pele
-
మెస్సీ కాదు!.. నేనే అత్యుత్తమ ఆటగాడిని: రొనాల్డో
దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఫుట్‌బాల్ ప్రపంచంలో మకుటం లేని మహారాజులుగా వెలుగొందుతున్నారు పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)- అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సీ(Lionel Messi). అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకునే ఈ ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈ వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప అన్న చర్చ ఎప్పుడూ ఆసక్తికరమే.ఈ విషయంపై రొనాల్డో స్వయంగా స్పందించాడు. చాలా మంది మెస్సీకే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) బిరుదు ఇచ్చేందుకు మొగ్గుచూపవచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే, తాను మాత్రం పరిపూర్ణ ఫుట్‌బాలర్‌ని అని పేర్కొన్న రొనాల్డో.. ఫుట్‌బాల్ చరిత్రలో తన కంటే గొప్ప ఆటగాడు లేడని అనడం విశేషం.నేనే ‘కంప్లీట్ ప్లేయర్’స్పానిష్ మీడియా అవుట్లెట్ లాసెక్టా టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతూ.. ‘‘నాలాగా ప్రపంచంలో పరిపూర్ణమైన ఫుట్‌బాలర్ మరెవరూ లేరని అనుకుంటా. ఇప్పటి వరకు ఉన్న ఫుట్‌బాల్ ఆటగాళ్లందరిలో నేనే ‘కంప్లీట్ ప్లేయర్’. నేను అన్ని రకాలుగా ఫుట్‌బాల్ ఆడగలను. చాలా మంది మెస్సీ, మారడోనా లేదంటే.. పీలే పేరు చెప్తారేమో!చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడినివాళ్ల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఏదేమైనా మోస్ట్ కంప్లీట్ ప్లేయర్ మాత్రం నేనే! ఫుట్‌బాల్ చరిత్రలోనే నేను అత్యుత్తమ ఆటగాడిని. నా కంటే మెరుగ్గా ఆడే ఫుట్‌బాలర్‌ను ఇంత వరకూ చూడలేదు. ఇవి నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు’’ అని పేర్కొన్నాడు.అదే విధంగా మెస్సీతో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘మెస్సీతో నాకు ఎప్పుడూ ఎలాంటి సమస్యా లేదు. గత పదిహేనేళ్లుగా మేము అవార్డులు పంచుకుంటున్నాం. మా మాధ్య ఎలాంటి గొడవలు లేవు. అంతా సవ్యంగానే ఉంది.తనకోసం నేను ఆంగ్లాన్ని తర్జుమా చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో భలే సరదాగా ఉండేవాళ్లం. ఇక ఆటగాళ్లుగా మేము ప్రత్యర్థులమే కదా. తను తన క్లబ్‌కి, నేను నా క్లబ్‌కి మద్దతుగా ఉంటాం. జాతీయ జట్ల విషయంలోనూ అంతే. అయితే, ఆటతీరు ఎలా ఉందన్న అంశంపై పరస్పరం చర్చించుకుంటూ.. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. మా మధ్య ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పోటీయే ఉంటుంది’’ అని రొనాల్డో తెలిపాడు.కాగా 2002లో పోర్చుగీస్ క్లబ్ స్పోర్టింగ్ జీపీ తరఫున ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా ఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. క్లబ్, అంతర్జాతీయ స్థాయిలో కలిపి ఓవరాల్‌గా 923 గోల్స్‌తో టాప్ గోల్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించిన రొనాల్డోకు ఫిఫా వరల్డ్‌కప్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 648 మిలియన్ల మంది ఫాలోవర్లుఅయితే, ఈ విషయంలో మెస్సీదే పైచేయి. కెప్టెన్‌గా అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన ఘనత అతడికి దక్కింది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫాలోవర్ల విషయంలోనూ రొనాల్డో- మెస్సీ మధ్య పోటీ ఉంది. అయితే, ఇందులో పోర్చుగీస్ ఆటగాడిదే ఆధిపత్యం. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు రొనాల్డోకు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి ఏకంగా 648 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. మెస్సీకి 504 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత
ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు మారియో జగల్లో (92) తుది శ్వాస్ విడిచారు. వయసు పైబడటంతో పాటు శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినడంతో మారియో కన్నుమూశారు. నాలుగు సార్లు వరల్డ్‌కప్ విన్నర్ అయిన మారియో.. మునుపటి తరం మేటి ఆటగాళ్లలో చివరివాడు. మారియో మరణవార్త తెలిసి ఫుట్‌బాల్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. మారియో అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. మారియో బ్రెజిల్ ఫుట్‌బాలర్‌గానే కాకుండా ఆ జట్టుకు కోచ్‌గా కూడా సేవలందించాడు. మరో ఫుట్‌బాల్ దిగ్గజం పీలే సమకాలీకుడైన మారియో.. పీలేతో కలిసి 1958, 1962 ప్రపంచకప్‌లు గెలిచాడు. 1970లో వరల్డ్‌కప్ గెలిచిన బ్రెజిల్ జట్టుకు మారియో మేనేజర్‌గా పని చేశాడు. ఆ జట్టుకు పీలే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే 1994 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టుకు మారియో కో ఆర్డినేటర్‌గా పని చేశాడు. 2002లో వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టుకు మారియో అడ్వైజర్‌గా వ్యవహరించాడు. బ్రెజిల్ ప్రపంచకప్ గెలిచిన ప్రతి సందర్భంలో మారియో ఆ బృందంలో ఏదో ఒక రకంగా భాగమై ఉన్నాడు. -
ఆర్టిఫిషియల్ ఇంటలెజిన్స్ మాయ.. మన స్పోర్ట్స్ స్టార్స్ చిన్నపుడు ఇలా!
-
పీలే రికార్డును బద్దలు కొట్టిన నెమార్
సావోపావ్లో: బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నెమార్ కొత్త రికార్డు సృష్టించాడు. బొలీవియాతో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో నెమార్ నమోదు చేసిన గోల్ అతని కెరీర్లో 78వది. దాంతో ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్, దిగ్గజ క్రీడాకారుడు పీలే పేరిట ఉన్న 77 గోల్స్ రికార్డు బద్దలైంది. చదవండి: దాయాదుల పోరుకు రంగం సిద్ధం.. ఆటనా... వర్షమా! -
ఫుట్‌బాల్ దిగ్గజం హబీబ్ ఇకలేరు.. చిరస్మరణీయ క్షణాలు అవే!
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, 70వ దశకంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న మొహమ్మద్ హబీబ్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. హైదరాబాద్‌కు చెందిన హబీబ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 18 ఏళ్ల పాటు అక్కడే 1970లో మరో హైదరాబాదీ సయ్యద్ నయీముద్దీన్ నాయకత్వంలో బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో హబీబ్ కీలక సభ్యుడు. అయితే హబీబ్ కెరీర్ అత్యుత్తమ దశ కోల్‌కతాలోనే గడిచింది. 1966నుంచి 1984 వరకు దాదాపు 18 ఏళ్లు పాటు ఆయన అక్కడ ప్రధాన ఆటగాడిగా కొనసాగడం విశేషం. చిరస్మరణీయ క్షణం అదే మిడ్‌ఫీల్డర్‌గా మూడు ప్రఖ్యాత క్లబ్‌లు మోహన్‌బగాన్, ఈస్ట్ బెంగాల్, మొహమ్మదాన్ స్పోర్టింగ్‌లకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. హబీబ్ కెరీర్లో చిరస్మరణీయ క్షణం 1977లో వచ్చింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో హబీబ్ మోహన్‌బగాన్ తరఫున బరిలోకి దిగగా...ప్రత్యర్థి టీమ్ కాస్మోస్ క్లబ్లో ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లు పీలే, కార్లోస్ ఆల్బర్టో ఉన్నారు. నాడు పీలే ప్రత్యేక అభినందనలు మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగియగా, ఇందులో హబీబ్ కూడా ఒక గోల్ చేశారు. మ్యాచ్ అనంతరం పీలే ప్రత్యేకంగా హబీబ్‌ను పిలిచి ఆయన ఆటను ప్రశంసించడం విశేషం. ప్రతిష్టాత్మక డ్యురాండ్ కప్ మూడు వేర్వేరు ఫైనల్ మ్యాచ్‌లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడిగా ఇప్పటికీ హబీబ్ రికార్డు నిలిచి ఉంది. జాతీయ ఫుట్‌బాల్ టోర్నీ ‘సంతోష్ ట్రోఫీ’ని ఏకైక సారి ఆంధ్రప్రదేశ్ జట్టు 1966లో గెలుచుకుంది. పదేళ్ల పాటు భారత జట్టుకు ఆడి నాడు ఏపీ తరఫున చెలరేగిన హబీబ్...ఫైనల్లో బెంగాల్‌నే ఓడించడం ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం. పదేళ్ల పాటు (1965–75) భారత జట్టు తరఫున ఆడిన హబీబ్‌ను కేంద్ర ప్రభుత్వం 1980లో ‘అర్జున’ పురస్కారంతో గౌరవించింది. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత టాటా ఫుట్‌బాల్ అకాడమీకి, భారత్ ఫుట్‌బాల్ సంఘానికి చెందిన అకాడమీకి కూడా కోచ్‌గా వ్యవహరించారు. చదవండి: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. సౌతాఫ్రికా సిరీస్ నుంచి కెప్టెన్ ఔట్..! -
Pele: ఆస్తుల పంపకం.. 30 శాతం మూడో భార్యకు; 70 శాతం పిల్లలకు
లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే గతేడాది డిసెంబర్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా పీలేకు సంబంధించిన ఆస్తుల పంపకాలు లాయర్ల సమక్షంలో కుటుంబసభ్యలుకు అప్పజెప్పినట్లు సమాచారం. పీలే కోరిక మేరకు వీలునామా ప్రకారం ఆస్తిలో 30 శాతం వాటా అతని భార్యకు దక్కిందని ఆమె తరపు లాయర్ లూయిస్ కిగ్నెల్ పేర్కొన్నారు. ఇక మిగిలిన 70 శాతం వాటా ఆయన పిల్లలకు పంచినట్లు తెలిపారు. కాగా పీలే మొత్తంగా మూడు వివాహాలు చేసుకోగా.. ఇద్దరితో విడిపోయిన పీలే.. చివరిగా 2010 నుంచి మార్సియా సిబెలె హోకితో రిలేషన్ కొనసాగించిన పీలే.. 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు. పీలే కడశ్వాస వరకు మార్సియా అతని పక్కనే ఉండి సపర్యలు చేసింది. దీనికి కృతజ్ఞతగా పీలే తన మరణానంతరం ఆస్తిలో 30 శాతం వాటా ఇవ్వాలని వీలునామా రాయించాడు. ఈ మేరకు పీలే చివరి రోజుల్లో గడిపిన గౌరౌజాలోని మాన్షన్ హౌస్(విల్లా) మార్సియాకు వెళ్లనుంది. దీనితో పాటు సావో పాలోని రిసార్ట్ కూడా ఆమెకే దక్కనుందని లాయర్ లూయిస్ కిగ్నెల్ తెలిపారు. మిగిలిన 70 శాతం ఆస్తులను పీలే పిల్లలు పంచుకోనున్నారు. పీలేకు ఏడుగురు పిల్లలు ఉండగా.. ప్రపంచానికి పరిచయం కాని మరో కూతురు కూడా వీరితో సమానంగా ఆస్తిని పంచుకోనుండడం విశేషం. పీలే చనిపోయే ముందే వీలునామాలో తన 70 శాతం ఆస్తులను ఎనిమిది మంది సమానంగా పంచుకోవాలని రాశాడు. వీలునామాలో పీలే పేర్కొన్న ప్రకారమే పిల్లలకు ఆస్తి పంపకాలు జరుగుతాయని లాయర్లు పేర్కొన్నారు. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించాడు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్ ముఖచిత్రంగా మారాడు. తన అటాకింగ్ స్కిల్స్‌తో ఫిఫా ప్రపంచాన్ని ఊపేశారు. తన డ్రిబ్లింగ్ టాలెంట్‌తో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించేవాడు. తన సుదీర్ఘ కెరీర్లో తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేసిన పీలే... 1363 మ్యాచులు ఆడి 1283 గోల్స్ సాధించాడు. బ్రెజిల్ తరుపున 77 అంతర్జాతీయ గోల్స్ సాధించిన పీలే.. 1959లో ఒకే ఏడాదిలో 127 గోల్స్ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. చదవండి: ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె కొత్త చరిత్ర.. 'కోచ్‌గా ఉన్నప్పుడు'.. రవిశాస్త్రిపై రోహిత్ శర్మ ఆగ్రహం -
Pele: బరువెక్కిన హృదయంతో బోరున విలపిస్తూ.. అంతిమ వీడ్కోలు
Brazil Legend Pele Funeral- సాంటోస్: బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్ పీలే అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. కేవలం కుటుంబసభ్యుల మధ్యే ఈ లాంఛనం ముగించారు. అంతకుముందు విలా బెల్మిరో స్టేడియంలో పీలే భౌతికకాయాన్ని వేల మంది బ్రెజిలియన్లు సందర్శించుకొని కడసారి వీడ్కోలు తెలిపారు. బ్రెజిల్ దేశాధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా తమ దిగ్గజానికి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించేందుకు అభిమానులు పోటెత్తడంతో అంతిమయాత్ర నిర్ణీత షెడ్యూల్‌కు కాస్త ఆలస్యంగా మొదలైంది. సాంటోస్ వీధుల గుండా పీలే అంతిమయాత్ర సాగుతుండగా ‘పీలే జెర్సీ నంబర్ 10’ను అభిమానులు ప్రముఖంగా ప్రదర్శించారు. ప్రజలంతా భారమైన హృదయంతో తమ ఆరాధ్య ఫుట్‌బాలర్‌ను తలచుకొని విలపించారు. తమ దేశాన్ని మూడుసార్లు ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిపిన హీరోకు విషణ్ణ వదనంతో వీడ్కోలు పలికారు. అనంతరం మెమోరియల్ నెక్రొపొలె ఎక్యుమెనిక వద్దకు తీసుకొచ్చారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు ముగించారు. చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ! 17 కోట్ల ‘ఆల్‌రౌండర్’ దూరం?! IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన -
చివరి చూపు కోసం...
సావోపాలో: బ్రెజిల్ ఆరాధ్య ఫుట్‌బాలర్ పీలేను కడసారి చూసేందుకు అభిమానులు సోమవారం ఉదయం నుంచే ఆయన పార్థివదేహం ఉంచిన విలా బెల్మిరా స్టేడియం ముందు క్యూ కట్టారు. 82 ఏళ్ల సాకర్ సూపర్‌స్టార్ గురువారం క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే! సావోపాలో శివారులో ఉన్న స్టేడియం సామర్థ్యం 16000 మాత్రమే! కానీ పెద్ద సంఖ్యలో అభిమానులు, సాంటోస్ క్లబ్ ఆటగాళ్లు, బ్రెజిల్ జాతీయ ఆటగాళ్లు తమ దిగ్గజానికి తుది నివాళులు అర్పించారు. ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్ఫాంటినో, అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. మంగళవారం సాంటోస్ వీధుల గుండా అంతిమయాత్ర ముగించాక మెమోరియల్ నెక్రొపొలె ఎక్యుమెనికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనికి బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో హాజరవుతారు. -
Pele: భారత్‌తో అనుబంధం... నాడు సాకర్ మేనియాలో తడిసిముద్దయిన నగరం
Pele Visit India 3 Times: బ్రెజిల్ దిగ్గజం పీలేకు భారత్‌తో చక్కని అనుబంధమే ఉంది. కెరీర్లో, అనంతరం బిజీబిజీగా ఉండే పీలే మూడు సార్లు భారత పర్యటనకు వచ్చాడు. ముందుగా 1977లో కలకత్తా (ఇప్పటి కోల్‌కతా)కు వచ్చిన పీలే... న్యూయార్క్ కాస్మోస్ టీమ్ తరఫున మోహన్ బగాన్ క్లబ్ జట్టుతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాడు. ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. పీలే రాకతో కలకత్తా సాకర్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవ్! సాకర్ మేనియాలో నగరం తడిసిముద్దయ్యింది. అనంతరం మళ్లీ 2015లోనూ ఇక్కడికొచ్చాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సహ యజమానిగా ఉన్న అట్లెటికో డి కోల్‌కతా క్లబ్‌కు చెందిన కార్యక్రమానికి పీలే హాజరయ్యాడు. గంగూలీతో, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, విఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌లతో కలసి ఈవెంట్లో పాల్గొన్నాడు. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమైన పీలే.. స్కూల్ విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడాడు. ‘భారతీయ చిన్నారులతో ప్రపంచ ప్రఖ్యాత క్రీడ ఫుట్‌బాల్ ఆడటం ఎంతో ఆనందంగా ఉంది’ అని ఈ సందర్భంగా అన్నాడు. 2018లో కూడా పీలే వచ్చినప్పటికీ ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో పాల్గొని ఎలాంటి హడావుడి చేయకుండా వెళ్లిపోయాడు. చదవండి: Rishabh Pant: ఫ్యామిలీ కోసం పంత్ కొన్న విలువైన వస్తువులు చోరీ? పోలీసుల క్లారిటీ Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు! -
Pele: తల్లి కంటే ముందుగానే వెళ్లిపోయిన పీలే.. కడసారి చూసేందుకు
Pele Funeral: ప్రపంచానికి తన సత్తా చాటిన విలా బెల్మిరా స్టేడియంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే పార్థీవదేహాన్ని ఉంచుతారు. సావోపాలో శివారులో ఉన్న ఈ స్టేడియంలో సోమవారం అభిమానులు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత సాంటోస్లోని మెమోరియల్ నెక్రొపోలె ఎక్యుమెనికలో జనవరి 3న అంత్యక్రియలు పూర్తవుతాయి. కేవలం పీలే కుటుంబసభ్యులే దీనికి హాజరవుతారు. మాతృమూర్తి చూసేందుకు వీలుగా ఇక మంచానికి పరిమితమైన పీలే మాతృమూర్తి సెలెస్టె అరాంట్స్ చూసేందుకు వీలుగా ఆయన అంతిమయాత్రను పీలే ఇంటిముందు నుంచి తీసుకెళ్తారు. కాగా ఈ ఏడాది నవంబరు 20లో తల్లి 100వ పడిలో అడుగుపెట్టిన సందర్భంగా పీలే భావోద్వేగ నోట్ షేర్ చేస్తూ ఆమెకు విషెస్ తెలియజేశాడు. కానీ.. ఆమెను ఒంటరిని చేస్తూ తల్లి కంటే పీలే నిష్క్రమించడం బాధాకరం. ఇదిలా ఉంటే.. పీలే మరణం నేపథ్యంలో ఈ దిగ్గజానికి నివాళిగా బ్రెజిల్ మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అవయవాలన్నీ పాడైపోయి మూడుసార్లు ‘ఫిఫా’ ప్రపంచకప్‌ను గెలిపించిన బ్రెజిలియన్ సాకర్ కింగ్ పీలే గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. సావోపాలోలోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్లో 82 ఏళ్ల పీలే కన్నుమూశాడు. గతేడాది పెద్దపేగు క్యాన్సర్ బారిన పడిన అతను అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాడు. గతనెల ఆరోగ్యం విషమించడంతో అతన్ని ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అవయవాలన్నీ క్రమంగా పాడైపోవడంతో అతని శరీరం చికిత్సకు స్పందించ లేదు. చివరకు గురువారం క్యాన్సర్‌తో పోరాటాన్ని విరమించి లోకాన్ని వీడాడు. పీలే అసలు పేరు ఇదే పీలే అసలు పేరు: ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో. తల్లిదండ్రులు: సెలెస్టె అరాంట్స్, జొవో రామోస్ నాసిమియాంటో. పెళ్లిళ్లు 3: రోజ్మెరి (1966–78), అసిరియా (1994–2010), మార్సియా (2016 నుంచి) సంతానం: కెలీ, ఎడ్సన్, జెన్నిఫర్, సాండ్రా (మృతి), ఫ్లావియా, జోషువా, సెలెస్టె. చదవండి: Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం.. Rishabh Pant: తల్లిని సర్ప్రైజ్ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్ View this post on Instagram A post shared by Pelé (@pele) -
ప్రపంచం మెచ్చిన దిగ్గజం
-
Pele: అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు!
ఆటే అతని లోకం... ఆటే అతని ప్రాణం... చురుకుదనంలో అతనో పాదరసం... గోల్ చేస్తే లోకమే దాసోహం... అతను డ్రిబ్లింగ్ చేస్తే బిత్తరపోవాల్సిందే... అటాకింగ్‌కు దిగితే చేతులెత్తేయాల్సిందే... ఫార్వర్డ్‌గా అతని విన్యాసాలకు సలాం కొట్టాల్సిందే... ఇంత గొప్ప ఆటగాడు ఫుట్‌బాల్‌లో ఉన్నందుకు ఆ క్రీడే మురిసింది. తమ జట్టులో ఆటగాడైనందుకు బ్రెజిల్ అదృష్టం చేసుకుంది. దీంతో ఈపాటికే అందరికి అర్థమై ఉంటుంది... అతనేవరో కాదు సాకర్ సమున్నత శిఖరం పీలే అని! నిజం... అతని ఆట అద్భుతం. అతని గోల్స్ అసాధారణం. అతని అంకితభావం నిరుపమానం. వరం పొందిన బ్రెజిల్‌కు... అంకితమైపోయిన ఫుట్‌బాల్‌కు... మెప్పించిన గోల్స్‌కు... అతనితో ఆడి అలసిన ప్రత్యర్థులకు... తమకిది భాగ్యమనుకున్న ప్రేక్షకులకు... కురిపించిన ఆదరాభిమానాలకు సెలవు చెప్పాడు పీలే! గతేడాది పెద్దపేగు క్యాన్సర్ బారిన పడిన పీలే.. మహమ్మారి ముందు ఓడి.. 82 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. పది దేశాలు (శాశ్వత) ఆడే క్రికెట్లో విశిష్ట క్రికెటర్లు (ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్) ఎంతో మంది ఉన్నారు. కానీ రెండొందల దేశాలు ఆడే ఫుట్‌బాల్ లో మాత్రం అత్యుత్తమ ఆటగాళ్లు అతికొద్ది మందే! అదికూడా వేళ్లమీద లెక్కపెట్టేంత మందే సాకర్ సూపర్స్టార్లు ఉన్నారు. వారిలో పీలే మాత్రం కచ్చితంగా అగ్రగణ్యుడు అంటే ఆశ్చర్యం, అతిశయోక్తి లేనేలేదు. అందుకే అతన్ని ‘ద కింగ్’ అంటారు. బంతి మైదానంలో పారాడితే కాళ్లతో డ్రిబ్లింగ్... గాల్లో ఉంటే ఛాతీతో కంట్రోల్... గోల్‌పోస్ట్ వద్ద ఎగిరొస్తే హెడర్... కింది నుంచి పాస్ అయితే చక్కని కిక్ షాట్... ఇలా బంతి ఎటునుంచి వచ్చినా... తన చుట్టు అడుగడుగునా ప్రత్యర్థులు మాటువేసినా... డిఫెండర్లు గోడ కట్టినా... గోల్ కీపర్ కంచెలా నిలుచున్నా... పీలే కచ్చితమైన లక్షిత షాట్‌ను ఎవరూ అడ్డుకోలేదు. అంతటి మంత్రముగ్ధమైన ప్రదర్శనతో, ప్రత్యర్థి శిబిరాన్ని నిశ్చేష్టుల్ని చేసే ఆటతీరుతో గోల్స్ కొట్టే నైపుణ్యం పీలేకు మాత్రమే సాధ్యం. అచ్చుతప్పు పిలుపుతో... మినాస్ గెరయిస్ రాష్ట్రంలోని చిన్న గ్రామం ట్రెస్ కొరకోస్లో 1940 అక్టోబర్ 23న జన్మించిన పీలే అసలు పేరు అది కాదు. నిజానికి అది పేరులోంచి తెచ్చుకున్న పదం కూడా కాదు. పీలే పేరు... ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో! ఇతనికి ఫుట్‌బాల్ అంటే పిచ్చి. తండ్రి ఫుట్‌బాలర్ కావడంతో ఆ పిచ్చి కాస్త వయసుతో పాటే పెరిగింది. 11 ఏళ్ల ప్రాయంలో అతని నైపుణ్యాన్ని గుర్తించిన స్థానిక ప్రొఫెషనల్ ప్లేయర్ ఒకరు సాంటోస్ యూత్ క్లబ్లో చేర్పించాడు. అచిరకాలంలోనే సీనియర్ జట్టులోకి వచ్చేశాడు. స్కూల్లో చదివే రోజుల్లో వాస్కోడి సావో లౌరెంకో క్లబ్ గోల్ కీపర్ ‘బిలే’ పీలే ఫేవరెట్ ఆటగాడు. అతడిని ‘బీలే’గా కాకుండా పీలేగా తప్పుగా పిలిచేవారు. ఆ తర్వాత సహచర విద్యార్థులు ఈ పేరును పీలేకు పెట్టేశారు. ఆ పేరు ఇప్పుడు ఫుట్‌బాల్ చరిత్రలో చెరగని సంతకం చేసింది. అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! ఆతని ఆటన్న... అతనికి ఉన్న క్రేజన్న ఎంటో ఈ ఒక్క ఉదంతంతో తెలుస్తుంది. 1969లో నైజీరియా అంతటా అంతర్యుద్దంతో అట్టుడుకుతోంది. పీలే అప్పటికే విశ్వవ్యాప్త ఆదరాభిమానాలు సంపాదించుకున్నాడు. కానీ ఏమూలో అనుమానం... ఈ అగ్గితో సాంటోస్ క్లబ్, స్టేషనరీ స్పోర్ట్స్ క్లబ్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుందా? అని... అయితే ఈ అనుమానాలు పటాపంచలు చేస్తూ నైజీరియాలోని రెండు వర్గాలు పీలే ఆట కోసం విరామం ప్రకటించాయి. దీంతో కాసేపు అంతర్యుద్దం అటకెక్కగా ... ఆట మైదానంలో ఉరకలెత్తించింది. అట్లుంటది పీలేతోని! ఖాళీగా కూర్చోలేదు రిటైర్మెంట్ తర్వాత... ఇన్ని పేరు ప్రఖ్యాతలు, అవార్డులు, రివార్డులు సాధించాక ఇక ఆటపాట నాకెందుకని ప్రశాంతంగా కూర్చోలేదు. ఆటగాడిగా బిజీగా గడిపిన తర్వాత డాక్యుమెంటరీ నటుడిగాను మెప్పించాడు. ఆల్బమ్‌లను రూపొందించాడు. పలు ఆటోబయోగ్రఫీలను కూడా ప్రచురించాడు. వ్యాపారవేత్తగాను విజయవంతమయ్యాడు. అనంతరం ఈ విశిష్ట ఫుట్‌బాలర్‌ను 1994లో యునెస్కో గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. మరుసటి ఏడాది బ్రెజిల్ అధ్యక్షుడు... తమ దేశ క్రీడల మంత్రిగాను నియమించారు. 1997లో క్వీన్ ఎలిజబెత్ –2 చేతుల మీదుగా ‘నైట్‌హుడ్’ను కూడా అందుకున్నాడు. ఇంత చేసినా... ఇతనికి తప్పలేదు ఫుట్‌బాల్ ఆట ప్రభను పెంచి... బ్రెజిల్ సాకర్ సత్తాను చాటి... క్రీడకే నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన పీలేకు ‘నల్లజాతి’ అవమానాలు తప్పలేదు. అభిమానులు, సాకర్ లోకం అతన్ని వేనోళ్ల స్తుతిస్తే మతిలేని మంద, గిట్టని ప్రబుద్ధులు కొందరు అతని వర్ణం సాకుతో గేలిచేశారు. నల్ల కోతిలాంటి వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టేవారు. కానీ దీపం మండే కొద్దీ వెలుగును ప్రభవించినట్లే... ఆడే కొద్దీ తన ఆటతీరుతో పీలే ఫుట్‌బాల్ క్రీడకే వన్నె తెచ్చాడు తప్ప తలొగ్గే పని, తలదించుకునే పని ఏనాడూ చేయలేదు. మూడు వరల్డ్‌కప్ విజయాల్లో... బ్రెజిల్ జట్టులోకి రాగానే తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో పీలే కీలక ఆటగాడిగా మారాడు. దీంతో 16 ఏళ్లకే 1956లో బ్రెజిల్ జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. మైదానంలో మెరికలాంటి ఆటతో అందరికంటా పడ్డాడు. 1958 ప్రపంచకప్ కోసం స్వీడన్‌కు రిజర్వ్ ఆటగాడిగా వెళ్లిన పీలే కీలక ఆటగాడిగా స్వదేశానికి తిరిగొచ్చాడు. 17 ఏళ్ల టీనేజ్‌లో ప్రపంచకప్ లో అరంగేట్రం చేసిన పీలే బ్రెజిల్ చాంపియన్‌షిప్‌లో కీలకభూమిక పోషించాడు. మరో ప్రపంచకప్ (1962) నాటికి స్టార్ హోదాతో బరిలోకి దిగాడు. తన జట్టు టైటిల్ నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డిన పీలే తన కొచ్చిన ‘స్టార్ డమ్’కు న్యాయం చేశాడు. రెండో ప్రపంచకప్ విజయంలో భాగమయ్యాడు. 1966 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ అయిన బ్రెజిల్ గ్రూప్ దశలోనే వెనుదిరగడం, తదనంతర పరిస్థితులతో అదే తన చివరి ప్రపంచకప్ అని పీలే ప్రకటించాడు. తర్వాత మనసు మార్చుకున్న ఈ దిగ్గజం 1970 ప్రపంచకప్ ఆడి బ్రెజిల్ విజయానికి బాట వేశాడు. అలా 14 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 12 గోల్స్ చేశాడు. మూడు ప్రపంచకప్ విజేత జట్లలో భాగమైన ఏకైక ఫుట్‌బాలర్‌గా నిలిచాడు. 3: పీలే గెలిచిన ప్రపంచకప్‌ల సంఖ్య. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ టైటిల్స్ నెగ్గడంలో పీలే కీలకపాత్ర పోషించాడు. మూడు ప్రపంచకప్‌లు సాధించిన ఒకే ఒక్క ఫుట్‌బాలర్‌గా పీలే రికార్డు నెలకొల్పాడు. 17: బ్రెజిల్ తొలిసారి 1958లో విశ్వవిజేతగా నిలిచినపుడు జట్టులో సభ్యుడిగా ఉన్న పీలే వయస్సు. ప్రపంచకప్‌లో పాల్గొన్న, ప్రపంచకప్‌ను సాధించిన పిన్న వయస్సు ప్లేయర్‌గా పీలే పేరిట ఉన్న రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కెరీర్ విశేషాలు 92: అధికారిక, అనధికారిక మ్యాచ్‌ల్లో కలిపి పీలే సాధించిన ‘హ్యాట్రిక్’ల సంఖ్య. 30: మ్యాచ్‌లో పీలే నాలుగు గోల్స్ చొప్పున 30 సార్లు సాధించాడు. 1283: పీలే 1954 నుంచి 1977 మధ్య కాలంలో అధికారిక, అనధికారిక, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కలిపి మొత్తం 1363 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి 1283 గోల్స్ సాధించాడు. 6: మ్యాచ్‌లో పీలే కనీసం ఐదు గోల్స్ చొప్పున ఆరుసార్లు నమోదు చేశాడు. 77: బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున 92 మ్యాచ్‌లు ఆడి పీలే చేసిన గోల్స్. 12: ప్రపంచకప్ టోర్నీలలో పీలే సాధించిన గోల్స్. వ్యక్తిగత వివరాలు జన్మదినం: అక్టోబర్ 23, 1940 ఎక్కడ: ట్రెస్ కొరకోస్, బ్రెజిల్. అసలు పేరు: ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో. తల్లిదండ్రులు: సెలెస్టె అరాంట్స్, జొవో రామోస్ నాసిమియాంటో. పెళ్లిళ్లు 3: రోజ్మెరి (1966–78), అసిరియా (1994–2010), మార్సియా (2016 నుంచి) సంతానం: కెలీ, ఎడ్సన్, జెన్నిఫర్, సాండ్రా (మృతి), ఫ్లావియా, జోషువా, సెలెస్టె. పీలేకు ప్రముఖుల నివాళులు ►ఆటను అందంగా తీర్చిదిద్దిన యోధుడు. ఫుట్‌బాల్‌ను కళాత్మకంగా మార్చిన లెజెండ్ పీలే. –నెమార్ జూనియర్ (బ్రెజిల్) ►ఆల్‌టైమ్ సాకర్ సూపర్ స్టార్ పీలే. మీరే మా అందరికీ స్ఫూర్తి. –మెస్సీ (అర్జెంటీనా) ►సాకర్ స్టార్, ఫుట్‌బాల్ కింగ్ పీలే ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత. నాపై మీరు కురిపించిన ప్రేమానురాగాలు నేనెప్పటికీ మరచిపోలేను. –క్రిస్టియానో రొనాల్డో ►(పోర్చుగల్) అతడిక లేడన్నది చేదు నిజం... కానీ అతని ఆట చిరస్మరణీయం. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి కింగ్ పీలే. –ఎంబాపే (ఫ్రాన్స్) ►స్పోర్టింగ్ లెజెండ్ పీలే. ఫుట్‌బాల్ కింగ్‌కు ఘనమైన నివాళి. – బోల్ట్ (దిగ్గజ స్ప్రింటర్) ►పీలే లేని లోటు పూడ్చలేనిది. తన ఆటతో, అద్భుత విన్యాసాలతో ఎల్లలెరుగని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అతని స్ఫూర్తిమంతమైన జీవితం భావి తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. –భారత ప్రధాని మోదీ చదవండి: Pak Vs NZ 1st Test: ఫలితం రాబట్టాలనుకున్నాం.. కానీ! పాక్ అలా బతికిపోయింది! Pele Old Goals Video: పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే -
పీలే క్రేజ్‌కు ఉదాహరణ.. షూ లేస్ కట్టుకున్నందుకు రూ.కోటి
బ్రెజిల్‌కి మూడు ఫిఫా వరల్డ్ కప్స్ (1958, 1962, 1970) అందించిన పీలే... బ్రాండ్స్‌కి మార్కెటింగ్ చేయడంలోనూ తన మార్కు చూపించారు. రెండు ప్రపంచ కప్స్ గెలిచిన తర్వాత పీలే ఫిఫా వరల్డ్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా వెలుగొంతున్న సమయంలో ఆయనతో బ్రాండ్ ప్రమోషన్ చేయించాలని కంపెనీలన్నీ క్యూ కట్టాయి. 1970లో స్పోర్ట్స్ షూస్ కంపెనీ పూమా, పీలేతో బ్రాండ్ ప్రమోషన్‌కి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సాధారణంగా ప్రమోట్ చేస్తే కుదురదని బ్రాండ్ ప్రమోషన్ కోసం ఓ వినూత్న ప్లాన్‌ను వాడింది పూమా. 1970 వరల్డ్ కప్ సమయంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పూమా, తన షూ లేస్‌ని కట్టుకోవడం మొదలెట్టాడు.. అంతే కంపెనీకి కోట్ల రూపాయాల్లో టర్నోవర్ వచ్చింది. కేవలం మ్యాచ్ ఆరంభానికి ముందు షూ లేస్ కట్టుకున్నందుకు 120000 డాలర్లు (దాదాపు కోటి రూపాయల వరకూ) పీలేకి ముట్టచెప్పింది పూమా కంపెనీ. మ్యాచ్ సమయంలో పీలే షూ లేస్ కట్టుకోవడం వల్ల పూమా కంపెనీకి కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. అప్పట్లో పీలేకి ఎంతటి క్రేజ్ ఉండేదో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే... తన సుదీర్ఘ కెరీర్లో తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేసిన పీలే... 1363 మ్యాచులు ఆడి 1283 గోల్స్ సాధించాడు. బ్రెజిల్ తరుపున 77 అంతర్జాతీయ గోల్స్ సాధించిన పీలే.. 1959లో ఒకే ఏడాదిలో 127 గోల్స్ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. చదవండి: పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే 'పీలే'.. ఆ పేరు ఎలా వచ్చింది; అసలు పేరేంటి? -
పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే(82) ఇకలేరు. అభిమానులను విషాదంలోకి నెట్టి తాను దివికేగారు. ‘‘నాకేం కాలేదని.. త్వరలోనే తిరిగి వస్తా’’నంటూ కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రకటించిన పీలే.. గురువారం అర్ధరాత్రి తర్వాత కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్ద పేగు కాన్సర్‌కు బలైపోయిన ఈ లెజెండ్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించారు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్ ముఖచిత్రంగా మారారు. పీలే తన అటాకింగ్ స్కిల్స్‌తో ఫిఫా ప్రపంచాన్ని ఊపేశారు. తన డ్రిబ్లింగ్ ట్యాలెంట్‌తో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించేవాడు. గోల్ పోస్టునే టార్గెట్ చేస్తూ ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచుల్లో పీలే మొత్తం 12 గోల్స్ చేశాడు. పీలే కొట్టిన టాప్-10 అద్భుతమైన గోల్స్‌ను ఒకసారి చూసేయండి. ►17 ఏళ్ల వయసులో పీలే ఓ వండర్ చేశాడు. 1958లో బ్రెజిల్‌కు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందించాడు. ఆ టైటిల్‌తో ఆగలేదతను. పీలేలో ఉన్న గోల్ స్కోరింగ్ సామర్థ్యం అందర్నీ స్టన్ చేసేది. ఆ ఏడాది ఫ్రాన్స్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో అతను హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు. ► 1970వ సంవత్సరం పీలే కెరీర్లో ఓ మలుపురాయి లాంటింది. ఆ ఏడాది ఫిఫా వరల్డ్‌కప్‌ను కలర్లో టెలికాస్ట్ చేశారు. కొత్త టెక్నాలజీతో మ్యాచ్‌లను ప్రేక్షకులు వీక్షించారు. ఇక ఆ పీలే జోరును కూడా ప్రేక్షకులు కళ్లార్పకుండా చూశారు. యెల్లో జెర్సీలో పీలే చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ టోర్నీలో ఇటలీతో జరిగిన ఫైనల్లో బ్రెజిల్ 4-1 తేడాతో నెగ్గింది. ఆ విజయంలో పీలే కీలక పాత్ర పోషించాడు. ► 1982లో బ్రెజిల్ మళ్లీ టైటిల్‌ను గెలుచుకున్నది. ఆ జట్టులో పీలే ఉన్నాడు. కానీ ఆ టోర్నీలో అతను కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయం వల్ల టోర్నీలోని మిగితా మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. 1966 టోర్నీలో బ్రెజిల్ గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయ్యింది. One of the greatest to ever play the game 🇧🇷⚽️ Join us in wishing the legendary @Pele a very Happy Birthday 🥳 pic.twitter.com/hwuU3d1Ufh — FIFA World Cup (@FIFAWorldCup) October 23, 2022 చదవండి: అసమాన ఆటతీరుకు సలాం.. చెక్కుచెదరని రికార్డులకు గులాం 'పీలే'.. ఆ పేరు ఎలా వచ్చింది; అసలు పేరేంటి? Pele: తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నవేళ -
అసమాన ఆటతీరుకు సలాం.. చెక్కుచెదరని రికార్డులకు గులాం
ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది. ఫుట్‌బాల్ ఆటకే వన్నె తెచ్చి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పీలే 82 ఏళ్ల వయసులో డిసెంబర్ 29న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం ఫుట్‌బాల్ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. అసమాన ఆటతీరుతో బ్రెజిల్‌కు ఎన్నో అద్భుత విజయాల్ని అందించాడు పీలే. సుదీర్ఘ కెరీర్లో పీలే సాధించిన కొన్ని రికార్డులు ఇవి... ► బ్రెజిల్‌కు మూడు వరల్డ్ కప్‌లను పీలే అందించాడు. 1958, 1962, 1970 మూడు సార్లు బ్రెజిల్ వరల్డ్ కప్ గెలవడంతో పీలే కీలక పాత్ర పోషించాడు. అత్యధిక సార్లు వరల్డ్ కప్ అందుకున్న ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రికార్డులెక్కాడు. ► 1958 వరల్డ్ కప్ తో పీలే ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభమైంది. అప్పటికీ పీలే వయసు 17 ఏళ్లు మాత్రమే. వరల్డ్ కప్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా పీలే రికార్డ్ సృష్టించాడు. ► 1958 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో పీలే ఫ్రాన్స్‌పై హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. కేవలం 23 మూడు నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేసి బ్రెజిల్‌ను విజేతగా నిలిపాడు. వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ చేసిన యంగెస్ట్ ప్లేయర్ అతడే కావడం గమనార్హం. ► వరల్డ్ కప్‌లో గోల్ చేసిన 18 కంటే తక్కువ వయసున్న ఏకైక ఆటగాడు కూడా పీలే కావడం విశేషం. ► బ్రెజిలియన్ క్లబ్ సాంటోస్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు పీలే కావడం గమనార్హం. 659 మ్యాచ్‌లలో 643 గోల్స్ చేశాడు పీలే. కెరీర్ మొత్తంగా 1363 మ్యాచ్‌లు ఆడిన పీలే 1283 గోల్స్ చేశాడు. ► బ్రెజిల్ తరఫున 92 మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశాడు. వరల్డ్ కప్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన పీలే 12 గోల్స్ చేశాడు. ► పీలే బ్రెజిల్ తరుఫున ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన పీలే ఒలింపిక్స్‌లో మాత్రం ఒక్కసారి కూడా బరిలో దిగలేదు. ► ఒక ఏడాదిలో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్ పీలేనే. 1959వ ఏడాదిలో పీలే 127 గోల్స్ చేశాడు. ► పీలే కెరీర్లో మొత్తం 92 రెండు సార్లు హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. -
'పీలే'.. ఆ పేరు ఎలా వచ్చింది; అసలు పేరేంటి?
ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది. ఫుట్‌బాల్ ఆటకే వన్నె తెచ్చి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పీలే 82 ఏళ్ల వయసులో డిసెంబర్ 29న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం ఫుట్‌బాల్ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. మరి మనం ఇంతలా ఆరాధిస్తున్న పీలే అసలు పేరేంటో తెలుసా? అదేంటి పీలే అసలు పేరు కాదా అనే అనుమానం రావొచ్చు. ఆయన అసలు పేరు పీలే కాదు.. అది కేవలం ముద్దుపేరు. పీలే అసలు పేరు 'ఎడిసన్ అరాంట్స్ డో నాసిమియాంటో'. పేరు పలకడమే కష్టంగా ఉంది కదూ.. కానీ పీలే అసలు పేరు మాత్రం ఇదేనండి. అమెరికా శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్పై ప్రేమతో తండ్రి డోండిన్హో ఆ పేరు పెట్టుకున్నాడు. అయితే పాఠశాలలో స్నేహితులు పెట్టిన పీలే అనే పేరు ఆ తర్వాత స్థిరపడిపోయింది. అదే పేరుతోనే ఫుట్‌బాల్ ఆటలో చరిత్ర సృష్టించాడు. తన అసలు పేరు అర్థం తనకే తెలియదని పీలే ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయితే పీలే అనే పేరు మాత్రం ఎలా వచ్చిందనేది గుర్తుందన్నాడు. ''పోర్చుగీస్ భాషలో ఫుట్‌బాల్‌ను పాదంతో కిక్ కొడితే 'పీ' అని.. అదే సమయంలో నేను చేసిన తప్పులను ఎత్తిచూపుతూ పోర్చుగీసు భాషలో 'లే' అని పదం వాడారు. ఆ తర్వాత స్కూళ్లో అందరూ ''పీలే.. పీలే'' అని పిలిచేవారు. ఆ తర్వాత నా అసలు పేరు పోయి ''పీలే''గా సిర్థపడిపోయాను. కానీ పీలే అనే పేరు నాకు ఇష్టం ఉండదు. అసలు పేరు పలకడానికి కష్టంగా ఉన్నప్పటికి.. కుటుంబసభ్యులు, ఆప్తులు.. ''డీకో'' అని పిలుస్తుంటే చాలా ఆనందంగా ఫీలయ్యేవాడిని'' అని పేర్కొన్నాడు. ఇక పీలే బాల్యం కడు పేదరికంలో సాగింది. తండ్రి ఫుట్‌బాల్ ప్లేయర్ అయినప్పటికి సొంతంగా ఫుట్‌బాల్ కొనిచ్చేంత స్థోమత మాత్రం లేదు. దీంతో సాక్సుల్లో పేపర్లు నింపి బంతిలా తయారు చేసి ఫుట్‌బాల్ ఆడేవాడు. అలా చిన్నతనంలోనే ఫుట్‌బాల్‌పై మమకారం పెంచుకున్న పీలే తన బాల్యంలో చాలా స్థానిక ఫుట్‌బాల్ క్లబ్స్‌లో మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో రేడియం అనే స్థానిక ఇండోర్ ఫుట్‌బాల్(ఫుట్సల్) జట్టులో సభ్యుడయ్యాడు. అప్పటికి పీలే వయస్సు కేవలం 14 ఏళ్లు మాత్రమే. 14 ఏళ్ల వయసులోనే సీనియర్లతో ఆడడం గొప్ప విషయం అయినప్పటికి వారితో అతను ఎలా నెట్టుకురాగలడని అంతా సందేహపడ్డారు. ఇండోర్ ఫుట్‌బాల్‌లో ఆటగాళ్లు చాలా దగ్గరగా ఉంటారు. దీంతో మెరుపు వేగంతో ఆడాల్సి ఉంటుంది. ఇక్కడే పీలే ఫుట్‌బాల్‌ను ఎంత వేగంగా ఆడాలనేది నేర్చుకొని రాటుదేలాడు. అక్కడి నుంచి పీలే వెనుదిరిగి చూసుకోవాల్సి అవసరం రాలేదు. ఇక ఆ ఏడాది పీలే జట్టు ఇండోర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ గెలుచుకుంది. టోర్నీలో మొత్తంగా పీలే 15 గోల్స్ చేయడం విశేషం. ఆ తర్వాత పీలే చిన్ననాటి కోచ్ డి బ్రిటో.. అతన్ని శాంటోస్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌కు పరిచయం చేశాడు. ఆ జట్టు తరపున 15 ఏళ్ల వయసులో ఆడిన తొలి మ్యాచ్‌లోనే గోల్ చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత బ్రెజిల్ జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. అప్పటికే పీలే వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. ఇక పీలే తన మొదటి ఫిఫా వరల్డ్‌కప్ ఆడే సమయానికి వయస్సు 17 ఏళ్లు. పట్టుమని 20 ఏళ్లు కూడా లేని ఒక కుర్రాడు ఆ వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తాడని ఎవరూ ఊహించలేదు. పైగా టోర్నీలో అడుగుపెట్టే సమయానికి పీలే మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. కానీ నొప్పిని సైతం లెక్కచేయకుండా బరిలోకి దిగిన పీలే మొత్తం ఆరు గోల్స్ చేసి బ్రెజిల్‌ను తొలిసారి చాంపియన్స్‌గా నిలబెట్టాడు. ఆ తర్వాత 1962 ఫిఫా వరల్డ్‌కప్ బ్రెజిల్ గెలిచినప్పటికి పీలే పెద్దగా మెరవలేదు. కానీ కొన్ని మ్యాచ్‌ల్లో తన మార్క్‌ను చూపెట్టాడు. ఇక ఎనిమిదేళ్ల తర్వాత అంటే 1970 ఫిఫా వరల్డ్‌కప్‌లో మాత్రం మరోసారి పీలే తన మ్యాజిక్ చూపెట్టాడు. అద్భుత ప్రదర్శనతో గోల్డెన్ బాల్ అవార్డును సొంతం చేసుకున్న పీలే ముచ్చటగా మూడోసారి బ్రెజిల్‌ను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. పీలే తన కెరీర్ మొత్తంలో(ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కలిపి) 1363 మ్యాచ్‌ల్లో 1281 గోల్స్ చేయడం విశేషం. ఇక అధికారికంగా ఆడిన 831 మ్యాచ్‌ల్లో 767 గోల్స్ చేశాడు. ఇప్పటితరంలో గొప్ప ఆటగాళ్లుగా పేరు పొందిన మెస్సీ, రొనాల్డోలు ఇన్ని గోల్స్ చేయడానికి దాదాపు వెయ్యి మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. చదవండి: Pele: తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నవేళ -
Pele: తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నవేళ
అది 1950 ఫిఫా వరల్డ్‌కప్.. ఆతిథ్య దేశం బ్రెజిల్, ఉరుగ్వే మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్లో ఉరుగ్వే చేతిలో ఓడిన బ్రెజిల్ రన్నరప్‌గా నిలిచింది. బ్రెజిల్ ఓడిపోవడం చూసి ఒక వ్యక్తి కన్నీటిపర్యంతం అయ్యాడు. ఆయన పక్కనే ఉన్న ఒక పదేళ్ల పిల్లాడు కూడా ఆ వ్యక్తి అలా ఏడ్వడం చూసి తట్టుకోలేకపోయాడు. ఆ పదేళ్ల పిల్లాడు మరెవరో కాదు.. ఫుట్‌బాల్ లెజెండరీ ఆటగాడు.. పీలే. బ్రెజిల్‌కు మూడుసార్లు ఫిఫా వరల్డ్‌కప్ అందించి హీరోగా నిలిచాడు. ఇక పీలే పక్కనున్న వ్యక్తి ఇంకెవరో కాదు స్వయానా ఆయన తండ్రి డోండిన్హో. తన పదేళ్ల వయసులో నాన్న గుక్కపట్టి ఏడ్వడం గమనించిన పీలే.. నాన్న ఏడ్వకు.. ఈరోజు నీకు మాట ఇస్తున్నా.. బ్రెజిల్‌కు కచ్చితంగా వరల్డ్‌కప్ అందించి తీరుతా అని పేర్కొన్నాడు. అప్పటికే పదేళ్ల వయసు మాత్రమే ఉన్న పీలే మాటలు తండ్రికి నమ్మశక్యంగా అనిపించలేదు. 1958 ఫిఫా ఫైనల్ గెలిచిన అనంతరం పీలే కట్‌చేస్తే.. ఎనిమిది సంవత్సరాల తర్వాత 1958 ఫిపా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించింది పీలేనే. తండ్రికిచ్చిన మాటను నిలబ్టెట్టుకోవాలని మోకాలి గాయాన్ని సైతం లెక్కచేయకుండా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగాడు. ఆ వరల్డ్‌కప్‌లో పీలే మొత్తంగా ఆరు గోల్స్ చేశాడు. సెమీఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన పీలే ఫైనల్స్‌లోనే రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అప్పటికి పీలే వయస్సు కేవలం 17 ఏళ్లు మాత్రమే. 17 ఏళ్ల వయసులోనే ఫుట్‌బాల్‌లో సంచలనాలు సృష్టించిన పీలే ఆ తర్వాత ఎంత ఎత్తుకు ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక 1958 ఫిఫా వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ట్రోఫీని తీసుకెళ్లి తండ్రికి అందించాడు. ఆ సమయంలో పీలే తండ్రి దోహిన్హో పీలేను హత్తుకొని కన్నీరు కార్చడం ప్రతీ ఒక్కరి గుండెలను కదిలించింది. తన పదేళ్ల వయసులో ఫిఫా వరల్డ్‌కప్ రాలేదని తండ్రి ఏడ్వడం చూసిన పీలే.. తన తండ్రి మరోసారి అలా ఏడ్వకూడదని నిశ్చయించుకున్నాడు. అందుకే కడు పేదరికంలో పెరిగినప్పటికి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గాలనే లక్ష్యంతోనే ఎన్ని కష్టాలొచ్చినా వాటిని బరిస్తూ ముందుకు కదిలాడు. ఆ తర్వాతి ఎనిమిదేళ్లలో ఫుట్‌బాల్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగి తండ్రి కోరికను సాకారం చేసి గొప్ప కొడుకు అనిపించుకున్నాడు. -
దివికేగిన దిగ్గజం.. బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే అరుదైన ఫోటోలు
-
Rip ‘King’: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం..
Brazil Legend Pele: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే(82) ఇకలేరు. అభిమానులను విషాదంలోకి నెట్టి తాను దివికేగారు. ‘‘నాకేం కాలేదని.. త్వరలోనే తిరిగి వస్తా’’నంటూ కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రకటించిన పీలే.. గురువారం అర్ధరాత్రి తర్వాత కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్ద పేగు కాన్సర్‌కు బలైపోయిన ఈ లెజెండ్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫుట్‌బాల్ స్టార్ల నివాళులు ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్-2022 విజేత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా రన్నరప్ ఫ్రాన్స్ సారథి కైలియన్ ఎంబాపే, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేమార్ తదితరులు పీలేను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దిగ్గజ ఆటగాడితో తమ జ్ఞాపకాలు పంచుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘‘పీలే ఆత్మకు శాంతి కలగాలి’’ అని మెస్సీ పీలేతో దిగిన ఫొటోలను పంచుకున్నాడు. నేమార్ ఎమోషనల్ నోట్ ‘‘పీలే రాకముందు.. 10 అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే అన్న ఈ వాక్యాన్ని ఎక్కడో చదివాను. ఇదెంతో అందమైనదే అయినా.. అసంపూర్ణమైనదని నేను భావిస్తా. నిజానికి పీలే రాక మునుపు ఫుట్‌బాల్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే. ఆయన వచ్చిన తర్వాత ఈ క్రీడను ఓ కళగా మార్చారు. ఎంతో మంది నిస్సహాయులకు.. ముఖ్యంగా నల్లజాతీయుల గొంతుకగా మారారు. బ్రెజిల్ దిక్సూచిలా పనిచేశారు. ఆయన నేతృత్వంలో సాకర్, బ్రెజిల్ ఒక్కటిగా వెలుగొందాయి. ఇంతటి గొప్ప సేవలు అందించిన కింగ్‌కు ధన్యవాదాలు! ఆయన భౌతికంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవచ్చు. కానీ ఆయన చేసిన అద్భుతాల తాలుకు జ్ఞాపకాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. పీలే చిరస్మరణీయుడు’’ అంటూ నేమార్ ఉద్వేగపూరిత నోట్ రాశాడు. కిరీటం ధరించిన పీలే ఫొటోను షేర్ చేస్తూ ‘కింగ్’ పట్ల అభిమానం చాటుకున్నాడు. ఎంబాపే, రొనాల్డో ఉద్వేగం ఫుట్‌బాల్ రారాజు భౌతికంగా దూరమయ్యాడు అంతే! ఆయన సాధించిన విజయాలు మాత్రం ఎల్లప్పటికీ శాశ్వతం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి కింగ్ అని ఎంబాపే ట్వీట్ చేశాడు. ఇక పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కోట్లాది మందికి పీలే స్ఫూర్తిదాయకమని, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. పీలే లేరన్న విషయాన్ని ఫుట్‌బాల్ లోకం జీర్ణించుకోలేకపోతోందని, ఆయన కుటుంబానికి ప్రగాభ సానుభూతి తెలియజేశాడు. అల్విదా కింగ్ ఫుట్‌బాల్ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చే ఆటగాళ్లలో పీలే ముందు వరుసలో ఉంటారనడంలో అతిశయోక్తి కాదు. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించారు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్ ముఖచిత్రంగా మారారు. అంతా స్టార్ ప్లేయర్లు ఉన్న జట్టులో.. 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో ఆడిన ఆయన.. మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారు. దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందారు. కాగా కెరీర్ మొత్తంలో నాలుగు ఫిఫా ప్రపంచకప్‌లు ఆడిన పీలే మొత్తం 12 గోల్స్ సాధించారు. 10 నంబర్ జెర్సీ ధరించే ఆయన.. ఆ సంఖ్యకు వన్నె తెచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by NJ 🇧🇷 (@neymarjr) View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) The king of football has left us but his legacy will never be forgotten. RIP KING 💔👑… pic.twitter.com/F55PrcM2Ud — Kylian Mbappé (@KMbappe) December 29, 2022 View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) -
బ్రెజిల్ ఫుట్ బాల్ లెజెండ్ పీలే కన్నుమూత
-
పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం!
పీలే, డీగో మారడోనా.. ఇద్దరు దిగ్గజాలే. ఫుట్‌బాల్‌లో తమకంటూ ప్రత్యేక చరిత్రను లిఖించుకున్నారు. ఒకరు బ్రెజిల్‌ను మూడుసార్లు చాంపియన్‌గా నిలిపితే.. మరొకరు అర్జెంటీనాను ఒకసారి విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఇద్దరిలో మారడోనా రెండేళ్ల క్రితమే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. ప్రస్తుతం పీలే పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇటీవలే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కానీ తనకేం కాలేదని.. బాగానే ఉన్నట్లు పీలే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో సోమవారం బ్రెజిల్, దక్షిణ కొరియాల మధ్య ప్రీ క్వార్టర్స్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ 4-1 తేడాతో కొరియాను చిత్తు చేసి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. కాగా ఈ మ్యాచ్‌ను పీలే ఆసుపత్రి నుంచి వీక్షించినట్లు ఆయన కూతురు పేర్కొంది. మ్యాచ్ విజయం కూడా పీలేకు అంకితమిచ్చిన బ్రెజిల్ జట్టు ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంది. ఇక మ్యాచ్ జరిగిన స్టేడియం 974లో బ్రెజిల్ ఫ్యాన్స్.. పీలే తొందరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున బ్యానర్లు, కటౌట్లు ప్రదర్శించారు. బ్రెజిల్ గోల్ కొట్టిన ప్రతీసారి పీలే.. పీలే అంటూ గట్టిగా అరిచారు. అలా పీలేపై తమకున్న గౌరవాన్ని గొప్పగా చాటుకున్నారు. పీలేకు ఎక్కడైతే గౌరవం లభించిందో అక్కడే మారడోనాకు అవమానం జరుగుతుందంటూ మారడోనా కూతురు జియానిన్ని మారడోనా పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే అర్జెంటీనా జట్టును తప్పుబట్టలేదు కానీ.. కనీసం మారడోనా గౌరవార్థం ఆయనకు ఒక మ్యాచ్ విజయాన్ని అంకితమిస్తే బాగుండేదని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. అయితే మారడోనాను అర్జెంటీనా జట్టు ఎప్పుడు అవమానపరచలేదంటూ ఒక వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ మ్యాచ్ ప్రారంభమైన పది నిమిషాల తర్వాత మారడోనా సేవలకు గుర్తుగా పాటలు, బ్యానర్లు ప్రదర్శించడం చేస్తున్నారని పేర్కొంది. ఇక పీలే, మారడోనా జెర్సీ నెంబర్లు 10 అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే అర్జెంటీనా, బ్రెజిల్‌లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. డిసెంబర్ 7న జరిగే క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా.. నెదర్లాండ్స్‌ను ఎదుర్కోనుండగా.. డిసెంబర్ 9న బ్రెజిల్.. క్రొయేషియాతో అమితుమీ తేల్చుకోనుంది. 💛💚 pic.twitter.com/9CXaglvuHR — FIFA World Cup (@FIFAWorldCup) December 5, 2022 Brazil turned 🆙 the 🔥 in #BRAKOR 💪 Catch the best moments from the 4-1 win over South Korea 📹 Watch @CBF_Futebol in action next 🆚 @HNS_CFF on Dec 9, 8:30 pm 👉🏻 #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/45n9yL6YIl — JioCinema (@JioCinema) December 6, 2022 View this post on Instagram A post shared by Gianinna Maradona 🧿 (@giamaradona) చదవండి: FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి FIFA WC 2022: రొనాల్డో కోసం ఏదైనా.. టాప్‌లెస్‌గా దర్శనం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Pele: 'నాకేం కాలేదు బాగానే ఉన్నా.. భయపడకండి'
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్వయంగా స్పష్టతనిచ్చాడు. తాను బాగానే ఉన్నానని.. తిరిగి కోలుకుంటున్నట్లు ప్రకటించాడు. 82 ఏళ్ల పీలేకు గతేడాది క్యాన్సర్ కారణంగా పెద్ద పేగులో కణతిని తొలగించారు. అప్పటినుంచి తరచూ చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నాడు. తాజాగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబసభ్యులు సావో పౌలో పట్టణంలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆదివారం ఉదయం పీలే పరిస్థితి విషమంగా ఉందని.. కీమో థెరపీకి కూడా స్పందించడం లేదని.. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తన ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు ప్రచారంపై ఇన్స్టాగ్రామ్ వేదికగా పీలే స్పందించాడు. తాను బాగానే ఉన్నట్లు వెల్లడించాడు. తన కోసం ప్రార్థిస్తున్న వాళ్లంతా ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని.. తాను బాగానే ఉన్నానని ప్రకటించాడు. తాను సానుకూల దృక్పథంతో ఉన్నట్లు.. చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పాడు. దేవుడిపై తనకు విశ్వాసం ఉందని.. మీరు చూపిస్తున్న ప్రేమ నాకు మరింత శక్తినిస్తోందని తెలిపాడు. ఈ సందర్భంగా తన కోసం ప్రార్థిస్తున్న అభిమానులకు, చికిత్స అందిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా పీలేకు గతేడాది క్యాన్సర్ సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. తర్వాత ఆయన కోలుకున్నారు. తిరిగి ఇటీవల క్యాన్సర్ సంబంధిత సమస్యతోనే ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆసుపత్రిలో ఉన్న ఆయన ఆరోగ్యంపై రోజుకో రకంగా వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Pelé (@pele) చదవండి: దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం.. మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? -
దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం..
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు సమాచారం. పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కీమోథెరపీ చికిత్సకు స్పందించడం లేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పీలేను పాలియేటివ్ కేర్‌కు తరలించి చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా గతేడాది అతని పెద్ద పేగు నుంచి కణతిని తొలగించారు. అప్పటినుంచి పీలే క్రమం తప్పకుండా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్నారు. కాగా ఇటీవలే పీలే ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబసభ్యులు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్లో చేర్చారు. శరీరం పై వాపులు రావడం వల్ల ఆయన ఆసుపత్రిలో చేరారు. దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా.. పీలే కూతురు స్పందించారు. చికిత్స కోసమే తన తండ్రి పీలేను ఆసుపత్రిలో చేర్చామన్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఏమీ లేదని, భయపడాల్సింది కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. న్యూఇయర్‌ను నాన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము అని కూడా ఆమె ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇంతలోనే ఇలా కీమోథెరపీకి స్పందించడం లేదని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పీలే వయసు 82ఏళ్లు. ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్స్‌లో ఒకడిగా పీలే పేరుగాంచారు. తన కెరీర్లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడి 1279 గోల్స్ చేశాడు. ఇందులో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇదొక గిన్నిస్ రికార్డ్. బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశాడు. పీలే.. మూడు వరల్డ్ కప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు FIFA WC: నరాలు తెగే ఉత్కంఠ.. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా -
దిగ్గజం పీలే పరిస్థితి విషమం.. వార్తలను ఖండించిన కూతురు
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరాడు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పీలే పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం హల్చల్ చేయడంతో పీలే కూతురు కెలీ నాసిమెంటో వార్తలను ఖండించింది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ తర్వాత తండ్రి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చింది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్లో చేరిన పీలేకు పరీక్షలు జరుగుతున్నాయని.. ఆ తర్వాతే అతని ఆరోగ్య పరిస్థితిపై ఒక స్పష్టత వస్తుందని తెలుస్తోంది. "మా నాన్నా ఆరోగ్యం గురించి మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. చికిత్స కోసమే ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఏమీ లేదు. భయపడాల్సింది కూడా లేదు. న్యూఇయర్‌ను నాన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. దానికి సంబంధించిన ఫొటోలు కూడా పోస్ట్ చేస్తాను" అని నాసిమెంటో ఇన్‌స్టాలో పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో 82 ఏళ్ల పీలే పెద్ద పేగు నుంచి ట్యూమర్‌ను తొలగించారు. అప్పటి నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ, వస్తూ ఉన్నాడు. అతనికి కీమో థెరపీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే అతనికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, కీమో థెరపీ ఆశించిన ఫలితం ఇవ్వడం లేదని ఈఎస్పీఎన్ బ్రెజిల్ తన కథనంలో పేర్కొంది. ఇక ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్స్‌లో ఒకడిగా పీలే పేరుగాంచాడు. తన కెరీర్లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడి 1279 గోల్స్ చేశాడు. ఇందులో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇదొక గిన్నిస్ రికార్డు కావడం విశేషం. ఇక బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశాడు. -
దిగ్గజం పీలే సరసన స్పెయిన్ మిడ్ ఫీల్డర్
ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం స్పెయిన్, కోస్టారికా మధ్య జరిగిన మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిసింది. మ్యాచ్‌లో అన్ని గోల్స్ చేసింది స్పెయిన్ ఆటగాళ్లే కావడం విశేషం. మ్యాచ్‌లో స్పెయిన్ 7-0 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది. స్పెయిన్ తరఫునఫెర్రాన్ టోరెస్ రెండు గోల్స్ చేయగా, ఓల్మో, అసెన్సియో, గవి, సోలెర్, మోరాటా తలో ఒక్క గోల్ చేశారు. ఈ మ్యాచ్ ద్వారా స్పెయిన్ మిడ్ ఫీల్డర్ గవి కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. వరల్డ్ కప్‌లో గోల్ కొట్టిన మూడో పిన్న వయస్కుడిగా నిలిచాడు. వరల్డ్ కప్‌లో గోల్ కొట్టిన అతి పిన్నవయస్కుల జాబితాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే మొదటి స్థానంలో ఉన్నాడు. 1958 వరల్డ్ కప్‌లో పీలే స్వీడన్‌పై 17 సంవత్సరాల 249 రోజుల్లో గోల్ కొట్టాడు. ఆ తర్వాత 1930 ఆరంభ ఫిఫా వరల్డ్‌కప్‌లో మెక్సికన్ ప్లేయర్ రోసెస్(18 సంవత్సరాల 93 రోజులు) రెండో స్థానంలో నిలిచాడు . బుధవారం కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టిన గవి (18 సంవత్సరాల 110 రోజులు) పిన్న వయస్కుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇక వరల్డ్ కప్‌ల పరంగా కోస్టారికాపై గెలుపు స్పెయిన్‌కు అతి పెద్ద విజయం. 2010 వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచిన స్పెయిన్ .. 2018లో రౌండ్ 16లో వెనుదిరిగింది. ఆ వరల్డ్‌కప్‌లో స్పెయిన్ పదో స్థానంలో నిలిచింది. చదవండి: అంతర్యుద్ధంతో కుటుంబం విచ్చిన్నం; అన్న ఘనాకు.. తమ్ముడు స్పెయిన్‌కు -
FIFA: సాకర్ సమరం.. దిగ్గజాలపై కన్ను వేయాల్సిందే
మొత్తం 20 ప్రపంచకప్‌లు... విజేతలుగా నిలిచిన 8 జట్లు ... ఎందరో సూపర్ స్టార్లు తమ ఆటతో అభిమానులను ఉర్రూతలూగించారు. కార్లోస్ ఆల్బర్టో, రోజర్ మిల్లా, బాబీ చార్ల్టన్, థియరీ హెన్రీ, ప్లాటిని, జిదాన్, ఒలివర్ కాన్, క్లిన్స్మన్, లోథర్ మథియాస్, రుడ్ గలిట్, జొహన్ క్రఫ్... ఇలా ఎందరో మైదానంలో బంతితో విన్యాసాలు చేయించారు. కానీ కొందరు మాత్రం వీరందరికంటే కచ్చితంగా పై స్థానంలో ఉంటారు. తమదైన ప్రత్యేకతతో ఆటను శాసించిన వీరు, అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి టాప్–5 వరల్డ్ కప్ స్టార్స్‌ను చూస్తే... - కరణం నారాయణ పీలే (బ్రెజిల్) ఫుట్‌బాల్ పేరు చెప్పగానే అందరికంటే ముందుగా గుర్తొచ్చే ఆటగాళ్లలో పీలే పేరు ఉంటుంది. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్ పీలేనే కావడం విశేషం. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించాడు. స్టార్ ఆటగాళ్లు ఉన్న జట్టులో 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో చెలరేగిన పీలే మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తుకి తనే ఒక దిగ్గజంగా ఎదిగాడు. కెరీర్ మొత్తంలో నాలుగు ప్రపంచకప్‌లు ఆడిన పీలే మొత్తం 12 గోల్స్ సాధించాడు. డీగో మారడోనా (అర్జెంటీనా) పీలేతో సంయుక్తంగా ‘ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద సెంచరీ’గా నిలిచిన ఆటగాడు డీగో మారడోనా. దేశాలతో సంబంధం లేకుండా ఫుట్‌బాల్ అభిమానులందరి హృదయాలు గెల్చుకున్నాడు. 1986 ప్రపంచకప్‌ను అర్జెంటీనాకు సాధించి పెట్టడంతో అతను సూపర్‌స్టార్‌గా ఎదిగిపోయాడు. 1990లో కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కి చేర్చిన అతను 1994 వరల్డ్ కప్ సమయంలో డ్రగ్స్ వాడినట్లుగా తేలింది. నాలుగు ప్రపంచకప్‌లు ఆడి ఎనిమిది గోల్స్ చేసిన మారడోనా ఉజ్వల కెరీర్ ముగిసిన తర్వాత అనేక వివాదాలు చుట్టుముట్టినా... ప్లేయర్‌గా అవి అతని గొప్పతనాన్ని తగ్గించలేవు. ఫ్రాంజ్ బెకన్‌బాయర్ (పశ్చిమ జర్మనీ) జర్మనీ అందించిన ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడు. మూడు ప్రపంచకప్‌లు ఆడిన అతను తన శైలి, నాయకత్వ పటిమతో ‘ది ఎంపరర్’గా పేరు తెచ్చుకున్నాడు. కెప్టెన్‌గా, మేనేజర్‌గా రెండు సార్లు ప్రపంచకప్‌ను అందుకున్న ఇద్దరు ఆటగాళ్లలో బెకన్‌బాయర్ ఒకడు. 1974లో సొంతగడ్డపై కెప్టెన్ హోదాలో బెకన్‌బాయర్ తొలి మ్యాచ్ నుంచే జట్టును విజయ పథంలో నడిపించాడు. ఫైనల్లో జర్మనీ 2–1తో నెదర్లాండ్స్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించి చరిత్రలో నిలిచిపోయాడు. అనంతరం 1990లో బెకన్‌బాయర్ కోచ్‌గా ఉన్న పశ్చిమ జర్మనీ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. గెర్డ్ ముల్లర్ (పశ్చిమ జర్మనీ) ‘ద నేషన్స్ బాంబర్’ అనే నిక్‌నేమ్ ఉన్న గెర్డ్ ముల్లర్ ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లలో ఒకడు. రెండు ప్రపంచకప్‌లలో (1970, 1974 ) 13 మ్యాచ్‌లలోనే మొత్తం 14 గోల్స్ కొట్టిన ముల్లర్ ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 1974లో సొంతగడ్డపై ప్రపంచకప్ ఫైనల్లో ముల్లర్ చేసిన గోల్‌తో జర్మనీ రెండోసారి విజేతగా నిలిచింది. కెరీర్ ఆసాంతం ముల్లర్ ‘ఫెయిర్ ప్లేయర్’గా గుర్తింపు పొందడం విశేషం. రొనాల్డో (బ్రెజిల్) ఫుట్‌బాల్‌ను ప్రాణంగా ప్రేమించే బ్రెజిల్లో పీలే తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్లేయర్ రొనాల్డో లూయీ డి లిమా. మూడుసార్లు ‘ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’, రెండు సార్లు ‘గోల్డెన్ బాల్’ గెలుచుకోవడం మాత్రమే రొనాల్డో గొప్పతనం కాదు. పీలే రిటైర్మెంట్ తర్వాత 24 ఏళ్ల పాటు వరల్డ్ కప్ విజయానికి నోచుకోకుండా నిరాశగా కనిపించిన బ్రెజిల్ అభిమానులకు కొత్త ఊపిరి పోసింది అతనే అనడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా నాలుగు ప్రపంచకప్‌లు ఆడిన రొనాల్డో 15 గోల్స్ కొట్టి రెండోస్థానంతో కెరీర్‌ను ముగించాడు. చదవండి: FIFA: 1950లో బంగారం లాంటి అవకాశం వదిలేసిన భారత్ -
FIFA World Cup: అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లెవరంటే?
మరో రెండు రోజుల్లో టి20 వరల్డ్‌కప్ ముగియనుంది. ఇప్పటివరకు ఫోర్లు, సిక్సర్లు కౌంట్ చేసిన నోటితోనే గోల్స్ కౌంట్ చేయాల్సి ఉంటుంది. టి20 వరల్డ్‌కప్ ముగిసిన వారం రోజులకు మరో మెగా సమరం మొదలుకానుంది. క్రికెట్ కంటే కాస్త ఎక్కువే క్రేజ్ ఉన్న క్రీడ ఫుట్‌బాల్. మాములు ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతూనే అభిమానులకు పూనకాలు వస్తాయి. మరి అలాంటిది సాకర్ సమరానికి(ఫిఫా వరల్డ్‌కప్) సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే అప్పటివరకు మనకు తెలిసిన స్టార్స్‌ను ఉమ్మడిగా వేర్వేరు జట్లలో చూస్తుంటాం. కానీ ఫిఫా వరల్డ్‌కప్ అనగానే దేశం తరపున ఆడడానికి ఆటగాళ్లు సిద్ధమవుతారు. మరి అంత క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్ గురించి మాట్లాడుకుంటే.. 1930 నుంచి ఇప్పటి వరకూ 21 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ టోర్నీలు జరిగాయి. మరి ఇప్పటి వరకూ ఈ టోర్నీల్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్స్ ఎవరనేది ఒకసారి పరిశీలిద్దాం. మిరొస్లావ్ క్లోజ్ ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా జర్మనీ స్ట్రైకర్ మిరొస్లావ్ క్లోజ్ నిలుస్తాడు. అతడు ఇప్పటి వరకూ వరల్డ్‌కప్‌లలో 24 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 16 గోల్స్‌తో టాప్‌లో ఉన్నాడు. క్లోజ్ నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడాడు. ఈ 24 మ్యాచ్‌లలో 63సార్లు అతడు గోల్డ్పోస్ట్పై దాడి చేసి 16 గోల్స్ చేయడం విశేషం. అంటే ప్రతి నాలుగు షాట్లలో ఒకదానిని అతడు గోల్‌గా మలిచాడు. రొనాల్డో లూయిస్ నజారియో డె లిమా మిరొస్లావ్ క్లోజ్‌కు ముందు అత్యధిక గోల్డ్స్ రికార్డు బ్రెజిల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో పేరిట ఉండేది. రొనాల్డో చివరిసారి 2002లో వరల్డ్‌కప్ గెలిచిన బ్రెజిల్ టీమ్‌లో సభ్యుడు. అతడు మూడు టోర్నీల్లో 19 మ్యాచ్‌లలోనే 15 గోల్స్ చేయడం విశేషం. 1998లో తాను ఆడిన తొలి వరల్డ్‌కప్‌లో నాలుగు గోల్స్ చేశాడు. ఇక 2002లో అయితే ఏడు మ్యాచ్‌లలోనే 8 గోల్స్ చేసిన గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. అతని ప్రదర్శనతోనే 2002లో బ్రెజిల్ ఖాతాలో ఐదో టైటిల్ వచ్చి చేరింది. గెర్డ్ ముల్లర్ జర్మనీ లెజెండరీ ప్లేయర్ గెర్డ్ ముల్లర్ 14 వరల్డ్‌కప్ గోల్స్ చేశాడు. కేవలం రెండు వరల్డ్‌కప్‌లలో అతడు ఇన్ని గోల్స్ చేయడం విశేషం. 1970 వరల్డ్‌ప్‌లో 10 గోల్స్‌తో గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. 1970 తర్వాత ముల్లర్ చేసినన్ని గోల్స్ మరే ఇతర వరల్డ్‌కప్‌లో ఏ ఆటగాడు కూడా చేయలేదు. జస్ట్ ఫాంటెయిన్ ఫ్రాన్స్ స్ట్రైకర్ ఫాంటెయిన్కు ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఉంది. అతడు 1958 వరల్డ్‌కప్‌లో ఏకంగా 13 గోల్స్ చేశాడు. అతడు ఆడిన ఏకైక వరల్డ్‌కప్ ఇదే కావడం గమనార్హం. పీలే బ్రెజిల్ లెజెండరీ ప్లేయర్ పీలే వరల్డ్‌కప్‌లలో 12 గోల్స్ చేశాడు. అతడు నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడాడు. అతడు ఎప్పుడూ గోల్డెన్ బూట్ అవార్డు గెలవకపోయినా.. 1970లో బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ టోర్నీలో నాలుగు గోల్స్ చేయడంతోపాటు ఆరు గోల్స్ కావడంలో సాయపడ్డాడు. ఇప్పుడు ఖతార్‌లో జరగబోయే వరల్డ్‌కప్‌లో అందరి కళ్లూ థామస్ ముల్లర్, క్రిస్టియానో రొనాల్డో, లూయిస్ సురెజ్, లియోనెల్ మెస్సీ, కరీమా బెంజెమా లపైనే ఉన్నాయి. ముల్లర్ ఖాతాలో 10 గోల్స్ ఉండగా.. రొనాల్డో 7, మెస్సీ 6 గోల్స్ చేశారు. -
మరోసారి ఆసుపత్రిలో చేరిన బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే మరోసారి ఆసుపత్రిలో చేరాడు. కొంతకాలంగా పీలే పెద్దప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిదే. గతేడాది సెప్టెంబర్ 2021లో పెద్దప్రేగుకు ఏర్పడిని కణితిని వైద్యులు తొలగించారు. అప్పటినుంచి పీలే..సావోపోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రికి తరచు చికిత్స కోసం వెళ్లి వస్తున్నాడు. తాజాగా సోమవారం నొప్పి మరోసారి ఎక్కువవడంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పీలే పరిస్థితి బాగానే ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఆయన అబ్జర్వేషన్లో కొనసాగుతున్నాడు. కాగా గత ఫిబ్రవరిలో యూరిన్ ఇన్ఫెక్షన్ సోకడంతో ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కీమోథెరపీ కూడా చేయించుకున్నాడు. కాగా ఫుట్‌బాల్‌లో పీలేది చెరగని ముద్ర. మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదయింది. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. చదవండి: Wimbledon 2022: రష్యన్ టెన్నిస్ ప్లేయర్లకు షాక్.. వింబుల్డన్‌కు దూరమయ్యే అవకాశం! -
ఆసుపత్రిలో చేరిన దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్
Pele Hospitalized For Treatment Of Colon Tumor: గత కొంతకాలంగా కోలన్ ట్యూమర్‌తో బాధపడుతున్న బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్ పీలే(81) ఆసుపత్రిలో చేరాడు. సంవత్సర కాలంగా పీలే పెద్ద పేగు కణితి సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన కుమార్తె పేర్కొంది. త్వరలోనే పీలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, పీలే ఈ ఏడాది సెప్టెంబర్‌లో కణితి తొలగింపుకు సంబంధించిన శస్త్రచికిత్సను చేయించుకున్నారు. ఆ సమయంలో ఆయన ఐసీయూలో ఉన్నారు. ఇదిలా ఉంటే, మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదైవుంది. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. చదవండి: లెజెండ్స్ క్రికెట్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్.. -
ఆట ఏదైనా ఆ జెర్సీ అంటే ఎందుకంత క్రేజ్!
Top 11 Players Who Wear Number 10 Jersey In Cricket: క్రీడల్లో నెంబర్ 10 జెర్సీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక్క క్రికెట్లోనే కాదు.. ఫుట్‌బాల్‌లోనూ నెంబర్ 10 జెర్సీకి వేరే లెవెల్ క్రేజ్ ఉంది. ఫుట్‌బాల్ దిగ్గజాలుగా పేరు పొందిన పీలే, మారడోనా, జినదిన్ జిదానే, రొనాల్డీనో, డెల్పోరో, వెయిన్ రూనీ, మెస్సీ లాంటి స్టార్స్ ధరించే జెర్సీ నెంబర్ 10 కావడం విశేషం. ఆ జెర్సీ ధరిస్తే స్టార్ హోదా వస్తుందని చాలా మంది నమ్మకం. ఇక క్రికెట్లో నెంబర్ 10 జెర్సీ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. తన కెరీర్లో ఎక్కువకాలం ఈ జెర్సీతోనే ఆడిన సచిన్ ఎన్నోమైలురాళ్లను అందుకున్నాడు. ఈ విధంగా క్రికెట్ చరిత్రలో 10వ నెంబర్ జెర్సీ ధరించిన కొందరి ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. - సాక్షి, వెబ్‌డెస్క్ సచిన్ టెండూల్కర్(టీమిండియా) టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మొదట్లో 99 జెర్సీతో బరిలోకి దిగాడు. ఆ తర్వాత 33 జెర్సీ నెంబర్‌తో ఆడాడు. ఇక చివరగా 10వ నెంబర్ జెర్సీతో రిటైర్మెంట్ వరకు ఆడిన సచిన్ ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించాడు. క్రికెట్ చరిత్రలో వంద సెంచరీలు సాధించి చరిత్రలో నిలిచిపోయాడు. టెస్టు, వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. చదవండి: Abu Dhabi T10 League: సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో.. అయినా ఊచకోతే క్రెయిగ్ మెక్‌మిలన్(న్యూజిలాండ్) 1997-2007 కాలంలో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రెయిగ్ మెక్‌మిలన్ మంచి బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. తన 10 ఏళ్ల కెరీర్లో ఎక్కువశాతం 10వ నెంబర్ జెర్సీలోనే కనిపించాడు. న్యూజిలాండ్ తరపున 55 టెస్టుల్లో 3116 పరుగులు.. 197 వన్డేల్లో 4707 పరుగులు సాధించాడు. ఇక 8 టి20ల్లో ఆడిన మెక్‌మిలన్ 187 పరుగులు సాధించాడు. స్టువర్ట్ లా(ఆస్ట్రేలియా) 1994-95 మధ్య కాలంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా గాయంతో వెనుదిరిగిన సమయంలో అతని స్థానంలో టెస్టు జట్టులోకి వచ్చాడు స్టువర్ట్ లా. ఇదే అతను ఆడిన ఒకే ఒక్క టెస్టు మ్యాచ్. ఇక క్రికెట్ ఆడినంత కాలం తన కెరీర్లో 10వ నెంబర్ జెర్సీని ధరించాడు. ఆసీస్ తరపున 54 వన్డేల్లో 1237 పరుగులు.. ఒక్క టెస్టు మ్యాచ్‌లో 54 పరుగులు సాధించాడు. చదవండి: Joshua da Silva Vs Dhananjaya de Silva: వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా! అలెన్ డొనాల్డ్(దక్షిణాఫ్రికా) దక్షిణాఫ్రికా తరపున దిగ్గజ బౌలర్‌గా పేరు పొందిన అలెన్ డొనాల్డ్ జెర్సీ నెంబర్ 10. దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో 300 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా డొనాల్డ్ చరిత్ర సృష్టించాడు. ఒక ఓవరాల్‌గా 72 టెస్టులాడిన అలెన్ డొనాల్డ్ 330 వికెట్లతో సౌతాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేగాక 164 వన్డేల్లో 272 వికెట్లు తీసిన డొనాల్డ్ రిటైర్మెంట్ తర్వాత అంతర్జాతీయంగా కొన్ని దేశాలకు.. చాలా ప్రైవేట్ లీగ్‌ల్లో కోచ్‌గా వ్యవహరించాడు. షాహిద్ అఫ్రిది(పాకిస్తాన్) ఆసియా నుంచి చూస్తే క్రికెట్లో సచిన్ తర్వాత జెర్సీ నెంబర్ 10తో ఫేమస్ అయిన ఆటగాడు షాహిద్ అఫ్రిది మాత్రమే. పాకిస్తాన్ దిగ్గజ ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన అఫ్రిది వ్యక్తిగత జీవితంలో వివాదాలకు కొదువ లేకపోయిన.. ఆటలో మాత్రం పలు రికార్డులను బద్దలుకొట్టాడు. వన్డే చరిత్రలో 37 బంతుల్లోనే సెంచరీ సాధించిన అఫ్రిది రికార్డు 17 ఏళ్ల పాటు చెక్కుచెదరలేదు. వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అఫ్రిది తొలి స్థానంలో ఉన్నాడు. ఇక పాకిస్తాన్ తరపున అఫ్రిది 398 వన్డేల్లో 8064 పరుగులు.. 395 వికెట్లు, 99 టి20ల్లో 1416 పరుగులు.. 98 వికెట్లు తీశాడు. చదవండి: Steve Smith: 'ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను బాత్రూం అద్దానికి అంటించా' డారెన్ లీమన్(ఆస్ట్రేలియా) 1996లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన డారెన్ లీమన్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారడానికి ఐదేళ్లు పట్టింది. లీమన్ 2004-05 కాలంలో 10వ నెంబర్ జెర్సీ ధరించి ఆడాడు. ఆస్ట్రలియా తరపున 117 వన్డేల్లో 3078 పరుగులు సాధించాడు. ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియాకు ప్రధాన కోచ్‌గా సేవలందించిన లీమన్ 2017 బాల్‌టాంపరింగ్ ఉదంతం తర్వాత పదవి నుంచి వైదొలిగాడు. జెరెయింట్ జోన్స్(ఇంగ్లండ్) ఇంగ్లండ్ వికెట్ కీపర్‌గా 2004-06 మధ్య కాలంలో సేవలందించిన జెరెయింట్ జోన్స్ తన కెరీర్ మొత్తం జెర్సీ నెంబర్ 10నే ధరించాడు. ఈ కాలంలో అతను ఇంగ్లండ్ తరపున 51 వన్డేల్లో 862 పరుగులు.. 34 టెస్టుల్లో 1172 పరుగులు చేశాడు. పీటర్ సిడిల్(ఆస్ట్రేలియా) 2019లో ఆస్ట్రేలియా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పీటర్ సిడిల్ .. 2008 అరంగేట్రం నుంచి రిటైర్ అయ్యేవరకు జెర్సీ నెంబర్ 10తోనే ఆడాడు. ఆస్ట్రేలియా తరపున 67 టెస్టుల్లో 217 వికెట్లు.. 20 వన్డేల్లో 17 వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్(టీమిండియా) టీమిండియా నుంచి సచిన్ తర్వాత శార్దూల్ మాత్రమే జెర్సీ నెంబర్ 10 ధరించాడు. అయితే సచిన్ కానుకగా ఉన్న ఆ జెర్సీని ధరించడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారడంతో బీసీసీఐ అనధికారికంగా ఆ జెర్సీ నెంబర్‌ను తొలగించింది. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న శార్దూల్ 4 టెస్టులు, 15 వన్డేలు, 24 టి 20లు ఆడాడు. డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా) ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు ఆడుతున్న మిల్లర్ కీలక బ్యాటర్‌గా మారాడు. అలెన్ డొనాల్డ్ తర్వాత జెర్సీ నెంబర్ 10 ధరించిన ఆటగాడిగా మిల్లర్ నిలిచాడు. విధ్వంసకర ఆటకు మారుపేరుగా ఉన్న మిల్లర్ దక్షిణాఫ్రికా తరపున 137 వన్డేలు.. 95 టి20లు ఆడాడు. చదవండి: Tim Paine scandal: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు షాహిన్ అఫ్రిది(పాకిస్తాన్) దిగ్గజ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ధరించిన 10వ నెంబర్ జెర్సీని ధరించడం సంతోషంగా ఉందంటూ షాహిన్ అఫ్రిది ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది. అయితే క్రికెట్లో అడుగుపెట్టిన మొదట్లో 40వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగిన షాహిన్ ఆ తర్వాత 10వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కీలకబౌలర్‌గా మారిన షాహిన్ టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. -
పీలే రికార్డును సమం చేసిన భారత స్టార్ ఫుట్‌బాలర్..
Sunil Chhetri Equals Pele Record: భారత ఫుట్‌బాల్ జట్టు సారథి సునీల్ ఛెత్రి అరుదైన రికార్డును సమం చేశాడు. శాఫ్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో గోల్ సాధించడం ద్వారా కెరీర్లో 77వ అంతర్జాతీయ గోల్ సాధించాడు. ఈ క్రమంలో ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలే సరసన నిలిచాడు. పీలే 92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్ సాధించగా, ఛెత్రి 123వ మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను సాధించాడు. మొత్తంగా అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో పీలే, అలీ మబ్కౌట్(యూఈఏ)తో కలిసి మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో 122 గోల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ 79 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఛెత్రి రికార్డు గోల్ సాధించి భారత్‌కు 1-0తేడాతో విజయాన్ని అందించాడు. చదవండి: దేశం కోసం ధోని.. మెంటార్‌గా ఎలాంటి ఫీజు వద్దన్న లెజెండ్ -
'నా తండ్రికి ప్రాణాపాయం తప్పింది.. మీ అందరికి కృతజ్ఞతలు'
బ్రెసిలియా: అనారోగ్యం బారిన పడ్డ బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కోలుకుంటున్నారు. పెద్ద ప్రేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పీలే బ్రెజిల్‌లోని సావోపాలో ఆసుపత్రిలో చేరారు. కాగా ఆయనకు రెండు రోజుల క్రితం వైద్యులు సర్జరీ నిర్వహించారు. అప్పటినుంచి ఐసీయూలో ఉన్న పీలేను తొందరలోనే రెగ్యులర్ రూమ్‌కు షిఫ్ట్ చేయనున్నారు. ఈ సందర్భంగా పీలే కూతురు తన తండ్రి ఆరోగ్య విషయమై ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. చదవండి: PELE: ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం.. ''నా తండ్రి సర్జరీ అనంతరం త్వరగానే కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయనను రెగ్యులర్ రూమ్‌కు షిఫ్ట్ చేయనున్నారు. మరో రెండు రోజుల్లో ఇంటికి కూడా వెళ్లనున్నాం. మీ అందరి దీవెనలతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. సర్జరీ చేసి ఆయనను మాములు మనిషిని చేసిన వైద్యుల బృందానికి, అండగా నిలిచిన ఆసుపత్రి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అతను కోలుకోవాలని ప్రార్థిస్తూ లక్షల మంది అభిమానులు పంపించిన మొయిల్స్, విషెస్‌కు కృతజ్ఞతలు. మీ మెయిల్స్ అన్ని చదవలేకపోయినా.. ఆయనపై చూపించిన ప్రేమ, అభిమానం మిమ్మల్ని మరింత దగ్గర చేసింది. థ్యాంక్యూ సో మచ్'' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదైవుంది. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. ఇక ఫుట్‌బాల్ క్లబ్ మ్యాచ్‌ల విషయానికి వస్తే.. పీలే 1957 నుంచి 1974 వరకు సాంటోస్ క్లబ్‌కు 19 సీజన్ల పాటు ఆడి 643 గోల్స్ చేశాడు. చదవండి: Emma Raducanu: అంతా నాలుగు నెలల్లోనే... అనామక ప్లేయర్ నుంచి చాంపియన్ దాకా! View this post on Instagram A post shared by Kely Nascimento (@iamkelynascimento) -
ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం..
న్యూఢిల్లీ: అనారోగ్యంతో బాధపడుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలేకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పెద్దప్రేగుకు సర్జరీ అనంతరం పర్యవేక్షణ నిమిత్తం అతన్ని ఐసీయూలో ఉంచారు. అయితే, ప్రస్తుతం పీలే ఆరోగ్యం నిలకడగా ఉందని, కీలక అవయవాలన్నీ మెరుగ్గా పని చేస్తున్నాయని, ఆయన ఉత్సాహంగా మాట్లాడగలుతున్నారుని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. తన ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోందంటూ పీలే తన ఇన్‌స్టా ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశారు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా గత నెలలో ఆసుపత్రికి వెళ్లగా.. పెద్దపేగులో ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీన్ని వెంటనే సర్జరీ ద్వారా తొలగించాలని తెలిపారు. రొటీన్ కార్డియోవాస్కులర్, లాబోరేటరీ పరీక్షల్లో భాగంగా ట్యూమర్ ఉన్నట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదైవుంది. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. ఇక క్లబ్ ఫుట్‌బాల్ విషయానికొస్తే.. ఈ పోటీల్లో సైతం అత్యధిక గోల్స్ రికార్డు పీలే పేరిటే ఉండేది. ఈ రికార్డును అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ లియోనల్ మెస్సీ గతేడాదే బ్రేక్ చేశాడు. పీలే 1957 నుంచి 1974 వరకు సాంటోస్ క్లబ్‌కు 19 సీజన్ల పాటు ఆడి 643 గోల్స్ చేయగా, 2004 నుంచి 2020 వరకు బార్సిలోనాకు ప్రాతినిధ్యం వహించిన మెస్సీ.. 17 సీజన్ల పాటు ఆడి 749 మ్యాచ్‌ల్లో 644 గోల్స్ చేసి పీలే రికార్డును అధిగమించాడు. చదవండి: టెన్నిస్ చరిత్రలో పెనుసంచలనం -
రొనాల్డో రికార్డ్‌ను బద్దలు కొట్టిన మెస్సీ..
బ్రెసిలియా: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ అరుదైన రికార్డును నెలకొల్పాడు. పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉన్న ఫ్రీకిక్ గోల్స్ రికార్డును ఈ అర్జెంటీనా సంచలన ఫుట్‌బాలర్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా మొత్తం మూడు గోల్స్ చేయగా.. అన్నింటిలోనూ మెస్సీ భాగస్వామిగా ఉన్నాడు. తొలి రెండు గోల్స్‌లో బాల్‌ను పాస్ చేయడంలో కీలకపాత్ర పోషించిన మెస్సీ.. ఓ ఫ్రీకిక్‌ను గోల్‌గా మలచి అర్జెంటీనా లీడ్‌ను 3-0కు పెంచాడు. ఈ క్రమంలోనే రొనాల్డో రికార్డును మెస్సీ అధిగమించాడు. ఇప్పటివరకు రొనాల్డో ఫ్రీకిక్స్తో 57 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో మెస్సీ 58వ సారి ఫ్రీకిక్ గోల్ సాధించి టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ప్రస్తుతానికి 76 గోల్స్ సాధించిన మెస్సీ.. మరొక్క గోల్ చేస్తే, అత్యధిక గోల్స్ సాధించిన సౌత్ అమెరికన్‌గా చరిత్ర పుటల్లో నిలుస్తాడు. ఈ జాబితాలో దిగ్గజ ఫుట్‌బాలర్, బ్రెజిల్ మాజీ కెప్టెన్ పీలే 77 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. -
క్రిస్టియానో రొనాల్డో కొత్త చరిత్ర
మిలాన్ (ఇటలీ): ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఇటలీ ప్రొఫెషనల్ లీగ్ సెరియెలో భాగంగా క్యాలియరి క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువెంటస్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 36 ఏళ్ల రొనాల్డో హ్యాట్రిక్ సాధించడంతో ఆ జట్టు 3–1తో గెలిచింది. ఈ మూడు గోల్స్‌తో అధికారికంగా గుర్తింపు పొందిన మ్యాచ్‌లలో రొనాల్డో చేసిన గోల్స్ సంఖ్య 770కు చేరుకుంది. దాంతో 767 గోల్స్‌తో బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట ఉన్న రికార్డు తెర మరుగైంది. రొనాల్డో తన కెరీర్లో పోర్చుగల్ తరఫున 120 గోల్స్ సాధించగా... ప్రొఫెషనల్ క్లబ్ జట్ల తరఫున 668 గోల్స్ నమోదు చేశాడు. తన రికార్డు బద్దలు కొట్టిన రొనాల్డోను పీలే సోషల్ మీడియా ద్వారా అభినందించాడు. -
మెస్సీ ప్రపంచ రికార్డు
బార్సిలోనా (స్పెయిన్): ఫుట్‌బాల్ క్రీడలో 46 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును బార్సిలోనా స్టార్ ప్లేయర్, అర్జెంటీనా జట్టు కెప్టెన్ లయనెల్ మెస్సీ బద్దలు కొట్టాడు. ఒకే క్లబ్ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా 33 ఏళ్ల మెస్సీ గుర్తింపు పొందాడు. ఇప్పటిదాకా 643 గోల్స్‌తో బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట ఉన్న రికార్డును గత ఆదివారం మెస్సీ సమం చేశాడు. పీలే 1957 నుంచి 1974 వరకు బ్రెజిల్‌లోని సాంటోస్ క్లబ్ తరఫున ఆడిన పీలే 643 గోల్స్ సాధించాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన స్పానిష్ లీగ్‌లో రియల్ వాలాడోలిడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా జట్టు 3–0తో గెలిచింది. ఆట 65వ నిమిషంలో మెస్సీ గోల్ చేసి పీలే రికార్డును అధిగమించాడు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో మెస్సీ 2004 నుంచి బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పీలే 643 గోల్స్‌ను 757 మ్యాచ్‌ల్లో చేయగా... మెస్సీ 644 గోల్స్‌ను 749 మ్యాచ్‌ల్లో సాధించాడు. ఈ జాబితాలో గెర్డ్ ముల్లర్ (బయెర్న్ మ్యూనిక్–564 గోల్స్) మూడో స్థానంలో... ఫెర్నాండో పెరోటియో (స్పోర్టింగ్ లిస్బన్–544 గోల్స్) నాలుగో స్థానంలో... జోసెఫ్ బికాన్ (స్లావియా ప్రాగ్–534 గోల్స్) ఐదో స్థానంలో ఉన్నారు. -
ఫిఫా ప్రపంచకప్: పీలే తర్వాత ఎంబాపెనే!
మాస్కో : ఫ్రాన్స్ యువ కెరటం కైలిన్ ఎంబాపె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆదివారం క్రోయేషియాతో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఈ స్టార్ ఆటగాడు 65వ నిమిషంలో గోల్ సాధించి బ్రెజిల్ దిగ్గజం పీలే (1958లో) తర్వాత అతి పిన్న వయసులో వరల్డ్ కప్ ఫైనల్లో గోల్ కొట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-2తో నెగ్గి 20 ఏళ్ల తర్వాత రెండోసారి జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక అంతకముందు నాకౌట్ సమరంలోను గోల్ సాధించిన ఎంబాపే ఇదే..పీలే రికార్డును సమం చేశాడు. మ్యాచ్ అనంతరం ‘మైలవ్’ అనే క్యాప్షన్‌తో ట్రోఫీని ముద్దాడుతూ.. ఫోజిచ్చిన ఫొటోను ఎంబాపె ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు పీలేనే తొలుత స్పందించడం విశేషం. ‘కైలిన్ నా రికార్డును సమం చేశాడు.. ఇక నా బూట్లకున్న దుమ్ముదులిపి బరిలోకి దిగాల్సిందే’ అని ట్వీట్ చేశాడు. అంతకు ముందు ‘వెలకమ్ టూ ది క్లబ్’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అయ్యాయి. If Kylian keeps equalling my records like this I may have to dust my boots off again... // Se o @KMbappe continuar a igualar os meus records assim, eu vou ter que tirar a poeira das minhas chuteiras novamente...#WorldCupFinal https://t.co/GYWfMxPn7p — Pelé (@Pele) July 15, 2018 క్రొయేషియా ఆటగాడు మాన్‌జుకిచ్ (18వ నిమిషం) సెల్ఫ్ గోల్‌తో ఫ్రాన్స్ ఖాతా తెరవగా... గ్రీజ్మన్ (38వ ని.లో), పోగ్బా (59వ ని.లో), ఎంబాపె (65వ ని.లో) తమ జట్టు తరఫున గోల్స్ కొట్టారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్ (28వ ని.లో), మాన్‌జుకిచ్ (69వ ని.లో) గోల్స్ సాధించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్ 2–1తో ఆధిక్యంలో నిలవగా... ఆ తర్వాత మరో రెండు గోల్స్‌తో ఫ్రాన్స్ తమ ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేసింది. దీంతో ఫ్రాన్స్ సునాయస విజయం సాధించింది. -
పీలే తర్వాత ఎంబాపె!
మాస్కో: అర్జెంటీనాతో మ్యాచ్ ముందు వరకు కైలిన్ ఎంబాపె గురించి బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ఈ ఫ్రాన్స్ ఫుట్‌బాలర్ గురించి నెటిజన్లు ఆసక్తిగా గూగ్ల్లో సెర్చ్ చేస్తున్నారు. కీలక మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి గత ప్రపంచకప్ ఫైనలిస్ట్‌ను ఇంటికి పంపించిన ఈ ఫార్వర్డ్ ప్లేయర్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక ప్రపంచకప్ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అంతపుట్బాల్ దిగ్గజం పీలే (17 సంవత్సరాల 8 నెలల 6 రోజులకు) ఫిపా ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన అతి చిన్న వయస్కుడిగా తొలి స్థానంలో ఉన్నాడు. 1958 సాకర్ ఫైనల్ సమరంలో స్వీడన్‌పై రెండు గోల్స్ చేసి పీలే ఈ ఘనత సాధించాడు. 60 సంత్సరాల అనంతరం ఫ్రాన్స్ ఆటగాడు కైలిన్ ఎంబాపె (19 సంవత్సరాల 6 నెలల 10 రోజులు) అర్జెంటీనాపై రెండు గోల్స్ చేయడంతో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అర్జెంటీనా- ఫ్రాన్స్ మ్యాచ్ అనంతరం ఎంబాపెకు ట్విటర్ ద్వారా పీలే అభినందనలు తెలపడం ఇక్కడ మరో విశేషం. Congratulations, @KMbappe. 2 goals in a World Cup so young puts you in great company! Good luck for your other games. Except against🇧🇷! 😅/ Parabéns, Kylian. Marcar 2 gols em uma partida da Copa te coloca em boa companhia! Boa sorte no resto da competição. Exceto contra o 🇧🇷! https://t.co/DW0XcJF49m — Pelé (@Pele) June 30, 2018 -
పీలే మూడో వివాహం
సావోపాలో: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే 75 ఏళ్ల వయస్సులో మూడోసారి పెళ్లికొడుకయ్యారు. జపాన్‌కు చెందిన తన చిరకాల ప్రియురాలు... 50 ఏళ్ల మార్సియా సిబెల్ వోకిని శనివారం ఆయన వివాహం చేసుకున్నారు. 1980ల్లో తొలిసారిగా వీరిద్దరు ఒకరికొకరు పరిచయమయ్యారు. అయితే 2010 నుంచి మాత్రం సన్నిహితులయ్యారు. వ్యాపార వేత్త అయిన వోకి ఇటీవలి కాలంలో పీలే పలుమార్లు అనారోగ్యానికి గురైనప్పుడు దగ్గరుండి సపర్యలు చేశారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే వీరిద్దరు వివాహం చేసుకోవాలనుకున్నా పీలే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వాయిదా పడింది. పీలే అన్ని స్థాయిల్లో కలిపి తన కెరీర్లో 1,363 మ్యాచ్‌లు ఆడి 1,281 గోల్స్ చేశారు. 1957 నుంచి 1971 మధ్య బ్రెజిల్ తరఫున 91 మ్యాచ్‌లు ఆడారు. పీలే సభ్యుడుగా ఉన్న బ్రెజిల్ జట్టు 1958, 1962, 1970లలో ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించింది. -
దిగ్గజ ఆటగాడికి మూడో పెళ్లి
రియోడిజనీరో: బ్రెజిల్ ఫుట్‌బాట్ మాజీ దిగ్గజం పీలే త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఇదివరకే ఇద్దర్ని వివాహామాడిన పీలే వారికి విడాకులిచ్చిన విషయం తెలిసిందే. 75 ఏళ్ల ఈ ఫుట్‌బాల్ లెజెండ్, 42 ఏళ్ల మార్సియా సిబెలే వివాహం మంగళవారం జరగనుంది. వీరిద్దరూ 2010 నుంచి డేటింగ్ చేస్తున్నట్లు కొన్ని నెలల నుంచి వార్తలు ప్రచారం అవుతున్నాయి. తన పెళ్లి వార్తను పీలే స్వయంగా మీడియాకు తెలిపారు. 1958, 1962, 1970లలో ఫుట్ బాల్ ప్రపంచకప్ సొంతం చేసుకున్న బ్రెజిల్ జట్టులో కీలక ఆటగాడు పీలే. 1363 మ్యాచ్ లాడిన పీలే 1281 గోల్స్ చేశాడు. వ్యక్తిగత జీవితానికొస్తే.. పీలే మొదట రోస్ మేరి ఛోల్బీని పెళ్లి చేసుకోగా వీరికి ముగ్గురు సంతానం కలిగారు. ఆ తర్వాత అస్సీరియా నాస్కిమెంటోతో జీవితాన్ని పంచుకున్నాడు. ఆమెతో జోషువా, సెలెస్ట్ అనే ఇద్దరు కవలలకు పీలే తండ్రయ్యారు. ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్న బ్రెజిల్ మాజీ ఆటగాడు తన గర్ల్ ఫ్రెండ్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. -
మెస్సీకి పీలే విన్నపం
రియో డి జనీరో: అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ తన వీడ్కోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బ్రెజిల్ దిగ్గజ ఆటగాడు పీలే విన్నవించాడు. ఇటీవల జరిగిన కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్ ను గోల్ గా మలచడంలో విఫలమైన మెస్సీ.. అర్జెంటీనా జట్టు ఓటమికి కారణమయ్యాడు. దీంతో ఇక తన అంతర్జాతీయ ఫుట్ బాల్ కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే తన వీడ్కోలు నిర్ణయాన్ని మార్చుకోవాలని పలువురు అర్జెంటీనా ఫుట్ బాల్ ఆటగాళ్లు ఇప్పటికే మెస్సీకి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు పీలే కూడా మెస్సీ నిర్ణయం సరైనది కాదని అంటున్నాడు. 'గత 10ఏళ్లలో మెస్సీనే అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక మ్యాచ్ లో ఓటమితో అతనికి ఏమైంది. గెలుపు-ఓటములు అనేవి సహజం. కేవలం ఒక పెనాల్టీ షూటౌట్ ను మిస్సయ్యాడు. అంతమాత్రన అంతర్జాతీయ కెరీర్‌ను ముగించడం సబబు కాదు. మెస్సీ చాలా నిరాశలో ఉన్నాడు. కొంత సమయం తీసుకుంటే దాన్ని మరిచిపోవచ్చు. చాలా మంది అత్యుత్తమ ఆటగాళ్లు ఇదే తరహాలో విఫలమైన దాఖలాలు చాలా ఉన్నాయి. అదంతా ఆటలో భాగం. ఏదొక తప్పిదం జరిగితే మొత్తం ఫుట్ బాల్ కెరీర్ నుంచి వైదొలుగుతానని అనడం సరైన నిర్ణయం కాదు. ఆ నిర్ణయాన్ని మార్చుకో' అని పీలే విజ్ఞప్తి చేశాడు. -
పీలే 1000వ గోల్
ఆ నేడు 19 నవంబర్ 1969 ఎడ్సన్ ఆరెంటస్ డొ నాసిమెంటో! ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? పోనీ చిన్న క్లూ. ఈ మధ్యే ఈయన కోల్‌కతా వచ్చి వెళ్లారు. చెప్పలేకపోతున్నారా? మరో క్లూ ఏంటంటే... విశ్వవిఖ్యాతుడైన ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ ఆయన. కొంచెం కష్టమే కదా! సరే ఆ పేరును వదిలేద్దాం. పీలే ఎవరో తెలుసా? తెలీకేం బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం అంటారా. ఎస్! ఆయనే ఈయన. పీలే అసలు పేరే.. పైన మీరు చదివిన పేరు. పీలేకు 75 ఏళ్లు. 1940 అక్టోబర్ 23న జన్మించారు. అయితే అంతకన్నా ప్రాముఖ్యమైన రోజు ఆయన ఫుట్‌బాల్ కెరీర్లో ఇంకొకటి ఉంది. అదే నవంబర్ 19. ఆ రోజు ఆయన ఫుట్‌బాల్‌లో తన 1000వ గోల్ కొట్టారు! బ్రెజిల్ నగరం రియో డి జనిరో లోని మరకానా స్టేడియంలో వాస్కో డ గామా టీమ్‌పై పెనాల్టీ కిక్‌తో ఈ చరిత్రాత్మకమైన గోల్ సాధించారు. పీలే 1974లో రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యేనాటికి 1282 గోల్స్ చేశారు. 1363 ఆటలు ఆడారు. -
పీలేకు ఘనస్వాగతం
-
ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న గంగూలీ
కోల్ కతా: ఫుట్ బాల్ దిగ్గజం పీలే నగరానికి వచ్చిన సందర్బంగా ఆయన్ను కలిసిన టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు. 1977లో మోహన్ బగాన్‌తో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడేందుకు తొలిసారి కోల్‌కతాకు పీలే వచ్చినప్పుడు తాను ఐదు సంవత్సరాలు బాలుడినని.. ఆ సమయంలో పీలేను నల్ల ముత్యంగా అభిమానులు పిలుచుకోవడం తనకు ఇప్పటికీ గుర్తేనన్నాడు. బ్రెజిల్ ను మూడు సార్లు విశ్వ విజేతగా నిలిపిన పీలే ఆల్ టైం ఫుట్ బాల్ అంబాసిడర్ అంటూ కొనియాడాడు. తాను యుక్త వయసులో ఉన్నప్పుడు పీలే ఆడే మ్యాచ్ లను క్రమం తప్పకుండా చూసేవాడినని గంగూలీ తెలిపాడు. నిజంగా ఆయన ఆట అద్భుతం అంటూ పీలేపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. -
చాలా ఆనందంగా ఉంది: ఏ ఆర్ రెహ్మాన్
కోల్ కతా: ఫుట్‌బాల్ దిగ్గజం పీలేను సోమవారం రాత్రి కలవనుండటంపై మ్యూజిక్ లెజెండ్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహ్మాన్ ఉద్వేగానికి లోనవుతున్నాడు. ఈ మేరకు 'జయ హో'అంటూ ట్వీట్ చేసిన రెహ్మాన్.. ఒక దిగ్గజ ఆటగాడ్ని కలుస్తుండం పట్ల సరికొత్త అనుభూతికి లోనవుతున్నట్లు పేర్కొన్నాడు. పీలేను కలుస్తుండటంపై చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇప్పటికే పీలే జీవిత చరిత్రపై మ్యూజిక్ ఆల్బమ్ ను ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేశాడు. ఈరోజు రాత్రి నేతాజీ ఇండోర్ స్టేడియంలో పీలేను రెహ్మాన్ కలిసే కార్యక్రమానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు కూడా హాజరు కానున్నారు. 38 ఏళ్ల అనంతరం ఆదివారం ఉదయం కోల్ కతా నగరానికి పీలే వచ్చిన సంగతి తెలిసిందే. 1977లో మోహన్ బగాన్‌తో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడేందుకు తొలిసారి కోల్‌కతాకు వచ్చిన పీలే.. ఆ తరువాత నగరానికి రావడం ఇదే ప్రథమం. -
38 ఏళ్ల తర్వాత భారత్‌కు పీలే
న్యూఢిల్లీ: 'గ్రేటెస్ట్ ఫుట్‌బాలర్ ఆఫ్ ఆల్ టైమ్' పీలే దాదాపు 38 ఏళ్ల తర్వాత భారత్‌కు రాబోతున్నాడు. స్కూళ్ల స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సుబ్రతో కప్ టోర్నీ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా ఆయన రానున్నాడని నిర్వాహకులు చెప్పారు. 56వ ఎడిషన్‌గా జరుగుతున్న ఈ సీజన్ ఫైనల్ అక్టోబర్ 16న ఢిల్లీలో జరుగనుంది. అక్టోబర్ 15న పీలే భారత్‌కు వస్తాడు. ఆయన 1977లో ఆమెరికా క్లబ్ న్యూయార్క్ కాస్మోస్ తరఫున భారత జట్టు మోహన్ బగాన్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. భారత్‌లో పర్యటించేందుకు ఆసక్తి ఎదురుచూస్తున్నానని వీడియో మెసెజ్‌ను పీలే పోస్ట్ చేశాడు. 'భారత్ నాకు ప్రత్యేకమైంది. అక్కడి వచ్చేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను. 1977లో అక్కడ ఆడిన మ్యాచ్ గుర్తుంది. నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు. అక్కడి యువకులను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఢిల్లీలో కలుద్దాం' అని వ్యాఖ్యానించాడు. సుబ్రతో కప్ ఈనెల 11 నుంచి వచ్చే నెల 16 వరకు జరుగనుంది. ఈసారి 100కు పైగా జట్లు మూడు విభాగాల్లో పోటీపడనున్నారు. అండర్-14 బాలుర, అండర్-17 బాలుర, అండర్-14 బాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయి. కేవలం భారత్ నుంచే కాకుండా స్వీడన్, కొరియా, బ్రెజిల్, ఉక్రెయిన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల జట్లు పాల్గొంటున్నాయి. -
ఆస్పత్రిలో చేరిన సాకర్ లెజెండ్
శావ్ పౌలో: బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ సాకర్ లెజెండ్ పీలే ఆస్పత్రిలో చేరారు. గత కొద్ది కాలంగా ఆయనను వెన్ను నొప్పి తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న నేపథ్యంలో ఆయన ఆస్పత్రికి వెళ్లారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా సంస్థ స్పష్టం చేసింది. గతంలో చేసిన ఓ శస్త్ర చికిత్స మూలంగా వెన్నుపూసకు చెందిన ప్రధాన నాడీవ్యవస్థపై ఒత్తిడి పడుతోందని ఈ నేపథ్యంలో ఆయన నొప్పిని ఎదుర్కొంటున్నారని తెలిసింది. అయితే, పరిస్థితి అంత తీవ్రంగా ఏమి లేదని, సోమవారం వరకు మాత్రం ఆయనను వైద్యుల సమక్షంలో పరిశీలనలో ఉంచనున్నట్లు తెలిపారు. గత మే నెలలో ఇలాంటి సమస్యతోనే ఆయన ఆస్పత్రిలో చేరగా బినైన్ వ్రణం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అప్పటి నుంచి తరుచు ఆయన వెన్నునొప్పిని ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. -
పీలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
రియో డి జెనీరో : బ్రెజిల్ పుట్‌బాల్ దిగ్గజం పీలే ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్యులు ఆదివారం వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వారు తెలిపారు. ప్రొస్టెట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన్ని ఇటీవల కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. దాంతో ఆయన్ని ఆదివారం డిశ్చార్జి చేశారు. ఇటీవల పీలే (74) తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు వైద్యులు పలు శస్త్ర చికిత్సలు చేసిన సంగతి తెలిసిందే. ఫుట్ బాల్ ప్రపంచ కప్ టైటిళ్లను మూడు సార్లు గెలుచుకున్న అరుదైన ఆటగాడిగా పీలే రికార్డు సృష్టించారు. -
వారం రోజుల్లో పీలే డిశ్చార్జి
రియో డి జెనీరో: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలేను వారం రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నారు. మూత్ర నాళ సంబంధ (యూరినరీ ట్రాక్) ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఆయన కుమారుడు ఎడినో చెప్పారు. 'పీలే ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడింది. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పీలేను ఎప్పుడు డిశ్చార్జీ చేస్తారన్న విషయం ఇంకా నిర్ధారించలేదు. వారం రోజుల్లో డిశ్చార్జి చేస్తారు' అని వైద్యులు తెలిపారు. -
పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది
వెల్లడించిన డాక్టర్లు సావో పాలో: మూత్ర నాళ సంబంధ (యూరినరీ ట్రాక్) ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు. యాంటీబయాటిక్స్‌కు బాగా స్పందిస్తున్నారన్నారు. ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఉన్న 74 ఏళ్ల పీలేకు తాత్కాలిక కిడ్నీ చికిత్స అందిస్తున్నాం. అయితే ఇతర పరికరాల సాయం లేకుండా శ్వాస, ఆహారం సాధారణంగానే తీసుకుంటున్నారు. ఓవరాల్‌గా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగైంది’ అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. 1970లో పక్కటెముక విరగడంతో తలెత్తిన సమస్యల నుంచి పీలేను కాపాడేందుకు ఓ మూత్రపిండాన్ని తొలగించారని అతని వ్యక్తిగత సలహాదారు జోస్ ఫోర్నోస్ రోడ్రిగ్వేజ్ చెప్పారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న చికిత్సకు దానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. -
నాన్న ఆరోగ్యం మెరుగ్గా ఉంది : పీలే కుమార్తెలు
రియాడిజనీరో: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన కుమార్తెలు శనివారం వెల్లడించారు. వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. పీలే ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయికి చేరిందని ఆల్బర్ట్ ఐనస్టీన్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 74 ఏళ్ల పీలే మూత్ర సంబంధిత సమస్యలతో ఇటీవల సావ్ పాలోని ఆల్బర్ట్ ఐనస్టీన్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. పీలే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడిన నేపథ్యంలో ఈ నెలలో ఇదే ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయనకు శస్త్ర చికిత్స అందించారు. నవంబర్13న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. -
నా ఆరోగ్యం బాగానే ఉంది: పీలే
సావో పాలో: తన అనారోగ్యం గురించి వస్తున్న కథనాలను ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఖండించారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళనపడాల్సిన విషయమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 74 ఏళ్ల ఈ బ్రెజిల్ దిగ్గజం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు, ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ‘నా ఆరోగ్య పరిస్థితి గురించి ఈ వేదికను ఉపయోగించుకుని అందరికీ చెప్పదలుచుకున్నాను. నేను బాగానే ఉన్నాను. ఈ రోజు (శుక్రవారం) నన్ను ఐసీయూలో ఉంచలేదు. ఏకాంతంగా ఉండేందుకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిలో ఉంచారు. మీ అందరి ప్రేమ, అభిమానంతో కోలుకున్నాను. ప్రస్తుతానికి ఆందోళనపడాల్సిన స్థితి లేదు. కొత్త ఏడాది సరికొత్త ఆరోగ్యంతో గడపాలనుకుంటున్నాను. అలాగే విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నాను’ అని పీలే ట్విట్టర్లో పేర్కొన్నారు. మూత్ర పిండాల్లో రాళ్లు తొలగించుకునేందుకు ఈనెల 13న సర్జరీ చేయించుకున్న పీలే... సోమవారం ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా మరోసారి అడ్మిట్ అయ్యారు. పీలే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఆయనకు హెమోడయాలసిస్ జరుపుతున్నట్టు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆస్పత్రి పేర్కొంది. కృత్రిమ కిడ్నీ ద్వారా రక్తాన్ని శుద్ధి చేసి పీలే శరీరంలోకి పంపుతున్నారు. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన పీలే
రియాడిజనీరో: బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సావ్ పాలోని ఆల్బర్ట్ ఐనస్టీన్ ఆస్పత్రి ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 74 ఏళ్ల పీలే- మూత్ర సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. మూత్రపిండాల్లో రాళ్లు తొలగించుకునేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న పీలే- ఈనెల 13న ఇదే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 2004లో కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న పీలే, ఆ తరువాత 2012 లో ఎముక సంబంధింత ఆపరేషన్ చేయించుకున్నారు. -
కోలుకుంటున్నఫుట్ బాల్ దిగ్గజం పీలే
రియాడిజనీరో: మూత్రపిండాల్లో రాళ్ల సమస్యకు చికత్స తీసుకున్నఫుట్ బాల్ దిగ్గజం పీలే(74) కోలుకుంటున్నాడు. కిడ్నీలోని రాళ్ల సమస్యతో బుధవారం సా పాలోస్ ఆల్బర్ట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన పీలేకు సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పీలే కోలుకుంటున్నాడని ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. కిడ్నీలో రాళ్లను తీసిన వేసిన అనంతరం పీలే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 2004లో కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న పీలే, ఆ తరువాత 2012 లో ఎముక సంబంధింత ఆపరేషన్ చేయించుకున్నాడు. -
పీలే కొడుక్కి 33 ఏళ్ల జైలు శిక్ష
శావో పాలో: ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు పీలే తనయుడు ఎడిన్హో(43)కు బ్రెజిల్ కోర్టు 33 ఏళ్ల జైలు విధించింది. మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేసే వ్యక్తులతో నగదు బదిలీ వ్యవహారాలు నడిపినందుకు అతడికి కోర్టు ఈ శిక్ష విధించిందని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే తనపై మోపిన అభియోగాలను ఎడిన్హో తోసిపుచ్చాడు. ఫ్రీ పెండింగ్ అప్పీలుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. ఎడిన్హోతో పాటు మరో ముగ్గురికి కూడా కోర్టు 33 ఏళ్ల చొప్పున కారాగార శిక్ష ఖరారు చేసింది. వీరి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. వీరి వద్దనున్న 100 కార్లను కూడా స్వాధీనం చేసుకోవాలని సూచించింది. రొనాల్డో నాదిన్హో నాయకత్వంలోని ముఠాతో ఎడిన్హో వ్యవహారాలు నడిపినట్టు అభియోగాలు మోపారు. ఈ ముఠా నుంచి మాదకద్రవ్యాలు కొన్నట్టు ఎడిన్హో అంగీకరించాడు. అయితే ఈ ముఠాతో కలిసి పనిచేయలేదన్నాడు.