minority
-
Minority Rights Day: మైనారిటీలంటే ఎవరు? జాబితాలో ఎవరున్నారు?
భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 18న మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మైనారిటీ కమ్యూనిటీల హక్కులను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. అలాగే ఈరోజు దేశంలోని మైనారిటీల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. 2013లో తొలిసారిగా మన దేశంలో మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.1992, డిసెంబర్ 18న ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో జాతి, మతపరమైన, భాషాపరమైన మైనారిటీలకు ప్రత్యేక హక్కులను ఆమోదించింది. 2013లో భారతదేశంలో మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మైనారిటీ సమూహాల గుర్తింపు, హక్కులను పరిరక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిక్లరేషన్ రాష్ట్రాలను కోరింది.నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ (ఎన్సీఎం)ను 1992లో జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం కింద అధికారికంగా స్థాపించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలతో పాటు గుర్తింపు పొందిన మైనారిటీ కమ్యూనిటీల రాజ్యాంగ హక్కుల అమలును పర్యవేక్షించడం ఎన్సీఎం లక్ష్యం. 2014లో జైనులను ఈ జాబితాలో చేర్చారు. భారతదేశంలో మైనారిటీల హక్కులను వివిధ రాజ్యాంగ నిబంధనలలో పొందుపరిచారు. ఆర్టికల్ 29, 30 ప్రకారం వారికి హక్కులపై హామీలిచ్చారు. మైనారిటీలకు విద్య, సంస్కృతి, మతం లేదా భాష ఆధారంగా వివక్ష నుండి స్వేచ్ఛను పొందే హక్కులను రాజ్యాంగం కల్పించింది. వీటిని అమలు చేయడానికి, మైనారిటీ వర్గాల ఫిర్యాదులను పరిష్కరించడానికి ఎన్సీఎం పనిచేస్తుంది.ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్దులు, పార్సీలు, జైనులను ఎన్సీఎం మైనారిటీలుగా గుర్తిస్తుంది. మైనారిటీ హక్కుల దినోత్సవ ప్రాముఖ్యత విషయానికొస్తే.. మైనారిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించేందుకు, వాటిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ఈరోజు(డిసెంబరు 18)న నిర్వహిస్తుంటారు. అన్ని వర్గాలకు సమాన హక్కులు , సామాజిక న్యాయం కోసం కృషి చేయాల్సిన అవసరాన్ని మైనారిటీ హక్కుల దినోత్సవం గుర్తు చేస్తుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: మరోసారి వైఎస్ జగన్ స్పష్టీకరణ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముస్లిం మైనారిటీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ముస్లిం మైనారిటీల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందని.. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామన్నారు.‘‘ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ తొలి నుంచి అండగా నిల్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీ వెంట నడుస్తుంది. వక్ఫ్ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను మా పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇంకా పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న మా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, మీ అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారు’’ అని వైఎస్ జగన్ చెప్పారు.మరో వైపు, ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వక్ఫ్ భూముల్లో దాదాపు 70 శాతానికి పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ (వక్ఫ్) భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. కొత్త వక్ఫ్ బిల్లును మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందన్న వారు, ఆ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించడంపై హర్ష్యం వ్యక్తం చేశారు. బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించడం వల్లనే, కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని వారు గుర్తు చేశారు.కాగా, వక్ఫ్ భూముల పరిరక్షణకు వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ వెల్లడించారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేయడంతో పాటు, ఆ భూముల వివరాలన్నీ ఆన్లైన్ ఒక గొప్ప పరిణామం అన్న ఆయన, ముస్లింలకు జగన్ చేసిన మేలు, దేశ చరిత్రలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు చేయలేదని స్పష్టం చేశారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా జీవో నెం 60 జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
ఓబీసీల కోసం రాజ్యాంగ సవరణ తప్పదు..
బిహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఇది దేశంలోని బీసీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. బిహార్ నమునాగా ఇతర రాష్ట్రాలు కూడా కులగణన చేసి శాస్త్రీయంగా బీసీల జీవన స్థితిగతుల లెక్కలు తీసుకుని విద్యా–ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంపుదల చేసుకోవచ్చని ఆశగా ఎదురు చూసిన వారు విస్మయానికి గురైనారు. దీంతో రాజ్యాంగ సవరణ చేయకుండా ఓబీసీల విద్యా–ఉద్యోగ రిజర్వేషన్ల పెంపుదల జరుగదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం 69 శాతానికి పెంచిన మొత్తం రిజర్వేషన్ శాతం ఇప్పటికీ కొనసాగుతున్న విషయం గమనార్హం. శాసన సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది రాష్ట్ర ప్రభుత్వం. పార్టీలకు అతీతంగా సీఎం జయలలిత ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి అప్పటి పీవీ నరసింçహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి... తమ శాసన సభ చేసిన చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా చేశారు. దీంతో తమిళనాడులో అమలు జరుగుతున్న 69 శాతం రిజర్వేషన్లపై ఏ కోర్టులోనూ ఛాలెంజ్ చేసే అవకాశం లేకుండాపోయింది.బిహార్ రాష్ట్రం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ తరహాలో బీసీలకు అధిక రిజర్వేషన్లు అందేలా చూడాలి. బిహార్‌తో పాటుగా అన్ని రాష్ట్రాలూ ఇదే దారిలో ప్రయాణించవలసి ఉంది. ఇది జాతీయ ఉద్యమంగా రూపుదాల్చవలసి ఉన్నది. ఏ రాష్ట్రంలోనైనా బీసీల రిజర్వేషన్లు పెంచాలనే తలంపుతో ఏ విధాన నిర్ణయం తీసుకున్నప్పటికీ 1992లో ‘ఇందిరా సహానీ’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాద’నే తీర్పును అడ్డుపెట్టుకుని ఆధిపత్య వర్గాలు కోర్టులకు వెళ్ళి అడ్డుపడుతున్నాయి. బిహార్‌లో మాదిరిగా మహారాష్ట్ర, రాజస్థాన్, హరియాణా ప్రభుత్వాలు 50 శాతం రిజర్వేషన్లు మించి ఇచ్చాయని సుప్రీంకోర్టులో పిల్స్ వేశారు. దీన్ని బట్టి చూస్తే విధిగా రాజ్యాంగసవరణ చేస్తే తప్ప బీసీలకు న్యాయం చేయడానికి వేరే మార్గం లేదని అర్థమవుతుంది.బిహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 50 శాతానికి మించి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలా అంగీకరించిందని బీసీలు ప్రశ్నిస్తున్నారు.ఈ డబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు జనాభా గణన చేయలేదు. వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేయకుండా అగ్రవర్ణాలలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దేశజనాభాలో అగ్రవర్ణాలు ఎంతమంది? వారిలో పేదరికం ఎంత శాతం? ఈ లెక్కలు లేకుండా 10 శాతం రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో కేంద్రమే చెప్పాలి. అయినా సుప్రీంకోర్టు ధర్మాసనం 10 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 85 శాతం మంది ఉంటే వీరిలో 56 శాతంగా ఉన్న బీసీలలో పేదలు ఎంతమందో ఎవరి దగ్గరా లెక్కలు లేవు. అందుకే ఓబీసీ రిజర్వేషన్లలో ఎలాంటి పరిమితి విధించకుండా అత్యవసరంగా రాజ్యాంగంలోని 15(4), 16(4) ఆర్టికల్స్‌ను సవరించాలి. అపుడే బీసీలకు విద్యా– ఉద్యోగ రంగాలలో న్యాయం జరుగుతుంది.పట్నా హైకోర్టు తీర్పు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇపుడు దేశంలోని ఓబీసీలంతా స్పష్టంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఆలోచనలతో తమిళనాడులో రామస్వామి పెరియార్ కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తితో ఓబీసీ ఉద్యమం కొనసాగించవలసి ఉంది. నితీష్ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున తమిళనాడులాగా ఒక చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చుకుని బిహారు రాష్ట్రం వరకు రిజర్వేషన్ల పెంపును అమలు జరుపుకునే అవకాశముంది. ప్రస్తుతం ఎన్డీఏ మిత్రత్వం బిహారుకు కలిసివచ్చే విధంగా ఉంది.దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చి బడుగులందరి తరఫున నిలిచి కేంద్రంపై బీసీ రిజర్వేషన్లు పెంచడానికై రాజ్యాంగ సవరణ చేయాలని ఒత్తిడి పెంచాలి. ఓబీసీల హక్కుల సాధన కోసం జాతీయోద్యమం రూపుదాల్చే సమయం ఆసన్నమయ్యింది.దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పాటు పడిన బీఆర్ అంబేడ్కర్ తర్వాత అంతగా కృషి చేసినవారు తమిళనాడు సామాజిక, రాజకీయ రంగాల నాయకులనే చెప్పాలి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు విద్యా–ఉద్యోగాలలో రిజర్వేషన్ల పెంపుదల కోసం తమిళనాడులో మహోద్యమాలు జరిగాయి. పెరియార్ రామస్వామి చేసిన కృషి మరువలేనిది. రిజర్వేషన్లను న్యాయస్థానం అడ్డుకోకుండా చేయడంలో పెరియార్ రామస్వామి జరిపిన పోరాటం మరిచిపోలేనిది. అంబేడ్కర్ రిజర్వేషన్ల రక్షణ కోసం చేసిన పోరాటానికి కొనసాగింపుగా తమిళనాడులో పెరియార్, ఉత్తర భారతంలో రామ్ మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్లు చేసిన ఉద్యమాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు దేశవ్యాపితంగా ఓబీసీ రిజర్వేషన్ల కోసం జాతీయ ఉద్యమం రూపుదాల్చవలసి ఉంది. నేటి ఓబీసీ యువతరం, విద్యావంతులు ఈ ఉద్యమంలో కీలకంగా పాల్గొనాలి. బడుగు వర్గాల నుంచి వచ్చిన యువతరం బీసీలకు జరిగిన అన్యాయాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. బీసీలను ఐకమత్యం చేసే పనిలో పాలుపంచుకోవాలి. ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాలలో బీసీలకు న్యాయం జరిగేదాకా ఉద్యమపథంలో ముందుకు సాగక తప్పదు. న్యాయస్థానాల్లో న్యాయపోరాటం విధిగా చేయాలి.– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ -
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ముస్లిం నేత అరిఫ్ నసీమ్ ఖాన్ పార్టీ ప్రచార కమిటీ పదవి నుంచి తప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క ముస్లిం నేతకు టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అరిఫ్ ఖాన్ లేఖ రాశారు. ప్రతిపక్ష కూటమి మమా వికాస్ అఘాడీ కూటమి ముస్లిం అభ్యర్ధిని నిలబెట్టనందుకు లోక్‌సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయలేనని లేఖలో తేల్చి చెప్పారు.‘మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఎంవీఏ కూటమి ఒక్క ముస్లిం అభ్యర్ధికి కూడా అవకాశం ఇవ్వలేదు. పార్టీ కోసం అనేక ముస్లిం సంస్థలు, నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్లు మైనారిటీ కమ్యూనిటీ నుంచి కనీసం ఎక్క నేతనైనా అభ్యర్ధిగా ఆశిస్తారు. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. పార్టీ నాయకులు కార్యకర్తలందరూ నన్ను ‘కాంగ్రెస్‌కు ముస్లిం ఓట్లు కావాలి, కాని అభ్యర్థులు ఎందుకు వద్దు’ అని అడుగుతున్నారు. వారి ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. అందుకే మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీకి రాజీనామా చేస్తున్నాను’ అని ఖాన్ లేఖలోపేర్కొన్నారు.కాగామహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ 17 స్థానాల్లో, శివసేన (ఉద్దవ్), ఎన్సీపీ (శరద్చంద్ర పవార్)తో కలిసి పోటీ చేస్తోంది. అయితే ముహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి టికెట్ ఆశించారు. కానీ నగర యూనిట్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్‌ను ఖరారు చేసింది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని చండీవాలి నుంచి పోటీ చేసిన ఖాన్.. కేవలం 409 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చదవండి: ఆ పోలింగ్ బూత్‌లో జీరో ఓటింగ్.. కారణమిదే? -
హిమాచల్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్
Himachal Pradesh Crisis Live Updates రాజీనామా వెనక్కి తీసుకున్న విక్రమాదిత్య హిమాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఊహించని మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నాయకత్వంపై అసంతృప్తితో బుధవారం ఉదయం రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత, పీడబ్ల్యూడీ మంత్రి విక్రమాదిత్య సింగ్ సాయంత్రానికి కల్లా తన మనసు ర్చుకున్నారు. విక్రమాదిత్య తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు: విక్రమాదిత్య పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది: విక్రమాదిత్య పార్టీ విస్తృత ప్రయోజనాలు, పార్టీ ఐక్యత దృష్ట్యా ఉదయం నేను ఇచ్చిన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించలేదు : విక్రమాదిత్య ఈ తరుణంలో మరింత ఒత్తిడి తీసుకురావాలని నేను కూడా అనుకోవడం లేదు : విక్రమాదిత్య ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేదు: విక్రమాదిత్య హిమాచల్ మాజీ సీఎం వీరభద్ర సింగ్తనయుడే విక్రమాదిత్య తన తండ్రికి కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వలేదని విక్రమాదిత్య ఆరోపణ ఢిల్లీ చర్చలతో.. సాయంత్రానికి చల్లబడ్డ విక్రమాదిత్య #WATCH | Shimla, Himachal Pradesh: Congress MP Rajeev Shukla says, "Our party observers who have come to Shimla are talking to the party MLAs and taking their opinion. First, they met the PCC Chief and also met Vikramaditya Singh. CM Sukhvinder Singh Sukhu has said that he is not… pic.twitter.com/8zIbqWq0vc — ANI (@ANI) February 28, 2024 ఆపరేషన్ లోటస్ జరగనివ్వం: జైరాం రమేశ్ హిమాచల్ ప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై ఏఐసీసీ సమీక్ష ముగ్గురు పరిశీలకులు సిమ్లాకు పరిశీలకులుగా.. డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హుడా, భూపేష్ బఘేల్ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా కాంగ్రెస్ వెనకాడదన్న సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రజాతీర్పునకు ద్రోహం జరగనివ్వం: జైరామ్ రమేష్ వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీయే ముఖ్యం: జైరామ్ రమేష్ ఆపరేషన్ లోటస్‌తో ప్రజా తీర్పుకు భంగం వాటిల్లనివ్వం: జైరామ్ రమేష్ అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటాం: జైరామ్ రమేష్ బీజేపీదే అధికారం: హర్ష్ మహాజన్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ థ్రిల్లింగ్ విక్టరీ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్.. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల ఓట్లతో 34 ఓట్లు సంపాదించుకున్న హర్ష కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి సైతం 34 ఓట్లు డ్రా కావడంతో టాస్‌లో హర్ష్ మహాజన్ విజయం హర్ష్ మహాజన్‌ను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణిస్తున్న రాజకీయ విశ్లేషకులు త్వరలో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హర్ష్ ధీమా కేంద్రం నుంచి కాంగ్రెస్‌ను దింపేసి.. ఒక్కో రాష్ట్రంలో పడగొడుతున్నామన్న హర్ష్ హిమాచల్‌లో.. బీజేపీతో మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్య మరికొన్ని గంటల్లో పరిణామాలు మారిపోవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు మరో 10-20 ఏళ్లపాటు హిమాచల్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోదంటూ జోస్యం బీజేపీపై ప్రియాంక ఫైర్ హిమాచల్ ప్రదేశ్ పరిణామాలపై ప్రియాంక వాద్రా గాంధీ మండిపాటు ధన బలం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో ప్రజల తీర్పును తుంగలోకి తొక్కుతోందంటూ బీజేపీపై ఫైర్ రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు యత్నిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆరోపణ హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తమ ఓటుహక్కు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ, అధికార దుర్వినియోగంతో వారి తీర్పును అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ యత్నిస్తోంది. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ.. 43మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ప్రభుత్వాన్ని సవాల్ చేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతుందనేందుకు ఇదే నిదర్శనం. ఇది పూర్తిగా అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. హిమాచల్ ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ చర్యలను గమనిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రజలను ఆదుకోని కేంద్రం.. ఇప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టాలని చూస్తోంది హిమాచల్ సంక్షోభం.. ఏఐసీసీ ఫోకస్ హిమాచల్ రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ ప్రమాదంలో హిమాచల్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభ పరిణామాలపై ఏఐసీపీ ఫోకస్ ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా భేటీ హిమాచల్‌లో ఏం జరిగింది?.. అలాగే తాజా పరిణామాలపై చర్చ తెరపైకి సీఎంను మారుస్తారనే ప్రచారం రాజీనామా ఊహాగానాలకు కొట్టేసిన సీఎం సుఖ్విందర్సింగ్ సుఖు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని.. ఐదేళ్లు ఉంటుందంటూ వ్యాఖ్య నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం హిమాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభ పరిస్థితుల్ని కాంగ్రెస్ కేంద్రం నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ మేరకు ముగ్గురు పరిశీలకులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాలతో పాటు స్టేట్ ఇన్‌ఛార్జి రాజీవ్ శుక్లా సిమ్లాకు బయల్దేరినట్లు సమాచారం. నేను ఫైటర్ని: వదంతుల్ని కొట్టిపారేసిన హిమాచల్ సీఎం రాజీనామా వదంతుల్ని కొట్టిపారేసిన హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్సింగ్ సుఖు. ‘‘ నేను ఫైటర్‌ను. పోరాడుతూన ఉంటా. ఎవరూ నన్ను రాజీనామా చేయాలని కోరలేదు. నేనెవరికీ రాజీనామా సమర్పించలేదు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరుగుతోంది. కానీ, మా మెజారిటీని మేం నిరూపించుకుంటాం. మేమే గెలుస్తాం. బడ్జెట్ టైంలో ఊహాగానాలతో కాంగ్రెస్‌లో చీలిక తేవాలని బీజేపీ యత్నిస్తోంది. కాంగ్రస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని యత్నిస్తోంది. కానీ, కాంగ్రెస్ సంఘటితంగానే ఉంది అని ప్రకటించారాయన. రాజీనామా యోచనలో సీఎం సుఖ్విందర్ సింగ్ ప్రభుత్వం మైనారిటీలో పడటంతో రాజీనామా యోచనలో సీఎం సుఖ్విందర్సింగ్ కాంగ్రెస్ హైకమాండ్‌కు నిర్ణయం తెలిపిన సీఎం గవర్నర్‌కు ఇంకా రాజీనామా లేఖ పంపని సుఖ్విందర్ హిమాచల్‌కు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్స్ డీకే, భూపిందర్ హుడా కాంగ్రెస్‌లో అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన హైకమాండ్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హుడాలు హిమాచల్‌కు పయనం సీఎంను మార్చాలని ఇప్పటికే పట్టుబడుతున్న ఎమ్మెల్యేలు ఉదయం నుంచి అజ్ఞాతంలోకి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్.. హిమాచల్‌లో రాజకీయ సంక్షోభం రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాటరీలో గెలిచిన బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ మరుసటి రోజు బుధవారమే ఆట షురూ చేసిన బీజేపీ అసెంబ్లీలో బడ్జెట్ బిల్లుపై ఓటింగ్‌కు బీజేపీ పట్టు తిరస్కరించిన స్పీకర్, మూజువాణి ఓటుతోనే పాస్ చేస్తామని స్పష్టం సభ రెండుసార్లు వాయిదా పడ్డ శాంతించని బీజేపీ ఎమ్మెల్యేలు 15 మంది బీజేపీ సభ్యులను సస్పెండ్ చేసిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా వెంటనే గవర్నర్‌ను కలిసిన బీజేపీ శాసనసభాపక్ష నేత జైరాం ఠాకూర్ అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు వినతి ఈ నేపథ్యంలో గవర్నర్‌తో భేటీ అయిన అసెంబ్లీ స్పీకర్ #WATCH | After meeting Governor Shiv Pratap Shukla, Himachal Pradesh LoP Jairam Thakur says, "We have informed the Governor about what happened in the Assembly...In the Assembly, when we demanded division of vote during the financial bill, it was not allowed and the House was… pic.twitter.com/5RymuHzEop — ANI (@ANI) February 28, 2024 మంత్రి రాజీనామా పదవికి రాజీనామా చేసిన మంత్రి విక్రమాదిత్య సింగ్ ఎమ్మెల్యేల అభిప్రాయానికి విలువ లేనందునే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి సీఎంను మార్చాలన్న డిమాండ్‌ను పట్టించుకోనందునే క్రాస్ ఓటింగ చేశామని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరి బాటలోనే మంత్రి విక్రమాదిత్య సింగ్ అజ్ఞాతంలోకి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసి హర్యానాలోని పంచకులకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఇవాళ ఉదయం అజ్ఞాత ప్రదేశానికి తరలింపు రంగంలోకి కాంగ్రెస్ అధిష్టానం సంక్షోభంలో హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వం రంగంలోకి అధిష్టానం ముఖ్య నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బుజ్జగింపు ఎమ్మెల్యేల డిమాండ్ మేరకే సీఎంను మారుస్తారని ప్రచారం తెరపైకి పీసీసీ చీఫ్ ప్రతిభాసింగ్ పేరు మైనార్టీలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సమానంగా 34 ఓట్లు వచ్చి ఫలితం టై అయింది. లాటరీ తీయగా బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి ఓటమి పాలయ్యారు. హిమాచల్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 68 కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 40 మంది సభ్యులు, బీజేపీకి 25, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు. వీరు కూడా బీజేపీకి ఓటు వేయడంతో ఆ పార్టీ బలం ఒక్కసారిగా 34కు పెరిగింది. ఆరుగురు సభ్యులను కోల్పోవడంతో కాంగ్రెస్ బలం 34కు తగ్గి మైనారిటీలో పడిపోయింది. -
చంద్రబాబు డర్టీ పొలిటీషియన్: మంత్రి రోజా
సాక్షి, చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డర్టీ పొలిటీషియన్ అంటూ మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు. ఇప్పుడేమో మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నాడంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ లాంటి నాన్ లోకల్ పొలిటిషియన్లకు ప్రజలే తగిన బుద్ది చెప్తారన్నారు. సంక్షేమ రాష్ట్రంగా సీఎం జగన్ ఏపీని ముందుకు నడిపిస్తున్నారన్న మంత్రి రోజా. తండ్రి బాటలోనే సీఎం జగన్ మైనారిటీలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. తండ్రి అడుగు జాడల్లో ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ. 80 వేలు అందిస్తున్నారని, మైనారిటీ పక్షపాతిగా వక్ఫ్ బోర్డు స్థిర చర ఆస్తులు రక్షణకు అండగా నిలుస్తున్నారన్నారు. వైఎస్సార్ షాదీ తోఫా కింద లక్ష రూపాయలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. డిప్యూటీ సీఎం, శాసనమండలి డిప్యూటీ చైర్మన్లతోపాటు 2024 ఎన్నికల్లో ఏడుగురు మైనార్టీలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. తమ నియోజకవర్గంలో కోటి 85లక్షలతో షాది మహల్ నిర్మాణం చేయడంతోపాటు మసీదుల మరమ్మత్తులకు రూ. 2 కోట్లు కేటాయించారని తెలిపారు. మీరా సాహెబ్‌పాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. -
మైనార్టీల ఓట్లెవరికో..?
కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల మైనార్టీ ఓట్లపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజక వర్గంలో మొత్తం 3,55,054 మంది ఓటర్లు ఉండగా అందులో 66 వేల పైచిలుకు మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరు కాకుండా క్రిస్టియన్లు, సిక్కులు, ఇతరులు కలిపి మరో 12 వేల మంది వరకు ఉన్నారు. గురువారం జరిగిన పోలింగ్‌లో నియోజకవర్గంలో 3,55,054 ఓట్లకు 2,24,504 ఓట్లు పోలయ్యాయి. ముస్లిం మైనార్టీలకు సంబంధించి 78 వేల ఓట్లల్లో 70 శాతం పోలైన 52 వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఒక అంచనా. మైనార్టీలు ముస్లింల ఓట్లు ఒకే పార్టీకి పడే అవకాశం ఉండటంతో ఈ ఓట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ముస్లింలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపారో అన్న చర్చ హట్‌టాపిక్‌గా మారింది. ఓటు హక్కు వినియోగించుకున్న 52 వేల పైచిలుకు మందిలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వేశారనే సందిగ్ధంలో అభ్యర్ధులు మల్లగుల్లాలు పడుతున్నారు. అంచనా ప్రకారం పోలైన 52 వేల ఓట్లల్లో 35వేల పైచిలుకు ఓట్లు బీఆర్ఎస్కే పడుతాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. మిగతా 17వేల ఓట్లు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పడుతాయనే అంచనాల్లో మూడు పార్టీల నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లల్లో చేపట్టిన సంక్షేమ పథకాలు ముస్లిం మైనార్టీ వర్గాల్లో గడపగడపకూ అందాయని బీఆర్ఎస్ నాయకులు తెలుపుతుండగా, కాంగ్రెస్ హాయంలోనే 4 శాతం రిజర్వేషన్ ఇచ్చామని ముస్లిం మైనార్టీలకు వెన్నుదన్నుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. ముస్లిం ఓట్ల చీలికపై బీజేపీ ఆశలు పెంచుకుంది. త్రిపుల్ తలాక్‌తో పాటు బీజేపీ చేపట్టిన కార్యక్రమాలతో మైనార్టీల మద్దతు బీజేపీకి ఉందని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారు. దీంతో కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గం ఫలితం హట్‌టాపిక్‌గా మారింది, -
తెలంగాణలో గెలుపెవరిది?.. డిసైడ్ చేసేది ఆ 30 నియోజకవర్గాలేనా?
తెలంగాణ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లే కీలక పాత్ర పోషించనున్నాయి. 30కిపైగా నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయిస్తారు. హైదరాబాద్ పాతబస్తీలో అయితే మజ్లిస్‌కి మినహా మరో పార్టీకి అవకాశమే లేదు. ఇక ఏ పార్టీ అధికారంలోకి రావాలో డిసైడ్ చేసేది ఆ 30 నియోజకవర్గాలే. ఒకప్పుడు మైనారిటీలు కాంగ్రెస్‌కి అండగా నిలిచేవాళ్ళు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఓట్లన్నీ గులాబీ గూటికే చేరుతున్నాయి. ఈసారి మైనారిటీలు ఎవరిని కరుణించబోతున్నారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా ఈసారి కులాలు, మతాల ఓట్లపై బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు కులాలవారీగా, మతాల వారీగా ఓట్ల వేట సాగిస్తున్నాయి. అందుకు అవసరమైన తాయిలాలు ప్రకటిస్తున్నాయి. హామీలిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మైనారిటీల కోసం ఒక డిక్లరేషన్ కూడా ప్రకటించింది. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై అటు బీజేపీ.. ఇటు బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఇక మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మైనారిటీలంతా తమ మిత్రపక్షం బీఆర్ఎస్కు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు కూడా సామాజికవర్గాల వారీగా ఓట్ల వివరాలు సేకరిస్తూ..ఎవరికి కావాల్సిన హామీలు వారికిస్తున్నారు. గతంలో ఎన్నికలు వస్తే మా ఊరికి, పల్లెకు, కాలనీకి, నగరానికి ఏం చేస్తారంటూ...ఆయా పార్టీల తరపున నిలబడే అభ్యర్థులను అక్కడి ప్రజలు ప్రశ్నించే వాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులను మా కమ్యూనిటీకి ఏం చేస్తారు?..మా మతానికి ఎం చేస్తారు? అని అడుగుతున్నారు. కోట్లు గుమ్మరించి ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థులు కులం, మతానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ దిశగానే ప్రచారం సాగిస్తున్నారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలోను, పట్టణంలోనూ ముస్లిం మైనారిటీలు నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ ఒక కుటుంబం మాదిరిగానే ఉంటారు. ఒక మాటకే కట్టుబడతారు. కాని పట్టణాలు, నగరాల్లోని బస్తీల్లో మాత్రం ఎవరి దారి వారిదే. ఎన్నికల సమయంలో ఎవరి పార్టీ వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలుంటే...హైదరాబాద్ పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో మజ్లిస్ మినహా మరో పార్టీ గెలుస్తున్న ఉదంతాలు కనిపించడంలేదు. ఇక మిగిలిన 112 నియోజకవర్గాల్లో 30 సెగ్మెంట్లలో ముస్లిం మైనారిటీలు కీలక పాత్ర పోషిస్తారు. అభ్యర్థుల గెలవాలన్నా..ఓడించాలన్నా వీరిది నిర్ణయాత్మక పాత్రగా ఉంటోంది. హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్, నిజామాబాద్ అర్బన్ తో కలిపి మూడు నియోజకవర్గాల్లో లక్షకు పైగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ జూబిలీ హిల్స్‌లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను బరిలో దించింది. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, కరీంనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో 60 వేల నుంచి లక్ష లోపు వరకు మైనారిటీ ఓట్లు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. 50వేలకు పైగా మైనారిటీలు ఉన్న నియోజకవర్గాలుగా ముషీరాబాద్, బోధన్, మహబూబ్ నగర్, జహీరాబాద్, గోషామహల్ ఉన్నాయి. ఇక అంబర్ పేట, సికింద్రాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి సెగ్మెంట్లలో 40వేలకు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నట్లు సమాచారం. 30 వేల నుంచి 40 వేల వరకు మైనారిటీ ఓట్లున్న నియోజకవర్గాలు 8..20 వేల నుంచి 30 వేల వరకు ఉన్న నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో 12వేలు మైనారిటీ ఓటర్లు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ 30 నియోజకవర్గాల్లో 25 సీట్లను గులాబీ పార్టీ గెలుచుకుంది. మూడు స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. గోషా మహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ కాషాయజెండా ఎగరేసారు. తాజా ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీతో ఎంఐఎం స్నేహపూర్వకంగానే ఉంది. తాము పోటీ చేయనిచోట బీఆర్ఎస్కు ఓటేయాలని అసదుద్దీన్ ఒవైసీ మైనారిటీలకు పిలుపునిచ్చారు. మరి మైనారిటీలు ఎవరి మాట వింటారో.. ఎవరి హామీలను విశ్వసిస్తారో.. ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాలి. చదవండి: నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆత్మహత్య -
కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ బీజేపీ కుట్రే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మైనారిటీలను బీసీల్లో చేరుస్తామని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయమై ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ‘మైనారిటీలు, బీసీల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.మైనారిటీలకు కులగణనతో సంబంధం లేదు. ఇది బీజేపీ కుట్రలాగా కనిపిస్తోంది. మైనారిటీలను బీసీల్లో కలిపితే వారు తమ హక్కులన్నీ కోల్పోతారు. కాంగ్రెస్ వెంటనే మైనారిటీ డిక్లరేషన్‌ను ఉపసంహరించుకోవాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అవినీతి డబ్బుతో కేసీఆర్ గెలవాలనుకుంటున్నారు! -
సంక్షేమ జాతర.. అర్హులకు టోకరా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశ పెడుతోంది. అయితే అవి అర్హులకు అందడం లేదని, నిరుపేదలకు నిరాశే ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ దన్ను లేదా బలమైన సిఫారసు ఉంటేనే గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ బంధు పథకాల జాబితాలో చోటు దక్కుతోందని ఆయా పథకాలకు అన్ని విధాలా అర్హులైన వారు వాపోతున్నారు పోటీ తీవ్రంగా ఉండటంతో.. ‘ఇప్పటికైతే పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకే పంచేద్దాం..ఈ మేరకు గ్రామాల వారీగా జాబితాలు పంపండి’ అంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు సిద్ధం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లకు గాను 14.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీబంధు పథకం కింద ఒక్కో నియో జకవర్గంలో 300 మందికి, మైనారిటీ బంధు కింద 100 మందికి ఆర్థిక సహా యం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాలకూ వేలల్లో దర ఖాస్తు లు వచ్చాయి. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. వాస్తవానికి అత్యంత నిరుపేదలకు, ఇచ్చే ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకునే సాంకేతికత, ఇతర పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు చెప్పినవారికి, బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొన్ని చోట్ల అర్హుల జాబితాల్లో చేర్చేందుకు 10 నుంచి 30% కమీషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను తమసిబ్బందితో కలిసి పరిశీలించాల్సిన జిల్లా యంత్రాం గాలు, కనీస పరిశీలన లేకుండానే ఆమోద ముద్ర వేసేసి చేతులు దులుపు కొంటూ సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పథకం ఏదైనా అదే తీరు.. డబుల్ బెడ్రూంలు దక్కని నిరుపేద తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు10, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆయా కులాల్లో దివ్యాంగులుంటే వారికి 5 శాతం కేటాయించాలి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ నిబంధనలు పాటించలేదు. చేతి వృత్తులే జీవనాధారమైన నాయీ బ్రాహ్మణ, రజక, సగర పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి ఇతర ఎంబీసీ కులాల్లో పేదరికం, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాధాన్యతలేవీ పాటించటం లేదని జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితాలు చూస్తే అర్థం అవుతోంది. మైనారిటీ బంధులో లబ్ధిదారుల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ ఇందులో కూడా నిబంధనలు, ప్రాధాన్యతల పాటింపుపై అక్కడక్కడా ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. పథకాలు కలెక్టర్లకు అప్పగించాలి.. ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత, మైనారిటీ, బీసీ బంధుతో పాటు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం పథకాలు పూర్తి పక్కదారి పట్టాయి. రాష్ట్ర ప్రజలు పన్నులతో వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతోంది. నిజమైన అర్హులకు కాకుండా గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా జరుగుతున్న ఎంపికలతో వాస్తవ పేదలకు న్యాయం జరగడం లేదు. వెంటనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో కలెక్టర్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పైసా నిరుపేదల ఆర్థిక ప్రగతికి ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గృహ‘లక్షీ కటాక్షం’ లేదంట పూరి గుడిసెలో జీవితాన్ని వెల్లదీస్తున్న ఈమె పేరు గాలి ఉపేంద్ర. మహబూబా బాద్ జిల్లా నల్లెల గ్రామం. డబుల్ బెడ్రూం రాలేదు. చివరకు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలైనా ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసింది. అన్ని అర్హతలున్న తనకు లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసింది. కానీ ఈ మారు కూడా ఇళ్లు ఇవ్వటం లేదని గ్రామ నాయకులు తేల్చేశారు. అర్హతలున్నా ఎంపిక చేయలేదు..! ఈమె పేరు రాచమల్ల మంజుల. సీఎం కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జకవర్గంలోని అలిరాజపేట గ్రామం. ఇటీ వల భర్త చనిపోవటంతో కొడుకు శ్రీకాంత్‌తో కలిసి ఇస్త్రీ షాపునకు అవసరమయ్యే పని ముట్లు కొనేందుకు బీసీబంధు పథకంలో లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలా ఈ ఊరిలో మొత్తం 33 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఇద్దరినే ఎంపిక చేశారు. అయితే ఆ ఇద్దరు తమకంటే అన్ని విధాలుగా బాగా ఉన్నవారేనని మంజుల పేర్కొంది. -
మానవీయ కోణంలో సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అన్నివర్గాలను పేదరికం నుంచి బయటపడేసేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగిస్తూ ముస్లిం, క్రైస్తవ మైనారిటీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో మైనారిటీల సంక్షేమం కోసం సుమారు రూ.15 వేల కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. మైనారిటీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి వంద శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధి దారుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఈ పథకం కింద రాష్ట్రం మొత్తం మీద 27 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేల మందికి రూ.లక్ష చొప్పున అందిస్తున్నామని తెలిపారు. మైనారిటీలకు కార్పొరేట్ స్థాయి విద్య.. మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సుమారు 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ విద్య అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం లక్షకు పైగా విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నామని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు అబ్దుల్ అహ్మద్ బిన్ బలాలా, జాఫర్ హుస్సేన్, కాలేరు వెంకటేశ్, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఖరీదైనా.. రెండు గజాలు!
అదొక మెట్రోపాలిటన్ సిటీ. ప్రముఖ వాణిజ్య ప్రాంతం. అక్కడ ప్రాపర్టీ కొనాలంటే కనీసం రూ.20 కోట్లు అయినా ఉండాల్సిందే. కానీ అంత ఖరీదైన ప్రాపర్టీని సొంతం చేసుకోవాలంటే ఎగువ మధ్య తరగతి వారి వల్ల కూడా అయ్యే పని కాదు. అయినా సరే ఆ ప్రాపర్టీకి యజమాని కావాలనే కోరిక బలంగా ఉంది. ఇందుకు ఉన్న మార్గం ఏంటి..? నిజమే అంత భారీ పెట్టుబడి లేకపోవచ్చు. చేతిలో కొద్ది మొత్తమే ఉన్నా, అదే ప్రాపర్టీకి యజమానిగా మారిపోగల అవకాశం ఉంది. అదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. తమకు బాగా నచ్చిన ప్రాపర్టీలో ఒక శాతం వాటాను తక్కువకే సొంతం చేసుకోవచ్చు. మధ్యతరగతి వాసులను సైతం ప్రాపర్టీ యజమానులను మార్చేదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. ఈ సాధనం గురించి తెలియజేసే కథనమే ఇది. అసలు ఏంటి ఇది..? పాక్షిక అని పేరులోనే ఉంది. రియల్ ఎస్టేట్‌లో స్వల్ప వాటా. ఈ విధానంలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తానికి తగ్గ వాటా మీ సొంతం అవుతుంది. అంటే ఒక ప్రాపర్టీకి అచ్చమైన యజమాని కాలేరు. ఆ ప్రాపర్టీకి ఎంతో మంది యజమానుల్లో మీరు కూడా ఒకరు అవుతారు. ఈక్విటీల గురించి తెలిసే ఉంటుంది. లిస్టెడ్ కంపెనీ మూలధనంలో ప్రమోటర్ల వాటా గరిష్టంగా 75 శాతమే ఉంటుంది. మిగిలినది పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతుల్లో ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లు. ఒక్క షేరు ధర సుమారు రూ.2,500. కేవలం రూ.2,500 పెట్టి ఒక్క షేరు కొనుగోలు చేసినా ఆ కంపెనీ వాటాదారుగా మారతారు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ కూడా ఇదే మాదిరి ఉంటుంది. పాక్షిక రియల్ ఎస్టేట్‌కు ఇప్పుడు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. స్వల్ప వాటాలు తీసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి ప్రధాన ప్రేరణ టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) చిన్నగా ఉండడమే అని చెప్పుకోవాలి. పైగా కొద్ది మొత్తానికే నాణ్యమైన రియల్ ఎస్టేట్ వాటా వస్తుండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఆదరణ పెరుగుతుండటం గమనార్హం. ఎలా పనిచేస్తుంది..? సాంకేతికంగా చెప్పుకోవాలంటే.. మీరు, మీ స్నేహితులతో కలసి 5–10 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడి ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఆచరణలో ఇది అందరికీ సాధ్యం కాదు. అందరి మధ్య సఖ్యత లేదా ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే ప్రాపర్టీ సంగతేమో కానీ, తమ హక్కుల కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి రావచ్చు. అందుకే ఈ పాక్షిక రియల్ ఎస్టేట్‌ను సాకారం చేసేందుకు పలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు స్వల్ప పెట్టుబడితో ప్రాపర్టీలో పాక్షిక వాటా కొనుగోలుకు ఇవి అవకాశం కలి్పస్తాయి. ఇలా ఒకరితో ఒకరు పొత్తు లేకపోయినా, అందరూ కలసి ఒక ప్రాపర్టీకి ఉమ్మడి యజమానులుగా మారిపోయేందుకు పలు ప్లాట్‌ఫామ్‌లు వేదికగా నిలుస్తున్నాయి. ఈ తరహా సేవలు అందించే పోర్టళ్లను ‘ఎఫ్వోపీ’ లేదా ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్ అని పిలుస్తారు. గడిచిన కొన్నేళ్ల కాలంలో ఇలాంటివి పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ఇన్వెస్టర్ల తరఫున క్లిష్టమైన ప్రాపర్టీ కొనుగోలు, దానికి సంబంధించిన ఇతర పనులను ఇవి చక్కబెడతాయి. దాంతో కొనుగోలు, విక్రయం ఎంతో సులభంగా, సౌకర్యంగా ఉంటుంది. ప్రాపర్టీ పరిశోధన, కొనుగోలు, అమ్మకం, డాక్యుమెంటేషన్, న్యాయపరమైన అంశాలు, అద్దె వసూలు, ఆ అద్దెను యజమానులకు పంపిణీ చేయడం తదితర సేవలను ఈ ప్లాట్‌ఫామ్‌లు అందిస్తాయి. వీటి సాయం లేకుండా ఇన్వెస్టర్లు ఒక సమూహంగా ఏర్పడి ఇలాంటి కార్యకలాపాలు అన్నింటినీ సొంతంగా నిర్వహించుకోవడం సులభం కాదు. అందుకే ఈ ప్లాట్‌ఫామ్ సేవలకు ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఎక్కడ..? దేశవ్యాప్తంగా ఎన్నో పట్టణాలకు సంబంధించి ఫ్రాక్షనల్ ప్రాపర్టీ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గచ్చి»ౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఓ ప్రాపర్టీ ఆఫర్ విలువ రూ.46,60,00,000. దీని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్/ఐఆర్ఆర్ (యాజమాన్య నిర్వహణ సమయంలో అంతర్గత రాబడి రేటు) 13.5 శాతంగా ఉంది. స్థూల ఈల్డ్ (వార్షిక అద్దె రాబడి) 8.9 శాతంగా ఉంది. అలాగే మహారాష్ట్రలోని గోరేగావ్‌లో (ఈజోన్ అపార్చునిటీ) రూ.33,60,00,000 విలువ చేసే ప్రాపర్టీకి సంబంధించి డీల్‌లో.. ఐఆర్ఆర్ 13.4 శాతంగా ఉంటే, గ్రాస్ ఎంట్రీ ఈల్డ్ 9.6 శాతంగా ఉంది. సాధారణంగా రియల్ ఎస్టేట్‌లో 10 శాతానికి పైన ఐఆర్ఆర్ ఉంటే దాన్ని మెరుగైనదిగా పరిగణిస్తారు. 18–20 శాతంగా ఉంటే అత్యుత్తమంగా భావిస్తారు. ఐఆర్ఆర్ 5% కంటే తక్కువ ఉంటే అది లాభసాటి కాదు. నిర్వహణ సులభతరం ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో ఉన్న సౌలభ్యం నిర్వహణ అని చెప్పుకోవాలి. అద్దె వసూలు, ప్రాపర్టీ నిర్మాణం, విక్రయం, పన్నుల చెల్లింపుల ఇవన్నీ ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌లే చూస్తాయి. దీంతో ఇన్వెస్టర్‌పై నిర్వహణ భారం పడదు. ప్రాపర్టీ డాక్యుమెంట్లు పట్టుకుని ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడదు. సెబీ నియంత్రణ లేదు గత కొన్నేళ్లలో ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు వచ్చాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల లావాదేవీల పరంగా ఓ ప్రామాణిక విధానం, ప్రక్రియ, మార్గదర్శకాలు, నియంత్రణలు అంటూ లేవు. ఇన్వెస్టర్లకు సమగ్రంగా అన్ని వివరాలు వెల్లడిస్తున్నాయా? లావాదేవీల నిర్వహణ చట్టబద్ధంగానే ఉందా? అని చూసే వారు లేరు. అందుకే ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణకు సంబంధించి చర్చా పత్రాన్ని సెబీ విడుదల చేసింది. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) నియంత్రణల పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ మార్కెట్లో లావాదేవీలకు రక్షణలు ఏర్పడతాయి. ఇన్వెస్టర్ల హక్కులు, ప్రయోజనాలకు భరోసా ఉంటుంది. అయితే ఇందుకు ఎంత కాలం పడుతుంది? అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎలాంటి ప్రాపర్టీలు..? ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో అధిక శాతం లావాదేవీలు వాణిజ్య రియల్ ఎస్టేట్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో వృద్ధి ఎక్కువగా ఉంటుంది. పైగా పెట్టుబడి వృద్ధికి తోడు, వాణిజ్య రియల్ ఎస్టేట్ నుంచి రెంటల్ రూపంలో ఆదాయం క్రమం తప్పకుండా వస్తుండడం మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అందుకే వాణిజ్య ప్రాపర్టీల ధరలు చాలా ఖరీదుగా ఉంటాయి. వీటి విలువ సాధారణంగా రూ.20 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్య ఉంటుంది. అందుకే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. పైగా వాణిజ్య ప్రాపర్టీల్లో రిటైల్ ఇన్వెస్టర్ నేరుగా పెట్టుబడి పెట్టడం సాధ్యపడదు. ఈ ప్లాట్‌ఫామ్‌లు దీన్ని సాధ్యం చేస్తున్నాయి. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో కనీసంగా ఒక టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) విలువ రూ.10–25 లక్షల మధ్య ఉంటుంది. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు సైతం ఇందులో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రాపర్టీ వారీగా రాబడి రేటు, ధర తదితర వివరాలు అన్నీ ఉంటాయి. లిక్విడిటీ మాటేమిటి? రియల్ ఎస్టేట్‌లో ఉండే ప్రధాన సమస్య లిక్విడిటీయే. అవసరం వచ్చినప్పుడు విక్రయిద్దామంటే ఎక్కువ సందర్భాల్లో వెంటనే సాధ్యపడదు. విక్రయించే ప్రాపర్టీ, దాని ధర ఇతర అంశాలన్నింటినీ కొనుగోలుదారులు లోతుగా చూస్తారు. బేరసారాలు, విచారణలు అన్నీ అంగీకారం అయితేనే ప్రాపర్టీ లావాదేవీ పూర్తవుతుంది. కనుక కావాల్సినప్పుడు వెంటనే నగదుగా మార్చుకునే సౌలభ్యం సహజంగా రియలీ్టలో తక్కువ. మీరు ఆశించే ధరకే విక్రయించాలని అనుకుంటే నెలల నుంచి సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లోనూ ఇదే అమలవుతుంది. కాకపోతే విడిగా ఓ ప్రాపర్టీ లావాదేవీతో పోలిస్తే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ టికెట్ సైజు తక్కువగా ఉంటుంది. కనుక లిక్విడిటీ కాస్తంత మెరుగు అని భావించొచ్చు. పాక్షిక ప్రాపర్టీ అయినా సరే, దాని అద్దె రాబడి ఏ మేరకు? ప్రాపర్టీ నాణ్యత మాటేమిటి? అనేది కొనుగోలు దారులు చూస్తారు. నాణ్యమైన ప్రాపర్టీ, అద్దె రాబడి మెరుగ్గా ఉంటే వేగంగా అమ్ముడుపోతుంది. లేదంటే చాలా కాలం పాటు అందులో పెట్టుబడి చిక్కుకుపోవచ్చు. పైగా ఇందులో కొనుగోలు చేసే ప్రాపర్టీ పెట్టుబడి దృష్ట్యానే తప్ప వినియోగం కోణంలో ఉండదు. అందుకని విక్రయించుకునేందుకు కొంత సమయం పట్టొచ్చు. టికెట్ సైజు తక్కువగా ఉండడం ఇందులో కాస్త అనుకూలతగా చెప్పుకోవచ్చు. -
16 నుంచి మైనారిటీలకు రూ.లక్ష సాయం
సాక్షి, హైదరాబాద్: మైనార్టీల సంక్షేమంలో భాగంగా ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10 వేల మంది లబ్దిదారులకు ఈ నెల 16 నుంచి రూ.లక్ష చెక్కుల పంపిణీ ప్రారంభించాలన్నారు. ఈ పథకానికి ఇప్పటికే రూ. 270 కోట్లు కేటాయించగా, ఇప్పుడు మరో రూ.130 కోట్లు కేటాయించామని, దీంతో మొత్తం రూ. 400 కోట్లకు చేరిందన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మైనార్టీల సమస్యలపై చర్చించేందుకు సచివాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల, తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ పాల్గొన్నారు. మైనారిటీలకు రూ.లక్ష సాయం, ఓవ ర్సీస్ స్కాలర్షిప్స్, శ్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్ శ్మశాన వాటికలు, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ తదితర అంశాలపై చర్చించారు. అన్ని వర్గాల అభివృద్ధికి.... రాష్ట్రంలో మైనారిటీలతోపాటు అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని హరీశ్‌రావు చెప్పారు. శ్మశానవాటికలకు 125 ఎకరాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు–మౌజంల సంఖ్య పెంపుపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం లబ్దిదారుల ఎంపిక సాగాలని, మైనారిటీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. శ్మశానవాటికలు, ఈద్గాల భూముల కోసం వచ్చిన వినతులను క్రోడీకరించాలని, ఈ దిశగా పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఒవైసీ పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ పనులు, దర్గా బర్హనా షా అద్దెల సవరణ, క్రిస్టియన్ శ్మశానవాటికలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర పనులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలన్నారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా మైనార్టీ నేతల ప్రార్థనలు
-
అస్సాంని మరో కశ్మీర్‌గా మార్చకండి!...కీలక వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం
Ten Years Back Muslims Are Not Minority: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అస్సాం జనాభాలో 35 శాతం ముస్లింలు ఉన్నారని అన్నారు. ఈశాన్య రాష్ట్రంలో ఇకపై వారిని మైనారిటీలుగా పరిగణించలేరని కూడా స్పష్టం చేశారు. 1990లో కాశ్మీరీ హిందువుల వలసలను గురించి కూడా ప్రస్తావించాడు. అంతేగాదు బాలీవుడ్ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'లో చూపిన విధంగా అస్సాం మారుతుందేమో అని ఇతర వర్గాల్లో రేకెత్తుతున్న భయాలను తొలగించడం రాష్ట్రంలోని ముస్లింల కర్తవ్యం అని చెప్పారు. అస్సాం అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, “ఈ రోజు ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, సమాన అవకాశాలు, అధికారాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి దానిని నిర్ధారించడం వారి కర్తవ్యం. గిరిజనుల హక్కులు పరిరక్షించబడతాయని వారి భూములు ఆక్రమించబడవు అని భరోసా ఇచ్చారు. ఆరో షెడ్యూల్ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల భూములను ఆక్రమించాల్సిన అవసరం లేదు. బోరా, కలిత (అస్సామీ ఇంటిపేర్లు) ఈ భూమిలో స్థిరపడకపోతే ఇస్లాం, రెహమాన్ (ముస్లిం ఇంటిపేర్లు) కూడా ఆ భూముల్లో స్థిరపడవు. అధికారం బాధ్యతతో వస్తుంది. అస్సాం జనాభాలో ముస్లింలు 35 శాతం ఉన్నందున ఇక్కడ మైనారిటీలను రక్షించడం వారి కర్తవ్యం" అని ముఖ్యమంత్రి అన్నారు. అస్సామీ ప్రజలు భయాందోళనలో ఉన్నారు, సంస్కృతి, నాగరికత రక్షింపబడతుందో లేదో అనే భయంతో ఉన్నారని చెప్పారు . సామరస్యం అంటే టూ-వే ట్రాఫిక్ అని చెప్పారు. ముస్లింలు శంకరి సంస్కృతి, సత్త్రియ సంస్కృతి రక్షణ గురించి మాట్లాడనివ్వండి.. అప్పుడే సామరస్యం ఉంటుందని నొక్కి చెప్పారు. పదేళ్ల క్రితం ముస్లీంలు మైనారిటీలు కాదు కానీ ఇప్పుడు మైనారిటీలుగా ఉన్నారని తెలిపారు. ఇతర వర్గాల్లో మెదులుతున్న భయాల్ని ముస్లీంలు పోగొట్టాలి. ఇక్కడ మరో కశ్మీర్ పునరావృతం కాదని మాకు భరోసా ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. (చదవండి: రెండోసారి సీఎంలుగా ప్రమోద్ సావంత్, బీరేన్ సింగ్) -
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లాను ఖరారు చేసిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడు రుహుల్లాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. సీఎం నిర్ణయంతో ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. ఎండీ రుహుల్లా, కార్పొరేటర్ షాహీన సుల్తానా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎండీ రుహుల్లా మీడియాతో మాట్లాడుతూ.. జీవిత కాలం సీఎం జగన్‌కి రుణపడి ఉంటాము. స్వర్గీయ ఎమ్మెల్సీ కరిమున్నీసా ఆశయాలను నెరవేరుస్తాం. మైనార్టీల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని ఎండీ రుహుల్లా అన్నారు. చదవండి: (CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ నూతన ఏడాది కానుక) -
రాజమండ్రి : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమ్మేళనంలో సినీ నటుడు అలీ
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కన్నుమూత
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం ► ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ నా సోదరి మహ్మద్ కరీమున్నీసా ఆకస్మిక మరణం తీవ్రంగా కలిచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది’ అని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. నా సోదరి మహ్మద్ కరీమున్నీసా ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం చాలా బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 20, 2021 -
బడుగు వర్గాలకే పెద్దపీట: 86 స్థానాల్లో ఎవరెవరు?
సాక్షి, అమరావతి: పురపాలక పదవుల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే సింహభాగం కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. చట్టం చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈ వర్గాలకు పదవులు దక్కేలా కసరత్తు చేశారు. ఆ మేరకు రాష్ట్రంలోని 86 మున్సిపల్, నగర పంచాయతీ చైర్మన్లు, నగర మేయర్ల పదవుల్లో ఏ స్థానాన్ని ఏ సామాజికవర్గానికి కేటాయించింది.. వివరాలివీ.. -
వారెవ్వా... క్యా సీన్ హై!
సాక్షి, కడప కార్పొరేషన్: ఎన్నికల షెడ్యూల్ విడుదలై పది రోజులైంది.. అధికార టీడీపీ అభ్యర్థి ఎవరో అంతు చిక్కలేదు. నోటిఫికేషన్ కూడా వచ్చి 24 గంటలు గడిచింది... అయినా అభ్యర్థిపై పీటముడి వీడలేదు. ఓ వైపు నామినేషన్ల పర్వం మొదలైనా టీడీపీ అధినేత కడపలో పార్టీ ‘లీడర్’ ఎవరో చెప్పకపోవడంతో క్యాడర్లో నిస్తేజం అలుముకుంది. అధినేత మనసులో ఏముందో.. టికెట్ దక్కేదెవరికోగానీ.. తమకే టికెట్ అంటూ తెలుగుదేశం పార్టీ తరఫున ‘ఇద్దరు’ అభ్యర్థులు ప్రచారం చేస్తుండటం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఆ మధ్య పార్టీలో చేరిన మరుక్షణమే అష్రఫ్‌ను కడప ఇన్చార్జిగా చంద్రబాబు ప్రకటించారు. ఇంకేముంది ‘టికెట్ నాకే’ అంటూ అష్రఫ్ ప్రచారంలో దిగారు. అంతే ఇన్నేళ్లు పార్టీలో ఉన్న తమను కాదని ఇప్పుడొచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ నేతలంతా ఒక్కసారిగా అసమ్మతి రాగం అందుకున్నారు. అలాగే మంత్రి ఆది నారాయణరెడ్డి కూడా అష్రఫ్‌కు టికెట్ ఇస్తే తాను పోటీ చేయనని మొండికేశారంట. పరిస్థితి ముందునొయ్యి.. వెనుకగొయ్యిలా మారడంతో అధిష్టానం టికెట్‌పై ఎటూ తేల్చకుండా నాన్చుతోంది. ఇంతవరకు టికెట్ పీటముడిని విప్పని బాబు ‘కడప టికెట్ మైనార్టీకే’ అని మాత్రం తేల్చిచెప్పారంట. దీంతో అమీర్‌బాబు, అష్రఫ్‌లు పోటీలో నిలిచా రు. తాజాగా తనకే టికెట్ ఖరారయ్యిందంటూ వీఎస్ అమీర్‌బాబు , మరోవైపు తనకే టికెట్ ఖరారు అవుతుందని, తనకు కాకపోతే తన తండ్రి అహ్మదుల్లాకైనా టికెట్ ఇస్తారంటూ అష్రఫ్ ఫోన్లలో ప్రచారం చేస్తున్నారు. ఆఖరికి టికెట్ దక్కేదెవరికో.. పోటీ చేసేదెవరో చూడాలి. నామినేషన్ల పర్వం మొదలైనా టీడీపీలో నెలకొన్న గందరగోళ ప్రచారాన్ని చూసి నగర ప్రజలు ‘వారెవ్వా.. క్యా సీన్ హై’ అంటూ గుసగుసలాడుతున్నారు. -
టీఆర్ఎస్తోనే ముస్లింల అభ్యున్నతి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీతోనే ముస్లింల అభ్యున్నతి సాధ్యమని, రాష్ట్రంలోని మైనార్టీ పిల్లలకోసం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా దేశంలోని ఏ రాష్ట్రమూ ఖర్చు చేయడం లేదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లిం అమ్మాయిల విద్యారేటు తక్కువగా ఉందని, వారు కూడా ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని సూచించారు. చంచల్‌గూడ మైదానంలో ఆదివారం జమియతుల్ మొమినాత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మైనార్టీ పిల్లల కోసం సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన 204 రెసిడెన్షియల్స్ స్కూళ్లలో 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. ఒక్కో మైనార్టీ విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆకాశంలో సగం.. ఆదాయంలోనూ సగం మహిళలు ఆకాశంలో సగమని, ఇంటి ఆదాయంలో నూ సగంగా ఉండాలని హోంమంత్రి పిలుపునిచ్చా రు. ముస్లిం కుటుంబాలు వృథా ఖర్చులు మానుకో వాలని, మహిళలు తమ కుటుంబ ఆదాయం ప్రకార మే బడ్జెట్ రూపొందించుకోవాలన్నారు. బాల్యంనుంచే పిల్లల్ని నైతికత, క్రమశిక్షణతో పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. పేద మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 20 లక్షలు ఉచితంగా అందిస్తోందని దీన్ని వారంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అనంతరం మాజీ పార్లమెంట్ సభ్యుడు, మతగురువు అల్లామా ఉబెదుల్లాఖాన్ మాట్లాడుతూ.. మహిళల వ్యక్తిగత, సామూహిక, దాంపత్య జీవితానికి సంబంధించిన ఇస్లామీ షరియత్‌లో కేంద్ర ప్రభుత్వం జోక్యం పట్ల ముస్లిం మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. ముస్లిం మహిళల హక్కును కేంద్రం కాలరాస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ముస్లింలు, లౌకికవాదులంతా కలసి బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ మహ్మద్ ఖమురుద్దీన్, జమియతుల్ మొమినాత్ సంస్థ అధ్యక్షుడు ముఫ్తీ మస్తాన్అలీ, హఫెజ్ సాబెర్పాషా, ముఫ్తీ హసనుద్దీన్తో పాటు పలువురు మతగురువులు పాల్గొన్నారు. -
ఆడపెళ్లివారమండీ
ఒక వధువు, ఒక వరుడు ఏకమై దంపతులుగా జీవనం గడపాలంటే వాస్తవంగా కొన్ని వందల రూపాయలు మాత్రమే ఖర్చవుతాయి, అవసరం అవుతాయి. కానీ ఏళ్ల తరబడి కొనసాగుతున్న ‘సాంప్రదాయ ఖర్చులు’ పెళ్లీడుకు వచ్చిన యువతుల పాలిట ముళ్ల కంచెలు అవుతున్నాయి. వాళ్ల తల్లిదండ్రులకు మోయలేనంత భారంగా పరిణమిస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి ముస్లిం మైనారిటీ మహిళలకు, వాళ్ల తల్లిదండ్రులకు విముక్తి కల్పించేందుకు ఆవిర్భవించిన సంస్థే ‘అమన్’.ముస్లిం కుటుంబాలలో నికాహ్ సందర్భంగా.. కట్న కానుకలతో పాటు ఏర్పాటు చేసే విందు భోజనాల ఖర్చులు వధువు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతాయి. అమన్ సంస్థ ఈ విందు భోజనాలకు సంబంధించి ముస్లిం కుటుంబాలతో ఒక అవగాహన కల్పించాలని ప్రయత్నం చేసి ఆ దిశగా ఆచరణలోకి తీసుకొచ్చింది. లక్షల రూపాయలు ఖర్చయ్యే మాంసాహార భోజనానికి తెరదించాలని ప్రచారం చేస్తోంది. దశాబ్ద కాలంగా ఈ సంస్థ చేస్తున్న కృషి వల్ల వేలాది కుటుంబాలు లబ్దిపొందాయి. ‘అవాయిడ్ మటన్ ఆఫ్టర్ నికాహ్’ (అమన్) అనే నినాదంతో బయలుదేరిన ఈ సంస్థ తన లక్ష్య సిద్ధి కోసం చిత్తశుద్ధితో నిర్విరామంగా కృషి చేస్తోంది. నికాహ్ ఖర్చులను తగ్గించేందుకు పనిచేస్తూ ఇప్పటి వరకు కర్నూలు నగర ముస్లింలకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు అమన్ నిర్వాహకులు చెబుతున్నారు. నికాహ్ వేడుకల్లో మాంసాహార నిషేధం కోసం తమ కమిటీ సభ్యులు నిరంతరం శ్రమిస్తూ, తద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థికపరమైన ఊరటను చేకూర్చుతున్నారని సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. హమీద్, సహాయ కార్యదర్శి ఎండి అన్వర్ బాషా తెలిపారు. అమన్ ఆవిర్భావం వెనుక ‘‘2005లో అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ ముస్లిం ఇంట పెళ్లి జరిగింది. అందులో నికాహ్ తరువాత పెళ్లి కొడుకు బంధువులకు విందు భోజనాల్లో మాంసాహారం సంతృప్తికరంగా వడ్డించలేదని వరుని తరుపున వచ్చిన బంధువులు గొడవ పెట్టుకున్నారు. ఆ ఘర్షణ చివరకు సాయంత్రానికే పెళ్లి తెగతెంపులకు దారి తీసింది. ఈ ఘటన పేపరులో చదివి చాలా బాధపడ్డాం. ఆ తరువాత చికెన్ తింటే ‘చికున్ గున్యా’ వస్తుందనే ప్రచారం సంచలనం రేపింది. అప్పటివరకు కర్నూలు పెళ్లిళ్లలో తక్కువ ఖర్చు అని చికెన్‌తో భోజనాలు పెట్టే వారు. అయితే చికెన్ తింటే చికున్ గున్యా వస్తుందన్న భ్రమతో నికాహ్ భోజనాలు పొట్టేలు మాంసంతోనే పెట్టాలని అబ్బాయిల తల్లిదండ్రులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ సంఘటనలు ఆందోళన కలిగించాయి. కర్నూలు నగరంలో 80శాతం మంది ముస్లింలు పేద, సామాన్య కుటుంబాలే. బీడి కార్మికులు, రిక్షా, తాపీ కార్మికులు, హమాలీలు ఖరీదైన పొట్టేలు మాంసం వండి వచ్చిన బంధువులందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలంటే ఖర్చు లక్షలకు చేరుతుంది. ఈ సమస్య పరిష్కారానికి ఉద్యమం తీసుకురావాలని యునైటెడ్ మైనారిటీ సొసైటీ అధ్యక్షుడు మౌలానా జుబేర్ అహ్మద్ ఖాన్ రషాదీతో 2006 జనవరిలో మలిగియా మసీదులో కూర్చొని చర్చించాం. అయన సానుకూల స్పందనతో ‘అమన్’ కమిటీని ఏర్పాటు చేసి నికాహ్ వేడుకల్లో మాంసాహారం నిషేధం కోసం అభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యాం. ఉద్యోగులు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లను వ్యక్తిగతంగా కలిసి అమన్ కమిటీ ఆశయాలు వివరించాం. అబ్బాయి తల్లిదండ్రులు నిర్వహించే వలిమా విందుకు ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని చెప్పాం. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి 11గంటల వరకు వివిధ కుటుంబాలను కలిసి ప్రచారం చేపట్టాం. ఐదు నెలలకు పైబడిన మా శ్రమకు అల్లాహ్ కరుణ తోడవడంతో ముస్లిం ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. 80వేల సంతకాలు సేకరించాం. వాటిలో ప్రభుత్వ ఖాజీలు హాఫీజ్ సయ్యద్ సలీం బాషా (హనఫీ), యూసుఫ్ జానీ (అహెలే హదీస్)లు సంతకాలు చేశారు. ‘అవాయిడ్ మటన్ ఆఫ్టర్ నికాహ్’ అనే నినాదంతో ఆ ఆంగ్లపదాల్లోని మొదటి అక్షరాలతో అమన్ కమిటీ అని పేరు పెట్టాం. ముందుగా మటన్‌ను మాత్రమే నిషేధించాలనుకున్నాం. కానీ ప్రజల నుంచి వచ్చిన విన్నపాల మేరకు మటన్, చికెన్‌తోపాటు ఇతర ఏ మాంసాహారాన్నీ నికాహ్‌లో పెట్టరాదనే నిర్ణయానికి వచ్చాం. అయితే అప్పటికే ప్రజల్లో ‘అమన్’ కమిటీ పేరు బాగా పాపులర్ అవడంతో ఆ పేరును అలాగే కొనసాగిస్తున్నాం’’ అని వివరించారు హమీద్, అన్వర్ బాషా.భవిష్యత్తులో వరకట్న కానుకలు, అదనపు కట్నాలపై సైతం ఇదే తరహాలో పోరాటాలు నిర్వహించి, ఆ భారం నుంచి కూడా అమ్మాయిల తల్లిదండ్రులను తప్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ‘అమన్’. అందుకోసం ‘ఆమని’ (ఆడపిల్లల మరణాల నివారణ) అనే సంస్థను ఏర్పాటు చేయబోతోంది. -
నరసారావుపేటలో ఉద్రిక్త పరిస్థితులు
-
ధర్మవరంలో ముస్లింల ఆత్మీయ సదస్సు
-
ఇది గౌరవమేనా?
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత మైనారిటీ, ఎస్టీ వర్గాల నుంచి ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్ధమైంది! ఈమేరకు ఏపీ శాసనమండలి చైర్మన్ ఫరూక్, ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్‌లకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందచేసినట్లు తెలిసింది. ఆదివారం రోజు ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉండాలని వారిద్దరికీ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అనాదిగా అదే ఆనవాయితీ.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలో చూసినా మైనారిటీలు, గిరిజనులకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించారు. ఈ వర్గాలకు ప్రాతినిథ్యం లేకుండా మంత్రివర్గ ఏర్పాటు ఎన్నడూ జరగలేదు. ఈ నేపథ్యంలో నాలుగున్నరేళ్లు గడిచిపోయిన తరువాత ఇన్నాళ్లూ దూరంగా పెట్టి, తీరా ఎన్నికలకు వెళ్లే ముందు మైనారిటీ, ఎస్టీలను మంత్రివర్గంలో తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడం ఆ వర్గాలకు సన్మానమా? అవమానమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికలకు ముందు ఓ వ్యక్తిని తెచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తే తమను ఎలా గౌరవించినట్లు అవుతుందని ఆయా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ దశలో ఇప్పుడు మంత్రులుగా నియమించినంత మాత్రాన వారు చేయగలిగేది ఏమీ ఉండదని, ఇదంతా ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఆయా వర్గాలను గౌరవించడం కాదు అవమానించినట్లుగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పదవిస్తే అవమానం మాసిపోతుందా? రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన గిరిజన సలహా మండలి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శించింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండటంతో గిరిజన సలహా మండలిని నియమించకుండా ఏళ్ల తరబడి తాత్సారం చేసింది. దీనిపై పోరాడిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేత పోరాటంతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం ఎట్టకేలకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎస్టీ వర్గానికి చెందిన వారిని మంత్రి పదవిలోకి తీసుకున్నా ఇన్నేళ్లుగా గిరిజన వర్గానికి సర్కారు చేసిన అన్యాయం, అవమానం మాసిపోదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎన్నిక కాకుండానే మంత్రిగా శ్రవణ్! మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నందున కిడారి శ్రవణ్ ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే అప్పటికి సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ సభకూ ఎన్నిక కాకుండానే శ్రవణ్ మంత్రిగా కొనసాగుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ కోడెల ఆఖరి ప్రయత్నం.. విస్తరణ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్న క్యాంటీన్ కోసం రూ.5 లక్షల విరాళాన్ని అందించేందుకు వచ్చిన కోడెల శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వలేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలిసింది. రెండు బెర్తులే ఖాళీగా ఉన్నాయని, వాటిని ముస్లిం, ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు తన వద్దే ఉన్న వైద్య, ఆరోగ్య శాఖను ఎవరికి ఇవ్వాలనే అంశంపై ముఖ్యమంత్రి మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఆ శాఖ తీసుకోవాలని యనమల రామకృష్ణుడికి సూచించినా వివాదాలున్నాయనే కారణంతో ఆయన నిరాకరించారు. గ్రీవెన్స్ హాల్లో ప్రమాణ స్వీకారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఆదివారం ఉదయం 11.45 గంటలకు ముహూర్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం పక్కన గ్రీవెన్స్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ)ను ఆదేశించింది. -
మైనార్టీల ఆస్తులకు రక్షణ లేకుండ పోతోంది
-
ముస్లింలను మభ్యపెట్టేందుకే కపట నాటకాలు
-
వైఎస్సార్‌సీపీతోనే మైనారిటీల అభ్యున్నతి
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): ముస్లిం మైనారిటీల అభ్యున్నతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే వారికి మేలు జరుగుతుందని పార్టీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో ముస్లింల ఆత్మీయ కలయిక కార్యక్రమం శుక్రవారం 9వ వార్డులో గల హెచ్‌బీకాలనీలో రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి ఎస్కే ఆజమ్ ఆలీ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వంశీకృష్ణ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 4 శాతం రిజర్వేషన్లుకు కల్పించి ముస్లింల ప్రగతికి బాటలు వేశారన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రజాసంకల్పయాత్రలో జనంతో మమేకమవుతూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్న జననేత జగనన్న రానున్న ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ముస్లిం సోదరులంతా వైఎస్సార్ïసీపీ పక్షాన ఉంటున్నారన్నారు. రాష్ట్ర మంత్రిమండలిలో మైనారిటీల మంత్రి పదవి ఇవ్వకుండా ముస్లింలను చంద్రబాబు దగా చేశారన్నారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి రాజకీయం మాత్రమే చేస్తున్నారని దుయ్యబట్టారు. 100 మంది కుటుంబాల ముస్లిం సోదరులు పార్టీలో చేరిక ఆత్మీయ సమ్మేళనంలో తూర్పు నియోజకవర్గానికి చెందిన 100 ముస్లిం కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరందరికి వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ కడువువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ముస్లిం సోదరులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసేందుకు మైనారిటీ ముస్లింలంతా సిద్ధంగా వున్నామన్నారు. గుంటూరులో ముస్లిం యువతపై చేసిన దాడులు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ కోస్తాంధ్ర అ«ధ్యక్షుడు ఐ.హెచ్.ఫరూకీ, మాజీ కార్పొరేటర్ నడింపల్లి కృష్ణంరాజు, మహిళా విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ సబీరా బేగం, 2వ వార్డు అధ్యక్షుడు గొలగాని శ్రీనివాస్, హాసీన్, మదరీసా, సాహుద్, ఫీరోజ్ హుసేన్, షేక్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మరో 296 మైనారిటీ గురుకులాలు
భీమారం (వరంగల్ అర్బన్): రాష్ట్రంలో మరో 296 మైనారిటీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ వెల్లడించారు. ఆదివారం ఆయన వరంగల్ అర్బన్ జిల్లా భీమారంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల విద్య కోసం 204 గురుకుల పాఠశాలలు, 8 జూని యర్ కాలేజీలు ప్రారంభించిందన్నారు. దేశంలో ఎక్కడ కూడా మైనారిటీ వర్గాలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు లేవన్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో కూడా ముస్లింలకు గురుకుల వ్యవస్థ లేదని వివరించారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థిపై ప్రభు త్వం రూ.1.31 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. -
నన్ను అలా చూడకండి.. ప్లీజ్ : ప్రీతి
లండన్: తనను ఒక వెనుకబడిన మైనారీటి వర్గానికి చెందిన మహిళగా గుర్తించడం నచ్చట్లేదని, అది ప్రజలను కించపరిచడమేనని బ్రిటిష్ మాజీ కేంద్ర మంత్రి, భారత సంతతి మహిళ ప్రీతి పాటిల్ అసహనం వ్యక్తం చేశారు. కన్జర్వేటివ్ పార్టీ తరఫున బ్రిటిష్ కేబినెట్లో చోటుదక్కించుకున్న మొదటి భారతీయ మైనారీటి మహిళగా గుర్తింపు పొందిన ప్రీతి పాటిల్ తనను ఒక వర్గానికి పరిమితం చేసి మాట్లాడటం.. ఆ వర్గాన్ని అవమానించే విధంగా ఉందని, అది ప్రజలను మోసం చేసి లబ్ధి పొందేవిధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను బ్రిటిష్లోనే పుట్టి పెరిగాను, నన్ను మొదట బ్రిటిష్ మహిళగా గుర్తించండి’ అని ఆమె కోరారు. బ్రిటిష్ కేబినెట్లో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పదవిలో ఆమె సేవలందించారు. గత ఏడారి నవంబర్‌లో తన మీద వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారు. తనను అలా చూడడం ఏంతో ఉద్వేగానికి గురిచేసిందని, సహచర కేబినెట్ మంత్రులకు, పార్టీ ఎంపీలందరికీ తనని మొదట బ్రిటిష్ మహిళగానే చూడాలని, తనను ఒక వర్గానికి పరిమితం చేసి వేరుగా చూడొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. -
మరో కీలక వ్యూహం!
దేశం నలుమూలల విస్తరించేందుకు వ్యూహాలు పన్నుతున్న కాషాయ దళపతి అమిత్ షా.. కేరళపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో సీట్లు గెలవలేకపోయినా.. గణనీయమైన ఓటు బ్యాంక్‌ను బీజేపీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కేరళలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. తిరువనంతపురం: కేరళ శాసనసభకు 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవచ్చని మొదట అందరూ అంచనా వేశారు. అయితే కేవలం ఒక్క సీటుతోనే పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సీట్లురాకపోయినా మంచి ఓటు బ్యాంక్‌ను పార్టీ సాధించింది. మైనారిటీలు, క్రైస్తవులు అధికంగా ఉండే కేరళలో బీజేపీ గత ఎన్నికల్లో హిందుత్వ వాదాన్ని పెద్దగా నెత్తికెత్తుకోలేదు. అయితే దారుణ ఓటమి తరువాత కూడా ఉత్తర భారతంలో అనుసరించిన హిందూ విధానాన్నే కేరళలో అనుసరించాలని బీజేపీ భావిస్తున్నట్లు కనబడుతోంది. కేరళలో తమ పార్టీ మూలాలు బలపడితే.. మొత్తం దక్షిణాదిలో పాగా వేయవచ్చిన బీజేపీ అధినాయకత్వం ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. కేరళలో జనరక్ష యాత్రకు సిద్ధమయ్యారు. వ్యూహాత్మక అడుగులు అమిత్ షా కేరళలో చేస్తున్న యాత్రపై రాజకీయ విశ్లేషకలు స్పందిస్తూ.. కమల దళపతి అసాధారణ వ్యూహాలతోనే ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కేరళ ప్రజలను మత ప్రాతిపదికన విడిదీసి.. స్థిరమైన ఓటు బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఈ యాత్ర అని సీనియర్ జర్నలిస్ట్ ఎన్పీ చెకుట్టి అంటున్నారు. కమ్యూనిస్ట్‌లకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న హిందువులను తమ వైపుకు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. అతివాద హిందుత్వం వల్ల ముస్లింలు, క్రైస్తవులకు భవిష్యత్‌లో ప్రమాదమేనని ఆయన విశ్లేషించారు. విభజన సాధ్యమా? కేరళ ప్రజలను మత ప్రాతిపదికగా విభజించడం అసాధ్యమరి మరికొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీని ఇక్కడి హిందువులు దారుణంగా ఓడించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కేరళలోని బలమైన ఎజువా వర్గం వారిని బీజేపీ కోల్పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎజువా సామాజిక వర్గం చేతిలో ఉన్న భారతీయ ధర్మ జన సేనను బీజేపీ నిర్లక్ష్యం చేసిందని.. అందుకు తగిన మూల్యం ఆ పార్టీ చెల్లించుకుంటోందని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యం 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేరళ నుంచి కనీసం 12 పార్లమెంట్ స్థానాలు సాధించాలనేది ప్రస్తుత బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అమిత్ షా ఈ యాత్ర చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల చరిత్రలో బీజేపీ ఇప్పటివరకూ కేరళ నుంచి ఒక్క పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేదు. షా వ్యూహాలు కేరళలో పాగా వేసేందుకు అమిత్ షా విభిన్నమైన వ్యూహాలను రచిస్తున్నారు. కేరళలో ఒక్క హిందూ ఓటు బ్యాంక్‌తో విజయం సాధించడం అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ ముస్లింలు.. క్రైస్తవులు కూడా 28 శాతం వరకూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్రైస్తవ, ముస్లిం వర్గాలను చీల్చితేనే అధికారంగానీ.. సీట్లుగానీ సాధించడం జరుగుతుంది. అందులో భాగంగానే కేరళకు చెందిన అల్ఫోన్స్ కన్నన్ థామన్కు కేంద్రమంత్రి పదవి ఇవ్వడం.. ఆయన కొంత కాలంగా కేరళలోని క్రైస్తవ సంఘాలతో చర్చలు జరపడం జరుగుతోంది. షా వ్యూహాలు కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ ప్రయత్నాలు కొంతవరకూ ఫలిస్తే.. కేరళలో బీజేపీ పాగా వేయడం ఖాయం. -
మైనారిటీలు లెక్కలోకే రారా?
జాతిహితం ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత మైనారిటీ ఓటు బ్యాంకులు లెక్కలోకి వచ్చేవి కాకుండా పోయాయి. అయినా, మన ప్రభుత్వం వారి రక్షణకు హామీని కల్పిస్తుంది, వారి సామాజిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. అంతేగానీ, దయచేసి అధికారంలో వాటాను మాత్రం అడగకండి. కాకపోతే ఎప్పటికో ఒకప్పటికి మన సొంత సంకేతాత్మకతా ఏర్పడవచ్చు. అప్పుడు మన సొంత దర్శన్ లాల్ తయారవుతాడు. అదే జరిగితే, పాక్‌లాగే మనమూ మైనారిటీలు లెక్కలోకి రానే రారు అనే సమాధానాన్నే ఎంచుకున్నట్టు అవుతుంది. కోర్టుల్లోని మన న్యాయమూర్తుల పద్ధతిని అరువు తెచ్చుకుని నా వాదనను ముందుగా ఉత్త వాస్తవాలను ఏకరువు పెట్టడంతో మొదలెడదాం. ఆ తర్వాత వాదనతో అది మంచి విషయమా లేక చెడ్డ విషయమా అని నిర్ధారిద్దాం. భారత ఉపరాష్ట్రతి పదవి నుంచి మొహమ్మద్ హమీద్ అన్సారీ నిష్క్రమణ, భారత రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని తెరచింది. గత యాభై ఏళ్లలో మన మైనారిటీలలో ఒక మతం వారు ఒక్కరైనా రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, అగ్రశ్రేణి మంత్రులు (హోం, రక్షణ, విదేశాంగ శాఖలు)గా పనిచేసినవారు లేరు. నేను చెప్పింది తప్పని గూగు ల్లో శోధించి నిరూపించాలని మీరు ఉబలాటపడవచ్చేమో. కానీ, నేను పలు స్వల్పకాలిక ప్రభుత్వాలతో సహా నేను ఆ చరిత్రనంతటినీ తిరగేయడమే కాదు, లోతుగా జల్లెడ పట్టేసి మరీ చూసేశాను. మైనారిటీలంటే ముస్లింలే కాదు, క్రైస్తవులు, సిక్కులు కూడానని మరచిపోకండి. గూగుల్ శోధనకు బదులు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఉన్న వారి పేర్లను పరిశీలించండి. స్వాతంత్య్రానంతర కాలచరిత్రలోనే విశిష్టమైన రీతిలో నేడు మైనారిటీకి చెందిన క్యాబినెట్ మంత్రి ఒక్కరే ఉన్నారు. ఆమె, ఎన్డీఏ భాగస్వామి అకాలీదళ్‌కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్. ఆమెకు, అతి ముఖ్యమైన ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను (లేదా అందుకు అసంతృప్తితో ఉన్న ఆమె విధేయులు పిలిచేట్టుగా పచ్చళ్లు, ఊరగాయలు, జామ్‌లు, జ్యూస్‌ల శాఖ) అప్పగించారు. ఇంకా దిగువ స్థాయికి పోయి జూనియర్ మంత్రులను పరిశీలిస్తే, మరి కొన్ని పేర్లు కనిపిస్తాయి. సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ కనిపిస్తారు. సహాయ మంత్రులలోకెల్లా ఆయనే అత్యంత సీనియర్. ఆయనది మైనారిటీ వ్యవహారాల శాఖని గమనించండి. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్న ఎంజే అక్బర్ పేరు కూడా కనిపిస్తుంది. పేర్లు, ప్రత్యేకించి క్రైస్తవుల పేర్లు ఒక్కోసారి తప్పుదారి పట్టించొచ్చు గానీ, నాకు మరే ఇతర పేర్లూ కనిపించలేదు. కాబట్టి క్రైస్తవులు ఎవరూ లేకపోవడం కూడా ఈ మంత్రివర్గపు విశిష్టత కాదా? అది కూడా, ప్రధానంగా క్రైస్తవులే ప్రధానంగా ఉండే ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్న ప్పటి పరిస్థితి ఇది. పైగా, దాదాపు పూర్తి క్రైస్తవ రాష్ట్రాలైన మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌లూ, పంజాబ్, జమ్మూకశ్మీర్లూ తప్ప దేశంలోని 24 ఇతర రాష్ట్రాలలో ఎక్కడా మైనారిటీ ముఖ్యమంత్రి లేరు. దీన్ని మరింతగా పొడి గించి చూద్దాం. ఇందిరాగాంధీ ప్రాభవం వెలిగిన కాలం తర్వాత, అత్యంత బలమైన జాతీయ పార్టీగా ఉన్నది మోదీ–అమిత్‌షాల బీజేపీయే. ఆ పార్టీ పదవులలో ప్రముఖంగా కనిపించే మైనారిటీవారు ఎవరు? షానవాజ్ హుస్సేన్, ఎస్ఎస్ ఆహ్లూవాలియా, బహుశా ఆ తర్వాత తేజిందర్‌పాల్ బగ్గా. లౌకికవాద పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, వామపక్షాలు, హిందీ మాట్లాడే ప్రాంతంలోని పార్టీల తీరు కూడా ఈ విషయంలో ఇంతేనంటూ మీరు దీనికి బదులు చెప్పొచ్చు. అయితే అది, భారత మైనారిటీలు అధికార చట్రానికి ఇంత దూరంగా ఎన్నడూ లేవనే నా మొదటి నిర్ధారణను బలో పేతం చేసేదే. దీనికి సంబంధించి మైనారిటీలలో అభద్రతాభావం ఉండటం సమంజసమే. మెజారిటీలో ఆత్మన్యూనత వాస్తవాలలో వేళ్లూనుకుని, కాల్పనికతలతో అల్లుకున్న అద్భుతమైన పలు వైచిత్రులను మన రాజకీయాలు ఆవిష్కరిస్తుంటాయి. ఎల్కే అద్వానీ, అటల్ బిహారి వాజ్‌పేయి (ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్న వరుస క్రమం) తమ పార్టీని 1984 నాటి శిథిలాల నుంచి తమ పార్టీని పునరుజ్జీవితం చేశారు. మైనారిటీల పట్ల హిందూ మెజారిటీలో ఉన్న ఆత్మన్యూనతా భావం అనే అంశాన్ని కేంద్రంగా చేసుకుని వారు ఆ పనిని చేపట్టారు. అది కాల్పనిక మైనదిగానీ లేదా విజయవంతంగా సాగించిన ప్రచారంతో రేకెత్తించిన తమపై తాము జాలిపడే «సామూహిక ధోరణిగానీ కాదు. దశాబ్దాల తరబడి సాగిన కాంగ్రెస్ పాలనలో నెహ్రూ, దృఢమైనదే అయినా సాపేక్షికంగా సులువైనదిగా ఉండే మైనారిటీవాదాన్ని అనుసరిం చారు. అది ఇందిరాగాంధీ, దూకుడుతనపు మైనారిటీవాదంగా పరిణమిం చింది. ఆ తర్వాత అది, షా బానో కేసులో రాజీవ్ గాంధీ చరిత్రాత్మకమైన లొంగుబాటుగా పరిణమించింది. అది, వారి సొంత పార్టీలోని ఉదారవాద ముస్లింలు సైతం భ్రమలను కోల్పోయేటంత నాటకీయంగా జరిగింది. అప్పట్లో ముస్లింల ప్రముఖ నేతగా ఎదుగుతున్న ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అందుకు నిరసనగా పార్టీని వీడారు కూడా. అలీఘర్ విశ్వవిద్యాలయం విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగిన ఆయన సహాయ మంత్రిగా ఉండేవారు. మితవాద హిందువులు (వారు బీజేపీ ఓటర్లే కానవసరం లేదు) దీన్ని, అదే సంస్కరణోత్సాహంతో హిందూ కోడ్ బిల్లులను తేవడంతో పోల్చి చూశారు. అదే పార్టీ, ముస్లిం మత పెద్దలను ఇలా ఎలా బుజ్జగిస్తుంది? అది అద్వానీకి అవకాశాన్ని తెరిచింది. మైనారిటీ అంటే మెజారిటీలో ఉన్న ఈ ఆత్మన్యూనతా భావం భారత రాజకీయాలను మౌలికమైన రీతిలో మార్చేసింది. ఫలితమే నేటి మైనారిటీ–ముక్త్ భారత్ సర్కార్. అన్సారీ అక్షింతలు అవసరం కాదా? 1993–94 నాటి ‘‘ఇండియా రీడిఫైన్స్ ఇట్స్ రోల్’’ అనే నా రచనలో, బీజేపీ ఇలా భారత రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఆవిర్భవించడం గురించి ఊహించి, చర్చించాను. ప్రధానిగా తన మొదటి అవిశ్వాస తీర్మానానికి జవాబు చెబుతూ వాజ్‌పేయి దాని నుంచి ఉల్లేఖిస్తూ, తీవ్ర విచారం ధ్వనించే స్వరంతో ఇలా అన్నారు: కొంత అసాధారణమైనదే జరిగింది. మైనారిటీ లంటే హిందూ మెజారిటీ ఆత్మన్యూనతా భావాన్ని ఏర్పరచుకుంది. నిరుత్సా హంతో ఆయన ఆ అంశాన్ని గుర్తించి, దాని గురించి తాను ఏమైనా చేస్తానని వాగ్దానం చేశారు. 1988లో మెజారిటీలోని ఈ ఆందోళన గురించి ఆయన నొక్కి చెప్పినప్పుడు ప్రశంసలు లభించాయి. రెండు దశాబ్దాల తర్వాత హమీద్ అన్సారీ మైనారిటీలలో ఉన్న అదే ఆందోళన గురించి మాట్లాడినం దుకు ఆయనపై దాడి చేస్తున్నారు. మనం వాజ్‌పేయి మాటలు విన్నంత శ్రద్ధగా ఆయన మాటలూ వినాలి. వాజ్‌పేయి చెప్పినదే సరైనదైతే, మనం ఆ తర్వాతి కాలంలో మన రాజకీయాలను అతిగా సరిదిద్దామా? అలా జరిగి ఉంటే, అన్సారీ అక్షింతలు వేయడం న్యాయమైన ఆందోళనతోనే కాదా? దిద్దుబాటు అవసరం లేదా? చివరిగా, అసలు మైనారిటీలు లెక్కలోకే రారా? విలక్షణమైన మూడు ఆసియా ప్రజాస్వామ్య దేశాలు ఈ సమస్యతో తంటాలు పడ్డాయి. బంగాళాఖాతం నుంచి మధ్యధరా సముద్రం వరకు ఉన్న సువిశాల ప్రాంతంలో ముస్లిం మైనారిటీలుసహా పౌరులందరికీ ఓటింగ్ హక్కును అనుమతించే దేశాలు ఇజ్రాయెల్, భారత్ మాత్రమేనని ఇజ్రాయెల్ నేత షైమన్ పెరెస్ 1992లో నాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. కాబట్టి ఆయన దేశం కూడా మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తుంది గానీ, వారికి యూదు పౌరులకుండే పూర్తి ప్రజాస్వామిక హక్కులను, ఎంపిక అవకాశా లను ఇవ్వదు. జాన్ లై కారె, తన ‘‘ద లిటిల్ డ్రమ్మర్ గర్ల్’’ అనే గూఢచార నవలలో ఖలీల్ అనే పాత్రతో.. ఇజ్రాయెల్ తన యూదు రాజ్య భావజాలాన్ని, ఆధు నిక ఉదారవాద ప్రజాస్వామ్యంతో సమం చేయడంలో ఎదుర్కొంటున్న సందిగ్ధాన్ని తెలిపారు. వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాలను ఇజ్రాయెల్ తనవిగా ఉంచు కోవాలంటే, అరబ్బులందరికీ ఓటింగ్ హక్కు ఇవ్వాలి, ఇస్తే అది యూదు రాజ్యమే కాకుండా పోతుంది. అందువల్లనే ఇజ్రాయెల్, అందరికీ ఓటున్నా సమానత్వం లేని విచిత్ర ప్రజాస్వామ్యం అయింది. అరబ్బు పౌరులు ఉన్నత స్థానాలను అందుకోలేకపోతే ప్రశ్నించే వారు లేరు. పాకిస్తాన్ మనకు ఆదర్శమా? ఆ తర్వాత, పాకిస్తాన్ కూడా పెరెస్ రెండు ప్రజాస్వామ్యాల (ఆ ప్రజా స్వామ్యం వచ్చి పోతుండేదే అయినా) దేశంగా మారింది. ఇజ్రాయెల్‌లాగే అది కూడా ఒక భావజాల రాజ్యం, అదీ అదే ప్రశ్నను ఎదుర్కొంటోంది. మైనారిటీలకు సమాన రాజకీయ హక్కులు ఉండేట్టయితే, అది ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ఉండగలదా? ఆ దేశ వ్యవస్థాపకులు ఆకుపచ్చ జెండాపై మైనారిటీ లకు ప్రాతినిధ్యం వహించేలా తెల్ల పట్టీని ఉంచారు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి వలసవాద శైలిలో మైనారిటీలకు రిజర్వుడ్ నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు. అది ఆసక్తికరమైన సంకేతాత్మకతలకు దారితీసింది. కొత్తగా ఏర్పరచిన, రాష్ట్రాల మధ్య సమన్యయ మంత్రిత్వ శాఖ మంత్రిగా దర్శన్ లాల్ నియామకం లేదా పాక్ సైన్యంలోని మొదటి సిక్కు అధికారి హర్చరణ్ సింగ్ సంస్మరణను పాటిస్తూ తమ క్షణిక లౌకికవాదానికి గర్వంతో ఉప్పొం గడం లేదా తాజాగా హిందూ అమరవీరుడు లాన్స్ నాయక్ లాల్ చాంద్ రబారీని కీర్తించడం అలాంటి సంకేతాత్మకతలే. అదే సమయంలో, హిందూ మైనారిటీ బాలికలను కిడ్నాప్ చేసి, బలవంతపు మత మార్పిడులు చేయిం చిన ఒక రాజకీయవేత్తను సత్కరించడమూ చేశారు. హిందువులను పార దోలి వారి జనాభాను క్షీణింపజేయడం కోసం విస్తృతంగా వారిపై వేధింపు లకు పాల్పడుతూనే ఉన్నారు. హిందువులే గాక, సిక్కులు, క్రైస్తవులు, అహ్మదీ యులను కూడా నాస్తిక మతభ్రష్టులని దూషిస్తూ, వేధింపులకు పాల్పడు తున్నారు. మునుపటి కాంగ్రెస్–లౌకికవాద ప్రభుత్వాలు మైనారిటీ ఓటు బ్యాంకుల రాజకీయ క్రీడ సాగించాయని భారత మితవాదం అనడంలో వాస్తవముంది. మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తూ కాంగ్రెస్‌ను, దాని మిత్రులను అధికారంలోకి తెచ్చిన మాటా నిజమే. కానీ ఇప్పుడు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత వారి ఓటు బ్యాంకులు ఇక లెక్కలోకి వచ్చేవి కాకుండా పోయాయి. అయినా, మన ప్రభుత్వం వారి రక్షణకు హామీని కల్పిస్తుంది, వారి సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం చేస్తుందను కోండి. అంతేగానీ, దయచేసి అధికారంలో వాటాను మాత్రం అడగకండి. కాకపోతే ఏదో ఒక సమయానికి మనం కూడా సంకేతాత్మకతను సృష్టించ వచ్చు. అప్పుడు మన సొంత దర్శన్ లాల్ తయారవుతాడు. అలాంటప్పుడు, ఈ సమస్యకు పాక్ చెప్పుకున్న.. మైనారిటీలు లెక్కలోకి రానే రారు అనే సమా ధానాన్నే మనమూ ఎంచుకున్నట్టు అవుతుంది. ఈ ప్రశ్నతో దీన్ని ముగిద్దాం: మనం మన జాతీయవాదాన్ని పునర్నిర్వచించుకునే సమయంలో మనకు స్ఫూర్తి, చివరకు పాకిస్తాన్ అవుతుందా? వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ శేఖర్ గుప్తా -
వైఎస్సార్సీపీలోనే ముస్లింలకు పెద్దపీట
టీడీపీకి రోజులు దగ్గరపడ్డాయి రేపటి నుంచి నగరంలో ‘గడప గడపకూ వైఎస్సార్’ వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీం అహమ్మద్ అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు పెద్దపీట వేస్తోందని పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీంఅహమ్మద్ అన్నారు. టీడీపీ ముస్లిం మైనార్టీలను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకుంటోందే తప్ప వారి సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించి తమ జీవితాల్లో వెలుగులు నింపారని, అదే స్ఫూర్తితో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింల సంక్షేమానికి పాటు పడుతున్నారని చెప్పారు. తనను గుర్తించి ఫిబ్రవరిలో ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన ఆయన తాజాగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా నియమించారని, జీవితాంతం జగన్‌కు రుణపడి ఉంటానని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి సైనికుడిలా పని చేస్తానన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ చేపట్టిన ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమాన్ని ఈనెల 19 నుంచి నగరంలో ప్రారంభిస్తానన్నారు. దీనిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో చర్చించానని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. 600లకు పైగా అబద్ధపు హామీలతో అధికారం దక్కించుకున్న చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు. రుణాలు మాఫీ చేస్తానని ఒక అబద్ధం చెప్పి ఉంటే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేవారన్నారు. మాటతప్పని, మడమ తిప్పని నాయకుడైన ఆయన సాధ్యం కాని హామీని ఇవ్వలేనని చెప్పారన్నారు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని చెప్పిన చంద్రబాబు తన కొడుకును దొడ్డిదారిన మంత్రి చేసుకుని ఉపాధి పొందారు తప్ప రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక ఉద్యోగం ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు గోగుల పుల్లయ్య, షఫీ అహ్మద్, ఎంఎస్ఎస్ సాదిక్, ఖాదర్‌బాషా, గిరి, ఖాజా, జక్రియా అహ్మద్, నిజాముద్దీన్, వాహిద్, జఫ్రుల్లా తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికి దుల్హన్ పథకం వర్తింపు
జిల్లామైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌వలి పాములపాడు: జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరికీ దుల్హన్ పథకం వర్తింపజేస్తునట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌వలి తెలిపారు. బుధవారం మండలంలోని బానుముక్కల గ్రామ పంచాయతీ భవనంలో విలేకరులతో మాట్లాడుతూ 2016 అక్టోబర్ 10 నాటికి ఆన్లైన్లో నమోదు చేసుకున్న 2431 మంది లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.12కోట్లు జమ చేసినట్లు చెప్పారు. 2017–18 సంవత్సరానికి గాను తొలి విడతలో రూ.4.56కోట్ల నిధులు మంజూరైనట్లు వివరించారు. ఈ పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందాలంటే మైనార్టీ వర్గానికి చెందిన వారు వివాహమైన 56 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలుండి ఆధార్, బ్యాంకు ఖాతా, పెళ్లి ఫొటో, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండల స్థాయిలో విచారణ అనంతరం జిల్లా కేంద్రానికి ఆన్లైన్లో పంపుతారని చెప్పారు. -
మైనారిటీ యువతులకు ఫాక్స్ కాంలో ఉద్యోగ అవకాశాలు
కర్నూలు (రాజ్‌విహార్): నిరుద్యోగ యువతులకు చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఉన్న ఫాక్స్ కాంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టరు మహమ్మద్ అంజాద్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధుల్లోని 18 సంవత్సరాల నుంచి 35ఏళ్ల వయస్సులోపు ఉన్న మహిళలు అర్హులని పేర్కొన్నారు. నెలకు రూ.8వేలు, 750 బోనస్ (26 పనిదినాలు పూర్తి చేసినవారికి) షిఫ్ట్ అలవెన్స్ కల్పిస్తారని, 150 కిలో మీటర్లు దూరం ఉన్న వారికి ఉచిత వసతి, 40శాతం సబ్సిడీపై నెలకు రూ.800కి భోజనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేస్తారని వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత అని, ఆసక్తి ఉన్న యువతులు www.apsmfc.com లో వివరాలను నమోదు చేసుకోవాలని, లేదా ఫోన్ 08518 277153, 91601 05162 నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
‘మైనారిటీ’ పరిధిలోకి 14 గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో ఉన్న 47 గురుకులాల్లోని 14 గురుకులాలను మైనారిటీ గురుకుల విద్యాలయాల సొసైటీ (టీఎం ఆర్ఈఐఎస్) పరిధిలోకి మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 12 గురుకుల పాఠశాలలతో పాటు ఉర్దూ మీడియం జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసిన 2 గురుకుల జూనియర్ కాలేజీలను టీఎంఆర్ఈఐఎస్ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. టీఎంఆర్ఈఐఎస్ పరిధిలోకి వెళ్లిన విద్యాసంస్థల వివరాలు..కులీ కుతుబ్‌షా ఉర్దూ బాయ్స్ గురుకుల పాఠశాల బార్కాస్ (హైదరాబాద్), టీఎస్ఆర్ ఉర్దూ బాయ్స్ స్కూల్ నాగారం (నిజామాబాద్), టీఎస్ఆర్ ఉర్దూ బాయ్స్ స్కూల్ (సంగారెడ్డి), టీఎస్ఆర్ ఇంగ్లిషు మీడియం బాయ్స్ స్కూల్ ఎస్ఎల్బీసీ కాలనీ (నల్గొం డ), టీఎస్ఆర్ ఉర్దూ బాలికల స్కూల్ ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి), టీఎస్ ఆర్ ఉర్దూ గర్ల్æ్స స్కూల్ (మహబూబ్‌నగర్), టీఎస్ఆర్ మైనారిటీ గర్ల్స్ స్కూల్‌తోపాటు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, కామారెడ్డి, జహీరాబాద్, వనపర్తి, వరంగల్‌లోని టీఎస్ఆర్ మైనారిటీ బాయ్స్ స్కూళ్లను మైనారిటీ గురుకుల సొసైటీ పరిధిలోకి తెచ్చారు. ఎల్బీనగర్లోని బార్కాస్ కులీకు తుబ్‌షా ఉర్దూ గురుకుల జూనియర్ కాలేజీ, నిజామాబాద్ జిల్లా నాగారం లోని టీఎస్ఆర్ ఉర్దూ బాయ్స్ జూనియర్ కాలేజీలను బదలాయించారు. -
ఉచిత ఎంసెట్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
– దరఖాస్తుకు 23వ తేదీ వరకు గడువు కర్నూలు(రాజ్‌విహార్): ఎంసెట్–2017కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు రీజినల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్, ప్రొఫెసర్ సయ్యద్ ఇందాద్ అలీ ఖాద్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జౌనులు, సిక్కులు అర్హులని.. ఇంటర్మీడియేట్ పూర్తయి, 2వ సంవత్సరం పరీక్షలు రాసే అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ పత్రం జిరాక్స్ కాపీ, 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 19వ తేదీ వరకు ఉన్న దరఖాస్తు గడువును విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఈనెల 23వ తేదీకి పెంచామన్నారు. శిక్షణతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇస్తామన్నారు. వివరాలకు స్థానిక ఉస్మానియా కళాశాలలోని రూమ్ నంబర్ 54లో ఉన్న తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, 94945 55961, 94417 61178 ఫోన్ నెంబర్లలోనూ సమాచారం పొందవచ్చన్నారు. -
మైనారిటీ యువతకు గుంటూరులో జాబ్‌మేళా
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఈనెల 25, 26 తేదీల్లో గుంటూరులో మైనారిటీ యువతకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్‌చైర్మన్ ఎస్.కె.బషీర్‌అహ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ కార్పొరేషన్ (విజయవాడ) ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నామన్నారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులైన మైనారిటీ అభ్యర్థులు (ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, జైన్స్, బుద్దీస్, పార్సీస్) ఈనెల 23లోపు దరఖాస్తులను www.apsmfc.com వెబ్సైట్లో పంపాలన్నారు. అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను సిద్ధం చేసుకుని జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాల కోసం 98499 01149, 98853 77707 నంబర్లకు సంప్రదించాలన్నారు. -
పీఎస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ
కర్నూలు (రాజ్‌విహార్): పంచాయతీ సెక్రటరీ(పీఎస్)పోస్టులకు సంబంధించిన పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని రీజినల్ సెంటర్ ఫర్ ఎడ్యూకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ సంస్థ డిప్యూటి డైరెక్టరు సయ్యద్ ఇందాద్ అలీ ఖాద్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్శీలు అర్హులన్నారు. నెల రోజుల శిక్షణతోపాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇస్తామన్నారు. బుధవారం నుంచి తమ కార్యాలయంలో దరఖాస్తులు అందిస్తామన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఏప్రిల్ 20 వరకు శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు ఉస్మానియా కళాశాలలోగానీ, ఫోన్ (94945 55961, 94417 61178) ద్వారా కానీ సంప్రదించాలన్నారు. -
మైనారిటీ రుణాల మంజూరుకు చర్యలు
– 27 నుంచి పలు మండలాల్లో ఇంటర్వూ్యలు కర్నూలు(రాజ్‌విహార్): మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మైనారిటీ కార్పొరేషన్ జిల్లా ఎగ్జిక్యూటీవ్ డైరక్టరు మహమ్మద్ అంజాద్ అలీ శనివారం ప్రకటనలో తెలిపారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పెద్ద కడుబూరు, డోన్ మున్సిపాలిటీ (పట్టణం), చిప్పగిరి, ఆలూరు, మిడుతూరు, కల్లూరు, పత్తికొండ, పాణ్యం, గోస్పాడు, మద్దికెర, ప్యాపిలి, బనగానపల్లె మండలాలకు చెందిన అభ్యర్థులు 27వ తేదీన, హోళగుంద, నందవరం, పాములపాడు, బేతంచెర్ల, ఉయ్యాలవాడ, కొత్తపల్లి, ఆదోని మున్సిపాలిటీ, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, వెలుగోడు మండలాల్లో 28వ తేదీన, కృష్ణగిరి, పగిడ్యాల మండలాల్లో 29వ తేదీన ఉదయం 10గంటలకు మండల అభివృద్ధి అధికారి (ఎండీఓ) కార్యాలయాల్లో ఇంటర్వూలు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలకు ఫోన్ : 70754 40400, 88013 54690 నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
కర్నూలులో మైనార్టీ భవన్ నిర్మాణం
–రూ.1.25 కోట్లతో ప్రతిపాదనలు – కలెక్టర్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలులో మైనార్టీ వర్గాల వారి కోసం సదా్భవన్ మండప్ పేరుతో మైనార్టీ భవన్‌ను నిర్మించనున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. సోమవారం ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్పేర్ అసోసియేషన్( ఆల్మేవ)జిల్లా కార్యవర్గ సభ్యులు కలెక్టర్‌ను ఆయన చాంబరులో కలిసి వివిధ సమస్యలపై చర్చించారు. మైనార్టీ ఉద్యోగులు, ప్రజల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి షేక్ మస్తాన్‌వలితో కలిసి కలెక్టర్ వివరించారు. మైనార్టీ భవన్ నిర్మాణానికి రూ.1.25 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. మైనార్టీ ఉద్యోగులు వినియోగించుకోవడంతో పాటు, వృత్తి నైపుణ్యాల శిక్షణ కేంద్రంగా వాడుకునేలా భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఆదోనిలో రూ.15 కోట్లతో మైనార్టీ బాలికల కోసం జవహర్ నవోదయ విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు వివరించారు. అరేకల్లో రూ.3.99 కోట్లతో మైనార్టీ ఐటీఐ నిర్మిస్తున్నట్లు తెలిపారు. అల్‌మేవ వ్యవస్థాపకుడు సయ్యద్‌హుసేన్ మాట్లాడుతూ నంద్యాలలో ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం మైనార్టీల అభ్యున్నతికి కలెక్టర్ చేస్తున్న కృషి అభినందనీమని కొనియాడుతూ అల్‌మేవ నేతలు కలెక్టర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ గంగాధర్‌గౌడు, ఆల్మేవ వ్యవస్థాపకుడు సయ్యద్హుసేని, జిల్లా అధ్యక్షుడు సర్దార్ అబ్దుల్ హమీద్, జిల్లా కార్యదర్శి రియాజ్‌బాషా, వర్కింగ్ ప్రెసిడెంటు మహబూబ్‌బాష, ఇతర నాయకులు దాదాపీర్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. -
ఉపకార వేతనాల దరఖాస్తుకు గడువు పెంపు
కర్నూలు(రాజ్‌విహార్): మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు జిల్లా మైనారిటీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు మహమ్మద్ అంజాద్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యార్థులు (ప్రీ మెట్రిక్), కళాశాల విద్యార్థులు (పోస్టు మెట్రిక్) స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 31వ తేదీతో గడువు ముగిసిందన్నారు. అయితే ఈ గడువును ఈనెల 30వ తేదీకి పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 08518 277153, 91601 05162 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
మైనార్టీలకు కొత్త పథకాలు కావాలి..
* రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ వినతి * మంత్రి రఘునాథరెడ్డితో సమావేశం గుంటూరు (ఆనందపేట): రాష్ట్ర మైనా ర్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో శనివారం వెలగపూడిలోని తాత్కాలిక రాజధానిలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ సమావేశమయ్యారు. దుల్హన్ పథకంలో మార్పులు చేసి వధువు తల్లిదండ్రులకు మరింత ఆర్థిక సహాయం అందేలా చూడాలని మంత్రిని కోరినట్లు హిదాయత్ చెప్పారు. స్వయం ఉపాధి పథకాల కోసం అందిస్తున్న రుణ సహాయం బ్యాంకులతో ప్రమేయం లేకుండా ప్రత్యక్షంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందించాలని, మైనార్టీల కోసం మరిన్ని నూతన పథకాలు రూపొం దించాలని కోరినట్టు తెలిపారు. సాధ్యమయినంత ఎక్కువ మందికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హమీ ఇచ్చినట్లు హిదాయత్ తెలిపారు. ఈ సమావేశంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్పు గడువు పొడిగింపు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు మైనార్టీ కార్పొరేషన్ ఈడీ మహ్మద్ అంజాద్ అలీ తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పది, ఇంటర్ విద్యార్థుల నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్పుల కోసం దరఖాస్తులు కోరామన్నారు. అయితే చాలా మంది విద్యార్థుల విన్నపం మేరకు మరో నెలపాటు గడువు పొడిగించినట్లు వివరించారు. -
మైనార్టీ విద్యార్థులకు సువర్ణ అవకాశం
– ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభించిన గంటా, కేఈ – రెండేళ్లలో పక్కా భనాల్లోకి మార్చుతాం – ఎమ్మెల్యే ఎస్వీకి కేఈ చురకలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలులో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం మైనార్టీ విద్యార్థులకు సువర్ణ అవకాశమని మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉస్మానియా కళాశాలలో తాత్కాలికంగా మంగళవారం ఉర్దూ యూనివర్సిటీకి రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు, డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఉర్దూ వర్సిటీ కోసం తాత్కాలికంగా తరగతి గదులను కేటాయించిన ఉస్మానియా కళాశాల కరస్పాండెంట్ అజ్రాజావేద్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేఈ మాట్లాడుతూ.. ఉస్మానియా కళాశాలలో చదివి తాను జీవితంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నానని, ఉర్దూ వర్సిటీ విద్యార్థులు కూడా లక్ష్యం కోసం నిరంతరం చదివి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని సూచించారు. అంతకముందు రాజకీయ ప్రసంగం చేసిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి కేఈ చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో అలాంటి ప్రసంగం చేశారని.. ఆయన మరచిపోయిన మరికొన్ని పథకాలను మైనార్టీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు నగరంలో రూ.207 కోట్లతో అభివద్ధి పనులు జరుగుతున్నాయని, తన హయాంలోనే ఉర్దూ యూనివర్సిటీ నెలకొందని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ పేర్కొన్నారు. ఉర్దూ యూనివర్సిటీని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిపై ఒత్తిడి చేసి ఇక్కడే ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నట్లు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. నేటి నుంచి తరగతులు ప్రారంభం ఉర్దూ యూనివర్సిటీ తరగతులను బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఇన్చారి వైస్ చాన్సులర్ వై.నరసింహులు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇప్పడు కూడా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మొత్తం ఆరు కోర్సుల్లో 87 మంది చేరినట్లు చెప్పారు. ఇందులో ఎంఏ ఉర్దూ కోర్సుకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్లు సత్తార్ సాహేబ్, బి.అమర్నాథ్, కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, ఏజేసీ రామస్వామి, డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, ఉస్మానియా కళాశాల కరస్పాండెంట్ ఆజ్రాజావేద్, పలువురు మైనార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తెలుగుకీర్తి.. విశ్వదీప్తి పుస్తకావిష్కరణ 2014 సంవత్సరంలో ఉస్మానియా కళాశాలలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ తెలుగు సదస్సుకు సంబంధించిన ప్రత్యేక సంచిక తెలుగు కీర్తి..విశ్వదీప్తి అనే గ్రంథాన్ని మంత్రులు గంటా శ్రీనివాసరావు, కేఈ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. -
మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
న్యూశాయంపేట : కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాల కోసం మైనారిటీ విద్యార్థులు టీఆర్ఎస్ మైనారిటీ విభాగం మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మహ్మద్ షకీల్ అహ్మద్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31లోగా ఆన్లైన్లో తమ దరఖాస్తులను దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. 1నుంచి 10 వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, ఆపై తరగతుల వారు కూడా ఉపకార వేతనాలకోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఫ్రెష్ అభ్యర్థులతో పాటు, రెనివల్ చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్లో తమ దరఖాస్తులను అందించాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఫీజు వివరాల రషీదును ఆన్లైన్లో పొందుపరిచినట్లు చెప్పా రు. ఇతర వివరాలకోసం 94905 82690, 97032 88868 సెల్నెంబర్లను సంప్రదిం చాలని సూచించారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
కోటగిరి : మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి షఫీఉల్లా అన్నారు. బుధవారం సాయంత్రం కోటగిరి మండలకేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల భవనంలో చేపట్టిన మరమ్మత్తు పనులను త్వరలో పూర్తిచేయాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న మూత్రశాలలు, పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలో మౌళిక వసతులు కల్పించాలని నిర్వాహకులకు ఆదేశించారు. ఏ క్షణంలోనైనా వస్తానని, లోటుపాట్లు కనిపిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట పలువురు నాయకులు,ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు. -
మొదటి వారంలో సబ్సిడీ విడుదల
నల్లగొండ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కా ర్పొరేషన్ లబ్ధిదారులకు సంబంధించిన ఈ నెల మొదటి వారంలో ప్రభుత్వం సబ్సిడీ (బడ్జెట్) విడుదల చేయనున్నుట్ల ఏజేసీ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం తన చాంబర్లో వివిధ బ్యాంక్‌ల జిల్లా మేనేజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారుల రుణాల విషయంలో జాప్యం చేయొద్దని, వారి ద రఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సూ చించారు. బ్యాంకర్లు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగించకుండా రుణాలు మంజూరు చేయూలని సూచించారు. అర్బన్ మున్సిపాలిటీ స్వయం ఉపా ధి పకం ద్వారా రుణాల విషయంలో లబ్ధిదారులు సంబంధిత ధ్రువపత్రాలు ఖచ్చితంగా సమర్పిస్తే లోన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బ్యాంకు అధికారులు తెలిపారు. సమభావన సంఘాల రుణాలలో అవకతవకలు జరుగుతున్నాయని బ్యాంకర్లు డీఆర్డీఏ పీడీ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ అంజయ్య, ఎల్.డి.యం శ్రీధర్, బీసీ కార్పొరేషన్ ఈడీ వేణుగోపాల్‌రావు, గ్రౌండ్ వాటర్ డీడీ జితేందర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
మహిళలకు వడ్డీ లేని రుణాలందించాలి
మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సృజన ఆదిలాబాద్ అగ్రికల్చర్ : గతంలో స్త్రీనిధి ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఉండేవని, ప్రస్తుతం వడ్డీ వసూలు చేస్తున్నారని, గతంలో మాదిరిగా వడ్డీ లేని రుణాలను పునరుద్ధరించాలని మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వి.సృజన అన్నారు. శుక్రవారం పట్టణంలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మహిళా సమాఖ్య సదుస్సులో ఆమె మాట్లాడారు. ఎన్నికల ముందు మహిళా గ్రూపులకు రూ.10 లక్షల చొప్పున వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లుగానే డ్వాక్రా మహిళ రుణాలను మాఫీ చేయాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లలకు స్కాలర్షిప్ను రూ.1500 అందించాలని, అభయహస్తం పింఛన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు, అఘారుుత్యాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. షీ టీంలను పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా మండల, గ్రామ స్థాయిలో కూడా నియమించాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో జిల్లా కార్యదర్శి ముడుపు నళినిరెడ్డి, అధ్యక్షురాలు చంద్రకళ, ప్రభావతి, టీ.రాజకుమారి, కవిత, బోథ్ మండల కార్యాదర్శి గోదావరి, వై.కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బాలికల గురుకులాల్లో ఇక అందరూ మహిళా ఉద్యోగులే!
♦ కొత్త గురుకులాలతో పాటు పాత వాటిలోనూ భర్తీకి ప్రభుత్వం మొగ్గు ♦ రెండు మూడు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రారంభించనున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల బాలికల గురుకులాల్లో మొత్తం మహిళా ఉద్యోగులనే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాలికల అక్షరాస్యతను పెంచడంతో పాటు, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం గురుకులాల ద్వారానే సాధ్యమని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో కొత్తగా బాలికల గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కొత్తగా ఏర్పాటుకానున్న బాలికల గురుకులాలతోపాటు ఇప్పటికే కొనసాగుతున్న బాలికల గురుకులాల్లో టీచర్లు, వార్డెన్లు మొదలుకుని అన్ని విధుల్లోనూ మహిళా ఉద్యోగులనే నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివ రకూ 50 ఏళ్లకు పైబడిన పురుషులను బాలికల గురుకులాల్లో నియమించేందుకు మినహాయింపు ఉండేది. ప్రస్తుతం అటువంటి మిన హాయింపు లేకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయంలో సాంకేతికంగా, చట్టపరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయా అంశాలపై వివిధ సంక్షేమ శాఖలకు ఈ ఫైల్‌ను పంపించారు. ఆ తర్వాత సాధారణ పరిపాలన శాఖ ఆమోదముద్రకు పంపనున్నారు. ఇందుకు సంబంధించి రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవచ్చునని అధికార వర్గాల సమాచారం. బీసీ వర్గాల్లో అసంతృప్తి కొత్తగా 100 ఎస్సీ, 71 మైనారిటీ, 50 ఎస్టీ గురుకులాలను, 30 రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటుచేయనున్నారు. తమను మినహాయించి మిగతా అన్నివర్గాలకు గురుకులాలను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం పట్ల బీసీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తగా 20 బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న 16 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఈ వర్గాల్లో పెరుగుతోంది. -
లక్ష్మీ.. రావే మా ఇంటికి!
♦ బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపు ♦ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ ♦ సంబురాల్లో వెనుకబడిన వర్గాలు ♦ జిల్లాలో బీసీ జనాభా 18.54లక్షలు ♦ దరఖాస్తుల పరిశీలన బాధ్యత బీసీ సంక్షేమ శాఖకే ♦ పారదర్శకంగా అమలు చేయాలంటున్న ప్రజాప్రతినిధులు, నేతలు జోగిపేట : బీసీలకూ కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వెనుకబడిన వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ 1 నుంచి బీసీలు, ఓబీసీలకు కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జీఓ ఎంఎస్ నం. 5ను జారీ చేసింది. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ.51 వేల ఆర్థిక సాయం అందుతుంది. ప్రారంభంలో ఎస్సీ, ఎస్టీలకే ఈ పథకాన్ని వర్తింపజేసిన ప్రభుత్వం తాజాగా బీసీలకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇక నుంచి బీసీలు, ఓబీసీలు, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది. జిల్లాలో బీసీ జనాభా 18.54 లక్షలు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కంటే బీసీలే అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం బీసీ జనాభా 18,54,073 లక్షలు. వీరిలో 70 శాతానికిై పెగా నిరుపేద వర్గాలకు చెందిన వారే ఉన్నారు. వీరిలో చాలామంది ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయలే క సతమత మవుతున్నారు. బీసీలకు, ఓబీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చాలా మంది తల్లిదండ్రులకు ఇది వరంగా మారింది. కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయడంతో బీసీలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలన బాధ్యత ఆ శాఖ అధికారులకే.. దరఖాస్తుల పరిశీలన బాధ్యతలను ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించింది. సహయ బీసీ సంక్షేమ అధికారులు (ఏబీసీడబ్ల్యూఓ) వసతి గృహ వార్డెన్లకు ఈ బాధ్యతలను కట్టబెట్టింది. దరఖాస్తులు చేసుకునే వారు ఆయా మండల ప్రాంతాల వార్డెన్లకు దరఖాస్తులు అందజేస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసే విధానం.. ♦ సమీపంలోని మీ-సేవ కార్యాలయంలో గాని, ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో, హాస్టల్ వార్డెన్లకూ దరఖాస్తులు సమర్పించవచ్చు. ♦ వధూవరుల వయస్సు ధ్రువీకరణ పత్రం లేదా టెన్త్ మెమో, బోనఫైడ్, టీసీ ♦ వధూవరుల కుల ధ్రువీకరణ పత్రం ♦ వధూవరుల ఆధార్ కార్డులు ♦ వధువు బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ ♦ వివాహ ప్రతిక, మొదటి వివాహ ధ్రువపత్రం (గెజిటెడ్ అధికారి సంతకం చేసినది) ♦ సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి వివాహ ధ్రువపత్రం. పథకం పక్కదారి పట్ట కుండా చూడాలి ♦ పేద బీసీ వర్గాల కోసం ప్రవేశ పెట్టిన పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే. పేద బీసీ ఆడపడుచుల వివాహానికి ప్రభుత్వం మంజూరు చేసే రూ.51వేలు కొంత మేరకు ఉపయోగపడతాయి. ♦ నిబంధనల పేరిట పేదలను ఇబ్బంది పెట్టొద్దు. బీసీలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - కవిత, చైర్పర్సన్, జోగిపేట నగర పంచాయతీ వివాహ రిజిస్ట్రేషన్ పత్రం.. ఏప్రిల్ 1నుంచి పెళ్లిళ్లు చేసుకున్న బీసీ యువతులు, కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కల్గిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం ఏబీసీడబ్ల్యూవోలు, వార్డెన్లు వాటిని పరిశీలిస్తారు. ఆ వెంటనేవధువు ఖాతాల్లోకి ట్రెజరీ ద్వారా నిధులు జమ అవుతాయి. ఆశన్న, - బీసీ సంక్షేమ శాఖ అధికారి సంగారెడ్డి పథకం కింద అర్హత పొందాలంటే .. ♦ వివాహం కానివారై ఉండాలి, వధూవరులు ఒకే కులానికి చెందిన వారై ఉండాలి. ♦ పెళ్లి నాటికి వధువుకి 18, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ♦ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు మించరాదు. ♦ {పతి వధువుకు ఒకసారి మాత్రమే వర్తిస్తుంది. ♦ ఏప్రిల్ 1 తర్వాత వివాహం చేసుకున్న బీసీ యువతులందరూ అర్హులే. -
మెజారిటీ ఉంటే ఎమ్మెల్యేలను కొనడమెందుకు?
► టీడీపీ ప్రభుత్వం మైనారిటీలో ఉందా? ► దమ్ముంటే ఫిరాయింపుదారులకు టీడీపీ టికెట్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలి ► సీఎంకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ సవాల్ ► చిత్తూరు, తిరుపతి, నగరిలో కొవ్వొత్తుల ర్యాలీలు చిత్తూరు (అర్బన్)/తిరుపతి మంగళం/నగరి/: రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మెజారిటీలో ఉంది. మైనారిటీలో లేదు. అలాంటప్పుడు కోట్ల రూపాయలిచ్చి మా ఎమ్మెల్యేలను ఎందుకు కొంటున్నావ్’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి అధికారపార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ శనివారం వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సేవ్‌డెమోక్రసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు, తిరుపతి, నగరిలో జరిగిన కార్యక్రమాలకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిత్తూరులో జరిగిన కార్యక్రమానికి గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పీలేరు ఎమ్మెల్యేలు కె.నారాయణస్వామి, డాక్టర్ ఎం.సునీల్‌కుమార్, చింతల రామచంద్రారెడ్డి హాజ రయ్యారు. చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లె శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత నగరంలోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తుల తో నగర వీధుల్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే లు సీఎం తీరును ఎండగట్టారు. మైండ్‌గేమ్ ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 13 మంది ఎమ్మెల్యేలచేత రాజీనామా చేయించి, టీడీపీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టాలని సవాల్ విసిరారు. సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది మూలం, చిత్తూరు నగరఅధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీ.పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర లీగల్‌సెల్ ప్రధాన కార్యదర్శులు తోట పురుషోత్తం, త్రిమూర్తి పాల్గొన్నారు. తిరుపతిలో.. తిరుపతిలో జరిగిన సేవ్‌డెమోక్రసీ కార్యక్రమానికి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు విచ్చేశారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొవ్వొత్తులతో నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ అనుభవాన్ని రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తే బాగుంటుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న, వైఎస్ఆర్ ఫొటోలతో గెలిచిన ఎమ్మెల్యేలు అవినీతి సొమ్ముకు కక్కుర్తిపడి టీడీపీలోకి వెళ్లడం సిగ్గుచేటన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, సంయుక్త కార ్యదర్శి ఎస్కె.బాబు, యువజన విభాగం నగర అధ్యక్షుడు ఎస్కె.ఇమామ్, నాయకులు కేతం జయచంద్రారెడ్డి, దుద్దేల బాబు, టి.రాజేంద్ర, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, పుల్లూరు అమరనాథ్‌రెడ్డి, శివకుమార్, పెరుగు బాబూయాదవ్, తాల్లూరు ప్రసాద్, చెలికం కుసుమ, పుష్పలత, పుణీత, పుష్పాచౌదరి, శారద, సాయికుమారి, ప్రమీల, కవితమ్మ పాల్గొన్నారు. నగరిలో.. చంద్రబాబునాయుడు నుంచి ప్రజాస్వామాన్ని కాపాడుకోవల్సిన సమయం ఇదేనని, మేధావులు, విద్యార్థులు, జర్నలిస్టులు, మానవతావాదులందరూ ప్రజాస్వామ్యానికి అండగా నిలవాలని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సేవ్ డెమోక్రసీలో భాగంగా పట్టణంలోని కొత్తపేట నుంచి టవర్ క్లాక్ మీదుగా ఓంశక్తి ఆలయం వరకు బైక్, కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో చీకటి పాలన నెలకొందని, దీనికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ చేపడున్నామని చెప్పారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు ప్రజాస్వామ్యాన్నీ అదే రీతిలో ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ కుర్చీ కోసం పిల్లనిచ్చిన మామనే చంపిన చంద్రబాబు నేడు ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని, ఇది అసాధ్యమన్నారు. నాడు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు, నేడు లింగమనేని అక్రమ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను కొంటున్నాడని ధ్వజమెత్తారు. కొడుకు నారా లోకేష్ ఎమ్మెల్యేలకు కోట్లు ఇస్తుంటే, చంద్రబాబు కండువాలు కప్పి పార్టీకి ఆహ్వానిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు, టీడీపీ నేతలు సమాధి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు నిజమైన రాయలసీమ బిడ్డ అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. నియోజకవర్గ నాయకుడు రాష్ట్ర టీయూసీ ప్రధాన కార్యదర్శి కేజే.కుమార్, వైస్ చైర్మన్ పీజీ.నీలమేఘం, రాష్ట్ర నాయకుడు డి.లక్ష్మీపతిరాజు, రాష్ట్ర బీసీ కార్యదర్శి అములు, ఎంపీపీ మురళీధర్, జెడ్పీటీసీ సురేష్‌రాజు, రాష్ట్ర యూత్ కార్యదర్శి శ్యామ్‌లాల్, దిలీప్‌రెడ్డి, రవిశేఖర్‌రాజు పాల్గొన్నారు. బాబూ మచ్చలేని నాయకుడని నిరూపించుకో నువ్వు అసెంబ్లీలో మచ్చలేని నాయకుడం టూ ఊదరగొట్టేస్తుం టావ్. ఇప్పుడేమో కోట్ల రూపాయలు పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నావు. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చకాదా?. నీ నిజాయితీ ఇదేనా?. దమ్ముంటే నీ పార్టీలోకి వచ్చిన మా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు. టీడీపీ టికెట్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించు. మచ్చలేని నాయకుడని నిరూపించుకో - డాక్టర్ సునీల్‌కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే అవితి డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నావ్ పట్టిసీమతోపాటు అమరావతి రాజధాని పేరు తో సీఎం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఆ డబ్బును ఎరజూపి ప్రతి పక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారు. దేశంలో ఎక్కడికెళ్లినా ఇప్పు డు దీనిపైనే చర్చ. ఎమ్మెల్యేలు సైతం ఏ మాత్రం సంకోచించకుండా తాము నియోజకవర్గ అభివృద్ధికంటూ టీడీపీలో చేరుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. సీఎం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి. చింతల రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే -
ఆయనకు తగిన గుణపాఠం చెబుతారు
మదనపల్లె: కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా మైనార్టీల ద్రోహి అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, కదిరి నియోజకవర్గ ఇన్చార్జి బాబ్జాన్ ఆరోపించారు. శనివారం ఆయన మదనపల్లెలో విలేకరులతో మాట్లాడుతూ కదిరి ఎమ్మెల్యే పార్టీ మారడం నీచమైన చర్య అన్నారు. అధికార పార్టీ తాయిలాలకు అశపడి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం, మైనార్టీల మనోభాలను దెబ్బతీసినట్లేనన్నారు. చాంద్‌బాషా రాష్ట్రంలోని మైనార్టీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా షాదీమహళ్లు నిర్మించి, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీని స్థాపించి మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించారని చెప్పారు. అలాంటి పార్టీని వదిలి వెళ్లడం దారుణమన్నారు. కదిరి నియోజక వర్గ ప్రజలు చాంద్‌బాషాను చూసి ఓట్లు వేయలేదని, జగన్మోహన్రెడ్డి కోసం, పార్టీపై ప్రేమతో ఆయన్ని గెలిపించారన్నారు. దురాశతో పార్టీ మారిన చాంద్‌బాషాకు మైనార్టీలు రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇలాంటి స్వార్థపరులు ఎంతమంది పార్టీని వదిలినా మైనార్టీలు మాత్రం ఎప్పుడూ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటారని స్పష్టం చేశారు. -
పేదల పక్షపాతి వైఎస్సార్సీపీ
పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్యే చాంద్‌బాషా కదిరి : పేద, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు, ఇలా అన్ని వర్గాల పేద ప్రజల కోసం పుట్టిందే వైఎస్సార్సీపీ అని ఆపార్టీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా పేర్కొన్నారు. శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, పార్టీ కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే స్వగృహం వద్ద నుంచి క్లాక్ టవర్ మీదుగా స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని వైఎస్సార్ విగ్ర హం వద్దకు భారీ ర్యాలీ చేశారు. అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం వలీసాబ్‌రోడ్‌లో పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్సీపీని ఆవిర్భావంలోనే అణచివేయాలని కొన్ని పార్టీలు కుట్రపన్నాయని, అయితే ప్రజల మద్దతుతో దిగ్విజయంగా ఐదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. త్వరలోనే పార్టీకి, ప్రజలకు మంచిరోజులొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనతో పాటు జిల్లాకు చెందిన మరికొందరు వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీలో చేరుతారని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని, అలాంటి మాటలు పట్టించుకోవద్దన్నారు. టీడీపీ మునిగిపోయే నావ లాంటిదయితే వైఎస్సార్సీపీ ఉదయించే సూర్యుడి లాంటిదని పేర్కొన్నారు. -
మైనార్టీలకు రూ.710 కోట్ల కేటాయింపుపై హర్షం
నెల్లూరు (టౌన్): రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీలకు రూ.710 కోట్లను కేటాయించడం అభినందనీయమని మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. హరనాథపురంలోని చారిటబుల్ ట్రస్ట్‌లో టీడీపీ మైనార్టీ నాయకులతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గతేడాది మైనార్టీలకు బడ్జెట్లో రూ.370 కోట్లను కేటాయించారని, ఈ ఏడాది దాన్ని రెట్టింపు చేయడం మైనార్టీలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. నిధుల కేటాయింపుపై చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మైనార్టీ నేత అబూబకర్ మాట్లాడారు. ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడే వారు అభివృద్ధి చెందుతారన్నారు. నాయకులు రఫీ, మౌలానా అబ్దుల్ అజీజ్, సుభహాన్, మున్వర్, పఠాన్‌బాషా, రియాజ్, షంషుద్దీన్, నన్నేసాహెబ్, జియఉల్‌హక్ పాల్గొన్నారు. -
మంత్రి రావెల రాజీనామా చేయాలి
పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల విజయవాడ(వన్‌టౌన్) : మైనార్టీ మహిళపై అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు సుశీల్‌ను కఠినంగా శిక్షించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసకుమార్ డిమాండ్ చేశారు. అలాగే తన కుమారుడిని ప్రోత్సహించి మహిళలపై ఏమాత్రం గౌరవం లేని రావెల తక్షణం తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ మేరకు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పంజా సెంటర్లో ఆదివారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఆకుల శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ రావెల సుశీల్ పట్టపగలు మహిళపై అఘాయిత్యానికి పాల్పడటం అత్యంత దుర్మార్గమన్నారు. సుశీల్‌ను ఆ విధంగా పెంచిన మంత్రి బలమైన సాక్ష్యాలు ఉన్నా ఇంకా తన కుమారుడు నిర్దోషి అనడం అతని దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇటీవల రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసి పేదల పొట్టలు కొట్టిన మంత్రి దానినీ సమర్ధించుకున్నారని గుర్తు చేశారు. పీసీసీ మైనార్టీ నేతలు బషీర్ అహ్మద్, అన్వర్, హుస్సేన్ పాల్గొన్నారు. -
సీమకు అన్యాయం చేస్తే సహించం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం సాధన కోసం విద్యార్థి సంఘాలు గర్జించాయి. సీమకు అన్యాయం చేస్తే సహించమంటూ నినాదాలు చేశాయి. రాయలసీమ రాష్ట్ర సాధనే ధ్యేయమని ప్రకటించాయి. సీమపై పాలకులు చూపుతున్న వివక్షపై దండెత్తాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోస్తా జపం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్, ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫెడరేషన్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు మూడు వేల మంది విద్యార్థులు హాజరై సీమ సమస్యలపై గళమెత్తారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు వీవీనాయుడు అధ్యక్షతన మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో నిర్వహించిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నక్కలమిట్ల శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 20 స్మార్ట్ సిటీలను ప్రకటించగా వెనుకబడిన రాయలసీమలో ఒక్కటి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజనతో రాళ్ల సీమగా మారిన రాయలసీకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలుకు రావాల్సిన రాజాధాని అమరావతికి తరలించారని, హైకోర్టును అక్కడే స్థాపించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీంతో సీమకు రావాల్సిన పరిశ్రమలు కోస్తాకు తరలిపోతున్నాయని, అక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుతుందన్నారు. అంతకుముందు రాజవిహార్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు 3000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణారావు, బాలసుందరం, అరుణ్‌శర్మ, రవికుమార్, నాగేశ్వరరెడ్డి, సుహాన్బాష, రాజునాయుడు, శివకుమార్, క్రాంతికుమార్, రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
తమిళంలోనే రివిజన్ టెస్ట్
హైకోర్టు ఉత్తర్వులు అమలుచేయని ప్రభుత్వం మైనార్టీ భాషల విద్యార్థులకు తప్పని తిప్పలు హొసూరు: తమిళనాడు రాష్ట్రంలో వేలాది మంది మైనార్టీ భాషలు చదువుతున్న విద్యార్థులు వీధుల్లోకి వచ్చి తమ మాతృభాషలో చదువుకొనే అవకాశం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్నివేడుకున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను తమ మాతృభాషలోనే రాసే అవకాశం కల్పించమని ప్రాధేయపడ్డారు. తమిళనాడు ప్రభుత్వం కనికరించలేదు. విద్యార్థులు రాష్ర్ట హైకోర్టు తలుపులు తట్టారు. హైకోర్టు 2015 నవంబర్ 23వ తేదీ ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు వారి మాతృభాషలోనే రాసేందుకు అవకాశం కల్పిచమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, విద్యార్థులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేస్తూ గడువిచ్చింది. వేలాది మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకొన్నారు. కానీ విద్యాశాఖ కార్యదర్శి దరఖాస్తులు చేసుకొన్న ప్రతి విద్యార్థికి లెటర్ అందజేసి తమిళం బోధించాము, తమిళంలో పరీక్షరాయాలని సూచించడంతో ఈ లెటర్‌ను సవాల్ చేస్తూ మాచినాయకనపల్లి ప్రభుత్వ హయ్యర్సెకెండరీ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని గౌతమి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ కేసును విచారించి రెండవ సారి కూడా విద్యాశాఖకు 25.01.2016న స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కానీ విద్యాశాఖ కోర్టు సూచనలను పెడచెవిన పెట్టి 10వ తరగతి చదుతున్న మైనార్టీ భాషా విద్యార్థులకు నిర్బంధంగా తమిళ పాఠాలు బోధిస్తోంది. వారి మాతృభాషలైన తెలుగు, కన్నడం, ఉర్దూ, మళయాళం భాషలను బోధించకపోవడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనయ్యారు. మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ప్రారంభమైన రివిజన్ టెస్టులో మైనార్టీ విద్యార్థులకు తమిళంలో ప్రశ్నాపత్రాలు అందజేసింది. తమ మాతృభాషలోపరీక్షలు రాయమని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా తమకు రివిజన్ టెస్టులో తమిళ ప్రశ్నాపత్రం ఇవ్వడమేమిటని కోర్టుకెళ్లిన గౌతమి ప్రశ్నిం చింది. తనకు తమిళం రాదని, తాను తమిళ ప్రశ్నాపత్రానికి జవాబులు రాయలేదని గౌతమి సాయంత్రం భోరున విలపించింది. దీనిపై విద్యార్థులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం పట్టిం చుకోకపోతే భావిభారత పౌరులమైన తమకు కోర్టులపై, తీర్పులపై, భారత రాజ్యాంగంపై ఉన్న గౌరవం ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యార్థులు అనుకుంటున్నారు. మైనార్టీ విద్యార్థుల సమస్యలపై నేడు సమావేశం రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను తమిళంలో నిర్వహించడంపై ప్రభుత్వ చర్యలను ఎదుర్కొనేందుకు హొసూరు ఎమ్మెల్యే కే. గోపీనాథ్ అధ్యక్షతన బుధవారం ఉదయం 10 గంటలకు ఆంధ్రసాంస్కృతిక సమితిలో మైనార్టీ భాషా సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగు, కన్నడ భాషాభిమానులు, సంఘాలు, పిల్లల తల్లితండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులకు వారివారి మాతృభాషల్లో విద్యనభ్యసించేందుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. -
మైనారిటీలకు 60 కొత్త స్కూళ్లు
-
మూసివేతకేనా ఉదాసీనత?
పిఠాపురం : అన్ని వర్గాల విద్యాభివృద్ధే ధ్యేయం అంటూ ప్రకటనలు గుప్పించే ప్రభుత్వం ఆ విషయంలో మైనార్టీలకు మొండి చేయి చూపుతోంది. ఉపాధ్యాయులు లేక, విద్యాబోధన జరగక ఉర్దూ పాఠశాలలు వెనకబడుతుంటే, వాటి స్థితిగతులను మెరుగుపరచడం మాని, మూసివేసే దిశగా పావులు కదుపుతోంది. జిల్లాలో అనేక ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందన్న వాస్తవాన్ని పట్టించుకోకుండా మొన్నటి డీఎస్సీలో ఉర్దూ ఉపాధ్యాయుల భర్తీలో మొండిచేయి చూపింది. జిల్లాలో 57 ఉర్దూ పాఠశాలలు ఉండగా ఉపాధ్యాయులు 42 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కొందరు ఇటీవల ఇతర తెలుగు మీడియం పాఠశాలలకు బదిలీ కాగా, కొంత మంది పదవీ విరమణలు చేయడంతో 12 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇక 30 మంది మాత్రమే ఉర్దూ ఉపాధ్యాయులున్నారు. ఈ దశలో జిల్లాలో 27 పాఠశాలల్లో అసలు ఉర్దూ ఉపాధ్యాయులే లేక ఉర్దూ బోధన నిలిచిపోయింది. పరిస్థితి ఇలా ఉంటే.. జిల్లాకు డీఎస్సీలో ఒకే ఒక్క ఉర్దూ ఉపాధ్యాయ పోస్టు కేటాయించారు. ఉపాధ్యాయుల కొరత సాకుగా చూపించి ఉర్దూ పాఠశాలలను మూసివేయాలన్న పన్నాగంతోనే ప్రభుత్వం ఇలా చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఉర్దూ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం తప్ప విద్యా బోధన కనీసంగా సాగేలా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేవలం ఎవరి పుస్తకాలు వారే చదువుకోవడం తప్పఅనుమానాలను నివృత్తి చేసే వారు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉర్దూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని బయట పెట్టకుండా గోప్యంగా ఉంచడం కూడా ఈ పాఠశాలల మూసివేతకు ఎత్తుగడలో భాగమేనని మైనారిటీ వర్గాల వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా.. ఇలాంటి కుయుక్తిని విడనాడి, తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలని కోరుతున్నారు. పుస్తకాలిచ్చి చదువుకోమంటున్నారు మాకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. కేవలం పుస్తకాలు ఇచ్చి చదువుకోమంటున్నారు. దాని వల్ల ఏమీ తెలియడం లేదు. అంతా తెలుగులోనే చెబుతున్నారు. - అన్సర్, 5వ తరగతి విద్యార్థి, ఉర్దూ పాఠశాల, పిఠాపురం ఏమీ అర్థం కావడం లేదు.. ఉపాధ్యాయులు లేక ఉర్దూ ఏమీ అర్థం కావడం లేదు. ఎవరినైనా అడుగుదామన్నా చెప్పేవారు లేరు. మొక్కుబడిగా పాఠశాలకు వెళ్లి వస్తున్నాం. తెలుగు మాత్రమే నేర్చుకుంటున్నాం. - బషీరమ్మ, 5వ తరగతి విద్యార్థిని, ఉర్దూ పాఠశాల, పిఠాపురం భర్తీకి చర్యలు తీసుకుంటాం.. ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకుంటాం. 27 పాఠశాలలకు ఉపాధ్యాయుల కొరత ఉంది. అయినా పాఠశాలలు కొనసాగుతాయి. పాఠ్యపుస్తకాలు సక్రమంగా పంపిణీ చేస్తున్నాం. - మహమ్మద్ రజాక్, సర్వశిక్షాభియాన్ ఉర్దూ ఏఎంఓ, కాకినాడ -
అప్పుడే పెళ్లికెందుకు తొందర..?
పెద్దతూప్రలో బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు పెద్దతూప్ర(శంషాబాద్ రూరల్): మండల పరిధిలోని పెద్దతూప్రలో అధికారులు శుక్రవారం ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. మైనారిటీ తీరాకే పెళ్లి చేస్తామని తల్లిదండ్రుల నుంచి హామీపత్రం తీసుకున్నారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతూప్ర గ్రామానికి చెందిన పి.శంకరయ్య, సాలమ్మ దంపతుల కూతురు(15) స్థానికంగా ఆరో తరగతి వరకు చదివి మూడేళ్ల క్రితం బడి మానేసింది. ఇంటిపట్టునే ఉంటూ తల్లిదండ్రులకు సాయంగా ఉంటోంది. బాలికకు మేనబావ వరుసైన మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని రామ్‌నగర్ కాలనీకి చెందిన యాదయ్యతో శుక్రవారం పెళ్లి జరిపించడానికి ఇరు కుటుం బాల వారు నిర్ణయించారు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు గురువారం రాత్రి తహసీల్దార్ వెంకట్‌రెడ్డి విశ్వసనీయ సమాచారం అందుకున్నారు. ఆయన ఆదేశాలతో శంషాబాద్ పోలీసులు అదేరోజు రాత్రి పోలీసులు గ్రామానికి వెళ్లి బాలిక కుటుంబీకులతో మాట్లాడారు. అమ్మాయి మైనర్ కావడంతో ఇప్పుడే పెళ్లి వద్దని సూచించి వెళ్లిపోయారు. అయినా పెళ్లి కార్యక్రమం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీంతో శుక్రవారం ఉదయం సీఐ ఉమామహేశ్వర్రావు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు కల్యాణి, నారాయణమ్మ, బాలల సంరక్షణ జిల్లా ప్రతినిధి లావణ్యరెడ్డి పెద్దతూప్రకు చేరుకున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో పెళ్లి చే యొద్దని, 18 ఏళ్లు దాటిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. కా దు.. కూడదని పెళ్లి చేస్తే రెండు కుటుం బాలవారు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. అప్పటి వరకు బాలికను హాస్టల్లో వసతి సౌకర్యం కల్పించి చదువుకోవడానికి ఏర్పాట్లు చేస్తామని అధికారులు నచ్చజెప్పారు. అప్పుడే పెళ్లికెందుకు తొందర..? ముందు చదువుకోనివ్వండి అన్నారు. చిన్న వయస్సులో పెళ్లి చేస్తే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, బాలిక బంగారు జీవితం నాశనం అవుతుందన్నారు. అమ్మాయి మేజర్ అయిన తర్వాత పెళ్లి చేస్తే ప్రభుత్వం నుంచి కల్యాణ లక్ష్మీ పథకం కింద రూ.50 వేలు వస్తాయని తెలిపారు. బాలికకు మైనారిటీ తీరాకే పెళ్లి చేస్తామని అధికారులు ఆమె కుటుంబీకుల నుంచి హామీ పత్రం రాయించుకున్నారు. జిన్నారంలో బాల్య వివాహం నిలిపివేత బంట్వారం: ఓ నలభై ఏళ్ల ప్రబుద్ధుడు పన్నెండేళ్ల బాలికను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అమ్మాయి తల్లిదండ్రులకు రెండెకరాల పొలం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరో రెండు రోజుల్లో జరగాల్సిన బాల్య వివాహన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకొని బాలిక బంగారు జీవితాన్ని కాపాడారు. ఈ సంఘటన మండల పరిధిలోని జిన్నారంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఎర్రోళ్ల అంజయ్య, అంతమ్మ దంపతుల కూతురు(12) రాంపూర్‌లోని జెడ్పీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. బాలికకు ధారూరు మండలం నాగారం గ్రామానికి చెందిన యాదగిరి(40)తో పెళ్లి చేసేందుకు మార్చి 2న ఏర్పాట్లు చేశారు. కాగా యాదగిరికి ఇది రెండో వివాహం. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అమ్మాయి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో యాదగిరి బాలిక తల్లిదండ్రులకు రెండెకరాల పొలాన్ని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈమేరకు వారు అంగీకరించి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మోమిన్‌పేట ఐసీడీఎస్ సీడీపీవో కాంతారావు, సూపర్వైజర్ జగదాంబ శుక్రవారం స్థానిక పోలీసులతో జిన్నారం గ్రామానికి చేరుకున్నారు. బాల్య వివాహం వల్ల జరిగే అనర్థాలను తెలియజేసి వివాహాన్ని రద్దు చేయించారు. తనకు పెళ్లి ఇష్టం లేదని, బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని ఉందని బాలిక అధికారులకు తెలియజేసింది. బంట్వారంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో బాలికను చేర్పించారు. బాలికకు మైనారిటీ తీరాకే వివాహం చే యాలని అధికారులు అమ్మాయి తల్లిదండ్రులకు సూచించారు. -
మైనార్టీలను విస్మరించిన ప్రభుత్వం
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పెనుకొండ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ముస్లీం మైనార్టీలను విస్మరించిందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అలీఖాన్ ఆరోపించారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లీం కోసం 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత తెలుగుదేశం హయాంలో రిజర్వేషన్ల అమలు కాకపోయినా మైనార్టీలు ఉన్నారన్న విషయాన్ని గుర్తిస్తే చాలన్నారు. టీడీపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన డీలర్లను బలవంతంగా తొలగించి తెలుగుదేశం వారికి కట్టబెట్టారని, ఇదెక్కడి న్యాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న కాంట్రాక్ట్ పనులను బలవంతంగా నిలుపుదల చేయించి టీడీపీవారికి కట్టబెట్టాలన్న ఒత్తిడి అధికారులపై అధికమైందన్నారు. దీంతో అధికారులు విధులు నిర్వర్తించాంటే ఆందోళన చెందుతున్నారన్నారు. ఎమ్మెల్యే బీకే. పార్థసారథి కనుసన్నల్లో ఈ వ్యవహారాలు సాగుతున్నాయన్నారు. త్వరలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై కాంగ్రెస్ తగిన విధంగా స్పందిస్తుందన్నారు. నాయకులు చినవెంకటరాముడు, కేటీ.శ్రీధర్, మహేష్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, సుగుణాకరరెడ్డి, నారాయణస్వామి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలుగు దేశం పార్టీ నాయకులతో పడుతున్న ఇబ్బందులను పీసీసీ ఛీఫ్‌కు వివరించారు. బాబయ్య సమాధిని దర్శించుకున్న రఘువీరారెడ్డి : ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అలీఖాన్ మంగళవారం స్థానిక బాబయ్య దర్గాను సందర్శించి స్వామివారి సమాధిని దర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో వారు పాల్గొన్నారు. అంతకుముందు మాజీ మంత్రికి దర్గా నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మతపెద్దలతో మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట నాయకులు కేటీ శ్రీధర్, చినవెంకటరాముడు, సుదర్శనరెడ్డి ఉన్నారు. -
ఇకపై ‘సర్కారీ’ రుణాలు!
స్వయం ఉపాధి పథకాలకు రాయితీతో కూడిన రుణాలు బ్యాంకుల పాత్ర తగ్గించే యోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రాయితీలు విడుదల చేసి ఏడాది గడిచినా బ్యాంకులు రుణాలు మంజూరు చేయవు. రుణం కోసం నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగిన లబ్ధిదారులకు చివరకు మిగిలేది బ్యాంకర్ల ఈసడింపులే. ప్రభుత్వ రాయితీ పథకాల అమలులో ప్రతి ఏటా జరిగే సర్వ సాధారణ తంతు ఇది. బడా బాబులకు వందల కోట్ల రుణాలను ఉదారంగా చెల్లించే బ్యాంకర్లు బడుగు, బలహీనవర్గాల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండటంతో ఏటా రాయితీ పథకాల అమలు అస్తవ్యస్తంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా తామే స్వయంగా లబ్ధిదారులకు రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలనే ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల స్వయం ఉపాధి పథకాల అమలులో బ్యాంకుల పాత్రను క్రమంగా తగ్గించుకుంటూ పోవాలనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే (2015-16) ఆర్థిక సంవత్సరం నుంచి ఎంపిక చేసిన కొన్ని పథకాలకు ఈ ప్రతిపాదనలను వర్తింపజేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అదేవిధంగా రాయితీల పంపిణీపై సైతం పునఃసమీక్ష జరుపుతోంది. స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం.. బీసీ, మైనారిటీలకు 50 శాతం రాయితీలు ఇవ్వాలని కిందటేడాది ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి వీరికి జారీ చేసే రాయితీలను ఏక విధానంలో 70-75 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. యూనిట్ విలువలో మిగిలిన 25-30 శాతం నిధులను సైతం ప్రభుత్వమే లబ్ధిదారులకు రుణం కింద చెల్లిస్తే లబ్ధిదారులకు బ్యాంకు కష్టాలు తప్పుతాయని, సకాలంలో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోగలుగుతారనే భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే, బ్యాంకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే రుణాలు మంజూరు చేస్తే లబ్ధిదారుల్లో జవాబుదారీతనం లోపిస్తుందని, బ్యాంకుల పాత్రను పూర్తిగా నిర్మూలించడం సరికాదని కొందరు ఉన్నతాధికారులు గట్టిగా వాదిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది పాత విధానమే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పాత విధానంలోనే రాయితీ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది వరకు అమల్లో ఉన్న రాయితీ మొత్తాలనే ఈ ఏడాది కూడా విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఒకవేళ రాయితీల పెంపుపై నిర్ణయం తీసుకున్నా వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలనే భావనలో ఉంది. అదేవిధంగా స్వయం ఉపాధి పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు సూచిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 101 సవరణ విషయం సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. లబ్ధిదారులు కచ్చితంగా 21-45 ఏళ్ల వయసు కలిగి ఉండాలనే నిబంధనపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో వయో అర్హతను 50 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. భూ ఆధారిత పథకాల (భూపంపిణీ మినహాయించి) లబ్ధిదారుల వయోపరిమితిని 55-60 ఏళ్ల వరకు పెంచాలనే ప్రతిపాదన సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. -
మైనర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్
ముంబై: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ బుధవారం పదేళ్లు పైబడిన మైనారిటీల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించింది. వ్యక్తిగత చెక్‌బుక్, డెబిట్ కార్డ్‌ను కూడా ఈ అకౌంట్‌తో బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. పిల్లల్లో పొదుపు, ఆర్థిక పరంగా జవాబుదారీ తనాన్ని పెంచడం లక్ష్యంగా ఈ ‘స్మార్ట్ స్టార్’ అకౌంట్‌ను ప్రారంభించినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సబర్వాత్ తెలిపారు. చెక్కుల జారీ, బిల్లుల చెల్లింపు, మొబైల్ ఫోన్ల రిచార్జ్, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్ల ప్రారంభం, ఏటీఎం, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఆర్థిక అంశాలపై మైనర్లకు అవగాహన పెరుగుతుందనీ అన్నారు. -
బడుగుల బాగుకు ఏదీ బాసట?
సాక్షి, కాకినాడ : గత ప్రభుత్వమూ వారిని చిన్నచూపు చూసింది. ‘ఎస్సీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం’ అని గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వమూ వారి మేలును గాలికి వదిలేస్తోంది. అభివృద్ధి పేరిట గాలిమేడలు కడుతూ పాలనలో నూరురోజుల పండుగ చేసుకుంటున్న చంద్రబాబు సర్కారుకు తమ క్షేమం పట్టడం లేదని బడుగు, బలహీన వర్గాల వారు మండిపడుతున్నారు. జిల్లాలో ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదపడడం లేదు. ఆ సంస్థలకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా నిధులు లేకపోవడంతో పది శాతం యూనిట్లు కూడా ఏర్పాటు కాని పరిస్థితి నెలకొంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కనీసం కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకోలేని దుస్థితిలో కార్పొరేషన్లు ఉన్నాయి. దీంతో వాటి ద్వారా లబ్ధి పొంది, జీవితంలో స్థిరపడాలని ఆశించే నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో రూ.43,30,65,000 అంచనా వ్యయంతో 4,064 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించారు. వీటిలో రూ.15,77,97,000 విలువైన 1618 యూనిట్లు మంజూరు చేశారు. వీటిలో బ్యాంకు సంబంధిత పథకాల నుంచి రూ.39.37 కోట్లతో 2655 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించగా, రూ.15.16 కోట్లతో 1464 యూనిట్లు మంజూరు చేశారు. హెచ్ఐవీ సోకిన వారికి, వికలాంగులకు నేరుగా సంస్థ ఆధ్వర్యంలో రూ.3,93,65,000తో 1406 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించగా, రూ.61.60 లక్షలతో 154 యూనిట్లకు మంజూరు ఉత్తర్వులివ్వగలిగారు. బ్యాంక్ లింకేజ్ కలిగిన 1464 యూనిట్లకు రూ.8,70,46,000 సబ్సిడీ విడుదల కావాల్సి ఉంది. దీంతో ఈ సంస్థ ద్వారా గతేడాది మంజూరైన ఏ ఒక్క యూనిట్ ఇప్పటి వరకు ఏర్పాటు కాని పరిస్థితి నెలకొంది. సబ్సిడీ ఊసే లేదు.. బీసీ కార్పొరేషన్లో మార్జిన్ మనీ స్కీమ్ కింద రూ.24,13,50,000తో 4410 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించగా, రూ.12,40,54,000 విలువైన 1848 యూనిట్లు మంజూరు చేశారు. కార్పొరేషన్ ద్వారా అమలయ్యే రాజీవ్ అభ్యుదయ యోజన కింద రూ.10,96,50,000తో 2010 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించగా, రూ.2,83,92,000 వ్యయం కాగల 400 యూనిట్లకు మంజూరు ఉత్తర్వులిచ్చారు. ఈ రెండు స్కీమ్‌లలో మంజూరైన 2248 యూనిట్లు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.6,77,55,000 విడుదల చేయాల్సి ఉంది. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాని దుస్థితి నెలకొంది. ఇక బీసీ సహకార సంఘాల సమాఖ్య ద్వారా వివిధ సహకార సంఘాలకు రూ.28.30 కోట్లతో 377 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించగా, కేవలం రూ.కోటీ 52 లక్షలతో 22 యూనిట్లు మాత్రమే మంజూరు చేశారు. వీటికి రూ.76 లక్షల సబ్సిడీ మొత్తం నేటికీ విడుదల కాలేదు. అరకొరగా యూనిట్ల ఏర్పాటు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లింలకు రూ.101.53 లక్షలతో 296 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించగా, రూ.62.74లక్షలతో 191 యూనిట్లకు మంజూరు ఉత్తర్వులిచ్చారు. ఇప్పటి వరకు రూ.24.23 లక్షలతో 96 యూనిట్లు మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించి రూ.కోటీ 11 లక్షలతో 276 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించగా, రూ.18.30 లక్షలతో 34 యూనిట్లకు మంజూరు ఉత్తర్వులిచ్చారు. ఇప్పటి వరకు అతికష్టమ్మీద రూ.5 లక్షల 45వేల అంచనాలతో 11 యూనిట్లు మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. మైనార్టీ కార్పొరేషన్ మినహా మిగిలిన కార్పొరేషన్లలో మంజూరైన ఏ ఒక్క యూనిట్ గత ఏడాదిన్నరగా ఏర్పాటు కాని దుస్థితి ఏర్పడింది. దీంతో మంజూరు ఉత్తర్వులు పొందిన వారు ఎక్కడ వీటన్నింటినీ రద్దు చేస్తారోనని భయపడుతున్నారు. కార్యాచరణ ప్రణాళికే కరువు.. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్క ఎస్సీ కార్పొరేషన్ మినహా మిగిలిన కార్పొరేషన్లు కార్యాచరణ ప్రణాళికను రూపొందించలేకపోయాయి. ఎస్సీ కార్పొరేషన్ 2014-15లో బ్యాంకు సంబంధిత పథకాలకు సంబంధించి రూ.60.80 కోట్లతో 2921 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇందులో కార్పొరేషన్, ఇతర శాఖల సబ్సిడీ రూపంలో రూ.21,29,37,000, బ్యాంకు రుణంగా రూ.21,59,83,000 మంజూరు చేయాలని నిర్దేశించారు. బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా హెచ్ఐవీ సోకిన వారికి, వికలాంగులకు మంజూరు చేసే స్కీమ్‌కు సంబంధించి రూ.4,31,58,000 అంచనా వ్యయంతో 1550 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించగా, వీటిలో రూ.కోటి 93లక్షల 20వేలు సబ్సిడీ రూపంలో రావాల్సి ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆర్థిక సంవత్సరం ఆరంభమై అర్ధ సంవత్సరం కావస్తున్నా నేటికీ ప్రభుత్వం నుంచి ఈ ప్రణాళికకు నిధులు విదల్చని పరిస్థితి నెలకొంది. -
ఎస్టీ. ఎస్టీ, మైనార్టీల సంక్షేమమిదేనా?
బడ్జెట్లో పూర్తి అన్యాయం చేశారని ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: ఏపీ ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లోనే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పూర్తి అన్యాయం జరిగిందని, ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకొస్తుంటే గత ప్రభుత్వాలు, అప్పటి సీఎం వైఎస్ ఇందుకు కారణమని నిస్సిగ్గుగా అధికార పక్షం ఎదురుదాడికి దిగుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, అంజాద్ బాషా, జలీల్‌ఖాన్, వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. డేవిడ్‌రాజు మాట్లాడుతూ... దళితులకు వైఎస్ హయాంలో అన్యాయం జరిగిందని, ఎస్సీలు వివక్షతకు గురయ్యారని మంత్రి రావెల సభలో చెప్పడాన్ని ఆక్షేపించారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎవరి హయాంలో దళితులకు మేలు జరిగిందో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దళిత బంధువెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఎస్సీల సంక్షేమానికి చంద్రబాబు ఏదో చేస్తున్నారని చెప్పేందుకు రావెల నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు ప్రకటించేటప్పు డు ఎస్సీ, ఎస్టీ ఖాళీలను పేర్కొనట్లేదని సభ దృష్టికి తెస్తే మంత్రి దారుణంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంజాద్ బాషా మాట్లాడుతూ... మైనార్టీ సంక్షేమానికి కట్టుబడాల్సిన ప్రభుత్వం గతంలో అది చేశాం.. ఇది చేశామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతోందని విమర్శించారు. వాస్తవానికి బడ్జెట్లో మైనార్టీలకు రూ.371కోట్లు కేటాయించినట్లు చూపుతోందని, కానీ మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు అన్నీ పోనూ కేవలం కేటాయించింది రూ.మూడున్నర కోట్లు మాత్రమేనన్నారు. ఈ కేటాయింపులపై సీఎం జవాబు చెప్పాలన్నారు. మైనార్టీల పట్ల చంద్రబాబుకు ప్రేమ ఉంటే మంత్రి నారాయణను ఎలా ప్రమోట్ చేశారో.. అలా ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నిం చారు. మైనార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే మైక్ కట్ చేసి అమానుషంగా వ్యవహరించారంటూ జలీల్‌ఖాన్ అన్నారు. మైనార్టీలకు కేటాయింపుల్లో జరిగిన అవమానాన్ని ఎలుగెత్తి చెప్పేందుకు అడుగడుగునా అడ్డుకుంటున్న అధికార పార్టీ సభాసంప్రదాయాల గురించి పదేపదే పేర్కొనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుం దన్నారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన ఏపీ వికేంద్రీకరణ దిశగా అభివృద్ధి చేయాలన్నారు. వెనుకబడిన రాయలసీమను విస్మరిస్తే ఉద్యమాలు మొదలవుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ పోస్టుల భర్తీ ఎప్పుడు? ఎమ్మెల్యే పాలపర్తి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ జీరోఅవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర విభజన జరిగి కొత్త ప్రభుత్వం వచ్చినా ఉద్యోగుల ఖాళీల వివరాలు ప్రకటించలేదని తప్పుపట్టారు. రాష్ట్రంలో 4,300 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మంత్రి చెప్పారని, వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉన్నట్టు తమకు సమాచారముందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల పంపిణీకోసం నియమించిన కమలనాథన్ కమిటీ లెక్కప్రకారం రాష్ట్రంలో, సచివాలయం స్థాయి లో 20,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేలిం దని, ఈ నెల 21న ఉద్యోగుల్ని పంపిణీ చేసినా ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీలవెన్నో తెలుపలేదన్నారు. తమకున్న సమాచారం ప్రకారం ఖాళీ పోస్టుల్లో 15 వేలకుపైగా ఎస్సీ,ఎస్టీలకు చెందినవన్నారు. ఇది నిజమో కాదో చెప్పాలని, ఎస్సీ,ఎస్టీల బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పాలని కోరారు. మంత్రి రావెల కిషోర్‌బాబు స్పందిస్తూ.. త్వరలో పరిశీలించి సమాధానం చెబుతామన్నారు. -
టీడీపీ హయాంలోనే ముస్లింలకు పెద్దపీట: చంద్రబాబు
యాకత్‌పుర : గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీలకు పెద్ద పీట వేసి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి హజ్‌యాత్రకు వెళ్లే వారికి సబ్సిడీ కల్పించామని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ ఆధ్వర్యంలో బుధవారం పాతబస్తీ ఎతేబార్ చౌక్‌లోని బజాబార్ ఫంక్షన్హాల్లో పేదలకు బియ్యం, చీరలు (జకాత్) ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరై చంద్రబాబు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ....ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు తమ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల సంక్షేమం కోసం తొలి ప్రాధాన్యమిచ్చామన్నారు. నగరం నుంచి హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింల కోసం నాంపల్లిలో ప్రత్యేక హజ్ హౌజ్‌ను నిర్మించామన్నారు. యాత్రికులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సబ్సిడీ సైతం కల్పించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలకు సైతం అండగా ఉంటూ అవసరమైన మేరకు న్యాయం చేకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు జాహెద్ అలీ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ, టీడీపీ గ్రేటర్ ఉపాధ్యక్షులు, ఓల్డ్ సిటీ ఇన్‌ఛార్జి అలీ మస్కతీ తదితరులు పాల్గొన్నారు. -
లంకపై కన్నెర్ర!
సాక్షి, చెన్నై: శ్రీలంకలో యుద్ధం పేరుతో తమిళులపై సింహళీయ సైన్యం సాగించిన మారణ హోమం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ దేశ సర్కారు పైశాచికత్వాన్ని నిరసిస్తూ, ఈలం తమిళులకు మద్దతుగా రాష్ర్టంలో నేటికీ ఆందోళనలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శ్రీలంకలో ముస్లింలపై సింహళీయులు తమ ప్రతాపం చూపించే పనిలో పడ్డారు. రెండు రోజుల క్రితం ఆ దేశంలో ముస్లిం మైనారిటీలపై దాడులు చోటు చేసుకున్నాయి. పెద్ద సంఖ్యలో ముస్లింలు ఉండే ప్రాంతాల్లో జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు. ఈ ఘటనను రాష్ట్రంలోని ముస్లిం సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. ఆందోళనలు: పొరుగు దేశంలో ముస్లింలపై దాడులకు నిరసనగా ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ, తౌఫిక్ జమాత్ తదితర మైనారిటీ సంఘాలు ఆందోళనలకు పిలుపు నిచ్చాయి. సోమవారం ఇండియన్ నేషనల్ లీగ్ నేతృత్వంలో శ్రీలంక దౌత్య కార్యాలయ ముట్టడికి యత్నించగా, మంగళవారం తౌఫిక్ జమాత్ నేతృత్వంలో భారీ నిరసన జరిగింది. పెద్ద ఎత్తున ఆ జమాత్ ప్రతినిధులు, మహిళలు ఉదయాన్నే ర్యాలీగా లయోలా కళాశాల వద్దకు చేరుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే చిత్రాన్ని చీపుర్లతో కొడుతూ నిరసన తెలియజేశారు. ఆ జమాత్ కార్యదర్శి కోవై రహ్మతుల్లా నేతృత్వంలో అందరూ కలసి కట్టుగా నుంగబాక్కంలోని శ్రీలంక దౌత్య కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. మార్గం మధ్యలో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు రోడ్డుపై నిరసన కారులు బైఠాయించడంతో వాహనాల రాకపోకలు ఆగాయి. ఆందోళనకారులు ఆ కార్యాలయం వైపుగా చొచ్చుకెళ్లే యత్నం చేయడంతో, పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు, నిరసన కారుల మధ్య వాగ్యుద్ధం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. భద్రత : శ్రీలంకపై మైనారిటీలు కన్నెర్ర చేసిన దృష్ట్యా, నగరంలోని దేశ దౌత్య కార్యాలయానికి, ఎగ్మూర్‌లోని బౌద్ధాలయానికి, శ్రీలంక ఎయిర్ లైన్స్, బ్యాంక్‌లకు భద్రతను పెంచారు. ఆ మార్గాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. మహ్మద్ ప్రవక్త మీద బురదజల్లుతూ అమెరికాలో తీసిన ఓ చిత్రానికి నిరసనగా ఇక్కడి ముస్లింల ఆగ్రహానికి ఆ దేశ దౌత్య కార్యాలయం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ దాడి పోలీసు అధికారుల మెడకు సైతం చుట్టుకుంది. ఈ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, గతం పునరావృతం కాకుండా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. టీఎంఎంకే నిరసన : ముస్లింలపై దాడిని నిరసిస్తూ టీఎంఎంకే, వీసీకేల నేతృత్వంలో సాయంత్రం నుంగబాక్కంలో నిరసన జరిగింది. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం నేత హైదర్ అలీ, వీసీకే నేత తిరుమావళవన్‌ల నేతృత్వంలో ర్యాలీగా నిరసన కారులు నుంగబాక్కం చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీలంక దౌత్య కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. శ్రీలంక పైశాచికత్వ చర్యలపై తిరుమావళవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు అడ్డుకట్ట వేయాలని, పునరావృతం అయితే, మాత్రం తమిళుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని శ్రీలంక సర్కారును హెచ్చరించారు. -
శాసనసభలో ప్రభుత్వం ప్రకటన ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు
- ఇతర మైనారిటీలకు వర్తింపు : - మంత్రి ఫౌజియాఖాన్ వెల్లడి ముంబై: ముస్లింలతోపాటు రాష్ట్రంలోని మైనారిటీలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం శాసనసభలో బుధవారం ప్రకటించింది. బాషాపరమైన మైనారిటీ విద్యాసంస్థలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనిసభ అభిప్రాయపడింది. మైనారిటీలకు విద్యా అవకాశాల కల్పనపై ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా స్పీకర్ దిలీప్ వల్సేపాటిల్పై సూచన చేశారు. దీనికి ఇతర సభ్యులంతా మద్దతు పలికారు. ‘మతపరమైన మైనారిటీలేగాక భాషాపరమైన మైనారిటీలూ ఎందరో ఉన్నారు. వీరిలో చాలా మంది సంపన్నులు. సొంతగా విద్యాసంస్థలూ ఉన్నా, పేద, అణగారినవర్గాల వారికి అడ్మిషన్లు ఇవ్వడం లేదు’ అని స్పీకర్ అన్నారు. సభలో విపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే ఈ అభిప్రాయాన్ని సమర్థించారు. పేదలకు అడ్మిషన్లు నిరాకరించే విద్యాసంస్థలను వదిలిపెట్టకూడదని స్పష్టీకరించారు. పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్ రాణే స్పందిస్తూ భాషాపర మైనారిటీల అడ్మిషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చించి, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. సావధాన తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్ మాట్లడుతూ ముస్లింలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ఫౌజియా ఖాన్ దీనిపై వివరణ ఇస్తూ త్వరలోనే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీ విద్యాసంస్థల్లో బోధన, సదుపాయాలను మెరుగుపర్చాలని పటేల్ కోరారు. ఈ ప్రతిపాదనపై చర్చ నడుస్తోందని ఫౌజియా అన్నారు. అంతేగాక ముస్లింలతో పాటు సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలూ మైనారిటీలేనని ఆమె వివరణ ఇచ్చారు. మైనారిటీల సంక్షేమ నిధి పెంపు మైనారిటీల సంక్షేమ కోసం కేటాయించిన నిధులను రూ.362 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై సభలో బుధవారం చర్చ నడిచినప్పుడు, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో రూ.280 కోట్లు, ఇటీవలి బడ్జెట్లో రూ.82 కోట్లు కేటాయించామన్నారు. దీనిని ఈ ఏడాది రూ.500 కోట్లకు పెంచుతామన్నారు. మహిళల భద్రతపై రాజీ లేదు : పాటిల్ మహిళల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా వైర్లెస్ కార్ల సేవలను వినియోగించుకుంటామని హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ సభలో బుధవారం ప్రకటించారు. వీటిని కేవలం మహిళల రక్షణ కోసమే ఉపయోగిస్తారని చెప్పారు. శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై సభలో నడిచిన చర్చలో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. దళితులు, మైనారిటీలు, మహిళలు, వయోధికులు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. హోంశాఖకు బడ్జెట్ కేటాయింపులు రూ.13,342 కోట్లు కాగా, వాటిలో రూ.150 కోట్లు సీసీటీవీల ప్రాజెక్టుకు, రూ.440 కోట్లు పోలీసుశాఖ ఆధునీకరణకు కేటాయిస్తామని పాటిల్ ప్రకటించారు. -
మోడీ నరహంతకుడు
బీజేపీకి ఓటేస్తే గోద్రా ఘటనలు పునరావృత్తం వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్న జగన్‌కు ఓటెయ్యండి రోడ్ షోలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లె, మదనపల్లె రూరల్ న్యూస్‌లైన్ : ‘‘నరహంతకుడు నరేంద్ర మోడి. బీజేపీకి ఓటేస్తే గోద్రా ఘటనలు పునరావృత్తమవుతాయి. మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఓటెయ్యండి’’ అని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు నిచ్చారు. మదనపల్లె రూరల్ మండలంలోని కాశీరావుపేట, సీటీఎం, గుడిసివారిపల్లె, పోతపోలు, బాలాజీనగర్, అంకిశెట్టిపల్లె, చిప్పిలి, అంకిశెట్టిపల్లె, వలసపల్లె, వేంపల్లె, చీకలబైలు, బండకిందపల్లె తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఆయన మదనపల్లె అభ్యర్థి దేశాయ్తిప్పారెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. మొదటగా కాశీరావుపేటకు చేరుకున్న పెద్దిరెడ్డికి ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ప్రదర్శనగా బయలుదేరి సీటీఎం, గుడిసివారిపల్లె, పోతపోలులో జరిగిన సభల్లో ప్రసంగించారు. మైనారిటీలను ఊచకోత కోసిన బీజేపీ నాయకుడు నరేంద్రమోడి నరహంతకుడన్నారు. పార్లమెంటు సభ్యులు ఉన్న ఇంటికి నిప్పంటించి 11 మంది సజీవదహనానికి కారకుడయ్యాడని ధ్వజమెత్తారు. ప్రజలు బీజేపీకి ఓట్లువేస్తే 2002లో జరిగిన గోద్రా ఘటనలు సీమాంధ్ర, మదనపల్లెల్లో పునరావృత్తమవుతాయన్నారు. బీజేపీతో రాక్షస పాలన కావాలో వైఎస్ఆర్ సీపీతో సువర్ణపాలన కావాలో ప్రజ లే తేల్చుకోవాలని సూచించారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్ల పాటు సీమాంధ్రలో సువర్ణపాలన అందిస్తారని భరో సా ఇచ్చారు. ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. చంద్రబాబునాయు డు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్ర కరువుతో అల్లాడాల్సి వచ్చిందన్నారు. అప్పటి తెలుదేశం పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయా..? మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందాయో ఒకసారి ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు, మహిళలు, మైనారిటీలు, రైతుల సంక్షమానికి వైఎస్ పెద్దపీట వేశారని గుర్తుచేశారు. సమైక్య రాష్ట్రానికి ఆమె ఒరగబెట్టిందేమీ లేదు ‘‘బీజేపీ రాజంపేట పార్లమెంటు అభ్యర్థి పురందేశ్వరి ఇంతకాలం ఎక్కడున్నారు?. కేంద్ర మంత్రిగా ఉండి సమైక్య రాష్ట్రానికి ఆమె ఏం ఒరగబెట్టారు?. రాష్ట్రం విడిపోకుండా ఉండేం దుకు మంత్రి పదవికి రాజీమానా చేయాలని కోట్లాది గొంతులు నినదించినా పట్టించుకోలేదు.. మాట వరసకైనా రాజీనామా చేస్తామని చెప్పలేదు.. ఇప్పుడు ఐదు జిల్లాలు దాటి అధికార వాంఛతో ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ మదనపల్లె అభ్యర్థి దేశాయ్‌తిప్పారెడ్డి ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడుపై వారు నిప్పులు చెరిగారు. బాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివస్రాద్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. -
మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్లో గొడవ
-
రుణం.. ని‘బంధనం’
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల కార్పొరేషన్ల నుంచి రుణాలను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల ఆంక్షలను విధించింది. ఈ మేరకు జీఓఎంఎస్ నంబర్ 101ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఎస్సీ,ఎస్టీ వర్గాలకు సంబంధించి 21 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు మాత్రమే రుణ సహాయం పొందేందుకు అర్హులు. అలాగే బీసీ, మైనార్టీ, వికలాంగులు 21 నుంచి 40 సంవత్పరాల లోపు వారే దరఖాస్తు చేసుకోవాలి. మండల, పట్టణ స్థాయిలో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆయా కమిటీలు రెకమెండ్ చేసిన వారికే రుణ సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ కమిటీల్లో ఎంపీడీవో లేదంటే మున్సిపల్ కమిషనర్ కన్వీనర్‌గా, ముగ్గురు సోషల్ వర్కర్లు, వారిలో ఒక మహిళ ఉండాలి. ఆమెను కూడా జిల్లా ఇన్చార్జి మంత్రి నామినేట్ చేయాలి. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, డీఆర్డీఏ నుంచి ఒక ప్రతినిధి, ఆయా మండలాల్లోని బ్యాంకుల మేనేజర్లు, అన్ని ప్రభుత్వ ఆర్థిక సహకార సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఎంపిక చేసిన దరఖాస్తులకు మాత్రమే రుణ సబ్సిడీని విడుదల చేయాల్సి ఉంటుంది. జిల్లాలో పరిస్థితి ఇలా.. వ్యవసాయం కలిసిరాక, నిరుద్యోగ సమస్యతో ఇప్పటికే వేల సంఖ్యలో రుణాల కోసం ఆయా కార్పొరేషన్లకు దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల వారి దరఖాస్తులు ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల వారి దరఖాస్తులు మున్సిపల్ కమిషనర్లు పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ చేసి ఆయా కార్పొరేషన్లకు రెకమెండ్ చేశారు. ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వీటిని పరిశీలించి అర్హులను ప్రకటించాల్సి ఉంది. అయితే గత ఏడాది ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. నేటికీ దరఖాస్తులకు మోక్షం కలగలేదు. కొత్త నిబంధనలతో వయస్సు ఎక్కువగా ఉండేవారి దరఖాస్తులు పరిశీలనలోకి వచ్చే అవకాశం లేదు. అంతేగాక లబ్ధిదారుల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీ సిఫారసు అవసరమని ప్రకటించిన దృష్ట్యా, అన్ని దరఖాస్తులను ఆయా మండలాలు, మున్సిపాలిటీలకు తిప్పి పంపించాల్సి వస్తుందేమో అనే అనుమానాలను ఆయా కార్పొరేషన్ల అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(మార్చిలోపు)లో రుణ విడుదల కష్టమేననే వాదన వినిపిస్తోంది. -
మైనారిటీలపై కాంగ్రెస్ వల!
ప్రత్యేక పథకాలపై భారీ ప్రచారం లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం న్యూఢిల్లీ: ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. మైనారిటీలకు ప్రకటించిన ప్రత్యేక పథకాలపై భారీ ప్రచారం, లబ్ధి చేకూర్చే పొత్తులు, ప్రత్యర్థులకు దీటుగా ప్రచారం వంటి అంశాలపై కసరత్తు మొదలుపెట్టింది. పనిలోపనిగా రాహుల్ గాంధీనే తమ భావినాయకుడని తేల్చేసింది. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో మైనారిటీల డిమాండ్లు, అభిప్రాయాలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం సోమవారం 200 మంది మైనారిటీ విభాగాల నేతలతో భేటీ నిర్వహించింది. 11, 12వ పంచవర్ష ప్రణాళికల్లో మైనారిటీలకు ప్రవేశపెట్టిన ‘జియో పార్శీ’(పార్శీల సంక్షేమానికి), ‘సీఖో ఔర్ కమావో’(చదువు, సంపాదన), ‘నయీ రోష్ని’ (కొత్త వెలుగు) వంటి పథకాలు, వక్ఫ్ సంస్కరణలు, మైనారిటీ సంక్షేమ శాఖ సాధించిన విజయాలతో రూపొందించిన బుక్లెట్లను అందించింది. వాటిలోని అంశాలపై మైనారిటీలో ్లప్రచారం చేయాలని సూచించింది. భేటీలో మైనారిటీ నేతలు పలు ఫిర్యాదులు చేశారు. ముస్లిం ఓటుబ్యాంకును కాపాడుకోవాలంటే దిద్దుబాటు చర్యలు అవసరమన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వారి వాదనతో ఏకీభవించారు. బీఎస్పీ, ఆర్జేడీలతో పొత్తుకు కసరత్తు లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్జేడీలతో పొత్తుకు కాంగ్రెస్ అవకాశాలను అన్వేషిస్తోంది. వీటితో పొత్తు వల్ల 120 పార్లమెంటు సీట్లున్న ఉత్తరప్రదేశ్, బీహార్‌లో తమకు కలిసిసొస్తుందని భావిస్తోంది. వీటితోపాటు రామ్‌విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీతో చేయి కలిపితే జార్ఖండ్‌లోనూ లాభపడొచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు. మరోపక్క.. నిత్యావసరాల ధరల పెరుగుదల, అవినీతి వంటి సవాళ్ల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించేందుకు రాహుల్ ఈ నెల 27న పార్టీ ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ధరల నియంత్రణ తదితరాలపై చర్చిస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ చెప్పారు. కాంగ్రెస్ భవిష్యత్ నాయకుడు రాహులేనని, అయితే తమ ప్రధాని అభ్యర్థిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సామాజిక మీడియాలో తమపై బీజేపీ సాగిస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో ‘సైబర్ ఆర్మీ’ని ఏర్పాటు చేస్తామన్నారు. కాగా గత పదేళ్లలో దేశం మంచి ఆర్థిక వృద్ధి, సర్వతోముఖాభివృద్ధి సాధించినప్పటికీ దేశవ్యాప్తంగా తమ పార్టీ రాజకీయంగా ఒంటరైందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. -
సత్వరమే పరిష్కరించండి : కలెక్టర్
సత్వరమే పరిష్కరించండి : కలెక్టర్ : కైకలూరు, న్యూస్‌లైన్ : సమైక్య సమ్మె ప్రభావంతో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఎం. రఘునందరావు సూచించారు. బుధవారం ఆయన కైకలూరులోని తహశీల్దార్, పంచాయతీరాజ్, మండల మహిళా సంఘం, హౌసింగ్ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించారు. తహశీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ డీ విజయశేఖర్, ఎంపీడీవో నిమ్మగడ్డ బాలాజీ, ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మీతో సమీక్షాసమావేశం నిర్వహించారు. రెవెన్యూ రికార్డులకు ఆధార్ నెంబరును తప్పనిసరిగా అనుసంధానం చేయాలని చెప్పారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ ద్వారా చిన్నారులకు అందుతున్న పోషకాహార పంపిణీపై ఆరా తీశారు. అంగన్వాడీ కార్యకర్తల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మండల మహిళా సమైక్య భవనాన్ని సందర్శించి గ్రూపులకు రుణాలు ఏ మేరకు అందుతున్నాయనే విషయాలను డ్వాక్రా గ్రూపు లీడర్ల నుంచి తెలుసుకున్నారు. మండలంలో వికలాంగ సంఘాలను ఏర్పాటు చేసి వారికి రుణాలు వచ్చేవిధంగా కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో 7వ విడత భూపంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఎసైన్డ్మెంటు కమిటీ సభ్యుడు కాలి రాజ్‌కుమార్ కలెక్టర్‌కు అర్జీ అందించారు. అదే విధంగా బైపాస్‌రోడ్డులో కోత మిషన్ కారణంగా ఆనారోగ్యం పాలవుతున్నామని అన్నం సుబ్రహ్మణ్యం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ అర్జీల పరిష్కారం... విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్డాడుతూ రెండు నెలలుగా మీ సేవాలో పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 35 వేల వరకు మీ సేవాలో అర్జీలు పరిఫ్కారం కావాల్సి ఉందన్నారు. అధికారులు నాలుగు రోజుల్లో వీటిని పరిష్కరిస్తారని ఆయన చెప్పారు. ప్రధానంగా ఎస్సీ, బీసీ, మైనార్టీలకు రుణాల మంజూరుకు ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఆధార్ కార్డుల జారీ పక్రియ 96 శాతం పూర్తయ్యిందన్నారు. అనేక మందికి ఇంకా ఆధార్‌కార్డులు రావాల్సిఉందన్నారు. త్వరగా అందే విధంగా చర్యలు తీసుకుంటాని తెలిపారు. కొల్లేరులో నిబంధనలకు విరుద్ధంగా తవ్విన చెరువుల యజమానులపై తహశీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే... పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కొల్లేరు ప్రాంతాల్లోని డ్రైయినేజీల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగించే విధంగా ఆ శాఖ ఈఈతో మాట్లాడతానని అన్నారు. కార్యక్రమంలో పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
వక్ఫ్ బోర్డ్‌కు సీఈవోను నియమించండి
రాష్ట్ర వక్ఫ్ బోర్డ్‌కు పూర్తిస్థాయి ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈవో)ని నియమించాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు గాను ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ బోర్డులో అకౌంటింగ్ అధికారిగా ఉన్న ఎం.ఎ.గఫార్‌ను సీఈవోగా కొనసాగేందుకు అనుమతి ఇస్తూ ఈ ఏడాది జూన్ 22న మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన సయ్యద్ ఒమర్ షఫీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీన్ని సోమవారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం రెండు వారాల్లో వక్ఫ్ బోర్డ్‌కు పూర్తిస్థాయి సీఈవోను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న చైల్డ్‌లైన్
అద్దంకి, న్యూస్‌లైన్ : మైనారిటీ తీరని బాలికను 33 ఏళ్ల వ్యక్తికిచ్చి అద్దంకి మండలం శింగరకొండలో వివాహం చేయబోతుండగా ఒంగోలు చైల్డ్‌లైన్ అధికారులు రంగంలోకి దిగి స్థానిక పోలీసుల సహకారంతో శనివారం అడ్డుకున్నారు. వివరాలు.. తాళ్లూరు మండలం తూర్పుగంగవరానికి చెందిన 33 ఏళ్ల గుజ్జుల వెంకటేశ్వరరెడ్డికి పొదిలి మండలం ఉప్పలపాడుకు చెందిన మైనారిటీ తీరని బాలికతో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. అద్దంకి మండలం శింగరకొండ ఆలయంలో వివాహం చేస్తుండగా చైల్డ్‌లైన్‌కు సమాచారం అందింది. చైల్డ్‌లైన్ ప్రతినిధి బీవీ సాగర్, ఐసీడీఎస్ కొరిశపాడు సెక్టార్ సూపర్వైజర్ మల్లేశ్వరిలు రంగంలోకి దిగి పోలీసుల సహకారంతో బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత బాలికను ఒంగోలులోని శిశు మందిర్‌కు తరలించారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, ఎవరైనా బాల్య వివాహం చేసేందుకు ప్రయత్నిస్తే చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించాలని సాగర్ కోరారు. పందలపాడులో.. కందుకూరు రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని పందలపాడులో బాల్య వివాహం జరగనుందని ఐసీడీఎస్, బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందడంతో వారు గ్రామానికి వెళ్లి బాలిక తల్లిదండ్రులకు శనివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను గుడ్లూరు మండలం దారకానిపాడుకు చెందిన యువకునికి ఇచ్చి ఈ నెల 31వ తేదీన వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. మైనర్‌కు వివాహం చేస్తున్నారని సమాచారం అందుకున్న ఐసీడీఎస్ కొండపి ప్రాజెక్టు సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ హేమలత, బాలల సంరక్షణ అధికారి ఎం.శ్రీనివాసులు గ్రామానికి వెళ్లి బాలిక తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం నేరమని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనారిటీ తీరకుండా పెళ్లి చేయమని వారి నుంచి హామీ పత్రం తీసుకున్నారు.