సమాజంలోని దిగువ ఆదాయ వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని ఎన్‌బీఐ రూ.25వేల పరిమితితో క్రెడిట్ కార్డులను జారీ చేయనుంది. చెల్లించగల సామర్థ్యం ఉండి, కార్డులు లేని వారి కోసం వీటిని తీసుకురానున్నట్టు ఓ అధికారి తెలిపారు. రుణ అర్హత లేని వారు సైతం క్రెడిట్ కార్డు పొందవచ్చని పేర్కొన్నారు.