మనీలాండరింగ్‌ ద్వారా ‘స్కిల్‌’ కుంభకోణం: ఈడీ | Ap Skill Development Corporation Scam Through Money Laundering | Sakshi
Sakshi News home page

మనీలాండరింగ్‌ ద్వారా ‘స్కిల్‌’ కుంభకోణం: ఈడీ

Published Wed, Mar 15 2023 10:34 AM | Last Updated on Wed, Mar 15 2023 5:35 PM

Ap Skill Development Corporation Scam Through Money Laundering - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొ­రేషన్‌లో కుంభకోణంలో రూ.241 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా కొల్ల­గొట్టినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నిర్ధారించింది. అందులో రూ.70 కోట్లు ఎక్క­డికి చేరాయో గుర్తించినట్టు తెలిపింది. మిగి­లిన మొత్తం ఎక్కడికి చేరిందన్న దిశగా దర్యాప్తు కొనసాగి­స్తు­న్నామని పేర్కొంది.

మనీ­లాండరింగ్‌ చేస్తూ అక్రమాలకు పాల్పడినట్టు తమ విచారణలో వెల్లడైందని ఈడీ మంగళ­వారం ఒక ప్రకట­నలో తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ అలియాస్‌ సుమన్‌ బోస్‌ (సీమెన్స్‌ కంపెనీ మాజీ ఎండీ), వికాస్‌ ఖన్విల్కర్‌ (డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ), ముకుల్‌చంద్ర అగర్వాల్‌ (స్కిల్లర్‌ కంపెనీ ప్రతినిధి), సురేశ్‌ గోయల్‌­(చార్టెడ్‌ అకౌంటెంట్‌)లను కోర్టు ఆదే­శాలతో విచారణ కోసం ఏడు­రోజుల కస్టడీకి తీసుకున్నట్టు పేర్కొంది.
చదవండి: అసెంబ్లీకి అందుకే వచ్చావా?.. కోటంరెడ్డిపై మంత్రి అంబటి ఫైర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement