savings account
-
పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే..?
బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఏం చేస్తారు.. ‘సింపుల్..ఏటీఎం ద్వారా కావాల్సిన నగదును డ్రా చేస్తాం’ అంటారు కదూ. ఒకవేళ మీ ఖాతాలో రూ.5 లక్షలు ఉన్నాయనుకోండి దాన్ని విత్‌డ్రా చేయాలన్నా ఏటీఎం ద్వారానే చేస్తారా..? ఏటీఎం, చెక్‌బుక్, డీడీ ఇలా ప్రతిదానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. ఒకవేళ పెద్దమొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఎన్ని విధానాలు ఉన్నాయో తెలుసుకుందాం.ఏటీఎం విత్డ్రాఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేయాలంటే మీ కార్డును అనుసరించి రోజుకు రూ.40,000 నుంచి గరిష్ఠంగా రూ.ఒక లక్ష వరకు మాత్రమే సాధ్యం అవుతుంది. కొన్ని ప్రముఖ బ్యాంకుల కార్డులకు సంబంధించి విత్‌డ్రా పరిమితులు కింది విధంగా ఉన్నాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాక్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులు: రోజుకు రూ.40,000.గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000.ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ఇంటర్నేషనల్, ఉమెన్స్ అడ్వాంటేజ్, ఎన్ఆర్వో డెబిట్ కార్డులు: రోజుకు రూ.25,000టైటానియం రాయల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.75,000ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డులు: రోజుకు రూ.1,00,000.ఐసీఐసీఐ బ్యాంక్క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000గోల్డ్ డెబిట్ కార్డు: రోజుకు రూ.50,000ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000యాక్సిస్ బ్యాంక్క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..చెక్బుక్చెక్ లేదా పాస్‌బుక్ ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకుకు ముందుగా సమాచారం అందించాలి. ఆ సమయంలో ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, చెక్‌బుక్ లేదా పాస్‌బుక్ వంటి డాక్యుమెంటేషన్ అవసరం కావచ్చు. రూ.2 లక్షలకు మించి నగదు విత్‌డ్రా చేస్తే పాన్ కార్డ్ కాపీ తప్పనిసరి.డిమాండ్ డ్రాఫ్ట్పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్‌లు ఉపయోగించవచ్చు. ఇలా చేసే లావేదేవీలను బ్యాంకులు ట్రాక్ చేసేందుకు కొన్ని నియామాలు పాటించాయి. -
మహిళలకు కొత్త బ్యాంక్ అకౌంట్
ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా మహిళలకు సమగ్రమైన ఆర్థిక సేవలు అందించే దిశగా ‘ఎరైజ్ ఉమెన్స్ సేవింగ్స్ అకౌంటు’ను ఆవిష్కరించింది. ముగ్గురు కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగపడేలా ఫ్యామిలీ బ్యాంకింగ్ ప్రోగ్రాం, చిన్న–మధ్య స్థాయి లాకర్లపై తొలి ఏడాది జీరో రెంటల్ ఫీజు, పీవోఎస్లలో రూ. 5 లక్షల వరకు లావాదేవీ పరిమితితో ఏరైజ్ డెబిట్ కార్డు, కాంప్లిమెంటరీగా నియో క్రెడిట్ కార్డు వంటి ప్రయోజనాలను దీనితో పొందవచ్చు.అలాగే, మహిళా నిపుణులతో ఆర్థిక సలహాలు, తొలి ఏడాది డీమ్యాట్ అకౌంటుపై వార్షిక మెయింటెనెన్స్ చార్జీల నుంచి మినహాయింపు, ప్రత్యేకంగా మహిళల కోసం కస్టమైజ్ చేసిన స్టాక్స్ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం మొదలైన సర్వీసులను అందుకోవచ్చు. ఆరోగ్య సంరక్షణ విషయంలో మహిళలకు సంబంధించిన ప్యాప్‌స్మియర్ తదితర నిర్దిష్ట వైద్యపరీక్షలపై 70 శాతం వరకు డిస్కౌంట్లు, ప్రముఖ ఆస్పత్రుల్లో వైద్యులతో అపరిమిత కన్సల్టేషన్లు తదితర ప్రయోజనాలను పొందవచ్చని బ్యాంకు తెలిపింది.దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంకు ఇటీవలే ఫిక్స్డ్ డిపాజిట్లపైన వడ్డీ రేట్లను సవరించింది. గత అక్టోబర్ 21 నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. వారం రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3 శాతం నుంచి గరిష్టంగా 7.25 శాతం వడ్డీ అందుతోంది. ఇక సీనియర్ సిటిజెన్ల విషయానికి వస్తే.. కనీసం 3.50 శాతం నుంచి గరిష్టంగా 7.75 శాతం వడ్డీ లభిస్తోంది. -
అకౌంట్లో ఇంతకు మించి క్యాష్ జమైతే అంతే..
మనలో చాలా మంది బ్యాంకు ఖాతాల ఆధారంగా లావాదేవీలు చేస్తూంటారు. ఎఫ్డీలో డబ్బు దాచుకుంటారు. సేల్ డీడ్ ద్వారా చెల్లింపులు చేస్తూంటారు. బిజినెస్ చేస్తున్నవారు కరెంట్ అకౌంట్ ద్వారా లావాదేవీలు చేస్తుంటారు. అయితే ఏ ఖాతాకైనా లావాదేవీల పరంగా నిబంధనల ప్రకారం కొన్ని అవధులుంటాయి. వాటిని పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఆదాయపన్ను అధికారుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏయే ఖాతాలకు నిబంధనల ప్రకారం ఎంతమొత్తంలో లిమిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.సేవింగ్స్, కరెంట్ ఖాతాలో లావాదేవీలుభారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి ప్రాథమికంగా రూ.50 లక్షలు ఉంటుంది. కొన్నిసార్లు కరెంట్ అకౌంట్‌కు సంబంధించి లేవాదేవీలు ఆయా బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.నగదు ఉపసంహరణనగదు ఉపసంహరణల విషయానికి వస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్లో టీడీఎస్ నిబంధనలు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ.1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని వ్యక్తులకు విత్‌డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ.1 కోటికి మించితే 5% టీడీఎస్ అమలవుతుంది.నగదు బహుమతినగదు బహుమతులపై ఆదాయపు పన్నుశాఖ నిబంధనలు విధించింది. పన్ను విధించదగిన ఆదాయాన్ని దాచిపెట్టి పన్నులను ఎగవేసేందుకు ప్రయత్నిస్తుంటారు. నగదు బహుమతులకు సంబంధించి దీన్ని నిరోధించడానికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. సంబంధీకులు కానివారి నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 లేదా అంతకంటే తక్కువ మొత్తంలో నగదు బహుమతులు స్వీకరించినట్లయితే ఎటువంటి గిఫ్ట్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టువులు, అత్తమామలతో సహా ఇతర బంధువుల నుంచి బహుమతులను స్వీకరిస్తే పన్ను మినహాయింపు ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్ పరిమితిఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందాలనుకుంటే కనీసం రూ.100 నుంచి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఆపై చేసిన ఎఫ్డీపై ట్యాక్స్ ఉంటుంది. అయితే ఎఫ్‌డీల్లో రూ.రెండు కోట్లు కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉంటే బల్క్ డిపాజిట్ల రూపంలోకి మారుతాయి. ఎఫ్డీపై వచ్చే వడ్డీ ఏటా రూ.10 వేలు దాటితో టీడీఎస్ 10 శాతం కట్ అవుతుంది.‘రియల్’ లావాదేవీలుపూర్తి నగదును ఉపయోగించి స్థలం లేదా, ఇల్లు కొనుగోలు చేసేందుకు నిబంధనలు అనుమతించవు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు నగదు లావాదేవీల పరిమితికి లోబడి ఉంటాయి. నగదు రూపంలో రూ.2,00,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేయకూడదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్ఎస్ ప్రకారం నగదు రూపంలో రూ.రెండు లక్షల కంటే ఎక్కువ చెల్లింపులు స్వీకరిస్తే విక్రేత 100% పెనాల్టీ రుసుమును చెల్లించవలసి ఉంటుంది.ఇదీ చదవండి: పాన్ కార్డ్‌తో గేమ్స్ వద్దుసేల్ డీడ్‌లో నగదు చెల్లింపులను రికార్డ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రిజిస్టర్డ్ టైటిల్ డీడ్‌లో రుజువులు రికార్డు చేసే క్రమంలో రూ.రెండు లక్షలు గరిష్ట పరిమితి మాత్రమే ఉండాలి. అది కూడా బ్యాంకు డ్రాఫ్ట్, చెక్, ఈసీఎస్ వంటి ఎలక్ట్రానిక్ రూపంలో ఉండడం మేలు. -
అకౌంట్లో క్యాష్.. ఎన్ని లక్షలు ఉండొచ్చు?
మనలో చాలా మందికి బ్యాంకులలో సేవింగ్ ఖాతాలు ఉంటాయి. వివిధ అవసరాల నిమిత్తం వీటిలో లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ అకౌంట్లలో లెక్కకు మించి క్యాష్ ఉంచుకునేందుకు వీలు లేదు. ఇందు కోసం ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పరిమితి ఉంది.బ్యాంకు, ఇతర పొదుపు ఖాతాలలో నగదు డిపాజిట్ పరిమితి అనేది ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టిని ఆకర్షించకుండా ఒక వ్యక్తి నిర్దిష్ట వ్యవధిలో డిపాజిట్ చేయగల గరిష్ట నగదు మొత్తాన్ని సూచిస్తుంది. నగదు లావాదేవీల ప్రవాహాన్ని పర్యవేక్షించడం, నియంత్రించడం, మనీలాండరింగ్, పన్ను ఎగవేత, ఇతర అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడం కోసం ఆదాయపు పన్ను నిబంధనల మేరకు ఈ పరిమితిని సెట్ చేశారు.రూ.10 లక్షలు మించితే..భారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. ముఖ్యమైన నగదు డిపాజిట్లతో సహా నగదు లావాదేవీలకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి రూ.50 లక్షలు ఉంటుంది. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడానికి ఆర్థిక సంస్థలు బాధ్యత వహిస్తాయని గుర్తించడం అవసరం.ఇదీ చదవండి: మారనున్న ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్?ఇక నగదు ఉపసంహరణల విషయానికి వస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్లో టీడీఎస్ నిబంధనలు పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ. 1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని వ్యక్తులకు విత్‌డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ. 1 కోటికి మించితే 5% టీడీఎస్ వర్తిస్తుంది. -
మామూలు బ్యాంక్ బ్యాలెన్స్‌పైనా ఎక్కువ వడ్డీ!
నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అంటే సేవింగ్స్ అకౌంట్ ఉంది. అందరూ తమ డబ్బును ఈ ఖాతాలోనే ఉంచుకుంటారు. లావాదేవీలు నిర్వహిస్తారు. కానీ ఇందులో ఉంచే డబ్బుపై సాధారణంగా పెద్దగా వడ్డీ రాదు. అయితే ఇలాంటి మామూలు సేవింగ్స్ అకౌంట్‌పైనా 7.25 శాతం వరకు వడ్డీని పొందవచ్చని మీకు తెలుసా? సేవింగ్స్ ఖాతాపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్న కొన్ని బ్యాంకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాలో రూ.10 కోట్ల లోపు ఉన్న బ్యాలెన్స్‌పై 2.70 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డబ్బును ఉంచినట్లయితే, రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే 3.5 శాతం వడ్డీ ఇస్తారు.ఐసీఐసీఐ బ్యాంక్ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచే బ్యాలెన్స్ రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది. అదే 50 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే 3.5 శాతం వడ్డీ లభిస్తుంది.ఇదీ చదవండి: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్‌పై మరింత ప్రయోజనంపంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే దానిపై 2.70 శాతం వడ్డీ ఇస్తారు. బ్యాలెన్స్ రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75 శాతం, రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ఐడీఎఫ్సీ బ్యాంక్ (IDFC FIRST Bank) సేవింగ్ అకౌంట్ డిపాజిట్లపై అన్ని బ్యాంక్‌ల కంటే అధికంగా వడ్డీ ఇస్తోంది. ఖాతాలో రూ. 5 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీని అందిస్తోంది. అదే రూ. 5 లక్షల నుండి రూ. 100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే, మీరు దానిపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 100-200 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌పై 4.50 శాతం వడ్డీ ఇస్తోంది.ఈ వడ్డీని ఎలా నిర్ణయిస్తారు?సాధారణంగా పొదుపు ఖాతా వడ్డీ రేటును త్రైమాసికానికి ఒకసారి లెక్కించి జమ చేస్తారు. ఈ వడ్డీ రేటును రోజువారీ బ్యాలెన్స్ అంటే రోజంతా చేసిన డిపాజిట్లలో ఉపసంహరణలు పోగా మిగిలిన మొత్తం ఆధారంగా నిర్ణయిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చినప్పుడు పొదుపు ఖాతాకు ఎలాంటి మెచ్యూరిటీ వ్యవధి ఉండదు. ఎందుకంటే ఈ రకమైన ఖాతాను సాధారణ పొదుపు, లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. పెనాల్టీలు లేదా రుసుము లేకుండా ఈ ఖాతాలో ఎప్పుడైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. ఉపసంహరించుకోవచ్చు. -
ఐవోబీ అకౌంట్ పోర్టబిలిటీ
చెన్నై: ఖాతాదారుల సౌకర్యార్థం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) సేవింగ్స్ అకౌంట్ పోర్టబిలిటీ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో కస్టమర్లు తమ ఖాతాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోని శాఖకు ఆన్లైన్లో బదిలీ చేసుకోవచ్చని బ్యాంక్ ప్రకటించింది. విద్య, ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు మారే వారికి ఇది సౌకర్యంగా ఉంటుందని ప్రకటించింది. అకౌంట్ బదిలీ కోరుకునే వారు ఒకటికి మించిన పత్రాలను పూరించి, దాఖలు చేయాల్సిన శ్రమ దీంతో తప్పుతుందని, అకౌంట్ బదిలీకి ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవస్థ తొలగిపోతుందని పేర్కొంది. మా కస్టమర్ల బ్యాంకింగ్ ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా, సులభంగా మార్చేందుకు సేవింగ్స్ అకౌంట్ పోర్టబిలిటీని ఆన్లైన్లో తీసుకొచ్చామని ఐవోబీ ఎండీ, సీఈవో అజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. టెక్నాలజీ సాయంతో వినూత్నమైన పరిష్కాలను అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. అకౌంట్ బదిలీ కోరుకునే వారు ఐవోబీ అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి, ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్’ సెక్షన్‌కు వెళ్లాలి. అకౌంట్ నంబర్ నమోదు చేసి, రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఏ శాఖకు బదిలీ చేయాలన్న వివరాలను కూడా నమోదు చేయాలి. -
లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్! డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా...
BoB LITE Savings Account: బ్యాంక్ అకౌంట్ లేని వారికి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాల్సిన వారి కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) సరికొత్త అకౌంట్‌ను అందిస్తోంది. బీఓబీ ప్రత్యేక పండుగ క్యాంపెయిన్‌లో భాగంగా ‘బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్’ పేరిట లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ప్రకటించింది. ఈ అకౌంట్‌తో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండానే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్‌తో పాటు కస్టమర్లు ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా పొందవచ్చు. అయితే లైఫ్‌టైమ్ ఫ్రీ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు కోసం సగటు త్రైమాసిక బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అర్హతను బట్టీ లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు కూడా పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని ఆఫర్లను కస్టమర్లకు బ్యాంక్ అందిస్తోంది. ఇప్పటికే వివిధ కన్జ్యూమర్ బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. డిసెంబర్ 31 వరకు వివిధ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, మేక్ మై ట్రిప్, అమెజాన్, బుక్ మై షో, మింత్రా, స్విగ్గీ, జొమాటోలో కొనుగోళ్లపై స్పెషల్ ఆఫర్లు లభిస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు ఇది లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. 10 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులెవరైనా ఈ కౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఉచితంగా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు. ఇందు కోసం మెట్రో/అర్బన్‌లో రూ.3000, సెమీ అర్బన్‌లో రూ.2000, గ్రామీణ శాఖల్లో రూ.1000 త్రైమాసిక సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత ఆధారంగా లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఒక ఆర్థిక సవత్సరంలో ఉచితంగా 30 చెక్ లీవ్స్ -
ఎన్ఆర్ఐలకు ఎస్బీఐ గుడ్ న్యూస్: యోనో యాప్‌తో ఈజీగా
NRIs SBI YONO app: దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. యోనో యాప్‌ద్వారా నాన్-రెసిడెంట్ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ)లు సేవింగ్స్, కరెంట్ ఖాతాలు రెండూ సులభంగా తెరవడానికి డిజిటల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు కొత్త ఖాతాదారులకు ఉద్దేశించిందని ఎస్బీఐ ప్రకటించింది. ఈ సదుపాయం భారతదేశంలో ఖాతాలను తెరవడానికి, నిర్వహించడానికి సులభమైన విధానాన్ని కోరుకునే ఎన్ఆర్ఐ క్లయింట్ల నుంచి దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరిస్తుంది. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు) తాజా అప్డేట్ ప్రకారం ఎన్ఆర్ఐలు భారతదేశంలోని సంబంధిత బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండానే తమ ఇళ్లలో కూర్చొని తమ ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాలను తెరవచ్చు. దీంతో అకౌంట్ ను ఓపెనింగ్ ప్రక్రియ ఎన్ఆర్ఐ కస్టమర్లకు వేగం మరింత సులభతరమవుతుంది. అలాగే డిజిటల్ సేవల ద్వారా లావాదేవీలు మరింత ఈజీ కానున్నాయని డిఎండి & హెడ్ (డిజిటల్ బ్యాంకింగ్ & ట్రాన్స్ఫర్మేషన్) నితిన్ చుగ్ తెలిపారు.అంతేకాదు మూడే మూడు స్టెప్స్‌లో ఖాతాను తెరిచే ప్రక్రియను పూర్తి చేయవచ్చు కూడా. (భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్) ముచ్చటగా మూడు స్టెప్స్ ►యోనో ఎస్బీఐ బ్యాంకింగ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ►హోమ్‌పేజీలో ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాతెరిచే ఆప్షన్ ఎంచుకోవాలి ► ఇది పూర్తి అయిన తరువాత కేవైసీ వివరాలను సబ్మిట్ చేయాలి. ఇండియాలోతాము ఖాతా ఓపెన్ చేయాలనుకుంటున్న ఎస్బీఐ బ్రాంచ్‌కు కేవైసీ డాక్యుమెంట్స్‌ను అందించవచ్చు. లేదా కేవైసీ డాక్యుమెంట్స్‌ను నోటరీ, హై కమీషన్, ఎస్బీఐ ఫారిన్ ఆఫీస్, ఇండియన్ ఎంబసీ, రిప్రజెంటేటివ్ ఆఫీస్, కోర్ట్ మేజిస్ట్రేట్ లేదా జడ్జితో అటెస్ట్ చేసి తదుపరి ప్రాసెసింగ్ కోసం సంబంధిత బ్రాంచ్‌కి మెయిల్ చేయాలి. అలాగే కస్టమర్లు తమ అప్లికేషన్ స్టేటస్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు. -
ఇంటింటికీ తిరుగుతున్నారు.. అకౌంట్లు తెరిపిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్ : పూర్వ వైభవాన్ని సాధించే క్రమంలో తపాలా శాఖ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను, సేవలను ప్రవేశపెట్టడం ప్రారంభించింది. అయితే వీటి గురించిన ప్రచారం పెద్దగా లేకపోవడంతో, రెగ్యులర్‌గా పోస్టాఫీసులకు వెళ్లేవారికి తప్ప మిగతా వారికి అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే శాఖ సిబ్బంది ప్రజలకు చేరువగా వెళుతున్నారు. బ్యానర్లు, కరపత్రాలు పట్టుకుని ఊరూరా, ఇంటింటా తిరుగుతున్నారు. పోస్టాఫీసును, వాటి ద్వారా అందుబాటులో ఉన్న సేవలను గుర్తు చేస్తున్నారు. తపాలాఫీసును ఉత్తరాల బట్వాడా కార్యాలయంగానే చూడకుండా.. వివిధ ప్రజోపయోగ సేవలకు కేంద్రంగా గుర్తించాలంటూ కరపత్రాల ద్వారా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం మంచి ఫలితాన్ని ఇవ్వడం, ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తం కావడం విశేషం. తోక లేని పిట్ట 90 ఆమడలు తిరిగిందట ..ఏంటది..? అంటూ..ఒకప్పుడు పోస్టు కార్డు గురించిన పొడుపు కథ విప్పమని అడిగేవారు.ఇప్పటితరానికి పోస్టు కార్డు తెలియదు.. పొడుపు కథ అంతకన్నా తెలియదు. కొందరికి తపాలా కార్యాలయం (పోస్టాఫీసు) గురించి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రైవేటు కొరియర్ సంస్థలు, బ్యాంకులుపుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన తర్వాత తపాలా శాఖ ఒకప్పటి వైభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది.ఇక జనం తపాలా సేవలను మరిచిపోతున్నారా? అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. దీంతో పోస్టల్డిపార్ట్మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తానే జనం బాట పట్టి మంచి ఫలితాలు సాధిస్తోంది. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి వివిధ పథకాలకు సంబంధించిన ప్రత్యేక మేళాలు నిర్వహించడంతో పాటు కరపత్రాలు, బ్యానర్లతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు అంతగా అందుబాటులో ఉండనందున, గ్రామాల్లో ప్రచారం చేస్తూ మైక్రో ఏటీఎంల ద్వారా తమ సిబ్బందే ఫోన్ చేస్తే ఇంటికి డబ్బు తెచ్చి అందిస్తారని, పోస్టాఫీసులకు వెళ్లినా డబ్బు చెల్లిస్తారని, రైతు బంధు లాంటివి కూడా ఇంటికే వచ్చి ఇస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా ఇటీవల వారం రోజుల్లోనే 1,52,833 పొదుపు ఖాతాలను తెరిపించిన తెలంగాణ సర్కిల్ జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని పొదుపు ఖాతాల సంఖ్య 42,55,352కు చేరుకుంది. వీటిల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 6,76,975 ఖాతాలు తెరవడం గమనార్హం. ఆకర్షిస్తున్న వడ్డీ శాతాలు వృద్ధుల పేరుతో ఖాతాలు తెరిస్తే గరిష్టంగా 8 శాతం వడ్డీ చెల్లిస్తుండటం జనం తపాలా ఖాతాల వైపు మళ్లేందుకు కారణమవుతోంది. ఆడపిల్లల పేరుతో చేసే పొదుపు మొత్తంపై 7.6 వడ్డీ చెల్లిస్తున్న కారణంగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలకు డిమాండ్ పెరిగింది. ఇటీవల మేళాలు ఏర్పాటు చేసి ప్రచారం చేసిన కేవలం మూడు రోజుల్లోనే కొత్తగా 34,384 ఖాతాలు తెరుచుకున్నాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 5,71,659కి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ తరహాలో 92,509 ఖాతాలు తెరుచుకోవడం విశేషం. ♦ ‘సుకన్య సమృద్ధి యోజన పథకం కింద బాలికల పేరిట పొదుపు ఖాతా తెరిస్తే 7.6 శాతం వడ్డీతో ఆ మొత్తం చూస్తుండగానే పెరుగుతూ పోతుంది. వారి చదువులకు, పెళ్లిళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది..’అంటూ తపాలా శాఖ ప్రజల్లోకి వెళ్లింది. సిబ్బంది చేసిన కృషి ఫలించింది. తల్లిదండ్రులు కేవలం 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 34 వేల ఖాతాలు తెరిచారు. ♦ ‘తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతాలు తెరిస్తే మంచి వడ్డీతో పాటు మైక్రో ఏటీఎం ద్వారా పోస్ట్‌మాన్ ఇంటికి డబ్బు పట్టుకొస్తారు. ఏటీఎంకు దూరంగా ఉన్నామన్న బెంగ అవసరం లేదు..’అంటూ తపాలా శాఖ సిబ్బంది మహా మేళాల ద్వారా చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించింది. కేవలం వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల కొత్త పొదుపు ఖాతాలు తెరుచుకున్నాయి. తపాలా శాఖ ద్వారా 150 రకాల సేవలు అందిస్తున్నాం. వీటిల్లో చాలావరకు పోస్టాఫీసు వరకు రాకుండా పోస్ట్‌మాన్ ద్వారానే పొందవచ్చు. జనవరి నుంచి ఖాతాలపై వడ్డీని కూడా పెంచాం. కానీ ప్రజల్లో వీటిపై పెద్దగా అవగాహన లేదు. అందుకే మేమే వారి వద్దకు వెళ్తున్నాం. మా ప్రయత్నం మంచి ఫలితాన్నిస్తోంది. –పీవీఎస్ రెడ్డి, పోస్ట్‌మాస్టర్ జనరల్ -
కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పీఎన్బీ!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అన్ని కాలపరిమితులపై డిపాజిట్ రేటును అరశాతం పెంచింది. రూ.2 కోట్లలోపు ఏడాది, మూడేళ్ల మధ్య వడ్డీరేట్లు అరశాతం పెరిగి వరుసగా 6.75 శాతానికి పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం వడ్డీ అందుతుంది. ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయెల్ అవకాశం లేని పీఎన్బీ ఉత్తమ్ స్కీమ్ కింద డిపాజిట్ రేటు 6.8 శాతానికి ఎగసింది. 666 రోజుల స్థిర డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 8.1 శాతంగా కొనసాగుతుంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
ఆ కస్టమర్లకు షాక్.. ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం!
దేశంలో ప్రైవేట్ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్‌గా పేరున్న ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్ఐ షాకిస్తూ వారి సేవింగ్స్ అకౌంట్ల బ్యాంక్ సర్వీస్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీలు 1 నవంబర్ 2022 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. వీటితో పాటు చెక్కులతో కూడిన వివిధ లావాదేవీల పెనాల్టీ చార్జీలను కూడా పెంచేసింది. దీంతో ఇకపై చెక్ ద్వారా నిర్వహించే పలు లావాదేవీలకు కొత్తగా తీసుకున్న పెంపు నిర్ణయం వర్తించనుంది. ఏవేవి పెరిగాయి.. ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి.. నగదు డిపాజిట్లు, డూప్లికేట్ స్టేట్మెంట్ జారీ, డూప్లికేట్ పాస్‌బుక్ జారీ, IMPS అవుట్‌వర్డ్, డెబిట్ కార్డ్ పిన్ రీ-జనరేషన్, ఇంటర్నెట్ యూజర్ ఐడి లేదా పాస్వర్డ్ (బ్రాంచ్ లేదా నాన్ IVR కస్టమర్ కేర్) రీఇష్యూ వంటి వివిధ రకాల లావాదేవీల చార్జీలు పెరిగాయి. బ్యాంక్ జరిమానా ఛార్జీలు చెక్ రిటర్న్ అవుట్‌వర్డ్ (కస్టమర్ డిపాజిట్ చేసిన చెక్కు), చెక్ రిటర్న్ ఇన్వర్డ్ (కస్టమర్ జారీ చేసిన చెక్) వంటి వాటిపై ఉన్న జరిమానా చార్జీలను కూడా పెంచింది. చదవండి: దీపావళి స్కాం: వాటిపై క్లిక్ చేయకండి, మోసపోతారు జాగ్రత్త! -
యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు షాక్!
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను అన్ని కాలపరిమితులపై 25 బేసిస్ పాయింట్లు పెంచింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. బ్యాంక్ వెబ్సైట్ సమాచారం ప్రకారం మెజారిటీ ఖాతాలకు అనుసంధానంగా ఉండే ఏడాది కాల వ్యవధి రుణ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగి, 8.35 శాతానికి చేరింది. ఏడాది, మూడు, ఆరు నెలల కాలపరిమితులకు రుణ రేట్లు పావుశాతం పెంపుతో 8.15 శాతం–8.30 శాతం శ్రేణికి చేరాయి. రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 8.45 శాతంగా ఉంది. మూడేళ్ల రేటు 8.50 శాతానికి ఎగసింది. తదుపరి సమీక్ష వరకూ ఈ రేట్లు అమల్లో ఉంటాయని బ్యాంక్ ప్రకటన వివరించింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్!
ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇందులో ఎక్కవ శాతం సేవింగ్స్ ఖాతాదారులే ఉన్నారన విషయం విదితమే. కొందరు అవసరమై, లేదా ఏదైనా ప్రయోజనం కోసం సేవింగ్స్ ఖాతాను ఒకే బ్యాంక్‌లో లేదా వేర్వేరు బ్యాంకుల్లో తెరుస్తుంటారు. ఈ క్రమంలో పనైపోయాక సదరు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచలేక, లేదా బ్యాంక్ చార్జీలు భరించలేక ఆ అకౌంట్‌ని క్లోజ్ చేయాలని అనుకుంటుంటారు. అయితే మీ సేవింగ్స్ ఖాతా మూసివేసే ముందు ఈ విషయాలు తెలుసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. 1. అకౌంట్ క్లోజ్ చేసే ముందు బ్యాలెన్స్ చెక్ చేయండి సేవింగ్స్ అకౌంట్‌ను మూసివేసే ముందు, కస్టమర్లు వారి ఖాతా బ్యాలెన్స్‌ని చెక్ చేయడం ఉత్తమం. దీంతో పాటు స్టేట్మెంట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అది మీకు భవిష్యత్తులో ఉపయోపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు మీ స్టేట్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. 2. ఆటోమేటెడ్ పేమెంట్లను రద్దు చేయండి కస్టమర్లు వారి ఖాతా ద్వారా లోన్ ఈఎంఐ (EMI)లు, బిల్లు చెల్లింపులు, నెలవారీ సబ్స్క్రిప్షన్ మొదలైన వాటికి ఆటోమెటిక్ విధానంలో ప్రతి నెల చెల్లిస్తుంటారు. మీ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారంటే ముందు ఈ తరహా చెల్లింపులను రద్దు చేయడంతో పాటు మరో ఖాతాకు ముందుగానే బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డిఫాల్టర్ ముద్రపడే ప్రమాదముంది. 3. బకాయిలు-చార్జీలు ఖాతాలో సరిపడా నగదు నిల్వలు లేకపోతే దానికి సంబంధించిన బకాయిల్ని చెల్లించకుండా ఆ ఖాతాను మూసేందుకు బ్యాంకులు అంగీకరించవు. అలాగే ఇతర సేవలకు సంబంధించిన చార్జీలనూ తప్పక చెల్లించాలి. లేకపోతే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. 4. వివిధ పోర్టల్స్ నుండి మీ సేవింగ్స్ ఖాతాను డీ-లింక్ చేయండి సంస్థల నుంచి సేవలను పొందేందుకు కస్టమర్లు వారి బ్యాంక్ ఖాతాలను ఈపీఎఫ్ఓ (EPFO), ఐటీ శాఖ మొదలైన వాటితో లింక్ చేస్తారు. ఒక వేళ మీ సేవింగ్స్ ఖాతాని క్లోజ్ చేస్తున్నట్లయితే మరొక ఖాతా నంబర్‌తో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాక పెట్టుబడులు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఈ ఖాతానే లింకై ఉంటే మార్పించుకోవాలి. అలా చేయకపోతే సదరు సంస్థల సేవలను వినియోగించుకోలేరు. దీంతో పాటు భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. చదవండి: బాబోయ్.. ఆ రంగంలో ఉద్యోగాలు, మాకొద్దంటున్న గ్రాడ్యుయేట్లు! -
ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్!
ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా లేదా వాడుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు గమనించాలి లేదంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బ్యాంక్ ఖాతా అంటే నగదును దాచుకోవడం , అవసరం ఉన్నప్పుడు నగదు విత్‌డ్రా చేసి వాడుకోవడం, మరి కొందరు ఫిక్స్డ్ డిపాట్లలో వచ్చే వడ్డీ కోసం ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ బ్యాంకింగ్ సంస్థలు తమ సేవల పరిధిని పెంచుకుంటూ పోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని సేవలకు ఛార్జీలు కూడా విధిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో కస్టమర్లు అనుకోకుండా ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉన్నారు. ఇలా ఎక్కువ ఖాతాలను నిర్వహించడం వల్ల ముఖ్యంగా సామాన్య ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఓ లుక్కేద్దాం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక బ్యాంక్ అకౌంట్‌ను నిర్వహించడం సులభం పైగా మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు, మీ బ్యాంకింగ్ వివరాలు ఒకే బ్యాంకు ఖాతాలో అందుబాటులో ఉన్నందున మీ పని సులభం అవుతుంది. అయితే తప్పక అధిక బ్యాంక్ ఖాతాలు ఉపయోగించాల్సి వస్తే.. బ్యాంక్ సేవలు, ఛార్జీలు తెలుసుకునే కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తే మంచిదని సూచిస్తున్నారు. సిబిల్(CIBIL) రేటింగ్‌కు ప్రమాదం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించడం వల్ల మీ బ్యాంక్ ఖాతాను సరైన మినిమం బ్యాలెన్స్‌తో నిర్వహించడంలో ఒక్కో సారి కుదరకపోవచ్చు. అటువంటి సందర్భాలలో దాని ప్రభావం మీ సిబిల్( CIBIL ) రేటింగ్‌పై చూపుతుంది. సర్వీస్ ఛార్జీలు అధికం బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతీ ఒక్క కస్టమర్ కూడా బ్యాంకులు విధించే ఎస్ఎంఎస్ అలర్ట్ సర్వీస్ ఛార్జ్, డెబిట్ కార్డ్ ఏంఎంసీ మొదలైన వివిధ సేవా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తుంటే వారు ఖచ్చితంగా మిగిలిన ఖాతాల ఛార్జీలను కూడా భరించాల్సిందే. అంతే కాకుండా ఎక్కువ కాలం అకౌంట్ వాడకుంటే వివిధ ఛార్జీలు పడతాయి. మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే బ్యాంక్ సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలంటే మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం తప్పనిసరి. మీకు ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే, మీ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసి ఉంచాల్సి వస్తుంది. ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు కస్టమర్ల ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బాదుడు మొదలుపెడుతున్నాయి. అలాంటిది వేర్వేరు బ్యాంకుల్లో కనీస మొత్తంలో నగదుని నిల్వను నిర్వహించాలంటే సామాన్యుడికి ఇది భారమే తప్ప ఉపయోగకరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఎన్ని ఖాతాలు మనం ఉపయోగిస్తుంటే బ్యాంకులు విధించే ఛార్జీలు కూడా అదే స్థాయిలో ఉంటాయనే విషయాన్ని గమనించాలి. చదవండి:Chennai: నగరజీవికి మోయలేని భారం.. తప్పక కట్టాల్సిందే గురూ! -
బ్యాంకుకు బొమ్మ తుపాకీతో వెళ్లి.. 10 లక్షలు తీసుకెళ్లిన మహిళ
ఓ మహిళ గుంపుతో కలిసి బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి ప్రవేశించి హల్చల్ చేసింది. మేనేజర్‌కు ఆ తుపాకీ ఎక్కుపెట్టి 13,000 డాలర్లు(రూ.10లక్షలు) విత్‌డ్రా చేసింది. ఆ డబ్బునంతా పాస్టిక్ బ్యాగులో పెట్టుకుని అక్కడి నుంచి క్షణాల్లో వెళ్లిపోయింది. లెబనాన్ రాజధని బెయరూత్లో ఈ ఘటన బుధవారం జరిగింది. సదరు మహిళ చేసిన పనిని ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఘటనకు పాల్పడిన మహిళ పేరు సలీ హఫేజ్. ఆమె తీసుకెళ్లిన డబ్బంతా తన సొంత సేవింగ్స్ ఖాతాలోదే కావడం గమనార్హం. తన ఖాతా నుంచి ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో పక్కా ప్లాన్‌తో ఆమె ఈ పని చేసింది. కొంతమంది ఆందోళనకారులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆర్థిక ఆంక్షలు.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్‌లో 2019 నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రజలు నెలకు 200 డాలర్లకు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీల్లేదు. దీంతో సేవింగ్స్ ఖాతాల్లో డబ్బు ఉన్నా దాన్ని ఉపయోగించుకోలేక లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద కారణం.. అయితే సలీ హఫేజ్ బొమ్మ తుపాకీతో బెదిరించి మరీ డబ్బు తీసుకెళ్లడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఆమె 23ఏళ్ల సోదరి చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. చికిత్సకు ప్రతినెలా చాలా డబ్బు అవసరం అవుతోంది. సేవింగ్స్ ఖాతాలో 20వేల డాలర్లు ఉన్నా వాటిని విత్ డ్రా చేసుకోలేక హఫేజ్ అవస్థలు పడింది. తన చెల్లికి క్యాన్సర్ అని చెప్పినా బ్యాంకు అధికారులు అసలు పట్టించుకోలేదు. ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించలేదు. దీంతో కొంతమంది నిరసనకారులతో కలిసి హఫేజ్ బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి వెళ్లి నగదు విత్‌డ్రా చేసుకుంది. ఇంటర్వ్యూలో వివరణ తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో స్థానిక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలీ హఫేజ్ వివరించింది. తన చెల్లి క్యాన్సర్ చికిత్సకు డబ్బు కావాలని, విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించాలని బ్యాంకు అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆలస్యమైతే తన చెల్లి ప్రాణాలకే ప్రమాదమని చెప్పినా వినలేదని వాపోయింది. ఇక తాను కోల్పోవడానికి ఏమీ లేదని నిర్ణయించుకున్న తర్వాతే ఇలా చేసినట్లు వివరించింది. ప్రత్యక్ష సాక్షి భయం.. అయితే ఈ ఘటనను చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి మాత్రం భయాందోళన వ్యక్తం చేసింది. మొదట ఓ గుంపు బ్యాంకు లోపలికి వచ్చి నేలపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని బెదిరించిందని, ఓ మహిళ బ్యాంకు మేనేజర్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి నగదు ఇవ్వకపోతే కాల్చిపడేస్తానని బెదిరించిందని చెప్పింది. అయితే తాను ఎవరికీ హాని చేయాలనుకోలేదని హఫేజ్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. తన హక్కుల కోసమే గత్యంతరం లేక ఇలా చేసినట్లు స్పష్టం చేసింది. హఫేజ్కు లెబనాన్ ప్రజలంతా మద్దతుగా నిలిచారు. ఆమెను హీరోగా అభివర్ణించారు. ఆమె చేసినదాంట్లో తప్పేంలేదన్నారు. మరోవైపు డబ్బు అవసరమైనవాళ్లు తనలాగే చేయాలని హఫేజ్ పిలుపునిచ్చింది. చదవండి: నిమిషంలోపే హెయిర్ కట్.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్ డ్రస్సర్ -
అన్నదాతల కోసం మరో కేంద్ర పథకం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిది యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీని కింద ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తుంది. అలాగే ఇప్పుడు రైతుల కోసం మరో పథకం కూడా అందుబాటులో ఉంది. గతంలోనే అన్నదాతల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపై అవగాహన తక్కువగా ఉండటం వల్ల చాలా తక్కువ మంది రైతుల మాత్రమే ఇందులో చేరారు.(చదవండి: రైతులకు భారీ ఊరట: రుణ మాఫీ) పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనేది చిన్న, ఉపాంత రైతుల సామాజిక భద్రత కోసం తీసుకొచ్చిన ప్రభుత్వ పథకం. 18 నుండి 40 సంవత్సరాల వయస్సులోపు 2 హెక్టార్ల వరకు సాగు చేయగల భూములను కలిగి ఉన్న చిన్న, ఉపాంత రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందటానికి అర్హులు. ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన తరువాత రైతులకు నెలకు 3000/- రూపాయల కనీస భరోసా పెన్షన్ లభిస్తుంది. రైతు మరణిస్తే రైతు జీవిత భాగస్వామికి 50శాతం పెన్షన్‌ను కుటుంబ పెన్షన్‌గా పొందటానికి అర్హత ఉంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల చందాదారులు 60ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు 60 ఏళ్లు నిండిన వెంటనే పెన్షన్ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ప్రతి నెల సంబంధిత వ్యక్తి యొక్క పెన్షన్ ఖాతాలో రూ.3వేలు జమ అవుతాయి. దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా/PM-కిసాన్ ఖాతా, పొలం పాస్‌బుక్, రెండు ఫోటోలు ఉంటే సరిపోతుంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్నా వారు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఉచితంగానే ఈ పథకంలో చేరవచ్చు. -
పెట్రోల్ పంపుల్లో ఫాస్ట్యాగ్లు
న్యూఢిల్లీ: టోల్‌ప్లాజాల వద్ద వాహన క్యూలను తగ్గించే ఫాస్ట్యాగ్లు ఇకపై పెట్రోల్ పంపుల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. వాహనం విండ్ స్క్రీన్‌పై అతికించే ఈ ఫాస్ట్యాగ్స్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద రుసుము ఆటోమేటిక్‌గా జమ అవుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) విధానం ద్వారా లింక్ అయి ఉన్న ప్రీపెయిడ్ లేదా సేవింగ్ అకౌంట్ నుంచి నేరుగా లావాదేవీ జరిగిపోతుంది. దీనివల్ల ప్లాజాల వద్ద వాహనాలు ఆపే అవసరం ఉండదు. ఈ ఫాస్ ట్యాగ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపుల వద్ద త్వరలోనే అందుబాటులో ఉంచుతారు. వీటితో పార్కింగ్ ఫీజు చెల్లింపులు, పెట్రోల్ కొనుగోలు కూడా చేసుకోవచ్చు. ఫాస్ట్యాగ్ల విక్రయం, పంపిణీకి సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చున్న అనంతరం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయం తెలిపారు. -
పన్నుభారం... తగ్గించుకుందాం!
ఏటా పన్ను రిటర్నులు దాఖలు చేయటం తప్పనిసరే!! కాకపోతే కొందరు పన్ను తగ్గించుకోవటానికి తాము గరిçష్టంగా ఎంత పొదుపు చేయగలమో అంతా చేస్తారు. ఆ రకంగా పొదుపును కూడా పెంచుకుంటారు. ఇవన్నీ ప్రతిబింబించేలా పన్ను రిటర్నులు దాఖలు చేస్తారు. మరికొందరు మాత్రం నామమాత్రపు కార్యక్రమంగా కానిచ్చేస్తుంటారు. తమకున్న అన్ని రకాల ఆదాయం, ఖర్చులు, వాటికి చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఉన్న మినహాయింపుల గురించి అవగాహన కలిగిన వారు చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు. దీంతో ఆ మినహాయింపులను ఉపయోగించుకోరు. ఆదాయపన్ను చట్టంలో సెక్షన్ 80సీ కింద ఉన్న పన్ను మినహాయింపుల గురించే సాధారణ అవగాహన ఉంటుంది తప్ప, ఇతర సెక్షన్ల గురించి తెలిసిన వారు కూడా తక్కువ మందే!! కొంత సమయం వెచ్చించి అవేంటన్నది తెలుసుకుంటే మినహాయింపుల ద్వారా పన్ను భారాన్ని మరింత తగ్గించుకోవచ్చు. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్‌పై వడ్డీ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో బ్యాలెన్స్‌పై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ జమవుతుంది. ఇలా ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని సంబంధిత ఖాతాదారుడి వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. అయితే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80టీటీఏ ప్రకారం ఏటా ఈ వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో బ్యాలెన్స్‌పై వడ్డీకి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అంతకు మించితే మాత్రం పన్ను చెల్లించాలి. వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు మినహాయింపు అంటే... మొత్తం ఆదాయంలో రూ.10,000 తగ్గించి చూపించుకోవడం అని పొరపడొద్దు. ఇతర ఆదాయం కాలమ్‌లో వడ్డీ ఆదాయాన్ని చూపించి అది రూ.10 వేల లోపు ఉంటే పన్ను మినహాయింపు పొందొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. అది ఈ సెక్షన్ కిందికి రాదు. ఇంటి అద్దె చెల్లింపులు... చట్టంలోని సెక్షన్ 80జీజీ ప్రకారం, వేతన ప్యాకేజీలో భాగంగా హెచ్ఆర్ఏ లేకపోతే... వేతన ఉద్యోగి కాని వారు ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. తన పేరు, తన జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరిట ఇల్లు ఉండి, ఆ ఆంట్లో నివసిస్తుంటే మాత్రం ఈ ప్రయోజనానికి అనర్హులు. మొత్తం ఆదాయంలో 10 శాతాన్ని అద్దెగా చెల్లిస్తుంటే లేదా, మొత్తం ఆదాయంలో 25% లేదా ప్రతీ నెలా రూ.5,000 మొత్తం వీటిలో ఏది తక్కువ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం ఆదాయం అంటే సెక్షన్ 80సీ, 80యూ, 80జీజీ కింద మినహాయింపులు పోనూ మిగిలింది. తీవ్ర అనారోగ్యాలు, వ్యాధులు ఈ వ్యయాలను 80డీడీబీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. వార్షికంగా రూ.40,000 వరకు చేసే ఖర్చుకు పన్ను ఆదాయం నుంచి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు సీనియర్ సిటిజన్ అయితే ఈ పరిమితి రూ.60,000. సూపర్ సీనియర్ సిటిజన్ (80 ఏళ్లకుపైన) అయితే... పరిమితి రూ.80,000. అయితే, ఈ వ్యాధులకయ్యే ఖర్చును బీమా పాలసీ ద్వారా పొందితే పన్ను మినహాయింపు పొందేందుకు వీలుండదు. పాక్షికంగా రీయింబర్స్మెంట్ వస్తే, మిగిలిన మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారుడు లేదా అతని జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు, సోదరీమణులకు సంబంధించి ఖర్చు చేసినా ఈ చట్టం కింద పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు... నివసిస్తున్న భవనం కొనుగోలుకు రుణం తీసుకుని చేసే చెల్లింపులకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. 2016 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 మధ్య రుణం తీసుకుని ఉండాలి. ఇంటివిలువ రూ.50 లక్షల్లోపు, రుణం మొత్తం రూ.35 లక్షల్లోపు ఉండాలి. అలాగయితే సెక్షన్ 24 కింద వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షలకు పైన ఉంటే, అప్పుడు సెక్షన్ 80ఈఈ కింద మరో రూ.50వేలకు పన్ను మినహాయింపు పొందే అవకాశముంది. హోమ్ లోన్ అనుబంధ చార్జీలకూ... ఇంటి రుణం తీసుకునే సమయంలో చేసే ఇతర చెల్లింపులక్కూడా పన్ను మినçహాయింపు పొందొచ్చు. ప్రాసెసింగ్ ఫీజుపైనా సెక్షన్ 24 కింద పన్ను చెల్లించక్కర్లేదు. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చెల్లింపులను సైతం వడ్డీగానే చట్టం పరిగణిస్తోంది. డౌన్ పేమెంట్... రుణాల కోసం కొందరు స్నేహితులు లేదా తెలిసిన వారి నుంచి చేబదులు తీసుకుని డౌన్ పేమెంట్ సమకూర్చుకుంటారు. ఈ మొత్తంపై వడ్డీ చెల్లించినా సెక్షన్ 24 కింద పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు కొనుగోలు, ఆధునికీకరణ, పునర్నిర్మాణం కోసం రుణం తీసుకుని చేసే వడ్డీ చెల్లింపులు సైతం ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. వైకల్యం కలిగిన వారికి... 40 శాతం వైకల్యం కలిగిన వారు వార్షికంగా రూ.75,000 వరకు సెక్షన్ 80యూ కింద మినహాయింపు పొందే అవకాశం ఉంది. తమపై వైకల్యం కలిగిన వారు ఆధారపడి ఉన్నా గానీ, వారిపై చేసే ఖర్చులకు సెక్షన్ 80డీడీ కింద 75,000 వరకు పన్ను మినహాయింపును పొందొచ్చు. ఒకవేళ వైకల్యం తీవ్రత 80 శాతంపైన ఉంటే అప్పుడు వార్షికంగా రూ.1.25 లక్షలకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక జీవిత భాగస్వామి, పిల్లల పేరిట చేసే పెట్టుబడులపై వచ్చే ఆదాయం తమ ఆదాయం కిందే చూపించి పన్ను చెల్లించాలి. ఒకవేళ పిల్లల్లో ఎవరైనా వైకల్యంతో ఉంటే, వారి పేరిట చేసే పెట్టుబడులకు ఇది వర్తించదు. వైకల్యంతో ఉన్న పిల్లల పేరిట పెట్టుబడులపై ఆదాయం తండ్రి ఆదాయంగా చట్టం చూడదు. కనుక పన్ను వర్తించే పెట్టుబడులను వైకల్యంతో ఉన్న పిల్లల పేరిట చేసుకుంటే పన్ను నుంచి ఉపశమనం పొందొచ్చు. నష్టాలు చూపించుకోవచ్చు... గత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులపై నష్టపోయిన వారు, అదే సంవత్సరంలో షేర్లు, ప్రాపర్టీ, బంగారం, డెట్ ఫండ్స్ విక్రయంపై వచ్చిన మూలధన లాభాల పన్ను నుంచి నష్టాలను మినహాయించుకోవచ్చు. స్వల్ప కాలిక మూలధన నష్టాలను, స్వల్పకాలిక మూలధన లాభాలు, దీర్ఘకాలిక మూలధన లాభాల నుంచి కూడా సర్దుబాటు చేసుకునేందుకు వీలుంది. వివిధ సంస్థలకు విరాళాలిస్తే... విరాళాలపై సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, మీ మొత్తం ఆదాయంలో ఇది 10 శాతాన్ని మించకూడదు. ముఖ్యంగా ఈ సెక్షన్ కింద ప్రభుత్వం నోటిఫై చేసిన ఫండ్స్‌కు ఇచ్చే విరాళాలకే ఈ పన్ను ప్రయోజనం ఉంటుంది. అలాగే, నగదు రూపంలో విరాళం రూ.2,000 మించి ఇస్తే మినహాయింపునకు అవకాశం లేదు. నేషనల్ డిఫెన్స్ ఫండ్, జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, ప్రధానమంత్రి కరువు ఉపశమన నిధి, జాతీయ చిన్నారుల నిధి, ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి, క్లీన్ గంగా ఫండ్ తదితరమైనవి ప్రభుత్వం నోటిఫై చేసిన వాటిలో ఉన్నాయి. అలాగే, ఆలయాలు, చర్చిలు, మసీదుల నవీకరణకు ఇచ్చే విరాళాలకూ ఈ మినహాయింపు వర్తిస్తుంది. ప్రత్యేకమైన పరిశోధనలు లేదా యూనివర్సిటీ లేదా కాలేజీలను ప్రభుత్వం సెక్షన్ 35(1)(2), సెక్షన్(1)(3), 35సీసీఏ, 35సీసీబీ కింద ఆమోదించి ఉంటే, వీటికి చేసే విరాళాలకు సెక్షన్ 80జీజీఏ రూ.10,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇందుకు నగదు రహితంగానే విరాళాలు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాపారం రూపంలో లేదా వృత్తి రూపంలో ఆదాయం కలిగిన వారికి ఈ ప్రయోజనం లేదు. వీటన్నిటితో పాటు రాజకీయ పార్టీలకిచ్చే విరాళాలపైనా సెక్షన్ 80జీజీసీ కింద పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపునకు పరిమితి లేదు. ఎంత మొత్తాన్నయినా విరాళంగా అందించి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే నగదు రహితంగానే విరాళాలు అందించి ఉండాలి. వైద్య బీమా ప్రీమియం చెల్లిస్తే.. వైద్య బీమా పాలసీకి ఏటా చెల్లించే ప్రీమియం మొత్తానికి సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు, వారి జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లలు వీరిలో ఎవరి పేరిట తీసుకున్నా గానీ, చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వార్షికంగా తన పేరిట, జీవిత భాగస్వామి, పిల్లల పేరిట చేసే వైద్య బీమా ప్రీమియం రూ.25,000పై ఈ పరిమితి పొందొచ్చు. దీనికి అదనంగా తల్లిదండ్రుల వైద్య బీమా పాలసీకి చేసే చెల్లింపులు మరో రూ.25,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీరు 60 ఏళ్లు దాటిన వారు అయితే రూ.30,000 వరకు అవకాశం ఉంది. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) అయితే, ఏ సభ్యులు ప్రీమియం చెల్లించినా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం చేసే చెల్లింపులు రూ.5,000 వరకు కూడా మినహాయింపు అమల్లో ఉంది. విద్యా రుణంపై వడ్డీ చెల్లింపులు ఉన్నత విద్య కోసం రుణం తీసుకుని చేసే వడ్డీ చెల్లింపులకు సెక్షన్ 80ఈ కింద పన్ను మినహాయింపు ఉంది. పన్ను చెల్లింపుదారు, అతని జీవిత భాగస్వామి, పిల్లలు, లేదా చట్టబద్ధంగా వేరెవరైనా విద్యార్థి తన సంరక్షణలో ఉంటే, వారి పేరిట తీసుకునే విద్యా రుణాలకు పన్ను మినహాయింపు పొందొచ్చు. కేవలం వడ్డీ రూపంలో చేసే చెల్లింపులకు, అది కూడా రుణం తీసుకున్న తర్వాత ఎనిమిదేళ్ల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇంటర్ తర్వాత చేసే ఉన్నత విద్యా కోర్సుల కోసం తీసుకునే రుణాలకే ఈ ప్రయోజనం. వడ్డీ రూపంలో చెల్లింపుల పరిమితి లేదు. ఎంత ఉన్నా, ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. రాయల్టీ ఆదాయానికీ మినహాయింపు... రచయితలకు వారి రచనల ద్వారా వచ్చే ఆదాయం ఉంటే, వార్షికంగా రూ.3 లక్షలకు సెక్షన్ 80క్యుక్యుబి ప్రకారం పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. కాకపోతే రాయల్టీ ఆదాయం ఏక మొత్తంలో వచ్చి ఉండాలి. ఏక మొత్తంలో కాకుండా వాయిదాలుగా అందుకుంటే మాత్రం రాయల్టీ ఆదాయంలో 15 శాతానికే పన్ను మినహాయింపు పరిమితం అవుతుంది. మేథో సంపత్తి హక్కులు 2003 ఏప్రిల్ 1 తర్వాత నమోదయిన ఏ పేటెంట్ ద్వారానైనా రాయల్టీ ఆదాయం అందుకుంటుంటే సెక్షన్ 80ఆర్ఆర్బి కింద ఒక ఏడాదిలో రూ.3లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. పన్ను వర్తించని ఆదాయాన్ని చూపించాలి బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, పోస్టాఫీసు పథకాలపై వచ్చే ఆదాయం కచ్చితంగా పన్ను పరిధిలోకి వస్తుంది. కానీ, 80 శాతం పన్ను చెల్లింపుదారులు వడ్డీ ఆదాయాన్ని చూపించడంలేదని ట్యాక్స్ స్పానర్ అనే పోర్టల్ పరిశీలనతో తేలింది. పన్ను చెల్లించకూడదన్న ఉద్దేశంతో, పన్ను నోటీసు అందుకోకూడదన్న అభిప్రాయంతో ఈ ఆదాయాన్ని చూపించడం లేదని ట్యాక్స్ స్పానర్ డాట్ కామ్ సీఎఫ్‌వో కౌశిక్ చెప్పారు. ♦ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్‌లపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10,000 వరకు పన్ను లేదని పైన చెప్పుకున్నాం. నిజానికి రూ.2.5 లక్షలను ఏడాది పాటు బ్యాంకులో ఉంచితే ఈ మేరకు వడ్డీ ఆదాయం వస్తుంది. రూ.10,000కు పైన వడ్డీ ఆదాయం అందుకునే వారు తక్కువ మందే ఉంటారు. కానీ, ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం రూ.10,000లోపు ఉన్నా పన్ను రిటర్నుల్లో తప్పకుండా ఆ ఆదాయాన్ని చూపించాలి. ♦ ఐటీఆర్–1లో ఎగ్జెంప్ట్ ఇన్కమ్ అనే కాలమ్‌లో ఇలా పన్ను రహిత ఆదాయాన్ని పేర్కొనాలి. ♦ డివిడెండ్ రూపంలో వచ్చే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల వరకు ఉంటే సెక్షన్ 10 (34) కింద పన్ను ఉండదు. అలాగే, జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ రూపంలో వచ్చే ఆదాయం లేదా పరిహారానికి సెక్షన్ 10 (10డి) కింద పన్ను మినహాయింపు ఉంది. వీటిని సైతం రిటర్నుల్లో పేర్కొనడం ద్వారా పన్ను అధికారులకు సందేహాలు తలెత్తితే సమాధానం చెప్పడం సులభం అవుతుందని నిపుణుల సూచన. ♦ ఇక అధిక విలువతో కూడిన పెట్టుబడుల వివరాలను కూడా పన్ను రిటర్నుల్లో పేర్కొనాలని సూచిస్తున్నారు. విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించాలా? ♦ ఇక్కడ నివసించేవారు, ఎన్ఆర్ఐలకు వేర్వేరుగా నిబంధనలు ♦ ఎన్ని రోజులున్నారన్న అంశం ఆధారంగా వర్గీకరణ ♦ స్వదేశంలో ఉండే వారు విదేశీ ఆదాయం చూపించాల్సిందే ♦ ఎన్ఆర్ఐలు భారత్‌లో ఆదాయాన్ని రిటర్నుల్లో పేర్కొనాలి ♦ రిటర్నుల దాఖలు పత్రాలు కూడా వేరే పనిచేస్తున్న కంపెనీ తరఫున కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరి విదేశీ క్లయింట్ల కోసం పనిచేయడం ద్వారా వీరు ఆర్జించే విదేశీ మారకాన్ని తమ పన్ను రిటర్నుల్లో చూపించాలా? స్వదేశానికి వెలుపల ఆర్జించిన మొత్తంపై పన్నుకు సంబంధించి నిబంధనలేంటి? విదేశీ ఆర్జనను పన్ను రిటర్నుల్లో ఎలా చూపించాలి? ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానమే ఈ కథనం... విదేశీ ఆదాయం భారతీయ పన్ను చట్టాలు పన్ను చెల్లింపుదారులను ఓ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజుల పాటు స్వదేశంలో ఉన్నారనే వివరాల ఆధారంగా వారిని నివాసితులు (రెసిడెంట్), నివాసేతరులు (నాన్ రెసిడెంట్)గా వర్గీకరించింది. వారి నివాస హోదాకు అనుగుణంగా భారతీయ పన్ను చట్టాల పట్ల వారికున్న బాధ్యతను విస్తృతంగా నిర్వచించాయి. ప్రతి ఆర్థిక సంవత్సరానికీ తమ హోదాను బట్టి వారు తమ ఆదాయాన్ని చూపించాలి. పన్ను చట్టాల ప్రకారం... దేశంలో నివసించే ప్రతి పౌరుడూ, దేశం వెలుపల తాను ఆర్జించిన ఆదాయాన్ని తప్పనిసరిగా రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. అదే ఎన్ఆర్ఐ అయితే కేవలం భారత్‌లో ఆర్జించిన దాన్నే స్వదేశంలో దాఖలు చేసే రిటర్నుల్లో చూపిస్తే సరిపోతుంది. ఒకే ఆర్థిక సంవత్సరంలో స్వదేశంలోను, విదేశంలోనూ ఒక కంపెనీ తరఫున పనిచేయడం ఇటీవల సాధారణంగా కనిపిస్తోంది. కంపెనీలు కొందరు ఉద్యోగులను విదేశాల్లోని కార్యాలయాల్లో విధుల కోసం కొంత కాలం పాటు పంపిస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. విదేశీ ప్రాజెక్టుల కోసం ఉద్యోగులను తరచుగా ఇలా పంపిస్తున్నాయి. ఆ పనికి చెల్లింపులను విదేశీ కార్యాలయం చేస్తుంటుంది. అప్పుడది విదేశీ ఆర్జన అవుతుంది. ఇక విదేశాల్లో ఉన్న ఇంటి నుంచి అద్దె రూపంలో కొందరికి ఆదాయం ఉండొచ్చు. ఇటువంటి ఆదాయాన్ని భారత్‌లో నివసించే వారు తప్పకుండా తమ రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. రిటర్నుల దాఖలు ఈ తరహా వ్యక్తులు అంటే విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించదలిస్తే వారికి ఐటీఆర్–1 వర్తించదు. విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించే వారు ఐటీఆర్–2ను తీసుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్–2 లేదా ఐటీఆర్–3 ఈ రెండింటిలో ఒక దానిని వారి ఆదాయ వివరాల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. ఎఫ్ఎస్ఐ షెడ్యూల్లో చూపించాలి. రెండు పన్నులు భారత్‌లో నివసించే వారు తమ విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించి ఆ మేరకు పన్ను చెల్లించడం తప్పనిసరి అని చెప్పుకున్నాం. అయితే, ఒకవేళ పన్నులను విదేశాల్లోనే మినహాయిస్తే ఆ ఆదాయాన్ని ఇక్కడ చూపించి పన్ను చెల్లిస్తే అప్పుడు రెండు సార్లు పన్నులు చెల్లించినట్టు అవుతుంది. అందుకే ఒకసారి పన్ను మినహాయిస్తే దానిపై పన్ను చెల్లించక్కర్లేదు. పలు దేశాలతో మనకు ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం ఉంది. విదేశీ ఆదాయంపై పన్నును అక్కడే మినహాయించేస్తే ఇక్కడ మరోసారి పన్ను చెల్లించే పని లేకుండా ఉపశమనం పొందొచ్చు. దీన్నే విదేశీ పన్ను జమగా (ఎఫ్‌టీసీ) పేర్కొంటారు. -
కొత్త ఏడాదైనా కాస్త మారదాం..!
మరో సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. మరి ఆర్థికాంశాలకు సంబంధించి ఎప్పుడూ ఏవేవో సాకులు చెప్పుకుంటూ వాయిదాలు వేస్తూ వస్తున్న వారు ఇప్పటికైనా సరైన ప్రణాళిక వేసుకున్నారా? లేదనుకోండి... ఇకనైనా ఆలస్యం చెయ్యకండి. ఎందుకంటే గమ్యంపై స్పష్టత ఉంటేనే ప్రయాణం వేగంగా, సాఫీగా సాగుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనుసరించదగ్గ ఆర్థిక తీర్మానాల గురించి నిపుణులు, ఆర్థిక సలహాదారులు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం... ఆలస్యం విషమే! కొత్తవారైతే ముందు 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెక్షన్ 80సీ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే పెట్టుబడులకింకా మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంది. మార్చిలోపు పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. చివరి నిమిషం వరకు వాయిదా వేస్తే ఆఖర్లో ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే ముందుగా ఆరంభిస్తే వయసు, అవసరాలు, రిస్క్ తీసుకోగల స్థాయి, రాబడులు, అవసరంలో నగదు చేసుకోగల వెసులుబాటు వంటివన్నీ పరిశీలించి తగిన సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం ఆరంభం అవుతుంది కనక కనీసం జూన్ నుంచయినా పన్ను ఆదా పెట్టుబడులను ఆరంభించి ఏడాది పాటు కొనసాగించాలి. ముందుగా ఆరంభించడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనంతో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. సకాలంలో రిటర్నులు వేయండి... మనలో కొందరు పన్ను రిటర్నులను సకాలంలో దాఖలు చేయరు. ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ఆలస్యమైతే వడ్డీతో పాటు పెనాల్టీ కూడా భరించాలి. గడువులోపు రిటర్నులు వేయకపోతే ఆలస్య రుసుం గతంలో రూ.1,000గా ఉండగా అదిప్పుడు రూ.10,000గా మారింది. అందుకే గడువులోపు రిటర్నులు ఫైల్ చేయాలి. గడువులోపు బీమా పాలసీల ప్రీమియం చెల్లించడం కూడా అవసరమే. లేదంటే బీమా రక్షణ కోల్పోవాల్సి వస్తుంది. ఇంకా రుణాలకు సకాలంలో చెల్లింపులు చేయడం కూడా తప్పనిసరి. ఎందుకంటే ఆలస్యమైతే అనవసర వడ్డీ భారంతో పాటు క్రెడిట్‌స్కోరు కూడా తగ్గిపోతుంది. క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం కట్టేస్తే బెటర్! చాలా మందికి క్రెడిట్ కార్డుపై భారీ మొత్తం వాడటం, నెలయ్యేసరికి ఎంతో కొంత కనీస బిల్లు చెల్లించటం అలవాటు. కానీ అలా చేయటం వల్ల వారి మొత్తం రుణం ఎప్పటికీ తీరదనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బ్యాలెన్స్ మొత్తంపై దాదాపు నెలకు 2.5 నుంచి 3 శాతం వడ్డీ అంటే ఏడాదికి 30–36 శాతం చెల్లించాల్సి వస్తుంది. దీనికి ఆలస్యపు చెల్లింపుల ఫీజు కూడా తోడైతే ఇక చెప్పనక్కర్లేదు. అందుకే కార్డుపై వీలైనంత తక్కువ వాడటం... ఏ నెలకు ఆ నెల మొత్తం బిల్లు చెల్లించేయటం చేస్తుండాలి. రుణ సమస్యల్లో ఉన్న వారు ముందుగా తీర్చేయాల్సింది క్రెడిట్ కార్డు బకాయిలే. రివాల్వింగ్ క్రెడిట్‌కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. జీవితానికీ కవరేజీ తప్పనిసరి.. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. ఎందుకంటే జీవితం, ఆరోగ్యం అన్నవి ఇలానే ఉంటాయని ఊహించలేం. అనారోగ్యం పాలైతే అయ్యే వ్యయాలు బడ్జెట్‌ను గుల్ల చేసేస్తాయి. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి దూరమైతే ఆ కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయి. అందుకే తమ వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్ల మేర బీమా పాలసీ తీసుకోవడం మరవద్దు. ఏవైనా రుణాలు తీసుకుని ఉంటే వాటికి సరిపడా బీమా కవరేజీ పెంచుకోవాలి. జీవిత బీమాకు టర్మ్ పాలసీలు ఉత్తమం. తక్కువ ప్రీమియానికే గణనీయమైన కవరేజీనిస్తాయి. అలాగే రూ.4–5 లక్షల కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్‌పాలసీ కూడా తీసుకోవాలి. ఖర్చుల్లో స్మార్ట్‌గా... ఆరు నెలల అవసరాలను తీర్చే స్థాయిలో ఓ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం అవసరం. అనుకోని, అనూహ్య, అత్యవసరాలు ఏర్పడితే ఆదుకుం టుంది. ఈ నిధుల్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో లేదా తక్కువ రిస్క్ ఉండే లిక్విడ్ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అవసరంలో వేగంగా వీటిని వెనక్కి తీసుకునే సౌలభ్యం ఉంటుంది. అయితే, సంక్షోభం ఏర్పడితే తప్ప ఈ నిధుల్ని కదలించకూడదు. మీ బడ్జెట్ పరిమితుల్లో స్మార్ట్‌గా ఖర్చు చేయడాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ ఖర్చులు చేయి దాటిపోకుండా వాటిని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఈ విషయంలో సా యం చేయడానికి ఆన్లైన్ మనీ మేనేజ్మెంట్ టూల్స్ చాలానే ఉన్నాయి. అవసరం లేని వాటిని రుణం తీసుకుని కొనే చర్యలకు దూరంగా ఉండాలి. ఈక్విటీల్లో సిప్ చేయండి.. ఏడాదికి 4– 6 శాతం వడ్డీనిచ్చే సేవింగ్స్ ఖాతాలో నిధులను నిల్వ చేసుకోవడం సరికాదు. పైగా సేవింగ్స్ రాబడులు ఏడాదిలో రూ.10,000 దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అధిక రాబడులను ఇచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేసే అవకాశాలపై దృష్టి సారించడం మంచిది. స్థిరమైన ఆదాయం కోసం డెట్ సాధనాలు అవసరమే కానీ, వీటిలో చాలా వరకు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇవ్వలేవు. ఈక్విటీలకు మాత్రం ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులనిచ్చే సత్తా ఉంది. అందుకే, ఏ సాధనానికి ఎంత కేటాయించాలన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి. మీ వయసు, అవసరాలు, రిస్క్‌కు అనుగుణంగా ఈక్విటీ, డెట్ తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి అందరికీ నప్పే ఓ ఆచరణీయ సూత్రం ఉంది. 100 నుంచి మీ ప్రస్తుత వయసు తీసివేయగా, ఎంత వస్తే అంత మేర ఈక్విటీలకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు మీ వయసు 35 అనుకోండి. అప్పుడు 65 వస్తుంది. అంటే ఈక్విటీలకు మీ పెట్టుబడుల్లో 65 శాతం కేటాయించుకోవచ్చని అర్థం. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడం కొంత వరకు రక్షణాత్మకం. స్వల్పకాలంలో అస్థిరతలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం మంచి ఫండ్స్ రెండంకెల స్థాయిలో లాభాలను ఇస్తున్నాయి. పైపెచ్చు ఈక్విటీ ఫండ్స్‌లో ఏకమొత్తంలో కంటే నెలవారీ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయటమే మంచిది. ముఖ్యంగా మార్కెట్లు బాగా పెరిగి ఉన్న ప్రస్తుత స్థితిలో స్టాక్స్ విలువలు చాలా గణనీయమైన స్థాయిలో ఉన్నాయి. ఒకవేళ మార్కెట్లు కరెక్షన్కు లోనవుతున్నా గానీ సిప్ రూపంలో పెట్టుబడులు ఆపకూడదు. మార్కెట్లు తగ్గుతున్నప్పుడు ఫండ్స్ యూనిట్ల విలువ కూడా తగ్గుతుంది. కనుక సిప్ రూపంలో ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. స్వల్పకాలంలో ఆటుపోట్లు కనిపించినా దీర్ఘకాలంలో సిప్ చాలా చక్కని రాబడులకు బాట వేస్తుంది. -
పొదుపు డబ్బులపై ఆంక్షలు
సాక్షి, అమరావతి: ‘మిత్ర’ మహిళా సంఘంలో పది మంది సభ్యులున్నారు. వీరంతా ప్రతి నెలా వంద రూపాయల చొప్పున బ్యాంకు పొదుపు ఖాతాకు జమ చేస్తున్నారు. పిల్లలు చదువులు, చిరు వ్యాపారం, కుటుంబ అవసరాలకు ఇది అక్కరకు వస్తుందని ముందుచూపుతో పొదుపు చేసినా రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగా వారి ఆశలు నెరవేరటం లేదు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవటంతో పొదుపు ఖాతాలో దాచుకున్న డబ్బులు తీసుకునేందుకు సంఘాలను బ్యాంకులు అనుమతించటం లేదు. రాష్ట్రంలోని మెజారిటీ బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు రావటం గమనార్హం. దాచుకున్న డబ్బులున్నా ప్రైవేట్ అప్పులే దిక్కు ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ కుదరదని తేల్చి ప్రతి మహిళకు పది వేల రూపాయల చొప్పున పెట్టుబడి నిధిగా ఇస్తానంటూ మాట మార్చటం తెలిసిందే. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవటంతో పొదుపు కింద బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను కూడా బ్యాంకులు ఇవ్వడం లేదు. మహిళా సంఘాలు సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకులు అనుమతించడం లేదు. దీంతో పెళ్లిళ్లు ఇతర అవసరాల కోసం మహిళా సంఘాలు ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తోంది. రుణమాఫీ చేయకపోవటమే కారణం ఒకపక్క బ్యాంకులో వారి డబ్బులుండి కూడా డ్వాక్రా మహిళలకు అప్పు చేయాల్సిన దుస్థితి రావడం శోచనీయమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి, ప్రభుత్వం చెబుతున్న దానికి పొంతన లేదని భేటీలో అధికారులు స్పష్టం చేశారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడమే దీనికంతటికీ ప్రధాన కారణమని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. మహిళా సంఘాల పేరుతో ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోవటంతో అవి అలాగే ఉన్నాయని, పొదుపు ఖాతాల నుంచి సంఘాలకు డబ్బులు ఇచ్చేస్తే రుణాలు ఎవరు తీరుస్తారని బ్యాంకర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలపై చార్జీల మోత మరోపక్క మెజార్టీ బ్యాంకులు నిర్ధారించిన వడ్డీ కన్నా ఎక్కువకు రుణాలు ఇస్తున్నాయని, వివిధ రకాల చార్జీల పేరుతో సంఘాల నుంచి అధికంగా వసూలు చేస్తున్నట్లు తేలిందని సమావేశంలో అధికారులు తెలిపారు. కొన్ని బ్యాంకులు మహిళా సంఘాలకు 12.5 శాతం వడ్డీకి, మరి కొన్ని బ్యాంకులు 14.5 శాతం వడ్డీకి రుణాలను ఇవ్వాల్సి ఉంది. అయితే ఇంతకంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వివిధ రకాల చార్జీల రూపంలో బ్యాంకులు ఎక్కువ మొత్తంలో సంఘాల నుంచి వసూలు చేస్తున్నాయని వెల్లడైంది. కొన్ని బ్యాంకులు రుణాల మంజూరు సమయంలో జీవిత బీమా, వైద్య బీమా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. సకాలంలో చెల్లించినా ప్రయోజనం ‘సున్నా’ సకాలంలో అప్పు చెల్లించిన డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలను వర్తింప చేయాలి. అయితే 2015 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు సున్నా వడ్డీకి చెల్లించాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో సకాలంలో రుణాలను చెల్లించిన మహిళా సంఘాలకు సున్నా వడ్డీ ప్రయోజనం దక్కటం లేదు. ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో మెలగిన రాష్ట్రంలోని మహిళా సంఘాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం కారణంగా నిర్వీర్యం అయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. -
సేవింగ్స్‌పై వడ్డీ అరశాతం కోత: యాక్సిస్
ముంబై: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును అరశాతం తగ్గించింది. సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్లు రూ. 50 లక్షల కన్నా తక్కువుంటే ఇకపై 3.5 శాతం వడ్డీ రేటు మాత్రమే చెల్లించనుంది. రూ. 50 లక్షలు పైబడిన మొత్తం ఉంటే మాత్రం యథాప్రకారం 4 శాతంగానే కొనసాగించనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. రూ. 1 కోటి కన్నా తక్కువగా డిపాజిట్లున్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును తగ్గించిన తర్వాత, బ్యాంక్ ఆఫ్ బరోడా, కర్ణాటక బ్యాంకులు కూడా సేవింగ్స్ అకౌంట్లపై రేటును తగ్గించాయి. -
యాక్సిస్ బ్యాంకు కూడా తగ్గించేసింది
ముంబై: ప్రముఖ ప్రయివేటు యాక్సిస్ బ్యాంకు కూడా వడ్డీరేటులో కోత పెట్టింది. అంచనాలకనుగుణంగానే యాక్సిస్ కూడా వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. సేవింగ్ ఖాతాలపై చెల్లించే వడ్డీరేటును 50 బీపీఎస్ పాయింట్లను తగ్గించింది. దీంతో ప్రస్తుత వడ్డీరేటు 3.5శాతంగా ఉండనుంది. పొదుపు ఖాతాల్లోని నిధులపై ఇచ్చే వడ్డీ రేటును యాక్సిస్ బ్యాంక్ అర శాతం తగ్గించింది. 3.5 శాతానికి కుదించింది. రూ. 50లక్షల వరకు వరకు నిల్వ (బ్యాలెన్స్) ఉన్న ఖాతాలకు ఈ రేట్ల కోత వర్తిస్తుంది. రూ.50లక్షలకుపైన 4శాతంవడ్డీ చెల్లించనుంది. కాగా రిజర్వ్ బ్యాంక్ తాజా రివ్యూ లో కీలక వడ్డీరేటులో పావు శాతం కోత విధించడంతో ప్రభుత్వ రంగబ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా కూడా సేవింగ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 3.5శాతంగా నిర్ణయించింది. మరో పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలే పొదుపు ఖాతాల (రూ.50లక్షలలోపు) వడ్డీరేటును 3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. -
పేటీఎం పేమెంట్ బ్యాంకు వడ్డీరేటు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: పే మెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించనున్న ఇ-వాలెట్ అగ్రగామి పేటీఎం తన పేమెంట్ బ్యాంక్ మొట్టమొదటి శాఖను నేడు( మే 23, మంగళవారం) ఢిల్లీలో ప్రారంభించనుంది. ఈ సందర్బంగా వినియోగదారులకు చెల్లించనున్న వార్షిక వడ్డీరేటును ప్రకటించింది. దాదాపు ఒక సంవత్సరం ఆలస్యం తరువా , కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పేటీఎం తన చెల్లింపుల బ్యాంకును లాంచ్ చేస్తోంది. ఢిల్లీలో మొదట శాఖను ప్రారంభించనున్నామని, ఇతర మెట్రో నగరాల్లో రెండో విడత ప్రారంభిస్తామని 'పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. మూడు నెలలు తర్వాత రెండో విడతను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు దేశంలోని మొత్తం మూడు చెల్లింపులు (ఎయిర్టెల్, ఇండియా పోస్ట్) బ్యాంకులలో అత్యల్పంగా వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. ఏడాదికి ఎయిర్టెల్ 7.25 శాతం, ఇండియా పోస్ట్ 5.5 శాతం వడ్డీని అందిస్తోంటే పేటీఎం మాత్రం వినియోగదారులకు 4శాతం వార్షిక వడ్డీ రేటును అందించనున్నట్టు తెలిపింది. అలాగే డిపాజిట్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను వెల్లడించింది. 2020 నాటికి కంపెనీ 500 మిలియన్ల ఖాతాలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రణూ సత్తీ చెప్పారు. ఈ నేపథ్యంలో మొదటి శాఖను నోయిడాలో మంగళవారం ప్రారంభించనుంది. ఈ సంవత్సరంలో 31 శాఖలు, 3,000 కస్టమర్ సర్వీస్ పాయింట్లు తెరవాలని యోచిస్తోంది. చెల్లింపుల బ్యాంకులో ఖాతా తెరిచిన మొట్టమొదటి మిలియన్ కస్టమర్లకు రు .25,000 డిపాజిట్లపై రూ.250ల స్పాట్ క్యాష్ బ్యాక్ అందిస్తామని, అన్ని ఆన్లైన్ లావాదేవీలు ఉచితమని కంపెనీ తెలిపింది. దీంతోపాటు వినియోగదారులకు రుపే కార్డులు అందిస్తుంది. అలాగే నెలకు ఐదు ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచితం (నాన్ మెట్రో నగరాల్లో) . ఆ తరువాత, వినియోగదారులు ప్రతి ఉపసంహరణకు రూ. 20 రూపాయలు చెల్లించాలి. తమ బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసెకోవాల్సిందిగా ఇప్పటికే గత 48 గంటల్లో 2.20 కోట్ల మెసేజ్‌లను పంపించింది. మరోవైపు ఎయిర్టెల్ పేమెంట్‌బ్యాంకు ప్రతి నగదు ఉపసంహరణపై 0.65 శాతం వసూలు చేస్తుండగా, ప్రస్తుతం ఉన్న చెల్లింపుల బ్యాంకుల్లో ఇండియా పోస్ట్ మాత్రం ఇది తన ఖాతాదారులకు భారతదేశం పోస్ట్ ఎటిఎం నుంచి నగదును తీసుకోవడానికి కార్డును అందిస్తోంది. కాగా దేశంలో మొట్టమొదటి చెల్లింపులన బ్యాంకును ఎయిర్ టెల్ ప్రారంభించింది. ఆ తర్వాత ఇండియాపోస్ట్ ఎయిర్‌టెల్‌ను అనుసరించింది. -
అకటా...! మళ్లీ కటకట
⇒ బ్యాంకుల్లో నిండుకున్న నగదు నిల్వలు ⇒ ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులు ⇒ నగదురహితం పేరిట ప్రభుత్వం గొప్పలు ⇒ పల్లెలు, పట్టణాల్లో సామాన్యుల ఇక్కట్లు ‘నో క్యాష్’ బోర్డులు...పొడవైన క్యూలు... బ్యాంకుల్లో పడిగాపులు... అయినా అందుబాటులోకి రాని నగదు...వెరసి అమరావతిలో మరో సారి నగదు కష్టాలు ముప్పిరిగొన్నాయి. మూడు నెలల పాటు నగదు కష్టాలతో అల్లాడిన సామాన్యులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నామని భావిస్తుండగా... అంతలోనే మరోసారి నగదు కొరత వచ్చిపడింది. సాక్షి, అమరావతి బ్యూరో : బ్యాంకుల వద్ద నగదు నిల్వలు దాదాపు నిండుకోవడంతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు అమరావతి ప్రాంతాన్ని నగదు రహిత జిల్లాలుగా ప్రకటిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారైంది. నగదు కష్టాలు రిజర్వు బ్యాంకు రాష్ట్రంలోని బ్యాంకులకు నగదు సరఫరాను గణనీయంగా తగ్గించివేసింది. నగదు రహిత లావాదేవీలవైపు ప్రజలను మళ్లించేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అమరావతి పరిధిలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారైంది. కృష్ణా జిల్లాలో 48 బ్యాంకులకు చెందిన 789 శాఖలు ఉండగా, గుంటూరు జిల్లాలో 42 బ్యాంకులకు చెందిన 795 శాఖలు ఉన్నాయి. దాదాపు అన్ని శాఖల్లోనూ కనీస స్థాయిలో కూడా నగదు నిల్వలు లేకుండా పోయాయి. కొత్తగా ప్రారంభించిన శాఖకు రోజువారీ లావాదేవీలకు కనీసం రూ.50లక్షలు అవసరం కాగా, 10 ఏళ్లకు పైబడిన శాఖలలో రోజుకు దాదాపు రూ.2కోట్ల వరకు లావాదేవీలు సాగుతాయి. ఇక గ్రామీణ బ్యాంకులకు రోజుకు కనీసం రూ.10లక్షల వరకు అవసరం. కానీ అందులో 25 శాతం నగదు నిల్వలు కూడా లేకుండాపోయాయి. దాంతో బ్యాంకుల్లో దాదాపు 75 శాతం లావాదేవీలు తగ్గిపోయాయి. డ్వాక్రా సంఘాలు, రైతులకు చెల్లింపులు నిలిపి వేశారు. ఖాతాదారులకు నగదు చెల్లింపులపై అనధికారికంగా పరిమితులు విధిస్తున్నారు. నో క్యాష్ బోర్డులే ... నగదు నిల్వలు లేకపోవడంతో ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో 928 ఏటీఎంలు, గుంటూరు జిల్లాలో 850 ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో 80శాతం ఏటీఎంలలో నగదు నిల్వలు లేనేలేవు. విత్‌డ్రా కోసం ఖాతాదారులు పలు ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒక్కో ఏటీఎంలో రోజుకు సగటున రూ.30లక్షలు ఉంచాలి. కానీ ప్రస్తుతం రూ.10లక్షలు కూడా అందుబాటులో ఉంచలేకపోతున్నారు. 13 నుంచి పరిస్థితి ఏమిటో...!? ఈ నెల 13 నుంచి బ్యాంకుల్లో విత్‌డ్రాల మీద పరిమితి ఎత్తివేస్తామని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతా నుంచి రోజుకు రూ.50వేల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మార్చి 13 నుంచి ఆ పరిమితి తొలగిస్తామని చెప్పారు. అదే విధంగా ఏటీఎం నుంచి రోజుకు రూ.40వేలు విత్‌డ్రా చేసుకోవచ్చని కూడా ప్రకటించారు. కానీ ప్రస్తుతం నగదు నిల్వలు నిండుకోవడంతో ఆర్బీఐ ప్రకటించిన విధానం అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. -
వారానికి రూ. 50,000 తీసుకోవొచ్చు
సేవింగ్స్ ఖాతాల విత్ డ్రాయల్ పరిమితి పెంపు ముంబై: సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వీక్లీ క్యాష్ విత్‌డ్రాయల్ పరిమితి సోమవారం నుంచి రూ.50,000కు పెరిగింది. అంటే ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి వారానికి రూ.50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. మార్చి 13 నుంచి ఈ పరి మితి కూడా ఉండదు. కాగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి క్యాష్ విత్‌డ్రాయల్ పరిమితి ఇప్పటివరకూ రూ.24,000గా ఉంది. క్యాష్ విత్డ్రాయల్స్పై ఉన్న పరిమితులను రెండంచెల్లో ఎత్తివేస్తామని ఆర్బీఐ ఇదివరకే ప్రకటించింది. ఇందులో మొదటిది సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్ 8 నుంచి క్యాష్ విత్డ్రాయెల్స్పై పరిమితులు ఆర్బీఐ విధించింది.