81 మందికి ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణాలు
81 మందికి ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణాలు
Published Tue, Nov 22 2016 11:39 PM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
కర్నూలు(అర్బన్): జిల్లా షెడ్యూల్డు కులాల ఆర్థిక సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 81 మందికి రూ.2.27 కోట్ల ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణాలు మంజూరైనట్లు ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ ఎస్ సత్యం తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పథకం కింద 246 మంది ఎంపిక కాగా, మొదటి విడత కింద 81 మందికి రుణాలు మంజూరు చేస్తు కార్పొరేషన్ ఎండీ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇందులో రుణం రూ.1.35 కోట్లు, సబ్సిడీ రూ.80.80 లక్షలు, లబ్ధిదారుల వాట రూ.11.355 లక్షలు ఉంటుందన్నారు. మొదటి విడతలో ఇంటర్నెట్ షాపు ఏర్పాటుకు 45 మందికి, మినిడెయిరీకి 20, మెడికల్ క్లినిక్‌కు 2, ఆటో ట్యాక్సీకి 12, ఆటో ట్రాలీ గూడ్సు వెహికల్స్ 2 యూనిట్లకు రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సీ హరికిరణ్ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. అప్పట్లో ఎంపికైన వారిలో ఇంకా 165 మందికి రుణంగా రూ.2.41 కోట్లు, సబ్సిడీగా రూ.1.59 కోట్లు త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందన్నారు.
Advertisement