శావో పాలో: ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు పీలే తనయుడు ఎడిన్హో(43)కు బ్రెజిల్ కోర్టు 33 ఏళ్ల జైలు విధించింది. మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేసే వ్యక్తులతో నగదు బదిలీ వ్యవహారాలు నడిపినందుకు అతడికి కోర్టు ఈ శిక్ష విధించిందని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే తనపై మోపిన అభియోగాలను ఎడిన్హో తోసిపుచ్చాడు. ఫ్రీ పెండింగ్ అప్పీలుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు.
ఎడిన్హోతో పాటు మరో ముగ్గురికి కూడా కోర్టు 33 ఏళ్ల చొప్పున కారాగార శిక్ష ఖరారు చేసింది. వీరి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. వీరి వద్దనున్న 100 కార్లను కూడా స్వాధీనం చేసుకోవాలని సూచించింది. రొనాల్డో నాదిన్హో నాయకత్వంలోని ముఠాతో ఎడిన్హో వ్యవహారాలు నడిపినట్టు అభియోగాలు మోపారు. ఈ ముఠా నుంచి మాదకద్రవ్యాలు కొన్నట్టు ఎడిన్హో అంగీకరించాడు. అయితే ఈ ముఠాతో కలిసి పనిచేయలేదన్నాడు.
పీలే కొడుక్కి 33 ఏళ్ల జైలు శిక్ష
Published Sun, Jun 1 2014 4:27 PM | Last Updated on Fri, May 25 2018 2:37 PM
Advertisement