మైనర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ | ICICI Bank Savings Account to Minors | Sakshi
Sakshi News home page

మైనర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్

Published Thu, Sep 25 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

మైనర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్

మైనర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్

 ముంబై: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ బుధవారం పదేళ్లు పైబడిన మైనారిటీల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించింది. వ్యక్తిగత చెక్‌బుక్, డెబిట్ కార్డ్‌ను కూడా ఈ అకౌంట్‌తో బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.

 పిల్లల్లో పొదుపు, ఆర్థిక పరంగా జవాబుదారీ తనాన్ని పెంచడం లక్ష్యంగా ఈ ‘స్మార్ట్ స్టార్’ అకౌంట్‌ను ప్రారంభించినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సబర్వాత్ తెలిపారు. చెక్కుల జారీ, బిల్లుల చెల్లింపు, మొబైల్ ఫోన్ల రిచార్జ్, ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్ల ప్రారంభం,  ఏటీఎం, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఆర్థిక అంశాలపై మైనర్లకు అవగాహన పెరుగుతుందనీ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement