్యుడు రో ఖన్నా ఆధ్వర్యంలో తాజాగా జరిగిన యూఎస్–ఇండియా సదస్సులో అజయ్ జైన్ మాట్లాడారు. హెచ్–1 వీసాలపై లేని కంట్రీ లిమిట్ గ్రీన్‌కార్డులపై ఎందుకని ప్రశ్నించారు. అమెరికాలో ఇప్పుడు 8,80,000 మంది గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. వీరిలో భారత్, చైనా నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉందన్నారు. పదేళ్లకుపైగా నిరీక్షిస్తున్నవారు చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. చట్టాన్ని మార్చకపోతే మరో 50 సంవత్సరాలు ఎదురు చూడక తప్పదని తేల్చిచెప్పారు. -
Sabarimala: 90వేల మందికి మాత్రమే దర్శనం!
తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం లక్ష మందికిపైగానే తరలివస్తున్నారు. అయ్యప్ప దర్శనానికి దాదాపు 12 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది. దర్శనం కోసం సోమవారం ఒక్కరోజే 1,19,480 మంది ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులతో కలిసి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శబరిమలలో భక్తుల రాక, దర్శనం ఏర్పాట్లపై చర్చించారు. పార్కింగ్ సదుపాయాలు పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీగా తరలివస్తున్న భక్తులను నియంత్రించడం కష్టతరంగా మారడంతో వారి సంఖ్యపై పరిమితి విధించాలని, ప్రతిరోజూ గరిష్టంగా 90,000 మందిని మాత్రమే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే దర్శన సమయాన్ని మరో గంటపాటు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో.. భక్తుల రద్దీ నియంత్రణకు సంబంధించి కేరళ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై న్యాయస్థానం ఆదివారం సమావేశమై, విచారణ చేపట్టింది. రద్దీని నియంత్రించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని పత్తనంతిట్ట జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించింది. నిత్యం 75,000 మందికిపైగా భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో భక్తుల సంఖ్యను 90,000కు పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుఝాము నుంచే.. అయ్యప్ప స్వామిని నిత్యం 90,000 మంది సులువుగా దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు ట్రావెన్కోర్ దేవాస్వోమ్ బోర్డ్(టీడీబీ) చైర్మన్ కె.అనంతగోపన్ చెప్పారు. దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు స్వామిని భక్తులు దర్శించుకోవచ్చని చెప్పారు. ఇదిలా ఉండగా, శబరి దేవస్థానంలో నవంబర్ 17న ప్రారంభమైన 41 రోజుల మండల పూజ ఈ నెల 27న ముగియనుంది. అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిళక్కు యాత్ర కోసం ఈ నెల 30న ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు. 2023 జనవరి 14న మకర జ్యోతి దర్శనంతో మకరవిళక్కు యాత్ర ముగుస్తుంది. పూజలు పూర్తయ్యాక జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు. -
షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్?
సాక్షి,ముంబై: డిజిటల్ ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చాలా సర్వసాధారణమైపోయాయి. ప్రతీ చిన్న లావాదేవీకి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్‌పై ఆధారపడటం బాగా పెరిగింది. అయితే అపరిమిత యూపీఐ లావాదేవీలకు సంబంధించి తాజా అంచనాలు యూజర్లకు షాకివ్వనున్నాయి. పేమెంట్ యాప్‌ల ద్వారా అన్లిమిటెడ్ పేమెంట్లు చేయకుండా నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని భావిస్తున్నారు. త్వరలో డిజిటల్ యూపీఐ పేమెంట్లపై ట్రాన్సాక్షన్ లిమిట్ విధించనున్నారని తాజా నివేదికల సమాచారం. యూపీఐ డిజిటల్ సిస్టమ్‌లోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) వాల్యూమ్ క్యాప్‌ను పరిమితం చేయనుంది. ఈ మేరకు వాల్యూమ్‌ను 30 శాతానికి పరిమితం చేసే విషయంపై రిజర్వ్ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ PhonePe ఈ ఏడాది డిసెంబరు 31తోముగియనున్న గడువును కనీసం మూడు సంవత్సరాలు పెంచాలని ఇప్పటికే ఫోన్‌పే అభ్యర్థించింది. మరికొందరైతే ఐదేళ్లు పొడిగించాలని కోరుతున్నారు. అయితే ఈ నెలాఖరులోగా ఎన్పీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కాగా 2020లో ఈ లావాదేవీల పరిమాణాన్ని 30 శాతానికి పరిమితం చేసేలా ప్రతిపాదించింది. ఎన్పీసీఐ థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ UPIలో నిర్వహించబడే లావాదేవీలను నియంత్రించాలని భావించింది. ఆ తరువాత దీని అమలును రెండు సంవత్సరాలకు పొడిగించింది. మరి ఈ గడువును పొడిగించే అవకాశం ఉందా లేదా అనే దానిపై నవంబర్ చివరి నాటికి దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలాంటి పరిమితులు లేకుండా యూపీఐ యాప్‌ల చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. గూగుల్ పే, ఫోన్‌పే మార్కెట్లో దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
ఇంతకు మించి బంగారం ఇంట్లో ఉంటే చిక్కులు తప్పవు
-
బంగారాన్ని ఇంట్లో దాచుకుంటున్నారా? ఈ పన్నుల కథేంటో తెలుసా?
సాక్షి,ముంబై: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి వినియోగదారు భారత్. మన దేశంలో బంగారం అంటే సెంటిమెంట్ మాత్రమే కాదు పెట్టబడికి ఒక కీలకమైన మార్గం కూడా. బంగారాన్ని లక్ష్మీ దేవితో సమానంగా భావిస్తారు. పసిడి ఇంట్లో శుభప్రదమని నమ్ముతారు. అందుకే ఆభరణాల నుండి నాణేల వరకు ఇళ్లలో బంగారాన్ని దాచుకోవడానికి ఇష్టపడతారు. అయితే బంగారాన్ని ఇట్లో ఎంతమేరకు ఇంట్లో ఉంచుకోవాలి. అసలు దానికి సంబంధించిన ఏమైనా ఆంక్షలున్నాయా? చట్టప్రకారం ఇంటిలో ఎంత బంగారాన్ని దాచుకోవచ్చు? దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఏం చెబుతోంది? అనేది పరిశీలించడం చాలా అవసరం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ప్రకారం, ఒక వ్యక్తి వెల్లడించిన ఆదాయంతో బంగారాన్ని కొనుగోలు చేసినా లేదా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో బంగారాన్ని కొనుగోలు చేసినా లేదా పొదుపు చేసిన మొత్తంతో కొనుగోలు చేసినా లేదా చట్టబద్ధంగా వారసత్వంగా వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారానికి పన్ను వర్తించదు. ఈ విధంగా కొనుగోలు చేసిన బంగారాన్ని సెర్చ్ ఆపరేషన్ల సమయంలో అధికారులు స్వాధీనం చేసుకోలేరు. నిబంధనల మేరకు దాచుకున్న బంగారంపై ఎలాంటి పన్ను వర్తించనప్పటికీ, కానీ దానిని విక్రయించే సమయంలో మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చట్ప్రకారం వివాహిత మహిళ 500 గ్రాముల బంగారాన్ని, అవివాహిత మహిళ 250 గ్రాముల బంగారాన్ని, కుటుంబంలోని పురుషులకు పరిమితి 100 గ్రాములు మాత్రమే. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బంగారం మన దగ్గర ఉంచుకుని తర్వాత దానిని విక్రయించాలనుకుంటే ఆ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం.. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ (ఎల్టీసీజీ)కి లోబడి ఉంటుంది, ఇది ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20 శాతం. బంగారాన్ని కొనుగోలు చేసిన మూడేళ్లలోపు విక్రయిస్తే, ఆ లాభం వ్యక్తి ఆదాయానికి కలిపి, పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను (SGB) విక్రయించిన సందర్భంలో కూడా లాభాలు మీ ఆదాయంగా లెక్కించి, పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.మూడు సంవత్సరాల తర్వాత విక్రయిస్తే, లాభాలపై ఇండెక్సేషన్‌తో 20 శాతం, ఇండెక్సేషన్ లేకుండా 10 శాతం చొప్పున పన్ను విధిస్తారు. అయితే మెచ్యూరిటీ వరకు బాండ్‌ని ఉంచితే వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను ఉండదు. -
ట్యాక్స్ ఫ్రీ పీఎఫ్.. కేంద్రం గుడ్ న్యూస్!
పన్ను రహిత ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని పెంచే సూచనలు బడ్జెట్ 2022-2023లో స్పష్టంగా కనిపిస్తున్నాయి!. పీఎఫ్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై రూ. 5 లక్షల వరకు జమ చేసుకునే ఉద్యోగులందరికీ(ప్రైవేట్ కూడా!) వడ్డీపై పన్ను ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయలుగా ఉన్న పీఎఫ్ ట్యాక్స్ ఫ్రీ పరిమితిని.. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం రెట్టింపు చేసే అవకాశం కనిపిస్తోంది. జీతం ఉన్న ఉద్యోగులందరికీ సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు చేయొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రైవేట్ ఉద్యోగులను ఈ గొడుగు కిందకు తీసుకొచ్చేందకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు కొన్ని ఆర్థిక సంబంధమైన బ్లాగుల్లో కథనాలు కనిపిస్తున్నాయి. 2021-22 ఉద్యోగుల సమయంలో.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై పన్ను భారాన్ని తగ్గిస్తూ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఉద్యోగి తరఫున భవిష్యనిధి ఖాతాకు కంపెనీ తన వాటా జమ చేయనట్టయితే.. అటువంటి కేసులకు రూ.5లక్షల పరిమితి వర్తిస్తుందని మంత్రి వెసులుబాటు కల్పించారు. అయితే పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే సవరణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చిందని, ఇది వివక్షతో కూడుకున్నదని నిపుణులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో.. తాజా నిర్ణయం అమలులోకి వస్తే.. జీతం ఎత్తే ఉద్యోగులందరికీ ఈ లిమిట్‌ను 5 లక్షల దాకా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనను సవరించాలంటూ ప్రభుత్వానికి అనేక ప్రాతినిధ్యాలు అందాయి. ప్రాథమికంగా ఈ నిబంధన.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే అంశం కాబట్టి, ఇది వివక్షత లేనిదిగా ఉండాలని, జీతాలు తీసుకునే ఉద్యోగులందరినీ దీని పరిధిలోకి తీసుకురావాలని నొక్కిచెప్పాయి. చదవండి: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త.. లక్ష రూ. దాకా.. -
అన్నా.. మొబైల్ డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది! ఏం చేయను..
Mobile Data Usage And Data Saving Tips In Telugu: ఎన్నిసార్లు చెప్పా.. ఇంటర్నెట్ప్యాక్ కోసం ఎక్స్ట్రా రీఛార్జ్ అడగొద్దని? అంటూ అసహనంగా చెల్లిని మందలించాడు ప్రశాంత్. ‘ఏం చేయను అన్నయ్యా.. డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది. ఆ విషయం తెలియకుండానే మొబైల్ డేటా లిమిట్ దాటేసిందని అలర్ట్ వస్తోంది’ అంటూ ముఖం వేలాడేసుకుని సమాధానం ఇచ్చింది గిరిజ. ఇంతకీ మొబైల్ డేటా లిమిట్ ఆన్‌లో పెట్టుకున్నావా? అని ప్రశాంత్ అనడంతో బిక్క ముఖం వేసింది గిరిజ. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే కోట్ల మంది ఎదుర్కొనే సమస్య.. వేగంగా మొబైల్ డేటా అయిపోవడం. వైఫై కనెక్షన్ లేని ఇళ్లలో మొబైల్ డేటానే ఆధారం. ఓటీటీ, ఇతరత్రా సోషల్ యాప్‌లను ఉపయోగిస్తూ రోజూ వారీ డేటా ఎలా అయిపోతోందో కనీసం తెలియదు కూడా. ఫుల్ సిగ్నల్ ఉందని.. ఇంటర్నెట్ జెట్ స్పీడ్‌తో వస్తోందని సంబరపడేవాళ్లు.. ఇంటర్నెట్ డేటా ఫటా ఫట్ అయిపోతుందని మాత్రం గుర్తించరు!. డేటా లిమిట్ మ్యాగ్జిమమ్ దాటి వెళ్లకుండా ఉండేదుకు పర్యవేక్షణ, పరిమితం చేయడం లాంటి మార్గాలు ఉంటాయని గుర్తిస్తే చాలు కదా!. ►మొబైల్ డేటా వాడకాన్ని మానిటరింగ్ చేయడం చాలా సులువు. ఏదైనా ఒక యాప్‌ను ఎక్కువసేపు నొక్కి పట్టుకున్నప్పుడు.. యాప్ ఇన్ఫో app info అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే నేరుగా యాప్ సెట్టింగ్ పేజ్‌కి వెళ్తుంది. అక్కడ మొబైల్ డేటా&వైఫై ఆప్షన్ కనిపిస్తుంది. పైన బ్యాక్‌గ్రౌండ్-ఫోర్‌గ్రౌండ్‌లో ఆ యాప్ ఎంత డేటాను తీసుకుంటుందనే విషయం అక్కడ చూడొచ్చు. ఒకవేళ ఆ యాప్ ఎక్కువ డేటాను లాగేస్తుందని అర్థమైతే.. వెంటనే అక్కడి ఆప్షన్స్‌ను ఆఫ్ చేస్తే సరిపోతుంది. ►ఇక ఫోన్ సెట్టింగ్స్ యాప్ Settings appలో డేటాసేవర్ Data Saver అనే ఫీచర్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్‌లు వినియోగించుకుంటున్న డేటాను నియంత్రిస్తుంది. ►గూగుల్ ప్లే స్టోర్‌లో.. డేటా మేనేజ్మెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా మానిటర్ చేసుకోవచ్చు. పైగా ఒకేసారి ఒక్కోయాప్ ఎంతెంత డేటా తీసుకుంటున్నాయో ఒకేసారి చెక్ చేసుకోవచ్చు. గంట, రోజూ, వారాలు, నెలల తరబడి ఎంతెంత ఉపయోగిస్తున్నామో అక్కడ చూసుకోవచ్చు కూడా. ►కొన్ని ఫోన్లలో డేటా లిమిట్ ఆప్షన్ నేరుగా ఉంటుందన్నది చాలామందికి తెలిసే ఉండొచ్చు. అక్కడ ఫలానా ఎంబీ నుంచి జీబీల్లో డేటా లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు. సపోజ్ యూట్యూబ్లోగానీ, లేదంటే ఏదైనా ఓటీటీ యాప్‌లోగానీ సినిమా చూస్తూ ఉండిపోయినప్పుడు డేటా దానంతట అదే అయిపోతుంది. కానీ, లిమిట్ పెట్టుకోవడం వల్ల పరిధి దాటగానే అలర్ట్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. అప్పుడు ఇంటర్నెట్ డేటాను నియంత్రించుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా లిమిట్ Data limit అని టైప్ చేస్తే ఆప్షన్ కనిపిస్తుంది. మరికొన్ని ఫోన్లలో Data Warning ఫీచర్ కూడా ఉంటుంది. ►లైట్ వెర్షన్, అలర్ట్నేట్ వెర్షన్ యాప్స్‌ను ఉపయోగించడం ద్వారా కూడా ఇంటర్నెట్ డేటాను తక్కువగా వాడొచ్చు. కానీ, వీటిలో చాలామట్టుకు సురక్షితమైనవి కానివే ఉంటాయి. కాబట్టి, ప్లేస్టోర్ నుంచి అథెంటిక్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించడం ఉత్తమం. ఉదాహరణకు.. ఫేస్బుక్, ఇన్స్టలాంటి యాప్‌ల్లో స్క్రోలింగ్ చేస్తూ ఉండగానే.. డేటా అయిపోయినట్లు మెసేజ్ వస్తుంది. అవి ఎక్కుడ డేటాను లాగేస్తాయి కాబట్టి.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లైట్ వెర్షన్ యాప్‌ల ఉపయోగించొచ్చు. మొబైల్ డేటాను సేవ్ చేసుకోవచ్చు. చదవండి: ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయకుండా ఫోన్లో ఫ్రీ స్పేస్ పొందండి ఇలా.. -
వాట్సాప్ కొత్త నిబంధన : ఒక్కసారే
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారానికి, నకిలీ వార్తలు అడ్డూ అదుపులేకుండా కొనసాగుతోంది. పాత వార్తలు, పాత వీడియోలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తూ, వ్యాఖ్యానాలను జోడిస్తూ పోస్ట్ చేస్తు వుండటం ఆందోళన రేపుతోంది. చట్టపరంగా వీటి నిరోధానికి చర్యలను ప్రకటిస్తున్నప్పటికీ ఫేక్ న్యూస్ ప్రవాహం ఆగడం లేదు. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన నకిలీ వార్తలు, వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్, టిక్ టాక్ లాంటి ప్లాట్ ఫాంలలో విరివిగా షేర్ అవుతూ అనేక అపోహలను, ఆందోళనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక మీద తరుచుగా షేర్ చేసిన సందేశాన్ని లేదా, వీడియోను ఒకసారి ఒక చాట్ కు మాత్రమే ఫార్వార్డ్ చేసేలా వాట్సాప్ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్ లో ఆన్లైన్లో తప్పుడు సమాచారాన్ని తెలుసుకునే వాట్సాప్ కొత్త ఆంక్షలను విధించింది. ఇక మీద తరుచుగా షేర్ చేసిన సందేశాన్ని లేదా, వీడియోను ఒక చాట్ కు ఒక్కసారి మాత్రమే ఫార్వార్డ్ చేసేలా పరిమితి విధించింది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులకు ఈ రోజునుంచే ఈ కొత్త నిబంధన వర్తించనుంది. అలాగే తరచుగా ఫార్వార్డ్ చేయబడిన సందేశాలను వాట్సాప్‌లో డబుల్ టిక్ ద్వారా సూచిస్తుంది. కోవిడ్-19 తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీని ప్రకారం వాట్సాప్ లో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు షేర్ చేయబడిన సందేశాలను ఒక చాట్‌కు మాత్రమే ఫార్వార్డ్ చేయగలం. అలాగే తరచుగా ఫార్వార్డ్ చేసిన వాటిని యూజర్లు గుర్తించేలా డబుల్ టిక్ తో హైలైట్ చేస్తుంది. గతంలో నకిలీ వార్తలను అడ్డుకునే నేపథ్యంలో ఐదుసార్లకు మించి ఫార్వార్డ్ చేయకుండా పరిమితి విధించడంతో 25 శాతం ఫేక్ న్యూస్ బెడద తప్పిందని వాట్సాప్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే సందేశాలను ధృవీకరించడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. ఫార్వార్డ్ చేసిన సందేశాలను తెలుసుకునేలా వెబ్‌లో ఒక ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. ఇందుకోసం వెబ్ లో భూతద్దం చిహ్నాన్ని జోడించింది. ప్రస్తుతం ఐవోఎస్, ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. చదవండి : ఎన్నారై డాక్టర్‌ను బలిగొన్న కరోనా బంగారం రికార్డు : రూ. 45 వేలను దాటేసింది -
హెచ్-1బీ వీసా : పరిమితి ముగిసింది
వాషింగ్టన్ : వచ్చే ఏడాది 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్1-బీ దరఖాస్తుల పరిమితి ముగిసిందని యూఎస్సీఐఎస్(యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) వెల్లడించింది. ఎవరి దరఖాస్తులను ఆమోదించాలనే విషయంపై లాటరీ ద్వారా నిర్ణయిస్తామని కౌన్సిల్ తెలిపింది. ఎంపికైన వారి వివరాలను ఆయా దరఖాస్తుదారులు, వారి సంస్థలకు మార్చి 31 లోపు సమాచారాన్ని అందిచేస్తామని ప్రకటించింది. అలాగే హెచ్1-బీ క్యాప్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 30వ తేదీని వెల్లడించింది. 2021 ఆర్థిక సంవత్సరానికి కాంగ్రెస్ నిర్దేశించిన 65 వేల దరఖాస్తుల స్వీకరణ పరిమితి మించిందని తెలిపింది. అయితే ఎంత మంది హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేశారనే విషయాన్ని యూఎస్సీఐఎస్ ప్రకటించలేదు. భారత్, చైనా దేశాల నుంచి వేల మంది ఐటీ నిపుణులు ఎక్కువగా హెచ్1-బీ వీసా ద్వారా అమెరికాకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండటం తెలిసిన విషయమే. -
అన్నదాతకు ఆసరా..
కాజీపేట: పంటల సాగు కోసం అన్నదాతలకు బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణ పరిమితి పెరగనుం ది. భూమి ఐదెకరాల పైన ఉన్న రైతులకు ఉపయోగకరంగా ఉండేలా రిజర్వు బ్యాంకు నిర్ణ యం తీసుకుంది. ఎలాంటి సెక్యూరిటీ పత్రాలు లేకుండా ప్రతి రైతుకు రూ.1.60 లక్షలు పంట రుణాలు అందించాలన్న నిర్ణయంతో రైతన్నకు కాస్త ఊరట లభించనుంది. ప్రస్తుతం రైతులకు క్రాప్‌లోను కింద రూ.లక్ష వరకు బ్యాంకులు అందిస్తున్నాయి. ఎకరాకు రూ.30వేల చొప్పున ఈ రుణాలు అందుతున్నాయి. అయితే జిల్లాలో ఐదున్నర ఎకరాలు పైబడి ఉన్న రైతులకే పెరిగిన రుణ పరిమితి వర్తించనుంది. ఒకటి, రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు ఇది అంతగా ప్రయోజనం చేకూర్చదు. గతంలో మాదిరిగానే రూ.లక్ష లోపు రుణమే దక్కనుంది. రబీ సీజన్ ప్రారంభమై ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యం లో ఈ నిబంధనలు రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు వర్తించనున్నాయి. 4.76 లక్షల మంది రైతులు.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4.76 లక్షల మంది రైతులుండగా.. ఐదెకరాలలోపు ఉన్న రైతులు 2.82లక్షలు, ఐదున్నర నుంచి ఆరెకరాల వరకున్న రైతులు 72 వేల పైచిలుకు ఉన్నారు. ఇక పది నుంచి 25 ఎకరాలు ఉన్న రైతులు 89 వేల మంది దాకా ఉన్నారు. 25 ఎకరాలకు పైగా ఉన్న రైతులు 33 వేలకు పైగా ఉన్నారు. వీరందరికీ భూమితో సంబంధం లేకుండా ఆర్బీఐ నిర్ణయించిన ప్రకారమే రూ.1.60 లక్షలు రుణం దక్కనుంది. అంటే ఎకరానికి రూ.30 వేల చొప్పున బ్యాంకు రుణం పరిమితికి లోబడి ఇస్తున్నందున ఐదున్నర ఎకరాలు పైబడిన రైతులందరికీ రుణాలు దక్కనున్నాయి. గతంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం పాస్‌పుస్తకాలతో సంబంధం లేకుండానే బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో పాత పాస్పుస్తకాలన్ని బ్యాంకర్ల వద్దనే ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేస్తే పెద్ద ఎత్తున రైతులకు మేలు జరుగనుంది. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మార్గదర్శకాల కోసం ఎదురుచూపు.. పెరిగిన రుణ పరిమితికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. ప్రస్తుతం ఉన్న రుణాలను మాఫీ చేస్తేనే బ్యాంకర్లు కొత్తగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు. గతంలో భూములను మార్టిగేజ్ చేసుకోవడం, పాస్‌పుస్తకాలను పెట్టుకోవడం ద్వారా రుణాలను మంజూరు చేసేవారు. ప్రస్తుతం ధరణి వెబ్సైట్లో రైతులకు భూమి ఎంత ఉందనేది నిర్ధారణ చేసుకున్న అనంతరం పాస్‌పుస్తకాలను చూసి రుణాలను ఇవ్వాల్సి ఉంటుంది. రైతుల నుంచి తనఖా పత్రాలను తీసుకోవడం కానీ, మార్జిగేజ్ చేసేకోవడం కానీ ఇకపై ఉండదు. పాస్‌పుస్తకాలను ధ్రువీకరించుకోవడం కోసమే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆన్లైన్ ద్వారా ధరణి వెబ్సైట్లో రైతుల సమాచారాన్ని, భూముల వివరాలను, సర్వే నంబర్లను చూసి సదరు భూములు రుణాలు పొందే రైతులవేనా అని సరిచూసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. రుణాల పంపిణీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ కూడా రైతులకు ప్రయోజనం చేకూరేలా ఆదేశాలను ఇచ్చింది. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత బ్యాంకర్లు రుణాల విషయమై చర్యలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. బ్యాంకర్లు ముందుకొచ్చేనా..? రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకొని పంటలు సాగు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో మూడెకరాలు ఉన్న రైతులకు రూ.60 నుంచి రూ.90వేల వరకు రుణాలు ఇచ్చేవారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా మూడెకరాల వరకు ఉన్న రైతులకు ఉపయోగపడలేదు. ఐదున్నర ఎకరాలు పైబడిన రైతులకు మాత్రమే రూ.1.60లక్షలు రానున్నాయి. బ్యాంకర్లు ఇస్తున్న రుణాలకు, పెరిగిపోయిన వ్యవసాయ పెట్టుబడులకు తీవ్ర వ్యత్యాసం ఉంటోంది. పంటలు సాగు చేయడానికి కూలీల ఖర్చు, ట్రాక్టర్లు దున్నకానికి, విత్తనాలు, ఎరువులు మొదలుకొని పంటలు కోసి, దిగుబడులను అమ్ముకునే వరకు రైతులకు నష్టం వస్తుందా లేదా లాభం వస్తుందా తేలని పరిస్థితులున్నాయి. లీడ్ బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు మండలాలు, డివిజన్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తే తప్ప బ్యాంకు మేనేజర్లు రుణాలపై ఓ స్పష్టతకు రారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో పెరిగిన రుణాల విషయంలో బ్యాంకర్లు ఏ మేరకు రైతులకు సహకరిస్తారో వేచిచూడాల్సిందే. ఉమ్మడి జిల్లాలో రైతులు 4.76 లక్షలు ఐదెకరాలలోపు ఉన్నవారు 2.82 లక్షలు 5.5 నుంచి ఆరు ఎకరాలు 72 వేలపైన.. పది నుంచి 25 ఎకరాలు.. 89 వేల మంది 25 ఎకరాలకు పైగా కలిగిన వారు 89 వేల మంది -
వాట్సాప్‌లో ఆ ఫీచర్ కూడా వచ్చేసింది
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ, రెచ్చగొట్టే తప్పుడు వార్తలు బాగా షేర్ అవుతున్న వైనంపై భారత ప్రభుత్వం సీరియస్‌గా స్పందించిన నేపథ్యంలో ఫార్వర్డ్ మెసేజ్‌లను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు ఒకేసారి పెద్ద సంఖ్యలో షేర్ చేయకుండా ఐదుగురికి మాత్రమే వాటిని పంపేలా ‘వాట్సాప్’ నియంత్రణ చర్యలు చేపట్టింది. భారతదేశంలో 200 మిలియన్లకు పైగా యూజర్లను కలిగివున్న వాట్సాప్ సందేశాల షేరింగ్‌పై ఈ ఆంక్షలు విధించింది. వాట్సాప్ ప్రస్తుత వెర్షన్లో కేవలం ఐదుగురికి మాత్రమే ఒక మేసేజ్‌ను ఫార్వార్డ్ చేసే అవకాశం ఉంది. ఈ వారం నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు వినియోగదారుల అవగాహన కోసం ఒక వీడియోను కూడా విడుదల చేసింది. వాట్సాప్‌లో ఇప్పటికే ఈ నిబంధన వాట్సాప్‌లో షేరింగ్ ప్రక్రియలో అమల్లోకి వచ్చిన తీరును మనం గమనించ వచ్చు. ఒక మెసేజ్‌ను ఐదుగురికి మించి షేర్ చేసేందుకు ప్రయత్నిస్తే.. వెంటనే ఒక వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. మరోవైపు గత నెలలో ఫేస్బుక్ సొంతమైన ఫ్లాట్‌ఫాం వాట్సాప్‌లో ఐదు చాట్లకు సందేశాన్ని ఫార్వర్డ్ చేయడానికి కట్టడి చేసేలా టెస్టింగ్ ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. భారత ప్రభుత్వ ఒత్తిడితో వాట్సాప్ సందేశాలను, చిత్రాలు, వీడియోల సామూహిక ఫార్వార్డింగ్‌ను తగ్గించేందుకు ఈ నియంత్రణ విధిస్తున్నట్టు పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మాములుగా వచ్చిన మెస్సేజ్ లకు, ఫార్వార్డ్ ద్వారా వచ్చిన మెస్సేజ్‌లకు మధ్య డిఫరెన్స్ ను స్పష్టంగా చూపించేలా ‘ఫార్వార్డెడ్’ అని సింబల్ రూపంలో చూపిస్తూ వుండటం మనకు తెలిసిందే. -
ఆ ఖాతాలపై భారీగా చార్జీల బాదుడు
సాక్షి, ముంబై: నో ఫ్రిల్స్ (జీరో బ్యాలెన్స్) బ్యాంకు ఖాతాలనుంచి కూడా కొన్ని బ్యాంకులు భారీగా చార్జిలను బాదేస్తున్నాయని తాజా నివేదిక తేల్చింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీఏ) ఖాతాలనుంచి నిబంధనలకు విరుద్ధంగా చార్జీలను వసూలు చేస్తున్నాయని ఐఐటీ బోంబే ప్రొఫెసర్ ఆశిష్‌దాస్ నివేదించారు. నెలలో నాలుగు విత్ డ్రాలు మించితే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా సదరు ఖాతాదారులపై పెనాల్టీని భారీగా విధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం రూపకల్పనలో ఉన్న లోపాల కారణంగా బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి మరీ కస్టమర్లపై అధిక చార్జీలను విధిస్తున్నాయంటూ ఓ నివేదికను రూపొందించి ఆశిష్‌దాస్ విడుదల చేశారు. కస్టమర్ ఐదో డెబిట్ లావాదేవీ నిర్వహించిన వెంటనే బ్యాంకులు స్వచ్ఛందంగా ఆయా ఖాతాల్ని అధిక బ్యాలన్స్ నిర్వహణ, చార్జీలు ఉండే సాధారణ ఖాతాలుగా మార్చేస్తున్నాయని ఆశిష్‌దాస్ తన నివేదికలో పేర్కొన్నారు. ఇలా స్వచ్చందంగా ఖాతాల్ని మార్చడానికి ఆర్బీఐ చెక్ పెట్టాలని ఆయన కోరారు. ప్రస్తుతం నాలుగు ఉపసంహరణల తరువాత, వినియోగదారుడు ఆన్లైన్ కొనుగోళ్లను చేయలేక పోతున్నారన్నారు. భీమ్ యాప్‌ద్వారా లేదా రూపే డెబిట్ కార్డు ద్వారా డబ్బు బదిలీ లేదా రోజువారీ కొనుగోళ్లకు ఉపయోగించుకోలేకపోతున్నారని తెలిపారు. తక్కువ నగదు ఉన్న ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బీఎస్‌బీడీఏ ఖాతాలో నెలవారీ కనీస లావాదేవీలపై నియంత్రణలు తొలగించాలని కూడా సూచించారు. నాలుగో ఉపసంహరణ తర్వాత బీఎస్‌బీడీఏ కస్టమర్లు ఐదో ఆన్లైన్ లావాదేవీకి అవకాశం లేని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ఇది డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహ కార్యక్రమానికి ప్రతికూలమని కూడా ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సేవలను అందరికీ దగ్గర చేయాలని తీసుకొచ్చిన పథకం బీఎస్‌బీడీఏ ఖాతా. వాస్తవానికి బీఎస్‌బీడీఏ ఖాతాల్లో కనీస బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ఖాతాదారులకు ఉపసంహరణలకు పరిమితి ఉంది కానీ, డిపాజిట్లపై పరిమితి లేదు. కానీ, ఈ ఖాతా నిర్వహణ విషయంలో కొన్ని పరిమితులను ఆయుధంగా మార్చుకున్న బ్యాంకులు ఖాతాదారులకు చెప్పకుండానే రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా నెలలో నాలుగు సార్లకు మించి ఉపసంహరణలు జరిగితే ఐదో ఉపసంహరణ జరిగిన తక్షణమే బ్యాంకులు ఆయా ఖాతాలను పొదుపు ఖాతాలుగా మార్చేసి, చార్జీల బాదుడుకు సిద్ధపడుతున్నాయి. అంటే సాధారణ సేవింగ్ ఖాతాల్లోలాగా హై మినిమం బ్యాలెన్స్, సర్వీస్ చార్జీలను వర్తింపచేస్తుందన్నమాట. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంతో 2012లో ఆర్బీఐ బీఎస్‌బీడీఏ పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 54 కోట్ల బీఎస్‌బీడీఏ ఖాతాలు ఉండగా, వీటిలో సగానికిపైగా ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలే కావడం విశేషం. -
మా ప్రభుత్వం పరిమితికి లోబడే అప్పు చేసింది
-
ప్రీపెయిడ్ సాధనాల పరిమితి నెలకు రూ. 50,000
ముంబై: మొబైల్ వాలెట్లు తదితర ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ)లో నెలకు రూ. 50,000కు మించి లోడ్ చేయరాదని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అలాగే వీటిని జారీ చేసే సంస్థలు పీపీఐ బ్యాలెన్స్‌లపై వడ్డీ చెల్లించడానికి లేదని స్పష్టం చేసింది. మీల్ వోచర్లు మినహా పీపీఐలను పేపర్ రూపంలో జారీ చేయరాదని కూడా సూచించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత ఈ వోచర్లు కూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనే జారీ చేయాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మరోవైపు పీపీఐల ఇంటర్ఆపరబిలిటీని దశలవారీగా అమల్లోకి తెస్తామని వివరించింది. ఆరు నెలల్లోగా వివిధ సంస్థల వాలెట్స్కి.. ఆ తర్వాత వాలెట్లు, బ్యాంకులకు మధ్య కూడా దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. తాజా ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
ట్విట్టర్ ఆ లిమిట్‌ను డబుల్ చేస్తోంది..
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ట్విట్టర్ తన యూజర్లకు త్వరలో గుడ్‌న్యూస్ అందించనుంది. ట్వీట్ నిడివిని పెంచేదిశగా సంస్థ ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం ట్విట్టర్ యూజర్లకు అందుబాటులో ఉన్న 140అక్షరాల పరిధిని రెట్టింపు చేసే ప్రయోగాన్ని ప్రారంభించింది. ట్విట్టర్లో సాధారణంగా యూజర్లు ట్వీట్, రిప్లై చేసే టెక్ట్స్ నిడివి ఇప్పటికి 140 క్యారెక్టర్లు మాత్రమే. ట్విట్టర్ తాజాగా చేపట్టిన ఈ ప్రయోగం సపలమైతే యూజర్లు తమ ట్వీట్లను 280కారెక్టర్లకు పెంచుకోవచ్చు. ట్వీట్ ప్రాజెక్ట్ మేనేజర్ అలీజా రోసెన్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇకుహిరో ఇహారా బ్లాగ్ ద్వారా మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న సదుపాయాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానున్నట్టు తెలిపారు. చైనా, కొరియా, జపాన్ భాషల్లో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ ప్రయోగాన్ని చేస్తున్నట్టు ట్విట్టర్ తెలిపింది. అయితే ఈ ప్రయోగంలో ఎంతమందికి అవకాశం ఉందనే వివరాలు అందించడానికి నిరాకరించింది. -
నేటి నుంచి విత్‌డ్రాలపై ఆంక్షలు లేవు.. కానీ!
న్యూఢిల్లీ: సేవింగ్స్ అకౌంట్ నుంచి మీరు ఇక ఎంత నగదు అయినా విత్ డ్రా చేసుకోవచ్చు. సేవింగ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రాయల్స్‌పై ఉన్న ఆంక్షలు ఇవాళ్టి నుంచి తొలగిపోయాయి. ఈ మేరకు జనవరి 30న ఆర్బీఐ చేసిన ప్రకటన ప్రకారం.. నేటి(మార్చ్ 13) నుంచి ఆంక్షలు తొలగించబడ్డాయి. డీమోనిటైజేషన్ అనంతరం ఏర్పడ్డ నగదు కొరత పరిస్థితులను అదిగమించేందుకు ఆర్బీఐ తొలుత రోజుకు రూ. 2000 మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. తరువాత దీనిని రోజుకు రూ. 4500కు, ఆ తరువాత వారానికి రూ. 24,000కు మించకుండా రోజుకు రూ 10,000 వరకు విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అనంతరం ఫిబ్రవరి 20న వారానికి గల లిమిట్‌ను రూ 24,000 నుంచి రూ. 50.000కు పెంచిన విషయం తెలిసిందే. ఆర్బీఐ నిర్ణయంతో నగదు విత్‌డ్రాపై ఆంక్షలు లేకపోవడంపై ఓ వైపు హర్షం వ్యక్తమౌతోంది. కానీ.. ఏటీఎంల వద్ద ఇప్పటికీ కనిపిస్తున్న నోక్యాష్ బోర్డుల పట్ల ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్‌లో నాలుగైదు రోజులుగా నోట్ల కష్టాలు కొనసాగతుతున్నాయి. డబ్బుకోసం ఏటీఎంల వద్ద జనం బారులు తీరారు. -
నేటి నుంచి విత్‌డ్రాలపై ఆంక్షలు లేవు.. కానీ!
-
వారానికి రూ. 50,000 తీసుకోవొచ్చు
సేవింగ్స్ ఖాతాల విత్ డ్రాయల్ పరిమితి పెంపు ముంబై: సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వీక్లీ క్యాష్ విత్‌డ్రాయల్ పరిమితి సోమవారం నుంచి రూ.50,000కు పెరిగింది. అంటే ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి వారానికి రూ.50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. మార్చి 13 నుంచి ఈ పరి మితి కూడా ఉండదు. కాగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి క్యాష్ విత్‌డ్రాయల్ పరిమితి ఇప్పటివరకూ రూ.24,000గా ఉంది. క్యాష్ విత్డ్రాయల్స్పై ఉన్న పరిమితులను రెండంచెల్లో ఎత్తివేస్తామని ఆర్బీఐ ఇదివరకే ప్రకటించింది. ఇందులో మొదటిది సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్ 8 నుంచి క్యాష్ విత్డ్రాయెల్స్పై పరిమితులు ఆర్బీఐ విధించింది. -
అర్హత లేకపోయినా ఎస్బీఐ క్రెడిట్ కార్డు
-
అర్హత లేకపోయినా ఎస్బీఐ క్రెడిట్ కార్డు
న్యూఢిల్లీ: సమాజంలోని దిగువ ఆదాయ వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని ఎన్‌బీఐ రూ.25వేల పరిమితితో క్రెడిట్ కార్డులను జారీ చేయనుంది. చెల్లించగల సామర్థ్యం ఉండి, కార్డులు లేని వారి కోసం వీటిని తీసుకురానున్నట్టు ఓ అధికారి తెలిపారు. రుణ అర్హత లేని వారు సైతం క్రెడిట్ కార్డు పొందవచ్చని పేర్కొన్నారు. ‘‘ప్రతీ బ్యాంకు ఖాతాలో ఎంతో కొంత నగదు ఉంటోంది. ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేకపోయినా వారికి సెక్యూర్డ్ కార్డు ఇవ్వనున్నాం. బ్యాంకు డిపాజిట్ హామీగా ఎవరికైనా రూ.25 వేల పరిమితితో క్రెడిట్ కార్డు జారీ చేస్తాం’’ అని ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సేవల విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ జసూజా తెలిపారు. -
క్యాష్ విత్డ్రాయల్స్పై పరిమితి తొలగించండి
-
క్యాష్ విత్డ్రాయల్స్పై పరిమితి తొలగించండి
• వారానికి రూ.50,000 చాలా చిన్న మొత్తం • దీని వల్ల పరిశ్రమలు సమస్యలను ఎదుర్కొంటున్నారుు • ప్రభుత్వానికి అసోచామ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: క్యాష్ విత్డ్రాయల్స్పై పరిమితిని తొలగించాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ తాజాగా కేంద్రానికి విన్నవించింది. రూ.50,000లు మాత్రమే విత్‌డ్రా అనే నిబంధన వల్ల పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఈ లిమిట్ చాలా స్వల్పమని, దీన్ని పెంచాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలిపింది. ‘కరెంట్ అకౌంట్ నుంచి వారానికి రూ.50,000లు మాత్రమే విత్‌డ్రా పరిమితి వల్ల పరిశ్రమలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారుు. సంస్థలకు ఈ మొత్తం చాలా చిన్నది. అందుకే పరిమితిని పెంచాలి. పరిశ్రమలకు ఇలాంటి పరిమితులతో అవసరం లేదు. ఎందుకంటే ఇవి నిర్వహించే లావాదేవీలన్నీ నమోదు అవుతారుు. వీటిని ప్రభుత్వ యంత్రాంగం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది’ అని వివరిస్తూ అసోచామ్.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసింది. రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో పలు పరిశ్రమలకు సంబంధించిన బ్యాంక్ రుణాల రీపేమెంట్ షెడ్యూల్‌ను పునర్వ్యవస్థీకరించాలని కోరింది. ఫైనాన్స కోసం బ్యాంకులు/ఆర్థిక సంస్థలపై ఆధారపడ్డ కంపెనీలపై పరిమిత సంఖ్యలో నగదు లభ్యత అనే అంశం తీవ్ర ప్రభావం చూపతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రుణగ్రహితలు మరీ ప్రత్యేకించి ప్రైవేట్ కంపెనీలు, ఎంఎస్ఎంఈ రంగ సంస్థలు వాటి రుణం/వడ్డీ చెల్లింపులల్లో డిఫాల్ట్ అయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. అందుకే పలు పరిశ్రమలకు సంబంధించిన బ్యాంక్ రుణాల రీపేమెంట్ షెడ్యూల్‌ను పునర్వ్యవస్థీకరించాలని సూచించింది. క్యాష్ కార్డులను జారీ చేయండి నగదు లభ్యత తక్కువగా ఉన్న తాజా పరిస్థితుల్లో రిటైల్ కస్టమర్లకు, చిన్న వర్తకులకు క్యాష్ కార్డులను జారీ చేయాలని తెలిపింది. దీని వల్ల బ్యాంక్ ఖాతా లేకున్నా లావాదేవీలను నిర్వహించవచ్చని పేర్కొంది. దేశంలో నగదు పంపిణీ (క్యాష్ డిస్ట్రిబ్యూషన్) వేగంగా చేయాల్సి ఉందని, దీని వల్ల వ్యవస్థలో సరిపడ నగదు ఉందనే విశ్వాసం ప్రజల్లో పెరుగుతుందని తెలిపింది. -
పెట్రోల్ బంకుల్లో లిమిట్!
సిమ్లా: రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల నిర్వాహకులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మీరు ఎంత మొత్తంలో పెట్రోల్, డీజిల్ కావాలని అరచి గోల చేసినా మేం మాత్రం 500 రూపాయల పెట్రోల్ మాత్రమే పోస్తామంటూ వినియోగదారులకు స్పష్టం చేశారు. దీంతో ఎక్కువ మొత్తంలో పెట్రోల్ పోయించుకొని బ్యాంకులకు వెళ్లకుండానే రూ. 500, 1000 రూపాయలను 'సేల్' చేద్దామనుకున్న వాహనదారులకు చుక్కెదురైంది. దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల నిర్వాహకులను చిల్లర కష్టాలు వేదిస్తున్న సంగతి తెలిసిందే. చిల్లర కష్టాలను తొలగించేందుకు టోల్ గేట్ల వద్ద టోల్ట్యాక్స్ను సైతం ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. నేటి నుంచి బ్యాంకుల్లో పాత నోట్లను మార్చుకునే అవకాశం ఉంది. అయితే.. ఒక్కో వ్యక్తికి 4 వేల వరకు మాత్రమే పరిమితి ఉంది. రేపటి నుంచి ఏటీఎంలు పనిచేయనున్నాయి. -
పరిమితికి మించి ఔషదాలు వాడితే లివర్ జబ్బులు
–ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ ఎస్కే ఆచార్య కర్నూలు(హాస్పిటల్): పరిమితికి మించి ఔషదాలు వాడితే లివర్ జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఎయిమ్స్(ఢిల్లీ) గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగాధిపతి డాక్టర్ ఎస్కే ఆచార్య చెప్పారు. ఆదివారం కర్నూలు మెడికల్ కాలేజీలోని నూతన క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగం ఆధ్వర్యంలో ‘లివ్ అప్–2016’ పేరున నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్కే ఆచార్య మాట్లాడుతూ హెపటైటిస్ బి,సి వ్యాధులతో పాటు ఆల్కహాలు, టీబీ మందులు, షుగర్, మలేరియా, డెంగీ వ్యాధికి వాడే మందులతో లివర్జబ్బులు పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా హెపటైటిస్ ఎ,బి,సి వైరస్లు, పలు రకాల ఇన్ఫెక్షన్లతో భారత దేశంలో లివర్ ఫెయిల్యూర్లు సంభవిస్తున్నాయని వివరించారు. కొందరు ఆత్మహత్య చేసుకునేందుకు క్రిమిసంహారక మందులు, నిద్రమాత్రలు వాడుతున్నారని, దీంతో కాలేయం తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. అనంతరం లివర్ వ్యాధులకు సంబంధించి డాక్టర్ ధీమన్(చండీగడ్), డాక్టర్ సేతుబాబు, డాక్టర్ పీఎన్ రావు, డాక్టర్ జార్జికురియన్(పాండిచ్చేరి) ఉపన్యసంచారు. సదస్సుకు రాష్ట్రం నుంచే గాక తెలంగాణ నుంచి పలువురు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు డాక్టర్ బి. శంకరశర్మ, డాక్టర్ వెంకటరంగారెడ్డి, డాక్టర్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడులకు ఆకాశమే హద్దు
బీజింగ్ : భారతదేశంలో పెట్టుబడులకు ఆకాశమే హద్దు అని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. చైనాలో ఐదు రోజుల పర్యటనలో ఉన్న జైట్లీ బీజింగ్ లో చైనీస్ ప్రభుత్వం నిర్వహించే సీసీటీవీతో మాట్లాడారు. ఆర్థికవృద్ధి పరంగా భారతదేశం నిలకడగా ఉందని.. మౌలిక సదుపాయాలు, పట్టణీకరణ, హౌసింగ్, విద్యుత్, నీరు మరియు సామాజిక రంగాల్లో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ పుంచుకుంటోందని చెప్పగలననీ, ప్రయివేట్ రంగ పెట్టుబడులు దీనికి ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నాయని తెలిపారు. తమ దేశంలో పెట్టుబడులకు ఆకాశమే పరిమితి... ఆస్థాయిలో పెట్టుబడులు తమకు అవసరమని ఆర్థిక మంత్రి చెప్పారు. వర్షపాతమే కీలక అంశంగా ఉన్న తమ దేశంలో గత రెండేళ్లుగా సాధారణ వర్షపాత పరిస్థితులు నమోదవుతున్నా ..గణనీయమైన వృద్ధిని సాధించామని తెలిపారు. ఈ ఏడాది దేశంలో మంచి వర్షాలు కురిస్తే గ్రామీణ ఆర్థిక అభివృద్ధి, గ్రామీణ కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. గత సంవత్సరం 7.6 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. ఆశాజనక వర్షాలు కురిస్తే ఈ పరిస్థితిలో కచ్చితంగా మెరుగుదల ఉంటుందని జైట్లీ ఉద్ఘాటించారు. 6.9 శాతం వృద్ధి రేటుతో వున్న చైనాను గత ఏడాది భారతదేశం అధిగమించిందన్నారు. అధిక జనాభా కలిగి భారత ఆర్థికవ్యవస్థలో ఉద్యోగ వృద్ధి రేటుచాలా ముఖ్యమన్నారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం ఆందోళనలపై మాట్లాడిన జైట్లీ ఎంతకాలం ఇది (గ్లోబల్ మాంద్యం) కొనసాగుతుందో.. ప్రపంచంలో ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడుతుందో, ప్రపంచంలో వృద్ధి తిరిగి ఎలా వస్తుందో చూడాలనీ. ఇదొక అనివార్యమైన పరిస్థితి అని చెప్పారు. చైనా మద్దతిస్తున్న ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఎఐఐబీ) గవర్నర్ల బోర్డు సమావేశఃలో కూడా జైట్లీ పాల్గొన్నారు. -
విమాన టికెట్ ధరలపై పరిమితి!
కొత్త పాలసీపై ప్రభుత్వం కసరత్తు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణపు టికెట్ ధరలకు సంబంధించి కొత్త పాలసీ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఈ అంశమై పౌర విమానయాన శాఖ, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ప్రభుత్వంలోని పలు ఇతర విభాగాలు ఇప్పటికే చర్చలను ప్రారంభించాయి. టికెట్ ధరలపై ఒక పరిమితి ఉండాలని అవి భావిస్తున్నట్లు సమాచారం. ఏ నిర్ణయమైనా అందరి ఏకాభిప్రాయం మేరకే ఉంటుందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, పండుగలు, డిమాండ్ అధికంగా ఉన్న సీజన్లలో విమానయాన సంస్థలు వాటి టికెట్ ధరలను ఒకేసారి విపరీతంగా పెంచేస్తున్న విషయం తెలిసిందే. కాగా గంట విమాన ప్రయాణానికి టికెట్ ధర రూ.2,500గా ఉండాలని పౌర విమానయాన శాఖ ఇప్పటికే ప్రతిపాదించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా టికెట్ ధరల అంశం ప్రస్తావనకు వచ్చింది. -
గ్రేటర్లో పోలింగ్ పర్సంటేజీ పెంచుతాం
-
నేడు పరిమితంగానే బస్సులు
సాక్షి, హైదరాబాద్: సమగ్ర సర్వే నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ప్రకటించటం, సర్వే సిబ్బంది వచ్చేసరికి కుటుంబ సభ్యులు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో బస్సులు నడపాల్సిన అవసరం లేదని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో మంగళవారం ప్రజల అవసరాల కోసం ఎక్కడా బస్సులు నడపటం లేదని ప్రకటించింది. కేవలం సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్ల వెసులుబాటు కోసం ఉదయం, రాత్రి వేళల్లో పరిమితంగా మాత్రమే బస్సులు తిప్పనున్నారు. వాటిలో సాధారణ ప్రయాణికులను కూడా అనుమతిస్తారు. అయినప్పటికీ వీలైనంతవరకు ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆర్టీసీ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బస్సులు నడపాల్సిన అవసరం లేదని ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్టు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. సర్వే రోజున బస్సులు నడుస్తాయని తాను ప్రకటించినట్టుగా కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త అవాస్తవమని స్పష్టంచేశారు. కాగా, హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి 11 గంటల వరకు సిటీ బస్సులు తిరుగుతాయి. ఉదయం, రాత్రి వేళ నాలుగు గంటల చొప్పున బస్సులు తిప్పాలని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు కోరడంతో ఆర్టీసీ ఆ మేరకు చర్యలు తీసుకుంది. ఎన్యూమరేటర్లను గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా పలు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా బస్సులు బుక్ చేసుకున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్‌కు 100, ఖమ్మంకు 120, రంగారెడ్డికి 120, నిజామాబాద్‌కు 350, కరీంనగర్ జిల్లాకు 250 చొప్పున బస్సులను కేటాయించారు. ప్రత్యేక రైళ్లేవీ? సాధారణంగా ఒకేసారి భారీ సంఖ్యలో ప్రజలు ఊళ్లబాట పడితే ప్రత్యేక రైళ్లు నడపటం కద్దు. కానీ సమగ్ర సర్వే సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఒక్క ప్రత్యేక రైలు కూడా నడపలేదు. ‘‘ఒక ప్రాంతానికి కాకుండా ప్రజలు వారివారి సొంతూళ్లకు పయనమయ్యారు. అలాంటప్పుడు ఏ ప్రాంతానికని అదనపు రైళ్లు నడుపుతాం. ఇలాంటప్పుడు బస్సులే సౌకర్యంగా ఉంటాయి. పైగా ఈ సర్వే కోసం ప్రజలు ఎక్కువగా బస్సులపైనే ఆధారపడ్డారు. రైళ్లను ఎంచుకున్నవారు తక్కువ. సికింద్రాబాద్ నుంచి నిత్యం 58 వేల మంది అన్‌రిజర్వుడు బోగీల్లో ప్రయాణిస్తుంటారు. ఆదివారం ఈ సంఖ్య 64 వేలు మాత్రమే. అంటే ప్రయాణికుల సంఖ్య పెరిగింది కేవలం 10 శాతం మాత్రమే. వీటిని దృష్టిలో ఉంచుకునే ప్రత్యేక రైళ్లు నడపలేదు’’ అని ఓ రైల్వే సీనియర్ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. కానీ ఈ లెక్కలెలా ఉన్నా ఆది, సోమవారాల్లో సికింద్రాబాద్ స్టేషన్ కిటకిటలాడింది. హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లకు ప్రత్యేక రైళ్లను నడపాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.