మైనారిటీ యువతకు గుంటూరులో జాబ్‌మేళా
Published Sat, Mar 18 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఈనెల 25, 26 తేదీల్లో గుంటూరులో మైనారిటీ యువతకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్‌చైర్మన్ ఎస్.కె.బషీర్‌అహ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ కార్పొరేషన్ (విజయవాడ) ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నామన్నారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులైన మైనారిటీ అభ్యర్థులు (ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, జైన్స్, బుద్దీస్, పార్సీస్) ఈనెల 23లోపు దరఖాస్తులను www.apsmfc.com
వెబ్‌సైట్‌లో పంపాలన్నారు. అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను సిద్ధం చేసుకుని జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాల కోసం 98499 01149, 98853 77707 నంబర్లకు సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement