దిగ్గజ ఆటగాడికి మూడో పెళ్లి | Brazilian football legend Pele to marry for third time | Sakshi
Sakshi News home page

దిగ్గజ ఆటగాడికి మూడో పెళ్లి

Jul 10 2016 10:41 AM | Updated on Oct 2 2018 8:39 PM

దిగ్గజ ఆటగాడికి మూడో పెళ్లి - Sakshi

దిగ్గజ ఆటగాడికి మూడో పెళ్లి

బ్రెజిల్ ఫుట్బాట్ మాజీ దిగ్గజం పీలే త్వరలో వివాహం చేసుకోనున్నారు.

రియోడిజనీరో: బ్రెజిల్ ఫుట్బాట్ మాజీ దిగ్గజం పీలే త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఇదివరకే ఇద్దర్ని వివాహామాడిన పీలే వారికి విడాకులిచ్చిన విషయం తెలిసిందే. 75 ఏళ్ల ఈ ఫుట్బాల్ లెజెండ్, 42 ఏళ్ల మార్సియా సిబెలే వివాహం మంగళవారం జరగనుంది. వీరిద్దరూ 2010 నుంచి డేటింగ్ చేస్తున్నట్లు కొన్ని నెలల నుంచి వార్తలు ప్రచారం అవుతున్నాయి. తన పెళ్లి వార్తను పీలే స్వయంగా మీడియాకు తెలిపారు.

1958, 1962, 1970లలో ఫుట్ బాల్ ప్రపంచకప్ సొంతం చేసుకున్న బ్రెజిల్ జట్టులో కీలక ఆటగాడు పీలే. 1363 మ్యాచ్ లాడిన పీలే 1281 గోల్స్ చేశాడు. వ్యక్తిగత జీవితానికొస్తే.. పీలే మొదట రోస్ మేరి ఛోల్బీని పెళ్లి చేసుకోగా వీరికి ముగ్గురు సంతానం కలిగారు. ఆ తర్వాత అస్సీరియా నాస్కిమెంటోతో జీవితాన్ని పంచుకున్నాడు. ఆమెతో జోషువా, సెలెస్ట్ అనే ఇద్దరు కవలలకు పీలే తండ్రయ్యారు. ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్న బ్రెజిల్ మాజీ ఆటగాడు తన గర్ల్ ఫ్రెండ్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement