corporation
-
‘పచ్చ’ తాలిబన్లు.. కూటమి గూండాల విధ్వంసకాండ
Updates:మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నికలు.. మరోసారి టీడీపీ గూండాలు దౌర్జన్యం⇒కాకినాడ జిల్లా: తునిలో మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నికలలో మరోసారి టీడీపీ గూండాలు దౌర్జన్యానికి దిగారు. నిన్నటిలాగే ఇవాళ కూడా మున్సిపల్ కౌన్సిల్లోకి టీడీపీ రౌడీలు దౌర్జన్యంగా ప్రవేశించారు. మద్యం మత్తులో నిన్న మహిళ కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన గుండాలు.. ఈ రోజు కూడా కౌన్సిల్ హల్ లోకి చొచ్చుకు వచ్చారు. కౌన్సిల్ హల్లో వెళ్లే అవకాశం లేకపోవడంతో మున్సిపల్ ఛైర్మన్ సుధాబాలు,కౌన్సిలర్లు బయటే బైఠాయించారు. యనమల డైరక్షన్లో ప్రేక్షక పాత్రకు పోలీసులు పరిమితమయ్యారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరావు పత్తాలేకుండా పోయారు. ⇒మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార మదంతో కూటమి నేతలు అరాచక పర్వానికి తెరలేపారు. బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పాగాకు కుయుక్తులు పన్నుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు.⇒టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది.⇒కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.⇒నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు.⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. ⇒ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ⇒పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు. ⇒కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు. -
కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు: అంబటి
సాక్షి, గుంటూరు: కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారారని.. కూటమి బలం ప్రకారం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేయకూడదన్నారు. ఎమ్మెల్యేలు సిగ్గు విడిచి కార్పొరేటర్లు ఇళ్లకి వెళ్లి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో కార్పొరేటర్‌కి యాభై లక్షలు ఇస్తామంటున్నారు. కార్పొరేటర్లను కొంటున్న విధానాన్ని ప్రజలు గమనించాలి. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని అంబటి మండిపడ్డారు.ప్రజాస్వామ్యానికి టీడీపీ విఘాతం: అప్పిరెడ్డివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ, కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారని.. లక్షల రూపాయలు కార్పొరేటర్లకు వెదజల్లుతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తున్నారు.. మా కార్పొరేటర్లు నిజాయితీగా వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగాలి’’ అని అప్పిరెడ్డి హితవు పలికారు.ప్రజాస్వామ్యానికి టీడీపీ తూట్లు: మనోహర్మేయర్ కావటి మనోహర్ మాట్లాడుతూ, ఆరు స్టాండింగ్ కమిటీ సభ్యులను గెలుచుకునే బలం మాకుంది. కేంద్ర మంత్రి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కూటమి బలం కేవలం పదకొండు సభ్యులు మాత్రమే. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఈప్యాక్‌లో.. చైనా కంపెనీ హైసెన్స్‌కు చోటు
కన్జూమర్ అప్లయెన్సెస్ కంపెనీ ఈప్యాక్ డ్యూరబుల్స్ ఏర్పాటు చేయనున్న ప్లాంటులో చైనా సంస్థ హైసెన్స్ గ్రూప్ ఇన్వెస్ట్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏసీలు, వాషింగ్ మెషీన్ల తయారీకి ఈప్యాక్ కొత్తగా ప్లాంటును నెలకొల్పుతోంది. ఈ ప్లాంటులో టీవీలు, అప్లయెన్సెస్ తయారీ చైనా కంపెనీ హైసెన్స్ గ్రూప్ 15 నుంచి 26 శాతం వాటా కొనుగోలు చేసే ప్రణాళికల్లో ఉంది.అయితే భారత ప్రభుత్వ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలపై ఆధారపడి పెట్టుబడులకు వీలున్నట్లు హైసెన్స్ ఇండియా ఎండీ స్టీవెన్ లి తెలియజేశారు. ఈప్యాక్ ప్లాంటులో కనీసం 15 శాతం, గరిష్టంగా 26 శాతం వాటా కొనుగోలుకి అవకాశమున్నట్లు వివరించారు. నిబంధనలు అనుమతిస్తే భారత్‌లో పెట్టుబడులకు తమ గ్రూప్ కట్టుబడి ఉంటుందని తెలియజేశారు.కంపెనీ దేశీయంగా తొలిసారి 120 అంగుళాల లేజర్ టీవీని ఇక్కడ విడుదల చేసింది. ఈ సందర్భంగా లి ప్రసంగిస్తూ వచ్చే వేసవిలో కొత్త శ్రేణిలో ఏసీలను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటులో ఈప్యాక్ డ్యురబుల్స్ ఏసీలు, వాషింగ్ మెషీన్లను తయారు చేయనున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలియజేశారు.తొలి దశలో రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. కాగా.. ఈప్యాక్ మ్యాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీస్ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్పీవీ ద్వారా ప్లాంటు నిర్వహణ ఉంటుందని 2025 అక్టోబర్‌కల్లా ఉత్పత్తి ప్రారంభమవుతుందని లి వెల్లడించారు. భవిష్యత్‌లో దక్షిణాసియా, మెక్సికో మార్కెట్లకు హైసెన్స్ ద్వారా ఎగుమతులకు సైతం ప్లాంటు ఉపయోగపడనున్నట్లు తెలియజేశారు. -
విశాఖ–ఖరగ్‌పూర్ మధ్య హైవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని నిర్మించనుంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రధాన అంశాలివీ⇒ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవాణాను వేగవంతం చేయడం ద్వారా లాజిస్టిక్ రంగ అభివృద్ధి కోసం ఈ హైవేను నిర్మించనున్నారు. ⇒ విశాఖపట్నం– ఖరగ్‌పూర్ మధ్య 783 కి.మీ. మేర ఆరు లేన్లుగా దీనిని నిర్మిస్తారు.⇒ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్‌పూర్‌కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం.⇒ విశాఖపట్నం, భావనపాడు, గోపాల్పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.⇒ విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్ ( ఒడిశా) వరకు ఒక ప్యాకేజీ, ఖుర్దా రోడ్ నుంచి ఖరగ్‌పూర్ వరకు మరో ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్ట్ చేపడతారు.⇒ డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్ చివరి వారానికి ఎన్హెచ్ఏఐ కన్సల్టెన్సీని ఖరారు చేయనుంది. ⇒ 2025 జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు.⇒ ఏడాదిన్నరలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేయాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. -
దుర్గా పూజల వేళ.. మెట్రో శుభవార్త
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో దసరా సందర్భంగా దుర్గా పూజలు వైభవంగా జరుగుతాయి. రాజధాని కోల్‌కతాలో నిర్వహించే దుర్గా పూజలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది. కోల్‌కతాలోని మెట్రో ప్రయాణికులు అక్టోబరు ఆరు నుంచి అంటే దుర్గా పూజల సమయంలో మెట్రో నుంచి అదనపు సేవలు అందుకోనున్నారు. దుర్గాపూజల సందర్భంగా మెట్రోలో ఏర్పడే రద్దీని నియంత్రించేందుకు కోల్‌కతా మెట్రో రైల్వే కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో ప్రత్యేక మెట్రో సేవలను అందించనున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. ఈ సేవలు అక్టోబర్ 6 నుంచి ప్రారంభమై, విజయదశమి నాడు అంటే అక్టోబర్ 12 వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఉత్తర-దక్షిణ కారిడార్‌లో ప్రతిరోజూ 248 మెట్రో సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.విజయ దశమి నాడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అర్ధరాత్రి వరకు 174 మెట్రో రైలు సర్వీసులు నడపనున్నారు. అక్టోబర్ 9న కోల్‌కతా మెట్రో ఉదయం 6:50 నుండి అర్ధరాత్రి వరకు 288 సర్వీసులను నడపనుంది. గ్రీన్ లైన్-1లో సప్తమి-అష్టమి- నవమి రోజులలో 64 సర్వీసులు, 'దశమి' నాడు 48, షష్ఠి నాడు 106 సర్వీసులు నడపనుంది. గ్రీన్ లైన్-2లో సప్తమి-అష్టమి-నవమి రోజుల్లో 118 సర్వీసులు, దశమి నాడు 80 సర్వీసులు నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: రేపటి నుంచి దసరా సెలవులు -
పదో తేదీ వస్తోంది.. కిస్తీ కట్టండమ్మా!
పటమట(విజయవాడ తూర్పు): మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ఉంది బుడమేరు వరద ముంపు ప్రాంతంలోని స్వయం సహాయ సంఘాల సభ్యుల పరిస్థితి. బుడమేరు వరద వల్ల ఇళ్లు మునిగి సర్వం కోల్పోయి వారం రోజుల నుంచి కట్టుబట్టలతో అల్లాడుతున్నవారిని ఆదుకోవాల్సిన విజయవాడ నగరపాలక సంస్థ పట్టణ సాధికారిక విభాగం అధికారులు... మానవత్వాన్ని మరిచి ఇప్పుడిప్పుడే ఇంటికి చేరి బురదను శుభ్రం చేసుకుంటున్న వారి వద్దకు సిబ్బందిని పంపి ‘పదో తేదీ వస్తోంది పొదుపు రుణం కిస్తీ కట్టండి... లేకపోతే వడ్డీ పెరుగుతుంది.తర్వాత ఇబ్బందిపడతారు...’ అని హెచ్చరించడంపై పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘అనేక సంవత్సరాలుగా పని చేసి పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న సామాన్లన్నీ నాశనమైపోయాయి. ఇప్పుడు తినడానికి తిండికి కూడా లేకుండా అల్లాడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వలేదు. దాతలు ఇచ్చే పులిహోర పొట్లాలు తిని బతుకుతున్నాం. బురదనీటిలోనే బతుకీడుస్తున్నాం. ఈ పరిస్థితుల్లో బుక్ కీపర్లు వచ్చి కిస్తీ కట్టాలని చెప్పడం దారుణం. వారికి మనసెలా వచి్చందో అర్థం కావడం లేదు..’ అంటూ అజిత్‌సింగ్‌నగర్ ప్రాంత పొదుపు సంఘాల మహిళలు మండిపడుతున్నారు. వెంటనే పొదుపు రుణాల చెల్లింపులను మూడు నెలలు వాయిదా వేయాలని కోరుతున్నారు. 1.50లక్షల మందిపై ప్రభావం⇒ విజయవాడలోని మూడు సర్కిళ్ల పరిధిలో సుమారు 12వేల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. ⇒ వరద ప్రభావం ఎక్కువగా ఉన్న సర్కిల్–1, సర్కిల్–2 పరిధిలోని విద్యాధరపురం, భవానీపురం, చిట్టినగర్, పాత ఆర్‌ఆర్‌పేట, కొత్త ఆర్‌ఆర్‌పేట, కొత్తపేట, అజిత్‌సింగ్‌నగర్, లూనా సెంటర్, ఆంధ్రప్రభ కాలనీ, నందమూరినగర్, ఇందిరానాయక్‌నగర్, పాయకాపురం, పైపులరోడ్డు, వాంబేకాలనీ, ఎల్బీఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 8వేల గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో సుమారు 1.50లక్షల మంది సభ్యులు పొదుపు రుణాలు పొందారు. ⇒ఒక్కో సంఘం రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు రుణాలు పొందాయి. ఆయా సంఘాల సభ్యులు రెండు నెలల నుంచి 15 నెలల వరకు వాయిదాలు చెల్లించారు. ⇒ఇప్పటి వరకు తాము తీసుకున్న రుణాలతో చిరువ్యాపారాలు, చేతివృత్తులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ ప్రతి నెల పదో తేదీలోపు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు కిస్తీలను పక్కాగా చెల్లిస్తున్నారు. ⇒ప్రస్తుతం ఆకస్మిక వరద వల్ల పనిలేక, ఉన్న వస్తువులన్నీ పాడైపోయి అల్లాడుతున్నారు. వీరు తేరుకోవడానికి కనీసం మూడు నుంచి ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. మేం ఇప్పుడు కట్టలేం మా పరిస్థితి చూశారుగా... ఇళ్లన్నీ మునిగిపోయాయి. సామాన్లు కొట్టుకుపోయాయి. ఆకలితో అలమటిస్తుంటే ఇప్పుడు వచ్చి పొదుపు రుణం కిస్తీ చెల్లించాలని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మేం కట్టలేం... కట్టం. ఏం చేసుకుంటారో చేసుకోండి. మాలాంటి వారిని ఆదుకోవాల్సింది పోయి అప్పు కట్టమనడం ఎంతవరకు న్యాయం? మేం మళ్లీ మా పాత రోజువారీ జీవితానికి రావాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది. అప్పటి వరకు మేం రుణాలు కట్టలేం. ప్రభుత్వం మాకు కొత్త రుణాలు ఇవ్వాలి. ఇంట్లో సామాన్లు కొనుక్కునేందుకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలి. – మీనాక్షి, ఆంధ్రప్రభ కాలనీ, విజయవాడ బాధితులనే విరాళాలు అడుగుతారా? ఇప్పటి వరకు వాహనాలు, ఎల్రక్టానిక్ వస్తువుల బీమాపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. పొదుపు సంఘాల పరిస్థితిని అసలు పట్టించుకోవడం లేదు. పైగా కిస్తీలు కట్టండి... పొదుపు సంఘాలు కూడా విరాళాలు ఇవ్వండి... అని చెబుతున్నారు. మేమే బాధితులమైతే మేం ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వాలా..? ఇదెక్కడి విడ్డూరం? మాపై ప్రభుత్వానికి కనికరం కూడా లేదు. మా రుణాలు మాఫీ చేయాలి. సున్నా వడ్డీకి కొత్త రుణం అందించాలి. – సునీత, ఆంధ్రప్రభ కాలనీ, విజయవాడ -
బర్గర్ కింగ్ వర్సెస్ బర్గర్ కింగ్..!
పుణె: అంతర్జాతీయ ఫాస్ట్–ఫుడ్ చెయిన్ బర్గర్ కింగ్ కార్పొరేషన్‌పై పుణెలో బర్గర్ కింగ్ పేరుతో ఉన్న రెస్టారెంట్ 13 ఏళ్లపాటు సాగిన న్యాయ పోరాటంలో విజయం సాధించింది. ‘బర్గర్ కింగ్’పేరును వాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా 13 వేలకుపైగా ఔట్లెట్లు కలిగిన తమ పేరును దెబ్బతీస్తున్నారని అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ బర్గర్ కింగ్ కార్పొరేషన్ 2011లో పుణె కోర్టులో కేసు వేసింది. ఆ పేరును వాడకుండా సంబంధిత రెస్టారెంట్‌ను ఆదేశించాలని, తమ బ్రాండ్‌కు పూడ్చలేని నష్టాన్ని కలుగజేసినందుకు రూ.20 లక్షలు చెల్లించాలని కూడా అందులో కోరింది. దీనిపై పుణె బర్గర్ కింగ్ యజమానులైన అనహిత, షాపూర్ ఇరానీలు న్యాయపోరాటం జరిపారు. ఒక్క పేరు తప్ప, బర్గర్ కింగ్ కార్పొరేషన్‌తో ఎలాంటి సారూప్యతలు తమ రెస్టారెంట్‌కు లేవన్నారు. తమ వంటి చిన్న వ్యాపారాలను దెబ్బకొట్టే దురుద్దేశంతోనే ఆ సంస్థ ఈ కేసు ఏళ్లపాటు కొనసాగించిందని ఇరానీ ఆరోపించారు. దీని కారణంగా తాము తీవ్ర వేదనకు, మానసిక ఒత్తిడికి గురయ్యామని చెప్పారు. విచారించిన జడ్జి సునీల్ వేద్ పాఠక్..‘ఇరానీ 1992లోనే బర్గర్ కింగ్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కానీ, అమెరికా కంపెనీ 2014 తర్వాతే దేశంలోకి అడుగుపెట్టింది. ఆ కంపెనీ వాదన చాలా బలహీనంగా ఉంది. పుణెలోని రెస్టారెంట్ బర్గర్ కింగ్ పేరుతో వినియోగదారులను తికమకపెట్టినట్లు గానీ, తప్పుదోవ పట్టించినట్లు గానీ నిరూపించలేకపోయింది’అని స్పష్టం చేశారు. అంతేకాదు, పుణె బర్గర్ కింగ్ రెస్టారెంట్‌తో తమ బ్రాండ్‌కు వాటిల్లిన నష్టంపై సరైన ఆధారాలను సైతం అమెరికా కంపెనీ చూపలేదన్నారు. అందుకే పరిహారం పొందే అర్హత కూడా ఆ సంస్థకు లేదన్నారు. ఈ విషయంలో ఎవరూ ఎవరికీ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుణె రెస్టారెంట్ అదే పేరుతో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. -
రూ.341 కోట్ల జీఎస్టీ ఎగవేత!.. బజాజ్ ఫైనాన్స్‌కు నోటీసు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (DGGI) బజాజ్ ఫైనాన్స్‌కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. సుమారు రూ.341 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన ఆగస్టు 3 డీజీజీఐ ఈ నోటీసు పంపింది.కేంద్ర పన్ను నిబంధనల ప్రకారం.. మినహాయింపు ప్రయోజనాలను పొందేందుకు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ సర్వీస్/ప్రాసెసింగ్ ఛార్జీలను వడ్డీగా పరిగణించడం ద్వారా జీఎస్టీని ఎగవేస్తోందని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. అయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మొత్తం రూ. 850 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది.రూ. 341 కోట్ల పన్ను ఎగవేత, రూ. 150 కోట్ల వడ్డీ మాత్రమే కాకుండా.. జూన్ 2022 నుంచి మార్చి 2024 వరకు రోజుకు రూ. 16 లక్షల జరిమానా విధించింది. మొత్తం మీద బజాజ్ ఫైనాన్స్ రూ.850 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉందని సమాచారం. దీంతో కంపెనీకి మొత్తం 160 పేజీల నోటీసు పంపింది.వస్తువులను కొనుగోలు చేయడానికి లోన్ పొందిన వారి నుంచి బజాజ్ ఫైనాన్స్ ముందస్తు వడ్డీ వసూలు చేస్తోంది. డీజీజీఐ దీనికి కూడా టాక్స్ చెల్లించాలని పేర్కొంది. కానీ బజాజ్ ఫైనాన్స్ దీనిని నాన్-టాక్సబుల్ 'వడ్డీ ఛార్జీ'గా వర్గీకరించింది. దీంతో అధికార యంత్రాంగం సమస్యను లేవనెత్తింది. -
సబ్సిడీ ఇచ్చాకే ‘జీరో బిల్లు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే విద్యుత్ సబ్సిడీ నిధులను విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విడుదల చేయాలని.. అలా చేస్తేనే వినియోగదారులకు ‘జీరో’ బిల్లులు జారీ చేయాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం–2003లోని నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ అందించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ‘గృహజ్యోతి’ పథకానికి షరతులతో ఆమోదం తెలిపింది. ముందుగా ఇవ్వాలి.. లేదా రిఫండ్ చేయాలి.. అర్హులైన పేదలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసే ‘గృహజ్యోతి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. లబ్ధిదారులకు జీరో బిల్లుల జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీ అనుమతి కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఈఆర్సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చట్టం ప్రకారం.. ఫ్రంట్ లోడెడ్ లేదా బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులకు సబ్సిడీ చెల్లింపు జరగాలని తెలిపింది. ఫ్రంట్ లోడెడ్ విధానంలో.. డిస్కంలు బిల్లింగ్ చేపట్టడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదే బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లిస్తే.. తర్వాత వారికి రాష్ట్ర ప్రభుత్వం రిఫండ్ చేస్తుందని వివరించింది. సకాలంలో రాబట్టుకోవాలి.. గృహజ్యోతి పథకానికి సంబంధించి ఇంధన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఈఆర్సీ ఆమోదించింది. ఒక నెలకు సంబంధించి అందాల్సిన సబ్సిడీ వివరాలను తదుపరి నెల 20వ తేదీలోగా డిస్కంలు అందజేస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని మార్గదర్శకాల్లో ఇంధన శాఖ పేర్కొన్నట్టు తెలిపింది. అయితే సకాలంలో సబ్సిడీ రాబట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. 2024–25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక టారిఫ్ సవరణ ప్రతిపాదనలను కూడా సత్వరమే సమర్పించాలని కోరింది. -
మారింది పేరొక్కటే
సాక్షి, అమరావతి: ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (ఏపీడీసీ) ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రమోట్ చేయడం. ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలను హైలైట్ చేస్తూ వివిధ పధకాల ద్వారా ప్రజలు ప్రయోజనం పొందేలా విస్తృత ప్రచారం కల్పించడం వారి విధుల్లో భాగమే. టీడీపీ హయాంలోనూ అదే జరిగింది. ఇప్పుడు కూడా అంతే. ఒక్క పేరు మార్పు మినహా ఎలాంటి తేడా లేదు. నాడు కంటెంట్ కార్పొరేషన్‌గా వ్యవహరించగా ఇప్పుడు డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా డిజిటల్ కార్పొరేషన్‌గా మార్పు చేశారు. డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులను వైఎస్సార్ సీపీ కార్యకర్తలుగా అభివర్ణిస్తూ కథనాలను ప్రచురించిన ఈనాడుకు వారిలో కొందరు గతంలో తమ వద్ద కూడా పని చేశారనే విషయం తెలుసా? చంద్రబాబు హయాంలో పీఆర్వోలుగా పనిచేసిన వారంతా ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థల్లో పనిచేసిన వారే కదా? ఇక ఏపీడీసీ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు జీతభత్యాలు, కార్యక్రమాల ప్రమోషన్ల కోసం చేసిన మొత్తం ఖర్చు రూ.88.56 కోట్లు కాగా రూ.500 కోట్లు దోచిపెట్టారంటూ ఈనాడు తప్పుడు కథనాలను అచ్చోసింది. ఏపీడీసీకి నాలుగేళ్లలో సగటున రూ.౨౨ కోట్లు కూడా ఖర్చు కాలేదన్నది వాస్తవం. ♦ గత సర్కారు చంద్రబాబు ఇమేజీని పెంచడానికి గ్రూప్– ఎమ్ లాంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కోట్లాది రూపాయలు చెల్లించిన మాట వాస్తవం కాదా? ♦ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలైన ఎమ్ఈఐటీవై, ఎమ్ఐబీ, డీఏవీపీ లాంటి వాటి మార్గదర్శకాలనే ఏపీడీసీ కూడా అనుసరిస్తోంది. వాటికి అనుగుణంగానే ఏపీడీసీ డిజిటల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ తయారైంది. పద్ధతి ప్రకారం ఇవన్నీ నడుస్తున్నప్పుడు పసలేని విమర్శలు ఎందుకు? ♦ రేట్ కార్డులను కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏపీడీసీ స్వీకరించింది. దానికి అనుగుణంగానే వెబ్సైట్లు, సోషల్, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, యాడ్ ఏజెన్సీలు మొదలైన వాటికి ఎంప్యానెల్ చేయడానికి ప్రముఖ జాతీయ, ప్రాంతీయ ప్రింట్ మీడియా పబ్లికేషన్స్‌లో ఆర్ఎఫ్పీలను ఏపీడీసీ ప్రచురిస్తుంది. అన్నీ సక్రమంగా జరిగాకే ఎంప్యానెల్ ఏజెన్సీలకు ఏపీడీసీ వర్క్ ఆర్డర్లను జారీ చేస్తుంది. ♦ ఏపీడీసీ ఇప్పటివరకు ఏ ఒక్క కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలను కూడా ఏదో ఒక ఏజెన్సీకి కట్టబెట్టిన సందర్భం లేదు. ప్రతి ప్రచార కార్యక్రమంలోనూ కనీసం 5 లేదా అంతకంటే ఎక్కువ ఏజెన్సీలకు ఏపీడీసీ ప్రకటనలు విడుదల చేసింది. కేవలం ఒక మీడియా సంస్థకు మాత్రమే ప్రత్యేకంగా ప్రకటనలు ఇస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు. కార్యక్రమాలు, లక్షిత వీక్షకుల ఆధారంగా వీలైనంత ఎక్కువ మందికి చేరే ప్లాట్‌ఫామ్స్‌కే ఏపీడీసీ ప్రకటనలు విడుదల చేస్తూ వచ్చింది. ప్రకటనల జారీలో వివిధ ఆధీకృత సంస్థలు పాటించే పద్ధతే ఇది. ♦ వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్ అనేది అసలు ఏపీడీసీ పరిధిలోకే రాదు. ఏపీడీసీ దానికి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ కూడా కాదు. ఇలాంటి పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం ఈనాడుకే చెల్లింది. ♦ ఐప్యాక్‌కు ప్రకటనలు ఇస్తున్నారన్నది పూర్తి అబద్ధం. ఐప్యాక్ అనేది ఎంప్యానెల్ అయిన ఏజెన్సీ కాదు. ఐప్యాక్‌కు ఏపీడీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. ఐడ్రీమ్‌కు కూడా ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. ♦ రిక్రూట్మెంట్ విషయానికి వస్తే సాంకేతిక పరిజ్ఞానం, మీడియాలో అపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అర్హతలు ప్రామాణికంగా నియామకాలు జరిగాయి. నియామకాలన్నీ జీఓ 94 ప్రకారమే జరుగుతున్నాయి. గతంలో ఇదే ఉద్యోగులు ఈనాడులో కూడా పనిచేశారు. సలహాదారులైన సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, ధనుంజయ్‌రెడ్డి, ముఖ్యమంత్రి సీపీఆర్వో శ్రీహరి తదితరులు ఈనాడులో పనిచేసిన వారే అన్న విషయాన్ని ఆ పత్రిక ఖండించగలదా? ఈనాడులో పని చేసి అక్కడనుంచి సాక్షికి వచ్చారన్నది వాస్తవం. వారికి అర్హతలున్నాయి కాబట్టే ఈనాడు ఉద్యోగాలు ఇచ్చింది. అవే అర్హతల ప్రామాణికంగా సాక్షిలో కూడా ఉద్యోగాలు పొందారు. వాటిని పరిగణలోకి తీసుకుని ఇటు ప్రభుత్వంలోనూ అటు ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ వారికి సముచిత స్థానం కల్పించారు. ఈ విషయంలో టీడీపీ, ఈనాడు చేస్తున్నవి అడ్డగోలు వాదనలని ఇక్కడే తేలిపోతోంది. ♦ ఓ కార్పొరేషన్‌గా ఏపీడీసీ వివిధ విభాగాల నుంచి ఆదాయాన్ని కూడా ఆర్జిస్తోంది. అన్ని ప్రభుత్వ విభాగాలూ ఏపీడీసీ సేవలను, డిజిటల్ స్పేస్‌లో అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సాధారణ పరిపాలన శాఖ సూచించింది. ఏపీడీసీ ఖర్చు చేసే ప్రతి రూపాయికీ లెక్క ఉంటుంది. ♦ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే యత్నాలను తీవ్రంగా పరిగణిస్తున్న ఏపీడీసీ సంబంధిత వ్యక్తులు, సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉంది. ♦ గతంలో చంద్రబాబు హయాంలో ఏర్పాటైన ఏపీ కంటెంట్ కార్పొరేషన్ పేరును మారుస్తూ జారీ చేసిన జీవో 19 ద్వారా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఇదేమీ ఇవాళ కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ కాదు. ఏపీడీసీ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ కార్యక్రమాలకు బహుళ ప్రాచుర్యం కల్పించడం, ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, ప్రభుత్వం – ప్రజల మధ్య వారధిగా పనిచేయడం. ♦ రాష్ట్ర ప్రభుత్వం సహా అన్ని విభాగాల తరపున ఏపీడీసీ ప్రకటనలు రూపొందిస్తుంది. ప్రభుత్వాధి నేతగా, ప్రభుత్వ సారథిగా, ఆ కార్యక్రమాల రూపకర్తగా ముఖ్యమంత్రి ఈ ప్రకటనలన్నింటిలోనూ కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇదేమీ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకం కాదు. దీనిపై విమర్శలు చేయడం వెనుక ఆంతర్యం కేవలం బురద జల్లడమే. ‘‘డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు వైకాపా కార్యకర్తలే.. సాక్షికి, ఏపీడీసీకి తేడాలేదు.. ఆ రెండింటి పని జగన్‌కు బాకా ఊదడమే’’నంటూ టీడీపీ చేసిన ఆరోపణలను ఒక కథనం రూపంలో 10–10–2023న ‘ఈనాడు’ దినపత్రిక ప్రచురించింది. ఇందులోని అంశాలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. నిజాలకు పాతరేస్తూ వక్రీకరణలతో… pic.twitter.com/5RC5M1Gnlo — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) October 10, 2023 -
మైనార్టీ లకూ ‘లక్ష’ణమైన పథకం
సాక్షి, హైదరాబాద్: మైనార్టీల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం ‘లక్ష’ణమైన పథకాన్ని ప్రకటించింది. స్వయం ఉపాధి పొందుతున్న, ఉపాధికి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి రూ.లక్ష ఆర్థిక సాయం పథకం ఒకింత ఊతమివ్వనుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను నిర్ధారించి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, నిబంధనలకు అనుగుణంగా అర్హతలను నిర్ధారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆ నిబంధనలే అమలు: ప్రభుత్వం గత నెలలో వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్దిదారుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కొన్ని నిబంధనలు విధించింది. దరఖాస్తులను పరిశీలించి అర్హతలను నిర్ధారించి లబ్దిదారులకు రూ.లక్ష చెక్కులు ఇస్తోంది. మైనార్టి లకు ఆర్థిక సాయం పథకానికి సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. 2022–23 సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈ పథకం కింద పరిశీలిస్తారు. వీటినే 2023–24 ఆర్థిక సాయం కింద మార్పు చేసి అర్హతల మేరకు తెలంగాణ స్టేట్ మైనార్టి స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సాయమందిస్తారు. క్రిస్టియన్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి అర్హతలను నిర్ధారిస్తారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తుకు మాత్రమే ఆర్థిక సాయాన్ని అందిస్తారు. దరఖాస్తుదారుల వయసు 2023 జూన్ 2 నాటికి 21 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీస్థాయిలోనే అర్హుల ఎంపిక జరుగుతుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. జిల్లా ఇంచార్జి మంత్రి అనుమతితో కలెక్టర్ జాబితాను ఖరారు చేస్తారు. అర్హుల జాబితాను టీఎస్ఎంఎఫ్సీ వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. (బాక్స్) మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మైనార్టి ల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో ఇవ్వనున్నట్లు చెప్పారు. మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిందన్నారు.కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని పేర్కొన్నారు. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే వివిధ పథకాలను అమలు చేస్తూ మైనార్టి ల్లోని వెనుకబాటును తొలగించేందుకు కృషి చేస్తోందన్నారు. భిన్న సంస్కృతులను, విభిన్న మత సంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్‌ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన క్రిస్టియన్లకు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, ముస్లిం, సిక్కు, బుద్దిస్ట్, జైన్, పార్శీ మతాలకు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.లక్షను ప్రభుత్వం అందిస్తోందని సీఎం చెప్పారు. -
AP: సిక్కులకు కార్పొరేషన్
సాక్షి, అమరావతి: సిక్కుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు కల్పించాలన్న సిక్కు మతపెద్దల విజ్ఞప్తిపై అప్పటికప్పుడు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు గురుద్వారాలపై ఆస్తి పన్నును తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన సిక్కు మత పెద్దలతో సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ సభ్యుడు జితేందర్‌జిత్‌సింగ్ నేతృత్వంలో సిక్కు మతపెద్దలు ముఖ్యమంత్రిని కలిశారు. శతాబ్దం క్రితం నుంచి సిక్కులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని సిక్కుమత పెద్దలు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందుతున్నాయని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేశారు. సిక్కుల కోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి నవరత్నాలను మరింత సమర్థంగా అందించాలని కోరగా ముఖ్యమంత్రి అందుకు అంగీకరించారు. గురుద్వారాల్లో పూజారులైన గ్రంథీలకు ప్రయోజనాలు గురుద్వారాల్లో పూజారులైన గ్రంథీలకు పూజారులు, పాస్టర్లు, మౌల్వీల మాదిరిగానే ప్రయోజనాలు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవురోజుగా ప్రకటించేందుకు అంగీకారం తెలిపారు. ఓ మైనార్టీ విద్యాసంస్థను నెలకొల్పేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని ప్రకటించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో ఈ చర్యలు ఉండాలని నిర్దేశించారు. పది రోజుల్లోగా ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం
ఏ సిగ్నల్ దగ్గరో, లేదా దారిమధ్యలోనో దీనంగా కనిపించిన బిచ్చగాళ్లకు తోచినంత సాయం చేయడం చాలామందికి అలవాటు. అలా చేయడం వల్ల కాస్త పుణ్యం దక్కుతుందని భావిస్తున్నారు. కానీ ఒడిశాకు చెందిన సామాజిక కార్యకర్త, జర్నలిస్టు చంద్ర మిశ్రా మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ‘‘దానం చేయవద్దు పెట్టుబడి పెట్టండి’’అనే నినాదంతో అద్భుతాలు సృష్టించారు. ఈ పిలుపు వెనుక ఉన్న సాహసం, ఆయన సాధించిన విజయం గురించి తెలిస్తే.. మీరు కూడా ఔరా అంటారు..! బెగ్గర్స్ కార్పొరేషన్: చంద్ర మిశ్రా జర్నలిస్టు,సామాజిక కార్యకర్త, చంద్ర మిశ్రా బిచ్చగాళ్లకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించడంలో పెట్టుబడి పెడితే, వారికి గౌరవప్రదమైన జీవితం ఇవ్వొచ్చని బాగా నమ్మారు. బిచ్చగాళ్లకు భిక్ష కాదు పెట్టాల్సింది.. కాసింత చేయూత, తగినంత పెట్టుబడి ఉంటే అద్భుతాలు చేయొచ్చని నిరూపించారు. ముఖ్యంగా కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో అసంఘటిత రంగానికి చెందిన వేలాదిమంది తమ ఉద్యోగాలను కోల్పోవడం, వారణాసిలో గుడి దగ్గర వేలాంది మంది బెగ్గర్స్‌ను చూసిన చలించిపోయిన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. పేదరికంతో బిచ్చగాళ్లుగా మారిన వారికి దానం పరిష్కారం కాదనీ, ప్రాథమిక మార్పు తీసుకొచ్చేలా సాయం చేయడమే ఏకైక పరిష్కారమని నమ్మారు. అలా అనేక ప్రయోగాల తర్వాత, చంద్ర అధికారికంగా ఆగస్టు 2021లో బెగ్గర్స్ కార్పొరేషన్‌ను రిజిస్టర్ చేసారు. రూ.10 నుంచి రూ.10వేలు దాకా తోచినంత పెట్టుబడి పెడితే ఆరు నెలల్లో 16.5 శాతం వడ్డీతో చెల్లిస్తామని, దీని ద్వారా గ యాచకుల జీవితాల్లో మార్పువస్తుందని ప్రకటించారు. బిచ్చగాళ్లకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చడమే చంద్ర లక్ష్యం. లాక్డౌన్ కారణంగా ఏర్పడిన నిరుద్యోగ సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఫేస్బుక్ సర్వే నిర్వహించి వారణాసిలో దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ముందుగా సమీప ప్రాంతాల నుండి దాదాపు 27వేల మంది చేరడంతో ఈ ఉద్యమానికి భారీ మద్దతు లభించింది. ఉత్సాహం చూపించిన వారికి బ్యాగుల తయారీవంటి నైపుణ్యాల శిక్షణ, ఉద్యోగాలు ఇప్పించడం మొదలైంది. దీంతో పలువురు బిచ్చగాళ్ళు కార్పొరేషన్లో చేరిక పెరిగింది. శిక్షణ తరువాత రాత్రి పగలు కష్టపడి పనిచేశారు. అలా ఇంతింతై..అన్నట్టుగా సాగుతోంది బెగ్గర్స్ కార్పొరేషన్. 2021-22లో రూ. 5.7 లక్షలతో మొదలైన పెట్టుబడి, 2022-23లో 10 రెట్లు పెరిగింది. ఇపుడు రూ. 10 కోట్ల పెట్టుబడులను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విజయంపై పలువురి ప్రశంసలు దక్కాయి. (బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా? ) #BeggarsCorporation is raising ₹ 10 cr #investment, not #donation. Indians donate ₹ 103 lakh cr p/a. If only 700 donors invest ₹ 1.5 lac each on one beggar, we don't need #VentureCapital to create 1st #beggingfree city of India. Don't donate, invest.https://t.co/TkwiATIS8k — Beggars Corporation (@BeggarsCorp) April 13, 2023 వ్యవస్థాపకులుగా 14 కుటుంబాలు ఫలితంగా ఇప్పటికే 14 పేద కుటుంబాల జీవనోపాధి కల్పించారు. తద్వారా ప్రారంభ పెట్టుబడిదారుల డబ్బును ఆరు నెలల్లోపు తిరిగి ఇచ్చేయడమేకాదు, 16.5 శాతం లాభాన్ని ఆర్జించారు. దీంతో తన భాగస్వాములైన బద్రీనాథ్ మిశ్రా, దేవేంద్ర థాపాతో కలిసి, మిశ్రా ఆగస్ట్ 2022లో బెగ్గర్స్ కార్పొరేషన్ ప్రాఫిటబుల్ కంపెనీగా మారి పోయింది. 14 యాచక కుటుంబాలు వ్యవస్థాపకులుగా పనిచేస్తున్నాయి. ఇందులో పన్నెండు కుటుంబాలు చక్కటి సంచులను తయారు చేస్తాయి. మరో రెండు కుటుంబాలు వారు దేవాలయాల సమీపంలో దుకాణాల్లో పువ్వులు, పూజా సామగ్రి ఇతర వస్తువులను విక్రయిస్తారు. If you think #beggars can't work, please watch this video. Today for the first time she came with her child. I motivated her to work. With 15 minutes of guidance, she started stitching. What if she gets skill training under Learn & Earn? @narendramodi @blsanthosh @MSDESkillIndia pic.twitter.com/KHm3jVNugr — Chandra Mishra (@employonomics) December 29, 2021 కార్పొరేషన్లో చేరింది ఒక మహిళ కావడం విశేషం. భర్త వేరొకరిని పెళ్లిచేసుకుని బాధిత మహిళను ఇంటినుంచి తరిమిమేయడంతో 12 ఏళ్ల కొడుకుతో పాటు, కాశీ ఘాట్ వద్ద భిక్షాటన చేసేది. ఆమెను కలిసి పనినేర్చుకోమన్నపుడు వెనకడుగు వేసింది. మిషన్‌ను పాడు చేస్తానేమోనని భయపడింది. చివరికి 15 నిమిషాల్లో ఆమె నేర్చుకొంది. కుట్టుపని శిక్షణలో పదును తేలడం బెగ్గర్స్ కార్పొరేషన్‌కు మరింత ప్రోత్సహాన్నిచ్చిందనీ, వారికి చేయూతనిచ్చి ఆత్మవిశ్వాసాన్ని పెంచితే చాలనే నమ్మకాన్ని తమలో పెంచిందని చంద్ర చెబుతారు. ‘‘వారి జీవితాలను మార్చడంలో ఎంతవరకు విజయం సాధించానో ఖచ్చితంగా తెలియదు, కానీ బనారస్ బెగ్గర్స్ కార్పొరేషన్ ద్వారా నేను మారును. నేను ఒక మాధ్యమం మాత్రమే. నిజానికి నేను యూపీకి చెందిన వాడ్నికాను. వారణాసి ప్రజలతో నాకు సంబంధం లేదు. కానీ వృద్ధి సమానంగా ఉండాలని ఈ ఉద్యమం నాకు నేర్పింది. మనం ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించే వరకు రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. బిచ్చగాళ్లు పారిశ్రామికవేత్తలు కాగలిగితే, నిరుద్యోగం అనేదే ఉండదు’ అంటారు చంద్ర. విరాళాలకు బదులుగా పెట్టుబడులను ప్రోత్సహించాం తద్వారా బిచ్చగాళ్ళు వ్యవస్థాపకులుగా మారారు. ఈ రకమైన చర్య ప్రపంచంలోనే మొదటిది, ఏకైక చొరవ అని ఆయన పేర్కొన్నారు. అవార్డులు, రివార్డులు ♦ఈ మిషన్‌లో ఒక్కో బిచ్చగాడికి రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తారు. వీటిలో రూ. 50వేల మూడు నెలల నైపుణ్య శిక్షణా కార్యక్రమానికి వినియోగిస్తారు. మిగిలిన మొత్తాన్ని వ్యక్తి సంస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను రూపొందించడానికి ఖర్చు చేస్తారు. ♦ దీంతోపాటు వారణాసి ఘాట్ల వద్ద అడుక్కునే పిల్లలకు సహాయం చేయడానికి మిశ్రా స్కూల్ ఆఫ్ లైఫ్‌ను కూడా స్థాపించారు. బెగ్గర్స్ కార్పొరేషన్ చంద్ర మిశ్రాకు 100 ఇన్నోవేటివ్ స్టార్టప్‌లలో స్థానం సంపాదించిపెట్టింది. తరువాత టాప్ 16 మైండ్‌ఫుల్ స్టార్టప్‌లలో చేరారు. ♦ ప్రారంభంలో 57 మంది తన ప్రచారానికి నిధులు సమకూర్చారు . వారి డబ్బుతో, మిశ్రా లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ అందించి వారి ఉపాధిని ఏర్పాటు చేశారు. ♦ బెగ్గర్స్ కార్పొరేషన్స్ అనేక అవార్డులను కూడా అందుకుంది. స్టార్టప్ ఇండియా సహకారంతో లెమన్ ఐడియాస్ నిర్వహించిన ఇన్నోప్రెన్యూర్స్ గ్లోబల్ స్టార్టప్ కాంటెస్ట్‌లో ఇది బెస్ట్ సోషల్ ఇంపాక్ట్ అవార్డును అందుకుంది. -
ఆస్తిపన్ను వసూళ్లు రూ. 825.87 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక సంఘాలు, సంస్థల నుంచి ఆస్తిపన్ను రూపంలో రూ.825.87 కోట్లు వసూలయ్యాయి. జీహెచ్ఎంసీ మినహా 128 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్ల పరిధిలో నిర్దేశిత లక్ష్యం రూ.1,146.56 కోట్లలో 72.03 శాతం మేర వసూలైంది. 2021– 22 ఏడాది ఆస్తిపన్ను వసూళ్లతో పోలిస్తే ఈసారి రూ.127.62 కోట్లు అదనంగా సమకూరాయి. ఆస్తిపన్ను వసూళ్లలో హైదరాబాద్ మినహా 12 కార్పొరేషన్లలో 92.33 శాతం పన్ను వసూళ్లతో ఫిర్జాదిగూడ మొదటిస్థానంలో నిలవగా, 55.02 శాతం పన్ను వసూళ్లతో నిజామాబాద్ చివరిస్థానంలో ఉంది. మునిసిపాలిటీలలో జగిత్యాల జిల్లా కోరుట్లలో అత్యధికంగా 97.39 శాతం, నిర్మల్ జిల్లా బైంసాలో అత్యల్పంగా 26.93 శాతం మాత్రమే వసూలైంది. ఆస్తిపన్ను, భవన నిర్మాణాల ఫీజుల వసూళ్లతో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రతి సంవత్సరం ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. చిన్న మునిసిపాలిటీల్లో కూడా పన్నువసూళ్లు ఆశాజనకంగా ఉండటంతో ప్రభుత్వానికి ఏయేటికాయేడు ఆదాయం పెరుగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు నెలల ముందు నుంచే కమిషనర్ అండ్ డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ మునిసిపల్ కమిషనర్లతో తరుచూ సమావేశాలు నిర్వహించడం, ఆదాయలక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన సమీక్షలు ఎప్పటికప్పుడు చేయడంవల్ల పన్నువసూళ్లలో పురోగతి స్పష్టంగా కనిపించింది. మునిసిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గ్రాంట్లతోపాటు స్వయంగా ఆదాయం సమకూర్చుకోవడం తప్పనిసరని సీడీఎంఏ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆస్తిపన్నుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రతీ మంగళ, గురు, ఆదివారాల్లో మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30లోగా ఆస్తిపన్నుచెల్లిస్తే 5 శాతం రాయితీ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించినవారికి ఎర్లీబర్డ్ స్కీమ్ వర్తిస్తుందని కమిషనర్, డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ తెలిపారు. ఆస్తిపన్ను మొత్తం చెల్లించేవారికి ఐదుశాతం రాయితీ లభిస్తుందన్నారు. ఆస్తిపన్ను మునిసిపల్ కార్యాలయానికి రాకుండానే పేమెంట్ యాప్స్ ద్వారా చెల్లించవచ్చని పేర్కొన్నారు. పన్నుచెల్లింపు దారులకు మునిసిపాలిటీలు పంపించే ఎస్ఎంఎస్లలో లింక్ తెరిచి పన్ను చెల్లించవచ్చని, లేదంటే వాట్సాప్ చాట్‌బాట్ నంబర్ 90002 53342 ద్వారా కూడా చెల్లించవచ్చని వివరించారు. -
మనీలాండరింగ్ ద్వారా ‘స్కిల్’ కుంభకోణం: ఈడీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కుంభకోణంలో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించింది. అందులో రూ.70 కోట్లు ఎక్కడికి చేరాయో గుర్తించినట్టు తెలిపింది. మిగిలిన మొత్తం ఎక్కడికి చేరిందన్న దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొంది. మనీలాండరింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడినట్టు తమ విచారణలో వెల్లడైందని ఈడీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్‌చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్(చార్టెడ్ అకౌంటెంట్)లను కోర్టు ఆదేశాలతో విచారణ కోసం ఏడురోజుల కస్టడీకి తీసుకున్నట్టు పేర్కొంది. చదవండి: అసెంబ్లీకి అందుకే వచ్చావా?.. కోటంరెడ్డిపై మంత్రి అంబటి ఫైర్ -
హెచ్‌డీఎఫ్‌సీకి ఐఎఫ్‌సీ రుణాలు
ముంబై: దేశీ మార్టిగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకు తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) అదనపు రుణాలు అందించనుంది. పర్యావరణహిత అందుబాటు ధరల హౌసింగ్ యూనిట్లకు మద్దతుగా 40 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,300 కోట్లు)ను విడుదల చేయనుంది. వాతావరణ పరిరక్షణా లక్ష్యాలకు అనుగుణంగా తాజా రుణాలను మంజూరు చేయనుంది. దీంతో పట్టణాలలో హౌసింగ్ అంతరాలను తగ్గించేందుకు అవకాశమున్నట్లు రెండు సంస్థలూ విడిగా పేర్కొన్నాయి. పర్యావరణహిత చౌక గృహాల ఏర్పాటుకు మద్దతివ్వడం ద్వారా గ్రీన్ హౌసింగ్‌కు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలియజేశాయి. వెరసి తాజా రుణాలు పర్యావరణ అనుకూల వృద్ధి, ఉపాధి కల్పన తదితర దేశీ లక్ష్యాలకు ఆలంబనగా నిలవనున్నట్లు వివరించాయి. తద్వారా దీర్ఘకాలిక బిజినెస్ వృద్ధికి హామీ లభిస్తుందని అభిప్రాయపడ్డాయి. 75 శాతానికి రెడీ ఐఎఫ్‌సీ నుంచి లభించనున్న నిధుల్లో 75 శాతాన్ని అంటే 30 కోట్ల డాలర్లను పర్యావరణహిత చౌక హౌసింగ్ యూనిట్లకు కేటాయించనున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. దేశీయంగా 27.5 కోట్లమంది ప్రజలు లేదా 22 శాతం ప్రజానీకం తగినస్థాయిలో ఇళ్లను పొందలేకపోతున్నట్లు అంచనా వేసింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఇళ్ల కొరత రెట్టింపుకాగా.. 2018కల్లా పట్టణాల్లో 2.9 కోట్ల యూనిట్ల గృహాల కొరత నమోదైనట్లు తెలియజేసింది. 2012తో పోలిస్తే ఇది 54 శాతం పెరిగినట్లు వివరించింది. దేశీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు 2010 నుంచీ ఐఎఫ్‌సీ 170 కోట్ల డాలర్ల రుణాలను అందించడం గమనార్హం! -
పవన్ పై రెక్కీ నిర్వహించింది చంద్రబాబు కు చెందిన వ్యక్తులే : ఏపీ రెడ్డి, కమ్మ ,కాపు కార్పొరేషన్ చైర్మన్లు
-
ఆంధ్రప్రదేశ్ కు జాతీయ అవార్డులు
-
పట్టణాల్లో ఫిర్యాదులపై ప్రత్యేక వ్యవస్థ!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ప్రజలకు సకాలంలో సేవలు అందించడంపై రాష్ట్ర మునిసిపల్ పాలనా విభాగం దృష్టి సారించింది. ఏ స్థాయిలోనూ ‘పెండింగ్’ అనేది లేకుండా నిబంధనల ప్రకారం వెంటనే సమస్యలను పరిష్కరించనుంది. ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్ కుమార్ మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 123 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందించాల్సిన సేవలపై పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి మంగళ లేదా బుధవారాల్లో మునిసిపల్ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అలాగే ప్రతినెలా మూడు లేదా నాలుగు మున్సిపాలిటీల్లో సీడీఎంఏ స్వయంగా పర్యటించనున్నారు. ఏ లోపం ఉన్నా కమిషనర్లదే బాధ్యత ప్రభుత్వ పథకాలు సకాలంలో ప్రజలకు అందుతున్నాయా? లేదా అనే అంశంపై మునిసిపల్ శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో సిబ్బంది, కమిషనర్లపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఆన్లైన్లో ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ఒక బృందాన్ని కూడా నియమిస్తోంది. మునిసిపాలిటీలో ఏ స్థాయిలో అవినీతి జరిగినా, ప్రజలకు అందించాల్సిన సేవల్లో లోపం కనిపించినా అందుకు స్థానిక కమిషనర్లనే బాధ్యులను చేయనుంది. 4,136 వార్డులపై ప్రత్యేక దృష్టి వార్డు సచివాలయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఎలాంటి ఫిర్యాదులు ఉండవని మునిసిపల్ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అన్ని మునిసిపాలిటీల్లో ఉన్న 4,136 వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బందిపై దృష్టి పెట్టింది. దీంతో రాష్ట్ర స్థాయి నుంచి ఎప్పుడు ఏం ప్రశ్న వస్తుందోనని మునిసిపల్ కమిషనర్లు జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పటిదాకా వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తుల దుమ్ముదులిపే పనిలో నిమగ్నమయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి మునిసిపాలిటీలో ఇటీవల పర్యటించిన సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ కొత్తపేట–2 సచివాలయంలో సిబ్బంది లేకపోవడం, ఉన్నవారు యూనిఫామ్ ధరించకపోవడాన్ని గుర్తించారు. వార్డు కార్యాలయాల్లో సిబ్బంది పేర్లు, వారు అందించే సేవల బోర్డులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో సిబ్బంది పనితీరుని మునిసిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ పర్యటనలో ఆయన గుర్తించిన లోపాలను అన్ని మునిసిపాలిటీలు సరిచేసుకోవాలని 123 మంది కమిషనర్లకు నోటీసులు పంపించారు. కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే.. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో సకాలంలో సేవలు అందలేదని ఫిర్యాదులు వస్తే సహించేది లేదు. కిందిస్థాయి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలి. కమిషనర్లు పట్టణంలో పర్యటిస్తుంటే సమస్యలు తెలుస్తాయి. ఫిర్యాదులు, పెండింగ్ సమస్యలు ఎక్కడా లేకుండా చర్యలు తీసుకోవాలి. మునిసిపాలిటీల్లో 4,136 వార్డులు ఉన్నాయి. వాటిలో 317 సేవలు అందించాలి. ఎవరు ఎలాంటి సేవలు అందిస్తారనేది వార్డు సచివాలయాల్లో బోర్డులు పెట్టాలి. కొన్ని వార్డుల్లో ఇప్పటిదాకా బోర్డులు పెట్టనిచోట చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చెడ్డపేరొచ్చేలా ప్రవర్తించినా, ప్రభుత్వ సేవలు, పథకాలు సకాలంలో ప్రజలకు అందకున్నా బాధ్యులపై చర్యలు తప్పవు. – ప్రవీణ్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ -
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో సీఐడీ దూకుడు
-
పలు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను నియమించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 5 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేశ్, తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరిశంకర్, ‘తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ నియమితులయ్యారు. కీలకంగా పనిచేసిన వాళ్లకు.. తెలంగాణ మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్‌గా నియమితులైన ఆకుల లలిత గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు టీఆర్ఎస్లో చేరారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించినా చివరి నిమిషంలో చేజారింది. తాజాగా నామినేటెడ్ పదవి లభించింది. బీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా నామినేట్ అయిన గజ్జెల నగేశ్.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తండటాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్‌గా పనిచేస్తున్న పాటిమీది జగన్మోహన్రావు యువజన విభాగంలో క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చారు. గతంలో జీహెచ్ఎంసీ యువజన విభా గం ఇన్చార్జిగా పనిచేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమితులైన జూలూరు గౌరి శంకర్ పాత్రికేయుడు. రచయితగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా చేసిన శంకర్‌కు ప్రస్తుతం నామినేటెడ్ పదవి లభించింది. విద్యార్థి దశ నుంచే వామపక్ష విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐలో పనిచేసిన డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమంలో 150కి పైగా కేసు లు ఎదుర్కొని 50 రోజులు జైలు జీవితం గడిపారు. కాగా యువ గాయకుడు సాయిచంద్‌ను రెండ్రోజుల క్రితం తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా, విద్యార్థి నాయకులుగా ఉద్యమంలో పాల్గొన్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. చదవండి: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు! -
Nellore: టీడీపీలో ‘కార్పొరేషన్’ బ్లో అవుట్.. రాజీనామాల బాట
నెల్లూరు (టౌన్): కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫలితాలపై సమీక్ష సందర్భంగా పార్టీకి వీర విధేయులుగా ఉన్న పలువురు సీనియర్ నేతలను సస్పెండ్ చేయడం, మరి కొందరిని పార్టీ నుంచి తొలగించడం, ఇంకొందరిని సంజాయిషీ కొరడంతో ఆ పార్టీలో నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీ అధినేత ఎన్నికల్లో తప్పులు చేసిన పెద్దలను వదిలి చిన్నచిన్న నాయకుల మీద చర్యలు తీసుకోవడం, ఆగ్రహం వ్యక్తం చేయడంపై తమ్ముళ్లు మండి పడుతున్నారు. అధినేత తీరును నిరసిస్తూ ఆదివారం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్‌యాదవ్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో 25వ డివిజన్ నుంచి 54వ డివిజన్ వరకు పార్టీ జిల్లా నాయకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ లోపే మరి కొంత మంది మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అభ్యర్థుల విషయంలో ఎవరిని సంప్రదించకుండానే ఇళ్లల్లో కూర్చొని ప్రకటించారని డివిజన్ నాయకులు చెబుతున్నారు. కనీసం పోటీ ఇచ్చే వారిని కూడా బరిలో నిలపకుండా డబ్బులు తీసుకుని డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా ఎలాంటి సంబంధం లేని తమపై చర్యలు తీసుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా పార్టీ ఇంతగా భ్రష్టుపట్టడానికి కారణమైన సిటీ, రూరల్ నియోజకవర్గాల ఇన్చార్జిల తీరు నిరసిస్తూ ఇటీవల ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఏకమై నినదించిన విషయం తెలిసిందే. మంగళవారం తర్వాత వీరిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక వేళ వారిపై చర్యలు తీసుకోకపోతే సిటీ, రూరల్ నియోజకవర్గాల్లోని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్ మొత్తం మూకుమ్మడిగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
Andhra Pradesh: అధికార పార్టీ అరుదైన రికార్డు
సాక్షి, అమరావతి: నగర పాలక సంస్థల్లో మేయర్ పీఠాలను వందకు వంద శాతం, పురపాలక, నగర పంచాయతీల్లో 96.55 శాతం స్థానాలను సొంతం చేసుకోవడం ద్వారా వైఎస్సార్ సీపీ దేశంలో అరుదైన రికార్డును నెలకొల్పింది. తొలివిడత ఎన్నికల్లో 12 నగర పాలక సంస్థలనూ అధికార పార్టీ కైవశం చేసుకోగా తాజాగా నెల్లూరుతో కలిపి 13 కార్పొరేషన్లలో విజయబావుటా ఎగుర వేయడం తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ కేవలం దర్శి, తాడిపత్రి మునిసిపాలిటీలకే పరిమితమైంది. కొండపల్లి మునిసిపాలిటీలో టీడీపీ, వైఎస్సార్సీపీలకు సమంగా వార్డులు దక్కడంతో ‘టై’ అయింది. టీడీపీ గెలిచిన దర్శి, టై అయిన కొండపల్లిలో ఓటు షేర్ పరిశీలిస్తే వైఎస్సార్ సీపీకే ఎక్కువగా ఉండటం గమనార్హం. దర్శిలో వైఎస్సార్ సీపీ ఓటు షేర్ 48.30 శాతం కాగా టీడీపీ ఓటు షేర్ 46.57గా ఉంది. కొండపల్లిలో వైఎస్సార్ సీపీ 47 శాతం, టీడీపీ 44.17 శాతం ఓటు షేర్‌ను సాధించాయి. ఇక స్థానిక సంస్థలకు సంబంధించి 13,092 గ్రామ పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల్లో 10,536 (80.47 శాతం) పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులనే ప్రజలు గెలిపించారు. పరిషత్ ఎన్నికల్లో 9,583 ఎంపీటీసీ స్థానాలకు 8249 స్థానాల్లో (86 శాతం) విజయం చేకూర్చారు. 638 జెడ్పీటీసీ స్థానాలకుగానూ 630 స్థానాల్లో (98 శాతం) అధికార పార్టీ అభ్యర్థులే నెగ్గారు. స్పష్టమైన ఆధిక్యంతో.. తాజాగా రెండో దశలో నెల్లూరు కార్పొరేషన్, 12 మునిసిపాలిటీల్లో 328 డివిజన్లు, వార్డులతోపాటు పలు మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న 25 డివిజన్లు, వార్డులకు సంబంధించి ఎన్నికల్లో పోలైన మొత్తం 5,17,430 ఓట్లలో వైఎస్సార్ సీపీ ఏకంగా 2,88,568 ఓట్లు (55.77 శాతం) దక్కించుకుంది. మొదటి దశ ఎన్నికల్లో 48,76,933 ఓట్లు పోల్ కాగా వైఎస్సార్ సీపీ 52.75 శాతంతో 25,72,595 ఓట్లను సాధించింది. అంటే మొదటి దశతో పోలిస్తే రెండో దశలో అధికార పార్టీకి ఓట్లు మూడు శాతానికిపైగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇక తాజా ఎన్నికల్లో టీడీపీ 1,76,954 ఓట్లకే (34.20 శాతం) పరిమితమైంది. జనసేన, బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 51,908 ఓట్లు (10.03 శాతం) దక్కాయి. రాజంపేటలో అత్యధికంగా.. నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీకి 58.07 శాతం ఓట్లు రాగా టీడీపీకి 28.37% వచ్చాయి. రాజంపేట మునిసిపాలిటీలో వైఎస్సార్సీపీకి అత్యధికంగా 63.54% ఓట్లు లభించాయి. మొత్తం 353 వార్డులు, డివిజన్లకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్సీపీ 261 (73.91%) వార్డులు డివిజన్లను దక్కించుకుంది. టీడీపీ 82 (23.22%) వార్డులు, డివిజన్లకు పరిమితమైంది. 81.85 శాతం వార్డులు, డివిజన్లు వైఎస్సార్‌సీపీవే రాష్ట్రంలో రెండు దశల్లో 13 కార్పొరేషన్లు, 87 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో 3,125 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 81.85 అంటే 2,558 వార్డులు, డివిజన్లను వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంది. టీడీపీ కేవలం 13.76 శాతం అంటే 430 వార్డులు, డివిజన్లలో నెగ్గింది. బీజేపీ/జనసేన 1.24 శాతంతో 39 వార్డులు, డివిజన్లు సాధించగా ఇతరులు 98 (3.13 శాతం) వార్డులు, డివిజన్లను దక్కించుకున్నారు. -
బీఎంసీలోకి ఎలక్ట్రిక్ వాహనాలు
సాక్షి, ముంబై: స్వచ్ఛ–సుందర్, కాలుష్య రహిత ముంబై కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కార్యాలయం పనులకు, అధికారుల పర్యటనకు, ఉన్నతాధికారులు ఇంటి నుంచి కార్యాలయానికి రావడానికి ఇలా వివిధ పనులకు ఉపయోగించేందుకు బ్యాటరీతో నడిచే వాహనాలను కొనుగోలు చేయనుంది. అందుకు బీఎంసీ ప్ర«ధాన కార్యాలయంతోపోటు, 24 వార్డు కార్యాలయాల్లో, గ్యారేజీల్లో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించింది. పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే సంకల్పంతో చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ నుంచి బ్యాటరీతో నడిచే కొత్త వాహనాలను అందుబాటులోకి తేవాలని బీఎంసీ యోచిస్తోందని పర్యావరణ విభాగం డిప్యూటీ కమిషనర్ సునీల్ గోడ్సే తెలిపారు. 200 వాహనాలు.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వాహనాల సంఖ్యతోపాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు బెస్ట్ సంస్థ కూడా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసింది. ఇదే తరహాలో బీఎంసీ సిబ్బంది, అధికారులు వినియోగించే ఫోర్ వీలర్స్‌తోపాటు చిన్న, చితక సామగ్రి, తేలకపాటి సరుకులు చేరవేసే వాహనాలను కొనుగోలు చేయనుంది. కార్లు, ఇతర ఫోర్ విలర్స్ వాహనాలను బీఎంసీ కమిషనర్, డిప్యూటీ, అదనపు, సహాయ కమిషనర్లకు, ఉన్నతాధికారులకు అందజేయనుంది. సుమారు 200 వరకు బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలున్నాయని గోడ్సే తెలిపారు. దశల వారిగా వీటిని వినియోగంలోకి తేనుంది. బ్యాటరీతో నడిచే వాహనాల సంఖ్య పెరగడంతో బీఎంసీకి చెందిన అన్ని కార్యాలయాలలో, గ్యారేజీలలో చార్జీంగ్ పాయింట్ నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదటి దశలో 35 చోట్ల, ఆ తరువాత 100కుపైగా కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వీటితోపాటు విద్యుత్ పొదుపు చేసేందుకు సోలార్ విద్యుత్ ప్యానెళ్లు కూడా ఏర్పాటు చేయాలని బీఎంసీ భావిస్తోంది. కార్యాలయం పనులకు ఎలాంటి ఇబ్బందులు లేని చోట ఈ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. -
Karimnagar: బల్దియా కమిషనర్, కార్పొరేటర్ల మధ్య కొత్త వివాదం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ నగర పాలక సంస్థలో కొత్త వివాదం మొదలైంది. కమిషనర్ వల్లూరి క్రాంతి, అధికార టీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య అంతరం పెరిగింది. తమకు కనీస గౌరవం కూడా ఇవ్వని కమిషనర్ క్రాంతిని బదిలీపై పంపించాలని 32 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు సంతకాలతో మంత్రి గంగుల కమలాకర్‌కు వినతిపత్రం అందజేయడం కొత్త చర్చకు దారితీసింది. కౌన్సిల్లో ఉన్న 40 మంది టీఆర్ఎస్ సభ్యుల్లో సీనియర్లు 8 మంది మినహా 32 మంది కమిషనర్ క్రాంతిని బదిలీపై పంపించాలని మంత్రి కమలాకర్, మేయర్ సునీల్‌రావుకు విన్నవించడం గమనార్హం. తమకు గౌరవం ఇవ్వడం లేదనే సాకుతోనే కార్పొరేటర్లు కమిషనర్ బదిలీకి ఎసరు పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవలే జిల్లా కలెక్టర్ శశాంక బదిలీ కాగా, ఆయన స్థానంలో ఆర్వీ కర్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఉప ఎన్నిక జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్లలో ఒకటైన కరీంనగర్ కమిషనర్‌ను మాత్రం మార్చలేదు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్లు కరీంనగర్ కమిషనర్‌ను కూడా మార్చాలని కోరుతుండడం గమనార్హం. ఐఏఎస్ అధికారి కావడంతో... కరీంనగర్ కార్పొరేషన్‌కు గతంలో గ్రూప్–1 అధికారులు కమిషనర్లుగా వ్యహరించేవారు. మొన్నటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన కె.శశాంక తొలి ఐఏఎస్ కమిషనర్‌గా వ్యవహరించారు. ఆయన బదిలీ తరువాత మళ్లీ గ్రూప్–1 అధికారులనే నియమిస్తూ వచ్చినప్పటికీ, ఏడాది క్రితం ఐఏఎస్ అధికారి వల్లూరి క్రాంతి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్లో జరుగుతున్న అభివృద్ధి, స్మార్ట్‌సిటీ పనుల విషయంలో కమిషనర్‌గా నిబంధనల మేరకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. క్రాంతి వచ్చినప్పటి నుంచి కరోనా ప్రభావమే ఉండడంతో పనుల్లో వేగం తగ్గింది. కాంట్రాక్టర్లకు బిల్లుల విషయంలోనూ ఆలస్యం జరుగుతోంది. పనుల నాణ్యతను బట్టి బిల్లుల మంజూరీకి ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలు చేపట్టడం కార్పొరేటర్లకు నచ్చడం లేదు. మొరం పనులతో మొదలై.. కరీంనగర్లో విలీనమైన శివారు ప్రాంతాల్లో వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు భారీగా వరద చేరి చెరువుల్లా తయారయ్యాయి. నీట మునిగిన ప్రాంతాల్లో మొరం నింపాలని, ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కార్పొరేటర్లు మేయర్, కమిషనర్‌కు విన్నవించారు. అందుకు సమ్మతించిన అధికారులు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అయితే.. టెండర్ల విధానంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించాలని కొందరు కార్పొరేటర్లు ప్రతిపాదించి, వెంటనే అనుమతించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. నామినేషన్ ప్రతిపాదనలను కమిషనర్ పక్కన పెట్టడంతో కొందరు కార్పొరేటర్లు సంతకాల సేకరణకు తెరలేపారని సమాచారం. వీటితోపాటు ఇటీవల పట్టణ ప్రగతిలో చేసిన పలు పనులు నాసిరకంగా ఉండడంతో, సదరు కాంట్రాక్టర్లను మందలించి, పూర్తిస్థాయి బిల్లులు కాకుండా, చేసిన పనులకే చెల్లించారని.. తద్వారా అగ్గి రాజకుందని ప్రచారం జరుగుతోంది. కమిషనర్ నిర్ణయాలను శివారు ప్రాంతాలకు చెందిన కొందరు కార్పొరేటర్లు చాలాసార్లు మంత్రికి, మేయర్‌కు దష్టికి తీసుకుని వెళ్లినా.. సర్దిచెప్పి పంపించారని సమాచారం. ఆయా ప్రాంతాల్లో సాగుతున్న పనులు లోపభూయిష్టంగా ఉండడంతో బిల్లులు మంజూరు కాకుండా కమిషనర్ కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వీటితోపాటు ఉద్యోగుల్లో సైతం జవాబుదారి తనం పెంచేందునకు చర్యలు తీసుకుంటుండడం కూడా నచ్చడం లేదు. కార్పొరేటర్ భర్తలకు కనీస గౌరవం లేదా..? కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిపి 60 మంది ప్రజాప్రతినిధులు ఉండగా, వారిలో సగం అంటే 30 మంది మహిళా కార్పొరేటర్లే. మహిళలు కార్పొరేటర్లుగా గెలిచినా.. ఒకరిద్దరు మినహాయించి మిగతా వారిని ముందుండి నడిపించేది వాళ్ల భర్తలే. ఈ క్రమంలో సాధారణంగా 80 శాతం మంది మహిళా కార్పొరేటర్ల భర్తలే ఆయా డివిజన్లలో జరిగే పనులకు కాంట్రాక్టర్లుగా వ్యహరించడం లేక కుటుంబసభ్యుల్లో ఒకరి పేరిట పనులు చేయించడం జరుగుతోంది. అలాగే.. కమిషనర్, ఇతర అధికారులను కార్పొరేటర్ల భర్తలే కలిసి అభివృద్ధి పనులకు నిధులు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కమిషనర్‌కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని, కార్పొరేషన్‌కు వెళ్లినా అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని మహిళా కార్పొరేటర్ల భర్తలు ‘ఆవేదన’ చెందుతున్నారు. అత్యవసర పనులకు నామినేషన్ పద్ధతిలో మంజూరు ఇచ్చేది కమిషనరే కావడంతో కరోనా సమయంలో పట్టణంలోని వార్డుల్లో కోట్లాది రూపాయల పనులు ఇదే పద్ధతిలో జరిగాయి. అయితే.. నామినేషన్ మీద జరిగిన పనులను పరిశీలించి బిల్లులు మంజూరు చేయాల్సిన కమిషనర్ అనుకూలంగా స్పందించడం లేదని చెపుతున్నారు. -
ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం 20 లక్షల ఎకరాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగువిస్తీర్ణాన్ని భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 45 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతుండగా, రాబోయే మూడేళ్లలో 20 లక్షల ఎకరాలకు పెంచేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆయిల్‌పామ్ రైతులకు ఎకరాకు గరిష్టంగా రూ.36 వేల ఆర్థికసాయాన్ని అందించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయించనున్నాయి. పొరుగుదేశాల నుంచి నూనె దిగుమతులతోపాటు వరిసాగు విస్తీర్ణం, ధాన్యం సేకరణ భారం తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో కేంద్రం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 25 జిల్లాల్లో 8.24 లక్షల ఎకరాలు ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని గుర్తించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కంటే మూడు రెట్లు అధికవిస్తీర్ణంలో పంటసాగు చేపట్టేవిధంగా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఆయిల్‌ఫెడ్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడేళ్లు... మూడుదశలు రాబోయే మూడేళ్లలో మూడు దశలుగా ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచనుంది. 2022–23 సంవత్సరంలో 3 లక్షల ఎకరాలు, 2023–24లో 7 లక్షల ఎకరాలు, 2024–25లో మరో 10 లక్షల ఎకరాల పంటను సాగు చేసే విధంగా కార్యాచరణ రూపొందించింది. ఈ పంట సాగు కోసం 11 కంపెనీలకు 25 జిల్లాలను కేటాయించింది. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచితే ప్రత్యక్షంగా 30 వేలమంది, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆయిల్‌పామ్ రైతులకు ఒక్కో ఎకరాకు రూ.36 వేల చొప్పున సాయాన్ని మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ పంట సాగు కోసం రూ.7,200 కోట్లు ఖర్చు చేయనుంది. ఆయిల్‌పామ్ పంట సాగుకు నీటి వినియోగం తక్కువ. టీఎస్ ఆయిల్‌ఫెడ్ సరికొత్త యాప్ ఆయిల్‌పామ్ రైతులకు సూచనలు, సలహాలతోపాటు నిరంతరం ఫీడ్ బ్యాక్ తెలుసుకునేవిధంగా టీఎస్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ సరికొత్త యాప్, ప్రత్యేక వెబ్‌పేజీని అందుబాటులోకి తీసుకొచి్చంది. వీటిని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ ఎం.సురేందర్ లాంఛనంగా ప్రారంభించారు. నేడు టీ–సాట్ ప్రత్యేక లైవ్ కార్యక్రమం ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణంపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో శనివారం మధ్యాహ్నం 12 నుండి 2–గంటల వరకు టీ–సాట్ స్టూడియోలో ప్రత్యేక లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల్లో అవగాహన కలి్పంచేందుకు మంత్రి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. -
3 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
-
రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు
సాక్షి, అమరావతి : అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, బీసీ కులాల జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది. పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘సి’ కేటగిరీ కింద విభజించారు. -
నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్
చిత్తూరు అర్బన్: చిత్తూరు కార్పొరేషన్ నూతన మేయర్‌గా ఎన్నికైన అముద ప్రస్థానం.. కష్టాల్లో ఆగిపోకుండా నిలదొక్కుకోవాలనే ఎందరో మహిళలకు ఆదర్శం. కుటుంబం గడవడం కోసం ఒకప్పుడు అముద కట్టెలు కొట్టి అమ్మింది. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతోంది. జగన్ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. వైఎస్సార్సీపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమేగాక ఇప్పుడు ఏకంగా చిత్తూరు మేయర్‌గా ఎన్నికైంది. దీనిపై అముద స్పందిస్తూ.. ‘‘మాది పేద కుటుంబం. అమ్మానాన్న చనిపోయేనాటికి నాకు ఊహ కూడా తెలియదు. అక్క నాగభూషణం కుటుంబ బాధ్యత తీసుకుంది. అక్కతోపాటు పనికిపోయేదాన్ని. ఆమె పడుతున్న కష్టం చూసి.. మేముంటున్న చోటి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడివికిపోయి కట్టెలు కొట్టేదాన్ని. వాటిని మోసుకొచ్చి మా కాలనీలో అమ్మితే రూ.20 వచ్చేవి. మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం, ఓ తమ్ముడు. ఇంత కష్టపడితే ఇప్పుడిçప్పుడే జీవితంలో స్థిరపడ్డాం. నేనెవరో కూడా జనానికి తెలియదు. అయితే జగనన్నను చూసి ఓట్లేసి నన్ను గెలిపించారు. ఇప్పుడు మేయర్‌ను చేశారు. ఇది నా జీవితంలో అస్సలు ఊహించలేదు. ప్రజలకు నమ్మకంగా ఉండి.. పార్టీకి మంచిపేరు తీసుకొస్తాను’’ అని తెలిపారు. చదవండి: మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్ రాయచోటి మున్సిపల్ చైర్మన్‌గా కూరగాయల వ్యాపారి -
మంత్రిని అభినందించిన సీఎం కేసీఆర్
సాక్షి, ఖమ్మం: నగర పాలక సంస్థ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ దృష్టి సారించింది. నగర ఓటర్ల మనోభావాలను తెలుసుకునేందుకు ఒక అడుగు ముందుకేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత గోప్యంగా చేయించిన అంతర్గత సర్వే అనుకూలమని తేల్చినట్లు తెలుస్తోంది. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ వశమైన నగర పాలక సంస్థ.. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ ఖిల్లాపై పట్టు సాధించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ఇక సిట్టింగులు.. కొత్త ముఖాలు.. అసంతృప్తి ఉన్న ప్రాంతాలేమిటనే అంశాలపై పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 50 డివిజన్లకు.. 34 డివిజన్లలో విజయం సాధించింది. నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుంది. అయితే త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు ప్రతి డివిజన్లో సర్వే చేసిన బృందం అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. ప్రతి డివిజన్లో 170 నుంచి 180 మందిని కలిసి.. ఇలా 8,754 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ప్రభుత్వ పనితీరు, నగరాభివృద్ధిపై ప్రజల్లో సానుకూలత, కొన్నిచోట్ల కార్పొరేటర్ల పనితీరుపై నెలకొన్న అసంతృప్తి సైతం వెల్లడైనట్లు తెలుస్తోంది. 50 డివిజన్లకు.. 46 డివిజన్లలో టీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు సర్వేలో వెల్లడైందని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. అనేక చోట్ల కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉన్నట్లు సర్వే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే సర్వే ఫలితాలు పార్టీ అధినేత కేసీఆర్‌కు చేరడం, నగరంలో పార్టీ పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై చేసిన సర్వే గురించి సీఎం కేసీఆర్.. మంత్రి అజయ్‌తో ఫోన్లో ప్రస్తావించి మెజార్టీ సీట్లు గెలుచుకోబోతున్నామని అభినందనలు తెలియజేసినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. దీంతో త్వరలో జరగనున్న నగర పాలక సంస్థ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే నగర కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో కొత్త ముఖాలకు సైతం పార్టీ తరఫున అవకాశం లభించనుంది. దాదాపు పది డివిజన్లు కొత్తగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత కార్పొరేటర్లలో పలువురు తిరిగి పోటీ చేసేందుకు అనాసక్తిగా ఉండటంతో వారి స్థానాల్లో ఎవరికి అవకాశం ఇస్తారనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం టీఆర్ఎస్ కార్పొరేటర్లు 42 మంది ఉన్నారు. ఇందులో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారు సైతం ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు ఇందుకోసం సమాయత్తమవుతున్నారు. ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల బాధ్యత టీఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యేగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై ఉండటంతో నగరంలో జరుగుతున్న అభివృద్ధితోపాటు సర్వేకు తగ్గ ఫలితాలు వచ్చేలా డివిజన్లవారీగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం డివిజన్లవారీగా ప్రజాదరణ కలిగిన నాయకులు, సమస్యలపై అవగాహన ఉన్న నేతలకు సంబంధించి పార్టీ వివిధ రూపాల్లో అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. నగరంలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడంతోపాటు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీ ప్రాతినిధ్యం వహించని డివిజన్లలో ఎవరిని రంగంలోకి దించాలనే అంశంపై పార్టీ ఇప్పటికే దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి డివిజన్ నుంచి పది మందికి పైగా ఆశావహులు కార్పొరేటర్లుగా రంగంలో ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
నా పదవికి న్యాయం చేస్తా: యానాదయ్య
సాక్షి, కడప (వైఎస్సార్ జిల్లా): సామాన్య కార్యకర్త అయిన తనకు రాష్ట్ర చైర్మన్ పదవి దక్కడం పట్ల నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల ఆర్థిక, సామాజిక లబ్ది కోసం 56 బీసీ కులాల వారికి లబ్ది చేకూరేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడం గర్వించదగ్గ విషయమని ప్రశంసించారు. తోకలు కట్ చేస్తాం, తాట తీస్తాం అన్న సచివాలయంలోనే తల ఎత్తుకుని తిరిగేలా సీఎం వైఎస్ జగన్ తమకు పదవి ఇచ్చారని అన్నారు. (చదవండి: 56 బీసీ కార్పొరేషన్లు – చైర్మన్ల వివరాలు) తన పదవికి తప్పకుండా న్యాయం చేస్తానని, నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీయిచ్చారు. తనపై విశ్వాసం ఉంచి పదవి ఇచ్చిన సీఎం జగన్‌కు ఆయన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ మేయర్ కొత్తమద్ది సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, జిల్లాలోని శాసనసభ్యులకు సహకరించిన నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. కాగా, యానాదయ్యను రాష్ట్రస్థాయి పదవిలో నియమించడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయీ బ్రాహ్మణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నాయీ బ్రాహ్మణ చైర్మన్ పేరు: సిద్దవటం యానాదయ్య విద్యార్హత: బిఏ పుట్టిన తేది: 01–07–1968 తల్లిదండ్రులు: రామయ్య, పిచ్చమ్మ భార్య: వెంకటసుబ్బమ్మ పిల్లలు: శ్రీహరి, రెడ్డి వైష్ణవి స్వగ్రామం: అత్తిగారిపల్లె, పెనగలూరు (మండలం) రాజకీయ ప్రస్థానం: విద్యార్థి నాయకుడిగా ఉంటూ నాయీ బ్రాహ్మణ సంఘంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకూ 25 ఏళ్లు పనిచేశారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి అటు జిల్లాలో, రాష్ట్రంలో పలు ఉద్యమాలు చేశారు. 2009లో వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప పార్లమెంటుకు పోటీ చేసే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
పబ్జీ బ్యాన్ : పబ్జీ కార్పొరేషన్ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం పబ్జీ సహా 118 చైనా యాప్స్‌ని నిషేధంతో ఆందళనలో పడిన పబ్జీ ఫాన్స్ కు భారీ ఊరట లభించనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో పాపులర్ బ్యాటిల్ రాయల్ గేమ్ పబ్జీ మొబైల్ మళ్లీ దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి పరిణామాల దృష్ట్యా పబ్జి మొబైల్, పబ్జి మొబైల్ లైట్ గేమ్‌లకు పబ్లిషింగ్ హక్కులను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని, ఇకపై చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పింది. (ఇండియన్ పబ్జీ...ఫౌజీ వచ్చేస్తోంది!) ఇండియాలో పబ్జీ రద్దుపై ఈ గేమ్ రూపకర్త సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ పబ్జి కార్పొరేషన్ తాజాగా స్పందించింది. పబ్జీ మొబైల్ వర్షన్‌ను ప్రమోట్ చేస్తున్న చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ కంపెనీతో సంబంధాలను తెగ తెంపులు చేసుకుంటోంది. నిషేధం తదనంతర పరిస్థితిని గమనిస్తున్నామని వెల్లడించింది. ఇకపై పబ్జీ మొబైల్‌కు, టెన్సెంట్ గేమ్స్‌కు ఎలాంటి సంబంధం లేదని, పూర్తి బాధ్యతలు తమ ఆధ్వర్యంలోనే ఉంటాయని పబ్జీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. భారతీయ చట్టాలు, నిబంధనలను, ప్రభుత్వం చర్యలను పూర్తిగా గౌరవిస్తున్నామనీ, ఈ విషయంలో ఒక పరిష్కారం కోసం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని భావిస్తున్నామని ప్రకటించింది. తద్వారా యాప్‌పై నిషేధం తొలగిపోతుందని పబ్జీ కార్పొరేషన్ భావిస్తోంది. అయితే ఈ విషయంపై కేంద్రం ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా గత వారం భారతదేశంలో పబ్జీ నిషేధం తరువాత టెన్సెంట్ మార్కెట్ విలువ 34 బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు అంచనా. -
ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్: ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరా బాద్): ఏపీ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆయా కులాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఆదివారం బీసీ భవన్లో ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్, 12 బీసీ కులాల ఫెడరేషన్ల ద్వారా మూడేళ్ల క్రితం తీసుకున్న 5.77 లక్షల దరఖాస్తులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కోరారు. దరఖాస్తుదారులందరికీ రుణాలు మంజూరు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత వాటిని పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. వెంటనే రుణాలు మంజూరు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కాగా, ఏపీ ప్రభుత్వం ప్రతి బీసీ కులానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ చొప్పున 52 బీసీ కుల కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న 12 బీసీ కుల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. పాత ఫెడరేషన్లకు, కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. -
1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్
సాక్షి, హైదరాబాద్ : కీసర రెవెన్యూశాఖలో ఓ భారీ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భూరికార్డుల్లో పేర్లు మార్చడం, పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వడం కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామానికి చెందిన సర్వే నంబర్ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కోర్టులో కేసు నడుస్తున్నట్టు సమా చారం. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఓ వర్గానికి అనుకూలంగా రికార్డులు తయారుచేయడానికి తహసీల్దార్ రూ.2 కోట్ల లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏఎస్రావు నగర్‌లోని తన ఇంటివద్ద మొదటి విడతగా రూ.కోటీ 10 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాంపల్లి దాయర గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డి, వరంగల్‌కు చెం దిన శ్రీనాథ్ యాదవ్‌తోపాటు రాంపల్లి వీఆర్ఏ సాయిరాజ్ తహసీల్దార్‌కు సహకరించినట్లు సమాచారం. ఈ ముగ్గురినీ కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగరాజుతోపాటు ఆయన బంధు వుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తొలినుంచీ అవినీతి ఆరోపణలే.. తహసీల్దార్ నాగరాజుపై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూకట్పల్లి నుంచి కీసరకు బదిలీపై వచ్చిన ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన నాగరాజును నిలదీశారు. కాగా, ఇటీవల కీసర మండలంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ విభాగంలో ఉన్న లోసుగులను అడ్డుపెట్టుకొని తమ కార్యాలయాలకు వచ్చే వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలక అధికారి విల్లా బహుమతి.. రెవెన్యూశాఖలో టైపిస్ట్‌గా చేరిన నాగరాజు పదోన్నతిపై తహశీల్దార్‌గా ఎదిగాడు. మధ్యలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డాడు. అయినా.. రాజకీయ పలుకుబడి ఉపయోగించి తనపై ఉన్న కేసులను తొలగించుకున్నాడు. ఇప్పుడు తన లంచాల స్థాయిని ఏకంగా రూ.కోట్లకు పెంచుకున్నాడు. ఇటీవల మేడ్చల్ జిల్లాలోని ముగ్గురు తహశీల్దార్లు తమ అక్రమాల జోలికి రాకుండా.. ఓ కీలకాధికారికి రూ.కోట్లు విలువ జేసే విల్లాను కొనిచ్చారంటే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో, వీరు ఎంత పెద్ద అధికారినైనా ఎలా మేనేజ్ చేయగలరో అర్థం చేసుకోవచ్చు. సీఎం కార్యాలయం కన్నెర్ర.. కీసరలో ఏసీబీ దాడులపై సీఎం కార్యాలయం కూడా ఆరా తీసినట్లు సమాచారం. రెవెన్యూ అధికారుల విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం కేసీఆర్.. రెవెన్యూశాఖ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. -
కార్పొరేషన్లపై టీఆర్ఎస్ కన్ను
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలక మండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరున ముగియనుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పాలకమండళ్ల పదవీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చితో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో మూడు మున్సిపల్ కర్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. 2016 ఫిబ్రవరిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను 99 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో అదే స్థాయిలో ఫలితాలను సాధించేలా టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ మొదటిదశ పనులను ఈ ఏడాది అక్టోబర్‌లోగా పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. మరోవైపు జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల పనులకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ శంకస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపైనా దృష్టి వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిమిత్తం ఇప్పటికే పార్టీ నేతలను కేటీఆర్ అప్రమత్తం చేశారు. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో వరంగల్, ఖమ్మం నగర పర్యటనలను కేటీఆర్ వాయిదా వేసుకున్నారు. ఆ రెండు కార్పొరేషన్ల పరి ధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టాల్సిందిగా సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మె ల్యేలను ఆదేశించారు. అక్టోబర్ నాటికి అభివృద్ధికార్యక్రమాలను పూర్తి చేసి, తర్వాత పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి సారించేలా టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఆయా కార్పొరేషన్ల పరిధిలో డివిజన్లవారీగా పార్టీ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఇటీవల జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కేటీఆర్ సూచించినట్లు సమాచారం. దుబ్బాక బాధ్యతలు హరీశ్‌కే! దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ కార్యాలయం నోటిఫై చేసింది. దుబ్బాక ఉప ఎన్నికలు ఎప్పుడనేదానిపై స్పష్టత లేనప్పటికీ, పొరుగునే ఉన్న సిద్దిపేట సెగ్మెంట్‌కు చెందిన మంత్రి హరీశ్‌రావుకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. పార్టీ నేతలు, కేడర్ మధ్య సమన్వయంతోపాటు ఉపఎన్నికల కోణంలో పార్టీ యంత్రాంగాన్ని సం సిద్ధం చేసే బాధ్యత హరీశ్‌పై పెట్టినట్లు తెలిసింది. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలకు తావుండదు
ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. లంచాలకు తావు లేకుండా ఉద్యోగాలిస్తాం. నేరుగా వారి జీతాలు వాళ్లకే అందిస్తాం. సాక్షి, అమరావతి: ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వారి వేతనాలు వారికి పూర్తిగా చెల్లించడంతో పాటు.. ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా చేసేందుకే ఏపీ ఔట్సోర్సింగ్ సర్వీసుల కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఇంతకంటే పారదర్శకంగా, గొప్పగా ఎక్కడా ఉండదని, చాలా స్పష్టంగా మార్గదర్శకాల్లో రాస్తే ఎక్కడా లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్చార్జ్ మంత్రులను పెట్టి ఉద్యోగులను తీసేసే కార్యక్రమాలు చేస్తున్నామని నీచమైన ఆరోపణలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టినా విపక్ష సభ్యులు బురద చల్లుతున్నారని, ప్రతీది రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షం నిత్యం దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ.. అసత్యాలు చెబుతున్నారని, అందుకే ఈ అంశంపై ప్రివిలేజ్ మోషన్‌కు వెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అంశంపై మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఈ వ్యవస్థలో మార్పు కోసమే.. ‘‘ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడం కోసం లంచాలు, తర్వాత జీతాలు ఇవ్వాలంటే మాకింత ఇస్తేనే అంటూ వసూళ్లు.. మొత్తంగా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ నష్టపోతున్న పరిస్థితి గత ప్రభుత్వంలో చూశాం. ఈ పేరుతో చివరకు గుళ్లలో శానిటేషన్ పనుల (క్లీనింగ్) కాంట్రాక్ట్ కూడా చంద్రబాబునాయుడు బంధువు భాస్కరనాయుడుకు ఇచ్చారు. మొత్తం మీద వాళ్లకు సంబంధించిన వాళ్లను పెట్టుకుని పూర్తిగా దోచేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈ వ్యవస్థ నడిపితే ఈ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే విధంగా మేం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం’’. -
‘బీపీఎస్’పై అధికారుల నిర్లక్ష్యం
పట్టణంలో ఓ చిరుద్యోగి తన తండ్రి నుంచి వచ్చిన స్థలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ప్లాన్‌కు విరుద్ధంగా కొంత నిర్మాణం జరిగింది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)లో రెగ్యులరైజ్ చేయించుకునేందుకు ఓ సారి దరఖాస్తు చేశాడు. అయితే ఆ దరఖాస్తును పక్కన పెట్టేశారు. మళ్లీ రెండోసారి దరఖాస్తు చేశారు. అయినా పట్టించుకోలేదు. చివరకు ఓ మాజీ ప్రజాప్రతినిధి ద్వారా బేరసారాలకు దిగాడు. చేద్దాం.. చూద్దాం అంటూ బదులిస్తున్నారు. ఈ సమస్య.. ఈ ఒక్క చిరుద్యోగిదే కాదు.. జిల్లా వ్యాప్తంగా బీపీఎస్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి పైగా ఇదే పరిస్థితి. జిల్లాలో అందిన దరఖాస్తుల్లో 12 శాతానికి మించి పరిష్కారానికి నోచుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యనికి నిదర్శనం. సాక్షి, మచిలీపట్నం : బీపీఎస్ పథకం కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఆదాయం సమకూర్చే ఓ సాధనం. అయితే ఈ పథకంపై జిల్లాలో ఆయా సంస్థల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా అందుతున్నా.. పరిష్కారమవుతున్న సమస్యలు బహుస్వల్పంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు విడుదలయ్యే గ్రాంట్స్‌లో కేంద్రం ఏటా వివిధ కారణాలు చూపి కోతలు విధిస్తోంది. ఈ తరుణంలో ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ఉద్దేశించిన బీపీఎస్ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది కొరత సాకుతో టౌన్ ప్లానింగ్ విభాగం బీపీఎస్ దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుండడంతో ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బీపీఎస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక సంస్థలు మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించుకునే వెసులుబాటు ఉంది. అయినా సరే తమకేమి పట్టనట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. చివరకు కమిషనర్లు కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కేవలం కమిషనర్ సంతకం కోసం జిల్లా వ్యాప్తంగా 600కు పైగా దరఖాస్తులు ఎదురు చూస్తుండడం ఇందుకు నిదర్శనం. కొన్ని చోట్ల ఒక్కో పనికి ఒక్కో రేటు బిల్డింగ్ పీనలైజ్ స్కీమ్ (బీపీఎస్) కింద రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం జనవరిలో అవకాశమిచ్చారు. ఇందుకోసం ఆగస్టు 31వ తేదీ గడువు విధించింది. గడువు ముగిసే నాటికి సీఆర్డీఏ పరిధితో çసహా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాల్టీల్లో 8,321 దరఖాస్తులు అందాయి. వాటిలో ఇప్పటి వరకు 980 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించడం ఈ పథకం పట్ల ఏ స్థాయిలో నిర్లక్ష్యం తాండవిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 20 దరఖాస్తులను తిరస్కరించగా, 6,689 దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని చెబుతున్నారు. కాగా 623 దరఖాస్తులను కనీసం పరిశీలన కూడా చేయలేదు. ఇప్పటి వరకు పరిష్కరించిన దరఖాస్తుల ద్వారా జిల్లాలోని నగర, మున్సిపాల్టీలకు రూ.21 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా సీఆర్డీఏ పరిధిలో 3,875 దరఖాస్తులందగా వాటిలో రెగ్యులరైజ్ చేసినవి 447 మాత్రమే. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 3,008 దరఖాస్తులందగా, రెగ్యులరైజ్ చేసినవి 343 మాత్రమే. అత్యల్పంగా నందిగామలో 257 దరఖాస్తులకు కేవలం రెండు దరఖాస్తులను మాత్రమే పరిష్కరించగలిగారు. అయితే చేయి తడిపితే కానీ బీపీఎస్ దరఖాస్తులను పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. కొన్ని మున్సిపాల్టీల్లో ఒక్కో పనికి ఒక్కో రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీపీఎస్ కింద అందిన దరఖాస్తులు 8,321 ఇప్పటి వరకు పరిష్కరించినవి 980 వచ్చిన ఆదాయం రూ. 21 కోట్లు వివిధ దశల్లో ఉన్న దరఖాస్తులు 6,689 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టడం సరికాదు టౌన్ ప్లానింగ్‌లో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. కానీ దాన్ని సాకుగా చూపి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టడం సరికాదు. కమిషనర్లు బాధ్యతగా తీసుకుని వీటి పరిష్కారంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలి. – వైపీ రంగనాయకులు, ఆర్డీడీ, టౌన్‌ప్లానింగ్ విభాగం, రాజమండ్రి రీజియన్ -
ఒకటా మూడా?
సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీ, ముంబై తరహాలో హైదరాబాద్ మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తారా..? ఔటర్ లోపల ఉన్న 23 మున్సిపాలిటీలను ఇందులో విలీనం చేస్తారా...? మున్సిపాలిటీల వారీగా మంగళవారం తుది ఓటర్ల జాబితా ప్రకటించిన నేపథ్యంలో మహానగరంలో మళ్లీ సస్పెన్స్ మొదలైంది.అయితే దీనిపై రాష్ట్ర నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం బుధవారం రాష్ట్ర కేబినెట్ భేటీలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. వాస్తవానికి పోలీస్ అవసరాల కోసం నగరాన్ని మూడు కమిషనరేట్లుగా విభజించగా, మున్సిపల్ పాలన మాత్రం జీహెచ్ఎంసీ కేంద్రంగానే కొనసాగుతోంది.శివారు ప్రాంతాలన్నీ మహానగరంలో కలిసిపోయినా మొన్నటి వరకు పంచాయతీలుగానే కొనసాగాయి. తాజా మార్పులతో పట్టణాలుగా అప్‌గ్రేడ్ అయి వచ్చే నెలారంభంలో ఎన్నికలకు సైతం సన్నద్ధం అవుతున్నాయి. నగరంలో కలిసిపోయిన ప్రాంతాలు గ్రామ పంచాయతీలుగా ఉన్న సమయంలో అక్రమ కట్టడాలు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలు భారీగా జరిగిపోవటంతో ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పెద్ద సమస్యగా మారిపోయింది. కోర్టు వివాదాలు సైతం భారీగానే పేరుకుపోయాయి. తాజాగా శివారు ప్రాంతాలను ఈ దఫా మున్సిపాలిటీలుగానే కొనసాగించి, వచ్చే ఐదేళ్ల తర్వాత జీహెచ్ఎంసీలో విలీన ప్రతిపాదనలు ఉండగా, మరో వైపు ఔటర్ రింగు రోడ్డు లోపలి ప్రాంతాలన్నింటికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే గ్రేటర్లో విలీనం తప్పనిసరి అన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుండా మహానగరానికి ముఖద్వారాలుగా ఉన్న ప్రాంతాల్లో అడ్డదిడ్డమైన పాలన, రాజకీయ జోక్యం చోటు చేసుకుంటే భవిష్యత్‌లో కూడా వాటిని సరి చేయలేరన్న భావన వ్యక్తమవుతోంది. విలీనమైతే..మూడు కార్పొరేషన్లు ఇప్పటికే జలమండలి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలను విలీనం చేయాలన్న ప్రతిపాదనను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముందుకు తీసుకు రాగా, నగర శివారులోని 23 మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేస్తే మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే చాన్స్ కనిపిస్తోంది. వాటిని హైదరాబాద్, హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ వెస్ట్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి ఈ మూడు కార్పొరేషన్ల మధ్య సమన్వయం కోసం చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల కోసం బీసీ ఓటర్ల గణన, వార్డుల విభజన తదితర అంశాలు పూర్తి కావటంతో ఎన్నికలు నిలిపేయటం సాధ్యం కాకపోతే ఔటర్ రింగురోడ్డు లోపలున్న మున్సిపాలిటీలకు వచ్చే నెలారంభంలో ఎన్నికలు నిర్వహించటం ఖాయం కానుంది. -
పురపాలికల్లో ప్రత్యేక పాలన!
ఉమ్మడి జిల్లాలో గడువు ముగుస్తున్న పాలక మండళ్లు మునిసిపల్ కార్పొరేషన్లు : కరీంనగర్, రామగుండం మునిసిపాలిటీలు : హుజూరాబాద్, జమ్మికుంట, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి కొత్త మునిసిపాలిటీలు: మంథని, సుల్తానాబాద్, కొత్తపల్లి, చొప్పదండి, ధర్మపురి, రాయికల్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొత్త పురపాలక చట్టం రూపకల్పన ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో మునిసిపల్ ఎన్నికలు గడువులోగా జరిగే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ప్రస్తుతం కొనసాగుతున్న పాలక మండళ్ల గడువు జూలై 2తో ముగుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని పంచాయతీ, పార్లమెంటు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియ రాష్ట్రంలో ముగిసిపోయినప్పటికీ, కేవలం మునిసి‘పోల్స్’ మాత్రమే మిగిలాయి. ఇప్పుడున్న మునిసిపల్ చట్టం స్థానంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త పురపాలక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌లో పురపాలక శాఖ(ఎంఏయూడీ) ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజల నుంచి వచ్చిన సూచనలతో పాటు ప్రభుత్వం పొందుపరచనున్న అంశాల నేపథ్యంలో కొత్త మునిసిపల్ చట్టం రూపకల్పన పూర్తయి, ఉభయసభల ఆమోదం పొంది అమలులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో జూలై 2తో ముగుస్తున్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతోపాటు కొత్తగా ఏర్పాటైన పురపాలికలకు మరో ఆరునెలల వరకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని మునిసిపల్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2 కార్పొరేషన్లు, 8 మునిసిపాలిటీలు జూలై 2న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండు మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు 8 మునిసిపాలిటీల పాలక మండళ్లకు గడువు ముగుస్తుంది. మేయర్లు, కార్పొరేటర్లు, మునిసిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు మాజీలు కాబోతున్నారు. కరీంనగర్, రామగుండం మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు హుజూ రాబాద్, జమ్మికుంట, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి పాలక మండళ్ల పదవీ కాలం వచ్చే నెల 2తో పూర్తి కాబోతున్నది. ప్రభుత్వ ఆలోచన ఇప్పటికే తెలియడంతో పాలక మండళ్ల సభ్యులు ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారు. తమ తమ ప్రాంతాల్లో మిగిలిపోయిన పనులను జనరల్ ఫండ్, స్పెషల్ ఫండ్ కింద పూర్తి చేసుకునే పనిలో మునిగిపోయారు. కొత్తగా ఆరు మునిసిపాలిటీలు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఉన్న 2 కార్పొరేషన్లు, 8 మునిసిపాలిటీలతోపాటు కొత్తగా ఆరు పురపాలికలు ఏర్పాటయ్యాయి. కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి, చొప్పదండి, పెద్దపల్లిలో మంథని, సుల్తానాబాద్, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, రాయికల్ మునిసిపాలిటీలుగా అవతరించాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పాతవాటితోపాటు కొత్త మునిసిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. పురపాలికలకు ప్రత్యేక అధికారులే జూలై 2తో పాలక మండళ్ల పాలన ముగుస్తుండడంతో 3వ తేదీ నుంచి అన్ని పురపాలికలు స్పెషల్ ఆఫీసర్ల పాలన కిందికి వెళ్లబోతున్నాయి. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల స్థాయిని బట్టి వాటికి ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమిస్తుంది. ఇప్పుడున్న కమిషనర్లనే ప్రత్యేకాధికారులుగా కొనసాగిస్తారా? లేక సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. కరీంనగర్ కార్పొరేషన్‌కు ఇటీవలే కొత్త కమిషనర్ ను నియమించారు. ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా వచ్చి ఉంటే రెండు బాధ్యతలు ఆయనే చూసుకునే వీలు ఉండేది. కానీ ప్రభుత్వం ఐఏఎస్‌ను నియమించలేదు. రామగుండం కార్పొరేషన్‌తోపాటు మిగతా మునిసిపాలిటీల్లో కొనసాగుతున్న కమిషనర్లను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
పట్నం.. ఇక నగరం!
ప్రాచీన పురపాలక సంఘం మచిలీపట్నం..ఇకపై నగరపాలకసంస్థ కానుంది. ఏళ్లుగాకలగానే మిగిలిన కార్పొరేషన్ హోదా త్వరలోనేనెరవేరనుంది. మూడేళ్ల క్రితం కార్పొరేషన్హోదా కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడినా..కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం మున్సిపాలిటీపాలకవర్గాల పదవీ కాలం కొద్ది రోజులుమాత్రమే ఉండటంతో అప్పట్లో వెలువడినఉత్తర్వుల ప్రకారం మున్సిపాలిటీ కార్పొరేషన్గారూపుదిద్దుకునేందుకు అడుగులు పడుతున్నాయి. జూలై 3వ తేదీ నుంచి కార్పొరేషన్గామార్చి పాలన సాగించేందుకు అవసరమైనఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు. సాక్షి,కృష్ణాజిల్లా, మచిలీపట్నం: మచిలీపట్నం 1886లో పురపాలక సంఘంగా రూపాంతరం చెందింది. 42 వార్డుల పరిధిలో 1.80 లక్షల జనాభా నివసిస్తున్నారు. బందరును నగరపాలక సంస్థగా పరిగణించాలని 2015 సెప్టెంబరు 29న ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో జారీ అయిన వారం రోజుల్లోనే మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్సిపల్ పాలకులు గడువు కంటే ముందే అంటే.. జీవో వచ్చిన మరుసటి రోజే కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించేశారు. అప్పుడే అందరూ బందరు కార్పొరేషన్ అయిపోయిందని భావించారు. నగరపాలక సంస్థ కావాలంటే 3 లక్షలకుపైగా జనాభా ఉండాలి. బందరులో ఆ మేరకు జనాభా లేదు. దీంతో మచిలీపట్నంకు పక్కనున్న గ్రామాలను సైతం విలీనం చేయాలని భావించారు. ఇవన్నీ చేయకుండా ఉంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనికి తోడు పాలకవర్గాలు కొలువుదీరి ఏడాదిన్నర కాలం కూడా గడవకుముందే మళ్లీ ఎన్నికలంటే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని గుర్తించిన ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల వరకు ఆగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీఓను పక్కనబెట్టేశారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం అధికారులు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా తీర్చి దిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. జూలై 3వ తేదీ నుంచి బందరు నగర పాలక సంస్థ కార్పొరేషన్ హోదాలో పాలన సాగించనుంది. అప్పుడలా.. బందరు కార్పొరేషన్‌గా రూపాంతరం చెందితే ప్రస్తుతం ఉన్న 42 వార్డుల స్థానంలో డివిజన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఒక్కో డివిజన్‌కు 6 వేల మంది జనాభా ఉండాలి. నగర పాలక సంస్థలో 50 డివిజన్లు ఉండాలి. కానీ ప్రస్తుతం పట్టణంలో 30 డివిజన్లు ఉన్నాయి. దీంతో అప్పట్లో బందరుకు సమీపంలో ఉన్న సుల్తానగరం, అరిశేపల్లి, గరాలదిబ్బ, పోతేపల్లి, మేకవానిపాలెం,పెడన మున్సిపాలిటీ, గూడూరు మండలంలోని కప్పలదొడ్డి, పోసినవారిపాలెం, ఆకులమన్నాడు, కోకనారాయణపాలెం, నారికేడలపాలెంలను బందరు కార్పొరేషన్లో విలీనం చేయాలనుకున్నారు. ఇప్పుడిలా.. ప్రస్తుతం విలీనం ప్రక్రియను పక్కనబెట్టి పట్టణాన్నే కార్పొరేషన్‌గా చేయాలని మున్సిపల్ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో పట్టణంలోని 42 వార్డులనే 50 డివిజన్లుగా రూపుదిద్దాలని అధికారులు భావిస్తున్నారు. కార్పొరేషన్ హోదాలోనే ఎన్నికలు.. మున్సిపాలిటీ పాలకవర్గ పదవీ కాలం జూలై 2తో ముగియనుంది. సార్వత్రిక ఎన్నికలు సైతం ఇప్పటికే ముగిశాయి. ఈ తరుణంలో కార్పొరేషన్ హోదాలో వచ్చే ఎన్నికలను నిర్వహించనున్నారు. రెండేసి వార్డులు కలిపేసి ఒక డివిజన్‌గా రూపుదిద్దనుండటంతో వార్డులకు అన్నీ తామై వ్యవహరిస్తున్న కౌన్సిలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 3 నుంచి కార్పొరేషన్ హోదా.. బందరు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ 2015లోనే ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పట్లో అభ్యంతరాలు రావడంతో సార్వత్రిక ఎన్నికల అనంతరం అమలు చేయాలని ఉత్తర్వులు అందాయి. దీంతో కార్యాచరణ ప్రారంభించాం. డివిజన్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదించాం. పట్టణంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఇవ్వాలని కలెక్టర్‌కు నివేదించాం. డివిజన్ల ఏర్పాటు, జనాబా వర్గీకరణ తదితర అంశాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తాం.–పీజే సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ -
కులవృత్తికి దన్ను
సాక్షి, తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): స్వర్ణకారులు.. వీరి పేరులో స్వర్ణం ఉన్నా జీవితాల్లో మాత్రం చీకట్లు అలముకున్నాయి. కార్పొరేట్ సంస్థల ఆగమం, రెడీమేడ్ వస్తువులకు గిరాకీ పెరగడంతో స్వర్ణకార వృత్తి రోజురోజుకూ తగ్గుతోంది. చేతినిండా పనిలేకపోవడంతో చాలామంది స్వర్ణకారులకు పూట గడవడటం కష్టంగా మారింది. వృత్తిపరంగానూ వీరు చాలా ఒడుదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కారుచీకట్లలో కాంతిరేఖలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కనిపిస్తున్నారు. స్వర్ణకారుల కష్టాలు దగ్గరనుంచి తెలుసుకున్న ఆయన విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఎందరో స్వర్ణకారుల దీనగాథలు తెలుసుకున్న ఆయన వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ హామీ వేలాది మంది స్వర్ణకారుల్లో ఆనందం నింపింది. కార్పొరేట్ మాయాజాలం, రెడీమేడ్ ఆభరణాలు మార్కెట్లోకి విరివిగా వస్తుండటంతో స్వర్ణకారుల కొలిమిలో నిప్పు రాజకోవడం గగనమైపోతుంది. బంగారు ఆభరణాల తయారీకి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. వస్తువులను మెరుగు పెట్టించుకునేందుకు వీరి వద్దకు వస్తుండటంతో చేతినిండా పనులు లేక పస్తువులు ఉంటున్నారు. కుటుంబ పోషణ, దుకాణాల అద్దెల చెల్లింపులు గగనమైపోతున్నాయి. వారి కష్టాలు తీర్చేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకుంటామని జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో స్వర్ణకారులకు కొండత భరోసా ఇచ్చినట్టయ్యింది. దీంతో వీరంతా రావాలి జగన్.. కావాలి జగన్ అని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో తామంతా మీవెంటే అని నినదిస్తున్నారు. కొండంత ధైర్యం వచ్చింది స్వర్ణకారులు అందరూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో స్వర్ణకారుల ఆవేదనను ఆయన విన్నారు. జగన్ ఇచ్చిన భరోసాతో మాలో ధైర్యం వచ్చింది. వైఎస్సార్ స్ఫూర్తితో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం. మేమంతా ఆయన వెంటే. –అకరిపల్లి మల్లికార్జున, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి ప్రజాసంకల్ప యాత్రలో మా కష్టాలు విన్న జగన్ విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మా ఎదుగుదలకు కృషిచేస్తానన్నారు. చాలా ఆనందంగా ఉంది. మేం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశంగా భావిస్తున్నాం. మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నాం. –ఆవుపాటి సాయిప్రశాంత్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం రుణ సదుపాయం వస్తుంది విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ వల్ల రుణ సదుపాయం వస్తుంది. ఆ«ధునిక యంత్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు తమ పరిస్థితిని పట్టించుకోలేదు. జగన్ మా సంఘీయులకు హామీ ఇవ్వడం సంతో షాన్ని కలిగిస్తుంది. స్వర్ణకారుల కష్టాలు తొలుగుతాయ ని నమ్ముతున్నాం. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. –పెట్ల రవిప్రసాద్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం యంత్రాలు సమకూర్చుకోవచ్చు విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇవ్వడం శుభపరిణామం. విశ్వ బ్రాహ్మణులు సమస్యల సుడిగుండంలో ఉన్నారు. కార్పొరేషన్ ఏర్పాటైతే ఆధునిక యంత్రాలు సమకూర్చుకోవచ్చు. మరింత నైపుణ్యం సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం కావచ్చు. –కొండెంపూడి శ్యామ్‌కుమార్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం విద్యుత్ రాయితీ ఇవ్వాలి స్వర్ణకారులకు విద్యుత్ రాయితీ విషయమై పరిశీలన చేస్తానని జగన్మోహన్రెడ్డి చెప్పడం సంతోషంగా ఉంది. విద్యుత్ చార్జీల్లో రాయితీలు ఇస్తే ఆర్థికంగా కొంతవరకు గట్టు ఎక్కుతాం. స్వర్ణకారుల కష్టాలు చాలావరకు తొలుగుతాయని నమ్ముతున్నాం. జగన్మోహన్రెడ్డి అ«ధికారంలోకి రావడం ద్వారా లబ్ధి తప్పక వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. –సమతాని జెమిని శ్రీనివాస్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం పని దొరకడం కష్టమైంది రెడీమేడ్ ఆభరణాలతో సంప్రదాయ స్వర్ణకారులకు పని దొరకడం లేదు. వరలక్ష్మి రూపులు కూడా రెడిమేడ్ వచ్చేశాయి. చిన్నపాటి పనులు తప్ప పెద్ద పని ఎవరూ ఇవ్వడం లేదు. జగన్ హామీలు మాకు భరోసా ఇచ్చాయి. –లక్కోజు ధర్మేష్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం -
శిక్షణతోనే సరి.. రాయితీలు మరి!
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి గాడి తప్పింది. నిరుద్యోగ యువతను ఉద్యోగావకాశాలకు ప్రత్యామ్నాయంగా స్వయం ఉపాధి రంగంవైపు ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన ఫైనాన్స్ కార్పొరేషన్ల లక్ష్యం అటకెక్కింది. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించిన ఆశావహులందరికీ రాయితీలిచ్చి సహకరిస్తామంటూ వార్షిక సంవత్సరం ప్రారంభంలో భారీ ప్రణాళికలు తయారు చేసిన వివిధ కార్పొరేషన్లు ప్రస్తుతం ముఖం చాటేశాయి. రాయితీలపై నోరుమెదపకుండా శిక్షణ కార్యక్రమాలతో సరిపెడుతున్నా యి. స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న వారికి చెయ్యిచ్చాయి. మరో నెలన్నరలో 2018–19 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. కనీసం దరఖాస్తుల పరిశీలన సైతం చేయకపోవడంతో అర్జీదారులు డీలా పడ్డారు. 10.25 లక్షల మంది ఎదురుచూపులు.. భారీ వార్షిక ప్రణాళికలు రూపొందించిన ఫైనాన్స్ కార్పొరేషన్లు గత రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా 10.25 లక్షల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. ఇందులో భాగంగా 2017–18 వార్షిక సంవత్సరం చివర్లో 7,59,788 మంది దరఖాస్తు చేసుకోగా... 2018–19 వార్షికం ప్రారంభంలో 2,65,375 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలిం చి లబ్ధిదారులను గుర్తించాలి. ఈక్రమంలో ముందు గా జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్ధారిస్తే... ఆమేరకు పరిశీలన చేపట్టి అర్హులను గుర్తిస్తారు. కానీ ఇప్పటివరకు జిల్లాల వారీ లక్ష్యాలను ఆయా ఫైనా న్స్ కార్పొరేషన్లు నిర్ధారించలేదు. ఇందుకు ప్రధాన కారణం ఫైనాన్స్ కార్పొరేషన్ల రాష్ట్ర వార్షిక ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదించకపోవడమే. సాధారణంగా ఫైనాన్స్ కార్పొరేషన్లు వార్షిక ప్రణాళికలను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే వాటికి ఆమోదం రావాల్సి ఉంటుంది. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు సమర్పించిన 2018–19 వార్షిక ప్రణాళికలను ప్రభుత్వం ఇప్పటికీ ఆమోదించలేదు. దీంతో ఆయా కార్పొరేషన్లు లబ్ధిదారుల ఎంపికను సైతం నిర్వహిం చలేదు. 2018–19 వార్షిక ప్రణాళికలకు ఆమోదం రాకపోవడం, గత దరఖాస్తులకు మోక్షం కలగని కారణంగా ఈ ఏడాది ఎస్టీ, బీసీ కార్పొరేషన్లతో పాటు బీసీ ఫెడరేషన్లు కనీసం దరఖాస్తులు సైతం స్వీకరిం చలేదు. ప్రస్తుతం కార్పొరేషన్ల వద్ద ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలంటే రూ.18,062.41 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఎంబీసీ కార్పొరేషన్ వద్ద అందుబాటులో ఉన్న రూ.250 కోట్ల నిధితో 17వేల మంది లబ్ధిదారులకు అధికారులు చెక్కులు సిద్ధం చేశారు. వీరంతా రూ.50 వేలలోపు యూనిట్లు పెట్టుకున్నవారే. కానీ ముందస్తు ఎన్నికలు రావడంతో ఇవికూడా జిల్లా కలెక్టరేట్ల వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. ‘ముందస్తు’తో ఆవిరైన ఆశలు.. 2017–18 వార్షికంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ తరువాతి ఏడాదిపైనే కార్పొరేషన్లు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఈక్రమంలో 2018–19 వార్షిక ప్రణాళికలను భారీగా తయారు చేసిన అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించారు. ఎన్నికల సీజన్ కావడంతో తప్పకుండా నిధులు వస్తాయని అన్నివర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ రెండో త్రైమాసికంలోనే ప్రభుత్వం ముందస్తుకు సిద్ధం కావడంతో నిరుద్యోగ యువతకు భంగపాటు తప్పలేదు. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో మరో రెండు నెలలపాటు కాలయాపన జరిగింది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు రానుండడంతో ఈసారి స్వయం ఉపాధికి రాయితీ రుణాలు కష్టమేనని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
అంతేగా.. అంతేగా!!
పటమట (విజయవాడ తూర్పు): పాలకులు పలుకుబడి... అధికారుల అండదండలుంటే చాలు నిబంధనలు బేఖాతర్ చేయవచ్చని.. అనుమతులకు చెల్లించాల్సిన చార్జీలను కూడా ఎగ్గోట్టోచ్చని విజయవాడ టీడీపీ నాయకులు, వీఎంసీ అధికారులు మరోమారు నిరూపించారు. నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక అధికారులు పాలకపక్షం నేతలు చెప్పింది తూచా తప్పకుండా పాటించటంతోపాటు వీఎంసీకి రావాల్సిన ఆదాయానికి గండికొట్టి తమ జేబులు నింపుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలిస్తున్న అధికారులు అసలు పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంటుందని ఆరోపణలు పెరుగుతున్నాయి. ఒకే నిర్మాణానికి వేర్వేరు బిల్డింగ్ ఇన్సెపెక్టర్లు పరిశీలనకు వెళ్లగా ఒక అధికారి తిరస్కరించిన ప్లాను, అనుమతిని మరో అధికారి మంజూరు చేయటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 14 శాతం ఓపెన్‌స్పేస్ చార్జీలను ఒక అధికారి సిఫారసు చేస్తే అదే భవనాకికి నామమాత్రపు చార్జీలతో అనుమతులు ఇచ్చేయటం ఇప్పుడు వీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. దీనికి నగరంలోని టీడీపీకి చెందిన ఓ యువనేత చక్రం తిప్పి అటు అధికారులకు, ఇటు నిర్మాణాదారులకు మధ్యవర్తిత్వం వహించి వీఎంసీకి సమకూరాల్సిన సొమ్ముకు గండికొట్టారు. వివరాల మేరకు .. బెంజిసర్కిల్ వద్ద కళానగర్‌లో 2018 నవంబర్ 440 గజాల స్థలంలో సిల్టు, జీప్లస్3 నిర్మాణానికి అనుమతి కావాలని వీఎంసీకి దరఖాస్తు వచ్చింది. దీన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు బిల్డింగ్ ఇన్సెపెక్టర్ వశీంబేగ్ వెళ్లారు. సంబంధిత ఆస్తికి చెందిన దస్తావేజులు, పన్ను చెల్లింపుల రసీదుల పరిశీలనలో భవన నిర్మాణ అనుమతికి సంబంధించి కేవలం 1999ల నుంచి పన్నులు చెల్లిస్తున్నట్లు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పరిశీలనలో తేలటంతో ఈ ఆస్తికి 14 శాతం ఓపెన్‌స్పేస్ బెటర్మెంట్ చార్జీలు అప్లై అవుతుందని నివేదిక ఇచ్చారు. ఆ చార్జీలు చెల్లించిన తర్వాతే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. బెటర్మెంట్ చార్జీలు చదరపుగజానికి రూ. 60,500 చొప్పున 440 చదరపు గజాలకి 14 శాతం చొప్పున 37.26 లక్షలు వీఎంసీకి చెల్లించాల్సి వచ్చింది. దీంతో సదరు భవన నిర్మాణదారులు భవన నిర్మాణ అనుమతి దరఖాస్తును విత్‌డ్రా చేసుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ పనులు జరిగినా అధికారులు ఇటువైపు కన్నెతి చూడలేకపోయారు. అయితే ఈ ఏడాది జనవరి 10వ తేదీన సంబంధిత భవనానికి సిల్టు, జీప్లస్ 4 నిర్మాణానికి మళ్లీ వీఎంసీకి దరఖాస్తు అందింది. మళ్లీ క్షేత్రస్థాయి పరిశీలనకు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రాం కుమార్ వెళ్లటంతో సంబంధిత భవన నిర్మాణదారులు టీడీఆర్ (టాన్స్‌ఫర్‌బుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లు సమర్పించి దరఖాస్తు చేసుకోవటంతో అధికారులు భవన నిర్మాణానికి నామమాత్రపు చార్జీలు రూ. 1.6 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని సిఫారసు చేయటంతో వీఎంసీ అధికారులు అనుమతిని యధేచ్ఛగా ఇచ్చేశారు. అయితే ముందు జరిగిన పరిశీలనలో ఉన్న 14 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలను అధికారులు కన్పించకుండా మాయచేసి అనుమతులు ఇచ్చేవారని, దీనికి నగరంలోని టీడీపీలో కీలకంగా ఉన్న ఓ యువ నాయకుడు చక్రంతిప్పి అటు నిర్మాణదారులకు, ఇటు అధికారులకు సమన్యాయం చేశారని సమాచారం. పరిశీలించాల్సి ఉంది దీనిపై పరిశీలన చేయాల్సి ఉంది. భవన నిర్మాణదారులు 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించారా లేదా అనేది పరిశీలించి చెల్లించకపోతే చర్యలు తీసుకుంటాం.- లక్ష్మణరావు, సిటీ ప్లానర్ -
సబ్‌ప్లాన్ పనులకూ.. అధికార చీడ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతలు ఏ పనులనూ వదలడం లేదు. అన్నీ తమకే అప్పగించాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, మురికి కాలువలు వంటి పనులకు పిలిచిన టెండర్లను తెరవొద్దంటూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో టెండరు గడువు పూర్తయి సుమారు నెల రోజులు కావస్తున్నా వాటిని కర్నూలు కార్పొరేషన్ అధికారులు తెరవడం లేదు. తన వారికి దక్కలేదన్న కారణంగా అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో టెండర్లు తెరవడం లేదని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి కోట్లాది రూపాయల విలువైన పనులకు సకాలంలో టెండర్లు పిలవలేదంటూఏకంగా మునిసిపల్ డైరెక్టర్ రద్దు చేసినప్పటికీ వ్యవహారంలో మాత్రం మార్పు రావడం లేదు. మునిసిపల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సుమారు రూ.4.5 కోట్లతో మూడు వేర్వేరు టెండర్లను ఈ ఏడాది జూలై 21న పిలిచారు. వీటికి బిడ్లు సమర్పించే గడువు ఆగస్టు 13తో పూర్తయ్యింది. ఈ టెండర్లలో పలు సంస్థలు పాల్గొన్నాయి. అయితే, అధికార పార్టీ నేతకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి దక్కలేదనే కారణంగా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి మరీ టెండర్లు తెరవకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధులు వెనక్కి వెళుతున్నా... ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పనులకు సంబంధించిన టెండర్లను త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో సబ్‌ప్లాన్ నిధులను సకాలంలో ఖర్చు చేయలేదన్న కారణంతో వెనక్కి తీసుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్ల మేర నిధులను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. జిల్లాలో కూడా రూ.20 కోట్ల మేర వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు కూడా రూ.4.5 కోట్ల పనులకు టెండర్లను పిలిచి 50 రోజులకు పైగా అయ్యింది. బిడ్లను సమర్పించి కూడా నెల రోజులు కావస్తోంది. అయినప్పటికీ టెండర్లను మాత్రం తెరవడం లేదు. అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో అధికారులు కిమ్మనకుండా ఉండిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సబ్‌ప్లాన్ పనులకు సంబంధించిన టెండర్లు ఆలస్యం కాకుండా చూడాలని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కర్నూలు కార్పొరేషన్లో మాత్రం అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో గడువు ముగిసినా టెండర్లను తెరవని పరిస్థితి నెలకొంది. రంగంలోకి ఇతర కాంట్రాక్టర్లు! సబ్‌ప్లాన్ టెండర్లను తెరవకపోవడంతో కొద్ది మంది మునిసిపల్ కాంట్రాక్టర్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సదరు నేత వద్దకు వెళ్లి.. టెండర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయినప్పటికీ ఆ నేత ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. టెండరులో పనులు దక్కే కాంట్రాక్టర్‌ను మీ వద్దకు తీసుకొస్తామని పేర్కొన్నప్పటికీ అంగీకరించలేదని సమాచారం. కేవలం తన మనుషులకు మాత్రమే పనులు దక్కించుకునేందుకు ఈ విధంగా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వెంకటగిరి మున్సిపాలిటీలో తెలుగుతమ్ముళ్ల చేతివాటం
-
కుదుంబ బృందం
కోళికోద్.. ఒకప్పటి కాలికట్. అరేబియా తీరం. వాస్కోడిగామా సముద్రమార్గాన ఇండియాకి చేరింది ఇక్కడే. కేరళలోని ఓ జిల్లా కేంద్రం ఇది. ఈ కోళికోద్ ఇప్పుడు మళ్లీ ఓ చరిత్రకు శ్రీకారం చుట్టింది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఓ షాపింగ్ మాల్‌ను కట్టింది కోళికోద్ కార్పొరేషన్. కుదుంబశ్రీ బజార్ ప్రాజెక్ట్ పేరుతో అర ఎకరా స్థలంలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌ను కట్టింది. ఈ ఐదంతస్తుల భవనంలో ఉన్న అన్ని షాపులనూ మహిళలకే అద్దెకిస్తారన్నమాట. అంటే మహిళలు స్థాపించిన పరిశ్రమలు, వ్యాపారాలకే ఈ దుకాణాలు. ఈ ప్రాజెక్టు ఇచ్చిన భరోసాతో కేరళ మహిళలు కుదుంబశ్రీ (కుటుంబశ్రీ) పేరుతో సంఘటితమయ్యారు. పదిమంది నుంచి పదిహేను మందితో చిన్న చిన్న బృందాలయ్యారు. తమకు ఆసక్తి ఉన్న పనుల్లో నైపుణ్యం సాధించి వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు సూపర్‌మార్కెట్, ఫుడ్కోర్ట్, కిడ్స్ పార్క్, స్పా, బ్యూటీపార్లర్, ఉమెన్స్ బ్యాంక్, ఫ్యాన్సీ స్టోర్, టెక్స్టైల్స్, రెడీమేడ్స్, బొటిక్, ఫుట్‌వేర్, డ్రై క్లీనింగ్, కార్ వాషింగ్, ఆప్టికల్ స్టోర్, హ్యాండీ క్రాఫ్ట్స్, బేబీ కేర్, హోమ్ అప్లయెన్సెస్, బుక్‌స్టాల్స్.. ఇలా అన్నిట్లో అడుగుపెట్టారు. దాదాపుగా అన్నీ చిన్న తరహా వ్యాపారాలే. తక్కువ పెట్టుబడితో ఆర్థిక స్వావలంబన సాధించడానికి ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటులో భాగం ఇది. కుదుంబశ్రీ బృందాలు మన దగ్గర ఉన్న సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల వంటివి. వీరిలో కొంతమంది వ్యక్తిగతంగా, మరికొందరు బృందంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. తమ వ్యాపారాలతోపాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహణ బాధ్యత కూడా ఈ మహిళలే చూసుకుంటారు. ఈ మాల్ మొత్తం ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ల కోసమే. కుదుంబశ్రీ సభ్యులకు దుకాణాల అద్దె పదిశాతం తగ్గుతుంది, ఈ బృందంలో సభ్యులు కాని మహిళలకు అద్దెలో రాయితీ ఉండదు. ఈ మాల్లో కాన్ఫరెన్స్ రూమ్‌లు, ట్రైనింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కేరళ మహిళలు అక్షరాస్యతలో మిగిలిన రాష్ట్రాలకంటే ముందున్నారు, ఉద్యోగాల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారు. వ్యాపార రంగంలో కూడా ముందంజలో ఉండడానికి ప్రభుత్వం ఇస్తున్న సహకారమిది. – మంజీర -
కార్పొరేషన్లకు సభ్యుల నియామకం
అమరావతి: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు సభ్యులను నియమిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో కార్పొరేషన్‌కు నాలుగు నుంచి ఆరుగురు వరకు సభ్యులను నియమించారు. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ ఇర్రిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ గ్రంధాలయ సంస్థ, ఏపీ షీప్ అండ్ గోట్ ఫెడరేషన్లకు సభ్యులను కేటాయించారు. ఎన్నికలు దగ్గర సమయంలో టీడీపీలో అసంతృప్తులను చల్లబరిచేందుకు కార్పొరేషన్ల నియామకం చేపడుతోన్నట్లు కనిపిస్తోంది. -
పుట్టి ముంచుతున్న ప్రాజెక్టులు
కార్పొరేషన్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.. ఆదాయ వనరులు పెరగడం లేదు. పోనీ.. చేస్తున్న ఖర్చులైనా సక్రమంగా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. ఏదో ఒక ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడం.. నచ్చిన సంస్థకు ఆ ప్రాజెక్టుని అప్పగించడం.. జీవీఎంసీ ఖజానా నుంచి కోట్ల రూపాయలు కట్టబెట్టడం. గత మూడేళ్లుగా ఇదే తంతు. ఇలాగైతే.. కార్పొరేషన్ పుట్టి మునిగిపోవడం ఖాయం. చివరికి ప్రజలకు కచ్చితంగా ఉపయోగపడే పని ఏదైనా చెయ్యాలంటే ఒక్క రూపాయీ మిగలదేమో..! – ఇటీవల ఓ జీవీఎంసీ అధికారి అన్న మాటలివి.. ఆయన మాటల్లో కించిత్తయినా అవాస్తవం లేదు. ప్రస్తుతం జీవీఎంసీలో జరుగుతున్న తీరును పూసగుచ్చినట్లు చెప్పారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో పైసా పైసా కూడబెట్టుకొని మహా నగరాన్ని అభివృద్ధి చేస్తున్న నగరపాలక సంస్థ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల అప్పుల పాలవుతోంది. స్మార్ట్ సిటీ, అమృత్ నగరమంటూ ప్రకటించి.. పప్పుబెల్లాలు చేతికిచ్చి మిగిలిన సొమ్ము పెట్టుబడి పెట్టి చేస్తున్న ప్రాజెక్టులు ఖజానాను ఊడ్చేస్తున్నాయి. తాజాగా.. హైబ్రిడ్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్రాజెక్టు కూడా అదే కోవలోకి వస్తోంది. అసలే అప్పుల్లో ఉన్న నగరంపై అదనంగా రూ.150 కోట్ల భారం వేస్తోంది. విశాఖ సిటీ : మహా విశాఖ నగర పాలక సంస్థకు కొత్త ప్రాజెక్టులు తలబొప్పి కట్టిస్తున్నాయి. అరకొర నిధులు మంజూరు చేసి మిగిలిన మొత్తాన్ని కార్పొరేషన్ భరించుకొని పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాలను ఆధునికీకరణ, స్వచ్ఛత పేరుతో స్మార్ట్‌సిటీ, అమృత్ వంటి పథకాలు ప్రవేశపెట్టింది. వీధులు సర్వాంగ సుందరంగా, నగరంలోని ఓ ప్రాంతం సాంకేతిక రూపు సంతరించుకునేలా స్మార్ట్‌సిటీ, నగరాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఉద్యానవనాల పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాలను ప్రవేశపెట్టింది. పేరుకే కేంద్ర ప్రభుత్వ పథకాలైనా.. ఖర్చులో సింహభాగం కార్పొరేషన్‌దే కావడం గమనార్హం. ఈ పథకాల కారణంగానే జీవీఎంసీ ఖజానా ఖాళీ అవ్వడం ప్రారంభమైంది. అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 33.33 శాతం నిధులు మా త్రమే అందిస్తుంది. అంటే అమృత్ పథకం కింద జీవీఎంసీ పరిధిలో రూ.250 కోట్లు పనులు చేపట్టాలని టెండర్లు ఖరారు చేశారు. అయితే ఇందులో కేంద్రం ఇచ్చేది రూ.83 కోట్లు కాగా, జీవీఎంసీపై రూ.167 కోట్ల భారం పడుతోంది. సివరేజ్... గ్రేటర్ నిధులు బ్రేవ్ జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా 2007లో రూ.244 కోట్ల అంచనాతో 320 కిలోమీటర్ల పొడవునా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (యూజీడీ) వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటిని అనుబంధంగా కార్పొరేషన్ పరిధిలో ఉత్పన్నమయ్యే మురుగునీటిని శుద్ధి చేసేందుకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. నరవలో 108 ఎంఎల్డీ సామర్థ్యంతో అతిపెద్ద ఎస్టీపీ నిర్మాణం పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు 50 శాతం మా త్రమే పూర్తయ్యాయి. మరోవైపు.. ఈ సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు నిర్వహణకు జీవీఎంసీ తల ప్రాణం తోకకొస్తోంది. వీటికి విద్యుత్ సరఫరా కోసం హెచ్‌టీ పవర్ సప్లై అవసరమవుతోంది. నిర్వహణ వ్యయం తడిసి మోపెడై కార్పొరేషన్ ఖజనాను ఖాళీ చేసేస్తోంది. జీవీఎంసీ నెత్తిన హైబ్రిడ్ ఎస్టీపీ శఠగోపం ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లతోనే సతమతమవుతున్న కార్పొరేషన్‌కు తాజాగా ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసిన మరో హైబ్రిడ్ ఎస్టీపీ ప్రాజెక్టు గుదిబండలా మారనుంది. రూ.762 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్లాంటు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో తొలి విడతగా రూ.412కోట్లతో పెందుర్తిలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నరవలో సగం పనులు పూర్తయిన ఎస్టీపీని ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేయాలని కార్పొరేషన్ భావిస్తోంది. రూ.412 కోట్లలో రూ.150 కోట్లు జీవీఎంసీ భరించాల్సింది. అప్పోసొప్పో చేసి ప్లాం టు పూర్తి చేసిందే అనుకున్నా.. ఈ భారీ ఎస్టీపీ నిర్వహణ ఖర్చుల మోత మోగిపోనుంది. ఈ హైబ్రిడ్ సివరేజ్ ట్రీ ట్మెంట్ ప్లాంట్ నిర్వహణకు ఏడాదికి రూ.100 కోట్లు అ య్యే అవకాశముందని జీవీఎంసీ అంచనా వేస్తోంది. అప్పుల ఊబిలోకి వెళ్లే ప్రమాదం ఈ ప్రాజెక్టులు ప్రారంభించాలంటే కార్పొరేషన్ అప్పుల బాట పట్టాల్సిందే. కొన్నేళ్లుగా ఆదాయ వనరులు పెరగకపోవడంతో... ఉన్న వాటితోనే సర్దుకుపోతున్న పరిస్థితి. రెండేళ్ల క్రితం వరకూ రూ.400 కోట్లు అప్పుగా ఉండగా.. ప్రస్తుతం వాటిని సగం మేరకు తీర్చేశారు. మిగిలిన రూ.198 కోట్లను చెల్లించేందుకు మూడు నెలలకోసారి రూ.3 నుంచి 4 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మిగిలిన జేఎన్ఎన్యూఆర్ఎం పనులు పూర్తి చేసేందుకు రూ.75 కోట్లు అప్పు తీసుకునేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఇటీవలే జీవీఎంసీ అధికారులు లేఖ రాశారు. మరోవైపు.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో రూ.100 కోట్ల 14 వఆర్థిక సంఘం నిధుల్నీ కేంద్రం నిలిపేసింది. ఇవి వస్తాయన్న దీమాతో అభివృద్ధి పనులు పూర్తి చేసిన కార్పొరేషన్.. ఇప్పుడు దిక్కులు చూస్తూ.. జనరల్ ఫండ్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించింది. జీవీఎంసీకి వచ్చే ఆదాయ వనరుల్లో ప్రధానంగా ఉండే ఆస్తి పన్ను రూ.200 కోట్లు ఉద్యోగుల జీతాలకు సరిపోతున్నాయి. టౌన్ ప్లానింగ్ నుంచి రూ.100 కోట్లు, నీటి సరఫరా నుంచి సుమారు రూ.50 కోట్లు ఆదాయం వస్తున్నా.. సాధారణ పనులకు సరిపోతున్నాయి. 2007 నుంచి ఆస్తి పన్నుని, 2012 నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజుల్ని పెంచలేదు. వీటిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని నిరోధిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రెండేళ్లలో గ్రేటర్ మళ్లీ రూ.400 కోట్ల అప్పుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితే ఎదురవుతుందని జీవీఎంసీ అధికారిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రజల అవసరాల కోసమే.. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులూ ప్రజల అవసరాల కోసమే చేపట్టాం. ప్రస్తుతం ఉన్న నిధులతో పనులు నిర్వహిస్తున్నాం. స్మార్ట్ సిటీ అన్నప్పుడు ఖర్చులు తప్పవు. ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక అవసరాలకు అమ్మగా వచ్చిన నిధులతో ప్లాంట్ నిర్వహణ జరుగుతుంది. నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ నిధులు ఖర్చు చెయ్యాలి. ప్రజలకు అన్ని సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉంది. – హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్ -
‘పుట్టా’కు టీటీడీ.. ‘వర్ల’కు ఆర్టీసీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు సీఎం చంద్రబాబు అధ్యక్షులను నియమించారు. టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్, ఆర్టీసీ చైర్మన్‌గా వర్ల రామయ్యను ఖరారు చేశారు. ఆ జాబితాను పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. కొద్దిరోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ సీఎం సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డికి స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి లభించింది. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి అప్పగించారు. -
‘సాగునీటి’కి మరో భారీ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సేకరణ కోసం మరో భారీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి సంయుక్తంగా ‘తెలంగాణ రాష్ట్ర వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్‌డబ్ల్యూఐసీ)’పేరిట కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిని సద్వినియోగం చేసుకొనేలా చేపట్టిన ప్రాజెక్టులకు భారీగా నిధులు అవసరమవుతున్న విషయం తెలిసిందే. దీంతో నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల వివిధ రుణ సంస్థలు, బ్యాంకుల నుంచి అవసరమైన మేరకు రుణాలు తెచ్చుకునేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయగా... తాజాగా మరో నాలుగు ప్రాజెక్టులకు కలిపి సంయుక్తంగా కార్పొరేషన్ ఏర్పాటుకు నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగే కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే రూ.25 వేల కోట్లు కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ)’ను ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్ ద్వారా మూడు విడతల్లో రుణ సమీకరణ చేసింది. ఆంధ్రాబ్యాంకు, విజయా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకుల ద్వారా మొత్తంగా రూ.24,780 కోట్ల రుణాలకు ఒప్పందాలు కుదరగా.. ఇప్పటికే రూ.6,299 కోట్ల మేర ఖర్చు చేశారు కూడా. తాజాగా దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల వ్యయాలు పెరగడంతో.. 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలనే లక్ష్యంతో రూ.9,423 కోట్లతో దేవాదుల ప్రాజెక్టును చేపట్టారు. అయితే ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు పెంచడంతో.. అంచనా వ్యయం రూ. 13,445.44 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకు రూ.8,800 కోట్ల వరకు ఖర్చు చేయగా.. మరో రూ.4,700 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. దీనికితోడు ఇటీవలే ప్రాజెక్టు పరిధిలో అదనపు నీటి నిల్వ కోసం కొత్త రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. 10.78 టీఎంసీల సామర్థ్యంతో రూ.3,300 కోట్లతో వరంగల్ జిల్లా ఘణపూర్ మండలం లింగంపల్లి వద్ద దాన్ని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అంటే దేవాదుల పూర్తికే రూ.8 వేల కోట్ల వరకు అవసరం కానున్నాయి. ఇక దేవాదుల దిగువన తుపాకులగూడెం బ్యారేజీని రూ.2,121 కోట్లతో చేపట్టగా.. మరో రూ.1,900 కోట్లు అవసరం. ఈ రెండు ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్ల మేర అవసరంకాగా.. రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రీ-ఇంజనీరింగ్‌తో.. ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రీఇంజనీరింగ్ చేయడంతో.. అంచనా వ్యయం రూ.7,926 కోట్ల నుంచి రూ.13,384 కోట్లకు పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో రూ.220 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. వచ్చే రెండేళ్లలో కనీసం రూ.7 వేల కోట్ల మేర పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఈ ప్రాజెక్టుకు ఏటా రూ.3,500 కోట్లు అవసరం. దీంతో ఈ ప్రాజెక్టునూ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చి.. రూ.8 వేల కోట్ల మేర రుణం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక వరద కాల్వ పనులను రూ.9,886 కోట్ల అంచనాతో చేపట్టగా.. ఇప్పటివరకు రూ.5,323 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.4,500 కోట్లు అవసరం కావడంతో దీన్ని కూడా కార్పొరేషన్ పరిధిలోకి చేర్చారు. మొత్తంగా నాలుగు ప్రాజెక్టులకు కలిపి రూ.20 వేల కోట్ల వరకు రుణాలను తీసుకోనున్నారు. -
రెండో హరిత విప్లవం లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరిట కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఇందులో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, శాఖ కమిషనర్ జగన్మోహన్, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయిలను డైరెక్టర్లుగా నియమించింది. కార్పొరేషన్‌కు రూ.200 కోట్లతో మూలధన నిధిని ఏర్పాటు చేసింది. ఇందులో గవర్నర్ పేరుతో రూ.199,99,99,300ను, మిగతా మొత్తాన్ని బోర్డు డైరెక్టర్ల పేరిట కేటాయించింది. అయితే కార్పొరేషన్‌కు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం.. చైర్మన్ పోస్టును ప్రస్తుతానికి ఖాళీగా ఉంచింది. చైర్మన్ నియామకంతోపాటు పలువురు జిల్లా సమన్వయ సమితి సభ్యులను డైరెక్టర్లుగా నియమించనున్నారు. ఈ పేర్లను తరువాత ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైతు సమన్వయ సమితి ఎండీగా వ్యవసాయ శాఖ కమిషనర్ కొనసాగనున్నారు. ఇవీ ప్రధాన మార్గదర్శకాలు.. ♦ రాష్ట్రంలో ప్రధానమైన వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలకు అనుగుణంగా పంట కాలనీలను ఏర్పాటు చేయాలి. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలి. ♦ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పండించిన ఆహార పదార్థాల సరఫరా. ♦ రైతు సమితుల సభ్యులకు శిక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు ఏర్పాటు చేయడం. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు పంపడం. ♦ సన్న, చిన్నకారు రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించి సాగు ఖర్చు తగ్గించడం. ♦ వ్యవసాయాభివృద్ధిలో సహకారం కోసం జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ఐకార్ వంటి సంస్థలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవడం. ఎప్పటికప్పుడు వారి సలహాలతో ముందుకు సాగడం. ♦ జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ, ఉద్యాన సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం. ♦ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం. ♦ సహకార సంఘాలను, రైతు శిక్షణ సంస్థలను/కేంద్రాలను బలోపేతం చేయడం. ♦ రాష్ట్ర గణాంక శాఖ/వ్యవసాయ, ఉద్యా నవర్సిటీల సహకారంతో ఏటా పంటల ఉత్పత్తిని అంచనా వేసి.. పంటల కొనుగోలుకు ఏర్పాట్లు చేయడం. ♦ రైతుల ఆదాయం పెంచేందుకు పంట కోతల అనంతర నష్టాలు తగ్గేలా చర్యలు చేపట్టడం. ఇందుకోసం ప్రాసెసింగ్, అదనపు విలువ జోడింపు వంటివి చేపట్టడం. స్థానిక అవసరాలకు అనుగుణంగా దిగుబడి సాధించడం. ♦ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదాములు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు. ♦ ప్రైవేటు పరిశ్రమలతో కలసి పీపీపీ పద్ధతిలో పనిచేయడం. వ్యాపారులు, ఇతర సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం. ♦ ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు కృషి. 30 జిల్లాలకు సంబంధించి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలకు సంబంధించి జిల్లా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఆయా జిల్లాల జాబితాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించిన అనంతరం.. ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కార్పొరేషన్ లక్ష్యాలు, ఉద్దేశాలివీ.. ♦ వ్యవసాయ రంగాన్ని వేగంగా అభివృద్ధిపర్చడం ♦ వివిధ పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం ♦ రాష్ట్రంలో రెండో హరిత విప్లవం తరహాలో కీలక అడుగు వేయడం ♦ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం ♦ కేంద్ర సంస్థలతో కలిసి ఆయా పంటలను కొనుగోలు చేయడం ♦ మార్కెట్లో మద్దతు ధర లభించనపుడు జోక్యం చేసుకుని మంచి ధర అందేలా చూడడం ♦ ఆహార పంటల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ చేపట్టడం ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించడం ♦ నాణ్యమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం ♦ అవసరమైతే సొంత ఔట్లెట్లను ఏర్పాటు చేయడం ♦ వ్యవసాయ, దాని అనుబంధ శాఖలతో కలసి పనిచేయడం -
పాలన గాడిన పడేనా..?
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో గాడితప్పిన పాలనను గాడిన పెట్టేందుకు ప్రక్షాళన మొదలైంది. కొన్నేళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నవారిని డిమోషన్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. రెండేళ్లుగా స్మార్ట్‌సిటీ సాధనపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన బల్దియా.. ఉద్యోగులను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సిబ్బంది ఆడిందే ఆటగా నడుస్తోంది. దీనికితోడు పలువురికి రాజకీయ అండదండలు ఉండడంతో ఎక్కడివారక్కడే పాతుకుపోయారు. పనిచేయకున్నా ఫరవాలేదనే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని, ఓడీఎఫ్‌గా గుర్తించబడిన నగరపాలక సంస్థలో ఉద్యోగుల పనితీరుపై దృష్టిసారించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడం, సదరు ఉద్యోగులు పలు ఆరోపణలు వంటివి అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో కమిషనర్ శశాంక బల్దియా పాలనను గాడిన పెట్టేందుకు కొరడా ఝుళిపిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఉద్యోగులను డిమోషన్ చేసి, కంప్యూటర్ ఆపరేటర్లను అంతర్గత బదిలీలు చేశారు. కాగా ఐదేళ్లుగా బిల్ కలెక్టర్లను, కంప్యూటర్ ఆపరేటర్లను కదిలించిన సందర్భాలు లేవు. కారణం.. ఉత్తర్వులు వెలువడకముందే రాజకీయ ప్రమేయంతో ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో సాహసోపేత నిర్ణయంతో పలువురు ఉద్యోగులపై చర్యలు చేపట్టారు. దీంతో బల్దియా కార్యాలయంలో పనిచేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఆర్ఐ, బిల్ కలెక్టర్లకు డిమోషన్ నగరపాలక సంస్థకు గుండెకాయలాంటి రెవెన్యూ విభాగంలో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవహించింది. ఇంటిపన్నుల వసూలు, అసెస్మెంట్లు, మోటేషన్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటికితోడు ఇంటిపన్నుల వసూళ్లకు కదలకపోవడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని పలుమార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులను మందలించినా.. మార్పు రాకపోవడంతో వేటుపడింది. మున్సిపల్లో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు క్లర్క్‌గా డిమోషన్ అయ్యారు. పన్నుల వసూలు విషయంలో నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయకుండా గతంలో షోకాజ్ నోటీసులు అందుకున్నా పనితీరులో మార్పు కనిపించని బిల్కలెక్టర్లు నర్సయ్య, శశికుమార్, ప్రణీత్, మల్లేశంను విధుల నుంచి తొలగించారు. అదే బాటలో నడుస్తున్న మరికొంత మంది రెవెన్యూ సిబ్బందిపై కూడా త్వరలో వేటు పడుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు కదిలిన సీట్లు కొద్ది సంవత్సరాలుగా ఆయా విభాగాల్లో పాతుకుపోయిన కంప్యూటర్ ఆపరేటర్ల సీట్లు ఎట్టకేలకు కదిలించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆపరేటర్లతోపాటు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఆపరేటర్లను సైతం అంతర్గత బదిలీలు చేశారు. ఆరోపణలు ఉన్నవారిని కాకుండా అందరినీ ఒకేగాటిన కట్టడంతో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఔట్సోర్సింగ్ ద్వారా నియామకమై ఒక సెక్షన్లో 15ఏళ్లుగా, మరో సెక్షన్లో 10 ఏళ్లుగా పనిచేస్తూ తమకు ఎదురులేదన్నట్లు ఉన్నవారికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గతంలో ఎంతమంది కమిషనర్లు అంతర్గత బదిలీలకు ప్రయత్నించినా రాజకీ య ఒత్తిడి మేరకు వెనక్కితగ్గారు. ఈసారి కూడా రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గుతారా..? ఉత్తర్వులకు కట్టుబడి ఉంటారా..? వేచి చూడాల్సిందే.. అధికారులపై చర్యలు లేవా..? నగరపాలక సంస్థలో చిన్న ఉద్యోగులపైనే కొరడా ఝుళిపిస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ... పలుమార్లు టెండర్ల రద్దుకు కారణమవుతున్న వారిపై, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ సెక్షన్లో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, వారిపై కూడా చర్యలు చేపట్టాలనే వాదనలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా బల్దియాలో ఆరంభమైన ప్రక్షాళన అవినీతి, నిర్లక్ష్యపు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. -
సహ‘కారమే’
పొత్తు తలనొప్పిగా మారిందా! ప్రచారానికి దూరంగానే బీజేపీ నాయకులు బోట్‌క్లబ్(కాకినాడ సిటీ) : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పేరుతో స్థానికంగా ఐక్యతా రాగం తీసినా ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. టీడీపీ నాయకులకు మద్దతుగా డివిజన్లో ప్రచారం చేసేందుకు బీజేపీ నాయకులు ససేమిరా! అంటున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ పథకాల్లో తమ వారు చెప్పిన వారికి ఒక్కరికీ కూడా ఏ పథకం అందకుండా చేసిన టీడీపీ నాయకులపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఎన్నికలు వచ్చే సరికి పొత్తు పేరు చెప్పి కలిసి పనిచేయడమంటే కుదరదని బీజేపీ నాయకులు తెగేసీ చెబుతున్నారు. తమను ఇప్పటి వరకు బద్ధవిరోధుల్లా చూసి ప్రస్తుతం మీ అవసరమ వచ్చిందని స్నేహగీతం పాడితే సరిపోతుందా? అని బీజేపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులపై మండిపడుతున్నారు. తాము సీట్లు ఆశించి భంగపడ్డామని, సీట్లు తమకు ఇవ్వకుండా టీడీపీ తమకు అన్యాయం చేసిందని ఇది మనస్సులో పెట్టుకుని వారితో ప్రచారం చేయడమెలా అన్ని ప్రశ్నిస్తున్నారు. ఆది నుంచి అంతే కాకినాడ నగరంలో టీడీపీ, బీజేపీ నాయకులు ఎప్పుడూ సఖ్యత లేదు. కేవలం పార్టీ అధిష్టానం పొత్తు రాగం పాడింది తప్ప, క్షేత్రస్థాయిలో ఇరుపార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడు పొసగలేదు. నగరంలో రెండు దేవస్థానాల్లో బీజేపీ నాయకులకు పాలకవర్గసభ్యులుగా నియమించినా టీడీపీ నాయకులు వారితో ప్రమాణస్వీకారం చేయించకుండా అడ్డుకున్నారంటే ఆ రెండుపార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు ఏమేరకు ఉన్నాయో వేరే చెప్పనవసరం లేదు. రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు బీజేపీ నాయకుల వైపు నిలబడినా వారిని ఆలయంలోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారు. నగరంలో బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో బీజేపీకి చెందిన కర్రి పాపారావును, జగన్నాథపురంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బీజేపీకి చెందిన కొక్కిలగడ్డ గంగరాజును పాలకవర్గ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా స్థానిక టీడీపీ నాయకులు బీజేపీ వారిని దరిచేరనీయలేదు. దీనికి తోడు నగరంలో కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ప్రధానమంత్రి ఆవాస్‌యోజన0 పథకంలో మంజూరైన 4608 ఇళ్ల మంజూరులో కూడా టీడీపీ నాయకులు పెత్తనమే చెల్లింది. కేంద్ర ప్రభుత్వ పథకమైనా బీజేపీ నాయకులు సిఫారసులు చేసిన వారికి ఒక్కరికీ కూడా ఇళ్లు మంజూరు చేయలేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తాము ఏ ముఖం పెట్టుకొని టీడీపీ నాయకులతో కలిసి ప్రచారానికి వెళ్లేది లేదంటూ బీజేపీ నాయకులు వద్ద ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. పొత్తు.. తలనొప్పిగా మారింది బీజేపీ, టీడీపీ పొత్తు ఇప్పుడు తలనొప్పిగా మారింది. టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్న డివిజన్లో బీజేపీ నాయకులు అటువైపు తొంగిచూడడం లేదు. అలాగే ఇటు బీజేపీకి కేటాయించిన తొమ్మిది డివిజన్లలోనూ టీడీపీ నాయకులు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకొని కలిసి పనిచేయడం చాలా కష్టమని ఇరుపార్టీ నాయకులు చెప్పకనే చెబుతున్నారు. -
కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సన్నద్ధం
- 1300 మంది సిబ్బంది నియామకం - మద్యం, డబ్బు పంపిణీ నిరోధానికి బృందాలు కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు నగరపాలక సంస్థ సర్వసన్నద్దమైంది. అభ్యర్థుల ప్రచారం ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా,నియమావళి, పోలింగ్ సహా వివిధ అంశాల్లో విధులు నిర్వర్తించేందుకు సుమారు 1300 మంది సిబ్బందిని నియమించారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెట్ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి గురువారం ఉత్తర్వులు కూడా పంపారు. దాదాపు 196 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించేందుకు పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థ యంత్రాంగం కసరతు చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరో వైపు ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ నిరోధానికి ప్లైయింగ్స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. ఇక కొత్తగా నియమించే జోనల్ అధికారులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి న్యాయశాఖ ఆమోదానికి పంపారు. ఇక ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఈ నెల 19 నుంచి 22 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. అందుబాటులో ఉన్న 400 ఈవీఎంలను మొదటి విడత పరిశీలన పూర్తి చేశారు. బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ కూడా సిద్ధం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో సామాజిక సమతూకం
- అభ్యర్థుల ఎంపికలో సముచిత ప్రాధాన్యం - అన్ని వర్గాలకూ సమన్యాయం - పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సమతూకాన్ని పాటించి అన్ని వర్గాలకూ సమన్యాయం చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలతోపాటు కమ్మ, వైశ్య, ముస్లిం వర్గాలకు కూడా సీట్లు కేటాయించింది. ప్రధానంగా బీసీ, ఎïస్సీల్లోని ఉపకులాలను గుర్తించి ఆయా వర్గాలకు అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. ఇందు కోసం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ వి.విజయసాయిరెడ్డి సమక్షంలో జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మరో సీనియర్ నేత, మాజీ మత్రి బొత్స సత్యనారాయణ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కసరత్తు చేశారు. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సామాజిక వర్గాలు, రిజర్వేషన్లు, ప్రాంతాలవారీగా ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. వైఎస్సాఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పార్లమెంట్ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్ భాగస్వామ్యంతోపాటు వివిధ సర్వేల ద్వారా సమర్థులైన అభ్యర్థులతోపాటు సామాజికపరంగా అ«ధ్యయనం చేశారు. ఓసీ కేటగిరీలో కాపులకు 17 స్థానాలు కేటాయించారు. బీసీ వర్గాల్లోని తూర్పు కాపులకు రెండు, శెట్టిబలిజలకు 4, మత్స్యకార వర్గాల్లోని అగ్నికుల క్షత్రియ, వాడబలిజ, జాలర్లకు ఐదు సీట్లు ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి 2, షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఎరుకుల కులస్తులకు (ఎస్టీ)1, ఎస్సీలకు 4 స్థానాలు కేటాయించారు. వెనుకబడిన తరగతులకు సంబంధించి ఉపకులాలైన వెలమ, గవర, ఉప్పర, శెట్టి బలిజలకు తగిన రీతిలో అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. వైశ్య, ముస్లింలకు ఒకొక్కటి, రెడ్దిక కులానికి మూడు స్థానాలు కేటాయించారు. ఇలా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థిత్వాలను నిర్ణయించడంతో కార్పొరేషన్ పరిధిలోని అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు సమర్థతకు పెద్దపీట వేస్తూ అన్ని సామాజిక వర్గాలకూ సమన్యాయం చేసిన సీట్ల కేటాయింపులతో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి మరింత అదనపు బలాన్ని చేకూరుతుందన్న ఆశాభావం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. -
ఎమ్మెల్యే కొండబాబుకు షాక్
♦ ఎమ్మెల్యే కొండబాబుకు షాక్ ♦ వ్యూహాత్మకంగా దెబ్బకొట్టిన మంత్రులు ♦ అలకవహించిన కొండబాబు ♦ తన వద్దకు వచ్చిన మేయర్ అభ్యర్థిపై అగ్రహం ♦ టీడీపీ, బీజేపీకి రెబెల్స్ పోటు సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీలో రగడ మొదలలైంది. మంత్రులు, ఎమ్మెల్యే కొండబాబు మధ్య చిచ్చు రేగింది. వ్యూహాత్మకంగా మంత్రులు దెబ్బకొట్టారు. ఇప్పుడా బాధను తట్టుకోలేక ఎమ్మెల్యే రగిలిపోతున్నారు. తనను కాదని కార్పొరేషన్ అభ్యర్థును ఎలా గెలిపిస్తారో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడిది చినికి చినికి గాలివానలా మారింది. ఇదెక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రెబెల్స్ సెగ తాకింది. ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపుతారోనన్న భయం పట్టుకుంది. మిత్రపక్షాలకు రెబెల్స్ షాక్... టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. మిత్రపక్షమైన బీజేపీకి షాక్ తగిలింది. ఇప్పుడా రెండు పార్టీలూ కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. బీజేపీకి కేటాయించిన 9, 27, 47 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు తిరుగుబాటు అభ్యర్థులుగా కొనసాగుతున్నారు. టీడీపీ కేటాయించిన 28, 35 డివిజన్లలో వేసిన టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు రెబల్ రేసులో నిలబడ్డారు. ఆయా వార్డుల్లో రెబెల్ పోటు ఉండటంతో గెలుపుపై ఆశలు వదులుకోవల్సిన పరిస్థితులు నెలకున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యే కొండబాబు తలనొప్పి వచ్చి పడింది. కొండబాబుకు చెక్ పెట్టిన మంత్రులు... కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)కు పార్టీ అధిష్టానం చెక్ పెట్టింది. అభ్యర్ధుల ఎంపికలో కొండబాబుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు బీపారంలు ఇచ్చే చివరి వరకు నటించిన మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన రాజప్ప వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎమ్మెల్యేకు కోలుకోలేని దెబ్బకొట్టారు. మొదటి నుంచీ మేయర్ అభ్యర్థిగా జ్యోతుల ఇందిరను ఎంపిక చేయాలని కొండబాబు సూచించగా దానికి అంగీకరించినట్లు చెప్పుకొచ్చిన మంత్రులు ఆఖరి నిమిషంలో మరొకర్ని తెరపైకి తెచ్చి ఇందిరకు షాక్ ఇచ్చారు. 47వ డివిజన్‌కు చెందిన జ్యోతుల ఇందిరను తీసుకొచ్చి 40వ డివిజన్లో ఎమ్మెల్యే కొండబాబు నామినేషన్ వేయించారు. మేయర్ అభ్యర్ధిగా దాదాపు ఆమెకు సానుకూలత వ్యక్తం చేసినట్టు మంత్రులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజుకొచ్చేసరికి జ్యోతుల ఇందిరను కాదని 40 డివిజన్ అభ్యర్థిగా సుంకర సాగర్ భార్య సుంకర శివ ప్రసన్నను ఖరారు చేశారు. ఆమెనే టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించి బీపారం అందజేశారు. కొండబాబు సూచించిన జ్యోతుల ఇందిర కాపు సామాజిక వర్గానికి చెందినది కాదనే వాదనను తెరపైకి తీసుకువచ్చిన దేశం నేతలు చివరి నిమిషంలో నాటకీయంగా మేయర్ అభ్యర్థిని మార్చడంతో చేసేదేమీ లేక జ్యోతుల ఇందిర తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కొండబాబు కోరిన అన్ని డివిజన్లలో ఆయన సూచించిన అభ్యర్థులకు బదులు బీజేపీకి కేటాయించారు. అలాగే 29వ డివిజన్లో కొండబాబు అనుచరునికి బదులుగా వేరే వ్యక్తికి బీఫారం అందజేయడంతో అభ్యర్థుల ఎంపికలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కొండబాబు అలిగి ఇంటికి వెళ్లిపోయారు. మేయర్ అభ్యర్థిపై ఆగ్రహం మేయర్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించిన సుంకర సాగర్ తన భార్యతో కలిసి బీఫారం తీసుకుని కొండబాబు దగ్గరకు వెళ్లగా తనను కాదని అభ్యర్థులను ఎంపిక చేశారని...ఎలా గెలుస్తారో నేనూ చూస్తానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తన దగ్గరకు రావాల్సిన అవసరం లేదని, టిక్కెట్టు ఎవరు ఇచ్చారో వారి దగ్గరకే వెళ్లండంటూ ఇంట్లోకి రానివ్వకుండా పంపేసినట్టు సమాచారం. బుధవారం సాయంత్రం నుంచి కొండబాబు కినుక వహించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కొండబాబును బుజ్జగించే ప్రయత్నాలు బెడిసికొట్టడంతోతోపాటు తనకు జరిగిన అవమానాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతానని కొండబాబు చెబుతున్నట్టు తెలిసింది. -
ఉత్కంఠ... ఉరుకులు... పరుగులు
♦ నామినేషన్ల చివరి రోజు హైడ్రామా ♦ అభ్యర్థులకు బి ఫారాలు అందజేత ♦ బరిలో మొత్తం అభ్యర్థులు 241 మంది... ♦ నేటి నుంచి ఊపందుకోనున్న ప్రచారం కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల్లో నామినేషన్ల చివరి రోజైన ఆదివారం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. అప్పటికే ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేయడం...అభ్యర్థిత్వాల ఖరారుపై కసరత్తులు కొనసాగుతున్న నేపద్యంలో అభ్యర్థులతోపాటు నాయకులకు కూడా టెన్షన్ తప్పలేదు. అభ్యర్థిత్వాలను ఖరారు చేయడంతో ఆగమేఘాలపై మధ్యాహ్నం మూడు గంటల లోపు బి-ఫారాలను అందజేసే పనిలో కొందరు నిమగ్నమైతే... రెబల్స్‌గా ఉండిపోతారన్న భయంతో అప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులతో ఉపసంహరింపచేసే దిశగా మరికొంత మంది ఉరుకులు...పరుగులు పెట్టారు. చివరి క్షణం వరకూ బి - ఫారం అందజేత, నామినేషన్ల ఉపసంహరణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికారికంగా అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక రెబల్స్‌గా ఉంటారన్న భయంతో కొంతమందిని పార్టీ నేతలు బుజ్జగింపులపర్వం కూడా కొనసాగించారు. భవిష్యత్తులో మంచి పదవులిస్తామంటూ నచ్చజెప్పడం వంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. బరిలో 241 మంది... నామినేషన్ల ఉపసంహరణ అనంతరం కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 241 మంది బరిలో నిలిచారు. మొత్తం 449 నామినేషన్లు దాఖలుకాగా బుధవారం నాటికి 209 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చివరి రోజైన బుధవారం ఒక్కరోజే 158 మంది నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 48 మంది, టీడీపీ నుంచి 39, కాంగ్రెస్ 17, టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నుంచి 9 మంది, సీపీఎం 2, సీపీఐ 2, బీఎస్పీ 4, శివసేన 1 కలిపి 122 మంది ప్రధాన పార్టీ అభ్యర్థులు రంగంలో నిలిచారు. మిగిలిన 119 మంది స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ తుది జాబితా... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంగళవారం 40 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మిగిలిన 8 మంది అభ్యర్థుల జాబితాను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి బుధవారం పత్రికలకు విడుదల చేశారు. ఆ ఎనిమిది మందిలో వాసిరెడ్డి సూరిబాబు (1), సంగిశెట్టి జాహ్నవి(2), గుర్రాల వెంకటేష్ (స్టీఫెన్, 3), పేర్ల జోగారావు (16), కోనాడ సత్యనారాయణ (18 ), వాసిరెడ్డి వరలక్ష్మి (28) బోరా అరుణ(33), రమణాతి మురళి (49) వార్డుల్లో బరిలో నిలిచారు. -
రెబెల్.. గుబుల్..
–కార్యకర్తలను కాదన్నందుకు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం –సీట్ల కేటాయింపులో మాట నెగ్గించుకున్న యనమల –ఎమ్మెల్యే బాధితుల వరుసలో జ్యోతుల ఇందిర –బీజేపీ డివిజన్లలో బరిలోకి టీడీపీ రెబల్ అభ్యర్థులు భానుగుడి(కాకినాడ) : పార్టీల అభ్యర్థుల ఎంపిక ముగిసింది. పలు డివిజన్లలో టీడీపీ రెబల్ అభ్యర్థులు బరిలో ఉండడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. టీడీపీలో బడాబాబులు, నేతల అనుయాయులతో జాబితా సిద్ధం చేయడంపై అభ్యర్థులు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా డివిజన్ల వారీగా ఎమ్మెల్యేను నమ్ముకుని మోసపోయిన వారు సైతం ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామంటున్నారు. 29వ డివిజన్లో సీటును ఆశించిన యాళ్ల పట్టాభి, వాసిరెడ్డి రామచంద్రరావు టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచారు. ఆ డివిజన్లో విస్తృత ప్రచారం చేస్తూ పార్టీలో తమకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగానే వెల్లబుచ్చుతున్నారు. దీంతో ఈ డివిజన్లో తేదేపా అభ్యర్థినిగా పోటీచేస్తున్న ఆ పార్టీ సీటీ ప్రెసిడెంట్ సుంకర తిరుమల కుమార్ భార్య సుంకర పావని గెలుపు కష్టం కానుంది. 28వ డివిజన్లో ఎమ్మెల్యేను నమ్ముకుని నట్టేట మునిగిన పినిశెట్టి సతీష్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 35వ డివిజన్ సీటును బీజేపీకి కేటాయించడంతో కొండాబత్తుల ప్రసాదరావు ఆ పార్టీ తరఫున బరిలో నిలిచారు. దీంతో ఎప్పటి నుంచే టీడీపీ పార్టీ కార్యక్రమాలు సొంత ఖర్చులతో నిర్వహించిన రమా ఆప్టికల్స్ రాంబాబు ఈ డివిజన్లో టీడీపీ రెబల్‌గా నిలిచారు. 9వ డివిజన్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కంపర రమేష్, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య బీజేపీ తరపున బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ రెబల్ అభ్యర్థిగా శీకోటి అప్పలకొండ బరిలో నిలిచారు. ఈ విషయమై బీజేపీ నాయకులు కాస్త సీరియస్ ఉన్నారు. సీట్లు కేటాయించినట్టే కేటాయించి తేదేపా అభ్యర్థులను బరిలో ఉంచిందని అ«ధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే ఇంటివద్దా? బి ఫారాలిచ్చేది? ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇంటి వద్ద అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ కార్యాలయంలో ఇవ్వకుండా ప్రాబల్యాన్ని నిలుపుకొనేందుకు ఎమ్మెల్యే ఈ తరహా కార్యక్రమాలు చేస్తున్నారంటున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు నామన రాంబాబును నామమాత్రానికైనా లెక్కలోకి తీసుకోకుండా ఒంటెత్తుపోకడలతో వనమాడి వ్యవహరించడంపై కార్యకర్తల్లో ఆగ్రహం నెలకొంది. సుంకరకు సీటు.. ఇందిరకు వెన్నుపోటు ఆర్థిక మంత్రి అనుచరుడు సుంకర విద్యాసాగర్ భార్య సుంకర శివప్రసన్నకే 40 డివిజన్ టీడీపీ సీటు కేటాయించడం ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది. తన సొంత డివిజన్ అయిన 47వ డివిజన్‌ను వదులుకుని ఎమ్మెల్యే వనమాడిని నమ్మి 40వ డివిజన్లో అభ్యర్థిత్వాన్ని దాఖలు చేసిన జ్యోతుల ఇందిర తీవ్ర భంగపాటుకు గురైంది. డివిజన్లో మేయర్ అభ్యర్థిని ఇందిరనే టాక్ రావడంతో ప్రచారం సైతం ఇందిర అనుచరులు వేగవంతం చేశారు. సీటు కేటాయింపు విషయానికొచ్చేసరికి ఆర్థిక మంత్రి చక్రం తిప్పడంతో కొండబాబు ఇందిర పేరును సమావేశంలో ప్రస్తావించేందుకు సంకోచించినట్టు సమాచారం. టిడీపీ అభ్యర్థుల రెండో జాబితా: టీడీపీ 48 డివిజన్లకు సంబంధించి బీజేపీకి తొమ్మిది డివిజన్లు కేటాయించగా 34 డివిజన్లకు తొలిజాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. 13వ డివిజన్‌కు సంబంధించి ఒమ్మి బాలకామేశ్వరరావు, 21వ డివిజన్‌కు సుల్తాన్‌బేగం, 49వ డివిజన్‌కు పి.ఉషారాణి, 40వ డివిజన్ సుంకర శివప్రసన్న, 50వ డివిజన్ పాలిక త్రిమూర్తులకు కేటాయించి బుధవారం బీ ఫారాలు అందించారు. కరపత్రాలు, జెండాల పంపిణీ జిల్లా టీడీపీ కార్యాలయంలో 50 డివిజన్లలో ఎన్నికలు జరుగుతున్న 48 డివిజన్లకు సంబంధించి జెండాలు, ప్లెక్సీలు, కరపత్రాలు ఇతరత్రా సామగ్రిని పార్టీ కార్యాలయం నుంచి బుధవారం రాత్రి ఆఘమేఘాల మీద సరఫరా చేశారు. -
ఖర్చు పెట్టాలా... వద్దా?
–గందరగోళంలో అభ్యర్థులు – భయపెడుతున్న కోర్టు తీర్పు – ఆగిపోతే ఖర్చు అంతా వృధా – ఖర్చు చేయని పక్షంలో ఎన్నిక జరిగితే ఓడిపోతామేమోనని అభద్రతా భావం సాక్షి ప్రతినిధి, కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికలపై అనుకున్నట్టుగా బుధవారం తీర్పు రాలేదు. గురువారమో...శుక్రవారమో...తీర్పు ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ...పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం భయాందోళన చెందుతున్నారు. ఎన్నికలంటేనే ఖర్చు. ఇప్పుడా ఖర్చు చేయాలా? వద్దా? అనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఖర్చు పెట్టాక ఎన్నికలు ఆగిపోతే నష్టపోతామని..అలాఅని ఖర్చు పెట్టని పక్షంలో ఎన్నికలు జరిగితే ఓడిపోతామోనన్న భయం పట్టుకుంది. ఇప్పుడేం చేయాలా? అని అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు జరుగుతున్న 48 డివిజన్లకుగాను.........మంది బరిలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పక్షాలతోపాటు అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. వీరంతా ఎన్నికల కథన రంగంలోకి దూకాల్సిందే. ప్రచారాలతోపాటు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు పదును పెట్టాలి. దాదాపు ప్రతి దానికీ ఖర్చు పెడితే గానీ పని జరగదు. ప్రచారం స్వీకారం చుట్టిన దగ్గరి నుంచి ఎన్నికలయ్యేంతవరకూ అభ్యర్థులకు ఖర్చు తప్పదు. ఇదంతా సాధారణమే. ఎన్నికల్లో గెలిచేవాడు సంతోషిస్తాడు. ఓడిపోయినోడు సొమ్ముపోయింది, పదవి పోయిందని బాధపడతాడు. కానీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో ఆ క్లారిటీ లేదు. దీనికంతటికీ హైకోర్టులో నడుస్తున్న ప్రజా వ్యాజ్యాలే కారణం. తీర్పులో ఏముందో... డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్లు సరిగా లేదని, ఎన్నికలను నిలిపివేయాలని టీడీపీ నేతల అనుయాయులు పిటీషన్లు వేశారు. ఆ పిటీషన్లపై ఇప్పటికే వాదనలు కూడా ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. బుధవారం వెల్లడిస్తామని ఈ నెల 10వ తేదీన పేర్కొంది. కానీ...అనుకున్నట్టుగా బుధవారం తీర్పు రాలేదు. ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. ఈలోపే (బుధవారం) నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. బరిలో ఉన్నదెవరో తేలిపోయింది. ఇకపై ఎన్నికలపైనే అభ్యర్థులు దృష్టి సారించాల్సి ఉంది. ఎన్నికల నిబంధనలకు లోబడి ఎవరి స్థాయి ప్రకారం వారు ఖర్చు పెట్టుకుని సిద్ధమవుతారు. ప్రచారాల జోరు పెంచనున్నారు. ఓట్ల కోసం రకరకాల జిమ్మిక్కులు ప్రదర్శించనున్నారు. వాటి కోసం ఎంతో కొంత ఖర్చు పెట్టనున్నారు. ఇవన్నీ జరిగితే తప్ప ఎన్నికల్లో గట్టెక్కే అవకాశం లేదు. గెలుపోటములు పక్కన పెడితే ఎన్నికల ప్రహసనం ముగియనుంది. అయితే అంత స్వేచ్ఛగా అభ్యర్థులు ముందుకెళ్లేందుకు రిజర్వులో ఉన్న కోర్టు తీర్పు ముందరి కాళ్లకు బంధంలా నిలిచింది. ఖర్చుల విషయంలో మల్లగుల్లాలు... బుధవారం వెలువడుతుందనుకున్న కోర్టు తీర్పు రాలేదు. ఈ రోజు వచ్చేస్తే అభ్యర్థులకు క్లారిటీ వచ్చేసిది. స్వేచ్ఛగా ముందుకెళ్లేవారు. కానీ హైకోర్టు తీర్పు రాలేదు. ఎప్పుడొస్తుందో స్పష్టత లేదు. ఎన్నికలు జరిగిపోతాయని వెళ్లిపోతే అందుకు భిన్నంగా కోర్టు తీర్పు వస్తే చేసిన ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అలా అని ఖర్చు చేయకుండా తాత్సారం చేస్తే ఎన్నికల కొనసాగింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే...తాము అసలుకు నష్టపోక తప్పదన్న భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఏమి చేయాలన్న దానిపై అభ్యర్థులంతా మల్లగుల్లాలు పడుతున్నారు. ఖర్చుల విషయంలో ఆచీతూచీ వ్యవహరించాలన్న అభిప్రాయంతో ఉన్నారు. మొత్తానికి కోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియదు గాని అభ్యర్థులు మాత్రం గందరగోళంలో ఉన్నారు. -
బుజ్జగింపులు, నజరానాలు, బెదిరింపులు
- చివరి నిమిషంలో అభ్యర్థుల ఖరారు సీటు ఖరారైన అభ్యర్థుల పాట్లు గెలుపు గుర్రాలకు సీట్లు ఇచ్చినట్టు చెబుతున్న అధినేతలు చెట్టెక్కి కూర్చున్న ఆశావహులు సాక్షి, కాకినాడ: ప్రధాన రాజకీయ పార్టీల్లో బుజ్జగింపులు, నజరానాలు ప్రారంభమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు నేటితో (ఈ నెల 16వ తేదీ) గడువు ముగియనుండడంతో సీట్లు ఖరారైన అభ్యర్థులు తమతోపాటు పార్టీ నుంచి నామినేషనన్లు వేసిన ఆశావహుల్ని సంప్రదిస్తున్నారు. పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన నేపథ్యంలో నామినేషన్ ఉపసంహరించుకుని తనకు మద్దతుగా నిలవాలని అభ్యర్ధిస్తున్నారు. వారితోపాటు పార్టీ అధినాయకులూ సర్వే ప్రకారం గెలుపు గుర్రాలకు సీట్లు ఇచ్చామని, భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామంటూ నచ్చజెబుతున్నారు. అటు పార్టీ అధినేతలు, ఇటు సీటు ఖరారైన అభ్యర్థులు సంప్రదింపులు జరుపుతున్నా, కొందరు ఆశావహులు చెట్టెక్కి కూర్చుంటున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజల సమస్యలను పరిష్కరించామని, అందుకోసం విలువైన సమయాన్ని, డబ్బును వ్యయపరిచామని, ప్రజలు తమను అభిమానిస్తున్నారని చెబుతున్నారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తామంటున్నారు. భవిష్యత్తు రాజకీయానికి కార్పొరేటర్ పదవి తొలి మెట్టులాంటిదని, అది ఎక్కకపోతే రాజకీయంగా వెనుకబడిపోతామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీటు ఖరారైన అభ్యర్థులు బుజ్జగింపులు, నజరానాలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. చివరి నిమిషంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంతో నామినేషన్లు వేసిన ఆశావహులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. దాదాపు పది మంది అభ్యర్దులు నామినేషనన్లు వేసిన తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో వారిని వెతికి పట్టుకోడానికి ఆభ్యర్ధులు నానా తంటాలు పడుతున్నారు. ఇలా నామినేషన్లు వేసిన అభ్యర్దులను అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉంది..నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే ఇబ్బందులు పడతావ్ అంటూ బెదిరిస్తూ ఇంటికి వెళ్లి వారితో విత్‌డ్రా ఫారాల మీద సంతకాలు చేయించుకుంటున్నారు. విత్‌డ్రాలకు బేరం... కాకినాడ కార్పొరేషన్‌కు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. విలీన గ్రామాల సమస్య నేపథ్యంలో ఈ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులు మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం గత 29న నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం అధికార యంత్రాంగం ఈ నెల 7 వరకు నామినేషనున్లు స్వీకరించింది. ప్రధాన రాజకీయ పార్టీలకు అంచనాలకు భిన్నంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం, ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయాన్ని ఇవ్వకపోవడంతో అభ్యర్ధుల ఖరారులో కొంత జాప్యం జరిగింది. నామినేషన్లు స్వీకరణకు గడువు తేదీలోపు (7వ తేదీ) అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆశావహకులంతా నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 48 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుంటే 589 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 50 శాతం రిజర్వేషన్ కలిగిన మహిళలు 280 మంది ఉన్నారు. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు ఇప్పటి వరకు 35, 9 సీట్లను పంచుకునేందుకు ఏకాభిప్రాయానికి వచ్చాయి. టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసినా... అందరి నుంచీ విత్‌డ్రా ఫారాలపై సంతకాలు చేయించుకుని తీసుకుంది. వీరిలో సీటు ఖరారైన అభ్యర్థికి బీపారం ఇచ్చి మిగిలిన అభ్యర్థులు విత్‌డ్రా ఫారాలు అధికార యంత్రాంగానికి అందజేసే వ్యూహంలో ఉంది. అయితే సీటు ఖరారైన అభ్యర్థులు విత్‌డ్రా చేసుకునే ఆశావహులకు వారి స్థాయిని బట్టి రూ.50 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు చెల్లించడానికి లోపాయికారీగా ఒప్పందాలు ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో మరోలా... బీజేపీలోని ఒక డివిజన్‌కు చెందిన అభ్యర్థి అదే పార్టీలో మరో అభ్యర్థికి ఇంకో డివిజన్ నుంచి పోటీ చేయడానికి అనువుగా సీటు ఇప్పించాడు. దీనికి ప్రతిఫలంగా తన డివిజన్లో ఎన్నికల ఖర్చు మొత్తం భరించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 26 డివిజన్లలో బీజేపీ ఆశావహకులు నామినేషన్లు వేస్తే పొత్తులో ఆ పార్టీకి 9 డివిజన్లు లభించాయి. అయితే 26వ డివిజన్లకు బీజేపీ ఆశావహులు నామినేషన్లు వేయడంతో టీడీపీ, బీజేపీల్లో సీటు ఖరారైన అభ్యర్దులు మిగిలిన వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. -
ఎన్నాళ్లీ అవస్థలు
– 150 ఏళ్ల చరిత్ర గల కాకినాడలో దయనీయ పరిస్థితి – గుంతలతో అధ్వానంగా మారిన రోడ్లు – ప్రయాణమంటే హడలిపోతున్న నగర జనం – ప్యాచ్ వర్క్‌లకే పరిమితం – నాసిరకం పనులతో నాణ్యతకు తూట్లు – సుమారు రూ.400 కోట్ల మేర స్మార్ట్‌సిటీ నిధుల కేటాయింపు – ఏడాదిన్నర దాటుతున్నా ఒక్క అడుగూ పడని దుస్థితి మంత్రాలకు చింతకాయలు రాలనట్టే.. మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడి మాటలకు గుంతలు మాయం కాలేదు! రోడ్లు భవనాల శాఖ మంత్రి హోదాలో ‘వర్షాకాలం వచ్చే లోపు కాకినాడ రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాన’ని ఆయన ప్రకటించారు. కానీ నేటికీ వాటి అతీగతీ పట్టించుకొనే దిక్కు లేదు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఏది రోడ్డో...ఏది గుంతో తెలియని పరిస్థితి. 150 ఏళ్ల చరిత్ర గల కాకినాడ నగరానికి పట్టిన గతి ఇది. వాహన చోదకులే కాదు పాదచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి. నగర రోడ్లపై ప్రయాణమంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఎక్కడ పడిపోతామో...ఎక్కడ గాయపడతామో...రోడ్డెక్కితే ఏమవుతుందోనని భయపడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. రహదారుల నిర్వహణకు ఏటా రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా అవి ప్యాచ్ వర్క్‌లకే పరిమితమవుతున్నాయి. నిధుల దుర్వినియోగం తప్ప రహదారులకు మోక్షం కలగడం లేదు. నాసిరకం పనులతో సమస్య కాకినాడ నగరంలో 875 కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఉన్నాయి. ఇందులో 175 కిలోమీటర్ల రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక మిగిలిన 700 కిలోమీటర్ల రోడ్లలో అత్యధికం దెబ్బతిని ఉన్నాయి. ఒక నగర రోడ్లే కాదు కాకినాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగానే ఉంది. సిటీలోని ఏ డివిజన్‌కు వెళ్లినా రోడ్లపై గుంతలే ఉంటున్నాయి. ఎటువైపు చూసినా గోతుల రోడ్లే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మామిడాడ రోడ్డు, సర్పవరం నుంచి వలసపాకల వైపు రోడ్డు(పూర్తిగా దెబ్బతింది), కాకినాడ–జొన్నాడ మధ్య రోడ్డు...ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. పలు దఫాలుగా గోతులమయమైన రోడ్లకు మరమ్మతులు చేస్తున్నా నాసిరకం నిర్మాణాలతో కొద్ది రోజులకే పాడవుతున్నాయి. స్మార్ట్ సిటీలోనూ మారని దుస్థితి కాకినాడ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. నిధులు కేటాయించింది కూడా. వాటిలో కొంతవరకు మంజూరు చేసింది. కానీ, ఆ నిధులతో పనులు చేపడుతున్న దాఖలాల్లేవు. స్మార్ట్‌సిటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.90 కోట్లు కేటాయించారు. మురుగునీటి కాలువలకు అనుసంధానంగా వర్షపు నీరు పోయేందుకు కాలువల నిర్మాణానికి మరో రూ.307 కోట్లు ప్రకటించారు. అయితే ఈ పనులకు ఇంతవరకు ఒక్క అడుగూ పడలేదు. రాజకీయ జోక్యం, అధికారుల్లో కొరవడిన చిత్తశుద్ధితోనే పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అన్నీ చేయాలన్న పరోక్ష ఆదేశాలతో అధికారులు కూడా చొరవ చూపలేకపోతున్నారు. అదే కార్పొరేషన్ పాలకవర్గం ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అభివృద్ధికి అడ్డంకులు ఉండేవి కావు. బయట వ్యక్తుల ప్రభావం ఉండేది కాదు. నగరాభివృద్ధికి దోహదపడే కార్పొరేషన్ పాలకవర్గం రాకుండా ఉంటేనే తమ ఆటలు సాగుతాయని, నచ్చినట్టుగా చేసుకోవచ్చని, దొరికిన కాడికి దోచుకోవచ్చన్న ఉద్దేశంతో ఎన్నికలు నిలిపివేయించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారు. పాలకవర్గం ఏర్పాటైతే తమ హవా సాగదని కుటిల యత్నాలకు దిగుతున్నారు. వర్షం వస్తే నరకమే వర్షం వస్తే మురికివాడ ప్రాంతంలో ఎలా ఉన్నా ప్రధాన రహదారులు మరింత అధ్వానంగా తయారవుతున్నాయి. గతుకుల, గుంతల రోడ్లతో ప్రయాణమంటేనే భయపడే పరిస్థితి. నరకం చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా నగరంలో రోడ్లన్నీ పల్లం కావడంతో కొద్దిపాటి వర్షానికే జలమయంగా మారడంతో పాటు డ్రైనేజ్‌లో ఉన్న వ్యర్థాలు రోడ్లపైకి వచ్చి మురికికూపంగా మారుతున్నాయి. – పి.త్రినా«థ్, సాలిపేట, కాకినాడ పైపులైన్ విస్తరణతో అధ్వానం.. నగరంలో ఉన్న కొద్దిపాటి రోడ్లను గ్యాస్ పైపులైన్ పేరుతో తవ్వి అధ్వానంగా తయారు చేశారు. వాటిని సక్రమంగా పూడ్చకపోవడంతో ప్రయాణానికి ఇబ్బందిగా ఉంది. నగరంలో ఏదో చోట పైపులైన్లు, కేబుల్ వర్క్‌ల పేరుతో రోడ్లను ఇష్టానుసారంగా తవ్వి నగర వాసులకు ఇబ్బందులు తెస్తున్నారు. – బోనం మణిబాబు, 22వ డివిజన్, కాకినాడ -
తీర్పు.....?
♦ అందరి చూపూ హైకోర్టు వైపు ♦ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికపై నిర్ణయం 16వ తేదీకి వాయిదా ♦ ఇదంతా టీడీపీ పనేనని నగరవాసుల మండిపాటు ► ఓటమి భయంతో ఇంత నీచ రాజకీయమా అంటూ ఆగ్రహం ►రెండోసారి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కింది కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన రెండు డివిజన్లను వదిలేసి ఎన్నికలు నిర్వహించుకోవాలని హై కోర్టు చెబుతుందా? ►రెండు డివిజన్లను పెండింగ్ పెట్టడానికి, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధం లేదని, ఫలితాలను యథావిధిగా ప్రకటించుకోవచ్చని సూచిస్తుందా? ►పెండింగ్‌లో ఉన్న రెండు డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసేంతవరకు తాజాగా నిర్వహించే 48 డివిజన్ల ఎన్నికల ఫలితాలను రిజర్వులో ఉంచాలని ఉటంకిస్తుందా... ►మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నది నిబంధన. ఈ లెక్కన ప్రస్తుతం జరుగుతున్న 48 డివిజన్లకుగాను నిబంధనల ప్రకారం 24 డివిజన్లు మహిళలకు కేటాయించాల్సింది. కానీ ప్రస్తుతం 23 డివిజన్లు మాత్రమే మహిళలకు రిజర్వు అయ్యాయి. ఇదంతా నిబంధనలకు విరుద్ధమని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తుందా? ►ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చాక ఎన్నికలు ఆపడం కుదరదని హైకోర్టు స్పష్టంగా ప్రకటించనుందా? ► ప్రస్తుతం నిర్వహిస్తున్న సాంకేతికంగా సరికాదని, న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఎన్నికలను వాయిదా వేస్తుందా? సాక్షి ప్రతినిధి, : కాకినాడ నగర ప్రజలను, రాజకీయ పక్షాలను తొలిచేస్తున్న సందేహాలివీ. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యంలో ఎన్నికలు నిలుపుదల చేస్తారా? కొనసాగిస్తారా? ప్రస్తుతం ఈ అంశం రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన నాటి నుంచి హైకోర్టులో గడచిన నాలుగైదు రోజులుగా లంచ్ మోషన్ పిటీషన్‌పై ఏరోజుకారోజు వాయిదాలు పడుతూ వాదనలు జరిగాయి. ప్రతిరోజూ తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై రాజకీయ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూశాయి. తాజాగా 16వ తేదీన తీర్పు వెలువరిస్తామని కోర్టు చెప్పడంతో నరాలు తెగే టెన్షన్ అటు పార్టీల్లోనూ, ఇటు అభ్యర్థుల్లోనూ నెలకొంది. టీడీపీ విశ్వ ప్రయత్నాలు... ఎన్నికలు నిలుపుదల చేసేందుకు గల సాంకేతిక కారణాలపై విస్తృత వాదనలు జరుగుతున్నాయి. ఈ పాత్రను ముఖ్యంగా అధికార పార్టీ నేతలు పోషిస్తున్నారు. ఎన్నికలు వాయిదా వేస్తేనే తమకు మంచిదన్న ఆలోచనతో టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. తమకున్న అస్త్రాలన్నీ ప్రయోగిస్తోంది. ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొని ఎన్నికల్లో గెలవడమంటే కష్టమనే అభిప్రాయంతో ఎన్నికలను ఏదో ఒక సాంకేతిక కారణం చూపించి వాయిదా వేయించేందుకే చూస్తోంది. ఒక్కొక్కరిదీ ఒక్కో వాదన... ప్రధానంగా కార్పొరేషన్ చట్టం ప్రకారం కనీసం 50 డివిజన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంటుందని అయితే ప్రస్తుతం 48 డివిజన్లకే ఎన్నికలు నిర్వహించడం వల్ల ఈ ఎన్నికకు భవిష్యత్తులో చట్టబద్దత ఉండదని, ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉందన్న వాదన ఒకవైపు విన్పిస్తోంది. మరోవైపు 48 డివిజన్లలో ఎన్నికలు జరపాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం కూడా లేదనే వాదన కూడా ఉంది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై కోర్టు జోక్యం చేసుకుని మొత్తం ఎన్నికను వాయిదా వేయాలని తీర్పు ఇచ్చిన సందర్భాలు కూడా ఎప్పుడులేవని, దీనిదృష్ట్యా ఎన్నికలు వాయిదా పడకపోవచ్చునని అంటున్నారు. అధికారుల తప్పిదంతో కొత్త సమస్యలు... విలీనం చేసిన మూడు పంచాయతీలకు సంబంధించిన మూడు గ్రామ పంచాయతీలపై కోర్టు స్టే కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని విలీనం చేసి ఎన్నికలకు సిద్ధంకావడం అధికారులు చేసిన పెద్దపొరపాటుగా చెబుతున్నారు. కోర్టు స్టే తొలగకుండానే ఎన్నికలకు సిద్దమైన తీరే మొత్తం ఈ సమస్యకు ప్రధాన కారణమంటున్నారు. ఒక వేళ 48 డివిజన్లకు ఎన్నికలు జరిపి, మిగిలిన డివిజన్లు నిలుపుదల చేస్తే మరో కొత్త సమస్య కూడా వచ్చిపడే అవకాశం ఉంటుందంటున్నారు. వాయిదాపడ్డ డివిజన్ల నుంచి అభ్యర్థులు తమకు రాజకీయంగా అవకాశాలు కోల్పోయమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే సమస్య మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. పరిష్కారం జరగాలంటే ఒక వేళ సమస్య పరిష్కరించాలంటే ప్రస్తుతం ఉన్న 48 డివిజన్లను (విలీన పంచాయతీలను పక్కనపెట్టి) 50 డివిజన్లుగా విభజించి డీ లిమిటేషన్, వార్డుల పునర్విభజన పూర్తి చేసి మళ్ళీ ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇదంతా జరగాలంటే ప్రస్తుత ఎన్నికను వాయిదా వేసి మరో నెల నుంచి రెండు నెలలు కసరత్తు పూర్తి చేశాక మాత్రమే ఎన్నికలు జరిపే అవకాశం ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి. మరీ, ఈ వ్యవహారంలో కోర్టు ఎన్నికలకు సంబంధించి స్వతంత్రంగా ప్రకటిస్తుందా? ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ముందుకు వెళ్ళమంటుందా అన్న అంశమే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమవుతోంది. -
తొలి అంకానికి నేడే తెర
-నామినేషన్ల దాఖలుకు నేడు చివరిరోజు -టీడీపీ, బీజేపీల మధ్య తేలని సఖ్యత -వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టత! కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఖరారుపై రాజకీయపార్టీలలో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీలకు ఇంకా స్పష్టత రాకపోవడంతో.. ఎందరో ఆశావహులు కార్పొరేటర్ పదవులకు ఆశావహులు ముందుగానే తమ తమ పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. గడచిన మూడు రోజుల్లో 112 నామినేషన్లు పడ్డాయి. డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో గతంలో పోటీ చేసిన ప్రాంతాలు తారుమారు కావడం, రిజర్వేషన్లు మారడం, అకస్మాత్తుగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించడంతో చాలా చోట్ల అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు కొంత తలనొప్పిగా మారింది. నేడు వైఎస్సార్ సీపీ జాబితా! అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా వరకూ స్పష్టత వచ్చిందని పార్టీ వర్గాల సమాచారం. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కాకినాడలోనే ఉండి పార్టీనేతలతో చర్చించి, సర్వే ద్వారా సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసే అంశంపై గడచిన నాలుగు రోజులుగా ముమ్మరంగా కసరత్తు చేశారు. నాయకులను సమన్వయం చేసుకుంటూ సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు చేసిన కసరత్తు కొలిక్కి వచ్చిందంటుని, గురువారం జాబితాను విడుదల చేయవచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. ఎంపికలు ఏకపక్షమని టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు! అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో గందరగోళం నెలకొంది. కష్టపడి పనిచేసేవారికి టిక్కెట్లు దక్కడం లేదని కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఏకపక్షంగా అభ్యర్థులను ఎంపిక చేశారంటూ కొంతమంది అధిష్టానానికి ఫిర్యాదు చేశారంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.కళావెంకట్రావు, జిల్లా మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప జోక్యం చేసుకుని జాబితాపై మరోసారి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితి కొన్ని డివిజన్లలో ఉందని, చాలా డివిజన్లలో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. కనీసం 12 ఇవ్వాలంటున్న ‘కమలం’ కాగా బీజేపీతో పొత్తు విషయంలో కూడా టీడీపీలో సందిగ్ధం తొలగలేదు. కనీసం 20 టిక్కెట్లు కావాలని బీజేపీ పట్టుబడుతుండగా మూడు సీట్లకు మించి ఇవ్వలేమంటూ టీడీపీ చెప్పిందంటున్నారు. దీంతో ఇరుపార్టీల మధ్య నెలకొన్న వివాదానికి తెరదించేందుకు మంత్రులు రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. ఆర్థిక మంత్రి యనమల, హోంమంత్రి రాజప్ప బుధవారం బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజులతో జరిపిన చర్చలు బెడిసికొట్టాయంటున్నారు. కనీసం 12 స్థానాలైనా ఇవ్వాలంటూ బీజేపీ నేతలు చివరి డిమాండ్‌గా టీడీపీ ముందుంచారని చెపుతున్నారు. పొత్తు వ్యవహారం తేలకపోవడం కూడా టీడీపీ అభ్యర్థుల జాబితా రూపొందకపోవడానికి ఆటంకంగా మారిందంటున్నారు. నేడు భారీగా నామినేషన్లకు అవకాశం నామినేషన్ల ఘట్టానికి గురువారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు పడనున్నాయి. గురువారం అన్ని రాజకీయ పార్టీల నుంచీ ఎందరో అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. మొత్తం మీద కార్పొరేషన్ ఎన్నికల కాక గురువారంతో మరింత పెరగనుంది. -
టీడీపీ దొంగ జపం
– తెరపైకి మళ్లీ కాపు మంత్రం – మేయర్ పీఠం కాపులకంటూ కుతంత్రం –ఓ పక్క కాపులను తొక్కేస్తూ మరో పక్క బుజ్జగించే యత్నాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ మళ్లీ డ్రామాలాడుతోంది. 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక చేతులేత్తేసిన పచ్చపార్టీ కార్పొరేషన్ ఎన్నికల వేళ మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. గత మూడేళ్లుగా అణగదొక్కుతున్న కాపు నినాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తోంది. పసుపు నేతలకు రాజకీయాలు తప్ప విలువలు, నిజాయితీ లేదా అని జనాలు చీదరించే పరిస్థితి ఏర్పడింది. గడిచిన ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేర్చుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే కాపులను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తున్నారు. రిజర్వేషన్ కోసం పోరాడుతున్న కాపు నేతలపై కేసులు బనాయిస్తున్నారు. కాపు జాతికోసం చేస్తున్న ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాపులు రోడ్డుపైకి అడుగు పెడితే చాలు నిర్బంధం పెడుతున్నారు. పోలీసుల నిఘాలోనే కాపులు నిరంతరం గడుపుతున్నారు. అడుగడుగునా ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కాపులపై అనుసరిస్తున్న తీరుపై ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. కాపులపై కక్షకట్టినట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. దీంతో టీడీపీ అంటేనే కాపులు రగిలిపోతున్నారు. చంద్రబాబు దగ్గరి నుంచి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల వరకు కాపుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో గెలిపించిన కాపులను అధికారంలోకి వచ్చాక హింసిస్తున్నారని ఆ జాతి అంతా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆ సామాజిక వర్గానికి పూర్తిగా దూరమైన పరిస్థితి ఏర్పడింది. చక్కదిద్దేందుకు కాపు జపం అసలే ప్రభుత్వంపై అసంతృప్తి...ఆపై కాపుల నుంచి వ్యతిరేకత...పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కాపు రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభంపై అనుసరిస్తున్న తీరుతో కాపులంతా అంతెత్తున లేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతున్నారు. పరిస్థితిని ఎలా చక్కదిద్దాలా అన్న దానిపై తర్జనభర్జన పడి గడిచిన ఎన్నికల్లో గట్టెక్కించిన కాపు మంత్రాన్ని ఎంచుకున్నారు. బీసీల్లో చేర్చుతామన్న హామీని ఏ ఒక్కరూ నమ్మకపోవడంతో మేయర్ పీఠాన్ని కాపులకే కట్టబెడతామని కొత్త పల్లవి అందుకున్నారు. మొన్నటి వరకూ పార్టీలో అంతర్గతంగా ఈసారి బీసీలకు ఇద్దామని చెప్పుకుని వస్తూ ఎన్నికలకొచ్చేసరికి దూరమవుతున్న కాపులను దృష్టిలో ఉంచుకుని వారికే పెద్దపీట వేస్తామంటూ తెరపైకి తెచ్చారు. ఇప్పుడీ ప్రకటనను కాపులెవ్వరూ హర్షించడం లేదు. తమ జీవితాలను నిలబెట్టేది, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టి మేయర్ పీఠం అప్పగిస్తే మారిపోతామా అంటూ కాపులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఏ పార్టీ అయినా ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కోసారి కేటాయిస్తుందని, ఇందులో టీడీపీ గొప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. -
కార్పొరేషన్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ కసరత్తు
హాజరైన పార్టీ సీనియర్ నేతలు కాకినాడ : త్వరలో జరగనున్న కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. నగరంలోని అన్ని డివిజన్లలోను పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఎన్నికలకు సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక, విజయావకాశాలు, ఇతర అంశాలపై రోజంతా చర్చించారు. స్థానిక సరోవర్ పోర్టికోలో జరిగిన ఎన్నికల సమీక్షలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరయ్యారు. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి గడిచిన మూడు రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనపై నేతలు చర్చించారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చించారు. సమర్థులైన, పార్టీ కోసం కష్టించి పని చేసే వారిని గుర్తించి టిక్కెట్లు ఇచ్చే విషయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు కసరత్తు చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పార్లీమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, మాజీ ఎమ్మెల్యే, కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సినీ కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్‌లతో కూడా చర్చించారు. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే నామినేషన్ల ప్రక్రియ అనంతరం చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై కూడా నాయకులు చర్చించుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై నెలకున్న తీవ్రమైన వ్యతిరేకతతోపాటు ఇటీవల జాతీయ ప్లీనరీలో ప్రకటించిన నవరత్న పథకాలపై కూడా ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోందని, పార్టీ విజయావకాశాలు మెండుగా ఉన్నాయన్న విషయాన్ని నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా కార్పొరేషన్ ఎన్నికల నేపద్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ నెల 12 నుంచి 29 వరకూ కాకినాడలోనే అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
గెలుపు గుర్రాల కోసం పాట్లు
కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల కోసం వెదుకులాట వైఎస్సార్సీపీ వారిని ఆకర్షించేందకు యత్నాలు కాకినాడ రూరల్: ఏడేళ్ల తరువాత కాకినాడ కార్పొరేషన్‌కు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతోపాటు రిజర్వేషన్లు ఖరారు కావడంతో గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల నాయకులు పడుతున్న పాట్లు అన్నీ, ఇన్నీ కావు. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు అభ్యర్థులు కరువవ్వయడంతో ఆ పార్టీలకు అభ్యర్థులను నియమించడం తలకు మించిన వ్యవహారంగా కన్పిస్తోందని ఆ పార్టీలకు చెందిన నాయకులే చెబుతుండడం గమనార్హం. ముఖ్యంగా వైఎస్సార్సీపీ నుంచే టీడీపీకి గట్టి పోటీ ఎదురుకావడంతో కుటిల రాజకీయం చేసే దిశగా టీడీపీ నాయకులు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌కు పాలకవర్గం లేకపోవడం, ఇప్పటికిప్పుడే ఎన్నికలు రావని, దర్జాగా మరో రెండేళ్లు పాటు కార్పొరేషన్‌పై తామే అధికారం చెలాయిద్దామనుకున్న సిటీ, రూరల్ నియోజకవర్గాల ప్రతినిధులకు ఎన్నికల ప్రకటనతో గొంతులో వెలకాయపడినట్లయింది. వైఎస్సార్సీపీ నాయకులకు గాలం డివిజన్ల వారీగా పోటీలో నిలిపేందుకు టీడీపీకి బలమైన నాయకులు కన్పించకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే 1, 2, 3, 47, 49, 50 డివిజన్లలో సరైన అభ్యర్థులు దొరక్కపోవడంతో టీడీపీ నేతలు బలంగా ఉన్న వైఎస్సార్ నాయకులపై దృష్టి పెట్టారు. ఇప్పటికే బంధువర్గాలను ఉపయోగించి నాయకులను ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీ తరపున పోటీ చేస్తే ఎన్నికల్లో ఖర్చంతా తామే పెడతామని టీడీపీ వర్గాలు భరోసా ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుకు రాని మహిళలు ఇక కొన్ని డివిజన్ స్థానాలను బీసీ జనరల్‌కు, మరికొన్ని బీసీ మహిళలకు, కొన్ని ఎస్సీ వర్గాలకు కేటాయించినా వాటిలో పోటీ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. నగరపాలక సంస్థ మేయర్ పదవిని మహిళకు కేటాయించడంతో జనరల్ మహిళా, బీసీ మహిళా అన్నది తేల్చకపోవడంతో మహిళలు పోటీకీ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జనరల్ మహిళకు పదవిని కేటాయిస్తే నాయకుల భార్యలనే రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మేయర్ పదవిని ఆశిస్తున్న వారే అన్ని డివిజన్లలో తమకు అనుకూలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకొని గెలుపించుకునే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఎన్నిక అయ్యే అవకాశాలుండడంతో సమరోత్సాహంలో ఉన్న వైఎస్సార్సీపీ తరఫున నిలబడేందుకు పలువురు నాయకులు, కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల మేకపోతు గాంభీర్యం రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌పార్టీని ప్రజలు తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి గ్రామస్థాయిలో జరిగిన ఎంపీటీసీ సభ్యుల్లో ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం ఇవ్వకపోవడంతో అంతర్మథనంలో పడిపోయిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ కార్పొరేషన్ ఎన్నికలకు తామూ సిద్ధమేనంటూ ప్రకటించారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన కొందరు ప్రధాన నాయకులు టీడీపీకి చెందిన నాయకులతో రహస్య మంతనాలు జరిపి వైఎస్సార్సీపీని దెబ్బకొట్టేందుకు పావులు కదుపుతున్నట్లు ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
‘కాకినాడ కదనాని’కి శ్రీకారం
-నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ -11న పరిశీలన, 16న ఉపసంహరణ -29న పోలింగ్, ఒకటిన కౌంటింగ్ కాకినాడ : ఏడేళ్ళ విరామం తరువాత కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు కార్పొరేషన్ యంత్రాంగం సన్నద్ధమైంది. సోమవారం (7వ తేదీ) నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. 7 నుంచి 10 వరకు ఎంపిక చేసిన డివిజన్ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 16న నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 29న పోలింగ్ జరుగుతుంది. ఎక్కడైనా వివాదాలు, సమస్యలు తలెత్తితే ఈ నెల 31న రీపోలింగ్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1న కౌంటింగ్ పూర్తి చేసి, ఫలితాలను ప్రకటించేలా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అధికారులు సన్నద్ధం.. సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా డివిజన్ కేంద్రాల్లో నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు కమిషనర్ అలీమ్ బాషా ఆదేశాలు జారీ చేశారు. 48 డివిజన్లకే నామినేషన్లు నగరంలో 50 డివిజన్లకు ప్రస్తుతం 48 డివిజన్లకే ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడు గ్రామ పంచాయతీలపై న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో 42, 48 డివిజన్లకు ఎన్నికలు జరగవు. తొలిరోజు గ్రహణం ఎఫెక్ట్ తొలిరోజైన సోమవారం చంద్రగ్రహణం కావడంతో అభ్యర్థులు ఎంతవరకు నామినేషన్లు దాఖలు చేస్తారనేది సందేహంగానే కనపిస్తోంది. అయితే స్వతంత్ర అభ్యర్థులుగా కొందరు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి అధికారులు నియమనిబంధనలను ప్రకటించారు. ఫారం-1 నుంచి ఫారం-8 వరకు.. రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు అందజేసే సమయంలో రిజర్వేషన్లు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2,500, జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5వేలు ధరావత్తుగా చెల్లించాలి. రిజర్వేషన్లకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలు, ఎన్నికల నిబంధనలకు లోబడి ఉంటామన్న అఫిడవిట్లు, ఇతర అంశాలకు సంబంధించిన నిబంధనలతో ఫారం–1 నుంచి ఫారం–8 వరకు సమర్పించాలి. పార్టీల ముమ్మర కసరత్తు పోటీ చేసే అభ్యర్థులపై రాజకీయ పార్టీలు కసరత్తును ముమ్మరం చేశాయి. వైఎస్సార్ సీపీ, టీడీపీ పాటు కాంగ్రెస్ కూడా అన్ని స్థానాలకూ పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇందుకనుగుణంగా డివిజన్లలో సమర్థులైన అభ్యర్థుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానపార్టీలు ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నాయి. ఆర్వోలతో సమీక్ష నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి కమిషనర్ ఆలీమ్‌బాషా ఆదివారం సాయంత్రం రిటర్నింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ల స్వీకరణ, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. నామినేషన్లు స్వీకరించే ప్రాంతాలు 1నుంచి3 ఎంటీఎంసీహెచ్ స్కూల్, గొడారిగుంట జె.సింహాద్రి 4 నుంచి 6 ఎంసీ గరల్స్ హైస్కూల్, శ్రీనగర్ ఎం.వెంకటేశ్వరరావు 7 నుంచి 9 రామకృష్ణ పబ్లిక్‌స్కూల్, శాంతినగర్ కె.భీమేశ్వర్ 10 నుంచి 12 ఏఎంజీ స్కూల్, పర్లోపేట బి.సుగుణ 13 నుంచి 15 వీఎంఎంసీ స్కూల్, గౌరీశంకర్పేట ఎల్.శివకుమారి 16 నుంచి 18 బీఆర్ఆర్ఎంసీçహైస్కూల్, చర్చిస్క్వేర్ కె.పద్మావతి 19 నుంచి 21: ఎల్ఎంఎన్సీ స్కూల్, జె.రామారావుపేట ఎస్.ఎల్.జోసఫ్ 22 నుంచి 24 : జీఎంసీబీఎంసీ స్కూల్ అన్నమఘాటీ బి.ఆదినారాయణ 25 నుంచి 27: ఎంసీ బాలుర పాఠశాల, పరదేశమ్మపుపేట వై.జయ 28 నుంచి 30 సీబీఎంస్కూల్ సినిమారోడ్డు, ఎస్.పోతురాజు 31 నుంచి 33: ఆర్జీఎంసీ హైస్కూల్, ఆనందభారతి పీవీఎస్‌ఎస్‌ఆర్ శర్మ 34 నుంచి 36: పీర్ బాలికల పాఠశాల బాలాజీచెరువు, పి.విజయభాస్కర్ 37 నుంచి 39 : ఎంసీ ప్రైమరీ స్కూల్ రామారావుపేట, పీవీ థామస్ 40–41 : ఎంజీఎంసీ హైస్కూల్, గాంధీనగర్ సీహెచ్ కాశీవిశ్వనాథ్ 43నుంచి 45: బీజెఆర్ఎంసీ స్కూల్ నరన్ననగర్ వి.అబ్రహం లింకన్ 46–47 : ఆర్పీలైన్ స్కూల్, రిజర్వ్లైన్ వెంకటలక్ష్మి 49–50: ఎస్ఆర్పీ కేఎంఎంసీ స్కూల్, గైగోలుపాడు ఎస్.మధుసూదన్ -
సమరం వేళ షాక్..
-కార్పొరేషన్ ఎన్నికల ముందు టీడీపీకి కుదుపు -అధికార పార్టీని వీడిన మాజీ వైస్ చైర్మన్ ఇనుకొండ, మాజీ కార్పొరేటర్ కొలగాని -రాష్ట్రనేతల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిక కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీకి గట్టిషాక్ తగిలింది. ఆ పార్టీ నాయకుడు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇనుకొండ పట్టాభిరామయ్య, మాజీ కార్పొరేటర్ కొలగాని దుర్గాప్రసాద్ ఆదివారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గతంలో ప్రజాప్రతినిధులుగా సేవలందించిన వీరిద్దరూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో టీడీపీని వీడడంతో ఆ పార్టీ నేతలకు మింగుడు పడని పరిస్థితి నెలకొంది. వీరితోపాటు మరికొందరు నేతలు కూడా వైఎస్సార్ సీపీలో చేరనున్న సంకేతాలు టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. ఆ పార్టీ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరగడంతో పాటు వైఎస్సార్ సీపీ నానాటికీ ప్రజలకు చేరువవుతోందనడానికి వీరి చేరికలు మరింత బలాన్నిచ్చాయి. సోమవారం నుంచి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్న నేపథ్యంలో.. ఇనుకొండ, కొలగానిల చేరిక వైఎస్సార్సీపీలో శ్రేణుల్లో మరింత ఉత్తేజాన్నినింపింది. ఇది పార్టీకి మంచి పరిణామమని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి చేరిక.. కదనంలో అదనపు బలం ప్రజలతో సత్సంబంధాలు కలిగి, ప్రజాసమస్యల పరిష్కారానికి గతంలో ఎంతో కృషి చేసిన ఇనుకొండ, కొలగానిల చేరికతో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరగలదని ఆ పార్టీ రాష్ట్రనేతలు అన్నా రు. పార్టీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చిన ఇనుకొండ పట్టాభిరామయ్య, మాజీ కార్పొరేటర్ కొలగాని దుర్గాప్రసాద్‌లకు రాష్ట్రనేతలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వారిని ప్రత్యేకంగా అభినందించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే ధ్యేయంగా కష్టపడి పనిచేయాలని కోరారు. ద్వారంపూడి మాట్లాడుతూ ఒకప్పుడు తనకు మంచి స్నేహితులైన పట్టాభిరామయ్య, దుర్గాప్రసాద్ ఫ్రెండ్షిప్ డేన పార్టీలో చేరడం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. వీరివల్ల పార్టీకి అదనపు బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, సిటీ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, మాజీ కార్పొరేటర్ ఐ.శ్రీను, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బొబ్బిలి గోవిందు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేటర్లుగా విశిష్ట సేవలు వైఎస్సార్ సీపీలో చేరిన పట్టాభిరామయ్య గతంలో ఎన్నో సేవలు అందించారు. ప్రభాజోషఫ్, బీరక చంద్రశేఖర్ మున్సిపల్ చైర్మన్లుగా ఉన్న సమయంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆ తరువాత మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కూడా సేవలందించారు. దుర్గాప్రసాద్ 2005లో కార్పొరేటర్‌గా ఎన్నికై స్టాండింగ్ కమిటీ, శానిటేషన్ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. -
టీడీపీ నేతల గుండెల్లో గుబులు
– ఎన్నికలంటేనే హడలెత్తిపోతున్న పరిస్థితి – ఎన్నికను వాయిదా వేయించేందుకు విశ్వ ప్రయత్నాలు – ఫలించని పన్నాగం - ఎన్నికల కమిషన్ నిర్ణయంతో కంగుతిన్న నేతలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : పరిస్థితులు ఎక్కడా సానుకూలంగా లేవు. ప్రజావ్యతిరేకత రోజురోజుకీ ఎక్కువవుతోంది. అభివృద్ధి లేదు సరికదా అవినీతి పెరిగిపోయిందని ప్రజలు అంతెత్తున లేస్తున్నారు. దొరికినకాడికి దోచుకుంటుండడంతో మండిపడుతున్నారు. మోసపూరిత హామీలిచ్చి మోసగించారన్న ఆవేదనతో ప్రజానీకం ఉంది. అధికార పార్టీపై ఎక్కడ చూసినా అసంతృప్తే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలంటే ఆ పార్టీ నేతలే భయపడిపోతున్నారు. ఎలాగోలా ఎన్నిక గండం నుంచి గట్టెక్కాలన్న ఉద్దేశంతో పన్నాగం పన్నుతున్నారు. ఏదో ఓ కారణం చూపించి ఎన్నికలను వాయిదా వేయించేందుకు యత్నించినా ఫలించడం లేదు. న్యాయస్థానాలు అంగీకరించకపోవడంతో కొంతమంది టీడీపీ నేతలు చేసిన కుయుక్తులు బోర్లాపడ్డాయి. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనతో పోల్చి రూస్తే అవినీతి స్వైర విహారం చేస్తోంది ... అభివృద్ధి జాడే లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వాటి కోసం అడుగుతున్న వారిపై కేసులు పెడుతున్నారు. రకరకాలుగా వేధిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులగా చిత్రీకరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా కాపులనే తీసుకోవచ్చు. బీసీలో చేర్చాలని ఉద్యమం చేస్తుంటే ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడిది కాకినాడ కార్పొరేషన్ పరిధిలో తీవ్ర చర్చనీయాంశమయింది. టీడీపీ అంటేనే కాపులు మండిపడిపోతున్నారు. మోసగించడమే కాకుండా నానా రకాలుగా హింసిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. - జన్మభూమి కమిటీల పెత్తనమైతే అంతా ఇంతా కాదు. కమిటీ సభ్యుల ఆగడాలు పెచ్చుమీరిపోయి కార్పొరేషన్‌లోని ప్రతి డివిజన్‌లోనూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, తదితర సంక్షేమ కార్యక్రమాలన్నీ పచ్చచొక్కాలకే తప్ప అర్హులకు ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల జన్మభూమి కమిటీ సభ్యులే తమ భార్యల పేరిట వితంతు పింఛన్లు మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయి. - ఇక హౌసింగ్ పేరిట అక్రమాలకు పాల్పడ్డారు. స్థలం, మంజూరు లేకుండానే ఇళ్లు ఇస్తామంటూ లబ్ధిదారుల చేత డీడీలను కట్టించడమే కాకుండా పెద్ద ఎత్తున పర్సంటేజీలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. - మూడేళ్ల పాలనలో కాకినాడ నగర పరిస్థితి అధ్వానంగా తయారైంది. పారిశుద్ధ్య పరిస్థితులు దారుణంగా ఉండటంతో ఎక్కడికక్కడ వ్యాధులు ప్రబలుతున్నాయి. రోగాల బారిన పడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రజల్లో ఎక్కడ చూసినా వ్యతిరేకతే కనబడుతోంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేసి తప్పు చేశామని, బుద్ధి చెప్పేందుకు మళ్లీ ఎన్నికలెప్పుడొస్తాయా? అని నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేశాయి. కోర్టు ఆదేశాలతో ఏడేళ్ల విరామం అనంతరం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడిది టీడీపీలో గుబులు రేపుతోంది. ఎన్నికల వాయిదా వేయించేందుకు యత్నాలు ప్రజల నాడిని గమనించిన టీడీపీ నేతలు డైలామాలో పడ్డారు. అకస్మికంగా వచ్చిన నోటిఫికేషన్ చూసి కలవరపడ్డారు. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే గట్టెక్కలేమన్న భయం పట్టుకుంది. దీంతో ఎలాగైనా ఎన్నికలు వాయిదా వేయించాలన్న ఆలోచనకు వచ్చి రకరకాల పిటీషన్లు కోర్టులో వేయిస్తున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ సరిగా పాటించలేదని కొందరి చేత పిటీషన్ వేయించారు. ఎస్సీల రిజర్వేషన్ కూడా సరిగా లేదనే పిటీషన్ వేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు కోర్టులో పిటీషన్లు వేయిస్తూనే మరోవైపు అధికారుల చేత రకరకాల వాదనలు విన్పిస్తున్నారు. ముఖ్యంగా కోర్టు తాజా ఆదేశాల ప్రకారం రెండు డివిజన్లు (42,48) వదిలేసి మిగతా డివిజన్లలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అదెలా సాధ్యమంటూ అధికారుల చేత అభ్యంతరం తెలిపే ప్రయత్నం చేయిస్తున్నారు. ఆ రెండు డివిజన్లను వదిలేసి ఎన్నికలు నిర్వహిస్తే వాటి పరిస్థితేంటనే అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నెలకున్న సందిగ్ధం నేపథ్యంలో ప్రభుత్వ స్థాయిలో కూడా అధికారులపై ఒత్తిడి చేయించారన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయన్న సమాచారాన్ని శుక్రవారమైతే మెసెజ్‌ల రూపంలో పలువురు నేతలు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఎటువంటి భయం వద్దని...ఎన్నికలు వాయిదా పడతాయని...ధీమాగా ఉండొచ్చని ఓ నేత ద్వారా విస్తృతంగా మెసెజ్‌లు వెళ్లినట్టు నగరంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఎన్ని చేసినప్పటికీ అటు కోర్టులు, ఇటు ఎన్నికల సంఘం ఎలాగైనా ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబట్టడంతో టీడీపీ నేతలు షాక్ తిన్న పరిస్థితి నెలకుంది. -
కార్పొరేషన్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
- 48 డివిజన్లకు ఎలక్షన్ కమిషన్ ఆమోదం - ఇక యథావిధిగా ఎన్నికల ప్రక్రియ - 7 నుంచి నామినేషన్ల స్వీకరణ - ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం లు జారీ చేసింది. దీంతో గడచిన రెండు రోజులుగా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌కు అనుగుణంగా అవసరమైన సన్నాహాల్లో కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు. జీవో 83 సస్పెన్షన్... ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో మూడు పంచాయతీల విలీనానికి సంబంధించిన జీవోను సస్పెండ్ చేస్తూ కోర్టు ఉత్తర్వులివ్వడంతో ఎన్నికల కొనసాగింపుపై రెండు రోజులుగా సందిగ్ధానికి దారితీసింది. ఆ పంచాయతీలున్న డివిజన్లు వదిలేసి మిగతా 48 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించుకోవాలని స్పష్టం చేయడంతో అధికారులు సన్నద్ధం కాక తప్పలేదు. దీంతో కాకినాడలోని 42, 48 డివిజన్లలో ఎన్నికలు నిలుపుదల చేశారు. ఎన్నికల సంఘానికి లేఖ... కోర్టు ఆదేశాల నేపథ్యంలో గంగనాపల్లి, స్వామినగర్, ఎస్.అచ్యుతాపురం పంచాయతీలకు సంబంధించిన 42,48 డివిజన్లను పక్కన పెట్టి మిగిలిన డివిజన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు నగరపాలక సంస్థ సమాయత్తమైంది. ఈ మేరకు వివాదంలో రెండు డివిజన్లను మినహాయించి మిగిలిన 48 డివిజన్లలో ఎలక్షన్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ నెల 7వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కమిషనర్ ఆలీమ్ బాషా శనివారం సాయంత్రం లేఖ పంపించారు. స్పష్టత ఇచ్చిన ఈసీ కమిషనర్ పంపిన లేఖతో ఎన్నికల సంఘం శనివారం రాత్రి ఎన్నికల నిర్వహణపై కొత్త ఆదేశాలు జారీ చేశారు. ఆ రెండూ మినహాయించి మిగిలిన 48 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి శనివారం రాత్రి 8 గంటల సమయంలో కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏర్పాట్లలో అధికారులు... ఎన్నికల సంఘం నుంచి స్పష్టత రావడంతో ఈ నెల 7వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ దిశగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించి ప్రతి మూడు డివిజన్లకు ఒక్కో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం నియమించిన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఆర్వోలతో సమావేశం... కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కమిషనర్ ఆలీమ్ బాషా శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. 48 డివిజన్ల ఎన్నికలకు సంబంధించి ఆర్వోలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి మూడు డివిజన్లకు ఒక్కో కార్యాలయాన్ని, ఆర్వోను నియమించినందున నామినేషన్ల స్వీకరణకు ఆయా డివిజన్ కేంద్రాల్లో సోమవారం సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. -
కార్పొరేషన్ ఎన్నికలపై తర్జన భర్జన
కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో డైలమా పంచాయతీల విలీనమే అవరోధం నేడు స్పష్టత వచ్చే అవకాశం ఎన్నికల కోడ్ అమలులోకి కాకినాడ : ఏడేళ్ల తరువాత కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదలై 24 గంటలు గడవకముందే కొత్త సమస్య వచ్చిపడింది. ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్‌లో ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఎస్.అచ్యుతాపురం, గంగనాపల్లి, స్వామినగర్ గ్రామ పంచాయతీల విలీనంపై కొండా అప్పారావు, కోనాల కృష్ణతోపాటు పలువురు స్థానికులు వేసిన పిటీషన్ నేపథ్యంలో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 7వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ల స్వీకరణ జరగాల్సి ఉన్న తరుణంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రాజకీయవర్గాల్లో ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. కోర్టు ఉత్తర్వులు రాత్రి వరకు కూడా బయటకు రాకపోవడంతో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఒకందుకు వెళ్తే... కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి గతంలో దాఖలైన ప్రజాప్రయోజనాల వాజ్యం, కోర్టు ధిక్కార పిటీషన్లపై న్యాయస్థానం ఎదుట హాజరయ్యేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంఏ, కమిషనర్ అలీంబాషాతోపాటు అనేకమంది అధికారులు వెళ్ళారు. ఓ వైపు ఆ కేసుపై అధికారులు రికార్డులతో సహా కోర్టుముందు హాజరయ్యారు. అదే సమయంలో వేరొక కోర్టులో పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన కోర్టు ఆ మూడు పంచాయతీలను తొలగించి ఎన్నికలకు వెళ్లాలని ఆదేశాలిచ్చినట్టు సంకేతాలందాయి. ఈ ఆదేశాల ప్రకారం మూడు పంచాయతీలను తొలగిస్తే 42 ,48 డివిజన్ల పరిస్థితి డైలమాలోపడే పరిస్థితి నెలకొంది. ఏడవ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సిన నేపథ్యంలో ఆ మూడు పంచాయతీలను తొలగించి ఎలా ఎన్నికలు జరపాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఉత్తర్వులు అందక డైలమా కిందికోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పంచాయతీలను తొలగించి ఎన్నికలకు వెళ్ళాలంటే తిరిగి డివిజన్ల పునర్విభజన చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికలకు ఎలా వెళ్ళాలనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పునర్విభజన చేస్తే రిజర్వేషన్లు కూడా మారే అవకాశం ఉండడంతో ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాయిదా పడ్డాయంటూ పుకార్లు ఓ వైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలపై న్యాయస్థానం స్టే ఇచ్చిందంటూ రోజంతా పుకార్లు షికార్లు చేశాయి. కోర్టు ఉత్తర్వులు బయటకు రాకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయని కొందరు, స్టే వచ్చిందని మరికొందరు, రెండువారాలకు వాయిదా అంటూ మరికొందరు పేర్కొనడంతో రోజంతా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ రెండురోజులు మాత్రమే ఉండడం, అధికారికంగా ఎలాంటి సమాచారం రాకపోవడంతో అసలేం జరుగుతుందో తెలియక వివిధ రాజకీయపార్టీల నేతలు తలలు పట్టుకున్నారు. నేడు స్పష్టత వచ్చే అవకాశం కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని నగరపాలక సంస్థ అధికారుల సమాచారం. ఈ విషయమై పురపరిపాలనాశాఖ డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సహా కాకినాడ కార్పొరేషన్ కమిషనర్, ఇతర అధికారుల చర్చల అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. శనివారం కోర్టు ఉత్తర్వుల కాపీ కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఆ ఉత్తర్వులను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. మొత్తంమీద కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలపై రోజంతా తీవ్ర ఉత్కంఠ, తర్జన భర్జన చోటు చేసుకుంది. అమలులో ఎన్నికల కోడ్ ఇదిలా ఉండగా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ నెల 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. కులం, మతం పేరిట ఓట్లు అడగడం, దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ఎన్నికల ప్రచారం చేయడంపై ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలు చేయరాదని స్పష్టం చేసింది. లౌడ్స్పీకర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే ఉపయోగించాలని, పోలింగ్ నిర్వహించే 48 గంటల ముందు నుంచి ప్రచారం నిలిపివేయాలని స్పష్టం చేశారు. -
ఏడేళ్ళ తరువాత మోగిన నగారా
- ఆగస్టు 29న పోలింగ్ –1న ఫలితాలు - 7 నుంచి పది వరకు నామినేషన్లు - విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగింది. ఏడేళ్ల విరామం అనంతరం కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఊహించని విధంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఒక్కసారిగా అన్ని రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి రాజుకుంది. మరో మూడు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. నెలాఖరులోగా అన్ని ప్రక్రియలు పూర్తి చేసి సెప్టెంబర్ 1వ తేదీన ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఏడేళ్ల అనంతరం ఎన్నికలు... మున్సిపాలిటీగా ఉన్న కాకినాడను 2005లో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. అదే ఏడాది అక్టోబర్ 1న కార్పొరేషన్ తొలిపాలక వర్గం బాధ్యతలు చేపట్టింది. 2010 సెప్టెంబర్ 30తో పదవీకాలం కూడా ముగిసిపోయింది. కాంగ్రెస్ హయాంలోను, ప్రస్తుత టీడీపీ పాలనలోను ఇక్కడ ఎన్నికలు జరిపేందుకు సాహసం చేయలేక కుంటిసాకులతో వాయిదాలు వేస్తూ వచ్చారు. రాజకీయ కోణంలో వెనక్కి... ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాజకీయకోణంలోనే ఇక్కడి ఎన్నికలను చూడడంతో దాదాపు ఏడేళ్లుగా ప్రజలకు ప్రత్యేకాధికారి పాలనే దిక్కయింది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత వల్ల ఓటమి భయంతో రెండు ప్రభుత్వాలు ఎన్నికలకు ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవిగో ఎన్నికలంటే, అవిగో ఎన్నికలంటూ కాలయాపనతోనే మూడేళ్ళుగా రోజులు గడిపేశారు. మారని డివిజన్లు... తొలి కార్పొరేషన్ ఎన్నికల్లో ఉన్న 50 డివిజన్లతోనే ఇప్పుడు కూడా ఎన్నికలు జరపనున్నారు. అయితే మరోసారి వార్డుల పునర్విభజన జరగడంతో హద్దులు మారి రిజర్వేషన్లలో కూడా చాలా మార్పులు వచ్చాయి. మహిళలకు 50 శాతం... ప్రస్తుత ఎన్నికల్లో 50 శాతం మహిళలకు కార్పొరేటర్ సీట్లు కేటాయించనున్నారు. మహిళలకు సంబంధించి రెండు ఎస్సీ, ఎనిమిది బీసీ, 15 జనరల్ కోటాలోను పోటీ చేయనున్నారు. ఆ మేరకు రిజర్వేషన్లను కూడా నిర్ధారిస్తూ పురపరిపాలన శాఖ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్... ఆగస్టు 7–10 నామినేషన్లు ఆగస్టు 11 నామినేషన్ల పరిశీలన ఆగస్టు 16 నామినేషన్ల ఉపసంహరణ ఆగస్టు 29 ఎన్నికల పోలింగ్ ఆగస్టు 31 అవసరమైనచోట్ల రీ పోలింగ్ సెప్టెంబర్ 1 కౌంటింగ్, ఫలితాలు కాకినాడ కార్పొరేషన్ ప్రొఫెల్... మొత్తం డివిజన్లు 50 కార్పొరేషన్ ఓటర్లు 2,37,844 బీసీ ఓటర్లు 1,22,782 ఎస్సీలు 19,484 ఎస్టీలు 594 రిజర్వేషన్ల కేటాయింపు... బీసీలకు 17 ఎస్సీలకు 4 ఎస్టీ 1 మహిళలు (జనరల్) 15 అన్రిజర్వ్డ్ (జనరల్) 13 -
మళ్లీ కదలిక
కార్పొరేషన్ ఎన్నికలపై మరోసారి కదలిక కోర్టు వ్యాఖ్యలతో చిగురించిన ఆశలు ఒకటి రెండు నెలల్లో జరిగే అవకాశం కాకినాడ : ఓటమి భయంతో ఏడేళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా మోకాలడ్డిన ప్రభుత్వాలు ఇక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితి నెలకొంది. స్వయంగా అత్యున్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుని మొట్టికాయలు వేయడంతో ఒకటి, రెండు నెలల్లోనే కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ కూడా కుంటిసాకులతో ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. మున్సిపాలిటీగా ఉన్న కాకినాడను 2005 సెప్టెంబర్ 29న నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేస్తూ అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ తొలి కార్పొరేషన్ ఎన్నికలను 8 నెలల తరువాత పూర్తి చేసి 2005 సెప్టెంబర్ 30న తొలి పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. 2010 సెప్టెంబర్ 29న తొలి పాలకవర్గం పదవీకాలం ముగిసిపోయింది. ఆ తరువాత ఎన్నికలు నిర్వాహించాల్సి ఉండగా పంచాయతీల విలీనం సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతకాలంపాటు వాయిదాలు వేస్తూ వచ్చింది. ఆ తరువాత కొన్ని పంచాయతీలు న్యాయస్థానాలను ఆశ్రయించడం, మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికలకు ఆ పార్టీకి అనువుగా లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ఊసు ఎత్తలేదు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఎన్నికలు జరుగుతాయని ఆశించినా ఫలితం కనిపించలేదు. టీడీపీ విధానాలతో ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత పెరగడంతో ఈ ప్రభుత్వం కూడా ఎన్నికలపై వెనక్కి తగ్గింది. ఈ నేపద్యంలో కాకినాడకు చెందిన మాజీ కార్పొరేటర్ చిట్నీడి నారాయణమూర్తి న్యాయ స్థానంలో ప్రజాప్రయోజనాల వాజ్యాన్ని దాఖలు చేశారు. పాలకవర్గం లేక ప్రత్యేకాధికారిపాలనలో నగరపాలన స్తంభించి పోయిందని, నగర ప్రజలకు కనీస సదుపాయాలు అందడంలేదంటూ వేసిన వ్యాజ్యంపై కోర్టు గత ఏడాది సెప్టెంబర్ 24లోపు ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 45 రోజులు గడువు అడిగిన ప్రభుత్వం మళ్లీ ఏదో ఒకసాకుతో ఎన్నికలకు ముందుకు రాని పరిస్థితుల్లో ప్రభుత్వంపై సుమారు మూడు నెలల క్రితం కోర్టు ధిక్కార కేసును వేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కోర్టు కాకినాడ ఎన్నికలపై ఎందుకు ముందుకు వెళ్లడం లేదంటూ ప్రభుత్వాన్ని రెండు రోజుల క్రితం గట్టిగా ప్రశ్నించింది. ఆగస్టు 4వ తేదీన తమ ఎదుట వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర పురపాలకశాఖ కార్యదర్శులకు కూడా నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఎన్నికల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కొలిక్కి రానున్న ప్రక్రియ కోర్టు జోక్యం చేసుకుని ఆగస్టు 4 నాటికి స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఎన్నికలపై మరోసారి ఆశలు చిగురించాయి. ఇప్పటికే డివిజన్ల పునర్విభజన పూర్తి చేసి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించిన నగరపాలక సంస్థ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తి చేసింది. కోర్టు జోక్యంతో ఇక కుంటుసాకులు చెప్పే అవకాశం లేదంటున్నారు. ఆగస్టు 4వ తేదీన కోర్టు మరోసారి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉండడంతో త్వరలోనే ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం ముందుకు కదిలే అవకాశం ఉందంటున్నారు. అంతా అనుకున్నట్టే జరిగితే ఒకటిరెండు నెలల్లో ఏడేళ్ళ తరువాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. -
కళ్లెదుట దొంగలు..కనబడలేదట..!
♦ గుంటూరు కార్పొరేషన్లో పింఛన్ మాయంపై చర్యలు శూన్యం ♦ రూ. 3.50 లక్షలు కాజేసినట్లు తేల్చిన అధికారులు ♦ ముగ్గురు ఆర్ఐలు, పదిమందికిపైగా సిబ్బంది పాత్ర ఉన్నట్లు సమాచారం ♦ ఐదు నెలలు దాటుతున్నా విచారణ పేరుతో కాలయాపన ♦ కలెక్టర్ ఆదేశించినా పట్టించుకోని వైనం సాక్షి, గుంటూరు: స్థానిక నగరపాలక సంస్థలో ఈ ఏడాది ఫిబ్రవరిలో రెవెన్యూ అధికారులు, ఇతర సిబ్బంది కలిసి పింఛన్లు కాజేశారు. 147 మందికి సంబంధించి సుమారు రూ. 3.50 లక్షలు వారికి ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా రాసుకుని జేబులో వేసుకున్నారు. దీనిపై డీఆర్డీఏ అధికారులు విచారణ జరిపారు. ఇందులో టీసీఎస్ నుంచి టెక్నికల్ కో–ఆర్డినేటర్‌గా ఉన్న గోపి అనే వ్యక్తి సహకారంతో నగరపాలక సంస్థకు చెందిన రెవెన్యూలో కొందరు అధికారులు, ఉపాసెల్లోని సిబ్బంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అప్పటి కమిషనర్ నాగలక్ష్మికి లేఖ రాశారు. సీరియస్‌గా తీసుకున్న ఆమె క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని ఆదేశించారు. అయితే 25 రోజుల తర్వాత లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాఖాపరమైన విచారణ జరిపి నిందితులు ఎవరో చెబితే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. కమిషనర్ నాగలక్ష్మి బదిలీతో.. అనంతరం కమిషనర్ నాగలక్ష్మి బదిలీ కావడంతో ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. కనీసం కమిషనర్ అథంటికేషన్ మార్చి పింఛన్ డబ్బులు కాజేసిన గోపిపై టీసీఎస్‌కు ఫిర్యాదు కూడా చేయకపోవడంతో డీఆర్డీఏ అధికారులే ఆ పని కూడా చేశారు. దీనిపై సీరియస్‌గా దృష్టి సారించిన కలెక్టర్ పింఛను కాజేసిన వ్యవహారంపై ఆరా తీయడంతోపాటు విచారణ ఎంత వరకు వచ్చిందంటూ కార్పొరేషన్ అధికారులను వివరణ కోరారు. దీంతో డీసీ –2ను విచారణ అధికారిగా నియమించామంటూ కలెక్టర్‌కు సమాధానం ఇచ్చారు. ఐదు నెలలు గడిచినా.. సంఘటన జరిగి ఐదు నెలలు దాటుతున్నా ఇంత వరకు విచారణ పూర్తి కాలేదు. జిల్లాలో పింఛను డబ్బులు పంచే అధికారులకు ఎంపీడీవోలు చెక్కు ఇస్తుంటారు. కార్పొరేషన్లో మాత్రం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పింఛన్ పంపిణీ చేస్తారు. వీరికి రెవెన్యూ అధికారులు నేరుగా డబ్బులు ఇచ్చి, మిగిలిన డబ్బులు తిరిగి తీసుకుంటారు. ఇక్కడ పింఛన్ గోల్‌మాల్‌లో నగరపాలక సంస్థకు చెందిన ముగ్గురు ఆర్ఐలు, పది మందికిపైగా ఉపాసెల్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు సమాచారం. రాజకీయ పైరవీలు అక్రమార్కులు హైదరాబాద్ వెళ్లి సర్వర్‌లో తమ పేరు తొలగించుకొనేందుకు ప్రయత్నించినా కుదరలేదని దీంతో విచారణలో తమ పేర్లు రాకుండా అధికార పార్టీ నేతల ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిసింది. విచారణ వేగవంతం చేస్తాం: కమిషనర్ అనూరాధ పింఛన్ గోల్మాల్ వ్యవహారంలో విచారణ వేగవంతం చేస్తున్నాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిందితులు తేలితే ఉపేక్షించబోం. -
కార్పొరేషన్లో అక్రమ వసూళ్లు తగవు: ఎమ్మెల్యే అనిల్
► పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలి నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కార్పొరేషన్లో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. 53వ డివిజన్ వెంకటేశ్వరపురంలో శుక్రవారం పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో 300 కుటుంబాలు మరుగుదొడ్లకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ విషయమై పలుమార్లు అధికారులకు తెలియజేసినా నేటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. భగత్‌సింగ్‌కాలనీ, జనార్దన్రెడ్డికాలనీల్లో మరుగుదొడ్లను నిర్మించుకునే వారి నుంచి ఇంటికి రూ.రెండు వేలు వసూలు చేశారని, అయితే నేటికీ ఆ దరఖాస్తులను పరిశీలించే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీర్లకు గతంలో కట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించాల్సిన బాధ్యత ఉందన్నారు. టెండర్ తీసుకున్న వారు వేగవంతంగా నిర్మాణ పనులను చేపట్టడంలేదని ఆరోపించారు. హౌస్ ఫర్ ఆల్ కింద స్థలం ఉంటే ఇల్లు కట్టుకోమని చెప్తున్నారని, అయితే వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ ప్రాంతాల్లో ఇంటి ప్లాన్‌కు కార్పొరేషన్ రూ.700 నిర్ణయిస్తే నిరుపేదల వద్ద రూ.1500 వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌నగర్‌లో జరిగిన అవకతవకలపై అధికారులను సస్పెండ్ చేశారని, దీన్ని కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ వసూళ్లలో అధికారుల ప్రమేయం ఉంటే వారికి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ ప్రాంతంలో 30 కరెంట్ స్తంభాలను వేయించాల్సిన అవసరం ఉందని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్పొరేటర్లు దేవరకొండ అశోక్, ఓబిలి రవిచంద్ర, నాయకులు నాగరాజు, నాగభూషణం, జాకీర్, జమీర్, కేవీఆర్ శ్రీను, వెంకటేశ్వర్లు, అన్వర్, హర్షద్, కరిముల్లా, ప్రసాద్, సుధాకర్, సంక్రాంతి కల్యాణ్, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయండి
– ఎంపీ బుట్టా రేణుకను కలిసిన ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి ప్రతినిధులు కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి జిల్లా శాఖ నాయకులు ఎంపీ బుట్టారేణుకను కోరారు. సోమవారం వారు ఎంపీని జోహరాపురంలోని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఇల్లూరి సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్యవైశ్యులకు వ్యాపార, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. నామినేటెడ్ పదవులు కూడా దక్కడం లేదన్నారు. ఆర్యవైశ్యుల్లో చాలా మంది పేదలు ఉన్నారని, వారికి కారొ్పరేషన్ ఉంటే మేలు జరుగుతుందన్నారు. దీనిపై ఎంపీ బుట్టా రేణుక సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీని వారు శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విఠల్‌శెట్టి, ప్రతినిధులు నాగేళ్ల రాజగోపాల్, గూడూరుగోపాల్, విజయ్, భాస్కర్, శేషగిరిశెట్టి, కె.కిరణ్, కె.నవీన్, కె.కిశోర్, పి.సుధాకర్, వి.హరి, జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు జ్ఙానేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
8 కార్పొరేషన్లకు చైర్మన్లు..
- యువతకు, ఉద్యమ నేతలకు అవకాశమిచ్చిన కేసీఆర్ - టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలిగా గుండు సుధారాణి - విద్యార్థి సమితి అధ్యక్షుడిగా శ్రీనివాసయాదవ్ సాక్షి, హైదరాబాద్: నామినేటేడ్ పదవుల భర్తీలో భాగంగా సీఎం కేసీఆర్ సోమవారం రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. వాటితో పాటు టీఆర్ఎస్ మహిళా, విద్యార్థి విభాగాల అధ్యక్షులనూ ప్రకటించారు. ఈ నియామకాల్లో యువతకు, ఉద్యమ సమయంలో క్రియాశీల పాత్ర పోషించిన నాయకులకు అవకాశమిచ్చారు. ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా.. మరో పదవి కోసం మెదక్ డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ఎలక్షన్‌రెడ్డి పేరును కూడా సీఎం ఖరారు చేశారు. అయితే ఎలక్షన్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నందున.. హైదరాబాద్‌కు రాగానే ఆయనకు ఏ కార్పొరే షన్ బాధ్యతలు అప్పగించాలనేది నిర్ణయించ నున్నట్లు తెలిపారు. ఇక టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాజీ ఎంపీ గుండు సుధారాణిని.. తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అధ్యక్షుడిగా ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నాయకుడు, కరీంనగర్ జిల్లాకు చెందిన గెల్లు శ్రీనివాసయాదవ్‌ను నియమించారు. మొత్తంగా జూన్ 2వ తేదీన జరుగనున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు ముందు పదవుల భర్తీ చేపట్టడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. చైర్మన్లుగా నియామకాలు ఇవీ.. ► రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్: తూముకుంట నర్సారెడ్డి (గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే) ► విమెన్ కో– ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్: గుండు సుధారాణి (మాజీ ఎంపీ, వరంగల్ జిల్లా) ► హౌజింగ్ కార్పొరేషన్: మడుపు భూంరెడ్డి (మెదక్ జిల్లా) ► గిరిజన కో– ఆపరేటివ్ కార్పొరేషన్: గాంధీ నాయక్ (వరంగల్ జిల్లా) ► ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్: పుష్కర్ రామ్మోహన్రావు (ఆదిలాబాద్, మందమర్రి) ► వికలాంగుల అభివృద్ధి సంస్థ: కె.వాసుదేవరెడ్డి (కాకతీయ వర్సిటీ విద్యార్థి నాయకుడు) ► మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్: ప్రేమ్‌సింగ్ రాథోడ్ (గోషామహల్ మాజీ ఎమ్మెల్యే) ► టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్: డాక్టర్ చిరుమిల్ల రాకేశ్‌కుమార్ (ఓయూ విద్యార్థి నాయకుడు, పెద్దపల్లి) -
పారిశుద్ధ్యం కార్మికుల్లోనూ పార్టీ క్యాడరే...
– రాజమహేంద్రవరం కార్పొరేషన్లో లీలలు – నోటీసులివ్వకుండా 31 మంది తొలగింపు – వారి స్థానంలో కొత్తవారు 26 మంది నియామకం – టీడీపీ కార్పొరేటర్ల బంధువులు, అనుచరులే సాక్షి, రాజమహేంద్రవరం: బాబు వస్తే.. జాబు వస్తుందన్న ఎన్నికల వేళ ఊరూవాడా ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆ హామీని తమ విషయంలో తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు చంద్రబాబు ఎరుగు... ఉన్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలు ఊడగొడుతున్నారు. వారి స్థానంలో అధికార పార్టీ నేతలు అధికారుల అండతో తమ బంధువులు, కార్యకర్తలను నియమించుకుంటున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫిబ్రవరి 10వ తేదీన 31 మంది కార్మికులను విధులకు హాజరు కావడం లేదన్న సాకుతో తొలగించింది. కనీసం నోటీసులిచ్చి వారి వివరణ అడగకుండానే నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కార్మికులు నగరపాలక సంస్థ కమిషనర్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించినా ఫలితం లేదు. ఫలితంగా పక్షం రోజులుగా బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. తొలగించిన 31 మంది కార్మికులు 180 రోజుల్లో 100 రోజులు పనిలోకి రాకపోవడంతో వారిని విధుల నుంచి తొలగించామని, మరో పది మందిని కూడా తొలగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కమిషనర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. 180 రోజులు ఎప్పటి నుంచి లెక్కించారు..? 180 రోజులకుగాను 100 రోజులు పనిలోకి రాలేదని కమిషనర్ ప్రకటించడాన్ని కార్మికులు తోసిపుచ్చుతున్నారు. తాము వరుసగా 15 రోజులు మాత్రమే హాజరు కాలేదని పేర్కొంటున్నారు. అది కూడా తమ కుల దేవత వడ్ది పోలమాంబ, కుంచమాంబ ఉత్సవాలు 45 రోజులపాటు చేసిన సమయంలోనే విధులకు హాజరు కాలేదని చెబుతున్నారు. ఓడీఎఫ్ జాబితాలో నగరం చేరాలంటే మీరు హాజరు కావాలని కమిషనర్ ఆదేశించడంతో జాతర ముగింపును జనవరి 10 నుంచి 17వ తేదీకి వాయిదా వేసుకున్నామని, జాతర నవంబర్ 4న మొదలై జనవరి 17న ముగిసిందని, ఈ మధ్యలో తాము 15 రోజులు ఉత్సవాల నిర్వహణలో ఉన్నామని బాధితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన తమను విధుల నుంచి తొలగించారని, అయితే డిసెంబర్ నుంచి మే నెల వరకు జరిగిన రోజులను పరిగణనలోకి తీసుకుని 180 రోజుల్లో తాము 100 రోజులు విధులకు హాజరు కాలేదని చెప్పడం తగదంటున్నారు. కార్మికుల స్థానంలో తమ్ముళ్లకు ఉద్యోగాలు... తొలగించిన 31 మంది పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో 26 మందిని తీసుకున్నామని, వీరిలో 8 మంది డ్రైవర్లు, 10 మంది కార్మికులు, ఇతరులు మేస్త్రీలు ఉన్నారని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. అయితే వారి వివరాలు ఇవ్వాలని అడగ్గా కమిషనర్ ఆదేశాలు లేనిదే తాము ఇవ్వలేమంటున్నారు. ఇదే విషయం కౌన్సిల్‌కు మూడు రోజులు ముందు తాము అడిగినా అది రహస్యమని, ఇవ్వడానికి నిబంధనలు ఒప్పకోవని చెప్పారని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. తొలగించిన కార్మికుల స్థానంలో నియమించిన వారిలో టీడీపీ కార్పొరేటర్ల బంధువులు, కార్యకర్తలు ఉన్నారన్న బలమైన ఆరోపణలున్నాయి. టీడీపీ మహిళా కార్పొరేటర్ కుమారుడిని, మరో మహిళా కార్పొరేటర్ బంధువును మేస్త్రీలుగా నియమించారని తొలగించిన కార్మికులు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. కొత్తగా నియమించిన 26 మంది వివరాలు ప్రకటించాలని ప్రతిపక్ష కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. తొలగించిన వారిలో 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నవారున్నారని, వారిలో వితంతువులు, ఏ ఆధారం లేని వారున్నారని విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా నియమించిన వారి వివరాలు ఇవ్వడంలేదు.. కార్మికులను అన్యాయంగా తొలగించారు. వారి స్థానంలో టీడీపీ కార్పొరేటర్ల బంధువులు, కార్యకర్తలను నియమించారు. 31 మందికి బదులుగా తీసుకున్న వారి జాబితా అడిగితే ఇవ్వడంలేదు. అది రహస్యం, ఇవ్వకూడదని కమిషనర్ చెప్పారని పబ్లిక్ హెల్త్ అధికారులు చెబుతున్నారు. – ఈతకోట బాపన సుధారాణి, 14వ డివిజన్ కార్పొరేటర్ కార్మికులను న్యాయం చేయకపోతే ఆందోళనలు... నోటీసులు ఇవ్వకుండా, కనీసం వారి వివరణ అడగకుండా ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగించడం అన్యాయం. 180 రోజులను ఎప్పటి నుంచి తీసుకుని 100 రోజులు శెలవులు పెట్టారో అధికారులు చెప్పాలి. వారు అన్ని రోజులు సెలవులు పెడుతుంటే శానిటరీ మేస్త్రీలు, సూపర్వైజర్లు ఏం చేస్తున్నారు? రెండు మూడు రోజులు సెలవు పెట్టినప్పుడే ఎందుకు హెచ్చరించ లేదు. కార్మికులకు న్యాయం చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనలు తప్పవు. – జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు. -
ప్రజా సమస్యలు గాలికి..సమావేశాలు దేనికి?
– ప్రజా సమస్యలు గాలి వదిలేసిన అధికార పార్టీ – ప్రతిపక్ష నేత వైఎస్. జగన్‌పై దూషణలు – ఘాటుగా స్పందించిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు – పింఛన్లు, బీసీ, కాపు, ఎస్సీ రుణాలపై నిలదీత – జన్మభూమి కమిటీలపై ఎండగట్టిన వైసీపీ నేతలు – వాగ్వాదంతో ప్రతిపక్ష కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్ రాజమహేంద్రవరం నగరపాలక మండలి సాధారణ సమావేశం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దూషణకు వేదికగా నిలిచింది. అధికారపార్టీ నేతల అక్రమాలు, దోపిడీ, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న జన్మభూమి కమిటీలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నిలదీయడంతో టీడీపీ వర్గీయులు వ్యక్తిగత దూషణలకు దిగారు. సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరపాలక మండలి సాధారణ సమావేశం పూర్తిగా వ్యక్తిగత దూషణలకు వేదికగా మారింది. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని దూషిస్తూ కాలం గడిపేశారు. అధికారపార్టీ నేతల అక్రమాలు, దోపిడీ, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న జన్మభూమి కమిటీలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నిలదీయడంతో టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, టీడీపీ సీనియర్ కార్పొరేటర్లు వ్యక్తిగత దూషణలకు దిగారు. ‘నీకు ఎమ్మెల్సీ పదవి జగన్ పెట్టిన భిక్షే’ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దొంగలు, దోపిడీదారులు అంటూ టీడీపీ ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మాట్లాడడంతో వారు ఎవరో చెప్పాలని వైఎస్సార్ సీపీ చీఫ్‌విప్ మింది నాగేంద్ర డిమాండ్ చేశారు. దోపిడీలు, భూకబ్జాలు మీరు చేస్తూ దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, ఈతకోటి బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం మాట్లాడారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆదిరెడ్డి, వర్రే, వాసిరెడ్డి ఎదురుదాడి చేశారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి వైఎస్ జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో స్పందించిన వైఎస్సార్సీపీ సభ్యులు ‘నీకు ఎమ్మెల్సీ పదవి జగన్ పెట్టిన బిక్షేనన్న విషయం గుర్తుంచుకోవాలి’ అంటూ ఆదిరెడ్డికి చురక అంటించారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, వర్రే శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. పింఛన్ల అక్రమాలపై విచారణ చేసి దొంగలు ఎవరో తేల్చాలని మింది నాగేంద్ర సవాల్ విసిరారు. బీసీ, ఎస్సీ, కాపు రుణాలు సకాలంలో మంజూరు చేయకుండా కమిటీ ఆమోదం పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సబ్సిడీ నగదు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల్లో సభ్యులుగా సామాజిక కార్యకర్తలు ఉండాలని కమిషనర్ చెప్పగా, అందులో టీడీపీ కార్యకర్తలను ఎలా నియమించారని నాగేంద్ర ప్రశ్నించారు. ప్రభుత్వం మాది మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామని వర్రే, వాసిరెడ్డి దురుసుగా సమాధానమిచ్చారు. ఇదా మీరు చేస్తున్న అభివృద్ధి...? సీఎం చంద్రబాబు పుష్కరాలకు నిధులు ఇవ్వడంతోనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి అఖండ గోదావరికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉన్నా బీపీఎస్ నిధులు రూ.20 కోట్లు కేటాయించడమా? చంద్రబాబు, పాలక మండలి చేసింది? అని ప్రశ్నించారు. పుష్కరాల పనుల్లో అవినీతి జరిగిందని తమతో లేఖలు రాయించిన ఆదిరెడ్డి ఇప్పడు టీడీపీలో చేరిన తర్వాత చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం నీతిమయమైందా? అని నిలదీశారు. ఏ ఎండకు ఆ గోడుకు పట్టే ఆదిరెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని మండిపడ్డారు. ఈ క్రమంలో వాగ్వివాదం పెరగడంతో టీడీపీ ఫ్లోర్‌లీడర్ వర్రే ప్రతిపాదన మేరకు మేయర్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసి బలవంతంగా బయటకు పంపించేశారు. దోపిడీ, దౌర్జన్య పాలన సాగుతోంది అనంతరం మేడపాటి షర్మిలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ క్వశ్చన్ అవర్ అని రెండు నిమిషాలు కూడా ఇవ్వకుండా ఉంటే ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావిస్తామని ప్రశ్నించారు. టీడీపీ కార్పొరేటర్లు ప్రతి పనిలో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. మేయర్ టీడీపీ ఫ్లోర్‌లీడర్ వర్రే చెప్పినట్టు నడుస్తున్నారని ఆరోపించారు. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ మురళీధర్ మాట్లాడుతూ నగరంలో రోడ్డుపక్కల వ్యాపారం చేసుకునే బడుగు జీవులకు అన్యాయం జరిగింది. దీనిపై మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వలేదని మండిపడ్డారు. బొంతా శ్రీహరి మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు బీపీఎస్ నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. -
దద్దరిల్లిన ధర్నాలు
కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై కన్నెర్ర కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వందమందికి పైగా మున్సిపల్ కార్మికుల అరెస్ట్ తాడితోట (రాజమహేంద్రవరం సిటీ) : మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తుండగా మరో పక్క మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నాలతో దద్దరిల్లింది. సీపీఐ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కిర్ల కృష్ణారావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ, రెల్లికుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో తొలగించిన 31 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి కార్పొరేషన్ గేటు వద్ద బైఠాయించారు. 20 ఏళ్లుగా కార్పొరేషన్లో కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న వీరికి నోటీసులు ఇవ్వకుండానే తొలగించడం దారుణమన్నారు. 1998లో అప్పటి మున్సిపల్ కమిషనర్ వికాస్‌రాజ్ వీరికి అవకాశం కల్పించారని అన్నారు. కమిషనర్ ఆనాలోచిత చర్యల వల్ల 31 కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని, తొలగించిన 15 రోజులకూ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 151 జీఓ అమలు, జీతాలు సక్రమంగా చెల్లించాలని వారు కోరారు. వందమంది పైగా అరెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఆందోళన చేపట్టిన సీపీఐ, మున్సిపల్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వంద మందిని పైగా అరెస్ట్ చేసి త్రీటౌన్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిపై కేసులు నమోదు చేసి సొంత పూచీకత్తులపై విడుదల చేశారు. అరెస్ట్ అయిన వారిలో కిర్ల కృష్ణారావు, మీసాల సత్యనారాయణ, జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు వంగమూడి కొండల రావు, కార్యనిర్వాహక కార్యదర్శి నల్లా రామారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉన్నారు. ఆశీల వ్యవహారంపై సీపీఎం ఆందోళన చిరు వ్యాపారులపై పెంచిన ఆశీల వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కార్పొరేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. పెంచిన ఆశీల భారంపై నగర పాలక సంస్ధ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు కౌన్సిల్ సమావేశంలో వద్దకు చేరుకున్నారు. ఈమేరకు వారు వినతిపత్రాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లు, కార్పొరేటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ మాట్లాడుతూ నగరంలో స్వయం ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారుల జీవనోపాధిపై దెబ్బకొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు చేసిన తప్పుకు చిరు వ్యాపారులు బలైపోతున్నారని అన్నారు. జైలు రోడ్డులో చిరువ్యాపారులను తొలగించారని వారిని అక్కడే వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పి.వెంకటేశ్వరరావు, ఎన్.రంగ, పి.తులసి, ఐ.సుబ్రహ్మణ్యం, కేవీపీఎస్ నాయకులు రూపస్‌రావు, రాజా తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు సీపీఎం నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. -
పెంచు.. పంచు!
కార్పొరేషన్ పనులపై విజిలెన్స్! – పుష్కర పనులపై కూడా.. – నేరుగా ఫిర్యాదు చేసిన చిన్న కాంట్రాక్టర్లు - అంచనా విలువ భారీగా పెంపు - అన్నింటా కమీషన్ల వ్యవహారం – త్వరలో విచారణ షురూ సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులపై విజిలెన్స్ కన్నుపడింది. గత ఏడాది కాలంగా చేపడుతున్న మొత్తం పనుల నాణ్యతతో పాటు టెండర్ల వ్యవహారంపైనా విజిలెన్స్ దృష్టి సారించనుంది. ఈ మేరకు కార్పొరేషన్లో జరుగుతున్న టెండర్ల బాగోతంపై చిన్న కాంట్రాక్టర్లు ఫిర్యాదు నేపథ్యంలో విజిలెన్స్ కన్నుపడినట్టు సమాచారం. కార్పొరేషన్ పరిధిలో టెండర్ల అంచనా విలువను కోటి రూపాయల కంటే అదనంగా పెంచి చూపించడం ద్వారా కేవలం పెద్ద కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా చూస్తున్నారని ఈ ఫిర్యాదులో చిన్న కాంట్రాక్టర్లు పేర్కొన్నట్టు తెలిసింది. కృష్ణా పుష్కరాల సందర్భంగా జరిగిన పనులపైనా అనేక ఫిర్యాదులు అందినట్టు సమాచారం. అంతేకాకుండా పెద్ద కాంట్రాక్టర్లు రింగుగా ఏర్పడి టెండర్ విలువ కంటే అదనంగా 5 నుంచి 10 శాతం వరకూ అధిక ధరలను కోట్ చేస్తున్నారని వివరించారు. తద్వారా 10 నుంచి 15 శాతం వరకూ తక్కువ ధరకే కోట్ కావాల్సిన టెండర్లు కాస్తా అధిక ధరతో కార్పొరేషన్ ఖజానాకు గండిపడుతుందని పేర్కొన్నారు. ప్రధానంగా గత ఏడాది కాలంగా జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని విజిలెన్స్‌కు ఇచ్చిన ఫిర్యాదులో వీరు కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ టెండర్ల బాగోతంపై విజిలెన్స్ విచారణ ప్రారంభించనున్నట్టు తెలిసింది. పనులన్నీ పెద్ద కాంట్రాక్టర్లకే.. కార్పొరేషన్లో వాస్తవ పనుల విలువ కంటే అధిక ధరను పెంచేస్తున్నారని.. తద్వారా పనులన్నీ పెద్ద కాంట్రాక్టర్లకే దక్కేలా చూస్తున్నారని ప్రధాన ఫిర్యాదు. వాస్తవానికి రూ.90 లక్షల విలువైన పనుల అంచనా వ్యయాన్ని కూడా కోటి రూపాయలకంటే అదనంగా పెంచి టెండర్లను పిలిచారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. తద్వారా కేవలం ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లు మాత్రమే బరిలో నిలుస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య అధికార పార్టీ నేత రింగు ఏర్పడేలా చేసి అధిక ధరకు టెండర్లను దాఖలు చేయిస్తున్నారు. తద్వారా కమీషన్ రూపంలో 10 శాతం మేరకు నొక్కేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా చిన్న కాంట్రాక్టర్లకు పెద్దగా పనులు లేకుండా పోతున్నాయి. అంతేకాకుండా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు కూడా పనులు చేయకుండా అధికార పార్టీ నేతలకు చెందిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తున్నారు. ఫలితంగా నాణ్యత నగుబాటు అవుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద కాంట్రాక్టర్ల జేబులు నింపే విధంగా జరుగుతున్న మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను చిన్న కాంట్రాక్టర్లను కోరినట్టు తెలిసింది. ఇందుకోసం ఎక్కడెక్కడ అంచనా విలువలను రూ.80 లక్షలు–రూ.90 లక్షల విలువైన పనులను కోటి రూపాయలకు దాటించారనే సమాచారాన్ని కూడా విజిలెన్స్ అధికారులో చేతిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఖజానాకు 20 శాతం నష్టం కర్నూలు కార్పొరేషన్లో జరిగే పనులను దక్కించుకునేందుకు కాంట్రాక్టు సంస్థల మధ్య పోటీ ఉంది. ఈ పోటీలో భాగంగా ఒక్కో కాంట్రాక్టు పనికి 10 నుంచి 15 శాతం వరకూ తక్కువ ధరకే టెండర్లు వేస్తున్నారు. అయితే, అంచనా విలువను కోటి రూపాయలకుపైగా పెంచడంతో చిన్న కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొనే అర్హతను కోల్పోతున్నారు. తద్వారా కేవలం నలుగురైదుగురు ఉన్న పెద్ద కాంట్రాక్టర్లు కాస్తా అధిక ధరకు టెండర్లను దక్కించుకుంటున్నారు. ఈ విధంగా 5 నుంచి 10 శాతం వరకూ అధిక ధరను కోట్ చేస్తున్నారు. ఫలితంగా 10 నుంచి 15 శాతం తక్కువకే దక్కాల్సిన పనులు కాస్తా 5–10 శాతం అధిక ధరకు టెండర్లను కార్పొరేషన్ అప్పగించాల్సి వస్తోంది. ఫలితంగా 15 నుంచి 20 శాతం వరకూ కర్నూలు కార్పొరేషన్ ఆదాయాన్ని కోల్పోతుందని తమ ఫిర్యాదులో చిన్న కాంట్రాక్టర్లు వాపోయినట్టు తెలిసింది. ఈ విధంగా వందల కోట్ల పనుల్లో కార్పొరేషన్‌కు కూడా కోట్లలోనే గండిపడుతోందని వివరించారు. దీంతో విజిలెన్స్ అధికారుల విచారణ షురూ కానున్నట్టు సమాచారం. -
అటు సొసైటీ.. ఇటు కార్పొరేషన్
రాజీవ్ స్వగృహ ఇళ్ల యజమానులకు కొత్త కష్టాలు సాక్షి, మహబూబ్‌నగర్: సొంతింటి కలను నెరవేర్చే గొప్ప ఆలోచనతో మొదలైన రాజీవ్ స్వగృహ.. అధికారుల తీరుతో లబ్ధిదారులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్‌లో ‘షెడ్యుల్–బి’ని చేర్చి మరొకరికి హక్కులు కల్పించారని లబ్ధిదారులు వాపోతున్నారు.రాజీవ్ స్వగృహ కింద రాష్ట్రంలో ఆదిలాబాద్, బండ్లగూడ, పోచారం, తాండూరు, మహబూబ్‌నగర్, రామగుండం, చందానగర్, గద్వాలలో చేపట్టిన ప్రాజెక్టులలో ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు నిర్వహణ రుసుం కింద డబ్బులు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఒకవైపు సొసైటీ నిర్వాహకుల తీరు.. మరోవైపు కార్పొరేషన్ అధికారుల చర్యలతో స్వగృహ యజమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతా షెడ్యూల్–బితోనే.. రాజీవ్ స్వగృహ ఇళ్ల విషయంలో కిరికిరంతా షెడ్యూల్–బి కారణంగానే తలెత్తింది. ఇళ్ల రిజిస్ట్రేషన్ సమయంలో కచ్చితంగా సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని స్వగృహ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. సొసైటీతో సంబంధం లేకుండానే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉన్నా రూ.1,200 చెల్లించి బలవంతంగా సభ్యత్వం తీసుకునేలా చేశారు. దీంతో షెడ్యూల్–బి కారణంగా స్వగృహలోని ఇళ్లపై అక్కడి సొసైటీకి సర్వహక్కులు కల్పించినట్లయింది. సొసైటీ నిబంధనలకు యజమానులు కట్టుబడి ఉండాల్సి వస్తోంది. నల్లా, విద్యుత్ కనెక్షన్ సహా ఇతర విషయాల్లో సొసైటీ నిర్వాహకుల చర్యలతో యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకు నుంచి రుణం పొందాలన్నా సొసైటీ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొనుగోలుదారులకు నోటీసులు స్వగృహ ఇళ్ల కొనుగోలుదారులకు తాజాగా కార్పొరేషన్ నుంచి నోటీసులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహణ రుసుం పేరిట ఒక్కొక్క ఇంటికి రూ.9,000 చెల్లించాలంటూ నోటీసులిచ్చారు. వీధిలైట్ల కరెంట్ బిల్లు సొసైటీ నుంచి వసూలు చేయాల్సి ఉండగా.. తమకు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. సొసైటీ సభ్యత్వ రుసుం పేరిట రూ.1,200, నల్లా కనెక్షన్ కోసం వసూలు చేసిన రూ.3 వేలు సొసైటీ వద్దే ఉన్నాయని.. నిర్వహణ చార్జీలు కూడా వారినుంచి తీసుకోవాలంటున్నారు. నిర్వహణ బిల్లు చెల్లించాల్సిందే 2015 నుంచి విద్యుత్, వాటర్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లుగా సొసైటీగానీ, ఇళ్ల యజమానులుగానీ వీటిని చెల్లించలేదు. ఇప్పటి వరకు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంది. సొసైటీ ముందుకు రాకపోవడంతో యజమానులకు నోటీసులు జారీ చేశాం. ఒక్కొక్కరూ రూ.9 వేలు చెల్లించాలని సూచించాం. యాజమాన్య హక్కులకు సంబంధించి షెడ్యూల్–బి విషయం ప్రభుత్వంతో తేల్చుకోవాల్సిందే. – శ్రీనివాస్, రాజీవ్‌స్వగృహ జీఎం, మహబూబ్‌నగర్ -
ఆశీలు కాంట్రాక్టర్లకు నోటీసులు
హెచ్చరించిన నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు ఆశీలు రేట్లపై చిరు వ్యాపారులకు అవగాహన సాక్షి, రాజమహేంద్రవరం : నిబంధనలకు విరుద్ధంగా ఆశీలు వసూలు చేస్తే కాంట్రాక్టలు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టిస్తామని ఆశీలు కాంట్రాక్టర్లకు నగరపాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు హెచ్చరించారు. ‘ఆశీలు దందా’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లోన వచ్చిన కథనానికి కమిషనర్ స్పందించారు. రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ మార్కెట్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో ఆశీలు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లకు నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. నగరపాలక సంస్థ నిర్ణయించిన రేట్ల కంటే అధిక మొత్తంలో సైకిళ్లు, మోటారు సైకిళ్లపై వ్యాపారాలు చేసుకునే వారి వద్ద వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులు, ‘సాక్షి’లో వచ్చిన కథనాలతో అధికారులు చర్యలు ప్రారంభించారు. అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఆల్కాట్ తోట కాంట్రాక్టర్ జి.సాయిబాబు, జాంపేట మార్కెట్ కాంట్రాక్టర్ డి.శ్రీనివాస్, మునికుట్ల అచ్యుతరామయ్య మార్కెట్ (కంబాలచెరువు) కాంట్రాక్టర్ ఎం.చంద్రరావులకు నోటీసులు జారీ చేసింది. నిర్ణయించిన మేరకు ఆశీలు వసూలు చేయాలని, లేదంటే క్రిమినల్ కేసుల పెట్టిస్తామని హెచ్చరించింది. మరోమారు ఇది పునరావృతమైతే ఎలాంటి సమాచారం లేకుండా కాంట్రాక్ట్ రద్దు చేస్తామని తెలిపింది. తాము నిర్ణయించిన మార్కెట్ సరిహద్దుల మేరకు ఆశీలు వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఆశీలు రేట్లపై చిరు వ్యాపారులకు సిబ్బంది అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టింది. సిబ్బంది మార్కెట్ల వద్దకు వెళ్లి ఎంత ఆశీలు కట్టాలన్న దానిపై చిరువ్యాపారులకు వివరించనున్నారు. అంతేకాకుండా ఇకపై నిరంతరం రెవెన్యూ అధికారులు ఆశీలు వసూళ్లను పర్యవేక్షించేలా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. -
నగరపాలక పంచాయతీ
ముదిరిపాకాన పడిన కమిషనర్, మేయర్ విభేదాలు గుంటూరు నుంచి వచ్చిన మున్సిపల్ అసిస్టెంట్ డైరెక్టర్లు కార్యదర్శి కార్యాలయంలో రికార్డుల పరిశీలన నకళ్లు వెంటబెట్టుకు వెళ్లిన వైనం వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ ఫిర్యాదుతో కదిలిన రాష్ట్ర యంత్రాంగం పాలన గాడితప్పడంతోనే ప్రభుత్వం దృష్టికి.. సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో మేయర్ పంతం రజనీశేషసా యి, కమిషనర్ వి.విజయరామరాజుల మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు పరచడంలో ఒకరి కొకరు పంతాలకు పోవడంతో కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ తీర్మానాలు కొన్ని పెండిం గ్లో పడిపోతున్నాయి. నగరపాలన కుంటుపడుతుండడంతో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్యమంత్రికి, మున్సి పల్ పరిపాలన సంచాలకులకు ఫిర్యా దు చేశారు. దీంతో సోమవారం మున్సిపల్ సంచాలకులు కన్నబాబు ఆదేశాల మేరకు గుంటూరు నుంచి సహాయ సంచాలకులు టీఎస్ఎస్ఎ¯ŒSజీ శ్రీనివాస్, పి.రాఘునాథ్రెడ్డిలు రాజమహేంద్రవరం వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరపాలక సంస్థ కార్యదర్శి శైలజావల్లి కార్యాలయంలో కౌన్సిల్, స్థాయీ సంఘం తీర్మానాలు, ఇతర రికార్డులు పరిశీలించారు. వాటి నకళ్లను తమ వెంటబెట్టుకు వెళ్లారు. తాము గమనించిన విషయాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని సహాయ సంచాలకులు శ్రీనివాస్, రాఘునాథ్‌రెడ్డి తెలిపారు. అంత్య పుష్కరాల నుంచి విభేదాలు మొదలు తనకు తెలియకుండానే స్టాండింగ్ కమిటీ , కౌన్సిల్ సమావేశం అజెండాలోకి అంశాలు చేర్చుతున్నారంటూ గతంలో మేయర్ పంతం రజనీశేషసాయి విలేకర్ల సమావేశంలో కుండబద్ధలు కొట్టిన విషయం తెలిసిందే. నగరపాలక సంస్థలో తనకు తెలియకుండానే పాలన జరిగిపోతోందని, ఇలా అయితే ఇక పాలక మండలి, మేయర్ ఎందుకని ఘాటుగా స్పందించారు. అధికార యంత్రాంగమే పాలన చేసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. అదే సమయంలో తన పరిధి మేరకే తాను పని చేస్తున్నానని, తనకు ఉన్న అధికారం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నానని కమిషనర్ వి.విజయ రామరాజు పేర్కొన్నారు. మేయర్, కమిషనర్ల మధ్య గోదావరి అంత్య పుష్కరాల నుంచి పాలన, నిర్ణయాలలో ప్రారంభమైన మనస్పర్థలు ‘హ్యాపీ సండే’ కార్యక్రమంతో మరింత ముదిరాయి. ‘తనకు తెలియకుండానే కౌన్సిల్, స్థాయీ సంఘం సమావేశం అజెండాలోకి అంశాలు చేర్చుతుండడంతో వాటిని తోసిపుచ్చుతున్నారు. వాటిని తరువాత సమావేశంలో అనుమతి కోసం యంత్రాంగం చేర్చుతోంది. నగరపాలక సంస్థలో ఇతర కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికిలాగే వాచ్మెన్ల జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని మేయర్ రజనీశేష సాయి కమిషనర్‌కు లేఖ రాశారు. అయితే ఆ విషయం బుట్టదాఖలైంది. దీంతో ఇరువురి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాలక మండలి నిర్ణయం లేకుండానే మున్సిపల్ పాఠశాలలోని స్వీపర్లకు జీతాలు పెంచి ఇస్తున్నారని, అలాంటప్పుడు ఇక కౌన్సిల్ ఆమోదం ఎందుకని డిసెంబర్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మేయర్ ప్రశ్నించారు. కంప్యూటర్ ఆపరేటర్ల జీతాలతో మరోసారి... ఇక తన వ్యక్తిగత కంప్యూటర్ ఆపరేటర్ విషయంలో మేయర్‌కు కమిషనర్‌కు మధ్య ఉన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించకపోవడంతో మేయర్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఆపరేటర్ల జీతాలు విడుదల తీర్మానాన్ని పక్కనబెట్టారు. దీనిపై ఈ నెల ఏడో తేదీన జరిగిన బడ్జెట్ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. జీతాలు ఆపవద్దని నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో వారు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో కదిలిన రాష్ట్ర యంత్రాంగం... గత కొన్ని నెలలుగా నగరపాలక సంస్థలో జరుగుతున్న విషయాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు విలేకర్ల సమావేశం నిర్వహిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పాలక మండలి తీరును ఎండగట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత మేడపాటి షర్మిలారెడ్డి నగరపాలక సంస్థలో జరుగుతున్న విషయాలను ముఖ్య మంత్రి చంద్రబాబుకు, మున్సిపల్ పరిపాలన సంచా లకులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు నుంచి వచ్చిన మున్సిపల్ పరిపాలన సహాయ సంచాలకులు సోమవారం నగరపాలక సంస్థలో రికార్డులు పరిశీలించి, నకళ్లు తమవెంటబెట్టుకు వెళ్లారు. -
దేశంలోని సంపన్న కార్పొరేషన్..
ముంబై: దేశంలోని సంపన్న వంతమైన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎలాంటి పన్నుల భారం మోపకుండా రూ. 2.60 కోట్ల మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆక్ట్రాయి రద్దు చేసిన అనంతరం మొదటిసారిగా స్టాండింగ్ కమిటీ ముందు బడ్జెట్ ప్రవేశపెట్టింది. బీఎంసీ కమిషనర్ అజయ్ మెహతా బుధవారం 2017–18 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 25,141.51 కోట్ల బడ్జెట్లో మహిళ భద్రత, ఆరోగ్యం, విద్య, నీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ తదితరాల మౌలికసదుపాయాలకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా బీజేపీ ఎన్నికల్లో ట్రాన్స్ఫరెన్సీ (పారదర్శకత) అంశాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన శివసేన గతేడాది రూ. 37,052 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా ఈసారి రూ.11,910.64 కోట్లను తగ్గించి రూ. 25,141.51 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పార్కింగ్ సదుపాయాలను మూడింతలు పెంచనున్నారు. ముఖ్యంగా 92 పార్కింగ్ స్థలాల నుంచి 275 పార్కింగ్ స్థలాలకు పెంచనున్నారు. మూడు ప్రాంతాల్లో భూగర్భంలో (అండర్‌గ్రౌండ్) పార్కింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.కోటి కేటాయించారు. మరోవైపు బీఎంసీ అదనపు కమిషనర్ ఐ.ఎ. కుందన్, సమితి అధ్యక్షుడు శుభదా గుండేకర్ విద్యాశాఖ కోసం రూ. 2311.66 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా బైకలాలోని రాణీబాగ్ అభివృద్ధి కోసం రూ.50.25 కోట్లను కేటాయించారు. ఇదిలా ఉండగా, ముంబై వాసులకు 500 చదరపు అడుగుల లోపు ఉండే ఇళ్లకు ఇంటి పన్నుల నుంచి మినహాయించనున్నట్టు శివసేన తమ మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్లో మాత్రం ఈ అంశం ఎక్కడ కన్పించలేదు. దీంతో శివసేన ఈ అంశాన్ని మరించిపోయిందా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. -
డుమ్మాల నుంచి సొమ్ములు
-కాకినాడ నగర పాలక సంస్థలో అవినీతి బాగోతం -మస్తర్ల మాయాజాలంతో శానిటరీ ఇన్స్పెక్టర్ల దందా -గైర్హాజరుకు ఇంత అని రేటు నిర్ణయించి వసూళ్లు -నిత్యం 20 శాతం మంది విధులకు రాకున్నా పట్టించుకోని అధికారులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎక్కడైనా విధులకు డుమ్మా కొడితే పైనుంచి చర్యలుంటాయని భయపడతారు. కానీ కాకినాడ కార్పొరేషన్లో మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. నెలనెలా మస్తర్ల మాయాజాలంతో మామూళ్ల దందా నడుస్తోంది. ఇక్కడ పారిశుద్ధ్య విభాగంలో కొందరు అధికారులు.. ఎంతమంది డుమ్మా కొడితే అంత మంచిదనుకుంటున్నారు. అలా అయితేనే తాము నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని ఆరాటపడుతున్నారు. కాకినాడ నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం అడుగడుగునా అవినీతి కంపుకొడుతోంది. చిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని పర్యవేక్షకులు నెలనెలా మామూళ్లు దండుకుంటున్నారు. ఈ విభాగంలో విధులకు రాకున్నా ఫర్వాలేదు. కానీ వచ్చినట్టు మస్తర్ మాత్రం పడిపోతుంది. అలాగని మస్తర్ ఉచితంగా వేస్తారనుకుంటే పొరపాటే. డుమ్మా కొట్టే చిరుద్యోగుల నుంచి మస్తర్, మస్తర్కు ఒకో రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఈ మస్తర్ల బాగోతంలో మొత్తం శానిటరీ విభాగం అంతటినీ ఒకే గాట కట్టలేము. కానీ కొందరు జేబులు నింపుకునేందుకు చేస్తున్న అవినీతి శానిటరీ ఇనస్పెక్టర్లందరికీ మచ్చ తెస్తోంది. కాకినాడ జనాభా నాలుగున్నర లక్షలు. నగరంలో రోజూ సేకరించే చెత్త 175 టన్నులు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం 14 సర్కిళ్లు ఉన్నాయి. ఒక సర్కిల్‌కు ఒక ఎస్ఐ(శానిటరీ ఇన్స్పెక్టర్)ఉంటారు. శానిటరీ వర్కర్లలో సీనియర్లు, మాట వినే వారిని మేస్త్రీలుగా నియమించుకుని తమ ఆదేశాలు అమలు చేసేలా చూసుకుంటారు. ఇది నగరంలో నడుస్తున్న ప్రక్రియ. ఒక సర్కిల్ పరిధిలో 40 నుంచి 60 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఇద్దరు లేదా ముగ్గురు మేస్త్రీలు పనిచేస్తున్నారు. నగరంలో ఆయా సర్కిళ్లలో సుమారు 850 మంది కార్మికులు పనిచేస్తుండగా వీరిలో 450 మంది పర్మనెంట్ కార్మికులు, మిగిలిన వారు ఆయా సొసైటీల నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. పర్మనెంట్ వారికి రూ.18 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనాలుండగా, కాంట్రాక్ట్ వర్కర్లకు రూ.12,000 నుంచి రూ.15,000 ఉన్నాయి. నెలనెలా వేతనాలు ఎవరి ఖాతాలకు వారికి వేసేస్తారు. కార్మికులు పనిచేస్తున్నారో, లేదో పర్యవేక్షించి మస్తర్ వేయాల్సింది శానిటరీ ఇన్స్పెకర్. శానిటరీ ఇన్స్పెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లి తెల్లవారుజామున 5 గంటలకు ఆ సర్కిల్ పరిధిలో పనిచేసే వారి మస్తర్ తీసుకోవాలి. ఇదివరకు రిజిస్టర్లో సంతకం తీసుకునే వారు. ఇప్పుడు వేలిముద్రలు తీసుకుంటున్నారు. అలా తెల్లవారుజామున ఒకటి, మధ్యాహ్నం మరొకటి మస్తర్ తీసుకుంటారు. కొన్ని సర్కిళ్లలో కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు మస్తర్ల ప్రక్రియను మేస్త్రీలకు విడిచిపెట్టేసి తీరిగ్గా తొమ్మిది, 10 గంటలకు బయటకు వస్తున్నారనే విమర్శలున్నాయి. మస్తరు పడగానే హుష్‌కాకి కొన్ని సర్కిళ్ల పరిధిలో కొందరు మస్తర్లు తీసుకునే సమయానికి వచ్చి మస్తర్ వేసేసి ఆనక డుమ్మా కొట్టేస్తున్నారు. ఇలా నగరం మొత్తం మీద 15 నుంచి 20 శాతం మంది డుమ్మా కొడుతున్నా కార్పొరేషన్ అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. అలా కార్మికులు డుమ్మా కొట్టేయడమే కావాలని కొందరు ఎస్ఐలు ఆశిస్తున్నారు. ఎందుకంటే మస్తర్ వేయించుకున్నాక డుమ్మా కొట్టేసే కార్మికుడు అలా ఎన్ని రోజులు ఎగనామం పెడితే అన్ని రోజులకు అక్కడి ఎస్ఐకి తాంబూలం ఇచ్చుకుంటున్నారు. డుమ్మా కొట్టే కార్మికులకు ఒక్కొక్కరికి ఒకో రేటు నిర్ణయించారు. కొన్ని సర్కిళ్లలో ఎస్ఐల పేరు చెప్పి మేస్త్రీలు కూడా ఈ తతంగం నడిపిస్తున్నారు. నెలలో 20 రోజులు ఎగనామం పెడితే పర్మనెంట్ వర్కర్ రూ.11 వేలు, కాంట్రాక్ట్ వర్కర్ రూ.6 వేలు, ఒక రోజు ఎగనామం పెడితే కాంట్రాక్ట్ వర్కర్ రూ.200, పర్మనెంట్ వర్కర్ రూ.500 చొప్పున మామూళ్లు ఇచ్చుకుంటున్నారు. అదే ఒక పూట ఎగనామం పెడితే కాంట్రాక్ట్ వర్కర్ రూ.100, పర్మనెంట్ వర్కర్ రూ.200 చెలించుకునే విధానం నడుస్తోంది. ఇలా ప్రతి నెలా పలువురు ఎగనామం పెడుతున్న కారణంగా వారు చేసే పని కూడా తాము చేయాల్సి వస్తోందని, తమపై పనిభారం రెట్టింపు అయిపోతోందని మిగిలిన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వారిపై పనిభారం ఇప్పుడున్న 850 మందికి అదనంగా మరో 200 మంది కార్మికుల అవసరం ఉంది. కార్మికుడెవరైనా చనిపోతే ఆ కుటుంబం నుంచి మరొకరికి పోస్టింగ్ ఇస్తున్నారు తప్ప కొత్తగా నియామకాలు ఉండటం లేదు. ఈ కారణంగా పెరిగిపోతున్న పని భారానికి తోడు డుమ్మా కొట్టే వారి భారం కూడా తమపై పడుతోందని కార్మికులు పేర్కొంటున్నారు. పండుగలు, ఆగస్టు 15, రిపబ్లిక్ డే.. ఇలా పలు ముఖ్యమైన సందర్భాలతో పాటు అవసరమైనప్పుడు అడుగుతున్నా క్యాజువల్ లీవ్‌లు ఇవ్వకపోవడంతో సెలవులు పెట్టక తప్పడం లేదని డుమ్మా కొడుతున్న కార్మికులు పేర్కొంటున్నారు. చర్యలు తీసుకుంటాం.. ఈ విషయమై నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి శ్రీనివాస్ నాయక్‌ను వివరణ కోరగా తాను కొత్తగా వచ్చానని చెప్పారు. పారిశుద్ధ్య విభాగంలో సరిపడినంత వర్కర్లు లేకపోవడంతో పనిభారం పెరిగిన మాట వాస్తవమేనన్నారు.విధులకు హాజరు కాకపోయినా మస్తరు వేసి అవకతవకలకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. రోజూ ఉదయం 5 గంటల నుంచి మస్తర్లు తనిఖీ చేస్తున్నామన్నారు. ఎక్కడైనా ఆరోపణలు ఉన్నా, లోపాలు జరుగుతున్నా తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
‘కుడా’కు ఆమోదం
2599.50 చదరపు కిలోమీటర్లతో ఏర్పాటు – 117 గ్రామాలు, 9 మండలాల విలీనం – ఇందులోనే డోన్ నగర పంచాయతీ కర్నూలు(టౌన్): కర్నూలులో కుడా(కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి జీఓ 277ను మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి కరికాల్ వలవన్ జారీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కుడా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పట్లో 2414.69 కిలోమీటర్ల పరిధిలో కుడాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కుడా పరిధిలోకి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్, నంద్యాల మున్సిపాలిటీ, గూడూరు నగర పంచాయతీతో పాటు 111 గ్రామాలు, 8 మండలాలను తీసుకొచ్చారు. కుడా ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని గత ఏడాది నవంబర్ 4వ తేదీ జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అయితే ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో కుడా ఏర్పాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో అధికారికంగా నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. డోన్ నగర పంచాయతీని అదనంగా కలుపుకుని 117 గ్రామాలు, 9 మండలాలు విలీనమయ్యాయి. కుడా పరిధిలో భూముల అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్స్, అలాగే తనిఖీలు, జరిమానాలు వంటి కార్యక్రమాలను కుడా చేపట్టనుంది. ఏపీ మెట్రో పాలిటన్ రీజియన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ–2016 ప్రకారం కుడా పనిచేయనుంది. -
ఈడో రకం వసూల్ రాజా
- రోజువారీ మెనూగా మార్చేశాడు - శాకాహారం సరే..మాంసాహారంతో బెంబేలు - ఇవ్వకపోతే వేధింపులు...బండ బూతులే - కమిషనర్‌కు, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం - చర్యలు తీసుకోకపోతే దీర్ఘకాలిక సెలువులోకి వెళ్తామని బాధితుల హెచ్చరిక ఇంటిల్లపాదికి సరిపడేలా రోజూ రెండు లీటర్ల పాలు...కావల్సినన్ని కూరలు...వారానికి రెండు, మూడు రోజులు రెండు పూటలకు ఫుల్‌గా చికెన్...ఆదివారం వస్తే చాలు బొంతకోడి లేదా నాటుకోడి..ఇదేదో ఒక హోటల్లో మెనూ అనుకునేరు. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే...ఇదంతా కాకినాడ కార్పొరేషన్లో ఒక పారిశుద్ధ్య ఉద్యోగి రోజువారీ వసూళ్ల మెనూ ఇదీ. తన కింద పనిచేసే వారికి ఇండెంట్లమీద ఇండెంట్లు వేస్తున్న కార్పొరేషన్ ఉద్యోగి వ్యవహార శైలిదీ... ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్ మారింది. వివరాలిలా ఉన్నాయి... సాక్షిప్రతినిధి, కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగంలో ఒక ఉద్యోగి కోరిన కోర్కెలు తీర్చకపోతే తన కింద పనిచేసే ఉద్యోగులు నరకం కళ్లచూడాల్సిందే. రాజకీయంగా మంచి పలుకుబడి ఉండటంతో ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయి అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. తాను చెప్పిన పనులు చెప్పినట్టు చేయని వారికి వేధింపులు తప్పడం లేదు. అతని గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక దిగువ కేడర్‌లో పనిచేసే ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. మార్కెట్ నుంచి తెచ్చే వాటిలో పై అధికారులకు కూడా వాటాలు వెళుతుండటంతో అతని ఆగడాలు మితిమీరిపోయాయని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. . కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలోని పెద్ద మార్కెట్ ఉన్న ప్రాంతమంతా కలిపి ఒక పారిశుద్ధ్య సర్కిల్ అంటారు. ఆ సర్కిల్ అంటే మంచి గిరాకీ ఉన్న ప్రాంతం. ఎందుకంటే అక్కడ నిత్యం లక్షల రూపాయలు కూరగాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఆ ప్రాంత పారిశుద్ధ్య నియంత్రణ కోసం పనిచేస్తున్న ఉద్యోగి నిత్యం కిందిస్థాయిలోని మేస్త్ర్రీలు కార్మికులకు నిత్యావసర సరుకులు, కూరలు, ఇతర వస్తువులు తీసుకురావాలని చాలా కాలంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు న్నాయి. ఆ ఉద్యోగికి తమపై పర్యవేక్షణాధికారం ఉండడంతో ప్రారంభంలో అడిగినవన్నీ అక్కడా ఇక్కడ వ్యాపారులను బతిమిలాడి చక్కబెట్టేవారు. అదికాస్తా రోజువారీ వసూళ్ల దందాగా మారిపోయిందని దిగులు చెందుతున్నారు. ఇప్పుడు సిబ్బందికి మింగుడుపడని పరిస్థితి నెలకొంది. అడిగిన వస్తువులు రాకపోతే అయ్యవారిలో కోపం కట్టలు తెచ్చుకుని రాయడానికి, వినడానికి వీలులేని విధంగా తిట్ల పురాణం లంకింంచుకోవడంతో సిబ్బంది హడలిపోతున్నారు. ధైర్యం చేసిన కొందరు కార్పొరేషన్ కమిషనర్ అలీమ్‌భాషా, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దృష్టికి ఇటీవల తీసుకువెళ్ళారు. అతని ఆగడాలు నిలువరించలేకపోతే దీర్ఘకాలిక సెలవులపై వెళ్ళిపోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . మస్తర్లలోనూ మాయాజాలమే.. ఆ సర్కిల్లో పారిశుద్ధ్య సిబ్బంది హాజరుకు సంబంధించిన మస్తర్లలో కూడా ఆ ఉద్యోగి చేతిలో పెద్ద మాయాజాలమే నడుస్తోంది. ఆ సర్కిల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మొక్కుబడిగా హాజరై వేలిముద్రలు వేసి వెళ్ళిపోతున్నారనే ఆరోపణలున్నాయి. పనిచేయకుండా తీసుకునే జీతాలలో సంబంధిత కార్మికులు రూ.1200లు, రూ.1500లు వంతున నెలవారీగా ఆ ఉద్యోగికి ముట్టజెబుతున్నారు. ఇలా నెలకు లక్ష జేబులో వేసుకుని పై అధికారులకు సగం ఇవ్వాల్సి వస్తోందని కార్మికులకు ఎదురు చెబుతుండటం విశేషం. ట్రేడ్ లైసెన్సులలోనూ అదే పరిస్థితి... ట్రేడ్ లైసెన్సు ఫీజు వసూళ్ళలో కూడా ఇటీవల అతని ఆగడాలు మితిమీరిపోయాయని మార్కెట్లో విమర్శలు వినిపిస్తున్నాయి. అతని నిర్వాకంతో కార్పొరేషన్ ఆదాయానికి గండిపడుతుందంటున్నారు. పెద్ద, చిన్న దుకాణాల తారతమ్యం లేకుండా వ్యాపారుల నుంచి సొమ్ములు గుంజుతున్నట్టు ఆరోపణలున్నాయి. వ్యాపారాన్ని బట్టి ట్రేడ్‌లైసెన్సు కింద రూ.5 నుంచి రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుందని చెబుతూ రెండు, మూడు వేలు మించి నగరపాలక సంస్థకు జమ చేయడం లేదంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. కార్పొరేషన్ ఆరోగ్య అధికారి శ్రీనివాస్ నాయక్‌ను వివరణ కోరగా ఈ ఆరోపణలు విషయం తమ దృష్టికి రాలేదన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. -
మైనారిటీ యువతకు గుంటూరులో జాబ్‌మేళా
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఈనెల 25, 26 తేదీల్లో గుంటూరులో మైనారిటీ యువతకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్‌చైర్మన్ ఎస్.కె.బషీర్‌అహ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ కార్పొరేషన్ (విజయవాడ) ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నామన్నారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులైన మైనారిటీ అభ్యర్థులు (ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, జైన్స్, బుద్దీస్, పార్సీస్) ఈనెల 23లోపు దరఖాస్తులను www.apsmfc.com వెబ్సైట్లో పంపాలన్నారు. అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను సిద్ధం చేసుకుని జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాల కోసం 98499 01149, 98853 77707 నంబర్లకు సంప్రదించాలన్నారు. -
పకడ్బందీగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు
- మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు - రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమావేశం కర్నూలు (టౌన్) ; త్వరలో నిర్వహించనున్న కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు సూచించారు. స్థానిక నగరపాలకలోని సమావేశ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల గుర్తింపు కార్యక్రమం ముగిసిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఇలా.. కులాల వారీగా ఓటర్లను కూడా గుర్తించామన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం, కర్నూలు, కల్లూరు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ నెల 13న కులాల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తామన్నారు. ఒక్కో రిటర్నింగ్ అధికారి 5 వార్డులకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందన్నారు. 51 వార్డుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. 9వ వార్డులో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాలకు ఇబ్బందిగా ఉన్నట్లు గుర్తించామని, ఇక్కడ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులకు వారికి కేటాయించిన కార్యాలయ గదిలో ఆయా వార్డుల సమాచారం, ఓటర్ల జాబితా తదితర వాటిని అప్పగిస్తామన్నారు. వారం రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్ డిప్యూటి సిటీ ప్లానర్ కృష్ణకుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఇశ్రాయేలు, నగరపాలక మేనేజర్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ స్వల్ప మార్పు
- వచ్చే నెల 10 నాటికి ఓటర్ల జాబితా ప్రచురణ - రాజకీయ పార్టీల సమావేశంలో మున్సిపల్ కమిషనర్ - ఓటరు జాబితాలో అభ్యర్థనలు, అభ్యంతరాలు తెలియజేయాలని సూచన కర్నూలు(టౌన్): నగరంలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని రాజకీయ పార్టీ నాయకులు నగరపాలక అధికారులు, ప్రభుత్వానికి విన్నవించిన నేపథ్యంలో సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీలు చేసిన ప్రతిపాదనలు, గడువు లేకపోవడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసింది. గత నెల 28వ తేదీన ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేశారు. మార్చి1 నుంచి 6 వ తేదీ వరకు అభ్యర్థనలు, అభ్యంతరాల పరిశీలనకు చర్యలు తీసుకున్నారు. 7వ తేదీ నుంచి 9వతేదీ వరకు బీసీ ఓటర్ల మార్కింగ్ పనులు పూర్తి చేస్తారు. ఈ మార్పులకు సంబందించి మంగళవారం సాయంత్రం స్థానిక నగరపాలక కమిషనర్ చాంబర్లో వివిధ రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హాఫీజ్‌ఖాన్, పార్టీ పాణ్యం ఇన్చార్జీ తోట వెంకటకృష్ణా రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తేర్నెకల్ సురేందర్‌రెడ్డి, పర్వేజ్ ( టీడీపీ) రాముడు (సీపీఎం), సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ఓటర్ల తుది జాబితాపై సూచనలు ఇవ్వండి: నగరపాలక కమిషనర్ ఓటర్ల తుది జాబితాపై తగిన సూచనలు ఇవ్వాలని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు కోరారు. ముసాయిదా జాబితాలో తప్పొప్పులు, అభ్యంతరాలుంటే తెలియజేయాలన్నారు. ఇలాంటి వాటిని పరిశీలించి వచ్చే నెల 10వ తేదీన తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. దీనిపై హాఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఓటర్ల సర్వే తూతూ మంత్రంగా చేపట్టడం వల్ల జాబితాలో తప్పులు దొర్లాయన్నారు. ఇంటింటికి సర్వే సక్రమంగా చేపట్టకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే ...మరోసారి ఇలాంటి తప్పులు రాకుండా ఉంటాయన్నారు. తోట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ డీ లిమిటేషన్ చేస్తే వార్డుల వారీగా ఓటర్ల సంఖ్యలో పెద్దగా మార్పులుండవన్నారు. అయితే ఇటివల జాబితాను పరిశీలిస్తే.. అనేక వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో వ్యత్యాసం ఉందన్నారు. సీపీఎం నాయకులు రాముడు మాట్లాడుతూ ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందన్నారు. వార్డుల వారీగా ఓటర్ల సంఖ్య సక్రమంగా లేదన్నారు. వీకర్‌సెక్షన్ కాలనీ వార్డులో 8 వేల ఓట్లుంటే, నరసింగరావు పేటలో 3 వేల ఓట్లు మాత్రమే ఉన్నాయన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో పట్టణ ప్రణాళిక అధికారులు కృష్ణకుమార్, శాస్త్రి షభ్నం, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఇశ్రాయేలు పాల్గొన్నారు. -
బ్రాహ్మణ కుటుంబాలకు సంక్షేమ ఫలాలు
– జిల్లా కోఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు కర్నూలు (అర్బన్): ఇప్పటి వరకు 30 వేల బ్రాహ్మణ కుటుంబాలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందాయని బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు తెలిపారు. ఆదివారం స్థానిక సంకల్‌బాగ్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు ఒక లక్ష మంది వరకు బ్రాహ్మణులు లబ్ధిపొంది ఉంటారన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసమే కార్పొరేషన్ చైర్మెన్ ఐవైఆర్ కృష్ణారావు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. విద్య, ఉపాధి, వైద్య రంగాలతో పాటు 60 సంవత్సరాలు దాటిన బ్రాహ్మణ వృద్ధులకు నెలకు రూ.1000 పింఛన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. రిజిస్టర్ అయిన వృద్ధాశ్రమాల్లో ఉన్న వారికి రూ.3 వేలు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అర్చకులకు రిటైర్డ్‌మెంటు లేకుండా చేశామని చెప్పారు. అనంతరం బ్రాహ్మణ సంఘం నేతలు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హెచ్‌కే మనోహర్, జిల్లా అర్చక పురోహితుల సంఘం అధ్యక్షుడు రవిచంద్ర, కార్యదర్శి చెరువు దుర్గాప్రసాద్, హెచ్‌కే రాజశేఖర్, ఎస్.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మంచినీటి ఎద్దడి తలెత్తనీయొద్దు
– మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ కన్నబాబు కర్నూలు (టౌన్): మంచినీటి ఎద్దడిని తలెత్తనీయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ కన్నబాబు ఆదేశించారు. శనివారం సాయంత్రం కర్నూలు నగరానికి వచ్చిన ఆయన ..స్థానిక ప్రభుత్వ ఆతిథి గృహంలో నగర పాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే నగరంలోని పాత బస్తీ ప్రాంతంలో పర్యటించారు. వీధుల్లో పారిశుద్ధ్యం మెరుగుపడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్సుకోవాలని మున్సిపల్ ఆరోగ్యశాఖ సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్, ఆరోగ్యశాఖ, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు ప్రజలకు మంచినీటి ఇక్కట్లు రాకుండా చూడాల్సిన బాధ్యత ఇంజినీరింగ్ విభాగంపై ఉందన్నారు. సుంకేసులలో, అలాగే సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్‌లోనూ నీరు అడుగంటిందన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి, నీటి పన్నులను వంద శాతం వసూలు చేయాలన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం, మున్సిపల్ ఇంజనీరు రాజశేఖర్, మేనేజర్ చిన్నరాముడు, నగరపాలక ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు మల్లిఖార్జున, వీరస్వామి పాల్గొన్నారు. -
అవినీతి నిగ్గు తేలేనా..?
= నేడు కలెక్టర్‌కు నివేదిక = 120 పనుల వివరాలు గోప్యం = అభివృద్ధి పనుల్లో రూ.కోట్లలో అవినీతి! అనంతపురం న్యూసిటీ: నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపిన పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనాథ్‌రెడ్డి నివేదికను సోమవారం కలెక్టర్ శశిధర్‌కు నివేదించనున్నారు. నివేదికలో అవినీతి అక్రమాలు నిగ్గు తేలేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. కార్పొరేష¯ŒS పరిధిలో రూ.10 కోట్లతో చేపట్టిన దాదాపు 320 అభివృద్ధి పనులపై విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ఎస్ఈ శ్రీనాథ్‌రెడ్డి ఆరుగురు డీఈలతో మూడు బృందాలుగా ఏర్పడి గత నెలలో విచారణ చేపట్టారు. నగరపాలక సంస్థ అధికారులు 172 పనులకు సంబంధించి ఎం బుక్కులు, రికార్డులను మాత్రమే విచారణ బృందాలకు ఇచ్చారు. 120 అభివృద్ధి పనులను గోప్యంగా ఉంచినట్లు సమాచారం. వీటిలో ఓ ఏఈ రూ.15 లక్షలతో చేసిన పనులు, రాంనగర్లో రూ.16 లక్షలతో మార్కెట్ ఏర్పాటు చేసినట్లు నమోదు చేసిన రికార్డులు, అలాగే నగరంలో కొన్ని డివిజన్లలో తీసిన పూడికతీత పనులు, రూ. కోటి వరకు చేపట్టిన మట్టిరోడ్డు పనులు, మట్టిదిబ్బల తొలగింపు పనుల రికార్డులు ఇవ్వలేదని విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు రూ. 2 కోట్ల నుంచి రూ.3 కోట్ల పనుల బిల్లుల వివరాలను పూర్తిగా సమర్పించలేదు. పదుల సంఖ్యలో ఎం బుక్కులు, రికార్డులు అధికార పార్టీకి చెందిన కొందరు నేతల వద్ద ఉండడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా అభివృద్ధి పనుల వివరాలు ఇవ్వలేదని కమిషనర్ సత్యనారాయణ ఇద్దరు ఏఈలకు మెమోలు సైతం జారీ చేశారు. అయిన వాటి వివరాలను ఇంత వరకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సోమవారం పబ్లిక్‌హెల్త్ ఎస్ఈ సమర్పించే నివేదికతో పలువురి భవితవ్యం తేలనుంది. కమిషనర్‌కు కలెక్టర్ భరోసా..! నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ ఆదివారం కలెక్టర్‌ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్, పాలకుల గ్రూపు రాజకీయాలు, కొందరు అధికారుల ప్రవర్తనపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, సెలవుపై వెళ్తానని చెప్పడంతో అందుకు కలెక్టర్ ఒప్పుకోలేదు. ఎటువంటి ఇబ్బందీ ఉండదని, కొత్త కమిషనర్ వచ్చే వరకు పని చేయాలని ఆదేశించారు. ఆరోగ్యం బాగలేని పక్షంలో అప్పుడప్పుడు క్యాజువల్ లీవ్ తీసుకుని అందుబాటులో ఉండాలని సూచించారు. -
‘స్మార్ట్’ సూచనలకు ఆహ్వానం
– కర్నూలు అభివృద్ధికి ప్రతి ఏటా రూ.33 కోట్లు విడుదల – ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కో–ఆర్డినేటర్ స్మిత కర్నూలు(టౌన్): కర్నూలు స్మార్ట్ సిటీగా ఎంపికైనందున..నగర అభివృద్ధికి పౌరులు, బిల్డర్లు తగిన సూచనలు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల సంస్థ కోఆర్డినేటర్ స్మిత పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక నగరపాలక సంస్థ సమావేశ భవనంలో బిల్డర్లు, వివిధ సంస్థల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలన్నారు. ప్రతి ఏడాది కర్నూలు నగరపాలక సంస్థకు స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా రూ.33 కోట్లు నిధులు విడుదలవుతాయన్నారు. ఈ నిధులను వెచ్చించి ప్రాధాన్య క్రమంలో మురుగుకాల్వలు, సీసీ రోడ్లు, తాగునీరు, పార్కులు వంటి సౌకర్యాలు కల్పించేందుకు వీలు ఉంటుందన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సూపరింటెండెంట్ ఇంజనీర్ శివరామిరెడ్డి, బిల్డర్లు ఎంఎస్–9 మధుసూదన్‌రెడ్డి, సోమిశెట్టి వెంకటరామయ్య, గోరంట్ల రమణయ్య, కృష్ణకాంత్ బిల్డర్స్ వెంకటసుబ్బయ్య, సూపరింటెండెంట్లు ఇశ్రాయేల్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు ఓటర్ల ముసాదా జాబితా సిద్ధం
కర్నూలు (టౌన్): ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బుధవారం కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు ఓటర్ల ముసాయిదా జాబితాను నగరపాలక కార్యాలయంలో ప్రదర్శించారు. నగరంలోని 51 వార్డులను 413 బ్లాకులుగా విభజించిన అధికారులు ఓటర్ల పేర్లు, కులాలను క్షుణంగా పరిశీలించి వాటిని మార్కింగ్ చేశారు. కులాల వారీగా ఓటర్లను గుర్తించే ప్రక్రియ పూర్తి కావడంతో వీటికి సంబంధించిన అభ్యంతరాలను ఈనెల 20 వ తేదీ వరకు నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకురావచని కమిషనర్ తెలిపారు. కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 28వ తేదీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. వచ్చేనెల 1వ తేదీ ఓటర్ల జాబితాను మున్సిపల్ పరిపాలన శాఖకు పంపిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
కొండంత దన్నుతో బరితెగింపు
దర్జాగా రూ.3 కోట్ల కార్పొరేషన్ స్థలం కబ్జా కాకినాడలో ఓ ‘తెలుగు మహిళ’ ఆక్రమణ పర్వం వాస్తు రీత్యా వదిలిన స్థలంలో ఏకంగా ఇళ్లే కట్టేస్తున్న వైనం ముఖ్య నేత అండ ఉండడంతో నోరు మెదపని అధికారులు స్మార్ట్ సిటీ అయ్యాక కాకినాడలో గజం స్థలం కూడా దొరకడం గగనమే అవుతోంది. అటువంటి పరిస్థితుల్లో నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాన్ని అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ తెలుగు మహిళ కబ్జా చేశారు. ‘కొండ’ంత అండ ఉండటంతో కార్పొరేషన్ అధికారులు కూడా ఆ కబ్జావైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేక మిన్నకుండిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ‘కొండ’ంత దన్ను ఉండటంతో కాకినాడలో ఒక తెలుగు మహిళ కబ్జాలు చేయడంలో ‘తమ్ముళ్ల’ను కూడా మించిపోయింది. కబ్జా చేసిన స్థలంపై అధికారులెవరూకన్నెత్తి చూడకుండా ఉండేందుకు కొన్నేళ్లుగా ఉన్న రాజకీయ పార్టీనే విడిచిపెట్టేసి, తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె కబ్జా చేసిన స్థలం విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.3 కోట్లు పైనే ఉంది. కాకినాడలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగో డివిజన్లోని భాస్కర్ నగర్ ప్రాంతమది. అక్కడ భారీ అపార్టుమెంట్లు, కోట్ల రూపాయల విలువైన భవంతుల నిర్మాణాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రాంతంలో స్థానికులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఓ పార్కు ఉంది. ఆ పార్కు ప్రాంతంలో అర ఎకరం భూమిని సాయిబాబా ఆలయ నిర్మాణానికి కేటాయించారు. సర్వే నంబర్ 18/1లో ఉన్న ఈ స్థలాన్ని 2006లో అప్పటి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ బీరక చంద్రశేఖర్ హయాంలో సాయిబాబా ఆలయం నిర్మాణానికి కేటాయించారు. ఈ మేరకు ఆ స్థలాన్ని సద్గురు షిర్డీ సాయి భక్తజన సంక్షేమ సంఘానికి అప్పగించారు. సంఘం ఆధ్వర్యాన అప్పట్లో దాతల సహకారంతో సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరురాలైన ఓ మహిళ ఆ స్థలంలో పాకలు వేసింది. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో 2012లో మున్సిపల్ అధికారులు ఆ స్థలాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, మున్సిపాలిటీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆ స్థలాన్ని ఖాళీ చేయించారు. అప్పటినుంచీ ఆ స్థలం ఖాళీగా ఉండటంతో కబ్జా అవుతుందనే ఉద్దేశంతో అక్కడ పార్కు అభివృద్ధి చేస్తామని సాయిబాబా ఆలయ సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని ఆలయానికి అప్పగించారు. దాతల సహకారంతో సంఘ సభ్యులు సుమారు రూ.60 లక్షలు వెచ్చించి, పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. పార్కుకు ప్రహరీ నిర్మించి మిగిలిన 700 గజాల స్థలాన్ని ప్రహరీ బయట వాస్తు రీత్యా ఖాళీగా ఉంచారు. అక్కడ గజం రూ.40 వేలు పైనే పలుకుతోంది. అంత ఖరీదైన స్థలాన్ని ఖాళీగా ఉంచడమే పాపం అన్నట్టు ఇప్పుడు ఆ స్థలాన్ని తిరిగి ‘ఆమె’ కబ్జా చేసేసింది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆమె.. ఏడాది క్రితం టీడీపీలో చేరింది. కబ్జా స్థలాన్ని కాపాడుకోవడానికే ఇలా చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. నగరంలో ఆ పార్టీ ముఖ్యనేత దన్ను ఉండటంతో ఆమె కబ్జాను అడ్డుకున్నవారే లేకపోయారు. టీడీపీలో జన్మభూమి కమిటీ సభ్యురాలు కూడా కావడంతో.. కార్పొరేషన్ ప్రమేయం లేకుండానే 700 గజాల స్థలాన్ని ఆ తెలుగు మహిళ దర్జాగా కబ్జా చేసేసింది. అంతేకాకుండా ఆ స్థలంలో కార్పొరేషన్ అనుమతి లేకుండా గత నెల రెండో వారంలో రెండు పక్కా ఇళ్లు యుద్ధప్రాతిపదికన నిర్మించేశారు. ప్రస్తుతం మూడో ఇంటి నిర్మాణ ఏర్పాట్లలో ఉండగా స్థానికులు, సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు కార్పొరేషన్అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో బీచ్ ఫెస్టివల్ హడావుడిలో ఉండడంతో అధికారులు దీనిపై దృష్టి పెట్టలేదు. ఇదే అదునుగా బరితెగించిన ఆ తెలుగు మహిళ గడచిన కొద్ది రోజులుగా మరో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీనిపై స్థానికులు, ఆలయ కమిటీ చైర్మ¯ŒS పలకా శేఖర్ తదితరులు నిలదీసేందుకు వెళ్లగా, గొడవకు దిగడంతో వెనక్కు వచ్చేశారు. ఈ అంశాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని వారు విరమించుకున్నారు. దాతలు ముందుకు వచ్చారని, ఖాళీ స్థలంలో హెర్బల్ పార్క్ నిర్మిస్తామని ఆలయ కమిటీ సభ్యులు కార్పొరేషన్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా.. అధికార పార్టీ ముఖ్యనేత అండ ఉండటంతో వారు పెదవి విప్పడంలేదు. తహసీల్దార్ వివరణ కోరాం భాస్కర్‌నగర్ పార్కు స్థలంలో రెండు షెడ్లు అక్రమంగా నిర్మించిన విషయం మా దృష్టికి వచ్చింది. మూడో షెడ్డు నిర్మాణం మా దృష్టికి రాలేదు. తనవద్ద తహసీల్దార్ ఇచ్చిన పట్టా ఉందని చెబుతున్నందున తహసీల్దార్‌ను వివరణ కోరాం. పట్టా లేకుంటే చర్యలు తీసుకుంటాం. – కాలేషా, డిప్యూటీ సిటీప్లానర్ -
ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్
- ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి డిమాండ్ - రాష్ట్ర అధ్యక్షుడిగా టి.జి.భరత్ ఎన్నిక కర్నూలు(టౌన్): ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పూలబజార్‌లోని చిన్న అమ్మవారి శాలలో ఈ సమితి ఏర్పాటయ్యింది. వివిధ ఆర్యవైశ్య సంఘాలకు చెందిన నాయకులు సాధన సమితికి నూతన అధ్యక్షుడిగా టి.జి.భరత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లోగోను ఆవిష్కరించారు. డిమాండ్లతో కూడిన కరపత్రాలను సమావేశంలో విడుదల చేశారు. వివిధ ఆర్యవైశ్య సంఘాలు టీజీ భరత్‌ను ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీజీ భరత్ మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆర్యవైశ్యులను మాత్రం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల్లో ఐకమత్యం లేకపోవడం వల్లే ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి హక్కుల సాధన కోసం గాంధీ మార్గాన్ని ఎంచుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటిస్తూ సమితిని జిల్లాస్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద ఆర్యవైశ్యునికి ప్రభుత్వం ఉచిత గృహం నిర్మించాలన్నారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టి.జి.శివరాజు, మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి, శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు, కాశీ అన్నపూర్ణ సత్రం అధ్యక్షులు వై.బాలకృష్ణ, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు, అవోపా నాయకులు రత్నప్రసాద్, వాసవీ సేవాదళ్, వాసవీ క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు, ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తి ప్రసాద్, శేషగిరి శెట్టి, సుబ్రహ్మణ్యం, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఏర్పాటు ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి సమావేశం అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన టి.జి.భరత్‌తో పాటు ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య, కోశాధికారి తిరుపాల్ బాబు, జిల్లా అధ్యక్షుడు ఇల్లూరు సుధాకర్, కర్నూలు పట్టణ అధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శిగా లగిశెట్టి కిరణ్‌లను ఎన్నుకున్నారు. -
చేతకాకుంటే రాజీనామా చేయండి
ఆ సీటులో సమర్థులను కూర్చోబెట్టండి మేయర్‌కు షర్మిలారెడ్డి సూచన తాడితోట (రాజమహేంద్రవరం) : నగరపాలక సంస్థను పాలించడం చేతకాకుంటే రాజీనామా చేసి సమర్థులను కూర్చోబెట్టాలని వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి మేయర్ పంతం రజనీ శేషసాయికి సూచించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని మేయర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. మేయర్‌కే ప్రొటోకాల్ లభించకపోతే తమవంటివారి సంగతేమిటని ప్రశ్నించారు. మహిళను కాబట్టే తనకు విలువ ఇవ్వడం లేదని మేయర్ అనడం భావ్యం కాదన్నారు. కౌన్సిల్ సమావేశంలో మహిళా కార్పొరేటర్ పిల్లి నిర్మలకుమారిని పోలీసులు ఈడ్చుకువెళ్లినప్పుడు మహిళా మేయర్ అయి ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ నెల 8న కౌన్సిల్ సమావేశానికి 9 అంశాలు సిద్ధం చేస్తే అధికారులు 13 అంశాలను తీసుకువచ్చినట్టు చెబుతున్నారని, మేయర్‌కు తెలియకుండా ఈ అంశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పింఛన్ల మంజూరుపై తిరిగి సర్వే చేయాలి నగరానికి 2 వేల పింఛన్లు వస్తే రూరల్ వార్డులకు మంజూరు చేయడమేమిటని షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే, మేయర్ ఏకమై పింఛన్లు మంజూరు చేశారన్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్ల మధ్య వ్యత్యాసం చూపించారని అన్నారు. ఎనిమిదో డివిజ¯ŒSలో 39 దరఖాస్తులు వస్తే 35 పింఛన్లు మంజూరు చేశారన్నారు. మురికివాడలైన 49వ డివిజ¯ŒSకు 102 దరఖాస్తులు వస్తే 32 మాత్రమే మంజూరు చేశారన్నారు. పింఛన్ల అవకతవకలపై తిరిగి సర్వే చేసి అర్హులైనవారికి మంజూరు చేయాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ‘ఆదెమ్మదిబ్బ’పై ఆధారాలు బయటపెట్టాలి ఆదెబ్బదిబ్బ స్థలానికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలని షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడ కార్పొరేష¯ŒS స్థలం ఉన్నా మేయర్ సహా ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఎవరివద్ద ఆధారాలున్నాయో బయట పెట్టాలని లేకుంటే 15 రోజుల్లో తనవద్ద ఉన్న ఆధారాలను బయట పెడతానని స్పష్టం చేశారు. మాస్టర్‌ప్లా¯ŒS సహా ఏ అంశల పైనా తాను మేయర్‌తో కుమ్మక్కు కాలేదని, ప్రజా సమస్యలకు సంబంధించి ప్రతి అంశంపైనా పోరాడుతున్నామని అన్నారు. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధరరావు మాట్లాడుతూ, ప్రొటోకాల్ ఇవ్వడం లేదని మేయర్ అంటున్నారని, కానీ వార్డుల్లో జరిగే కార్యక్రమాలకు రెండుసార్లు పిలిచినా హాజరు కాలేదని తెలిపారు. కార్పొరేటర్‌కు తెలియకుండానే ఆమె వార్డుల్లో పర్యటిస్తారని అన్నారు. స్థాయీ సంఘం చైర్మ¯ŒSగా అజెండా అంశాలు మేయర్‌కు తెలియాలని, తెలియదంటే అది వారి పాలన వైఫల్యమేనని అన్నారు. అసలు పాలక మండలి ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. విలేకర్ల సమావేశంలో కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, వైఎస్సార్ సీపీ నాయకులు మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్లో కోల్డ్ వార్
మేయర్, కమిషనర్ల మధ్య భేదాభిప్రాయాలు తనకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారంటున్న మేయర్ తన పరిధిలో పని చేస్తున్నానంటున్న కమిషనర్ విజయరామ రాజు స్థాయీ సంఘం అజెండాల ఆమోదంలో మేయర్ ఆలస్యం చేస్తున్నారంటున్న కార్పొరేటర్లు ఆలస్యమైన పనులేవో చెప్పాలంటున్న మేయర్ పంతం రజనీ శేషసాయి భిన్నాభిప్రాయాలతో పెరుగుతున్న అంతరం నగర అభివృద్ధి కుంటుపడే ప్రమాదం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల మౌనంపై నగర ప్రజల విస్మయం సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పాలకవర్గానికి...యంత్రాంగానికి మధ్య అగాధం పెరుగుతోంది. దీంతో నగర అభివృద్ధి, పాలన గాడితప్పే ప్రమాదం ఉందని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కమిషనర్ వి.విజయ రామరాజు, మేయర్ పంతం రజనీ శేషసాయిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. గోదావరి అంత్య పుష్కరాల అనంతరం మండలికి, యంత్రాంగానికి మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది. ఈ విషయంలో మేయర్ నాలుగు నెలల క్రితం విలేకర్ల సమావేశం కూడా నిర్వహించి నగరపాలక సంస్థలో జరుగుతున్న పనులేవీ తన దృష్టికి రావడం లేదంటూ వాపోయారు. కౌన్సిల్ ఆమోదానికి రావాల్సిన పనులను కూడా చిన్న చిన్న మొత్తాలుగా విడదీసి స్థాయీ సంఘం ఆమోదానికి పెడుతున్నారని ఆరోపించారు. అయితే ఆ తర్వాత ఈ విషయం సద్దుమణిగినా బేధాభిప్రాయాలు మాత్రం ముదిరిపాకానపడ్డాయి. మేయర్, కమిషనర్లకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందన్న విషయం మంగళవారం మేయర్ పంతం రజనీశేషసాయి విలేకర్ల సమావేశంలో వెల్లడించిన అంశాలతో మరోమారు నిరూపితమైంది. అయితే తన పరిధిలోనే తాను నిర్ణయాలు తీసుకుంటున్నానని కమిషనర్ విజయరామరాజు పేర్కొంటున్నారు. రూ.10 లక్షలలోపు పనులకు తన ఆమోదంతో చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు. కుంటుపడుతున్న నగర అభివృద్ధి... తనకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని, స్ధాయీ సంఘం అంజెండాలో తనకు చెప్పకుండానే అంశాలు చేర్చుతున్నారని మేయర్ ఆరోపించారు. గత ఏడాది నవంబర్ 9వ తేదీన స్థాయీ సంఘ సమావేశానికి 17 అంశాలతో కూడిన నోట్‌ఫైల్‌పై మేయర్ సంతకం చేసి పంపారు. అయితే అజెండాలో మాత్రం 25 అంశాలున్నాయి. తనకు చెప్పకుండానే 8 అంశాలు అజెండాలో ఎలా చేరుస్తారంటూ మేయర్ సమావేశాన్ని వాయిదా వేశారు. తరువాత తిరిగి డిసెంబర్ 9న ఆ 25 అంశాలతోపాటు మరో 11 అంశాలు చేరుస్తూ స్థాయీ సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రొటోకాల్ పాటించడంలేదని, హ్యాపీ సండే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న విషయం తనతో చర్చించలేదని ఆరోపించారు. ఇలా అభివృద్ధి పనులు, ఇతర వ్యవహారాల్లో యంత్రాంగం, పాలక మండలికి మధ్య భేదాభిప్రాయల వల్ల నగర అభివృద్ధి కుంటుపడుతోంది. మేయర్ స్థాయీ సంఘం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఇతర పనులపై తన ఆమోదం తెలపకుండా నెలల తరబడి నాన్చుతున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల దృష్టికి వెళ్లినా పరిష్కారమేదీ? నగర పాలక సంస్థలో పాలన గాడి తప్పిందని పలు సందర్భాల్లో సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆకుల సత్యానారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కూడా పేర్కొన్నారు. పాలన గాడిలో పెడతామని ప్రకటనలు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా పాలనలో ప్రతిష్టంభన నెలకొనడం ఇదే ప్రథమమని సోమవారం విలేకర్ల సమావేశంలో గోరంట్ల పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా పెరిగిపోతోంది. దీని వెనుకు రాజకీయ శక్తులు ఉన్నాయన్న వార్తలు నగరంలో హల్చల్ చేస్తున్నాయి. అధికార పార్టీలోనే అనేక గ్రూపులున్నాయన్న చర్చ జోరందుకుంది. నగరపాలక సంస్థలో పైచేయి సాధించేందుకు కొందరు సీనియర్ కార్పొరేటర్లు యత్నిస్తుండడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందన్న ఆరోపణలున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల ఈ విషయం పట్ల చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ పాలక మండలి ఉన్నచోట ఇలాంటి విభేదాలు తలెత్తడం సహజం. దీనికి భిన్నంగా అధికార పార్టీ టీడీపీయే పాలకవర్గంగా ఉన్నచోట ఇలా జరుగుతుండడంపై ప్రజలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. -
పింఛను డ్రామా
నియోజకవర్గానికి 2 వేల పింఛన్లు 50 డివిజన్లకు 40 చొప్పున కేటాయింపు ప్రతిపక్ష డివిజన్లలో 10 చొప్పున కోత మిగిలిన 30లో సగం జన్మభూమి కమిటీలకు రూరల్ 8 డివిజన్లకు కూడా ఇందులోనే... పింఛన్ల కేటాయింపులో పారదర్శకలేమి పేదలు, ధనవంతుల డివిజన్లకు సమానంగా కేటాయింపు సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలో పింఛ¯ŒS రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గానికి ఇచ్చిన పింఛన్లను 50 డివిజన్లకు పంపిణీ చేయడంతో కొందరు కార్పొరేటర్లు పాలక వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూరల్ పరిధిలోని 8 డివిజన్లకు కూడా సిటీ నియోజకవర్గానికి వచ్చిన పింఛన్లను పంపిణీ చేయడాన్ని ఆక్షేపిస్తున్నారు. అర్హుల సంఖ్యతో సంబంధం లేకుండా పేద, ధనిక వర్గాల ప్రజలున్న డివిజన్లకు సమానంగా పింఛన్లను కేటాయించారు. ప్రతిపక్ష, స్వతంత్ర కార్పొరేటర్ ప్రజాప్రతినిధిగా ఉన్న డివిజన్లకు ఇచ్చిన పింఛన్లలో అధికారికంగా కోత విధిస్తున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో 50 డివిజన్లు న్నాయి. ఇందులో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలో 8 డివిజన్లు కలిశాయి. ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన నాలుగో విడత జన్మభూమి సభల అనంతరం ప్రభుత్వం నియోజకవర్గానికి 2 వేల పింఛన్ల చొప్పున కేటాయించింది. అర్బన్, గ్రామీణ అనే తేడా లేకుండా ప్రతి నియోజకవర్గానికి సమానంగా పింఛన్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నగర, రూరల్ నియోజకవర్గాలకు కూడా రెండు వేల చొప్పున పింఛన్లు మంజూరయ్యాయి. నియోజకవర్గం చొప్పున కేటాయించిన పింఛన్లను నగరపాలక సంస్థ పరిధిని ప్రమాణికంగా తీసుకుని 50 డివిజన్లకు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే డివిజన్లకు కూడా సిటీ నియోజకవర్గానికి కేటాయించిన పింఛన్లను పంపిణీ చేశారు. రూరల్ నియోజకవర్గానికి వచ్చిన రెండువేల పించన్లకు అదనంగా సిటీ పరిధిలోని పింఛన్లు 8 డివిజన్లకు 320 కేటాయించారు. నగరంలో అనేక ప్రాంతాల్లో మురికివాడలు, పేదలు ఎక్కువగా నివశించే డివిజన్లున్నాయి. నగర పరిధిలో అర్హులైన వారు వేల మంది ఉన్నారు. అయితే నగరపాలక సంస్థలో హవా కొనసాగిస్తున్న ప్రజాప్రతినిధి సిటీకి వచ్చిన పింఛన్లలో 320 తన నియోజకవర్గానికి తీసుకుపోవడంతో సిటీ పరిధిలోని వేలాది మంది వృద్ధులు, వికలాంగులకు ఎదురు చూపులే మిగిలాయి. అందరికీ సమానంగా ఎలా ఇస్తారు? అన్ని డివిజన్లకు 40 చొప్పున పింఛన్లు కేటాయించడాన్ని కొందరు కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు నగరంలో 3, 5, 11, 12, 22, 24 డివిజన్లలోని ప్రజలు ఆర్థికంగా బలమైనవారు. ఈ డివిజన్లలో అర్హుల సంఖ్య మంజూరైన 40 పింఛన్ల కన్నా తక్కువగా ఉంది. ఉదాహరణకు 12వ డివిజ¯ŒSలో అర్హులైన వారి దరఖాస్తులు 37 ఆ¯ŒSలై¯ŒS అవగా ఆ డివిజ¯ŒSకు కూడా 40 పింఛన్లు కేటాయించారు. 5వ డివిజ¯ŒSలో 32 దరఖాస్తులు ఆ¯ŒSలై¯ŒS అవగా 40 కేటాయించారు. ఇలా దాదాపు 10 డివిజన్లలో అర్హుల కన్నా ఎక్కువ పింఛన్లు కేటాయించారు. ఇక 31, 41, 46, 49 డివిజన్లలో 90 శాతం పేదలున్నారు. ఇక్కడ అర్హుల సంఖ్య కూడా వందల్లో ఉంది. 31వ డివిజ¯ŒSలో 300లకు పైగా దరఖాస్తులు రాగా 102 మాత్రమే ఆ¯ŒSలై¯ŒS అయ్యాయి. ఇది ప్రతిపక్ష కార్పొరేటర్ డివిజ¯ŒS కావడంతో 30 ఫించన్లే కేటాయించారు. అందులోనూ సగం జన్మభూమి కమిటీలకు ఇచ్చారు. 41వ డివిజ¯ŒSలో 96 మంది అర్హుల దరఖాస్తులు ఆ¯ŒSలై¯ŒS కాగా పేదలు ఎక్కువగా ఉన్న ఈ డివిజ¯ŒSకు కూడా 40 పింఛన్లనే కేటాయించారు. ప్రతిపక్ష డివిజన్ల కేటాయింపుల్లో కోత... టీడీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తు న్న డివిజన్లకు 40 చొప్పున కేటాయించగా ప్రతి పక్ష, కొందరు స్వతంత్ర కార్పొరేటర్ల డివిజన్లకు మా త్రం 30 పింఛన్లే కేటాయించారు. ఆ 30లో కూడా సగం ఆ డి విజ¯ŒSలో టీడీపీ ప్రభుత్వం వేసిన జన్మభూమి కమిటీలకు కేటాయిం చారు. ఆ 15 పింఛన్ల లబ్ధిదారులను జన్మభూమి కమిటీలే ఎంపిక చేస్తా యి. దీంతో కొందరు ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు ఆందోళనకు సిద్ధమవతున్నారు. ప్రతిపక్షం, స్వతంత్ర కార్పొరేటర్లలో పలుకుబడి కలిగిన వారు మాత్రం 40 పింఛన్లు సాధించుకోగలిగారు. వారు మాత్రం కిమ్మనడం లేదు. కొందరికి ‘కృతజ్ఞత’ పింఛన్లు.. ప్రతిపక్ష, స్వతంత్ర కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లకు కేటాయించిన పింఛన్లలో 10 చొప్పున కోత విధించిన ‘పెద్ద మనుషులు’ వాటిని తమ అనునూయులకు బహుమతిగా, తమ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసిన వారికి ‘కృతజ్ఞత’గా ఇచ్చారు. ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలో తమ అనుచరుడి భూ కబ్జాకు సహకరించిన కార్పొరేటర్లకు రెట్టింపు పింఛన్లు కానుకగా ఉచ్చారు. అదేవిధంగా సీనియర్ నేత అనుంగు అనుచరులు కూడా పింఛన్ల కేటయింపుల్లో పై‘చేయి’ సాధించారు. -
కార్పొరేషన్ అవినీతిపై ఆందోళన
= వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అఖిలపక్షం నిర్ణయం = రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు : మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ధ్వజం అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురం నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని అఖిలపక్ష నేతలు తెలిపారు. అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ అవినీతి కారణంగా నగర పాలక సంస్థ నవ్వులపాలు అవుతోందన్నారు. దీనిపై ప్రముఖ దినపత్రికలలో వార్తా కథనాలు వస్తున్నా వారి తీరులో ఎటువంటి మార్పూ లేదన్నారు. గడిచిన మూడేళ్లలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఉద్యోగులపై దౌర్జన్యాలకు కూడా పాల్పడుతున్నారన్నారు. కార్పొరేటర్లే కాంట్రాక్టర్లుగా మారి అవినీతి చేస్తున్నా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. పాలకవర్గం గ్రూపులుగా విడిపోయి ‘మూడు ముక్కలాట’ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి పనిలోనూ ఒక వర్గం చేపట్టాలని, మరో వర్గం వద్దంటూ అభివృధ్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అవినీతిలో అందరూ భాగస్వాములుగా మారారని దుయ్యబట్టారు. అధికారులను నిర్బంధించి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్నారు. మేయర్ సమక్షంలోనే ఉన్నతాధికారిపై దాడి జరిగిందనే వాస్తవం తెలుస్తోందని, ఇలాంటి చర్యల ద్వారా నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మాజీ మేయర్ రాగే పరశురాం మాట్లాడుతూ నేడు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నగర పాలక సంస్థ అవినీతి అక్రమాలపైనే ప్రధాన చర్చ నడుస్తోందన్నారు. పాలకవర్గం అనుసరిస్తున్న తీరుతో కార్పొరేషన్ మొత్తం దివాళా తీసే పరిస్థితి ఉందన్నారు. గడిచిన మూడేళ్లలో రూ.15 కోట్ల నిధులను డ్రా చేశారన్నారు. వారికి ప్రజలు, మీడియా, విజిలెన్స్ అంటే భయం లేకుండా పోయిందన్నారు. కమిషనర్‌పై దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను మేయర్, ఎమ్మెల్యే ఖండించినప్పటికీ ఈ విషయంలో అసలు దొంగలు ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ మాట్లాడుతూ కార్పొరేషన్ లో పెత్తందారీ వ్యవస్థ రాజ్యమేలుతోందన్నారు. సీపీఐ నగర కార్యదర్శి లింగమయ్య మాట్లాడుతూ కొన్ని నెలల వ్యవధిలోనే ఏడుగురు కమిషనర్లు బదిలీపై వెళ్లిపోవడం ఇక్కడి పరిస్థితికి అద్దంపడుతోందన్నారు. డివైడర్ల పేరుతో రూ.43 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. సీపీఎం మొదటి జోన్ కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ నగర పాలక సంస్థ విచ్ఛలవిడి తనానికి అడ్డాగా మారిందన్నారు. ఈ అవినీతిలో సీఎంకూ భాగముందని ఆరోపించారు. కార్పొరేటర్ జానకి మాట్లాడుతూ కార్పొరేషన్ అవినీతిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు విన్నవించినా వారు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. పైగా కార్పొరేటర్లపై అక్రమ కేసుల ను బనాయించి అరెస్టులు చేస్తున్నారన్నారు. కార్పొరేషన్ అవినీతిపై మంగళ వారం అఖి లపక్షం ఆధ్వర్యంలో విచారిస్తామని నేతలు తెలిపారు. విచారణ అనంతరం నగరపాలక సంస్థ కార్యాల యం ముందు మహాధర్నా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లికార్జున, సరోజమ్మ, బాలాంజినేయులు, గిరిజమ్మ, పక్కీరమ్మ, వెంకటరమణమ్మ, పోతులయ్య పాల్గొన్నారు. -
రాజకీయంగా సంఘటితం కావాలి
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ పిలుపు రావులపాలెం: బ్రాహ్మణులు రాజకీయంగా సంఘటితం కావాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు స్థానిక బ్రాహ్మణసంఘ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితుడు పెడసనగంటి సీతారామమూర్తి శర్మ అవధాని, వేదాశీర్వచనంతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కళావెంకట్రావు సెంటర్లో భక్తాంజనేయ ఆలయంలో పూజలు నిర్వహించారు. అలాగే కళా వెంకట్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళా వెంకట్రావు వంటి మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. స్వాతంత్య్ర సమరంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకుల్లో కళావెంకట్రావు ఒకరు అన్నారు. త్యాగాలు చేసే కాలంలో ముందున్న బ్రాహ్మణ నాయకత్వం నేడు ఏమైందని అంతా ప్రశ్నించుకోవాలన్నారు. నేడు బ్రాహ్మణులు రాజకీయాల్లోనే లేకుండా పోతున్నారని ఇప్పటికైనా సంఘటితమై రాజకీయాల్లో ్రçపధాన స్థానం పొందకపోతే భవిష్యత్ లేదన్నారు. ఈ సం దర్భంగా స్థానిక మహా త్మాగాంధీ అధ్యయన సంస్థ కార్యదర్శి దుళ్ల వెంకటేశ్వర్లు, కళా వెంకట్రావు, వావిలాల గోపాలకష్ణయ్య, జీవిత చరిత్రల రచనలను కృష్ణారావుకు అందజేశారు. ఆయన వెంట ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ డైరెక్టర్ దువ్వూరి సురేష్, రాణి శ్రీనివాసశర్మ, అమలాపురం డీఎల్పీఓ జేవీవీఎస్ శర్మ ఉన్నారు. ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా చూస్తా వెదురుపాక (రాయవరం) : బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి విడుదలయ్యే ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా చూడడం తన బాధ్యతని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) 81వ జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ 2014–15లో రూ.25కోట్లు, 2015–16లో రూ.35కోట్లు విడుదలైందన్నారు. 2016–17లో రూ.65కోట్లు విడుదల కాగా ఇప్పటి వరకు రూ.40కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు విడుదలైన నిధుల ద్వారా 30 వేల మందికి ప్రయోజనం చేకూరగా, ఈ ఏడాది చివరినాటికి మరో 10 వేల మందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ నిధుల్లో 50 శాతం విద్యా సంబంధ కార్యక్రమాలకు, మిగిలినవి సం క్షే మ కార్యక్రమాలకు వినియోగి స్తున్నట్లు తెలిపారు. ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే రెండేళ్లలో ఏడాదికి రూ.170కోట్ల వంతున విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఈ సంఘం ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం నెరవేరేలా తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అర్చకులను వివాహం చేసుకునేందుకు యువతులు ముందుకు రావడం లేదన్నారు. అందుకే చంద్రశేఖర పథకం కింద వారిని వివాహం చేసుకుంటే ఇరువురి పేరన రూ.లక్ష డిపాజిట్ చేయనున్నామని, ఆ సొమ్మును ఐదేళ్ల అనంతరం విత్‌డ్రా చేసుకుని ఖర్చు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో బ్రాహ్మణ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు సూరంపూడి కామేష్, బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు దంతుర్తి సత్యప్రసాద్‌లు ఉన్నారు. -
దొంగ కోళ్లు
కార్పొరేషన్లో టెండర్ ఆట - రింగ్ చేసేందుకు ఒక నేత యత్నం - అందరూ టెండర్లు వేయాలని మరో నేత ఆదేశం - బరిలో పలువురు కాంట్రాక్టర్లు - కార్పొరేషన్ ఖజానాకు సంక్రాంతి కిక్కు సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్లో దొంగ కోళ్ల సందడి మొదలయింది. కాంట్రాక్టర్లందరినీ రింగ్ చేసి.. కేవలం ఒకరిద్దరే టెండర్లో పాల్గొనేలా చేసి సులభంగా ‘ఆట’ గెలిచేందుకు అధికార పార్టీ నేత ఒకరు ప్రయత్నం చేశారు. అయితే, టెండర్లో అందరూ పాల్గొనాలంటూ మరో నేత ఆదేశించడంతో కార్పొరేషన్లో గెలుపు కోడి ఎవరనే అంశం చర్చనీయాంశంగా మారింది. రింగ్ కావడం ద్వారా ఏకపక్షంగా పందెం గెలవాలనుకున్న నేత కాస్తా మెత్తపడ్డారు. ఫలితంగా రూ.10.2 కోట్ల విలువ చేసే ఈ పనులన్నింటిలో ఇప్పుడు పోటీ మొదలయ్యింది. మొదట్లో కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరను కోట్ చేసి టెండర్ దక్కించుకుందామనుకున్న సదరు నేత ఆలోచనకు బ్రేకులుపడ్డాయి. తాజాగా కాంట్రాక్టర్లు పోటీపడటంతో తక్కువ ధరకే పనులు దక్కే అవకాశం ఉంది. ఈ మొత్తం రూ.10.2 కోట్ల పనుల్లో సుమారు కోటి రూపాయల మేరకు కార్పొరేషన్ ఖజానాకు మిగలనుందని సమాచారం. అంతిమంగా ఈ ఆటలో కార్పొరేషన్ ఖజానాకు సంక్రాంతి కిక్కు వచ్చినట్లయింది. ఇవీ పనులు....! – రూ.70 లక్షల విలువైన కల్లూరు దర్వాజా నుంచి ఉస్మానియా కాలేజీ మీదుగా ఉమర్ అరబిక్ కాలేజీ వరకు రోడ్డు వెడల్పు పనులు. – రూ.80 లక్షల అంచనా వ్యయంతో రేణుక ఆసుపత్రి నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్డు వెడల్పు పనులు. – గాయత్రీ ఎస్టేట్ నుంచి మద్దూరు నగర్ మీదుగా సి–క్యాంపు సర్కిల్ వరకు రోడ్డు వెడల్పు పని. ఈ పని అంచనా వ్యయం రూ.85 లక్షలుగా కార్పొరేషన్ అధికారులు తేల్చారు. – కోటి రూపాయల విలువ కలిగిన విష్ణుటౌన్‌షిప్ నుంచి జాతీయ రహదారి–44 వరకు(ఈద్గా పశ్చిమవైపునకు) – కృష్ణానగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యుబీ) వద్ద పశ్చిమ వైపునకు అప్రోచ్ రోడ్డు అభివృద్ధి పనులు. ఈ పనుల విలువ రూ.2 కోట్లు. – కృష్ణానగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యుబీ) వద్ద తూర్పు వైపునకు అప్రోచ్ రోడ్డు అభివృద్ధి పనులు. ఈ పనుల విలువ రూ.2 కోట్లు. – రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నంద్యాల రోడ్డు (ఎన్‌హెచ్–18) నుంచి గుత్తి రోడ్డు (ఎన్‌హెచ్–44) వరకు మాస్టర్‌ప్లాన్ రోడ్డు నిర్మాణం. కోటి ఖన్నానికి బ్రేకులు మొత్తం ఎనిమిది పనుల విలువ రూ.10.2 కోట్లు. ఈ పనుల్లో కాంట్రాక్టర్లను రింగు చేసి.. టెండర్లో కేవలం ఒక్కరిద్దరే పాల్గొని అధిక ధరకు టెండర్ వేయించాలనేది అధికార పార్టీలోని ఒక నేత ప్రయత్నం. తద్వారా కనీసం 5 శాతం అధిక ధర అంటే టెండర్ విలువ కంటే రూ.50 లక్షల మేరకు అధికంగా కొట్టేయాలనేది పన్నాగం. అంటే రూ.10.2 కోట్ల విలువైన పనులను రూ.10.7 కోట్లకు కొట్టేయాలని నిర్ణయించారు. అయితే, తాజాగా అందరూ టెండర్లో పాల్గొనడంతో ఈ మొత్తం టెండర్లన్నీ తక్కువ ధరకే(లెస్సుకే) పనులు దక్కే అవకాశం ఉంది. కనీసం 5 శాతం లెస్సు లెక్కించినా.. టెండర్ ధర కంటే రూ.50 లక్షలు తగ్గుతుంది. అంటే రూ.9.7 లక్షలకే కాంట్రాక్టర్లు పనులు చేయనున్నారు. ఒకవేళ టెండర్లో రింగు అయితే.. కోటి రూపాయల మేరకు అధికంగా పనులు కొట్టేయాలనుకున్న సదరు నేత పన్నాగంగా ఉంది. తాజా పరిణామాలతో దీనికి బ్రేక్ పడినట్లయింది. ఫలితంగా కార్పొరేషన్‌కు ఆ మేరకు లబ్ధి చేకూరనుంది. -
కార్పొరేషన్లో రూ. కోట్లు కొల్లగొట్టారు
– అక్రమాలపై కలెక్టర్ స్పందించాలి – లేదంటే త్వరలో కార్పొరేషన్ కార్యాలయం ముట్టడిస్తాం – మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం అనంతపురం : నగరపాలక సంస్థ ప్రస్తుత పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న అవినీతిపైనా, మారుతున్న కమిషనర్లపైన పత్రికల్లో రోజుకో కథనం వస్తోందని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్లో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. ఇది ఇలానే కొనసాగితే నగరపాలక సంస్థ దివాలా తీస్తుందన్నారు. కమిషనర్లను భయబ్రాంతులకు గురి చేసి చేయని పనులకూ బిల్లులు చేయించుకుంటున్నారని విమర్శించారు. కలెక్టర్, జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారికీ ఇందులో వాటాలున్నాయేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ముఖ్యంగా కలెక్టర్‌కు నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ ముగ్గురూ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు బుక్కపట్నం చెరువును పరిశీలించి ఏపుగా పెరిగిన కంపచెట్లను తొలిగించి, పూడిక తీయాలంటూ అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. ఆదేశాలు అందిన గంటలోనే అక్కడ పనులు ప్రారంభించారన్నారు. సీఎం నిధులు కేటాయిస్తానని చెప్పిన వెంటనే మంజూరుకాని, అంచనాలు కాని, ఏవిధమైన టెండరు కాని, పనులు చేసే విధానం తెలపకున్నా అధికార పార్టీకి చెందిన నాయకులు మూడు రోజుల్లో రూ. 10 కోట్ల పనులను ముగించారన్నారు. అధికారులు నాయకులకు కొమ్ము కాస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం అన్నారు. ఈ అక్రమాలపై కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని స్పందించకపోతే కార్పొరేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ మేయర్ రాగే పరుశురాం మాట్లాడుతూ అవినీతిలో ర్యాంకులు కేటాయిస్తే అనంత నగరపాలక సంస్థకు రాష్ట్రంలో మొదటిస్థానం దక్కుతుందని ఎద్దేవా చేశారు. బాక్స్ టెండర్లంటూ కొత్తభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. అత్యవసర పనులు నిమిత్తం నామినేషన్ పద్ధతిలో పనులు చేయొచ్చన్నారు. ఇవి చేయడం వల్ల 14 శాతం లెస్‌కు వేస్తారన్నారు. ఇది కార్పొరేషన్‌కు ఆదాయమేన్నారు. ఇలా చేయడం వల్ల తమ అనుయాయులు ఇంతమొత్తం నష్టపోతారనే ఉద్ధేశ్యంతో బాక్స్ టెండర్‌ను తెరపైకి తెచ్చారన్నారు. ఈ విధానం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని చెప్పారు. అవినీతి అక్రమాలపై విచారణ చేయించాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. -
కర్నూలు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు
– చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ – ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్ కర్నూలు (టౌన్): స్మార్ట్‌సిటీ పేరుతో కర్నూలు నగరంలో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కర్నూలు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. విధి విధానాలు రూపొందించి కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్‌ను నియమిస్తూ సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు నగర పరిధిలో ప్రజల జీవన పరిస్థితుల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు వచ్చే మూడేళ్ల వ్యవధిలో రూ. 33 కోట్లు మంజూరు చేయనుంది. చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరించే ఈ కార్పొరేషన్ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా నగరపాలక కమిషనర్, జిల్లా ఎస్పీ ఉంటారు. షేర్‌హోల్డర్లుగా ప్రిన్సిపల్ ప్రత్యేక కార్యదర్శి, మున్సిపల్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ సీఈ టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్, అడిషనల్ కమిషనర్, ఎగ్జామినర్, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఎస్ఈలు వ్యవహరిస్తారు. రూ. 5 లక్షలు విలువ చేసే షేర్లను రూ. 10 ప్రకారం 50 వేల షేర్లను రూపొందించారు. -
బ్రాహ్మణులకు ‘నారాయణ ప్రసాదం’
కర్నూలు(అర్బన్): బ్రాహ్మణులు మృతి చెందితే వారి కుటుంబాలకు నారాయణ ప్రసాద పథకం ద్వారా ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తామని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా బియ్యం, కందిపప్పు, నూనె, నెయ్యి తదితర వస్తువులను అందించాలనుకునే వారు సంకల్‌బాగ్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలోని నగర సంఘం ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ను సంప్రదించాలన్నారు. ఈ దేవాలయంలోని వనానికి నారాయణవనం అని పేరు పెట్టామన్నారు. ఎండోమెంట్తో సంబంధం లేకుండా అర్చకులు, పురోహితుల ఉపనయనాలకు రూ.25 వేలు, చంద్రశేఖర్ పథకం ద్వారా వధూవరులకు రూ.1 లక్ష అందిస్తామన్నారు. త్వరలోనే కర్నూలు నగరంలో బ్రాహ్మణులు అపకర్మలు చేసుకునేందుకు భవనంతో పాటు విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు హాస్టల్ వసతి, వేద పాఠశాల, వృద్ధాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి హెచ్‌కే మనోహర్‌రావు, నగర అధ్యక్షుడు కళ్లె చంద్రశేఖరశర్మ, ఉపాధ్యక్షుడు ఎస్ చంద్రశేఖర్, సీవీ దుర్గాప్రసాద్, శ్యాంసుందరశర్మ, హెచ్‌కే రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీ రుణాల మంజూరుకు చర్యలు
– 27 నుంచి పలు మండలాల్లో ఇంటర్వూ్యలు కర్నూలు(రాజ్‌విహార్): మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మైనారిటీ కార్పొరేషన్ జిల్లా ఎగ్జిక్యూటీవ్ డైరక్టరు మహమ్మద్ అంజాద్ అలీ శనివారం ప్రకటనలో తెలిపారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పెద్ద కడుబూరు, డోన్ మున్సిపాలిటీ (పట్టణం), చిప్పగిరి, ఆలూరు, మిడుతూరు, కల్లూరు, పత్తికొండ, పాణ్యం, గోస్పాడు, మద్దికెర, ప్యాపిలి, బనగానపల్లె మండలాలకు చెందిన అభ్యర్థులు 27వ తేదీన, హోళగుంద, నందవరం, పాములపాడు, బేతంచెర్ల, ఉయ్యాలవాడ, కొత్తపల్లి, ఆదోని మున్సిపాలిటీ, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, వెలుగోడు మండలాల్లో 28వ తేదీన, కృష్ణగిరి, పగిడ్యాల మండలాల్లో 29వ తేదీన ఉదయం 10గంటలకు మండల అభివృద్ధి అధికారి (ఎండీఓ) కార్యాలయాల్లో ఇంటర్వూలు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలకు ఫోన్ : 70754 40400, 88013 54690 నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
81 మందికి ఎన్ఎస్ఎఫ్డీసీ రుణాలు
కర్నూలు(అర్బన్): జిల్లా షెడ్యూల్డు కులాల ఆర్థిక సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 81 మందికి రూ.2.27 కోట్ల ఎన్ఎస్ఎఫ్డీసీ రుణాలు మంజూరైనట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎస్ సత్యం తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పథకం కింద 246 మంది ఎంపిక కాగా, మొదటి విడత కింద 81 మందికి రుణాలు మంజూరు చేస్తు కార్పొరేషన్ ఎండీ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇందులో రుణం రూ.1.35 కోట్లు, సబ్సిడీ రూ.80.80 లక్షలు, లబ్ధిదారుల వాట రూ.11.355 లక్షలు ఉంటుందన్నారు. మొదటి విడతలో ఇంటర్నెట్ షాపు ఏర్పాటుకు 45 మందికి, మినిడెయిరీకి 20, మెడికల్ క్లినిక్‌కు 2, ఆటో ట్యాక్సీకి 12, ఆటో ట్రాలీ గూడ్సు వెహికల్స్ 2 యూనిట్లకు రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సీ హరికిరణ్ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. అప్పట్లో ఎంపికైన వారిలో ఇంకా 165 మందికి రుణంగా రూ.2.41 కోట్లు, సబ్సిడీగా రూ.1.59 కోట్లు త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. -
రేపు వైఎస్ఆర్సీపీ విస్తృతస్థాయి సమావేశం
– పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. సమావేశానికి పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుకతో పాటు కమలాపురం శాసన సభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా పరిశీలకులు అనంత వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వివరించారు. ఆ ప్రకటనలో సమావేశాల షెడ్యూలును కూడా విడుదల చేశారు. షెడ్యూలు దిగువ పేర్కొన్న విధంగా ఉంది. కర్నూలు నియోజకవర్గ సమావేశం.. కర్నూలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం రాయల్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు: 1 మొదలు 5వరకు వార్డులు, 10 గంటల నుంచి 11 గంటల వరకు: 6 నుంచి 10 వార్డులు, 11 గంటల నుంచి 12 వరకు: 11 నుంచి 15 వార్డులు, మధ్యాహ్నం 12 నుంచి 1.00 గంట వరకు 16, 17, 18, 22, 23 వార్డులు, 1.30 గంటల నుంచి 2.30 వరకు: 24, 25, 41, 42, 43 వార్డులు, 2.30 నుంచి 3.30 గంటల వరకు: 44 నుంచి 48 వార్డులు, సాయంత్రం 3.30 నుంచి 4 గంటల వరకు 49 నుంచి 51 వార్డుల సమావేశాలుంటాయి. పాణ్యం, కోడుమూరు నియోజకవర్గ (కార్పొరేషన్) సమావేశం.. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే పాణ్యం, కోడుమూరు వార్డుల విస్తృతస్థాయి సమావేశం బిర్లా కాంపౌండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు: 19, 20, 21, 26, 27 వార్డులు, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు: 28 నుంచి 32 వరకు వార్డులు, సాయంత్రం 6.30 నుంచి 8.00 గంటల వరకు: 33 నుంచి 40వ వార్డు వరకు -
సైనికుల్లా పని చేద్దాం
- మున్సిపల్ ఎన్నికల ఓటరు నమోదుపై దృష్టి సారించాలి - నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా పోరాడుదాం - వైఎస్ఆర్సీపీ జిల్లా అదనపు పరిశీలకుడు రవీంద్రనాథ్‌రెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని జిల్లా అదనపు పరిశీలకుడు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం రోజురోజుకు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని, దానిని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మలుచుకునేందుకు సమష్టి కృషి అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ కలుపుగోలు తనంతో నాయకులు, కార్యకర్తలు అన్న తేడా లేకుండా పార్టీ కోసం పనిచేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో సులభంగా గెలవచ్చన్నారు. శనివారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఇటీవల ఎంపిక చేసిన డివిజన్ ఎలక్షన్ కమిటీలతో రవీంద్రనాథ్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్పొరేషన్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో నిమగ్నం కావాలన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు చేపట్టనున్న ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఆయా కమిటీ సభ్యులు వారివారి డివిజన్లలో ఇంటింటికి తిరిగి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. అంతేకాక వార్డుల భౌగోళిక పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు, సమస్యలపై పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించాలని కోరారు. ఎంపీ బుట్టా రేణుక నేతృత్వంలో.. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక నేతృత్వంలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించామని జిల్లా అదనపు పరిశీలకుడు రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఎన్నికైన డివిజన్ ఇన్చార్జీలు, అందులోని కమిటీ సభ్యులు ఎన్నికల అంశాలపై ఎంపీతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ముందుకు సాగాలని సూచించారు. 20న వార్డుల వారీగా సమీక్ష: తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం ఈనెల 20వ తేదీన వార్డుల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా వార్డుల డివిజన్ ఎలక్షన్ కమిటీలు పూర్తి స్థాయి సమాచారంతో సమీక్షకు హాజరు కావాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి ఏడు గంటలకు సమీక్షా సమావేశం ఉంటుందని, త్వరలోనే సమావేశాన్ని ఎక్కడ నిర్వహించేదేది తెలుపుతామని పేర్కొన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో: ఎంపీ కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌పై వైఎస్ఆర్సీపీ జెండాను ఎగుర వేసేందుకు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎంపీ బుట్టారేణుక పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను ఇవ్వడంలో టీడీపీ, బీజేపీ విఫలమైన నేపథ్యంలో ప్రజలు చూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. నగరంలోని వార్డుల్లో సమస్యలు పేరుకుపోయాయని, అయినా టీడీపీ ప్రజా ప్రతినిధులు మాత్రం వాటి గురించి పట్టించుకోవడంలేదన్నారు. ఎంతో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పడం తప్పా వారు చేసిందేమిలేదన్నారు. కర్నూలు నగరంలో చాలా వార్డులో మంచినీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దోమల బెడదతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, సీడబ్ల్యూసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, సిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్, కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల పరిధిలోని మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
మనస్పర్థలు...అభివృద్ధిపై నీలినీడలు
నగరపాలక సంస్థలో అంతర్యుద్ధం మేయర్, కమిషనర్ మధ్య సమన్వయలోపం మేయర్ అనుమతికి విరుద్ధంగా ఎజెండాలోకి అంశాలు స్థాయీ సంఘం సమావేశంలో మరోసారి బయటపడిన విభేదాలు సాక్షి, రాజమహేంద్రవరం/ రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో కమిషనర్ వి.విజయ రామరాజు, మేయర్ పంతం రజనీ శేషసాయిల మధ్య సమన్వయ లోపం నగర అభివృద్ధికి శాపంగా మారింది. కలిసి పని చేయాల్సిన మేయర్, కమిషనర్ ఎవరి దారి వారిదన్నట్లుగా కొద్ది నెలలుగా వ్యవహరిస్తుండడంతో కౌన్సిల్లో ఆమోదం పాందిన పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలున్నాయి. ఇదే విషయాన్ని నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారంటే నగర అభివృద్ధిపై ఏ మేరకు నీలినీడలు కమ్ముకుంటున్నాయో బయటపడుతోంది. మూడు నెలలకోసారి నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధిపై పలు నిర్ణయాలు తీసుకుంటారు. మిగిలిన రోజుల్లో చేపట్టాల్సిన పనుల కోసం ప్రతి వారం మేయర్ అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో స్థాయీ సంఘం సమావేశం జరుగుతుంది. ఈ రెండు సమావేశాల్లో తీసుకున్న పలు ప్రతిపాదనలు, తీర్మానాలకు అనుగుణంగా అంచనాలు రూపొందించి సభ్యుల ఆమోద ముద్రతో పనులకు శ్రీకారం చుట్టారు. దీనికి భిన్నంగా నిప్పూ, ఉప్పుగా కమిషనర్, మేయర్ ఉండడంతో వారం వారం జరగాల్సిన స్థాయీ సంఘం సమావేశం కూడా జరగడం లేదు. దీంతో ప్రగతి పడకేస్తోంది. మరోసారి విభేదాలుబట్టబయలు... తాజాగా సోమవారం జరిగిన స్థాయీ సంఘం సమావేశం వాయిదా పడడం మరోసారి మేయర్, కమిషనర్ మధ్య జరుగుతున్న వర్గపోరును బహిర్గతం చేసింది. గత నెల 25న 16 అంశాలతో రూపొందించిన ఎజెండాను నగరపాలక సంస్థ సెక్రటరీ మేయర్ అనుమతి కోసం పంపారు. అదే నెల 28న సమావేశం నిర్వహించాలని మేయర్ నిర్ణయించారు. అనంతరం సెక్రటరీ సెలవుపై వెళ్లారు. ఆ స్థానంలో ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న అధికారి కమిషనర్ ఆదేశాలతో మరో తొమ్మిది అంశాలు ఉన్నాయంటూ 28న మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. అప్పటికే నిర్ణయించిన ప్రకారం 16 అంశాలతో నవంబర్ 7న స్థాయీ సంఘం సమావేశం నిర్వíßంచాలని మేయర్ ఇన్ చార్జ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అధికారికి సూచించారు. అయితే సోమవారం 25 అంశాలతో కూడిన ఎజెండా స్థాయీ సంఘం సమావేశం ముందుకు వచ్చింది. తన నిర్ణయానికి వ్యతిరేకంగా 25 అంశాలతో ఎజెండా పెట్టడడంతో మేయర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని వాయిదా వేశారు. ఇలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే సమావేశాన్ని మేయర్ వాయిదా వేయడాన్ని అధికార పార్టీకి చెందిన సంఘ సభ్యులు వ్యతిరేకిస్తూ ఇన్ చార్జి సెక్రటరీకి లేఖ రాశారు. చైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం లేకపోయినప్పటికీ సభ్యులు లేఖ రాయడం గమనార్హం. ఈ ఘటనతో మేయర్, అధికార పార్టీ సభ్యుల మధ్య ఉన్న లుకలుకలు మరింత ముదిరి పాకానపడ్డట్టయింది. -
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలి
- టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది - అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెట్టినా బెదరొద్దు - సమన్వయంతో పనిచేస్తే మనదే విజయం - పార్టీ జిల్లా అదనపు పరిశీలకులు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగుర వేయాలని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వంతో పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అదనపు పరిశీలకులు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంపై 92.8 శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, అది కర్నూలులో 93.4 శాతంగా ఉందన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా పక్కన పెట్టి పనిచేస్తే వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో విజయం తథ్యమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని అహర్నిశలు కష్టపడాలని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఇబ్బంది పెట్టినా బెదరకూడదని ధైర్యం నూరిపోశారు. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు స్థానికంగా ఉండే నాయకులతోపాటు తాను అండగా ఉంటానని చెప్పారు. అవసరమైతే పార్టీయే వారికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మరో ఆరు నెలలు గడిస్తే టీడీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతుందని.. అప్పటిలోగా జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయాలను చూసి అధికారులు వద్దన్నా సహకరిస్తారన్నారు. అంతవరకు కొంత ఇబ్బందులు ఉన్నా ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు. అంతకు ముందు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారి నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఒక్క సీటు రాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మునిసిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అక్టోబర్/నవంబర్ నెలల్లో ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే ఉద్దేశంతో ఫిబ్రవరి/మార్చి/ఏప్రిల్ నెలల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఒక్క సీటు రాదని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి మంత్రం జపిస్తోందని, అయితే ప్రజలు వారి మోసాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌లోని 51 డివిజన్లను కైవసం చేసుకోచ్చని ధీమా వ్యక్తం చేశారు. 15లోపు డివిజన్ ఎలక్షన్ కమిటీలు.. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి ఎంపీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ కమిటీలో నగరంలో ఉండే నాయకులు, కార్యకర్తలకు చోటు కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు డివిజన్ ఎలక్షన్ కమిటీల ఏర్పాటు బాధ్యతను పలువురు నాయకులకు అప్పగించినట్లు ఆయన వివరించారు. ఈ కమిటీలు నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆయా డివిజన్లలో ఓటర్ల నమోదు, పార్టీ ప్రచార కార్యక్రమాల బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని వివరించారు. జనవరి 10వ తేదీ తుది ఓటరు జాబితా విడుదల అవుతుందని, ఆ తరువాత రిజర్వేష్లను ఖరారు చేస్తారని, ఆ వెంటనే ఎన్నికలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో కేంద్రపాలిక మండలి సభ్యుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవైరామయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రభాకరరెడ్డి, నగర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు జహీర్ అహ్మద్, కృష్ణారెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ నాయకుడు సమన్వయ నాయకులు 1–8 హఫీజ్‌ఖాన్ అయుబ్‌ఖాన్, సురేంద్రనాథ్‌రెడ్డి 9–16 గౌరు వెంకటరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, మద్దయ్య 17–25 బీవై రామయ్య విజయలక్ష్మీ, రమణ 26–36 గౌరు చరితారెడ్డి 37–42 కొత్తకోట ప్రకాష్‌రెడ్డి రహమాన్, ఫిరోజ్‌ఖాన్ 43–51 నరసింహులు యాదవ్ ఈశ్వర్, సురేష్ నిరుత్సాహపడకండి: ఎంపీ బుట్టా రేణుక వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో బలమైన ఆదరణ ఉందని, కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉన్నా నిరుత్సాహపడకుండా పనిచేయాలని ఎంపీ బుట్టా రేణుక.. కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలో లేకపోవడంతో కొన్ని పనులు కావడంలేదన్నారు. కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానునగా ఇవ్వాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని నెలకొల్పుతుతామని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. వక్ఫ్‌బోర్డు నిధులు మళ్లీంపు దారుణం: ఽహఫీజ్ఖాన్ వక్ఫ్‌బోర్డు నిధులను మసీదులకు మళ్లించడం దారుణమైన విషయమని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయక ర్త హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. ఈ విషయాన్ని మరచి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి మసీదులకు నిధులు తెప్పించినట్లు ముస్లింలను మోసం చేస్తున్నారన్నారు. గతంలో వక్ఫ్ బోర్డు నిధులను పిల్లల స్కాలర్షిప్పులు, ఫీజు రీయంబర్స్ కోసం వినియోగించేవారని తెలిపారు. -
అడ్డ‘దారి’!
• అరుునోళ్లకు అప్పగించేందుకు ‘అధికార’ ఒత్తిడి • విషయం బయటకు పొక్కడంతో వివాదంగా మారిన వైనం • టెండర్ అమలుపై తర్జనభర్జన పడుతున్న పాలకవర్గం అవినీతి అక్రమాలకు ఆస్కారం ఉండొద్దు.. అంతా పారదర్శకంగా జరగాలి.. చేసే పనులు నాణ్యతగా.. మన్నికగా ఉండాలి.. పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు కుమ్మక్కు కాకుండా.. ప్రభుత్వం ఈ-టెండర్ విధానం అమలు చేస్తోంది.. ఎన్ని నిబంధనలు పెట్టినా.. మా దారి మాదే.. రూల్స్ మాకేం పట్టవన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు కాంట్రాక్టర్లు. నేతల ఒత్తిడికి తలొగ్గిన కార్పొరేషన్ అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. టెండర్‌పై నిర్ణయం తీసుకునేందుకు పాలకవర్గం తర్జన భర్జన పడుతోంది. - ఖమ్మం ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్లో రూ.కోటిన్నర విలువైన రహదారి నిర్మాణ పనుల టెండరింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పనులు నాణ్యతగా ఉండాలనే ఉద్దేశంతో.. కాంట్రాక్టర్లు కుమ్మక్కు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ-టెండర్ విధానం అమలు చేస్తోంది. అరుుతే అధికారాన్ని అడ్డం పెట్టుకున్న కొందరు కాంట్రాక్టర్లు ఈ నిబంధనలు మాకు వర్తించవు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టెండర్లు నిస్పక్షపాతంగా దాఖలైతే మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది. పనులు కూడా నాణ్యతగా ఉండే అవకాశం ఉంది. అరుుతే టెండర్లు దక్కించుకునే విషయంలో ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.కోటిన్నర విలువైన రహదారి పనులు తమ వారికే ఇప్పించాలని ప్రజాప్రతినిధులు తలంచడం.. ఆపై ఎవరికి అనుమానం రాకుండా కేవలం రెండు టెండర్లు మాత్రమే దాఖలు చేయడం.. ఇది కాస్తా బయటకు పొక్కడంతో ఇప్పుడేం చేయాలనే దానిపై కార్పొరేషన్ పాలక మండలి తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో రూ.1.50కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధులతో ఇటీవల టెండర్లు దాఖలు చేశారు. ఇవి సీఎం నగర అభివృద్ధి కోసం కేటారుుంచిన నిధులు కావడంతో ఓ ప్రజాప్రతినిధి అండతో స్థానిక ప్రజాప్రతినిధి బంధువు చక్రం తిప్పి టెండర్లు వేరే వాళ్లు దాఖలు చేయకుండా రెండు టెండర్లు మాత్రమే దాఖలయ్యేలా చేశారు. రూ.1.50కోట్ల పనులకు ఒక టెండర్ అధిక రుసుముకు జారీ చేసి.. మరో టెండర్‌ను కార్పొరేషన్ అధికారులు నిర్ణరుుంచిన ధరకే కోడ్ చేశారు. దీంతో జీరో పర్సంటేజీ వద్ద టెండర్ దక్కించుకునేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అరుుతే విషయం బయటకు పొక్కడం.. కొందరికి ఈ పనులపై సొమ్ములు రాకపోవడంతో టెండరింగ్ కాస్తా వివాదంగా మారింది. ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి ఉండటంతో అటు అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఒత్తిడికి నిర్ణయం.. ఎలాగైనా పనులు దక్కించుకోవాలని తలంచిన సదరు కాంట్రాక్టర్ టెండర్‌ను ఖరారు చేరుుంచుకునేందుకు పాలక మండలిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మున్సిపాలిటీలో జరిగిన ఓ సమావేశంలో తనకు అనుకూలంగా ఉన్న స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులతో టెండర్ ఖరారు చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. సాధారణంగా సింగిల్ టెండర్ దాఖలు చేస్తే దానిని రద్దు చేసి.. అధికారులు తిరిగి టెండర్ దాఖలు చేయాల్సి ఉంది. అరుుతే రెండు టెండర్లు మాత్రమే దాఖలు కావడం, అవి కూడా ఒకటి అధిక ధరకు, రెండోది నిర్దేశిత ధరకు దాఖలు కావడంతో ఏమి చేయాలో పాలుపోని అధికారులు.. దీనిని పాలక మండలి నిర్ణయానికే వదిలేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇతర కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేయకుండా చేసి, కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టే విధంగా వేసిన ఈ టెండర్లను రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విపక్ష కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ టెండర్ రద్దవుతుందా? నేతల ఒత్తిడికి తలొగ్గి టెండర్ ఖరారు చేస్తారా? అనేది కార్పొరేషన్లో చర్చనీయాంశంగా మారింది. -
కొత్త భవనం.. కుదరని ముహూర్తం
ఖమ్మం: ‘కార్పొరేషన్‌లోని ప్రణాళిక విభాగం కార్యాలయం.. ఒక పక్క నగరంలోని భవనాలకు సంబంధించిన ఫైళ్లతోనే నిండి ఉంటుంది.. ఇద్దరు కలిసి అధికారి వద్దకు వస్తే కనీసం నిల్చునేందుకు స్థలం ఉండదు.. పట్టణ ప్రణాళిక అధికారి ముందు కూర్చునేందుకు వీలుండదు..’ ఇదీ ఖమ్మం కార్పొరేషన్లో చాలీచాలని గదులతో కొనసాగుతున్న పాలన. వందేళ్ల క్రితం నిర్మించిన పాత భవనం.. దానికి అనుబంధంగా నిర్మించిన రెండు భవనాలు ఇప్పుడు కార్పొరేషన్‌కు పరిపాలనా భవనాలుగా మారాయి. పాలనా సౌలభ్యం కోసం కొత్త భవనం నిర్మించాలనే ప్రణాళిక సైతం ముందుకు సాగడం లేదు. 1942లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న ఖమ్మం కార్పొరేషన్ వ్యాపార, వాణిజ్యంతో అతి తక్కువ కాలంలో కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. పాలన సక్రమంగా నిర్వహించి.. ప్రజల ఇబ్బందులు తీర్చే పరిపాలనా భవనం మాత్రం మారడం లేదు. కార్పొరేషన్‌గా ఏర్పడి నాలుగేళ్లు పూర్తయినప్పటికీ పరిపాలన భవనం రూపురేఖలు మారడం లేదు. కార్పొరేషన్లో 3,56,000 మంది జనాభాతో.. 50 డివిజన్లుగా ఏర్పడింది. 93 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నగరంలో కార్పొరేషన్ లెక్కల ప్రకారం 98,548 ఇళ్లు ఉన్నాయి. రోజూ వివిధ అవసరాల నిమిత్తం కార్పొరేషన్‌కు వస్తుంటారు. దీంతోపాటు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను చేయించుకునేందుకు ఇక్కడికే రావాల్సి ఉంది. సిబ్బంది సతమతం.. కార్పొరేషన్లో ప్రస్తుతం 99 మంది సిబ్బందికి.. 67 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పరిపాలనా విభాగంలో 27 మందికి.. 22 మంది, రెవెన్యూ విభాగంలో 18 మందికి.. 13 మంది, అకౌంట్స్ విభాగంలో ఒకరు, పబ్లిక్ హెల్త్, శానిటేషన్ విభాగంలో 20 మందికి.. 13, ఇంజనీరింగ్ విభాగంలో 14 మందికి.. 9 మంది, టౌన్ ప్లానింగ్ విభాగంలో 22 మందికి.. తొమ్మిది మంది బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు పారిశుద్ధ్య విభాగంలో వివిధ డివిజన్లలో పనిచేసే వందలాది మంది కార్మికులను ఇక్కడి నుంచే పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాత భవనంలో మున్సిపల్ మేనేజర్‌తోపాటు కొందరు విధులు నిర్వహిస్తుండగా.. అనుబంధంగా నిర్మించిన భవనాల్లో చాలీచాలని గదుల్లో జనన, మరణ ధ్రువీకరణ, పట్టణ ప్రణాళికా విభాగం, ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్, పబ్లిక్ హెల్త్ శాఖలతో కమిషనర్ కార్యాలయం నడుస్తున్నాయి. కార్పొరేషన్‌లోని కౌన్సిల్ హాల్ వద్ద మేయర్ కార్యాలయం ఉంది. సుమారు రూ.వెయి కోట్ల మేరకు ఆదాయం కలిగి ఉన్న కార్పొరేషన్‌కు కొత్త భవనం నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికోసం ఎన్ఎస్పీ వద్ద నాలుగున్నర ఎకరాల స్థలం కేటాయించారు. భవనాన్ని డిజైన్ చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. ఇటీవల అది మరుగున పడింది. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణంతో వెనక్కు.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో కొత్త కలెక్టరేట్ భవిష్యత్‌లో నిర్మిస్తే.. అక్కడే కార్పొరేషన్ కార్యాలయం ఉండేలా చూడాలని జిల్లా ఉన్నతాధికారులు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం కొత్త భవన నిర్మాణం అంశం మరుగున పడినట్లు తెలుస్తోంది. మూడు లక్షల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండటంతోపాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన కార్పొరేషన్‌కు ప్రత్యేక భవనం అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు కార్పొరేషన్ నూతన భవన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
తీరాన ఎగసింది..ఆనందతరంగం
కార్పొరేష¯ŒS ఆధ్వర్యంలో పుష్కరఘాట్‌లో ‘హ్యాపీ సండే’ అలరించిన మున్సిపల్ స్కూల్ విద్యార్థుల ఆటాపాటా అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సరదాగా ‘టగ్ ఆఫ్ వార్’ రాజమహేంద్రవరం సిటీ : వరదవేళ గోదావరిలో నీరు ఉరకలెత్తిట్టు.. ఆ నదీతీరాన ఉన్న పుష్కరఘాట్‌లో ఆదివారం ఆనందోత్సాహాలు పరవళ్లు తొక్కాయి. రేవు ఆటపాటలకు నెలవైంది. పిన్నలూ, పెద్దలూ, మాన్యులూ, సామాన్యులూ ఆ సందడిలో భాగస్వాములయ్యారు. నగర ప్రజల ఉమ్మడి వేదికగా విభిన్న రకాల కార్యక్రమాలతో రూపొందించిన ‘హ్యాపీ సండే’ తొలిసారి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులతో రెండు గంటల పాటు ఉల్లాసంగా గడిచింది. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కమిషనర్ విజయరామరాజు అధికారులు ఒక జట్టుగా, ఎంపీ మురళీమోహ¯ŒS, మిగిలిన ప్రజాప్రతినిధులు మరోజట్టుగా టగ్ ఆఫ్ వార్ సరదాగా సాగింది. కబడ్డీ, ఖోఖో, రంగవల్లుల పోటీలు నిర్వహించారు.రక్త పరీక్షలు, మెహిందీ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రూ.10 నుంచి రూ.1000 లవరకూ ఫ్యాన్సీ నెంబర్ల నోట్లు, వివిధరకాల ప్టాస్టిక్ వస్తువుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నీటి ఆవశ్యకత గూర్చి చిన్నారి ఇచ్చిన ప్రదర్శన అలరించింది. నగర పాలక సంస్థ పాఠశాలల చిన్నారులు జాతీయత ఉట్టిపడే గీతాలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తీ¯ŒSమార్, కరాటే, బురక్రథ వంటి అంశాలు అలరించాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తొలి ప్రయత్నం విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఆదివారాల్లో మరింత ఆనందంగా ఉండే విధంగా రూపొందిస్తామన్నారు. ఎంపీ మురళీమోహ¯ŒS మాట్లాడుతూ వంటల పోటీలు, యోగా వంటి అంశాలు నిర్వహించేలా చూస్తామన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, కార్పొరేటర్లు రాంబాబు, గొర్?రల సురేష్, కొమ్మ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘కార్పొరేషన్’ సమరానికి సన్నద్ధం
-
బీజేపీకి టీడీపీ ఝులక్
స్టాండింగ్ కమిటీలో దక్కని చోటు గతంలో ఇచ్చిన హామీకి మంగళం బీజేపీ స్పందనపై కార్పొరేషన్ వర్గాల్లో ఆసక్తి రాజమహేంద్రవరం: మిత్ర పక్ష బీజేపీకి అధికార టీడీపీ చేయిచ్చింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీలో చోటు ఇవ్వకుండా వ్యూహం రచించింది. రెండో దఫా అవకాశం ఇస్తామన్న హామీని నెలబెట్టుకోకపోవడంతో ఇరు పార్టీల మధ్య పొరపొచ్చాలు బయటపడుతున్నాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పాలక మండలి ఎన్నికలు 2014 ఏప్రిల్‌లో జరిగాయి. 50 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 34, వైఎస్సార్సీపీ 8, బీజేపీ 01, బీఎస్పీ 01, కాంగ్రెస్ 01, స్వతంత్రులు మరో ఐదు డివిజన్లలో గెలుపొందారు. మేయర్ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ తమ సభ్యులతో స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. టీడీపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉండడంతో ప్రతి ఏడాది జరిగే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో దఫా స్టాండింగ్ కమిటీలో తమకు చోటు కల్పించాలని బీజేపీ కోరింది. అయితే బీజేపీ మాటను పెడచెవిన పెట్టిన అధికార పార్టీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల నేతృత్వంలో ఐదు స్థానాలు తమ వారికే కట్టబెట్టింది. కడలి రామకృష్ట(1వ డివిజన్), పితాని లక్ష్మీకుమారి(2వ డివిజన్), బూర దుర్గాంజనేయుల రావు(27వ డివిజన్), గాడిరెడ్డి నరశింహరావు(33వ డివిజన్), సింహా నాగమణి(40వ డివిజన్)లు స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో స్టాండింగ్ కమిటీలో చోటు ఆశించిన బీజేపీ కార్పొరేటర్ రేలంగి శ్రీదేవీ(47వ డివిజన్)కి ఆశాభంగం తప్పలేదు. దీంతో ఆమె కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, గోరంట్లతో మంతనాలు జరిపారు. వచ్చేసారి తప్పక స్థానం కల్పిస్తామని గోరంట్ల హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈసారి రిక్తహస్తమే... అయితే మూడో దఫాలో కూడా బీజేపీకి రిక్త హస్తమే ఎదురైంది. బుధవారంతో ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. ఐదు స్థానాలకు టీడీపీ తరఫున కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికపై అధికారపార్టీలో తీవ్ర స్థాయిలో మంతనాలు జరిగాయి. ఎవరిని సభ్యులుగా నియమించాలన్నదానిపై పలుమార్లు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. నామినేషన్‌కు ముందు గోరంట్ల నివాసంలో సభ్యుల ఎంపికపై మంతనాలు జరిగాయి. చివరికి ఇన్నమూరి రాంబాబు(23వ డివిజన్), మజ్జి మౌనికా సుధారాణి(6వ డివిజన్), తంగేటి వెంకట లక్ష్మి(15వ డివిజన్), మానుపాటి తాతారావు(18వ డివిజన్), మళ్ల నాగలక్ష్మి(32వ డివిజన్) కార్పొరేటర్లు నామినేషన్లు వేశారు. ఇతరులు పోటీ చేయకపోవడంతో వచ్చే నెల 10న జరిగే వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే గత ఏడాది తమకు ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ మిత్ర ధర్మాన్ని పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఎమ్మెల్యే గోరంట్ల ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని వారు మండిపడుతున్నారు. ఇలా అయితే తమకు ఇక విలువేముందని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హామీ నిలబెట్టుకోకపోవడంపై సోము వీర్రాజు ఏ విధంగా స్పందిస్తారు, దీనికి గోరంట్ల ఏం సమాధానం చెబుతారోనన్న చర్చ కార్పొరేషన్ వర్గాల్లో నడుస్తోంది. ముఖ్య పాత్ర స్టాండింగ్ కమిటీదే... కార్పొరేషన్ పాలక మండలి సాధారణ సమావేశం ప్రతి మూడు నెలలకోసారి జరుగుతుంది. ఈ సమావేశంలో నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, విధాన నిర్ణయాలుపై చర్చించి ఆమోదం తెలుపుతారు. అయితే మిగతా సమయంలో నగరంలో జరిగే అభివృద్ధి పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలుపుతుంది. ప్రతి వారం మేయర్ అధ్యక్షతన సమావేశమై రూ. 50 లక్షల లోపు పనులను ఆమోదిస్తుంది. ఇంతటి ప్రాధాన్యమున్న స్టాండింగ్ కమిటీలో సభ్యత్వం కోసం ప్రతి సారి కార్పొరేటర్లు ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. -
మొక్కుబడితంతుకు ఆరేళ్లు
కాకినాడ కార్పొరేషన్లో కొనసాగుతున్న ప్రత్యేకాధికారి పాలన పాలకవర్గం లేకపోవడంతో పేరుకుపోతున్న సమస్యలు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాల తాత్సారం కాకినాడ : కాకినాడ కార్పొరేషన్లో ప్రత్యేకాధికారి పాలనకు నేటితో సరిగ్గా ఆరేళ్లు పూర్తయింది. తొలి నగరపాలక సంస్థ పదవీకాలం 2010 అక్టోబర్ 29వ తేదీతో ముగిసిపోయింది. దీంతో ఆ మరుసటిరోజు అంటే అక్టోబర్ 30వ తేదీ నుంచి కాకినాడ ప్రత్యేకాధికారి పాలనలోకి వెళ్లిపోయింది. పాలకవర్గంలేని ప్రభావం జిల్లా కేంద్రంపై తీవ్రంగానే కని పిస్తోంది. గట్టిగా అడిగే నాథుడు కరువవడం, ప్ర త్యేకాధికారిగా తీరికలేని కలెక్టర్‌ను నియమించడం తో మౌలిక సదుపాయాల కల్పన నుంచి నిత్యం ఎదుర్కొనే సమస్యల వరకు మొక్కుబడిగానే పరిష్కారానికి నోచుకుంటున్నాయి. ఆరంభంలో కొద్దిరోజులపాటు జాయింట్ కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించడంతో కనీసం వారానికి రెండుమూడుసార్లు కార్పొరేషన్‌కు వచ్చి అధికారులతో సమీక్షలు జరపడం, పనితీరు బాగాలేకపోతే కొర డా ఝుళిపించడం, సిబ్బందిపై వేటు వేయడం వంటి చర్యలతో కొంతవరకు గాడిలోపడింది. అయితే ఈ విధానం ఎంతోకాలం సాగలేదు. ఆరంభంలో జాయింట్ కలెక్టర్లుగా ఉన్న కోన శశి« దర్, బాబు .ఎ. హయాంలో కార్పొరేషన్ కొంతవరకు పరిపాలన పరంగా ముందుకు సాగినా కొద్దిరోజులకే కలెక్టర్లను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ వచ్చిన ఉత్తర్వులు పాలనపై ప్రభావం చూపించాయి. నగరపాలక సంస్థకు ఐఏఎస్ హోదా కలిగిన అధికారులను కమిషనర్లుగా నియమిస్తారని ఆశించినా అదికూడా జరగకపోగా డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులే ఇక్కడ కమిషనర్లుగా కొనసాగడం కూడా కాకినాడ అభివృద్ధిపై ప్రభావం చూపించాయి. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడకపోవడం, అక్రమ కట్టడాలపై నియంత్రణ లేకపోవడం, రహదారి విస్తరణ పనులు కుంటుపడడం, వివిధ విభాగాల్లో నియంత్రణ కరువై అవినీతి రాజ్యమేలడం పెరిగిపోయాయి. విలీనమే అవరోధం పంచాయతీలు విలీనమే నగరపాలక సంస్థ ఎన్నికలకు అవరోధంగా మారాయి. తొలిపాలకవర్గం 2005 అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరించగా 2010 అక్టోబర్ 29 నాటికి పదవీకాలం ముగిసిపోయింది. అప్పటి నుంచి గత ప్రభుత్వం 2014 వరకు ఎన్నికలు జరగకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. పంచాయతీల విలీనం పేరుతో జరిగిన కాలయాపన నేపథ్యంలో 2014లో తూరంగి పంచాయతీని కలిపి ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత మరికొన్ని పంచాయతీల విలీనంలో కొత్త సమస్యలు తలెత్తడం, న్యాయపరమైన అవరోధాలు, ఓటమి భయం, కుంటిసాకులతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఎన్నికలు జరిపేందుకు ముందుకు రాలేదు. ఇప్పుడైనా ఎన్నికలు జరిగేనా? కోర్టు అక్షింతలతో... ఆరేళ్ల తరువాత కార్పొరేషన్ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం ఇటీవలే సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పుడైనా ఎన్నికలు నిర్వహించి కొత్తపాలకవర్గం ఏర్పాటయ్యే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. స్మార్ట్‌సిటీగా ఎంపికైన నేపథ్యంలో పాలకవర్గం కూడా ఉంటే మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుంటుందన్న భావన ప్రజల్లో వ్యక్తమౌతోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే జనవరి నాటికి ఎన్నికలు జరగగలవన్న ఆశాభావంతో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. -
బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు
– బ్రాహ్మణ కార్పొరేషన్ కో ఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు కర్నూలు(అర్బన్): బ్రాహ్మణ విద్యార్థినీ, విద్యార్థులకు భారతీ పథకం ద్వారా ఉపకార వేతనాలు అందిస్తామని ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కో ఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు తెలిపారు. స్థానిక మౌర్యా ఇన్ హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవసరమైన ధవీకరణ పత్రాలతో అక్టోబర్ 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్రాహ్మణ కులానికి చెందిన వారు మతి చెందిన సందర్భాల్లో కర్మకాండ ఖర్చుల నిమిత్తం గరుడ పథకం కింద కార్పొరేషన్ ద్వారా రూ.10 వేలు అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులను ఆదుకునేందుకు 2016–17లో కార్పొరేషన్‌కు రూ.65 కోట్లు కేటాయించారన్నారు. కర్నూలు నగరంలో 20 వేలకు పైగా బ్రాహ్మణులున్నారని, జనాభాకు అనుగుణంగా కార్పొరేషన్ ఎన్నికల్లో తగు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నగరాధ్యక్షుడు కళ్లె చంద్రశేఖరశర్మ, కార్యదర్శి చెరువు దుర్గాప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి హెచ్‌కే రాజశేఖర్, కాల్వబుగ్గ అధ్యక్షుడు లక్ష్మినరసింహ శర్మ, సుబ్రమణ్యశాస్త్రి, కళ్లె రామకష్ణశర్మ, కల్కూర మురళీ తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్.. గుబులు
అధికార పార్టీని కుదిపేస్తున్న ఎన్నికలు – గెలవలేకపోతే నాయకత్వ లోపమేనన్న ఇన్చార్జి మంత్రి – పొదుపు రుణాలు మాఫీ చేయకపోతే కష్టమన్న కార్యకర్తలు – పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను విస్మరించిన నేతలు – హడావుడిగా విగ్రహం.. ఆ తర్వాత పక్కకు – సమావేశంలో వార్డు నాయకుల హాజరు పలుచన – మాట్లాడే అవకాశం దక్కక అసహనం సాక్షి ప్రతినిధి, కర్నూలు: కార్పొరేషన్ ఎన్నికల విషయంలో అధికార పార్టీ నేతలకు భయం పట్టుకుందా? నేరుగా ప్రజల ఓట్లతో గెలవలేమన్న సంకేతాలు ఉన్నాయా? అందుకనే దొడ్డిదారిన గెలవాలనే ఆలోచనకు బీజం పడిందా? ఒకవేళ కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించకపోతే జిల్లాలోని మొత్తం నాయకత్వం వథా అంటూ స్వయంగా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించిన నేపథ్యంలో అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందనే వాదనలకు బలం చేకూరుతోంది. పైగా కార్యకర్తలు కూడా ఆషామాషీగా ప్రచారం చేస్తే గెలవలేమనే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో లక్ష్మీ ఫంక్షన్హాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో నేతల ప్రసంగాలు, కార్యకర్తల మనోభావాలు ఇవే విషయాలను బయటపెట్టాయి. ఈ సమావేశానికి కర్నూలు నగరంలోని వార్డుల నుంచి కార్యకర్తల హాజరు శాతం మరీ పలుచగా ఉండటం అధికార పార్టీ నాయకత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది. అనేక వార్డుల నుంచి ఎందుకు ఎక్కువగా కార్యకర్తలు హాజరుకాలేదని ఇన్చార్జి మంత్రితో పాటు జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణా రెడ్డి ఆరా తీయడం గమనార్హం. ఎన్టీఆర్‌ను మరిచిన నేతలు కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు మాజీ మంత్రులు ఏరాసు, కేఈ ప్రభాకర్, ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్వీ మోహన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను విస్మరించడం కార్యకర్తలకు మింగుడుపడలేదు. సమావేశం జరుగుతున్నప్పుడు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తెప్పించి మణిగాంధీ, ఏరాసుల ముందుంచారు. అయితే, విగ్రహం కాస్తా అడ్డుగా ఉందంటూ చివరకు పూర్తిగా అక్కడి నుంచి తీసి పక్కన పడేశారు. ఎన్టీఆర్‌కు అవమానం జరిగిందంటూ పలువురు కార్యకర్తలు వాపోయారు. పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌ను స్మరించుకునే తీరు ఇదేనా అనే చర్చ ఈ సందర్భంగా చోటు చేసుకుంది. గెలుపు ఆషామాషీ కాదు.. అధికార పార్టీ గెలుపు అంత సులువు కాదని స్వయంగా పార్టీ నేతలతో పాటు కార్యకర్తలూ అభిప్రాయపడ్డారు. కొన్ని వార్డుల నుంచి కార్యకర్తల హాజరు మరీ పలుచగా ఉండటం నేతలను కలవరపాటుకు గురిచేసింది. వచ్చిన కొద్ది మందిని కూడా సమస్యలపై మాట్లాడిచేందుకు అంగీకరించకపోవడం నిరుత్సాహానికి గురిచేసింది. పాతతరం నేతలు, కార్యకర్తలను విస్మరిస్తున్నారని.. కేవలం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆషామాషీగా ప్రచారం చేస్తే మనం గెలిచే అవకాశం లేదని.. కేవలం రోడ్లు వేస్తే ప్రజలు అభివద్ధి చేశారని నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ప్రధానంగా కార్పొరేషన్ పరిధిలో ఉండే పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేయాలని కార్యకర్తలు కోరారు. లేనిపక్షంలో పొదుపు సంఘాల మహిళలు పార్టీకి ఓటేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేస్తే అభివద్ధి ఆగిపోతుందని ప్రజలకు చెప్పండంటూ ఇన్చార్జి మంత్రి పిలుపునిచ్చారు. మొత్తం మీద కార్పొరేషన్ ఎన్నికల్లో తమ గెలుపు అంత సులువు కాదని ఈ సమావేశం సాక్షిగా అందరికీ తేటతెల్లమయ్యిందని అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
కాకినాడ కార్పొరేషన్‌కు ‘స్కాచ్’ గుర్తింపు
కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థకు ముంబాయికి చెందిన స్కాట్ గ్రూప్ సంస్థ నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. దేశంలో అమలు జరుగుతున్న 100 ప్రాజెక్టులను ప్రాతిపదికగా తీసుకొని ఒక్కో అంశంపై ఒక్కో ప్రాంతానికి స్కాచ్సంస్థ ప్రత్యేక గుర్తింపునిస్తోంది. మరుగుదొడ్ల నిర్మాణంలో కాకినాడ నగరపాలక సంస్థను ఎంపిక చేశారు. ఈ మేరకు స్కాచ్ గ్రూఫ్ చైర్మన్ సమీర్ కొచార్ నుంచి కార్పొరేషన్‌కు మంగళవారం సమాచారం అందింది. ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ కార్పొరేషన్‌కు మాత్రమే ఆ గుర్తింపు లభించింది. గడచిన ఏడాది కాలంలో కాకినాడ నగరంలో 3,600లకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, సుమారు 20 సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టి బహిరంగ మలవిసర్జనలేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చేసిన కృషికి గాను ఈ గుర్తింపు లభించింది. -
కార్పొరేషన్‌పై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేద్దాం
– కార్యకర్తల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి పిలుపు కర్నూలు(ఓల్డ్‌సిటీ): త్వరలో జరిగే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేద్దామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, ఎంపీ బుట్టా రేణుక, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు, ఆలూరు శాసన సభ్యులు ఐజయ్య, గుమ్మనూరు జయరాం, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఓటమి భయంతోనే ప్రభుత్వం కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేస్తుందని, అయితే, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు అమరావతి తప్ప రాయలసీమ సమస్యలు పట్టడం లేదన్నారు. శ్రీశైలం నీటిమట్టం తగ్గించి సీమ రైతులకు అన్యాయం చేశారన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు ఇప్పుడు మాట మార్చారని చెప్పారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర పాలన గాలికొదిలేసి విదేశీ పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతోనే చంద్రబాబు నాయుడు కేంద్రానికి ప్రత్యేక హోదా అడగలేకపోతున్నారని విమర్శించారు. హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అబద్దాలతో పాలన కొనసాగిస్తున్నారని, ప్రజలు సరైన సమయంలో ఓటుతో బుద్ధిచెబుతారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, నాయకులు సత్యంయాదవ్, రాజశేఖర్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఉండండి– ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. నగరంలోని 51 వార్డులు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవాలని, ఇందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, రాష్ట్రాభివద్ధి జగన్‌తోనే సాధ్యమని వారు భావిస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం పనిచేసేవారికి ఉజ్వల భవిష్యత్తు– ఎంపీ బుట్ట పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో కర్నూలు కార్పొరేషన్‌ను గెలుచుకుని‡ వైఎస్ జగన్‌కు గిఫ్ట్‌గా ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జేబులు నింపుకునేందుకే ప్రత్యేక ప్యాకేజీ– గౌరు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఏపీకి అన్యాయం చేశాయని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. టీడీపీ మంత్రులు, నాయకులు, కార్యకర్తల జేబులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీ వైపు మొగ్గుచూపారని విమర్శించారు. -
రుణాల పంపిణీలో నిర్లక్ష్యం తగదు
– జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): రుణాల పంపిణీలో నిర్లక్ష్యాన్ని సహించబోమని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. శనివారం సాయంత్రం కాన్ఫరెన్స్ హాల్లో డీసీసీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేయకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్లు ఇంతవరకు లక్ష్యాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాల పంపిణీలో కాపులకు ప్రాధాన్యాత ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. ఖరీఫ్ సీజన్ పంట రుణాల లక్ష్యం రూ,2794 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రూ.2300 కోట్లు పంపిణీ చేశారన్నారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ....ప్రస్తుతం వరి నాట్లు ముమ్మరంగా పడుతున్నాయని ఈ నెల చివరిలోగా రుణాల పంపిణీలో లక్ష్యాలను అధిగమిస్తామని వివరించారు. మెప్మా ఆద్వర్యంలోని స్వయం సహాయ సంఘాలకు రుణాలు పంపిణీని వేగవంతం చేయాలన్నారు. చిన్న పరిశ్రమల స్థాపనకు బ్యాంకర్లు సహకరించాలని సూచించారు. డీఆర్డీఏ పీడీపై ఆగ్రహం... డీసీసీ సమావేశానికి డీఆర్డీఏ పీడీ రామకృష్ణ హజరుకాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీడీని సమావేశం నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించారు. పీడీ హాజరు కాకపోవడంతో స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీని సమీక్షించలేదు. పట్టు పరిశ్రమ శాఖ డీyీ కూడా సమావేశానికి హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎల్‌డీసీఎం నరసింహారావు, ఆంద్రబ్యాంకు డీజీఎం గోపాలకృష్ణ, ఏపీజీబీ ఆర్ఎం విసికే ప్రసాద్, డీసీసీబీ సిఇఓ రామాంజనేయలు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ ఎన్నికలు మరింత ఆలస్యం?
– మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం – స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో సమయం కోరేందుకు ప్రణాళిక – ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి ఎదురుదెబ్బే – తేల్చి చెబుతున్న ఆ పార్టీ సొంత సర్వేలు – ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే.. సాక్షి ప్రతినిధి, కర్నూలు: డిసెంబర్‌లోగా కార్పొరేషన్ ఎన్నికలు జరుపుతామని ఒకవైపు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్లో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే మార్చి నెలలో కానీ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం లేదని సమాచారం. వాస్తవానికి నవంబర్‌లోగా కార్పొరేషన్ ఎన్నికలు జరుపుతామంటూ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. అయితే, ఇప్పటికీ కర్నూలు కార్పొరేషన్‌కు సంబంధించి ఓటర్ల జాబితా పూర్తి కాలేదు. అదేవిధంగా వార్డులు.. కులాల వారీగా జనాభా వివరాలు కావాల్సి ఉంది. ఈ నెల 25వ తేదీలోగా చేస్తామని మొదట్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల ఓటర్ల జాబితా ఇంకా తయారుకాలేదు. దీంతో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో స్మార్ట్ పల్స్ సర్వే పూర్తయిన తర్వాత వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహిస్తామని మరోసారి హైకోర్టును గడువు కోరేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉండటమే.. ఈ ఆలస్యానికి అసలు కారణంగా తెలుస్తోంది. స్మార్ట్ సర్వే పేరుతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి స్మార్ట్ పల్స్ సర్వే చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు కార్పొరేషన్ పరిధిలోనూ ఈ సర్వే జరుగుతోంది. ఇందులో అన్ని శాఖల సిబ్బంది భాగస్వాములు అవుతున్నారు. ఈ నెలాఖరులోగా సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు 33 శాతం మాత్రమే కార్పొరేషన్ పరిధిలో పూర్తయ్యింది. సర్వే విధుల్లో ఉన్న సిబ్బంది ప్రతి నెలా ఒకటి నుంచి పదో తేదీ వరకు పింఛన్ల పంపిణీలో బిజీగా ఉంటున్నారు. ఈ సమయంలో సర్వే పనులు సాగడం లేదు. ఈ నేపథ్యంలో నెలాఖరులోగా పూర్తి కావాల్సిన సర్వే కాస్తా నవంబర్ చివరి నాటికి కానీ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల సర్వేను ఒక సాకుగా చూపి కూడా ఎన్నికలు మరింత ఆలస్యం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే, హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే అంశం కీలకం కానుంది. వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని సర్వేలో తెలిసింది. అధికారపార్టీ నేతలు చేసుకున్న సొంత సర్వేలోనే ఈ విషయం తేటతెల్లమైనట్టు సమాచారం. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా వైఎస్ఆర్సీపీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని తమ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలను మరింత ఆలస్యం చేసుకుని.. ఈ సమయంలో తమ కేడర్‌కు మరింత పనులను నామినేషన్‌పై అప్పగించేందుకు అధికార పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. తద్వారా మరింత మందిని తమ వైపునకు తిప్పుకోవాలనేది అధికార పార్టీ నేతల ఆలోచనగా ఉంది. -
పాణ్యమే ముద్దు!
– కార్పొరేషన్ ఎన్నికలు వేదికగా తెరపైకి.. – బల నిరూపణకు ఏర్పాట్లు – అనుచర వర్గానికి సీట్లు దక్కించుకునే ప్రయత్నాలు – పట్టు నిలుపుకునేందుకు తాజా ఇన్చార్జి మల్లగుల్లాలు – ఆసక్తికరంగా మాజీ మంత్రుల మధ్య వార్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: అందని ద్రాక్ష పుల్లన.. కాదు కాదు తీపే అంటున్నారు ముఖ్య నేత సోదరుడు, మాజీ మంత్రి. పాణ్యం నియోజకవర్గంలో పాగా వేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు గమనిస్తే అది నిజమేననిపించక మానదు. తాజాగా కార్పొరేషన్ ఎన్నికలు వేదికగా పాణ్యం నియోజకవర్గ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సదరు నేత ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆయన ప్రయత్నాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. మొత్తం మీద అధికార పార్టీలో మళ్లీ పాణ్యం వేదికగా రాజకీయం వేడెక్కుతోంది. మొదటి నుంచీ ప్రయత్నాలు వాస్తవానికి ఎన్నికల ముందు ఎంపీ సీటు ఆశించి భంగపడ్డ సదరు నేత ఎన్నికల తర్వాత ఏదో ఒక పదవి వస్తుందని ఆశపడ్డారు. అటు ఎమ్మెల్సీ కానీ.. ఇటు రాజ్యసభ సభ్యత్వం కానీ దక్కలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక సీటును ఖరారు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన సదరు నేతకు సొంత కుటుంబం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ వారసుడు తన కుమారుడేనని స్వయంగా ముఖ్యనేత ప్రకటించారు. దీంతో పత్తికొండ సీటు ఖాళీ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో పాణ్యంపై దష్టి సారించారు. ఇందుకోసం తన అనుచరులతో మంతనాలు జరిపి పార్టీలు కూడా చేసుకున్నారు. అయితే, అధిష్టానం నుంచి మాత్రం గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో కొంతకాలంగా ఆయన స్తబ్దుగా ఉన్నారు. తాజాగా కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో తిరిగి హడావుడి చేద్దామని ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. రెండుగా చీలిన పార్టీ... పాణ్యం నియోజకవర్గంలో అధికార పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇరువురు మాజీ మంత్రుల నడుమ కేడర్ నలిగిపోతోంది. తన అనుచర వర్గంతో ఇప్పటికీ ముఖ్యనేత సోదరుడు, మాజీ మంత్రి బలమైన నేతగానే ఉన్నారు. వీరి అండతోనే పాణ్యంలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రయత్నాలు విఫలమైనప్పటికీ కార్పొరేషన్ ఎన్నికల్లో తన బలం చూపించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో తన వర్గానికి సీట్లు ఇప్పించుకునేందుకు కూడా ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే పాణ్యం నియోజకవర్గంలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. -
ఇక.. ఆన్లైన్లో అభివృద్ధి పనులు
గుంటూరు (నెహ్రూనగర్): నగరపాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇకపై ఆన్లైన్లో పొందుపరచనున్నట్లు నగర కమిషనర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. కౌన్సిల్ హాలులో గురువారం ఈ అంశానికి సంబంధించి లీడ్ విన్నర్ సంస్థ పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధి పనులను కంప్యూటర్ నుంచే తనిఖీలు నిర్వహించే విధంగా తమ సంస్థ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఆన్లైన్ అయితే త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుంటుందని చెప్పారు. ఈ ఆన్లైన్ విధానాన్ని త్వరలో ముందుగా గుంటూరు నగరపాలక సంస్థలోనే ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. -
వరించేదెవరినో..!
దసరాలోపు కార్పొరేషన్ పదవులను ప్రకటించేందుకు సీఎం కసరత్తు రేసులో ఈద శంకర్‌రెడ్డి, జీవీ.రామకృష్ణరావు, అక్బర్‌హుస్సేన్, మైఖేల్ శ్రీను ఈద, జీవీకి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాయమనే ప్రచారం మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కోసం అక్బర్‌హుస్సేన్ ప్రయత్నాలు కరీంనగర్ : అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలను నామినేటెడ్ పదవులు మళ్లీ ఊరిస్తున్నాయి. దసరా కానుకగా కార్పొరేషన్ పదవులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. కార్పొరేషన్ పదవుల కోసం జిల్లా నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులు, అనుబంధ సంఘాల నేతలు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సిఫారసు లేఖలు తీసుకుని సీఎంను కలిసి నామినేటెడ్ పదవులివ్వాలని కోరారు. ఇప్పటికే మార్కెట్ కమిటీలను భర్తీ చేస్తున్న కేసీఆర్ దసరాలోపు కార్పొరేషన్ పదవులను కూడా భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈసారి జిల్లాకు రెండు లేదా మూడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కనున్నట్లు అధికార పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు... కార్పొరేషన్ పదవుల కోసం వందల కొద్ది దరఖాస్తులు వచ్చిన ప్పటికీ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవీ.రామకృష్ణారావు, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు అక్బర్‌హుస్సేన్, రజక సంఘం నాయకుడు మైఖేల్ శ్రీను పేర్లు ఖారారైనట్లు తెలిసింది. వీరిలో ఈద శంకర్‌రెడ్డి, జీవీ.రామకృష్ణరావులకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఖాయమైనట్లు సమాచారం. ఈద శంకర్‌రెడ్డి గత ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన జీవీ.రామకృష్ణారావు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు బంధువు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు కార్పొరేషన్ పదవి ఇవ్వాలని రాష్ట్ర, జిల్లాకు చెందిన పలువురు నేతలు సిఫారసు చేసినట్లు తెలిసింది. మిగిలిన ఇద్దరిలో అక్బర్‌హుస్సేన్ జిల్లా మైనారిటీ విభాగం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. మైఖేల్ శ్రీను పార్టీలో సుదీర్ఘ కాలంగా క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్నారు. జిల్లా రజక సంఘం నాయకుడిగా ఉన్నారు. వీరిద్దరితోపాటు జిల్లాకు చెందిన మరో నాయకుడికి కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు దక్కనున్నట్లు సమాచారం. అయితే తనకు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని అక్బర్‌హుస్సేన్ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీతోపాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు పార్టీకి ఏళ్ల తరబడి సేవలు చేస్తున్న నేతల పేర్లు జిల్లాల వారీగా ఇప్పటికే తెప్పించుకున్న కేసీఆర్ అందులో ఎవరెవరికి కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల పదవులను కట్టబెట్టాలనే అంశంపై ఇప్పటికే జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి భంగపడిన వాళ్లు, రాబోయే ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్ ఇచ్చే అవకాశాల్లేని వారిని కార్పొరేషన్ పదవులతో సంతృప్తిపర్చాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పిన తరువాతే జాబితాను విడుదల చేస్తారని తెలుస్తోంది. మొత్తమ్మీద దసరా లోపు పేర్లను ప్రకటించనున్నట్లు అధికార పార్టీ వర్గాల సమాచారం. -
మున్సిపల్ ఎన్నికలకు పార్టీ పరిశీలకులు
కార్పొరేషన్, మున్సిపాలిటీల నేతలతో భేటీలో వైఎస్ జగన్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పాలకవర్గాలు ఖాళీగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల పరిశీలకులను నియమించారు. మంగళవారం ఆయా కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోని నేతలతో సమావేశమైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల పరిశీలకుల వివరాలను తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు విడుదల చేశారు. ఈ పరిశీలకులు జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, లేదా సమన్వయకర్తలు, ఇన్చార్జులతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని కన్నబాబు తెలిపారు. -
మేయర్‌ను అనర్హుడిగా ప్రకటించండి
నగరపాలక సంస్థ కమిషనర్‌కు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల వినతి విజయవాడ సెంట్రల్ : నగరపాలకసంస్థలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన మేయర్ కోనేరు శ్రీధర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కమిషనర్ జి.వీరపాండియన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఫ్లోర్‌లీడర్ బి.ఎన్.పుణ్యశీల ఆధ్వర్యాన కార్పొరేటర్లు గురువారం కమిషనర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా పుణ్యశీల మాట్లాడుతూ కేఎంకే ఈవెంట్ మేనేజ్మెంట్ (ప్రైవేట్ లిమిటెడ్)లో మేయర్ సతీమణి కోనేరు రమాదేవి గౌరవ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ యాక్టు సెక్షన్ 22 (హెచ్) ప్రకారం మేయర్ కుటుంబ సభ్యులు నగరపాలకసంస్థలో ఎటువంటి కాంట్రాక్ట్‌లు చేయకూడదని స్పష్టంగా ఉందని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్‌లు దక్కించుకుంటున్న మేయర్ శ్రీధర్ పదవిలో కొనసాగేందుకు అర్హులు కాదన్నారు. కాబట్టి ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కేఎంకే సంస్థకు కేటాయించిన కాంట్రాక్ట్‌లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో విచారణ నిర్వహించాలన్నారు. వాస్తవాలు తేలే వరకు ఆ సంస్థకు బిల్లులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని కమిషనర్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు షేక్ బీజాన్బీ, పాల ఝాన్సీలక్ష్మి, టి.జమ్మలపూర్ణమ్మ, బుల్లా విజయ్, కె.దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్లో కాసుల వేట
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో కాసుల కటకట నెలకొంది. ఉద్యోగుల ఆగస్ట్ జీతాలకు వెతుకులాట సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో రెవెన్యూ వసూళ్లు దెబ్బతిన్నాయి. టౌన్‌ప్లానింగ్ కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వినాయకచవితి, బక్రీద్ పండుగల నేపథ్యంలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేయర్ కోనేరు శ్రీధర్ బుధవారం తన చాంబర్లో రెవెన్యూ, అకౌంట్స్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పండుగలు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాల్సిందిగా సూచించారు. అకౌంట్స్ ఆఫీసర్ కె.అంబేద్కర్ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదని, కాబట్టి ఈదఫా జీతాల చెల్లింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మేయర్ రెవెన్యూ కలెక్షన్స్‌ను వేగవంతం చేయడంతో పాటు టౌన్‌ప్లానింగ్ బకాయిలను వెంటనే రాబట్టాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. సాధ్యమైనంత వరకూ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) ఏవీ రమణి, సిటీప్లానర్ వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మూడో ‘సారీ’ కావొద్దు..
నేడు ఖమ్మం కార్పొరేషన్ పాలక మండలి సమావేశం గతంలో రెండుసార్లు ప్రజా సమస్యలపై జరగని చర్చ – ఖమ్మం – నగర అభివృద్ధిపై చర్చ జరగాలని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని, నిధుల కేటాయింపుపై గళం విప్పాలని నగర వాసులు కోరుకుంటున్నా..పాలకమండలి సమావేశాలు నిరుత్సాహ పరుస్తున్నాయి. కార్పొరేటర్లు ఏమీ మాట్లాడకుండానే రెండుసార్లు ముగిశాయి. ముచ్చటగా మూడోసారి..జరగబోతున్న ఈ సభలోనైనా ప్రజా ఉపయోగ అంశాలపై మాట్లాడతారా..? లేదా..? అనే మీమాంస నెలకొంది. అప్పుడలా..ఆపేశారిలా తొలి సమావేశం ప్రమాణ స్వీకారానికి, మలి సమావేశం కోఆప్షన్ సభ్యుల ఎన్నికకే పరిమిత చేయాల్సి వచ్చింది. ఒకసారి పాలేరు ఉప ఎన్నికల కోడ్, మరోసారి మరో కారణంతో ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి బదిలీ కావడంతో..జాప్యమైంది. ఈ క్రమంలో మంగళవారం కౌన్సిల్æసమావేశం కానుంది. ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై తీవ్రంగానే మాట్లాడతారనే అంచనా ఉంది. గోళ్లపాడు..తీరని గోడు నగరం నడిబొడ్డు నుంచి వెళ్లే గోళ్లపాడు చానల్ అధ్వానంగా మారి..మురుగు సమస్య పీడిస్తోంది. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు నుంచి వచ్చే కాల్వ ఖమ్మం సారధినగర్, జూబ్లీక్లబ్, కాల్వొడ్డు, గాంధీచౌక్ మీదుగా సుందరయ్యనగర్, శ్రీనివాస నగర్ వరకు దాదాపు నాలుగు కిలో మీటర్ల దూరం వరకు ఉన్న ఈ కాల్వ చుట్టు ప్రాంతాలు మురికి కూపంగా మారాయి. నిరుపేదలు, కార్మికులు ఈ కాల్వ చుట్టూ జీవిస్తున్నారు. అపరిశుభ్రత..దోమల సమస్యతో స్థానికులు అవస్థ పడుతున్నారు. విలీన గ్రామాలు..తీరని కష్టాలు ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ మండలాల నుంచి కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదు. కైకొండాయిగూడెం, బల్లేపల్లి, ఖానాపురం, పుట్టకోట, గొల్లగూడెం, కొత్తగూడెం, అల్లీపురం, ధంసలాపురం గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టలేదు. తాగునీటి ఇబ్బందులు వీడలేదు. డ్రెయినేజీ వ్యవస్థ తీవ్రంగా ఉంది. నగరంలోని బీసీ కాలనీ, వైఎస్సార్ కాలనీ, రమణగుట్ట, వికలాంగుల కాలనీ, శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు సక్రమంగా లేవు. డ్రెయిన్లు అధ్వానం..పట్టింపు శూన్యం కార్పొరేషన్ పరిధిలో చాలా చోట్ల డ్రెయినేజీ సమస్యలు పీడిస్తున్నాయి. మొత్తం 345 కిలోమీటర్ల మేరకు సైడ్ కాల్వలు ఉండగా 100 కిలోమీటర్ల డ్రెయిన్లు దెబ్బతిని శిథిలావస్థకు చేరాయి. పెద్ద కాల్వల్లో అసలు పూడికనే తీయడం లేదు. పిచ్చిచెట్లు పెరిగాయి. పారిశుద్ధ్య కార్మికులు 580 మంది ఉండగా..వంద మందికి పైగా అధికారులు, నాయకులు, కార్పొరేటర్లు ఇళ్లల్లోనే పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మిగిలిన వారిలో అటెన్డెన్స్ వేయించుకుని వెళ్లేవారు పోగా..పనిచేసేవారు తక్కువవుతున్నారు. -
‘బ్రాహ్మణుల సంక్షేమానికే కార్పొరేషన్’
రాజాం: బ్రాహ్మణుల సంక్షేమానికే కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఏపీ బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ సీఈఓ అభిజిత్ జయంతి అన్నారు. ఆయన బుధవారం స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. అరుంధతి, వశిష్ట వంటి గ్రూపులు ఏర్పాటు చేసి అందులోని మహిళా సభ్యులకు రుణ సౌకర్యం కల్పించి వారి ద్వారా పచ్చళ్లు, పొడులు తదితర వాటిని తయారుచేయించి మార్కెట్లో విక్రయించడానికి ఆర్ధిక స్వావలంబన కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాడ సంతోష్‌కుమార్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.30వేలు చెక్కును అందించారు. కార్యక్రమంలో క్రెడిట్ సొసైటీ రాష్ట్ర సభ్యుడు కె.తిరుమలేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్ కేవీఎస్కేజే శర్మ, గాయత్రీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు రంప జగదీశ్వరరావు, వాయునందనశర్మ, కాలేటి కృష్ణమూర్తి , శ్రీను పంతులు తదితరులు పాల్గొన్నారు. -
11న కాపు కార్పొరేషన్ పథకాలపై అవగాహన సదస్సు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ ద్వారా అందిం^è నున్న పలు పథకాలపై ఈ నెల 11న ఉదయం 11 గంటలకు డీఆర్డీఏ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు బీసీ కార్పొరేషన్ ఈడీ బి.శ్రీహరిరావు లె లిపారు. ఈ సదస్సులో స్కిల్ డవలెప్‌మెంటు, విద్యోన్నతి పథకాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కాపు, తెలగ, ఒంటరి కులం, బలిజ కులస్తులు హజరు కావాలని కోరారు. -
గుంటనక్కలకు గులాం
రోడ్డు విస్తరణలో స్పీకర్ స్థలం జోలికి వెళ్లని కార్పొరేషన్ పక్కనే ఉన్న చర్చికి చెందిన.. గుంట గ్రౌండ్ వైపే 22 అడుగుల విస్తరణ చక్రం తిప్పిన టీడీపీ ఎమ్మెల్యే ! గుంటూరులో ఏఈఎల్సీ ఆస్తులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హారతి కర్పూరంలా కరిగించేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే చర్చి స్థలాలను కారుచౌకగా కొట్టేశారు. మరో ఎమ్మెల్యే తన బినామీ పేరు లీజుకు తీసుకున్నారు. తాజాగా జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి రోడ్డు విస్తరణ సమయంలో తన స్థలాన్ని కాపాడుకునేందుకు చర్చి స్థలాన్ని టార్గెట్ చేశారు. రోడ్డుకు మరోవైపు ఉన్న చర్చికి చెందిన గుంట గ్రౌండ్ స్థలాన్ని తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, అమరావతి : ‘దీపం ఉన్నప్పుడే దేవుళ్ల ఆస్తులను స్వాహా చేయాలి..’ అన్నట్లుగా ఉంది అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తీరు. గుంటూరులో ఏఈఎల్సీ స్థలాల స్వాహా పర్వం వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది. కొందరు ప్రత్యక్షంగా చర్చి ఆస్తులను కొట్టేస్తున్నారు. మరికొందరు తమ స్థలాలను కాపాడుకునేందుకు పరోక్షంగా చర్చి స్థలాలను వినియోగించుకుంటున్నారు. ఏఈఎల్‌సీకి కోట్లాది రూపాయల నష్టం కలిగిస్తున్నారు. గుంటూరులోని నాజ్ సెంటర్ నుంచి కొత్తపేట వెళ్లే రోడ్డును విస్తరించిన తీరే ఇందుకు నిదర్శనం. రోడ్డు విస్తరణకు ఒకవైపే స్థల సేకరణ.. రోడ్డు విస్తరణ చేసేటప్పుడు సాధారణంగా రెండు వైపులా సమానంగా స్థలం తీసుకుంటారు. కానీ గుంటూరు నాజ్‌సెంటర్ నుంచి కొత్తపేట పోలీస్‌స్టేçÙన్ వైపు వెళ్లే రోడ్డు విస్తరణ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఈ రోడ్డుకు ఒకవైపు చర్చికి చెందిన గుంట గ్రౌండ్, మరోవైపు స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చెందిన స్థలం ఉన్నాయి. ఈ రోడ్డు విస్తరణ కోసం 22 అడుగులు తీసుకోవాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు రెండు వైపులా 12 అడుగుల చొప్పున రోడ్డు విస్తరించాల్సి ఉంది. కానీ ఇక్కడే నగరపాలక సంస్థ ‘పచ్చ’పాతం చూపింది. కోడెల స్థలం ఉన్న వైపు కాకుండా... ఏకపక్షంగా చర్చికి చెందిన గుంటగ్రౌండ్ వైపున 22 అడుగుల మేరకు రోడ్డును విస్తరించేసింది. గుంట గ్రౌండ్ లీజు ఎమ్మెల్యే ఆనంద్బాబుకే.. గంట గ్రౌండ్‌ను ఏటా రూ.5 లక్షల లీజుకు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సొంతం చేసుకున్నారు. ఎగ్జిబిషన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యే ఏటా రూ.50 లక్షలకుృపైగా ఆర్జిస్తున్నారని క్రైస్తవ సంఘాల పెద్దలు చెబుతున్నాయి. ఎగ్జిబిషన్లకు నేరుగా చర్చి తరఫునే స్థలం ఇస్తే ఆదాయం మొత్తం చర్చికే వస్తుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతా ఎమ్మెల్యే హవా..! ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి గుంట గ్రౌండ్‌కు చెందిన స్థలాన్ని సేకరించే విషయమై చర్చించేందుకు కలెక్టర్ అధ్యక్షతన ఈ ఏడాది మే 12న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు కూడా పాల్గొన్నారు. వేమూరు ఎమ్మెల్యే అయిన ఆనంద్‌బాబుకు ఈ వ్యవహారంతో సంబంధం లేదు. అయినా అధికార పార్టీ తరఫున మధ్యవర్తిత్వం చేయడానికే సమావేశంలో పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది. అదే నెల 18న జరిగిన చర్చి కౌన్సిల్ సమావేశంలో రోడ్డు విస్తరణకు గుంట గ్రౌండ్ స్థలంలో 12 అడుగులు ఇచ్చేందుకు తీర్మానం చేశారు. చర్చి కౌన్సిల్ తీర్మానాన్ని నగరపాలక సంస్థ పట్టించుకోలేదు. ఏకపక్షంగా రోడ్డును గుంట గ్రౌండ్ వైపే 22 అడుగుల మేర విస్తరించింది. కార్పొరేషన్ వైఖరిని వ్యతిరేకిస్తూ చర్చి పెద్దలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. -
రోడ్డెక్కిన ట్రైసైకిళ్లు
ప్రారంభించిన నగర మేయర్ రామగుండం బల్దియాలో ఇంటింటా చెత్త సేకరణ షురూ.. కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నాలుగు నెలలుగా మూలకుపడిన ట్రై సైకిళ్లు ఎట్టకేలకు శుక్రవారం రోడ్డెక్కాయి. గత నెల 27న ‘రూ.35 లక్షలు వథా’ శీర్షికతో ట్రై సైకిళ్ల నిర్లక్ష్యంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాలకవర్గంలో కదలిక వచ్చింది. ఫలితంగా ఇంటింటికి చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రై సైకిళ్లను నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఇంటింటికీ చెత్త సేకరించడలో పారిశుధ్య సేవకులు నిర్లక్ష్యం చేయొద్దన్నారు. చెత్త రహిత రామగుండం... స్వచ్ఛ రామగుండం లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం ఆదర్శంగా నిలవడానికి పారిశుధ్య సేవకులు పని చేయాలని సూచించారు. జీవనభతి కోసం పారిశుధ్య సేవకులు ఇంటింటికీ రూ.40 చొప్పున తీసుకోవాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చెత్త సేకరించే పనులు పూర్తి చేయాలన్నారు. కమిషనర్ డి.జాన్‌శ్యాంసన్ మాట్లాడుతూ... చిత్తశుద్ధితో పని చేయాలని, కార్మికులు చేస్తున్న పనిని ప్రతీ రోజూ ఫొటోలను ఆన్లైన్లో ప్రధాన మంత్రికి పంపించడం జరుగుతుందన్నారు. అనంతరం కార్మికులకు యూనిఫాం, మాస్క్‌లు, చేతి తొడుగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మారుతి, సోమారపు లావణ్య, దాసరి ఉమాదేవి, తానిపర్తి గోపాలరావు, చుక్కల శ్రీనివాస్, నాయిని భాగ్యలక్ష్మీ, షేక్బాబుమియా, చిట్టూరి రాజమణి, బక్కి రాజకుమారి, జనగామ నర్సయ్య, పీచర శ్రీనివాసరావు, కోదాటి తిరుపతి, నాయకులు పాల్గొన్నారు. -
యాత్రికులకు మెరుగైన సేవలు
నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.నాగలక్ష్మి నెహ్రూనగర్ : కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు మెరుగైన సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. గోరంట్ల హోసన్నా మందిరం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర్ నగర్, పలకలూరు రోడ్డు, జేకేసీ కాలేజీ రోడ్డులో జరుగుతున్న పనులను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుష్కరాలు సమీపించనున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పుష్కర్ నగర్ వద్ద భక్తులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, వాహనాల రాకపోకలకు తగు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే ప్రాంతాల్లో స్థానిక ప్రజలు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సహాయ సహకారాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట అదనపు కమిషనర్ కృష్ణకపర్ధి, ఎస్ఈ గోపాలకృష్ణరెడ్డి, ఈఈ లక్ష్మయ్య, డీసీపీ సత్యనారాయణ, డీఈలు, ఏఈలు ఇతర సిబ్బంది ఉన్నారు. -
చెత్తే కదాని పారేస్తే..
కాలువలు, రోడ్లు, ఖాళీ స్థలాల్లో వేస్తే జరిమానా బహిరంగ మల, మూత్ర విసర్జనకూ ఫైన్ జాతీయ పారిశుధ్య సర్వేకు కేంద్రం శ్రీకారం కరీంనగర్, రామగుండంలో స్వచ్ఛ సర్వేక్షణ్–2017 కరీంనగర్ కార్పొరేషన్ : చెత్త కదా అని ఎక్కడ పడితే అక్కడ పారేస్తే ఇక మీదట చెల్లదు. ఒకవేళ అలా చేస్తే మీ జేబులు గుల్లకావడం ఖాయం. రెండో జాతీయ పారిశుధ్య సర్వేలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్–2017 పేరుతో కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకోసం దేశంలోని లక్ష జనాభా దాటిన 500 నగరాలను ఎంపిక చేసింది. అందులో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు ఉన్నాయి. బహిరంగ ప్రాంతాల్లో మల, మూత్ర విసర్జన, చెత్త వేయడాన్ని అరికట్టేందుకు జరిమానాలు విధించాలని సూచించింది. ప్రజల అలవాట్లలో మార్పు తీసుకొచ్చేందుకు స్వయం సహాయక గ్రూపు మహిళల సేవలను వినియోగించుకోవాలని తెలిపింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై చెత్త వేయడం, మల, మూత్ర విసర్జన చేయడం వంటి చర్యలకు పాల్పడితే అక్కడికక్కడే జరిమానాలు విధించే విధంగా కొత్త నిబంధనలను రూపొందించింది. ఇలా చేస్తే జాతీయ స్థాయి పారిశుధ్య ర్యాంకుల్లో ప్రోత్సాహక మార్కులను కేటాయిస్తామని కేంద్రం వెల్లడించింది. మన స్థానం వెనక్కి... 2013–14 సంవత్సరానికి స్వచ్ఛ భారత్‌పై కేంద్రం సర్వే నిర్వహించింది. లక్ష జనాభా దాటిన నగరాలు, పట్టణాలను ఎంపిక చేసుకొని 476 పట్టణాల్లో సర్వే చేసింది. పరిశుభ్రత ర్యాంకుల్లో కరీంనగర్ 259వ ర్యాంకుకు పడిపోగా, రామగుండంకు 142వ ర్యాంకు వచ్చింది. ఆరుబయట మల, మూత్ర విసర్జన, మరుగుదొడ్ల ఉపయోగం, చెత్తను రోడ్లపై వేయడం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని సర్వే నిర్వహించారు. స్మార్ట్‌కు చాలెంజ్... కరీంనగర్ స్మార్ట్‌సిటీకి పరుగులు పెడుతున్న తరుణంలో స్వచ్ఛత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. స్మార్ట్‌సిటీల్లో పారిశుధ్యం, స్వచ్ఛభారత్‌కు పెద్దపీట వేస్తుండడమే ఇందుకు కారణం. స్మార్ట్ రేసులో ఉండాలంటే వందశాతం ఇంటింటి చెత్త సేకరణ కచ్చితంగా చేపట్టాల్సిన అవసరముంది. స్వచ్ఛభారత్‌పై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యపరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. పారిశుధ్య పనులు కొంత మెరుగ్గానే ఉన్నా, చెత్త తరలింపులో వెనుకబడ్డట్టు కనిపిస్తోంది. సరైన ప్రణాళిక లేకపోవడంతో రోడ్లపైనే చెత్త దర్శనమిస్తోంది. మరుగుదొడ్ల నిర్మాణంపై అశ్రద్ధ... నగరంలో యూజీడీ పైపులైన్ లేని ప్రాంతాల్లో 133 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు 71 వరకు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 62 మరుగుదొడ్లు పూర్తిచేయాల్సి ఉంది. మురుగు కాల్వలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం వరకే పరిమితమవుతున్నారు. ఆరుబయట మల, మూత్ర విసర్జనను అరికట్టడంలో విఫలమవుతున్నారు. పక్కాగా అమలు చేస్తేనే... కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ స్థాయి పారిశుధ్య సర్వేలో ఉత్తమ ర్యాంకు సాధించాలంటే నిబంధనలు కఠినతరం చేయాల్సి ఉంది. నగరంలో ప్రతి రోజు 180 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. చెత్తను ఊడ్చడం, తరలించడం, ఘన వ్యర్థాల పునర్వినియోగం, పబ్లిక్ టాయిలెట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, బహిరంగ స్థలాల్లో చెత్త వేయడం, మల, మూత్ర విసర్జణపై కఠినంగా వ్యవహరిస్తూ జరిమానాలు వేసి ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ప్రజల్లో చైతన్యం వస్తేనే పారిశుధ్యం, స్వచ్ఛభారత్‌లో మంచి ర్యాంకు సాధించే అవకాశముంది. అధికారులు ఆ దిశగా సంస్కరణలు చేపట్టాలి. -
కోర్టు స్టే ఇచ్చినా.. కూల్చేస్తున్నారు
విజయవాడ (వన్‌టౌన్ ) : నెహ్రూ రోడ్డు విస్తరణ పనులను నగరపాలకసంస్థ అధికారులు శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభించారు. రెండు నెలల క్రితం నెహ్రూరోడ్డు విస్తరణకు అధికారులు సిద్ధం కాగా, స్థానికులు అడ్డుకున్నారు. వారితో అధికారుల చర్చలు విఫలం కావటంతో కొద్ది రోజులుగా విస్తరణ పనులు నిలిచిపోయాయి. దీనిపై భవన యజమానులకు సమస్యను పరిష్కరిస్తానంటూ చెబుతూ వచ్చిన స్థానిక శాసనసభ్యుడు జలీల్‌ఖాన్ ఇప్పుడు చేతులు ఎత్తేశారు. దాంతో అధికారులు శనివారం అర్ధరాత్రి పలు జేసీబీలతో అక్కడకు చేరుకొని ఆయా భవనాల షట్టర్లను కూలగొట్టారు. గాంధీహిల్ నుంచి పెట్రోల్‌బంక్ వరకూ ఉన్న దుకాణాలన్నింటిని తలుపులే లేకుండా గోడలను కూలగొట్టారు. సరుకును సర్ధుకోవటానికి కూడా ఎవరికీ సమయం ఇవ్వలేదు. దాంతో సరుకులు పాడై తీవ్రంగా నష్టపోయామంటూ స్థానిక యజమానులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలూ బేఖాతరు విస్తరణ ను వ్యతిరేకిస్తూ పలువురు భవన యజమానులు న్యాయస్థానాలను ఆ«శ్రయించి స్టేఆర్డర్‌ను తీసుకొచ్చారు. వాటిని చూపించినా అధికారులు తమకు సంబంధం లేదంటూ కూల్చివేయడం గమనార్హం. పలువురు భవనాల తలుపులకు న్యాయస్థానాల తీర్పుల కాపీలను అంటించినా అధికారులు పట్టించుకోకుండా కూల్చివేతలను కొనసాగించారు. కార్మికునికి తీవ్ర గాయాలు తారాపేట పెట్రోల్‌బంక్ ఎదురుగా ఉన్న భవనం ఎదుట తలుపులను జేసీబీతో అధికారులు తొలగిస్తుండగా ఆ ఇనుప తలుపులు పడి అక్కడ పనిచేస్తున్న కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒక ప్రైవేటు ఆస్పత్రి ఐసీయులో ఉంచి చికిత్స చేస్తున్నారు. -
ఈసారైనా జరిగేనా?
నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి ఆరేళ్లు గత ఏడాది అక్టోబర్‌లోనే కోర్టు ఆదేశాలు నిర్వహణపై సర్కారు ఉదాసీనం సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి ఆరేళ్లవుతోంది. అప్పటి నుంచి నగరపాలకSసంస్థ ప్రత్యేకాధికారుల పాలనలోనే మగ్గుతోంది. దీంతో నగర ప్రజల సమస్యలు తీర్చే నాధుడే కరువయ్యాడు. అధికారుల్లో జవాబుదారీతనం లోపించడంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా ఈ ఏడాది నవంబర్‌లో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం చేశారు. కొత్తగా అర్హులైనవారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. తొలగిన అడ్డంకులు... నగరపాలకసంస్థలో 2011లో పది గ్రామపంచాయతీలను విలీనం చేశారు. డివిజన్ల సంఖ్య 52 నుంచి 57కు పెంచారు. మేయర్ అభ్యర్థికి సంబంధించిన రిజర్వేషన్ సైతం ప్రకటించారు. ఓసీ జనరల్‌కు మేయర్ సీటు కేటాయించారు. 2014 మే 25న 57 డివిజన్ల పున ర్విభజన కోసం అప్పటి కలెక్టర్, నగరపాలకSసంస్థ ప్రత్యేకాధికారి ఎస్.సురేష్‌కుమార్ సమక్షంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. డివిజన్ల పునర్విభజన మొత్తం గందరగోళంగా ఉందని, ఏకపక్షంగా జరిగిందని స్వచ్ఛంద సంస్థలు హైకోర్టును ఆశ్రయించగా, గతేడాది జూన్‌లో కోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లో మరోసారి డివిజన్ల పునర్విభజన చేయాలని కోర్టు ఆదేశించింది. లాలుపురం, డివిజన్ల అంశాలపై గత ఏడాది అక్టోబర్‌లోనే హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కలెక్టర్ ఆయా అంశాలను పరిశీలించి వెంటనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తీర్పు ఇచ్చింది. దీంతో నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆగస్టులో నోటిఫికేషన్ ఇస్తేనే... నగరపాలకసంస్థ ఎన్నికల ప్రక్రియకు కనీసం మూడునెలల సమయం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత డివిజన్ల పునర్విభజనకు కనీసం 45 రోజుల సమయం పడుతుంది. ఓటర్ల జాబితా రూపొం దించడం, ఆ తర్వాత డివిజన్లకు రిజర్వేషన్లు ప్రకటించడం తదితరాలకు సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశముంది. అంటే ఎన్నికలు నవంబర్‌లో జరగాలంటే నోటిఫికేసన్ ఆగస్టులో ఇవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. టీడీపీ నేతల మేకపోతు గాంభీర్యం... టీడీపీ నాయకులు ఎన్నికలంటే భయపడుతూనే మేకపోతు గాంభీ ర్యం ప్రదర్శిస్తున్నారు. పార్టీలో అంతర్గత కలహాలు, బీజేపీతో సయోధ్య కొరవడటం, మరోపక్క రెండు పార్టీలపై ప్రత్యేక హోదా తదితర హామీల అమలులో వైఫల్యంపై ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో ఎన్నికలంటేనే అధికార పార్టీ నాయకులు వెనకడుగు వేస్తున్నారు. -
నిలువ జాగ లేదాయే !
నగరంలో పార్కింగ్‌స్థలాల కొరత దుకాణాల ఎదుటే నిలిపివేత ట్రాఫిక్ ఇబ్బందులు టవర్‌సర్కిల్‌లో రోడ్డుపై చేసిన పార్కింగ్లు కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలో ట్రాఫికర్ రోజురోజుకు పెరుగుతుంది. బైక్‌పై వెళ్లడమే కష్టంగా మారింది. పార్కింVŠ Sస్థలాలు లేకపోవడంతో వాహనదారులు రోడ్డుపైన, దుకాణాల ఎదుట నిలుపుతున్నారు. అరకిలోమీటర్ ప్రయాణించాలంటే అరగంట పడుతుంది. టవర్‌సర్కిల్, పోస్టాఫీస్రోడ్, శాస్త్రీరోడ్, ప్రకాశంగంజ్, గాంధీరోడ్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కార్పొరేషన్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సైతం నగరంలో ప్రత్యేకంగా పార్కింగ్‌స్థలాల ఏర్పాటుపై కసరత్తు చేయడం లేదు. ఇప్పటికైనా వీటి గురించి పట్టించుకుంటే స్మార్ట్ నగరంలో ట్రాఫికర్‌కు చెక్ పెట్టగలం. కరీంనగర్లో పార్కింగ్ స్థలాలు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో ద్విచక్రవాహనంతోపాటు మరికొన్ని ఇళ్లల్లో అదనంగా కారు ఉంటుంది. కరీంనగర్లో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. పిల్లల చదువు, వ్యాపారం, ఉద్యోగం వంటి అవసరాలకు జిల్లా కేంద్రం అనువుగా ఉంది. జనాభాకు తగ్గట్టుగానే వాహనాల సంఖ్య పెరుగుతోంది. వాహనాల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్‌స్థలాలు లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి రోడ్డుపై వాహనం తీసుకుని వెళ్లడం నరకంగా మారుతోంది. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలోని ముఖ్య వ్యాపారకూడళ్లయిన టవర్‌సర్కిల్, పోస్టాఫీస్రోడ్డు, శాస్త్రీరోడ్డు, ప్రకాశంగంజ్, గాంధీరోడ్డు, రూరల్‌పోలీస్ స్టేషన్‌రోడ్డు, ఆఫీస్‌రోడ్డు, కూరగాయల మార్కెట్ రోడ్డు సాయంత్రం పూట కిక్కిరిసిపోతున్నాయి. అరకిలోమీటరు ప్రయాణించాలంటే అరగంట పడుతుంది. దుకాణాల ఎదుటే.. వివిధ అవసరాల నిమిత్తం వ్యాపార కూడలికి వచ్చే వారు తమ వాహనాలను దుకాణాల ఎదుటే నిలుపుతున్నారు. దీంతో రోడ్లపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలో రోడ్లు ఇరుకుగా ఉండడంతో పాలకులు ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. వాహనాలకు తోడు దుకాణాల యజమానులు వారి సామగ్రిని రోడ్డుపైనే పెడుతూ మరింత ఇబ్బందులు కలిగిస్తున్నారు. పెద్దపెద్ద వాణిజ్య సంస్థలు, షాపింగ్‌మాల్స్, ఆస్పత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, విద్యాసంస్థలు ఇలా అన్నింటి ఎదుట వాహనాలపార్కింగ్లే దర్శనమిస్తున్నాయి. సెల్లార్లపై దృష్టి కరువు షాపింగ్‌మాల్స్, హోటళ్లు, బార్లు, ఇతర వాణిజ్య సంస్థలు పార్కింగ్‌ల కోసం సెల్లార్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఆ సెల్లార్లలో వాహనాలకు బదులుగా దుకాణాలనే విస్తరిస్తుండడం ఇబ్బందిగా మారుతుంది. వాహనాల పార్కింగ్‌ను రోడ్లపైనే చేస్తున్నారు. గతంలో సెల్లార్లపై కొరడా ఝుళిపిస్తున్నామని నగరపాలకసంస్థ అధికారులు హడావిడి చేసినా అవి తాటాకు చప్పుల్లే అయ్యాయి. రోడ్లపై ఇరువైపులా పార్కింగ్‌లతో సగానికిపైగా రహదారులు కనుమరుగవుతున్నాయి. స్థలాలు కరువు నగరపాలక సంస్థ పరిధిలో పార్కింగ్ కోసం స్థలాలు కరువయ్యాయి. అమరవీరుల స్థూపం, మార్కెట్ సమీపంలోని నీటి పారుదల కార్యాలయం, అన్నపూర్ణ కాంప్లెక్స్, మున్సిపల్ గెస్ట్‌హౌస్‌ల్లో కొంత స్థలం ఉంది. అయితే పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ప్రధాన వ్యాపార కూడళ్లలో రోడ్లపై పార్కింగ్‌ను నిషేధించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఎక్కడా పార్కింగ్ స్థలాలను గుర్తించిన దాఖలాలు లేవు. దీంతో నగరంలో వాహనాల పార్కింగ్ సమస్యగా మారింది. ఇప్పటికైన అధికారులు స్పందించి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. -
అక్రమార్కులపై కన్ను
విజయవాడ నగరపాలక సంస్థలో పెచ్చుమీరిన అవినీతిపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దృష్టి సారించింది. టౌన్‌ప్లానింగ్, ప్రజా రోగ్యం, ఇంజనీరింగ్ విభాగాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీబీ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఓ అధికారి అర్ధంతర రిలీవ్ వెనుక కూడా అవినీతి ఆరోపణలే కారణమని సమాచారం. సీఎం పేషీ జోక్యం చేసుకోవడంతో ఆ అధికారి మూటాముల్లె సర్దుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో పాలన గాడి తప్పింది. ప్రతి పనికి అక్రమార్కులు చేయి చాస్తున్నారు. ఇక టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని అవినీతి జాఢ్యం పట్టిపీడిస్తోంది. అక్రమ నిర్మాణాల నుంచి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) వరకు దేన్నీ వదలకుండా అవినీతి రాయుళ్ళు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీపీఎస్ పథకం కింద 6,903 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల రూపంలో రూ.5.95 కోట్లు జమ అయ్యాయి. క్షేత్రస్థాయిలో వీటిని పరిష్కరించినట్లైతే సుమారు రూ.50 కోట్ల పైనే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులోనూ అక్రమార్కులు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కాసులు వచ్చే వాటిని మాత్రమే పరిష్కరిస్తూ మిగిలిన ఫైళ్ళనుపక్కన పడేశారు. ఇప్పటి వరకు సుమారు 820 దరఖాస్తుల్ని మాత్రమే పరిష్కరించారని సమాచారం. రిలీవ్ వెనుక ఏసీబీ టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని ఆన్లైన్ చేసిన నేపథ్యంలో అవినీతిరాయుళ్ళు క్షేత్రస్థాయిలో కాసుల వేట ప్రారంభించారు. ఫైన్ ముసుగులో ఇబ్బడిముబ్బడిగా అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటాల్లో తేడాలు రావడంతో కొందరు సిబ్బంది అక్రమాల గుట్టును ఏసీబీకి ఉప్పందించారని తెలుస్తోంది. ఓ అధికారి తీరు సక్రమంగా లేకపోవడంతో ఏడాది తిరక్కుండానే సాధారణ బదిలీ వేటు వేశారు. ఆయన్ను రిలీవ్ చేసేందుకు ఉన్నతాధికారి ససేమిరా అన్నారు. ఆ అధికారిని ఏసీబీ టార్గెట్ చేస్తోందంటూ పైస్థాయి నుంచి సమాచారం అందడంతో గప్‌చుప్‌గా రిలీవ్ చేసేశారు. ఉన్నతాధికారితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ఆ అధికారి పలువురి వద్ద చెప్పడం కార్పొరేషన్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీగా అవకతవకలు ... ఇంజినీరింగ్, ప్రజారోగ్య శాఖ విభాగాల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కరాల నేపథ్యంలో నగరంలో జరుగుతున్న కోట్లాది రూపాయల పనుల్లో భారీగానే ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రజారోగ్య శాఖలో సీట్ల మార్పిడి, కాంట్రాక్టుల మంజూరు వెనుక భారీగా అమ్యామ్యాలు ముడుతున్నాయనే అభియోగాలు ఉన్నాయి. పనికి వస్తారనుకున్న ఉద్యోగులకు రెండుమూడు పోస్టుల్ని కట్టబెట్టటం వెనుక తిర ‘కాసు’ కథ నడుస్తోందనేది బహిరంగ రహస్యం. రోడ్ల నిర్మాణం ముసుగులో కొందరు అధికారులు అక్రమాలకు తెరతీశారనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్టీఎస్ రోడ్డు, సాంబమూర్తి తదితర రోడ్ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ఓ కార్పొరేటర్ విజిలెన్స్, ఏసీబీలకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ విషయాలను నగరపాలక సంస్థలో ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఏసీబీ, విజిలెన్స్‌ను ఆశ్రయించినట్లు ఆ కార్పొరేటర్ బాహాటంగా చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అక్రమార్కులు బెంబేలెత్తుతున్నారు. -
లీజుల విషయం తేల్చండి
స్టాండింగ్ కమిటీ అంటే లెక్కలేదా? ఎస్టేట్ అధికారులపై మండిపడిన సభ్యులు విజయవాడ సెంట్రల్ : ‘ఒకసారి వాయిదా వేసిన అంశాన్ని ఆ తర్వాత కమిటీ దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదు. ఇదేం పద్ధతి. ఇలా అయితే నగరపాలక సంస్థకు ఆదాయం ఎలా వస్తుంది. స్టాండింగ్ కమిటీ అంటే లెక్కలేదా. లీజుల విషయం తేల్చండి..’ అంటూ ఎస్టేట్ అధికారులపై సభ్యులు మండిపడ్డారు. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సభ్యులు కాకు మల్లిఖార్జున యాదవ్, కొరకాని అనూరాధ మాట్లాడుతూ గత సమావేశంలో వాయిదా వేసిన 105 షాపుల రెన్యూవల్ అంశాన్ని ఏం చేశారని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారుల నుంచి సమాధానం కరువైంది. కాకు మల్లిఖార్జున్ మాట్లాడుతూ కమిటీ సభ్యులుగా తమ పదవీ కాలం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుందామనుకుంటున్నారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశం నాటికి లీజుల విషయం ఏం చేశారో చెప్పాలన్నారు. మరీ అంత తక్కువా.. సింగ్‌నగర్‌లోని గుజ్జల సరళాదేవి కల్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్‌ను రూ.8,55,999కు లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీ సభ్యులు వ్యతిరేకించారు. సత్యనారాయణపురంలోని కర్మల భవనాన్ని రూ.6.40 లక్షలకు లీజుకు ఇచ్చారు. దీంతో పోలిస్తే సరళాదేవి కల్యాణ మండపం విస్తీర్ణం చాలా ఎక్కువన్నారు. గ్రౌండ్, మొదటి అంతస్తును కలిపి లీజుకు ఇచ్చేందుకు మరోసారి టెండర్ పిలవాలని సూచించారు. రాజీవ్‌గాంధీ పార్కులో బంగీ జంప్, క్రికెట్ నిర్వహించుకునేందుకు ఏడాదికి రూ.1,65,457కు పద్ధతిపై లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనను వాయిదా వేశారు. టెండర్ పిలిస్తే ఇంతకంటే ఎక్కువ మొత్తం వస్తుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. పలు షాపుల లీజుకు స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఉద్యోగుల మెడికల్ రియింబర్స్‌మెంట్, బకాయిల చెల్లింపునకు అంగీకరించారు. కమిటీ సభ్యులు చెన్నుపాటి గాంధీ, సహేరాభాను, నాగోతు నాగమణి, అదనపు కమిషనర్ అరుణ్‌బాబు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, ఎస్టేట్ అధికారి కృష్ణమూర్తి, చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, అకౌంట్స్ ఎగ్జామినర్ ఎంవీ ప్రసాద్, ఆకౌంట్స్ ఆఫీసర్ కె.అంబేద్కర్ పాల్గొన్నారు. -
‘చెత్త’ నిర్ణయం
స్టోర్‌రూంలో పుష్కాట్స్, డస్ట్‌బిన్స్ వాడకుండానే మూలకు.. రూ.35 లక్షలు వృథా నాలుగు నెలలకే చిలుముపట్టిన కొత్త రిక్షాలు రామగుండం బల్దియాలో ప్రజాధనం దుర్వినియోగం కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థలో ప్రజాధనం వృథా చేస్తున్నారు. పాలకులు, అధికారులు అనాలోచిత నిర్ణయంతో ఏకంగా బల్దియాకు రూ.35లక్షల నష్టం కలిగింది. చెత్త సేకరించడానికి ఉపయోగపడే తోపుడు బండ్లు కొనుగోలు చేసి మూడేళ్లు గడిచినా వాడకుండా మూలన పడేశారు. మళ్లీ నాలుగు నెలల క్రితం ట్రైసైకిళ్లు కొన్నా వాటిది అదే పరిస్థితి. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తుప్పుబట్టిపోతున్నాయి. వాటిని వాడకుండానే మళ్లీ కొత్తగా కొనేందుకు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. కనీసం వాటిని వినియోగించేందుకు కార్మికులను తీసుకోకపోవడం విమర్శలకు దారితీసింది. పాలకులు, అధికారులు తీసుకునే చెత్త నిర్ణయాలతో బల్దియా పేరు అభాసుపాలువుతున్నారు. మూడున్నరేళ్ల క్రితం 12వ ఆర్థిక సంఘానికి చెందిన రూ.25 లక్షల నిధులతో 90 పుష్‌కాట్(చెత్తను సేకరించడానికి ఉపయోగపడే తోపుడు బండ్లు),1,250 డస్ట్బీన్స్ను టెండర్ల ద్వారా అధికారులు కొనుగోలుచేశారు. సంవత్సరాల తరబడి ఒక్క పుష్కాట్స్ బండిని కూడా ఉపయోగించకుండానే గదుల్లో మూలకు పడేశారు. వీటి కొనుగోలుపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ గతంలో కొందరు మాజీ కౌన్సిలర్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్‌కు ఫిర్యాదుచేశారు. అయినా స్పందన లేదు. ఇప్పటికే చాలావరకు పుష్కాట్స్, ప్లాస్టిక్ డబ్బాలు మాయమయ్యాయని ఆరోపణలున్నాయి. పుష్కాట్స్, డస్ట్బీన్స్ ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుండానే... ప్రస్తుత పాలకర్గం 12వ ఆర్థిక సంఘానికి చెందిన మరో రూ.10 లక్షల నిధులతో నాలుగునెలల క్రితం 56 ట్రైసైకిళ్లను కొనుగోలు చేసింది. మరో వంద ట్రైసైకిళ్లు, ఇంటింటికీ రంగు డబ్బాలు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త ట్రైసైకిళ్లలో నాణ్యతెంత? రూ.10 లక్షలతో కొనుగోలు చేసిన 56 ట్రైసైకిళ్లను అధికారులు నిర్లక్ష్యంగా చెట్ల కిందపడేశారు. ఎండకు ఎండుతూ... వానలకు తడుస్తూ ప్రస్తుతం రిక్షాలన్నీ తుప్పుబట్టి పాడవుతున్నాయి. నాసిరకం విడిభాగాలతో ట్రైసైకిళ్లను తయారుచేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా పారిశుధ్యం మెరుగుకు ఉపయోగంలేకుండానే రూ.35 లక్షల ప్రజాధనం వృథా అయింది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం పాలకవర్గం నోరు మొదపడంలేదు. కొలిక్కిరాని రిక్షా కార్మికుల ఎంపిక ఇంటింటా చెత్త సేకరించి రీసైక్లింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రస్తుత పాలకవర్గం 12వ ఆర్థిక సంవత్సరం మిగులు నిధులు రూ.10 లక్షలతో 56 ట్రైసైకిళ్లను కొనుగోలు చేసింది. ఒక్కో రిక్షాపై ఇద్దరు కార్మికులను పనిలోకి తీసుకుంటామని చెప్పి ఇటీవల రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా ఎవరూ ముందుకు రాలేదు. గతంలో పనిచేసిన ర్యాగ్పిక్కర్ల(రిక్షా కార్మికులు)ను పనిలోకి తీసుకోవాలని, వారిని పారిశుధ్య కార్మికులుగా గుర్తించి కార్పొరేషన్ తరఫున వేతనాలు ఇవ్వాలని చాలాకాలంగా కార్మిక సంఘాల నాయకులు, ర్యాగ్‌పిక్కర్లు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై కొలిక్కి రాలేదు. వినియోగంలోకి తెస్తాం.. –డి.జాన్‌శ్యాంసన్, కమిషనర్ ఇంటింటా చెత్త సేకరించడానికి 56 ట్రైసైకిళ్లు కొనుగోలు చేశాం. వీటిపై కార్మికులను తీసుకునేందుకు రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చాం. ఎవరూ ముందుకు రావడంలేదు. మున్సిపల్ కార్పొరేషనే జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇది సాధ్యంకాదు. మరోసారి నోటిఫికేషన్ ఇస్తాం. రాకుంటే మేమే 50 డివిజన్లలో ఉన్న కార్మికులతో అవసరమున్నచోట ట్రైసైకిళ్లతోపాటు పుష్కాట్స్ ఏర్పాటుచేస్తాం. 20 రోజుల్లో డివిజన్లలోకి రిక్షాలు – కొంకటి లక్ష్మీనారాయణ, రామగుండం నగర మేయర్ రిక్షాలపైన పనిచేయడానికి నోటిఫికేషన్ పిలిస్తే కార్మికులు ముందుకురాలేదు. ట్రైసైకిళ్ల వినియోగంపై దృష్టి సారించాం. 20 రోజుల్లో రిక్షాలను వినియోగంలోకి తీసుకువస్తాం. అవసరమైతే పుష్కాట్స్ కూడా పారిశుధ్యం కోసం వినియోగిస్తాం. -
అభివృద్ధే లక్ష్యం
నాణ్యత పాటించకుంటే చర్యలు ప్రజల సహకారంతో రోడ్ల విస్తరణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ కార్పొరేషన్ : నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, రానున్న రెండేళ్లలో రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరపాలక కార్యాలయంలో మంగళవారం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్ల దుస్థితిపై స్పందించిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఎన్ని కోట్లయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఆర్అండ్బీ రోడ్లకు ఇప్పటికే రూ.46 కోట్లు మంజూరు చేశారని, మరో రూ.36 కోట్లకు రెండు రోజుల్లో జీవో విడుదల కానుందని పేర్కొన్నారు. ఈ నిధులతో రోడ్ల సుందరీకరణతోపాటు ఐలాండ్‌ను అందంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కమాన్ నుంచి సదాశివపల్లికి రోడ్డు, అత్యాధునిక సస్పెన్షన్ బ్రిడ్జి కోసం రూ.77 కోట్లు మంజూరయ్యాయని, మరో రూ.70 కోట్లకు వారంరోజుల్లో జీవో వస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఇచ్చే రూ.100 కోట్లలో రూ.25 కోట్లు మంజూరయ్యాయన్నారు. వీటిలో రూ.20 కోట్లు లింక్ రోడ్ల అభివృద్ధికి, రూ.5 కోట్లను కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి వెచ్చిస్తామన్నారు. ఎస్సారార్ కళాశాలలో అసంపూర్తిగా వదిలిన మినీరవీంద్రభారతి స్థలంలో కన్వెన్షన్ నిర్మాణానికి రూ.15 కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. అధికారుల పనితీరుపై సీరియస్... సమావేశంలో ఇంజినీరింగ్ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతోందని, పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వ క్వాలిటీ కంట్రోల్ ద్వారా రోడ్లను కోర్‌కటింగ్ చేసి పరీక్షిస్తామన్నారు. నాణ్యతకు అధికారులే బాధ్యత వహించాలని, అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రతి రూపాయికి నాణ్యత కనబడేలా పనులు చేయాలని ఆదేశించారు. రోడ్ల విస్తరణకు మతాలకతీతంగా సహకరించాలి జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందని, మతాలకతీతంగా అందరూ సహకరించాలని కోరారు. సివిల్ ఆసుపత్రి వద్ద రెండు గుడులను ఇతర స్థలాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్ తరాల కోసం మంచిరోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగరాన్ని సుందరంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కమిషనర్ కృష్ణభాస్కర్, కార్పొరేటర్లు ఏవీ రమణ, బోనాల శ్రీకాంత్, లంక రవీందర్, బండారి వేణు, నాయకులు కట్ల సతీష్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
హడావుడి దోపిడీ
మంత్రిగారి తంత్రం... సబ్ కాంట్రాక్టర్ అవతారం తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో రూ.50 కోట్ల దోపిడీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి అధికారులు, కూలీల తరలింపు మున్సిపాలిటీల జేసీబీలు, ట్రాక్టర్లు, వాహనాలన్నీ వెలగపూడిలోనే.. హడావుడిగా పనులు ప్రారంభించడం.. తక్కువ గడువు ఉన్నందున వేగంగా పూర్తి చేయడానికి అధిక మొత్తం చెల్లించడానికి సిద్ధం కావడం.. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన గడువు కంటే ముందుగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందంటూ మళ్లీ హడావుడి చేయడం.. కాంట్రాక్టర్‌ను పక్కనబెట్టి సాక్షాత్తూ ఒక మంత్రి ఉప కాంట్రాక్టర్ అవతారం ఎత్తడం.. ఇదీ... ఇప్పుడు తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో సాగుతున్న తంతు.. గుంటూరు :హడావుడి డ్రామాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకూ పాత్ర ఉంది. పనుల పరిశీలనకు వెళ్లి.. పనులు వేగవంతం చేయాలంటూ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశాలిచ్చేస్తారు. ఉప కాంట్రాక్టర్ అవతారంలో అప్పుడు ప్రవేశిస్తారు మంత్రి గారు. ఇప్పుడు సచివాలయ నిర్మాణ పనుల్లోనూ ఒక మంత్రిగారు ఉప కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు. కమీషన్ల రూపంలో రూ.50 కోట్లు కొట్టేసినట్లు అధికారులే చెబుతున్నారు. ‘ఎల్ అండ్ టీ’ నుంచి ఉప కాంట్రాక్టు సచివాలయ నిర్మాణ పనులకు ఎల్ అండ్ టీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ఆ సంస్థ నుంచి మంత్రి అండ్ కో-ఉప కాంట్రాక్టు తీసుకున్నారు. అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న ఉద్యోగులు మొత్తం మంత్రికి చెందిన ప్రయివేటు సంస్థలకు చెందిన వారే కావడం విశేషం. సచివాలయ నిర్మాణ పనులకు ఆరు నెలల గడువిచ్చారు. అంతకంటే ముందుగానే పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇదే సమయంలో కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. జూన్ 27వ తేదీలోపు తాత్కాలిక సచివాలయ పనులు పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీంతో ఆయన పలుమార్లు పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వేగవంతం చేయాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో మంత్రి ఉప కాంట్రాక్టర్‌గా మారారు. జిల్లాలోని పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల నుంచి ట్రాక్టర్లు, మిషనరీ, జేసీబీలు, కూలీలను తరలించే బాధ్యతలను ఆయా కమిషనర్లకు అప్పగించారు. అడ్డాల వద్ద అధికారుల కాపలా! విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలు, తాడేపల్లి, మంగళగిరి, నరసరావుపేట, తెనాలి తదితర పురపాలక సంఘాల అధికారులు వారివారి ప్రాంతాల్లోని కూలీలను వెలగపూడికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు భవన నిర్మాణ పనులకు కూలీలను పంపిన అధికారులు రెండు రోజులగా టైల్స్ వేసే కార్మికులను తరలిస్తున్నారు. గుంటూరు నుంచి రోజూ వంద మంది వరకూ కూలీలను తరలిస్తున్నారు. వీరి కోసం నగరపాలక సంస్థకు చెందిన అక్రమ కట్టడాల నిర్మూలనా దళం వాహనం, ట్రాక్టర్లను వినియోగించడం గమనార్హం. రోజూ ఉదయాన్నే నగరంలో ప్రధాన అడ్డాల వద్ద ఉన్నతాధికారులు కాపలా కాయడం, వచ్చిన కూలీలను తరలించడం చేస్తున్నారు. అయితే అక్కడ పనులు చేస్తున్న కూలీలకు కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించకపోవడంతో ఆ భారం అధికారులపై పడుతోందంటున్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థకు చెందిన జేసీబీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు, సిబ్బంది అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల నుంచి భారీ ఎత్తున యంత్రాలు, భవన నిర్మాణ సామగ్రి, కూలీలను తరలించి కాంట్రాక్టర్‌కు భారీగా లబ్ధిచేకూర్చారు. ఇలా మిగిలిన సొమ్మును పెద్దలు కమీషన్ల రూపంలో దండుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ల రూపంలో దండుకున్న మొత్తం సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఎర్రచందనం కోసం కార్పొరేషన్!
* మార్కెటింగ్‌కు చైనాలో డిపో * ఎర్రచందనం, మొక్కల పెంపకంపై సమీక్షలో సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రపంచంలో ఏ ప్రాంతంలో లేని ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌కు సొంతమని, దీనిద్వారా మరింత ఆదాయం పెంచుకునేందుకు కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఎర్రచందనం, మొక్కలు పెంపకంపై గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం మొక్కల పెంపకం, స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను భద్రపరచడం, వేలం వంటి వ్యవహారాలను కార్పొరేషన్ పరిధిలోకి తెస్తామని చెప్పారు. ఎర్రచందనాన్ని స్మగర్ల బారి నుంచి రక్షించేందుకు జియోట్యాగింగ్, డ్రోన్లను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,095 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నట్టు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఎర్రచందనం వేలంలో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చేలా విదేశాల్లో మార్కెట్ సృష్టించాలని, చైనాలో డిపో ఏర్పాటు చేయడంతోపాటు చైనీస్ కరెన్సీలో కూడా వేలం వేసే యోచన చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 23.04శాతమే ఉందని, నాలుగేళ్లలో 12లక్షల హెక్టార్లలో మొక్కలు పెంచాలని చెప్పారు. పనులు పూర్తి కాకపోతే కఠిన చర్యలు పుష్కర పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తిచేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గురువారం ఉదయం ఆయన ఇంద్రకీలాద్రి, పుష్కరఘాట్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇకమీదట ప్రతి వారమూ పనుల్ని పరిశీలిస్తానని చెప్పారు. పలు రంగాల్లో ఆస్ట్రియా సహకారం వ్యవసాయం, జలశుద్ధి రంగాల్లో తాము అభివృద్ధి చేసిన నూతన సాంకేతిక ఆవిష్కరణలను రాష్ర్టంలో ప్రవేశపెట్టేందుకు ఆస్ట్రియా దేశం ముందుకొచ్చింది. ఈ విషయమై ఆస్ట్రియా ఉప రాయబారి జార్జ్ జెట్నర్ నేతృత్వంలోని బృందం గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యింది. వివిధ అంశాల్లో కలిసి పనిచేయడానికి 2003లో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తొలిదేశం తమదేనని, మళ్లీ అదే సీఎం సారథ్యంలో ముందుకెళ్లే అవగాహనకు వచ్చామని తెలిపారు. అమరావతిలో బ్రిటన్ ఆస్పత్రికి అనుమతి అమరావతిలో బ్రిటన్ సహకారంతో ఏర్పాటుచేయనున్న హాస్పిటల్ ప్రాజెక్టుకు త్వరలో అనుమతులిస్తామని సీఎం తెలిపారు. భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ అస్క్విత్ బృందం గురువారం సీఎంతో సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంలోని 10 ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు. అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై బ్రిటన్ హైకమిషనర్‌కు సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. -
రుణం కోసం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం
కంగ్టి: కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయడంలో అన్యాయం చేశారంటూ ఓ వ్యక్తి శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలి పారు. బోర్గి గ్రామానికి చెందిన ఎం.శ్రీకాంత్ కార్పొరేషన్ రుణం కోసం బ్యాంకు అధికారులు కాన్సెంట్ ఇచ్చినా తమకు రుణం మంజూరు చేయకుండా ఎంపీడీఓ మధుసూదన్ అడ్డుకోవడంతోపాటు లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాంత్ తన బావ, బోర్గి సర్పంచ్ శశికళ భర్త సంజీవ్‌తో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తాళం వేశారు. దాదాపు గంటపాటు నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆందోళనకారులను సముదాయించారు. -
కార్పొరేషన్లో టీడీపీ దందా
శ్రీకాకుళం టౌన్ : నగర పాలక సంస్థగా శ్రీకాకుళం రూపుదిద్దుకున్న తరువాత కూడా ఎన్నికలు నిర్వహించే దమ్ము తెలుగుదేశం ప్రభుత్వానికి లేకపోవడం వల్ల అవినీతి రాజ్యమేలుతోందని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. కలెక్టరేట్లో నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ వివేక్యూదవ్ను ఆయన చాంబరులో శనివారం కలిసిన ఆయన కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై విచారణకు డిమాండ్ చేశారు. అవినీతిపై వినతిపత్రం అందజేశారు. పాలకవర్గం గడువు ముగిసి రెండేళ్లు పూర్తవుతున్నా ఎన్నికలంటే చంద్రబాబు ప్రభుత్వానికి భయమేస్తోందని విమర్శించారు. రాజ్యాంగబద్దం గా ఎన్నికలు జరపకుండా అడ్డదారిలో దోపిడీకి తెర తీసిందన్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలు గుర్తించి క్రమబద్దీకరణకు ప్రభుత్వం పలు విధానాలు అవలంభించిందని, నిబంధనల ప్రకారం క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న వారికి పన్నుల పేరిట భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వార్డుల్లో ప్రతి ఇంటికీ మూడు రెట్లు వంతున పన్నులు పెంచి టీడీపీ నేతల జోక్యంతో బేరాలు కుదుర్చుకొని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చెల్లిస్తున్న పన్నులకు కొంత మాత్ర మే రసీదు ఇచ్చి మిగతా మొత్తాన్ని వాటాలుగా పంచుకుంటున్నారని చెప్పారు. దీనికి సంబంధించి తక్షణమే విచారణ చేయూలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.40కోట్లు నిధులు తీసుకువచ్చి జనానికి తాగునీటి అవసరాలు తీర్చామని, గత రెండేళ్లలో ఆ పథకాన్ని మూలకు చేర్చారని ధర్మాన తన ఫిర్యాదులో జేసీకి వివరించారు. దీనిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సత్వరమే లోపాలు సరిదిద్దకపోతే ప్రజలతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్ఆర్ సీపీ నేతలు మాజీ జెడ్పీ చైర్మన్ వై.వి.సూర్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవీ పద్మావతి, మాజీ కౌన్సిలర్లు గుమ్మా నగేష్, ధర్మాన రఘునాథనాయుడు, అంధవరపు సూరిబాబు , ఎంఏ రఫీ, బలగ పండరీనాథ్, కర్నేని పద్మావతి, కెల్ల కొండలరావు, కస్పా శ్యామలరావుతో పాటు శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయరావు, సాధు వైకుంఠరావు, కేఎల్ ప్రసాద్, మండవల్లి రవి, మామిడి శ్రీకాంత్, మెంటాడ స్వరూప్, పి.జీవరత్నం, టి.కామేశ్వరి, ఆర్ఆర్ మూర్తి, కోరాడ రమేష్, వూన నాగరాజు, భైరి మురళి, కె.సీజ్, పాలిశెట్టి మధుబాబు, కిల్లాన సాయి, తంగుడు నాగేశ్వరరావు, కోణార్క్ శ్రీను, పోతల రామారావు, ఎన్.శ్రీను, రావాడ జోగినాయుడు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం : ధర్మాన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత లేని పాలన సాగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. కలెక్టరేట్ వద్ద విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుందని చంద్రబాబు చెబుతున్న మాటలకు పాలనకు ఎక్కడా పొంతన లేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 16 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించామని చెబుతున్నారే తప్ప ఆచరణలో శూన్యంగా కనిపిస్తుందన్నారు. రైతులు, మహిళలు పడుతున్న కష్టాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో కూడా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. -
డర్టీ సిటీ!
ఎన్నిసార్లు చెప్పాలి? ► గ్రేటర్ విశాఖను చూసి నేర్చుకోండి ► కమిషనర్‌కు సీఎం చీవాట్లు ► కార్పొరేషన్లో హాట్ టాపిక్ సిటీ వరస్టుగా ఉంది. బందరురోడ్డు, ఏలూరురోడ్డు మినహా మరెక్కడ చూసినా చెత్తకుప్పలే.. చాలాసార్లు చెప్పా.. మీరు మారడం లేదు.. ఇక నేనే మారుస్తా.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగరపాలక సంస్థ కమిషనర జి.వీరపాండియన్‌కు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కర ఏర్పాట్లకు సంబంధించి గత వారాంతంలో హైదరాబాద్‌లో మున్సిపల్ శాఖ మంత్రి, కలెక్టర్, మేయర్, కమిషనర్, ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరంలో పారిశుద్ధ్యం అంశం ప్రస్తావనకు రాగా కమిషనర్‌పై సీఎం తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్లు తెలిసింది. ‘గ్రేటర్ విశాఖపట్నంలో పారిశుద్ధ్యం బాగోలేదని ఒక్కసారి చెబితే అక్కడి కమిషనర్ సెట్‌రైట్ చేశారు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో! విజయవాడకు నేనొచ్చి ఎనిమిది నెలలైంది.. శానిటేషన్ బాగోలేదని చాలాసార్లు చెప్పా... ఏం ప్రయోజనం లేదు. ఏం చేస్తున్నట్లు?’ అంటూ చంద్రబాబు కమిషనర్‌ను గట్టిగా నిలదీశారని సమాచారం. పనిలో పనిగా మున్సిపల్ మంత్రి పి.నారాయణకు సైతం సీఎం చురకలు వేశారని తెలిసింది. రాజధాని నగరంలోనే శానిటేషన్ బాగోపోతే ఎలా అంటూ మంత్రికి క్లాస్ తీసినట్లు వినికిడి. స్వచ్ఛభారత్ ర్యాంకింగ్‌లో 22వ స్థానంలో నిలిచామంటూ జబ్బలు చరుచుకున్న అధికారులకు సీఎం వ్యాఖ్యలతో దిమ్మతిరిగినంత పనైంది. అన్నీ మాటలేనా! నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం పనితీరు అధ్వానంగా మారింది. 2,984 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది, 850 మంది పర్మినెంట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్క ఔట్సోర్సింగ్ కార్మికులకే నెలకు రూ.4 కోట్లు జీతాలుగా చెల్లిస్తున్నారు. బందరు, ఏలూరురోడ్లతోపాటు నేషనల్ హైవేలో 24/7 శానిటేషన్ నిర్వహించే బాధ్యతను బీవీజీ ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. బందరు, ఏలూరు రోడ్లను లిట్టర్‌ఫ్రీ (చెత్తరహిత) జోన్లుగా ప్రకటించారు. ఇవన్నీ కేవలం మాటలే.. గత నెలలో బందరురోడ్డులోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రాగా ఆ ప్రాంతంలో చెత్తకుప్పలు దర్శనమిచ్చాయి. దీనిపై అప్పట్లోనే సీఎం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కమిషనర్ పనితీరుపై ఇటీవలి కాలంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్‌తో కలిసి సమీక్షలు, సదస్సులతో బిజీగా ఉంటున్న కమిషనర్‌కు నగరపాలనపై పట్టు తప్పిందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చీవాట్లు పెట్టడం కార్పొరేషన్లో హాట్ టాపిక్‌గా మారింది. పాలన గాలికి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్రజారోగ్య శాఖలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏఎంవోహెచ్‌లు ప్రతిరోజు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సి ఉంది. వారు కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలున్నాయి. కొన్నేళ్లుగా పాతుకుపోయిన శానిటరీ ఇన్స్పెక్టర్లను (ఎస్.ఐ.లు) ఏడాది క్రితం లాటరీ ద్వారా డివిజన్లు మార్చారు. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. కొందరు ఎస్.ఐ.లు ఉన్నతాధికారుల్ని మేనేజ్ చేసుకొని తమకు కావాల్సిన డివిజన్లలో అనధికారికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అత్యధిక శాతం పర్మినెంట్ ఉద్యోగులు మస్తర్లు పూర్తయ్యాక వెళ్లిపోతున్నారు. ఇందుకుగాను సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్లకు నెలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు ముట్టజెబుతున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రిన్సిపల్ సెక్రటరీలు, వివిధ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లలో సుమారు 400 మంది ఔట్సోర్సింగ్ కార్మికులు అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఫలితంగా నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది. చర్యలేవీ! నగర పర్యటన సందర్భంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉన్నట్లు కమిషనర్ గుర్తిస్తే కార్మికులపై చర్యలతో సరిపెడుతున్నారు. గడిచిన ఆరు నెలలుగా రెండు ఏఎంవోహెచ్ పోస్టుల్లో ఇన్చార్జులే ఉన్నారు. వీరికి అదనపు బాధ్యతలు ఉండడంతో మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలు న్నాయి. ఎస్.ఐ.లపై స్పష్టమైన ఫిర్యాదులు ఉన్నప్పటికీ చర్యలు తీసుకునే విషయంలో ఉన్నతాధికారులు మొహమాటం ప్రదర్శిస్తున్నారు. మలేరియా విభాగం పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. కొందరు ఎస్.ఐ.ల కనుసన్నల్లో ప్రజారోగ్య విభాగం నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. వీటన్నింటినీ చక్కదిద్దకపోవడం వల్లే కమిషనర్ సీఎం వద్ద మాటపడాల్సి వచ్చిందని ఉద్యోగులు గుసుగుసలాడుకోవడం కొసమెరుపు.