మనలో చాలా మందికి బ్యాంకులలో సేవింగ్ ఖాతాలు ఉంటాయి. వివిధ అవసరాల నిమిత్తం వీటిలో లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ అకౌంట్లలో లెక్కకు మించి క్యాష్ ఉంచుకునేందుకు వీలు లేదు. ఇందు కోసం ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పరిమితి ఉంది.
బ్యాంకు, ఇతర పొదుపు ఖాతాలలో నగదు డిపాజిట్ పరిమితి అనేది ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టిని ఆకర్షించకుండా ఒక వ్యక్తి నిర్దిష్ట వ్యవధిలో డిపాజిట్ చేయగల గరిష్ట నగదు మొత్తాన్ని సూచిస్తుంది. నగదు లావాదేవీల ప్రవాహాన్ని పర్యవేక్షించడం, నియంత్రించడం, మనీలాండరింగ్, పన్ను ఎగవేత, ఇతర అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడం కోసం ఆదాయపు పన్ను నిబంధనల మేరకు ఈ పరిమితిని సెట్ చేశారు.
రూ.10 లక్షలు మించితే..
భారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. ముఖ్యమైన నగదు డిపాజిట్లతో సహా నగదు లావాదేవీలకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి రూ.50 లక్షలు ఉంటుంది. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడానికి ఆర్థిక సంస్థలు బాధ్యత వహిస్తాయని గుర్తించడం అవసరం.
ఇదీ చదవండి: మారనున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ రూల్స్?
ఇక నగదు ఉపసంహరణల విషయానికి వస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్‌లో టీడీఎస్ నిబంధనలు పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ. 1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని వ్యక్తులకు విత్‌డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ. 1 కోటికి మించితే 5% టీడీఎస్ వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment