Money laundering
-
37 గుర్రాలను అటాచ్ చేసిన ఈడీ.. విలువ రూ.3.98 కోట్లు!
అంతర్జాతీయ సైబర్ మోసాల నెట్ వర్క్, మనీ లాండరింగ్, అక్రమ ఆస్తుల ఆరోపణల వల్ల మెట్ టెక్నాలజీస్ యజమాని కునాల్ గుప్తా, తన సహచరుడు పవన్ జైస్వాల్‌కు చెందిన రూ.5.23 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ చర్యల్లో భాగంగా కేజీ స్టడ్ ఫామ్ ఎల్ఎల్పీకి చెందిన 37 గుర్రాలను సైతం ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ రూ.3.98 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. గ్రీన్లీఫ్ కాంప్లెక్స్, బాగుయాటి, కోల్‌కతాలోని రూ.1.08 కోట్ల విలువైన ఫ్లాట్లను కూడా ఈడీ జప్తు చేసింది. ఈ కేసు ఈ కేసులో ఈడీ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు, నవంబర్ 2023లో ఏజెన్సీ రూ.67.23 కోట్లు, జులై 2024లో రూ.85 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.మోసపూరిత వ్యాపార ఒప్పందాలుకునాల్ గుప్తా, అతని సహచరులు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియాలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసపూరిత కాల్ సెంటర్లను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. టెక్నాలజీని ఉపయోగించి నకిలీ యాప్‌ల ద్వారా తప్పుడు రుణ ఆఫర్లు, మోసపూరిత వ్యాపార ఒప్పందాలు చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. కేజీ స్టడ్ ఫార్మ్ ఎల్ఎల్పీ, జీడీ ఇన్ఫోటెక్‌తో సహా పలు సంస్థల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.రేసింగ్‌లో వచ్చిన డబ్బు పెట్టుబడిగా..కునాల్గుప్తా, పవన్ జైస్వాల్ నిబంధనలకు విరుద్ధంగా తమ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరిపింది. ప్రాథమిక విచారణలో భాగంగా కొన్ని ఆస్తులను, గుర్రాలను అటాచ్ చేసింది. సమగ్ర విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కేజీ స్టడ్ ఫార్మ్ ఎల్ఎల్పీ గుర్రాలను కొనుగోలు చేయడం, వాటికి శిక్షణ ఇవ్వడం, అమ్మడం వంటి చేస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా నిధులను దారిమళ్లించినట్లు ఈడీ గుర్తించింది. నేరారోపణలతో ముడిపడి ఉన్న గుర్రాల ద్వారా రేస్‌లో సంపాదించిన డబ్బును తిరిగి పెట్టుబడి పెట్టినట్లు అధికారులు తెలిపారు. దాంతో 37 గుర్రాలను ఈడీ అటాచ్ చేసింది. వీటిని వివిధ రేస్ క్లబ్‌లు, రైడింగ్ పాఠశాలల్లో ఉంచుతున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లులెక్కల్లోలేని లావాదేవీలుజీడీ ఇన్ఫోటెక్ ద్వారా పవన్ జైస్వాల్ గ్రీన్లీఫ్ కాంప్లెక్స్‌లో అక్రమంగా ఆస్తులను సంపాదించినట్లు ఈడీ తెలిపింది. లెక్కల్లోలేని ఆర్థిక లావాదేవీలు, నగదు డిపాజిట్లు, చట్టబద్ధమైన ఆదాయ వనరులు లేకుండా నగదు బదిలీ చేయడం ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ వెల్లడించింది. -
4.5 లక్షల ‘మ్యూల్’ ఖాతాలను స్తంభింపజేసిన కేంద్రం
సైబర్ నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకునేందుకు వాడే దాదాపు 4.5 లక్షల ‘మ్యూల్’(మనీ లాండరింగ్ కోసం వాడే ఖాతాలు) బ్యాంక్ ఖాతాలను కేంద్రం స్తంభింపజేసింది. సైబర్ మోసగాళ్లు ఈ మ్యూల్ ఖాతాల ద్వారానే లావాదేవీలు జరుపుతున్నట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అధికారులు తెలిపారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో జరిగిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు.బ్యాంకింగ్ వ్యవస్థలో మ్యూల్ ఖాతాలను వినియోగించుకుని సైబర్ నేరస్థులు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తంగా 4.5 లక్షల మ్యూల్ ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిపారు. అందులో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణంI4C సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్బీఐలోని వివిధ శాఖల్లో సుమారు 40,000 మ్యూల్ బ్యాంక్ ఖాతాలు కనుగొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 10,000 (ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా), కెనరా బ్యాంక్‌లో 7,000 (సిండికేట్ బ్యాంక్‌తో సహా), కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 6,000, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో 5,000 మ్యూల్ ఖాతాలు కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2023 నుంచి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో సుమారు ఒక లక్ష సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పారు. గత ఏడాదిలో సుమారు రూ.17,000 కోట్ల నగదు మోసం జరిగిందని పేర్కొన్నారు.మ్యూల్ ఖాతాల నిర్వహణ ఇలా..సైబర్ నేరస్థులు బ్యాంకు ఖాతాదారులను నమ్మించి వారికి తెలియకుండా కేవైసీ పూర్తి చేస్తారు. మనీలాండరింగ్‌కు పాల్పడుతూ ఖాతాదారుల ప్రమేయం లేకుండా లావాదేవీలు పూర్తి చేస్తారు. లీగల్ కేసు అయితే ఖాతాదారులను అదుపులోకి తీసుకుంటారు. కాబట్టి బ్యాంకులోగానీ, బయటగానీ అపరిచితులు, బంధువులకు బ్యాంకు, వ్యక్తిగత వివరాలు తెలియజేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఓటీపీలు కూడా ఇతరులతో పంచుకోకూడదని చెబుతున్నారు. -
పరిధిని పట్టించుకోకుండా ‘డిజిటల్ అరెస్టు’ తప్పించాడు!
సాక్షి, హైదరాబాద్: డ్రగ్ పార్శిల్స్, మనీ లాండరింగ్, బ్యాంకు ఖాతా దుర్వినియోగం అంటూ పోలీసుల పేరుతో ఫోన్లు చేస్తున్న సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్టు’ చేస్తున్నారు. వీడియో కాల్ ద్వారా నిఘా గంటల తరబడి నిర్భంధించి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి వారి బారినపడి రూ.లక్షలు, రూ.కోట్లు నష్టపోయిన కేసులు ఇటీవలి కాలంలో అనేకం నమోదయ్యాయి. అయితే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన కానిస్టేబుల్ గణేష్ చొరవతో సైబరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ ఫ్రాడ్ బారినపడకుండా బయటపడ్డారు. పరిధులు పట్టించుకోకుండా వేళకాని వేళలో వచ్చిన ఫోన్ కాల్‌కూ పక్కాగా స్పందించిన గణేష్‌ను ఉన్నతాధికారులు ఆదివారం అభినందించారు. మియాపూర్ ప్రాంతానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగికి శుక్రవారం వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్‌లు వచ్చాయి. ఈయన ఆధార్ నెంబర్ వినియోగించి ముంబైలో కొందరు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై అక్కడ కేసు నమోదైందని వాటిలో ఉంది. ఆ సందేశాలను బాధితుడు పట్టించుకోలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్చువల్ నెంబర్ల ద్వారా ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. ముంబై పోలీసుల మాదిరిగా మాట్లాడిన సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి యూనిఫాంలో కనిపించారు. కేసు, అరెస్టు అంటూ తీవ్రంగా భయపెట్టి ఇంట్లో ఉంటే స్థానిక పోలీసులూ వచి్చన అరెస్టు చేస్తారని భయపెట్టారు. తాను ఎప్పుడూ ముంబై రాలేదని, ఆ ఆరి్థక లావాదేవీలతో తనకు సంబంధం లేదని చెప్పినా సైబర్ నేరగాళ్లు పట్టించుకోలేదు.శనివారం తెల్లవారుజాము నుంచి రకరకాలుగా భయపెట్టిన వారు సదరు ఐటీ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో రూ.13 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. సోమవారం వరకు అతడు ఎక్కడికీ వెళ్లకుండా, ఎవరితో మాట్లాడకుండా చేసి ఆపై ఆరీ్టజీఎస్ ద్వారా ఆ మొత్తం కాజేయాలని పథకం వేశారు. దీంతో ఐటీ ఉద్యోగిని డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు చెప్పిన సైబర్ నేరగాళ్లు ఇంటి నుంచి బయటకు రప్పించారు. కుటుంబీకులతో సహా ఎవరినీ కలవద్దంటూ షరతు విధించి అమీర్‌పేటలోని ఓ హోటల్లో బస చేయించారు. ఇలా ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు ఆడియో, వీడియో కాల్స్ కట్ చేయని సైబర్ నేరగాళ్లు బాధితుడిని హోటల్ గదిలోనే ఉంచారు. ఆ సమయంలో కాల్ కట్ అవడంతో బాధితుడికి కాస్తా అవకాశం చిక్కింది. దీంతో ధైర్యం చేసిన అతడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణా ఫోన్ నెంబర్ తెలుసుకున్నాడు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సదరు నెంబర్‌కు కాల్ చేయగా... ఆ సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గణేష్ అందుకున్నారు. సాధారణంగా పోలీసులు తమకు ఫోన్ చేసిన బాధితులు బయటి ప్రాంతాలకు చెందిన వారని చెప్పగానే... అక్కడి అధికారులను సంప్రదించాలని చెబుతుంటారు. అయితే ఈ బాధితుడు మియాపూర్ వాసిని అని చెప్పినా ఆ సమయంలోనూ పక్కాగా స్పందించిన గణేష్ విషయం మొత్తం తెలుసుకున్నారు. అది సైబర్ మోసమంటూ బాధితుడికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు మియాపూర్‌లో వారి ఇంటి పక్కన ఉండే స్నేహితుడి నెంబర్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పిన గణే‹Ù... బాధితుడి వద్దకు వచ్చి తీసుకువెళ్లేలా చొరవ చూపారు. ఈ అంశంలో కానిస్టేబుల్ గణేష్ స్పందనకు ఉన్నతాధికారులు అభినందించారు. -
ఆన్లైన్ గేమింగ్‌కు మనీ లాండరింగ్ ముప్పు
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ రంగానికి మనీలాండరింగ్ నుంచి గణనీయంగా ముప్పు పొంచి ఉందని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో విస్తరించిన డిజిటల్ ఎకానమీని, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆపరేటర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని, చట్టబద్ధమైన ఆపరేటర్లతో వైట్‌లిస్ట్ తయారు చేయాలని, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని, అంతర్జాతీయంగా పరస్పరం సహరించుకోవాలని పేర్కొంది. అలాగే మోసపూరిత విధానాలు పాటించే ప్లాట్‌ఫాంల జోలికి వెళ్లకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని, పటిష్టమైన ఇన్వెస్టిగేటివ్ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయిదేళ్లలో 7.5 బిలియన్ డాలర్లకు పరిశ్రమ.. నివేదిక ప్రకారం 2020– 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 28 శాతం వార్షిక వృద్ధితో భారతీయ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) రంగం అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిశ్రమగా మారింది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగం ఆదాయం 7.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. కోట్ల కొద్దీ గేమర్లు పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నారు. దీనితో ఫిన్‌టెక్, క్లౌడ్ సర్వీసెస్, సైబర్–సెక్యూరిటీ వంటి అనుబంధ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → యూజర్‌కు భద్రత, సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు మొదలైనవి పరిశ్రమ పురోగతికి అవరోధాలుగా మారొచ్చు. దేశీయంగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ మార్కెట్లో ఏటా 100 బిలియన్ డాలర్ల డిపాజిట్లు వస్తుండటం ఈ సవాళ్ల తీవ్రతకు నిదర్శనం. → చట్టవిరుద్ధమైన ఆపరేటర్లను కట్టడి చేసేందుకు నియంత్రణ సంస్థలు ఎంతగా ప్రయతి్నస్తున్నప్పటికీ మిర్రర్ సైట్స్, అక్రమ బ్రాండింగ్, అలవిగాని హామీలతో చాలా ప్లాట్‌ఫాంలు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పర్యవేక్షణ, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. → దేశీయంగా 400 పైచిలుకు స్టార్టప్‌లు 10 కోట్ల మంది రోజువారీ ఆన్లైన్ గేమర్లు ఉన్నారు. వీరిలో 9 కోట్ల మంది డబ్బు చెల్లించి గేమ్స్ ఆడుతుంటారు. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగాలు కలి్పస్తోంది. 2025 నాటికి 2,50,000 ఉద్యోగాలను కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి భారీ పరిశ్రమకు నిర్దిష్టంగా ఒక నియంత్రణ సంస్థ అంటూ లేకపోవడం, పర్యవేక్షణ.. ఏకరూప ప్రమాణాలు లేకపోవడం వంటి అంశాలు సమస్యలుగా ఉంటున్నాయి. -
ఈడీ కేసు ఎలా పెడుతుంది?
బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) తనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేయడంలో ఔచిత్యం ఏమిటని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘దేని ఆధారంగా మనీలాండరింగ్ కేసు పెట్టారో నాకైతే అర్థం కావడం లేదు. మా నుంచి సేకరించిన భూమికి పరిహారంగా ప్లాట్లు కేటాయించారు. అలాంటపుడు మనీలాండరింగ్ కేసుకు ఆస్కారం ఎక్కడిది? నాకు తెలిసి మనీలాండరింగ్ దీనికి వర్తించదు’ అని సిద్ధరామయ్య మంగళవారం అన్నారు.మైసూరులో సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన 3.16 ఎకరాల భూమిని సేకరించిన ముడా పరిహారంగా 50:50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో 14 ప్లాట్లకు ఆమెకు కేటాయించింది. ఇందులో అధికార దురి్వనియోగం, అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్య, పార్వతిలపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ సోమవారం సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసును నమోదు చేసిన విషయం విదితమే. ఈడీ కేసు నమోదైన కొద్దిగంటల్లోనే 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తానని పార్వతి ముడా కమిషనర్‌కు లేఖ రాశారు. తన భర్త పరువుప్రతిష్టలు, మానసిక ప్రశాంతత కంటే ఏ ఆస్తి కూడా తనకు ఎక్కువ కాదని ఆమె పేర్కొన్నారు. తనపై ద్వేష రాజకీయాలకు పార్వతి బాధితురాలుగా మారారని సిద్ధరామయ్య అన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.14 ప్లాట్లు వెనక్కితీసుకున్న ముడా మైసూరు: పార్వతి అభ్యర్థన మేరకు ఆమెకు కేటాయించిన 14 ప్లాట్లను మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) మంగళవారం వెనక్కి తీసుకుంది. పార్వతితో చేసుకున్న సేల్డీడ్లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్వతి తనయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్ర తమకు లేఖను అందించారని, దాన్ని పరిశీలించి ప్లాట్లను స్వా«దీనం చేసుకోవాలని నిర్ణయించామని ముడా కమిషనర్ ఎ.ఎన్.రఘునందన్ వెల్లడించారు. ఎవరైనా స్వచ్ఛందంగా ప్లాట్లను వదులుకుంటే.. వెనక్కి తీసుకోవచ్చనే నిబంధన ముడా చట్టంలో ఉందన్నారు. -
నకిలీ ‘సీఐఏ’ ఏజెంట్ ఎన్ఆర్ఐపై బిగుస్తున్న ఉచ్చు : నవ్వుతూనే ముంచేశాడు!
భారతీయ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ మోసం, మనీ లాండరింగ్ ఆరోపణల వ్యవహారం మరింత ముదురు తోంది. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) రంగంలోకి దిగింది. అమెరికా పౌరుడిగా చెప్పుకుంటూ, సీఐఏ ఏజెంట్ అని నమ్మించి వివిధ దేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార నాయకులను మోసగించడం, తీవ్రమైన తప్పిదాలకు పాల్పడటం ఆరోపణల కేసులో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది.నకిలీ సీఐఏ ఏజెంట్‌గా శ్రీవాస్తవ ఏకంగా ప్రెసిడెంట్ జో బిడెన్‌ను కలిశారని, డెమోక్రటిక్ పార్టీకి 10 లక్షల డాలర్ల పైగా విరాళం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తడం అక్కడ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. 'నకిలీ సీఐఏ ఏజెంట్' స్కామ్‌లో శ్రీవాస్తవ, అనేక సంవత్సరాలుగా మోసపూరిత కార్యకలాపాలతో అమెరికా జాతీయ భద్రతకు భంగం కలిగించాడనే ఆరోపణలను ఎఫ్‌బీఐ విచారిస్తోంది.ఘోరమైన అబద్ధాలతో వాషింగ్టన్ రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీను బురిడీ కొట్టించాడు. వ్యాపార వేత్తలను నమ్మించి, తనఫౌండేషన్కు భారీనిధులను దక్కించుకున్నాడు. అయితే ఇండియాలోని లక్నోకు చెందిన శ్రీవాస్తవ కాలేజీ డ్రాపౌట్ అని కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా రిపోర్ట్ చేసింది.శ్రీవాస్తవ మోసపూరిత కార్యకలాపాలు అంతర్జాతీయ లావాదేవీలకు కూడా విస్తరించాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. సూడాన్, లిబియాతో సహా ఆఫ్రికాలోని నాయకులను తప్పుదారి పట్టించాడు . అమెరికా ప్రభుత్వ మద్దతు పొందేందుకు తప్పుడు వాగ్దానాలు చేశాడు. వాషింగ్టన్లో, అతను తన చర్యలను చట్టబద్ధం చేయడానికి ఉన్నత అధికారులతో సంబంధాలను మెయింటైన్ చేశాడు. మిస్టర్ జీగా పాపులర్ అయిన శ్రీవాస్తవ బాధితుల్లో నాటో మాజీ కమాండర్ జనరల్ వెస్లీ క్లార్క్ వంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇంకా అట్లాంటిక్ కౌన్సిల్ థింక్ ట్యాంక్, అనేక డెమొక్రాటిక్ నిధుల సేకరణ కమిటీలు, అనేకమంది సెనేటర్లు , కాంగ్రెస్ సభ్యులతో సహా అనేక ఉన్నత స్థాయి వ్యక్తులను మోసగించాడు. నేటర్ మార్క్ వార్నర్, ప్రతినిధి పాట్రిక్ ర్యాన్, జెనీవాకు చెందిన వస్తువుల వ్యాపారి, ఇంకా అనేక మంది ఆఫ్రికన్ నాయకులు ఇండోనేషియా అధ్యక్షుడు కూడా శ్రీవాస్తవ మోసానికి గురి కావడం గమనార్హం. అంతేకాదు తనపై కథనాలను రాసిన మీడియాను కూడా పరువు నష్టం దావాతో బెదరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాలు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో కొందరు ఆయనకు దూరం కాగా, మరికొందరు సంబంధాలను తెంచుకున్నారు.మరోవైపు శ్రీవాస్తవ, అతని భార్య షరోన్‌పై కాలిఫోర్నియాలో రెండు వేర్వేరు మోసం కేసులు నమోదైనాయి. అలాగే లీజు గడువు ముగిసిన తర్వాత 12 మిలియన్ల డార్లు శాంటా మోనికా ఇంటిని ఖాళీ చేయడం లేదని, అద్ద కూడా చెల్లించలేదని ఆరోపిస్తూ ఇంటి యజమాని స్టీఫెన్ మెక్‌ఫెర్సన్, శ్రీవాస్తవపై దావా వేశారు. శ్రీవాస్తవ,అతని భార్య షారోన్ ఆధ్వర్యంలో ‘ది గౌరవ్ & షారన్ శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్’ను కూడా ఉంది. ఆహారం , ఇంధన భద్రత వంటి ప్రపంచ సమస్యలపై ఇది దృష్టి సారిస్తుంది. అయితే తాజా అరోపణల నేపథ్యంలో ఈ ఫౌండేషన్ చట్టబద్ధతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కాగా శ్రీవాస్తవ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యాపారి నీల్స్ ట్రూస్ట్కు అనుమానం రావడంతో ఈ భారీ స్కాం బట్టబయలైంది. అయితే ఇవన్నీ కట్టుకథలని శ్రీవాస్తవ న్యాయవాది కొట్టి పారేశారు. కాలిఫోర్నియాలో వ్యాజ్యాలతో సహా కొన్ని ఖచ్చితమైన ఆధారాలున్నప్పటికీ, శ్రీవాస్తవ అతని న్యాయవాదులు అన్ని ఆరోపణలను ఖండిస్తూనే ఉన్నారు. -
చంపై సోరెన్ రాజీనామా..జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్
రాంచీ : జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు స్వీకరించేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నియామకానికి జార్ఖండ్ ముక్తా మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీలు సోరెన్ ఏకగ్రీవంగా మద్దతు పలికాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హేమంత్ సోరెన్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరారు.రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో ప్రస్తుత జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు.Champai Soren resigns as Jharkhand CM, Hemant Soren stakes claim to form govtRead @ANI Story | https://t.co/Mc2d74htr5#ChampaiSoren #JharkhandCM #HemantSoren pic.twitter.com/T6fkdW4I2Q— ANI Digital (@ani_digital) July 3, 2024 ఈడీ ఆరోపణలపై కోర్టు తీర్పుమనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అవమానం జరిగిందని మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యే సమయంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. చంపై సోరెన్ ఆ పదవి బాధ్యతల్ని స్వీకరించారు. తాజాగా, హేమంత్ సోరెన్‌కు బెయిల్ రావడం.. చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. ఈ అనూహ్య నాటకీయ పరిణామాలతో సీఎం పదవికి రాజీనామా చేయించడం చంపై సోరెన్ తనకు అవమానం జరిగిందని తన సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. -
గొర్రెల స్కాం లో అసలు దొంగలు దూకుడు పెంచిన ఈడీ
-
సీజేఐ పరిశీలనకు.. కేజ్రీవాల్ పిటిషన్
న్యూఢిల్లీ: మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలంటూ ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పరిశీలనకు పంపించనున్నట్లు వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన కేజ్రీవాల్‌కు అనారోగ్య కారణాలతో సుప్రీంకోర్టు జూన్ ఒకటో తేదీ వరకు బెయిలిచ్చిన విషయం తెల్సిందే.జూన్ 2వ తేదీన తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. మంగళవారం కేజ్రీవాల్ పి టిషన్ వెకేషన్ బెంచ్‌లోని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విశ్వనాథన్‌ల ముందుకు వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కేజ్రీవాల్ కొన్ని అత్యవసర వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని, బెయిల్ మరో వారం పొడిగించాలంటూ ఆయన తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వి కోరారు. పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టాలని తెలిపారు. అయితే, ధర్మాసనం ‘వాదనలు విన్నాం. తీర్పు రిజర్వు చేశాం. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచుతున్నాం’ అని తెలిపింది. -
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
రాంచీ: జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్ అలమ్‌ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. రాంచీలోని ఈడీ హెడ్‌క్వార్టర్స్‌లో అలమ్‌ను మంగళవారం(మే14) తొమ్మిది గంటలు ఏకబిగిన ప్రశ్నించిన అనంతరం ఈడీ ఆయనను అరెస్టు చేసింది.గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన అక్రమాల్లో జరిగిన మనీ లాండరింగ్ వ్యవహారంలో అలమ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. కాగా, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ అలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌కుమార్ లాల్ పనిమనిషి ఇంట్లో రూ.37 కోట్ల లెక్కల్లోకి రాని నల్లధనం పట్టుబడిన విషయం తెలిసిందే. పనిమనిషి ఫ్లాట్‌లో గుట్టలుగుట్టలుగా నల్లధనం పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ కూడా ప్రస్తావించడం గమనార్హం. -
ఆ చట్టానికి కోరలు ఎక్కువే!
ప్రారంభం నుంచీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) వరుసగా అనేక సవరణలకు గురై మరింత కఠినంగా మారింది. దాంతో చట్ట అన్వయా నికీ, వ్యక్తిగత స్వేచ్ఛకూ మధ్య సాధించాల్సిన సమతూకపు ఆవశ్యకత పెరుగుతోంది. పీఎంఎల్ఏ నిబంధనలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేదని చెప్పడం ద్వారా ఈడీకి ఉన్న విస్తారమైన అధికారాలను 2002లో సుప్రీంకోర్టు తీర్పు దృఢపరిచింది. ఈ తీర్పు ఫెడరల్ ఏజెన్సీకి అనవసరమైన వెసులు బాటు కల్పించిందని మానవ హక్కుల న్యాయవాదులు విమర్శించారు. ఏ రుజువూ లేకుండానే ఆరు నెలలు నిర్బంధంలో గడిపి, బెయిల్ మీద విడుదలైన ‘ఆప్’ ఎంపీ సంజయ్ సింగ్ కేసు ప్రాథమిక హక్కులపై పీఎంఎల్ఏ కలిగిస్తున్న ప్రభావాలను పునఃపరిశీలించవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్ఎల్ఏ) ఒక ముఖ్యసాధనం. 2005 జూలైలో అమలులోకి వచ్చి నప్పటి నుండి ఈ చట్టం సమూల మార్పులకు గురైంది. 2009, 2012, 2015, 2018, 2019, 2023లో ఈ చట్టానికి చేసిన పలు సవ రణలు... అక్రమ ఆస్తులకు వ్యతిరేకంగా దేశం ప్రదర్శిస్తున్న కఠిన వైఖరిని ప్రతిబింబిస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తాజా పరిణామం... కఠినమైన చట్టాన్ని అన్వయించడంలో న్యాయపరమైన పర్యవేక్షణ, జవాబుదారీతనాలకు సంబంధించిన క్లిష్టమైన అవసరాన్ని గుర్తించింది. మనీలాండరింగ్‌లో తన ప్రమేయం ఉన్నట్లు రుజువు లేకుండానే ఆరు నెలలు నిర్బంధంలో గడిపిన తర్వాత, సింగ్ బెయిల్ పిటీషన్‌పై సవాలు చేయకూడదని ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నిర్ణయించుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా, ప్రత్యేకించి 2022లో ‘విజయ్ మదన్‌లాల్ చౌదరి’ కేసుపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తర్వాత, మనీలాండరింగ్ చట్టం నిబంధనలను రాజ్యాంగ సూత్రా లతో సమతుల్యం చేయాలని సుప్రీంకోర్టును ఎక్కువగా కోరడం జరుగుతోంది. పీఎంఎల్ఏ నిబంధనలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేదని నొక్కి చెబుతూ ఈడీకి ఉన్న విస్తారమైన అధికారాలను ఆ తీర్పు దృఢపరిచింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం (ఈయన పదవీ విరమణ చేశాక లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు), అక్రమాస్తుల నిరోధ సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చర్యల అవసరాన్ని నొక్కి చెప్పింది. పైగా, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) కింద భారతదేశ బాధ్యతలను నెరవేర్చడంలో ఈ చట్టం పాత్రను ధర్మాసనం గుర్తించింది. ఈ తీర్పు ఈడీని బలోపేతం చేసినప్పటికీ, వ్యక్తిగత స్వేచ్ఛలు, విధానపరమైన భద్రతలను పణంగా పెట్టి, ఫెడరల్ ఏజెన్సీకి అనవసరమైన వెసులుబాటు కల్పించిందని న్యాయ నిపుణులు, మానవ హక్కుల న్యాయవాదులు విమ ర్శలు గుప్పించారు. న్యాయం, వ్యక్తిగత హక్కుల ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి బదులుగా, ఈ తీర్పు ఈడీ అధికారాన్ని దుర్వినియోగం చేయగలదనే భయాందోళనలకు తావిచ్చింది. ఈ తీర్పు వెలువడిన కేవలం ఒక నెల తర్వాత, మరో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ దానిపై రివ్యూ పిటిషన్లను అంగీకరించింది. నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) కాపీని తిరస్కరించడం, నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యత నిందితుడి మీద ఉండటం– రెండు అంశాలను పునఃపరిశీలించడానికి ధర్మాసనం అంగీకరించింది. 2022 తీర్పుపై రివ్యూ పిటిషన్ పెండింగులో ఉండగా, వివిధ ఇతర కేసుల్లో మనీలాండరింగ్ చట్టం నిబంధనలను సుప్రీంకోర్టు వివరించాల్సి వచ్చింది, కొన్నిసార్లు ఎన్ఫోర్స్ మెంట్ అధికారాల పరిధిని న్యాయస్థానం పరిమితం చేసింది. తదనంతరం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులలో కొన్ని విజయ్ మదన్ లాల్ చౌదరి తీర్పునకు విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి. ఉదాహరణకు, 2023 అక్టోబర్‌లో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ భిన్నమైన దృక్పథాన్ని తీసుకుంది. మనీలాండరింగ్ కేసుల్లో నిందితులకు వారిని అరెస్టు చేసిన కారణాల కాపీని ఈడీ తప్పనిసరిగా అందించాలని ధర్మాసనం ఆదేశించింది. మౌఖికంగా మాత్రమే సమాచారాన్ని అందించడం రాజ్యాంగ హక్కు ఉల్లంఘనగా పరిగణించబడుతుందని పేర్కొంది. అయితే, 2022 తీర్పు, నిందితు డిని అరెస్టు చేయడానికి గల కారణాలను వెల్లడించడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1)కి తగినంత సమ్మతి కలిగి ఉందని చెప్పింది. వారి అరెస్టుకు కారణాలు తెలియజేయకుండా లేదా వారు ఎంచుకున్న న్యాయవాదిని సంప్రదించే హక్కును తిరస్కరిస్తూ, అరెస్టు చేసిన ఎవరినైనా సరే కస్టడీలో ఉంచకూడదని పేర్కొంది. 2023 తీర్పును సమీక్షించాలని కేంద్రం, ఈడీ గతనెలలో చేసిన అభ్యర్థనను కూడా తోసిపుచ్చడమైనది. అదేవిధంగా, 2023 ఆగస్టులో తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీ మెడికల్ బెయిల్ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పులో, అక్రమాస్తుల నిరోధక చట్టంలోని సెక్షన్ 19 కింద అరెస్టు చేసే అధికారాలను జాగ్రత్తగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. విధాన పరమైన లేదా ముఖ్యమైన ఉల్లంఘనలు ఉన్నట్లయితే, అరెస్టు చేసిన వ్యక్తిని న్యాయమూర్తులు వెంటనే విడుదల చేయాలని ఈ తీర్పు పేర్కొంది. ఈ తీర్పు అధికార దుర్వినియోగాన్ని నిరోధించడంలోనూ, సరైన కారణం లేకుండా అరెస్టులు శిక్షార్హమైనవి కాదని నిర్ధారించడంలోనూ న్యాయవ్యవస్థ పాత్రను బలపరిచింది. 2023 అక్టోబర్‌లో, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన మరో తీర్పు, సత్వర విచారణను కోరుకోవడం ప్రాథమిక హక్కుగా నొక్కి చెప్పింది. అదే సమయంలో అక్రమాస్తుల నిరోధక చట్టంలోని సెక్షన్ 45 ఆరోపించినట్లుగా నేరాభియోగాలకు తాము పాల్పడలేదని నిందితులే రుజువు చేసుకోవాలంటూ వారిపై ప్రాథమికంగా మోపే భారం అనేది వారి బెయిల్ మంజూరుకు సంపూర్ణ అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ‘నిందితుడికి నిమిత్తం లేని కారణాల వల్ల విచారణ కొనసాగనప్పుడు, సరైన కారణాలు ఉంటే తప్ప, బెయిల్ మంజూరు చేసే అధికారాన్ని ఉపయోగించుకునేలా న్యాయస్థానం మార్గనిర్దేశం చేయవచ్చు. విచారణకు సంవత్సరాల కాలం పట్టే చోట ఇది నిజం’ అని చెప్పింది. 2023 నవంబర్‌లో పవన దిబ్బూర్ కేసులో ఇచ్చిన తీర్పులో, మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించడానికి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బీ కింద శిక్షార్హమైన నేరపూరిత కుట్ర మాత్రమే సరిపోదనీ, 2002 చట్టం కింద షెడ్యూల్డ్ నేరంగా ఆ కుట్ర ఉండాలనీ ప్రకటించింది. ఈ తీర్పు ఆధారంగానే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై నమోదైన కేసును సుప్రీంకోర్టు గత నెలలో కొట్టేసింది. సంజయ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం, మనీలాండరింగ్ నిరోధక చట్టం విషయంలో పురోగమిస్తున్న న్యాయశాస్త్రానికి మరొక ఉదాహరణ. రాజకీయ లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టపరమైన యంత్రాంగాలను దుర్వినియోగం చేయకుండా నిరోధించాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తుంది. ఈ కేసు దృఢమైన న్యాయ పరిశీలన ప్రాముఖ్యతను గుర్తుచేస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని అమలు చేయడంలో, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడంలో ప్రభుత్వ అధికారాల మధ్య సమతుల్యతను తిరిగి అంచనా వేయ డానికీ, పునశ్చరణ చేయడానికీ ఒక విస్తృత ధర్మాసనం ద్వారా 2022 తీర్పును సమగ్రంగా సమీక్షించవలసిన అవసరాన్ని కూడా ఇది గుర్తుచేస్తోంది. ఇతర కేసులతో పాటు సంజయ్ సింగ్ కేసు, మనీలాండరింగ్ చట్టపరిధిలో ఉన్న కీలకమైన అంశాన్ని సూచిస్తోంది. ప్రాథమిక హక్కులపై మనీలాండరింగ్ చట్టం కలిగిస్తున్న ప్రభావాలను పూర్తిగా పునఃపరిశీలించవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. స్వేచ్ఛను కాపాడడానికి ఉద్దేశించిన న్యాయం రాజీ పడకుండా చూసేందుకు ఒక విస్తృత ధర్మాసనం ద్వారా పునఃపరిశీలన చేయాలని ఇది సూచిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రాథమిక స్వేచ్ఛలను సవాలు చేస్తూనే ఉన్నందున, అమలు యంత్రాంగాలు న్యాయ, నిష్పక్షపాత సూత్రాలను అధిగమించకుండా చూడటంలో న్యాయవ్యవస్థ జాగ రూకతా పాత్ర అనివార్యమవుతోంది. ఉత్కర్ష్ ఆనంద్ వ్యాసకర్త జర్నలిస్ట్, కాలమిస్ట్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Delhi liquor scam: కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీకి సుప్రీం నోటీస్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ లోగా సమాధానమివ్వాలని ఈడీని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీన చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలన్న అభిషేక్ సింఘ్వి వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం కాదంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 9వ తేదీన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన 15 రోజుల కస్టడీ గడువు ముగియడంతో సోమవారం సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా వర్చువల్‌గా విచారణ చేపట్టారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే కేసులో బీఆర్ఎస్ నేత కె.కవిత తదితర నిందితుల కస్టడీ గడువు కూడా అదే రోజుతో ముగుస్తోందని ఆమె తెలిపారు. -
బీజేపీపైనా చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలపై బీజేపీ నేతలపైనా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మంత్రి అతిశి శనివారం ఎన్నికల కమిషన్(ఈసీ)ని డిమాండ్ చేశారు. బీజేపీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందని శనివారం ఆమె మీడియా సమావేశంలో ఆరోపించారు. బీజేపీలో చేరడమో, ఈడీ అరెస్ట్‌ను ఎదుర్కోవడమో తేల్చుకోవాలంటూ ఆ పార్టీ నేత ఒకరు తనను బెదిరించారంటూ అతిశి చేసిన ఆరోపణలపై ఈసీ ఆమెకు శుక్రవారం నోటీసులిచి్చన విషయం తెలిసిందే. ‘మద్యం కుంభకోణంలో డబ్బు చేతులు మారిందనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకనప్పటికీ కేవలం అనుమానంతోనే ఆప్ నేతలు సంజయ్ సింగ్, మనీశ్ సిసోడియా, సీఎం కేజ్రీవాల్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో నిందితుడొకరు బీజేపీకి కోట్లాది రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందజేసినట్లు ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు’అని ఆమె ప్రశ్నించారు. -
‘గురివింద’ బండారం బట్టబయలు
విశాఖ సిటీ/సాక్షి, అమరావతి: రాజ గురివింద రామోజీ బరితెగించారు. ఎన్నికల వేళ పచ్చ పార్టీకి భారీ మొత్తంలో డబ్బు అక్రమ తరలింపునకు తెగబడ్డారు. రాజకీయంగా చంద్రబాబుకు కొమ్ముకాసే రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ లెక్కా పత్రం లేకుండా విశాఖ నగరంలో భారీగా నగదును తరలిస్తూ అడ్డంగా దొరికిపోయింది. రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో రామోజీ ఆరి్థక అక్రమాల బండారం మరోసారి బట్టబయలైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖ పోలీసు బృందాలు, కేంద్ర బలగాలు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ నగరం ద్వారకానగర్ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఏపీ31సీజీ 7825 నంబరు స్కూటీపై ఇద్దరు వ్యక్తులు సూట్‌కేస్‌తో వెళుతుండగా పోలీసులు వారిని ఆపారు. వారి వద్ద ఉన్న సూట్‌కేసును తనిఖీ చేయగా అందులో రూ.500 నోట్ల కట్టలు, చెక్కులు కనిపించాయి. వాటిని లెక్కించగా రూ.51,99,800 నగదు ఉన్నట్లు తేలింది. రూ.36,88,675 విలువైన 51 చెక్కులను గుర్తించారు. ఆ డబ్బు ఎవరిదని, ఎక్కడకు తీసుకువెళుతున్నారని పోలీసులు ప్రశి్నంచారు. ఇందుకు వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఆ డబ్బు మార్గదర్శి చిట్స్‌కు సంబంధించినదని, ఎవరికీ ఇవ్వడానికి కాదని, బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళుతున్నట్లు బుకాయించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆధారాలు చూపించాలని అడిగినప్పటికీ వారు చూపించలేదు. దీంతో పోలీసులు నగదును స్వా«దీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించారు. అందులో ఒకరు లక్ష్మణరావు మార్గదర్శి చిట్స్‌లో అకౌంట్స్ అసిస్టెంట్‌గా, మరొకరు శ్రీనివాస్ ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. వారు ఆ డబ్బుకు ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు నగదు, చెక్కులను ఎన్నికల అధికారులకు అందజేశారు. వారు ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందజేశారు. గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా తరలింపు! ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పెద్ద మొత్తంలో నగదు తరలిస్తే అందుకు ఆధారాలు ఉండాలి. ఈ విషయం పత్రికాధిపతి రామోజీకి చెందిన సంస్థకు తెలియనిది కాదు. అయినా మార్గదర్శి ద్వారా లక్షలాది రూపాయలు ఎటువంటి ఆధారాలు లేకుండా తరలించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలకు డబ్బు చేరవేసేందుకే ఈ నగదును తీసుకువెళుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేస్తుండటంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో టీడీపీ అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్లు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా విశాఖలో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచిల నుంచి భారీ స్థాయిలో నగదు పంపిణీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే భీమిలిలో ఉన్న ప్రైవేటు పరిశ్రమ నుంచి టీడీపీ నేతలకు రూ.కోట్లు ముట్టినట్లు వార్తలు వినిపించాయి. వాస్తవానికి మార్గదర్శి, ఆ పరిశ్రమ సిబ్బంది చేతుల మీదుగానే రూ.కోట్ల డబ్బు పంపిణీ జరిగిందన్నది బహిరంగ రహస్యమే. ఈ ఎన్నికల్లోనూ అదే పంథాలో డబ్బు పంపిణీకి పూనుకున్నట్లు ఈ వ్యవహారంతో తేటతెల్లమైంది. డిజిటల్ చెల్లింపులేవి రామోజీ! 2022 డిసెంబర్ నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొత్త చిట్టీలు వేయడంలేదు. పాత చిట్టీలే కొనసాగుతున్నాయి. కాలపరిమితి ముగియడంతో చిట్టీలు మూసివేస్తున్నారు. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచిల్లో చిట్టీ గ్రూపుల సంఖ్య సగానికంటే తగ్గిపోయింది. అయినప్పటికీ విశాఖపట్నం బ్రాంచిలో ఖాతాదారుల నుంచి 3 రోజుల్లోనే రూ.51 లక్షలు నగదు రూపంలో వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఆ ప్రకారం నెలకు రూ.5.10 కోట్లు వసూలు చేస్తున్నట్టు. ఇక రాష్ట్రంలోని 37 బ్రాంచిల ద్వారా నెలకు సగటున రూ.188.70 కోట్లు వసూలు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా నగదు రూపంలోనే వసూలు చేస్తున్నట్లు కూడా స్పష్టమవుతోంది. ప్రస్తుతం కిళ్లీ దుకాణాలు, బజ్జీ దుకాణాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు కాబట్టి నగదు లావాదేవీలు జరపకూడదని రామోజీ ఈనాడులో పదేపదే వార్తలు రాయిస్తున్నారు. కానీ ఆయన మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ద్వారా భారీగా నగదు లావాదేవీలే నిర్వహిస్తుండటం గమనార్హం. చందాదారుల నుంచి డిజిటల్/ఆన్ౖలెన్ చెల్లింపులు ఎందుకు స్వీకరించడం లేదు? నగదు రూపంలోనే ఎందుకు తీసుకుంటున్నారన్నప్రశ్న తలెత్తుతోంది. మార్గదర్శి పేరుతో ఎన్నికల్లో టీడీపీకి డబ్బు తరలింపు, భారీగా నల్లధనం చలామణిలోకి తేవడమే లక్ష్యంగా ఈ దందా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. పక్కా మనీ లాండరింగే.. విశాఖలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడటంతో రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో భారీగా నల్లధనం దందా మరోసారి ఆధారాలతోసహా వెలుగులోకి వచ్చింది. ఈ డబ్బు ఎక్కడిదని మార్గదర్శి సిబ్బందిని పోలీసులు ప్రశి్నంచగా పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు యతి్నంచారు. చివరగా గత మూడు రోజుల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో చందాదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కానీ ఆ నగదు, చెక్కులకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలీసులు వాటిని జప్తు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మనీ లాండరింగ్‌కు పాల్పడుతోందని గతంలో స్టాంపులు–రిజి్రస్టేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో వెల్లడైన విషయం వాస్తవమేనని ఈ ఘటన మరోసారి రుజువుచేసింది. చిట్‌ఫండ్స్ చట్టం ప్రకారం ఒక బ్రాంచిలో వసూలు చేసే మొత్తాన్ని అదే బ్రాంచి పరిధిలో బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఇతర బ్యాంకుల్లోని ఖాతాల్లోకి మళ్లించకూడదు. రామోజీరావు ఈ నిబంధనలను ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చందాదారుల సొమ్మును హైదరాబాద్‌లోని తమ ప్రధాన కార్యాలయం ఖాతాకు మళ్లిస్తూ వచ్చారు. అదే రీతిలో చందాదారుల సొమ్మును సోమవారం విశాఖలో ఇతరత్రా అవసరాలకు మళ్లిస్తూ పోలీసులకు చిక్కినట్లు స్పష్టమైంది. -
నగదు లావాదేవీల సమాచారమివ్వండి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..అక్రమ డబ్బు రవాణాను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాతాదారులు ఎవరైనా రూ.లక్ష కంటే ఎక్కువ డిపాజిట్, విత్ డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించింది. ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షలకు పైగా నగదును ఖాతాదారుడు తీసుకున్నా జిల్లా ఎన్నికల అధికారికి, ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారికి తెలపాలని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం తన పేరుతో లేదా ఏజెంట్ పేరుతో కలిపి బ్యాంకు, పోస్టాఫీసుల్లో ప్రత్యేకంగా అకౌంట్ లేదా ఉమ్మడి అకౌంట్ తెరవవచ్చని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు తెరవాలని అన్ని బ్యాంకులకు ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. -
Delhi excise policy case: కేజ్రీవాల్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. మద్యం విధానం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించనందున ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఈడీ కోర్టులో రెండుసార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, మొదటి ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేజ్రీవాల్ శనివారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ రెండో ఫిర్యాదుపై మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదు పత్రాలను కేజ్రీవాల్‌కు అందజేయాలని ఈడీని ఆదేశించింది. -
మనీలాండరింగ్ కేసు: టీఎంసీ ఆస్తులు ఈడీ అటాచ్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. రూ.10.29 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ సోమవారం పేర్కొంది. ఆల్కెమిస్ట్ గ్రూప్, ఇతరులు చేసిన మనీలాండరింగ్ నేరంపై విచారణ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రూ. 10.29 కోట్లను ఈడీ టెండర్ చేసిన డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) రూపంలో అటాచ్ చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లు ఉపయోగించిన విమాన/హెలికాప్టర్ సేవలకు పలు విమానయాన కంపెనీలకు ఆల్కెమిస్ట్ గ్రూప్ దాదాపు రూ.10.29 కోట్లు చెల్లించినట్లు ఈడీ పేర్కొంది. ఇక.. అప్పటి ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు అయిన.. సీఎం మమతా బెనర్జీ, పార్టీ ఎమ్మెల్యే, మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్, నటుడు మూన్‌మూన్ సేన్, ఎంపీ నుస్రత్ జహాన్ కోసం టీఎంసీ విమాన సేవలు ఉపయోగించినట్లు ఈడీ తెలిపింది. ప్రజల డబ్బులో కొంత సొమ్మును టీఎంసీ ప్రచారంలో విమానయాన కంపెనీలకు చెల్లించేందుకు సదరు ఆల్కెమిస్ట్ గ్రూప్‌ను ఉపయోగించుకున్నట్లు ఈడీ విచారణలో నిర్ధారణ అయింది. ఈ ఆల్కెమిస్ట్ గ్రూప్.. టీఎంసీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కేడీ సింగ్‌ది కావటం గమనార్హం. -
Aam Aadmi Party: అతి త్వరలోనే కేజ్రీవాల్ అరెస్ట్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను త్వరలోనే అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నాలు చేస్తోందని శుక్రవారం ఆప్ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఆప్ చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీలో భయం మొదలైందని పేర్కొంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేసేందుకే తమ నేత కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆరోపించింది. ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఆప్, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు కొలిక్కి వచ్చిన విషయం తెలియగానే ఈడీ గురువారం కేజ్రీవాల్‌కు ఏడో విడత నోటీసులిచ్చిందని ఆయన చెప్పారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. శుక్రవారం సాయంత్రానికల్లా కేజ్రీవాల్‌కు నోటీసులు అందజేస్తుందని, రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తుందని ఆయన అన్నారు. -
గుర్తుపట్టారా? ఒకప్పుడు ‘బాగా రిచ్’.. ఇప్పుడు షార్ప్‌షూటర్లు మధ్య జైలు జీవితం!
ఓ వ్యక్తి ఫోటో ప్రస్తుతం అటు వ్యాపార ప్రపంచంలో ఇటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెల్లని గడ్డం.. సాదాసీదా బట్టలు. కళ్లల్లో అన్నీ కోల్పోయామనే బాధ, ఆ చూపులో తప్పు చేశాననే పశ్చాత్తాపం స్పష్టంగా కనపడుతుంది. ఒకప్పుడు విమానయాన రంగంలో రారాజులా వెలిగిన ఓ బడా వ్యాపారవేత్త. వందల్లో విమానాలు, వేల కోట్లల్లో ఆస్తులు. పిలిస్తే పలికే మంది మార్బలం. ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు. ఒక్క చిటికేస్తే ఆయన ఏం కోరుకున్నా క్షణాల్లో జరిగే పవర్స్. కానీ కాలం కలిసి రాకపోతే అది కొట్టే దెబ్బలకు ఎవరూ అతీతులు కారు. అలా కాలం ఈడ్చి కొట్టిన దెబ్బకి ఇప్పడు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. రూ.538.62 కోట్ల రుణాల ఎగవేతకు పాల్పడి కరడు గట్టిన నేరస్థులు, షార్ప్‌షూటర్లు, గూండాలతో కలిసి జైలు జీవితం అనుభవిస్తున్నారు. కడవరకు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తనకే తెలియని దిక్కుతోచని స్థితిలో కోర్టును చావును ప్రసాదించమని కోరారు. సమాజంలో బతకలేక.. జైలులో చనిపోయేందుకు అనుమతి అడిగారు. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎంతటి శత్రువుకైనా తలెత్తకూడదని కోరుకుంటూ నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆయనను గుర్తు పట్టారా? ఇంతకీ ఆఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? బ్యాంకు రుణాల ఎగవేత కేసులో జైలు పాలైన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ది. నాలుగు నెలలుగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఈయన ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో జాతీయ మీడియా ఆయనను ఫోటోలు తీసింది. ఇక జనవరి 26న ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల సూచనల మేరకు తనని ప్రైవేట్ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అమనుమతి కావాలని పిటిషన్లో కోరారు. ఎస్కార్ట్‌తో ప్రైవేట్ ఆస్పత్రికి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎంజే దేశ్‌పాండే..‘నరేష్ గోయల్ ఆరోగ్య పరిస్థితిని ఇప్పటికే (చివరి విచారణలో) గుర్తించాము. ఎవరి సహాయం లేకుండా తనంతట తానుగా నిలబడలేకపోతున్నారు. కాబట్టి అతని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఎస్కార్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్ ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారను కాబట్టి ఎస్కార్ట్ కోసం అయ్యే ఖర్చును గోయల్ చెల్లిస్తారని తెలిపారు. -
ఈడీ ఎదుటకు కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: 2011లో కొందరు చైనీయులకు వీసాల జారీకి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఈడీ అధికారులు ఈ నెల 12, 16వ తేదీల్లో కూడా కార్తీకి సమన్లు పంపారు. అయితే, అవసరమైన పత్రాల సేకరణకు సమయం కావాలంటూ ఆయన విచారణకు హాజరుకాలేదు. పంజాబ్‌లో ఏర్పాటవుతున్న ఒక విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును చైనా కంపెనీ తీసుకుంది. ఈ కంపెనీ గడువులోగా పనులను పూర్తి చేయలేదు. దీంతో, 263 మంది చైనా సిబ్బందికి దేశంలో ఉండేందుకు అవసరమైన వీసాలను మళ్లీ మంజూరు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వీసాల మంజూరు కోసం 2011లో కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు రూ.50 లక్షలు ముట్టినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రశ్నించేందుకే ఈడీ అధికారులు కార్తీకి నోటీసులు పంపారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంను వేధించే చర్యల్లో భాగంగానే తనపై కక్షగట్టారని కార్తీ ఆరోపిస్తున్నారు. ఒక్క చైనీయుడి వీసా మంజూరుకు కూడా తాను ఎన్నడూ సాయపడలేదన్నారు. కార్తీ చిదంబరంపై ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసుల్లో మనీలాండరింగ్ ఆరోపణల కింద ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తోంది. -
జార్ఖండ్ సీఎం సోరేన్‌కు ఆరోసారి ఈడీ సమన్లు..
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఆరోసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు లావాదేవీలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ సోరేన్‌పై కేసు నమోదు చేసింది.ఈ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందుకు రావాల్సిందిగా ఈడీ హేమంత్ సోరెన్‌కు వరుసగా ఆరోసారి సమన్లు పంపింది. సోరేన్ మంగళవారం తమ ముందు హాజరయ్యే అవకాశం ఉందని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. రాంచీలోని జోనల్ ఆఫీసులో ఆయనను విచారించనున్నట్లు చెప్పారు. గతంలో ఇదే కేసులో ఐదోసారి ఈడీ పంపిన సమన్లపై సోరేన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈడీ పంపిన సమన్లపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఇదీచదవండి..ఎదురెదురుగా ఢీకొన్న హైస్పీడ్,ఎక్స్‌ప్రెస్ రైళ్లు -
డీకే శివకుమార్ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతిచ్చింది. కాప్ 28 లోకల్ క్లైమేట్ యాక్షన్ సదస్సులో పాల్గొనేందుకుగాను డిప్యూటీ సీఎం హోదాలో శివకుమార్ దుబాయ్ వెళ్లనున్నారు. ఈనెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు దుబాయ్‌లో ఉండేందుకు డీకేకు కోర్టు అనుమతిచ్చింది. డీకే విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చే సందర్భంలో కోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సాధారణంగా ఒక పౌరుడు విదేశాలకు వెళ్లడం అనేది అతని ప్రాథమిక హక్కులో భాగం. అయితే ఇది పరిమితులు లేని హక్కు కాదు. కేసుల్లో నిందితులు విదేశాలకు పారిపోకుండా చూసేందుకు ఈ హక్కుపై పరిమితులు విధించవచ్చు. అయితే ఇక్కడ అనుమతి అడుగున్నది 8 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుత డిప్యూటీ సీఎం శివకుమార్ అయినందున అనుమతిస్తున్నాం. ఎందుకంటే ఇంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన పారిపోయే అవకాశాలు తక్కువ’అని కోర్టు పేర్కొంది. అయితే డీకే దుబాయ్ వెళ్లేందుకు అనుమతిచ్చిన కోర్టు కొన్ని షరతులు పెట్టింది. 5 లక్షల రూపాయల డిపాజిట్‌తో పాటు ప్రయాణానికి సంబంధిచిన పూర్తివివరాలు, అక్కడ వాడే మొబైల్ నెంబర్ అందించాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన డీకే శివకుమార్‌కు 2019 అక్టోబర్ 23న కోర్టు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన బెయిల్‌పైనే ఉన్నారు. ఇదీచదవండి..వర్షంలో శరద్‌పవార్ స్పీచ్..సెంటిమెంట్ ఏంటంటే.. -
Land-for-jobs case: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం.. లాలూ సన్నిహితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ల సన్నిహితుడు అమిత్ కట్యాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు సమన్లు జారీ చేసినా అతడు తప్పించుకు తిరుగుతున్నాడని ఈడీ తెలిపింది. కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం రిమాండ్ కోరుతామని ఈడీ వివరించింది. ఈ కేసులో ఈడీ సమన్లను కొట్టివేయాల్సిందిగా అతడు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల కొట్టివేసినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో లాలూ, తేజస్వీ యాదవ్, లాలూ కుమార్తెలు తదితరులతోపాటు కట్యాల్ ఇంటిపైనా ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉండగా ఈ కుంభకోణం జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. -
పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు?
గుంటూరు: చంద్రబాబు నాయుడు తనను అరెస్టు చేస్తారని చెప్పుకుంటూ ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని.. తప్పుచేశారు కాబట్టే ఆయన భయపడుతున్నారని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన నేరానికి ఐటీశాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అరెస్టు భయం పుట్టుకున్న చంద్రబాబు ప్రజల వద్ద సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అంబటి రాంబాబు. చట్టం దృష్టిలో చంద్రబాబు అయినా ఒకటే మరో బాబు అయిన ఒకటేనని చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందని ఆయన తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారని నాకు అనిపిస్తోందన్నారు. బహుశా ఆయనను అరెస్ట్ చేస్తారని ఆయనకు కలవచ్చినట్టుంది. చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే అరెస్టు చేస్తారు, అరెస్టు చేయాల్సిన అవసరం లేకపోతే అరెస్టు చేయరని అన్నారు. అలాగని చట్టానికి అడ్డం వస్తే ఆయన్ని తప్పకుండా అరెస్టు చేస్తారని ప్రాథమిక ఆధారాలు లేనిదే ఎవరి మీద ఏ విధమైన కేసులు పెట్టరని అన్నారు. దీనిని అవకాశంగా తీసుకుని చంద్రబాబు ప్రజల్లో సానుభూతి పొందే మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు దొంగైనా పవన్ కళ్యాణ్ నోరు విప్పడు. చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నారన్న ఆధారాలున్నా కూడా పవన్ కళ్యాణ్ నోరు విప్పడు సరికదా ఆయన హీరోనే అంటాడని వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం అలాంటిదని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చిన ఇదే అంశంపై మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ తప్పు చేస్తే అరెస్టు చేయక ముద్దుపెట్టుకుంటారా అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి పనులు చేస్తే అరెస్ట్ చెయ్యక ముద్దు పెట్టుకుంటారా? ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. పాలు అమ్మితే పదివేల కోట్ల ఆదాయం వచ్చిందా.. పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదని దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకే చంద్రబాబు పాల వ్యాపారం చేస్తున్నార్నయి అన్నారు. . అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే వాటి గురించి ప్రజలు చెప్పాలి.. అంతే తప్ప చంద్రబాబు సెల్ఫీలు తీసుకొని అన్నీ నేనే చేశానని చెప్పుకోవడమేంటో నాకైతే అర్ధం కాలేదన్నారు. మాట్లాడితే హైదరాబాద్ నేనే కట్టానంటారు కానీ చంద్రబాబు అక్కడ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు. పిట్టలదొర లేని లోటుని ఆయన తీరుస్తున్నారని రాష్ట్రంలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే సంపదని దోచుకోవాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇది కూడా చదవండి: మార్గదర్శి మా జీవితాల్ని నాశనం చేసింది: బాధితురాలు -
బాబూ! ఆ డబ్బెక్కడిది?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేతికి ముట్టిన రూ.118 కోట్ల అక్రమ ధనం గురించి ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించింది. ఐటీ రిటర్నుల్లో చూపని ఈ రూ.118 కోట్లనూ అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 4వ తేదీన ఈ నోటీసులు జారీ చేసినట్లు ప్రముఖ జాతీయ ఇంగ్లిష్ దినపత్రిక ‘హిందుస్థాన్ టైమ్స్’ శుక్రవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఇన్ఫ్రా కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లను లెక్క చూపని ఆదాయంగా పరిగణిస్తూ... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఆగస్టు 4న చంద్రబాబుకు జారీ చేసిన ఈ షోకాజ్ నోటీసులపై ఆ పత్రిక సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక ప్రచురించిన కథనం మేరకు వివరాలివీ... మనోజ్ వాసుదేవ్ సోదాల్లో విషయం వెలుగులోకి... మనోజ్ వాసుదేవ్పార్థసాని 2017 నుంచీ షాపూర్జీ పల్లోంజీ సంస్థ పాల్గొనే టెండర్ల ప్రక్రియలో చురుగ్గా ఉంటున్నారు. ఆ సంస్థ తరఫున ఈయనే మధ్యవర్తిగా వ్యవహారాలు నడిపేవారు. ఈయనకు చెందిన మనోజ్ పార్థసాని అసోసియేట్స్ కార్యాలయంలో 2019లో ఐటీ శాఖ అధికారులు జరిపిన సోదాలతో చంద్రబాబు నాయుడు గుట్టుగా సాగించిన అవినీతి బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల పేరుతో షాపూర్జీ పల్లోంజీ నుంచి భారీ ఎత్తున నగదును తరలించినట్లు మనోజ్ వాసుదేవ్ అంగీకరించారని కూడా గతంలో ఐటీశాఖ తన నివేదికలో వెల్లడించింది. సోదాల సమయంలో కొన్ని మెసేజ్‌లు, వాట్సాప్ చాటింగ్స్, ఎక్సెల్ షీట్లను మనోజ్ వాసుదేవ్ నుంచి స్వాధీనం చేసుకున్నామని, అందులో కొన్ని ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీల నుంచి నగదును అక్రమంగా తరలించి ‘మీకు చేరుస్తున్నాం’ అని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నట్లు ఐటీ శాఖ వివరించింది. ఆ నోటీసుల ప్రకారం మనోజ్ పార్థసాని చంద్రబాబు నాయుడుకి చెందిన వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్‌తో 2016 నుంచీ సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని శ్రీనివాస్ తనను అడిగినట్లు కూడా మనోజ్ వాసుదేవ్ అప్పట్లో వెల్లడించారని ఐటీ పేర్కొంది. అయితే షాపుర్జీ పల్లోంజీ సంస్థ బడా కార్పొరేట్ కంపెనీ కనక... డబ్బును తరలించడానికి వారంతా కలిసి ఓ తెలివైన మార్గాన్ని ఎంచుకున్నారు. వాస్తవంగా ఎటువంటి పనులు చేయకుండానే షాపూర్జీ పల్లోంజీ నుంచి వివిధ ప్రాజెక్టులు చేసినట్లుగా షెల్ కంపెనీల ద్వారా నకిలీ బిల్లులు పెట్టి ఆయా కంపెనీలకు నగదును తరలించారు. ఈ విషయాన్ని 2019 నవంబరు 1న ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా మనోజ్ పార్థసాని తెలియజేశారు. కేవలం షాపుర్జీ పల్లోంజీయే కాకుండా ఎల్అండ్టీ వంటి ఇన్ఫ్రా కంపెనీల నుంచి ఫోనిక్స్ ఇన్ఫ్రా, పోర్ ట్రేడింగ్ వంటి షెల్ కంపెనీలకు నకిలీ బిల్లుల ఆధారంగా నగదును తరలించినట్లు ఐటీ శాఖకు అర్థమయింది. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఆ డబ్బుకు లెక్కలు చెప్పాలని, అవి ఎలా వచ్చాయో తెలియజేయాలని బాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చింది. శ్రీనివాస్ నుంచి చంద్రబాబు నాయుడుకు నగదు చేరినట్లుగా ధ్రువీకరించే ఆధారాలను, నేరాన్ని ధ్రువపరిచే వివిధ సందేశాలు, చాట్లు, ఇంకా ఎక్సెల్ షీట్లను సైతం సెర్చ్ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నట్లు డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ సాక్ష్యాలను మనోజ్ వాసుదేవ్‌కు చూపించి విచారించగా ఇన్ఫ్రా కంపెనీల నుంచి బోగస్ కాంట్రాక్టుల ద్వారా నగదును ఎలా తరలించారన్న విధానాన్ని మొత్తం వివరించినట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ బోగస్ కంపెనీల ద్వారా తరలించిన నగదు ద్వారా అంతిమంగా లబ్థి పొందింది చంద్రబాబేనని ఐటీ శాఖ పేర్కొంది. మనోజ్ వాసుదేవ్ ద్వారా సబ్‌కాంట్రాక్టుల ద్వారా అందుకున్న రూ.118,98,13,207 మొత్తాన్ని 2020–21లో వచ్చిన అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది. అమిత్ షాను బాబు కలవటంపై అనుమానాలు!! 2024 ఎన్నికల్లో బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరినీ ప్రాధేయపడుతూ నానా తంటాలూ పడుతున్న వేళ ఈ నోటీసులు రావటంపై ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్‌లో చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం కావటాన్ని కూడా హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ప్రస్తావించింది. ఈ నోటీసుల విషయమై తాము అటు చంద్రబాబు నాయుడిని, ఇటు కేంద్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖలను ఈ మెయిల్ ద్వారా సంప్రదించామని, ఎవ్వరూ స్పందించలేదని కూడా పత్రిక వెల్లడించింది. లెక్క తేలని మొత్తం రూ.2,000 కోట్లు అమరావతిలో రాజధాని పేరిట తాత్కాలిక భవనాలను నిర్మించిన చంద్రబాబు... అందులో భారీ కుంభకోణానికి తెగబడినట్లు తాజా ఐటీ నోటీసులతో మరోసారి బట్టబయలైంది. తాత్కాలిక నిర్మాణాల పేరుతో పనుల అంచనా విలువలను భారీగా పెంచేసి అడ్డగోలుగా దోపిడీ చేసిన వైనాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. తాత్కాలిక సచివాలయాన్ని రూ.181 కోట్లతో పూర్తి చేయాలని తొలుత అంచనా వేసుకుంటే దాన్ని పెంచుకుంటూ రూ.1,151 కోట్లు ఖర్చు చేశారంటే... అంచనాలు ఎన్ని రెట్లు పెంచారో, అడ్డగోలు దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో తేలిగ్గానే అర్థమవుతుంది. 2020, ఫిబ్రవరి నెలలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌పై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రూ.2,000 కోట్ల వరకు లెక్క చూపని ఆదాయానికి సంబంధించిన లావాదేవీలు బయటకు తీసిన విషయాన్ని ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులతో సహా అప్పట్లోనే ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. ఒకే కంప్యూటర్ నుంచి ఆయా సంస్థలకు చెందిన బిల్లుల చెల్లింపులు, ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. చంద్రబాబు కొండంత అవినీతి చేస్తే మచ్చుకు రూ.2,000 కోట్లు మాత్రమే బయటకు వచ్చాయని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని భారీ మొత్తాలు వెలుగులోకి వస్తాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అడ్డగోలు వాదన... బాబుకు అలవాటే!! చంద్రబాబు నాయుడికైనా, రామోజీరావుకైనా అడ్డంగా వాదించటం పెన్నుతో పెట్టిన విద్య. ఎందుకంటే వీళ్లను ఎవరైనా ‘మీరు ఈ నేరం చేశారా?’ అని అడిగితే... తాము చేస్తే చేశామనో, లేకపోతే చేయలేదనో వీళ్లు నేరుగా చెప్పరు. చేసిన నేరాన్ని తప్పించుకోవటానికి ముందుగా ఎదుటి వ్యక్తికి తమను అడిగే అర్హత లేదనో, లేకపోతే తమకు ఆ చట్టం వర్తించదనో, లేకపోతే ఫలానా చట్టం ప్రకారం తమను ప్రశ్నించజాలరనో ఎదురు తిరుగుతారు. అలా... కేసును దశాబ్దాల పాటు సాగదీస్తారు. పైపెచ్చు తమపై ఎలాంటి కేసులూ రుజువు కాలేదని, తాము శుద్ధపూసలమని చెబుతుంటారు. అసలు విచారణ జరగనిస్తే కదా... వీళ్లు తప్పు చేశారో లేదో తేలటానికి!!. ఇదే రీతిలో ఐటీ శాఖ నోటీసులకు కూడా చంద్రబాబు నాయుడు విచిత్రమైన సమాధానమిచ్చారు. సోదాల్లో చంద్రబాబు నాయుడి పాత్రను బయటపెట్టే ఆధారాలు లభించటంతో... నేరుగా ఆయన ఖాతాల్లోకి ఎంత ముడుపులు వెళ్లాయనే విషయమై ఒక అంచనాకు వచ్చి... అది ఎలా వచ్చిందో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు దానికి నేరుగా సమాధానమివ్వకుండా... తనకు నోటీసులిచ్చే అధికారం సదరు సెంట్రల్ సర్కిల్ అధికారికి లేదంటూ జవాబిచ్చారు. దాన్ని పరిశీలించిన ఐటీ శాఖ... సెక్షన్లను ఉటంకిస్తూ సదరు కేసును ఆ అధికార పరిధి ఉన్న డిప్యూటీ కమిషనర్‌కు బదిలీ చేస్తూ... డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. దీన్ని అక్రమ ఆదాయంగా పేర్కొంటూ చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఆగస్టు 4న జారీ చేసిన నోటీసుల్లో ప్రశి్నంచింది. ఇది కూడా చదవండి: ప్రభుత్వ చర్యలు భేష్.. సీఎం జగన్‌కు యూనిసెఫ్ టీమ్ అభినందన