మైనారిటీ రుణాల మంజూరుకు చర్యలు
Published Sun, Dec 25 2016 12:03 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
– 27 నుంచి పలు మండలాల్లో ఇంటర్వూ్యలు
కర్నూలు(రాజ్‌విహార్): మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మైనారిటీ కార్పొరేషన్ జిల్లా ఎగ్జిక్యూటీవ్ డైరక్టరు మహమ్మద్ అంజాద్ అలీ శనివారం ప్రకటనలో తెలిపారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పెద్ద కడుబూరు, డోన్ మున్సిపాలిటీ (పట్టణం), చిప్పగిరి, ఆలూరు, మిడుతూరు, కల్లూరు, పత్తికొండ, పాణ్యం, గోస్పాడు, మద్దికెర, ప్యాపిలి, బనగానపల్లె మండలాలకు చెందిన అభ్యర్థులు 27వ తేదీన, హోళగుంద, నందవరం, పాములపాడు, బేతంచెర్ల, ఉయ్యాలవాడ, కొత్తపల్లి, ఆదోని మున్సిపాలిటీ, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, వెలుగోడు మండలాల్లో 28వ తేదీన, కృష్ణగిరి, పగిడ్యాల మండలాల్లో 29వ తేదీన ఉదయం 10గంటలకు మండల అభివృద్ధి అధికారి (ఎండీఓ) కార్యాలయాల్లో ఇంటర్వూలు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలకు ఫోన్ : 70754 40400, 88013 54690 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement